Telangana
-
శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్(సాక్ ఐ) పేరుతో సరికొత్త కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్‌ను ప్రారంభించింది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆన్లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఈ అత్యాధునిక వ్యవస్థను హైదరాబాద్ పోలీస్ ఐటీ విభాగం రూపొందించింది.గతంలో సోషల్ మీడియా పర్యవేక్షణకు భారీగా సిబ్బంది అవసరమవ్వడమే కాకుండా గంటల తరబడి మాన్యువల్‌గా శ్రమించాల్సి వచ్చేది. కానీ ఈ 'సాక్ ఐ' ద్వారా ఇకపై అన్నీ ఆటోమేటెడ్ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతాయి. దీనిలోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డ్యాష్‌బోర్డ్ ద్వారా డయల్ 100 కాల్స్, అంతర్గత నిఘా సమాచారం, నగరంలో జరుగుతున్న ప్రధాన ఘటనల వివరాలను ఒకే చోట క్రోడీకరించి అధికారులకు పూర్తి స్థాయి క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తుంది.సాక్ ఐ తన ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరమైన సున్నితమైన అంశాలను, అలాగే గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి పలు సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న 126 పోస్ట్‌లను ఇది గుర్తించింది. ఇటువంటి కంటెంట్‌ను సకాలంలో తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శాంతి సామరస్యాలను కాపాడటమే కాకుండా, విద్వేషాలను రేకెత్తించే వారిని గుర్తించడం సాధ్యమైంది.ప్రత్యేకించి మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి పెడుతుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలను ఏఐ మోడల్స్ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి, అభ్యంతరకర పోస్టులను తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నివేదిస్తుంది.నేరగాళ్ల నెట్వర్క్ విశ్లేషణ చేసే సామర్థ్యం ఈ అప్లికేషన్ ప్రత్యేకత కావడంతో, వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేసే వారిని, వాటిని వైరల్ చేసే ఖాతాలను ఇట్టే పట్టేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.ప్రతి ఫిర్యాదుకు ఒక యూనిక్ ట్రాకింగ్ నంబర్ కేటాయించి, అది పరిష్కారమయ్యే వరకు ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ చేస్తుంది. నగరంలో ప్రతిరోజూ జరిగే నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపుల వంటి కార్యక్రమాలపై ముందస్తు నిఘా ఉంచేందుకు 'ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్' ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు. నిర్ణీత కీవర్డ్స్ ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ, ఏదైనా ముప్పు పొంచి ఉంటే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.అలాగే నేర పరిశోధనలో కీలకంగా మారిన SOCMINT, OSINT వంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇందులో అంతర్భాగంగా ఉండటంతో సైబర్ కేసుల ఛేదన సులభతరం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రొఫైల్స్ మరియు కీవర్డ్స్ ఆధారంగా సెర్చ్ చేసే సామర్థ్యం ఉన్న గ్లోబల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఏదైనా అంశంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను, వస్తున్న కథనాలను తక్షణమే విశ్లేషించే వీలు కలుగుతుంది.అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన ఈ 'సాక్ ఐ' వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. "సమాజంలో అశాంతిని రేకెత్తించే శక్తుల ఆటకట్టించేందుకు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ ఏఐ వ్యవస్థను రూపొందించాం. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరగాళ్లు సామాజిక మాధ్యమాలను అస్త్రంగా చేసుకుంటున్న తరుణంలో, అత్యాధునిక సాంకేతికతతో వారిని సమర్థంగా ఎదుర్కొంటాం" అని ఆయన స్పష్టం చేశారు. -
తెలంగాణలో భానుడి భగభగలు.. ప్రజలకు బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో చాలాచోట్ల 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర తలు నమోదు కావొచ్చని హెచ్చరిం చింది.ఆదివారం రాష్ట్రంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణో గ్రత 44.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.6 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.ఈ సందర్భంగా వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. వడగాడ్పులు ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. సాధారణంగా తీసుకునే జాగ్రత్తలే కాకుండా అత్య వసరమైతే తప్ప మండే ఎండల్లో (మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు) అసలు బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. మండుటెండల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరిగితే వాంతులు, వికారంతో పాటు శరీరం పొడిగా, ఎర్రబారే అవకాశముందని పేర్కొంది. అంతేకాకుండా తీవ్ర తలనొప్పి, ఆందోళన, తలతిరగడం, స్పృహ కోల్పోయే అవకాశమూ ఉందని.. కండరాలు బలహీనపడి తిమ్మిర్లు రావచ్చని వివరించింది. కొన్నిసార్లు కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని హెచ్చరించింది. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే తగిన వైద్య సహాయం తీసుకోవాలని స్పష్టంచేసింది. -
సమ్మర్ సఫారీ చేద్దామా..!
దట్టమైన అటవీ ప్రాంతంలో జీపు సఫారీ..బెంగాల్ పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లను దగ్గరినుంచి తిలకించడం, రిజర్వాయర్‌లో బోటు షికారు.. నదుల మధ్య కాటేజీలు, తాబేలు, మొసలి వంటి థీమ్ కాటేజీలు, ట్రెక్కింగ్ చేయాలన్నా.. చూడాలన్నా ఏ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తే చాలు వన్య్రప్రాణుల సహజసిద్ధమైన జీవన శైలిని కళ్లారా చూస్తూ.. ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు. ఈ వేసవిలో పర్యాటకులకు మంచి అనుభూతిని మిగిల్చేందుకు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర అటవీ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాయి.ప్రకృతిని, వన్య ప్రాణులను దగ్గరి నుంచి చూడాలనుకునే వారికి సంతృప్తి పరిచేలా పలు పర్యాటక ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అడవులు, అటవీ జంతువులు, పక్షులు, నదులు, సహజ సిద్ధంగా ఏర్పడిన అందాలు, కృష్ణా, గోదావరి నదుల మధ్యలో కాటేజీలు ఇలా ఏ ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలనుకున్నా అందుకు తగిన ΄్ప్రాకేజీలు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణలోని ప్రధాన వన్య్ప్రాాణి పర్యాటక కేంద్రాలు ఇలా ఉన్నాయి. పర్యాటకులు తమ పర్యటనను అధికారిక వెబ్సైట్ల ద్వారా ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. వేసవి ఎండల దష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ అటవీ ప్రాంతం టేకు చెట్లకు ప్రసిద్ధి. ఓపెన్ టాప్ జీపుల్లో అడవి లోపలికి తీసుకెళ్తారు. ఉదయం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు, అలాగే 9:30 నుంచి 11:30 గంటలు; మధ్యాహ్నం 3:30 – 5:30 వరకు సఫారీ అందుబాటులో ఉంటుంది. సాధారణ రోజుల్లో జీపునకు (6 గురు వరకు) రూ.3,500, వారాంతాల్లో రూ.4వేల వరకు ఉంటుంది. ఏటూరునాగారం వన్య్రప్రాణి అభయారణ్యం (తాడ్వాయి)వరంగల్ సమీపంలోని ఏటూరు నాగారం వన్య్రప్రాణి అభయారణ్యంలో ’తాడ్వాయి హట్స్’ (కుటీరాలు), ’నైట్ వాచ్’ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. జీపు సఫారీకి రూ.1,500లు, అటవీ ట్రెక్కింగ్‌కు ఒక్కొక్కరికి రూ.100 ఉంటుంది. అలాగే సైక్లింగ్ సౌకర్యం ఉంది. ఇక్కడ భారీ ఉడుతలు, అడవి దున్నలు కనిపిస్తాయి.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (నల్లమల అడవులు)హైదరాబాద్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి. ఇక్కడ ‘టైగర్ స్టే‘ ప్యాకేజీ ప్రత్యేక ఆకర్షణ. ఇందులో పర్యావరణ విద్యా కేంద్రం సందర్శన, సఫారీ, ట్రెక్కింగ్ ఉంటాయి. ఫరాహాబాద్ సర్క్యూట్లో ఈ సఫారీ సాగుతుంది.కృష్ణా నది అందాలను చూస్తూ గడపడానికి తాబేలు, మొసలి వంటి థీమ్ కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమ్రాబాద్‌లో మూడు రకాల సఫారీలు అందుబాటులో ఉన్నాయి. ఫరాహాబాద్ సఫారీ మెుత్తం 16 కి.మీ. ప్రయాణం కాగా... 7 సీట్ల వాహనానికి రూ. 3 వేలు ఛార్జ్ చేస్తున్నారు. గుండం సఫారీ దట్టమైన అడవిలో 35 కి.మీ. ప్రయాణం కాగా.. వాహనానికి రూ. 5 వేలు, అక్కమహాదేవి గుహల సఫారీ 14 కి.మీ ప్రకృతి అందాల మధ్య ప్రయాణానికి.. 5 సీట్ల వాహనానికి రూ. 3 వేలు వసూలు చేస్తున్నారు. కిన్నెరసాని వన్య్రప్రాణి అభయారణ్యం (కొత్తగూడెం) ఖమ్మం సమీపంలోని కొత్తగూడెంలో ఉన్న ఈ ప్రాంతం నీరు, పచ్చదనంతో అలరారుతుంటుంది. డీర్ పార్క్ (జింకల పార్క్), రిజర్వాయర్‌లో బోటింగ్ సౌకర్యం కలవు. ఇక్కడి ప్రకతి అందాల మధ్య ప్రశాంతంగా గడపడానికి కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.. భద్రాచలం పుణ్యక్షేత్రం వెళ్లే సమయంలో వీటిని సందర్శించవచ్చు. – బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం (చదవండి: ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!) -
మొయినాబాద్ జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి,హైదరాబాద్: మొయినాబాద్ జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన మొత్తం ఎనిమిది మంది చంపేందుకు నిందితురాలు కరీమాబేగం, ఆమె భర్త రెహమాన్ ప్లాన్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.తాండూరు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే కరీమాబేగం, రెహమాన్ దంపతులు ఆబేదాబేగం, మహబూబాబీ అనే ఇద్దరు మహిళల వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. అప్పు తీసుకున్న తర్వాత నెలలు గడుస్తున్నా కరీమాబేగం దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో వారిపై మహిళలిద్దరూ ఒత్తిడి చేశారు. దీంతో వారిని చంపేయాలని కరీమాబేగం, రెహమాన్ కుట్ర చేశారు. కుట్రలో భాగంగా అప్పు ఇస్తానంటూ మొయినాబాద్ సమీపంలోని తోల్కట్ట ఫాంహౌస్ వద్దకు రావాలని సమాచారం అందించారు. అలా వచ్చిన బాధితుల్ని వేర్వేరు సమయాల్లో గొంతు నులిమి హత్య చేశారు. అక్కడే గొయ్యి తీసి మృత దేహాల్ని పూడ్చిపెట్టారు.మిస్సింగ్ కంప్లయింట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జంట హత్యకేసును ఛేదించారు. తాజాగా పోలీసుల దర్యాప్తులో నిందితులు అప్పు తీసుకున్న ఆరుగురిని హతమార్చేందుకు ఫామ్ హౌస్‌కు పిలిపించుకున్నారని, అప్పు ఇస్తానని చెప్పి ప్రాణం తీసేందుకు ప్రయత్నించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
TG : హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు.. నిందితుడు అరెస్టు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో దామోదర్ అనే వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే దామోదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందంటే? పోక్సో కేసులో కీలక నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టు వాదనలు జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా అనుచిత పోస్టుపై నమో దైన కేసు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయా పోస్టులు చేసిన వారిని గుర్తించడం కోసం ఐపీ అడ్రస్‌లు కోరుతూ ఆదివారం సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసు ఠాణాకు బదిలీ అయింది.బండి సాయి భగీరధ్‌ను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అతను ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడని, పోలీసులు, ప్రధాన మీడియా, సోషల్ మీడియాను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని పోస్టులు వచ్చాయి. సీనియర్ వెకేషన్ జడ్జి జస్టిస్ టంగిరాల మాధవి దేవిని కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కేసులో ఆరోపించారు. పాక్సో కేసులో భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, జస్టిస్ టంగిరాల మాధవి దేవి భర్తను తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నియమించేలా చూస్తానని కొందరు చెప్పినట్లు పోస్టులు చేశారు.ఈ కల్పిత వార్తను సోషల్ మీడియాలో ఉంచడమే కాకుండా ప్రింట్ మీడియాలో కూడా ప్రచురించారని, దీని వల్ల అది విస్తృతంగా ప్రచారం చెంది, న్యాయమూర్తులు. న్యాయవాదులు, సాధారణ ప్రజలు చదవడం ద్వారా న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలుగుతోందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ కల్పిత వార్తకు సంబంధించిన కాపీని ఫిర్యాదుతో జతపరిచారు.ఆయా పోస్టులను ఇప్పటికే సేకరించిన పోలీసులు వాటి మూలాలు కనిపెట్టడంపై దృష్టి పెట్టారు. దీనికి ఐపీ అడ్రస్ ప్రధాన ఆధారం కావడంతో వాటిని అందించాల్సిందిగా కోరుతూ సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన వివరాల ఆధారంగా నిందితుడు దామోదర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. -
బండి భగీరథ్ కేసు.. రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బండి భగీరథ్ కేసు విషయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా ఈ కేసులో ప్రకంపనలు సృష్టించింది. అయితే, ఈ కేసులో విషయమై తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ తండ్రి తప్పుచేయనప్పుడు రాజీనామా ఎందుకు చేయాలని ప్రశ్నించారు.తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘బండి భగీరథ్ తండ్రి ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన తప్పుచేస్తే పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. మా మంత్రి తప్పు చేస్తే మాది బాధ్యత. ముందస్తు బెయిల్ తీసుకోవడం హక్కు. ఆయన పారిపోలేదు. బెయిల్ పెండింగ్‌లో ఉంది. అనంతరం, భగీరథ్ సరెండర్ అయ్యాడు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్తే కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. కోట్లు ఖర్చు చేసి భగీరథ్, ఆయన తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఏ పని లేనట్టు బండి భగీరథ్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం సరికాదు. ఆ కుటుంబంలో కేంద్ర మంత్రి ఉన్నాడని టార్గెట్ చేశారు. కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ వాళ్లు ముందుగానే కోర్టుకు ఎందుకు వెళ్లారు?. ఈ కారు రేసింగ్ కేసులో కేటీఆర్ ముందస్తుగా కోర్టుకు వెళ్లలేదా?. మీ బీఆర్ఎస్ హయాంలో మహిళలపై దాడులు ఎన్నో జరిగాయి. పబ్‌లో ఎంఐఎం నేత కొడుకు అత్యాచారం చేయలేదా? ఏం చేశారు. కొమురం భీం జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగింది. గతంలో లంబాడా అమ్మాయి మీద కస్టోడియల్ డెత్ జరగలేదా?. గతంలో మీ పాలనలో అత్యాచారాలు జరిగితే మరి కేసీఆర్ రాజీనామా చేశారా?. కాళేశ్వరం, కారు రేసు కేసులో త్వరగా విచారణ జరిగేలా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తేవాలి. మోదీ సభ విజయంతో తెలంగాణ ప్రజల బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దు అని వ్యాఖ్యలు చేశారు. -
బండి భగీరథ్ కేసులో మలుపు..! బాధితురాలు మైనర్ కాదు..?
-
కేబీఆర్ పార్క్ వ్యవహారం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కాసు బ్రహ్మనందరెడ్డి పార్క్ వ్యవహారంలో సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఉద్యానవనం ఆవరణలో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని స్టే ఆర్డర్స్ జారీ చేసింది. తదుపరి విచారణ చేపట్టేంతదాకా పార్క్‌కు 35 మీటర్ల పరిధిలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని అధికార యంత్రాంగానికి కోర్టు స్పష్టం చేసింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న కేబీఆర్ నేషనల్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అండర్‌పాస్‌ల నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్లూ విధించారు. అయితే చెట్ల నరికివేతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పర్యావరణ ప్రేమికుల తరఫున కోర్టులో సీనియర్ కౌన్సిల్ కె. వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం స్టే ఆర్డర్ ఇచ్చింది. ఎకో సెన్సిటివ్ జోన్ (25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను నరకరాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది. ఎస్ఆర్డీపీ (SRDP - Strategic Road Development Plan) పేరిట.. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రతిష్టాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేబీఆర్ పార్క్ వద్ద నిర్మాణలకు దిగింది. అయితే.. సుప్రీం కోర్టు స్టేతో కేబీఆర్ పార్క్ వద్ద ఆ పనులు తాత్కాలికంగా ఆగిపోనున్నాయి. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి
సాక్షి, నల్లగొండ: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలై, తమకు చేదోడువాదోడుగా టుందనుకున్న కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ ఇంటి దీపం శాశ్వతంగా ఆరిపోయింది. రూ.50 లక్షలు అప్పు చేసి మరీ అమెరికా పంపిన కౌలు రైతు దంపతులకు తీరని శోకం మిగిలింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టుకు చెందిన నవ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్‌రెడ్డి, శోభ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు నవ్య (24) బీటెక్ పూర్తి చేయడంతో ఎంఎస్ కోసం రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లింది. చిన్న కూతురు ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. నవ్య చికాగో రాష్ట్రంలోని రోజ్ వెల్ యూనివర్సిటీలో రెండున్నర సంవత్సరాల నుంచి ఎంఎస్ చదువుతోంది.శనివారం రాత్రి కారులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వెనుక నుంచి మరో కారు ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితురాలు ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నవ్య మృతి విషయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి సమాచారం అందించారు. తక్షణమే వారు స్పందించి అమెరికా నుంచి నవ్య మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు నవ్య తల్లిదండ్రులు తెలిపారు.ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి.. నవ్య 10వ తరగతి నల్లగొండలోని ఎంవీఆర్ స్కూల్లో, ఇంటర్ గీతాంజలి కాలేజీలో, బీటెక్ హైదరాబాద్‌లోని విజ్ఞాన్ కళాశాలలో పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి ఎంఎస్ చదువుతోంది. తన కూతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వార్త తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. తన కూతురు ఉన్నత విద్యావంతురాలై విదేశంలో ఉద్యోగం చేసి ఇంటి దీపంగా వెలుగుతుంది అనుకుంటే రోడ్డు ప్రమాదం ఇంటి దీపాన్ని ఆర్పిందని నవ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేసిన అప్పులు తీరకముందే.. గడుసు శ్రీనివాసరెడ్డి, శోభ దంపతులు సొంతంగా భూమి లేకున్నా ప్రతి సంవత్సరం 10 నుంచి 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట పడిస్తూ తమ ఇద్దరు కూతుళ్లను చదివిపిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం పెద్ద కూతురు నవ్యను ఉన్నత విద్య కోసం అమెరికా పంపేందుకు రూ.30 లక్షలు బ్యాంకు రుణం, రూ.20 లక్షలు ప్రైవేట్ అప్పు చేశారు. చేసిన అప్పు తీరక ముందే కుమార్తె కానరాని లోకానికి పోయిందని తల్లడిల్లిపోతున్నారు. పెద్ద కూతురు ఉన్నత విద్య చదివి ఉద్యోగం చేస్తే చిన్న కూతురికి, తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది అనుకుంటే అప్పులతో పాటు కన్నీరే మిగిలిందని రోదిస్తున్నారు. -
సిరిసిల్లలో ఉద్రిక్తత.. పోలీసులు లాఠీచార్జ్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’.. ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఇరువర్గాల పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు సమాచారం. రెండు పార్టీ నేతల నిరసనలతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.వివరాల మేరకు.. సిరిసిల్లలోని నేతన్న చౌరస్తా వద్ద బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల పోటాపోటీ ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో పరస్పర నినాదాలతో చౌరస్తా దద్దరిల్లింది. అనంతరం, బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణ కొట్టుకునే స్థాయికి చేరింది. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’.. ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఇరువర్గాల భారీ నినాదాలు చేశాయి. దీంతో, రంగంలోకి దిగి ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసుల లాఠీచార్జ్ చేశారు.కాగా, ఉభయ పార్టీల నేతలు.. పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో, జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రెండు పార్టీ నేతలను అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. -
మనవడు ఇక లేడని తెలిసి కూడా..
2007 మే 18... శుక్రవారం... మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఆ క్షణం అప్రమత్తమైన పోలీసులు ఎండలో కొన్ని గంటల పాటు డ్యూటీ చేస్తూనే ఉన్నారు. మొఘల్‌పుర ప్రాంతంలోని ఓ ఇంటి యజమాని తన వీధిలో విధుల్లో ఉన్న పోలీసులను చూసి లోపలకు ఆహ్వానించారు. వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. అదే పోలీసుల కాల్పుల్లో తన మనుమడు చనిపోవడం... అయినప్పటికీ తన సాంప్రదాయాలను, అతిథి మర్యాదల్నీ మర్చిపోని ఆ పెద్దాయన అన్న మాటల్ని అక్కడ ఉన్న పోలీసులు ఇప్పటికీ తలచుకుంటున్నారు. ‘మక్కా’ పేలుళ్లు జరిగిన 19 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఆ విషయాలను ఓ ఉన్నతాధికారి ‘సాక్షి ప్రతినిధి’తో పంచుకున్నారు. ఆ వివరాలివి...హైదరాబాద్ పాతబస్తీలోని మక్కా మసీదులో ఉగ్రవాదులు రెండు బాంబుల్ని పెట్టారు. మధ్యాహ్న ప్రార్థనలు జరుగుతుండగా ఓ బాంబు పేలింది. దాన్ని ముష్కరులు అక్కడ ఉన్న మందపాటి సప్టా కింద పెట్టడంతో బ్లాస్ట్ ఇంపాక్ట్ తగ్గింది. ఫలితంగా పెను ప్రాణనష్టం తప్పి ఘటనాస్థలంలోనే ఐదుగురు మరణించగా... మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అదనంగా మరో 58 మంది క్షతగాత్రులయ్యారు. ఈ విషయం దేశ వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. మక్కా మసీదులో బాంబు పేలిందని, ఆ ప్రభావానికి మసీదు మొత్తం కూలిపోయిందని పుకార్లు షికారు చేశాయి. దీంతో రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తన మక్కా మసీదు వద్దకు చేరుకున్నారు.అప్పటికే ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం తప్పలేదు. దీంతో పోలీసులకు–స్థానికులకు–మసీదు వద్దకు వచ్చే వారికి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో మొఘల్‌పుర వైపు కొందరు ఆందోళనకారులు దూసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.అక్కడి పరిస్థితులు, వాళ్ల చేతిలో ఉన్న వస్తువుల ఆధారంగా ఏదో జరగరానిది జరుగుతుందనే ఆందోళన అధికారులు, సిబ్బందిలో వ్యక్తమైంది. ఆ ఆందోళనకారులను అదుపు చేస్తుండగా... సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌కు నిప్పు పెట్టాలనే ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. అదే జరిగితే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న పోలీసులు, ప్రజలు వందల సంఖ్యలో చనిపోతారని పోలీసులు భయపడ్డారు. పాతబస్తీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అప్పటికే అనేక మంది తమ ఇళ్లకు చేరారు. అలాంటప్పుడు పెట్రోల్ బంక్‌పై దాడి చేసే ఆందోళనకారులు దానికి నిప్పు పెడితే ఊహించని ఉపద్రవం తప్పదని నిర్థారించిన పోలీసులు అనివార్యంగా కాల్పులు జరపాల్సి వచ్చింది. అలా అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. అదే రోజు మక్కా మసీదు నుంచి పేలకుండా ఉన్న మరో బాంబునూ స్వాధీనం చేసుకున్నారు.అలా అల్లర్లు, ఉద్రిక్తతలు, రాళ్ల దాడులు, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, వాటర్ క్యానన్ల వినియోగం, నిఘా, గస్తీ, పికెట్లు... ఇలా కొన్ని గంటల పాటు సిబ్బంది, అధికారులు అంతా రోడ్లకు పరిమితం అయ్యారు. వీరికి కనీసం మంచి నీరు అందించడానికి ఉన్నతాధికారులకు సమయం చిక్కలేదు. అదే సందర్బంలో అన్ని దుకాణాలు మూతపడటంతో ఆహారం, టీ విషయం వదిలేస్తే.. మంచినీళ్లు దొరకడం కూడా కష్టసాధ్యమైంది. ఎవరికి వాళ్లు తమ ఇళ్లల్లో తలుపులు బిగించుకుని ఉండటంతో పాటు తీవ్ర భయాందోళనల్లో ఉన్న వాళ్లు కనీసం తలుపు తట్టినా తీసే పరిస్థితులు లేవు. ఇలా దాదాపు నాలుగైదు గంటల గడిచాయి.అప్పుడే మరో అంశం తెరపైకి వచ్చింది. అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్‌పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.ఆ వృద్ధుడి ఇంటికి వెళ్లే విషయంలో కొద్దిసేపు ఆలోచించిన పోలీసు బృందం ఎట్టకేలకు అంగీకరించింది. అల్లర్లు అదుపులోకి రావడంతో కాస్త మంచినీళ్లు తాగి, కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా వెళ్లిరావడం ఉత్తమమని భావించారు. దీంతో ఆ పోలీసు బృందం వృద్ధుడి వెంట ఆయన ఇంటికి వెళ్లింది. కుశల ప్రశ్నల, కాలకృత్యాల తర్వాత అంతా హాలులో కూర్చున్నారు. పోలీసులకు మంచినీళ్లు అందించిన ఆ పెద్దాయని... టీ, బిస్కెట్లు సిద్ధం చేస్తున్నారు. హఠాత్తుగా ఆయన జేబులో ఉన్న సెల్‌ఫోన్ మోగింది. ఆ కాల్ మాట్లాడిన పెద్దాయన ముఖంలో రంగులు మారిపోయాయి. కంఠం ఒణుకుతుండగా... కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ‘ఆ రోజు మధ్యాహ్నం మొఘల్‌పుర పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారిలో మీ మనుమడు కూడా ఉన్నాడు’ అనేది ఆ కాల్ సారాంశం. మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఉందని, కుటుంబీకులు వస్తే ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని అవతలి నుంచి పోలీసులు కోరారు.ఈ విషయం తెలియడంతోనే అక్కడ ఉన్న పోలీసుల కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. మధ్యాహ్నం నుంచి తమను ఎవరూ పట్టించుకోకపోయినా... ఈ పెద్దాయన మాత్రం నేరుగా వచ్చి ఇంటికి ఆహ్వానించారు. ఆప్యాయంగా పలకరిస్తూ సంభాషించారు. ఇప్పుడు పోలీసుల తూటాలకు మనుమడిని కోల్పోయిన వార్త విని ఎలా స్పందిస్తారో..? అనే సందేహాలు అందరి మదిలో మెదిలాయి. వీలున్నంత త్వరలో అక్కడ నుంచి బయటపడాలని అంతా భావించారు. అప్పుడే నోరు విప్పిన పెద్దాయన ‘మీరు ఎందుకు ఫీల్ అవుతారు? ఏదీ ఎవరూ కావాలని చేయరుగా? అల్లర్లు అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు... వాడి ఆయువు తీరి పోవడంతో దేవుడి దగ్గరకు వెళ్లాడు’ అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు.అంతటిలో ఆగని ఆయన ‘ఇంటి వచ్చిన అతిథిని గౌరవించి, వారికి సపర్యలు చేయడం మా సంస్కృతి, సాంప్రదాయం. మీరు కచ్చితంగా టీ, బిస్కెట్లు తీసుకున్నాకే మా గుమ్మం దాటాలి’ అని స్పష్టం చేశారు. తన ఇంటిలో ఉన్న పోలీసులు తిరిగివెళ్లిపోయే వరకు అక్కడే ఉన్న ఆ పెద్దాయని ఆ తర్వాతే ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి పరిగెత్తారు. ఆ ఉదంతం తర్వాత ఇప్పటి వరకు ఆ పెద్దాయన సహయం కోరుతూనో... తనకు కృతజ్ఞత చూపించాలనో ఆశించలేదు... పోలీసుల వద్దకు వెళ్లలేదు.మక్కా మసీదులో పేలుడు, పేలని బాంబులపై స్థానిక హుస్సేని ఆలం పోలీసుస్టేషన్లో నమోదైన కేసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్‌కు (ఎస్ఐసీ) బదిలీ అయ్యాయి. అక్కడ నుంచి సీబీఐ చేతుల మీదుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దగ్గరకు వెళ్లాయి. 2008 అక్టోబర్ 28న మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుడు కేసులో ఏటీఎస్ అధికారులు అభినవ్ భారత్‌కు చెందిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్ పురోహిత్‌లను అరెస్టు చేశారు. వీరి విచారణలో అజ్మీర్ పేలుడుకు బాధ్యులైన దేవేంద్ర, లోకేష్, రామ్‌చంద్ర, సందీప్‌ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మలను 2010 ఏప్రిల్ 28న అరెస్టు చేశారు. వీరి విచారణలో ‘మక్కా’ పనీ తమదే అని అంగీకరించడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి రాజస్థాన్ వెళ్లారు. సీబీఐ అధికారులు 2010 జూన్ 11న దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మలపై నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్స్ పొందారు. వీరిని రాజస్థాన్ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ప్రత్యేక బృందంతో అక్కడకు వెళ్లి 18న హైదరాబాద్ తీసుకువచ్చారు. న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో స్వామి అశిమానంద పేరు వెలుగులోకి వచ్చింది. మారు పేరుతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రహస్య జీవితం గడుపుతున్న స్వామి అశిమానందను సీబీఐ అధికారులు 2010 నవంబరు 19న అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులైన రామ్‌చంద్ర, సందీప్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు ‘మక్కా’ కేసు దర్యాప్తు సీబీఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు 2011 ఏప్రిల్ 7న బదిలీ అయింది. పరారీలో ఉన్న రామ్‌చంద్ర, సందీప్‌లపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ గాలించింది. ‘మక్కా’లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు 2011 మే 16న మరో సప్లమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులు 2018 ఏప్రిల్‌లో వీగిపోయాయి. నిందితులను దోషులుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్ -
హైదరాబాద్ : మురిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
గురుకులాలకు ప్రతి నెలా నిధులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లోని విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల డైట్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలతో పాటు ప్రైవేటు భవనాల్లో ఉన్న వాటి అద్దెను ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేయనుంది. సంక్షేమ శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో ఇబ్బందులకు క్రమంగా స్వస్తి పలికేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచే నెలవారీగా నిధులు విడుదల చేయనున్నారు. తాజాగా ఆదివారం రూ.221.24 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. తాజా నిర్ణయంతో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల వసతి, విద్యా సౌకర్యాల వాతావరణం మరింత మెరుగు పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు, అద్దె చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగేది. దాదాపు 9 నెలల వరకు కూడా నిధులు విడుదల కాని పరిస్థితి ఉండేది. దీనివల్ల గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణలో ఇబ్బందులు ఏర్పడటంతో పాటు విద్యార్థుల ఆహారం, వసతి, ఇతర మౌలిక అవసరాలపై ప్రభావం పడేది. ఈ సమస్యలపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం ప్రత్యేక చొరవతో నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. 2026–27 బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రకటించిన విధంగా, తొలుత త్రైమాసిక (క్వార్టర్లీ) ప్రాతిపదికన నిధులు విడుదల చేసే విధానాన్ని అమలు చేశారు. ప్రస్తుతం దానిని మరింత మెరుగుపరిచి నెలవారీ నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు భట్టి తెలిపారు. నిధులు సకాలంలో విడుదల కావడం వల్ల విద్యార్థులకు పోషకాహారం నిరంతరాయంగా అందుతుంది. హాస్టళ్ల నిర్వహణ, భవనాల అద్దెల చెల్లింపులు, అవసరమైన సౌకర్యాల కల్పన సులభతరమవుతాయి. ఆదివారం విడుదల చేసిన రూ.221.24 కోట్లలో.. డైట్ చార్జీల కింద రూ.164.37 కోట్లు, కాస్మోటిక్ చార్జీల కింద రూ.22.43 కోట్లు, భవనాల అద్దె కింద రూ.34.44 కోట్లు కేటాయించారు. -
కాంగ్రెస్ రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదు
వనస్థలిపురం (హైదరాబాద్): ‘తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ చచ్చుడో..’అనే నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన మహానాయకుడు కేసీఆర్ పోరాట పటిమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని స్థాయిలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 8 రోజులుగా కొడుకును దాచిపెట్టి, బాలిక కుటుంబసభ్యులను బెదిరించి, మీడియా నోరు నొక్కిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, నిష్పాక్షికంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆదివారం హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎల్బీనగర్ నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ‘గతంలో నిజాం ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు ఆసుపత్రుల నిర్మాణం జరిగితే, బీఆర్ఎస్ హయాంలో 4 ఆసుపత్రుల నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2.5 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తే, రేవంత్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తోంది. మైనర్ బాలిక విషయమై బీఆర్ఎస్ మహిళా విభాగం, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోరాడుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న బాలిక తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తున్నాం. బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వైఫల్యాలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసు కెళ్ళాలి..’అని కేటీఆర్ చెప్పారు. ‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి ‘దేశంలో బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తున్నారు. ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియలో భాగంగా బెంగాల్, కేరళ రాష్ట్రాలలో లక్షలాది ఓట్లను తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై బీఆర్ఏ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పార్టీ సభ్యత్వం, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నవారికే అవకాశం వస్తుంది. ఎల్బీనగర్లో ఉన్న 18 డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, రాజయ్య, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, నాయకులు దాసోజు శ్రవణ్, దేశ్‌పతి శ్రీనివాస్, దేవీప్రసాద్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, పల్లె రవికుమార్, మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
ప్రేమోన్మాది మణితేజ మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవిని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది మణితేజ (29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం వైష్ణవి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులు ముగించుకుని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కత్తితో దారుణంగా మెడ, గొంతుపై విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. రక్తం మరకలతో పారిపోతున్న మణితేజను స్థానికులు పట్టుకుని కాళ్లు చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతని తలపై రాళ్లు ఎత్తివేయడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. హైదరాబాద్‌లో పరిచయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ ల్యాండ్రీ షాప్ నిర్వహించేవాడు. గతంలో వైష్ణవి ఓ హాస్టల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విద్యార్థుల దుస్తులు ఉతికి, ఇస్త్రీచేసి అప్పగించే సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడింది. తర్వాత వైష్ణవి అక్కడ ఉద్యోగం మానేసినా ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తాను ప్రేమిస్తున్నట్లు వైష్ణవిని వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల వైష్ణవికి వెళ్లి కుదిరిందన్న సమాచారం తెలియడంతో మణితేజ తన ప్రేమను కాదన్న వైష్ణవిని హతమార్చాలని నిర్ణయించుకుని.. జడ్చర్లకు వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.కాగా, మణితేజ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి, తమ్ముడు ఉన్నారు. హత్య అనంతరం వైష్ణవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మణితేజ మృతి చెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చారు. ఈ క్రమంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు వారిపై దాడిచేస్తారన్న అనుమానంతో పోలీసులు వారిని జడ్చర్ల సమీపంలోని డీటీసీలో ఉంచి రక్షణ కల్పించారు. అప్పటి దాకా మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. జడ్చర్లలో వైష్ణవి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనరల్ ఆస్పత్రిలో మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. -
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్‌గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. -
EAPCET Results: బాలికలదే పైచేయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)కు హాజరైన విద్యార్థుల్లో అత్యధిక మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన ఎం.రుషి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. మూసాపేటకు చెందిన అన్షుల్ రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ పులివెందులకు చెందిన ఎం.వంశీధర్ రెడ్డి మూడో స్థానం దక్కించుకున్నారు. ఇంజనీరింగ్‌లో 73.36 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 86.27% మంది ఉత్తీర్ణులయ్యారు. రెండు విభాగాల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంది. ఈఏపీసెట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మే 4 నుంచి 11 వరకూ సీబీటీ విధానంలో జరిగాయి. ఆదివారం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలో జేఎన్టీయూహెచ్ ప్రాంగణంలో పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,10,766 మంది రిజిస్టర్ చేసుకోగా, 1,97,242 మంది పరీక్ష రాశారు. 1,44,704 మంది అర్హత సాధించారు. అగ్రి, ఫార్మా సెట్‌కు 90,977 మంది దరఖాస్తు చేస్తే, 84,954 మంది పరీక్ష రాశారు. వీరిలో 73,294 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌లో బాలురు 84.70 శాతం మంది అర్హత సాధిస్తే, బాలికలు 86.76 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొ. టీకే రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ.వెంకటేశ్వరరావు, మండలి వైస్ చైర్మన్లు ప్రొ. ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమ్మూద్ పాల్గొన్నారు. వారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్‌సెట్ ఫలితాలు వెల్లడవ్వడంతో కాలేజీల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఈ నెలాఖరు నుంచి మొదలు పెడుతున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగతా సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేస్తారు. ఏపీ విద్యార్థులు టాపర్లుగా నిలిచినప్పటికీ కౌన్సెలింగ్‌లో వారికి అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. కన్వీనర్ అసలు హీరో కేవలం వారం రోజుల్లోనే ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేయడం మామూలు విషయం కాదని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. అదీ ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా ఫలితాలు వెల్లడించడం అభినందనీయమన్నారు. పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులే కాదు... సెట్ కన్వీనర్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి కూడా హీరోనే అని కొనియాడారు. -
అమ్మకానికి అర్చక పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ‘అది ఉమ్మడి కరీంనగర్‌లోని ప్రధాన దేవాలయం. నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. ఐదారు నెలల క్రితం ఆ ఆలయంలో పరిచారకుల (సహాయ అర్చకులు) నియామకాలు జరిగినప్పుడు, అప్పటికే ఆ దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తున్న వారి కుమారులు నియమితులయ్యారు. ఇతర అభ్యర్థులకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు అదే ఆలయంలో నాలుగు అర్చకుల పోస్టుల భర్తీ ప్రక్రియ జరగబోతోంది. అర్చకుల పిల్లలు నలుగురు దరఖాస్తు చేశారు. వారికే పోస్టులు దక్కేలా తెరవెనక రంగం సిద్ధమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.’ అర్చకుల పోస్టులను బేరానికి అంగట్లో పెట్టేశారు. అర్చకులు, సహాయ అర్చకుల (పరిచారక) పోస్టులకు కొందరు అధికారులు ధర ఖరారు చేసి అమ్మకానికి తెరదీశారు. కొన్ని ఆలయాల్లో పద్ధతిగానే సాగుతున్నా, కొన్నింట్లో అక్రమాలకు గేట్లు ఎత్తారు. పే స్కేల్ పోస్టులు కావటంతో... గతంలో ఆలయాల్లో అర్చకులు, పరిచారకులు, డోలు సన్నాయి వాయించే వారి పోస్టులంటే పెద్ద ప్రాధాన్యం ఉండేది కాదు. వారికి జీతాలను ఆ దేవాలయ ఆదాయం నుంచే అత్తెసరుగా చెల్లించేవారు. కానీ, ఇప్పుడు దేవాదాయ శాఖ అధీనంలోని ఆలయాల్లో పనిచేసేవారికి ప్రభుత్వ పేస్కేల్ ప్రకారం జీతాలు అందుతున్నాయి. దీంతో ఆయా పోస్టులకు మంచి డిమాండ్ నెలకొంది. రాష్ట్రంలోని 55 ప్రధాన ఆలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. అయితే, భర్తీ ప్రక్రియ టీజీపీఎస్సీ లాంటి నియామక సంస్థల ద్వారా కాకుండా, ఆలయాల స్థాయిలోనే జరిగేలా ఏర్పాటు చేశారు. నియామక నోటిఫికేషన్లను కూడా దేవాదాయ శాఖ కమిషనరేట్ ద్వారా కాకుండా ఆయా దేవాలయాల స్థాయిలోనే జారీ అయ్యాయి. అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరించలేదు. దేవాలయ ఈఓలకు అభ్యర్థులు నేరుగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఆ దరఖాస్తుల ప్రక్రియ యావత్తు లోపభూయిష్టంగా సాగింది. చాలాచోట్ల అభ్యర్థులకు రశీదు కూడా ఇవ్వలేదు. ఒక్కో దేవాలయానికి ఒక్కో తేదీన నియామక తేదీలను ప్రకటించారు. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు.. జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, కొన్నింటికి దేవాదాయశాఖ ప్రధాన సెంటర్లలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రధాన దేవాలయంలో ప్రక్రియ ఒక్కటి ప్రస్తుతానికి పూర్తయింది. అక్కడ దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులకు కనీసం పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ కూడా వెల్లడించలేదు. తీరా ఇంటర్వ్యూల విషయం తెలిసి అభ్యర్థులు వెళ్లేసరికి ప్రక్రియ పూర్తయిందని, వారి దరఖాస్తులను తిరస్కరించామని చెప్పటంతో కంగు తిన్నారు. దీనిపై వారు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, దేవాలయం స్థాయిలోనే ప్రక్రియ జరిగినందున, అక్కడే తేల్చుకోవాలని చెప్పి పంపించేశారు. అభ్యర్థుల నుంచి భారీగా వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నారని, అందుకే చెప్పాపెట్టకుండా ప్రక్రియను పూర్తి చేశారని ఇతర అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు మిగతా ఆలయాల ప్రక్రియ మొదలవుతోంది. చాలాచోట్ల ఇప్పటికే ఇదే తరహా ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రేటు ఖరారు చేసి బేరమాడుకుని పోస్టులను రిజర్వ్ చేశారని ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ ప్రక్రియను రద్దు చేసి, నియామక బోర్డు ద్వారా పకడ్బందీగా ప్రక్రియ నిర్వహించి అర్హులకే పోస్టులు దక్కేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. డోలు సన్నాయి వాద్యకారుల పోస్టుల భర్తీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొందరు అర్హతలేని వారికి బాధ్యత అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. ⇒ ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ సహా ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ అంతర్గతంగానే జరిగే సంప్రదాయం ఉండేది. కానీ, ఇది అక్రమాలకు అవకాశం కల్పిస్తోందన్న ఉద్దేశంతో ప్రభుత్వం భర్తీ ప్రక్రియను టీజీపీఎస్సీకి కేటాయించింది. త్వరలో జరగబోయే నియామక ప్రక్రియ పూర్తిగా నియామక బోర్డుల ఆధ్వర్యంలో జరగనుంది. డ్రైవర్, కండక్టర్ పోస్టులను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, డీఎం, అసిస్టెంట్ డీఎం అయితే టీజీపీఎస్సీ, ఆర్టీసీ ఆసుపత్రి సిబ్బంది నియామకాలు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించబోతోంది. -
పర్సంటేజీ ఫిక్స్!
కరీంనగర్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి తన పదవీ విరమణ ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని రెండేళ్లయింది. అదిగో ఇదిగో అంటూ ఊరించిన ప్రభుత్వం ఎట్టకేలకు 4 నెలల క్రితం ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్‌ను మంజూరు చేసింది. ఈ బిల్లును ట్రెజరీ కార్యాలయం ఆమోదించి ఆయన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాల్సి ఉంది. ఆ రిటైర్డ్ ఉద్యోగి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి తన డబ్బులు విడుదల చేయాలని కోరాడు. బిల్లు వచ్చిన మాట వాస్తవమే కానీ అన్ని వివరాలు పరిశీలించాలని, పింఛనుకు సంబంధించి కొన్ని వివరాలు లోపించాయంటూ ట్రెజరీ సిబ్బంది లేని కొర్రీలు వేసి పదిరోజుల పాటు తిప్పుకున్నారు. చివరకు అసలు విషయం గ్రహించిన ఆ రిటైర్డ్ ఉద్యోగి.. ఓ ఉద్యోగ సంఘం నేత సహకారంతో ట్రెజరీ సిబ్బందిని సంప్రదించాడు. వారికి కావాల్సిన (తన మొత్తం బిల్లులో 4%) పర్సంటేజీని ముట్టజెప్పడంతో కొర్రీలు ఎటు వెళ్లాయో..! వారం వ్యవధిలోనే డబ్బులు విడుదల కావడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖజానా శాఖ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక శాఖ నుంచి వచ్చే ప్రతి బిల్లు విడుదల కోసం ఈ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రతి బిల్లుకు పర్సంటేజీలు నిర్ణయించి మరీ కాసులు కొల్లగొడుతున్నారని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు వాపోతున్నారు. రాష్ట్రంలోని చాలా డీటీవో (జిల్లా ట్రెజరీ కార్యాలయాలు), ఎస్టీవోలు (సబ్ ట్రెజరీ కార్యాలయాలు) అవినీతికి అడ్డాలుగా మారాయని, ఫిక్స్డ్ రేట్లు పెట్టి కొన్ని చోట్ల వసూలు చేస్తుంటే, మరికొన్ని చోట్ల బిల్లును బట్టి ఆమ్యామ్యాలు ఇవ్వాల్సిందేనని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు చెబుతున్నారు. పర్సంటేజీల వారీగా ముట్టజెపితే సకాలంలో బిల్లులు మంజూరవుతాయని, లేదంటే కొర్రీలు పెడుతున్నారని, సర్వర్లు పనిచేయడం లేదు.. దరఖాస్తుల్లో తప్పులున్నాయంటూ ఫైల్స్ కదపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ తప్పించుకోవడానికీ ముడుపులు! ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ ద్వారా వచ్చే ప్రతి రూపాయి ట్రెజరీల ద్వారానే చెల్లిస్తుంటారు. కాంట్రాక్టు పనులు, ఉద్యోగుల వేతనాలు, వారికి సంబంధించిన మెడికల్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు, గురుకులాలకు ఇచ్చే డైట్ చార్జీలు, అద్దె వాహనాలు, వివిధ కార్యాలయాలు, గ్రామపంచాయతీల బిల్లులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు.. ఇలా అన్ని రకాల బిల్లులను చెక్కుల రూపంలో బ్యాంకులకు పంపడం లేదంటే ఆయా బ్యాంకు అకౌంట్లలో వేయడం ట్రెజరీల ద్వారానే జరుగుతుంది. అయితే ఈ బిల్లుల విడుదల కోసం ట్రెజరీ కార్యాలయాల్లో పర్సంటేజీలు ముట్టజెప్పడం మామూలేనని, అయితే ఇటీవల కాలంలో ఈ అవినీతి పెచ్చుమీరుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల బిల్లులకు పది శాతం టోకుగా లేదంటే బిల్లును బట్టి ముట్టజెప్పాల్సి వస్తోందని, కనీసం పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నా ట్రెజరీ సిబ్బందిని ప్రసన్నం చేసుకోవాల్సిందేనని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ బిల్లుల విడుదలకు తోడు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆదాయ పన్నుకు సంబంధించిన ‘సహకారానికి’ గాను క్రమం తప్పకుండా ముడుపులివ్వాలని, అలా ఇస్తే వారు పన్ను కట్టే పని లేకుండా ఆడిట్ చేస్తారని చెబుతున్నారు. కొర్రీలు నమోదు చేయకుండానే.. వాస్తవానికి ఏదైనా బిల్లును తిరస్కరించే సమయంలో ట్రెజరీ సిబ్బంది ఎందుకు తిరస్కరించారనే కారణాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ డబ్బులు ముట్టకపోతే కారణాలేవీ నమోదు చేయకుండానే బిల్లులు తిరస్కరిస్తారని, లేదంటే కొర్రీలు వేసి ఫైల్ కదలకుండా చేస్తారని, విధిలేని పరిస్థితుల్లో వారు అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. మరోవైపు ఈ బిల్లుల చెల్లింపుల కోసం పర్సంటేజీలు ఇచ్చేలా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులే మధ్యవర్తిత్వం వహిస్తారని, కొన్ని చోట్ల ఉద్యోగ సంఘాల నేతలు సమన్వయం చేస్తుంటారని, డీటీవోలు, ఎస్టీవోలు ముందు జాగ్రత్తగా ఉద్యోగ సంఘాల నేతలు, పలు శాఖల ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారనే ఆరోపణలున్నా.. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ దృష్టి ఈ ట్రెజరీల మీద పడకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిజామాబాద్ డీటీవోలో.. నిజామాబాద్ జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలో ప్రతి పనికి సంబంధిత సెక్షన్లోనే డబ్బుల వసూలు జరుగుతోంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉద్యోగుల ఆదాయ పన్ను వివరాలు సమర్పించడం కోసం ప్రతి ఉద్యోగి నుంచి రూ.500 ఎస్టీవోల ఆధ్వర్యంలోనే వసూలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు ఉన్న మెడికల్ బిల్లులకు రూ.10 వేలు, దానికి లోపు ఉంటే రూ.5 వేలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. టీఎన్జీవో సంఘంలో నేతలుగా ఉన్న కొందరు ఉద్యోగులు సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. డీటీవో కార్యాలయానికి ఈ నేతల ద్వారానే వెళ్లి డబ్బులు సమర్పించి పనులు చేయించుకుంటున్న పరిస్థితి. గ్రామ పంచాయతీ బిల్లులు సమర్పించే పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా ఇలా సమన్వయం చేస్తుంటారు. సకాలంలో బిల్లులు చేయించుకోకపోతే నిధులు వెనక్కు వెళ్లిపోతాయని చెప్పి మరీ రూ.10 వేలు, రూ.20 వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో.. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయాలు, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో వసూళ్ల దందా యధేచ్చగా సాగుతోంది. ఉద్యోగుల మెడికల్ బిల్లులకు పది శాతం చొప్పున వసూలు చేస్తున్నారు. ఎవరైనా ఉద్యోగి మెడికల్ బిల్లు రూ.80 వేలు ప్రాసెస్ చేయాలంటే రూ.8 వేలు ఇచ్చుకోవాల్సిందే. లేని పక్షంలో బిల్లుల్లో ఆ వివరాలు లేవని, ఆన్లైన్లో సర్వర్ తీసుకోవడం లేదంటూ రోజుల తరబడి తిప్పడం పరిపాటి అయిపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా వసూళ్ల దందా సాగిస్తున్నారని తెలుస్తోంది. వచ్చిన ముడుపుల్లో సెక్షన్ల వారీగా పనిచేసే సిబ్బందితో పాటు అధికారులకు వాటాలు అందుతున్నాయని సమాచారం. బిల్లు స్థాయిని బట్టి.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎస్టీవో పరిధిలో బిల్లు, ఆ బిల్లు తెచ్చిన వ్యక్తి, ఆ బిల్లుకు సంబంధించిన స్థాయిని బట్టి పర్సంటేజీలు నిర్ణయిస్తున్నారు. ఓ ఉద్యోగి వేతన బిల్లు చేయడంలో లంచం తీసుకోవడంతో ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్‌ను ఇటీవల ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కార్యాలయంలో బిల్లుల కోసం ఉపాధ్యాయులు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఎరియర్స్ బిల్లులు మాత్రం బిల్లును బట్టి పర్సంటేజీలు ఉంటున్నాయి. సూర్యాపేట జిల్లా సూర్యాపేట ట్రెజరీ ఆఫీసులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 25–30 వేలు, మెడికల్ బిల్లుల కోసం రూ.10 వేల దాకా తీసుకుంటున్నారని, గ్రామ పంచాయతీ బిల్లులకు కనీసం 2 శా>తం ఇవ్వాల్సిందేననే ఆరోపణలున్నాయి. పెన్షన్ ఫైలు చెక్ చేసినందుకూ.. నల్లగొండ జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాల్లో రిటైర్ అయిన ఉద్యోగులు పెన్ష¯న్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆ ఫైల్ చెక్ చేసి పెట్టేందుకు కూడా పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడిస్తుందో తెలియని పరిస్థితులున్నా.. సదరు రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం ముందుగానే ట్రెజరీ సిబ్బందికి ఆమ్యామ్యాలు సమర్పించుకుంటున్నట్టు సమాచారం. -
హైకోర్టు న్యాయమూర్తిపై అసత్య ప్రచారం.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం చేసిన ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బి.ఎస్. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరధ్‌ను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం జరిగాయి. ఈ వార్తలు న్యాయమూర్తులపై ప్రభావం చూపే ప్రయత్నంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్పిత వార్తలు ప్రచారం కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజల మధ్య విస్తృత చర్చకు దారి తీసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.చార్మినార్ పోలీసులు ఐటీ యాక్ట్‌తో పాటు భారత న్యాయసంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 353(1)(c), బీఎన్ఎస్ 353(2), బీఎన్ఎస్ 267 సెక్షన్ల కింద ఎస్ఐఆర్ (SIR) నమోదు చేసి, కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. -
కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ చేయాలి. కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి. లేదంటే విచారణ పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు. తప్పు చేసిన కొడుకును తొమ్మిది రోజులు దాచిపెట్టారు. బేటీ బచావో అన్నది నినాదాలకు సరిపెడతారా మోదీ గారూ. కేంద్ర మంత్రి కొడుకుపై లుక్ఔట్ నోటీసు ఇవ్వడం తొలిసారి. బాధిత కుటుంబాన్ని బెదిరించి, ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు’అని వ్యాఖ్యానించారు. -
బండి భగీరథ్‌తో పార్టీకి సంబంధం లేదు:కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బండి భగీరథ్ అంశమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బండి భగీరథ్ ఇదివరకే సరెండర్ అయ్యారని ఆ విషయంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు అంశంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం ఉండదని తెలిపారు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుందని తెలిపారు. పెట్రోల్ పై ట్సాక్స్ తగ్గించాలని కేంద్ర కోరినా రాష్ట్రం ఏమాత్రం తగ్గించడం లేదన్నారు.అయితే కేంద్రమంత్రి బండిసంజయ్ కుమారుడు బండి భగీరథ్ నిన్న (శనివారం) పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.కాగా ఈ విషయంపై స్పందించిన బండి సంజయ్.. తన కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదని చెబుతున్నాడని అందుకే పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని తెలిపారు -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లులో అగ్నిప్రమాదం
నల్లగొండ: వీర్లపాలెంలో యాదాద్రి థర్మర్ పవర్ ప్లాంటులో అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్-3లో బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై అప్రమత్తమైన ప్లాంట్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చింది. ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు -
‘మక్కా’ పేలుళ్లు.. ఇంట్లో పోలీసులు.. మనవడి మృతి అంటూ ఫోన్.. పెద్దాయన ఏం చేశాడు..
‘మక్కా’ పేలుళ్లు జరిగి రేపటికి 19 ఏళ్లు పూర్తి అవుతుంది. 2007 మే 18.. శుక్రవారం.. మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం తప్పలేదు.అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్‌పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.అలసిపోయిన ఉన్న పోలీసులు మరో ఆలోచనే లేకుండా.. వెంటనే అతడి ఇంటికి చేరుకున్నారు. అనంతరం, వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. పోలీసుల కాల్పుల్లో అతడి మనవడు చనిపోయాడు అని.. ఆ తర్వాత ఏం జరిగింది?.. మనవడి మృతి పట్ల పెద్దాయన ఎలా స్పందించాడు. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు.. సదరు వృద్దుడు పోలీసులను ఎలాంటి సాయం కోరాడు.. తదితర విషయాలపై సాక్షి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. రేపు ఉదయం(సోమవారం) మీ కోసం.. -
ప్రేమించకుంటే చంపేస్తారా?
సాక్షి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్లో తనను ప్రేమించడం లేదని ప్రేమోన్మాది తేజ.. చేతితో గాయపడి వైష్ణవి (23) మృతి చెందింది. ఈ ఘటనలో స్థానికులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన తేజను ఆసుపత్రికి తరలించారు. ఆ యవకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ కీలక వ్యాఖ్యలు చేసింది. తన అక్క(వైష్ణవి) గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డింది.వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ స్పందించింది. ఈ సందర్బంగా అక్షయ..‘మా సోదరి మృతిపై రకరకాల కథనాలు రావడం బాధాకరం. ఏ అమ్మాయి అయినా డబ్బులు తీసుకొని మోసం చేస్తారా?. చనిపోయే సందర్భంలో నిందితుడు చేసిన ఆరోపణను ఎలా నిర్ధారిస్తారు?. అమ్మాయిలను సమాజంలో పురుగుల్లా చూస్తున్నారు. మా అక్క గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆమె గురించి మీకేం తెలుసు?. మాకు న్యాయం చేయకపోయినా సరే కానీ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. న్యాయం కోసం ముఖ్యమంత్రి వద్దకైనా వెళ్తాం.మా అక్కపై దాడి జరిగే సమయంలో అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్‌ను అలవరచుకోవాలి. ఎవరో చనిపోయారని తెలిస్తే అక్కడికి వెళ్ళాక మా అక్క అని గుర్తించాం. సామాజిక బాధ్యతగా వివరించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రేమించకుంటే చంపేస్తారా?’ అని ప్రశ్నించింది.ఇదిలా ఉండగా.. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో యువకుడు తేజ.. యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచ్చిన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్య చికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. -
ప్రియుడితో ప్రేమ పెళ్లి.. ఇద్దరితో వివాహేతర సంబంధం..
మధిర: భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళకు ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మొదలైన ఘర్షణ.. సదరు మహిళ హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని మధిర మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతురాలిని కల్పనగా గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరుకు చెందిన గోపిశెట్టి కల్పన (27), మైలవరం మండలం బొర్రగూడెంకు చెందిన డేరంగుల నాగరాజు 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించాక మనస్పర్దలతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆపై కల్పన కొంతకాలం తిరువూరులో, ప్రస్తుతం మధిరలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో వాయిద్యకారుడు విజయభాస్కర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడ్డాక, కొన్నాళ్లకు తిరువూరులోని ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో పనిచేసే గంపలగూడెం మండలం కనుమూరుకు చెందిన యార్లగడ్డ చెన్నారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై విజయభాస్కర్, చెన్నారావు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ప్రస్తుతం మేడూరులోని పుట్టింట్లో ఉంటూ మధిర వచ్చి వెళ్లే కల్పన రోజులాగే శనివారం కూడా బయలుదేరింది.ఇద్దరం కలిసి మాట్లాడుదాం..కల్పన విషయమై మాట్లాడే పని ఉందని, ఆమె కూడా వస్తున్నందున రావాలని చెన్నారావు.. విజయభాస్కర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో, తొలుత చెన్నారావు, కల్పన ద్విచక్ర వాహనంపై మధిర మండలం కృష్ణాపురం సమీపాన వెంచర్లోకి వెళ్లారు. ఆ లొకేషన్‌ను విజయభాస్కర్‌కు షేర్ చేయడంతో ఆయన కాసేపయ్యాక బయలుదేరాడు. అయితే, తొలుత వెళ్లిన చెన్నారావు, కల్పన మధ్య జరిగిన వాగ్వాదంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆపై చెన్నారావు వెళ్లిపోగా, కాసేపటికి లొకేషన్ ఆధారంగా చేరుకున్న విజయభాస్కర్‌కు ఇద్దరూ కనిపించకపోవడంతో వెనుదిరిగాడు.కొద్దిసేపయ్యాక కల్పన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మధిర సీఐ మధు, సిబ్బంది చేరుకుని పంచనామా నిర్వహించారు. అంతేకాక మృతురాలి భర్త నాగరాజు, ఆమెతో పరిచయం ఉన్న విజయభాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హత్య అనంతరం పరారైన చెన్నారావు.. కల్పన సోదరుడి సెల్‌ఫోన్‌కు పలు అంశాలపై వాట్సప్ మెసేజ్‌లు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ వెల్లడించారు. కాగా, కల్పన వివాహేతర సంబంధం కారణంగా ఆమె కుమారుడు ఒంటరైపోయాడని స్థానికులు చెబుతున్నారు. -
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏపీసెట్–2026 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌లోని గోల్డెన్ జూబ్లీహాల్లో ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధికారికంగా ప్రకటించారు.ఈ నెల 4 నుంచి 11 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు జరగ్గా ఈ నెల 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.👉టీజీ ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ రిజల్ట్ డైరెక్ట్ లింక్👉 టీజీ ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ రిజల్ట్ డైరెక్ట్ లింక్ -
చాయ్ గరం.. బిర్యానీ పిరం..
హైదరాబాద్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ మొదలు అన్నిరకాల ఆహార పదార్థాలపై గ్యాస్ ధర పెంపు ప్రభావం పడింది. మొన్నటి వరకు రూ.220 నుంచి రూ.300 వరకు ఉన్న ప్లేట్ చికెన్, మటన్ బిర్యానీ ధర ఇప్పుడు రూ.270 నుంచి రూ.380కి చేరింది. పాతబస్తీలోని ఒక ప్రముఖ హోటల్లో మటన్ బిర్యానీ ప్లేట్ రూ.320 నుంచి ప్రస్తుతం రూ.360కి పెరిగింది. గచ్చిబౌలిలోని ఒక హోటల్లో మొన్నటివరకు రూ.340 ఉండగా రూ.380కు, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో రూ. 320 నుంచి 360 పెరిగింది. ఇక నగర ప్రజలు ఇష్టంగా తాగే ఇరానీ చాయ్ రూ.12 నుంచి రూ.20కి ఎగబాకింది.పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గ్యాస్ దిగుమతులపై ప్రభావం చూపించడం, వాణిజ్య సిలిండర్ ధర గణనీయంగా పెరగడంతో ఫుడ్ ఇండస్ట్రీపై పిడుగు పడినట్టయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టీ స్టాళ్లు మొదలుకుని కర్రీ పాయింట్లు, టిఫిన్ బండ్లు, చిన్న హోటళ్లు, స్టార్ హోటళ్ల వరకు అన్నిట్లోనూ ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఎక్కడ చూసినా ‘ధరలు పెంచాం – సహకరించండి’అనే బోర్డులు కనిపిస్తున్నాయి. టీ నుంచి బిర్యానీ వరకు అన్నింటిపైనా సగటున 20% నుంచి 40% వరకు అదనంగా ధరలు పెరిగాయి. నగరంలోని ప్రతి నలుగురిలో ఒకరు బయటి ఆహారంపైనే ఆధారపడుతున్నారనే అంచనాల నేపథ్యంలో పెరిగిన ధరలు వారికి భారంగా మారాయి. 30 శాతం జనానికి హోటలే దిక్కు! నగర జనాభా 1.55 కోట్లు దాటింది. అందులో సుమారు 30 శాతం అంటే సుమారు 46.50 లక్షల మంది నిత్యం బయటి ఆహారంపైనే ఆధారపడి ఉంటారన్నది అంచనా. కాగా తాజా గ్యాస్ ధర ప్రభావంతో ఆహార ప్రియులపై రోజుకు సగటున రూ.40 నుంచి రూ.60 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నగరంపై రోజుకు సగటున రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడుతుండగా, నెలకు రూ.600 కోట్లు దాటిపోతోంది. ఇంట్లో వంట సదుపాయం ఉన్నప్పటికీ టీ, టిఫిన్లు, భోజనాల కోసం 20.25 లక్షల మంది హోటళ్లకు వెళుతుంటారని అంచనా. మిగిలిన 26.25 లక్షల మంది విద్య, శిక్షణ, ఉపాధి, వైద్యం, ఇతరత్రా పనుల కోసం నగరానికి వచ్చి హాస్టళ్లు, అద్దె రూమ్‌లు, లాడ్జీల్లో ఉంటూ అనివార్యంగా బయటి భోజనంపైనే ఆధారపడుతుంటారు. నలుగురితో కూడిన ఒక కుటుంబం హోటల్‌కు వెళ్లి భోజనం చేసి రావాలంటే రూ. 500 నుంచి రూ.1,000 వరకు అదనంగా బిల్లు అవుతున్నట్టు తెలుస్తోంది. కడుపు నింపని భోజనం! నగరంలోని అమీర్‌పేట్, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు ఐటీ ఉద్యోగులు నూటికి నూరు శాతం మెస్‌లు, కర్రీ పాయింట్లపైనే ఆధారపడుతుంటారు. ప్రస్తుతం వీరి నెలవారీ మెస్ చార్జీలు కూడా పెరిగాయి. గ్యాస్ ధర పెంపుతో అమాంతం ధరలు పెంచిన మెస్‌లు.. మెనూ మాత్రం తగ్గించేశాయి. పప్పులో పప్పు ఉండటం లేదని, చారులో రుచి కరువయ్యిందని, పరిమాణం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హోటళ్లలో కూడా మొన్నటివరకు ఇద్దరికి సరిపోయే ’ఫుల్ బిర్యానీ’ఇప్పుడు ఒకరికి కొంచెం ఎక్కువ, ఇద్దరికి తక్కువ అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు. కర్రీ..వర్రీ నగరంలో కర్రీ పాయింట్లకు యమ గిరాకీ అన్న సంగతి తెలిసిందే. కీలక ప్రాంతాల్లో గల్లీకో కర్రీ పాయింట్ ఉంటోంది. ప్రస్తుతం నాన్ వెజ్, వెజ్..అన్నిరకాల కూరల ధరలూ పెరిగాయి. ప్రతి కర్రీపై రూ.10 నుంచి రూ. 20 వరకు పెరుగుదల చోటు చేసుకుంది. కర్రీ పాయింట్లలో ఒక కప్పు కూర ధర రూ. 30 నుంచి రూ. 50కి చేరడంతో, రెండు కూరలు కొనేవారు ఇప్పుడు ఒక్కదాంతోనే సర్దుకుపోతున్నారు. క్యాటరింగ్ రంగానిదీ ఇదే పరిస్థితి. కొత్తగా వచ్చే ఆర్డర్లపై ప్లేటుకు రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.వసతి భారం హాస్టళ్లపై వాణిజ్య గ్యాస్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. సుమారు 12 వేల హాస్టళ్లలో ఉంటున్న 11 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత, అధిక ధరలతో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో హాస్టళ్ల నిర్వాహకులు భారీ నష్టాల్లో కూరుకుపోయారు. ఈ అదనపు భారాన్ని తట్టుకోలేక ఫీజులు పెంచడంతో పాటు మెనూలో కొంత కోతలు పెడుతున్నారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 17-24)
-
ఉప్పల్ చౌరస్తా మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా..
ఉప్పల్: అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఉప్పల్ విద్యుత్ జంక్షన్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను దారి మళ్లిస్తున్నా మని సూచించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్ బస్టాప్‌ను ఇప్పటికే ఉప్పల్ నల్ల చెరువు కట్ట వద్దకు మార్చిన విషయం విదితమే. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా.. హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్, ఐవోసీ, చెంగిచర్ల మీదుగా వరంగల్ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాంధీ పార్కునుంచి లిటిల్ ఫ్లవర్ వెనక దారి నుంచి వరంగల్ రహదారికి చేరుకోవచ్చు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు ఉప్పల్ ఏషియన్ సినీ థియేటర్ ఎదుటి హెచ్ఎండీఏ రోడ్డు ద్వారా నాగోల్ రోడ్డుకు కలుపుతారు. ద్విచక్ర వాహనదారులు నాగోల్ మెట్రో పిల్లర్లు 812, 813 నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జి కింద నుంచి యూ టర్న్ చేసుకుని తిరిగి ఉప్పల్ వైపు రావాలి. వరంగల్ వైపు వెళ్లేవారు హెచ్ఎండీఏ లే అవుట్ నుంచి వరంగల్ హైవేకు చేరుకోవాలి. హైదరాబాద్‌కు వచ్చే వరంగల్ బస్సులు, లారీలు, భారీ వాహనాలన్నీ ఓఆర్ఆర్ మీదుగా హయత్‌నగర్ మీదుగా నగరానికి చేరుకోవాల్సి ఉంటుంది. -
‘ఎన్యూమరేషన్’ ఇస్తేనే ఓటు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్)–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని బూత్ లెవల్ అధికారుల(బీఎల్ఓ)కు ఇవ్వని ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితాలో తొలగిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి చెప్పారు. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరుకు 2 ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేస్తారని తెలిపారు. ఇళ్లకు తాళం వేసి ఉంటే బీఎల్ఓలు కనీస పర్యాయాలు ఆ ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారని స్పష్టం చేశారు. ఓటర్లకు సంబంధించిన పాక్షిక సమాచారంతో ఈ ఫారాలను ముందే ముద్రిస్తారన్నారు. మిగిలిన సమాచారాన్ని ఓటర్లు పూరించి ఒక ఫారం ప్రతిని తిరిగి బీఎల్ఓలకు జూలై 24లోగా అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ దశలో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https://voters.eci.gov. in) ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని భర్తీ చేసి సమర్పించవచ్చని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానున్న ‘సర్–2026’ కార్యక్రమంపై శనివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముసాయిదాలో ఈ ఓటర్ల తొలగింపు ‘అందుబాటులో లేని/ వలసవెళ్లిన/చనిపోయిన(అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్) ఓటర్లను ముసాయిదా జాబితాలో తొలగిస్తారు. ఆయా కారణాలతో ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేకపోయిన ఓటర్ల జాబితాలను స్థానిక పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,18,902 పురుష, 1,71,02,883 మహిళా, 2,879 ట్రాన్స్‌జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 3,39,24,664 మంది ఓటర్లున్నారు. వీరిలో 2,18,39,741 మంది (64.38శాతం) ఓటర్లను సర్–2002 జాబితా మేరకు మ్యాపింగ్ పూర్తి చేశాం. ముసాయిదాలో ఉన్నా మ్యాపింగ్ కాకపోతే కష్టమే ముసాయిదా ఓటర్ల జాబితాలో స్థానం పొందినప్పటికీ సర్–2002 జాబితాతో మ్యాపింగ్ కాలేకపోయినా, ఒక వేళ మ్యాపింగ్ జరిగినప్పటికీ పేర్లు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నా.. వారిని జూలై 31 –సెప్టెంబర్ 28 మధ్య కాలంలో నోటీసులిచ్చి విచారణకు పిలుస్తారు. ఇలా నోటీసులు అందుకునే ఓటర్ల జాబితాలను ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)లు ప్రచురిస్తారు. ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం రుజువుగా విచారణ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డును ఓటరు గుర్తింపు నిర్థారణకు అనుమతిస్తారు..’అని సీఈఓ వివరించారు. వివరాల్లో వ్యత్యాసాలుంటే ఎదురయ్యే పరిస్థితులపై సీఈఓ ఒక ఉదాహరణ తెలిపారు. సర్–2002 ఓటర్ల జాబితాలో తన తండ్రి పేరు ‘నారాయణ’గా ఉండగా, ప్రస్తుత జాబితాలో ‘సి.నారాయణ’గా ఉండడంతో తాను సైతం విచారణకు హాజరై ‘మా నాన్న నారాయణే’అని రుజువులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/దరఖాస్తులను జూలై 31–ఆగస్టు 30 మధ్య స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. జూలై 31–సెప్టెంబర్ 28 మధ్య నోటీసుల జారీ/విచారణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు. పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు చేసుకోవాల్సిందే.. నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది. – 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. – 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. – 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధారంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన పత్రాలు – కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్‌కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ – 01.07.1987కు ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాలు – జనన ధ్రువీకరణ పత్రం – పాస్‌పోర్ట్ – గుర్తింపు పొందిన బోర్డులు/విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు – శాశ్వత నివాస సరి్టఫికెట్ – అడవి హక్కుల సర్టిఫికెట్ – ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ పత్రం – జాతీయ పౌరుల రిజిస్టర్ (అందుబాటులో ఉన్న చోట్ల) – రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ – ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రం – ఆధార్ కార్డు (09.09.2025 నాటి ఈసీ సూచనలు వర్తిస్తాయి) -
ఆధిపత్య పోరుకు ‘చెక్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఉండగా, ఉప సర్పంచ్‌లకున్న చెక్ పవర్ రద్దుకు చర్యలు మొదలైనట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న చెక్ పవర్ సమస్యకు ఓ పరిష్కారం చూపే దిశలో ప్రయత్నాలు ఊపందుకున్నట్టుగా తెలుస్తోంది. ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శికి చెక్ పవర్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి చెక్ పవర్ వినియోగం విషయంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని తెలిపాయి. అసెంబ్లీలో చట్ట సవరణ చేయాలి ఉప సర్పంచ్‌లకున్న చెక్ పవర్ రద్దు కావాలంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 కి సవరణలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు లేని పక్షంలో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ మార్పును అమలు చేసేందుకు వీలుంటుంది. అయితే ఆ తర్వాత ఆరు నెలల్లోగా అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శికి చెక్ పవర్ ఇవ్వడం వల్ల పంచాయతీరాజ్ శాఖ ప్రతినిధిగా జవాబుదారీతనంతో పాటు నిధుల దుర్వీనియోగం వాటిల్లితే అతడినే బాధ్యుడిని చేసి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో రాజకీయ నాయకుల మధ్య గొడవలతో అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే ఇదే సరైన మార్గమని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకాలతోనే నిధుల లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూడా 2018కి ముందు ఇదే పద్ధతి అమల్లో ఉండగా, గత ప్రభుత్వం ఉప సర్పంచ్‌లకు ఈ అధికారాన్ని కల్పించింది. అభివృద్ధికి ఆటంకం ఫిర్యాదులతో.. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ల మధ్య ఆధిపత్య పోరు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు అడ్డంకిగా మారినట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడడం, సకాలంలో నిధులు, బిల్లులు విడుదల కాకపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జాయింట్ చెక్ పవర్ విధానం వల్ల సర్పంచ్‌లు–ఉప సర్పంచ్‌లు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు/అధికారుల మధ్య కోల్డ్‌వార్ సాగుతున్నట్టుగా వస్తున్న వార్తలపై పీఆర్ఆర్డీ శాఖ అప్రమత్తమైంది. మళ్లీ పాత పద్ధతిలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఉమ్మడి సంతక అధికారాలు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. నిధుల విడుదల, చెల్లింపులో ప్రతిష్టంభన ప్రస్తుతం అమల్లో ఉన్న నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం..గ్రామాల్లో ఏ ఖర్చు చేయాలన్నా సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్ సంతకం తప్పనిసరి. అయితే అత్యధిక శాతం గ్రామాల్లో వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడడం, ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారైతే ఈ సమస్య మరింత జఠిలంగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారైనప్పటికీ వర్గ పోరు కారణంగా నిధుల విడుదల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతోందనే విమర్శలున్నాయి. కొన్ని గ్రామాల్లో ఉప సర్పంచులు సంతకం పెట్టాలంటే కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే బిల్లులు ఆపేస్తున్నారనే ఆరోపణలుండగా, సర్పంచులతో పాటు డీపీవోలు, ఇతర అధికారుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందినట్టుగా తెలిసింది.ఏకాభిప్రాయం కొరవడటంతో నిధుల విడుదల, బిల్లులు చెల్లింపు వంటి వాటిలో ఎడతెగని జాప్యం చేసుకుంటోందనే ఫిర్యాదులు అందినట్టు సమాచారం. చివరకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి సకాలంలో యుటిలైజేషన్ సర్టీఫికెట్లు సమర్పించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన తదుపరి నిధుల విడుదల కూడా ఆలస్యమవుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచి్చనట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ తాజా ప్రతిపాదనలు చేసిందని, అయితే దీనిపై ప్రభుత్వం కచి్చతమైన నిర్ణయం తీసుకుంటేనే చట్ట సవరణ ఇతర విషయాల్లో ముందడుగు పడుతుందని అధికారులంటున్నారు. -
నమ్మకంగా నయవంచన
సాక్షి, హైదరాబాద్: ఒంటరి వృద్ధ జంటల్ని, ఒకవేళ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నా..వారు ఇంట్లో లేని సమయంలో వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వృద్ధులకు అవసరమైన సపర్యలు చేసేందుకు ఇళ్లల్లో పని మనుషులుగా, కేర్ గివర్స్‌గా, కేర్ టేకర్స్‌గా చేరుతున్న ఇతర రాష్ట్రాలవారు, నేపాల్ వంటి దేశాలకు చెందినవారిలో కొందరు నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు. ఆభరణాలు దొంగిలించి పరారవుతున్నారు. ఈ క్రమంలో అవసరమైతే వృద్ధుల ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. పోలీసులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇలాంటి వారి విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టగొడుగుల్లా ఏజెన్సీలు వయో వృద్ధులకు వైద్య సహాయకులను, వ్యక్తిగత సేవకులను అందజేసే నెపంతో ఊరూ పేరు లేని కేర్ గివర్స్ ఏజెన్సీలు నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఏ విధమైన చట్టబద్ధత, గుర్తింపు లేని ఇలాంటి సంస్థల ద్వారా అటెండెంట్లు, పని మనుషులుగా చేరుతున్న వారు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని విధాలుగా చట్టబద్ధమైన గుర్తింపు కలిగిన కేర్ గివింగ్ ఏజెన్సీలు 80 వరకు ఉన్నట్లు అనధికార అంచనా. కానీ ఏ గుర్తింపు లేని సంస్థలు మాత్రం వందల సంఖ్యలోనే ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వణికించిన ఉదంతాలు పదవీ విరమణ చేసిన పోలీసు ఉన్నతాధికారి భార్యను నేపాలి ముఠా హతమార్చి దోపిడీకి పాల్పడిన ఘటన మరిచిపోకుండానే జవహర్‌నగర్ పరిధిలోని కౌకూర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో ఇలాంటిదే మరో ఉదంతం చోటుచేసుకుంది. పని మనుషులుగా చేరిన నేపాలీ భార్యాభర్తలు కొంతకాలం నమ్మకంగా ఉంటున్నట్టు నటించి పక్కా పథకం ప్రకారం వృద్ధ దంపతులను బంధించి ఇల్లంతా దోచుకెళ్లారు.ఈ సంఘటనలో ఆ నేపాలీ గ్యాంగ్‌ను వృద్ధ దంపతులు ఏవిధంగానూ ప్రతిఘటించక పోవడంతో వారు బతికి బట్టకట్టారు. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ సంఘటనలే కాకుండా నగరంలో తరచుగా ఎక్కడో ఒకచోట ఇలాంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెలిసిన వారి ద్వారా లేదా రకరకాల ఏజెన్సీల ద్వారా పని మనుషులు, కేర్ టేకర్లు, అటెండెంట్లుగా చేరుతున్నవాళ్లు కొన్ని సందర్భాల్లో రెండు, మూడు సంవత్సరాల పాటు నమ్మకంగా పని చేసి ఆ తర్వాత దురాగతాలకు పాల్పడుతున్నారు. ఏజెన్సీల ద్వారా చేరి.. వయోభారం, అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన వృద్ధులకు డైపర్లు మార్చడం, స్నానం చేయించడం, వేళకు మందులు ఇవ్వడంతో పాటు నర్సింగ్ విధులు నిర్వహించేందుకు కేర్ గివర్స్‌ను నియమించుకుంటారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేవారు, 12 గంటల పాటు పని చేసేవారు, లేదా ఉదయం, సాయంత్రం మాత్రమే వచ్చి సపర్యలు చేసేవారు ఏజెన్సీల ద్వారా అందుబాటులో ఉంటూ అవసరమైన వారివద్ద విధుల్లో చేరుతున్నారు.ఇందుకోసం రూ.15000, రూ.25000, రూ.30,000 చొప్పున ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. హెల్పేజ్ ఇండియా సంస్థ అధ్యయనం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 10 లక్షల మంది ఒంటరి వయోధికులు లేదా వృద్ధులైన భార్యాభర్తలు ఈ రకమైన సేవలను వినియోగించుకుంటున్నారు. పిల్లలు విదేశాల్లో ఉన్న కొందరు వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతుండగా, మరి కొందరు ఇళ్లల్లోనే పని మనుషులను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వీరిలో కొందరు నమ్మక ద్రోహులుగా మారుతున్న వారి బారిన పడుతున్నారు. పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి సపర్యల విషయం అలా ఉంచితే నిస్సహాయులైన వయో వృద్ధులను ఈ ‘పని మనుషులు’అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు, ఫిర్యాదులు అనేకం ఉన్నాయని హెల్పేజ్ ఇండియా ప్రతినిధి శ్యామ్ వెల్లడించారు. ఒంటరి వయోధికులు ఉండే ఇళ్లపై పోలీసులు ప్రతిరోజూ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని, వృద్ధుల వద్ద తమ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాలని ఆయన సూచిస్తున్నారు. అమలుకు నోచని సంక్షేమ చట్టం ⇒ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ (2007) ప్రకారం వృద్ధుల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. ఈ చట్టంలోని సెక్షన్ 21 (2) ప్రకారం వృద్ధులకు సేవలు అందించే గృహ సేవకులు, కేర్ గివర్లు, అటెండెంట్లు, ఏజెన్సీలు, ఇతర సంస్థలు స్థానిక పోలీస్‌స్టేషన్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పత్రాన్ని తీసుకోవాలి. ⇒ నగరంలో ప్రస్తుతం వృద్ధుల సంరక్షణ, హోమ్ నర్సింగ్, హోమ్ కేర్ సేవలు అందించేందుకు అనేక ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిపై ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. వీరికి సంబంధించి ఎలాంటి గణాంకాలు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ⇒ చాలావరకు హోమ్ కేర్, హోమ్ హెల్త్ కేర్ సంస్థలుగా పనిచేస్తున్నాయి. అయితే ఇలాంటి ఏజెన్సీల కోసం ప్రత్యేకంగా నియంత్రణ చట్టం లేదా లైసెన్సింగ్ వ్యవస్థ వంటివి లేకపోవడం గమనార్హం. అలాంటి వారికి ఇవి తప్పనిసరి.. ⇒ ఇళ్లల్లో పనిచేసే గృహ కారి్మకులు మొదలుకొని కేర్ గివర్స్ వరకు ఎవరైనా సరే వయోధికుల కోసం విధుల్లో చేరాలంటే తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ⇒ చట్టం ప్రకారం ప్రతి కేర్ గివర్కు ఆధార్ గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, వైద్యులు అందించే ఫిట్నెస్ ధ్రువీకరణ వంటి అర్హతలకు సంబంధించిన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. ⇒ కొన్ని పేరొందిన సంస్థలు మాత్రమే కఠినమైన ధ్రువీకరణలు కలిగి ఉంటుండగా.. చిన్న స్థాయి ఏజెన్సీలు లేదా వ్యక్తిగతంగా కేర్ గివర్లను పంపించే వారు ఈ నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తున్నారు. ⇒ కుటుంబసభ్యులు కేర్గివర్ల పూర్తి ఆధారాలతో పాటు ఫొటోలు కూడా తీసుకుని పెట్టుకోవాలి. అలాగే సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం మంచిది. ⇒ కేర్గివర్లు లేదా వ్యక్తిగత సేవకులకు డెబిట్, క్రెడిట్ కార్డులు, పిన్ నంబర్లు, చెక్కులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. మెడికల్ రిపోర్ట్లు, ఆస్తి పత్రాలను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి.తస్మాత్ జాగ్రత్త ఎవరిని పడితే వారిని పనిలో పెట్టుకోకూడదు. సాధారణంగా దోపిడీలు, దొంగతనాలే లక్ష్యంగా పనిలో చేరేవారు 6 నెలల పాటు రెక్కీ నిర్వహిస్తారు. ఇంటి పరిసరాలను, ఇంటికి వచ్చి వెళ్లేవారిని గమనిస్తారు. ఏ సమయం అనుకూలమైందో నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత ఏ మాత్రం అనుమానం రాకుండా అవసరమైతే తమ ముఠా సభ్యులతో కలిసి పంజా విసురుతారు. దోపిడీలు, హత్యలకు పాల్పడుతారు. గత పదేళ్లుగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. – గురజాడ శోభ, తెలంగాణ స్త్రీ సేవా సంస్థ -
ప్రేమోన్మాది ఘాతుకం
జడ్చర్ల: ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం పట్టపగలు గుర్తు తెలియని ఓ యువకుడు (30) యువతిని కత్తితో విచక్షణారహితంగా తల, మెడపై పొడవడంతోపాటు గొంతు కోయడంతో యువతి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మృత్యువాత పడింది. వివరాలు ఇలా.. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి (23) పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది.శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని ఓ యువకుడు యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచి్చన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్యచికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే దాడికి పాల్పడిన యువకుడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుండగా స్థానికులు పోలీసులను దరిచేరకుండా అడ్డుకున్నారు. తోపులాటలు, వాగ్వివాదం, కేకలు చోటు చేసుకున్నాయి. చివరకు తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీస్ వాహనంలో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో యువకుడి వివరాలు లభ్యం కాని పరిస్థితి ఏర్పడింది. కాగా నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మరో రెండు నెలల్లో పెళ్లి.. ఎర్రసత్యం కాలనీలో నివాసం ఉంటున్న రాంచంద్రయ్యకు భార్య శ్రీలత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో హతురాలు వైష్ణవి పెద్ద కూతురు. ఈమెకు ఇటీవల పెళ్లి నిశ్చయమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చే నెలలో నిశ్చితార్థం, మరో రెండు నెలల్లో వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈలోగా ఈ దారుణం జరిగిందని వారు కన్నీటిపర్యంతం అయ్యారు. మరో వంద అడుగులు వేసి ఉంటే తమ ఇంట్లోకి వచ్చేదని, ఇంతలోనే దారుణ హత్యకు గురైనట్లు వారు పేర్కొన్నారు.దాడి చేసిన యువకుడు ఎవరో తమకు తెలియదని, అతడిని ఎప్పుడూ చూడలేదని తెలిపారు. హత్య చేసి పారిపోతుండగా యువకుడిని పట్టుకున్న స్థానికులు అతని గురించి ఆరా తీశారు. రెండేళ్లుగా ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని, తన డబ్బులు తీసుకుందని నిందితుడు పేర్కొ న్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ మేరకు కేసు నమో దు చేసుకు ని దర్యాప్తు చేస్తున్నామని సీఐ కమలాకర్ తెలిపారు. యువకుడి వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్
హైదరాబాద్: పేట్బషీరాబాద్లో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. అడ్వకేట్ల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈరోజు(శనివారం, మే 16వ తేదీ) రాత్రి లాయర్ల సమక్షంలో బండి భగీరథ్‌ను కుటుంబ సభ్యులే పోలీసులకు అప్పగించారు. కాసేపట్లో బండి భగీరథ్‌ను జడ్జి ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. పోలీసులకు అప్పగించాం: బండి సంజయ్‘చట్టంపైన గౌరవంతోనే మా అబ్బాయిని పోలీసులకు అప్పగించా. ఏ తప్పు చేయలేదని మా అబ్బాయి చెబుతున్నాడు. ఆధారాలను చూపేందుకే పోలీసులకు అప్పగింతలో జాప్యం జరిగింది’ అని పేర్కొన్నారు బండి సంజయ్.తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, అందుచేత ఏ తప్పూ చేయని తన కుమారుడు పోలీసులకు లొంగిపోయాడన్నారు బండి సంజయ్. చట్టం ముందు అంతా సమానమేనని, ప్రతీ ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశాం: సీపీబండి భగీరథ్‌ను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ రమేష్‌రెడ్డి స్పష్టం చేశారు. భగీరథ్‌ను గాలించే క్రమంలో అరెస్ట్ చేశామన్నారు. నార్సింగ్‌లోని పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్‌ను అరెస్ట్ చేశామన్నారు. అటు తర్వాత పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నామన్నారు సీపీఇదిలా ఉంచితే, బండి భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్ కోర్టులో బాధితురాలు.. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు.కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా రంగంలోకి దిగిన న్యాయమూర్తి.. బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా జడ్జి.. స్టేట్మెంట్ తీసుకున్నారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మూడోసారి స్టేట్మెంట్ ప్రక్రియ.. కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. న్యాయమూర్తి సేకరించిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది. -
బండి భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, మేడ్చల్: బండి భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్ కోర్టులో బాధితురాలు.. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు.కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా రంగంలోకి దిగిన న్యాయమూర్తి.. బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా జడ్జి.. స్టేట్మెంట్ తీసుకున్నారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మూడోసారి స్టేట్మెంట్ ప్రక్రియ.. కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. న్యాయమూర్తి సేకరించిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది.మరోవైపు, భగీరథ్ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అతని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలతో ముమ్మరంగా గాలించారు. బాలికను లైంగిక వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్‌పై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసు (పోక్సో చట్టం కింద) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటిరోజు నుంచే(ఈ నెల 9న) భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడు. కేసు నమోదుకు ముందు చివరిసారిగా హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. విచారణకు తమ ఎదుటకు రావాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పిలుపునకు కూడా అతని నుంచి సరైన స్పందన లేదు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. తక్షణ ఉపశనమం విషయంలో నిరాశే ఎదురైంది. అయితే గురువారం(మే 21న) ఆ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడనుంది. భగీరథ్ కోసం ఐదు బృందాలు.. ఢిల్లీ, కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌ను జల్లెడపట్టారు. ఇవాళ సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్‌లోని అతని తండ్రి ఇంట్లో సోదాలు కూడా చేశారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి (శనివారం మే 16) షేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బండి భగీరథ్ లొంగిపోయారు. -
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మెహదీపట్నంలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు శుభమ్ సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 137 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తో పాటు వోల్వో కారు, ప్యాకింగ్ మెటీరియల్, 9 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్, మెహదీపట్నం పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించారునిందితుల్లో శుభమ్ కుమార్ మిశ్రా ఏ1 కాగా, A2 సోహమ్ నాయక్, A3 కలంగి రాజేష్, A4 ముంతున్ కుమార్ మరియు A8 అబ్దుల్ షాబాజ్ బాలానగర్ ప్రాంతానికి చెందినవారు. మిగిలిన వినియోగదారులు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ప్రధాన నిందితుడు శుభమ్ కుమార్ మిశ్రాకు, అదే ప్రాంతంలో నివసించే బుసా సాయి నిఖిల్ యాదవ్ అలియాస్ సాయి చిన్ననాటి స్నేహితుడు. వీరిద్దరికీ గంజాయి, ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉంది. ఈ క్రమంలో శుభమ్.. సాయి నిఖిల్ వద్ద నుండి ఎండీఎంఏ డ్రగ్‌ను సేకరించడం ప్రారంభించాడు. కాగా, సాయి నిఖిల్‌ను ఇటీవల చిలకలగూడ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు.సాయి నిఖిల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా శుభమ్ కుమార్ మిశ్రా ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించాడు. తన స్నేహితులైన సోహమ్ నాయక్, కలంగి రాజేష్‌లతో కలిసి కొనసాగించాడు. శుభమ్ వారిద్దరికీ పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేయగా.. వారు దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి కస్టమర్లకు విక్రయించేవారు. ఈ డ్రగ్స్‌ను వినియోగదారులకు చేరవేయడానికి శుభమ్ స్వయంగా వెళ్లడమే కాకుండా, రాపిడో సర్వీసులను ఉపయోగించేవాడు. అలాగే తన అన్న ముంతున్ కుమార్ ద్వారా కూడా డ్రగ్స్ డెలివరీ చేయించేవాడు. ఈ కేసులోని వినియోగదారులు.. నిందితులైన పెడ్లర్ల నుండి గ్రాము ఎండీఎంఏను రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. -
జడ్చర్లలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, మహబూబ్‌నగర్: జడ్చర్లలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదని ఓ యవకుడు.. యువతి ప్రాణం తీశాడు. యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని స్థానికులు చితకబాదారు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉంది. -
అడవిలో ప్రమాదాలకు అదే కారణం.. నర్సాపూర్‌లో క్లీన్ డ్రైవ్
సాక్షి, నర్సాపూర్: అడవి ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వల్ల కలిగే నష్టాలపై నర్సాపూర్ అడవీ ప్రాంతంలో క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవ్ వాటర్ అండ్ నేచర్, యూత్ ఫర్ సేవ ఫౌంటెన్ హెడ్ గ్లోబల్ సూల్ ,మెదక్ జిల్లా అడవీ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.ఇటీవల కాలంలో అడవి ప్రాంతానికి వచ్చే సందర్శకులు కోతులకు ఆహారం వేస్తున్నారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు వంటి పర్యావరణ హానికర వ్యర్థాలు అధికంగా పేరుకపోతున్నాయి. ఇవి పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా, రోడుపై ప్రయాణించే వాహనాలపై ఎగిరిపడడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీంతో ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు వాలంటీర్లు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా నర్సాపూర్ అడవీ ప్రాంతంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహాకులు మాట్లాడుతూ అడవి జంతువులకు బాధ్యతారహితంగా ఆహారం వేయడం ప్రకృతికి హానికరం. అడవిని పరిశుభ్రంగా ఉంచడం జంతువులను, మనుషులను రక్షించవచ్చు. నర్సాపూర్ అడవీ సౌందర్యాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోతులకు ప్లాస్టిక్ కవర్లలో ఆహారం ఇవ్వకూడదని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సేవ్ వాటర్ అండ్ నేచర్, వ్యవస్థాపకురాలు మేఘనా ముసునూరి, యూత్ ఫర్ సేవ హెదరాబాద్ VM గౌతమ్ చెరిపల్లి, జిల్లా అడవీ అధికారి శ్రీఎం. జోజి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దివ్య తదితరులు పాల్గొన్నారు. -
మొయినాబాద్ ఫౌంహౌస్‌లో దారుణం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్ సమీపంలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం తాండూరులో అదృశ్యమైన ఇద్దరు మహిళలుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళలను తాండూరులో కిడ్నాప్ చేసిన దుండగులు.. దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మహిళల నుంచి అప్పులు తీసుకున్నవాళ్లే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. -
కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి లోథా అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ పై అంతస్థులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
బండి భగీరథ్‌కు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో బండీ భగీరథ్‌కు మరో షాక్ తగిలింది. భగీరథ్ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. హైకోర్టులో మధ్యంతర ఉపశమనం దక్కని నేపథ్యంలో.. శనివారం అతని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. మైనర్ బాలికను లైంగిక వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్‌పై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసు (పోక్సో చట్టం కింద) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటిరోజు నుంచే(ఈ నెల 9న) భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడు. కేసు నమోదుకు ముందు చివరిసారిగా హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. విచారణకు తమ ఎదుటకు రావాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పిలుపునకు కూడా అతని నుంచి సరైన స్పందన లేదు. ఈ క్రమంలో.. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. తక్షణ ఉపశనమం విషయంలో నిరాశే ఎదురైంది. అయితే గురువారం(మే 21న) ఆ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడనుంది. ఈలోపు..ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదు బృందాలు భగీరథ్ కోసం ఢిల్లీ, కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌ను జల్లెడపడుతున్నాయి. శనివారం మధ్యాహ్నాం సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్‌లోని అతని తండ్రి ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటు పేట్ బషీర్బాద్ పీఎస్ వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. దీంతో ఇవాళో రేపో భగీరథ్‌ను అరెస్ట్ చేస్తారని.. తనంతట తానే లొంగిపోతాడని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి.సెన్సిటివ్ కేసు.. ఎలాపడితే అలా కుదరదు: సీఎం రేవంత్ఈ కేసు దర్యాప్తు విషయంలో వస్తున్న విమర్శలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. చర్యలు తీసుకునే ఉద్దేశమే లేకపోతే పోక్సో కేసు ఎందుకు పెడతామని విమర్శకులను ఆయన ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన వే2న్యూస్ కాంక్లేవ్–2026లో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి మైనర్ బాలిక తల్లి ఒకరు పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ మరుసటిరోజే విచారణ ప్రారంభించి సెక్షన్లు కూడా మార్చి కేసు పెట్టాం. 11న సెక్షన్లు సవరించి వెంటనే నోటీసులు జారీ చేశాం. ఇదే వ్యవహారంలో బండి భగీరథ్ కూడా కరీంనగర్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులను బేరీజు వేసుకుని అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని నోటీసులిచ్చారు. ఈ కేసులో ఎలా పడితే ఎలా చేయడానికి వీల్లేదు. నేను సహాయ పడాలనుకుంటే పోక్సో కేసు పెట్టం కదా? బండి భగీరథ్ తండ్రికి, బీఆర్ఎస్ మధ్య ఎక్కడ చెడిందో నాకు తెలియదు. కేటీఆర్‌కి, బండి భగీరథ్ తండ్రికి మధ్య ఏముందో నాకు తెలియదు. కానీ ఎవరైనా తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా నాకు మినహాయింపులు లేవు. ఆ అమ్మాయికి రెండు బర్త్ సర్టీఫికెట్లు ఉన్నాయి. అవన్నీ పోలీసులు విచారించాలి. ఒకరోజు ఆలస్యమైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు. మేము సత్రం నడపడం లేదు.. ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మా ప్రభుత్వం బాధితులకు 100 శాతం అండగా ఉంటుంది. కుమారుడి విషయంలో ఆ కేంద్ర మంత్రి(సహాయ) తీరు నైతికంగా సరైంది కాదు. ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలి. కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి అని సీఎం రేవంత్ సూచించారు. -
ACలు బంద్.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు
-
బోరుబావిలో పడ్డ చిన్నారి.. రక్షించబోయి తాత మృతి
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడగా.. రక్షించేందుకు వెళ్లి అతని తాత మృత్యువాత పడ్డాడు. శనివారం ఉదయం యాదగిరిపల్లిలో జరిగిందీ ఘటన.. శనివారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద ఉన్న మామిడి చెట్టుకు నీరు పెట్టేందుకు మనువడు, మనవరాలుతో వెంకన్న(50) వెళ్లాడు. మనవడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. అది గమనించిన తాత వెంకన్న రక్షించేందుకు ప్రయత్నించగా.. బోరు అంచులో ఉన్న మట్టి కుంగిపోయి అదే గుంతలో తలకిందులుగా పడిపోయాడు. వెంటనే మనవరాలు స్థానికులను అప్రమత్తం చేసింది. దీంతో తాళ్ల సాయంతో సైదులు అనే యువకుడు లోపలికి దిగి వాళ్లను బయటకు తీశాడు. ఈలోపు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే బోరుబావి గుంతలో ఊపిరి ఆడక వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే వెంకన్న కన్నుమూశాడు. చిన్నారి పరిస్థితి బాగానే ఉందని.. ప్రస్తుతం చికిత్స అందుతుందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పెట్రో ధరల పెంపు.. కేంద్రంపై రేవంత్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో పెట్రో ధరల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు. అలాగే, యువత ఉపాధికి గ్యారెంటీ లేకుండా పోయిందని విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పెట్రో ధరల పెంపుపై స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్..‘పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదు. ధరల పెంపుతో నిత్యాసరాల రేట్లు పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తుంది. అనేక రంగాలపై దీని ప్రభావం పడుతుంది. మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, యువత ఉపాధికి గ్యారెంటీ లేకుండా పోయింది.ఎన్నికలు ముగిసిన పది రోజులకే లీటరుకు మూడు రూపాయలకు పైగా పెంచడం ప్రజలను వంచించడమే అవుతుంది. ఇది ముమ్మాటికీ విశ్వాస ఘాతుకం. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా చెప్పుకుంటారు?. పెంచిన ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఆత్మ నిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప… ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు అన్నది తేలిపోయింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించింది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలింది. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరింది’ అని మండిపడ్డారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఈ నిర్ణయం అనేక రంగాల పై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుంది. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల…— Revanth Reddy (@revanth_anumula) May 16, 2026 -
Hyderabad: రోగికోసమని రప్పించి అంబులెన్స్ చోరీ
హైదరాబాద్: రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అంబులెన్స్‌ను రప్పించి డ్రైవర్‌ను బలవంతంగా దింపి అంబులెన్సుతో పరారయ్యారు. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నరేష్ (32) చెంగిచెర్లలోని శ్రీఎస్విఎస్ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 12న అసుపత్రి సిబ్బందికి ఫోన్ రావడంతో అంబులెన్స్‌తో లొకేషన్‌కు వెళ్లాడు. అక్కడ ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్‌లో ఎక్కి మహిళకు కడుపునొప్పి ఉంది.. కామినేని అసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు. సోదరుడు వస్తాడని చెప్పి సీపీఆర్ఐ రోడ్డులోని నిర్మానుష్య ప్రాతంతో అంబులెన్స్‌ను ఆపారు. మరో ఆద్దరు వ్యక్తులు వచ్చి డ్రైవర్‌ను బలవంతంగా కిందకు దింపి ఐదుగురూ కలిసి అంబులెన్సుతో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంన్నారు. -
తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో డేంజర్ ఈదురుగాలుల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. నేడు పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం, అల్లకల్లోల వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో భారీ ఈదురుగాలులు వంటి పరిస్థితి తెలంగాణలో నెలకొనే అవకాశముందన్నారు. పలు జిల్లాల్లో 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, జనగాం, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ డేంజర్ గాలుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు. ఇక హైదరాబాద్ వాతావారణ కేంద్రం కూడా తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడా ఈ వర్షాలకు తోడు బీభత్సం సృష్టించవచ్చని పేర్కొంది. సాయంత్రం సమయంలో హైదరాబాద్‌లో చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.Today's FORECAST ⚠️⛈️ Just like yesterday, even today, INTENSE HEATWAVE conditions expected in most parts of TG mainly North TG Thereafter, during late afternoon to night, scattered INTENSE THUNDERSTORMS ahead in Nalgonda, Yadadri - Bhongir, Nagarkurnool, Rangareddy, Jangaon,…— Telangana Weatherman (@balaji25_t) May 16, 2026 ఏపీ పరిస్థితి ఇలా.. మరోవైపు.. ఏపీలో కూడా వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పలు జిల్లాలో వర్షం కురుస్తుంటే మరికొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగింది. నేడు విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో 40-42°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఇక ఆదివారం 19 మండలాల్లో తీవ్రమైన, 30 మండలాల్లో సాధారణ స్థాయితో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై ఉంటుందని, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.Dear people of Telangana We have seen what happened in Uttar Pradesh earlier due to serious windsToday, the below mentioned districts can get thunderstorms with VERY STRONG WINDS upto 70kmph due to very high instability caused by heatwave ⚠️💨Requesting to stay alert as… https://t.co/bRXfU44Z8J— Telangana Weatherman (@balaji25_t) May 16, 2026 ఇదిలా ఉండగా.. భారత వాతావరణ ఈ నెల మే 26 లోపు రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అంతకంటే ముందు ఇవి తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు సముద్రంలో ఏర్పడ్డాయి. అందుకే మే 22నే ఇవి కేరళం చేరుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేరళం చేరుకున్న నైరుతి రుతుపవనాలు రెండుమూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయి. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఎండల తీవ్రత తగ్గుతుంది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు శనివారం విజయనగరం,మన్యం,పోలవరం,పల్నాడు, మార్కాపురం,ప్రకాశం,కర్నూలు,నంద్యాల,వైఎస్సార్ కడప జిల్లాల్లో 40-42°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం.ఆదివారం 19మండలాల్లో తీవ్ర,30 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. pic.twitter.com/nMUfx2kLkf— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 15, 2026 -
సీఏ కోర్సు చదవడం నా వల్ల కావడం లేదు..!
హైదరాబాద్: చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్న ఓ విద్యార్థి నాలుక కోసుకొని..ఆపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ క్రిష్ణ తెలిపిన మేరకు.. ఏపీలోని కర్నూలు జిల్లా ఉప్పలపాడు గ్రామానికి చెందిన జనార్ధన్ (28) చెన్నైలో సీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నగరానికి వచ్చి మియాపూర్‌లోని స్నేహితులతో ఉంటున్నాడు. గురువారం ఉదయం స్నేహితులు విధులకు వెళ్లగా జనార్ధన్ ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి స్నేహితులు గదికి వచ్చి చూడగా జనార్ధన్ ఫ్యాన్‌కు లుంగీతో ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. గదిలో సూసైడ్ నోట్ లభించింది. అమ్మ..నాన్నా. మీరు అనుకున్నట్లు నేను చదువులేక పోతున్నా.. సీఏ కోర్సు చదవడం నా వల్ల కావడం లేదు.. తనను క్షమించాలని లేఖలో పేర్కొన్నాడు. మొదట మొదట నాలుక కోసుకొని ఆ తరువాత ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలో మొత్తం రక్తపు మరకలు ఉండడంతో మృతుడి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఉన్న ఒక్కగొనక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. -
నిమ్స్ మరో రికార్డు
హైదరాబాద్: నిమ్స్ వైద్యులు 24 గంటల వ్యవధిలో 2 కాలేయ (లివర్), 3 మూత్రపిండ (కిడ్నీ) మారి్పడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనతను సాధించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు ఈ ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందించారు. శుక్రవారం నిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం.. అత్యంత క్లిష్టమైన వైద్య పరిస్థితులలో ఈ నెల 9, 10 తేదీల్లో 24 గంటల వ్యవధిలో వరుసగా రెండు అత్యవసర మృతదాత కాలేయ మారి్పడులను విజయవంతంగా నిర్వహించింది. యూరాలజీ, రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం కేవలం 9 గంటల వ్యవధిలో 3 మూత్రపిండ మారి్పడి శస్త్రచికిత్సలను పూర్తి చేసింది. మూడు ప్రత్యేక శస్త్రచికిత్స బృందాలుగా విభజించి ఈ శస్త్రచికిత్సలను ఏకకాలంలో నిర్వహించగా, అదే విభాగం స్వతంత్రంగా అవయవ సేకరణ ప్రక్రియలను కూడా చేపట్టింది. ఇంత తక్కువ సమయంలో రోగి సేవలకు అంతరాయం కలగకుండా, ఈ స్థాయిలో బహుళ మృతదేహ మారి్పడులను నిర్వహించడం మొదటి ఘనతగా నిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఈ ప్రక్రియల ఖర్చు సుమారు రూ.45 లక్షలకు పైగా ఉంటుంది. నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పొందారు. బ్రెయిన్ డెడ్ అయిన 59 ఏళ్ల మహిళ కుటుంబం మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కార్నియాల దానానికి అంగీకరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన 22 ఏళ్ల యువకుడి మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కారి్నయాలను సేకరించారు. మరో ఘటనలో రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన పదేళ్ల బాలుడి అవయవాలను కూడా సేకరించారు. కాలేయ నిల్వ అత్యంత క్షీణించి, డీకంపెన్సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ (డీసీఎల్‌డీ)తో బాధపడుతున్న 17 ఏళ్ల యువకుడికి మొదటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. క్రమంగా కోలుకుంటున్నారు. అదే వైద్యబృందం ఆల్కహాలిక్ డీసీఎల్‌డీ ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి కాలేయ మారి్పడి చేపట్టింది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ), అంత్య దశ మూత్రపిండ వ్యాధి (ఈఎస్ఆర్డీ)తో బాధపడుతున్న 19, 31, 59 సంవత్సరాల వయసు రోగులకు మూత్రపిండ మారి్పడి చికిత్సలు జరిగాయి. -
పోక్సో కేసులో కానిస్టేబుల్‌కు 31 ఏళ్ల జైలు
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన కానిస్టేబుల్‌కు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నేరం రుజువు కావడంతో నిందితుడు వరదరాజ్ సుదేశ్‌కు 31 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అదనంగా బాధిత బాలికకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. 2020లో డీసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వరదరాజ్ సుదేశ్ బోయిన్ నపల్లి తాడుబండ్ ప్రాంతంలో నివసించే ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ కొనసాగింది. ఆరు సంవత్సరాల అనంతరం నేరం నిరూపణ కావడంతో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 31ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
ఇప్పుడు అర్థమవుతోంది బాపూ..!
ఉత్తరం.. ఒకప్పుడు భావోద్వేగాలు పంచుకోవడానికి ఉపకరించే ఏకైక సాధనం. స్మార్ట్ యుగంలో దీన్ని అంతా మర్చిపోయాం. వ్యక్తిగత అవసరాలతో పాటు అధికారిక అవసరాలకూ ఈ–మెయిల్, వాట్సాప్ వంటి సాంకేతిక అంశాలనే వినియోగిస్తున్నాం. అయితే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల ఠాణా ఇన్స్పెక్టర్ జి.మల్లేశం మాత్రం మనలోని భావాలను మన వారికి పూర్తిగా వ్యక్తీకరించాలంటే ఉత్తరం రాయడం ఉత్తమం అని, దాని వల్లే అనుబంధాలు మరింతగా అల్లుకుంటాయని భావించారు. దీంతో తన పోలీసుస్టేషన్‌లోని అధికారులు, సిబ్బందితో ‘తల్లిదండ్రులకు ఓ ఉత్తరం’ పేరుతో శుక్రవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఖాకీ చొక్కా వెనుక కన్నీటి కథను వివరిస్తూ కానిస్టేబుల్ రాజు ఇన్ ల్యాండ్ లెటర్లో రాసిన ఉత్తరం వైరల్‌గా మారింది. అందులోని అంశాలు ఇలా...‘పూజ్యలైన తండ్రి గారికి తమ చిన్నకుమారుడు రాయునది. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. మీరు అక్కడ క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నా. మా పిల్లలు, భార్య వేసవి సెలవులకు వారి అమ్మ వాళ్ల ఊరికి వెళ్లారు. పిల్లలు, ఫ్యామిలీ లేకుండా ఉండటం చాలా కష్టంగా ఉంది బాపూ. కానీ.. మీరు ఎనిమిది ఏళ్లుగా అమ్మ లేకుండా, మాకు దూరంగా ఉంటూ ఎంత కష్టంగా జీవనం సాగిస్తున్నారో ఇప్పడు అర్థం అవుతోంది. రియల్లీ ఐ మిస్‌యూ బాపూ. వంట పని, ఇంటి పనికి తోడు లేకుండా జీవించడం చాలా కష్టం బాపూ. నీ కంటి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిసింది. నేను ఇంటికి వచ్చాక నీ కంటికి ఆపరేషన్ చేయిస్తాను. ఆ హాస్పిటల్ వారితో మాట్లాడుతున్నాను.నువ్వు ఖాళీగా ఉండలేక కరువు పనికి వెళ్తున్నావని తెలిసింది. ఖాళీగా ఉండలేక, ఆరోగ్యం సహకరిస్తేనే వెళ్లు. ఇంటి దగ్గర అమ్మ, మీరు ఉన్నప్పుడు పండుగలు, పబ్బాలు, ఫంక్షన్లు చాలా సంతోషంగా జరుపుకున్నాం. కానీ ఇప్పుడు అమ్మ లేకపోవడంతో మీరు మాకు దూరంగా ఉండటంతో అన్నీ మిస్ అవుతున్నాం బాపు. ఈ ఉద్యోగం, పిల్లల చదువులు, ఇంటికి దూరంగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నా. అన్ని ఫంక్షన్లు, పండుగలకు రావాలని ఉంది కానీ కుదరడం లేదు బాపూ. ఈసారి నేను పది రోజులు సెలవు తీసుకుని ఇంటికి వచ్చి మీ కంటి ఆపరేషన్ చేయించడంతో పాటు మన బంధువుల పెళ్లికి మీ కలిసి పాలుపంచుకుంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్త.ఇట్లు నాన్నకు ప్రేమతో.. తమ చిన్న కుమారుడు రాజీ (రాజు). -
ఉమెన్ పవర్
‘మైనింగ్ రంగంలో మహిళలు ఏమిటి?’ అనే ఆశ్చర్యం... మహిళా ఉద్యోగులు సునిత్నమైన పనులు మాత్రమే... అదీ ఆఫీసు నాలుగు గోడల మధ్యే పనిచేయాలనే నమ్మకాలు, అపోహలు...వాటన్నింటినీ బద్దలు కొడుతూ ఉమెన్ పవర్ చాటి చూపుతున్నారు మహిళలు.తాజా విషయానికి వస్తే... మైనింగ్ రంగంలో 50, 100 టన్నుల బరువులు మోసుకెళ్లే హెవీ డ్యూటీ డంపర్లను మహిళలు నడిపిస్తున్నారు. తొలి అడుగు ఉత్తర భారతంలోని టాటా స్టీల్స్ కంపెనీలో పడగా, రెండో అడుగుకు తెలంగాణలోని సింగరేణి వేదికైంది.పదమూడు మంది మహిళా కార్మికులు సిరిసిల్లలోని ‘తెలంగాణ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్’లో హెవీ ఎర్త్ మూవర్ మెషిన్లను నడపడంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే ఇంటర్నల్ రిక్రూట్ ద్వారా సంస్థ పరిధిలోని పదిహేడు ఓపెన్ గనుల్లో విధులు నిర్వహించనున్నారు...వారిలో కొందరి హెవీ వాహన ప్రయాణం గురించి వారి మాటల్లోనే...ఆర్మీ మిస్సైనా... మరుదనాయగం శిరీషమాది మంచిర్యాల జిల్లా మందమర్రి. చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ అంటే ఇష్టం. మా తాత, తండ్రులు, బాబాయ్‌లు సైతం సైన్యంలో పనిచేశారు. వాళ్ల స్ఫూర్తితో పోలీస్ శాఖలో చేరాలని ప్రయత్నించాను. ఎస్.ఐ. పరీక్షల్లో పల్టీ కొట్టినా, ఆ తర్వాత ఇంట్లోవాళ్లను ఒప్పించి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు సిద్ధమయ్యాను. ఆర్మీలో జాయిన్ అవడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్న సమయంలో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తోన్న నాన్న రఫేల్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో అమ్మ విక్టోరియా కోరిక మేరకు కుటుంబంకోసం ఆర్మీ కలలను పక్కనపెట్టి సింగరేణి కార్మికురాలిగా 2024 మార్చిలో జాయిన్ అయ్యాను. చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడిపే అలవాటు ఉంది. ఆ తర్వాత కార్లు కూడా ధైర్యంగా నడిపించేదాన్ని. అయితే, గనుల్లో వాటికంటే పరిమాణంలో, సామర్థ్యంలో పెద్దవైన ప్రొక్లెయినర్లు, డంపర్లు, షావెల్స్ క్రేన్లు కనిపించేవి. కార్లు, బైకులు నడిపిన నాకు వాటిని కూడా నడిపించాలని అనిపించినా, ఎవరిని అడగాలో తెలియక ఆశను మనసులోనే దాచుకున్నాను. సీఎండీ బలరామ్‌నాయక్ 2024 చివర్లో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో నేరుగా కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యారు. అదే అదనుగా సీఎండీ సార్‌తో మాట్లాడుతూ ‘సార్, నాకు గనిలో ఎప్పుడు తిరుగుతూ కనిపించే డంపర్లు నడపాలని ఉంది. నాకు ఆ అవకాశం ఇస్తారా’ అని అడిగాను. దానికి ఆయన ‘అవి నడపాలంటే డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలి. నీకు ఉందా?’’ అని ప్రశ్నించారు. దీంతో చిన్నప్పటి నుంచి బైకులు, కార్లు నడపడంలో నాకున్న అనుభవం గురించి వివరిస్తూ.. మాకు కూడా పురుషులతో సమానంగా డంపర్లు నడిపే ఛాన్స్ ఇవ్వండి అని మరోసారి కోరాను. నా ఉత్సాహం చూసిన సీఎండీ సార్ ‘ సరే,. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాను’ అని హామీ ఇచ్చారు. నిలబెట్టుకున్నారు.ప్రతీ చోట సవాలే.. ప్రయత్నిస్తే విజయాలే – తోకల త్రివేణిమాది మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్. మా నాన్న తోకల ఎల్లయ్య సింగరేణి కార్మికుడు. నాకు పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత 2022లో సింగరేణిలో జాయిన్ అయ్యాను. పెళ్లికిముందు నాకున్న కార్ డ్రైవింగ్ అనుభవం తర్వాత పనికి వచ్చింది. మహిళా కార్మికులకు డంపర్ ఆపరేటర్‌గా అవకాశం ఇస్తామంటూ 2025 ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నాను. సిరిసిల్ల ట్రైనింగ్ సెంటర్లో మొదటి వారం థియరీ, సిమ్యులేషన్ మీద క్లాసులు తీసుకున్నారు. తర్వాత 16 అడుగుల పొడవైన స్కూల్‌బస్సును, 26 అడుగుల పొడవు ఉండే ట్రక్ (లారీ)ని నడిపించడంపై గ్రౌండ్లో శిక్షణ ఇచ్చారు. కానీ శిక్షణ మలిభాగంలో అవే హెవీ వెహికల్స్‌ను నేరుగా రోడ్డుపై నడపమన్నారు. మొదట్లో కొంత భయపడ్డప్పటికీ, నా ఫస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను గుర్తు తెచ్చుకుని క్లచ్ వదిలి, ఎక్సలేటర్ తొక్కి గేరు మార్చాను అంతే!కెరీర్ గ్రోత్ కోసం...– షేక్ రహమత్ ఉన్నీసామా నాన్న షేక్ అబ్దుల్ ఖదీర్ భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడిగా పని చేసేవారు. ‘మనది సంప్రదాయ కుటుంబం, కట్టుబాట్లు పాటించాలి’ అనే పరిధిలోనే నేను డిగ్రీ పూర్తి చేయడం. పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే. ఐటీ సర్వీసెస్‌లో పనిచేసే నా భర్త జుబేర్ అహ్మద్‌తో పెళ్లి తర్వాత ఆయన నా ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చారు. కొత్తగా ఆయన కారు కొనుక్కోవడమే కాకుండా నాకు పట్టుబట్టి డ్రైవింగ్ నేర్పించారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2022లో సింగరేణిలో బదిలీ వర్కర్‌గా జాయిన్ అయ్యాను. ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న సమయంలో 2025 ఆగస్టులో డంపర్ ఆపరేటర్ నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేయాలనుకున్నప్పుడు ఎవరెన్ని విధాలుగా వెనక్కి లాగాలని చూసినా వినలేదు. సంప్రదాయ పద్దతిలో రెగ్యులర్ ఆఫీస్ జాబ్‌కే పరిమితం అవడం కంటే కెరీర్ గ్రోత్ ఉండే డంపర్ ఆపరేటర్‌గా వెళ్లడమే ఉత్తమం అనుకుని ముందడుగు వేశాను. కొత్త బాటలో నడిచేటప్పుడు ఎన్నో అవమానాలు, అవహేళనలు, తిరస్కారాలు ఎదురుకావచ్చు. వాటిని లెక్కచేయక ముందుకు సాగి విజయం సాధిస్తే తరువాత అదే బాటని మిగిలిన వాళ్లు అనుసరిస్తారు.– తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
ముందస్తు బెయిల్‌పై 21న ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)పై ఉత్తర్వులను హైకోర్టు రిజర్వు చేసింది. ఈనెల 21న ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది. వాదనలకే 3 గంటలకుపైగా సమయం పట్టిందని, ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. హడావుడిగా ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని, అన్నింటినీ పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.అన్ని పక్షాలు చేసిన వాదనలు, గత తీర్పులను సమగ్రంగా పరిశీలించాల్సి ఉందంటూ ఉత్తర్వులను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్‌ను అరెస్టు చేయకుండా, కఠిన చర్యలు తీసుకోకుండా స్టేటస్కో ఆదేశాలు ఇవ్వాలని కోరగా, నిరాకరించింది. తనపై పేట్‌బïÙరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం రాత్రి మరోసారి విచారణ చేపట్టింది. పోలీసులు కుమ్మక్కు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘గత సంవత్సరంలోనే బాధితురాలు, నిందితుడు స్నేహితులుగా మారారు. గత అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు నాలుగుసార్లు బాధితురాలిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనడంలో వాస్తవం లేదు. పోలీసులు బాధితులతో కుమ్మక్కై తొలుత ఉన్న సెక్షన్లకు తోడు పోక్సో సెక్షన్లు 5, 6ను చేర్చారు.బెయిల్ రాకుండా పూర్తి న్యాయ సలహాతో ఇచి్చన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ మార్చారు. నానక్‌రామ్‌గూడ, తర్వాత ఫామ్‌హౌస్‌లకు వెళ్లినప్పుడు వారి వెంట మిత్రులు కూడా ఉన్నారు. బాధితురాలికి గతంలోనే ఆల్కహాల్ అలవాటు ఉంది. బాధితురాలు మైనర్ కాదు (కొన్ని సర్టీఫికెట్లను సమరి్పంచారు). నాలుగున్నర నెలల వరకు ఫిర్యాదు చేయకపోవడంలో కుట్రదాగి ఉంది. బాధితురాలు పలుమార్లు బెదిరిస్తూ సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపారు. దీంతో ఆమె ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా చూడాలని బాధితురాలి తల్లిదండ్రులకు పిటిషనర్ చెప్పారు’ అని పేర్కొన్నారు. పిటిషనర్‌కు నేర చరిత్ర... బాధితురాలి తరఫు న్యాయవాది పప్పు నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. ‘బాధితురాలి డాక్యుమెంట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది సమరి్పంచడం అభ్యంతరకరం. బాధితురాలు మేజర్ అనేది నిరాధార ఆరోపణ. బర్త్ సర్టీఫికెట్ స్కూల్లో ఇచ్చింది ప్రధాన ఆధారం. దీనిపై ఏది ప్రామాణికమో సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. మున్సిపల్ అధికారులు ఇచి్చన పత్రం, టెన్త్ సర్టీఫికెట్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. భగీరథ్ ఒత్తిడితో బాధితురాలు అతని ప్రేమను అంగీకరించింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. పెళ్లి చేసుకుంటానంటున్నాడన్న నమ్మకంతో మరికొందరు కూడా ఉండటంతో భగీరథ్ వెంట తమ అమ్మాయిని తల్లిదండ్రులు పంపారు. అక్కడ బలవంతంగా ఆల్కహాల్ తాగించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని అవమానించేలా రూ.50 వేలు పంపగా, ఆమె వెంటనే ఆ మొత్తాన్ని వెనక్కు పంపింది. నిందితుడి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో అందరి నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. నిందితుడికి గతంలోనే నేర చరిత్ర ఉంది’ అని పేర్కొన్నారు. ఐవోకు ఎఫ్ఐఆర్లో మార్పు అధికారం.. పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. ‘పుట్టిన రోజు (2008, ఆగస్టు), ఇతర సర్టీఫికెట్లు దర్యాప్తు అధికారి నుంచి తీసుకున్నాం (వాటిని కోర్టుకు సమరి్పంచారు). పోక్సో కేసుల్లో ముందస్తు బెయిల్ సాధ్యంకాదు. ఇలాంటి కేసుల్లో కూడా నిందితులకు బెయిలిస్తే చట్టంపై నమ్మకం లేకుండా పోతుంది. ఎఫ్ఐఆర్లో మార్పులు చేసే అధికారం దర్యాప్తు అధికారి (ఐవో)కి ఉంటుంది. సేకరించిన వివరాల ఆధారంగా సెక్షన్ల మార్పు, నిందితులను చేర్చడం చేయొచ్చు’ అని చెప్పారు. నాపైనే తీవ్ర ఆరోపణలు...కేసు విచారణకు స్వీకరించడానికి ముందు న్యాయమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి తప్పుడు ఆరోపణలతో తనపై, తన భర్తపై సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టులు చేశారన్నారు. ఇది అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని భావించానని, కానీ, వెకేషన్ కోర్టు అయినందున అన్ని పక్షాల న్యాయవాదులంతా అంగీకరిస్తేనే వాదనలు వింటానని చెప్పారు.అయితే, సోషల్ మీడియా పోస్టులు తాము కూడా చూశామని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తున్న న్యాయమూర్తిపై అత్యంత నమ్మకం ఉందన్నారు. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే వాటిని తొలగించాలని డీజీపీని కోరినట్లు పీపీ పల్లె నాగేశ్వర్రావు పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి విచారణ ప్రారంభించారు. కాగా, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కేసుల విచారణ ప్రారంభించిన న్యాయమూర్తి రాత్రి 12 గంటల వరకు విచారణ చేపట్టడం గమనార్హం. -
మద్యం తాగించి.. బలవంతం చేసి!
సాక్షి, హైదరాబాద్: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బాధితురాలైన మైనర్ బాలిక తల్లి తొలిసారిగా మీడియాకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘2025లో నా కుమార్తెకు భగీరథ్‌తో పరిచయం ఏర్పడింది. తరుచూ మాట్లాడుతూ నా కూతురి నమ్మకాన్ని చూరగొన్నాడు. క్రమంగా ఆమెను చదువుకు దూరం చేస్తూ, ఆమెకు ఇష్టం లేకపోయినా శారీరకంగా లొంగదీసుకోవడం కోసం నిరంతరం ఒత్తిడి తెచ్చాడు.ఈ క్రమంలో 2025 డిసెంబర్ 31 రాత్రి మెయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో నా కుమార్తెకు బలవంతంగా మద్యం తాగించారు. దీంతో స్పృహ తప్పిన స్థితిలో ఉన్న ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించి, శారీరక దాడులకు తెగబడ్డాడు. తర్వాత బాలిక తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి భగీరథ్ నా కూతురితో చేసిన చాటింగ్‌లు, క్షమాపణల మెసేజ్‌లు మా వద్ద ఉన్నాయి’ అని ఆమె వెల్లడించారు. తమపై ఒత్తిళ్లు : న్యాయపరమైన చర్యల కోసం తాము ప్రయత్నిస్తున్న క్రమంలో తమపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని బాధితురాలి తల్లి తెలిపారు. ‘ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి రాజీ కోసం ప్రయత్నించారు. మర్నాడు ఉదయం ఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో ఆయన్ను కలిసిన క్రమంలో అక్కడ మాకు భరోసా లభిస్తుందని ఆశిస్తే, దానికి భిన్నంగా రాజకీయ ప్రభావం, అనుచరుల అండదండల గురించి మాట్లాడుతూ మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేశారు’ అని ఆరోపించారు.ఈనెల 8న తాము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. అధికారులు తమను దాదాపు 5 గంటల పాటు నిలబెట్టారని ఆవేదన చెందారు. జ్యురిస్డిక్షన్ నెపంతో కాలయాపన చేశారని, కేసు నమోదు చేయాలని తాము పట్టుబట్టడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. మరోవైపు తాము ఫిర్యాదు చేసిన అదే సమయంలో కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో తమ కుటుంబంపై రూ.5 కోట్ల బ్లాక్మెయిల్, వసూళ్ల ఆరోపణలతో భగీరథ్ తరఫు వ్యక్తులు కౌంటర్ కేసు నమోదు చేశారన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్‌కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీన డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటామని, ఆరోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కార్డులు లాంఛనంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జేఎస్సీ సమావేశం జరగడం గమనార్హం.ఈ సందర్భంగా జేఎస్సీ సభ్యులతో సీఎస్ పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ సమస్యలను ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశంలో ప్రస్తావించారు. పీఆర్సీ నివేదిక, హెల్త్‌కార్డులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సర్వీస్ అంశాలు, ఉద్యోగుల బదిలీలు, 317 జీఓ సమస్యల పరిష్కారం తదితర అంశాలను సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కె.రామకృష్ణారావు మాట్లాడుతూ సమావేశంలో ప్రస్తావించిన ఆర్థికేతర అంశాలను వీలైనంత మేరకు పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పీఆర్సీ నివేదికను వీలైనంత త్వరగా తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆ దిశగా కమిషన్ కూడా తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. జిల్లాలు, డైరెక్టరేట్ స్థాయిల్లో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ⇒ టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించిన బిల్లులను వేగవంతంగా విడుదల చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన పలు అంశాలకు సంబంధించి నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ⇒ రెవెన్యూ శాఖలో 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏల చట్టబద్ధ వారసులను నియమించాలని అని రెవెన్యూ శాఖలో తొలగించిన 632 కంప్యూటర్ ఆపరేటర్లు మరియు ఎఫ్టీఎస్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ⇒ రెవెన్యూ శాఖ ఉద్యోగులను బదిలీల నిషేధం నుంచి మినహాయింపు కల్పించాలి ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు సంఘాల తరపున ఉద్యోగుల సమస్యలపై వేర్వేరుగా వినతిపత్రాలను సీఎస్‌కు అందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మహేశ్‌దత్ ఎక్కా, సబ్యసాచి ఘోష్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, తహసీల్దార్ అసోసియేషన్ అధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి పాక రమేష్ తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఇవీ నిర్ణయాలు⇒ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) జూన్ 2 నుంచి అమలు.. ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5% చొప్పున వసూలు చేసి, ప్రభుత్వం కూడా సమానమైన మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలు⇒ పీఆర్సీ నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలో నివేదిక తెప్పించి దానిపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం.⇒ పెండింగ్ బిల్లులను 100 రోజులలోపు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటాం.⇒ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌పై చర్చ. పాత పెన్షన్ అమలుపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటాం.⇒ ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ సెక్రటరీకి సూచన.⇒ ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని విద్యాశాఖ సెక్రటరీకి సూచన.⇒ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా స్పౌస్ కేటగిరీలో పరిగణించేలా చర్యలు.⇒ వారంలో ఐదు రోజుల పని విధానాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటాం. -
రాష్ట్రం స్వయం సమృద్ధి!
సాక్షి, హైదరాబాద్: సొంత పన్ను ఆదాయంలో తెలంగాణ స్వయం సమృద్ధి దిశగా ముందుకెళుతోంది. ఇతర గ్రాంట్లు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, అప్పులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోనే వచ్చే రాబడులు ఏటేటా పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్ల కాలంలో సుమారు రూ.35 వేల కోట్ల మేర పెరుగుదల నమోదు కావడం గమనార్హం.2021–22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను, రాష్ట్రం విధించే ఇతర పన్నులు కలిపితే రూ.96,844 కోట్లు రాగా, 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ మొత్తం రూ.1,31,320 కోట్లకు పెరిగిందని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. అంటే ప్రతి యేటా సగటున మన రాష్ట్ర సొంత ఆదాయం రూ.7 వేల కోట్ల వరకు పెరుగుతోందన్న మాట. ప్రతి రాబడిలోనూ పెరుగుదల: ఆదాయ వనరుల వారీగా పరిశీలిస్తే ప్రతి రాబడిలోనూ వృద్ధి నమోదవుతోంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద 2021–22లో రూ.34,489 కోట్లు రాగా, 2025–26 నాటికి అది ఏకంగా రూ.52,375 కోట్లకు చేరింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల ద్వారా 2021–22లో రూ.12 వేల కోట్లు రాగా, 2025–26లో రూ.15 వేల కోట్లకు చేరింది. అమ్మకపు పన్నును పరిశీలిస్తే 2021–22లో రూ.27 వేల కోట్లు వసూలు కాగా 2025–26 కల్లా రూ.33 వేల కోట్లు దాటింది. ఇక ఎక్సైజ్ ఆదాయం రూ.17 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ప్రతి కేటగిరీలోనూ పన్ను రాబడుల్లో గత ఐదేళ్ల కాలంలో వృద్ధి కనిపిస్తుండటం గమనార్హం. గ్రాంట్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా అంతంతే.. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా నిధులను అంచనా వేయడంలో ఆర్థిక శాఖ అధికారులు విఫలమవుతున్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 2021–22లో రూ.8,500 కోట్లు వస్తే ఐదేళ్ల తర్వాత 2025–26లో కేవలం రూ.10 వేల కోట్లు మాత్రమే దాటడం గమనార్హం. అయితే 2025–26లో గ్రాంట్ ఇన్ఎయిడ్ రూపంలో రూ.22,782 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా, అందులో కేవలం 45.75 శాతం అంటే రూ.10,422 కోట్లు మాత్రమే వచ్చాయి.కేంద్ర పన్నుల్లో వాటా ఏటేటా పెరుగుతున్నా ఆశించిన మేర రావడం లేదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 2021–22లో కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.13,147 కోట్లు రాగా, ఐదేళ్ల కాలంలో కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే పెరిగి రూ.21 వేల కోట్లకు చేరిందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ రెండు పద్దులు ఇంకొంత మేర పెరిగి, పన్ను రాబడుల్లో లీకేజీలను అరికట్టగలిగితే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
సామాన్యుడికి చమురు చిచ్చు
సాక్షి, బిజినెస్ డెస్క్: పెట్రో ధరల భారం ఎప్పుడూ పెట్రోల్ బంకుల వద్ద మాత్రమే ఆగదు. ప్రతి వంటగదిలోకి, ప్రతి పొలంలోకి, ప్రతి కుటుంబ బడ్జెట్లోకి చొరబడుతుంది. ఇప్పటికే పేదలు, మధ్యతరగతి ప్రజలు వంటగ్యాస్‌కు ఎక్కువ చెల్లిస్తున్నారు. రైతులు డీజిల్ ధరను ఎక్కువ భరిస్తున్నారు. కారి్మకులు రవాణాకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ వేతనాలతో అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదల అదనపు భారాన్ని మోపుతుంది. అండర్ రికవరీల పేరుతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలపై ఆరి్ధక భారాన్ని మోపుతున్నాయని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.గత సంవత్సరాల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు ఆ లాభాలను చమురు సంస్థలు వినియోగదారులకు ఎప్పుడూ అందించలేదని, కానీ పెట్రోలియం ఉత్పత్తులపై భారీ పన్నుల భారం మాత్రం ప్రజలు సంవత్సరాలుగా భరించాల్సి వస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవనం అతలాకుతలమవుతుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా సీఎన్జీ, డీజిల్ ధరల పెంపుతో ఆటో డ్రైవర్లు, రవాణా కారి్మకులు, ప్రజా రవాణాపై ఆధారపడే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడే అవకాశముంది. ఇరాన్ యుద్ధం ప్రభావం ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేస్తుండగా భారత్‌లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆగి ఆగి ఎట్టకేలకు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచాయి. రెండు నెలలకు పైగా భారీ నష్టాలు భరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. అదే సమయంలో సీఎన్జీ ధరలను కూడా కిలోకు రూ.2 పెంచడంతో రవాణా రంగంపై అదనపు ఒత్తిడి పడింది. ప్రజా రవాణా వ్యవస్థలో డీజిల్ కీలక పాత్ర పోషిస్తుంది. డీజిల్‌పై ఆధారపడే ట్రక్కులు, బస్సులు, వ్యవసాయ యంత్రాలు, కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు, మార్కెట్ సరఫరా గొలుసులన్నింటిపై ఇప్పుడు అదనపు భారం పడనుంది.రవాణా సంస్థలు ఇప్పటికే చార్జీలు కనీసం 3% పెరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. టాక్సీ, బస్సు రవాణా, డెలివరీ చార్జీలు కూడా వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలు, పాలు, ధాన్యాలు, మందులు, నిత్యావసర వస్తువుల నుంచి ఆన్లైన్ డెలివరీల వరకు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్ ధరల పెంపుతో సాగు ఖర్చులూ పెరగనున్నాయి. రైతులు పంటలను మార్కెట్లకు తరలించే ఖర్చు కూడా పెరగడంతో ఆహార ధరలు మళ్లీ ఎగబాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం మళ్లీ వేగం? ఏప్రిల్‌లోనే రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 8.3 శాతానికి ఎగిసింది. ఇప్పుడు ఇంధన ధరల పెంపు కారణంగా వచ్చే మూడు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5% దాటే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెంపుతో రిజర్వ్ బ్యాంక్‌కు ద్రవ్యోల్బణ నియంత్రణ మరింత క్లిష్టం కానుంది. ఇప్పటికే వడ్డీ రేట్ల కోతలపై ఆశలు తగ్గిపోగా, ఇప్పుడు మరింత కఠిన ఆర్థిక విధానాలు కొనసాగించే పరిస్థితి ఏర్పడే అవకాశముంది. దీనివల్ల ధరలు మరింత పెరుగుతాయి. ఇంకా పెరిగే చాన్స్ ఉందా? ప్రస్తుతం చేసిన రూ.3 పెంపు ఆయిల్ కంపెనీల నష్టాలను పూర్తిగా భర్తీ చేయదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఈ ధరల పెంపు పూర్తి ఉపశమనం కాదని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 105–110 డాలర్ల వద్ద కొనసాగితే, ఇప్పటికీ రోజుకు వందల కోట్ల నష్టాలు తప్పవని అంచనా. పరిస్థితి మరింత దిగజారితే మరోసారి ఇంధన ధరల పెంపు కూడా తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్డీజిల్, ఏటీఎఫ్‌పై సుంకం తగ్గింపున్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ పెట్రోల్ ఎగుమతులను కట్టడి చేసి దేశీయంగా లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ. 3 చొప్పున ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) పేరిట విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించింది. డీజిల్ ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ. 23 నుంచి రూ. 16.5కి, విమాన ఇంధనంపై (ఏటీఎఫ్) రూ. 33 నుంచి రూ. 16కి తగ్గించింది. ఇవి మే 16 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై రోడ్, ఇన్ఫ్రా సెస్సు ఉండబోదని పేర్కొంది. నిర్దిష్ట పరిస్థితుల్లో ఇంధన సంస్థలకు వచ్చే అసాధారణ లాభాలపై తాత్కాలికంగా విధించే సుంకాలను విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. -
2034 వరకు నేనే సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. ఆ తర్వాత ఉండను. తర్వాతి తరానికి అవకాశం ఇస్తా. పార్టీ చెప్పిన వారికి రాష్ట్రాన్ని అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా. నా అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తా..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. 2034 వరకు కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తారని ఆయన మరోమారు ధీమా వ్యక్తం చేశా రు. 2034 వరకు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తానని, 10% జీడీపీ దేశానికి ఇచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని అన్నా రు. ప్రస్తుతం ప్రజలు ‘స్విగ్గీ పాలిటిక్స్’ కోరుకుంటున్నారని, ఫలాలు తక్షణమే అందాలనే ఆలోచనతో జెన్‌జీ ఉందని, అందుకు అనుగుణంగా రాజకీయంగా ముందుకెళ్లాల్సి ఉంటుందని అన్నారు.2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన వే2న్యూస్ కాంక్లేవ్–2026లో ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రాహుల్‌కు ప్రధాని కావాలనే లక్ష్యం లేదు.. గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉంది. రాహుల్‌గాంధీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే. ప్రధాని కావాలన్న లక్ష్యం ఆయనకు లేదు. కానీ ప్రధాని పదవి తీసుకోవాలని వికారాబాద్ మీటింగ్‌లో రాహుల్‌ను నేను ఒప్పించా. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్‌గాం«దీయే. ఈ మేరకు ఇండియా కూటమిని ఒప్పిస్తాం. మాట్లాడింది ప్రభుత్వాల సహకారంపైనే.. ప్ర«దానిగా మోదీ, సీఎంగా నేను ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నాం. మేం మైక్‌ల ముందే మాట్లాడుకున్నాం. ఇందులో రహస్యం లేదు. నిధుల కోసం తమతో కలసిరావాలని మోదీ నన్ను అడిగారు. మేం మాట్లాడుకుంది ప్రభుత్వాల సహకారం గురించి మాత్రమే. చొరవ ఉంది కానీ గీత దాటను.. నేను రాహుల్‌గాంధీ నాయకత్వంలో పనిచేస్తా. నేను నా మనసుకు నచ్చినట్టు చేస్తా. అవకాశాల కోసం అవకాశవాదిగా మారను. కొంతమంది ఓటమికి కుంగిపోతారు. గెలుపునకు పొంగిపోతారు. కానీ ప్రజాప్రతినిధిగా నా ఆలోచనలో నాకు స్పష్టత ఉంది. నిబద్ధతతో పార్టీలో చేరాననే గాంధీ కుటుంబం నాకు అవకాశమిచ్చింది. సోనియా, రాహుల్, ప్రియాంకల వద్ద నాకు చొరవ ఉంది. కానీ నా గీత నేను దాటను. అప్పుడూ ఇప్పుడూ ఒకే ఇంట్లో.. జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో సీఎం అయ్యాక కూడా అదే ఇంట్లో ఉన్నా. ఇందిరమ్మ ఇంట్లో ఉన్న వెడ్మ బొజ్జు, రూపాయి చేతిలో లేని మందుల సామేల్‌ను ఎమ్మెల్యేలను చేశాం. కష్టపడ్డ నేతలకు నామినేటెడ్ పోస్టులిస్తున్నాం. చాకలి ఐలమ్మ కుటుంబం, శ్రీకాంతాచారి కుటుంబం, కోదండరాం, ఆకనూరి మురళి ఇలా అందరిని గుర్తు పెట్టుకుని పదవులు ఇచ్చాం. ప్రజల సమస్యలపై అవగాహన ఉంది.. జీవితంలో నేను చాలా సౌకర్యంగా ఉన్నా.. 100 శాతం సంతృప్తితో ఉన్నా. భవిష్యత్తు తరాల కోసం ఏదైనా చేయాలన్నదే నా ఆలోచన. ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 17 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నా. ప్రజా సమస్యలపై అవగహన ఉంది. సీఎంగా వ్యవస్థలను పట్టాలెక్కించాల్సిన బాధ్యత నాపై ఉంది. గతంలో కులాలు, మతాల వారీగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇది కుల వ్యవస్థను ప్రోత్సహించినట్లే కదా? నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్‌లో అన్ని కులాలు, మతాల విద్యార్థులుంటారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలించాలనుకుంటున్న నన్ను విలన్లా చూస్తున్నారు. డ్రగ్స్ తీసుకుంటే ఏ కీలుకు ఆ కీలు తీస్తా. మూసీ ప్రక్షాళన ఆగదు.. ఎవరు అడ్డువచ్చినా మూసీని ప్రక్షాళన చేస్తాం. నగరాలను కలుషితం చేస్తే మరిచిపోతారు కాని నీటి వనరులను కలుషితం చేస్తే ఎప్పటికీ మరిచిపోరని జపాన్‌లో ఒక సామెత ఉంది. యుద్ధం జరిగినప్పుడు కొందరు అమాయకులు కూడా చనిపోతారు. యుద్ధ నీతే అది. ఆక్రమణలదారులకు ముందే నోటీసులు ఇస్తున్నాం. ఎవరూ మూసీ మురికిలో ఉండాలని కోరుకోరు. వారసత్వంగా సీఎం పదవి వస్తదని కొందరు కలలు కన్నారు.. బుర్రలేని లేని వాళ్లు టెండర్లు, కాంట్రాక్టులు మాత్రమే చూస్తారు.. టెండర్లు ఇచ్చి కమీషన్లు తీసుకునే వారి ఆలోచన వేరే ఉంటుంది. నా దగ్గరకి వచ్చి నీకు ఇంత ఇస్తాం పని చేయి అని చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు. రోజుకు 18 గంటలు అధికారులతో సమీక్షలు చేస్తున్నా. నా ప్యూచర్‌ను ప్రజలు నిర్ణయిస్తారు. ప్రతిపక్షం కాదు. వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి వస్తదని కొందరు కలలు కన్నారు. నేను వాస్తవంలో ఉంటా. ఉహాజనితమైన ప్రపంచంలో ఉండను. అలాగైతే పోక్సో కేసు ఎందుకు పెడతాం.. మేం అధికారంలోకి వచ్చాక మహిళలపై నేరాలు నియంత్రించాం. ఈ నెల 8వ తేదీన రాత్రి మైనర్ బాలిక తల్లి ఒకరు పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. 9 తేదీన విచారణ ప్రారంభించి సెక్షన్లు కూడా మార్చి కేసు పెట్టాం. 11 వ తేదీన సెక్షన్లు సవరించి వెంటనే నోటీసులు జారీ చేశాం. ఇదే వ్యవహారంలో బండి సంజయ్ కుమారుడు కరీంనగర్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులను బేరీజు వేసుకుని అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని నోటీసులిచ్చారు. ఈ కేసులో ఎలా పడితే ఎలా చేయడానికి వీల్లేదు. నేను సహాయ పడాలనుకుంటే పోక్సో కేసు పెట్టం కదా? బండి సంజయ్‌కి, బీఆర్ఎస్ మధ్య ఎక్కడ చెడిందో నాకు తెలియదు. కేటీఆర్‌కి, బండి సంజయ్‌కి మధ్య ఏముందో నాకు తెలియదు. కానీ ఎవరైనా తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా నాకు మినహాయింపులు లేవు. బండి సంజయ్ తీరు సరికాదు.. ఆ అమ్మాయికి రెండు బర్త్ సర్టీఫికెట్లు ఉన్నాయి. అవన్నీ పోలీసులు విచారించాలి. ఒకరోజు ఆలస్యమైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు. మేము సత్రం నడపడం లేదు.. ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మా ప్రభుత్వం బాధితులకు 100 శాతం అండగా ఉంటుంది. కుమారుడి విషయంలో బండి సంజయ్ తీరు నైతికంగా సరైంది కాదు. ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలి. కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి. -
బండి భగీరథ్ కేసు: హై కోర్టులో దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో దాఖలైన ముందస్తు రక్షణ (బెయిల్) పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పరిస్థితిలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు ఇస్తామని హై కోర్టు వెల్లడించింది.‘బాధితురాలు ముమ్మాటికీ మైనరే’పిటిషన్‌పై విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. బండి భగీరథ్‌కు ఎలాంటి ముందస్తు రక్షణ ఇవ్వకూడదని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో బాధితురాలి వయసుపై వస్తున్న అనుమానాలకు పీపీ తెరదించారు. బాధితురాలు ముమ్మాటికీ మైనరేనని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. విచారణలో బాధితురాలి వయసు 17 ఏళ్ల 3 నెలలుగా నిర్ధారణ అయిందని తెలిపారు. దీనికి సంబంధించి ఆమె పదో తరగతి (టెన్త్) మెమోతో పాటు, జీహెచ్ఎంసీ (GHMC) జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ కూడా ఉన్నట్లు కోర్టుకు సమర్పించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సైతం బాధితురాలు మైనర్ అనే విషయం స్పష్టమైందని పీపీ పేర్కొన్నారు.బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో జరిగిన సంఘటన మొత్తాన్ని వివరంగా వివరించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. "బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే సదరు బాలిక అతనితో కలిసి బయటకు వెళ్లింది" అని పీపీ వాదనలు వినిపించారు. ఈ కారణాల చేతనే పోలీసులు అతనిపై లైంగిక దాడి కేసులు నమోదు చేశారని, అందువల్ల నిందితుడికి ముందస్తు రక్షణ కల్పించకూడదని కోరారు.కాగా, అంతకుముందు బండి భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో తన వాదనలు వినిపించారు. బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలన్న కోర్టును కోరారు. -
కూలిన లిఫ్ట్.. బీఆర్ఎస్ నాయకులకు గాయాలు
సాక్షి, హైదరాబాద్: లిఫ్ట్ తెగిపడి బీఆర్ఎస్ నాయకులు గాయపడిన ఘటన హైదరాబాద్‌లోని పుప్పాలగూడ డాలర్ హిల్స్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు బీఆర్ఎస్ నాయకులు గాయపడ్డారు.వైర్లు తెగిపోవడంతో లిఫ్ట్ ఒక్కసారిగి కుప్పకూలింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఆరుగురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వీరందరికీ గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అవడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఓ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ ముగించుకుని లిఫ్ట్ లో కిందకు దిగుతున్న సమయంలో ఘటనఈ ఘటన జరిగింది. -
బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం హార్ట్ స్టెంట్ వేసి చికిత్స అందిస్తున్నారు. బండి సంజయ్ స్వయంగా ఆసుపత్రికి చేరుకుని తల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. -
సీఎం రేవంత్ కాన్వాయ్ వాహనాల తగ్గింపు..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో వాహానాలు తగ్గించాలని నిర్ణయించారు. ఇక నుంచి నాలుగు వాహనాలతోనే సీఎం రేవంత్ కాన్వాయ్ బయల్దేరనుంది. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మధ్యనే సీఎం కాన్వాయ్ వెళ్లడానికి నిర్ణయించారు. రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఆయన కాన్వాయ్‌కు సంబంధించిన వాహనాలపై నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమాసియాలో ఇంధన సంక్షోభం నేపథ్యంలో భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు రాష్ట్రాల సీఎంలు తమ కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకుంటున్నారు. అదే సమయంలో పలువురు మంత్రులు సైతం వాహనాల వాడకాన్ని కాసేపు పక్కనపెట్టి సైకిళ్లు, మెట్రోల్లో, ఎడ్లబండిపై పయనిస్తున్నారు. ఇక ప్రధాని మోదీ కూడా తన కాన్వాయ్‌లోని వాహనాలను రెండుకు పరిమితం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో తొలుత కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకునే యత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ కూడా తన కాన్వాయ్ వాహనాలను నాలుగుకు పరిమితం చేశారు. -
నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4వ ప్లాట్‌ఫాంపై ఉన్న ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. జైపూర్ వెళ్తున్నట్రైన్ ఏసీ బోగిలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడుతున్నాయి. మూడు ఫైరింజన్లతో మంటలను సిబ్బంది అదుపు చేశారు. తోటి ప్రయాణికులు.. అద్దాలు పగలగొట్టి ప్యాసింజర్లను కాపాడారు. బీ1, బీ2 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.రాత్రి 7.30కి బయలుదేరాల్సి ఉండగా 6.20 గంటల ప్రాంతంలో బోగీల్లో మంటలు వ్యాపించాయి. బోగీలలో పొగలు రావడాన్ని గమనించి ఫైర్, హైడ్రా కంట్రోల్ రూమ్‌కు రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకుని హైడ్రా, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెనుముప్పు తప్పడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. -
భూ వివాదం.. కత్తులతో దాడులు
అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం బండారు గుంపులో భూవివాదం తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. భూ వివాదం ముదరడంతో రెండు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. కళ్లలో కారం కొట్టుకుని కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల పరిధిలో భూవివాదాలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే తాజాగా చోటు చేసుకున్న భూవివాదం తారాస్థాయికి చేరుకుని కత్తులతో దాడులు చేసుకునే వరకూ వెళ్లడం చర్చనీయాంశమైంది. -
బండి భగీరథ కేసులో ఆ పేరు వాడొద్దు: కోర్టు
హైదరాబాద్: బండి భగీరథ కేసులో సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేరును వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసులో తన పేరును వాడుతున్నారంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్. ఈ మేరుకు విచారించిన కోర్టు.. బండి భగీరథ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ పేరు వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసింది సివిల్ కోర్టు. తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు రాయకుండా చూడాలని కోరారు. ఇప్పటివరకు మీడియాలో తన పేరుతో వచ్చిన ఈ కేసుకు సంబంధించిన వార్తలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు బండి సంజయ్. కేంద్రమంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. -
హైదరాబాద్‌లో ఈ దేవాలయం దర్శిస్తే.. మీ అమెరికా డ్రీమ్ నెరవేరినట్లే
వాషింగ్టన్: భక్తులు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం.. వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. విదేశాల్లో స్థిరపడాలనుకునే కోట్లాది మంది భక్తుల ఆశలు, విశ్వాసాలకు ప్రతీక. అందుకే చిలుకూరు బాలాజీని వీసా గాడ్ అని పిలుస్తారు. ఇప్పుడు మరోసారి చిలుకూరు బాలాజీ విశిష్టత ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై దుమ్మెత్తి పోస్తూ అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో హెచ్-1బీ వీసా పోగ్రామ్ వల్ల అమెరికన్లు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. దేశీయంగా ఉన్న ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నాయి. పనితీరు పేరుతో స్థానికుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. అమెరికా సెనేటర్ నోట చిలుకూరు బాలాజీ ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం గురించి ప్రస్తావించారు. ఉదాహరణకు మీరు అమెరికా హెచ్-1బీ వీసా కావాలంటే వీసా దేవాలయాన్ని సందర్శించొచ్చు. హెచ్-1బీ వీసా కోరుకునేవారు (వీసా కార్టెల్)కి హైదరాబాద్‌లో వీసా దేవాలయం ఉంది. అక్కడ వేలాది మంది భారతీయులు పుణ్యక్షేత్రంలో ప్రదిక్షణలు చేస్తారు. యూఎస్ వర్క్ వీసాల కోసం ఆశీర్వాదం పొందుతారు’అని పేర్కొన్నారు.పన్నులు కట్టేది మనం.. ఉద్యోగాలు మాత్రం భారతీయులకుఅమెరికా వీసా ప్రోగ్రామ్‌లలో మోసం, దుర్వినియోగం అధికంగా ఉంది. తద్వారా హెచ్-1బీ,ఎల్-1,ఎఫ్-1,ఓపీటీ వీసా ప్రోగ్రామ్‌లు అమెరికా మధ్యతరగతి ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయి. షెల్ కంపెనీలు అక్రమ పద్దతుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా తక్కువ వేతనాలతో వీసా ఆధారిత కార్మికులను అమెరికా ఉద్యోగాల్లోకి పంపుతున్నారు. అమెరికన్లను పక్కన పడుతున్నారు. ఆ కంపెనీలే భారత్‌లో ఏఐపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. పన్ను రాయితీ ప్రయోజనాలు మాత్రం అమెరికా నుంచి పొందుతున్నాయి. ఎల్‑1 వీసాలు వీసా కార్టెల్ వ్యాపారంగా మారాయని ఆయన ఆరోపించారు. విదేశీ కంపెనీలు నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి, మేనేజర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ వేతన పరిమితులను తప్పించుకుంటున్నాయి. దాదాపు సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుని, టెక్ కంపెనీలలో మధ్యస్థాయి కంటే తక్కువ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. అమెరికా ప్రజలు చెల్లించే పన్నులే విదేశీ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఫలితంగా, కంపెనీలు పేరోల్ ట్యాక్స్, వేజ్ రూల్స్ లేకుండా తక్కువ వేతనాలతో వారిని నియమించుకుంటున్నాయి. తర్వాత వారు హెచ్‑1బీ ఉద్యోగులు ఆపై గ్రీన్ కార్డ్‌లు పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అమెరికా గ్రాడ్యుయేట్లు తక్కువ వేతనం తీసుకుంటున్న పోటీపడుతున్నారు. వీసా వస్తే.. ఒక్కరితో ఆగదు.. అందరికి షేర్ చేస్తారుకార్టెల్ పని ఇక్కడితో ఆగదు. భారతీయ వీసా హోల్డర్లు ఇంటర్వ్యూలలో అడిగే కాన్ఫిడెన్షియల్ ప్రశ్నలను ఇతర భారతీయ అభ్యర్థులతో పంచుకుంటున్నారు చివరిగా వీసాల పేరుతో జరుగుతున్న మోసాలు ఇంక చాలు. ఆ మోసాన్ని ఆపాలి. ఈ నెట్‌వర్క్‌లను మూసివేయాలి. లోపాలను సరిచేయాలి. అమెరికన్ వర్క్ ఫోర్స్‌ను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రస్తావనఅమెరికా డ్రీమ్ తరచుగా హైదరాబాద్‌లో ప్రార్థనతో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంను వీసా టెంపుల్‌గా పిలుస్తారని, వీసా కోసం ప్రయత్నించే విద్యార్థులు, టెక్ ఉద్యోగులు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాలు పొందే జాబితాలో భారత్ వాటా 70 నుంచి 80శాతం ఉంటే చైనా మాత్రం 12శాతం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 11 లేదంటే 108 ప్రదక్షిణలుచిలుకూరు బాలాజీ ఆలయంలో వీసా కోసం చేసే ప్రదక్షిణల సంప్రదాయం ప్రత్యేకంగా ఉంది.కోరికను (ఉదా: అమెరికా వీసా) మనసులో పెట్టుకుని ఆలయ గర్భగుడి చుట్టూ 11 సార్లు తిరుగుతారు. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి ఆలయానికి వచ్చి కృతజ్ఞతగా 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు.ఈ సంప్రదాయం 1990లలో ఐటీ విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా వీసా కోసం ప్రార్థనలు చేసినప్పుడు విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. An American professor just sued SMU, alleging the department chair systematically favored Indian-origin candidates for tenure.100% approval for them, zero for equally qualified non-Indians.This isn’t isolated; it’s the pattern when these networks capture hiring. pic.twitter.com/60CezLg8pw— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026 -
పెద్దికి లైన్ క్లియర్
-
భార్య రెండో పెళ్లి చిచ్చు.. భర్త ఆత్మహత్య!
