రాజోళి: ఏపీ–తెలంగాణ సరిహద్దులో ఉన్న సుంకేసుల డ్యాంపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద అనునిత్యం నిఘా ఉంచాలని అడిషనల్ ఎస్పీ శంకర్ అన్నారు. గురువారం ఆయన రాజోళిలో పర్యటించి, సుంకేసుల డ్యాం పరిసరాలను, చెక్‌పోస్టును పరిశీలించారు. బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకుని జంతు రవాణా జరగకుండా నిఘా పెట్టాలని, ప్రస్తుతం మొక్కజొన్న, వరి కొనుగోళ్ల సందర్భంగా ఏపీ నుంచి ధాన్యం రాకుండా పటిష్ట నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం స్థానికులతో మాట్లాడారు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు హెల్మెట్,సీటు బెల్టు ధరించి,ట్రాఫిక్ నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడపటం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టపరంగా నేరమన్నారు. ప్రమాదాల నివారణకు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్‌ఐ గోకారి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అడిషనల్ ఎస్పీ శంకర్


