బైపాస్ రోడ్డుపై రోజురోజుకూ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్నా నియంత్రణ చర్యలు మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా రాత్రివేళల్లో వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి. వెంటనే స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
– శ్రీనివాసులు, పాలకొండ
అడ్డాగా మారింది..
పాలకొండ చౌరస్తా ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఇటీవల టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ఇది మరువక ముందే కారు, బైక్ ఢీకొని ఐదుగురు చనిపోయారు. పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహించి రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో కూడా ట్రాఫిక్‌పై అవగాహన పెంచాలి.
– రామాంజనేయులుగౌడ్, హోటల్ యజమాని, పాలకొండ చౌరస్తా
చర్యలు తీసుకుంటాం..
బైపాస్ రోడ్డుపై ఇక నుంచి రాత్రి 11 గంటల తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర ఎలాంటి ఆహార విక్రయాలు జరిపే దుకాణాలు తెరిచి ఉండటానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. బైపాస్‌పై ప్రత్యేకంగా పెట్రోలింగ్, నిఘా పెంచుతాం. నిత్యం వాహనాల తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతాం. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు కూడా త్వరలోనే పరిష్కారం అవుతుంది.
– వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్
●