హైదరాబాద్: తాను ఎంతగానో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కొన్నేళ్ల కాపురం తర్వాత రెండో పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని హయత్‌నగర్ పీఎస్ కోహెడ పరిధిలో చోటు చేసుకుంది. తమకు పుట్టిన బిడ్డను సైతం భార్య అమ్మేసి మరీ రెండో పెళ్లి చేసుకోవడంతోనే తాను ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు భర్త గోవర్థన్ వెల్లడించాడు. చనిపోయేముందు సెల్ఫీ వీడియో తీసుకోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. తన భార్య రెండో పెళ్లి చేసుకుందని, తమకు ఒక బాబు కూడా ఉన్నాడని ఆ వీడియోలో తెలిపాడు. నాలుగేళ్ల కాపురం తర్వాత ఆ బిడ్డను అమ్మేసి రెండో పెళ్లి చేసుకోవడాన్ని తాను భరించలేకపోతున్నానని, తనకు చావు తప్పితే మరొక మార్గం లేదని బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ వీడియోలో వెక్కి వెక్కి ఏడ్చిన గోవర్థన్.. తనను మోసం చేసిన ఆమెను వదిలిపెట్టవద్దని కుటుంబ సభ్యులకు విన్నవించాడు. తాను చనిపోతున్నందుకు క్షమించాలంటూ కుటుంబ సభ్యులను కోరాడు. దీనిపై గోవర్థన్ తల్లి మాట్లాడుతూ.. వారికి పెళ్లియిందనే విషయం తమకు ఇప్పుడే తెలిసిందని, బాబు పుట్టిన విషయం కూడా తమకు చెప్పలేదని, ఇప్పుడు వీడియో ద్వారా మాత్రమే వారికి పెళ్లైన విషయం, బాబు పుట్టిన విషయం తెలిసిందన్నారు. -
పెద్ది పేరు చెప్పి మా నోరు నొక్కేయకండి
-
పేద ప్రజల ఆరోగ్యం కోసమే టిమ్స్ ఆసుపత్రులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో AIIMS స్థాయి వైద్యం అందించేలా టిమ్స్‌ను ఆలోచించి రూపకల్పన చేశామన్నారు.సనత్‌నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామని అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ఇందులో మొత్తం మూడు బ్లాకులు నిర్మించామని 300 ICU బెడ్స్‌తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.1200 కోట్ల వ్యయంతో టిమ్స్ నిర్మాణం చేపట్టామని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేదన్నారు. -
సందడిగా యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ మీట్ అండ్ గ్రీట్
సాక్షి, హైదరాబాద్ : మీట్ అండ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ వీసీ జాన్ వాల్.. యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ మీట్ గ్రీట్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.బంజారాహిల్స్‌లోని తాజ్ దక్కన్ హోటల్లో గురువారం యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ మీట్ ద గ్రీట్ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ వైస్ ఛాన్సిలర్ జాన్ వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మూస కోర్సులు చదువుకునేందుకు ఇష్టపడటం లేదని ఎప్పటికప్పుడు సరికొత్త కోర్సులు చదువుకోవడానికి ఇష్టపడుతున్నారని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ యూనివర్సిటీకి భారతీయ విద్యార్థులకు మంచి సంబంధాలు ఉన్నాయని ఇక్కడ లభించే కోర్సులకు ప్రతియేటా భారతీయ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని అన్నారు. టెక్నాలజీ కోర్సులు, సైబర్ సెక్యూరిటీస్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రొబోటిక్స్ వంటి ఎన్నో అంశాలపై అధునాతన కోర్సులను విద్యార్థులకు ఈ యూనివర్సిటీ అందిస్తున్నదని తెలిపారు.ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నదని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ అడ్మిన్ గులిని రిచర్డ్ మాట్లాడుతూ ప్రస్తుతం యూనివర్సిటీలో 12 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారని అన్నారు. సావరియా ఎడ్యుకేషన్ సంస్థ చైర్మన్ రాజేష్ గోయల్ మాట్లాడుతూ తొలుత 200 మంది తమ కన్సల్టెన్సీ నుంచి లండన్ వెళ్ళారని ఇప్పుడు 500 మందికిపైగా వెళ్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఈడీ గ్రోత్ మిస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: యూసుఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశ్వ విహార్ లాండ్ మార్క్ అపార్టుమెంటులోని ఐదో అంతస్థులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అపార్టుమెంటులోని వారిని ఖాళీ చేయించి మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. అయితే ఏసీ పేలడంతోనే ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
ఆ వీఆర్ఏల గోడు పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక పద్ధతిన చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తే జీవితాలు బాగుపడతాయని అందరూ ఆశిస్తారు... కానీ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) విషయంలో మాత్రం ఉద్యోగాల క్రమబద్ధీకరణ నిరాశను మిగిల్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన క్రమబద్ధికరణ అనంతరం దాదాపు 7 వేల వీఆర్ఏల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ వీఆర్ఏలు, వారి కుటుంబ సభ్యులు మూడేళ్లుగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం, సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. తరాలుగా... సహాయకులుగా: రాష్ట్రంలో పేద వర్గాలకు చెందిన వేలాది మంది తరతరాలుగా మసూ్కరులుగా, సుంకరులుగా, నీరటిలుగా రెవెన్యూ శాఖలో సేవలందిస్తున్నారు. వీరితోపాటు 2012, 2014లో రాత పరీక్ష ద్వారా మరికొందరు గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఎంపికయ్యారు. వీరి పోరాటం కారణంగా గత ప్రభుత్వం 2023, ఆగస్టు నెలలో ఉద్యోగాలను క్రమబద్ధీకరించింది. వీఆర్ఏల వ్యవస్థను రద్దు చేసి వారిని ప లు శాఖల్లో జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, లస్కర్లుగా నియమించింది. ఇ ప్పుడు ఈ క్రమబద్ధీకరణే కొందరు వీఆర్ ఏల జీవితాల్లో కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ⇒ ఉద్యోగాల క్రమబద్ధికరణకు ముందు అప్పటి ప్రభుత్వం వీఆర్ఏల కారుణ్య నియామకాలను నిలిపివేస్తున్నట్టు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో వీఆర్ఏలుగా పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఇలా కారుణ్య నియామకాల కోసం దాదాపు 1,500 మంది ఎదురు చూస్తున్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ⇒ క్రమబద్ధికరణ సమయానికి 61 సంవత్సరాలు నిండిన వారిని రెగ్యులరైజ్ చేయలేదు. కానీ మండల రెవెన్యూ కార్యాలయాల్లో వారు విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఇలా రెగ్యులరైజ్ కాకుండానే ఉద్యోగాలు చేస్తున్న వారు దాదాపు 4వేల మంది ఉంటారని అంచనా. ⇒ మరో సమస్య ఏమిటంటే... మసూ్కరు ఉద్యో గం జీవితాంతం ఉంటుంది. దానికి రిటైర్మెంట్ ఉండదు. కానీ క్రమబద్ధికరణ నిబంధనల ప్రకారం 2వేల మంది వరకు రిటైరయ్యారు. వీరిలో చాలా మంది రెగ్యులర్ ఉద్యోగులుగా 3 నెలల నుంచి మూడేళ్లు మాత్రమే పనిచేయగలిగారు. ⇒ ఈ మూడు కేటగిరీలకు చెందిన వీఆర్ఏల సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వం కూడా శీతకన్ను వేసింది. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సహా ఉన్నతాధికారులెవరూ వీరి గోడును పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.కొసమెరుపేమిటంటే... ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయి కుటుంబాలకు దూరంగా, ఇతర జిల్లాలకు వెళ్లి పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లు, లస్కర్లు, అటెండర్లకు ఇంతవరకు ప్రొబేషన్ డిక్లేర్ కాకపోవడంతో వారు ఇంక్రిమెంట్లు పొందేందుకు వీలు లేకుండా పోయింది. కనీసం అధికారికంగా సెలవులు కూడా పెట్టలేని పరిస్థితి నెలకొనడం గమనార్హం. -
ఫార్ములా–ఈ రేస్ కేసులో కేటీఆర్‌కు నోటీసులు
సిటీ కోర్టులు, (హైదరాబాద్): ఫార్ములా–ఈ రేస్ కేసులో మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషిట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేటీఆర్ (ఏ–1)తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ (ఏ–2), హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డి (ఏ–3)కి గురువారం నోటీసులు జారీ చేసింది.జూలై 31న కోర్టులో హాజరుకావాలని తెలిపింది. స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు (ఏ–4), యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థ (ఏ–5)లను కూడా ఏసీబీ ఈ కేసులో నిందితులుగా చేర్చింది. హెచ్ఎండీఏకు చెందిన రూ.55 కోట్లకు పైగా నిధులను విదేశీ సంస్థలకు నిందితులు మళ్లించినట్లు ఏసీబీ అభియోగాలు మోపింది. ఆర్థిక లావాదేవీలు, తదితరాలకు సంబంధించి దాదాపు వెయ్యికి పైగా పత్రాలను కోర్టుకు సమర్పించింది. ఈ మేరకు చార్జిషిట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పత్రాల పరిశీలన అనంతరం విచారణకు స్వీకరించనుంది. రూ. 54.89 కోట్ల మళ్లింపు ఆరోపణలు కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గత గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్ వద్ద ఫార్ములా–ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి హెచ్ఎండీఏకు చెందిన రూ. 54.89 కోట్లను విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ నిధుల విషయంలో ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటికే కేటీఆర్ తదితరులు విచారించింది. -
రాత్రిళ్లు... ఉక్కపోతే!
రాత్రి సమయాల్లోనూ ఉక్కపోత, వేడి వాతావరణంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మండువేసవిలో సూర్యాస్తమయం తర్వాత చాలా సేపటి వరకు పడకగదులు ఉక్కపోతగానే ఉంటున్నాయి. దీంతో నిద్రకు అంతరాయం కలగడం, చిరాకు పెరగడం వంటి వాటితో మరుసటి రోజు పని, కార్యకలాపాల నిర్వహణలో ఉత్సాహం, చురుకుదనం కోల్పోయి ఉత్పాదకత కూడా ప్రభావితమవుతోంది.హైదరాబాద్, బెంగళూరు సహా దాదాపుగా అన్ని మహానగరాలు, పట్టణాల్లో ఇదే సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ఈ పరిస్థితుల్లో ఇళ్లలో రాత్రిపూట వేడిమి ఒక తీవ్రమైన సంక్షోభంగా మారుతోంది. సూర్యాస్తమయం తర్వాత ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గకపోవడం వల్ల, పగటిపూట వేడి నుంచి భౌతికంగా కోలుకోవడానికి వీలులేకుండా ఒక ‘ఉష్ణ లోటు’ ఏర్పడుతోంది. 2026 వివిధ అధ్యయనాలు, నివేదికల ప్రకారం చూస్తే...2026 మే నాటికి భారత్‌లో పగటి కంటే రాత్రుళ్లే వేగంగా వేడెక్కుతున్నాయని, 76% జనాభా తీవ్రమైన, మిశ్రమ వడగాలుల బారిన పడే అధిక ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది. – సాక్షి, హైదరాబాద్ఇదీ అధ్యయనం...2025 అక్టోబర్ నుంచి 2026 ఏప్రిల్ మధ్య ఏడు నెలల హై–రిజల్యూషన్ సెన్సార్ డేటా ఆధారంగా క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనం పెరుగుతున్న వాతావరణ ముప్పును సూచిస్తోంది. ఉదయం నుంచి కాంక్రీట్ గోడలు, నేలలు నిల్వ ఉంచుకున్న ఎండ వేడిమి విడుదల కావడం వల్ల, రాత్రి 8, 9 గంటల ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దాదాపు 34.7ని సెంటిగ్రేడ్ల గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. తెల్లవారుజామున కూడా, ఉష్ణోగ్రతలు 33.8ని నుంచి 34ని సెంటిగ్రేడ్ల మధ్యే ఉండటంతో ఇళ్లల్లోని వారికి పెద్దగా ఉపశమనం లభించడం లేదు.ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనలో వడగాలుల సమయంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడానికి, మరణాల రేటు పెరగడానికి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. నిద్రపై జరిపిన అధ్యయనాలు ఇంకా సూచించేదేమిటంటే, ఇళ్లలో 26–28 నిసెంటిగ్రేడ్ల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నిద్ర నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తాయి, అయితే 30ని సెంటిగ్రేడ్ల మించిన ఉష్ణోగ్రతలు దీర్ఘకాలిక అసౌకర్యానికి క్రమంగా పెరిగే శారీరక ఒత్తిడికి దోహదం చేస్తాయి. తాజాగా ఇండియా హీట్ సమ్మిట్–2026 సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. పట్టణ ప్రణాళికలు.. పర్యావరణహితంగా లేకే సమస్యలు మనదేశంలో నగరీకరణ అత్యంత వేగంగా వ్యాపిస్తుండడంతో, నగరాలు, పట్టణాలు ‘కాంక్రీట్ జంగిళ్లు’గా మారాయి. హైదరాబాద్, బెంగళూరు ఇతర నగరాల్లో పట్టణ ప్రణాళికలు, పర్యావరణహితంగా లేకనే సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటివరకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవి కూడా నగరీకరణపై ప్రణాళికాబద్ధమైన ప్లానింగ్ విషయంలో ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు. అర్భనైజేషన్కు సంబంధించి ఒక బ్లూప్రింట్, కచి్చతమైన ప్లానింగ్, దీర్ఘకాలిక నగర సుస్థిరాభివృద్ధి, ప్రకృతి, పర్యావరణ అనుకూల ‘డిజైన్ విత్ నేచర్’వంటివి, గాలి వీచే దిశ, వర్షపాతం, బహిరంగ, ఖాళీస్థలాలు, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా క్రీడామైదానాలు, పార్కులు, స్కూళ్లు వంటి వాటిని అంతర్భాగం చేసి ‘లేయర్డ్ ప్లానింగ్’చేయాల్సి ఉండగా అది జరగలేదు. – ప్రొఫెసర్ .కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్తఅధ్యయనం ముఖ్యాంశాలు... ⇒ గత దశాబ్ద కాలంలో ఇండో–గంగా మైదానంలో తేమ స్థాయిలు 10% పెరిగాయి ⇒ దీనివల్ల ఉష్ణోగ్రత 3–5ని సెంటిగ్రేడ్లు అధికంగా ఉన్నట్టు అనిపిస్తుంది ⇒ రాత్రిపూట సహజంగా చల్లబడే ప్రక్రియను అణచివేస్తుంది ⇒ అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవిలో దాదాపు 49% మంది ప్రజలు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారు ⇒ రాత్రులు వెచ్చగా ఉన్నప్పుడు, మానవ శరీరం చల్లబడలేదు, దీనివల్ల శరీరంలో వేడి భారం పెరిగి పక్షవాతం, గుండె, మూత్రపిండాల సమస్యల ప్రమాదం పెరుగుతుంది -
‘సర్’ సైరన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్) కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ను ప్రకటించింది. తొలి విడతలో బిహార్, రెండో విడతలో మరో ఆరు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా మూడో విడత కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్’ నిర్వహించనుంది. తెలంగాణలో 2026 అక్టోబర్ 1ని అర్హత తేదీగా పరిగణిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అంటే ఆ రోజుకు 18 ఏళ్లు నిండిన/నిండనున్న పౌరులందరూ ఓటర్లుగా నమోదు కావడానికి అర్హత కలిగి ఉంటారన్నమాట. ఇదీ షెడ్యూల్..: ఈసీ షెడ్యూల్ ప్రకారం..రాష్ట్రంలో వచ్చే జూన్ 15–24 మధ్యకాలంలో దరఖాస్తులు, మెటీరియల్ ముద్రణ, సిబ్బందికి శిక్షణ వంటి చర్యలు తీసుకుంటారు. జూన్ 25–జూలై 24 మధ్య బూత్ స్థాయి అధికారులు (బీఎస్ఓలు) ఇంటింటా తిరిగి ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందుకోసం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారు. ఈ ప్రక్రియలో బీఎల్ఓలకు ఆయా రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏ) సహకరించాలని ఎన్నికల సంఘం సూచించింది. జూలై 31న ‘సర్’ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. జూలై 31 నుంచి సెపె్టంబర్ 28 మధ్యకాలంలో ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించడంతో పాటు మ్యాపింగ్ సరిపోలని అనుమానిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ల ఆధ్వర్యంలో విచారణకు పిలుస్తారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. రాష్ట్రంలో ఈ నెల 12 నాటికి 3,39,20,705 మంది ఓటర్లు ఉండగా, 35,985 మంది బీఎల్ఓలు, 25,886 మంది బీఎల్ఏలు ‘సర్’ ప్రక్రియలో పాల్గొననున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 60 శాతమే మ్యాపింగ్ పూర్తి! సాధారణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఎస్ఆర్) పేరుతో ప్రతి ఏటా జనవరిలో కొత్త ఓటర్ల జాబితాను ప్రచురించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అనేక చోట్ల ఓట్లు ఉన్న వలస ఓటర్ల డూప్లికేట్ ఓట్లను, మరణించిన ఓటర్ల పేర్లను తొలగించడానికి ‘సర్’ను చేపట్టినట్టు ఎన్నికల సంఘం పేర్కొంటోంది. చివరిసారిగా 2002లో ఉమ్మడి ఏపీలో ‘సర్’ నిర్వహించగా, రెండు దశాబ్దాల విరామం తర్వాత ఈ ఏడాది మళ్లీ నిర్వహిస్తున్నారు. ‘సర్’ 2026 కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లను.. ‘సర్’ 2002 జాబితాలోని వారి పేర్లు/ తల్లిదండ్రులు/తాత అమ్మమ్మల పేర్లతో మ్యాపింగ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న వారిలో ఎవరెవరు .. 2002 జాబితాలో వారి పేర్లు గానీ వారి తల్లిదండ్రులు/తాత అమ్మమ్మల పేర్లు గానీ కలిగి ఉన్నారో గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నారు. సర్ 2002 జాబితా ప్రకారం తెలంగాణలో నాడు మొత్తం 2.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాగా ప్రస్తుత ఓటర్ల జాబితాలోని 60 శాతం మంది పేర్లను మాత్రమే ఇప్పటివరకు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి లేదు. మ్యాపింగ్ జరగని ఓటర్లకు ‘సర్’ 2026లో ఇబ్బందులు తప్పవు. సర్–2002 జాబితాను స్థానిక బీఎల్ఓలతో పాటు సీఈఓ కార్యాలయం వెబ్సైట్(https:// ceotelangana.nic.in)తో పాటు ఎన్నికల సంఘం వెబ్సైట్ (https:// voters.eci.gov.in)లో అందుబాటులో ఉంచారు. ప్రతి ఇంటికీ బీఎల్ఓలు సర్వేలో భాగంగా జూన్ 25–జూలై 24 మధ్య బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు సంబంధించి ముందే ముద్రించిన ఎన్యూమరేషన్ ఫామ్ రెండు ప్రతులను అందజేస్తారు. ఆన్లైన్ నుంచి కూడా ఓటర్లు ఈ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. భర్తీ చేసిన ఒక ప్రతిని బీఎల్ఓలకు అందజేయాల్సి ఉంటుంది. మరో ప్రతిని స్వీకరణ రశీదుగా నమోదు చేసి ఓటరు వద్దే ఉంచుతారు. 2002 జాబితాలో తమ ఓటు ఉందా? లేక తమ తల్లిదండ్రులు/తాతఅమ్మమ్మల పేర్లు ఉన్నాయా ? వంటి వివరాలను ఈ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో బీఎల్ఓలు ఓటర్లకు సహకరిస్తారు. ఎన్యూమరేషన్ దశలో ఓటర్లు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని ఓటర్లకు.. జూలై 31– ఆగస్టు 30 మధ్య అభ్యంతరాలు, దరఖాస్తుల సమయంలో మరో అవకాశం కల్పిస్తారు. వారు కొత్తగా ఓటరుగా నమోదు కోసం ఫామ్–6 దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు నియోజకవర్గం లోపల/బయట నివాసం మారిన ఓటర్లు/ వివరాల దిద్దుబాటు/కొత్త ఎపిక్‌కార్డు/ దివ్యాంగ ఓటరుగా గుర్తింపు కోసం ఇదే సమయంలో (ఫారం–8) దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాపింగ్ జరగని ఓటర్లకు నోటీసులు పూర్తి వివరాలు ఇవ్వని ఓటర్లతో పాటు 2002 జాబితాలో పేర్లు లేని/సరిపోల్చలేని ఓటర్లకు జూలై 31 నుంచి సెపె్టంబర్ 28 మధ్యకాలంలో నోటీసులు జారీ చేసి నిర్దిష్ట తేదీన స్థానిక ఈఆర్వో)/ఏఈఆర్ఓల వద్ద విచారణకు పిలిపిస్తారు. అప్పుడు తమ అర్హతలను రుజువు చేసే ఆధారాలను సంబంధిత ఓటర్లు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం నిర్దేశించిన పత్రాల్లో ఏదో ఒకదానిని వారు ఆధారంగా సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్, సీఈఓకు అప్పీల్ అవకాశం... విచారణలో ఈఆర్వోలు/ఏఈఆర్వోలు తీసుకున్న నిర్ణయంపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 24(ఏ) కింద జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. తొలి అప్పీల్లో కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై సెక్షన్ 24(బీ)తో పాటు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960లోని 27వ నిబంధన కింద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ)కు రెండో అప్పీల్ చేయవచ్చు. -
సీఎం రేవంత్ కాన్వాయ్ వాహనాల కుదింపు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సీఎంతో పాటు ఇతర మంత్రుల వాహనాల సంఖ్యలోనూ తగ్గింపు చేసినట్లు తెలిసింది. సీఎం కాన్వాయ్‌లో ప్రస్తుతం 9 వాహనాలు ఉండగా ఆ సంఖ్యను మూడుకు తగ్గించినట్లుగా తెలిసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి భద్రతాధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ ట్రయల్ రన్లో భాగంగా గురువారం తన క్యాంపు ఆఫీసు నుంచి ఎంసీఆర్హెచ్ఆర్డీకి మూడు వాహనాల కాన్వాయ్‌లోనే వెళ్లారు. అయితే, దీనిపై తుది నిర్ణయం ఇంకా జరగలేదని, నేడో, రేపో పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. అదేవిధంగా కేబినెట్ మంత్రుల కాన్వాయ్ లోనూ పైలట్ వాహనాలను తొలగించనున్నట్లుగా సమాచారం. దీంతో మంత్రుల వాహనాల సంఖ్య రెండుకు తగ్గనుంది. ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో దేశంలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ కూడా తన కాన్వాయ్ వాహనాలను కుదించుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు భద్రతా వ్యవహారాలను చూసే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
‘సర్’...ఫికర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పక్షాలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న పిడుగు పడనే పడింది. తెలంగాణతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. గతంలో అసోం, మణిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ నిర్వహించిన సందర్భంగా వచ్చిన ఆరోపణలు, సందేహాల నేపథ్యంలో తమ ఓట్లు జారిపోకుండా ఉండేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. రెడీ అవుతున్న పార్టీలు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఈ సవరణ కేవలం సెక్యులర్ ఓట్లను తొలగించేందుకే చేపడుతున్నారని, ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ అనుకూల ఓట్లను జాబితాలో ఉంచి, మిగిలిన పార్టీల సానుభూతిపరుల ఓట్లను పలు కారణాలతో తొలగిస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ వాదన. తెలంగాణలో ఎస్ఐఆర్ చేపడుతున్నట్టు సీఈసీ చేసిన ప్రకటనతో రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమావేశం కావాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ నిర్ణయించారు.ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డితో పార్టీ నేతలతో కలిసి ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఈ భేటీలో భాగంగా రెండు కీలకాంశాలపై ఎన్నికల సంఘం అధికారులతో చర్చిస్తామని మహేశ్‌గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. ఓటరు జాబితా సవరణ నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకుండే అన్ని సందేహాలను తీర్చిన తర్వాతే తుది ఓటరు జాబితా నిర్ధారించాలనే అంశాలపై మాట్లాడతామని, ఎస్ఐఆర్ విషయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వివరిస్తామని చెప్పారు. ఓటరు జాబితాలో అవకతవకలు జరగకుండా పార్టీ కేడర్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నామన్నారు. ⇒ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా ఎస్ఐఆర్ విషయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు ఇప్పటికే చేపట్టింది. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పార్టీ మద్దతుదారులు, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ఉండేలా గ్రామస్థాయిలో కేడర్‌ను సిద్ధం చేస్తోంది. పోలింగ్ బూత్‌ల వారీగా ఇద్దరు కార్యకర్తలకు ఎస్ఐఆర్పై శిక్షణనిస్తోంది. ⇒ ఎంఐఎం కూడా ఇప్పటికే ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సవరణ కార్యక్రమాన్ని పార్టీ పరంగా ఇప్పటికే చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలోని తమ ఓట్లు జారిపోకుండా ఉండే క్రమంలోనే ఎంఐఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. -
జాగ్రత్తలు ఈవీ.. పేలిపోతున్న వాహనాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగం దేశంలో వేగంగా పెరుగుతోంది. పర్యావరణహిత ప్రయాణ సాధనాలుగా పేర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే అక్కడక్కడా ఈ ఈవీ వాహనాల బ్యాటరీలు పేలిపోతుండటం తెలిసిందే. ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40ని–45ని డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నప్పుడు ఇవి కాలిపోవడం, కొన్ని సందర్భాల్లో వాహనదారులు గాయపడటం లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాల్లో బ్యాటరీ సమస్యలు, వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం.పరిమితికి మించి వేడెక్కినప్పుడు.. ఈవీలలో సాధారణంగా లిథియం–అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఇవి అత్యధిక శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో రసాయనిక మార్పుల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా లిథియం–అయాన్ బ్యాటరీ ప్యాక్‌లో వేలాది చిన్న సెల్స్ ఉంటాయి. చార్జింగ్, డిశ్చార్జింగ్ సమయంలో ఇవి వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఒక సెల్ పరిమితికి మించి వేడెక్కినప్పుడు, ఆ వేడి పక్కన ఉన్న సెల్స్‌కు వేగంగా వ్యాపిస్తుంది. క్షణాల్లో బ్యాటరీ ప్యాక్ పేలిపోయి మంటలు వ్యాపిస్తాయి. చల్లని వాతావరణం లేకపోవడం..విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అనేక లిథియం–అయాన్ సెల్స్ (ప్రధానంగా నికెల్ మాంగనీస్ కోబాల్ట్) చల్లని వాతావరణానికి అనుకూలంగా రూపొందుతాయి. అయితే భారత్‌లో వేసవి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ. అధిక బాహ్య ఉష్ణోగ్రతలకు.. వాహనం నడిపినప్పుడు, ఫాస్ట్ చార్జింగ్ చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే అంతర్గత వేడి తోడై బ్యాటరీ త్వరగా ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. బీఎంఎస్ వైఫల్యంబ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (బీఎంఎస్) అనేది బ్యాటరీకి మెదడు లాంటిది. ఇది ప్రతి సెల్ వోల్టేజ్, కరెంట్, ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తుంది. తక్కువ నాణ్యత గల సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కలిగిన బీఎంఎస్.. సెల్స్ వేడెక్కుతున్నప్పుడు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంలో విఫలమైతే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకుంటాయి.మన దేశంలో భద్రతా చర్యలుకేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి త్వ శాఖ బ్యాటరీ భద్రతను పటిష్టం చేయడానికి ఏఐఎస్–156, ఏఐఎస్–038 నిబంధనలకు సవరణలు తీసుకువచ్చింది. వాటి ప్రకారం.. ⇒ ప్రతి బ్యాటరీ సెల్‌ను బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిబంధనల ప్రకారం సునిశితంగా పరీక్షించాలి. ⇒ ప్రతి బీఎంఎస్ తప్పనిసరిగా ఓవర్–చార్జ్, ఓవర్–డిశ్చార్జ్, ఓవర్–టెంపరేచర్, ఓవర్ కరెంట్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉండాలి. ⇒ ఒక సెల్ కాలిపోయినా, ఆ మంటలు పక్క సెల్‌కు వ్యాపించకుండా ఉండేలా బ్యాటరీ డిజైన్ ఉండాలి. వాహనదారులు సురక్షితంగా బయటపడటానికి కనీసం 5 నిమిషాల సమయం లభించేలా ఉండాలి. ⇒ బ్యాటరీలో అధిక వేడి సంభవించినప్పుడు డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు డిస్ప్లేలో హెచ్చరిక, బీప్ సౌండ్ రావాలి. ⇒ బ్యాటరీ ప్యాక్ తప్పనిసరిగా ఐపీ67 రేటింగ్ కలిగి ఉండాలి. దీనివల్ల ధూళి, వరద నీటిలో మునిగినా షార్ట్ సర్క్యూట్ కాదు.కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఎలక్ట్రిక్ వాహనదారులు కొన్ని ప్రాథమిక నియమాలను పాటించడం ద్వారా బ్యాటరీ ప్రమాదాలను దాదాపు 99 శాతం నివారించవచ్చు. ⇒ వాహనంతో పాటు కంపెనీ ఇచ్చిన లేదా ధ్రువీకరించిన చార్జర్లనే వాడాలి. ⇒ సుదీర్ఘ ప్రయాణం తర్వాత బ్యాటరీ కనీసం 30–45 నిమిషాలు చల్లబడిన తర్వాతే చార్జింగ్కు పెట్టాలి. ⇒ రాత్రంతా చార్జింగ్ పెట్టి వదిలేయడం ప్రమాదకరం. 100% చార్జ్ అయిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. ⇒ ఎండాకాలంలో వాహనాన్ని వీలైనంత వరకు చెట్లు ఇతర నీడ ప్రాంతాల్లో పార్క్ చేయాలి. ⇒ బ్యాటరీ ప్యాక్ చుట్టూ గాలి ఆడేలా చూసుకోవాలి. ముఖ్యంగా డిటాచబుల్ బ్యాటరీలను ఇంట్లో చార్జ్ చేసేటప్పుడు బెడ్రూమ్లు లేదా సులభంగా మంటలు అంటుకునే వస్తువుల (ఎల్పీజీ సిలిండర్లు) దగ్గర పెట్టకూడదు. ⇒ బ్యాటరీ చార్జ్ అవుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు రసాయనాల వాసన, పొగ వచ్చినా, అసాధారణ శబ్దాలు విని్పస్తున్నా, బ్యాటరీ ప్యాక్ ఉబ్బినట్లు అనిపించినా వాహనాన్ని నిలిపివేసి టెస్టింగ్‌కు తరలించాలి. -
నల్లగొండ ఎఫ్‌సీఐ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, నల్లగొండ: పట్టణంలోని గొల్లగూడలో ఉన్న భారత ఆహార సంస్థ (FCI) గోడౌన్లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్‌లోని రికార్డుల గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు రికార్డు రూమ్ అంతటా విస్తరించడంతో లోపల ఉన్న కీలక పత్రాలు, దస్త్రాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ప్రస్తుతం ఒకే ఒక ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండటంతో మంటలను అదుపు చేయడం సిబ్బందికి సవాలుగా మారింది. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి సుమారు రెండు గంటలుగా అధికారులు శ్రమిస్తున్నా ఇంకా అదుపులోకి రావడం లేదు. ఎఫ్‌సీఐ గోడౌన్ పరిధిలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర పొగ వ్యాపించింది. ఊపిరి ఆడక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.వ్యక్తమవుతుఉన్న అనుమానాలుగోడౌన్లోని ఇతర విభాగాలకు కాకుండా, కేవలం కీలక సమాచారం ఉండే రికార్డు రూములోనే మంటలు చెలరేగడంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌సీఐ లావాదేవీలకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు కాలిపోవడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే కోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో పామాయిల్ రైతు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన బయోఫెర్టిలైజర్ స్టాల్ సందర్శకులకు, రైతులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పెద్ద సంఖ్యలో రైతులు స్టాల్‌ను సందర్శించి, సుస్థిర పంట ఉత్పత్తి కోసం జీవ ఎరువులు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించడంపై తీవ్ర ఆసక్తిని కనబరిచారు. దీనిలో భాగంగా సాంకేతిక నిపుణుల బృందంతో రైతులు చర్చించారు. పంట దిగుబడి, నేల సారవంతం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సూక్ష్మజీవ సాంకేతికతల ప్రయోజనాల గురించి ప్రధానంగా చర్చించారు. -
ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2026-2027 అకడమిక్ ఇయర్ నుంచే నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది. ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జూలజీలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్లో 15 మార్కులు, సెకండ్ ఇయర్లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. బోర్డు మ్యాథ్స్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టింది. ఫైనల్ ఎగ్జామ్స్‌లో మ్యాథ్స్ మార్కులు 75 నుండి 60కి తగ్గించింది. ఇంటర్నల్ అసెస్మెంట్లో ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయించారు. హ్యూమానిటీస్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా 20 మార్కులు పొందే అవకాశం కల్పించారు. ఫైనల్ పరీక్షలు 100 మార్కుల బదులు 80 మార్కులకే నిర్వహించనున్నారు. లాంగ్వేజెస్‌లో కూడా ఫైనల్ ఎగ్జామ్స్ 100 మార్కుల బదులు 80 మార్కులకే జరుగుతాయని ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. -
తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు ముందుగానే రుతుపవనాలు
-
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈకారు రేసు కేసులో ఏసీబీ కోర్టు మాజీ మంత్రి కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. అరవింద్ కుమార్, బీఎల్ఎన్రెడ్డికి సైతం సమన్లు పంపింది. జులై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. -
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ: రెండేళ్లలో రూ. 84 వేలకోట్లు!
