సంగమేశ్వరం చూసొద్దాం.. | - | Sakshi
Sakshi News home page

సంగమేశ్వరం చూసొద్దాం..

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

నేను.. మా విహారం

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నా పేరు ఎం.దీపక్‌కుమార్‌. నేను మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదవాలి. నేను, అమ్మ, నాన్న, అన్నయ్య జయంత్‌కుమార్‌తో కలిసి నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లోని జట్రపోల్‌ దేవాలయం మరియు సోమశిల నది మధ్యలో ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని ఈ వేసవి సెలవుల్లో సందర్శించాను. మీరు కూడా ఇలాంటి ప్రాంతాలను సందర్శించి.. మన దేశ చారిత్రక ప్రాంతాలు, దేవాలయాలు, సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి. నేను చూసిన సంగమేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పరిధిలోకి వస్తుంది. కృష్ణ, భవనాసి, వేణి, తుంగ, భద్ర, భీమరథి, మలపహరిణి.. ఈ ఏడు నదులు ఇక్కడ కలుస్తుండడంతో దీన్ని సప్తనదుల సంగమంగా పిలుస్తారు. ఏటా శ్రీశైలం జలాశయం నీటిమట్టం తగ్గినప్పుడే.. ఈ ఆలయం బయటపడుతుంది. జూలై నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు ఎనిమిది నెలలు నీటిలోనే మునిగి ఉంటుంది. మీ కూడా ఈ వేసవిలో చూసేయండి.

Advertisement
 
Advertisement
Advertisement