ఉన్నత విద్యపై దృష్టి సారించాలి: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యపై దృష్టి సారించాలి: కలెక్టర్‌

May 16 2026 1:03 AM | Updated on May 16 2026 1:03 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): టెన్త్‌ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్యపై దృష్టి పెట్టి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అన్నారు. విద్యా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో పదో తరగతి, ఇంటర్‌, క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురేసి విద్యార్థులకు రూ.10వేల నగదు, మెడల్‌, సర్టిఫికెట్‌ ప్రదానం చేసి, సన్మానించారు. టెన్త్‌ ఫలితాల్లో వందశాతం సాధించిన 57 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శాలువాతో సన్మానించి, ఆయా పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్‌, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సమష్టి కృషితో జిల్లాలో ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 92.70 శాతం ఉత్తీర్ణత సాధించగలిగామన్నారు. ఇంటర్‌, డిగ్రీ, ట్రిపుల్‌ ఐటీ వంటి విద్యా అవకాశాలపై విద్యాశాఖ ద్వారా మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మేయర్‌ గుమ్మాల మమత మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో టెన్త్‌ పరీక్షలు ముఖ్యమైన తొలిమెట్టు అని అన్నారు. డీఈఓ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ విద్య విజయోత్సవాలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్‌ ఆదేశానుసారం జిల్లాలోని 180 పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల టాపర్లకు సర్టిఫికెట్లు, మెడల్స్‌ ప్రదానం చేసి, సన్మానం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి, సీఎంఓ సుధాకర్‌రెడ్డి, ఏఎంఓడీ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

బాదేపల్లి యార్డుకు

పోటెత్తిన ధాన్యం

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 12,721 బస్తాల ధాన్యం యార్డుకు రావడంతో ఆవరణ కిక్కిరిసిపోయింది.ఽ అదేవిధంగా 4,066 బస్తాల మొక్కజొన్న మార్కెట్‌కు వచ్చింది. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌రకం క్వింటా గరిష్టంగా రూ.2,589, కనిష్టంగా రూ.1,601, వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,199, కనిష్టంగా రూ.5,411, ఆముదాలు గరిష్టంగా రూ.6,285, కనిష్టంగా రూ.6,215,ఽ పొద్దుతిరుగుడు రూ.6,072, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,921, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement