● నిస్వార్థ సేవలతో ఎంతోమంది ప్రాణాలు రక్షిస్తున్న వైనం
● ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో కీలక విధుల నిర్వహణ
ఆస్పత్రుల్లో అభాగ్యులకు అండగా నిలుస్తున్న నర్సులు
● పాలమూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్‌లో కొనసాగుతుంది. ఈ కళాశాలలో ఫస్టియర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు తగరతులు ఉండగా మొత్తం 231 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ఫస్టియర్‌లో 59, సెకండియర్‌లో 58, థర్డ్ ఇయర్‌లో 57, ఫోర్త్ ఇయర్‌లో 57 మంది ఉన్నారు. నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ, వసతి గృహానికి సమస్యగా మారింది. ఇటీవల మెడికల్ కళాశాల సమీపంలో ఐదు ఎకరాల్లో శాశ్వత కళాశాల భవనం, హాస్టళ్లు నిర్మించాలని భూమి చదును చేశారు. దాదాపు రూ.40 కోట్లతో కళాశాల భవనం రెండు అంతస్తులు, హాస్టళ్లు రెండు అంతస్తులు, క్రీడా స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 120 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు.
● గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 11 మంది స్టాఫ్ నర్సులు, 72 మంది జీఎన్‌ఎమ్‌లు, అలంపూర్ ఏరియా ఆస్పత్రిలో 27 మంది నర్సులు, ఇతర ఆస్పత్రుల్లో 156 మంది నర్సులు ఉన్నారు. గద్వాల నర్సింగ్ కళాశాలలో 320 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు.
● వనపర్తి జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్‌సీలు, ఇతర ఆస్పత్రుల్లో మొత్తం 326 మంది నర్సింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఎన్‌హెచ్‌ఎంలు ఉన్నారు. జిల్లాకేంద్రంలో 214 మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేస్తున్నారు.
● నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో గ్రేడ్, హెడ్ నర్సులతో పాటు జీఎన్‌ఎంలు 327 మంది, అచ్చంపేట, కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రుల్లో 42 మంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 76 మంది, పీహెచ్‌సీల్లో 32 మంది, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 400 మంది నర్సులు ఉన్నారు. ఇక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 160 మంది, రెండు ప్రైవేట్ కళాశాలల్లో 300 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు.
నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం


