నిలకడగా ఉల్లి ధరలు | - | Sakshi
Sakshi News home page

నిలకడగా ఉల్లి ధరలు

May 14 2026 12:25 AM | Updated on May 14 2026 12:25 AM

దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. కొన్ని వారాలుగా రూ.వెయ్యి దాటని ఉల్లి ధర గత వారం కొంతమేర పెరిగింది. ఉదయం మార్కెట్‌లో స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.వెయ్యి వరకు పలికింది. 50 కిలోల బస్తాను గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు. ఉల్లి నాణ్యతగా ఉండడంతో వినియోగదారులు పెద్దఎత్తున ఉల్లిని కొనుగోలు చేశారు.

కొనసాగిన అమ్మకాలు..

మార్కెట్‌ బయట రైతులు యథావిధిగా ఉల్లి అమ్మకాలు సాగించారు. ధరలు పెరగడంతో రైతులు రూ.600 నుంచి రూ.650 వరకు 50 కిలోల బస్తాను విక్రయించారు. చాలామంది రైతులు ట్రాక్టర్లపై ఉల్లి బస్తాలు తెచ్చి సాయంత్రం వరకు అమ్మకాలు సాగించారు. ఎక్కువగా వినియోగదారులు ఉల్లి బస్తాలను కొనుగోలు చేశారు.

బాదేపల్లి యార్డుకు

పోటెత్తిన ధాన్యం

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 15,674 బస్తాల ధాన్యం, 8,433 బస్తాల మొక్కజొన్న యార్డుకు రావడంతో ఆవరణంతా కిక్కిరిసిపోయింది. కాగా ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ రకం క్వింటా గరిష్టంగా రూ.2,539, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,642, కనిష్టంగా రూ.5,329, ఆముదాలు గరిష్టంగా రూ.6,239, కనిష్టంగా రూ.6,206, పొద్దుతిరుగుడు రూ.6,210, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,872, కనిష్టంగా రూ.1,601, జొన్నలు రూ.5,789, మినుములు రూ.6,600 చొప్పున వచ్చాయి.

గరిష్టంగా రూ.1,500..

కనిష్టంగా రూ.వెయ్యి

Advertisement
 
Advertisement
Advertisement