ఇరుకై న రోడ్డులో మలుపు
ప్రస్తుతం బొలెరో వాహనం బోల్తాపడిన చోట రోడ్డు ఇరుకుగా ఉండటంతోపాటు కొంత మలుపు ఉంటుంది. దీంతో వేగంగా వచ్చే వాహనాలను మలుపు దగ్గర సడెన్‌గా అదుపు చేయడం కష్టసాధ్యంగా మారింది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ మార్గంలో కొత్తగా వచ్చే వాహనదారులకు మలుపు పెద్ద సమస్యగా మారింది.
బాధితులను
పరామర్శించిన ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాద బాధితులది అందరూ దేరవకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి స్వగ్రామం కావడంతో విషయం తెలుసుకుని ఎమ్మెల్యే సాయంత్రం ఆస్పత్రికి చేరుకున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరాకు సూచించారు.
‘పాలమూరు నగరంలో వరుస ప్రమాదాలతో ప్రజలు, వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల క్రితమే బైపాస్ రోడ్డులో బైక్– కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెందిన ఘటన మరువక ముందే తాజాగా పెళ్లి బృందం వెళ్తున్న బొలెరో వాహనం బోల్తాపడి.. ఓ బాలుడు దుర్మరణం చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటికై నా పోలీస్ శాఖతో పాటు అర్‌అండ్‌బీ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా రోడ్లపై ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, వాహనదారులు నిబంధనలు పాటించేలా చైతన్యం తీసుకురావాలి.’ – మహబూబ్‌నగర్ క్రైం
అప్పటి వరకు పెళ్లి వేడుకల్లో ఆనందంగా గడిపి.. భోజనాలు చేసిన తర్వాత తిరిగి స్వగ్రామానికి రెండు బొలెరో వాహనాల్లో బయలుదేరిన పెళ్లి బృందాలకు ఆ ప్రయాణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహబూబ్‌నగర్ నగరంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. చిన్నచింతకుంట మండలం దమాగ్నపూర్ గ్రామానికి చెందిన ఈశం సత్యన్నగౌడ్, శంకరమ్మ దంపతుల కూతురు నవనీతకు భూత్పూర్ మండలం పాతమొల్గర గ్రామానికి చెందిన నరేష్‌గౌడ్‌తో బుధవారం పెళ్లి జరిగింది. ఈ క్రమంలో దమాగ్నపూర్ గ్రామం నుంచి పాత మొల్గరలో జరిగిన పెళ్లి వేడుకకు బంధువులు, గ్రామస్తులు రావడానికి సత్యన్నగౌడ్ రెండు బొలెరో వాహనాలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి వేడుక ముగిసిన తర్వాత రెండు వాహనాలు వెనువెంటనే బయలుదేరాయి. ఇందులో ఒక బొలెరో వాహనం వేగంగా వస్తూ నూతన కలెక్టరేట్ దగ్గర అదుపుతప్పి అక్కడ ఉన్న మలుపులో ఉన్న బ్రిడ్జిని మొదట ఢీకొట్టుకొని ఆ తర్వాత రోడ్డుకు పక్కనే ఉన్న రేలింగ్ తగిలి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో దాదాపు 20 మంది వరకు ఉండగా 13మందికి గాయాలు కాగా దమాగ్నపూర్‌కు చెందిన బాలుడు సాయి వర్షిత్(7) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడు అభిరామ్‌గౌడ్, మండ్ల కొండన్న, నారాయణగౌడ్‌లను హైదరాబాద్‌కు తరలించారు. అలాగే మరో బాలుడు కిరణ్‌కు జనరల్ ఆస్పత్రిలోని పీఐసీయూలో, పద్మ, సురేందర్‌గౌడ్, తిరుపతయ్య, నర్సింహులుగౌడ్, రాజు, రామకృష్ణ, కృష్ణవేణి, రాధ, వరలక్ష్మి, భరత్, డ్రైవర్ దుర్గ, అన్షికలకు ఆస్పత్రి క్యాజువాలిటీలో చికిత్స అందిస్తున్నారు.
మిన్నంటిన ఆర్తనాదాలు
పెళ్లి నుంచి బయలుదేరిన బొలెరో వాహనం బోల్తా పడటంతో గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన బాలుడితోపాటు గాయపడిన వారి కుటుంబ సభ్యులు, మహిళలు ఇతర వాహనంలో ఉండటంతో వారందరూ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో తగిలిన రక్త గాయాలను చూసి బంధువుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. గాయపడిన వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. మరోవైపు ప్రమాద విషయం తెలుసుకుని పెళ్లి జరిగిన ఇంట్లోనూ విషాదచాయలు అలుముకున్నాయి.
మలుపు దగ్గర అదుపు చేయలేక బ్రిడ్జిని ఢీకొట్టిన బొలెరో వాహనం
ఒక బాలుడి దుర్మరణం, 13 మందికి తీవ్రగాయాలు
క్షతగ్రాత్రులకు జనరల్ ఆస్పత్రిలో చికిత్స
ముగ్గురి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలింపు


