బండి సంజయ్‌ కుమారుడి కేసు.. నీరుగారే ప్రయత్నం జరుగుతోందా? | Harish Rao slams SIT move in Bandi Bhagirath case | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌ కుమారుడి కేసు.. నీరుగారే ప్రయత్నం జరుగుతోందా?

May 11 2026 5:06 PM | Updated on May 12 2026 11:57 AM

Harish Rao slams SIT move in Bandi Bhagirath case

సాక్షి,హైదరాబాద్‌: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు నీరుగారే ప్రయత్నం జరుగుతోందా? విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయడం కేసును నీరుగార్చడమేనా? అంటే అవునని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

బండి భగీరథ్ కేసుపై హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యానిస్తూ..‘సిట్ అంటేనే కేసును నీరుగార్చడం’ అని అన్నారు. బండి భగీరథ్ వ్యవహారంలో కేసు పెట్టి నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 10 సిట్‌లు ఏర్పాటు చేశారని, కానీ ఏ సిట్ కూడా ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు. సిట్ వేసి లీకులు ఇవ్వడం రేవంత్‌కు అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement