మహమ్మదాబాద్: ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అంగన్‌వాడీలకు స్మార్ట్‌ఫోన్‌లు తప్పకుండా అవసరమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మహమ్మదాబాద్ మండలం నంచర్లగేట్ వద్ద ఆడిటోరియంలో గండేడ్, మహమ్మదాబాద్ మండలాలకు చెందిన 20 మంది అంగన్‌వాడీలకు స్మార్ట్‌ఫోన్‌లను అందించారు. అనంతరం మాట్లాడుతూ అంగన్‌వాడీలు ఎలా వినియోగించాలో అధికారులు తెలియజేయాలన్నారు. మదర్స్‌డే సందర్భంగా కేక్ కట్‌చేసి మహిళలకు పంచిపెట్టారు. అమ్మ గొప్పతనం మాటల్లో చెప్పలేనిదని, అమ్మ నేర్పిన పాఠాలతోనే తండ్రి, గురువులు ఆదరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఎం నారాయణ, జితేందర్‌రెడ్డి, సీడీపీఓ రాధిక, ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌లు అలవేలు, మల్లమ్మ, పద్మ, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


