రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

వనపర్తి రూరల్‌: బొలేరో, బైకు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన బుదవారం అర్ధరాత్రి పెబ్బేరు మండల కేంద్రంలోని గోశాల దగ్గర చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేష్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... పెబ్బేరు మండలం, వైశాఖపూర్‌ గ్రామానికి చెందిన మెకానిక్‌ కురువ నాగేష్‌ (28) బైక్‌పై పెబ్బేరులోని తన మెకానిక్‌ షాపునకు వచ్చి పనులు ముగించుకొని రాత్రి బైక్‌పై గ్రామానికి బయలు దేరాడు. ఈ క్రమంలో పట్టణంలోని గోశాల దగ్గర ముందు వెళ్తున్న బొలేరో వాహనం యూటర్న్‌ తీసుకుంటుండగా వెనకాల వస్తున్న నాగేష్‌ బైక్‌ను అదుపు చేయలేక బొలేరోను ఢీకొట్టాడు. ప్రమాదంలో తల, కాళ్లకు బలమైన రక్త గాయాలు కాగా వెంటనే 108లో వనపర్తి ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు. మృతుడి అన్న రాఘవేంద్ర గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement