బండి తనయుడి కేసుపై సీఎం రేవంత్‌ ఆరా! | Bandi Bhagirath Row: IS CM Revanth Reddy Serious On Telangana DGP | Sakshi
Sakshi News home page

బండి తనయుడి కేసుపై సీఎం రేవంత్‌ ఆరా!

May 11 2026 1:53 PM | Updated on May 11 2026 2:02 PM

Bandi Bhagirath Row: IS CM Revanth Reddy Serious On Telangana DGP

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తనయుడి వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మైనర్‌ బాలికపై వేధింపులకు పాల్పడడంతో భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది కూడా. అయితే.. ఈ వ్యవహారంలో పోలీస్‌ శాఖ నుంచి సరైన స్పందన కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. 

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ కేసుపై స్పందించినట్లు సమాచారం అందుతోంది. సోమవారం డీజీపీ సీవీ ఆనంద్‌తో భేటీ అయ్యి ఈ కేసుపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ‘‘ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే..ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని డీజీపీని సీఎం ప్రశ్నించారు. అయితే.. ‍ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలోనే పోలీసులంతా నిమగ్నమయ్యారని ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. తక్షణమే విచారణ మొదలు పెట్టాలని సీఎం డీజీపీని ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. 

మైనర్‌ బాలిక వేధింపులకుగానూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్ పైన  నమోదు కేసు అయ్యింది. అయితే బాలిక కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తూ భగీరథ్‌ కూడా ఫిర్యాదు చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే పోలీసు వర్గాలు ఆ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. తాజా విమర్శల నేపథ్యంలో కేసు స‌మ‌గ్ర‌ విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement