ఉన్న భూమి పోతే బతుకేది ఎట్లా.. | - | Sakshi
Sakshi News home page

ఉన్న భూమి పోతే బతుకేది ఎట్లా..

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

మేము నలుగురు అన్న దమ్ములం. మా నలుగురికి కలిపి 15 మంది సంతానం ఉన్నారు. 20 ఏళ్ల కిందట జాతీయ రహ దారి విస్తీర్ణంలో రెండు ఎకరాల భూమి తీసుకున్నారు. ఇప్పుడు ఉన్న రెండున్నర ఎకరాల భూమి మొత్తం పోతుంది. కూరగాయలు, ఆకుకూరలు, వరి వేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు మా భూమిని రోడ్డుకోసం తీసుకుంటే మేము ఎట్లా బతికేది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని వేరే చోటకు మార్చాలి.

– గొల్ల కృష్ణయ్య, రైతు, అన్నాసాగర్‌

భూములివ్వం.. పోరాటం చేస్తాం

మా ముగ్గురు అన్నదమ్ములం.. మూడు ఎకరాల భూమి అంతా కో ల్పోతున్నాం. అన్నాసాగర్‌–హస్నాపూర్‌ రెండు గ్రామాల శివారు నుంచి భారత మాలరోడ్డుకు అలైన్‌మెంట్‌ చేస్తున్నట్లు మాకు గతంలోనే తెలుసు. ఇప్పుడు మళ్లీ మా పొలం నుంచి సర్వే చేయడం తగదు. వేరే చోట కు మార్చేదాకా సర్వేను అడ్డుకుంటాం. మేము భూములు ఇవ్వం. పోరాటాలకు చేస్తాం.

– ఎండీ జహంగీర్‌, రైతు, అన్నాసాగర్‌

రైతులు ఆందోళన చెందొద్దు..

భారత్‌ మాల భూ నిర్వాసితులు వారి సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కలెక్టర్‌కు ప్రత్యామ్నాయం అవకాశాలు ఉంటే పరిశీలించాలని సూచించాను. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారత్‌మాల రహదారి నిర్మాణానికి చర్యలు చేపడతాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

– డీకే అరుణ, ఎంపీ, మహబూబ్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement