రాజాపూర్(బాలానగర్): పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జానకి హెచ్చరించారు. గురువారం బాలానగర్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆమె సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాపై ఏడు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందన్నారు. కీలక ప్రాంతాలైన పాలమూరు యూనివర్సిటీ, కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు, బాలానగర్, మిడ్జిల్, నవాబ్‌పేట, మహమ్మదాబాద్, అడ్డాకల్ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణాపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. చెక్‌పోస్టులో తనిఖీలు, రిజిస్టర్లలో నమోదుపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. పశువుల అక్రమ రవాణాపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ చెక్‌పోస్టును
సందర్శించిన మహబూబ్‌నగర్
ఎస్పీ జానకి


