ప్రజలతో అవసరం తీరిందని.. | - | Sakshi
Sakshi News home page

ప్రజలతో అవసరం తీరిందని..

May 16 2026 12:57 AM | Updated on May 16 2026 12:57 AM

ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి.. ఇక ప్రజలతో అవసరం తీరిందని కేంద్రప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా పెంచేసింది. ఈ విషయంలో రాహుల్‌గాంధీ గత నెలలో ముందుగానే హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలతో వ్యాపారం చేస్తుందని, నష్టం అనేది రాకుండా ధరలు పెంచడమే ధ్యేయంగా పెట్టుకుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలపై పెను భారం పడుతుంది. రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర వస్తువులపై ప్రభావం చూపుతుంది. వెంటనే పెంచిన పెట్రో, డీజిల్‌ ధరలు తగ్గించాలి.

– మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర

ధరలు తగ్గించాలి

పెట్రోల్‌ ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. కుటుంబ అవసరాల కోసం ప్రతి ఇంటికి మోటార్‌ సైకిల్‌ తప్పనిసరిగా మా రింది. ఇలాగే ధరలు పెంచుకుంటూ పోతే పేదలు, మధ్యతరగతి వారు బైక్‌లను మూలన పడేయాల్సిందే. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించేలా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. – కడియాల మోహన్‌,

వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి

ధరల పెంపును సమీక్షించాలి

పెట్రో ధరల పెంపు ప్రజలకు పెనుభారంగా మారుతోంది.పెంపు ప్రభావం అన్ని రంగాలపై నా పడుతోంది. పెట్రో ధరల పెంపుపై ప్రభుత్వాలు సమీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇకనైనా ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి పెట్రో ల్‌, డీజిల్‌ అమ్మకాలను తీసుకొస్తే రేట్లు తగ్గి ప్రజలపై భారం తగ్గుతుంది. నిత్యావసరాలు అందుబాటులోకి వస్తాయి. – బి.రాజేశ్వర్‌గౌడ్‌,

జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌

Advertisement
 
Advertisement
Advertisement