ప్రజలను మోసం చేసిన మోదీ.. | - | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేసిన మోదీ..

May 16 2026 1:03 AM | Updated on May 16 2026 1:03 AM

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రో ల్‌, డీజిల్‌ ధరలు పెంచి కేంద్రంలోని మోదీ ప్రభు త్వం ప్రజలను మోసం చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే నిత్యవసరాల ధరలతో అల్లాడుతున్న ప్రజలకు పెట్రో ల్‌, డీజిల్‌ ధరల పెంపు మరింత భారం కానుంది. మంచి రోజులు అంటూ చెప్పుకునే ప్రధానమంత్రి మోదీ ధరలు పెంచితీవ్ర ఆర్థిక భారం మోపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయి ల్‌ ధరలు పెరిగిందనే సాకుతూ ఇలా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం సరికాదు. ధరల పెరుగుదలను పునఃసమీక్షించాలి లేదంటే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం. – సంజీవ్‌ ముదిరాజ్‌, డీసీసీ అధ్యక్షుడు

పెంచడం సరికాదు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచి సామాన్యుడిపై భారం మోపడం సరికాదు. ప్రభుత్వం ఆదాయం కోసం తీసుకునే నిర్ణయాలు మా లాంటి వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కష్టకాలంలో గిరాకీలు లేక నానా అగచాట్లు పడుతున్నాం. ఇంధన ధరలు పెరుగుదల కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వాలు పునరాలోచించి పెరిగిన ధరలను తగ్గించాలి.

– ఎ.రామస్వామి, ఆటో డ్రైవర్‌, మహబూబ్‌నగర్‌

వాహనాలు నడిపే పరిస్థితి లేదు

పట్టణానికి రావాలంటే ఆటోలు, బస్సు సౌకర్యం సరిగా లేకపోవడంతో బైక్‌ వినియోగిస్తా. పెరిగిన పెట్రోల్‌ ధరలు చూస్తే బైక్‌ నడిపే పరిస్థితి లేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఇంధన ధరలు పెరిగితే అన్నింటి ధరలు పెరుగుతాయి.

– చంద్రయ్య, రైతు, ఫర్దీపూర్‌, చిన్నచింతకుంట

Advertisement
 
Advertisement
Advertisement