మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఇంజినీరింగ్ కళాశాల బీఈఈ ల్యాబ్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్, ఇంజినీరింగ్ ఫిజిక్స్ ల్యాబ్‌ను పీయూ వీసీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ల్యాబ్స్ వినియోగించడంతో విషయ పరిజ్ఞానం పెరుగుతుందని, సబ్జెక్టుతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందన్నారు. విద్యార్థులు బాగా చదివి శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