గత రెండేళ్లలో రూ.84,000 కోట్లకు పైగా పెట్టుబడుల మద్దతుతో, తెలంగాణ జీవ శాస్త్రాల పర్యావరణ వ్యవస్థ సుమారు 145 బిలియన్ డాలర్ల విలువను చేరుకోవడం ద్వారా ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత వేగవంతమైన విస్తరణగా నిలిచింది.పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ (టిఎల్ఎస్ఎఫ్) 7వ బోర్డు సమావేశంలో ఈ పరివర్తనాత్మక పురోగతిని ప్రముఖంగా ప్రస్తావించారు. టిఎల్ఎస్ఎఫ్ సీఈఓ శక్తి ఎం. నాగప్పన్, తన దశాబ్ద కాల పదవీకాలంలో ఈ రంగం సాధించిన వృద్ధిపై సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి మరియు గౌరవనీయ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబుల శక్తివంతమైన నాయకత్వంలో గడిచిన రెండేళ్లు ఒక కీలక మలుపు అని ఆయన నొక్కి చెప్పారు.తెలంగాణాలో 2016 నుంచి జీవశాస్త్ర రంగం దాదాపు మూడు రెట్లు అభివృద్ధి చెందింది. దీనితో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ అండ్ హెల్త్ టెక్ ఆవిష్కరణలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది.ఒక విశేషమైన ఘనత ఏమిటంటే, ప్రపంచంలోని అగ్రగామి పది లైఫ్ సైన్సెస్ కంపెనీలలో తొమ్మిదింటికి చెందిన సాంకేతిక, ఆవిష్కరణ కేంద్రాలకు ఇప్పుడు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ ఘనత సాధించిన, యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉన్న ఏకైక ప్రాంతం ఇదే. పటిష్టమైన విధాన కార్యాచరణ విధానాలు, వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాలు మరియు లక్షిత సంస్థాగత నిర్మాణం వంటివి దీనికి కీలక చోదకాలుగా ఉన్నాయి. ఇవి తెలంగాణను సమగ్రమైన ప్రపంచ పర్యావరణ వ్యవస్థగా సుస్థిరం చేస్తున్నాయి.ఈ పరివర్తన దశలో అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను తీర్చిదిద్ది, విస్తరించడంలో చూపిన నాయకత్వానికి బోర్డు ఏకగ్రీవంగా సీఈఓ శక్తి ఎం. నాగప్పన్‌ను ప్రశంసించింది. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభినందనలను నమోదు చేసింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయనను 'సలహాదారు (లైఫ్‌సైన్సెస్)'గా నియమించిందని, అలాగే ఆయన తెలంగాణ లైఫ్‌సైన్సెస్ ఫౌండేషన్ బోర్డులో కొనసాగుతారని బోర్డు పేర్కొంది. -
బండి భగీరథ్ ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశాడు. భగీరథ్ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. బండి భగీరథ్ ముందస్తు రక్షణ పిటిషన్‌పై విచారణ వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. -
నీట్ పేపర్ లీక్‌పై సీఎం రేవంత్‌రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో స్పందించారు. నీట్ పేపర్ లీక్‌తో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టారని.. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులకు తీవ్ర ఆందోళనలొ ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. మే 3న జరిగిన నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. పేపర్ లీక్, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘కేంద్ర ప్రభుత్వం పారదర్శక దర్యాప్తు చేపట్టాలి. వ్యవస్థ వైఫల్యాలతో అమాయక విద్యార్థులు నష్టపోకూడదు. పోటీ పరీక్షలు అవకాశాలకు మార్గం కావాలి గానీ భయానికి కాదు. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని రేవంత్ ట్వీట్ చేశారు. -
మాటిచ్చాడు.. విమానం ఎక్కించాడు
పెద్దపల్లి జిల్లా: పదో తరగతి వార్షిక పరీక్షల్లో 550 మార్కులు దాటిన విద్యార్థులను సొంత ఖర్చులతో విమానంలో తీసుకెళ్తానని గణతంత్ర దినోత్సవం రోజున ఇచ్చిన మాటను గణిత ఉపాధ్యాయుడు నిలబెట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా గణితం బోధిస్తున్న మల్క రాంకిషన్‌రావు ఇచ్చిన మాట ప్రకారం 564 మార్కులు సాధించిన విద్యార్థి శ్రీమంతుల పూర్ణచందర్‌ను విమానంలో బుధవారం విశాఖపట్నం తీసుకెళ్లారు. అక్కడ వివిధ పర్యాటక ప్రదేశాలు చూపించారు. ఇలాంటి కార్యక్రమాలతో హాజరుశాతం పెరగడంతో పాటు పరీక్షల్లో పోటీ వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. ఐఎఫ్ఎస్కు ఎంపిక.. డీజీపీ సన్మానంసాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ కూతురు చల్లా యామినిని డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం తన కార్యాలయంలో సన్మానించారు. సూర్యాపేట జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చల్లా యాదగిరి కుమార్తె యామిని ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఎంసీఈఎంఈలో ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల వెలువడిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో ఆమెకు 119 ర్యాంక్ లభించింది. ఆమెకు శాంతిభద్రతల డీజీ మహేశ్ భగవత్ మెంటార్‌గా వ్యవహరించారు. -
తెలుగు రాష్ట్రాల్లో.. మూడో దశ ‘ఎస్ఐఆర్’కు ఈసీ ప్రకటన
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో.. మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో తెలుగు రాష్ట్రాలతో కలిపి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది. ఫేజ్-3 ప్రక్రియ కోసం 3.94 లక్షలకుపైగా బూత్‌స్థాయి అధికారుల్ని నియమించింది.ఏపీలో జులై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా.. ఏపీలో సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రకటించనుంది. అదే విధంగా తెలంగాణలో జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఓటర్లు ముసాయిదా.. తెలంగాలో అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది. ఏపీలో ఎస్ఐఆర్ షెడ్యూల్46,397 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం68,868 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్మే 12 నాటికి 4,16,16,061 మంది ఓటర్లుజూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలుజూన్ 14 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలజూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణజూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారంసెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితా విడుదలతెలంగాణలో ఎస్ఐఆర్ షెడ్యూల్35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం25,886 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్మే 12 నాటికి 3,39,20,705 కోట్ల మంది ఓటర్లు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలుజూన్ 24 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలజూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణజూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారంఅక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా విడుదలఈసీ అధికారిని కలవనున్న కాంగ్రెస్ నేతలుహైదరాబాద్: తెలంగాణ పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్యేలు , ఎంపీలు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలవనున్నారు. త్వరలో తెలంగాణలో SIR పక్రియ చేపట్టనున్న నేపథ్యంలో తమకు ఉన్న అనుమానాలను తీర్చాలని ఎన్నికల అధికారిని కాంగ్రెస్ నేతలు కోరనున్నారు. -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది.అమ్మగా మారిన ఎస్ఎన్సీయూపాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్‌ఎన్‌సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు.తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి..50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.పుట్టిన గంటలోనే.. తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జిల్లాలోని లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే పాప ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్‌రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్‌శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్‌నంబర్ ఆధారంగా నరేష్‌కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. -
భార్యపై అనుమానం.. గొడ్డలితో కాలు నరికిన భర్త
సంగారెడ్డి: భార్య కాలును నరికిన భర్తను పోలీసులు జైలుకు పంపించారు. బుధవారం కేసుకు సంబంధించిన వివరాలు పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ వెల్లడించారు. చౌటకూర్ మండలం గంగోజీపేట గ్రామానికి చెందిన కుమ్మరి వీరమణి, దుర్గయ్య భార్యాభర్తలు. వీరిద్దరూ బతుకు దెరువు కోసం సంగారెడ్డిలోని కొత్ల చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానంతో తరచూ దుర్గయ్య గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆవేశంతో దుర్గయ్య ఇంట్లో ఉన్న భార్య కుడికాలును గొడ్డలితో నరికాడు. అలాగే కుడి చేతిపై కూడా గాయపరిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన వీరమణిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారి కుమారుడు హరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని బుధవారం తద్ధాన్పల్లి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు. -
మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై లైంగిక దాడి
హైదరాబాద్: మహిళా కానిస్టేబుల్‌పై కన్నేసిన ఓ ఎస్సై ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమని ఆ లేడీ కానిస్టేబుల్ బలవంతం చేసేసరికి ఎస్సై ఎదురుతిరిగాడు. దీంతో బాధితురాలు కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నెలన్నర కిందట నమోదైన ఈ కేసులో కొల్లూరు ఎస్సైను కూకట్పల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సురేశ్‌కుమార్ 2020లో కూకట్పల్లి ఠాణాలో ఎస్సైగా పనిచేశారు. అదే సమయంలో ఎస్సైకు రైటర్‌గా ఓ మహిళా కానిస్టేబుల్‌ను నియమించారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అప్పటికే తనకు పెళ్లయిందనే విషయాన్ని దాచిపెట్టిన ఎస్సై.. కానిస్టేబుల్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2022 సంవత్సరంలో బోనాల పండుగ సందర్భంగా కూకట్పల్లి చిత్తారమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న క్రమంలో.. ఎస్సై సురేశ్ మహిళా కానిస్టేబుల్ని గుడిలోకి తీసుకెళ్లి ఆమె నుదుటిన బొట్టు పెట్టి మనిద్దరికి పెళ్లి అయిందని నమ్మించాడు. ఆ తర్వాత ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. 2023లో ఎస్సై సురేశ్‌కు కొల్లూరు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయింది. కొంతకాలానికి ఎస్సై సురేశ్‌కు అప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నారని మహిళా కానిస్టేబుల్‌కు తెలిసింది. ఈ విషయమై ఎస్సైని ఆమె నిలదీసింది. దీంతో తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని రెండేళ్ల పాటు కాలాయాపన చేశాడు. ఈ సమయంలో లేడీ కానిస్టేబుల్ గర్భవతి అయింది. దీంతో కంగారు పడిపోయిన ఎస్సై.. ఆమెకు మాయమాటలు చెప్పి అబార్షన్ చేయించాడు. తనను పెళ్లి చేసుకోవాలని కానిస్టేబుల్ బలవంతం చేసేసరికి.. తాను ఎస్సై అని, కానిస్టేబుల్‌ను ఎలా పెళ్లి చేసుకుంటానని ఎదురు తిరిగాడు. దీంతో బాధితురాలు ఏప్రిల్ 1న కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకొని, భార్యాపిల్లలతో సహా పరారయ్యాడు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నెలన్నర తర్వాత పోలీసులు ఎస్సై సురేశ్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఎస్సై సురేశ్‌పై లైంగిక దాడి కేసు నమోదైందని తెలియగానే అతడిని సస్పెండ్ చేసినట్టు శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. -
45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, తెలంగాణ: వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల పాటు వడగాలుల ప్రభాతం సైతం తీవ్రరూపం దాల్చనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయిటకి రాకూడదని తెలిపింది. ఒకవేళ బయిటకి వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
కేంద్రం.. ఆమోదమా? తిరస్కారమా?
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండోదశ పై మరోసారి ఉత్కంఠ నెలకొంది. కేంద్రం అనుమతి కోసం ఇప్పటికే సీఎం రేవంత్ సహా అధికారుల బృందం కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సీఎం మరోసారి ప్రధాని మోదీతో మెట్రో అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ 4 రోజుల వ్యవధిలో రెండోసారి కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏడాది కాలంగా ఈ భేటీలు, సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయి.. .. సీఎం సహా అధికారుల బృందాలు ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు. ఇటీవలి సమావేశాలు మెట్రో రెండో దశపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించినట్లుగా తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎల్అండ్టీ నుంచి టేకోవర్ చేసింది. రుణాల రీఫైనాన్సింగ్‌తో పాటు ఎల్అండ్టీ బకాయిల చెల్లింపు జూన్‌తో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రెండో దశపై కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు కార్యాచరణను వేగిరం చేసింది.ఇంకా ఎన్నాళ్లు..?రెండోదశకు ప్రణాళికలను రూపొందించి, కేబినెట్ ఆమోదంతో దాదాపు 18 నెలల క్రితమే కేంద్రం అనుమతి కోసం డీపీఆర్‌లను అందజేశారు. ఇటీవల పలు నగరాల్లో మెట్రో నిర్మాణానికి కేంద్రం అనుమతులను అందజేసింది. హైదరాబాద్‌లో రెండో దశను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికే రెండో దశలో పేర్కొన్న ‘ఏ’, ‘బి’ విభాగాల కోసం డీపీఆర్‌లను అందజేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి డీపీఆర్‌లు అందలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే మొదటి దశ స్వాధీనంతో పాటు వివిధ అంశాలపై కేంద్రానికి స్పష్టమైన నివేదిక అందజేశారు. రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సమర్పించింది. దాదాపు రూ.48 వేల కోట్లతో అంచనాలను రూపొందించారు. మొదట.. రెండో దశలోనే ఈ కారిడార్లన్నీ పూర్తిచేయాలని ప్రతిపాదించారు. కానీ, ఇటీవల సీఎం రేవంత్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సమావేశమైన సందర్భంగా ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీకి మూడో దశలో చేపట్టాలని కోరారు. మరోపు మెట్రో నిర్మాణానికి జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు అందజేసేందుకు ఏడాది క్రితమే సంసిద్ధత వ్యక్తం చేసినా కేంద్రం నుంచి సావరిన్ గ్యారెంటీ లభించక ప్రతిష్ఠంభన నెలకొంది. గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా.. మెట్రో రెండో దశ పనులతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రారంభించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో ఎన్నికలు సవాల్‌గా మారాయి. పాతబస్తీలో మెట్రో విస్తరణకు భూ సేకరణతో పాటు, రోడ్డు విస్తరణ చేపట్టారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గాన్ని మొదట పూర్తి చేయనున్నారు. కానీ, రెండో దశపై కేంద్రం స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. దీంతో హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఢిల్లీకి ప్రదక్షిణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
బండి భగీరథ్ కేసు.. వాట్ వాట్ నెక్స్ట్?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో కరీంనగర్, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రమంతా గాలిస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఠాణాలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భగీరథ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. లుక్ ఔట్ నోటీసులు (ఎల్ఓసీ) జారీ చేసే విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పట్నుంచీ నిందితుడు పరారీలోనే ఉన్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే భగీరథ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగనుంది.ఫోరెన్సిక్ ల్యాబ్‌కు బాధితురాలి ఫోన్ బాధితురాలైన మైనర్ బాలిక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ ఇతరత్రా కీలకాంశాలను తెలుసుకునేందుకు ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికను ఫామ్ హౌస్ తీసుకెళ్లే ముందు జరిగిన చాటింగ్, లొకేషన్ షేరింగ్, కాల్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ మొత్తం సేకరించనున్నారు. భగీరథ్ పరారీలోనే ఉండటంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతోనే దర్యాప్తును సాగిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిన మొయినాబాద్ ఫామ్‌హౌస్, పరిసర ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాలను, సెల్‌ఫోన్ సిగ్నల్స్, లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు విశ్లేషించారు. భగీరథ్‌తోపాటు పలువురు స్నేహితులు కూడా ఫామ్‌హౌస్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్నేహితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు.విచారణకు సహకరిస్తా: బండి భగీరథ్పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఆలస్యంగా సాయంత్రం 6 తర్వాత భగీరథ్ స్పందించారు. ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)కు లేఖను పంపారు. తాను నోటీసును అందుకున్నానని, కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తక్కువ సమయంలో పోలీసులు నోటీసులు ఇవ్వడం, అలాగే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయానని వివరించారు. తనపై, తన కుటుంబంపై వచి్చన ఆరోపణలు తప్పుడువని.. వీటిని నిరూపించేందుకు కీలక పత్రాలు, సమాచారాన్ని సేకరించి పోలీసులకు సమరి్పంచడానికి తనకు కనీసం రెండు రోజుల సమయం కావాలని కోరారు. గడువు ముగిసిన వెంటనే దర్యాప్తు అధికారి ముందు హాజరై పూర్తి వివరాలు అందజేస్తానని పేర్కొన్నారు.పోక్సో కేసును కావాలని బలహీనపరిచారు: బీఆర్ఎస్కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసును పోలీసులు ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారని బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు విమర్శించారు. బాధిత బాలికపై లైంగిక, మానసిక వేధింపులు, డిజిటల్ వేధింపులకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, పేట్ బషీరాబాద్ పోలీసులు నామమాత్ర సెక్షన్లతో కేసు పెట్టడాన్ని వారు ప్రశ్నించారు. పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్లకు బదులుగా సాధారణ సెక్షన్లతో కేసు పెట్టడంతో పాటు కొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడాన్ని నిలదీశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుల ఉమ తదితరులు బుధవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కుమారుడిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం, మొబైల్ ఫోన్లు, చాట్లు, వీడియోలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకోకపోవడం తదితరాలు విచారణపై అనుమానాలు పెంచుతున్నాయన్నారు. అలాగే కరీంనగర్లో మంగళవారం జరిగిన హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆరోపించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, సాక్షులకు వెంటనే రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్‌తో పాటు కేసులో ఉన్న ఇతరులను అరెస్టు చేయడం, వారిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయడం, సంబంధిత పోలీస్ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టడం సహా మొత్తం ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీజీపీకి సమర్పించినట్లు మహిళా నేతలు వెల్లడించారు.విదేశాలకు పారిపోకుండా చూడాలి: కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణల నేపథ్యంలో ఆయన విదేశాలకు పారి పోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుమారుడిపై ఆరోపణలు వచి్చనా, ప్రధానితో వేదికను బండి సంజయ్ పంచుకోవటం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు మరో సారి మొండిచెయ్యి చూపించారని చేశారు. తెలంగాణ పర్యటనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తారని భావించినా, మనకు పొదుపు సూత్రాలు చెప్పి... ఆంధ్రాకు పైసలు ఇచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్ రోకో చేసిన కేసులో కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కోర్టు మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేయడంతో వ్యక్తిగతంగా హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ జూలై 17న నిర్వహిస్తామని మేజిస్ట్రేట్ ప్రకటించారు. -
ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌కు 'ఔటర్ రింగ్ రోడ్డు'
సాక్షి, హైదరాబాద్: ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాలను వృద్ధి కేంద్రాలుగా మార్చడంలో భాగంగా మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం అధికారులతో సమీక్షించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ కేంద్రంగా అభివృద్ధికి బాటలు వేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని సీఎం ఆదేశించారు. రాబోయే ఎయిర్‌పోర్టులను దృష్టిలో ఉంచుకొని రోడ్లు నిర్మించాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ టి.కె.శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈవీలే లీజుకు తీసుకోవాలి.. ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని, లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలలో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, పట్టణ కేంద్రంగా డెవలప్మెంట్ ప్లానింగ్ ఉండాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అర్బన్ ప్లానింగ్‌లో తప్పనిసరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టెంపుల్ కారిడార్.. నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్ట్‌లను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లలను కలిపి కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి కారిడార్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. – వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడాడ్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకం అని సీఎం అన్నారు. ఎయిర్పోర్ట్ రాకతో ఈ ప్రాంతం రూపు రేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కాంటా వేయరు 'లోడ్ ఎత్తరు'!
సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెలరోజులు దాటింది. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 14 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో 600 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి బస్తాల్లో నింపి కుట్టిపెట్టారు. కానీ ఐదు రోజులుగా లారీలు రాకపోవడంతో ఆ ధాన్యం అక్కడే అలాగే ఉంది. ఈ కేంద్రంలో 15 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. కానీ లారీలు రాక కొనుగోలు చేసిన ధాన్యం ఎగుమతి కాకపోవడంతో రెండు రోజులుగా కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సకాలంలో అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు తెరిచామని, భారీగా ధాన్యం సేకరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెల దాటినా కొనుగోళ్లు ఊపందుకోవడం లేదని, కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ధాన్యం తీసుకోవడం లేదని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యాన్ని కాంటా వేయడం, కాంటా వేసిన ధాన్యాన్ని లారీలకు ఎత్తడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం సరిగా లేదని, హమాలీల కొరత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. రైతుల ఆందోళనకు తగినట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, పీఏసీఎస్‌లు ధాన్యం రాశులతో నిండిపోయి కన్పిస్తున్నాయి. అకాల వర్షాలు కురుస్తుండటంతో, తమ పంట ఎక్కడ తడిసి ముద్దవుతుందోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్ వంటి చాలా జిల్లాల్లో రాశులు పోసిన ధాన్యం తడిచిపోయిన ఘటనలు వెలుగు చూశాయి. ధాన్యం తడవకుండా తగిన సంఖ్యలో టార్పాలిన్లు సరఫరా చేయడంలో పౌరసరఫరాల సంస్థ విఫలమవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. మక్కలు, జొన్నల కొనుగోళ్ల పరిస్థితీ ఇదేనని రైతులు వాపోతున్నారు. లక్ష్యంలో మూడో వంతే..! ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 8,500 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొన్ని జిల్లాల్లోని మండలాల్లో పేరుకు కొనుగోలు కేంద్రాలే తప్ప, అక్కడ కొనుగోళ్లు సాగడం లేదు. ఇప్పటివరకు కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. అంటే లక్ష్యంలో మూడో వంతు మాత్రమే పూర్తయ్యిందన్నమాట. జూన్ నెల సమీపిస్తుండటంతో ఖరీఫ్ పనులు మొదలయ్యే సమయం ఆసన్నమైనా, ఇంకా రబీ పంట కొనుగోళ్లే పూర్తి కాకపోవడం గమనార్హం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి 15 రోజులకు పైగా రైతులు నిరీక్షిస్తున్న పరిస్థితి చాలా జిల్లాల్లో ఉంది. మంగళవారంముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఇంకా కదిలిన దాఖలాలు కన్పించడం లేదు. అన్నీ సమస్యలే.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయడమే ఒక ప్రహసనమైతే, వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం మరో పెద్ద యుద్ధంలా మారింది. లారీలు రాక రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఒకవేళ మిల్లుకు ధాన్యం చేరినా, అక్కడ మిల్లర్లు పెట్టే ఆంక్షలతో రైతులు బిక్క ముఖం వేస్తున్నారు. తరుగు, తాలు, తేమ శాతం పేరుతో యధావిధిగానే కోతలు విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి, నల్లగొండ, సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయగానే రైతుతో లావాదేవీలు ముగియాల్సి ఉండగా, మిల్లులకు వెళ్లిన తరువాత తాలు, నల్లబడ్డ ధాన్యం పేరుతో తరుగు పేరిట నాలుగైదు కిలోల ధాన్యాన్ని తరుగుగా తీసే విధానం ఇంకా కొనసాగుతోందని పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన మల్లయ్య అనే రైతు తెలిపారు. ధాన్యం ఎత్తుకోవడానికి, దించుకోవడానికి సవాలక్ష సాకులు చెబుతూ లారీలను రోజుల తరబడి నిలిపివేస్తున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మక్కల సేకరణలో మార్క్‌ఫెడ్ విఫలం! వరి రైతుల పరిస్థితి ఇలా ఉంటే, మొక్కజొన్న (మక్కలు) పండించిన రైతుల గోస వర్ణనాతీతం. రాష్ట్రంలో రబీలో పెరిగిన మక్కజొన్న సాగు నేపథ్యంలో ఈసారి సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. అయితే మక్కల కొనుగోళ్లలో మార్క్‌ఫెడ్ అపసోపాలు పడుతోంది. ఒక్కసారిగా భారీ ఎత్తున మార్కెట్‌కు వచ్చిన మక్కలను కొనుగోలు చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటివరకు మార్క్‌ఫెడ్ ఎండీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని ఇటీవలే తప్పించిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను నియమించింది. అయితే కొన్ని జిల్లాల్లో పాతుకుపోయిన మార్క్‌ఫెడ్ మేనేజర్లు కొనుగోళ్లు చేయలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆఫీసుల్లో కూర్చొని అవినీతి కార్యకలాపాలు సాగించేందుకు అలవాటు పడిన అధికారులు మక్కల కొనుగోళ్లు చేయలేకపోతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మక్కలు కొనడానికి కనీసం గోనె సంచులు సమకూర్చుకోలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెబుతున్నారు. మార్క్‌ఫెడ్ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2.97 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా, అతికష్టంమ్మీద 1.83 కోట్లు మాత్రమే సమకూర్చుకోగలిగారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 8.56 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. చాలా చోట్ల సంచులు లేక కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. నాగర్‌కర్నూలు, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, కొత్తగూడెం ప్రాంతాల్లో కొనుగోళ్ల కోసం రైతులు మార్కెట్ యార్డులు, పీఏసీఎస్‌లలో ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొంది. తగిన సంఖ్యలో గోదాములు లేకపోవడం కూడా సమస్యగా మారింది. ప్రైవేటుకు అమ్ముకుంటున్నాను.. 70 క్వింటాళ్ల మక్కలు రూ.1,750 చొప్పున ప్రైవేటుగా అమ్ముకున్నా. ఇంకా 50 కింటాళ్లు ఉన్నాయి. వాటిని కూడా ప్రైవేట్‌గానే అమ్ముతా. ప్రభుత్వానికి అమ్మాలంటే చాలారోజుల సమయం పడుతుంది. ఇంటిదగ్గర గొర్లు, పశువులు ఉన్నాయి. వాటి వెంబడి వెళ్లేవారు ఎవరూ లేరు. అందుకే ప్రైవేటుకు అమ్ముకుంటున్నా. – మల్లేష్, దేశీటికాల, నాగర్ కర్నూల్. మొక్కజొన్న ఎప్పుడు కొంటారో చెప్పడం లేదు.. నేను నాగర్‌కర్నూల్ మార్కెట్‌యార్డ్‌కు మొక్కజొన్న పంటను తీసుకొచ్చి నెల రోజులు దాటింది. సుమారు 200 క్వింటాళ్ల పంటను అమ్ముకునేందుకు రోజూ మార్కెట్ యార్డుకు వస్తున్నాను. కానీ ఫలితం లేదు. కనీసం ఎప్పుడు కొనుగోలు చేస్తారో కూడా అధికారులు చెప్పడం లేదు. – సిక్కొండ రాములు, మంతటి, నాగర్ కర్నూల్ మండలం -
మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం.. రోప్ తెగి కిందపడ్డ లిఫ్ట్
కరీంనగర్, సాక్షి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ఆస్పత్రి లిఫ్ట్‌లో దిగుతుండగా దురదృష్టవశాత్తు లిఫ్ట్ రోప్ తెగింది. దీంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడడంతో అందులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను వెంటనే అందులో నుంచి బయిటకి తీశారు. అనంతరం గాయాలకు చికిత్స అందించారు. కాగా ఇటీవల లిఫ్ట్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. -
సిట్‌కు బండి భగీరథ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ లేఖ రాశారు. ఎల్లుండి(శుక్రవారం) విచారణకు హాజరవుతానన్న బండి భగీరథ్.. కీలక ఆధారాలతో వస్తానని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. విచారణకు హాజరై అవసరమైన సమాచారం, పత్రాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. అయితే చాలా తక్కువ సమయం ఇచ్చిన కారణంగా ఇవాళ(మే 13) హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు...వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా విచారణకు రావడం సాధ్యం కాదన్న భగీరథ్.. అవసరమైన డాక్యుమెంట్లు, వివరాలు సేకరించడానికి రెండు రోజుల గడువు ఇవ్వాలని పోలీసులను కోరారు. తనపై, తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు తప్పుడువంటూ లేఖలో భగీరథ్ ప్రస్తావించారు. నిష్పాక్షిక దర్యాప్తు కోసం రెండు రోజుల సమయం మంజూరు చేయాలంటూ సిట్‌కు విజ్ఞప్తి చేశారు.కాగా, ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో కేసు విచారణకు ఇవాళ బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. ఈ కేసులో నిందితుడైన బండి భగీరథ ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎల్లుండి హాజరవుతానంటూ సిట్‌కు భగీరథ్ లేఖ రాశారుకుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్‌కు తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. -
పాదచారులపైకి దూసుకొచ్చిన స్కార్పియో.. ఒకరు మృతి
రాజన్న సిరిసిల్లా జిల్లా, సాక్షి: గంభీరావుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గజ సింగవరం స్టేజివద్ద ఓ స్కార్పియో ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందంది. మరో మహిళతో పాటు బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాద వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డ్రైవర్ నిర్లక్షం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
చుక్కలు చూపిస్తున్న చికెన్ ధర
-
విద్యార్థిగా మారిన మావోయిస్టు మాజీ అగ్రనేత
సాక్షి, జగిత్యాల జిల్లా: మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ విద్యార్థిగా మారిపోయారు. కోరుట్లలో నాలుగు దశాబ్దాల అనంతరం ఇవాళ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ అన్ని పరీక్షలు పాసైనా.. తెలుగు పరీక్ష తప్పిన దేవ్ జీ.. 1984- 1985లో ఇంటర్ చదివే రోజుల్లో విప్లవ భావజాలానికి ఆయన ఆకర్షితుడయ్యారు.కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన దేవ్ జీకి పరీక్ష రాసేందుకు ఇంటర్ బోర్డు నుంచి అనుమతి లభించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఎగ్జామ్ రాశారు. లాయర్ కావాలన్న ఉద్దేశంతో మళ్లీ పరీక్ష రాసినట్లు దేవ్‌జీ తెలిపారు. పరీక్షలు పాస్ కావాలని ఆయన కొద్ది రోజులుగా తిరుపతి ప్రిపేరవుతున్నారు. -
పోక్సో కేసు.. సిట్ విచారణకు బండి భగీరథ్ డుమ్మా
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసు విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ గైర్హాజరయ్యాడు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ బుధవారం మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరీంనగర్లో బండి సాయి భగీరథ మేన మామ డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణకు మంగళవారం పేట పేట్‌బషీరా బాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన భగీరథ్ హాజరు కాలేదు. దీంతో బండి భగీరథ్ చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందిపోక్సోకేసు విచారణకు హాజరు కాకపోతే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS, 2023) చట్టాల ప్రకారం, పోక్సో కేసులో సిట్ విచారణకు హాజరు కాకపోతే నిందితులెవరైనా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో అరెస్టు వారెంట్ జారీ చేయడం, మధ్యంతర బెయిల్ రద్దు కావడం, పరారీలో ఉన్నవాడిగా గుర్తించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం, కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. సిట్ విచారణకు హాజరు కాకపోతే మరిన్ని చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుత్బుల్లాపూర్ లోని సుచిత్రలో నివసించే 17 ఏళ్ల బాలికపై భగీరథ అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశాడని ఈనెల 8న ఆ బాలిక కుటుంబసభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు నమోదైన నాటి నుంచి నిందితుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడు.బండి భగీరథపై అదనపు సెక్షన్లు నమోదు..కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణాధికారిగా సిట్ ఏర్పాటు చేశారు. బండి భగీరథపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్యువల్ అఫెన్సెస్ (పోక్సో)లోని సెక్షన్ 11 ఆర్/డబ్ల్యూ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లను పరిశీలించిన డీసీపీ రితిరాజ్ మంగళవారం బాధితురాలిని మరోసారి విచారించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడు భగీరథపై అదనపు సెక్షన్లను జోడించారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు సంబంధించిన సెక్షన్లను సూచించే పోక్సో-2012 చట్టంలోని సెక్షన్ 5(ఐ)ను జోడించారు. -
తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
హనుమకే అరటి దండ దక్కితే!
హైదరాబాద్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నగరంలోని రామాలయాలు, అంజన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. కూకట్‌పల్లిలో హనుమంతుడిని ప్రత్యేకంగా అరటి పండ్ల దండలతో ఇలా అలంకరించారు. – కూకట్పల్లిఅధికారులే అడ్డంపడితే..!ఆ రహదారులు.. అధి‘కారు’లకు అడ్డాగా మారాయి. ఇతర వాహనదారులకు ఆటంకంగా ఉన్నాయి. గీతానగర్‌లోని మల్కాజిగిరి సర్కిల్, జోనల్ కార్యాలయాలున్న భవనం ముందున్న రహదారులు పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. – మల్కాజిగిరి గాం«దీలో అగ్గి పుడితే..సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో అసిస్టెంట్ డిస్టిక్ట్ ఫైర్ ఆఫీసర్ భాను ప్రతాప్ నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన ఫైర్‌సేఫ్టీ అవేర్నెస్, మాక్ ఎవాక్యుయేషన్ డ్రిల్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి, ఫైర్‌స్టేషన్ ఆఫీసర్లు మహ్మద్ షౌకత్ అలీ, రమే‹Ù, భిక్షపతి పాల్గొన్నారు. – గాం«దీఆస్పత్రి -
మమత ఎక్కడ..? ఇద్దరు పిల్లలతో అదృశ్యం
పటాన్చెరు టౌన్: తల్లీ ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మల్లన్న దేవస్థానం సమీపంలోని ఎండీఆర్ హోమ్స్‌లో నివాసం ఉండే నాగిరెడ్డి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతడి భార్య మమత (28), కుమారుడు శివరాం రెడ్డి, కూతురు బృందన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కాగా వారి కోసం తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. మరో ఘటనలో..శివ్వంపేట(నర్సాపూర్): తల్లీ, కూతురు అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గోమారం గ్రామానికి చెందిన ఎరుకలి మమత, పెంటయ్య దంపతులకు సంసార విషయంలో వారం నుంచి గొడవలు జరుగుతున్నాయి. సోమవారం పెంటయ్య ధాన్యం బస్తాలు తీసుకుని కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లగా, భార్య మమత, కూతురు అఖిల కూరగాయలు విక్రయించేందుకు మార్కెట్‌కు వెళ్తున్నామని చెప్పి రాత్రి వరకు ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన పెంటయ్య బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. -
చికెన్ కిలో ధర రూ.400..!
జోగిపేట(అందోల్): కోడి ధర కొండెక్కింది. ఈ నెల 1న కిలో రూ.259గా ఉన్న ధర ఆదివారం రూ.360కి పెరిగింది. పది రోజుల్లోనే కిలోపై రూ.100 పెరగడం గమనార్హం. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల పెరుగుదల అదనపు భారంగా మారుతోంది. వేసవి కావడంతో ఎండలకు కోళ్లు చనిపోతున్నాయని, వాటి బరువు కూడా తగ్గిపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరలను చూసి కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ ధరలు మరో 15 నుంచి 20 రోజుల పాటు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తగ్గిన ఉత్పత్తి ఎండలకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపడం లేదు. అధికంగా కంపెనీల యజమానులే షెడ్లలో కోళ్లను పెంచి, వారు నిర్ణయించిన ధరకే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమని చెప్పొచ్చు. స్కిన్లెస్ కిలో రూ.360కి, లైవ్ కోడి రూ.210, స్కిన్‌తో రూ. 320కి అమ్ముతున్నారు.పెళ్లిళ్ల సీజన్‌తో డిమాండ్ పెళ్లిళ్ల సీజన్‌తో చికెన్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అంతే కాకుండా ఎండ త్రీవత కారణంగా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. డిమాండ్ మేర ఉత్పత్తి లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగాయి. రెండు వారాల నుంచి కోళ్ల, చికెన్ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.360కి విక్రయిస్తున్నాం. ధరలు పెరగడంతో కొంతమేరకు విక్రయాలు తగ్గాయి. – ఎండీ. జావీద్, విక్రయదారుడు, జోగిపేట -
సిటీలో దారుణం.. నేపాలీ పని మనుషులతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జవహర్‌నగర్‌లో నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ గ్యాంగ్.. ఓనర్ దంపతుల చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, రూ.30వేల నగదు చోరీ చేశారు. వరుస ఘటన నేపథ్యంలో పని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని పలువురు చెబుతున్నారు.వివరాల మేరకు.. జవహర్‌నగర్‌లోని కౌకుర్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గల్ప్ ఎన్‌క్లేవ్‌లో దంపతులు చేతులు, కాళ్లు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ విజయలక్ష్మీ దంపతులకు మత్తు మందు ఇచ్చి దోపీడి చేశారు. కాగా, నేపాలీ గ్యాంగ్ 13 రోజుల క్రితమే వారి ఇంట్లో పని మనుషులుగా చేరారు. అయితే, నేపాలీ మహిళ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటామని డాక్టర్ దంపతులను కోరడంతో వారు అందుకు అంగీకరించారు. ఈ క్రమంలో పని మనుషుల బంధువుల పేరుతో మరో ముగ్గురు నేపాలీలు ఇంట్లోకి వచ్చారు. అనంతరం.. ఇంట్లో పనిచేస్తున్న వారితో పాటు మరో ఐదుగురు కలిసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ దంపతులకు మత్తు మందు ఇవ్వడంతో వారు నిద్రలోకి వెళ్లారు. దీంతో, ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, రూ.30వేల నగదు చోరీ చేశారు. దోపిడీ సమయంలో సదరు ముఠా.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది. ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసి పరారీ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో నిందితులు కూడా నేపాలీలు కావడం తెలిసిన విషయమే. ఈ హత్య కేసులో కీలక సూత్రధారి కల్పన అలియాస్ ధర్మ (30) నేపాలీ గ్యాంగ్ స్కెచ్‌లో భాగంగానేహైదరాబాద్కు వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులకు బెంగళూరులోని ఆమె భర్తగా పేర్కొంటున్న వ్యక్తితో ఎక్కువగా మాట్లాడిందని, అతడితో పాటు మరికొంతమంది వ్యక్తులతో సైతం ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. వారందరిపై పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో కల్పనను ఉద్యోగంలో నియమించిన వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.కల్పన తల్లిదండ్రులు పూణేలో నివాసం ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని సైతం ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. నేపాల్ సరిహద్దులు దాటేందుకు యూపీలోని మూడు ప్రాంతాల్లో అవకాశం ఉండగా, అక్కడకు ఇప్పటికే చేరుకున్న పోలీసులు వారికోసం కాపు కాస్తున్నారు. కాగా తనూజరంజన్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. నేపాల్‌లో ఉంటూనే భారత్‌లో వందలాదిమంది నేపాలీ వ్యక్తులను పావులుగా వాడుకుంటూ చోరీలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు విదేశీ వ్యవహారాలశాఖ సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం దిశగా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి గ్రేటర్లో ఎంఎంటీఎస్ రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఉచిత సేవలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వేకు ఏటా రూ.10 కోట్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదనపైన దక్షిణమధ్య రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ రైల్వేబోర్డు ఆమోదిస్తే తప్ప తాము ఈ సదుపాయాన్ని కల్పించలేమని, రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేబోర్డు మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదరాల్సి ఉంటుందని చెబుతున్నారు. రైల్వే బోర్డుకు సమాచారం లేదు! ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు సుమారు 75 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. 35 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం కొంత మేరకు తగ్గవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణాత్మకంగానే ఉన్నప్పటికీ రైల్వేబోర్డుకు ఇంకా సమాచారం అందజేయలేదు. ఇప్పటికిప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేసినా రైల్వేబోర్డు పరిశీలించి నిర్ణయం తీసుకొనేందుకు కొంత సమయం పట్టవచ్చు. పైగా ఎంవోయూ కూడా కుదుర్చుకోవలసి ఉంటుంది. జూన్ 2 లోపు ఇదంతా సాధ్యం కాకపోవచ్చుననిపిస్తోంది..’అని దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పైగా ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్రం నుంచి రావలసిన రూ.460 కోట్లకు పైగా బకాయీలపైనా స్పష్టత రావలసి ఉందని ఆయన అన్నారు. రెండోదశ నిధులే ఇవ్వలేదు..! హైదరాబాద్‌లో లోకల్ ట్రైన్ సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో ఎంఎంటీఎస్ ప్రాజెక్టును 2003లో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు, రైల్వేశాఖ 1/3 వంతు చొప్పున భరించాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు మొదటి దశ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. 2013లో ఇదే ఒప్పందం ఆధారంగా రెండోదశను ప్రారంభించారు. కానీ ప్రభుత్వం తన వాటా నిధులను పూర్తిగా చెల్లించలేదు. దీంతో ఈ ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే సొంతంగా పూర్తి చేయవలసి వచ్చింది. ప్రస్తుతం ఘటకేసర్ నుంచి రాయగిరి వరకు చేపట్టిన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులను కూడా దక్షిణ మధ్య రైల్వే సొంత నిధులతో చేపట్టింది. ఇదిలావుండగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తెరపైకి తేవడంతో..ఇప్పటివరకు రెండో దశ నిధులను చెల్లించకపోవడాన్ని రైల్వే అధికారులు ప్రధానంగా ఎత్తిచూపుతున్నారు. సమయ పాలన మెరుగుపరచాలి ఎంఎంటీఎస్ రైళ్లలో సమయ పాలన మెరుగుపడి, సర్వీసులు పెంచితేనే ప్రయాణికులకు ఉచిత సదుపాయం సద్వినియోగమవుతుందని హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ (హుమ్టా) అధికారులు భావిస్తున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు చొప్పున అందుబాటులో ఉండాలని, అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లకు సిటీబస్ కనెక్టివిటీ కల్పించాలని సూచిస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ బస్ సేవలను సమన్వయం చేయడంపై సంస్థ ప్రణాళికలను రూపొందించింది. -
తెలంగాణకు 23 ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో కనీస నిల్వమట్టానికి (ఎండీడీఎల్) ఎగువన మిగిలి ఉన్న 5.27 టీఎంసీల జలాలను పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. నాగార్జునసాగర్ జలాశయంలో ఎండీడీఎల్‌కి ఎగువన 28.21 టీఎంసీల నిల్వలు మిగిలి ఉండగా, ఏపీ తాగునీటి అవసరాలకు కుడి కాల్వ ద్వారా 10 టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించింది. మిగిలిన 18.21 టీఎంసీలను సాగర్ ఎడమ కాల్వ ద్వారా తెలంగాణకు విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 23.48 టీఎంసీల జలాలను త్రిసభ్య కమిటీ కేటాయించింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కంబోజ్ అధ్యక్షతన మంగళవారం జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. వేసవి తాగునీటి అసవరాల కోసం ఇరు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులపై ఈ భేటీలో చర్చించారు. వేసవి అవసరాలకు విన్నపాలు: మే 31 నాటికి ఉండనున్న తమ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి కాల్వకు 10 టీఎంసీల జలాలను విడుదల చేయాలని గతంలో కృష్ణా బోర్డుకు ఏపీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు, హైదరాబాద్ నగరం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 13 టీఎంసీలు.. మొత్తంగా 18 టీఎంసీల జలాలను జూలై చివరి నాటికి వాడుకుంటామని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కాగా ఏపీ విజ్ఞప్తిపై మంగళవారం నాటి భేటీలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో 1112.66 టీఎంసీల కృష్ణా జలాలు లభ్యతలోకి ఉండగా, ఏపీ ఇప్పటికే ఏకంగా 771.25 టీఎంసీలు (74.23శాతం) వాడుకుందని కమిటీ దృష్టికి తెచ్చింది. అయితే వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ పరస్పరం సహకరించుకోవాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సూచించడంతో ఈ మేరకు కేటాయింపులకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. -
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్ల పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో వంద శాతం తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, పార్టీ నేతలు ఇంటికి పరిమితం కాకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలో జనంతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. మంగళవా రం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్ష తన పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్‌రావుతో పాటు శాసనసభ, శాసన మండలిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు 7 గంటల పాటు సాగిన సమావేశంలో కేసీఆర్ కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భేటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేతల పనితీరును గమనిస్తున్నాం ‘క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరును నిశితంగా గమనిస్తున్నాం. పనిచేయని వారిని పక్కన పెడతాం. ప్రజా సమస్యలపై స్పందిస్తూ కష్టపడి పనిచేసే వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. సీఎం రేవంత్ గుజరాత్ మోడల్‌ను పదే పదే వల్లె వేస్తున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గుజరాత్ మోడల్‌ను మించి ఫలితాలు సాధించాం. జాతీయ స్థాయిలో అనేక సూచీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రభుత్వానికి నిధుల సమీకరణ, వనరుల వినియోగం వంటి అంశాలపై ఏ మాత్రం అవగాహన లేదు. పాలన చేతకాక కాంగ్రెస్ క్రమంగా కనుమరుగవుతోంది..’ అని కేసీఆర్ చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి సమన్వయకర్త రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణ వంటి అంశాలపైనే కేసీఆర్ ఎక్కువగా మాట్లాడినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆయా అంశాలపై నేతల అభిప్రాయాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పద్ధతిలోనే పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని ఆదేశించారు. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో పాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటల్ పద్ధతిలోనే జరపాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ నమోదు సమన్వయకర్తను నియమించాలి. కార్యకర్తలకు శిక్షణ అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహిచేందుకు ‘సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండుమూడు రోజుల్లో నియమించాలి. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేస్తున్నందున రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్‌లకు బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాలు కొనసాగుతాయి..’ అని కేసీఆర్ తెలిపారు. సభ్యత నమోదు కోసం ఇన్చార్జిలను ప్రకటించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు పలువురు కూడా పాల్గొన్నారు. -
కలెక్టర్లపైనా చర్యలకు వెనుకాడం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను మిషన్ మోడ్‌లో పనిచేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పరిష్కరించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకూ ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై రేవంత్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి ‘గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి. రవాణా శాఖ కమిషనర్ ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలి. ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దు. అవసరమైతే స్థానికంగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలి. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకూడదు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సీఎస్‌కు నివేదికలు పంపాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను వాడుకోండి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు మిల్లుల్లో స్థలం సరిపోవడం లేదని అంటున్నారు. చాలా ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను తీసుకుని ధాన్యాన్ని అక్కడికి తరలించాలి. తర్వాత పరిస్థితిని బట్టి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి..’అని సీఎం ఆదేశించారు. అకాల వర్షాల నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ ‘అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలి. కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలి. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలి. వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మిల్లు వద్ద ఒక అధికారి ఉండాల ప్రతి ఐకేపీ సెంటర్‌కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి. ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలి. ధాన్యం లోడింగ్‌లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలి. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు ఇవ్వాలి. అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చు..’అని ముఖ్యమంత్రి అన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి: మంత్రి ఉత్తమ్ ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో జిల్లాల్లో ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి సహకారం అందించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పొరుగు రాష్ట్రాల ధాన్యంతో సమస్యలు: మంత్రి తుమ్మల సరిహద్దు రాష్ట్రాల రైతులు కొంతమంది ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, దీంతో కొన్నిచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అలా ధాన్యం రాకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
6 గంటలు చర్చించిన కేసీఆర్.. కీలక నిర్ణయాలు
ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు, వోటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వాన్ని కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిజిటలైజేషన్ పద్ధతిలో జరపాలని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయ పడ్డారు.ప్రతి నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి మండలానికి, మున్సిపల్ బాడీల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి, సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండు మూడు రోజుల్లొ నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.డిజిటలైజేషన్ పద్దతిలో సభ్యత్వ నమోదు చేయాలని అనుకుంటుండడంతో రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్ లలో, బూత్ కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణాతరగతులు నిర్వహించాలని, ఈ సందర్భంగా డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలపై శిక్షణ ఇవ్వాలని సమావేశం అభిప్రాయ పడింది.సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం నియమించిన ఇన్చార్జిల వివరాలుఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు- తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎల్సీ, ప్రధాన కార్యదర్శిజగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శిములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శిజనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు - పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శిమెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు- గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శినిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు- గంగాధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శిమంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు- నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శిఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు- రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శివికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు- సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేమహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలు — మహమూద్ అలీ, మాజీ మంత్రిగద్వాల్,నాగర్‌కర్నూల్,వనపర్తి జిల్లాలు— మెట్టు శ్రీనివాస్, కార్యదర్శిమేడ్చల్-మల్కాజిగిరి,యాదాద్రి జిల్లాలు — పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్హైదరాబాద్ జిల్లా— తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యేనల్గొండ, సూర్యాపేట జిల్లాలు — ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి -
బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సిట్ బృందం బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది. పోక్సో కేసులో నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో రేపు మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరు కావాలని సూచించింది.భగీరథ్‌ను వెంట తీసుకుని రావాలని కరీంనగర్లో నివసించే అతని మేనమామ వంశీ కృష్ణకు పోలీసులు నోటీసులు పంపించారు. మరోవైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి విచారణకు రానుట్లు తెలుస్తోంది. భగీరథ్.. తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోమవారం (మే11,2026)న భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు మెమో జారీ చేసింది. ‘‘సైబరాబాద్ కూకట్పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ పెట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 684/2026లో బీఎన్ఎస్ 74, 75 సెక్షన్లు, పోక్సో 12 సెక్షన్ కింద నమోదైన కేసు దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాం.దర్యాప్తు సరైన, నిష్పాక్షిక, వృత్తిపరమైన విధానంలో సాగేటట్లు చూసి, కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి తప్పుదారి పట్టింపు లేకుండా పరిశీలించాల్సిందిగా ఆమెకు ఆదేశాలు ఇచ్చాం. దర్యాప్తు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతిరోజూ దర్యాప్తు నివేదికపై సంతకం చేసిన అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి’’ అని పేర్కొంది. -
'జీవో ఇచ్చినా రేట్లు పెంచే ప్రసక్తే లేదు' తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం
తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ బాగుండాలంటే పర్సంటేజీ విధానంలో సింగిల్ స్క్రీన్లు రన్ చేయడం తప్పనిసరి అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సింగిల్ స్క్రీన్ల మనుగడకు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతల మద్దతు కావాలని కోరింది. ఈ విషయంలో ఎగ్జిబిటర్స్ అంతా ఓ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. నిర్మాతలందరు అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేయాలని కోరారు. సింగిల్ స్క్రీన్స్‌పై సవతి ప్రేమ వద్దని అన్నారు.దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడుతూ..'ఎగ్జిబిటర్స్ బ్రతుకు పోరాటం ఈ పర్సంటేజ్ విధానం. నిర్మాతలందరు అర్థం చేసుకొండి. మాకు సపోర్ట్ చేయండి. తెలుగులో సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతున్నాయి. ఇప్పుడంతా ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. థియేటర్‌ను పక్కన పెట్టేస్తున్నారు. సింగిల్ స్క్రీన్‌ను కాపాడుకోవాల్సిన అవసరముంది. గవర్నమెంటు జీవో ఇచ్చినా సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో టికెట్ రేట్లు పెంచం' అని అన్నారు.ఎగ్జిబిటర్ శ్రీధర్ మాట్లాడుతూ..'2008 నుంచి పర్సంటేజ్ కోసం కొట్లాడుతున్నాం. హరిహర వీరమల్లు టైంలో మాట్లాడితే థియేటర్స్ మూసేస్తున్నామని నెగిటివ్ ప్రచారం చేశారు. నిదానంగా అన్నీ ప్రొడక్షన్స్ హౌస్‌లు పర్సంటేజ్ పద్ధతి వైపే వస్తున్నాయి. అందరూ ఈ విధానానికి వస్తే మేము ధియేటర్స్ నడుపుతాం'అని అన్నారు.చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..'నిర్మాతకు ఎగ్జిబిటర్ బిడ్డతో సమానం. చాలా కాలం నుంచి సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి దారుణంగా ఉంది. సింగిల్ స్క్రీన్స్ బిర్యానీ అయితే మల్టీప్లెక్స్ ఆవకాయ లాంటిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముగ్గురు కలవాల్సిన అవసరం ఉంది' అని అన్నారు. -
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మే 14న విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇక ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం భగీరథ్‌ను స్వయంగా విచారణ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. పోక్సో కేసు నమోదు, సిట్ ఏర్పాటు పరిణామాల నడుమ భగీరథ్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పేట్ బషీరా బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసు దర్యాప్తును ప్రత్యేక బృందానికి అప్పగించారు. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఈ టీమ్‌ను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. రమేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు శుక్రవార రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్‌కు తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. కాగా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగుతుందని, ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని సైబరాబాద్ సీపీ ప్రకటించారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది.బండి భగీరథ పరారీలో ఉన్నట్లు కేసు విచారణాధికారి,డీసీపీ రీతిరాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. మూడు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉందని చెప్పారు. అతని ఆచూకీ కోసం గాలి స్తున్నామని, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) పరిశీలిస్తుస్తున్నామని వెల్లడిం చారు. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, మరిన్ని వివరాల కోసం ఇం కోసారి ప్రశ్నిస్తామని వివరించారు. -
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్‌ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది. మైనర్ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్‌తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె. -
బండి భగీరథ్ కేసులో కక్ష సాధింపు! పొన్నం రియాక్షన్
-
పట్టపగలే పంజాగుట్టలో రూ.15లక్షల మాయం
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే పంజాగుట్టలో రూ.15 లక్షలు ఉన్న బ్యాగ్ మాయమైంది. నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వచ్చిన ఆఫ్షద్ అనే వ్యక్తి.. గణేష్ స్టాంప్స్ అండ్‌కో వద్ద ఆగి బ్యాగ్‌ను కుర్చీలో పెట్టారు. రూ.15 లక్షలు నగదు ఉన్న బ్యాగ్‌ను క్షణాల్లో చోరీచేశారు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీపీఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, హనుమకొండ: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగిపోయారు. నరహరి భార్యతో పాటు పోలీసులు ఎదుట లొంగిపోయారు. రెండు పదుల వయస్సులో పోరుబాట పట్టి దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాతంలో కొనసాగారు. సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నర్సమ్మ–సోమనారాయణకు ఐదుగురు కొడుకులు. వీరిలో రెండో కుమారుడు నరహరి.1980 సంవత్సరంలో ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా నక్సల్స్ విధానాలకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన స్నేహం ఆయనను ఉద్యమం వైపు అడుగులు వేయించింది. గ్రామంలో ఉంటూ కూలీల రేట్లు పెంచడంతోపాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అప్పటి ఆర్ఈసీలో ఉన్న ఉద్యమ నాయకుల మాటలతో ప్రభావితమైన నరహరి పోలీసుల నిర్బంధం పెరగడంతో అడవి బాట పట్టారు. -
రూ.500కే.. జైలు యోగం!
చంచల్‌గూడ (హైదరాబాద్): సాధారణంగా జైలుకెళ్లాలంటే ఏదో ఒక నేరం చేయాలి.. పోలీసులు అరెస్ట్ చేయాలి.. కోర్టు రిమాండ్ విధించాలి.. ఇదంతా పాత పద్ధతి. అసలు సిసలైన ‘ఖైదీ’ఫీలింగ్ కోసం ఇకపై అలాంటి కష్టాలేమీ పడక్కర్లేదు. కేవలం ఐదు వందల రూపాయలు జేబులో ఉంటే చాలు, చంచల్‌గూడ జైలు గేట్లు మీ కోసం గౌరవంగా తెరుచుకుంటాయి!.. మీరు చదివింది నిజమే. తెలంగాణ జైళ్ల శాఖ ఆలోచనతో చంచల్గూడలోని శిక్షణ సంస్థ (సీకా) ప్రాంగణంలో సరికొత్త ‘జైలు మ్యూజియం’కొలువుదీరింది. మంగళవారం ఉదయం గవర్నర్ శివప్రతాప్ శుక్లా దీనికి రిబ్బన్ కట్ చేయగానే, పర్యాటకులు క్యూ కట్టేయొచ్చు.రూ.500 టికెట్ కొంటే,ఒక్క రోజంతా జైలు వాతావరణాన్నిఅనుభవించవచ్చు. కేసుల భయం లేదు, బెయిల్ కోసం తిప్పలు లేవు!పాత కాలపు శిక్షలు ఎలా ఉండేవి?జైలు విధానాలు ఏంటన్నవిపెయింటింగ్స్ రూపంలో చూపిస్తూ మనల్ని భయపెడతారు. నేను జైలు చూశానని కాలర్ఎగరేయడానికి ఇదో సువర్ణావకాశం. -
ఇన్ని ఉద్యోగాలు ఎలా కొట్టేవురా నాయనా!
కౌడిపల్లి(నర్సాపూర్): కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు గిరిపుత్రుడు హలావత్ నవీన్‌కుమార్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం రావడమే గగనం. అలాంటిది ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. అయినా సంతృప్తి చెందక తన లక్ష్యం ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ కావాలని ఉందని చెప్పారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్ తండాకు చెందిన హలావత్ బోజ్యనాయక్, శోభా రాణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. బోజ్యనాయక్ పోస్ట్‌మన్‌గా ఉద్యో గం చేస్తుండగా శోభారాణి వ్యవసాయ కూలీపనులు చేస్తున్నారు. నవీన్‌కుమార్ తునికి ఎంజేపీలో ఇంటర్ పూర్తిచేసి నిజాంకాలేజీలో డిగ్రీ, ఓయూలో అర్థశాస్త్రం పీజీ పూర్తి చేశారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ఆరు ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో కెనరా బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఎస్బీఐ జూనియర్ అసోసియేట్, కెనరా బ్యాంక్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్, ది న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఏఓ, ఎల్ఐసీ ఏఏఓగా ఇలా ఆరు ఉద్యోగాలు సాధించారు. గత ఏప్రిల్‌లో ఎస్బీఐలో చేరగా.. వారం రోజుల క్రితం ఎల్ఐసీలో ఏఏఓ ఉద్యోగం రావడంతో అందులో చేరనున్నట్లు చెప్పారు. ఇష్టంతో కష్టపడి ఉద్యోగాలు సాధించానని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉందని చెప్పారు. -
1 నుంచి ప్రెస్ క్లబ్ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరి సోమవారం సచివాలయంలో మంత్రి దామోదర్ రాజ నరసింహకు వినతి పత్రం సమరి్పంచారు. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా జూన్ 1 నుంచి నిమ్స్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఈ స్పెషల్ డ్రైవ్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ ఉచితంగానే చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు నిమ్స్‌లో అవసరమైన ఏర్పాటు చేయాలని దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యదర్శి క్రిస్టినాను ఆదేశించారు. -
ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఆత్మహత్య
మియాపూర్: మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న కృష్ణప్రియ (30), మైత్రీనగర్‌లోని ఫేజ్– 2లో నివాసముంటున్న మాధురి (32) బలవన్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. కృష్ణ ప్రియ (35), మైనేని మోనిల్ సింహ దంపతులు నివాసముంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిని ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కృష్ణప్రియ హైటెక్‌సిటీలో పనిచేస్తుండగా భర్త కొద్ది రోజులు బెంగళూరులో, కొద్దిరోజులు స్థానికంగా పనిచేస్తాడు.వేసవి సెలవులు కావడంతో భర్త, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవాయం సాయంత్రం కృష్ణ ప్రియ సోదరి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వాచ్‌మన్‌కు సమాచారం ఇచి్చంది. వాచ్ మెన్ వెళ్లి తలుపు తలుపులు బద్దల కొట్టి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయనుకోని మృత దేహాన్ని గాంధీకి తరలించామని తెలిపారు. విజయనగరం జిల్లా, నల్లబెల్లి గ్రామానికి చెందిన హరిపాక బ్రహ్మ, చిన్న అమ్ములు కూతురు మాధురి (35)కి 12 ఏళ్ల క్రితం సత్యనారాయణతో వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మియాపూర్ మదీనాగూడలోని మైత్రీనగర్‌లోని ఫేజ్– 2లో నివాసముంటున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. 6 నెలల క్రితం మాధురి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి కుమారుడితో కలిసి ఉంటోంది. 5 రోజుల క్రితం మాధురి తల్లిదండ్రులు మనుమడిని తీసుకుని ఊరికి వెళ్లారు. సోమవారం ఉదయం నుంచి తండ్రి కాల్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఇంటి పక్కనున్న వ్యక్తికి కాల్ చేసి తమ ఇంట్లో చూడమని చెప్పాడు. అతను వెళ్లి కిటికి నుంచి చూడగా మాధురి బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే మియాపూర్ పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లి చేసుకుందామనుకున్నా.. నా మరదలినే ప్రేమిస్తావా..!
హైదరాబాద్: చిలకలగూడలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేలచ్చారు. సోమవారం అంబర్‌పేటలో డీసీపీ రక్షిత కె మూర్తి వివరాలు వెల్లడించారు. నామలగుండుకు చెందిన యవన్(21) చిలకలగూడకు చెందిన యువతి పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇటీవల జవహార్‌నగర్‌లో డబుల్బెడ్రూం కేటాయించడంతో అక్కడికి కుటుంబాన్ని మార్చారు. అయితే యవన్ సోదరి కుటుంబం నామలగుండు ప్రాంతంలో ఉండడంతో వస్తూ పాత స్నేహితులతో పాటు యువతితో సైతం సంప్రదిస్తున్నాడు. యువతి బావ అల్లాబోయిన సాయికిరణ్ సైతం వరసకు యువతి మరదలు కావడంతో పెళ్లి చేసుకుందమని భావించాడు. అప్పటికే సాయికిరణ్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడిïÙటర్. దీంతో ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి కుటుంబ సభ్యులతో చర్చించారు. యవన్‌ను హత్య చేయడమే పరిష్కారమని భావించి పథకం వేశారు. ఈ నెల 7న స్నేహితుడు సుబ్బు ఇంటికి యవన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. యవన్‌ను బయటకు పిలిచి దాడి చేశారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్న నా మరదలిని ప్రేమిస్తావా అంటూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీసులు విచారణ జరిపి యవన్ హత్యకు కారణమైన యువతి బావ అల్లబోయిన సాకిరణ్(27), తండ్రి రాజం నర్సింహాయాదవ్, బాబాయ్‌లు రాజం శ్రీశైలం యాదవ్(48), రాజం మల్లేశ్‌యాదవ్(48), సోదరులు రాజం పరేమేశ్ యాదవ్(19, రాజం వంశీకృష్ణ(19, రాజం మనీష్(21), వీరి స్నేహితులు సిరిగిరి రాహుల్(22), కుచ్చుల శివనందన్‌యాదవ్(20)తో పాటు మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. -
సీనియర్ మహిళా ఐపీఎస్‌తో విచారణ
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు వ్యవహారంపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సోమవారం ఉదయం సమీక్షించానని, ఈ కేసు సున్నితమైనందున మహిళా ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సోమవారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ విషయం ప్రస్తావించారు. ఈనెల 8వ తేదీన మైనర్ బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని, అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా 9, 10 తేదీల్లో దాదాపు 10 వేల మంది పోలీసు యంత్రాంగం బందోబస్తు విధుల్లో నిమగ్నమైందని సీఎం తెలిపారు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేయడానికి ముందే.. బండి సంజయ్ కుమారుడు కరీంనగర్లో వాళ్లపై వేరే ఫిర్యాదు చేశారని అన్నారు. సోమవారం ఉదయమే ఈ కేసులో విచారణ ప్రారంభమైందన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద ఏవీ జరగవని, వారు పనిలేకుండా ఉన్నంత మాత్రాన ఎవరూ పనిలేకుండా ఉన్నారను కోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తాను మాజీ పోలీసు అధికారినన్న విషయం మరిచిపోవద్దని సూచించారు. బాధితులను కలిసి స్టేట్మెంట్ తీసుకుని చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని, దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని చెప్పారు. కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరిగితే కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైనర్ బాలికకు సంబంధించిన అంశంలో అంతా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ కమిషనర్‌కు ఇవ్వొచ్చని సూచించారు. -
నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: జూలై వరకు రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం కానుంది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలు పాల్గొననున్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువకు తాగునీటి అవసరాల కోసం మే 31 వరకు 10 టీఎంసీలు విడుదల చేయాలని ఏప్రిల్ 29న ఏపీ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు.తాగునీటి అవసరాల కోసం శ్రీశైలంలో 5 టీఎంసీలు, సాగర్‌లో 13 టీఎంసీలు కేటాయించాలని మే 2న కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించి... శ్రీశైలం, సాగర్‌లో నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు చేయడంపై కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ ప్రతిపాదన చేయనుంది. దీని ఆధారంగా కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేయనుంది. కాగా, కృష్ణా బోర్డు 21వ సర్వ సభ్య సమావేశం ఈ నెల 14న హైదరాబాద్‌లో జరగనుంది. -
ప్రజా జీవనంపై మోదీ అప్రకటిత నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ తన అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల జీవనంపై అప్రకటిత నిషేధం ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘బంగారం కొనొద్దు.. వెకేషన్‌కు వెళ్లొద్దు.. నూనె తినడం తగ్గించాలంటూ ప్రధాని ప్రజలకు పిలుపునివ్వడం బాధ్యతా రాహిత్యం. మోదీ ప్రభుత్వ వైఫల్యం, అసమర్థ విధానాలే ఇందుకు కారణం. విదే శాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచనలు సలహాలు తీసు కోకుండా ఏకపక్ష నిర్ణయాలు సరికాదు. దేశంలో సంక్షోభం తలెత్తే అంశాలపై రాహుల్‌గాంధీ ఆరు నెలల నుంచే చెబుతున్నా అంతా సవ్యంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. కేంద్రానికి ఓ స్పష్టమైన విధానం లేదు. దశ, దిశ లేదు. అనుభవ రాహిత్యం, అహంకారంతో దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. గాలి తిని, గాల్లో బతకమని చెప్పి మోదీ వెళ్లిపోయారు. పశ్చిమాసియా యుద్ధంలో మనమేమీ ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు..’ అంటూ సీఎం విమర్శించారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియాతో సుదీర్ఘంగా చిట్‌చాట్ చేశారు. మావోయిస్టులను చంపడమే బీజేపీ ఎజెండా ‘బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిని ఖతం చేయడమే ఆ పార్టీ విధానం. ముస్లింలు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కారా? వారికి తమ సిద్ధాంతాలను చెప్పుకునే స్వేచ్ఛ లేదా? మావోయిస్టులను చంపడమే బీజేపీ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంది. మేము ప్రాణాలు తీయడానికి వ్యతిరేకం. మా సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను కూడా ఒప్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాం. మనుషుల ప్రాణాలకు మా ప్రభుత్వం విలువ ఇస్తుంది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ మాది. మనషులను చంపడం పరిష్కారం కాదు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అత్యధికంగా తెలంగాణలోనే లొంగిపోయారు. 818 మంది మావోయిస్టులు రాష్ట్రంలో సరెండర్ అయ్యారు. వందలాది ఆధునాతన ఆయుధాలను అప్పగించారు. అందుకోసం మేం ప్రత్యేక చొరవ తీసుకున్నాం. మేం బుల్లెట్ కాదు బ్యాలెట్ అన్నాం.. లొంగిపోయిన వారికి రక్షణ, వైద్యం, ఆర్థికపరమైన సాయం ప్రభుత్వం అందిస్తుంది. మావోయిస్టుల విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. భూ పంపణీ, ఉపాధి హామీ పథకాల అమలుతో వారి ఉద్యమాలు తగ్గాయి. గణపతి కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను అభినందించకపోగా విమర్శించడం దురదృష్టకరం. బుల్లెట్ కాదు బ్యాలెట్ అని మేం అన్నాం. చివరకు మావోయిస్టులు మా లైన్‌కు వచ్చారు. ముస్లింలను వేరే చేసి చూపించడం మంచిది కాదు. కలిసి ఉండాలని ప్రధాని మాట్లాడాలి కానీ విడగొట్టాలని మాట్లాడం దురదృష్టకరం. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ.. విభజించు, పాలించు అన్నదే వాళ్ల సిద్ధాంతం..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. నేను అడిగిన అంశాలకు మోదీ అంగీకరించారు.. ‘ఆదివారం అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా నేను అడిగిన అంశాలకు ప్రధాని అంగీకరించారు. అందులో ఎలాంటి రాజకీయాలు లేవు. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌కు సాయం చేసిన విధంగానే తెలంగాణకు కూడా మీరు సహకరించాలని కోరా. అందుకు ప్రధాని స్పందిస్తూ.. ‘నీవొక్కడివే చేస్తే అనుకున్న లక్ష్యాలను (3 ట్రిలియన్ ఎకానమీ) సాధించలేవు. నీ కలలు నిజం అవ్వాలంటే మాతో కలిసి వస్తే.. అది సాధ్యం అవుతుంది’ అనే విధంగా అన్నారు. అయితే ఆయన మాటలను ఎవరికి తోచిన విధంగా వారు అర్థం చేసుకుంటున్నారు. నేను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రి అయ్యా. నన్ను కాదు..రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని మోదీ అన్నారు. ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు.. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయంపై మేం చర్చించాం.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందే..అది హక్కు. వాటిని సాధించుకుంటాం. కేంద్రంతో సత్సంబంధాలు లేకుండా నిధులు అడగకుండా ఉంటే రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది? కానీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. కొన్ని అంశాల్లో సహకరిస్తున్నా.. మంత్రులను కలిసి ఎన్నిసార్లు అడిగినా అనుమతులు రావడం లేదు. రాష్ట్రాల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రధాని కార్యాలయంలో సింగిల్‌విండో ఏర్పాటు చేయాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం విధానంపైనే అభ్యంతరాలు ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి లేదు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం అనుసరించే విధానంపైనే ప్రతిపక్ష పార్టీలన్నింటికీ అభ్యంతరాలు ఉన్నాయి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు, నియోజకవర్గాల పెంపునకు ముడిపెట్టడంతోనే బిల్లు వీగిపోయింది. 50 శాతం సీట్ల పెంపునకు ఎలాంటి ఫార్ములా లేదు. 2029లో జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు అమలు కావొచ్చు. అయితే బీజేపీ ఎన్నికల విధానం అంతా జెమినీ సర్కస్‌లా ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రధాని అన్నారు. వారిష్టం.. అనందపడనివ్వండి. రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ భవిష్యత్తులో మళ్లీ ఆదే రెండు సీట్లకు పరిమితం అవుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మాకు ఒక రాష్ట్రం వస్తే.. వారికి ఒక రాష్ట్రం అదనంగా వచ్చింది అంతే. కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది..’ అని సీఎం వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో యాంటీ డ్రగ్ ప్రమాణం ‘రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభోత్సవం రోజున పిల్లలతో యాంటీ డ్రగ్ ప్రమాణం చేయించనున్నాం. అందుకోసం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆహ్వానిస్తున్నాం. నిపుణులు, విద్యావంతులతో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే పాఠశాల విద్యాశాఖలో ఇంటర్ విలీనంపై ఒక నిర్ణయం తీసుకుంటాం. తుమ్మిడిహెట్టిపైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. ఇంకా స్పందన రాలేదు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు ప్రధానమంత్రి పెద్దరికం వహిస్తే బావుంటుంది. ధాన్యం సేకరణలో సమస్యలు ధాన్యం సేకరణలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ధాన్యం దిగుబడి విపరీతంగా వచ్చింది. ప్రకృతి కారణంగా కూడా సమస్యలు ఉన్నాయి. అన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. గత ఎక్సెస్ టెండర్లపై సీబీఐ విచారణకు సిద్ధమా? హామ్ రోడ్ల టెండర్లలో అన్నీ ఎక్సెస్ అని హరీశ్‌రావు వ్యాఖ్యానిస్తున్నారు. 26 శాతం లెస్‌కు వచ్చిన విధంగానే అందరికీ ఇవ్వాలని అంటే.. గతంలో వారు ఎక్సెస్‌కు ఇచ్చిన టెండర్లన్నింటిపై సీబీఐ విచారణకు సిద్ధమా? నాకు ఎవరిపైనా కక్ష లేదు. తప్పు చేసిన వారిని న్యాయస్థానాలు శిక్షిస్తాయి..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మీ విషయంలో అలా జరగలేదు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అడవికి రాజునని, వేటాడి చంపే మృగం బలం ఉన్నప్పుడు అలా వ్యవహరించినా.. శక్తి లేనప్పుడు పొదల మాటున, రాళ్ల మాటున దాగి మరణిస్తుందని అంటూ ఇది ఎవరినీ ఉద్దేశించి తాను వ్యాఖ్యానించడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
విద్యకు బడ్జెట్లో 15 శాతం నిధులిస్తాం
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. విద్య కోసం రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని రాష్ట్ర విద్యా కమిషన్ సిఫారసు చేసిందని, అయితే ఒక్కరోజులో ఈ కేటాయింపులను పెంచే పరిస్థితి ఉండదన్నారు. కేటాయింపులను ప్రతి ఏటా బడ్జెట్లో క్రమంగా పెంచుతూ పోతామని, 15 శాతానికి పెరిగే వరకు ఇది కొనసాగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలను నిర్వహిస్తోంది. సోమవారం ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవాల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించి టీచర్లు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘విద్యాశాఖకు ఈ ఏడాది రూ.26,674 కోట్లు కేటాయించాం. రాష్ట్ర బడ్జెట్లో 8.22 శాతం కేటాయింపులు జరిపాం.గతేడాది కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు పెంచాం. ఇదేవిధంగా ఏటా పెంచుతాం. ఓఆర్ఆర్ లోపల క్యూర్ ప్రాంతంలో రూ.1,700 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు శంకుస్థాపన చేయడం శుభపరిణామం. వర్సిటీలు, విద్యను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది. పేదలకు న్యాయమైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం మా ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలోని తండాలు, గూడేలు, మారుమూల గ్రామాల్లోని పేదలు, దళితులు, గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యాశాఖను నేనే నిర్వహిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం.ప్రజాప్రభుత్వంలో కేవలం 60 రోజుల వ్యవధిలో 11 వేల మంది టీచర్లను నియమించడం చరిత్రాత్మక అంశం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా 22 వేల టీచర్లకు పదోన్నతులు, 36 వేల మంది టీచర్లకు బదిలీలు పూర్తి చేశాం. నీతిఆయోగ్ నివేదికలో విద్యలో రాష్ట్రం సాధించిన విజయాలను అభినందించింది. ఇందుకు విద్యాశాఖ ఉద్యోగులు, టీచర్లను అభినందిస్తున్నాను. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షలకు పైగా పేద విద్యార్థులు చదువుకుంటున్నారు.1.05 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నాడు. విదేశాల్లో విద్యాబోధన, అభ్యసన కార్యక్రమాల పరిశీలనకు టీచర్లను పంపుతాం దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. ప్రపంచ దేశాల్లో విద్యావిధానాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. మంత్రులు, ఉన్నతాధికారులే కాదు.. క్షేత్రస్థాయిలో బోధించే టీచర్లు ఈ అధ్యయనంలో భాగం కావాలి. అందుకే ఇటీవల 25 మంది ప్రభుత్వ టీచర్ల బృందాన్ని ఫిన్లాండ్కు పంపించాం. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఉపాధ్యాయులను ఎంపిక చేసి 500 మందిని విదేశాలకు పంపించాలనుకుంటున్నాం. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించే టీచర్లను అభినందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున లేదా మరో ప్రత్యేక దినాన టీచర్లకు సన్మానం చేస్తాం.దేశానికి ఆదర్శంగా నూతన విద్యా విధానం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ టు 12 వ తరగతి వరకు ప్రవేశపెడుతున్నాం. పదోతరగతి పాసైన తర్వాత ఇంటర్లో డ్రాపౌట్స్‌ను అరికట్టేందుకే ఈ నిర్ణయం. వర్సిటీలల్లో సదుపాయాల కల్పనకు భారీగా నిధులు ఖర్చు పెడుతున్నాం. 100 నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. పాఠశాల ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు ఒక జత స్కూల్ డ్రెస్, మరో జత జూన్ నెలాఖరున ఇస్తాం.ఎడ్యుకేషన్ కిట్ కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ టీచర్లకు ఉద్యోగం కాదు భావ్వోదేగం. పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు ఒక గంట అదనంగా పని చేయాలి. విద్యాశాఖకు మంత్రి లేడని కొందరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. సమీక్ష సమయంలో నన్ను ముఖ్యమంత్రిగా కాకుండా విద్యాశాఖ మంత్రిగా చూడండి. కావాలనే నేను విద్యా శాఖను నా దగ్గర పెట్టుకున్నాను’అని సీఎం స్పష్టం చేశారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను సీఎం అందజేశారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, జి.వివేక్ పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ పాఠశాలలే దేశ భవిష్యత్‌కు వేదికలు’
హైదరాబాద్: విద్యాశాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించామన్నారు రేవంత్. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించాం. విద్యాశాఖ పనితీరు నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకూ పేదవారికి విద్యను అందిస్తాం. ప్రైవేటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారుచేస్తాం. విద్యాశాఖకు అంచెలంచెలుగా 15 శాతం నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వ పాఠశాలలే దేశ భవిష్యత్‌కు వేదికలు. తెలంగాణ కల సాకారంలో విద్యార్థుల కృషి వెలకట్టలేనిది. 22వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం.’ అని రేవంత్ పేర్కొన్నారు.విద్య మూలంగానే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు..మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ.. ‘ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో బాగంగా ఈరోజు ముఖ్యమంత్రి విద్యా వారోత్సవాలు ప్రారంభించారు. అందులో భాగంగా దాదాపు 1100 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలతో పాటు ,క్యూర్ ప్రాంతంలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ చెప్తుంటారు..విద్యార్థి సంఘ్ రాజకీయాల నుండి వచ్చిన వ్యక్తిగా అనేక సమావేశాల్లో వేదికలపై చెప్పడం జరిగింది.. ఒక వ్యక్తి అభివృద్ధి వెనుక కులం , మతం డబ్బు కారణం కాదు ,విద్య మూలంగానే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు చేరుతాయి’ అని తెలిపారు. -
హీరోయిన్ త్రిషకు షాకింగ్ కౌంటర్ : డా.శివరంజని పోస్ట్ వైరల్
అనేక ట్విస్ట్స్ అండ్ టర్న్స్ మధ్య ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంప్రదాయ చీరకట్టులో హాజరైన నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలం రంగు పట్టుచీరలో, కొప్పున మల్లెలతో కనిపించడమే కాదు, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆనందబాష్పాలతో నిండిన కళ్లతో భావోద్వేగానికి లోనవుతున్న వీడియో సంచలనం రేపింది. ఆ తరువాత తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ప్రేమ ఎప్పుడూ గొప్పదే అంటూ ఆమె చేసిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో విజయ్-త్రిష మధ్య ప్రేమానుబంధంపై రకరకాల వాదనలు, పుకార్లు హాట్ టాపిక్‌గా మారాయి.అయితే చిన్నపిల్లల వైద్యురాలు, ఓఆర్ఎస్పై అలుపెరుగని పోరాటం చేసిన హైదరాబాద్‌కు చెందిన డా. శివరంజని ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా త్రిష పోస్ట్‌కు కౌంటర్‌గా ఆమె షేర్ చేసిన ఫోటో చర్చకు దారి తీసింది. ‘ప్రేమ ఎప్పటికీ గొప్పది కాదు. ద్రోహం. విచ్ఛిన్నమైన కుటుంబాల నిశ్శబ్దం బాధాకరం. ముఖ్యంగా పిల్లలకు’ అని అర్థం వచ్చే పిక్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. View this post on Instagram A post shared by Dr Sivaranjani Santosh (@drsivaranjanionline) నెటిజనుల స్పందనవావ్..ఎంత అద్భుతమైన సమాధానం, వావ్. మీపై గౌరవం పదివేల రెట్లు పెరిగింది అంటూ ఆమెను కొనియాడగా, మహిళలు ఆమెనే ఎందుకు నిందిస్తున్నారు, దీనికి ఆ వ్యక్తి ( విజయ్) బాధ్యుడు కాదా? నిజం ఏమిటంటే, ప్రతీ వివాహం శాశ్వతంగా నిలవాలని లేదు. కొన్నిసార్లు విడిపోవడమేమంచిది. ఆరోగ్యకరం కూడా. అందుకే చాలా జంటలు సమాజం కారణంగా కలిసి జీవిస్తాయి. వారు తమలో నింపుకున్న ద్వేషం చాలా లోతుగా పాతుకుపోయి, చాలాసార్లు దానిని పిల్లలకు కూడా అందిస్తారు అని మరొకరు కమెంట్ చేశారు.చిన్నప్పుడు నేను దీనిని అనుభవించాను. అది నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది, ఇప్పటికీ నన్ను ప్రభావితం చేస్తూనే ఉంది! ఈ విషయాన్ని గట్టిగా చెప్పినందుకు ధన్యవాదాలు అని మరొకరు సమాధానం ఇవ్వడం విశేషం.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను‘ప్రతి ఒక్కరూ వివాహేతర సంబంధాన్ని సాధారణీకరించి, దాన్ని గొప్పగా కీర్తిస్తుండటం అత్యంత అసహ్య కరమైన విషయం. పిల్లలు మోయబోయే బాధ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. పిల్లలు తమ తల్లికి చాలా గట్టిగా అండగా నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లూ భార్య వెన్నెముకలా నిలబడింది, అకస్మాత్తుగా మరో స్త్రీ వచ్చింది. ఇది ఇద్దరి వ్యక్తుల తప్పే. అతను ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు, కానీ తన పిల్లల ముందు ఓడిపోయాడు.ఆమెను వేడుకకు తీసుకువచ్చి, పిల్లలను, భార్యను అవమానించడం అత్యంత ఘోరమైన విషయం.’ ఇది మరో స్పందన.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?ఒక పిల్లల వైద్యురాలిగా, విడిపోయిన లేదా, విచ్ఛిన్నమైన కుటంబాలలోని పిల్లలు అనుభవించే మానసిక క్షోభ, ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఆమె వ్యాఖ్యలు చేశారని, పిల్లలపై ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనం అంటున్నారు మరికొందరు. ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే? -
తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్‌కు కొత్త ఛైర్పర్సన్, సభ్యులు నియమితుయ్యారు. ఈ కమిషన్ ఐదేళ్ల పాటు ఉంటుంది. ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శశికళ యాదవ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరా కూడా సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వు జారీ చేశారు. ఇంతకుముందు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద ఉన్న విషయం తెలిసిందే. నేరెళ్ల శారదకు ముందు ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఉన్నారు. -
‘యావన్‌ను హత్య చేయడానికి కారణం అదే’
సికింద్రాబాద్: చిలకలగూడకు చెందిన యావన్ హత్య ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని సికింద్రాబాద్ డీసీపీ రక్షిత స్పష్టం చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ప్లాన్ ప్రకారం హత్య చేశారన్నారు. అమ్మాయి తండ్రి, బాబాయి, బావ, అన్న, కజిన్ బ్రదర్స్ కలిసి యావన్‌ను హత్య చేసినట్లు గుర్తించామన్నారు. మే 7వ తేదీ జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి వివరాలను డీసీపీ మీడియాకు వెల్లడించారు.మే 7 అర్ధరాత్రి యావన్ హత్య జరిగింది. ఐదు ప్రత్యేక బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసాము.. యావన్, చంద్రికలు స్కూల్ డేస్ నుండి ఫ్రెండ్స్.. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గతంలో అమ్మాయి కుటుంబ సభ్యులు యావన్ ను హేచ్చరించారు. హత్యకు ఐదు రోజుల ముందే హత్య కోసం నిందితులు ప్లాన్ చేసుకున్నారు. అందరూ కలిసి రెక్కి నిర్వహించారు. A1 అల్లబోయిన సాయి కిరణ్ యువతి బావ.. ప్రధాన నిందితుడు..హత్య కు ప్లాన్ చేశారు. సాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశాం. నిందితులలో ఇద్దరికి గాంజా పాజిటివ్ వచ్చింది ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులతో పాటు ఓ మైనర్ అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. ప్రేమించాడని నరికి చంపారు.. -
హై అలెర్ట్.. మరో 48 గంటల్లో దూసుకొస్తున్న రాకాసి మేఘాలు
-
బండి సంజయ్ కుమారుడి కేసు.. నీరుగారే ప్రయత్నం జరుగుతోందా?
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు నీరుగారే ప్రయత్నం జరుగుతోందా? విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయడం కేసును నీరుగార్చడమేనా? అంటే అవునని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.బండి భగీరథ్ కేసుపై హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యానిస్తూ..‘సిట్ అంటేనే కేసును నీరుగార్చడం’ అని అన్నారు. బండి భగీరథ్ వ్యవహారంలో కేసు పెట్టి నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 10 సిట్లు ఏర్పాటు చేశారని, కానీ ఏ సిట్ కూడా ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు. సిట్ వేసి లీకులు ఇవ్వడం రేవంత్‌కు అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు. -
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. విచారణకు ప్రత్యేక టీమ్
హైదరాబాద్: పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. తన కుమార్తెని లైంగికంగా వేధించారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, తనని హనీట్రాప్ చేశారని కరీంనగర్ టూటౌన్ పీఎస్‌లో భగీరథ్ ఫిర్యాదు చేశారు. భగీరథ్ ఫిర్యాదుతో బాలిక, ఆమె తల్లిదండ్రులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు మెమో జారీ చేసింది. ‘‘సైబరాబాద్ కూకట్పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ పెట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 684/2026లో బీఎన్ఎస్ 74, 75 సెక్షన్లు, పోక్సో 12 సెక్షన్ కింద నమోదైన కేసు దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాం.దర్యాప్తు సరైన, నిష్పాక్షిక, వృత్తిపరమైన విధానంలో సాగేటట్లు చూసి, కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి తప్పుదారి పట్టింపు లేకుండా పరిశీలించాల్సిందిగా ఆమెకు ఆదేశాలు ఇచ్చాం. దర్యాప్తు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతిరోజూ దర్యాప్తు నివేదికపై సంతకం చేసిన అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి’’ అని పేర్కొంది.ఇదిలా ఉంటే బండి భగీరథ్ వ్యవహారంపై సీఎం రేవంత్ ఆరా తీస్తున్నారు. కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ సీఎంకు వివరించారు. సమగ్ర విచారణకు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పోలీసులు బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. -
అందుకే మోదీ బంగారాన్ని కొనొద్దన్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బంగారం కొనొద్దని, విమానాల్లో ప్రయాణించొద్దని చెప్పడం ప్రధాని మోదీ వైఫల్యాన్ని సూచిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహించిన మోదీ దేశ ప్రజలకు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో దీనిపై స్పందించారు.‘‘విదేశాంగ విధానంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ అసమర్థ విధానాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇది బాధ్యతారాహిత్యమైనది. రాహుల్ గాంధీ మొదటి నుంచి అదే చెబుతున్నారు. ప్రతిపక్షాల సూచనలను తీసుకోవాలి.. అఖిలపక్షాలను పిలిచి మాట్లాడాలి. కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు. అనుభవరాహిత్యం, అహంకారం వల్లనే దేశాన్నిసంక్షోభంలోకి నెడుతున్నారు. యూరియాను కేంద్రం ఇవ్వాలి.. రాష్ట్ర ప్రభుత్వం పంచాలి’’ అని విమర్శించారు.2029లో జమిలి ఎన్నికలు కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘ఎస్ఐఆర్ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోంది. పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించారు. ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ ఎస్ఐఆర్ ను ప్రయోగిస్తున్నారు.జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదు.. మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి ఏమిటి? జమిలి ఎన్నికలు 2029లో పెట్టడానికి ఆస్కారం ఉంది. బీజేపీకి ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదు. అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించాలి. గవర్నర్ చెప్పిన తేదీన బలనిరూపణ చేయించుకుంటే సరిపోతుంది. బండి సంజయ్ కొడుకు అంశంపైన డీజీపీ, ఇతర అధికారులతో సమీక్ష చేశాను. విచారణ ప్రారంభమైంది.. పోలీసులు చర్యలు తీసుకుంటారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద జరగదు. బాదితులను కలిసి స్టేట్ మెంట్ తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మైనర్ బాలిక కు సంబంధించిన అంశంలో అంతా భాద్యతాయుతంగా ఉండాలి. తుమ్మడి హట్టి పైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేలా చూడాలని ప్రధాని మోదీకి నేను లేఖ రాశాను.తెలంగాణకు కేంద్రం నుంచి ఆశించిన మేరకు సహకారం లేదు. రీజనల్ రింగ్ రోడ్డు నార్డ్ ఫార్ట్ , కాకాతీయ మెగా టెక్స్ టైల్స్, ఎయిర్ పోర్టులు క్లియర్, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ కోసం ఏడీబీ నిధులు, నేషనల్ హై వేలు వచ్చాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవి ముందుకు సాగలేదు. మేం వచ్చాక క్లియర్ చేయిస్తున్నాం. మెట్రో, సదరన్ పార్టు రీజనల్ రింగ్ రోడ్డు ఇలా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. సింగిల్ విండో విధానం తీసుకువచ్చి పరిష్కరించమని ప్రధానిని కోరాం. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు లేవు. రాజకీయ అంశాలకు తావు లేదు. నేను, మోదీ ప్రస్తావించింది అభివృద్ధిని మాత్రమే. అభివృద్ధి విషయంలో కలిసి పనిచేద్దామని ఆయన చెప్పారు’’ అని తెలిపారు. తమ ఇద్దరి మధ్య జరిగిన ప్రస్తావన అభివృద్ధికి చెందినది మాత్రమేనని.. అందులో రాజకీయాలకు తావులేదని చెప్పారు. -
భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్‌రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్‌రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. -
బండి తనయుడి కేసుపై సీఎం రేవంత్ ఆరా!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడి వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడడంతో భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది కూడా. అయితే.. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ నుంచి సరైన స్పందన కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసుపై స్పందించినట్లు సమాచారం అందుతోంది. సోమవారం డీజీపీ సీవీ ఆనంద్‌తో భేటీ అయ్యి ఈ కేసుపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ‘‘ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే..ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని డీజీపీని సీఎం ప్రశ్నించారు. అయితే.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలోనే పోలీసులంతా నిమగ్నమయ్యారని ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. తక్షణమే విచారణ మొదలు పెట్టాలని సీఎం డీజీపీని ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. మైనర్ బాలిక వేధింపులకుగానూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ పైన నమోదు కేసు అయ్యింది. అయితే బాలిక కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తూ భగీరథ్ కూడా ఫిర్యాదు చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే పోలీసు వర్గాలు ఆ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. తాజా విమర్శల నేపథ్యంలో కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నడుస్తుందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు మందుముల పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఉప్పల్ నియోజకవర్గానికి రూ.కోట్లాది నిధులను తెస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నట్టుగా చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, కుషాయిగూడ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు అప్‌గ్రేడెషన్ కోసం రూ.37.10 కోట్ల నిధులను మంజూరు చేయించినట్టుగా చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి గారి ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యం అయిందన్నారు. దీంతోనే కృతజ్ఞతగా సీఎం రేవంత్‌రెడ్డి గారి చిత్ర పటాలకు పాలాభిషేకం చేసినట్టుగా చెప్పారు.ఉప్పల్, ఈసీఐఎల్ ప్రాంతాలలో సీఎం రేవంత్‌రెడ్డి గారి చిత్ర పటానికి కాంగ్రెస్ నాయకులు సోమవారం పాలాభిషేకం చేపట్టారు. రెండు ప్రాంతాలలో జరిగిన పాలాభిషేక కార్యక్రమానికి పరమేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ఎంత ప్రచారం చేసుకున్నా, ఎన్ని రకాల మాయమాటలు చెప్పిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌రెడ్డి గారినే నమ్ముతారని ఈ సందర్భంగా పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కావాలన్నా, స్థానిక సమస్యల పరిష్కారం కావాలన్నా నేరు నన్ను లేదా మా పార్టీ డివిజన్ అధ్యక్షులను కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి గారు,సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి గారు,పావని రెడ్డి గారు,స్వర్ణరాజ్ శివమణి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్త అంజి రెడ్డి గారు,సీత రామ్ రెడ్డి గారు ,రాజేందర్ గారు,కాప్రా,చెర్లపల్లి ,మల్లాపూర్,AS రావు నగర్,మీర్పేట్ HB కాలనీ అధ్యక్షులు నాగ శేషు గారు,కాశెట్టి ప్రసాద్ గారు,పోలేపక అంజయ్య గారు,కప్రా సాయి గౌడ్,వెంకట్ రెడ్డి జిల్లాకార్యవర్గ సభ్యులు దండల్లా మురళి ,సురేష్,పాకాల రాజు గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్,పూర్ణ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు -
మోదీకి టీపీసీసీ చీఫ్ కౌంటర్
సాక్షి, నిజామాబాద్: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటిరిచ్చారు. నరేంద్ర మోదీ దేశానికి కాదు.. కేవలం బీజేపీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాగే, తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు ప్రధాని ఎన్ని సార్లు వచ్చిన బీజేపీ బలపడే అవకాశం లేదన్నారు.ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి బహుషా తెలంగాణ పరిస్థితులు తెలియకపోవచ్చు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులిచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాట్లాడటం ప్రజలకు రుచించదు. తెలంగాణ కాంగ్రెస్‌కు అనుకూలం.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పరిపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావటం ఖాయం అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో సెక్యులార్ల ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణకు ప్రధాని ఎన్ని సార్లు వచ్చినా బీజేపీ బలపడే అవకాశం లేదు. బీఆర్ఎస్ను ఓడించిన పార్టీ కాంగ్రెస్.. వారితో మాకు కలయిక ఉండదు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ పార్టీకి సమాన దూరంలో ఉంటాయి’ అని క్లారిటీ ఇచ్చారు. -
ఎస్బీఐ బ్యాంకులో భారీగా డబ్బు మాయం..!
హైదరాబాద్: యూసుఫ్‌గూడ ఎస్బీఐలో రూ.23 లక్షలు మాయమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. యూసుఫ్‌గూడ ఎస్బీఐలో క్యాష్ ఇన్చార్జ్గా అబ్బిరెడ్డి యాదగిరిరెడ్డి పని చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 7న యూసుఫ్‌గూడ బ్రాంచిలోని పాత ఏటీఎం స్ధానంలో ఎస్పీఆర్ మిషన్‌ను ఏర్పాటు చేయాలని బ్యాంకు నిర్ణయించింది. బ్యాంకు రికార్డులో రూ 27.5 లక్షలు ఎంట్రీ చేశారు. బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీయకుండానే తీసినట్లుగా బోగస్ ఎంట్రీలు సృష్టించారు. మరుసటి రోజు యాదగిరి రెడ్డి ఇతర సిబ్బందితో కలిసి ఏటీఎంలోని డబ్బు పెట్టెలను బ్యాంకు స్ట్రాంగ్ రూంకు తరలించారు. బ్యాంకు అధికారులు డబ్బు పెట్టెలను లెక్కించి చూడగా.. నగదులో తేడా వచి్చంది. రూ23 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. సీసీ టీవీ కెమెరాలు పరిశీలించగా.. యాదగిరి రెడ్డి ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడి, డబ్బును కాజేసినట్లు బ్యాంకు అదికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఎస్బీఐ చీఫ్ మేనేజర్ కిరణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘క్లూ’ దొరికింది
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య తనూజ రంజన్‌ను పని మనిషితో పాటు మరో ముగ్గురు నేపాలీలు హత్య చేసి, నగదు, నగలతో ఉడాయించిన ఘటనపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. నిందితులు పుణెలో ఉన్నట్లు సమాచారంతో గ్యాంగ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హత్య జరిగిన రాత్రి నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లి పుణెలో దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పది పోలీసు బృందాలు అక్కడ జల్లెడ పడుతున్నాయి. కాగా.. నిందితురాలు కల్పన లక్నోలో పని చేస్తున్న సందర్భంలో కూడా నేరాలకు పాల్పడినట్లు.. పథకం ప్రకారం హైదరాబాద్‌కు వచ్చి సంపన్నుల ఇళ్లలో పని చేస్తూ వారి కదలికలను గమనిస్తూ అవకాశం రాగానే అందినకాడికి దండుకుంటున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. లక్నోలో కల్పన పని చేసిన ఇంట్లోనూ ఓ పోలీసు బృందం విచారణ చేపట్టింది. మూడు బృందాలు నేపాల్ సరిహద్దులో తిష్టవేశాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కూడా మరో మూడు బృందాలు నిఘా పెట్టి నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత నిందితులు పుణె చేరుకోగా అక్కడ నుంచి ఎక్కడిడి ప్రయాణం కాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పుణె చుట్టూ బృందాలు నిఘా పెట్టాయి. వినయ్ రంజన్ ఇంట్లో ఈ గ్యాంగ్ 225 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. నగదు ఎంత చోరీ అయిందనేది ఇంకా లెక్క తేలలేదు. నేడో, రేపో నిందితులను పట్టుకునే దిశలో పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. నిందితుల వద్ద ఎలాంటి సెల్ఫోన్లు లేవని పోలీసులు గుర్తించారు. రెండు సెల్ఫోన్లు హైదరాబాద్‌లోనే పడేసిపోయినట్లు సమాచారం. నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
దొరికిన దొంగలు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో వారంరోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలుకోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేసిన నగలను బిహార్‌లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. బిహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నట్లు తెలిసింది.ప్రత్యేక బృందాలతో...ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌లో ఉన్న ప్రముఖ పీఎంజే జువెల్లరీస్‌లో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాపు తెరిచేటప్పుడు, జనసంచారం లేని సమయాన్ని ఎంచుకుని దుండగులు ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకాబందీ చేçపట్టారు. దుండగుల ప్రణాళిక, తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కీతో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను సేకరించి, దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలు గుర్తించారు.బిహార్‌లో నగలు విక్రయిస్తుండగాదర్యాప్తులో భాగంగా దొంగలు ఘటన అనంతరం కరీంనగర్ నుంచి ధర్మపురి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారు ఉపయోగించిన పల్సర్ బైక్‌ను వదిలిపెట్టి గోదావరినదిని దాటి పరారైనట్లు సీసీ కెమెరాలు, స్థానిక సమాచారంతో నిర్ధారించారు. ఈ మార్గం ద్వారా వారు మహారాష్ట్ర లేదా ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దోపిడీ కేసు వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి దోపిడీ ఘటనలతో పోల్చి చూశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, పాతనేరస్తులు, గతంలో దొంగతనాలకు పాల్పడిన గ్యాంగులతో విచారణ చేపట్టి నిందితుల కదలికలను, సేకరించిన సమాచారంతో బిహార్ రాష్ట్రంలో నగలు విక్రయిస్తుండగా దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్ల మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు మృతిచెందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేదాయపాలేనికి చెందిన కత్తి భరత్‌కాంత్(31), గూడ సాయి త్రిలోక్(31) అనే ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు శనివారం సాయంత్రం నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు వస్తుండగా బొంగ్లూర్ ఎగ్జిట్–12 సమీపంలో కారు డ్రైవర్ అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఎదురెదురుగా వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న కత్తి భరత్‌కాంత్, గూడ సాయి త్రిలోక్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం తెల్లవారుజామున 3.20గంటల సమయంలో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ అధికారి శ్రీకాంత్ ఇచి్చన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
మార్క్‌ఫెడ్‌లో మక్కతిక
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకునే మార్క్‌ఫెడ్‌లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఖరీఫ్ సీజన్లో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన 3.97 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను విక్రయించేందుకు పిలిచిన టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. రైతుల నుంచి రూ. 2,400కు క్వింటాలు చొప్పున కొనుగోలు చేసిన 3.97 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను రూ. 1,400 నుంచి రూ. 1,500లోపు అంటే దాదాపు రూ. 1000 నష్టానికి బల్క్‌గా విక్రయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పౌల్ట్రీ రైతులు రూ. 1,600కు క్వింటాలు చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినా గోదాములవారీగా చిన్న వ్యాపారులు రూ. 1,600 నుంచి రూ. 1,700లోపు మక్కలు కొనేందుకు సిద్ధపడినా ఆ టెండర్లను రద్దు చేసి మరీ బల్క్ టెండర్ల ద్వారా బడా సంస్థలకు కట్టబెట్టేందుకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో పాల్గొన్న ఐదు బడా కంపెనీలు కనీస మద్దతు ధరకన్నా రూ. 1,000 వరకు తక్కువకు కోట్ చేసినట్లు సమాచారం. నేడో, రేపో ఆయా సంస్థలకు టెండర్లు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతుండగా, ప్రభుత్వానికి ఉప్పందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హఠాత్తుగా మార్క్‌ఫెడ్ ఎండీ వి. శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి రాహుల్ రాజ్‌ను మార్క్‌ఫెడ్ ఎండీగా నియమించింది. రూ. 950 కోట్ల విలువకు కొనుగోలు చేసి .... రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగవుతోంది. అందులో భాగంగానే గత ఖరీఫ్‌లో దాదాపు 9 లక్షల ఎకరాల్లో సాగు చేయగా భారీ ఎత్తున మక్కలు మార్కెట్‌కు వచ్చాయి. మార్కెట్లో అప్పట్లో ధర రూ. 2,000 కూడా లేకపోవడంతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ. 2,400 చొప్పున 3.97 లక్షల మెట్రిక్ టన్నులను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం రైతులకు దాదాపు రూ. 950 కోట్ల వరకు వెచ్చించిన మార్క్‌ఫెడ్... రవాణా, గోనె సంచులు, గోదాముల్లో నిల్వ కోసం భారీగానే వెచ్చించింది. కొనుగోలు చేసిన మక్కలను విక్రయించే విషయంలో మార్క్‌ఫెడ్‌లో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. మార్కెట్లో ధర లేదనే కారణంగా విక్రయించే విషయంలో మీనమేషాలు లెక్కించిన అధికారులు.. మార్చిలో గోదాములవారీగా టెండర్లను ఆహా్వనించారు. దాదాపు 200 గోదాముల్లో మక్కలను నిల్వ చేయగా గోదాములవారీగా పిలిచిన టెండర్లలో పాల్గొన్న చిన్న వ్యాపారులు రూ. 1,600 నుంచి రూ. 1,700 వరకు వెచ్చించి మక్కలు కొనేందుకు ముందుకొచ్చారు. కానీ అధికారులు హఠాత్తుగా ఆ టెండర్లను రద్దు చేశారు. వెంటనే పౌల్ట్రీ వ్యాపారుల ప్రతినిధులు మార్క్‌ఫెడ్ అధికారులను సంప్రదించి క్వింటాలుకు రూ. 1,600 చొప్పున మక్కలను కొంటామని, పౌల్ట్రీ దానా కోసం ఇతరుల నుంచి కొనే బదులు మార్క్‌ఫెడ్ నుంచే తీసుకొంటామని ముందుకొచ్చారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోకుండా బల్క్ టెండర్లు పిలిచారు. రూ. 100 కోట్లపైన టర్నోవర్ నిబంధనతో... బల్క్ టెండర్ల ద్వారా ఒకేసారి మక్కలను విక్రయించి గోదాములను ఖాళీ చేస్తామని చెప్పిన మార్క్‌ఫెడ్ అధికారులు.. ఈ మేరకు గత నెలలో మళ్లీ టెండర్లు పిలిచారు. ఇందుకోసం రూ. 100 కోట్లపైన టర్నోవర్ కలిగిన సంస్థలే పాల్గొనాలనే నిబంధన విధించారు. దీంతో కేంద్రీయ బండార్, నాకాఫ్, వి–కేర్, మంచుకొండ ఆగ్రో ఇండస్ట్రీస్, అమరావతి కంపెనీలు ముందుకొచ్చాయి. 2022–23 రబీలో మిల్లర్లు మాయం చేసిన రూ. 7,000 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రాబట్టేందుకు 2023లో పిలిచిన టెండర్లలో పాల్గొన్న కంపెనీలే ఈ మక్కల బల్క్ టెండర్లలో పాల్గొనడం గమనార్హం. అయితే ధాన్యం రికవరీకి బదులు డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఈ కంపెనీలు సగంలోనే చేతులెత్తేశాయి. ఈ కంపెనీలే తిరిగి మక్కల టెండర్లలో పాల్గొని క్వింటాలుకు రూ. 1,400 నుంచి రూ. 1,500 చొప్పున కొనేందుకు బిడ్లు వేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో మార్క్‌ఫెడ్‌లో జరుగుతున్న మక్కల టెండర్ల దందా గురించి సర్కార్‌కు ఫిర్యాదులు అందడంతో ప్రాథమిక విచారణ జరిపినట్లు తెలియవచ్చింది. అందులో భాగంగానే ఆకస్మాత్తుగా మార్క్‌ఫెడ్ ఎండీ వి. శ్రీనివాస్‌రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో మక్కల టెండర్ల కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. -
ఇంటర్ అడ్మిషన్లు పాత పద్ధతిలోనే..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ప్రవేశాలు 2026–27 విద్యా సంవత్సరానికి పాత పద్ధతిలోనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉందని, ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండటంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి సీబీఎస్ఈలో తరహాలో 11, 12 తరగతులను పాఠశాల విద్యలోనే కొనసాగించాలని, ఫలితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరడం లేదు. అక్కడితోనే చదుకు ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి గతంలో అధికారులకు సూచించారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా తన నివేదికలో పేర్కొంది. ఇటీవల ఇంటర్మీడియట్లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. జూనియర్ కాలేజీల యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో సీఎం, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.వి.శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణాలతో ఆదివారం సమీక్షించారు. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం తాజా ఆదేశాలతో అతి త్వరలో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసే అవకాశం ఉంది. -
అబ్‌కే బార్ తెలంగాణ
బెంగాల్లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదు.. ఒక రాజకీయ నీతి పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారింది. ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకు వెళ్తోంది. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందు అబద్ధపు హామీలిస్తారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు.సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాక తెలంగాణలోనూ ఆ గెలుపు ప్రకంపనలు కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విశ్వాసఘాతుకం, హామీల అమల్లో వైఫల్యం, కుటుంబ రాజకీయాల పట్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా... మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీవైపు గాలిమార్పు స్పష్టంగా గోచరిస్తోందన్నారు. ‘అబ్కీ బార్ తెలంగాణ’ (ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం) అంటూ సభికులతో మోదీ నినాదాలు చేయించారు. దశాబ్దాల కింద బీజేపీకి ఎన్నో రాష్ట్రాల్లో ఆదరణ లభించలేదని, అయితే దేశవ్యాప్తంగా బీజేపీకి రెండుసీట్లు ఉన్నప్పుడు ఒకటి తెలంగాణలో వచ్చిందని గుర్తుచేశారు. ఆ విధంగా బీజేపీ చరిత్రలో తెలంగాణకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ఇప్పుడు దేశం నలుమూలలా బీజేపీపై ప్రజల ఆశీర్వాదం పెరుగుతోందని, బీజేపీ గుడ్‌గవర్నెన్స్ మోడల్‌పై ఎన్నికల్లో ప్రజలు ఓటు ముద్రవేశారన్నారు. తెలంగాణ అలాంటి ప్రదేశమైనందున ఇప్పుడు 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారని, ఇక అధికారానికి రావడమే తరువాయి అని చెప్పారు. బీజేపీ అభివృద్ధి మోడల్‌పై విశ్వాసం దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి మోడల్, సుపరిపాలనపై మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని మోదీ చెప్పారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అదే విషయం స్పష్టంగా చెబుతున్నారన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, ప్రజలను ఏళ్ల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అవినీతి, కుటుంబవాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారిందని ధ్వజమెత్తారు. అదే మార్గంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా నడిచిందని, ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారని అన్నారు. అయితే బెంగాల్లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదని, ఒక రాజకీయ నీతి పరాజయం పాలైందని మోదీ చెప్పారు. ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా కాంగ్రెస్‌ది విభజన రాజకీయం కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకెళ్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను ‘ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్’ (ఎంఎంసీ)గా అభివరి్ణస్తున్నారని ఎద్దేవా చేశారు. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు మావోయిస్టులకు భావజాల పరంగా మద్దతు ఇవ్వడం వల్లే ఈ సమస్య ఇంతకాలం కొనసాగిందని చెప్పారు. తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలాకాలం క్రితమే అంతం చేసేవారన్నారు. ‘మావోయిస్టు తీవ్రవాదంతో దేశానికి ఎంతో నష్టం జరిగింది. తెలంగాణలోనూ వారి తీవ్రవాద చర్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మావోవాది అంతిమ ఘడియలు సమీపించినా నక్సల్వాదిని రక్షించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ గత 12 ఏళ్లు కేంద్రంతోపాటు కలిసి పనిచేసే ఉంటే ఎప్పుడో మావోయిస్టుల నుంచి విముక్తి లభించి ఉండేది. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోందని చెప్పారు. ముందుచూపుతో, వికసిత్ తెలంగాణ సాధన దిశగా కృషిచేస్తోందన్నారు. బీజేపీ అభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెడుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘ప్రస్తుతం దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ సీఎంలు ఉన్నారు. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందుగా అబద్ధపు హామీలు ఇస్తారు.. ఆకాశం నుంచి చుక్కలు తెంచి ఇస్తామని చెబుతారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు’ అని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, తెలంగాణలో కూడా అదే జరుగుతోందని దుయ్యబట్టారు. -
రైల్వే ట్రాక్ పనులు చేస్తూ.. క్వార్టర్స్‌లో ఉంటూ..
తాండూరు రూరల్: వికారాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఉనికి కలకలం రేపింది. పెద్దేముల్ మండలం రుక్మాపూర్ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున నలుగురు నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర, తాండూరు పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు పురుషులు, ఓ మహిళా నక్సలైట్ ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన నలుగురు మావోయిస్టులు ఆ రాష్ట్రాల కూలీలతో కలిసి పది రోజుల క్రితం పెద్దేముల్ మండలం రుక్మాపూర్‌కు వచ్చారు.రైల్వే ట్రాక్ పనులు చేసుకుంటూ, అక్కడి క్వార్టర్స్‌లో తలదాచుకుంటున్నారు. వీరిపై మహారాష్ట్రలో పలు కేసులు ఉన్నట్లు తెలిసింది. వీరి కదలికలపై నిఘా ఉంచిన మహారాష్ట్ర పోలీసులు పక్కా సమాచారంతో పెద్దేముల్ మండలానికి వచ్చారు. తాండూరు డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు.. మొత్తం 50 మంది పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రుక్మాపూర్ రైల్వే క్వార్టర్స్‌ను వీరు చుట్టుముట్టారు. అందులో తలదాచుకున్న నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ప్రత్యేక వాహనంలో మహారాష్ట్రకు తరలించారు. కాగా, మావోయిస్టుల పేర్లు, ఫొటోలు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. -
కొంగొత్త నేరస్తులు
సాక్షి, హైదరాబాద్: ముందుగా రెక్కీ, పక్కా స్కెచ్, అదును కోసం ఎదురుచూపులు, పకడ్బందీగా అమలు.. ఇదీ ఒకప్పుడు నేరగాళ్లు అనుసరించిన పంథా. కానీ ఇటీవల కాలంలో తరచూ నేరాలకు పాల్పడేవారి స్థానంలో కొత్త నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. హత్య, హత్యాచారం.. మరేదైనా ఘరానా నేరం.. వాటిలో నిందితులంతా దాదాపుగా కొత్తవారే ఉంటున్నారు. వారికి ఎలాంటి నేరచరిత్ర ఉండట్లేదు. వ్యక్తిగత కక్షలతో కొందరు.. ప్రతీకారం తీర్చుకోవడానికి మరికొందరు నేరగాళ్లుగా మారుతున్నారు. రాష్ట్రంలో నేరాలకు పాల్పడి పోలీసులకు చిక్కుతున్న వారిలో 95 శాతం మంది కొత్త వాళ్లే ఉంటున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2024కుగాను విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.తెలంగాణలో వివిధ చట్టాల కింద నమోదైన నేరాల్లో మొత్తం 98,351 మంది పట్టుబడగా వారిలో 92,389 మంది తొలిసారి నేరం చేసి చిక్కిన వారేనని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఐపీసీ, బీఎన్ఎస్ చట్టాల కింద నమోదైన నేరాల్లో 79,698 మంది నేరస్తులు అరెస్టవగా వారిలో 74,801 మంది తొలిసారి అరెస్టయిన నేరస్తులే. వారిలోనూ తొలిసారి పట్టుబడ్డ జువెనైల్స్ 1,565 మంది ఉన్నారు. అలాగే ప్రత్యేక, స్థానిక చట్టాలు (ఎస్ఎల్ఎల్) కింద నమోదైన నేరాల్లో అరెస్టయిన నేరస్తుల సంఖ్య 18,653 కాగా వారిలో 17,588 మంది తొలిసారి చిక్కిన వారే ఉన్నారు.యువకులు ఎక్కువగా ఆర్థిక అవసరాల కోసం నేరాల బాట పడుతున్నారు. సాధారణంగా పాత నేరగాళ్లపై పోలీసుల నిఘా ఉంటుంది. కానీ కొత్త నేరగాళ్ల విషయంలో అలా కుదరట్లేదు. ముఖ్యంగా వ్యక్తిగత కక్షలతో నేరాలకు పాల్పడే వారిని పసిగట్టడం సవాల్‌గా మారుతోంది. కొత్త నేరస్తుల ఫొటోలు, వేలిముద్రల వంటివి పోలీసు రికార్డుల్లో ఉండకపోవడం, సాంకేతిక ఆధారాలు లేకపోవడంతో కొత్త నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులకు అడుగడుగునా సవాళ్లే ఎదురవుతున్నాయని నివేదిక పేర్కొంది.


