అరకు, బొర్రా కేవ్స్ అద్భుతం
హాయ్ ఫ్రెండ్స్.. నా పేరు శ్రీ చైత్రిక, నేను మహబూబ్‌నగర్‌లోని మౌంట్‌బాసిల్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నా.నేను, అమ్మ, నాన్న, మా తమ్ముడు అభిరామ్‌తో పాటు తాత, నాయనమ్మతో పాటు బాబాయ్, అత్తమ్మ ఫ్యామిలీలతో కలిసి నాలుగు రోజుల పాటు విశాఖపట్నంతో పాటు అరకు విహారయాత్రకు వెళ్లాం. అన్నవరం, విశాఖపట్నం, అరకు బొర్రా కేవ్స్‌లో సంతోషంగా గడిపాం. వైజాగ్ ఆర్‌కే బీచ్‌లో అర్ధరాత్రి చంద్రుడి వెన్నలలో మా అమ్మ లక్ష్మి, అత్తమ్మ ఉమాదేవి పాటు వారి పిల్లలు అక్షయ, భవ్య, మా పిన్నిలు లక్ష్మి, అంజలితో కలిసి కాసేపు కబడ్డీ ఆడాం. రిషికొండ బీచ్‌లో ఆటపాటలతో సందడి చేశాం. అరకులో కాపీ తోటలు, వాటర్‌ఫాల్స్ కనువిందు చేశాయి. చివరిగా బొర్రా కేవ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ యాత్ర నాకు ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలను ఇచ్చింది. మీరు మీ కుటుంబసభ్యులతో ఓసారి వెళ్లి రండి.. చాలా బాగుంటుంది.


