యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి

May 16 2026 1:09 AM | Updated on May 16 2026 1:09 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: యువత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్‌ ఖుష్బుగుప్తా పేర్కొన్నారు. పీయూలో విద్యావారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారం భోత్సవ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయడంతో భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని, ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తిస్తే వాటికి నివారణ సులువవుతుందన్నారు. కొన్ని ఆరోగ్య పరీక్షలను నిర్ణీత సమయాల్లో చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. యువత సంవత్సరానికి ఒక్కసారైనా రక్తదానం చేయడంతో అనేక లాభాలు ఉంటాయన్నారు. పీయూ వీసీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. చదువుతోపాటు ఆరోగ్యం, సామాజిక బాధ్యత, సేవవంటి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వీటితోపాటు ఏర్పాటు చేసిన బుక్‌ ఫెయిర్‌ను కలెక్టర్‌తోపాటు వీసీ పరిశీలించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, కంట్రోలర్‌ ప్రవీణ, ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, ప్రిన్సిపాళ్లు అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement