breaking news
Telangana Politics
-
అది ముమ్మాటికీ ఫార్మా సిటీయే.. : కేటీఆర్
హైదరాబాద్: ‘ఉన్న సిటీలో దోమలమందు కొట్టే దిక్కులేదు కానీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు.. ఫ్యూచర్ సిటీ లేదూ గాడిద గుడ్డూ లేదు. అది ముమ్మాటికీ హైదరాబాద్ ఫార్మాసిటీయే. అది ఇంకేదానికీ వాడుకోడానికి చట్ట ప్రకారం చెల్లదు. పెట్టుబడిదారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరో రెండేళ్లలో వచ్చేది కేసీఆర్ సర్కారే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.శంషాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో మణికొండకు చెందిన పలువురు నాయకులు ఆ పారీ్టలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. గణేష్ ఉత్సవాల్లో పదిరోజులుగా ఓ పెద్దాయనకు నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఓ సినిమా వచ్చి మరింత నిద్ర పట్టకుండా చేసిందన్నారు. ప్యారడైజ్ సినిమా మొత్తం ఒక ఎత్తు.. నాలుగు నిమిషాల కేసీఆర్ పాత్ర ఒక ఎత్తు అన్నారు.మన గొంతును.. మన జాతిని మేల్కొల్పిన నాయకుడి పోరాటాన్ని దర్శకుడు అందులో స్పృశించారని పేర్కొన్నారు. అధికారానికి మాత్రమే దూరమయ్యాయం కానీ కేసీఆర్ అంటే ప్రజల్లో ప్రేమాభిమానాలు తగ్గలేదన్నారు. ప్రస్తుత సర్కారు మూసీ ప్రక్షాళన పక్కనపెట్టి భూములు, ఇళ్లు గుంజుకునే పనిలో పడిందని కేటీఆర్ విమర్శించారు. హైడ్రాకు పేదోళ్ల ఇళ్లు తప్ప మంత్రులు పొంగులేటి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిలు నీళ్లలో కట్టిన ఇళ్లు మాత్రం కనపడటం లేదని దుయ్యబట్టారు.శంషాబాద్ ఘాంసిమియాగూడ, సుల్తాన్‌పల్లి భూముల కోసమే రేవంత్‌రెడ్డి పంచన చేరావనే విషయం తెలుసు అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకా‹Ùగౌడ్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.ఇదీ చదవండి: సిరిసిల్ల లెక్కలు తేల్చాలి -
‘జై కేసీఆర్’ అన్నందుకు కేసు!
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా రాజకీయ పాటలు, నినాదాల వ్యవహారం వివాదంగా మారింది. నిమజ్జనానికి వచ్చిన భక్తులు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాటలు పెట్టడాన్ని పోలీసులు అడ్డుకున్నారంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పోలీసుల తీరుతో పాటు రేవంత్ సర్కార్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గణేశ్ మండపాల వద్ద రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు, నేతలకు సంబంధించిన నినాదాలు చేయడంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. నవరాత్రి ఉత్సవాలు భక్తికి సంబంధించిన కార్యక్రమమని.. రాజకీయాలకు వేదిక కాకూడదని పేర్కొన్నారు. అసభ్యకర, రెచ్చగొట్టే పాటలు, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసుల సోషల్ మీడియా బృందాలు వీడియోలు, రీల్స్‌ను పరిశీలిస్తున్నాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.కేసీఆర్ పాటలపై వివాదంఈ నేపథ్యంలో గణేశ్ నిమజ్జన వాహనాల్లో కేసీఆర్‌కు సంబంధించిన పాటలు, డైలాగులతో కూడిన రీమిక్స్ డీజేలు వినిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని చోట్ల పోలీసులు వాటిని నిలిపివేసిన దృశ్యాలు కూడా చర్చకు వచ్చాయి. కేసీఆర్ పాటలు పెట్టొద్దంటూ పోలీసులు హెచ్చరించారని, కేసులు పెడతామని చెప్పడంతో పాటు వాహనం సీజ్ చేస్తామని బెదిరించారని నిర్వాహకులు ఆరోపించారు.ట్యాంక్ బండ్ మీద జై కేసీఆర్ అన్నందుకు కేసుట్యాంక్ బండ్ మీద వినాయక నిమజ్జనం సందర్భంగా జై కేసీఆర్ అన్నందుకు తన మీద కేసు పెట్టారని అంటున్న ట్రాన్స్‌జెండర్ శృతి యాదవ్ pic.twitter.com/C0opzqPaQk— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026‘జై కేసీఆర్’ అన్నందుకే కేసా?ఇదే వివాదానికి కొనసాగింపుగా.. ట్యాంక్‌బండ్‌పై ‘జై కేసీఆర్’ నినాదం చేసినందుకు తనపై కేసు పెట్టారని ట్రాన్స్‌జెండర్ శృతి యాదవ్ ఆరోపించారు. గణేశ్ నిమజ్జనానికి వచ్చిన సమయంలో తాను నినాదం చేశానని, అందుకే పోలీసులు కేసు నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణకు సంబంధించి కేసు ఏ సెక్షన్ల కింద నమోదైంది, నినాదమే కేసుకు కారణమా అనే అంశాలపై అధికారిక పోలీసు వివరణ వెలువడాల్సి ఉంది.గణేష్ నిమజ్జనం కోసం వచ్చిన భక్తులపై లాఠీ ఝులిపించడం ఏ విధమైన పోలీసింగ్?కేసీఆర్ పాట పెట్టారని భక్తులను కొట్టడం, కేసులు పెడతానని బెదిరించడం, వాహనం సీజ్ చేస్తానని హెచ్చరించడం, కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధిపై దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సిన విషయం.… pic.twitter.com/wzBA0bh2nP— Sai Ram Guptha Andole BRS (@sairam_brs) September 24, 2026మరో ఘటనలో..కేసీఆర్ పాటలు పెట్టి.. జై కేసీఆర్ నినాదాలు చేసినందుకు ఓ ఊరేగింపు బృందంతో పోలీసులు వాగ్వాదానికి దిగిన వీడియో సైతం వైరల్ అయ్యింది. ప్రశ్నించినందుకు ఆ సభ్యులతో పాటు వీడియో తీస్తున్న వ్యక్తితోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు అందులో ఉంది. బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరంపోలీసుల హెచ్చరికలు, కేసీఆర్ పాటల వ్యవహారంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గణేశ్ నిమజ్జనం కోసం వచ్చిన భక్తులపై లాఠీలు ప్రయోగించడం, కేసుల పేరుతో బెదిరించడం ఏమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. పోలీసుల చర్యలు రాజకీయపరంగా ఉన్నాయనే ఆరోపణలు చేశారు. ఇదీ చదవండి: నిమజ్జనంలో గుండె ఆగిపోయింది! -
భూములపై రేవంత్ సర్కార్ బిగ్ యాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లో భూములకు సంబంధించిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు, ప్రభుత్వ భూముల వ్యవహారాలపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రులకు చెందిన భూముల వ్యవహారాలపైనా పరిశీలన చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.కేసీఆర్ కుటుంబం, ఆయన అనుచరులకు సంబంధించిన భూముల వ్యవహారాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించనుంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కుటుంబ సభ్యుల భూములు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్ భూముల వ్యవహారాలను కూడా విచారణ పరిధిలోకి తీసుకుంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భూముల కొనుగోళ్లకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించనుంది. మాజీ మంత్రులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులకు చెందిన భూములపైనా పరిశీలనలు జరపనున్నట్లు తెలుస్తోంది.అసైన్డ్.. ప్రభుత్వ భూములపై ఫోకస్అసైన్డ్, ప్రభుత్వ, భూదాన్ భూములకు సంబంధించిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై కమిటీ దృష్టి సారించనుంది. మల్లన్నసాగర్ భూసేకరణలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు, మిడ్ మానేర్ ప్రాజెక్టు పరిహారం, పునరావాసం–పునరావాస ప్యాకేజీల్లో అవకతవకల ఆరోపణలపైనా విచారణ జరపనుంది.కమిటీ ఇలా..ఈ విచారణ కమిటీకి ఐఏఎస్ అధికారి ఎ. శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు కన్వీనర్‌గా ఉంటారు. వివిధ జిల్లాల్లోని భూ వ్యవహారాలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.ఇప్పటికే 22-ఏ నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. తాజా విచారణ కమిటీ పరిధి మాత్రం వివిధ రకాల భూ వ్యవహారాలు, ఆరోపణలు, నిబంధనల ఉల్లంఘనలను పరిశీలించే దిశగా విస్తరించినట్లు తెలుస్తోంది.ధరణి మాడ్యూల్ దుర్వినియోగంపైనా..భూ రికార్డుల నిర్వహణలో కీలకంగా ఉన్న ధరణి వ్యవస్థలోని మాడ్యూల్స్ దుర్వినియోగంపై కూడా విచారణకు ఆదేశాలు ఇచ్చింది. వివిధ జిల్లాల్లో భూముల రికార్డులు, లావాదేవీలు, ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలు–నిబంధనలకు అనుగుణంగా జరిగిన తీరును కమిటీ పరిశీలించనుంది.బాధ్యులెవరో తేల్చి.. చర్యలకు సిఫారసువిచారణలో అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు బయటపడితే.. వాటికి బాధ్యులెవరో నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఇందుకోసం అవసరమైన భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న డేటాను కమిటీకి అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. విచారణకు పూర్తి సహకారం అందించాలని సూచించింది. -
తెలంగాణలో మరో ఉప ఎన్నిక తప్పదా..? ఖైరతాబాద్ పై అందరి చూపు
-
రేవంత్ వర్సెస్ కేసీఆర్.. భూముల లెక్కల్లో అసలు ట్విస్ట్ ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగం ప్రధానంగా విపక్ష నేత కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. అందులో తప్పులేదు. ఆయనకు ఆ హక్కు ఉంటుంది. కేసీఆర్ కుటుంబం, ఆయన సన్నిహితులు, కొందరు బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన భూములపై రేవంత్ ఆరోపణలు గుప్పించారు. వీటిపై విచారణ చేసుకోవచ్చని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్ రెడ్డి తదితరులు సవాల్ చేశారు.ఇదే టైమ్‌లో బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంపై గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఉన్న వాస్తవాలపై కూడా రేవంత్ వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ రెండు పార్టీల వాదనలు, పరస్పర ఆరోపణలు విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది? రాజకీయ నేతలు తెలంగాణలో భూమిని ఒక పెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న అనుమానం కలగదా?. రేవంత్ చేసిన ఆరోపణలలో కొన్ని నిజాలు ఉండవచ్చు. కొన్ని నిజం కాకపోవచ్చు. అయినా ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన వివరాలకు ప్రాముఖ్యత ఉంటుంది. కాకపోతే కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల భూములు దోపిడీ చేసిందని ఏదో ఒక ఆరోపణ చేయడం బట్టకాల్చి మీద వేసినట్లుగా ఉంది.రేవంత్ చెప్పిన వివరాల ప్రకారం చూసినా ఆ భూములు విలువ అంత ఉండదని అర్థం అవుతుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దానిపై మంత్రులు పొంగులేటి, వివేక్, దామోదరలను కమిటీగా వేయడం ఏమిటో అర్థం కాదు. అంటే మొత్తం ప్రక్రియ రాజకీయం అయిపోదా అన్న చర్చ వస్తుంది. కేసీఆర్‌కు ఫామ్ హౌస్‌లో ఎంత భూమి ఉందన్నదానిపై రేవంత్ రెడ్డి గందరగోళంగా చెప్పినట్లు అనిపిస్తుంది.కొంతకాలం క్రితం అక్కడ వెయ్యి ఎకరాలు ఉందని ఆయనే అన్నారు. అసెంబ్లీలో 67 ఎకరాలని ప్రకటించారు. 700 ఎకరాల ఫామ్ హౌస్‌లో ప్రభుత్వ భూమి 388 ఎకరాలు ఉందని రేవంత్ అన్నారు. ఈ భూమిని దళితులకు పంచుతానని అన్నారు. బాగానే ఉంది. కాని నిజంగా ఆ స్థాయిలో ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉంటే ఈ మూడేళ్ల కాలంలో ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారులు పసికట్టలేకపోయారా? కేటీఆర్‌తో పాటు ఆయన సతీమణి, కుమారుడుల పేర ఉన్న భూముల వివరాలు కూడా ఆయన చెప్పారు. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత పేరిట ఉన్న భూముల గురించి కూడా చెప్పారు. మొత్తం మీద కేసీఆర్ కుటుంబం పరిధిలో 439 ఎకరాలు ఉందని అన్నారు. కేసీఆర్‌కు బంధువులు అయ్యేవారి కుటుంబాలకు ఉన్న భూములన్నీ కేసీఆర్ ఖాతాలో ఎలా వేస్తారో అర్థం కాదు. ఈ లెక్కలన్ని కాస్త గజిబిజిగా ఉన్నాయనిపిస్తుంది. సర్వే బృందాలను హడావుడిగా పంపించినా అందులో ఏమీ తేలలేదన్నది ఇప్పటికి వస్తున్న సమాచారం. ప్రభుత్వం చెబుతున్న భూమిలో దళితులే వ్యవసాయం చేసుకుంటున్నారని కొన్ని కథనాలు వచ్చాయి. ఆ ధైర్యంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే మొత్తం ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని హరీష్‌రావు సవాల్ విసిరారనుకోవాలి. సిద్దిపేట వద్ద హరీష్ రావుకు చెందిన భూములను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించి పరిశీలించారు. తొలుత అక్రమ భూములు అని అన్నారు. ఇప్పుడేమో తక్కువ ధరకు కొన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై క్లారిటీతో ఉంటే మంచిది. గత డెబ్బై ఐదేళ్లుగా వచ్చిన పలు భూ సంబధిత చట్టాలు ఎంతవరకు అమలు అవుతున్నాయో ఈ ఆరోపణల పర్వం తెలియచేస్తుంది.ఇదీ చదవండి: బాబూ.. వాటర్‌మ్యాన్ బిరుదుకు ఇంతే క్వాలిఫికేషనా?!అస్సైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, లాండ్ సీలింగ్ భూములు ఇలా అనేక రకాల భూములు కాలక్రమంలో చట్టాలతో నిమిత్తం లేకుండా అన్యాక్రాంతం అవుతున్నమాట నిజమే. కాకపోతే దీనికి ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. భూ సంస్కరణల చట్టం వచ్చిన రోజుల్లో నిర్దిష్ట పరిమితికి మించి ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ లెక్కలు తీసే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదని చెప్పాలి. రేవంత్ రెడ్డి 22 ఎ సెక్షన్ కింద నిషేధిత భూముల జాబితాలో చేరిన లక్షల ఎకరాల భూమిపై బాధితులకు ఊరట కలిగిస్తారని అంతా అనుకున్నారు. కాని ఆయన చెప్పిన 12 విధానాల వల్ల ఎంతవరకు ఆ సమస్య పరిష్కారం అవుతుందో అప్పుడే తెలియదు.రేవంత్ సీఎం కనుక జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసాన్ని 22 ఎ నుంచి చకచకా తొలగించి ఉండవచ్చు. కాని సామాన్యుడికి ఆ పరిస్థితి ఉండదన్నది నిజం. వారు అధికారుల చుట్టూ తిరగక తప్పదు. ఈ రాజకీయ వేడితో అధికారులు తగు నిర్ణయాలు చేయడానికి వెనుకాడతారు. విశేషం ఏమిటంటే రేవంత్ కేవలం రాజకీయపరంగా మాత్రమే ఆరోపోణలు చేశారు. రాజకీయ నేతలు మాత్రమే భూముల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారా? లేక ఇతర వర్గాలవారు కూడా అలాగే చేశారా? అంతెందుకు! రేవంత్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఒక మీడియా సంస్థ కొనుగోలు చేసిన వేల ఎకరాల భూములలో పెద్ద ఎత్తున అస్సైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దానిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు పోరాటం కూడా చేశారు. ఆ సంస్థ తప్పు చేసిందా? లేక కరెక్టుగా చేసిందా అన్నదానిపై గత కేసీఆర్ ప్రభుత్వం చెప్పలేదు. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం కూడా తేల్చదు. దానికి కారణం అందరికి తెలుసు కదా!ఇదొక్కటే కాదు. అనేక మంది బడాబాబులు చట్టాలను ఉల్లంఘించి భూములను కొనుగోలు చేశారనో, అక్రమించారనో తరచు వార్తలు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎంత శాతం మందిపై చర్య తీసుకుంటున్నారంటే సమాధానం దొరకదు. కేసీఆర్ కుటుంబంపై వచ్చిన ఆరోపణల మీద కేటీఆర్ గట్టిగానే స్పందించారు. ఈ క్రమంలో రేవంత్ కుటుంబంపైన ఆయన ఆరోపణలు చేశారు. రేవంత్ జీవితం ఎలా ఆరంభం అయింది? ఆయన ఆర్ధిక స్తితిగతులు ఏమిటి? జూబ్లిహిల్స్‌లో ఎలా ఇంటిని నిర్మించారు? ఆయన సొంత ప్రాంతంలో భూమి ఎలా కొనుగోలు చేశారు అన్నదానిపై విమర్శలు చేశారు. ఫ్యూచర్ సిటీలో రేవంత్ సోదరులకు చెందిన సంస్థకు అతి తక్కువ ధరకు రెండు ఎకరాలు ఎలా ఇచ్చారని కూడా ప్రశ్నించారు.హరీష్ రావు నిర్దిష్టంగా రేవంత్ కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. వీరిద్దరు చేసిన అభియోగాలలో ఎన్నిటికి ఆధారాలు ఉన్నాయో తెలియదు. కాని పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్న నేపథ్యంలో ప్రజలలో ఇదొక చర్చగా ఉంటుంది. రేవంత్ వ్యూహాత్మకంగానే 22ఏ అంశాన్ని రాజకీయంగా మార్చారని అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో తన ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, హామీలు అన్నీ నెరవేర్చడం కష్టమైన పరిస్థితి మొదలైన అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని తెలివిగా కేసీఆర్ కుటుంబంపై భూముల ఆరోపణలు చేసి ప్రజల దృష్టి మరలించడానికి యత్నించినట్లు అనిపిస్తుంది. 22 ఎ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ, రేవంత్ స్వయంగా ఆ విషయంపై మళ్లీ మూడు గంటలు ప్రసంగించడం, బీఆర్ఎస్ పైన, కేసీఆర్ కుటుంబంపైన దాడి చేయడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది.అయితే ఈ క్రమంలో కేసీఆర్ కుటుంబంతో పాటు తన కుటుంబంపై కూడా వచ్చిన ఆరోపణలకు రేవంత్ జవాబు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. హైకోర్టు లేదా సుప్రింకోర్టు సిటింగ్ జడ్జితో ఈ ఆరోపణలన్నిటిపైన విచారణకు సిద్దమని కేటీఆర్, హరీష్‌లు సవాల్ విసిరారు. దీనిపై రేవంత్ లేదా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంటుంది. ఈలోగా మంత్రుల కమిటీ వేయడంతో ఈ కధ ఎన్ని మలుపులు తిరుగుతుందో అప్పుడే చెప్పలేం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్ లేదు: హరీశ్‌రావు
సాక్షి, తెలంగాణ: వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్ లేదని, కనీసం అందులో బాత్రూం కూడా లేదని, తనకు ఉన్న ఆస్తులన్నీ ప్రతి ఎన్నికల్లో పొందుపరిచే అఫిడవిట్లలో తెలిపానని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పష్టం చేశారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్ కోసం రైతులకు నవంబర్ 2016 పరిహారంను ప్రభుత్వం చెల్లించిందని, జూన్ 2018లో రిజర్వాయర్ పూర్తి అయిందని, ఆగస్టు 2018–2024 వరకు 11 డాక్యుమెంట్లలో 13 ఎకరాల భూమిని కొనుగోలు చేశానన్నారు.తన భూమి కొనుగోలులో ఒక్క చిన్న తప్పు ఉందని నిరూపించినా మొత్తం భూమి ని ప్రభుత్వానికే వదిలేస్తానని హరీశ్ ప్రకటించారు. శుక్రవారం కాంగ్రెస్ ఎంపీల పర్యటించిన నేపథ్యంలో సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో «ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డెవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, అందులో భాగమే తన వ్యవసాయ భూమి వద్దకు కాంగ్రెస్ ఎంపీల పర్య టన అని మండిపడ్డారు.సీఎం తమ్ముళ్ల, మంత్రి పొంగులేటి, ఆయన కొడుకు చేస్తున్న భూ దందాలను బీఆర్ఎస్ ఎండగట్టినందుకే తమపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ఎంపీల బృందం వస్తే కడు పు నిండా భోజనం పెట్టి తీసుకువెళ్లి వ్యవసాయ క్షేత్రంను చూపిద్దామనుకున్నాని హరీశ్ చెప్పారు.ప్రభుత్వంలో ఉండి యాత్రలా?ప్రభుత్వాలు వాస్తవాలను దాచిపెట్టినప్పుడు ప్రతిపక్షాలు యాత్రలు చేసి నిజనిర్ధారణకు వెళ్తాయి కానీ అధికారంలో ఉండి ప్రభుత్వమే యాత్రలకు రావడం శోచనీయమన్నారు.కేసీఆర్ హయాంలో కాళేశ్వరంతో పాటు ఏడు ప్రాజెక్టులకు అనుమతులు రాగా...ఇప్పుడు ఆ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టిందన్నారు.ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ గోదావరి నీళ్లను ఎత్తుకుపోవాలని చూస్తుంటే కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీలు దండయాత్ర చేయాలన్నారు. మెట్రో ఫేజ్–2కు, పాలమూరు ఎత్తిపోతల, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదని, వీటి సాధన కోసం, రాష్ట్ర హక్కుల కోసం కలిసికట్టుగా కేంద్రంపై పోరాడాలి కానీ.. రాజకీయ కక్షసాధింపుల కోసం యాత్రలు చేయకూడద న్నారు.దళితులకు చెందిన 300 ఎకరాల భూమిని కేసీఆర్ కబ్జా చేయలేదని తేలితే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా ? అని హరీశ్ సవాల్ విసిరారు. దళితుల భూమి కబ్జా చేసినట్లు తేలితే తామంతా రాజీనామా చేస్తామని, ఇందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు హరీశ్‌రావు సవాల్ చేశారు.ఇదీ చదవండి: ఎల్‌నినోపై సమగ్ర వ్యూహం -
ముందస్తు కార్యాచరణ అమలు చేస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం.. ఫలితంగా జలాశయాల్లోకి నీటి ప్రవాహం తగ్గుదల, వ్యవసాయంపై ఒత్తిడి, విద్యుత్ డిమాండ్ పెరుగుదల వంటి పరిణామాలు తలెత్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమస్య తీవ్రతను ముందుగానే అంచనా వేసి ఏప్రిల్ నుంచే వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. శాసనసభలో ఎల్‌నినోపై లఘు చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు.సెప్టెంబర్ 18 నాటికి సాధారణంగా 640 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది 543 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందన్నారు. ఎల్‌నినో పరిస్థితులు రాబోయే ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రధాన, మధ్య తరహా ప్రాజెక్టుల మొత్తం 553 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 311 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, గోదావరి బేసిన్లో 255 టీఎంసీలకు గాను 154 టీఎంసీలు ఉన్నాయని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 808 టీఎంసీల సామర్థ్యానికి 465 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. రిజర్వాయర్లు, చెరువులను నింపేందుకు మహాత్మా గాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, రాజీవ్ భీమా, జె.చొక్కారావు దేవాదుల, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల ద్వారా చర్యలు చేపట్టామని చెప్పారు. వర్షాలు తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి కూడా పడిపోయిందని, గత ఏడాది ఇదే సమయంలో 1,940 మెగావాట్లుగా ఉన్న హైడల్ ఉత్పత్తి ఈ ఏడాది 422 మెగావాట్లకు పరిమితమైందని తెలిపారు. సెప్టెంబర్ 9న ఉదయం 10.41 గంటలకు తెలంగాణలో 19,543 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని, గతేడాది సెప్టెంబర్ 9న గరిష్ట డిమాండ్ 15,585 మెగావాట్లు కాగా, ఈ ఏడాది దాదాపు 4,000 మెగావాట్ల అదనపు భారం ఏర్పడిందన్నారు.ప్రాణహిత–చేవెళ్ల కడదామా? వద్దా? తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి బీజేపీ సహకరిస్తుందా? లేదా? స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యులు ప్రాణహిత–చేవెళ్ల అంశాన్ని ప్రస్తావించడంతో భట్టి స్పందించారు.కరువుపై కేంద్ర సాయం ఏదీ: మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏవిధంగా సహకరిస్తుందో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తి చేసి ఆదిలాబాద్‌కు నీళ్లు అందించేందుకు సహకరిస్తారా అని మహేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఉపాధి విషయంలో ప్రత్యేక చర్యలు: మంత్రి సీతక్క ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై తీవ్రంగానే ఉండనున్నందున ఉపాధి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క తెలిపారు. లఘు చర్చలో ఆమె మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి భద్రత, గ్రామీణ ఉపాధి, నీటి సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని చెప్పారు.రాష్ట్రంలోని 34 జలాశయాలను తాగునీటి సరఫరాకు వినియోగిస్తున్నామని, జలాశయాల్లో నీటి మట్టాలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నీటి కొరతను ఎదుర్కొనేందుకు చేతిపంపులు, బావులు, స్థానిక నీటి సరఫరా పథకాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైతే బోర్లను అద్దెకు తీసుకుని సమీప వనరుల నుంచి నీటిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ‘తెలంగాణ జల సిరి’కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆతీ్మయ భరోసా కింద రూ.50 కోట్లను చెల్లించినట్టు సీతక్క తెలిపారు.జాతీయ విపత్తుగా ప్రకటించాలి: కూనంనేని ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కరువు జిల్లాలను ప్రకటించి రైతులు, ప్రజలను ఆదుకోవాలని కోరారు. లఘు చర్చలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో నేపథ్యంలో ఈ ఏడాది పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించి కూలీలను ఆదుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలపై రైతులు ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఏపీ కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుంటోందని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సీఎం సొంత గ్రామం రైతులకే దిక్కు లేదు.. ఏలేటి ఎల్‌నినో ప్రభావంపై డాక్టర్ చిన్నారెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రూ.802.92 కోట్లను ఖర్చు చేశారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కమిటీ సిఫారసులను ప్రభుత్వం అమలు చేయలేదని తప్పుబట్టారు. చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో నిపుణుల కమిటీ ఉందో లేదో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోయారని విమర్శించారు. వర్షాలు లేక రైతులకు బోరుబావులే దిక్కు అయ్యాయని, కరెంట్ ఎక్కడ అని ప్రశ్నించారు. 6–8 గంటలు కూడా సరిగ్గా కరెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు.కరువు నేపథ్యంలో రైతుల నుంచి పంట రుణాలు వసూలు చేయకుండా బ్యాంకర్లకు సూచనలు జారీ చేయాలని బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ సూచించారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 100 శాతం ఇళ్లకు మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని సభలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పూర్తిగా అవాస్తవమని, కేవలం 40 శాతం ఇళ్లకే వస్తోందని మరో సభ్యులు పాల్వాయి హరీశ్‌బాబు ఆరోపించారు. ఇదీ చదవండి: 22ఏ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ -
MLA దానంపై వేటు హైకోర్టు సంచలన తీర్పు
-
నిజాంను పొగిడే నేతల డీఎన్ఏ టెస్ట్ చేయాలి: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పటేల్ సంకల్పంతో తెలంగాణకు విమోచనం కలిగిందని.. అలాంటిది నిజాంను పొగిడే నాయకులు ఓసారి ఇక్కడి పోరాట చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో కాస్త తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.గురువారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్రం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ నాలుగు పండుగలు ఒకేసారి వచ్చాయని ఆయన అన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు, తెలంగాణ విమోచన దినోత్సవం ఒకేరోజు రావడం ప్రత్యేకమన్నారు. దేశమంతా 1947లో స్వాతంత్ర్యం పొందితే.. తెలంగాణకు ఏడాది ఆలస్యంగా స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సంకల్పంతో తెలంగాణకు విమోచనం కలిగిందన్నారు.నిజాం పాలనపై తీవ్ర వ్యాఖ్యలునిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ ప్రజలు విమోచనం సాధించుకున్నారని బండి సంజయ్ అన్నారు. వీర బైరాన్‌పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వంటి ప్రాంతాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అలాంటి చరిత్రను పక్కనపెట్టి నిజాంను గొప్పవాడిగా చిత్రీకరించడం సరికాదని అన్నారు.నిజాంను పొగిడే నాయకులు తెలంగాణ పోరాట చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీలో నిజాంను ప్రశంసిస్తూ మాట్లాడటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకుని రక్తపాతం సృష్టించిన నిజాం పాలనను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. నిజాంను పొగిడే నేతలకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని, అసలు వారు ఈ దేశ పౌరులేనా? లేక విదేశీ డీఎన్ఏ ఉందా? అనేది చూడాలంటూ వ్యాఖ్యానించారు.చరిత్రను భావితరాలకు చెప్పాలితెలంగాణ పోరాట చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని బండి సంజయ్ చెప్పారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు. గత 12 ఏళ్లలో తెలంగాణకు రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసిన చరిత్ర మోదీ ప్రభుత్వానిదేనని బండి సంజయ్ పేర్కొన్నారు.అవినీతిపై విమర్శలుకొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని విస్మరించి అవినీతికి పాల్పడుతూ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికే పరిమితమవుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. అవినీతికి తావులేకుండా మోదీ పాలన కొనసాగుతోందని అన్నారు.తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కావాలో ఆలోచించుకోవాలని ఆయన కోరారు. అవినీతిమయమైన పాలన కావాలా? అవినీతి రహిత పాలన కావాలా? తెలంగాణ చరిత్రను తెరమరుగు చేసే పాలన కావాలా? లేక ఆ చరిత్రను భావితరాలకు అందించే పాలన కావాలా? అని ప్రశ్నించారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీకి ప్రతి తెలంగాణ పౌరుడు మద్దతు ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోరాట చరిత్రను పాట, సంగీతం, దృశ్యరూపంలో ప్రజలకు అందించిన ఆకుల నాగేశ్వర్, వందేమాతరం శ్రీనివాస్, దీపికలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇదీ చదవండి: ‘ఎవరి ఆస్తులు ఎంతో తేలుద్దామా?’.. కేటీఆర్ సవాల్ -
అసెంబ్లీకి అనూహ్య ఎక్స్టెన్షన్.. మరో రెండు రోజులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయనుకుంటే.. అనూహ్యంగా పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారంతోనే సమావేశాలు ముగుస్తాయని ఇప్పటివరకు భావించినప్పటికీ.. ఇవాళ కాకుండా మరో రెండు రోజుల పాటు సభను నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ సమావేశాల వ్యవధిపై ఆసక్తి నెలకొంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో.. ఈ అంశంపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఎన్నికల హామీల అమలు, ఇప్పటివరకు సాధించిన పురోగతిపై సభలో వివరించే అవకాశం ఉంది. మరోవైపు వెయ్యి రోజుల పాలనపై ‘మోసం’ పేరిట బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో.. సభా వేదికగా వాటికి సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల భర్తీ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం ఉంది. ఇవాళ్టి సమావేశాల బ్రేకులో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ ఈ అంశాన్ని ప్రస్తావించారని సమాచారం. అయితే సాయంత్రంకల్లా దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.22ఏపై నేడు చర్చమరోవైపు ఎల్ నినోతో పాటు 22ఏ నిషేధిత భూముల అంశంపై కూడా గురువారం మధ్యాహ్నం తర్వాత సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 22ఏ జాబితాలో ప్రైవేటు భూములు చేరడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం తన వైఖరిని సభలో స్పష్టం చేయనుంది.రెండు రోజులు ఎందుకు?అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుస్తాయని అంతా భావించిన వేళ.. మరో రెండు రోజులు పొడిగించే ఆలోచన తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. వెయ్యి రోజుల పాలనపై చర్చతోపాటు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం సమగ్రంగా వివరించే అవకాశం ఉంది. తద్వారా బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు సభా వేదికగానే సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశాల పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగుతాయన్నది స్పష్టత రానుంది. -
సీఎంగా తలసాని.. ఉత్తమ్‌గా పల్లా.. మాక్ అసెంబ్లీలో నవ్వులే నవ్వులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ వర్షాకాల సెషన్ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆ పార్టీ ప్రదాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించింది. బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో స్పీకర్ పాత్రను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావ్ పోషించారు. అలాగే సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర వేశారు. మంత్రి పొంగులేటి పాత్రలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మంత్రి ఉత్తమ్ పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అలరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా కేటీఆర్, హరీష్‌రావు.. మిగతా ఎమ్మెల్యేలు కనిపించారు.ఈ చర్చలో మాజీ మంత్రి జగదీశ్ ప్రశ్నలు వేయగా.. అవతలి నుంచి సమాధానాలు వచ్చాయి. సీఎం, మంత్రుల్ని ఇమిటేట్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన సందడి నవ్వులు తెప్పించాయి. కాంగ్రెస్ సర్కార్‌కు సెటైరిక్‌గా చివరి వరకు నడిచింది మాక్ అసెంబ్లీ. LIVE: తెలంగాణ భవన్ లో ''మాక్ అసెంబ్లీ'' కార్యక్రమంhttps://t.co/2C1qZvGBQB— BRS Party (@BRSparty) September 12, 2026సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుపడుతున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుల్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. అయితే కీలక హామీలు నెరవేర్చకపోవడం, ప్రజా సమస్యలు, పలు కీలక అంశాలపై చర్చకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం తమను సభలో లేకుండా చేసిందని బీఆర్ఎస్ అంటోంది. ఈ క్రమంలోనే మాక్ అసెంబ్లీ నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: ఇంతకీ ఆమెకు ఏమైంది?.. ఎక్కడ? -
బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపనుంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఎదురైన పరిణామాలను జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయించబోతోంది.సభ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ ఈ అసెంబ్లీ సమావేశాల సెషన్ నుంచి 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గురువారం ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో వాళ్లంతా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపాలని నిర్ణయించారు. అసెంబ్లీ వద్ద పోలీసులు దాడి చేశారని.. తమతో అనుచితంగా ప్రవర్తించారని ఎన్హెచ్ఆర్సీతో పాటు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయయనున్నారు. అలాగే హోం శాఖపైనా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. తెలంగాణ హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ పరిణామాలకు సంబంధించిన ఫొటో, వీడియో ఫుటేజీలను ఇప్పటికే ఆ పార్టీ బహిరంగంగా ప్రదర్శించింది. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫొటోలు నకిలీవంటూ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ సాయంత్రానికే సబిత, సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో మహిళా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: స్మార్ట్ రేషన్ కార్డ్‌లో అన్నీ తప్పులే! -
బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. ఈ సెషన్ మొత్తానికి ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని ప్రకటించారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడడమే ఇందుకు కారణంగా ఆయన తెలిపారు.బుధవారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. సభా కార్యకలాపాలకు బీఆర్ఎస్ సభ్యులు అడ్డుపడ్డారు. మంత్రులు మాట్లాడుతున్న టైంలో.. స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి నినాదాలు చేశారు. నిన్న కేసీఆర్ ఫామ్‌హౌజ్ ముట్టడికి కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రయత్నించిన క్రమంలో.. తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ (We Want Justice) నినాదాలు చేశారు.ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్.. వెళ్లి సీట్లలో కూర్చోవాలని బీఆర్ఎస్ సభ్యుల్ని కోరారు. అయితే వాళ్లు ఆ మాట వినలేదు. దీంతో వాళ్లను సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పీకర్‌ను కోరారు. ఆ వెంటనే వాళ్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. సస్పెండ్ అయిన వాళ్లలో.. కేటీఆర్, హరీష్‌రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, అనిల్ జాదవ్, కోవాలక్ష్మీ మాణిక్‌రావు, గంగుల కమలాకర్, సంజయ్ కుమార్, సునీతా లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని, చింత ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు 22 మంది ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత సభ కాసేపు వాయిదా పడింది. ఆ సమయంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ ఛాంబర్ వద్ద మార్షల్స్ కేటీఆర్, హరీశ్‌రావును అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మండలి నుంచి వాకౌట్ఇటు శాసనమండలిలో తమ ఇద్దరు సభ్యుల సస్పెన్షన్‌పై ఓటింగ్ నిర్వహించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కోరింది. అందుకు ఆయన అనుమతించలేదు. తమను మాట్లాడేందుకు అనుమతించకపోవడం దారుణమంటూ మండలి విపక్ష నేత మధుసూధనాచారి నిరసన వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం తన తప్పును అర్థం చేసుకొని యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. సభ ఉన్నత విలువలు పాటించాలి. మా అధినేత కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కోడతారట. ఎక్కడైనా ఇలా ఉంటుందా?. తెలంగాణకు అనేక సేవలు అందించిన మహానుభావుని చావు కోరుతారా?. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి...మా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు. నిన్న సభలోకి వస్తె వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలి. మా సభ్యులు సభలోకి వచ్చేవరకు మా నిరసన కొనసాగుతుంది. మా సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలి. మమల్ని ఎత్తివేస్తారా?. ఇది ప్రీ ప్లాన్డ్ కుట్ర. నిన్న పెట్టిన తీర్మానం పై చర్చ జరగాలి అని డిమాండ్ చేశారు. అయినా చైర్మన్ అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.ఇదీ చదవండి: ఇది ఫామ్‌హౌజ్‌లో జరిగిన కుట్రే! -
లోక్‌భవన్‌కు బీఆర్ఎస్.. కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల వేడి కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. బీఆర్ఎస్ నేతలు నేడు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవాలని నిర్ణయించింది. గత రెండు రోజులుగా కొనసాగిన పరిణామాలపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటు అధికార కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్‌కు సిద్దమైంది. ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు లోక్‌భవన్‌కు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వెళ్లాల్సి ఉంది. అయితే అనుకున్న టైం కంటే అరగంట ముందుగానే గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. పది మంది ఎమ్మెల్యేల బృందం ఆయన్ని కలవనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా పోలీసుల జులుం.. మహిళా ఎమ్మెల్యేలతో ప్రవర్తించిన తీరు, ఎమ్మెల్సీల అరెస్టులు.. నిన్న ఎర్రవల్లికి వెళ్తుండగా అడ్డగింతలు.. ఇలా ఇటీవల చోటుచేసుకున్న దాడుల ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్‌కు సిద్ధమవుతోంది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారాన్ని రేవంత్ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది. మధుతో పాటు నవీన్‌కుమార్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయించే దిశగా.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇటు ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరై క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే.. అప్పటిదాకా బీఆర్ఎస్ నేతలకు మైక్ ఇవ్వకూడదని స్పీకర్‌ను కోరాలని చూస్తోంది. నేడు మండలిలో కీలక చర్చమరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజుకు చేరుకోనున్నాయి. శాసనమండలిలో తాతామధు వ్యవహారంపై చర్చ జరగనుంది. ఈ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన శాసనసభలో ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి.. తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకుగానూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌ను కలిసి దాడుల ఘటనలపై ఫిర్యాదు చేయనుండగా.. మరోవైపు అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి అవకాశం ఉండటంతో తెలంగాణ రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏం తమాషా చేస్తున్నారా? లోపలేస్తా.. -
తెలంగాణలో హీటెక్కిన రాజకీయ వాతావరణం
తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ ఆందోళనలతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. మంగళవారం ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో వివాదం మరింత ముదిరింది. హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎర్రవల్లికి తరలిరావడంతో వాతావరణం మరింత హీటెక్కింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీ నిరసనలు కొనసాగుతున్నాయి. చెన్నూర్ పట్టణంలో హైటెన్షన్కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా నిరసనలకు దిగడంతో మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్, కేటీఆర్, తాతా మధు చిత్ర పటాలకు చెప్పుల దండలు వేసి నిరసన తెల్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. ఒకే ప్రాంతంలో రెండు పార్టీల నిరసనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమై అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్- సిద్ధిపేట రహదారిలో ట్రాఫిక్ జామ్బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో హైదరాబాద్- సిద్ధిపేట రహదారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ కేత్రం వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో షామీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరదరాజ్‌పూర్‌లో పరస్పర దాడులుసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం వరదరాజ్ పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటీపోటా నిరసనలకు దిగారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ దగ్ధం చేయగా, మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణ చోటు చేసుకున్నాయి. చెప్పులు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. జమ్మికుంటలో తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తాతా మధు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. నకిరేకల్‌లో బీఆర్ఎస్ బైక్ ర్యాలీతమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో అసెంబ్లీ వద్ద వ్యవహరించిన తీరుకు నిరసనగా నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. చదవండి: ఎర్రవల్లిలో టెన్షన్.. టెన్షన్ఐలయ్య నివాసం వద్ద డప్పు కొట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలుకేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట చావుడప్పు కొడతానన్న ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ఆయన నివాసం వద్ద డప్పులు కొట్టి నిరసన తెలిపారు. బీర్ల ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలిజగిత్యాల జిల్లాలోని కోరుట్ల, కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల నిరసన తెలిపారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా నాయకులపై అనుచిత ప్రవర్తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రోడుపై బైఠాయించి నిరసన తెలపడంతో వాహన రాకపోకలు అంతరాయం కలిగి, ట్రాఫిక్ స్తంభించింది. ఇదీ చదవండి: 'కేసీఆర్ ఇంటిని టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే'తాతా మధును బర్తరఫ్ చేయాలికామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ నాయకుల నిరసన చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే ఆ పదవి నుండి బర్తరఫ్ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గంప గోవర్ధన్ అరెస్ట్కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే కమాన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వినతిపత్రం సమర్పించి రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రైల్వే కమాన్ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవరకొండలో కాంగ్రెస్ బైక్ ర్యాలీబీఆర్ఎస్ అధినేత పోకడలను వ్యతిరేకిస్తూ నల్లగొండ జిల్లా దేవరకొండలో ఎమ్మెల్యే బాలూ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా బాలూ నాయక్ మాట్లాడుతూ.. అసెంబ్లీకి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమైన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు మోసానికి గురయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్న సైకో రేవంత్! 😡🚨 రేవంత్ రెడ్డి ఆదేశాలతో..కాంగ్రెస్ గూండాలకు బందోబస్తు ఇస్తూ ఎర్రవెల్లిలో కేసీఆర్ గారి ఇంటి మీద దాడికి తీసుకెళ్తున్న పోలీసులు!శాంతిభద్రతలు కాపాడాల్సిన సీఎం, హోం మంత్రి.. రేవంత్ రెడ్డి స్వయంగా దాడులను ప్రోత్సహిస్తావా? ఇదేనా… pic.twitter.com/sO60gB1SWP— BRS Party (@BRSparty) September 8, 2026 -
‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్‌ను ఓదార్చిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన సభాపతిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయించే దిశగానూ ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మంగళవారం అసెంబ్లీ సమావేశాల బ్రేక్ టైంలో.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఆయన చాంబర్లో కలిశారు. నిన్నటి పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం అండగా ఉంటుందని స్పీకర్‌కు భరోసా ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని.. ఎవరినీ వదిలపెట్టబోమని స్పష్టం చేశారు.సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఈ పరిణామంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో నిన్న కంటతడి పెట్టారు. అయితే స్పీకర్ పట్ల బీఆర్ఎస్ నేతల తీరు అమానుషమని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది చీకటి రోజు అని.. బాధ్యులపై చర్యలు తప్పవంటూ సభలో మాట్లాడారు. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలపై ఈ ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యవహారశైలిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న అంశంపై న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీలో తీర్మానం చేసి మండలికి పంపాలని.. ఇద్దరి సభ్యత్వాన్ని రద్దు చేయించే అంశాల్ని ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. మరోవైపు.. అసెంబ్లీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఆందోళన సందర్భంగా మహిళా పోలీసులతో బీఆర్ఎస్ నేతలు అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మహిళా కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, వారితో అనుచితంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: తిట్టింది నీ తల్లిని కాదు.. హరీశ్‌రావుపై స్పీకర్ ఆగ్రహం -
అసెంబ్లీలో స్పీకర్-హరీశ్‌రావు-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజు.. నిన్నటి పరిణామాల నేపథ్యంగా హాట్ హాట్‌గా మొదలైంది. నల్ల బ్యాడ్జీలతో సెషన్‌కు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు.. నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం దారుణం. నిన్న మా పట్ల పోలీసులు దురుసుగా పవ్రర్తించారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు. సునీతా లక్ష్మారెడ్డి చీరలాగి అవమానించారు. కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ వ్యవహరించారు. అసెంబ్లీ కౌరవసభగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నా తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులు నా తల్లిని అసభ్యంగా దూషించారు. సునీత, సబితా, కోవా లక్ష్మి అంటే నాకు గౌరవం. వాళ్లు నాకు తోబుట్టువులతో సమానం. సబితమ్మకు జరిగిన దానిపై నేనే విచారణ చేయమని చెప్పా. మీ తల్లిని అనలేదు హరీశ్.. నా సంగతి ఏంటి?. ముందు నన్ను అవమానించిన అంశంపై మాట్లాడూ.. అంటూ స్పీకర్ మాట్లాడారు. ఆ సమయంలో.. చర్చ జరగకుండా డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. దళిత స్పీకర్ పట్ల అమానుషంగా వ్యవహరించారని.. జరిగిన దానిపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని చూడకుండా.. చొక్కాలు విప్పి ముందుకు రావడం ఏంటని? సీతక్క మండిపడ్డారు. నిన్నటి పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని స్పీకర్‌ను కోరారామె. ఆ సమయంలో హరీశ్ రావు మరోసారి జోక్యం చేసుకుని.. స్పీకర్‌గా మీపై మాకు గౌరవం ఉంది. మీ పట్ల వ్యాఖ్యలపై మా ఎమ్మెల్సీ నిన్ననే విచారం వ్యక్తం చేశారు. మేం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. విచారం వ్యక్తం చేశాక.. దీనిపై రాద్ధాంతం అవసరమే లేదు. కాంగ్రెస్‌కు నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే..ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ఎందుకు చేయలేదు?.. అని హరీశ్ రావు అన్నారు. అయితే హరీశ్‌రావు వైఖరి స్పీకర్నే బెదిరించినట్లు ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై జరిగిన దానిని పక్కన పెట్టాలట. స్పీకర్‌ను డిక్టేట్ చేయడం ఏంటి?. స్పీకర్ ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అని చెప్పడానికి వాళ్లెవరూ? అంటూ బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి పరిణామాలపై దర్యాప్తు జరుగుతోందని.. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయని అన్నారాయన. -
కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ పోలీసుల చక్కర్లు
సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యల నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిరసనలకు దిగింది. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్ ముట్టడికి పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ విధించి.. పోలీసులు భారీగా భద్రతను మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉండటంతో కేసీఆర్ ఫామ్‌హౌజ్ వైపు ఎవరినీ అనుమతించడం లేదు. అటు వైపు అన్ని మార్గాలను బారికేడ్లతో మూసివేసి, చుట్టుపక్కల పోలీసు వాహనాలతో నిరంతరం పహారా కాస్తున్నారు. ఇటు మర్కుక్ పోలీస్‌స్టేషన్ వద్ద కూడా భారీగా బలగాలను మోహరించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు డీసీఎంలను సైతం పోలీసులు సిద్ధంగా ఉంచారు. మరోవైపు ఎర్రవెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ధర్నా శిబిరాన్ని పోలీసులు ఎత్తివేయడంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.ఇదీ చదవండి: రేవంత్ సర్కార్‌పై హరీష్‌రావు ఫైర్ -
అరెస్టులతో ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్టులపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు తమ పార్టీ ప్రజాప్రతినిధులపై దాడులు చేసి, ఇప్పుడు వారినే అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఆరోపించారు. హైకోర్టు చెప్పినా పట్టించుకోకుండా కేసులు పెట్టి అరెస్టు చేయడం చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.ప్రతిపక్షం అంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేయడమే ప్రభుత్వ కుట్రా అని నిలదీశారు. 1000 రోజుల పాలన వైఫల్యాలు, 22ఏ భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్ విద్యార్థులు, రైతుల సమస్యలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే అరెస్టులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.“ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే” అంటే.. తప్పు చేసినవాడే ఎదుటివారిని నిందించడం అని హరీష్‌రావు పేర్కొన్నారు. పోలీసులు తమపై దాడి చేసి, ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్సీలనే అరెస్ట్ చేస్తున్నారని విమర్శిస్తూ.. “దొంగే పోలీసును మందలించినట్టుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. తమ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, గొంతు పిసికిన వారిపై చర్యలు తీసుకోకుండా తమపైనే కేసులు, అరెస్టులు చేయడం ఏమిటని హరీష్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించడాన్ని కూడా తప్పుబట్టారు. ఖాకీలను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటూ హిట్లర్ పాలనను తలపిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రతిపక్ష గొంతు నొక్కే ఎమర్జెన్సీ రాజ్యమని వ్యాఖ్యానించారు. ‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే అరెస్ట్.. ప్రజల సమస్యలపై మాట్లాడితే నిర్బంధం’ అంటూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ గొంతుకను అణచలేరని, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.శాసన సభ్యులను, మండలి సభ్యులను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రూరంగా , కర్కశంగా గౌరవ శాసన సభ్యుల ను, మండలి సభ్యుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించిన పోలీసులే నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు గౌరవ మండలి సభ్యులు తాత మధు, నవీన్ రెడ్డి లను అరెస్ట్ చేయడం…— Harish Rao Thanneeru (@BRSHarish) September 8, 2026 -
‘అందరం అరెస్ట్ అవుతాం!’.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల అరెస్ట్ పరిణామంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సవాల్ చేశారు. ‘మేము సిద్ధం.. మీరు సిద్ధమా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై జరిగిన ఘటనలో బాధ్యులపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.హైకోర్టు నిన్న స్పష్టమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తాతా మధు, నవీన్‌రెడ్డిపై కావాలనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి కోర్టులు, చట్టాల పట్ల ఉన్న గౌరవం ఏమిటో అర్థమవుతోందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ ‘డైవర్షన్ పాలిటిక్స్’ను గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమి సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. హామీలు అమలు అవుతాయి అంటే - బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీ లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాము! మేము సిద్ధం, మీరు సిద్ధమా? అలానే…— KTR (@KTRBRS) September 8, 2026 ఇదీ చదవండి: నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: సాక్షితో తాతా మధు -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన సభా స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కూడా పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అయితే అరెస్ట్ సమయంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హైడ్రామా నడిచింది. తెలంగాణ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా.. శాసనసభ ప్రాంగణంలో నిన్న తాతా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే తానేం దూషించలేదని నిన్ననే మధు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో.. ఈ ఉదయం ఎమ్మెల్సీ తాతా మధు ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ని ఇంట్లోంచి బయటకు రావాలని పిలిచారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుని మధు అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అనంతరం అధికారులు వాళ్లతో మాట్లాడి ఆయన్ని తమ వెంట తీసుకెళ్లారు. మరోవైపు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డిపై సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బలవంతంగా ఆయన్ని తరలించారు. మధును తరలిస్తున్న సమయంలో ఆయనతో మాట్లాడించేందుకు సాక్షి ప్రయత్నించింది. అయితే పోలీస్ అధికారి మైక్‌ను తోసేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మధు చెప్పారు. తాతా మధును నారాయణగూడ పీఎస్‌కు తరలించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మధు, నవీన్‌లను ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.ఇటు.. అసెంబ్లీ గేటు వద్ద నిన్నటి పరిణామాల నేపథ్యంలో పలు కేసులు నమోదు అయ్యాయి. పోలీసులతో అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి సహా మరికొందరిపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టినట్లు తెలుస్తోంది.తాతా మధు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. కలత చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో కంటతడి పెట్టారు. ఆ సమయంలో ‘‘మధు వ్యాఖ్యలు స్పీకర్‌కే కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా సభలోని ప్రతి సభ్యుడు ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వాన్ని శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని సీఎం డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: గొంతులు నొక్కారు.. చీరలు లాగారు.. -
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
రాజకీయ నాయకుడంటే ఒకప్పుడు ఖద్దరు, తెల్లటి కుర్తా, పైజామా.. లేదంటే ధోవతి, షర్టు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. రంగురంగుల దుస్తులు.. అందునా టీషర్టు కూడా రాజకీయ నాయకుడి ఆయుధంగా మారింది. సభలోకి వెళ్లే దుస్తుల దగ్గర నుంచి.. పార్టీ మీటింగ్‌లు, ప్రజల్లోకి వెళ్లే టైంలోనూ.. వాళ్ల వస్త్రధారణ వైవిధ్యంలో ఒక్కో రాజకీయ సందేశం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలను నల్ల టీషర్టు ఒక్కసారిగా కుదిపేసింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదన్నది వారి ఆరోపణ. టీషర్టులపై కూడా అదే సందేశాన్ని ముద్రించారు. కేటీఆర్, హరీష్‌రావు ఇలా చాలామంది నేతలు ఆ పని చేశారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో లోపలికి అనుమతించబోమని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. టీషర్టు ధరించి వస్తే తప్పేంటని? ఆ తర్వాత బీఆర్ఎస్ సైతం పోలీసులను, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిచింది.అయితే ఇక్కడ వాళ్లు వేసిన నల్ల టీషర్టు కేవలం దుస్తులు కాదు.. నిరసనకు కనిపించే గుర్తు. ఒకే రంగు, ఒకే సందేశం ఉన్న టీషర్టులతో పెద్ద సంఖ్యలో నేతలు కనిపిస్తే.. అది రాజకీయంగా ఒక విజువల్ స్టేట్మెంట్గా మారింది. నిజంగా పోలీసులు చెబుతున్నట్లు టీషర్టులు వేసుకుంటే సభలోకి అనుమతించకూడదా?..రాహుల్ గాంధీ.. తెల్ల టీషర్టే ఎందుకు?టీషర్టు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ఎక్కువగా కనిపించే పేరు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర నుంచి ఆయన తెల్ల టీషర్టు దాదాపు ఆయన రాజకీయ గుర్తింపులో భాగమైపోయింది. రాహుల్ స్వయంగా తెల్ల టీషర్టు తనకు ‘పారదర్శకత, సరళత’ను సూచిస్తుందని చెప్పారు. ఇది కేవలం సౌకర్యం కోసం వేసుకునే దుస్తులా? అంటే కాదు. రాజకీయ విశ్లేషణల్లో రాహుల్ తెల్ల టీషర్టును యువతతో కనెక్ట్ అయ్యే ఇమేజ్, సాధారణ మనిషికి దగ్గరగా కనిపించే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో సంప్రదాయ ఖద్దరు ఇమేజ్‌కు భిన్నంగా.. మరింత క్యాజువల్ లుక్‌ను ఆయన తన బ్రాండ్‌గా మార్చుకున్నారు. అదే రాహుల్ సందర్భంలో రంగు మారితే.. సందేశం కూడా మారింది. అంబేడ్కర్ అంశంపై నిరసన సమయంలో ఆయన నీలం టీషర్టు ధరించడం కూడా రాజకీయ సంకేతంగా చర్చకు వచ్చింది. పార్లమెంట్ బయట నిరసన సమయంలో నల్ల టీషర్టు ధరించడం, ఇతర కార్యక్రమాలకు ఆయా సందర్భాలను బట్టి కలర్ మార్చడం కూడా ఇదే కోవలోకి వస్తోంది.ఉదయనిధికి టీషర్టే బ్రాండ్!తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా టీషర్టును తన రాజకీయ ఇమేజ్‌లో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా డీఎంకే యువజన విభాగం లోగోతో కూడిన టీషర్టుల్లో ఆయన తరచూ కనిపిస్తారు. టీషర్టు ద్వారా యువతకు దగ్గరగా కనిపించడం, పార్టీ యువజన విభాగంతో తన అనుబంధాన్ని చూపించడం ఇందులోని రాజకీయ కోణం. పార్టీ కార్యక్రమాలకే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్త్రధారణ ఒక దశలో వివాదంగా మారింది. 2024లో ప్రభుత్వ కార్యక్రమాల్లో టీషర్టు, జీన్స్ ధరించడంపై ఆయనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. టీషర్టు అధికారిక దుస్తుల కిందకు వస్తుందా? అనే అంశంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.ఇది తెలుసా? ఆ ఎమ్మెల్యేను బయటకు పంపారుటీషర్టుపై రాజకీయ సందేశాన్ని ముద్రించుకోవడం కొత్తేమీ కాదు. కర్ణాటకలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం నినాదాలతో కూడిన టీషర్టులను ప్రచార సాధనంగా ఉపయోగించారు. 2021లో గుజరాత్ అసెంబ్లీలో ఎమ్మెల్యే విమల్ చుడాసమా టీషర్టు, జీన్స్‌తో రావడం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో చివరకు ఆయనను సభ నుంచి బయటకు పంపారు.టీషర్టు.. ఇంత పవర్‌ఫుల్లా?దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. యువత కనెక్ట్. రాజకీయ నాయకుడు కూడా మనలాగే టీషర్టు వేసుకుంటే.. అతడు ‘నేత’ కంటే ‘మనలో ఒకడు’ అనే భావన కలిగించవచ్చు. పైగా ఈ జెన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో ఇది బాగా సింక్ అవుతోంది కూడా. రెండోది.. నిరసనకు సులభమైన గుర్తు. నల్ల టీషర్టు, నీలం టీషర్టు, నినాదాలు ముద్రించిన టీషర్టులు.. సభలోనైనా, రోడ్డుపైనైనా వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. మూడు.. పొలిటికల్ బ్రాండింగ్. ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే నినాదంతో వందల మంది కనిపిస్తే అది కళ్లకు కనిపించే ప్రచారంగా మారుతుంది. ఇక కంఫర్ట్ అనేది ఆయా నేతలకు ప్రధానంగా కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు రాజకీయాల్లో టీషర్టు కేవలం దుస్తులు కాదు.. ఒక స్టేట్మెంట్. ఎవరు ఏ రంగు వేసుకున్నారు? దానిపై ఏం రాశారు? ఎక్కడ వేసుకున్నారు? అనే దానికీ రాజకీయ అర్థం వెతికే పరిస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ టీషర్టు వివాదం.. ఈ ‘టీషర్టు పాలిటిక్స్’కు మరో ఉదాహరణగా నిలిచింది.ఇదీ చదవండి: త్రిషపై కామెంట్లు.. విజయ్ సాలిడ్ వార్నింగ్ -
కేసీఆర్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నీళ్ల సమస్యకు కేసీఆర్ కూడా ఓ కారణమేనని, ఇరిగేషన్‌ను నాశనం చేసిందే ఆయనని అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా చిట్‌చాట్‌లో ఉత్తమ్ మాట్లాడుతూ..తెలంగాణలో నీటి సమస్యకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ అయితే.. రెండోది ఎల్‌నినో ప్రభావం. ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు. నీళ్ల పంపకాల విషయంలోనూ అన్యాయం చేశారు. ఆయన వల్లే ఇవాళ నీళ్లు లేని పరిస్థితి. భారీగా ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును సరిగా నిర్మించి ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. నేనే ఇంజనీర్‌ను అంటూ కాళేశ్వరం కట్టి మరీ కూల్చారు. ఇంజినీర్లు చెప్పినట్లు ఉంటే.. ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యి ఉండేది. ఆయన హయాంలో భారీగా నిధులు ఖర్చు చేసినా ఆశించిన మేర ఆయకట్టుకు నీరందలేదు. ఇదే కాదు.. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ ఆయన ఇలాగే చేశారు. అసలు ఎస్ఎల్బీసీని పూర్తి కాకుండా గత ప్రభుత్వమే అడ్డుకుంది. ప్రస్తుతం మా ప్రభుత్వం దాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది. బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయితే మేమేం చేయగలం?’’ అని ఉత్తమ్ చెప్పారు.కేసీఆర్ గతంలో బూతులు మాట్లాడినప్పుడు కొందరు ఆయన్ను హీరోగా భావించారని, ఇప్పుడు అదే తరహా విమర్శలు ఆయనపై వస్తే మాత్రం నానాయాగీ చేస్తున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ వాడిన భాష తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ వాడలేదు. తెలంగాణ భాష ఇలా అవ్వడానికి కేసీఆర్ రే కారణం. కేసీఆర్ మాటలు అన్ని తెలిసినట్లే ఉంటాయి.. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం జీరో. నీళ్ల కోసం పాదయాత్ర చేస్తానన్న కేసీఆర్ ప్రకటనపైనా ఉత్తమ్ స్పందిస్తూ.. ఆయన పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుకుంటారని, ఇరిగేషన్ విషయంలో ఆయన బయటకు రాకుండా ఫామ్‌హౌజ్‌లో ఉంటేనే బెటర్ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల వేళ కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య సాగుతున్న ఈ నీటి రాజకీయ వివాదం మరింత వేడెక్కేలా కనిపిస్తోంది.ఇదీ చదవండి: ఇరిగేషన్‌పై బీఆర్ఎస్ది బోగస్ ప్రచారమే! -
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ప్రతిపక్షంపై పోలీసులు దౌర్జన్యకాండకు దిగారు. సోమవారం ఉదయం నల్ల టీషర్లుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు వద్దే అడ్డుకున్నారు. ఆ దుస్తులతో అనుమతించబోమని చెప్పారు. అయితే తమను లోపలికి అనుమతించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టడంతో మెయిన్‌గేట్ వద్ద హైడ్రామా నడిచింది. తెలంగాణ అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో నేల మీద పడుకుని పలువురు నేతలు నిరసన తెలిపారు. తన టీ షర్ట్ తీసేసి.. ఇప్పుడైనా అనుమతించాలని హరీశ్‌రావు కోరారు. అయినా పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో వాగ్వాదం కాస్త.. తోపులాటగా మారింది. పోలీసులు నెట్టేయడంతో పలువురు బీఆర్ఎస్ నేతలు కిందపడిపోయారు. కేటీఆర్, హరీష్ రావులను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు తరలించిన పోలీసులు https://t.co/zHd2zxHm06 pic.twitter.com/kCuJ4jsztK— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026ఈ క్రమంలో సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు మెడ బట్టి నెట్టేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గాయాలయ్యాయి. కేటీఆర్ ముఖం, చేతులకు దెబ్బలు తగిలాయి. తన చీర లాగారంటూ సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టగా.. సబిత ఓదార్చారు. ఆపై హరీష్‌రావు, కేటీఆర్ సహా పలువురు నేతల్ని బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామాలతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అసెంబ్లీ ముందు కంటతడి పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డినలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులుకౌరవ సభలా మారిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు https://t.co/0Nua3mziEr pic.twitter.com/Ada7X5MXwj— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026అసెంబ్లీ వద్ద తమకు అవమానం జరిగిందని.. పోలీసులు తమతో ప్రవర్తించిన తీరుకు పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.స్పీకర్ చెబితేనే: డీసీపీ శిల్పవల్లిఅసెంబ్లీ గేటు వద్ద పరిణామాలపై స్థానిక డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నల్ల దుస్తులతో లోపలికి అనుమతించొద్దని స్పీకర్ ఆదేశించారని.. అందుకే అడ్డుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణల్లో నిజం లేదని.. తామేం అమర్యాదగా నడుచుకోలేదన్నారు. అలాగే.. వద్దని చెబుతున్నా బలవంతంగా నిరసనలకు దిగడంతోనే అదుపులోకి తీసుకున్నామని వివరించారు.ఇదీ చదవండి: ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి -
బీఆర్ఎస్ ప్లాన్‌కు రేవంత్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు 22ఏ భూములు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలను ప్రధాన అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అయితే ప్రతిపక్షం దూకుడును ముందే పసిగట్టిన రేవంత్ ప్రభుత్వం కౌంటర్‌కు దిగింది.22ఏ భూముల వ్యవహారంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపైనా చర్చించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తరఫున ఈ అంశాలపై చర్చకు ప్రతిపాదనను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పెట్టనున్నారు. సమావేశంలో చర్చించి వీటిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో బీఆర్ఎస్ లేవనెత్తాలనుకున్న అంశాలనే అధికార పక్షం చర్చకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.22ఏపై ఇప్పటికే రగడతెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వ్యవహారం కొంతకాలంగా రాజకీయ దుమారం రేపుతోంది. ప్రైవేటు భూములు సైతం నిషేధిత జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని బాధితులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. 22ఏ జాబితాలో భూములు చేరడంలో అధికారుల తప్పిదాలపై మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పారు. రిజిస్ట్రేషన్ సాధ్యం కాని కేసుల్లో అందుకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, ఇప్పటికే ఫీజు చెల్లించి ఉంటే నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనా ఫోకస్మరోవైపు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను బీఆర్ఎస్ ప్రధానంగా ప్రస్తావించనుంది. విద్యార్థులు, కళాశాలల సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కూడా ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశంపైనా చర్చకు సిద్ధమని చెబుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో నిధుల విడుదలపై హామీలు ఇచ్చారు. ఆగస్టులో ప్రభుత్వం రూ.2,400 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.నల్ల టీషర్ట్‌లతో బీఆర్ఎస్ నిరసనఅసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్‌లతో నిరసనకు సిద్ధమయ్యారు. 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు రైతులు, రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలనూ సభలో ప్రస్తావించాలని పార్టీ నిర్ణయించింది.మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ ప్రధానంగా నిలదీయాలనుకుంటున్న 22ఏ, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపైనే ప్రభుత్వం చర్చకు సిద్ధమవుతుండటం ఆ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది.నేడు అసలు సమరం!సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందు కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్‌ను సీఎం ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల తర్వాత వివిధ నివేదికలను సభ ముందుంచనున్నారు.ఇదీ చదవండి: ప్రశ్నోత్తరాలు.. పలు నివేదికలు -
‘సర్’ ఒక సాకు మాత్రమే.. కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది: రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ చుట్టూ మాటల యుద్ధం ముదురుతోంది. ఓ వైపు ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్ విమర్శలు చేస్తుండగా.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీ ఓటమి తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.రాంగోపాల్‌పేట్ డివిజన్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఎస్ఐఆర్, విద్యావ్యవస్థపై ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారని రాంచందర్‌రావు అన్నారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేరళలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ విజయం సాధించిందని ఆయన గుర్తుచేశారు. దీంతో ఎస్ఐఆర్ కారణంగానే బీజేపీ గెలుస్తుందన్న కాంగ్రెస్ వాదనలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఆ ఓటమికి ముందుగానే ఎస్ఐఆర్ను కారణంగా చూపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని రాంచందర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రక్రియను అడ్డుపెట్టుకుని బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించి, మజ్లిస్‌కు కాంగ్రెస్ ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విమర్శించారు.విద్యావ్యవస్థపై తీవ్ర అసంతృప్తిరాష్ట్రంలోని విద్యావ్యవస్థ పరిస్థితిపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. టీచర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ముందుగా విద్యావ్యవస్థను చక్కదిద్దడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడం ప్రభుత్వం వల్ల కాకపోతే.. ఆ శాఖను వేరే వారికి అప్పగించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై బీజేపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వీధుల్లో పోరాటం చేయడంతో పాటు అవసరమైతే న్యాయస్థానాల్లోనూ పోరాడతామని తెలిపారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇవి కూడా చదవండి: అసెంబ్లీలో ‘వెయ్యి రోజుల’ సమరం! -
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: తాజా మాజీ మంత్రి, వరంగల్ తూర్పు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. “నిరీక్షణ ముగిసింది.. అతిత్వరలో ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తా.. చూస్తూనే ఉండండి.. తెలంగాణ!” అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఈ ఉదయం నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై కాసేపటికే ఆమె మరో ప్రకటన చేశారు. ఈ పోస్టు వైరల్ అవుతూ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆ ఫేస్బుక్ అకౌంట్ తనది కాదని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవం. మా పేరిట జరుగుతున్న ప్రచారాలకు మాకు సంబంధం లేదు అంటూ ఆమె నుంచి ఓ ప్రకటన వెలువడింది. “త్వరలో పెద్ద అప్డేట్” అంటూ సురేఖ పేరిట వచ్చిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయింది. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై ఆమె ఏదైనా క్లారిటీ ఇస్తారా? అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఆమెను రెండు పార్టీలు సంప్రదించాయని.. ప్రాంతీయ పార్టీ వైపు ఆమె మొగ్గు చూపిస్తున్నారని వరంగల్‌లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో ముదిరిన పంచాయితీ.. సురేఖను బర్తరఫ్ చేసేదాకా వెళ్లింది. మరీముఖ్యంగా మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించిన తర్వాత వరంగల్ రాజకీయాల్లోనూ చర్చ ధారి తీసింది.ఇదీ చదవండి: కొండాను ఒంటరి చేయడంలో సక్సెస్! -
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లాయి. ఇప్పటివరకు కొండా వర్గానికి బలంగా అండగా నిలిచి నేతలు, అనుచరుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. చర్యలు తమదాకా వస్తాయేమో అనే భయంతో కొందరు ఇప్పటికే కొండా వర్గానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత.. వరంగల్ తూర్పులో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని, ఆమె అనుచర గణం హడావిడి చేస్తుందని అంతా భావించారు. కానీ, ఇప్పటిదాకా అలాంటిదేం జరగకపోవడం గమనార్హం. పైగా నిన్నటిదాకా కొండా కుటుంబం పేరు చెప్పుకుని తిరిగిన నేతలు.. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయితే కొండా సురేఖ అనుచరులుగా ఉన్న పలువురికి దక్కిన పదవులు.. అలాగే వాళ్లకు అప్పగించిన ఏజెన్సీలు, ఇతర వ్యవహారాలపై అధికారులు ఆరా తీస్తున్నారన్న వార్తలు ఆ వర్గంలో మరింత టెన్షన్ పెంచుతున్నాయి.కొండా సురేఖ బర్తరఫ్‌తో వరంగల్ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. చర్యల భయంతో ఆమె అనుచర వర్గంలో టెన్షన్ నెలకొనగా.. తమ పదవులు కూడా పోతాయన్న ఆందోళనతో కొందరు సైలెంట్ అవుతున్నారు. ఈ భయంతోనే కొందరు అనుచరులు కొండాకు దూరంగా ఉంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు ఇంతకాలం కొండాకు వ్యతిరేకంగా నిలిచిన తమను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో తమకు రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుందని వారు భావిస్తున్నారు. కొందరు నేతలైతే ఏకంగా సంబురాలు జరుపుకున్నట్లు సమాచారం.మరోవైపు.. తన అనుచరులు ఇబ్బందుల్లో పడకూడదన్న ఉద్దేశంతో కొండా సురేఖ వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో కొందరు నేతలు వేచి చూసే ధోరణిలో ఉండగా.. మరికొందరు మాత్రం పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కొండా వర్గాన్ని వీడి.. మరో వర్గంలోకి జంప్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఇంతకాలం కొండా కేంద్రంగా సాగిన వరంగల్ రాజకీయ సమీకరణాలు ఇప్పుడు మరో బాట పట్టేలా కనిపిస్తున్నాయి.ఇటు కొండా కుటుంబానికి ఇంతకాలం వ్యతిరేకంగా ఉన్నవాళ్లు.. తమకూ మంచి రోజులొస్తాయనే ఆశతో ఉన్నారు. కొత్త పదవులు, రాజకీయ అవకాశాలపై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ కూడా మొదలైంది. దీంతో వరంగల్ కాంగ్రెస్‌లో ఎవరు ఎటు వెళ్తారు? ఎవరికి కొత్త అవకాశాలు దక్కుతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: విపక్షాలకు కొత్త అస్త్రం అందించిన రేవంత్! -
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి మార్పులు, చేర్పులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు సమాచారం. దీంతో జరగబోయేది కేబినెట్ విస్తరణా? శాఖల మార్పులా? లేదంటే మొత్తం ప్రక్షాళనా? అనే ఉత్కంఠ మొదలైంది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్లో ఇటు మంత్రులు.. అటు ఆశావహులు కనిపిస్తున్నారు.కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ ఎపిసోడ్‌పై మూడ్ ఆఫ్ ఎమ్మెల్యేల నివేదికకు సీఎం రేవంత్ ఆదేశించారు. అలాగే ఆమెను తొలగించడంతో కేబినెట్లో ముగ్గురికి అవకాశం లభించనుంది. అయితే సురేఖ స్థానంలో మహిళకే చాన్స్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే కేబినెట్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతోపాటు.. కొందరు మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది.మంత్రుల్లో మరికొందరిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించే అంశంపైనా అధిష్ఠానం, సీఎం మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్ఠాన నేతలతో భేటీల సందర్భంగా ఆయా అంశాలపై ఆయన, సీనియర్ మంత్రులు చర్చించినట్లు సమాచారం. రెండ్రోజుల పాటు సొంతూరిలో పర్యటించనున్న సీఎం రేవంత్.. సీనియర్ మంత్రులతో మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో ప్రస్తుత మంత్రుల్లో ఎవరికి పదవులు ఉంటాయో.. ఎవరికి శాఖలు మారతాయోనన్న టెన్షన్ నెలకొంది. మరోవైపు మంత్రి పదవుల కోసం పలువురు ఆశావహ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి? సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను ఎలా సర్దుబాటు చేయాలి? అనే అంశాలపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణా.. పూర్తిస్థాయి ప్రక్షాళనా.. లేక రెండూ కలిపి చేస్తారా? అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.ఇదీ చదవండి: ఇప్పుడు కొండా సురేఖ.. అప్పుడేమో ఆయన! -
ఇది కరెక్ట్ టైం కాదు.. రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, యాదాద్రి భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిణామాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ రాజీనామా చేస్తారా? అధిష్టానం ఆమెను భర్తరఫ్ చేస్తుందా? అనే ఎపిసోడ్‌పై స్పందించారాయన. ఇందులో తమ నిర్ణయమంటూ ఏదీ ఉండదని.. ఈ అంశాన్ని పూర్తిగా కాంగ్రెస్ జాతీయ కార్యవర్గమే చూసుకుంటుందని చెప్పారాయన.సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో గురువారం బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని మీడియాతో దాటవేత ధోరణిలో మాట్లాడారు. అయితే చివరకు కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై స్పందించిన రాజగోపాల్‌రెడ్డి.. ఈ అంశాన్ని కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం చూసుకుంటుందని తెలిపారు. దీనిపై తాము వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని, పార్టీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పారు.‘‘కొండా సురేఖ పార్టీ పెద్దలను కలిసి తన వాదన వినిపించారు. ఈ ఇష్యూపై అధిష్టానం వద్ద పూర్తి సమాచారం ఉంది. అధిష్టానం నిర్ణయమే ఫైనల్.. అందరం కట్టుబడి ఉండాలి. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అధిష్టాన నిర్ణయం. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరగాలన్నది అధిష్టానమే నిర్ణయిస్తుంది. రాహుల్ గాంధీపై నమ్మకం ఉంది.. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్పై పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలి. నేను కాంగ్రెస్ కార్యకర్తల గురించే ఆలోచిస్తా’’ఆ నిర్ణయమే ఫైనల్కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీ తరఫున తామంతా దానికి కట్టుబడి ఉంటామని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయ అంశాలపై అనవసరమైన చర్చలకు తావివ్వకుండా పార్టీ అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూడాలని ఆయన వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా గత కొంతకాలంగా సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తానే పదేళ్లు సీఎంగా కొనసాగుతానంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్‌రెడ్డి గతంలో ఖండించారు. ముఖ్యమంత్రి పదవి అనేది వ్యక్తిగత నిర్ణయం కాదని, పార్టీ అధిష్ఠానం, రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. నిన్న సైతం ‘‘మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెల్లగొడతారా?’’ అంటూ సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు.ఇదిలా ఉండగా నిన్న ఢిల్లీలోనూ.. కొండా సురేఖ రేవంత్.. రేవంత్ కుటుంబం, అలాగే కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలతో అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె.. తన కూతురు వ్యాఖ్యలు పూర్తి వ్యక్తిగతమని, అయితే అధిష్టానం చెప్పకుండా తానే పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ ఎలా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదు’ అంటూ రాజగోపాల్‌రెడ్డి కాస్త స్వరం తగ్గించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: రాజీనామా చేయమని ఖర్గేనే చెప్పారా? -
కొండా ఫ్యామిలీ బిగ్ డెసిషన్..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆమెపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? లేదంటే ప్రత్యామ్నాయ నిర్ణయం వెలువడుతుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో హైకమాండ్ పెద్దలంతా కీలక భేటీ నిర్వహించనున్నారు. అయితే ఆ నిర్ణయం వెలువడడం కంటే ముందే.. ఓ బిగ్ డెసిషన్ తీసుకోవాలని కొండా ఫ్యామిలీ యోచిస్తుందని సమాచారం. కాంగ్రెస్ పార్టీని వీడే యోచనలో కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేయాలా?.. లేదంటే పార్టీని వీడాలా? లేదంటే మరేదైనా నిర్ణయం తీసుకోవాలా? అనే తమ తదుపరి రాజకీయ అడుగుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తమ నిర్ణచం ఏదనేది వాళ్లు మీడియా ముఖంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లి పెద్దలకు వివరణ ఇచ్చిన కొండా సురేఖ.. గత రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. సీఎం రేవంత్ కుటుంబంతో పాటు కొందరు మంత్రులపైనా ఆమె ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అయితే హైకమాండ్ మాత్రం తమ నిర్ణయం వెల్లడించేందుకు కాస్త సమయం కావాలని చెప్పినట్లు సమాచారం. దీంతో ఇవాళ ఆమె వరంగల్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొండా దంపతులు తమ నివాసంలో అనుచరులతో సమావేశం కానున్నారు. పార్టీని వీడాలా? ప్రస్తుత పరిణామాలపై వేచి చూడాలా? అనే అంశాలపై అనుచరులతో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కుటుంబ సభ్యులతోనూ కొండా దంపతులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు.. తనపై వేటేస్తే ఎమ్మెల్యే(వరంగల్ తూర్పు) పదవికి సైతం రాజీనామా చేసి ఉపఎన్నికకే వెళ్లాలని ఆమె ఇది వరకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కూతురు సుస్మిత రాజకీయ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం వెల్లడించే చాన్సే ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం.కొండా సురేఖ వ్యవహారంపై ఇవాళో, రేపో కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే అప్పటిదాకా వేచి ఉండాలా? లేదంటే పార్టీ నిర్ణయం వెలువడకముందే తమ వైఖరిని ప్రకటించాలా? అనే అంశంపై కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. కూతురు సుస్మితా పటేల్ పరకాలకు తానే కాబోయే ఎమ్మెల్యేనంటూ కామెంట్ చేయడం మొదలు .. ఈ వివాదం రాజుకుంది. గతంలోనూ సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుస్మిత.. తాజాగానూ అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కూతురి వ్యాఖ్యల్ని ఖండించని సురేఖపై వేటు వేయాల్సిందేనని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. సురేఖ వైఖరి, కొండా ఫ్యామిలీ తీరుతో కాంగ్రెస్‌కు నష్టమే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు వాళ్లంతా.కొండా దంపతుల వ్యవహారంపై కాంగ్రెస్‌లో ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్నాయి. కొండా సురేఖపై పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక అధిష్ఠానానికి చేరింది. ఆమెను బర్తరఫ్ చేయాలని సీఎం, టీపీసీసీ చీఫ్ సహా పలువురు అధిష్టానానికి నివేదించారు. అదే సమయంలో ఆమెను కొనసాగించాలని, కొండా ఫ్యామిలీని దూరం చేసుకోవడం మంచిది కాదని మరికొందరు సీనియర్లు అధిష్టానికి విజ్ఞప్తులు చేశారు. దీంతో కొండా దంపతుల తదుపరి రాజకీయ అడుగుపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: నా కంటే ముందు ఆయనపై చర్యలు తీసుకోండి: కొండా సురేఖ -
రాఖీ కట్టనిస్తారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో రాఖీ పండుగ వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. భట్టి ఇంకా బెంగళూరులోనే ఉండగా!.. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తారా? అన్న అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ప్రతీ ఏడాది రాఖీ పండుగ సందర్భంగా మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం, డిప్యూటీ సీఎంలకు రాఖీ కడుతుంటారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సురేఖ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో ఉండటంతో ఆయనను కలిసే అవకాశం కూడా ఆసక్తికరంగా మారింది.సుస్మిత వ్యాఖ్యలతో దుమారం..కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. పరకాల(వరంగల్) ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పరకాల ఎమ్మెల్యే కాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి.అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి స్పష్టం చేశారు. అయినప్పటికీ సురేఖ వివరణపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ క్రమశిక్షణా కమిటీకి, అటు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు.అధిష్టానం వద్దకు వ్యవహారం..ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించింది. క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అంశంపై పార్టీ పెద్దలతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో కొండా మురళి కూడా పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరుకు వెళ్లారు. కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీలో మరికొందరిపై క్రమశిక్షణ చర్యల అంశాలపైనా ఖర్గేతో భట్టి చర్చించినట్లు సమాచారం.మౌనంగా సురేఖ.. అపాయింట్మెంట్పై ఉత్కంఠకొండా సురేఖ వ్యవహారం అధిష్టానమే చూసుకుంటుందని.. ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే సూచించారు. అయితే ఆయన అపాయింట్మెంట్ కోసం సురేఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటు కూతురి వ్యవహారంపైనా కొన్నిరోజులుగా కొండా సురేఖ పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా ఆమె కొంత దూరంగా ఉంటూ.. తన నియోజకవర్గంలో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలను కలిసేందుకు సురేఖ తాజాగా అపాయింట్మెంట్ కోరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా? రాఖీ కట్టేందుకు అవకాశం కల్పిస్తారా? అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఎపిసోడ్.. లాస్ట్ మినిట్‌లో ఆ ట్విస్ట్ తప్పదా? -
కొండా సురేఖ ఇష్యూ.. రేవంత్ కీలక భేటీ!
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటన రద్దు తర్వాత హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలపై దృష్టి సారించారు. సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం, పార్టీలో క్రమశిక్షణ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి తన విదేశీ పర్యటనను కుదించుకుని లండన్ నుంచి తిరిగి వచ్చారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించగా.. కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై తిరిగి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం రేవంత్ అన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్(చిట్టక్క) సీఎం రేవంత్ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తట్టుకోలేకపోతున్నారు. కూతురి వ్యాఖ్యలను ఖండించకపోగా.. నాకేం సంబంధం అన్నట్లు సురేఖ మాట్లాడటాన్ని కూడా అంగీకరించడం లేదు. ఇప్పటికే ఈ విషయమై క్రమశిక్షణా కమిటీకి వాళ్లంతా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంతో తమ అభిప్రాయాలను పంచుచుకోనున్నారు. మరోవైపు.. కొండా సురేఖ ఎపిసోడ్‌తో పాటు వనపర్తిలో చిన్నారెడ్డి-ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆదిలాబాద్ నేతలు కంది శ్రీనివాస్‌రెడ్డి-అల్లూరి సంజీవరెడ్డి గొడవ, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇటు.. కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖ చిక్కుల్లో పడ్డారు. వివరణ కోరుతూ పీసీసీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె నిన్న బెంగళూరు వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. గంట పాటు వీళ్ల మధ్య భేటీ జరిగింది. మరోవైపు ఈ పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ ఇవాళ సీఎంను కలుస్తారనే ప్రచారం సాగుతోంది. తన శాఖ సమీక్ష కోసం ఆమె సచివాలయానికి చేరుకునే అవకాశం ఉంది.దీంతో ఈ వరుస భేటీలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సాయంత్రం ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఫ్యామిలీ వ్యవహారం.. ఏం చేస్తే ఏమవునో? -
చిట్టక్క పంచాయితీ.. కొండా మురళి రియాక్షన్‌పై ఉత్కంఠ
సాక్షి, వరంగల్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కుటుంబం చుట్టూ నెలకొన్న వివాదం మరింత వేడెక్కుతోంది. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో అసంతృప్తిని ఒక్కసారిగా బయటపెట్టేశాయి. ఈ క్రమంలో కొండా దంపతుల స్పందనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ అలియాస్ చిట్టక్క చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపాయి. పరకాలకు కాబోయే ఎమ్మెల్యే తానేనంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, ఆపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పార్టీ నేతలపై ఆమె చేసిన విమర్శలపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూతురి వ్యాఖ్యలను ఖండించకుండా.. ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూ కొండా సురేఖ ఇచ్చిన నామమాత్రపు వివరణపైనా భగ్గుమన్నారు. ప్రతిపక్షాలకు సహకరించేలా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. కొండా ఫ్యామిలీ తక్షణమే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని.. లేని పక్షంలో అధిష్టానమే క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద గెంటేయాలని డిమాండ్ చేశారు.చర్యలపై ఉత్కంఠఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. వివాదం ముదిరుతున్నా.. ఇప్పటివరకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా స్పందించకపోవడం కూడా చర్చకు దారితీసింది. మంత్రులు సైతం ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అమెరికా పర్యటన రద్దుతో సీఎం రేవంత్ రేపు తిరిగి హైదరాబాద్ రానున్నారు. వచ్చిరాగానే అత్యవసరంగా ఆయన ఈ అంశంపై చర్చలు జరుపుతారని సమాచారం. ఈ క్రమంలో హైకమాండ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతుందా? లేదంటే చర్యలకు దిగుతుందా? అనే అంశం ఉత్కంఠగా మారింది.టికెట్ దక్కలేదనే అలా..ఇదిలా ఉండగా.. తన వ్యాఖ్యలపై సుస్మిత కాస్త టోన్ మార్చింది. తన తండ్రికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం వల్లే తాను ముఖ్యమంత్రిపై విమర్శలు చేశానని పేర్కొంది. వ్యక్తిగత అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆమె వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.నేడు కొండా మురళి స్పందించే అవకాశంఈ వివాదంపై కొండా కుటుంబం వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు మౌనం పాటించిన కొండా సురేఖ భర్త కొండా మురళీధర్‌రావు నేడు(శనివారం) మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన స్పందనతో ఈ వివాదంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.మొత్తంగా.. వరంగల్ కాంగ్రెస్‌లో మొదలైన ఈ అంతర్గత కలకలం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అధిష్ఠానం నిర్ణయం, కొండా కుటుంబ స్పందనపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.ఇదీ చదవండి: నా టార్గెట్ ఆయనే.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్య -
కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరం: మహేష్ గౌడ్
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో పార్టీ క్రమశిక్షణ, నేతల మధ్య సమన్వయం, నామినేటెడ్ పదవుల అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు, చిన్నారెడ్డి వ్యవహారం, పోచారం అసంతృప్తితో పాటు ప్రతిపక్ష నేత హరీశ్ రావు రాసిన లేఖపైనా తాజాగా ఆయన స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. మంత్రి పదవిలో ఉన్నందునే ఆమె నుంచి వివరణ కోరినట్లు చెప్పారు. వివరణ వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. సీనియర్ నేత చిన్నారెడ్డిపై ప్రస్తావన వచ్చిన సందర్భంలోనూ ఇదే విధానం వర్తిస్తుందని చెప్పారు. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎవరైనా ముందుగానే ప్రకటించినా అవి చెల్లుబాటు కావని తెలిపారు.పార్టీలో అభ్యర్థుల ఎంపికకు ఒక నిర్దిష్టమైన విధానం ఉందని చెప్పారు. ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) నిర్ణయాల మేరకే అభ్యర్థులను ఖరారు చేస్తామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.హరీశ్‌రావు లేఖపై..బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు రాసిన లేఖపై కూడా పీసీసీ చీఫ్ స్పందించారు. 22ఏ అంశంపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. కింది స్థాయిలో ఏదైనా తప్పిదం తమ దృష్టికి వస్తే లోపాలను సరిదిద్దాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. తప్పిదం జరిగిందని సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించి, దాన్ని సరిదిద్దే చర్యలు తీసుకున్నారని చెప్పారు. 22ఏ నిబంధన వల్ల భూదందాలకు, భూముల అన్యాక్రాంతానికి అవకాశం ఉండదని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా సామాన్యులకు అన్యాయం జరిగితే నేరుగా గాంధీభవన్ తలుపులు తట్టవచ్చని అన్నారు.పోచారంతో మాట్లాడాంసీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా మహేష్ గౌడ్ స్పందించారు. ఆయనతో ఇప్పటికే మాట్లాడామని, ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలకు 70 శాతం పదవులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాన్సువాడలో పాత, కొత్త నేతలను కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పారు.పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ సిద్ధాంతాలకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా ఉన్నారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీలో ‘పచ్చ నేతలు’ ఎవరూ లేరని, పాత–కొత్త నేతల కలయికతో పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు.సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే..కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మహేష్ గౌడ్ అన్నారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. నేతల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉన్నా వాటిని పార్టీ అంతర్గతంగా పరిష్కరించుకుంటామని, పార్టీని బలహీనపరిచేలా బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.కొండా రిప్లైపై ఆసక్తిగతంలో సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి అదే పని చేయడంతో.. ఆమె వ్యాఖ్యలపై దుమారం రేగింది. పరకాలలో తానే పోటీ చేయబోతున్ననానని.. కాబోయే ఎమ్మెల్యేనని ప్రకటించుకున్నారామె. దీంతో.. రేవూరి వర్సెస్ కొండా ఫ్యామిలీ వివాదం తెర మీదకు వచ్చింది. ఈ పరిణామంపై అధిష్టానం సీరియస్ అయ్యింది. కూతురి వ్యాఖ్యలపై మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని కొండా సురేఖను షోకాజ్ నోటీసుల్లో ఆదేశించింది. దీంతో కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను సమర్థిస్తారా? ఆమె ఏం వివరణ ఇవ్వబోతున్నారో అనే ఆసక్తి నెలకొంది. సాయంత్రం ఆమె ఓ లేఖ ద్వారా వివరణ ఇవ్వొచ్చని సమాచారం అందుతోంది. -
ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారు?: హరీశ్‌రావు
హైదరాబాద్: ప్రజల ఆస్తులను ప్రభుత్వ భూములుగా నిర్ణయించి, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. మల్కాజ్‌గిరిలో పర్యటించిన ఆయన.. భూముల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.ప్రైవేట్ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. సంబంధిత భూ యజమానుల నుంచి ఎలాంటి దరఖాస్తులు లేకుండానే ప్రైవేట్ భూములను 22ఏలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. ఇప్పటికే అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC)లో పరిష్కారమైన భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక కారణమేంటని ఆయన నిలదీశారు.ప్రభుత్వ నిర్ణయాల కారణంగా భూముల యజమానులు తమ ఆస్తులను విక్రయించుకోలేక, రిజిస్ట్రేషన్లు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే, ప్రజల ఆస్తులపై ప్రభుత్వ తప్పిదాల ప్రభావం పడితే అందుకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.దీంతో ప్రభుత్వ తప్పిదానికి ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నారని వారు నిలదీశారు. అయితే, భూముల రికార్డులను పరిశీలించి, అర్హత ఉన్న ప్రైవేట్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. -
వరంగల్: నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: నర్సంపేట నియోజకవర్గంలో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. ఈ పరిణామంపై బీఆర్ఎస్ భగ్గుమంది. అధికారుల చర్యకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలకు సిద్ధం కావడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నర్సంపేట పట్టణంలోని మెడికల్ కళాశాల సమీపంలో మొన్నీమధ్యే పెద్ది విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించారు. అనంతరం విగ్రహం ఏర్పాటు చేసిన గద్దెను కూడా నేలమట్టం చేశారు.అనుమతులు లేకుండా ప్రభుత్వ అసైన్డ్ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. విగ్రహం ఏర్పాటుకు సంబంధించి అవసరమైన అనుమతులు తీసుకోలేదని, ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టినందున తొలగించినట్లు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చెప్పారు.విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులు అర్ధరాత్రి నుంచే చర్యలు ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. విగ్రహం పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల భద్రత మధ్య అధికారులు విగ్రహాన్ని తొలగించి అక్కడి గద్దెను కూల్చివేశారు.అయితే విగ్రహం తొలగింపు విషయం తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలను మోహరించి విగ్రహాన్ని తొలగించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కీలకంగా ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడంతో నర్సంపేటలో ఉద్రిక్తత మరింత పెరిగింది.మొన్నీమధ్యే..ఇంతకు ముందు ఇదే ప్రాంతంలో విగ్రహ ఏర్పాటు కోసం గద్దెను నిర్మించగా.. అధికారులు కూల్చేశారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ అదే ప్రాంతంలో గద్దె కట్టి.. విగ్రహం ఏర్పాటు చేశాయి. విగ్రహం తొలగింపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో పాటు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది.మరోవైపు, విగ్రహం తొలగింపుపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నర్సంపేటలో ప్రస్తుతం పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. విగ్రహం తొలగింపు వ్యవహారం స్థానికంగా రాజకీయ వివాదానికి దారితీసే అవకాశం ఉండటంతో అధికారులు, పోలీసులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. -
ఎనుముల హబ్స్.. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో భారీ లాభాలు: కేటీఆర్ సెటైర్
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూ కేటాయింపుల అంశం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ భూముల కేటాయింపులు జరిగాయంటూ బీఆర్ఎస్ ఆరోపణలకు దిగింది. అయితే ఈ ఆరోపణలతో కూడిన ఓ వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ పోస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు.టీ-హబ్‌ను నిజమైన స్టార్టప్‌ల అభివృద్ధి కోసం నిర్మించాం. కానీ రేవంత్ రెడ్డి ‘ఎనుముల హబ్స్’ను రూపొందిస్తున్నారు. కుటుంబ ఆధారిత, కుటుంబ ప్రయోజనాల కోసం నడిచే వ్యవస్థ అంటూ ఘాటు విమర్శలు చేశారు.“జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో.. వందల కోట్ల లాభాలు?”కేటీఆర్ తన వ్యాఖ్యల్లో ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అంశాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి అత్యంత తక్కువ ధరకు విలువైన ప్రభుత్వ భూమి కేటాయించారంటూ ఆరోపణలు చేశారు. “జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో డిఫెన్స్ కంపెనీ నిర్మించి, రాత్రికి రాత్రే రూ.200 కోట్ల లాభాలు సాధించిన ఆవిష్కర్తగా అనుముల కొండల్ రెడ్డిని గుర్తించాలి” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.అలాగే మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. తెలంగాణ యువతకు ప్రభుత్వ భూములు ఎలా పొందాలో ఈ “మ్యాజిక్ ట్రిక్” నేర్పించాలని ఎద్దేవా చేశారు.While we built T-Hub to ensure that real startups’ thrive, Revanth Reddy is busy devising “Anumula Hubs” - family-run, family-driven, zero-innovation, zero-employee scam…err scheme.!If you are one of the Anumula brothers, you get land allotted for dirt cheap. No questions… https://t.co/jZjt65VZvm— KTR (@KTRBRS) August 12, 2026బీఆర్ఎస్ తన ప్రచారంలో దీనిని “ఎనుముల బ్రదర్స్ రూ.200 కోట్ల భారీ భూ స్కాం”గా అభివర్ణించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం కుటుంబానికి చెందిన వారికి విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించారంటూ ఆరోపించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య భూ కేటాయింపుల అంశం మరోసారి రాజకీయ పోరుకు కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
‘పెద్ది గద్దె’ తొలగింపుతో నర్సంపేటలో రగిలిన రాజకీయం
సాక్షి, వరంగల్: నర్సంపేటలో విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను రాత్రికి రాత్రే అధికారులు కూల్చివేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన తర్వాత గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు గద్దె నిర్మించారు. అయితే విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు ఆ నిర్మాణాన్ని కూల్చివేసినట్లు సమాచారం. ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తున్నప్పటికీ అనుమతి పేరుతో రాత్రి వేళ కూల్చివేయడం సరికాదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ ధర్నాగద్దె కూల్చివేతకు నిరసనగా సోమవారం ఉదయం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకునేందుకు యత్నంధర్నా నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమించాలని సూచించారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ప్రస్తుతం నర్సంపేటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ది కుటుంబాన్ని ఆదివారం కేసీఆర్ పరామర్శించి ఓదార్చారు. ఆ వెంటనే గంటల వ్యవధిలోనే.. విగ్రహ గద్దె కూల్చివేత చోటు చేసుకుంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మహేష్‌గౌడ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: హరీష్‌రావు
తెలంగాణ: టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుడు మహేష్‌గౌడ్.. మాజీ మంత్రి హరీష్‌రావు క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ.హరీష్‌రావు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన క్షుద్రపూజల ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొంటూ, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు.అంతేకాకుండా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మహేష్గౌడ్ను హరీష్‌రావు కోరారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన హరీష్‌రావు.. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. -
వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో యువతను వాడుకోవడం.. ఆ తర్వాత నట్టేట ముంచటం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య ఘటన ఆవేవన కలిగించిందన్న ఆయన.. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ యువతను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కానీ, ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇచ్చారు. కానీ, రెండున్నరేళ్లుగా జాబ్‌క్యాలెండర్ ఇవ్వలేదు. తెలంగాణ యువత.. ప్రత్యేకించి నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో వేణు అనే యువకుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వేణు తన లేఖలో రాశాడు. అలాగే బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారని కూడా గుర్తు చేశాడు. వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ రాశాడు. బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల 42 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. హైదరాబాద్‌లో 142 ఫ్లైఓవర్లు నిర్మించిందెవరు? సచివాలయం కట్టించింది ఎవరు? బీఆర్ఎస్ హయాంలో చివర 48 వేల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చాం.రేవంత్ పాలనలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానవతా దృక్ఫతం లేకుండా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడారు. విద్యార్థుల విలువ సీఎం రేవంత్‌కు ఏం తెలుసు?. అసలు నిరుద్యోగులకు ఆయన ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. పోలీసు ఉద్యోగాలు 20 వేలు ఖాళీ ఉన్నాయి. 7 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఎందుకిచ్చారు?. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ 24 హామీలు ఇచ్చింది. అశోక్ నగర్లో సాక్షాత్తు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు విలువ లేదు. ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా రాహుల్ పట్టించుకోరా? ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులపై దాడులు జరిగితే వెళ్తున్న ఆయన.. అసలు హైదరాబాద్‌కు ఎందుకు రావడం లేదు?. తెలంగాణ వైపు చూసే దమ్మే ఆయనకు లేదా?కాంగ్రెస్, బీజేపీ యువతను వాడుకుంటోంది. రాహుల్, రేవంత్ తెలంగాణ యువతను మోసం చేశారు. వాళ్లు ఇద్దరు ప్రకటించిన డిక్లరేషన్లు, కార్డులు క్రిమినల్ వేస్ట్. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయడం క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తి సీఎం కావడం క్రిమినల్ వేస్ట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. వేణు సూసైడ్‌కు సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని కేటీఆర్ నిలదీశారు.ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫారాలు నింపడం రాదని రేవంత్ అన్నారు. ఆ మాటలకు మేం బాధపడ్డాం. అసలు ఆయనకు ఎన్నికల అఫిడవిట్ ఫారం నింపడం వచ్చా?. ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్మాణాలు తెలుసు.. కాంగ్రెస్‌కు ఎలా సమాధి కట్టాలో తెలుసు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులను కోరుతున్నాం. మళ్లీ పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా.. ముందు ఆ హామీని నెరవేర్చండి. యువత సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రండి అని కేటీఆర్ రేవంత్ సర్కార్‌కు సవాల్ విసిరారు. -
ఏసీబీ కోర్టు: లక్ష పూచీకత్తు సమర్పించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఇవాళ్టి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ ముగిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) విచారణ కోసం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు అరవింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డి రూ.లక్ష పూచీకత్తు సమర్పించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ కొనసాగుతోంది. ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహిస్తే రాజకీయ కక్షతో నేరంగా చిత్రీకరిస్తున్నారని కేటీఆర్ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ 77 పేజీల ఛార్జ్‌షీట్‌ను మార్చి 23న దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో మొత్తం 14 మంది సాక్షులను ఏసీబీ ప్రస్తావించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబీ కోర్టు వచ్చే నెల(ఆగస్టు) 25కి వాయిదా వేసింది.ఐదుగురిపై అభియోగాలుఈ కేసులో కేటీఆర్ సహా ఐదుగురిపై అభియోగాలు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) సంస్థ ప్రతినిధి అల్బెర్టోకు సైతం కోర్టు సమన్లు జారీ చేసింది. మే 14న ఏసీబీ కోర్టు ఛార్జ్‌షీట్‌ను విచారణకు స్వీకరించింది.అనుమతులు లేకుండానే.. ఏసీబీ ఛార్జ్‌షీట్ ప్రకారం.. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి అవసరమైన అనుమతులు పొందకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించింది. కేబినెట్, ఆర్థిక శాఖ, న్యాయశాఖ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లారని పేర్కొంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ)పై సంతకం జరిగేలా కేటీఆర్ వ్యవహరించారని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించారని, ప్రభుత్వంపై సుమారు రూ.600 కోట్ల భారం పడిందని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు తెలిపింది.ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలుఫార్ములా ఈ రేసు కోసం రూ.75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఏసీబీ ఆరోపించింది. క్విడ్‌ప్రోకో అంశంతో పాటు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని కూడా ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. బీఆర్ఎస్కు వచ్చిన రూ.44 కోట్ల విరాళాల అంశాన్ని కూడా ఏసీబీ తన అభియోగాల్లో పేర్కొన్నట్లు సమాచారం. రాజకీయంగా ప్రాధాన్యంఫార్ములా ఈ-రేసు కేసు తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇదొక లొట్ట పీసు కేసు అని అభివర్ణించారు. ఎలాంటి అవినీతి జరగలేదని.. ఎలాంటి రహస్య ఒప్పందాలు, లావాదేవీలు లేవని చెప్పారాయన. ఇప్పుడు.. నాంపల్లి కోర్టు విచారణ నేపథ్యంలో కేసు తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. -
కోమటిరెడ్డి బ్రదర్స్‌తో అదే చెప్పా: ఎమ్మెల్యే సామెల్
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్‌లో తుంగతుర్తి పంచాయితీ మరోసారి తీవ్ర విభేదాలను బయటపెట్టింది. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా పర్యటనలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. తనకు టికెట్ ఇచ్చింది రాజగోపాల్‌రెడ్డి కాదని, ఏఐసీసీ అని స్పష్టం చేశారు.తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంలో రాజగోపాల్‌రెడ్డి పాత్ర లేదని ఎమ్మెల్యే సామెల్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టికెట్ నా చేతిలో లేదు.. రాజగోపాల్‌రెడ్డి చేతిలో అంతకన్నా లేదు. ఏఐసీసీ నాకు టికెట్ ఇచ్చింది. నన్ను గెలిపించింది రాజగోపాల్‌రెడ్డి కాదు.. పార్టీ’’ అని పేర్కొన్నారు.‘నాకు తెలియకుండా ఎలా?’తన నియోజకవర్గంలోకి రావాలంటే కనీస సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని సామెల్ అన్నారు. ‘‘నాకు తెలియకుండా నా నియోజకవర్గానికి ఎలా వస్తారు?’’ అంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు గౌరవం ఉండాలని పేర్కొన్నారు. ‘పార్టీలో నేనే ముందున్నా’కాంగ్రెస్‌లో తానే ముందునుంచి ఉన్నానని ఎమ్మెల్యే సామెల్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు తన కేడర్ ఎంతో కష్టపడిందని, అయితే ఇప్పుడు అదే కేడర్ బాధపడుతోందని అన్నారు. ‘‘మునుగోడులో ఆయన్ను గెలిపించినందుకు నా కార్యకర్తలు బాధపడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి గతంలో తన గెలుపుపై వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ‘‘నేను గెలుస్తా అని గతంలో రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. అప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చారు’’ అని విమర్శించారు.కులాల ఓట్లపై ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల సమయంలో సామాజిక వర్గాల ఓట్లపై కూడా సామెల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజగోపాల్‌రెడ్డికి మాదిగలు ఓటు వేశారు.. నాకు రెడ్లు ఓటేశారు’’ అని అన్నారు.‘ఎన్నిసార్లు కలిసినా రోడ్లు ఇవ్వలేదు’గతంలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ‘‘నేను ఎన్నోసార్లు కలిశాను. రోడ్లు కావాలని అడిగాను. చివరకు అటెండర్‌తో ఫోన్ చేయించినా వెళ్లి కలిసేవాడిని’’ అని పేర్కొన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్‌పై వ్యాఖ్యలుకోమటిరెడ్డి సోదరులు నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తాను చెప్పినట్లు సామెల్ వెల్లడించారు. ‘‘కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఇన్వాల్వ్ కానివ్వొద్దని చెప్పా. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఇకనైనా అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అన్నారు. మొత్తంగా మునుగోడు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సామెల్, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి తెరపైకి రావడంతో రాజకీయాలను మరింత వేడెక్కించాయి. -
10 నెలల కిందటే చెప్పా.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమీపంలో జరిగిన కాక్రోచ్ పార్టీ (CJP) ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యువత ఆకాంక్షలను పట్టించుకోకపోతే దేశంలో జెన్-జీ ఉద్యమం తప్పదని తాను 10 నెలల క్రితమే హెచ్చరించానని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘దాదాపు 10 నెలల క్రితం ఓ మీడియా సమావేశంలో.. యువత ఆశయాలు, ఆకాంక్షలను పరిష్కరించకపోతే మన దేశంలో జెన్-జీ నిరసన తప్పదని చెప్పాను’’ అని గుర్తుచేశారు.‘‘ఢిల్లీలో నిన్న జరిగిన నిరసనల తర్వాత కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుత పాలన, జవాబుదారీతనం, విద్యా రంగ సంస్కరణలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’’ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. యువతలో పెరుగుతున్న అసంతృప్తికి కారణాలను గుర్తించి, విద్యా వ్యవస్థలో మార్పులు, ఉద్యోగ అవకాశాలు, పాలనలో పారదర్శకత వంటి అంశాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. పార్లమెంట్ వైపు చేపట్టిన ‘చలో సంసద్’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండడంతో.. పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. About 10 months ago, I had made a comment at a media event that a Gen-Z protest is imminent in our country if the aspirations of youngsters are not addressed After yesterday’s Delhi protest, it is high time for the Union Govt to address the demand for accountability and… pic.twitter.com/9kTIDx9Oi8— KTR (@KTRBRS) July 21, 2026 -
కాళేశ్వరం రాజకీయ యుద్ధంగా మారిందా?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం నిత్యం ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. అది క్రమేపి రాజకీయ రూపు దాల్చుతోంది. ఆ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్దానికి తెరదీసింది. ఒక వైపు వానలు అంతంత మాత్రంగా ఉండడం, మరో వైపు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వస్తాయో, రావో అన్న సందిగ్దత గందరగోళంగా మారింది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసినప్పటికీ మెడిగడ్డ వద్ద కొన్ని పిల్లర్లు కుంగడంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చాలా డామేజి జరిగింది.2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమిలో ఆ సమస్య కూడా ఒక కారణం అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎలాంటి విధానం అనుసరించాలన్నదానిమీద సరైన క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నదన్న విమర్శ వస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఏర్పడిన పగుళ్లనండి. లేదా పిల్లర్లు కుంగడం అనండి.. ఏదైనా కానివ్వండి.. గ్రౌండ్ సిచ్చుయేషన్కు అనుగుణంగా నిర్ణయాలు చేసి రేవంత్ తనకు అడ్వాంటేజ్ తెచ్చుకునే అవకాశం ఒక దశలో ఉంది.ఆ ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని నేషనల్ డామ్ సేఫ్టి అథారిటి చెబుతోందన్నది ఆయన వాదనగా ఉంది. ఇందులో స్కామ్ అని, మరొకటి అని చెప్పి గత రెండేళ్లుగా అలాగే ఉంచేశారు. ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులను అరెస్టు చేస్తారేమో అన్నంతగా ప్రచారం జరిగింది. కాని వారు న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ పొందగలిగారు. కమిషన్ రిపోర్టుకు కూడా పెద్ద విలువ లేకుండా పోయిందనిపిస్తుంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నీరు నిల్వచేసి పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని తోడి ఆయా ప్రాంతాలలో ఉన్న రిజర్వాయిర్లను నింపాలా? వద్దా? అన్న చర్చకు పరిస్థితి చేరింది. ఇక్కడే రేవంత్ ప్రభుత్వం పొరపాటు చేస్తున్నదా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి, అక్కడ నీటిని తోడకపోతే తామే మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు. తనకు ఇరిగేషన్ మంత్రి పదవి అప్పగిస్తే, మూడునెలల్లో బారేజీలను బాగు చేయించి చూపుతానని హరీష్‌రావు సవాల్ చేశారు. వీటికి ప్రతిగా రేవంత్ కూడా ధీటుగానే బదులు ఇచ్చారు. అది వేరే విషయం.నిజానికి ఇంతదాకా రేవంత్ ప్రభుత్వం వెళ్లనిచ్చి ఉండాల్సింది కాదు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు ఆయా జిల్లాలను ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు నీరు ఎలా ఇవ్వవచ్చా అన్నదానిపై ఆలోచన చేసి ఉండాల్సింది. కేసీఆర్ కట్టించినంత మాత్రాన ఆ ప్రాజెక్టు ఆయనది అయిపోదు. అలాగే ఆరోపణలు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టుతో రేవంత్‌కు సంబంధం ఉండకపోదు. అది ప్రజల ఆస్తి.ఈ క్రమంలోనే వాదోపవాదాలు, విమర్శ, ప్రతి విమర్శలకు అవకాశం ఇచ్చారు. కాళేశ్వరం నీరు ఎత్తిపోయకుండా పగ పట్టారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి బదులుగా నీళ్లు ఉన్నంత మాత్రాన ఎత్తిపోయలేం అని, నీటి నిల్వకు ఆ బారేజీలు అనువుగాదని జాతీయ డామ్ భద్రత అథారిటీ చెబుతోందని, బరాజ్‌లు సురక్షితం కాదని కూడా ఆ సంస్థ చెప్పిందని రేవంత్ అన్నారు. అది నిజమే కావచ్చు. కాని అందుకు ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే, రైతుల పొలాలకు నీరందించలేకపోతే, వర్షాలు సరిగా కురవకపోతే ఆ ప్రభావం అంతా తన ప్రభుత్వంపైనే పడుతుందన్న సంగతి ఆయన గుర్తించాలి.అంతేకాక విపక్షాన్ని ఉద్దేశించి పొలాలలో రక్తం చల్లితే పంటలు పండుతాయని అనడం సరికాదు. ఎదుటి పక్షం వారు ఎదైనా చిన్న వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తేనే కేసులు పెడుతున్నారు. ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ కాస్త బెటర్ అయినా, ఈ మధ్య జరిగిన కొన్ని అరెస్టులు చూస్తే, ఇక్కడ కూడా టీడీపీ పెత్తనం సాగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత కొన్నాళ్లుగా తీవ్ర అసహనంతో మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఆయనలో ఉన్న ఫ్రస్టేషన్‌ను బయటపెట్టుకుంటున్నారు. తెలంగాణలో ఆయన శిష్యుడుగా పేరొందిన రేవంత్ కూడా అదే బాటలో వెళ్లకుండా ఉంటే మంచిది.రేవంత్ వ్యాఖ్యను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలచుకుని, గోదావరి నీళ్లు రైతులకు అందిస్తామంటే తమ రక్తం ఇస్తామంటూ పెద్ద హడావుడినే సృష్టించింది. తెలంగాణ భవన్లో భారీగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. కేసీఆర్‌ను ఎలాగైనా ఇరిటేట్ చేసి ముగ్గులోకి దించాలని రేవంత్ చూస్తున్నప్పటికి, ఆయన తొణకడం లేదు. కేటీఆర్, హరీష్‌రావులే గట్టిగా బదులు ఇస్తున్నారు. దీనివల్ల కూడా రేవంత్ అసహనానికి గురి అవుతున్నారేమో తెలియదు. రేవంత్ కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే దాని పునరుద్దరణపై పూర్తి శ్రద్ద పెట్టి ఉంటే ఆయనకు పేరు వచ్చేది.కేసీఆర్‌ను విమర్శించవచ్చు. అందులో అవినీతి ఉంటే దానిపై దర్యాప్తు చేయించవచ్చు. కాని అల్టిమేట్‌గా ప్రజలకు కావల్సింది నీరు. అందులోను వర్షాభావ స్థితిలో తమ పొలాలకు నీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అందువల్ల బీఆర్ఎస్ కోరడానికి ముందే, గోదావరిలోకి వచ్చిన వరద నీటిని అంచనా వేసుకుని, పంప్ హౌస్‌ల ద్వారా నీరు లిఫ్ట్ చేయించడం మొదలు పెడితే బాగుండేదేమో! కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా దానినే సూచిస్తున్నారట. ఒక వేళ నిజంగానే గోదావరి నీటిని లిఫ్ట్ చేయడంలో ఇబ్బంది ఉంటే, విపక్షాన్ని కూడా ఆహ్వానించి, వారిని కూడా ఆయా బారేజీల వద్దకు, పంప్ హౌస్‌ల వద్దకు తీసుకువెళ్లి ఇరిగేషన్ అధికారుల ద్వారా పరిస్థితిని వివరించి ఉండవచ్చు. అలాగే మేధావులైన ఇంజనీర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కోసం ఒక సమావేశం పెట్టి ఉండవచ్చు. ఇవేవి చేసినట్లు లేరు. పైగా అనుచిత వ్యాఖ్య చేసి తనకు రావల్సిన మైలేజీని రేవంత్ వదులుకున్నారేమో అనిపిస్తుంది.కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టానికి ఆత్మరక్షణలో ఉన్న బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఊపిరి పోస్తుందనిపిస్తుంది. కారణం ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం కూడా మెడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల పునరుద్దరణకు వేగంగా చర్యలు చేపట్టలేదన్న భావన ఉంది. ఒకప్పుడు గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఉన్న బారేజీ గేట్లు దెబ్బతిన్నాయి. దాంతో ఉభయ గోదావరి జిల్లాలకు తీవ్ర సంక్షోభం వచ్చే స్థితి ఏర్పడింది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు స్వయంగా ధవళేశ్వరం వెళ్లి, అక్కడే మకాం చేసి ఆ గేట్లను బాగుచేయడమో. కొత్త గేట్లను బిగించడమో చేశారట. దానివల్ల ఆయనకు ఖ్యాతి వచ్చింది.1986లో వచ్చిన భారీ వరదలకు గోదావరి రెండువైపులా గట్లు పలుచోట్ల తెగిపోయాయి. ఆ నది వెంబడి ఉన్న జిల్లాలన్నీ మునిగిపోయాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వం వెంటనే గోదావరి గట్లను పటిష్టపరిచే పని చేపట్టింది. అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమని చెబుతూ కాలం గడపలేదు. ఇలాంటి అనుభవాలు మరి కొన్ని కూడా ఉన్నాయి. కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిని ఎదుర్కుని ముందుకు పోవడంలోనే ప్రభుత్వ విజన్ కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా రేవంత్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా దానిని వినియోగించుకుంటే మంచిది. పాజిటివ్ దృక్పథంతోనే రేవంత్ ముందుకు వెళితే ఆయనకు మైలేజీ రావచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఫ్లడ్.. బ్లడ్.. పీక్స్‌కు చేరిన కాళేశ్వరం వార్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ రక్తదాన శిబిరం నిర్వహించగా.. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ ‘అవినీతి కాళేశ్వరం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇటు తెలంగాణ భవన్, అటు గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించాల్సి వచ్చింది.సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పీవీ నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో బీఆర్ఎస్వీ.. ‘రేవంత్ రక్తదాహానికి రక్తదానం’ అనే నినాదంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు.. ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కాళేశ్వరం అంశాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సేకరించిన రక్తపు ప్యాకెట్లతో.. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి నిరసన తెలుపుతామని బీఆర్ఎస్వీ నేతలు అంటున్నారు. దీంతో తెలంగాణ భవన్ బయట భారీగా పోలీసులు మోహరించారు. ఇక..మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగింది. గాంధీభవన్‌లో ‘అవినీతి కాళేశ్వరం’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించింది. ప్రాజెక్టు లోపాలు అంటూ పలు చిత్రాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.కాళేశ్వరం అంశాన్ని ఇరు పార్టీలు రాజకీయ ఆయుధంగా మార్చుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. మరోవైపు రాజకీయ కక్షతోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. దీంతో కాళేశ్వరం వ్యవహారం చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమవుతోంది. -
సంగారెడ్డి వదిలేస్తా.. హరీష్‌పై పోటీ చేస్తా: జగ్గారెడ్డి ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు "సంగారెడ్డి నుంచి పోటీ చేయను.. అవసరమైతే రాజకీయాలకే దూరంగా ఉంటా" అని ప్రకటించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం మహిళా రిజర్వేషన్‌కు వెళ్తే తన భార్య నిర్మల జగ్గారెడ్డే కాంగ్రెస్ అభ్యర్థి అవుతారని ఉద్ఘాటించిన ఆయన.. తాను మాత్రం మరో చోటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ ట్విస్ట్ ఇచ్చారు. శనివారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన జగ్గారెడ్డి.. తాను సంగారెడ్డి నియోజకవర్గానికే పరిమితం కాదని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయిస్తే అక్కడి నుంచే బరిలో దిగుతానని చెప్పారు. రాజకీయాల్లో ఎంత పెద్ద నాయకుడైనా పరిస్థితులకు, పార్టీ వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. "ఎంత పెద్దపులి అయినా వేటగాడి వ్యూహంలో పడాల్సిందే.. ఓట్ల రాజకీయం కూడా అంతే. అందుకే నేను కూడా రెండు సార్లు ఓడిపోయా" అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో పార్టీ ఆదేశిస్తే సిద్దిపేటలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావుపై పోటీ చేయడానికీ వెనుకాడనని స్పష్టం చేశారు.ఇటు సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించారు. ప్రతి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని, అధికార పార్టీని బలహీనపరచడం రాజకీయాల్లో సహజమేనని అన్నారు. రాజకీయాల్లో కౌంటర్, ఎన్కౌంటర్ కామనేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ సొంత ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తుందని, అందుకే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారని చెప్పారు."ఎమ్మెల్యే పనితీరు బాగాలేకపోతే ఎంత తోపు నాయకుడైనా కాంగ్రెస్‌లో టికెట్ దక్కడం కష్టం. గతంలో ఎంతో బలమైన నాయకులుగా భావించిన వారు కూడా ఎన్నికల్లో మట్టికరిచారు" అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం హెచ్చరికలను ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుని తమ లోపాలను సరిదిద్దుకోవాలని, లేకపోతే టిక్కెట్ల సమయంలో వారికే ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు.అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సర్వేల ఆధారంగానే జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై అంచనా వేసే హక్కు సీఎంకే ఉంటుందని, తుది నిర్ణయాన్ని ఏఐసీసీ, రాష్ట్ర ఇన్చార్జి, సీఎం, పీసీసీ చీఫ్ కలిసి తీసుకుంటారని వెల్లడించారు.రాబోయే ఎన్నికలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, ఆ అంచనాతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి నుంచే 117కుపైగా స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం ముందుగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని అభిప్రాయపడ్డారు.ప్రతిపక్షాల సర్వేలపై కూడా జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. "బీఆర్ఎస్కు అనుకూల వ్యక్తులతో సర్వే చేస్తే బీఆర్ఎస్కే అనుకూల ఫలితాలు వస్తాయి. తెలంగాణలో పెద్దగా బలం లేని బీజేపీ సర్వే చేయించినా బీజేపీకే అనుకూలంగానే ఉంటుంది" అని అన్నారు.మొత్తంగా.. ఒకప్పుడు సంగారెడ్డి నుంచి తప్పుకుంటానన్న జగ్గారెడ్డి.. ఇప్పుడు అదే నియోజకవర్గంలో తన భార్యను బరిలో దించేందుకు సిద్ధమని చెప్పడం, తాను అవసరమైతే హరీష్‌రావుపై కూడా పోటీ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. -
తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ 2028.. అసలు గేమ్ మొదలైందా?
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ఆరంభించింది. ప్రధాని మోదీనే ఇందుకు శ్రీకారం చుట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించి వివిధ సభలలో పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రసంగాలు గమనిస్తే.. 2028 శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. ఆయన కొత్తగా అధ్యక్షుడు అయినందున భవిష్యత్తులో వచ్చే ఎన్నికలన్నీ ఆయన సామర్థ్యానికి పరీక్షలు అవుతాయి. జయాపజయాలపై పూర్తిగా ఆయనదే బాధ్యత కాకపోవచ్చు. కాని సహజంగానే ఆయనపై అందరి దృష్టి ఉంటుంది.నితిన్ చేసిన ప్రసంగాలలో కొన్ని కీలక అంశాలు కనిపిస్తాయి. పశ్చిమబెంగాల్లో మాదిరే విజయం సాధించాలని, అందుకోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తెలంగాణలో గెలుపుపై ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తే తప్పుకాదు. కాని మతపరమైన అంశాలతో ప్రజలను రెచ్చగొట్టడం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో లక్షల ఓట్ల తొలగింపు వంటివి జరుగుతాయా అన్న సందేహం వస్తుంది.బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండవచ్చు. కాని దానికి మించి బీజేపీ కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి మమతను ఉక్కిరిబిక్కిరి చేయడానికి యత్నించింది. తన చేతిలో ఉండే సీబీఐ, ఈడి వంటి సంస్థలను విచ్చలవిడిగా టీఎంసీనేతలపై ప్రయోగించిందన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందా? అంటే లేదని చెప్పడం కష్టమే.గత పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఎనిమిది సీట్లను సాధించి బీజేపీ సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ బాగా బలహీనపడినట్లు కనిపించినా, తర్వాత యధా ప్రకారం ఆ పార్టీ అగ్రనేతలు బాగా యాక్టివ్ అయి టూర్లు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగిస్తున్నారు. అందువల్లే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. మాచ్ పిక్సింగ్ చేసుకుంటే తప్ప బీజేపీ అధికారంలోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా అది బీజేపీకి ప్లస్ అవుతుందన్న నమ్మకం ఇంకా రా లేదు.జనంలో ఉన్న ఒక అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ప్రధాన పోటీ ఉండవచ్చనిపిస్తుంది. అందుకే ఒక నెల రోజులలో తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు తయారు కావాలని నితిన్ నబీన్ పార్టీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్‌లోని కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయాలు సాధించాలని ఆయన నిర్దేశించారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు కలిసికట్టుగా ఎంత దూకుడుగా వెళతారు? కేంద్రంలో తమకు ఉన్న అధికారాన్ని ఇక్కడ కూడా ఏ మేరకు ప్రయోగిస్తారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను ఎదగనీయకుండా చేయడానికి ప్రత్యేక ప్రణాళికను ఏమైనా అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది.ఈ క్రమంలో బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధపడవచ్చని ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దికాలం క్రితం ఇదే మాట ఓపెన్‌గా చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న పొత్తులు కొనసాగిస్తారా? లేక అక్కడ కూడా ఒంటరిగా ఎదగడానికి యత్నిస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో దాని మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి అన్న చర్చ వస్తుంది. పెద్దగా బలం లేకపోయినా, ఆ పార్టీలకు ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు గురుశిష్యులుగా పేరొందారు.కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సభలో కర్నాటక ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌తో కలిసి చంద్రబాబు, రేవంత్‌లు పాల్గొన్నారు. డీ.కే మాట్లాడుతూ తాము ముగ్గురం కలిసి చరిత్ర సృష్టించబోతున్నామని వ్యాఖ్యానించారు. రేవంత్‌ను చంద్రబాబు పొగిడారు. తెలంగాణ అభివృద్ది కోసం రేవంత్ బాగా కష్టపడుతున్నారని, తెలంగాణ ప్రాజెక్టుల కోసం రేవంత్ రాజీ పడరని ప్రశంసించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటున్న సమయంలో బీజేపీ మిత్రుడైన చంద్రబాబు ఇలా కాంగ్రెస్ నేతను మెచ్చుకోవడం ఆసక్తికరమైన అంశమే. దీనిపై ఏమి మాట్లాడాలో బీజేపీ తెలంగాణ నేతలకు అర్థం కావడం లేదు. అందుకే ఏపీకే తమ మితృత్వం పరిమితమని, ఇక్కడ టీడీపీ తన సొంత వ్యూహం అమలు చేయవచ్చని వారు చెబుతున్నారు.మరో వైపు రేవంత్ రెడ్డి తనకు టీడీపీతో ఉన్న సంబంధాలను వాడుకుంటూ ఆ పార్టీకి కాస్తో, కూస్తో ఉన్న క్యాడర్‌ను, అభిమానులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి యత్నిస్తున్నారు. టీడీపీతో పాటు ఒక సామాజికవర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. టీడీపీ వారు కూడా కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ అధికార ప్రతినిదులు బహిరంగంగానే అకనాలెడ్జ్ చేస్తూ, టీడీపీ తమకే మద్దతు ఇస్తుందని టీవీ చర్చలలో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నగరపాలక సంస్థల ఎన్నికలు పలు రాజకీయ పరిణామాలకు కీలకంగా ఉండవచ్చు. ఈ ఫలితాల ప్రభావం భవిష్యత్తులో తెలంగాణ శాసనసభ ఎన్నికలపై పడే అవకాశం ఉంది.చంద్రబాబు వ్యూహాత్మకంగా రేవంత్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో పరోక్ష స్నేహం కొనసాగిస్తున్నారని, అలాగే చంద్రబాబు ద్వారా రేవంత్ బీజేపీ అగ్ర నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. అయితే దీనికి ఇప్పటికిప్పుడు ఆధారాలు కనిపించకపోవచ్చు. కాకపోతే ప్రధాని మోదీ తన సభలో రేవంత్‌ను ఉద్దేశించి తమతో కలిసి పనిచేయాలని అంటూ చేసిన వ్యాఖ్యలను కొందరు ఉదహరిస్తుంటారు. అంతేకాక రేవంత్‌కు మోదీ అప్పాయింట్మెంట్ ఇచ్చే విధానాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తుంటారు.కాగా ఇటీవల మెట్రో రైల్ వివాదంలో రేవంత్ కోరిక మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చలు జరిగేలా చూశారు. అయినా మెట్రో రుణం విషయం కాని, రెండో దశ గురించి కాని స్పష్టత రాలేదు. రేవంత్‌కు సహకరిస్తున్నట్లు కనిపిస్తూనే బహుశా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీజేపీ ఈ వ్యూహం అమలు చేస్తోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని నితిన్ మండిపడ్డారట. ఒకవైపు అలాంటి ప్రాంతీయ పార్టీలతో జతకడుతూ, మరోవైపు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వినే జనం ఆశ్చర్యపోవల్సిందే.వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని వీరు చెబుతారు. కాని అదే వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో మితృత్వం చేస్తుంటారు. అవకాశవాద రాజకీయాలకు బీజేపీ అతీతం కాదని చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ఏది ఏమైనా తన అధికారాన్ని అడ్డు పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై వేదింపులు, అక్రమ కేసులు, సీబీఐ, ఈడి సంస్థల దాడులు వంటివి చేయకుండా ఫెయిర్ రాజకీయం చేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాని ప్రస్తుత బీజేపీ నాయకత్వం అలాంటి నిబద్దత కలిగిన రాజకీయం చేస్తోందా అన్నదే ప్రశ్న.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇంత అలసత్వమా?.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అల్టిమేటం!
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్‌లో అలసత్వం కనిపిస్తోందా? క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదా? ఈ ప్రశ్నలకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. ఎస్ఐఆర్ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేసిన ఆయన.. పార్టీ ఆదేశాలను పట్టించుకోని నేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన టీపీసీసీ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ సాధారణ అంశం కాదని, పేద ప్రజల హక్కులతో ముడిపడి ఉన్న కీలక ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. పని చేయని వారి పేర్లు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని, అవసరమైతే వారి స్థానంలో కొత్త ఇన్ఛార్జ్లను నియమిస్తామని హెచ్చరించే దాకా వెళ్లారు.కొంతమంది నాయకులు ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలపై తన వద్ద పూర్తి నివేదిక ఉందని, ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు చేయడం లేదన్న విషయం తనకు తెలుసని చెప్పారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ తరఫున మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్‌లను కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో పొరపాట్లు జరిగితే పేదల ఓటు హక్కు దెబ్బతినే ప్రమాదం ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటు తొలగిపోతే భవిష్యత్తులో ఆధార్, రేషన్ కార్డులు వంటి సంక్షేమ ప్రయోజనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి అన్యాయం జరగకుండా పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించబోమని హెచ్చరించారు. మరో పది రోజుల సమయం ఇస్తున్నామని, ఈ వ్యవధిలో పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. లేకపోతే చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు. -
రేవంత్‌కు డబుల్ ట్రబుల్?
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ క్రీడలో పోటీ పడుతున్నాయి. రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ఫర్వాలేదు కాని, అవి నష్టం చేసేలా ఉంటే మాత్రం చాలా ప్రమాదకర క్రీడ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి అపాయం సంభవిస్తుందేమో అన్న అనుమానం వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కొత్త సంక్షోభంలోకి వెళుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంకట పరిస్థితిని సృష్టిస్తున్నదా? లేక ఆయన అనుభవరాహిత్యం కారణమా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కొంతకాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు గాను ఆ కంపెనీకి సుమారు 1400 కోట్లు ముట్టచెప్పడానికి, 13600 కోట్ల రుణాన్ని భరించడానికి ఒప్పందం అయినట్లు కూడా వెల్లడించారు. అంతా సజావుగా జరిగితే ప్రభుత్వానికి కొంత భారం అయినా, రేవంత్ సర్కార్‌కు ప్రతిష్ట వచ్చేది. ప్రభుత్వం కోరినట్లు 13600 కోట్ల మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు భారత రైల్వే ఆర్థిక సంస్థ(ఐఆర్ఎఫ్సీ) అంగీకరించింది. దీంతో అంతా హాపీస్ అనుకుంటున్న వేళ ఆ సంస్థ వెనక్కి తగ్గడం రేవంత్ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారింది. మెట్రో రెండోదశ నిర్మాణానికి సుమారు నలభై వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తూ డీపీఆర్‌ను కేంద్రానికి రాష్ట్రం పంపించింది. దీనికి కూడా ఆమోద ముద్ర పడలేదన్నది రేవంత్ ఆరోపణ.రుణం మంజూరు ఆగిపోవడం కాని, రెండో దశ నిలిచిపోవడానికి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణమని, ఆయన వెనుక బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉన్నారని రేవంత్ ఆరోపించారు. దీనిని కిషన్ రెడ్డి తోసిపుచ్చినా, సహజంగానే కేంద్రంపైన సందేహాలు వస్తాయి. అందులోనూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడానికి వెనుకాడటం లేదన్న విమర్శ ఉంది. నిజంగానే రేవంత్ చెప్పినట్లు కేంద్రం కనుక మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో ఇలాగే వ్యవహరించి ఉంటే వచ్చే ఎన్నికలలో బీజేపీకి చేటు అవుతుంది. అయితే రేవంత్‌వి తప్పుడు ఆరోపణలు అని బీజేపీ తిప్పికొడుతోంది. కాని నిర్దిష్టమైన సమాధానాలు ఇచ్చినట్లు కనిపించలేదు.బీజేపీ రాజకీయం ఇలా ఉంటుందని రేవంత్ సర్కార్ ఆలోచించలేక పోయిందా? ఇక్కడే ఆయన అనుభవ రాహిత్యం కనిపిస్తోందా? సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇలాంటి గేమ్ ఆడుతూనే ఉంటాయి. అలాగే ప్రతిదానికి కేంద్రంపై నెపం నెట్టి రాష్ట్రంలోని అధికార పార్టీ తనవంతు రాజకీయం తాను ఆడుతుంది. ఈ గేమ్ ప్రమాదకరంగా మారనంతవరకు ఫర్వాలేదు. కాని ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తు సంకటస్థితిలో పడుతోంది. ఆ ప్రాజెక్టుకు ఏడాదికి 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 30వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అది కరెక్టు అయితే ఎల్ అండ్ టీ ఎందుకు 15వేల కోట్లకే అంగీకరించిందన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. అంటే ఈ కంపెనీకి ఉన్న ఆస్తులపై రేవంత్ టీమ్ కన్నేసిందని ఆ నేతలు ఆరోపిస్తున్నారు.ఐఆర్టీసీ నుంచి తక్కువ వడ్డీకి రుణం వస్తుందని, అందువల్ల మెట్రోని లాభాల పట్టించవచ్చన్న ఆశ రాష్ట్రానికి ఉన్నా, ఇప్పుడు పరిస్థితి ఎదురు తిరిగింది. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వని వైభవ్, కిషన్ రెడ్డిలు కూడబలుక్కుని రుణం ఆపారా? లేక ఆదాయంలో రుణ వాయిదా చెల్లించాలన్న కండిషన్ కారణంతో రుణం ఆగిందా అన్నది చర్చగా ఉంది. ఆర్బీఐ కూడా ఈ రుణం మంజూరుకు ఓకే చేసిన తర్వాత కేంద్రం అడ్డు పడడం కుదురుతుందా? అలా ఆగిపోవడానికి కేంద్రం నుంచి లేఖ ఏదైనా వెళ్లిందా? లేక మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారా అన్నదానిపై ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ డీల్ పూర్తి అయితే కాంగ్రెస్‌కు, రేవంత్‌కు పేరు వస్తుందని, దానివల్ల బీజేపీకి ఏమి లాభమన్న ఆలోచన జరిగిందన్నది మరో ఆరోపణ. కాగా కేసీఆర్ టైమ్‌లో ప్లాన్ చేసిన రెండో దశను రేవంత్ రద్దు చేసి, జనం లేని ఫ్యూచర్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు ప్లాన్ చేయడం కూడా నష్టం చేసిందా అన్నది మరో పాయింట్‌గా ఉంది.ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీతో రేవంత్ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారన్న భావన ఉంది. కొద్ది రోజుల క్రితం నీతి అయోగ్ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయనతో ముఖాముఖీ మాట్లాడారు. అప్పుడు ఈ మెట్రో గురించి చర్చించారా? లేదా? చర్చించినా ఈ ప్రాజెక్టుకు ఈ సమస్య ఎదురైందంటే ఏమని అర్థం అవుతుంది. రాజకీయాలలో వీటన్నిటిని ముందుగా ఊహించుకుని ఒక వ్యూహంతో వెళ్లాలి. లేకుంటే సహజంగానే ప్రజాస్వామ్య రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఉమ్మడి ఏపీలో కేంద్రం తమకు సహకరించడం లేదని, అనేక ప్రాజెక్టులను పెండింగులో పెడుతోందని టీడీపీ వ్యవస్థాపకుడు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీరామారావు విమర్శించేవారు. కేంద్రం ఒక మిధ్య అని కూడా సీరియస్ వ్యాఖ్య చేశారు. తెలంగాణకు ఆర్థికంగా రావల్సిన మొత్తాలు రావడం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయడం లేదని కిషన్ రెడ్డి తదితరులు వాదిస్తుంటారు.ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం ద్వారా ఇబ్బంది పెట్టడానికి కొందరు బీజేపీ నేతలు ప్రయత్నించేవారు. జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ గతంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఒక తప్పుడు ఆరోపణతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు అప్పట్లో వినతిపత్రం అందచేశారు. తద్వారా విపక్ష టీడీపీకి మేలు చేయడానికి ఆమె యత్నించేవారు. అంతెందుకు! ఎన్నికల సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా పలువురు ఐపీఎస్, ఐఏఎస్ లను కూటమి ప్రయోజనం కోసం బీజేపీ నేతలు పోస్టు చేయించుకున్నారు. అంతేకాక ఏకంగా ఏభై లక్షల మాయ ఓట్లు అదనంగా అర్ధరాత్రి వేళ పోల్ అవడం వెనుక ఎవరు ఉన్నది అర్థం చేసుకోలేరా? దీనిపై పరకాల ప్రభాకర్ ఎన్ని విమర్శలు చేసినా నోరు తెరవడం లేదంటేనే పరిస్థితి అర్ధం చేసకోవచ్చు.ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తన అధికారాన్ని ప్రదర్శించడం మొదలు పెడితే రాష్ట్రాలను చాలా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుంది. దీనికి తగినట్లు రాష్ట్రాలలోని విపక్ష ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటివెన్నో చేసిందన్నది సర్వవిధితమే. ఆమె తెలివి తక్కువగా సొంత పార్టీ నేతలను కూడా కష్టాల పాలు చేసి జైళ్లలో పెట్టి, చివరికి తన అధికారాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత అధికంగా ఇలాంటి రాజకీయాలు చేస్తోందన్న భావన ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ మెట్రో వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్లు వ్యవహరించి ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది.ఏడాదికి మహా అయితే 500 కోట్ల నష్టం రావచ్చు. దానిని భరించే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. అలాకాకుండా ఏదేదో చేయాలని భావించి ఊబిలో చిక్కుకున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరచి కొత్త ఆలోచన చేయకపోతే అది రాష్ట్రానికి నష్టం చేస్తుందని చెప్పవలసి ఉంటుంది. కాగా మరో అంశం కూడా చూడాలి. కాంగ్రెస్ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లో రాజ్యసభకు పోటీచేస్తే ఆమెపై ఏదో కేసు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలే బీజేపీవారికి ఉప్పందించినట్లు వచ్చిన సమాచారం ఆ పార్టీకి తీరని చేటు అవుతుంది. దీని వెనుక రేవంత్ హస్తం ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ విషయంలో రేవంత్.. బీజేపీపై ఘాటైన విమర్శలే చేశారు. ఓట్ చోరీతో పాటు సీట్ చోరికి బీజేపీ పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాగా ఓటుకు నోటు కేసులో ఉన్నది రేవంతేనని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదన్నది నిజమే. మొత్తం మీద ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కాంగ్రెస్‌లో అంతా సజావుగా లేదన్న సంగతి అర్థం అవుతుంది. అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీపరంగా డిఫెన్స్‌లో పడితే అది కాంగ్రెస్‌తో పాటు రేవంత్ భవిష్యత్తు రాజకీయానికి ఇక్కట్లు తేవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పొన్నం సమక్షంలో ఎంపీ చిందులు
తెలంగాణ వ్యాప్తంగా బడి గంట మోగిన వేళ.. విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ వేదిక ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార కార్యక్రమం సాఫీగా సాగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలోనే.. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపింది. అసలు ఏం జరిగిందన్న ఆసక్తి వేదిక వద్దే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు అల్పాహార పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రోటోకాల్ అంశం వివాదాస్పదంగా మారింది.స్థానిక రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్‌కు కార్యక్రమం గురించి అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నేరుగా కార్యక్రమానికి హాజరై మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కొద్దిసేపు కార్యక్రమంలో రాజకీయ వేడి కనిపించింది.అనంతరం అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా, పౌష్టికాహారంతో ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుమారు రూ.800 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారంతో పాటు పాలు, రాగిజావ అందజేస్తున్నామని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల డ్రాప్‌అవుట్ రేటును తగ్గించడంతో పాటు విద్యను ప్రోత్సహించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్య నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.హైదరాబాద్ నగర వ్యాప్తంగా తొలి దశలో 42 ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అయితే విద్యార్థుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమం కంటే.. కార్యక్రమం ప్రారంభానికి ముందే చెలరేగిన ప్రోటోకాల్ వివాదమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి సమక్షంలోనే ఎంపీ అధికారులను నిలదీయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. -
అమరావతి ఉండగా.. ఎక్కడో ఉండడం ఎందుకు?
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్ తెలుగు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తూ పవన్‌ను విమర్శిస్తున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పవన్‌తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.గురువారం నల్లగొండ జిల్లాలో మీడియా చిట్ చాట్ సందర్భంగా గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ సభ పెట్టుకోవాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆ రోజు రాజకీయ సభ ఎందుకు?” అంటూ పవన్‌ను ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ తన భాషలో మార్పు చేసుకోవాలని సూచిస్తూ.. రాజకీయ నేతగా మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అంతటితో ఆగకుండా ఆయన వ్యాఖ్యలు నేరుగా కూటమి ప్రభుత్వ పెద్దలపైకి మళ్లాయి. అమరావతిని “బ్రహ్మాండం”గా, “ఈ భూగోళంలోనే అలాంటి రాజధాని లేదు” అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని.. దానికి పవన్ కల్యాణ్ వంతపాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు “షటిల్ సర్వీసులు బంద్ చేసుకోవాలి” అంటూ బాబు, పవన్‌లకు సూచించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులంతా అమరావతిలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. “అమరావతి రాజధాని అని చెబుతున్నప్పుడు నాయకులు అక్కడే ఉండాలి. ఎక్కడో ఉంటాం అంటే ఎలా? అలా కుదరదు కదా” అని గుత్తా చురకలు అంటించారు. -
తెలంగాణ హైకోర్టులో జనసేనకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీకి చుక్కెదురైంది. ‘నవనిర్మాణ సభ’కు అనుమతి నిరాకరించిన పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో ఆ పార్టీకి మంగళవారం ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో నవనిర్మాణ పేరిట సభ నిర్వహణకు జనసేన ప్రయత్నించింది. అయితే తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు, ఇక్కడి రాజకీయ నేతల ఖండన, తాజా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నిన్న కోర్టు సాధారణ సమయం ముగిసిన తర్వాత పోలీసుల నుంచి జనసేనకు తిరస్కరణ సమాచారం వెళ్లింది. దీంతో చేసేది లేక ఇవాళ అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి విచారణ జరపాలని కోరింది. అయితే ఈ వ్యవహారంలో ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి కేవియెట్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టును కోరారు.ఇరు పక్షాల అంశాలను పరిశీలించిన హైకోర్టు.. జనసేన వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. దీంతో నవనిర్మాణ సభ నిర్వాహణ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఫోకస్ అంతా సాయంత్రం పవన్ కల్యాణ్ నిర్వహించబోయే ప్రెస్‌మీట్ మీద కేంద్రీకృతమైంది. -
పవన్ ప్రెస్‌మీట్ రగడ.. తన్నుకున్న కాంగ్రెస్-జనసేన కేడర్!
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహారశైలితో తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలంగాణను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నేపథ్యంతో ఇక్కడ సభ నిర్వహించాలనుకోవడం, దానికి అనుమతి నిరాకరించడంతో హైదరాబాద్ నుంచే ప్రెస్‌మీట్‌కు సిద్ధం కావడం.. ఈ అంశాల చుట్టే వివాదం నడుస్తోంది. అయితే.. జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్, జనసేన నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం ఆవిర్భావ వేడుకల నేపథ్యంతో గన్‌పార్క్ వద్ద నివాళులర్పిస్తుండగా.. ఇరు పార్టీల నాయకులు ఎదురెదురు పడ్డారు. పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జనసేన నేతలు ఆందోళనకు దిగగా, కాంగ్రెస్ నేతలు దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇరవైపులా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పి దూషించుకుంటూ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఘర్షణ జరగ్గా.. పిడిగుద్దులు గుప్పించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి కాసేపటికి సర్దుమణిగింది. ఇక పవన్ కల్యాణ్ తీరుపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు అక్కడే రాజకీయాలు చేయాలని, తెలంగాణలో ఏపీ నాయకులకు ఏం పని అని ప్రశ్నించారు.తెలంగాణలో జనసేనకు రాజకీయ భవిష్యత్తు లేదని, మనుగడ లేని పార్టీలు ఇక్కడ విజయవంతం కావడం కష్టమని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ పార్టీ నిర్మాణం చేస్తామంటే ప్రజలు అంగీకరించరని విమర్శించారు.పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన, ఆయన వ్యాఖ్యలు, వాటిపై కాంగ్రెస్ ప్రతిస్పందనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇంత రాద్ధాంతం నడుమ ప్రెస్‌మీట్ అవసరమా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరును ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తప్పుబట్టారు. అనవసర వివాదాలకు పవన్ తెర తీస్తున్నారంటూ సాక్షితో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, అలాగే హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించాలన్న ఆయన ప్రకటనపై రాజకీయ దుమారం రేగింది. ఈ పరిణామంపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం తీవ్రంగా స్పందించారు.పవన్ కల్యాణ్ అనవసర వివాదాలకు తెర లేపుతున్నారని కోదండరాం విమర్శించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు నచ్చకపోతే అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవకాశం ఉన్నప్పటికీ, పోలీసు కేసుల వరకు వెళ్లడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తుల మధ్య ఉన్న విభేదాలను ప్రాంతాల మధ్య వైరుధ్యంగా మార్చడం ఆందోళనకరమని అన్నారు.మొదటి నుంచి తెలంగాణ అంటే బీజేపీకి గిట్టదని, ఈ వివాదాల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చని కోదండరాం వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ పవన్ కల్యాణ్ ద్వారా ఈ తరహా పరిస్థితులను నడిపిస్తోందని ఆరోపించారు. ఇంత రాద్దాంతం జరుగుతున్న తరుణంలో పవన్ హైదరాబాద్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన తన అభిప్రాయాలను ఏపీలోనే వ్యక్తం చేయవచ్చని సూచించారు.ఇదిలా ఉండగా.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరిలూదుకొన్నది తెలంగాణ గడ్డపైనేనని పేర్కొంటూ, ఈ నేల నుంచే పార్టీకి పోరాట పటిమ లభించిందని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదే సమయంలో.. జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ ప్రెస్‌మీట్‌కైనా పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్’లో వెటకారంగా ఓ పోస్ట్ చేశారు. -
పవన్.. కొండగట్టు అంజన్నపై ఒట్టేసి చెప్పు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టనున్న ‘నవనిర్మాణ సంకల్ప సభ’ రాజకీయ దుమారానికి దారితీసింది. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు, ఆ తర్వాత కూడా తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయ, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన వ్యక్తికి ఇక్కడ నవనిర్మాణం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు.సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ వారి కనులు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో సభలు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి, అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడికి వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరన్నారు.తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం రాజకీయ నాటకమేనని విమర్శించారు. ‘‘కన్న తల్లికి గాజులు కొనలేని వాడు పినతల్లికి ఒడ్డాణం చేస్తాడనే సామెత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో చేయలేనిది తెలంగాణలో వచ్చి చేస్తాననడం విడ్డూరం’’ అని వ్యాఖ్యానించారు.పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభల వెనుక బీజేపీ రాజకీయ ఎజెండా ఉందని ఆరోపించిన పొన్నం.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, తమిళనాడుల్లో కాకుండా తెలంగాణనే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సామాజిక వైషమ్యాలు సృష్టించడం లక్ష్యంగా బీజేపీ డైరెక్షన్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు.‘‘సినిమాల్లో హీరోగా అభిమానించొచ్చు. కానీ రాజకీయాల్లో తెలంగాణ వ్యతిరేక ధోరణితో వస్తే నిలదీస్తాం. పవన్ కళ్యాణ్ సినిమా నటుడు. పైసలు ఇస్తే ఏ పాత్రనైనా పోషిస్తాడు. ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్‌కు తగ్గట్టే నటిస్తున్నాడు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ కోసం పార్లమెంట్లో, ఉద్యమాల్లో, సకల జనుల సమ్మెలో వేలాది మంది పోరాడారని గుర్తుచేసిన మంత్రి పొన్నం.. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఎవరైనా కించపరిస్తే సహించబోమన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు పండుగరోజు అని, ఆ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఎవరైనా రావొచ్చని, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి ఇక్కడ రాజకీయ సభలు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్‌తో తమకు సోదర సంబంధాలే ఉన్నాయని, అక్కడి ప్రజలపై ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. అయితే తెలంగాణపై విషం కక్కిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రేమ నటిస్తే ప్రజలు నమ్మరన్నారు. ‘‘బీజేపీ ఇచ్చే రెమ్యూనరేషన్ కోసం తెలంగాణకు రావడం లేదని నువ్వు నమ్మిన దేవుడు కొండగట్టు అంజన్నపై ప్రమాణం చేసి చెప్పగలవా పవన్ కళ్యాణ్?’’ అంటూ సవాల్ విసిరారు.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, గంగవరం, కృష్ణపట్నం పోర్టుల అంశం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యలపై స్పందించకుండా తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ‘‘సినిమాల్లో దేశభక్తి చూపించడం కాదు.. నిజ జీవితంలో ప్రజల కోసం నిలబడాలి. ఏపీ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. ముందు అక్కడ నవనిర్మాణం చేసి చూపించు’’ అని హితవు పలికారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఆయన రాజకీయ ఉద్దేశాలను అంగీకరించదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు -
మైనింగ్ స్కాం కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మైనింగ్ కుంభకోణాల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజులు, అనుమతులు, తవ్వకాల ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వెయిరీకి ఆదేశించింది. ఈ క్రమంలో విజిలెన్స్ సంస్థ సమగ్ర పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దీంతో ఇకపై సీఐడీ ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరపనుంది. సంబంధిత అధికారులు, అప్పటి నిర్ణయాధికారులు, లీజుదారుల పాత్రపై విచారణ కొనసాగనుంది. అవసరమైతే కీలక పత్రాలు, ఫైళ్లు, అనుమతి రికార్డులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని సమాచారం.ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై వరుసగా దర్యాప్తు ఆదేశాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇది మరింత రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కమలంలో కాంగ్రెస్ కోవర్టులు?
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ కోవర్టులున్నారనే ఆరోపణలు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డితో బీజేపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు అంతర్గతంగా అంటకాగుతున్నారని, సన్నిహితంగా మెలుగుతున్నారనే చర్చ కమల దళంలో కాక పుట్టిస్తోంది. కొందరు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు, నియోజకవర్గ స్థాయిల్లో ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతున్నట్టుగా పార్టీ నాయకత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. మరోవైపు మరికొందరు పార్టీ నేతలు, వివిధ స్థాయిల నాయకులు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలూ గట్టిగానే వినిపిస్తుండటంతో బీజేపీ అధినాయకత్వం కూడా అప్రమత్తమైందని, పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగినట్టు సమాచారం. క్లాస్ పీకిన పాటిల్ ఇటీవల రాష్ట్ర బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం సందర్భంగా...తెలంగాణ ఇన్చార్జి అభయ్ పాటిల్ కొందరు నేతలను ముఖాముఖి ప్రశ్నించి పద్థతి మార్చుకోవాలని హెచ్చరికలు జారీచేయడం చర్చనీయాంశమయ్యింది. కొందరు ప్రజాప్రతినిధులు అవసరం ఉన్నా, లేకపోయినా సీఎంను కలుసుకోవడం ఆయనతో వేదికలు పంచుకోవడం, తమ నియోజకవర్గానికి చెందిన కార్యక్రమం కాకపోయినా పాల్గొని సీఎంకు స్వాగతాలు పలకడంపై వంటి వాటిపై అంతర్గతంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమ నియోజకవర్గంలోని సమస్యలు, ఇతర అంశాలపై సీఎంను కలుసుకోవడంలో తప్పేమీ లేదని, అయితే సీఎం మీటింగ్‌లకు వెళుతూ, సంబంధం లేని చోట వేదికలు పంచుకుంటే కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయంటూ గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతల వ్యవహారశైలిని పాటిల్ నిలదీసినట్టు పార్టీ వర్గాల సమాచారం. కాగా కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కు, మిలాఖత్లపై తమ వద్ద ఆధారాలున్నాయనే విధంగా పాటిల్ ద్వారా అగ్రనేతలు సంకేతాలిచ్చారని అంటున్నారు. మున్సిపోల్స్‌లో పెద్దెత్తున మిలాఖత్.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అధికచోట్ల, బీఆర్ఎస్ విజయానికి కొన్నిచోట్ల బీజేపీ నాయకులు పూర్తిస్థాయిలో సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆర్థికపరమైన లావాదేవీలు కూడా జరిగాయని, ఇటు ఎన్నికల కోసం ఇచ్చిన పార్టీ ఫండ్‌ను ఎదుటిపార్టీ ఇచ్చిన డబ్బును కొన్ని జిల్లాల్లో కొందరు పార్టీ నేతలు జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు కూడా పెద్దెత్తున వచ్చాయి. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఎక్కువగా లేని మెదక్, మంచిర్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, జనగామ తదితర జిల్లాల్లో బహిరంగంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీ నాయకులు సహకరించినట్టు అప్పట్లో విమర్శలు వినిపించాయి. కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులకు కొన్నిచోట్ల అతి తక్కువ ఓట్లు (కొన్నిచోట్ల సున్న) రావడానికి నాయకుల తీరు, రాజకీయ ప్రత్యర్థులతో కుమ్మక్కు కావడమే కారణమని కూడా పార్టీ నిర్థారించింది. ఈ వ్యవహారంపై ఆయా జిల్లాల్లోని పార్టీ నాయకులు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు లిఖితపూర్వక ఫిర్యాదులు కూడా చేసినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌కు లోపాయికారీగా సహకరించిన తీరుపై రాష్ట్ర నాయకత్వాన్ని జాతీయ నాయకత్వం నిలదీసి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మళ్లీ ఆ ముద్ర పడకుండా .. బీఆర్ఎస్–బీజేపీ కుమ్మక్కు అయ్యాయని కాంగ్రెస్..కాంగ్రెస్–బీజేపీల మధ్య అవగాహన ఉందని బీఅర్ఎస్.. తరచుగా ఆరోపణా్రస్తాలు సంధించుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఆరోపణల వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా తీరని నష్టం జరిగిందని భావిస్తున్న జాతీయ నాయకత్వం..ఈసారి అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ముందు నుంచే జాగ్రత్త పడాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. మరో రెండున్నరేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పార్టీపై అలాంటి ముద్ర ఏదీ లేకుండా క్లీన్‌గా వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను ఇప్పటినుంచే సిద్ధం చేసే దిశలో చర్యలు చేపడుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పూర్తి బలం పుంజుకుని, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందనే వాతావరణం నెలకొనగానే..పార్టీపై ఆరోపణలు, ఇతర రూపాల్లో ఎప్పటికప్పుడు ఏదో ఒకపెద్ద అవాంతరం ఎదురై చతికిలపడాల్సి వస్తోందని అధినాయకత్వం భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటున్నారా? కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారా? అనే అనుమానాల నేపథ్యంలో.. మరోసారి గతంలో మాదిరి పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ‘కోవర్ట్’ల అంశంపైనా నాయకత్వం గట్టిగా దృష్టి కేంద్రీకరించిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. -
ప్రజా పాలనలో ఇంతటి దుస్థితినా?: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: గర్భిణి రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే ప్రసవించాల్సిన పరిస్థితి… మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి… అంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేనా ‘ప్రజా పాలన’నా అంటూ రేవంత్ సర్కార్‌ను నిలదీస్తూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారాయన. తాండూర్‌లో ఓ నిరుపేద గర్భిణికి 108 అంబులెన్స్ సేవలు సమయానికి అందలేదని, ఫలితంగా ఆమె రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే ప్రసవించాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో భద్రాచలంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు హియర్స్ వాహనం అందుబాటులో లేక కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లిన ఘటన కూడా చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. ఘటనలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులను పోస్ట్ చేశారు.Is this the “Praja Palana” people were promised?The condition of Telangana’s public healthcare system under the Congress government is becoming deeply disturbing and heartbreaking.In Tandur, a poor pregnant woman was forced to deliver her baby on a railway platform after 108… pic.twitter.com/1O4cQYr54Y— Harish Rao Thanneeru (@BRSHarish) May 25, 2026కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు, హియర్స్ వాహన సదుపాయాలు ఇప్పుడు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారాయన. అత్యవసర పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాల్సిన వ్యవస్థలు ఇలా కుప్పకూలడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రాణాలు కాపాడాల్సిన సేవలు పనిచేయకపోవడం, మరణానంతరం గౌరవం ఇవ్వాల్సిన వ్యవస్థలు కూడా విఫలమవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 108 సేవలను, హియర్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని, బాధ్యతను నిర్ణయించాలని రేవంత్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
ఫ్యూచర్ సిటీని రద్దు చేసి తీరతాం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన ప్రకటన చేశారు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారాయన. అలాగే.. ఫార్మాసిటీని మళ్లీ తీసుకొస్తామని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉంది. రేవంత్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోంది. హై కోర్టు లో ఈ మధ్య ఒక కేసు వచ్చింది. మేము ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అసలు విషయం ఇదే. రేవంత్ సర్కార్ కేవలం జిమ్మిక్కు చేస్తోందిఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధం గా కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. 75 శాతం ఫార్మా సిటీ ఉండి.. మిగతా 25 పర్సెంట్ మిగతావి ఉండాలని చేస్తున్నారు. కానీ 75 శాతం మిగతా వ్యాపారం కేవలం 25 శాతమే ఫార్మా వచ్చేలా చేస్తున్నారు. ఇది చట్ట ప్రకారం చెల్లదు. కానీ కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందిమేము ప్రభుత్వం లోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ రద్దు వంద శాతం చేస్తాం. ఫార్మా సిటీ నీ రీస్టోర్ చేస్తాం. ఇది నా మాట కాదు. పార్లమెంట్ చట్టం ఇది. ఫార్మా సిటీ వస్తె లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మేము ప్రారంభించాం. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటికి వెళ్లొద్దని చేశాం. ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచిపోయింది. లాస్ట్ వన్ ఇయర్ ఎలక్షన్ ఉంటుంది. రేవంత్ సర్కార్ ఏమీ చేయలేదు. భూములు పంచి పెడితే బ్యాక్ ఎండ్ ఏదో లబ్ది పొందాలని ప్లాన్ చేశారు. ఫార్మా సిటీ అభివృద్ది చెందితే బీఆర్ఎస్కు పేరు వస్తుంది అని ఇలా చేశారు. వాళ్ళు ఏమి చేసినా నడవదు... నిలబడదు.. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది అని హరీష్‌రావు అన్నారు. “ఫ్యూచర్ సిటీ”, “ఫార్మాసిటీ” రెండూ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన భారీ ప్రాజెక్టులే. కానీ ప్రభుత్వాలు మారడంతో వాటి దిశ కూడా మారిపోయింది. తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో “ఫార్మాసిటీ” పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ రావాల్సి ఉంది. దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద ఔషధ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల ఉద్యోగాలు పెరుగుతాయని.. తెలంగాణ ఔషధ రంగంలో అగ్రస్థానానికి చేరుతుందని అప్పటి ప్రభుత్వం చెప్పింది.అయితే ఆ ప్రాజెక్ట్‌కు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భూములు కోల్పోతామన్న భయం ఒకవైపు.. కాలుష్యం పెరిగి నీరు, గాలి దెబ్బతింటాయన్న ఆందోళన మరోవైపు పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. ముఖ్యంగా యాచారం, కందుకూరు ప్రాంతాల్లో రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం “ఫార్మాసిటీ” ఆలోచనను పక్కనబెట్టింది. అయితే.. అదే ప్రాంతంలో “ఫ్యూచర్ సిటీ” అనే కొత్త ఆలోచనను తెరపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం పరిశ్రమల నగరం కాదు.. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు సాంకేతికత, కృత్రిమ మేధస్సు, పరిశోధనలు, హరిత వాతావరణం, నివాసాలు, ఉద్యోగ కేంద్రాలు అన్నీ కలిసిన ఆధునిక నగరంగా అభివర్ణిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. -
బండి భగీరథ్ కేసు.. వాట్ వాట్ నెక్స్ట్?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో కరీంనగర్, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రమంతా గాలిస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఠాణాలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భగీరథ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. లుక్ ఔట్ నోటీసులు (ఎల్ఓసీ) జారీ చేసే విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పట్నుంచీ నిందితుడు పరారీలోనే ఉన్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే భగీరథ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగనుంది.ఫోరెన్సిక్ ల్యాబ్‌కు బాధితురాలి ఫోన్ బాధితురాలైన మైనర్ బాలిక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ ఇతరత్రా కీలకాంశాలను తెలుసుకునేందుకు ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికను ఫామ్ హౌస్ తీసుకెళ్లే ముందు జరిగిన చాటింగ్, లొకేషన్ షేరింగ్, కాల్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ మొత్తం సేకరించనున్నారు. భగీరథ్ పరారీలోనే ఉండటంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతోనే దర్యాప్తును సాగిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిన మొయినాబాద్ ఫామ్‌హౌస్, పరిసర ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాలను, సెల్‌ఫోన్ సిగ్నల్స్, లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు విశ్లేషించారు. భగీరథ్‌తోపాటు పలువురు స్నేహితులు కూడా ఫామ్‌హౌస్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్నేహితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు.విచారణకు సహకరిస్తా: బండి భగీరథ్పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఆలస్యంగా సాయంత్రం 6 తర్వాత భగీరథ్ స్పందించారు. ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)కు లేఖను పంపారు. తాను నోటీసును అందుకున్నానని, కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తక్కువ సమయంలో పోలీసులు నోటీసులు ఇవ్వడం, అలాగే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయానని వివరించారు. తనపై, తన కుటుంబంపై వచి్చన ఆరోపణలు తప్పుడువని.. వీటిని నిరూపించేందుకు కీలక పత్రాలు, సమాచారాన్ని సేకరించి పోలీసులకు సమరి్పంచడానికి తనకు కనీసం రెండు రోజుల సమయం కావాలని కోరారు. గడువు ముగిసిన వెంటనే దర్యాప్తు అధికారి ముందు హాజరై పూర్తి వివరాలు అందజేస్తానని పేర్కొన్నారు.పోక్సో కేసును కావాలని బలహీనపరిచారు: బీఆర్ఎస్కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసును పోలీసులు ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారని బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు విమర్శించారు. బాధిత బాలికపై లైంగిక, మానసిక వేధింపులు, డిజిటల్ వేధింపులకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, పేట్ బషీరాబాద్ పోలీసులు నామమాత్ర సెక్షన్లతో కేసు పెట్టడాన్ని వారు ప్రశ్నించారు. పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్లకు బదులుగా సాధారణ సెక్షన్లతో కేసు పెట్టడంతో పాటు కొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడాన్ని నిలదీశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుల ఉమ తదితరులు బుధవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కుమారుడిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం, మొబైల్ ఫోన్లు, చాట్లు, వీడియోలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకోకపోవడం తదితరాలు విచారణపై అనుమానాలు పెంచుతున్నాయన్నారు. అలాగే కరీంనగర్లో మంగళవారం జరిగిన హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆరోపించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, సాక్షులకు వెంటనే రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్‌తో పాటు కేసులో ఉన్న ఇతరులను అరెస్టు చేయడం, వారిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయడం, సంబంధిత పోలీస్ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టడం సహా మొత్తం ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీజీపీకి సమర్పించినట్లు మహిళా నేతలు వెల్లడించారు.విదేశాలకు పారిపోకుండా చూడాలి: కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణల నేపథ్యంలో ఆయన విదేశాలకు పారి పోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుమారుడిపై ఆరోపణలు వచి్చనా, ప్రధానితో వేదికను బండి సంజయ్ పంచుకోవటం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు మరో సారి మొండిచెయ్యి చూపించారని చేశారు. తెలంగాణ పర్యటనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తారని భావించినా, మనకు పొదుపు సూత్రాలు చెప్పి... ఆంధ్రాకు పైసలు ఇచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్ రోకో చేసిన కేసులో కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కోర్టు మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేయడంతో వ్యక్తిగతంగా హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ జూలై 17న నిర్వహిస్తామని మేజిస్ట్రేట్ ప్రకటించారు. -
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్‌ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది. మైనర్ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్‌తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె. -
బండి తనయుడి కేసుపై సీఎం రేవంత్ ఆరా!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడి వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడడంతో భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది కూడా. అయితే.. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ నుంచి సరైన స్పందన కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసుపై స్పందించినట్లు సమాచారం అందుతోంది. సోమవారం డీజీపీ సీవీ ఆనంద్‌తో భేటీ అయ్యి ఈ కేసుపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ‘‘ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే..ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని డీజీపీని సీఎం ప్రశ్నించారు. అయితే.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలోనే పోలీసులంతా నిమగ్నమయ్యారని ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. తక్షణమే విచారణ మొదలు పెట్టాలని సీఎం డీజీపీని ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. మైనర్ బాలిక వేధింపులకుగానూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ పైన నమోదు కేసు అయ్యింది. అయితే బాలిక కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తూ భగీరథ్ కూడా ఫిర్యాదు చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే పోలీసు వర్గాలు ఆ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. తాజా విమర్శల నేపథ్యంలో కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
భగ్గుమన్న బీజేపీ.. పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నం!
సాక్షి, కరీంనగర్: నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి ప్రయత్నం జరిగింది. అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే క్యాంప్ కార్యాలయం, వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. బీజేపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి.బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఎమ్మెల్యే కౌశిక్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు కోపం తెప్పించాయి. ఈ క్రమంలోనే ఆయనపై దాడికి ప్రయత్నించింది. దాడిలో కౌశిక్ క్యాంప్ కార్యాలయం కూడా ధ్వంసం చేశారు. ఈ దాడితో కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కౌశిక్ ఏమన్నారంటే.. కరీంనగర్లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. గంగుల ఆఫీస్‌పైనా..మరోవైపు.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్‌రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. -
కొత్వాల్‌గూడలో ‘హైడ్రా’మా!
సాక్షి, హైదరాబాద్: కొత్వాల్గూడ్లో హైడ్రా హడావిడి చేస్తోంది. స్థానికంగా ఓ క్రషర్స్ మిషన్స్‌ను కూల్చివేస్తోంది. ఇది ఓ మంత్రికి సంబంధించిందంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండడం గమనార్హం. వట్టినాగులపల్లిలో అనుమతి లేని క్రషర్లను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో అక్రమ క్రషింగ్ యూనిట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడలో ఉన్న ఈ క్రషర్ల చుట్టూ ఉన్న వివాదాలు నెలకొన్నాయి. జీవో నెంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ.. అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్స్ కంపెనీ క్రషర్లను నడుపుతోందని ఆరోపణలు వచ్చాయి. హిమాయత్‌సాగర్ క్యాచ్మెంట్ ఏరియా (111 జీవో పరిధి)లో ఈ క్రషర్లు పనిచేస్తున్నాయని, గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే..తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. 15 స్టోన్ క్రషర్లకు (పరిధిలోని వివిధ ప్రాంతాలు) జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ లిస్ట్‌లో లేదని స్థానిక అధికారులు తెలియజేశారు. ఆ వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
ఇది మోదీ మేడే గిఫ్ట్, కుంభకర్ణుడిలా రేవంత్..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌లు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మే డే సందర్బంగా శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రూపాయి విలువ పాతాళానికి.. గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. హోటల్ కార్మికులకు మే డేన మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచారు. ఎన్నికలయ్యాక ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కోసం మంచి చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఏ కోశాన కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు దానవీర శూరకర్ణ.. ఎన్నికల తర్వాత కుంభకర్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొద్దునిద్ర పోతున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే.. బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే.. దిగజారి బూతులు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు జేమ్స్ బాండ్ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అంటూ రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. -
పార్టీ మార్పు.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తానింకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పారాయన. బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనకు మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురైంది.. మోదీని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మల్లారెడ్డి కుటుంబం ఇటీవల ప్రధాని మోదీని కలిసింది. అంతకు కొన్నిరోజులు ముందే.. ఆయన కోడలు ప్రీతిరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను పొగుడుతూ కామెంట్లు చేశారు. ఆ వెంటనే ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. దీంతో పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. తాము మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రారంభించబోయే ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవం కోసం ప్రధానిని కలిశామని.. బీజేపీ మాత్రమే కాదు అన్ని పార్టీల నేతలనూ కలిసి ఆహ్వానిస్తామని ప్రీతిరెడ్డి తర్వాత క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు తనకు ఇంకా టైం ఉందన్న ఆమె.. బీఆర్ఎస్ అంటే తమ కుటుంబానికి గౌరవం ఉందంటూ వ్యాఖ్యానించారు. -
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: భారతదేశ రాజకీయ చరిత్రలోనే పాతిక వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమేనని.. అందులో భారత రాష్ట్ర సమితి ఒకటని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో జెండా ఎగరేసిన ఆయన.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించారు. ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్. గత రెండున్నరేళ్లుగా దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. తెలంగాణను మళ్లీ గాడిన పెట్టేందుకు పోరాడతాం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పునరంకితం అవుతుంది. కేసీఆర్ సైనికులుగా బలగంగ కలిసికట్టుగా కదం తొక్కుతాం. ‘‘మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేసీఆర్ రానున్నారు. నేతలకు దిశ నిర్దేశం చేస్తారు’’ అని కేటీఆర్ తెలిపారు. అదే సమయంలో టీఆర్ఎస్ అధినేత్రి కవిత చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఆయన విముఖత ప్రదర్శించారు.నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా…పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం!స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ ..సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం!25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్!బీఆర్ఎస్ రాజకీయ… pic.twitter.com/1vrQbOtCqL— KTR (@KTRBRS) April 27, 2026 -
BRS Party: కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి పార్టీ నేటితో 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆవిర్భావ వేడుకల దృష్ట్యా ఆ పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 11గం.కు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఎగరేయనున్నారు. మధ్యాహ్నాం అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే.. ఈ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారో? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కొంతకాలంగా నిశబ్దంగా ఉండిపోయిన ఆయన.. మొన్నటి జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉరిమారు. తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా కూడా వ్యక్తం చేశారు. అయితే కొత్త సవాళ్లపై ఆయన స్పందిస్తారా?.. పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో? అనే కుతూహలం ఇప్పుడు నెలకొంది.తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కూతురు కవిత టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట కొత్త పార్టీ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని.. అందుకే తాను టీఆర్ఎస్ పెట్టి యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారామె. అదే సమయంలో ఆమె నేరుగా ‘తెలంగాణ తొలి సీఎం విఫలం’, ‘సారు మారిపోయారు’.. ‘ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్’ అంటూ నేరుగా తండ్రిపైనే విమర్శలు గుప్పించారు. కవిత పార్టీపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పరోక్షంగా సెటైర్లు వేసింది. కానీ ఆ పార్టీ నేతలెవరూ ఆమె ఆరోపణలపై స్పందించింది లేదు. ఈ తరుణంలో ఇటు పార్టీ శ్రేణులు సైతం ‘‘సారు ఏం మాట్లాడతారో..? కవిత విమర్శలకు స్పందిస్తారా? లేదంటే కేవలం కాంగ్రెస్ సర్కార్‌పైనే ధ్వజమెత్తుతారా?? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ సమావేశం తర్వాత కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉండొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. -
కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మేడ్చల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట శనివారం కొత్త పార్టీ ప్రకటించిన ఆమె.. ఆయన మారిపోయారని, రాజకీయ పరిణతి కోల్పోయారంటూ వ్యాఖ్యానించారు. ఆనాటి కేసీఆర్ వేరు..ఈనాటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేశారు. ఈనాటి కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి. ఏ కష్టమొచ్చినా ఆ సార్ ఇప్పుడు రారు.. ఎందుకంటే ఆయన మరమనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ అయ్యారు. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సరిగా పాలించలేదు. అందుకే సరైన ఫలితాలు రాలేదు. ఇప్పుడు పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన ఆయన ఏం చేస్తున్నారు?. గతంలో టీఆర్ఎస్ కోసం ఆస్తులు అమ్ముకుని పని చేశారు. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఉద్యమకారుల్ని ఇబ్బంది పెడుతుంటే పార్టీ అధినేత ఆనాడు ఎందుకు స్పందించలేదు. కేసీఆర్ హయాంలో ఒక్క ఉద్యమకారుడికి కూడా పదవి దక్కలేదు. దీనిపై ఆనాడే నేను పోరాడాల్సి ఉండేది. అదే నా తప్పైంది. ఆనాడు ఉద్యమకారులకు జరిగిందే ఇవాళ నాకు జరిగింది.. బీఆర్ఎస్ పార్టీలో అమ్మతనం పోయింది.. మమకారం పోయింది. ఆయన మన కేసీఆర్ కాదు.. మారిన కేసీఆర్. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు. మన కేసీఆర్ అయ్యింటే తెలంగాణ బిడ్డలు కష్టపడి బయటకు వచ్చేవారు. మారుతారామోనని చూశా కానీ నన్నే సస్పెండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే నేను చెప్పడమే తప్పా?. తప్పు చేయని నన్ను పార్టీ నుంచి పంపించేశారు. నా బిడ్డ, కొడుకు తప్పు చేస్తే తీసేస్తానని ఆనాడు కేసీఆర్ చెప్పారు. అవినీతి జరిగిందన్నందుకు నన్నే బయటకు పంపించేసి.. అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్నారు. ఆయన మారిపోయారు కాబట్టే నేను యుద్ధం చేస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే ముందుంది ముసళ్ల పండుగ’’ అంటూ కవిత ప్రసంగించారు.ఇదీ చదవండి: అందుకే మన పార్టీ పేరు టీఆర్ఎస్సీఎం రేవంత్‌పై.. ఇప్పుడు ఉన్న సీఎం కర్కోటకుడిలా వ్యహరిస్తున్నాడు. ఒక రాజకీయ నాయకుడిని అలా అనడం సరికాదు. కానీ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే అలా అనాల్సి వస్తోంది అంటూ సీఎం రేవంత్‌పై కవిత విమర్శలు గుప్పించారు. బీజేపీపై.. బీజేపీకి తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. మెడ మీద తలలేని ఓ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాక్‌తో పోల్చాడు. బీజేపీ బానిస ఎంపీలు ఈ విషయంపై కనీసం మాట్లాడలేదు. ఆ పార్టీ ఎంపీలకు చేతనైతే ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చూడండి అంటూ సవాల్ విసిరారామె. -
కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్
సాక్షి, మేడ్చల్: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. కల్వకుంట్ల కవిత శనివారం కొత్త పార్టీ ప్రకటించారు. తన పార్టీకి టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన)గా ఆమె నామకరణం చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన ఆవిర్భావ సభ వేదికగా ఈ ప్రకటన వెలువడింది. పార్టీ ప్రకటన అనంతరం ఆమె మాట్లాడుతూ..‘‘తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించా. నాకు సింగరేణి అంటే చాలా ఇష్టం. తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేసిన ఘనత జాగృతిదే. బతుకమ్మతో తెలంగాణ సంస్కృతిని చాటాం. బతుకమ్మను ప్రపంచానికి పునఃపరిచయం చేసుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి బలమైన సాంస్కృతి పునాది వేసింది జాగృతి. అయితే వచ్చిన తెలంగాణ ఎక్కడో దారి తప్పింది. .. 12 ఏళ్లు గడిచినా తెలంగాణ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైంది. తెలంగాణ ఆనాడు పాలించిన కుటుంబంలో నేను భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నా. ఆనాడు ఇసుక మాఫియా ఎన్నో దారుణాలకు పాల్పడింది. అలాగే తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు మాత్రం గర్వపడుతున్నా. తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి. కేసీఆర్ పాలనలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ తప్పు సరిదిద్దుకునేందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన(TRS)తో మీ ముందుకు వచ్చాను. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. మంచి చేయాలంటే రాజకీయ పార్టీ ఉండాలి. తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి అమ్మగా మారాలనుకుంటున్నా. బిడ్డల కష్టం అమ్మకే తెలుస్తుంది. అప్పుడే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరతాయి’’ అంటూ ప్రసంగించారామె. పాంచజన్య హామీలు..తెలంగాణలో ఉన్న మూడు పార్టీలు అధర్మం, అవినీతి, బంధు ప్రీతితో నిండిపోయాయి. ఎంతో మంది ఎన్నో మాట్లాడారు.. కానీ మనకు ఏమీ చేయలేదు. ఆ మూడు పార్టీలపై మన టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) తరఫున పాంచజన్యం పూరిద్దాం. ప్రస్తుతం మనమే ప్రధాన ప్రతిపక్షం. మరో రెండేళ్లలో మనదే అధికార పక్షం. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం. అవతలి వాడు మనవాడైనా సరే యుద్ధం చేస్తా. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం.. ఈ ఐదు అంశాలపైనే నా పోరాటం అంటూ పాంచ్జన్యం పేరిట ఐదు హామీలను కవిత ప్రకటించారు.ఇదీ చదవండి: మళ్లీ టీఆర్ఎస్గా బీఆర్ఎస్.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
కవిత ప్రసంగంపై ఉత్కంఠ
తెలంగాణలో మరో ప్రాంతీయ రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత ఇవాళ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీ జెండా, ఎజెండాను శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగే సభలో ఆవిష్కరించనున్నారు. సాక్షి, హైదరాబాద్: సబ్బండ వర్గాల సంక్షేమం కోసం.. రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం.. కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం అనే ప్రచారంతో కవిత ముందుకు వచ్చారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరిట పార్టీ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఉదయం 10గం. ఇందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి సంస్థ కవిత పార్టీ ప్రకటన సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. నగరంలో పలు చోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. కొత్త పార్టీ ప్రకటనకు మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర అద్వయ కన్వెన్షన్ ఇందుకు వేదిక కానుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేయగా.. ప్రాంగణంకు సెంటిమెంట్‌గా ‘ప్రొఫెసర్ జయశంకర్ సార్’గా నామకరణం చేశారు. సభ కోసం వచ్చే శ్రేణుల కోసం భోజనాలు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉదయం బంజారాహిల్స్ నివాసం నుంచి కవిత గన్ పార్క్‌కు చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి సభకు ఆమె చేరుకోనున్నారు. పార్టీ ప్రకటన, జెండా ఆవిష్కరణ, ప్రసంగం అనంతరం తిరిగి ర్యాలీగా లిబర్టీ చౌరస్తాకు చేరుకుంటారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి బంజారాహిల్స్ నివాసానికి చేరుకుంటారు. తెలంగాణ ఉద్యమంతో.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ బిడ్డగా కల్వకుంట్ల కవిత పోరాటంలో పాల్గొన్నారు. 2006లో ఉద్యమానికి సాంస్కృతిక కోణాన్ని జోడించి తెలంగాణ జాగృతిని నెలకొల్పారు. బతుకమ్మ సంబురాలతో సాంస్కృతికంగా, బీఆర్ఎస్ తరఫున రాజకీయ కార్యకలాపాల ద్వారా క్రియాశీలంగా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ తరఫున నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. 2020లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024 మార్చిలో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో అరెస్టై సుమారు 5 నెలల పాటు ఢిల్లీ తీహార్‌లో జైలు జీవితం గడిపారు. ఆగస్టులో విడుదల కాగా.. ఇటీవలె సీబీఐ కోర్టు ఈ కేసులో ఆమెకు క్లీన్చిట్ ఇచ్చింది. కవిత ప్రసంగంపై ఉత్కంఠ.. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల నిర్వహణ, పార్టీ అధినేత ప్రసంగంలో లోపాలను ఎత్తిచూపుతూ తాను తండ్రికి రాసిన లేఖ లీక్ కావడంపై కవిత కిందటి ఏడాది మే నెలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లేఖ లీక్ కావడానికి కేసీఆర్ చుట్టూ చేరిన దెయ్యాలే కారణమంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి నుంచి పార్టీపై, నాయకత్వంపై విమర్శల డోసు పెంచుకుంటూ వచ్చారు. ఒకానొక టైంలో.. హరీష్‌రావు, సంతోష్‌రావు, జగదీశ్ రెడ్డిలపై విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె.. సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కూ చురకలు అంటించారు. దీంతో పార్టీ గీత దాటారన్న కారణం చెబుతూ బీఆర్ఎస్ సెప్టెంబర్ 2వ తేదీన ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ పరిణామంతో కలత చెందిన ఆమె.. పలు సంచలన విషయాలను వెల్లడిస్తూ కంటతడి నడుమ పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన చేశారు. అప్పటి నుంచి రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారామె. మధ్యలో(అక్టోబర్‌లో) జాగృతి జనం బాట పేరిట నాలుగు నెలుల పాదయాత్ర చేశారు కూడా. ఈ నేపథ్యంలో కవిత పార్టీ పేరుతో పాటు ఆమె ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. సుమారు గంటన్నర పాటు ఆమె మాట్లాడతారని సమాచారం. -
బీజేపీ ఆఫీస్‌కు మల్లారెడ్డి కోడలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఇది హాట్ చర్చకు దారి తీసింది.ప్రీతిరెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించారు. బీజేపీ పార్టీ విధానాలపై సానుకూలంగా మాట్లాడారు. దీంతో ఆమె బీజేపీ వైపు అడుగేస్తారనే చర్చ మొదలైంది. ఈ ఊహాగానాల నడుమ శుక్రవారంనాడు ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీ ఆఫీస్‌కు వెళ్లి.. సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. అయితే.. ఇది మర్యాదపూర్వక భేటీనేనని చెబుతూ ప్రచారాలకు ప్రీతిరెడ్డి తెర దించారు. ‘‘మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐ క్యాంపస్ ఓపెనింగ్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించాం. మోదీని ఆహ్వానించాం కాబట్టే ఆ పార్టీ నేతలను ఇప్పుడు కలుస్తున్నాం. బీజేపీనే కాదు.. అన్ని పార్టీల నేతలను కలిసి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం మొన్న మంత్రి శ్రీధర్‌బాబును కూడా కలిశాం. నేను బీజేపీలో చేరడం లేదు. మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాకు బీఆర్ఎస్ అంటే గౌరవం ఉంది. విద్యావేత్తగా అందరితో కలిసి ఉండడంలో తప్పేముంది? దయచేసి ఈ ప్రచారానికి ఇంతటితో ఆపండి’’ అని అన్నారామె. సాక్షితో చిట్‌చాట్‌లో.. ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాంబీజేపీ నేతలను కలిసి ఇదే విషయం తెలియజేశాంబీఆర్ఎస్ నేతలను, కాంగ్రెస్ వాళ్లనూ ఆహ్వానిస్తాం అన్ని పార్టీల నేతలను కలుస్తాంఇప్పుడ రాజకీయాల్లోకి రావాలని లేదుమహిళా రిజర్వేషన్లు వచ్చి ఉంటే బాగుండేదిమల్లారెడ్డి ఇటీవల కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలిశారు. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా నడిచింది. అయితే ఆ కథనాలపై ఆయన స్పందించారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీలో దేశంలోనే మొట్టమొదటి డీజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్‌ను గూగుల్‌తో కలిసి త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్దదైన ఏఐ-ఏజెన్సీ క్యాంపస్ కానుంది. అందుకే ప్రధాని నరేంద్రమోదీని ఆ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు మల్లారెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు. -
అదే కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారనుందా?
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ ఒకే రోజున బహిరంగ సభలు నిర్వహించి మాటా మాటా అనుకోవడంతో రాష్ట్రం మొత్తమ్మీద రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనతోపాటు రైతు భరోసా నిధుల విడుదల సందర్భంలో రేవంత్ రెడ్డి.. సీనియర్ కాంగ్రెస్ నేత, టి.జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా రేవంత్, కేసీఆర్‌లు ఇద్దరూ ఈ బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మినహా ఇద్దరు ప్రధాన నేతలు ఒకే రోజు బహిరంగ సభలు పెట్టుకోవడం చాలా అరుదు. దీన్నిబట్టి చూస్తే వీరి మనసుల్లో ఏదో తెలియని ఆందోళన, సందేహాలు నిండి ఉండాలని అనిపిస్తుంది. అదే సమయంలో ఇరువురు నేతల ప్రసంగాల్లో స్పష్టమైన తేడా ఒకటి కనిపిస్తుంది. ఒకరు సెంటిమెంట్ రేకెత్తిస్తే.. ఇంకొకరు ఎదుటి పక్షాన్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. కాళేశ్వరం వెళుతున్నానని తెలిసి జీవన్ రెడ్డి సభ పెట్టుకున్నాడని, రేవంత్.. జగిత్యాలలో తమ సభ ఉందని తెలిసి రేవంత్ కాళేశ్వరం వెళ్లాడని జీవన్ రెడ్డి ఆరోపణలు చేసుకున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు నష్టమే. బహశా అందుకే రేవంత్ ఆయన పేరు ప్రస్తావించి ఉండాలి. ‘‘బానిస బతుకు బతికేందుకు బీఆర్ఎస్లోకి వెళ్లాడు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. 1984లో ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేశారని, దళితుడికి మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకపోయాడని, పాపాల భైరవుడి పార్టీలో చేరారని రేవంత్ ద్వజమెత్తారు. జీవన్ రెడ్డి కూడా తక్కువేమీ మాట్లాడలేదు. రేవంత్‌ను ఏకంగా తెలంగాణకు పట్టిన శని అని ఆరోపించారు. విశేషం ఏమిటంటే నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కరరావు ఏర్పాటు చేసిన కేబినెట్లో జీవన్‌రెడ్డి మంత్రిగా పనిచేయడం. రేవంత్ ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అప్పట్లో కాంగ్రెస్ చేసిన పనిని కూడా తప్పు పట్టినట్లు అయ్యింది. ఆ మాటకు వస్తే టీడీపీలో ఉండగా రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎంత తీవ్రంగా దుయ్యబట్టింది అందరికి తెలిసిందే. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు కేసీఆర్‌పైనే పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైనా ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్‌కు ఊపిరి పోశారు.ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికలలో సొంతంగా తన కేడర్‌ను రంగంలో దింపి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతోనే అవగాహనకు వచ్చి మున్సిపాల్టీని కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో తన అభ్యర్ధికి అవకాశం ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిలో మరింత అసంతృప్తి రాజేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉంది. అయినా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే ఈ వివాదం ఉండకపోయేదేమో!. రేవంత్ తన సన్నిహితుడు వేం నరేంద్రరెడ్డికి ఇచ్చారు. దాంతో తనను అవమానిస్తున్నారని భావించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రభావం పార్టీపై పెద్దగా పడకుండా ఉండడానికి రేవంత్ ఆయనపై విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. అయితే.. ఈ పరిణామం బీఆర్ఎస్కు మాత్రం కొంత ఉత్సాహం తెచ్చే విషయమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల గడువు ఉండగానే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్‌ను వీడడం కార్యకర్తలలో ఆలోచనకు దారి తీస్తుంది. అలాగే ప్రజలలో కాంగ్రెస్ దెబ్బతింటున్నదేమో అనే భావన కలగవచ్చు. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్‌ను, ఇటు జీవన్ రెడ్డిని కలిపి రేవంత్ విమర్శించారని చెప్పాలి. ఆ క్రమంలో రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కాంగ్రెస్ కేడర్ లో అపనమ్మకం కలగకుండా ఉండడానికి రేవంత్ ఇలా చేసి ఉండవచ్చు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసిఆర్ ధీమా వ్యక్తం చేస్తే 2029లో ఆ పార్టీకి విపక్ష హోదా దక్కనివ్వబోమని రేవంత్ అన్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవమే అయినప్పటికీ దానినే ప్రమాణికంగా తీసుకోలేం. ఉదాహరణకు రేవంత్ 2018 శాసనసభ ఎన్నికలలో ఓటమి చెంది, 2019 లోక్‌సభ ఎన్నికలలో మేడ్చల్ నుంచి విజయం సాధించారు. అదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు అయింది. కేసీఆర్‌ను పాపాల భైరవుడని.. ఆయన చేసిన తప్పులకు ఉరి వేయాలని.. దమ్ముంటే రా కేసిఆర్ ..ఇలాంటి డైలాగులు చెప్పడం కేవలం రెచ్చగొట్టడమే అనిపిస్తుంది.రాజకీయాలలో ఇదొక వ్యూహంగా చెప్పవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే తన రాజకీయ ప్రత్యర్దులపై పరుష వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయనకు శిష్యుడుగా భావించే రేవంత్ కూడా దానినే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక కేసీఆర్ ప్రసంగం చూస్తే ఆయన ఒకటిరెండు అభ్యంతరకర పదాలు వాడినా సెంటిమెంట్ పండించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా రేవంత్ పేరు కాని, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లు కాని తీయకుండా విమర్శలు చేయడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రస్తావించి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని,కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, తాను ఆనాడే ఈ విషయం చెప్పానని, గోసపోతారని హెచ్చరించానని చెప్పడానికి యత్నించారు. పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఆయన గుర్తు చేసి అవి అమలు అయ్యాయా? అని ప్రజలను అడిగారు. తాను సీఎంగా ఉండగా కరెంటు సరఫరాలో కాని, రైతులకు మేలు చేయడంలో కాని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కాని ఎక్కడా అశ్రద్ద చేయలేదని, అలాంటిది ఇప్పుడు ఏమి రోగం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీల గురించి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు రేవంత్ జవాబు ఇచ్చినట్లు అనిపించదు. కాళేశ్వరం లోని మూడు పిల్లర్లు కుంగిన అంశానికే ఎక్కువగా పరిమితం అయినట్లు అనిపిస్తోంది. రేవంత్ తీసుకువచ్చిన ఈ ప్రస్తావనకు కేసీఆర్ జవాబు ఇవ్వలేదు. ఇది ఈయన బలహీనత అయితే హామీల అమలులో వైఫల్యాలు రేవంత్ వీక్నెస్గా కనిపిస్తుంది. తెలంగాణలో కలకలం రేపుతున్న హైడ్రా ను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించడం కొత్త విషయంగా ఉంది. హైడ్రా వల్ల కాంగ్రెస్‌కు కొంత లాభం, మరికొంత నష్టం కలుగుతోంది. చెరువులలో నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించినప్పుడు ప్రభుత్వానికి మంచిపేరే వస్తోంది. కాని అదే టైమ్ లో పేదల ఇళ్లు కూల్చుతున్నారన్న విమర్శ, రాజకీయ ప్రేరేపితంగా ఇది పనిచేస్తోందన్న డౌట్లు రేవంత్ సర్కార్ ను ఆత్మరక్షణలో నెడుతున్నాయి. హైకోర్టు కూడా ఈ హైడ్రా పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, కూల్చివేతలకు అడ్డుపడడం ప్రభుత్వానికి మైనస్ కింద లెక్క. ఉదాహరణకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఆ ప్రాంతంలో కూల్చివేతలు పెద్దగా జరగలేదట. ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపగానే హైడ్రాను ప్రయోగించారన్నది ఒక విమర్శగా ఉంది. ఇందులో నిజంగానే ఆక్రమణలు ఉండవచ్చు. కానీరాజకీయ లక్ష్యాలతో పనిచేసినట్లు,బ్లాక్ మెయిల్ కు వాడుతున్నారన్న భావన జనంలో కలిగితే.. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చారన్న అభిప్రాయం పెరిగితే.. అది కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టడం తదితర విషయాలు కూడా కేసీఆర్ లేవనెత్తారు. కాగా కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ అనే వ్యాఖ్య చేయడం విశేషం. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా? అనే చర్చకు అవకాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్,ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరడానికి సిద్దంగా ఉన్నారని.. అదే పునరేకీకరణ అని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ నిజానికి తన పూర్తి స్థాయి స్టైల్ లో ప్రసంగించలేదు. అయినా లాగూలు పగిలేదాక.. అంటూ కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. తన చావు ను కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ ప్రజలలో సెంటిమెంట్ ను తీసుకురావడానికి కేసీఆర్ యత్నించారు. తన ప్రభుత్వం ఓడిపోయాక ,తెలంగాణ ఆగమైందని చెప్పడానికి కేసీఆర్ కృషి చేస్తే, తనది ప్రజాపాలన అని నమ్మించడానికి రేవంత్ ప్రయత్నించారు. రెండు సభలను పోల్చి చూస్తే కేసీఆర్ కొంతమేర పైచేయి అయినట్లు అనిపిస్తుంది. ఈ సభ ప్రభావం పరిమితం చేయడానికి రేవంత్ కాళేశ్వరం యాత్రను పెట్టుకున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైష్యమ్యాలు రగల్చొద్దు.. మీ మిత్రపక్షాల్ని కంట్రోల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై టీడీపీ మిత్రపక్షాల నేతలు చేస్తున్న వరుస ప్రకటనలపై అభ్యంతరం చేసిన పొన్నం.. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తున్న ఆ వ్యాఖ్యల్ని సహించబోమన్నారు. ‘‘ఆంధ్రా- తెలంగాణ విభజనను భారత్ - పాకిస్థాన్ విభజనతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మేలా ఉన్నాయి. ఆ వ్యాఖ్యల్ని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేలా స్పీకర్‌కు లేఖ రాయండి’’ పొన్నం చంద్రబాబును డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్ర విభజనసై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, త్యాగాలు గొప్పవి. రాజ్యాంగబద్ధంగానే రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ ఏపీ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. కానీ, బీజేపీ, జనసేన నేతల వ్యాఖ్యలు వైషమ్యాలకు దారి తీస్తున్నాయి. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. అలాగే.. ప్రధాని మోదీ గతంలో చేసిన ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అనే వ్యాఖ్యలు అనుచితం. .. తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు. అలాంటి మాటలు మానుకోవాలి. మీ మిత్రపక్షాల పార్టీల నేతల్ని నియంత్రించండి. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. వివాదాస్పద వ్యాఖ్యలకు ముగింపు పలకాలి. తెలంగాణ వారంతా ఐక్యంగా ముందుకు సాగాలి’’ అని పొన్నం ఆ లేఖలో పేర్కొన్నారు. -
కేసీఆర్‌కు సమకాలికుడినే.. చేతులు కట్టుకోను
సాక్షి, జగిత్యాల: తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సీనియర్ నేత జీవన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని నిలబడతానన్న వ్యాఖ్యలను బుధవారం ఆయన ఖండించారు. ‘‘కేసీఆర్ ముందు నేను చేతులు కట్టుకుని నిలబడతానంటూ సీఎం రేవంత్ మాట్లాడడం సరికాదు. విభేదాల పేరుతో వ్యక్తిగతంగా కించపరచడం సరికాదు. నేను ఎవరి ముందు చేతుల కట్టుకుని నిలబడను. కేసీఆర్‌కు నేను సమకాలికుడినే. ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం చేశాం. ..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర గొప్పది. ఆయన సమాజాన్ని గౌరవించే నాయకుడు. వ్యక్తిని గౌరవించే సంస్కారం నాది. నేను ఎవరి ముందు చేతులు కట్టుకోను. రాజకీయాల్లో నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో అది దెబ్బతింది కాబట్టే బయటకు వచ్చా అని జీవన్‌రెడ్డి చెప్పారు. -
మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్.. ఫిట్టింగ్ పెట్టింది ఎన్డీయే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పురుషులతో పాటు మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని.. అలాంటి పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇంతకాలం అడ్డుకుంది ఎన్డీయేనేనని ఆరోపించారాయన. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ చేస్తున్న ప్రచారంపై సోమవారం సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ రెండింటినీ ఒకేలా చూపించే ప్రయత్నం చేస్తోంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. బిల్లుకు విపక్షాలు సహకరించడం లేదని అపవాదు వేస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. రాజ్యాంగబద్ద పదవుల్లోనూ మహిళకు అవకాశం ఇచ్చింది. మహిళలకు రిజర్వేషన్ల బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని సోనియా భావించారు. గతంలో కాంగ్రెస్ బిల్లు పెడితే బీజేపీ పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. 2013లో బిల్లు తీసుకొస్తే బీజేపీ సహకరించలేదు. అందుకే మహిళా బిల్లు ఆగింది. గత పదేళ్లుగా బీజేపీ ఈ బిల్లు ఊసే ఎత్తలేదు. చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసిందే ఎన్డీయే అని సీఎం రేవంత్ ఆరోపించారు.2024లోనే రిజర్వేషన్లు వర్తింపజేసి ఉంటే మహిళలకు లాభం జరిగేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు చర్చే అవసరమే లేదన్న ఆయన.. అయినా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.శిక్షించే హక్కు ఎవరిచ్చారు?మహిళా బిల్లు, డీలిమిటేషన్‌కు లింకు పెడుతున్నారు. ఇక్కడే అసలు కుట్ర ఉంది. డీలిమిటేషన్‌పై కేంద్రం హడావిడి చేస్తోంది. 50 శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పారు. జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్‌ను గతంలో ఇందిరా గాంధీ నియంత్రించారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించాయి. అందుకే ఇక్కడ జనాభా తగ్గింది. మోదీ చర్యలతో ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి.. దక్షిణాదిలో తగ్గుతాయి. ఇది ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరాన్ని పెంచుతుంది.జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది. చిన్న రాష్ట్రాలు మనుగడ కోల్పోతాయి. రాజకీయంగా దక్షిణాది వాళ్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే ప్రయత్నం జరుగుతోంది. సీట్లు పెంచాలనుకుంటే ముందు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్స్పర్ట్ కమిటీ వేయండి.. అసెంబ్లీల అభిప్రాయం తెలుసుకోండి. జనగణన పూర్తయ్యే లోపు పూర్తి చేయండి. మేం హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదిస్తున్నాం. పెంచాలనుకున్న 272 సీట్లలో 136 ప్రొరేటా ప్రకారం చేయండి. మిగిలిన 136 సీట్లను జీఎస్డీపీ ప్రకారం చేయండి. స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు సీట్లు పెంచండి. దేశానికి మేం అత్యధిక ఆదాయం అందిస్తున్నాం. అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం. అలాంటి రాష్ట్రాలను శిక్షించే హక్కు మీకెవరు ఇచ్చారు?’’ అని కేంద్రాన్ని సీఎం రేవంత్ నిలదీశారు. -
కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ గూటికి ఆ ఎమ్మెల్యే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్‌తో బంధం తెంచుకుని బీఆర్ఎస్లో చేరబోతుండడంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. అయితే మరో నేత కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా.. ఆయన బహిరంగంగా చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనం. సీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై గరం గరంగా ఉన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారా? అనే చర్చ జోరందుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నిజామాబాద్ జిల్లా సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ పరిణామంపై పోచారం రిజర్వాయర్ వద్ద బైఠాయించి మరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘బిల్లులు రాకపోతే ఎలా పని చేయాలని కాంట్రాక్టర్లు అంటున్నారు. అయినా వాళ్లను బతిమాలి పనులు చేయిస్తున్నాం. నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏనాడూ చూడలేదు. నిధులు విడుదల చేయాలని సంబంధిత మంత్రిని 20 సార్లు అడిగా. ఇప్పుడు మంత్రులు కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు. వాళ్ల కాళ్లు మొక్కలా ఏంది?. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?’’ అని ప్రశ్నించారాయన. ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన పోచారం.. టీడీపీ, ఆ తర్వాత టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరారు. అటుపై మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గానూ ఆయన పని చేశారు. అయితే.. 2024లో కాంగ్రెస్‌లో చేరి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమితులయ్యారు. అయితే.. ఆయన పార్టీ ఫిరాయించినట్లు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ మాత్రం ఆ పిటిషన్ కొట్టేశారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. -
గులాబీ ఫ్లెక్సీల్లో జీవన్‌రెడ్డి ఫొటో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాల వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. గురువారం ఉదయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కలిసిన కేటీఆర్, వినోద్ కుమార్, రమణ.. ఇతర కీలక నేతలు సుమారు అరగంట పాటు జీవన్‌రెడ్డి చేరిక అంశంపై చర్చించారు. అనంతరం జగిత్యాలకు బయల్దేరారు. కేటీఆర్ రాకతో జగిత్యాల అంతటా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే కేటీఆర్‌తో పాటు జీవన్‌రెడ్డి ఫొటో కూడా ఫ్లెక్సీలో ప్రముఖంగా కనిపిస్తోంది. దీంతో.. ఆయన గులాబీ కండువా కప్పుకోవడం దాదాపు ఖరారైందనే సంకేతాలు అందుతున్నాయి. అన్నీ కుదిరితే పార్టీ ప్లీనరీ కంటే ముందే ఆయన బీఆర్ఎస్లో చేరవచ్చని తెలుస్తోంది.జీవన్‌రెడ్డి తెలంగాణలో సీనియర్ రాజకీయ నేత. 1983లో కాంగ్రెస్ చేరి.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన.. గతంలో రెండుసార్లు మంత్రి పని చేశారు. ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా ఉన్న ఆయన.. గత కొంతకాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో హర్టయ్యారు. ఈ క్రమంలోనే 43 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకున్నారు. బీఆర్ఎస్దే విజయంబీఆర్ఎస్లో చేరిక వేళ.. జీవన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్దేనని అన్నారు. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే బీఆర్ఎస్ పాలన భేష్ అని.. వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. అది చెప్పడానికి జీవన్‌రెడ్డి ఎవరు?జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14సార్లు బీఫామ్ ఇచ్చింది. రేవంత్ పోవాలి.. మార్పు రావాలి అనడానికి జీవన్‌రెడ్డి ఎవరు?. కేసీఆర్ అవినీతిని జీవన్‌రెడ్డి చాలాసార్లు బహిరంగంగానే విమర్శించారు. పొంగులేటి అవినీతిపై ఆధారాలు ఉంటే చర్చకు రండి. ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని మహేష్‌గౌడ్ అన్నారు. -
కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రచార హడావిడితో రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో గురువారం ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల కోసం కోఆర్డినేటర్ల జాబితాను టీపీసీసీ విడుదల చేసింది. అయితే అనూహ్యంగా ఈ జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు కనిపించడం చర్చనీయాంశమైంది. నిజామాబాద్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, ఇల్లందు మున్సిపాలిటీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, షాద్ నగర్ మున్సిపాలిటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్లు టీపీసీసీ లిస్టులో దర్శనిమిచ్చాయి. పైన చెప్పుకున్న ముగ్గురికి అనర్హత వివాదంలో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. కారు గుర్తు మీద పార్టీ ఫిరాయించారని 10 మందిపై బీఆర్ఎస్ తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లలో ఇప్పటిదాకా కడియం శ్రీహరి, దానం నాగేందర్ తప్ప మిగతా 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాల్లేవని.. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారంటూ తీర్పు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు సాధారణంగా పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు. ఈ తరుణంలో.. నెక్ట్స్ ఏం జరగనుందో చూడాలి. -
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కూ క్లీన్చిట్
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపుల వ్యవహారంలో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇచ్చారు. ఆయన పార్టీ ఫిరాయించినట్లు తగిన ఆధారాల్లేవంటూ.. దాఖలైన పిటిషన్‌ను కొట్టేశారు. దీంతో ఇప్పటిదాకా 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లైంది. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. విచారణలో జాప్యం జరుగుతుండడంతో బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్‌ను మందలిస్తూ.. వీలైనంత త్వరగా విచారణ జరిపి ఏదో ఒకటి తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కడియం శ్రీహరిని, పిటిషన్ వేసిన వివేకానందను ఇవాళ(బుధవారం, ఫిబ్రవరి 04) క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు స్పీకర్. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉన్న సంగతి తెలిసిందే. -
కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం తమ ఎదుట విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. కడియం శ్రీహరి కారు పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11గం. జరగబోయే విచారణకు రావాల్సిందిగా వివేకాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కడియం, వివేకా వాదనలను స్పీకర్ విననున్నారు.మొత్తం పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా.. ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లెవరూ పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇకప్పుడు కడియం శ్రీహరి పిటిషన్ విచారణ జరగబోతోంది. మరో ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
వీడిన ఉత్కంఠ.. జగిత్యాలలో హైవోల్టేజ్ పొలిటికల్ డ్రామా
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల విషయంలో అధికార పార్టీలో కొనసాగుతున్న రగడ.. హైవోల్టే పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపించింది. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సంజయ్ వర్గానికే అధిక సీట్లు కేటాయించింది. దీంతో.. సీనియర్ నేత జీవన్‌రెడ్డి అలకబూనారు.అధిష్టానం వద్ద జరిపిన లాబీయింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సక్సెస్ అయ్యారు. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో 62 మంది అభ్యర్థుల ఖరారు చేసింది. ఇందులో సంజయ్ వర్గానికి 36 (జగిత్యాలలో 30, రాయికల్‌లో 6), జీవన్‌రెడ్డి వర్గానికి 26 సీట్లు (జగిత్యాలలో 20, రాయికల్‌లో 6) కేటాయించింది. ఫ్లాష్ సర్వే, ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న సీఎం రేవంత్ మాటకే కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో.. ఎమ్మెల్యే సంజయ్‌ను బహిరంగంగానే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దూషిస్తున్నారు. తమకు బీఫామ్‌లు రాకుండా అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సంజయ్ నివాసం, ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో జగిత్యాలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధిష్టానం వద్ద జరిపిన లాబీయింగ్‌లో సంజయ్ సక్సెస్ అయ్యారు. అయితే అధిష్టానం ఫార్ములాను జీవన్‌రెడ్డి రిజెక్ట్ చేస్తున్నారు. పంపకాల ప్రసక్తే లేదు.. కార్యకర్తలకే ప్రాధాన్యత అని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్‌లు వరుస ఫోన్‌కాల్స్‌తో ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.నన్ను, నమ్ముకున్న కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నా గొంతు కోశారు. నా కోసం కార్యకర్తలను పార్టీ బలి చేస్తోంది. నాకు వర్గమంటూ ఏదీ లేదు. పార్టీ జెండా మోసిన వారే నా వర్గం. క్రమశిక్షణ పేరుతో కట్టడి చస్తే చూస్తూ ఊరుకోవాలా? అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేన్నారాయన. జగిత్యాల హస్తం పార్టీలో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జీవన్‌రెడ్డి నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఆయన తదుపరి అడుగులపై ఏంటనే చర్చ నడుస్తోంది. ఈ అలకను అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి. -
సజ్జనార్ అలా మాట్లాడటం రూల్స్‌కు విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: నగర కమిషనర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న అధికారి వీసీ సజ్జనార్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో సజ్జనార్ చేసిన ట్వీట్‌పై.. సోమవారం ఎక్స్ ఖాతాలో హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తికాకముందే.. అక్రమమని సజ్జనార్ ప్రకటించడం చట్టవిరుద్ధం. సజ్జనార్ వ్యాఖ్యలు అఖిల భారత సర్వీస్ నిబంధనలకు విరుద్ధం. కోర్టులు తేల్చే వరకు అన్నీ ఆరోపణలే కదా. అలాంటప్పుడు అక్రమ ఫోన్ ట్యాపింగ్ అని సజ్జనార్ ఎలా అంటారు?. అక్రమమా.. సక్రమమా అని న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఆయన వ్యాఖ్యలు విచారణపై అనుమానాలకు తావిస్తోంది’’ అని హరీష్ రావు అన్నారు. How a SIT chief @SajjanarVC can officially refer to the issue of phone tapping as “illegal” even before the matter has been examined and decided by a competent court of law.Such a statement is not only legally unsustainable but also deeply disturbing coming from SIT chief.In… https://t.co/YAXaL36keJ— Harish Rao Thanneeru (@BRSHarish) February 2, 2026సిట్ చీఫ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. పక్షపాతంగా వ్యవహరిస్తూ ముందే తీర్పు ఇచ్చే అధికారం సిట్ చీఫ్‌కు ఎవరిచ్చారు?. కేసీఆర్‌ను కనీసం ప్రతిపక్ష నేతగా కూడా సజ్జనార్ గుర్తించడం లేదని హరీష్‌రావు అన్నారు. పోలీసుల పని దర్యాప్తు మాత్రమేనని.. తీర్పు ఇవ్వడం కాదు అని అన్నారాయన. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారం నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సిట్ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ పేరు ఎక్స్‌లో కాసేపు ట్రెండింగ్‌లో కొనసాగడం గమనార్హం. ఇక ఈ కేసులో హరీష్‌రావును సిట్ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. -
తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం ముగిసింది
సాక్షి, హైదరాబాద్: హత్యానేరం కన్నా.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ మహా పాపమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒకవైపు ఆదివారం నందినగర్ నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ కొనసాగుతున్న వేళ.. మరోవైపు సీఎల్పీ మీడియా హాల్లో పలువురు నేతలు ఈ అంశంపై మీడియా మాట్లాడారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఏ తప్పు చేయకపోతే విచారణ వేళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు హడావుడి చేస్తోంది?. చెప్పు కావడానికి సిగ్గుచేటు ఫోన్ ట్యాపింగ్. విచారణకు హాజరుకావడానికి వేల కార్ల కాన్వాయ్‌లు ఎందుకు?. ట్యాపింగ్ భాగోతం అందరికీ తెలియజేయడానికి ర్యాలీలు చేస్తున్నారా?. ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కేసీఆర్‌కి తెలియకుండా తెచ్చారా?. ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు..గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు,మాజీ సీఎంలు విచారణకు హాజరయ్యారు. మీరు నిజాయితీ పరులైతే ఒక్కరే వచ్చి విచారణకు హాజరైతే బాగుండేది. సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కేసీఆర్ కూతురు కవితనే చెబుతోంది. ట్యాపింగ్ కేసు లో ఉన్న ప్రభాకర్ రావు ఎందుకు అమెరికా పారిపోయాడు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్ నుంచి హార్డ్ డిస్కులు ఎందుకు మాయం అయ్యాయి?. మూసి నదిలో,వికారాబాద్ అడవుల్లో ఎందుకు డిస్కులు దొరికాయి. సిగ్గు లేకుండా భార్యాభర్తల ఫోన్ లు ట్యాప్ చేశారుఅన్ని ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టినా బీఆర్ఎస్లో మార్పు రాలేదు. తెలంగాణ లో ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందని అనుకుంటున్నారు. ప్రజా పాలనలో అంబేద్కర్ రాజ్యంగం అమలు అవుతుంది. కేసీఆర్ రాజ్యాంగం ముగిసి చాలారోజులైంది. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిజాయితీగా ఉద్యమం చేయలేదు. రాజకీయం కోసం ఉద్యమాన్ని వాడుకున్నారు. విచారణ ఎదుర్కొంటున్న రూంలో కూర్చుని కేసీఆర్ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రూంలో కూర్చుని బజ్జీలు తిని ముచ్చట్లు పెట్టి వచ్చేవాళ్ళం. కేసీఆర్ ఆ రూంలో కూర్చొని ఏం చేస్తే తనకి బెనిఫిట్ అవుతుందా? అని ఆలోచించేవారు. సకల జనుల సమ్మె, సాగర హారం లాంటి అనేక కీలక ఘట్టాల్లో కేసీఆర్ బయటకి రాలేదు. తెలంగాణ కోసం కేసీఆర్ నటించాడు. అసలు తెలంగాణ బిల్లు పెట్టిన రోజు కేసీఆర్ పార్లమెంట్‌లోనే లేడు. దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అని తేలిపోయింది. కూలీ బ్యాచ్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తే భయపడుతామా?. కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే దిష్టిబొమ్మలు కాలబెడుతున్నారు. ఇజ్రాయిల్ నుండి ఎక్విప్మెంట్ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. బీఆర్ఎస్ ఓడిపోగానే హార్డ్ డిస్కులు ఎందుకు నాశనం చేసి పడేసారు?. తప్పు చేసినవాళ్లు చంద్రమండలానికి పారిపోయిన లాక్కొని వస్తాం. రాజ్యాంగంపై నమ్మకముంటే కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవాలి. కేసీఆర్ కథలు వెబ్ సిరీస్ తీయవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తెలంగాణలో లేకుండా చేస్తారు అని అద్దంకి దయాకర్ అన్నారు. -
ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో!
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరు ఒక డ్రామాగా మారిపోతోంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లుగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సమర్థనీయం కాదు కానీ.. ఇది బీఆర్ఎస్ పాలనలో మాత్రమే జరిగిందన్నట్టుగా వ్యవహరించడం సమస్యకు మూలమవుతోంది. ట్యాపింగ్ గుట్టు పోలీస్ అధికారులందరికీ తెలిసిన విషయమే. సంఘ విద్రోహశక్తుల విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ వాడటం అన్నది చాలాకాలంగా జరుగుతున్నదే. ఇందుకోసం చట్టాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారన్నది అభియోగం. ఆసక్తికరంగా ఈ పని చేసేది కూడా పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే. ప్రభుత్వం ఏదైనా, ముఖ్యమంత్రి, కీలక మంత్రి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయాలని కోరితే అధికారులు ఎందుకు నిరాకరించడం లేదు? లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా? ఇలాంటి సందేహాలు సామాన్యులకు రావచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండే పోలీసు అధికారులకు అలాంటి ఆలోచనలు రాకపోవడమే బాధాకరం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు మాజీ పోలీసు అధికారులు కూడా అరెస్టు అయ్యారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తారక రామారావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా సిట్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా నోటీసు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ నిర్ణయించాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్‌లోని నందినగర్ లో కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తోసిపుచ్చారు. ఈ కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాల్సిందే. కేటీఆర్‌ను పోలీసు అధికారులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలలో బీఆర్ఎస్కు కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఎలా వచ్చాయి అన్నది కూడా ఉంది. నిజానికి ఈ ప్రశ్న వేయడం వల్ల వచ్చే కొత్త సమాచారం ఏమీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? అని అడిగితే ఎవరైనా అవునని చెబుతారా? బెదిరించడం వల్లే కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయని అనుకుంటే, మిగిలిన రాజకీయ పక్షాలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు కూడా అది వర్తిస్తుంది కదా!. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రూ.6,000 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి రూ.900 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని అడిగితే జవాబు ఏమి ఉంటుంది? నిజంగానే ఎవరినైనా బెదిరించి విరాళం పొందితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే అది కేసు అవ్వడం కష్టం కదా! ఒక వేళ చేసినా వాటిని రుజవు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. అసలు సమస్య ఏమిటంటే ఈ విధంగా విరాళాలు తీసుకోవడంలోనే లోపం ఉంది. ఆ పద్ధతిని మార్చే అధికారం పోలీసులకు ఉండదు! ఫోన్ చేసి మాట్లాడితే బెదిరింపు అవుతుందా అన్నది ఒక ప్రశ్న. ఏపీలో తెలుగుదేశం మీడియా.. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించిన వారి సంస్థ అని ఒక కంపెనీపై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చేది. కాని ఆ సంస్థ అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీకి సుమారు రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. అదెలా జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి యథాప్రకారం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది. టీడీపీ మీడియా ఆ కంపెనీపై నెగిటివ్ వార్తలు రాయడం నిలిపివేసింది. మరి ఇందులో మతలబు ఏంటి? అందుకే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన విరాళాల మాటేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారెవ్వరూ ఫోన్ ట్యాపింగ్‌కు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వరు. నమ్మకంగా ఉండే అధికారులతో అనధికారికంగా జరుగుతుంటాయి. ఫోన్ ట్యాపింగ్ వల్ల సంచలన విషయాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ.ఏభై లక్షలు ఇచ్చారన్న అభియోగాలు వచ్చాయి. ఈ ఉదంతం బయటపడడానికి, అప్పట్లో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ కొనుగోలు లావాదేవీకి భరోసా ఇస్తూ ‘‘మనవాళ్లు భ్రీఫ్డ్ మీ’’ అని ఫోన్ చేసిన ఆడియో టేప్ బయటకు రావడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా కారణం కావచ్చు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్‌ను సమర్థించాలా? వ్యతిరేకించాలా? అయితే చంద్రబాబు నాయుడు తనపై కేసు రాకుండా చేసుకోవడానికి కేసీఆర్‌పై ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌పై ఎదురు కేసులు పెట్టి హడావుడి చేశారు. చివరికి బీజేపీ పెద్దలు కొందరు రాజీ చేశారు. ఆ కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు పలుమార్లు ఉన్నా నిందితుడుగా నమోదు కాలేదు. మరి పోలీసు అధికారులు దీన్నెలా సమర్ధించుకుంటారు? అంటే అధికారంలో ఉన్న రాజకీయవేత్తల ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు తప్ప నిబధనల ప్రకారం కాదని అర్థం అవుతుంది కదా!. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును టేకప్ చేసింది. ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేశారన్న కారణంతోనే రేవంత్ కక్ష కట్టి ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కేటీఆర్ వేసిన కొన్ని ప్రశ్నలు ఆసక్తికరమైనవని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని ఆయన అడిగారు. కొందరు మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీక్ ఇచ్చారని, ఆ తర్వాత పోలీసులే అలాంటిది లేదని ఎలా తెలిపారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి గత చరిత్ర చూస్తే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరిపై అభియోగాలు వచ్చినా ఏమీ కాలేదు. కాకపోతే కొన్నాళ్లు రాజకీయ దుమారం సాగుతుంటుంది. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ఆనాటి విపక్ష నేత సిద్దరామయ్యతో సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే మరో సీఎం కుమారస్వామి తమ ఫోన్లు ట్యాప్ చేయించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాజాగా కర్ణాట గవర్నర్ ఫోన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ విపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై కర్ణాటక శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గ సభ్యులపై నిఘా పెట్టడానికి అధికారులతో సంప్రదింపులు జరిపారట. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌తో విబేధాలు వచ్చినప్పుడు ఫోన్ బగ్గింగ్ జరిగిందన్న అనుమానాులు ఉన్నాయని అప్పట్లో కీలకంగా పనిచేసిన ఒక అధికారి తన పుస్తకంలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర కొన్ని జాతీయ పత్రికలలో వచ్చిన వ్యాసాలు చదవితే టాపింగ్, బగ్గింగ్‌కు సంబంధించిన పలు విశేషాలు కనిపిస్తాయి. ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోనే బగ్గింగ్ జరిగిందన్న ప్రచారం కూడా ఉందట. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఒక సీనియర్ పోలీసు అధికారి పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ టీడీపీ మీడియా ఒక పచ్చి అబద్ధపు కథనాన్ని సృష్టించింది. దానిపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం విశేషం. ఆ తర్వాత ఆ కేసు మందుకు వెళ్లినట్లు లేదు. ఇంత ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం జగన్‌దే కావచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అంటున్నారు. అది ఆయన బీఆర్ఎస్పై కోపంతో అన్నారా? లేక నిజంగానే ఆధారాలు ఉన్నాయో తెలియదు. అది కరెక్టయితే తన చేతిలో ఉన్న హోం శాఖ ద్వారా ఎందుకు చేయించలేదన్న ప్రశ్న వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అధికారంలో ఉన్నవారికి ఒక ఆయుధంగా మారకుండా చేయగలిగితే మంచి విషయమే అవుతుంది. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఫిరాయింపుల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిరాయింపుల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరైన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తన ఎదుట విచారణకు హజరు కావాలని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ చర్యలకు తీసుకోవడం లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు డెడ్లైన్లు, వార్నింగ్‌లతో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. ఇప్పటికే ఏడుగురిని విచారించిన స్పీకర్.. వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాల్లేవంటూ పిటిషన్లు కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్ చిట్ ఇచ్చారు.ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిలను విచారణ జరపాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తాజాగా నోటీసులు ఇచ్చారు. అలాగే దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరు ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈనెల 19వ తేదిన స్పీకర్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కర నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించించింది. ఈ నేపథ్యంలో నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేయడం తెలిసిందే. -
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ: నల్లగొండ ప్రాంత అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం టౌన్‌లోని బొట్టుగూడలో తాను నిర్వహించే కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేను నిప్పులా.. నిజాయితీగా బతుకుతున్నా. నల్లగొండ నా గుండెకాయ. అందుకే కొడంగల్‌కు ఎన్ని నిధులు తీసుకెళ్తారో.. తనకూ అన్నే నిధులు ఇవ్వాలని సీఎం రేవత్ను కోరా. వచ్చే ఎన్నికల్లో ఉత్సాహం ఉంటే పోటీ చేస్తా. లేదంటే ఇదే బొట్టుగూడ స్కూల్లో ఓ గది తీసుకుని ఉంటా. ఇక్కడి పిల్లల్లోనే చనిపోయిన నా కొడుకుని చూసుకుంటూ కాలం వెల్లదీస్తా. గత పదేళ్ల పాలన కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి భారంగా మారింది. ఆ టైంలో కనీసం సీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. కార్పొరేట్ స్కూల్స్ పేరుతో దొంగలు దోచుకుంటున్నారు. నేను గనుక విద్యాశాఖ మంత్రి అయితే కార్పొరేట్ స్కూల్స్‌ను మూయించేస్తా. వైఎస్ఆర్ హయాంలో నల్లగొండలో ఎంజీ యూనివర్సిటీ నిర్మించా. లా పాటు అనేక నూతన కోర్సులను ఎంజీ యూనివర్శిటీలో తీసుకొచ్చా. నల్లగొండకు ఔటర్ రింగ్ రోడ్డును గిఫ్టుగా గడ్కరీ ఇచ్చారు. నల్లగొండలో ప్రతీ ఇంటికి 24 గంటల నీటిని అందిస్తాం.చదువంటే ర్యాంకులు మాత్రమే కాదని ఓ ఆలోచన చేశాం. విద్యకు ప్రాధాన్యత ఇచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా డిజిటల్ విద్యను అందిస్తాం. ఇక్కడి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ఇదే స్కూల్ చేర్పించాలి అని కోమటిరెడ్డి కోరారు. -
నైనీ బొగ్గు టెండర్లు.. విచారణ వేగవంతం
సాక్షి, హైదరాబాద్: నైనీ బొగ్గు టెండర్ల వ్యవహారంపై విచారణ మొదలైంది. శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని సింగరేణి కార్యాలయానికి వెళ్లిన కేంద్ర బృందం.. సుమారు ఏడు గంటలకు పైగా విచారణ జరిపారు. విచారణ గోప్యంగా జరిగినప్పటికీ.. ఆ వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. టెక్నికల్ కమిటీ సభ్యులు అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇవాళ సింగరేణి కార్యాలయానికి మరోసారి వెళ్లనున్న సెంట్రల్ టీం.. మరోసారి అధికారులను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మొన్న, నిన్నటి విచారణలో సీఎండీ కృష్ణ భాస్కర్‌తో పాటు కొందరు అధికారులను విచారించారు. పలు కీలకమైన ఫైల్స్‌ను పరిశీలించారు. ప్ఱధానంగా సీఎస్ఆర్ ఫండ్స్ వినియోగంపై ప్రశ్నల వర్షం గుప్పించినట్లు తెలుస్తోంది. సోమవారం ఈ అంశంపై కేంద్రానికి సెంట్రల్ టీం నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే దర్యాప్తును పరుగులు పెట్టిస్తున్నట్లు స్పష్టమౌతోంది. అసలు ఏంటీ వివాదంఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లా నైనీ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిని గతంలో సింగరేణికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ గనిలో తవ్వకాలు, బొగ్గు ఉత్పత్తి పనులను ఇతర సంస్థలకు అప్పగించేందుకు ‘మైన్ డెవలపర్, ఆపరేటర్’(ఎండీఓ) ఎంపిక కోసం టెండర్లను ఆహ్వానిస్తూ గత నవంబరులో సింగరేణి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29లోగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో టెండర్లు వేయాలని గడువు విధించింది. ఈ నోటిఫికేషన్లో గని నేపథ్యం(బ్యాక్‌గ్రౌండ్) వివరాలు తెలిపిన అంశాల్లో ఒకటో విభాగంలోని 1.8 నిబంధన ప్రకారం... నైనీకి వెళ్లి, గని తవ్వాల్సిన ప్రాంతాన్ని సందర్శించి, అన్ని వివరాలు తెలుసుకున్నట్లు అక్కడి సింగరేణి జనరల్ మేనేజర్(జీఎం) నుంచి ‘ధ్రువీకరణ పత్రం’ తీసుకుని టెండర్‌తో పాటు తప్పనిసరిగా దాఖలు చేయాలి. అయితే, తాము గనిని సందర్శించినా అక్కడి జీఎం సర్టిఫికెట్ ఇవ్వలేదని కొన్ని కంపెనీలు ఆరోపించడంతో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో గని తవ్వకాలకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్లయ్యింది. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నాయకుల సిఫార్సులతో సింగరేణి నుంచి సీఎస్ఆర్ నిధులను మంజూరు చేశారనే ఆరోపణలు వచ్చాయి. మరోపక్క.. సింగరేణి సంస్థ వ్యవహారాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కేంద్ర బొగ్గుశాఖ నడుం బిగించింది. టెండరు ప్రకటన రద్దుకు దారితీసిన పరిస్థితులతోపాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద నిధుల వినియోగం జరిగిన తీరుపై విచారణకు ఇద్దరు ఉన్నతాధికారులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర బొగ్గుశాఖలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్(డీడీజీ)గా పనిచేస్తున్న చేతన్ శుక్లా, సాంకేతిక విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్న మారపల్లి వెంకటేశ్వర్లును విచారణ కమిటీ సభ్యులుగా నియమించింది. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశంతోనే కమిటీని ఏర్పాటు చేసినట్లు తన ఉత్తర్వుల్లో తెలిపింది. వాస్తవానికి సింగరేణి ప్రధాన కార్యాలయం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఉంది. పాలకమండలి సమావేశాలను మాత్రమే హైదరాబాద్ కార్యాలయంలో నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో నైనీతోపాటు సీఎస్ఆర్ నిధుల మంజూరు, వినియోగానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలను వెంటనే తమ ముందు పెట్టాలని సింగరేణి అధికారులను కమిటీ సభ్యులు కోరారు. దీంతో.. కమిటీ అడిగిన వాటిని తెప్పించే పనిలో సింగరేణి యంత్రాంగం తలమునకలైంది. -
ట్యాపింగ్ నేరమేం కాదు.. ఆ మాట రేవంతే అన్నారు
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ విచారణ వేళ.. మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది నేరమేం కాదని.. అది పోలీసుల అంతర్గత వ్యవహారమని అన్నారాయన. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు. ఇది పోలీసుల అంతర్గత వ్యవహారం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డే ఒప్పుకున్నారు. కానీ, కావాలనే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. అవినీతిని ప్రశ్నిస్తున్నామనే కేసులు పెడుతున్నారు. హామీలపై నిలదీస్తామనే అటెన్షన్ డైవర్షన్చేస్తున్నారు. రేవంత్ సర్కార్ ప్రజలను దోచుకుంటోంది. తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది. ప్రజల కోసమే కేటీఆర్, హరీష్ పోరాడుతున్నారు. ఈ-కార్ రేసు అంటూ విచారణ జరిపారు. మరి విచారణలో ఏం తేల్చారు?.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. అదొక చెల్లని సిట్ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్టలో వేసిన సిట్ చట్ట వ్యతిరేకం. సంబంధం లేకున్నా హరీష్‌రావు, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చారు. విచారణలో ఏ ఒక్కరూ వీళ్ల పేర్లు చెప్పలేదు. అందుకే సజ్జనార్‌తో మరొక సిట్ వేశారు. ఈ సిట్‌కు బాధ్యత వహించే అర్హత సజ్జనార్‌కు లేదు. రాజకీయ నేతలను వేధించే సిట్‌కు చీఫ్‌గా సజ్జనార్ ఉన్నారు. సజ్జనార్‌పై విచారణ జరగాలి. అసలు ఏ అర్హతతో ఆయన విచారణ జరుపుతున్నారు. సజ్జనార్‌పై ఏడు కేసులు ఉన్నాయి. అన్ని కేసులున్న వ్యక్తిని ఎలా నియమిస్తారు?. ముందు అసలు సజ్జనార్‌పై విచారణ జరగాలి. నిజంగా సిట్ వేయాలనుకుంటే.. చెక్ డ్యామ్‌లు పేల్చిన ఘటనపై వేయాలి. హిల్ట్ స్కామ్‌పై వేయాలి. కానీ, ప్రత్యర్థులను వేధించేందుకే సిట్ వేశారు. దేశ రక్షణపై రేవంత్‌రెడ్డికి ఏమైనా బాధ్యత ఉందా?. రేవంత్ రాజకీయ క్రీడలో భాగమైనవాళ్లను వదిలేదు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అలాంటి అధికారులపై చర్యలుంటాయ్. -
బేఫికరుండు.. నాదీ గేరంటీ
‘ఏం తమ్మీ మంచి గున్నవా?’..‘మంచిగున్న అన్నా.. నిన్నిట్టా సీఎం పోస్టులో జూస్తాంటే బలే హేపీగా ఉన్నదన్నా’..‘మీ బాపూ చూపించిన దారే గద తమ్మీ. అందుకే గద తమ్మీ.. సార్‌ని నేను దేవుడంటా వుంటా’..‘నీ అసుంటి మంచోడు దునియాలోనే వుండడన్నా.. మంచి జేసినా గూడా యెనకాల గోతులు తవ్వేటోల్లే తప్ప.. ఇలా యాది పెట్టుకునేటోళ్లు యెవరుంటున్నారన్నా’..‘అరె ఛుప్. అలా గట్టిగా అనకురా తమ్మీ.. నీ బాపు గురించి నువ్వే సీక్రెట్స్ బయటపెట్టేస్తన్నావని.. అందరూ క్రిటిసైజ్ చేస్తారు మల్ల’.. ‘అర్రర్రె పాయింటు మర్చిపొయినా! అది మన హిస్టరీనే గదా.. బలే గుర్తుచేశావ్ రేవంతన్నా. మనలో మనం మురిసిపోవచ్చు గానీ.. బయటకు అనగూడదు కరక్టే.’‘నీ బాపు ఎక్కడ తమ్మీ.. కానొస్తలేడు. అందరం దావోస్ లోనే ఉన్నం. ఒకే చోట తిరుగుతున్నం. ఒకే పంచాయతీలు పెడుతున్నాం. పుటో దిగుతున్నం. డప్పు గొట్టిపిచ్చుకుంటున్నం.. అయినా మీ నాయిన కానొస్తలేడేంది తమ్మీ’.. ‘ఊకో అన్నా.. దావోస్ ల నువ్వు ఉన్నావంటేనే మా నాయినకు జొరమొచ్చేట్టుంది. దూరం నుంచి నువ్వు గనిపిస్తే చాలు.. తప్పించుకు తిరుగుతున్నాడు పాపం..’‘గదేంది తమ్మీ.. నీ బాపు గనిపిస్తే క్లోజ్డ్ రూంల సిటింగేసి ముచ్చట బెట్టాలనుకుంటి’‘ఊర్కో అన్నా. ఒక క్లోజ్డ్ రూం ముచ్చటనే బరాబర్ బజార్ల పెట్టేశావు. దునియా అంతా మా మొహాన దుమ్మెత్తి పోస్తాంటే లాక్కోలేక పీక్కోలేక నానా యాతన అవుతాంది. మా మినిస్టర్లను జూసినవా. నిన్ను ఒక్క మాటైన అననీకి, నువు జెప్పింది అబద్దం అననీకి దైర్యం లేదు. కానీ.. మా నాయిన మీద బురదని మాత్రం కడిగెయ్యాలి.. అందుకోసం ఎన్ని పాట్లు పడుతున్నారో జూసినవా..’‘మరైతే బాపును క్లోజ్డ్ రూం ల కలవడం కుదరదంటవా..’‘నువ్వింకోపాలి ఆ క్లోజ్డ్ రూం మాటెత్తితే దావోస్ నుంచే పారిపోయేట్టున్నాడన్న మా నాయిన’‘చల్ తియ్.. అయితే మాన్లె. నిన్నయినా ఇట్ట ఓపెన్ రూం కల్సులు అయ్యె ఈ తానకి’‘అయినా రేవంతన్నా.. ఏడాదికి మించి కుర్సీలో ఉండవేమో అనుకుంటినే’‘గట్లెట్ల అవుతది తమ్మీ.. నాదేమైనా గసుమంటి గిసుమంటి ట్రెయినింగనుకుంటివా? మీ బాపు దగ్గర నేర్చుకుంటినని యాద్ మరిసితివా? ఎవులైతే మన కుర్సీ మీద కన్నేసిన్రో.. ఆల్లందరూ ఇప్పుడు అవినీతి కంప్లయింట్ల బురదలో పడి కొట్టుకుంటున్నరు.. జూసినవా’‘అరె.. ఏం వుషారున్నవ్ రేవంతన్నా.. ఈ లెక్కన నీకు అయిదేళ్లూ కుర్సీ గ్యారంటీ స్కీముంటదేమో నన్నా’‘తప్పదు గద తమ్మీ.. వుషారుండాలె. దునియా అందరికీ నీ బోంట్ల కుర్సీలో కూర్సోబెట్టే బాపు వుండడు గద తమ్మీ’‘ఎక్కడన్నా.. కూర్సొనుడు కూర్సొనుడ అనుకోడమే గానీ.. ఎప్పుటికి గూర్సుంటనో ఏమో’‘నీకు మించి నీ బాపుకి మస్తు కోరికున్నది గానీ.. ఫికరు జెయ్యకు తమ్మీ.. జరూరు కుర్సీ నీదే..’‘మా సోపతోల్లు ఊకుంటరో లేదో నని చిన్న గుబులున్నది అన్నా’‘చల్ తియ్.. గింత బేకారున్నవేంది తమ్మీ. నీ సోపతుల్లో పవన్ కల్యాణు నీ కుర్సీ మోసేటందుకే ఎగబడుతోంటే నువ్వు ఫికరౌతవేంది. బేఫికరుండు.. అంతగైతే నేనున్న గద. మంత్లీ మంత్లీ డిల్లీకి జమాయిస్తన్నది కాస్తా ఓపాలి నీకు జమాయిస్త. గంతె. జబర్దస్త్ నువు కుర్సీలో కొస్తవ్.. నాదీ గేరంటీ’‘ఆ మాట అనబోకు రేవంతన్నా.. నీ ఆరు గేరంటీల్లోనే యిది గూడా కలిపేస్తావేమో’‘ఇంత పిచ్చోనివి ఎలా బతుకుతవ్ రా బై. మందికిచ్చేటిది.. నా దేముని కొడుకైన తమ్మీకిచ్చేటిది వొకటే అవుతదా’‘ఆ మాటన్నావ్.. దైర్యంగా వుందన్నా’‘చల్ పోదం పా. ఉన్నూర్లో ముచ్చట్లాడుకోవాలంటే.. గాలికి గూడా సెవులు మొలుస్తయ్.. యింటా వుంటయ్.. యింత కష్టపడి స్పెషలు గాలిమోటర్లేసుకుని దావోసు కొచ్చినం. యిక్కడైనా మన మనసులో ముచ్చట్లు పంచుకోకుంటే గెట్ల? యింక పోదాం తియ్’::రాజేశ్వరి -
కాంగ్రెస్‌లో దండుపాళ్యం ముఠా.. మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు అంతులేని కథలా సాగుతోందని.. నోటీసులు, విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈ కేసులో సిట్ విచారణ బయల్దేరే ముందు తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, కీలక నేతలతో భేటీ అయ్యారాయన. అనంతరం కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోంది. ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్. ఎన్నికేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన నాయకత్వం మా పార్టీది. రాష్ట్రం కోసం రాజీలేని పోరాటాలు చేశాం. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పని చేశాం. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్‌ది. కావాలనే బురద చల్లడం, హింసించడం మేం ఏనాడూ చేయలేదు. మేం ఎప్పుడూ టైం పాస్ కార్యక్రమాలు చేయలేదు అని కేటీఆర్ అన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా.. అసమర్థుడి జీవన యాత్రలా కాంగ్రెస్ పాలన ఉంది. ఒక్కో రోజు ఒక్కో డ్రామాతో నెట్టుకొస్తున్నారు. మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. అక్రమ, అనైతిక పనులు చేయలేదు. అయినా నాపై తీవ్ర వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇందుకు ఎవరు బాధ్యులు? రేవంతా? అధికారులా?. నేను డ్రగ్స్ తీసుకుంటానని.. హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని దిక్కుమాలిన వార్తలు రాయిస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పదేళ్లపాటు రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేశా. ప్రభుత్వం పోలీసులు కలిసి గత రేండేళ్లుగా.. అంతులేని కథలా ఫోన్ ట్యాపింగ్ కేసును నడిపిస్తున్నారు. ఎంక్వైరీలకు భయపడేది లేదు. ఈ కేసుతో నాకేం సంబంధం లేదు. అయినా పిలిస్తే 10సార్లు విచారణకు వెళ్తా.. సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని హరీష్‌రావు చెప్పారు. ఆ కుంభకోణంలో సీఎం రేవంత్‌రెడ్డి బామర్ది సృజన్ రెడ్డిది కీలక పాత్ర. సింగరేణితో సీఎం రేవంత్ ఎలా ఫుట్‌బాల్ ఆడుతున్నారో హరీష్ వివరించారు. అలా మాట్లాడినందుకే నోటీసులు ఇచ్చారు. సిట్ నోటీసులు, విచారణ టైంపాస్ ప్రొగ్రాం అని కేటీఆర్ అన్నారు. మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందని అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పగలరా?. కాంగ్రెస్ ప్రభుత్వంలో దండుపాళ్యం ముఠా ఉంది. వాళ్ల దోపిడీ బయటపెడతామనే నోటీసులు, విచారణ పేరిట ఇబ్బంది పెడుతున్నారు. రేవంత్‌కు, ఆయన తొత్తులుగా ఉన్న పోలీసులను వదిలేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.. అని కేటీఆర్ అన్నారు. -
అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనకు తానే రాజకీయ బురద జల్లుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం లేదంటే మంత్రులపై పట్టు పెంచుకునే క్రమంలో ఆయన చేస్తున్న విన్యాసాలు కొన్నిసార్లు బెడిసికొడుతున్నట్లుగా ఉంది. దీనికి తోడు అనవసర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో తన విశ్వసనీయతను తానే దెబ్బ తీసుకుంటున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలకు ఆజ్యం పోస్తున్నారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి మీడియా అధిపతి రాధాకృష్ణను కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ అధికంగా నమ్ముకుంటున్నారన్న భావన కలుగుతోంది. దానివల్ల తెలంగాణ రాజకీయాలపై ఆ పత్రికలో ఏ కథనం వచ్చినా అది ఎంత వివాదాస్పదమైనా, చెత్త పలుకైనా అదంతా రేవంత్ భ్రీఫింగ్ వల్లేనని రాజకీయ వర్గాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మీడియాను ప్రమాణాలతో నిమిత్తం లేకుండా నీచమైన రాతలు రాసేవారిని నమ్ముకుంటే.. అది ఎప్పటికైనా భస్మాసుర హస్తం అయ్యే ప్రమాదం ఉంటుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన పరిణామాల సారాంశంగా దీనిని తీసుకోవచ్చు. ఎన్టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ఒక కథనం మహిళా ఐఏఎస్‌లను కించ పరిచేదిగా ఉందన్నది అభియోగం. దీనిని ఎవరూ సమర్థించరు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు ఖండన ఇవ్వడం, దానిపై ఆ టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పింది. అయినా తప్పు చేశారని అనుకుంటే కేసు పెట్టవచ్చు. చర్య తీసుకోవచ్చు. కాని ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించారు. ఆ పోలీసులు విచారణ పేరుతో చట్టబద్దమైన నిబంధనలు పాటించకుండా ఆ టీవీ ఛానల్లో సోదాలు చేయడం, ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. ఆ కేసులో ఫిర్యాదుదారు ఎవరు? బాధితులు ఎవరని కోర్టు ప్రశ్నించడంతో నీళ్లు నమలడం పోలీసుల వంతైంది. అంతటితో ఆ ఉదంతానికి ఫుల్స్టాప్ పడినట్లయింది. పోలీసులు ఈ వ్యవహారంలో అతిగా చేశారన్న విమర్శలు వచ్చాయి. అది వేరే కథ. ఇంతలో ఏమి జరిగిందో కాని సడన్‌గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వ్యాసంలో ఆ గాయాలను మళ్లీ కెలికారు. వ్యాపార ప్రయోజనం కోసమో, లేక ముఖ్యమంత్రి రేవంత్‌కు ఉపయోగపడుతందని అనుకున్నారో తెలియదు కాని ఓ కథ వండి జనం మీదకు వదిలారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఈ వివాదంలోకి లాగారు. ఎన్టీవీ యజమానికి సంబంధించిన కంపెనీకి బొగ్గు టెండర్ రావడానికి మల్లు భట్టి రూల్స్ మార్చారని ఆరోపించారు. పోనీ ఈ స్కామ్ వరకు రాసి ఉంటే అది వేరే విషయం అయ్యేది. అలా కాకుండా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీకి ఆ టెండర్ దక్కకుండా ఉండడం కోసం ఎన్టీవీ ఆయనపై అనుచితమైన స్టోరీ ప్రసారం చేసిందని ఆరోపించారు. ఆ క్రమంలో ఆయనకు మహిళలపట్ల ఎంతో గౌరవం ఉన్నట్లు నటించారు. పనిలో పనిగా, ఆవు కథ మాదిరి వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మీడియాకు స్వేచ్చ లేదంటూ ఒక పచ్చి అబద్దాన్ని కూడా జోడించారు. రాధాకృష్ణకు నిజంగా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన ఉంటే, సంక్రాంతి సందర్భంగా ఏపీలో జరిగిన దారుణమైన అశ్లీల నృత్యాలపై ఎక్కడైనా సరైన రీతిలో స్పందించారా? ఎల్లోమీడియాలో వైసీపీ మహిళా నేతలపై కక్ష కట్టినట్లు ఎన్ని తప్పుడు కథనాలు వచ్చేవో కూడా తెలిసిందే. ఈ మధ్యనే మాజీ సీఎం జగన్‌పై నీచమైన శీర్షికలతో కథనాలు లో ప్రసారం చేశారో కూడా చూశాం. ఈయన ఒక వైపు నీచమైన రాతలు రాస్తూ, ఎదుటివారికి నీతులు చెబుతుంటారు. తన వ్యాసంలో మల్లు భట్టిపై ఆరోపణలు చేయడంతోపాటు రేవంత్ ను అమాయకుడన్నట్లు చిత్రీకరించే యత్నం చేశారు. సిట్ వేసిన సంగతి రేవంత్‌కు తెలియదని అందులో రాశారు. దీనివల్ల రేవంత్‌కు నష్టం జరిగింది. అయితే.. రేవంత్ భ్రీఫింగ్తోనే రాధాకృష్ణ ఈ వ్యాసం రాశారా అన్న సందేహాన్ని వివిధ రాజకీయ పక్షాలు కాని, చివరికి కాంగ్రెస్ లో కొన్ని వర్గాలు కాని అనుమానించాయి. దానికి తోడు టీవీ కథనం వచ్చిన రోజున కాని, కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన రోజున కాని రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, రాధాకృష్ణ వ్యాసం రాసిన తర్వాత స్పందించడం చర్చనీయాంశం అయ్యాయి. మీడియా సంస్థలు ఆంబోతుల మాదిరి తన్నుకుని తమను అందులోకి లాగవద్దని ఆయన అనడం విడ్డూరంగా అనిపించింది. ఒక వేళ నిజంగానే రాదాకృష్ణ తప్పుడు వ్యాసం రాసి ఉంటే ఆయనపై కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఉండవచ్చు! కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలతోనే ఈ గొడవలన్ని బయటకు వచ్చాయన్న భావన ప్రజలలో ఏర్పడింది. దాంతో ఆ బురదను కడుక్కోవడానికి రేవంత్ స్టేట్ మెంట్ ఇచ్చి మంత్రులను బద్నాం చేయవద్దని కోరారు అంతేకాక తమ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు మల్లు భట్టి ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, రాధాకృష్ణ కథనం వెనుక ఎవరు ఉన్నారో తర్వాత చెబుతానని అన్నారు. పైగా తెలంగాణ వనరులు, సంపదను దోచుకోవడానికి వ్యవస్థీకృత నేరస్తులు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ మరో మాట కూడా చెప్పారు. బీఆర్ఎస్కు లబ్ది జరిగేలా కథనాలు ఉండవద్దని అన్నారు. తనకు డామేజీ అవుతోందని అర్థం చేసుకుని ఈ వ్యాఖ్య చేసి ఉండాలి. నిజంగానే బీఆర్ఎస్ ఈ ఎపిసోడ్‌ను తనకు అనుకూలంగా మలచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సింగరేణి టెండర్ల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేయడం, ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులలో ఉన్న ముగ్గురి మధ్య కాంట్రాక్ట్ కోసం పోటీ జరిగిందని, మంత్రివర్గంలో పలువురు మంత్రులు దోచుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. రేవంత్ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఖతం చేసిన బీఆర్ఎస్ను బొంద పెట్టాలని ఆయన అన్నారు. అదే ఎన్టీఆర్‌కు నివాళి అని కొత్త సూత్రీకకరణ చేశారు. అదేదైనా అయితే చంద్రబాబుకు కానుక అవుతుంది కాని, ఎన్టీఆర్‌కు ఎలా శ్రద్దాంజలి అవుతుందో తెలియదు.హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీకి ఉన్న కాస్తో, కూస్తో బలాన్ని, ఆ పార్టీకి ప్రధానంగా మద్దతు ఇచ్చే సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని రేవంత్ మాట్లాడినట్లు అనిపిస్తుంది. పైగా తెలంగాణలో టీడీపీ ఖతం అవడానికి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్‌ల పాత్ర కారణమన్నది బహిరంగ రహస్యమే కదా! ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన రేవంత్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఎగబాకారు. అయినా పాత వాసన వదులుకోలేక పోతున్నట్లు ఉంది. కాంగ్రెస్‌ను అంతం చేయడానికి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ను రేవంత్ పొగడడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎంతవరకు సంతోషిస్తారో చెప్పలేం.ఏది ఏమైనా ఈ మద్యకాలంలో పలు ప్రకటనలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చేస్తూ రేవంత్ రెడ్డి ఎదుటివారిపై బురద చల్లబోయి.. తనపై కూడా వేసుకుంటున్నట్లు ఉంది. హార్వర్డ్ యూనివర్శిటీలో నాయకత్వ కోర్సులో చేరిన రేవంత్ బీఆర్ఎస్ గద్దెలు గ్రామాలలో లేకుండా చేయాలని అనడం ఏ పాటి నాయకత్వ ప్రమాణం అవుతుందో!. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తుగ్లక్ సర్కార్‌కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తైనా ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. నాటి వైఎస్సార్ హయాం నుంచి బీఆర్ఎస్ పాలన దాకా ఏనాడూ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరగలేదని.. కానీ, ఇప్పుడు రేవంత్ ఆ పని చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. శనివారం తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సికింద్రాబాద్ బచావో యాత్ర జరగాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు సమాచారం అందించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకునే ప్రయత్నాలు చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘తుగ్లక్ పేరు పుస్తకాల్లో చదువుకున్నాం.. ఇప్పుడు చూస్తున్నాం. TS నుంచి TG గా మారిస్తే ఎవరికి లాభం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చివేశారు. తెలంగాణ తల్లిని రూపుమాపి.. కాంగ్రెస్ తల్లిని ప్రతిష్టించారు. కాకతీయ కళాతోరణం తీసివేస్తున్నారు. అపసవ్య దిశలో పాలన సాగుతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్ మధ్య విడదీయలేని బంధం ఉంది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీయాలనుకోవడం మంచిది కాదు. వైఎస్ఆర్ ఆనాడు ఎంసీహెచ్‌ను విస్తరించినా.. హైదరాబాద్ అస్థిత్వాన్ని ముట్టుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2016లో జిల్లాలు ఎర్పాటు అయ్యి పాలన సెట్ అవుతున్న సందర్భంలో జిల్లాలను తొలగించాలని అనుకోవడం తుగ్లక్ చర్యే. తుగ్లక్ సర్కార్‌కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం. సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని బీఆర్ఎస్ గౌరవిస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక జిల్లాగా ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. ఆరు గ్యారెంటీలు అటకెక్కించారు. జంట నగరాల్లో ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టారా?. కనీసం.. ఒక్క రోడ్డు వేయలేదు. రేవంత్‌కు తెలిసింది ఒక్కటే.. విధ్వంసం. శాంతి ర్యాలీనీ అడ్డుకోవడం దుర్మార్గపు చర్య. మా పార్టీకి చెందిన 8 వేల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనేది రేవంత్ గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే.. కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతుంది అని కేటీఆర్ అన్నారు. -
సికింద్రాబాద్ బచావోకు బ్రేకులు.. తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ సికింద్రాబాద్ పేరును మార్చేసి పెద్ద కుట్రకు తెర తీస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ చేపట్టాల్సిన సికింద్రాబాద్ బచావో ర్యాలీకి బ్రేకులు పడ్డాయి. ఉదయం నుంచే బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడే నిలువరిస్తున్న పోలీసులు.. ఈ ఉదయం తలసానిని కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ ర్యాలీ నేపథ్యంలో.. జంట నగరాల్లోని నేతలను పోలీసులు ఎక్కడికక్కడే నిలువరించారు. పలువురిని గృహ నిర్భందం చేశారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను ఖండిస్తూ తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడారు. ‘‘రైల్వే స్టేషన్ నుంచి ఎంజీరోడ్డు దాకా సికింద్రాబాద్ బచావో పేరిట శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. నల్ల జెండాలు, కండువాలతో ర్యాలీ చేయాలనుకున్నాం. నిన్న పోలీసులు మా ర్యాలీ రూట్ మ్యాప్ పరిశీలించారు. అయితే లష్కర్ సాధన సమితికి అనుమతి రద్దు చేస్తున్నట్లు రాత్రి 10.40 నిమిషాలకు మెసేజ్ పెట్టారు. నిన్ననే సమాచారం అందించి ఉంటే.. కోర్టుకు వెళ్లేవాళ్లం. మా ప్రాంతం పేరు లేకుండా.. మా అస్తిత్వం దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లు అంటున్నారు. మాకు సికింద్రాబాద్‌తో ఉన్నది మట్టి సంబంధం. ఇప్పటికే వేల మందిని అరెస్ట్ చేశారు. తాత్కాలికంగా శాంతిర్యాలీ అడ్డుకుని మీరు పైశాచిక ఆనందం పొందవచ్చు. న్యాయపరంగా కోర్టుకు వెళ్లి ర్యాలీ నిర్వహించి తీరతాం అని తలసాని అన్నారు. తలసానిని బయటకు పోనివ్వకుండా.. తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన అనంతరం తలసాని బయటకు వచ్చారు. అయితే ఆయన్ని ఎటూ పోనివ్వకుండా పోలీసులు తమ వాహనాలను అడ్డుపెట్టారు. తాను ఇంటికి వెళ్తానని తలసాని చెప్పినా పోలీసులు వినలేదు. తమ వాహనంలో దిగబెడతామంటూ ఆయన చెప్పారు. దీంతో ఆయన మళ్లీ తెలంగాణ భవన్‌లోకే వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. -
TG: ఇద్దరు ఎమ్మెల్యేలపై తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాయితీ ఎంతకూ తెగడం లేదు. పది మంది ఎమ్మెల్యేలలో.. ఐదుగురిపై దాఖలైన పిటిషన్లను శాసనసభ స్పీకర్ ఇదివరకే కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇవాళ అదీ సంక్రాంతి పండుగపూట.. మరో ఇద్దరి వ్యవహారంపై తీర్పు ఇవ్వబోతున్నారు. తమ పార్టీ సింబల్‌పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య(చేవెళ్ల), పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్సువాడ)లు ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మరికాసేపట్లో తీర్పు ఇవ్వనున్నారు. ఇంతకు ముందులాగే పిటిషన్లు డిస్మిస్ చేస్తారా?.. అనర్హత వేటేమైనా వేస్తారా?.. నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి. అయితే.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సంజయ్(జగిత్యాల) కాకుండా దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్) ఇప్పటిదాకా స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది. అంతకు ముందు.. గత నెలలో(డిసెంబర్ 17న) ఆరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు(ఖమ్మం), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్చెరు), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(గద్వాల్), టి. ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్) పిటిషన్లను స్పీకర్ కొట్టిపారేశారు. ఈ ఐదుగురు సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారని తీర్పు సందర్భంగా స్పష్టం చేశారాయన. అయితే స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న బీఆర్ఎస్.. ఈ అంశంలో విచారణ ముగిశాక కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. -
ఇది రేవంత్ సర్కార్ రాజకీయ వికృత క్రీడ
సాక్షి, హైదరాబాద్: పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు అన్నారు. తెలంగాణవ్యాప్తంగా మీడియా ప్రతినిధులను, డిజిటల్ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడం అక్రమమని అన్నారు. ‘‘మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి. .. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియా పై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. అంతేకాదు డీజీపీ శివధర్‌రెడ్ఢికి ఫోన్ చేసి జర్నలిస్టులను విడుదల చేయాలని కోరారు.పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు.మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా?ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా?జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా…— Harish Rao Thanneeru (@BRSHarish) January 14, 2026ఈ అరెస్టులను తెలంగాణ పీసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఖండించారు. ‘‘అర్ధరాత్రిళ్లు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సదరు జర్నలిస్టులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని ఉంటే బాగుండేది. జర్నలిస్టుల అరెస్టుతో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదు’’ అని అభిప్రాయపడ్డారు. ఓ మంత్రి-ఐఏఎస్ అధికారిణి అంటూ.. ప్రముఖ చానెల్లో కథనం ప్రసారం అయ్యింది. దాని ఆధారంగా అటు సోషల్ మీడియాలో విస్తృత కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మంత్రి కోమటిరెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఈ క్రమంలో సదరు ప్రముఖ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులను గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఇంటికెళ్లి తలుపులు బద్ధలు కొట్టి మరీ అరెస్ట్ చేశారని.. ఎలాంటి ప్రొసీజర్, నోటీసులు ఫాలో కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. రాష్ట్రంలో మరికొన్ని చోట్లా పోలీసులు పాత్రికేయుల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా పలు చానెల్స్, 40కి పైగా యూట్యూబ్ చానెల్స్‌పై పోలీసులు దృష్టిసారించినట్లు సమాచారం. అయితే అక్రమ అరెస్టులు.. పోలీసుల ప్రతాపంపై జర్నలిస్టుల సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. -
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన గురుశిష్యులు!
తెలుగు రాష్ట్రాల్లో గురుశిష్యుల రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని, పంచాయతీ కాదు..పరిష్కారం కావాలని, గొడవలతో ప్రయోజనం లేదని, సామరస్యంగా ముందుకు వెళితేనే మేలని గురువు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు కూడ బలుక్కున్నట్లు చేసిన ప్రకటనలు ఆసక్తికరమైనవే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో తాను అనుకోకుండా చేసిన తప్పును దిద్దుకునేందుకు రేవంత్ తన స్వరం మార్చారా? లేక.. ఇద్దరికి సన్నిహితులైన వారు తమకు వివాదాలు అక్కర్లేదని.. నీళ్లు కావాలని ప్రకటన చేయించినట్లుగా ఉందీ వ్యవహారం. అయితే.. తెలంగాణ ప్రాజెక్టులకు ఓకే చేయాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును కోరడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. రేవంత్‌తో ఎలాంటి రహస్య ఒప్పందమూ లేదని చంద్రబాబు స్పష్టంగా చెప్పలేకపోయారు. పైగా రేవంత్ కోరినట్లు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని నిలిపివేయడమే కాకుండా, చివరికి ఆ స్కీమే వృథా అన్న ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ రాజకీయ పార్టీలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏపీకి జరిగే నష్టాన్ని పట్టించుకోలేదు. ఇది ఒకరకంగా దుస్సాహసమే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపడం తమ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టడమేనని ఆ ప్రాంత మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమ స్కీమ్‌కు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ అనుకూల మేధావులతో ఆలోచనపరుల పేరుతో సదస్సు పెట్టించడంంపై కూడా సీమలో అసంతృప్తి ఏర్పడింది. ఇది చాలదన్నట్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణకు కూడా నీరు ఇస్తారట. చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఎత్తుకుని ప్రమాదకర క్రీడ అడుతున్నారన్న అనుమానం కలుగుతుంది. తనకు తెలుగు జాతి ముఖ్యమని తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు అంటున్నారు. ఆయన రెండు రాష్ట్రాలకు సీఎం కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే అనే సంగతి మర్చిపోరాదు. తనకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని గతంలో పలుమార్లు అన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతలా బలహీనంగా మాట్లాడుతున్నారు? రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ముందుకు తీసుకువెళితే జగన్‌కు పేరు వస్తుందనా? లేక రేవంత్‌కు ఇచ్చిన మాట తప్పితే తెలంగాణలో కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుందనా? లేక తన సొంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనా?.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షణకు దిగారు?.. విమర్శలు చేశారు?.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికే కుట్రపన్నారు?. ఓటుకు నోట కేసులో ఎలా దొరికిపోయారు? అప్పుడు తెలుగు రాష్ట్రాలు, తెలుగు జాతి ఏమైపోయినా ఫర్వాలేదా? కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు తదితర ప్రాజెక్టులను ఎలా వ్యతిరేకించారని చంద్రబాబును బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. మరి నాగార్జున సాగర్ వద్ద పోలీసుల మొహరింపు మాటేమిటి? కేసీఆర్, జగన్ భేటీ అయి ఆయా ప్రాజెక్టులపై చర్చిస్తే ఎన్ని ఆరోపణలు చేశారు. అప్పుడు తెలుగుజాతి గుర్తుకు రాలేదా?.. చంద్రబాబే కాదు.. రేవంత్ కూడా తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్‌ను విమర్శిస్తూ జగన్‌కు పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టారంటూ కొద్ది రోజుల క్రితం కూడా ఎద్దేవ చేశారే! పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టు సమయంలో చంద్రబాబు అనుసరించిన విధానం ఏమిటి? తెలంగాణలో టీడీపీ నేతలతో నిరసనలు, కోస్తాలో ఆ ప్రాంత టీడీపీ నేతలతో వ్యతిరేక ప్రదర్శనలు చేయించారు కదా? అంటే రాయలసీమ ప్రజలకు, తెలంగాణ, ఏపీ ప్రజలకు మధ్య తగాదా పెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందా? లేదా? అప్పుడు తెలుగుజాతి ఒక్కటిగా లేకపోయినా ఫర్వాలేదా! కెసిఆర్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు కలిసి ఉండనక్కర్లేదన్నమాట. రేవంత్ తన శిష్యుడు కాబట్టి, ఆయన కాంగ్రెస్ అయినా, తాను బీజేపీ కూటమిలో ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడేమో రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెట్టి రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని అంటున్నారు. తెలంగాణకు ఓడరేవు లేదు కనుక ఏపీతో సఖ్యంగా ఉండాలని రేవంత్ భావిస్తున్నారట. అయితే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడరాదని షరతు పెట్టారు. కేంద్రానికి తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులను చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి ఒప్పుకుంటుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుని అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే ఎవరూ కాదనరు. ఒక్క నీటి విషయంలో అన్న మాటేమిటి? విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.75 వేల కోట్ల విలువైన ఆస్తి రావల్సి ఉంటుందని, గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సు లెక్కకట్టింది కదా! అది ఇవ్వడానికి రేవంత్ సర్కార్ ఓకే అంటుందా? అసలు చంద్రబాబు ఉమ్మడి ఆస్తుల విభజన గురించి డిమాండ్ చేస్తారా? దీనిపై అవగాహన కుదిరితే అప్పుడు నీళ్ల సంగతి ఆలోచించవచ్చు కదా!. ఇంకో సంగతి చెప్పాలి.. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత వ్యయం చేసి, అందులో వాటా తీసుకోవాలన్న ప్రతిపాదన వస్తే ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు ఏమని అన్నారు? జగన్ బందరు పోర్టును కేసీఆర్‌కు రాసిచ్చేస్తున్నారని, ఏపీకి తీరని నష్టం చేస్తున్నారని ఆరోపించారా? లేదా? అది తెలుగుజాతి మధ్య గొడవలు పెట్టినట్లు కాలేదా? రాయలసీమ లిఫ్ట్ వల్ల కేవలం 22 టీఎంసీల నీరే వస్తుందని, ఆ ప్రాంతానికి ప్రయోజనం పెద్దగా ఉండదని చంద్రబాబు అంటున్నారు కదా! ఆ విషయమే రేవంత్‌కు వివరించి, ఈ చిన్న స్కీమ్ వల్ల తెలంగాణకు నష్టం లేదని చెప్పి ముందుకు తీసుకువెళ్లవచ్చు కదా! తెలంగాణకు పోర్టు కనెక్టివిటి కోసం ఏపీ సహకారం కావాలని, అమరావతి అభవృద్దికి హైదరాబాద్ సహకారం అవసరమని రేవంత్ చిత్రమైన వాదన తెచ్చారు. వీళ్లిద్దరు మాచ్ ఫిక్సింగ్ ప్రకటన చేస్తున్నారేమో!. కానీ అదే సమయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కమార్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ పోలవరం-నల్లమలసాగర్ స్కీమ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. మొత్తంగా చూస్తే తను చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయంగా చంద్రబాబుకు జరిగిన నష్టాన్ని తగ్గించడం కోసం రేవంత్ రెడ్డి ఏదో కంటితుడుపు ప్రకటన చేసినట్లుగా ఉంది. అలాగే చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతంతో ఇరు ప్రాంతాల ప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
క్వార్టర్స్‌లో నెగ్గాం.. సెమీస్, ఫైనల్లోనూ మనదే గెలుపు
సాక్షి, ఖమ్మం: ఎగవేతలు, కూల్చివేతలతో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని.. అందుకే ఆ పార్టీని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఖమ్మంలో బుధవారం నిర్వహించిన నూతన సర్పంచ్ల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. క్వార్టర్ ఫైనల్లో(సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశించి..) మంచి ఫలితాలు వచ్చాయి. సెమీ ఫైనల్ లో మంచి ఫలితాలు వస్తాయి. చివరికి ఫైనల్ లో విజయం మనదే. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. యూరియా బస్తాలు దొరకడం లేదని రైతన్నలు చెబుతున్నారు. పాలిచ్చే గేదెను వదులుకొని.. తన్నే దున్నపోతు ను గెలిపించారని నేను వారితో చెప్పా. అయిపోయింది ఏదో అయిపోయింది.. వచ్చేది బీఆర్ఎస్ అని రైతులు నాతో చెప్పారు. రైతులు ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థమైంది.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కష్టాల్లేవ్. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లైన్లలో చెప్పులు కనిపిస్తున్నాయి. షాపుల్లో లేని యూరియా యాప్‌ల్లో ఎలా వస్తుంది?.. కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలు. లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు.. ఏమైంది?. కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇచ్చారా?. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారా?. రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది?.. కూల్చివేతలు, ఎగవేతలే కనిపిస్తున్నాయి. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం.. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ పని చేశారు. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. కనీసం రైతులకు యూరియా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారు. కమీషన్ల కోసమే ఆ మగ్గురు పని చేసేది. 30 శాతం ట్యాక్స్ నడిపిస్తున్నారు వాళ్లు. ఆరు గ్యారెంటీలు భద్రంగా పెట్టుకొండనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆనాడు ఎన్నికల ప్రచారం లో చెప్పారు. ఇప్పుడు రెండేళ్లు అయిన గ్యారెంటీలు అమలు కాలేదు. దీనికి భట్టి ఏమి సమాధానం చెబుతారు?..ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది. సర్పంచ్ ఎన్నికల్లో 40 శాతం పదవులు గెలుచుకున్నాం. ఇక్కడే రెండేళ్లలోనే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుస్తోంది. త్వరలో జగరబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదు. ఖమ్మం నుంచి 7 నుంచి 8 స్థానాలు గెలుస్తాం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, జనగాం: భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. మంగళవారం జనగాంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయడం లేదు. రాహుల్, రేవంత్‌ను ఉరి తీయాలి. చదువురాని దద్దమ్మ రేవంత్‌రెడ్డి. ఢిల్లీకి డబ్బులు పంపి తన సీఎం సీటును కాపాడుకుంటున్నాడు. కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్‌కే రేవంత్ లాగు తడిసింది’’ అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
డే-4.. కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో.. తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు–2026ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై చర్చతో పాటు ఆమోదం తెలపనుంది సభ. పాల్వాయి హరీష్, బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్.. డీఆర్డీఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారుఅధికారుల అవినీతి పై నేను ఎక్కని గడుప లేదుఅన్ని స్థాయిల్లో అధికారులకు అవినీతి పై ఫిర్యాదు చేసాంప్రభుత్వం డీఆర్డీఏ అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు–2026ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అలాగే.. తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ పెండింగ్ వార్షిక నివేదికలను రిలీజ్ చేయనుంది. 2015-16 నుంచి 2018-19 వరకు ఆడిట్ నివేదికలు టేబుల్ చేయనుంది ప్రభుత్వం. దీంతో పాటు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్టన్) పాలసీపై షార్ట్ డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. -
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్
👉తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదాఎల్లుండి ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీఅసెంబ్లీలో కీలక తీర్మానాలు చేసిన ప్రభుత్వంపాలమూరుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని తీర్మానం👉తెలంగాణ శాసన సభ నుంచి బీజేపీ వాకౌట్కృష్ణా జలాలపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు వాకౌట్ చేసిన బీజేపీపాలమూరుపై ఉత్తమ్ సభలో వాస్తవాలు చెప్పారు: సీఎం రేవంత్ఇరిగేషన్ విషయంలో సభ్యులంతా తమ ఆలోచనలు, అభిప్రాయాలను చెప్పారుకేసీఆర్ 45 ఏళ్లు ప్రజాజీవితంలో ఉన్నారు..ఆయన ప్రభుత్వానికి సూచనలు ఇస్తారని అనుకున్నాంమంత్రి ఉత్తమ్ చాలా విషయాల వాస్తవాలను సభకు వివరించారుకృష్ణా జలాలపై ఒక రోజు.. గోదావరి జలాలపై మరో రోజు చర్చిందామని అనుకున్నాంశాసనసభ:ప్రభుత్వ తీరుపై చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ అసంతృప్తిఅర్ధరాత్రి వరకు ఎజెండా స్టేటమెంట్ సభ్యులకు అందడం లేదుఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన మీరు స్పందించడం లేదుప్రభుత్వం ఎప్పుడు మాట్లాడిన కృష్ణ గోదావరి తప్పితే ఇతర అంశాలు మాట్లాడడం లేదుసభ నిబంధనలు సరిగ్గా పాటించకపోతే సభ్యులు ఇబ్బంది పడతారుసభ్యులకు ఎజెండా స్టేట్మెంట్ కరెక్టు టైంకు ఇవ్వకపోతే ఎలా ప్రిపేర్ అవుతారు?స్పీకర్ సభ్యుల హక్కులను కాపాడాలిసభ్యులకు ఎజెండా, స్టేట్మెంట్ సరైన సమయంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా.ఉత్తమ్ కుమార్ రెడ్డి@అసెంబ్లీకృష్ణా బేసిన్‌పై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందిపాలమూరులో బీఆర్ఎస్ తట్టేడు మట్టి ఎత్తి పోయలేదువచ్చే మూడేళల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాంపాలమూరు ప్రాజెక్ట్ తరవాత కాళేశ్వరం మొదలైనా ఇప్పటికీ పాలమూరు పూర్తి కాలేదుకాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశారుపాలమూరుకు కేవలం 27 వేల కోట్లు మాత్రమేకాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చాయిపాలమూరుకు ఇప్పటికీ అనుమతులు పూర్తిగా రాలేదుపాలమూరు ప్రాజెక్ట్‌ను కావాలనే బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది👉కృష్ణా జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్బీఆర్ఎస్ సభ్యులు సభకు ఎందుకు రావడం లేదు: ఉత్తమ్కేసీఆర్.. కృష్ణా, గోదావరి జలాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారుబీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది: ఉత్తమ్బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని మేం ఖండిస్తున్నాం👉బ్రేక్ తర్వాత ప్రారంభమైన శాసనసభకృష్ణ నది నీటి కేటాయింపులపై మొదలైన చర్చ..👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విచిత్రమైన పరిస్థితి కనిపించింది. సభలో ప్రతిపక్షం లేకున్నా ప్రభుత్వం తీరుపై విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ పని చేశారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా.. కనీస స్పందన ఉండడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ శాసన సభలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలకు దిగారు. తమ నియోజకవర్గంలో బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, టెక్నీకల్ సమస్యలతో ఇబ్బందులు పెట్టొద్దని సభలో కొందరు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇస్తున్న ఇండ్లతో పాటు అదనపు ఇండ్లు మంజూరు చేయాలని మరికొందరు ఎమ్మెల్యేలు కోరారు. అయితే.. దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేసిందని చెప్పుకొచ్చారు. ‘‘గతంలో 200 కోట్లు డబుల్ బెడ్ ఇండ్లకు బిల్లులు బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వంలో కేవలం పింక్ కలర్ వాళ్ళకే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారు. గత ప్రభుత్వ పెద్దలు దత్తత తీసుకున్న వాసల మర్రిలో హామీ నెరవేర్చలేదు.రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేస్తాం. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న అంశంపై ప్రభుత్వం ద్రుష్టి సారించింది. ఇండ్ల స్థలం లేని పేదలకు స్థలంతో పాటు ఇళ్లను ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రవ్యాప్తంగా 52,000 ఇండ్లు ఇప్పటికే గృహప్రవేశాలు అయ్యాయి. అర్బన్ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వబోతున్నాం. గ్రేటర్ సిటీని మూడు కార్పొరేషన్లుగా పెద్దగా చేసుకోబోతున్నాం’’ అని అన్నారాయన. అసెంబ్లీలో ఇవాళ కృష్ణా జలాల అంశంపై స్వల్ప కాలిక చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్న సమయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు సభలోని స్పెషల్ హాల్లో ఏర్పాట్లు చేశారు. -
ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్-రేవంత్ కరచలనం.. పలకరింపుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే.. కేసీఆర్‌ను తాను ముఖ్యమంత్రి హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు కదా అని రేవంత్ అంటున్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో ఈ అంశంపై స్పందించారు. ‘‘కేసీఆర్‌ను నేను సీఎం హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో ఆస్పత్రిలోనూ కలిశాను కదా. నేను సభా నాయకుడ్ని. కాబట్టి అందరినీ గౌరవిస్తా. అందుకే కేసీఆర్‌ను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా. మరి సభలో నుంచి వెంటనే ఎందుకు వెల్లిపోయారే ఆయన్నే అడగాలి’’ అని రేవంత్ అన్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా.. తొలిరోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు. అయితే ఆయన వెళ్లే లోపు సభలో సీఎం రేవంత్, ప్రభుత్వం విప్‌లు, మంత్రులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం కేసీఆర్ దగ్గకు వెళ్లి పలకరించి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆ సమయంలో కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి మినహా మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. అయితే.. రాకరాక సభకు వచ్చిన కేసీఆర్ కొద్దిసేపైనా సభలో ఉంటారనుకున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగా... బావుంది అని చెప్పారు. నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు.. బావుందని చెప్పా. కేసీఆర్ హాస్పిటల్ లో దీక్ష చేశారు. నేను రోడ్లపై దీక్ష చేశాను. నేను ఒరిజినల్ ఉద్యమకారుడిని. తెలంగాణ కోసం పోరాడిన మాజీ శాసన సభ్యుల సంతాప తీర్మానం చదివే సమయంలో కేసీఆర్ బయటకి వెళ్లారు. మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెల్తే బావుండేది అని కోమటిరెడ్డి అన్నారు.పెద్ద మనిషిగా కేసీఆర్ ను కలవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కేసీఆర్ ను కలిశారు. నేనూ కేసీఆర్‌ను కలవాలి అనుకున్నా. కానీ, ఆయన చుటటూ దుర్మార్గులు ఉన్నారు. అందుకే కలవలేదు అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు. -
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అప్డేట్స్వారం రోజులు సభ నడపాలని బీఏసీ నిర్ణయంవారం తర్వాత మళ్ళీ బీఏసీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయం20 రోజులు సభ నడపాలని బీజేపీ,15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్, సీపీఐ పట్టునెక్ట్స్ బీఏసీలో నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం తెలంగాణ ఉభయ సభలు జనవరి 2కు వాయిదాకాసేపట్లో బీఏసీ సమావేశందేని మీద చర్చ పెడుతున్నారో తెల్వదు: కేటీఆర్ముఖ్యమంత్రి కృష్ణా నది ఎక్కడ ఉన్నది అని అడుగుతారుభాక్రా నంగల్ ఏ రాష్ట్రంలో ఉన్నదో తెల్వని ముఖ్యమంత్రి రేవంత్పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అడ్డుకున్న వ్యక్తి ఇవాళ నీటిపారుదల శాఖ సలహా దారుడువీళ్ళు నీటిపారుదల శాఖ పై చర్చ అంటున్నారుదేనిమీద చర్చ పెడుతున్నారో తెల్వదునీటిపారుదల శాఖ పై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారుకేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు అని చర్చకు మంత్రులు ప్రిపేర్ అవుతున్నారుకౌశిక్ రెడ్డి సభలో ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు మేడిగడ్డను ఎవరో బాంబులు పెట్టి పేల్చారని అన్నాడుబూతులు మాట్లాడాలి అంటే ఎన్ని రోజులైనా సభను పెడతారుసభ లో సబ్జెక్ట్ లేనప్పుడు ఎన్ని రోజులు నడుపుతారుహుజురాబాద్ లోని చెక్ డ్యాం పేల్చివేతలో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పాత్ర ఉన్నది.ఆనాడు మేడిగడ్డ ను పేల్చారు అని ఇంజనీర్లు పిర్యాదు చేశారు.. అలాంటప్పుడు ఎందుకు మీరు విచారణ చేపట్టడం లేదురష్యా ఉద్యమం లో కాకువ డ్యాంను పేల్చారు.అలానే ఇక్కడ కూడా మేడిగడ్డను పేల్చారనీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ క్లుప్తంగా వివరించి చెప్పారుకేసీఆర్ కాసేపైనా ఉండాల్సింది: కోమటిరెడ్డిసభా సమరం.. మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగా? బావుంది అని చెప్పారు.నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు... బావుందని చెప్పా.మాజీ ఎమ్మెల్యే లకు సంతాపం తెలిపితే సభలో లేకుండా కేసీఆర్ వెల్లిపోవడం సరైంది కాదుమౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెల్తే బావుండేదిఅధికార-ప్రతిపక్షం నడుమ బాంబుల గొడవతెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షం నడుమ బాంబుల గొడవబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారంమేడిగడ్డ ప్రాజెక్టును బాంబులు పెట్టి పేల్చేశారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిమేడిగడ్డ మాదిరిగానే తనుగుల చెక్ డ్యామ్‌ను కూడా బాంబుతో పేల్చేశారు: కౌశిక్రెడ్డికౌశిక్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుల తీవ్ర అభ్యంతరంకౌశిక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు కౌంటర్ బాంబులు పెట్టి పేల్చారని అనడం ఏంటి?.: ఎమ్మెల్యే నాగరాజు కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి: ఎమ్మెల్యే నాగరాజుసభలో కాసేపు ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదంశాసనమండలి వాయిదాశాసన మండలిలో ముగిసిన సంతాప ప్రకటనలుదివంగత నేతలకు సంతాపం ప్రకటించిన మండలితెలంగాణ శాసనమండలి జనవరి 2కు వాయిదాబీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.రెండేళ్ల పాలనలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, అధికారులు సమీక్ష చేయలేదు.సిద్దిపేట ఇరిగేషన్ ను మంత్రి పట్టించుకోవడం లేదు.మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ పై లక్షల ఎకరాలు ఆయకట్టు ఆధారపడి ఉంది.ప్రభుత్వం సిద్దిపేట జిల్లా ఇరిగేషన్ పై సమీక్ష చేయాలిఆ ఎమ్మెల్యేలు అలా.. ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్న ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలుట్రెజరీ బెంచీల వైపు కూర్చున్న అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన స్పీకర్ట్రెజరీ బెంచీలవైపు కూర్చున్న ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ఫిరాయింపు ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచీలలో కూర్చోవడాన్ని గతంలో తప్పు పట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుభాషపై బీజేపీ అభ్యంతరం.. మంత్రి వివరణవెంకటరమణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే @ అసెంబ్లీదిగజారి భాష మాట్లాడటం సరికాదుఒకరిని మించి మరొకరు మాట్లాడితే ఎలా ?ఒకరు తప్పు మాట్లాడితే మరొకరు సరిచేయాలిబూతు లు మాట్లాడటమే రాజకీయమా ?నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ వరకు మంత్రులు కూడా దిగజారి మాట్లాడుతున్నారుహైదరాబాద్ వరల్డ్ క్లాస్ అంటున్నారు.. మాటలు మాత్రం థర్డ్ క్లాస్ గా ఉంటున్నాయిశ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రి వివరణ.. మాకు భేషజాలు లేవువెంకటరమణ రెడ్డి తన పార్టీ నేతలకు సూచించాలిగౌరవ సభ్యుల గౌరవం కాపాడే విధంగా చూస్తాంశాసనసభలో ఇంట్రెస్టింగ్ సీన్అసెంబ్లీలో కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి కరచలనంప్రతిపక్ష నేత దగ్గరకు వెళ్లి మరీ షేక్‌హ్యాండ్ ఇచ్చిన సీఎం, మంత్రులుఆశీర్వాదం తీసుకున్న జూబ్లీహిల్స్ నూతన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్వందేమాతరం తర్వాత సభలో కనిపించని ప్రతిపక్ష నేతఅసెంబ్లీ అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో సంతకం చేసిన కేసీఆర్అనంతరం.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన గులాబీ బాస్ఇటు ఫిరాయింపుల నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ సీన్అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెనక కూర్చున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పార్టీ ఫిరాయింపు కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ప్రకటించిన స్పీకర్తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలుదివంగత నేతలకు సంతాపం తెలిపిన ఉభయ సభలుఅసెంబ్లీలో జీరో అవర్ ప్రారంభంప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలుతెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభంహాజరైన సీఎం రేవంత్, ప్రతిపక్ష నేత కేసీఆర్దివంగత నేతలకు సంతాప తీర్మానం చదివి వినిపిస్తున్న గడ్డం ప్రసాద్ఇటు తెలంగాణ శాసన మండలి సమావేశాలు ప్రారంభందివంగత నేతలకు మండలిలో సంతాపంసంతాప తీర్మానం చదివి వినిపిస్తున్న చైర్మన్ గుత్తా సుఖేందర్అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్రెడ్డిమరికాసేపట్లో మొదలుకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుఅసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్, మంత్రులుకేసీఆర్.. అటెండెన్స్‌కే పరిమితం కావొద్దు: కాంగ్రెస్‌ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలుకేసీఆర్ కేవలం అటెండెన్స్‌కే పరిమితం కావొద్దుహరీష్, కేటీఆర్ మధ్య గొడవలు పెరిగాయని.. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని పరజలు అనుకుంటున్నారుఅందుకే అసెంబ్లీలో జరిగే చర్చలోనూ కేసీఆర్ పాల్గొనాలిఅసెంబ్లీలో కేసీఆర్ భేటీమరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేతబీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలతో సమావేశంఫిరాయింపులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలుమీడియా చిట్‌చాట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలుఏ పార్టీలో ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యే లు చెప్పుకోలేకపోతున్నారుఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ డోర్స్ క్లోజ్ఆ స్థానంలో ఇక కొత్తవారికి అవకాశంగ్రౌండ్లో బీఆర్ఎస్కు మంచి పట్టు ఉందిసర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదురు దెబ్బ తగిలిందిబీఆర్ఎస్కు 80 శాతం అనుకూల ఫలితాలు వచ్చాయికాంగ్రెస్కు అందుకే భయం మొదలింది.. మున్సిపల్ ఎన్నికలు పెడుతలేరుమున్సిపల్ ఎన్నికలకల్లా నన్ను లేకుండా చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోంది నేను లోపలకు పోయినా.. బయట పార్టీ చూసుకుంటదినేను ఎవరికీ.. దేనికి భయపడనుఅసెంబ్లీ వద్ద ఉద్రిక్తతఅసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణంఅసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన మాజీ సర్పంచ్లుపెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్గన్ పార్క్ వద్ద అదుపులో తీసుకున్న పోలీసులుఅసెంబ్లీకి బయల్దేరిన కేసీఆర్!మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీకి బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్నందినగర్ నివాసం నుంచి బయల్దేరిన కాన్వాయ్కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్రెడ్డిఅసెంబ్లీ వద్ద 1000 మంది పోలీసులుతెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులుఅసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటుచేసిన పోలీసులు..దాదాపు 1,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు..ఈరోజు మాజీ సర్పంచ్ లు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ముట్టడికి పిలుపుదీంతో ముందస్తుగా మాజీ సర్పంచ్ అరెస్టు చేసిన పోలీసులుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది. సమావేశాలకు ఇటు అధికార కాంగ్రెస్.. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్.. అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. ఎవరి తోలు ఎవరు తీస్తారో చూద్దామంటు సవాళ్లు విసురుకుంటున్నాయి. అయితే.. సభను హుందాగా నడుపుకుందామని అన్ని పక్షాలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు ఇవ్వడం గమనార్హం. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్‌పై ప్రతిపక్ష నేత కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తోలు తీస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. దానికి కౌంటర్‌గా సీఎం రేవంత్ చేసిన ప్రతివ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే కేసీఆర్ సభకి వచ్చి చర్చలో పాల్గొని ఆ ఆరోపణలు నిరూపించాలని కాంగ్రెస్ ప్రతిసవాల్ విసిరింది. మరోపక్క కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డిపై కేసీఆర్ తన పదేళ్ల హయాంలో ఎందుకు పెట్టలేదని అధికార పార్టీకి చెందిన ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ తరుణంలో కేసీఆర్ తొలిసారి సమావేశాలకు హాజరవుతారనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోని నిర్ణయాలను ఎండగట్టడంతో పాటు గత రెండేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తామని ఒకవైపు మంత్రులు.. మరోవైపు అధికార ఎమ్మెల్యేలు, హామీల ఎగవేతతో పాటు జల వనరుల విషయంలో ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య ధోరణిని బయటపెడతామని బీఆర్ఎస్.. ఇంకోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్లు చేస్తున్న మోసాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ అంటోంది. ఈ సెషన్లోనే శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే.. ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన కొన్ని బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.షెడ్యూల్ ఇలా.. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. తొలుత.. శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు ఉంటుంది. ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఆపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, సీతక్క చర్చల కోసం వివిధ పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలు వాయిదా పడ్డ తర్వాత.. సమావేశాల ఎజెండా ఖరారు, ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.ఇరిగేషన్ ప్రధానాంశంగా..ఈసారి అసెంబ్లీ సమావేశంలో కృష్ణ గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టుల పై ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గింపు పై చర్చించాలని పట్టుబడుతోంది గులాబీ పార్టీ. దానికి కౌంటర్‌గా.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ఇలాంటి చర్చే గనుక జరిగితే తమకూ పీపీటీ ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరే అవకాశం లేకపోలేదు.హైదరాబాద్‌కు కేసీఆర్కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారనే అంశంపై బీఆర్ఎస్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఇప్పటిదాకా ఆయన రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అయితే.. ఆయన ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోవడంతో కచ్చితంగా హాజరు కావొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈ ఉదయం నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యి సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. -
రేవంత్‌ను భీమవరం బుల్లోడు అనాలా?: కేటీఆర్
ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని రేవంత్‌రెడ్డి నెరవేర్చలేదని.. అది అడిగినందుకే కేసీఆర్‌పై ఆయన నోరు పారేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. కేసీఆర్‌కు మళ్లీ అధికారం దక్కనివ్వనని శపథం చేసే బదులు.. ఆ హమీలేదో నేరవేర్చేందుకు శపథం చేయాలంటూ సెటైర్లు వేశారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు(KTR Slams CM Revanth Reddy). శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎలా ఎదిగారో అందరికీ తెలుసు. రోజూ తిట్ల పురాణం తప్ప రేవంత్ చేసేదేమీ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఏం భాష?. హైదరాబాద్ గల్లీల్లో తిరిగిన నేను కూడా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు లో బూతులు తిట్టగలను. ఏనుగు లాంటి కేసీఆర్ ను తిడుతున్నారు, చావు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని గీతమ్మ జాగ్రత్తగా చూసుకోవాలి..ఆయన ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. సోనియా, ప్రియాంక గాంధీ మీద ఒట్టు పెట్టి హామీలు ఎగవేశారు. నెలకు రూ. 2500 ఇవ్వడానికి మొఖం లేదు కానీ, కోటి మంది మహిళలను కోటీశ్వరులు కావాలట!. సీఎం పెద్ద పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారు. రోడ్లపై పెయింట్ వేసుకునే రేవంత్ రెడ్డి పెద్ద స్థాయికి వస్తే మంచిదే. కానీ మంచి పనులతో రావాలి. పేమెంట్ కోటాలో సీఎం అయ్యి... ఇప్పుడు కూడా నెలనెలా ఢిల్లీకి సంచులు పంపుతున్నారుకాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమే. కాంగ్రెస్ పాలనలో ఒక్క చెరువు కట్టలేదు. మేడిగడ్డ ఆనకట్టను కూల్చిన కాంగ్రెస్ నేతలు... ఇపుడు బీఆర్ఎస్ కట్టిన చెక్ డ్యాంలను బాంబులతో పేలుస్తున్నారు. ఇసుక దందాల కోసమే ఆ పని చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి కొడుకు భూములు కబ్జా చేస్తుంటే కేసు పెట్టిన పోలీసు అధికారిని లూప్ లైన్లో పెట్టారు..కేసీఆర్ దయతో అరికెపూడి గాంధీ ఎమ్మెల్యే అయ్యాడు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పేరు గాంధీ... చేసేవి గాడ్సే పనులు. భూకబ్జాలకు పాల్పడుతున్నారాయన. దమ్ముంటే గాంధీ శేరిలింగంపల్లి క్షేత్రానికి రావాలి, ఆ ఉప ఎన్నికల్లో తేల్చుకుందాం. కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి బీఆర్ఎస్లోనే ఉన్నామని చెబుతున్నారు. స్పీకర్ కళ్లు ఉండి చూడలేని ధృతరాష్ట్రునిలా తయారయ్యారు. ఎన్నికలకు భయపడి పదిమంది ఎమ్మెల్యేలు దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంగల్లా కలిసినా మనం గట్టిగా కొట్లాడదాం. ..ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని రేవంత్‌రెడ్డి అమలు చేయడం లేదు. ముందు ఆ హామీలను నెరవేరుస్తానని శపథం చేయాలి. కోటి మంది మహిళలకు జనవరి ఒకటి నుంచి నెలకు రూ.2500 ఇస్తామని రేవంత్ రెడ్డి శపథం చేయాలి. హామీ ఇచ్చినట్లు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి శపథం చేయాలి. పాలమూరు - రంగారెడ్డి గురించి కేసీఆర్ అడిగితే సమాధానం చెప్పలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. హామీల అమలు గురించి కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారుకేసీఆర్ బయటకు రా అని కాంగ్రెస్ నేతలు అన్నారు. తీరా కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్ పెడితేనే ముచ్చెమటలు పట్టి చలిజ్వరం తెచ్చుకున్నారు. అలాటింది కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చస్తారు. నేను మా నాన్న పేరు చెప్పుకుంటే తప్పేమిటి? తెలంగాణ తెచ్చిన మొనగాని పేరు చెప్పుకుంటే తప్పా?. మా నాన్నను తిడుతున్నందుకు నాకు చాలా కోపం ఉంది, నేను గుంటూరులో చదివితే తప్పేమిటి... రేవంత్ రెడ్డి లాగా చదువు లేకుండా తిరగలేదు. నేను ఆంధ్రాలో చదివితే తప్పు అట కానీ, ఆయన ఆంధ్రా అల్లుడిని తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా?. రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు. అమెరికాలో ఎవరి పని వారు చేసుకోవాలి, నేను చేసుకుంటే తప్పా?.. ఆయనలా దొంగ పనులు చేయలేదు. ఢిల్లీకి సంచులు మోసుకుంటూ గులాంలాగా బతకబోం. తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వబోమని రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు ఆయన్ను కొడంగల్‌లో గెలవకుండా చూద్దాం. నిజమైన మార్పు ఊళ్ళల్లో సర్పంచ్ ఎన్నికల్లో ప్రారంభం అయింది. బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్న హైదరాబాద్ వాసులకు పాదాభివందనం చేసినా తప్పులేదు. హైదరాబాద్‌ను ఎన్ని కార్పొరేషన్లు చేసినా గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలి. 2026లో గట్టిగా కష్టపడితే... 2027లో ఎన్నికల వాతావరణ వస్తుంది, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునే వరకు పోరాడదాం అని బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. -
మళ్లీ కేసీఆర్ మార్కు రాజకీయం!
చాలాకాలం తరువాత తెలంగాణ రాజకీయ యవనికపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన రీతిలో మెరిశారు. భాష, భావ వ్యక్తికరణ, హాహాభావాల ప్రదర్శనలో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ యాసను తనదైన శైలిలో ప్రయోగిస్తూ పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటారు. ఆసక్తికరంగా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో తక్కువేమీ తినలేదు అని చెప్పాలి.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడంతో వచ్చిన ఆత్మవిశ్వాసమో ఏమో కానీ... అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌పై విరుచుకు పడుతుంటారు. గత ఆదివారం వీరిద్దరు పరస్పర విమర్శల బాణాలు ప్రయోగించారు. పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఆశాజనకమైన ఫలితాలు రావడం కేసీఆర్‌లో ఉత్సాహం నింపి ఉండవచ్చు. పార్టీ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీలతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించి ఆ తరువాత మీడియాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ద్విముఖ వ్యూహం అమలు చేసినట్లు కనిపిస్తుంది. ఒకటి నీళ్ల సెంటిమెంట్ రాజకీయం, మరొకటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టడం. రేవంత్ మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి కేటాయింపులపై చర్చించాలని సవాల్ చేయడమే కాక, మొత్తం సమస్యలకు కేసీఆర్ కారణమని వాదించారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు జోలికి పోకుండా కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పరిణామాలను వాడుకోవడం ద్వారా రాజకీయం చేయడానికి యత్నించినట్లు కనబడుతోంది. కేసీఆర్ వాదనలోని బలాబలాలు చూద్దాం.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టుకు సంబంధించి తట్టెడు మట్టి తీయలేదని, దీనిపై ప్రజా యుద్ధం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితోనే కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపిందని ఆరోపించారు. అంతేకాకుండా... 45 టీఎంసీల నీరు కేటాయిస్తే చాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను అక్రమంగా వాడుకుంటున్నా ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో బీజేపీపై కూడా విరుచుకుపడుతూ తెలంగాణకు పట్టిన శని అని వ్యాఖ్యానించారు. బీజేపీ లోక్ సభ ఎన్నికలలో ఎనిమిది సీట్లు గెలుచుకున్నా పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీనే బాగా ముందంజలో ఉంది. దాంతో బీజేపీ ప్రభావాన్ని మరింత తగ్గించడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో సాగింది. ఈ మూడింటిలో నీళ్ల సెంటిమెంట్ ప్రజలను బాగా కదిలించింది. తెలంగాణకు రావల్సిన నీటి వాటా రావడం లేదని, ఏపీకి నీళ్లు తరలిపోతున్నాయని ఆరోపించేవారు. కేసీఆర్ చేస్తానన్న ప్రజా ఉద్యమం ఎంతమేరకు ప్రజలను ప్రభావితం చేస్తుందన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్లు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది సందేహమే. కాకపోతే ఆ పేరుతో రాజకీయంగా సభలు నిర్వహించడానికి కేసీఆర్ దీనిని ఒక అవకాశంగా వాడుకునే యోచన చేసినట్లుగా ఉంది. నీటి సమస్యను సెంటిమెంట్ కోసం ఆయన మాట్లాడినా.. అసలు లక్ష్యం రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే. తెలంగాణ, ఏపీ నేతలు నీటిని ఎంత సమర్థంగా వాడుతున్నారన్నది పక్కబెడితే, అవసరమైనప్పుడల్లా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు కూడా ఆ ధోరణినే అనుసరించినట్లు అనిపిస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అక్కడి ప్రజలను మభ్యపెట్టడానికే అన్నది ఎక్కువ మంది భావన. అయినా తెలంగాణ నేతలు అలాంటి వాటిని బూచిగా చూపించే యత్నం చేస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సర్వభ్రష్ట సర్కార్ గా కేసీఆర్ అభివర్ణించారు. తన ప్రభుత్వాన్ని ఓడించడానికి కాంగ్రెస్ అబద్దపు వాగ్దానాలు ఇచ్చిందని చెబుతూ ఆ జాబితాను చదివారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలకు హామీ ఇవ్వడమే కాకుండా, బాండ్ పత్రాలను సైతం ప్రజలకు అంద చేసింది. కాని అధికారంలోకి వచ్చాక వాటిలో కొన్నిటిని మాత్రమే చేయగలిగారు. వృద్ధాప్య ఫించన్ రూ.నాలుగు వేలు, కళ్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం, దళిత బంధు కింద రూ.12 లక్షలు మొదలైన హామీలను ప్రస్తావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే టైమ్ లో ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ దందా తప్ప మరొకటి కాదని, తాము తెచ్చిన ఫార్మాసిటీని వంతారా, జూ పార్కులకు కేటాయించాలన్న ఆలోచనను ఆయన తప్పుపట్టారు. అయితే.. ఈ ప్రెస్మీట్లో తోలు తీస్తా..అంటూ తన స్టైల్ లో కొన్ని పరుష పదాలను ఆయన వాడారు. గ్లోబల్ సమ్మిట్ జరిగిన తీరును ఆక్షేపించి అచ్చం గురువు చంద్రబాబు బాటలోనే రేవంత్ వెళుతున్నారని, విశాఖలో గత టర్మ్‌లో చంద్రబాబు సర్కార్ సమ్మిట్ నిర్వహించి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసిందని, ఆచరణలో పదివేల కోట్లు కూడా రాలేదని ఆయన అన్నారు. విశాఖలో హోటల్ ఉద్యోగులకు సూట్లు తొడిగి తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. నదీ జలాల ఇష్యూపైనే కేంద్రీకరించినట్లు కనిపించినా, మొత్తం రేవంత్ ప్రభుత్వాన్ని దాదాపు అన్ని అంశాలలో కడిగిపారేశారు. అయితే.. తనకు ఇబ్బంది కలిగించే కాళేశ్వరం, ఫోన్ టాపింగ్ తదితర కొన్ని అంశాలను కేసీఆర్ ప్రస్తావించలేదు. అసెంబ్లీకి వెళ్లేది, లేనిది చెప్పలేదు. కేసీఆర్ విమర్శలకు రేవంత్ బదులు ఇస్తూ తొలుత శాసనసభకు వచ్చి నదీ జలాలపై చర్చించాలని సవాల్ చేశారు. సభలో కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇది కొంత అనుమానాలకు తావిస్తుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ తదితరులు అసెంబ్లీ బహిష్కారం వంటి కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కున్నారు. ఆ నేపథ్యంలో కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒంటికాలి మీద లేచే అవకాశం లేకపోలేదు. అందువల్లే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడానికి కాస్త జంకుతున్నట్లు అనిపిస్తుంది. తాజాగా నీటి సెంటిమెంట్‌ను వాడుకోవడానికి శాసనసభకు వెళ్లవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. నదీ జలాల సమస్యకు, తెలంగాణ ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలకు కేసీఆర్ కారణమన్న ప్రచారాన్ని ప్రజల ముందు పెట్టడానికి రేవంత్ బృందం ప్రయత్నిస్తోంది. కంటోన్మెంట్, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఆధారంగా కేసీఆర్ వాదనను రేవంత్ తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను ఆర్థిక ఉగ్రవాదిగా పోల్చడం కచ్చితంగా అభ్యంతరకరకమైన అంశమే. తన చావు కోరతారా అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు బదులుగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులతోనే ప్రమాదం ఉందని, కేటీఆర్, హరీశ్ రావుల మధ్య విబేధాలు ఉన్నట్లు చిత్రీకరించడానికి రేవంత్ యత్నించారు. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్కు దూరమైన వైనాన్ని రేవంత్ తనకు అనుకూలంగా మలచుకోవడానికి కృషి చేస్తున్నారు. అయితే.. కేసీఆర్ వ్యాఖ్యలు వయసు తగ్గట్లు లేవని, ఆయన తమలపాకుతో కొడితే, తాను తలుపు చెక్కతో కొట్టగలనని రేవంత్ తన వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు. కేసీఆర్ నిజంగానే వచ్చే రోజుల్లో బాగా యాక్టివ్ అయితే వీరిద్దరి మద్య హోరాహోరీ మాటల యుద్దం జరిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను, ప్రభుత్వ వైఫల్యాల అంశాల ఆధారంగా భవిష్యత్తు రాజకీయం చేయడానికి సిద్దపడుతున్నట్లు అనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలు, కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు తదితర అంశాలను అస్త్రాలుగా వాడుకుని రాజకీయం చేయడానికి రేవంత్ రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీఆర్ఎస్కు ప్రయోనం కలిగిస్తాయా?లేక గత ప్రభుత్వంలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై రేవంత్ ప్రభుత్వం చేసే ప్రచారం ఫలిస్తుందా?అన్నది తెరపై చూడాలి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అడ్డంగా దొరికిపోవడం.. పనికిమాలిన శపథాలు చేసి పారిపోవడం
సాక్షి, హైదరాబాద్: కోస్గిలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా? అంటూ ఘాటుగా కౌంటర్ ఇస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన. పనికి మమాలిన శపథాలు చేయడం రేవంత్‌కు అలవాటే. అడ్డంగా దొరికిపోవడం రేవంత్‌కు మామూలే. 2028లో ప్రజలు కాంగ్రెస్‌ని బొందపెట్టడం ఖాయం. పాలమూరు ప్రాజెక్టు గొంతు ఎవరు కోశారో అందరికీ తెలుసు. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా?. తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది!. అడ్డంగా దొరికిపోవడం..ఆగమాగం కావడం..అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా!సభ్యత, సంస్కారంలేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా.. ఛీ కొడుతున్నా ఇంకా మారవా?. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తు వూరుకోం.. పౌరుషంగల్ల బిడ్డలం ప్రశ్నిస్తాం!. కాంగ్రెస్ జలద్రోహాన్ని అసెంబ్లీలో, ఇటు జనం మధ్య ఎండగడతాం అంటూ ట్వీట్ చేశారాయన. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా?జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా?పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి..సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నవా?తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్…— KTR (@KTRBRS) December 24, 2025 -
కేసీఆర్.. నిన్ను మళ్లీ అధికారంలోకి రానివ్వం: సీఎం రేవంత్
సాక్షి, నారాయణపేట్: పదేళ్లలో పాలమూరు ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని.. ఇక్కడి నుంచి ఎంపీగా నెగ్గి కూడా కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ఎండబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం కోస్గిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళానికి హజరైన ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నూతనంగా ఎన్నికైన సర్పంచు,ఉప సర్పంచు, వార్డుసభ్యులు ప్రజల ఆశలను వమ్ముచేయకుండా పని చేయాలి. గాందీ కలలు గన్నట్టు గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి చిహ్నం. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు స్దానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎన్నికలు పూర్తి అయ్యాయి ఇక రాజకీయాలు వద్దు అభివృద్ధి ద్యేయంగా పార్టీలకు అతీతంగా పని చేయాలి. చిన్నచిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టాలి గ్రామల్లో కక్షలు పెంచుకోవద్దు. నాకు వచ్చిన ఈ అవకాశం మీ అభివృద్ధికే..రాష్ట్రంలోని 12706 గ్రామపంచాయితీలకు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నిదులు ఇస్తాం. చిన్న పంచాయితీలకు 5 లక్షలు పెద్దగ్రామ సర్పంచులకు 10 లక్షలు నూతన సంవత్సరంలో ఇస్తాం. సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబందించిన ప్రణాళికలు సిద్దం చేయండి. ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇస్తాం. గ్రామాల్లో ఎవరికైన అర్హులకు సంక్షేమ పథకాలు రాకుంటే పేర్లు ఇస్తే వారికి ఇస్తాం. ఇందిరమ్మ చీరలు మేం ఇస్తున్న సారె లాంటిది. చదువే జీవితాల్లో వెలుగు తెస్తుంది పిల్లలకు మంచి విద్యను అందిస్తాం. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పహారం,నాణ్యమైన భోజనం అందిస్తాం. మార్చి 31 లోగా కేంద్రం నుంచి 3 వేల కోట్ల నిధులు గ్రామపంచాయితీలకు తీసుకోస్తాకేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా?. పదేళ్లు బీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరుకు వలస వచ్చి కేసీఆర్ ఎంపీ అయ్యాడు. కానీ, నీళ్ల కూడా ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని ఎండగట్టాడు. బీఆర్ఎస్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో పాపాలు చేశారు. లక్షా 80 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి.. కమిషన్లు దండుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. నన్ను జైలుకు పంపారు. నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారు. కేసీఆర్ ఆయన పాపాలకు ఆయనే పోతాడని.. నేనేమీ అనలేదు. అధికారంలోకి వచ్చాక నేను పగ రాజకీయాలు చేయలేదు. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కక్ష సాధింపులకు పాల్పడలేదు. ప్రమాణస్వీకారం చేసిన రోజునే మంచం మీద నుంచి పడి మక్కెలిరగొట్టుకున్నాడు. రెండేళ్ల నుంచి ఫాంహౌజ్నే కేసీఆర్ జైలుగా మార్చుకున్నారు. మొన్నే బయటకు వచ్చాడు. తోలు తీస్తానంటూ ఏదో మాట్లాడారు. రెండేళ్లు ఫామ్‌హౌజ్‌లో అదే పని చేశారా?.. మా సర్పంచ్ల దగ్గరికి రా ఎవరి తోలు తీస్తారో చూద్దాం. చింతకమడకలో చీరి చింతకు కడతారు. నేకేసీఆర్ చేయని పాపం అంటూ లేదు. సొంతల్లుడి ఫోన్‌నే ట్యాపింగ చేయించాడు. సొంత బిడ్డకే చీర పెట్టలేనోడు.. మాపై మాట్లాడతారా?. ఇన్ని ఎన్నికలు జరుగుతున్నా.. జనం బండకేసి కొడుతున్నా.. సిగ్గు రావడం లేదు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదు నేను. పండక్కి చెల్లెల్ని కూడా ఇంటికి పిలవలేనోడు కేటీఆర్. తండ్రి గాలికి సంపాదించిన వాటా పంచాల్సి వస్తుందని సొంత చెల్లినే మెడలు పట్టి బయటకు పంపించావ్. సొంత చెల్లికే సమాధానాలు చెప్పలేనోడు నాకే సవాల్ విసరుతాడా?.. కేటీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత..? నీలా అమాయకుల్ని నేను మోసం చేయలేదు. అలాంటిది నేను నీకు భయపడతానా?.. హరీష్‌రావు ఆరడుగులు పెరిగిండు.. కానీ తలకాయే లేదు. నీ కండలు కరిగి.. తొలు మిగిలింది. నీకా నేను భయపడేది. 2029లో 80 శాతంపైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తాం. రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా.. ఇదే నా సవాల్. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్‌ను అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం. తండ్రీ కొడుకులు కల్లు కాంపౌండ్ మాటలు మాట్లాడొద్దు. సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు. పార్టీ ఆఫీసులో కాదు.. అసెంబ్లీకి రండి. నీళ్లు, నియామకాలు.. నిధులు.. వేటిపైన అయినా అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం. కూలిన కాళేశ్వరం.. ఫోన్ ట్యాపింగ్.. ఏ అంశంపైనా అయినా సరే చర్చిద్దాం. ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు చర్చ పెడతాం. మీరు సిద్ధమా? అని రేవంత్ అన్నారు. -
ఏం చేద్దాం ఎలా చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇరిగేషన్ విషయంలో చేసిన ఆరోపణల నేపథ్యంలో.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోమవారం మధ్యాహ్నాం మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడంతో పాటు ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అంశంపైనా వీళ్ల నుంచి సీఎం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని సమాచారం. అలాగే పెండింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ , పార్టీ పదవులపై భర్తీ పైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ పైనా చర్చిస్తారని సమాచారం. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా అసెంబ్లీలో చర్చ చేపట్టే అంశంపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ‘‘ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చింది. గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే.. రాష్ట్ర సర్కారులో చలనం లేదు. కృష్ణాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే చప్పుడు చేయట్లేదు. అందుకే నేనే రంగంలోకి దిగా. ఇవాళ్టి దాకా వేరు.. రేపట్నుంచి వేరు. మా కళ్ల ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే.. నేను ఎందుకు మౌనంగా ఉండాలి? ఇది సర్వభ్రష్ట సర్కారు. ఈ నిష్క్రియా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం’’ అని కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇరిగేషన్ విషయంలో దమ్ముంటే ఫేస్ టూ ఫేస్‌కు రావాలంటూ సీఎం రేవంత్ ఆ వెంటనే కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాలపై అవసరమైతే రెండేసి రోజుల చొప్పున శాసనసభలో చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలకు వస్తానని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అంగీకరిస్తే జనవరి 2 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో ఓ ప్రకటన చేశారు. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ భవన్లో నేడు(ఆదివారం, డిసెంబర్ 21) ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ఈ భేటీలో పాల్గొనడానికి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని నివాసానికి శనివారమే కేసీఆర్ చేరుకున్నారు. ఇవాళ జరగబోయే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు చెబుతోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సాగునీటి కోసం మరో జల సాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారని.. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని బీఆర్ఎస్ కీలక నేతల ద్వారా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ డౌన్ అయ్యిందని బీఆర్ఎస్ బలంగా భావిస్తోంది. ఈ క్రమంలో ఈ భేటీని పార్టీ కీలకంగా భావిస్తోందని సమాచారం. -
అర్హతా.. అనర్హతా.. ఏం చెప్పబోతున్నారు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మొదటి దశ విచారణలో భాగంగా.. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై నిర్ణయం ఏంటి?.. ఐదుగురిపై వేటు వేస్తారా? లేదంటే ఫిరాయింపే లేదంటారా? స్పీకర్ ఏం చెప్పబోతున్నారు?.. అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేల అడ్వొకేట్లకు మధ్యాహ్నాం రావాలని కబురు పంపినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. ఆపై శాసనసభ వెబ్సైట్లో తీర్పు ప్రతులను అధికారులు అప్లోడ్ చేయనున్నారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ BRS (భారత రాష్ట్ర సమితి) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. ఈ నెల 18వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు డెడ్‌లైన్ నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉండడంతో.. నిర్ణయం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు మాత్రం స్పీకర్ నోటీసులకు వివరణలు ఇచ్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందోనని చర్చా నడుస్తోంది. -
కాంగ్రెస్ గూండాల దాడికి ప్రతిదాడి తప్పదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి వస్తన్నాయేగానీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత బిట్ల బాలరాజు, ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారాయన. అనంతరం.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉంది. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదు.. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. "ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అని హెచ్చరించారాయన. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. గాయపడిన భారతి గారి కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని.. న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. "ఖబడ్దార్ కాంగ్రెస్ గుండాలారా" అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్లు.. భారతి పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెతో పాటు బాలరాజులపై దాడి చేసిన వారిని, ఆ దాడికి ప్రేరేపించిన వారిపై కూడా వెంటనే 'అటెంప్ట్ టు మర్డర్' (హత్యాయత్నం) కేసులు నమోదు చేయాలి. వెంటనే దోషులను అరెస్ట్ చేసి బాధితుల పక్షాన నిలబడాలి. ఆసుపత్రి పాలైన ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరామర్శలో ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, స్థానిక కార్యకర్తలు కేటీఆర్ వెంట ఉన్నారు. -
ఐడీపీఎల్ భూములపై విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఐడీపీఎల్ భూములపై రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు మంగళవారం ఆదేశించింది. గత కొన్నిరోజులుగా కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత మధ్య ఈ భూములకు సంబంధించి పరస్పర ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మాధవరం, ఆయన తనయుడిపై కవిత ఆరోపణలు చేయగా.. కవిత భర్త అనిల్‌పై మాధవరం కబ్జా ఆరోపణలు చేశారు. సుమారు 4 వేల కోట్ల రూపాయల విలువైన భూములపై ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో.. సర్వే నెంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ సమగ్ర విచారణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. -
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి షాక్
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో.. తొలి విడత పలితాలే పునరావృతం అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి తన సొంతూరులోనే షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. రంగారెడ్డిగూడ సర్పంచ్‌గా బీజేపీ అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించారు. మరోవైపు.. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డికీ ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన సొంతూరు ధన్వాడలో బీజేపీ అభ్యర్థి జ్యోతి రామచంద్రయ్య ఘన విజయం సాధించారు. ధన్వాడ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కూడా సొంతూరు కావడం, పైగా పర్ణికారెడ్డికి అత్తాకోడళ్ల వరుస.. దీనికి తోడు ధన్వాడలో పోటీ పడింది కూడా అత్తాకోడళే కావడం.. ఈ ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటు ఖమ్మంలోనూ కాంగ్రెస్‌కు ఎదురుగాలి తప్పలేదు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ ప్రచారం చేసిన వాటిల్లో కేవలం రెండు చోట్ల (ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి) మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా నెగ్గారు.రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో.. 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల్లో 29% మంది గెలుపొందగా.. తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. అదే సమయంలో స్వతంత్రులు కూడా సత్తా చాటారు. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణలోని 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా..కాంగ్రెస్-2,112 బీఆర్ఎస్-1,025 బీజేపీ-225ఇతరులు(స్వతంత్రులు.. సీపీఐ-సీపీఎం బలపర్చినవాళ్లు)-549 గెలుపొందారు. రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదు కాగా.. ఇది తొలి విడత కంటే 1.58% ఎక్కువ. ఇప్పటి వరకు రెండు విడతల్లో ఇప్పటివరకు 8,567 పంచాయతీల ఎన్నికలు పూర్తైంది. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 5,195, బీఆర్ఎస్ మద్దతుదారులు 2,338, బీజేపీ 440గా ఉన్నారు. బీజేపీ కంటే ఇతరులు సాధించిన స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
‘క్షమాపణలు చెప్పకుంటే సినిమాలు ఆడనీయం’
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని.. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి. పవన్ క్షమాపణ చెప్పక పోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం. మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్లో కూడా పవన్ సినిమా విడుదల కాదు. పవన్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నాడు. పవన్ తెలిసి మాట్లాడాడో, తెలియక మాట్లాడాడో తెలియదు.. కానీ ఆయన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో నష్టపోయాం. తెలంగాణ వచ్చాక కేసీఆర్ వల్ల నష్టపోయాం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. చిరంజీవి సూపర్ మ్యాన్ ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. పవన్ కల్యాణ్ అన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో హైదరాబాద్ ఆదాయం అంతా విశాఖ, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారు. తెలంగాణ ప్రజలు దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు గరం..ఇక, అంతకుముందు.. పవన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలని ఒక వీడియోతో బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతామని హెచ్చరించారు. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే ఇక్కడి యువత పరిగెత్తించి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వార్నింగ్ ఇచ్చారు.పవన్ కల్యాణ్‌కు తెలంగాణపై అక్కసు ఉంటే... హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని కోరారు. తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా తెలంగాణలో ఆడవని హెచ్చరించారు. సినిమాల షూటింగ్‌లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడిందని పవన్ కల్యాణ్‌పై భగ్గుమన్నారు.మంత్రి వాకాటి వ్యాఖ్యలు.. పవన్ తల తిక్క మాటలు మానుకోవాలి. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదు. ఏపీలో మైలేజ్ కోసం తెలంగాణపై కామెంట్స్ చేయడమేంటి?. అన్నదమ్ముల్లా విడిపోయాం.. సోదరుల్లా కలిసుందాం.అవకాశవాద వ్యాఖ్యలు: అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.. పవన్ కల్యాణ్ బాధ్యతారహితంగా మాట్లాడారు. అవకాశవాద వ్యాఖ్యలు సరైనవి కాదు. ఆంధ్ర, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టేలా పవన్ కామెంట్స్ చేశారు. పవన్ మెచ్యూరిటీ పెంచుకోవాలి. ఏరోటి కాడ ఆపాట పాడటం పవన్‌కు అలవాటు అయింది అని విమర్శలు చేశారు. మంత్రి పొన్నం కామెంట్స్.. తెలంగాణ బిడ్డలుగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించాలి. ప్రకృతి వైపరీత్యం వస్తే.. అది వదిలేసి మాపై నిందలా?. మా దగ్గర వర్షాలు పడుతున్నాయి.. మీ దిష్టే మాకు తాకిందని మేం అంటున్నామా?. వివేకంతో మాట్లాడాలి కానీ, సినిమా డైలాగులు పేల్చకూడదు. -
వీరన్న కుటుంబాన్ని ఆదుకునేదెవరు?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు భరోసా ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఖమ్మం రైతు బానోతు వీరన్న ఉదంతంపై తాజాగా ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న బలవన్మరణం చెందడం అత్యంత బాధాకరం. పండించిన పంటకు ధర రాక.. అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అంటూ పురుగుల మందు తాగుతూ వీరన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు ఓ నిదర్శనం.వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యనే. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ. 15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గం. పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు. సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి... ఎవరూ అధైర్యపడకండి అంటూ హరీష్‌రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఇలా మాట్లాడితే నాకు అహంకారం అంటారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గోడకు వేలాడదిస్తే తుపాకీ కూడ మౌనంగానే ఉంటుందని.. ఎదురుదాడి విషయంలో కేసీఆర్ వైఖరి కూడా అలాగే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివస్(Diksha Divas) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. పీసీసీ చీఫ్ కేసీఆర్ దీక్ష దొంగ దీక్ష అని మాట్లాడుతున్నాడు. కొందరు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే కథనే నిజం అనుకుంటారు.. .. కొందరు మూర్ఖులు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారు. గోడకు వేలాడదిస్తే తుపాకీ కూడ మౌనంగానే ఉంటుంది. కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే బయటకు వస్తారు. ఎదురుదాడి ఎలా చెయ్యాలో కేసీఆర్‌కు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. నాయకుడిని నాయకుడే అంటారు, అర్భకుడిని అర్బకుడే అంటారు. ఇలా మాట్లాడితే నాకు అహంకారం అంటారు. నేను ఇలానే మాట్లాడుతాను.. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. This was the day that changed Telangana’s destiny and led to statehood 16 years ago29th November, 2009 will be etched in history Sharing a video of that day from Karimnagar when KCR Garu was arrested and emotions were running high #DeekshaDivas #KCR#Telangana pic.twitter.com/5QnrYaDzam— KTR (@KTRBRS) November 29, 2025 -
సర్పంచ్ ఎన్నికలు.. బంపరాఫర్ ప్రకటించిన బండి సంజయ్!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపరాఫర్ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారాయన. మాట ఇస్తే... తప్పే ప్రసక్తే లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్ఎస్ మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరక యాతన తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలే చేశారాయన.తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం షెడ్యూల్ రిలీజ్ చేసింది. షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఐఏఎస్ రాణి కుముదిని దేవి మీడియా ముఖంగా వెల్లడించారు.మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలుఫేజ్ 1లో కోసం.. నవంబర్ 27 నుండి నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 11న పోలింగ్ఫేజ్2 కోసం.. 30 నవంబర్ నుండి నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 14న పోలింగ్ఫేజ్3 కోసం.. డిసెంబరు 3 నుండి నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 17న పోలింగ్ -
కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
సాక్షి, జనగాం: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపుల ఆరోపణల నేపథ్యంతో తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయబోనని సోమవారం అన్నారాయన. ‘‘నేను రాజీనామా చేయడం లేదు. నా రాజీనామా, ఉప ఎన్నిక గురించి ఆలోచించొద్దు. స్పీకర్ నిర్ణయం తర్వాత కార్యాచరణ ప్రకటిస్తా. కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్. దేశవ్యాప్తంగా నాకు గుర్తింపు ఉంది. నేను ఫ్లైట్ దిగితే అభిమానులు ఎదురొస్తారు’’ అని అన్నారాయన. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఇచ్చిన నోటీసుల గడువు ఆదివారం ముగిసింది. అయితే స్పీకర్ విధించిన గడువులోగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ సమాధానం ఇవ్వలేదు. అయితే నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు తనకు కొంత వ్యవధి కావాలని ఈ నెల 21న స్పీకర్‌ను కడియం శ్రీహరి వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశారు.అయితే ఆయన చేసిన విజ్ఞప్తిపై స్పీకర్ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా స్పీకర్‌ను ఫోన్ ద్వారా గడువు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. -
కడియం ఓకే.. దానం పరిస్థితి ఏంటో?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. సుప్రీంకోర్టు ఈ కేసును సీరియస్‌గా పరిగణించి విచారణను వేగవంతం చేయాలని సూచించిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ వేగం పెంచారు. సుప్రీంకోర్టు దిశానిర్దేశాలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించని ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే స్పీకర్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి కాస్త గడువు కోరారు. ఇదిలావుండగా మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం స్పీకర్ వద్ద ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి పార్టీ అధిష్టాన పెద్దలతో ఆయన చర్చించినట్టు సమాచారం. తిరిగి రాష్ట్రానికి వచ్చాక కూడా కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే.. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సంబంధించిన వివరణను సిద్ధం చేసుకునే ప్రక్రియలో భాగంగా దానం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో గంటకు పైగా భేటీ అయినట్లు తెలుస్తోంది. అధిష్టాన పెద్దలు సూచించిన అంశాలనే ఆయన ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు సైతం పాల్గొన్నారు. -
నవీన్ యాదవ్‌కు రాహుల్ అభినందనలు
సాక్షి, ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికలో గెలిచిన వల్లాల నవీన్ యాదవ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్‌నూ ఆయన అభినందించారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హస్తినలో రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగుర వేశారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.కాంగ్రెస్ విజయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. -
‘జూబ్లీహిల్స్‌లో నైతిక విజయం నాదే’
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహణలో ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయిందని బీఆర్ఎస్ ఉపఎన్నిక అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. రౌడీల కనుసన్నల్లోనే ఈ ఎన్నికలు జరిగాయన్నారు. ఒక ఆడబిడ్డను ఎంత హింసపెట్టాలో అంతా పెట్టారని.. బీఆర్ఎస్ పార్టీకి మద్ధతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సునీత.. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్‌లు చేయించి, రౌడీయిజంతో గెలిచిందని ఆరోపించారు. పోలింగ్ సెంటర్లోనూ తమపై ర్యాగింగ్ జరిగిందన్నారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ కు మద్ధతివ్వడంతో కాంగ్రెస్ అభ్యర్థికి అంత మెజారిటీ వచ్చిందన్నారు. వారిది అడ్డదారిలో గెలిచిన గెలుపన్నారు. ఎలక్షన్ల సందర్భంగా తాను నవ్వినా, ఏడ్చినా తప్పే అన్నట్లు ప్రచారం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. నైతిక విజయం మాత్రం తనదే అంటూ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ డిపాజిట్ కోల్పోయి మూడో స్థానంలో నిలిచింది. -
అభివృద్ధికే జూబ్లీహిల్స్ ఓటర్ల పట్టం: మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, సాక్షి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ.. ఎర్లీ ట్రెండ్స్‌పై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సాక్షితో స్పందించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారని శుక్రవారం ఉదయం అన్నారాయన. ‘‘జూబ్లీహిల్స్ ఓటర్లు మూడు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. కానీ అభివృద్ధి కాలేదు. అధికారం కోల్పోయి.. ఇప్పుడు సిట్టింగ్ స్థానం కోల్పోతున్నామనే బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతోంది. వాళ్లు ప్రజలను ప్రలోభాలకు గురి చేసినట్టు మేము కూడ చేస్తామనుకుంటున్నారు, వాళ్లు చేసినట్లు మద్యం, డబ్బులు పంచుతామని అనుకున్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడిగాం. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ప్రజలకు చిన్నచిన్న కోరికలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ల పదేళ్ల కాలంలో ఆ కోరికలను కూడా తీర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అని అన్నారాయన. -
జూబ్లీహిల్స్‌లో ఫేక్ ఓటర్ ఐడీలు! ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్ పార్టీ జనాలను రకరకాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తోందని.. కానీ, ఓటర్లు తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోంది. లక్షకు పైగా చీరలతో పాటు మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోంది. అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి సమర్పించడం జరిగింది. కొంతమంది పోలీస్ అధికారులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. అందుకేనేమో ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ని కోరాం. సీ విజిల్ యాప్ లో కంప్లైంట్ కూడా ఇస్తున్నాం. .. ఇంత అధికార దుర్వినియోగం జరుగుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు. అన్ని విషయాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చాం. సెన్సిటివ్ పోలింగ్ బూతుల్లో కేంద్ర బలగాలను పెట్టాలని, సెన్సిటివ్ బూత్ వివరాలను కమిషన్ కి సమర్పించాం. ఓటర్ ఐడీ గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ బూతులకు పంపించకూడదు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేశారు. ఫేక్ ఐడీ కార్డుల వీడియోను ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగింది. మహిళా పోలీస్ అధికారులను, ఆశా, అంగన్వాడి వర్కర్లను అక్కడ నియమించి లోపలికి వెళ్లే ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే పోలింగ్ బూత్‌లోకి అనుమతించాలని కోరాం. ఎలక్షన్ అబ్జర్వర్లకు కూడా కాంగ్రెస్ అధికార దుర్వినియోగం.. ఫేక్ ఐడీ కార్డుల వివరాలను అందించాం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తప్పకుండా అధికారులపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.యూసుఫ్‌గూడాలో కాంగ్రెస్ కార్యాలయంను ఆనుకునే పోలింగ్ బూత్ ఉంది. కాంగ్రెస్ కార్యాలయం పక్కన పోలింగ్ బూత్ ఎలా పెడతారు?. దీనికి సంబంధించి కూడా ఆధారాలను ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. సీఎం రేవంత్‌పై సెటైర్లుముఖ్యమంత్రి రెండు సంవత్సరాలుగా ఆరు గ్యారెంటీలపై రివ్యూ పెట్టడానికి టైం దొరకలేదు. ఈరోజు 6 గ్యారంటీలపై రివ్యూ పెట్టడం ఎందుకు?. మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ఎన్నిసార్లు క్యాబినెట్ సమావేశం జరిగింది. అసెంబ్లీ జరిగింది. అయినా ఆరు గ్యారంటీలపై ఏనాడు రివ్యూ చేయలేదు. జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి మోకాళ్లపై తిరుగుతున్నాడు. ఈరోజు ఆరు గ్యారెంటీలపై ముఖ్యమంత్రి రివ్యూ చేయడం జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడమే.... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా లాభం లేదు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు తెలివైన వారు. తగిన రీతిలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారు’’ అని హరీష్‌రావు అన్నారు. -
ఈ రెండేళ్లలో ఏం చేశారో రేవంత్ చెప్పలేకపోయారు
సాక్షి, హైదరాబాద్: పీజేఆర్ కొడుక్కి సీటు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. తాజాగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు శనివారం హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో సంచలన ఆరోపణలే చేశారాయన. సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. కేసీఆర్ కట్టిన భవనాల్లో వాళ్ల పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే వృద్ధి రేటు పడిపోయింది. రేవంత్‌కు పరిపాలన చేత కావడం లేదు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు ఉండటం రేవంత్‌కు ఇష్టం లేదు. అందుకే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్లి కూర్చుంటున్నారు. ఈ రెండేళ్లలో ఏం చేశారో రేవంత్ నిన్న చెప్పలేకపోయారు. 2004-2014 కాంగ్రెస్ పాలన చూసి ఓటేయాలని అడుగుతున్నారు. పీజేఆర్ కొడుక్కి టికెట్ ఇవ్వని రేవంత్‌కు.. ఆయన పేరు తీసే నైతికత లేదు. పీజేఆర్‌ను మానసికంగా వేధించి చనిపోయేలా చేసిందే కూడా కాంగ్రెస్ పార్టీనే అని హరీష్‌రావు ఆరోపించారు. .. రేవంత్ రెడ్డి, బీజేపీది ఫెవికాల్ బంధం. ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగితే ఎందుకు బయటకు రాలేదు?. భట్టి ఢిల్లీ వెళితే తెలంగాణ భవన్ లో ఉండరు. గురుగ్రామ్‌లోని అత్తగారి ఇంట్లో ఉంటారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే భట్టి ఇంట్లో జరిగిన ఐటీ రైడ్స్ బయటకు రాలేదు. భట్టి ఇంట్లో హార్డ్ డిస్క్ లు కూడా ఐటీ అధికారులు తీసుకెళ్ళారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి బయట ఉన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉంది. రేవంత్ ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయి అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. -
ఆ ఇద్దరికీ కీలక పదవులు.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశించిన సీనియర్లకు అదిష్టానం బుజ్జగింపులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అలాగే.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కేబినెట్ బెర్త్ ఆశించారు. అయితే బదులుగా ఆయనకు సలహాదారు పదవి కట్టబెడుతూ ఆరు గ్యారెంటీల అమలు బాధత్యను అప్పగించింది రేవంత్ ప్రభుత్వం. అలాగే.. ప్రేమ్‌సాగర్‌రావు కూడా కేబినెట్ అవకాశం కోసం ఆశలు పెట్టుకున్నారు. అయితే.. కేబినెట్ ర్యాంకు హోదాలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌ను కేటాయించింది. ఆశావహుల జాబితా నుంచి ఈ ఇద్దరూ అవుట్ కావడంతో మంత్రి వర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యం, సామాజిక వర్గాల ప్రాధాన్యతను కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాజగోపాల్‌కు?ఇదిలా ఉంటే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో బెర్త్ దక్కుతుందా? అనే ఆయన వర్గీయులు ఎదురు చూస్తున్నారు. -
మాట మీద నిలబడటం కొందరికే సాధ్యం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహాభారతంలోని కర్ణుడి పాత్ర చాలా ఇష్టమట. చేతికి ఎముక లేనట్టుగా దానం చేసే లక్షణం కర్ణుడిది. మిత్రధర్మం కోసం ప్రాణత్యాగమూ చేసి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య యుగంలో కర్ణుడి పాత్ర అంత వాస్తవికమైంది కాదనే చెప్పాలి. పైగా రేవంత్ ఏ రాజకీయ ధుర్యోధనుడితో ప్రస్తుతం మిత్ర సంబంధం ఉందన్న చర్చకు ఆస్కారం ఇచ్చారు. రాజకీయ నేతలు తమని తాము కర్ణుడిలా ఊహించుకుంటారేమో తెలియదు కానీ ఆయన మాదిరిగా మాటమీద నిలబడే వారు చాలా అరుదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా సినీ కార్మికులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా సీఎం చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి సహకరించినందుకు సినీ కార్మికులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మరీ ముఖ్యంగా కృష్ణానగర్ ప్రాంతంలో సినీ జూనియర్ ఆర్టిస్టులు వేలమంది నివసిస్తూంటారు. వారి ఓట్లు దక్కించుకునేందుకు రేవంత్ ఈ మాట అన్నారేమో మరి!. ఎందుకంటే కార్మికుల సమ్మె ఎప్పుడో పరిష్కారమైతే ఇప్పుడు సన్మాన సభ ఏమిటో?.. అయితే ఈ సందర్భంగా రేవంత్ ఇంకో హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు ఆదాయంలో ఇరవై శాతం చెల్లిస్తేనే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందని ప్రకటించారు. ధరల పెంపు నిర్మాతలు, హీరోలకు ఆదాయం తెస్తుందని, కార్మికులకు దక్కేది ఏమీ ఉండదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చెవులకు ఈ హామీ వినసొంపుగా ఉండొచ్చు. కానీ అది ఆచరణ సాధ్యమా?.. ఎందుకంటే... ప్రతి సినిమాకూ ఓ సంక్షేమ నిధి అంటూ ఏదీ ఉండదు. అందరికీ కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఎంతివ్వాలన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడొచ్చు. రేవంత్ మాట్లాడుతూ.. నిజమే కానీ టిక్కెట్ ధరలు అన్ని సినిమాలకూ పెరగవు. టిక్కెట్ ధరలు పెంచిన తరువాత కూడా నష్టాలొస్తే ఏం చేయాలి? లాభ నష్టాలతో సంబంధం లేకుండా టిక్కెట్ రేట్ పెంచిన వెంటనే అందులో 20 శాతం వేరుచేసి కార్మికులకు కేటాయించాలని ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా?అందుకు నిర్మాతల సంఘాలు ఒప్పుకుంటాయా? ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తన ఆలోచనపై నిర్మాతలతో చర్చించి ఆ తరువాత ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది.కొంతకాలం క్రితం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సినిమా హాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఒక బాలుడు గాయపడి, ఇప్పటికీ కోలుకోలేకపోవడం తెలిసిన సంగతే. హీరో అల్లు అర్జున్ జైలు పాలయ్యారు కూడా. తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ తరువాత షరా మామూలే. యధావిధిగా బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చేస్తున్నాయి. బీజేపీ కూటమి భాగస్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా సినిమా బెనిఫిట్ షోతోపాటు టిక్కెట్ రేట్ల పెంపునకూ ఓకే అన్నారు. గురువు.. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారేమో మరి!. రేవంత్‌కు కర్ణుడి పాత్ర నిజంగానే అంత ఇష్టమైతే ఇలా మాట తప్పవచ్చా అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఇంకో సంగతి చెప్పాలి. దానగుణంలో గొప్పవాడైన కర్ణుడు కౌరవుల పక్షాన ఉన్న సంగతి మర్చిపోరాదు. కౌరవాగ్రజుడు దుర్యోధనుడికి అనుయాయిగా కర్ణుడు కూడా అపకీర్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది మరి. సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్ పెడతానని అన్నారు.ఆలోచన బాగానే ఉంది కాని అందుకు అవసరమైన మూడు నాలుగెకరాల స్థలం ఈ మహానగరంలో ఎక్కడి నుంచి తెస్తారు? దాన్ని ప్రభుత్వ అధికారులు చూడగలుగుతారు. కాని,కార్మిక సంఘాలు ఎలా వెదుకుతాయో చెప్పలేము. హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకు వచ్చే బాధ్యత తమదని, ప్రపంచ సినిమా వేదికగా హైదరాబాద్ కావాలన్న ఆకాంక్ష కూడా మెచ్చుకోతగ్గదే. అయితే.. చంద్రబాబుతోపాటు రేవంత్ రెడ్డితోనూ సత్సంబంధాలు నెరుపుతున్న మీడియా సంస్థకు సొంతంగా ఒక స్టూడియో ఇప్పటికే ఉంది. దీనికి పోటీగా మరిన్ని వస్తాయంటే వారు ఊరకుంటారా? అయితే రామోజీ ఫిలిం సిటీకే హాలీవుడ్‌ను రప్పిద్దామని ఆయన అనడం ద్వారా వారిని సంతృప్తిపరిచారని అనుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమకు చోటు ఇస్తామని చెప్పడం బాగానే ఉంది. అందులో పరిశ్రమ అభివృద్దికి వ్యూహారచన ఉండవచ్చు. కాగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కిపోనని రేవంత్ గంభీరంగా ప్రకటించినా, ఇంతకుముందు అలా మాటకు కట్టుబడి ఉండలేకపోయారని అనుభవం చెబుతోంది. పైగా.. గతంలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి హామీలు ఇస్తారు?ప్రజలను ఏ విధంగా మాయ చేస్తారో తన అభిప్రాయాలను చెప్పిన వీడియోలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన గత ఎన్నికలలో ఆయన ఇచ్చిన హామీలు,వాటి అమలు తీరు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుంటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఈ ప్రసంగం చేశారా అన్న భావన కలుగుతుంది. కొసమెరుపు ఏమిటంటే సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డితో సంబంధం లేకుండా ఈ సభ జరగడం!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ఇవాళ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే తీవ్ర అభ్యంతరాలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు నేపథ్యంతో ఈ ప్రమాణంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన సీఈవో సుదర్శన్‌రెడ్డి బదులు కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఓ వర్గం ఓటర్లను ప్రలోభ పెట్టడమే అవుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. అయితే ఎస్ఈసీ నిన్ననే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కేబినెట్ విస్తరణ పరిణామాలను, అభ్యంతరాలను అందులో వివరించింది. ఇవాళ మరోసారి సీఈసీని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి సంప్రదించినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లోనే దీనిపై స్పందన వెలువడే అవకాశం ఉంది. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నాం 12.15గం. ప్రాంతంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అజారుద్దీన్‌తో ప్రమాణం చేయించనున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. అంతేకాదు.. ఈ ప్రమాణం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ అజారుద్దీన్ పాల్గొంటారని తెలుస్తోంది. అయితే..గతంలో గోవాలోనూ ఇలాగే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్న టైంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంది. స్వయంగా సీఈసీనే అప్పటి సీఎం మనోహర్ పారికర్‌కు ఫోన్ చేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు కూడా. ఇదే విషయాన్ని నిన్న బీజేపీ ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం. అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంతో మంత్రి పదవి ఇస్తుండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే ఆయన్ని మంత్రి వర్గంలోకి తీసుకోనివ్వకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని, అందుకు బీఆర్ఎస్ కూడా మద్దతు చెబుతోందని కాంగ్రెస్ మండిపడుతోంది. ఏ శాఖ ఇస్తారో?అజహరుద్దీన్ గనుక మంత్రిగా ప్రమాణం చేస్తే.. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారో అనే చర్చా నడుస్తోంది. ప్రస్తుతం కీలక శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. దీంతో అందులోంచి ఒకటి ఇస్తారా? లేదంటే ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల వద్ద నుంచి ఏదైనా అడ్జెస్ట్మెంట్ చేస్తారా? చూడాలి. ఇదీ చదవండి: ఆ బైపోల్ టైంలో మంత్రి పదవిని బీజేపీ ఎలా ఇచ్చింది?కాంగ్రెస్‌లో అసంతృప్తి? అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్న కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయంపై పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. -
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఐదు ముక్కలవుతుందని అన్నారాయన. అంతేకాదు.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన స్థాయికి తగ్గ వ్యక్తి కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
గన్‌పార్క్ వద్ద క్షమాపణలు చెప్పిన కవిత
సాక్షి, హైదరాబాద్: ఇన్నేళ్ల తన రాజకీయంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం గట్టిగా కొట్లాడలేకపోయానని.. అందుకు ఆ కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి తరఫున శనివారం జనం బాట కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అంతకంటే ముందు.. గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించాక ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ అమరవీరుల కుటుంబాలను నేను క్షమాపణలు కోరుతున్నా. గతంలో నేను గట్టిగా కొట్లాడలేకపోయా. ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. నా జాగృతి జనం బాటలో అందరినీ కలుస్తా. 33 జిల్లాల్లో ఉన్న అన్ని వర్గాలను కలుస్తా’’ అని అన్నారామె. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారు. తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో? ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 అమరులు అయ్యారని అనేక సందర్భాల్లో చెప్పాం. అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయాం. ఈ మొత్తంలో 580 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు,కొన్ని చోట్ల ఎంపీపీ, జెడ్పిటిసి టిక్కెట్లు వచ్చాయి. కానీ ఉద్యమకారులకు అనుకున్న మేర న్యాయం జరగలేదు. నేను మంత్రిగా లేకపోయినా ఎంపీగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అడిగాను. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేక పోయినందుకు నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని కవిత వ్యాఖ్యానించారు. -
‘‘కేసీఆర్‌పై కోపంతో..’’ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్, హరీష్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ లేని కాంగ్రెస్ ప్రభుత్వం.. విజయోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానాను సందర్శించి.. అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫిరాయింపుల వ్యవహారంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అసలు నీతి ఉందా?. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్‌లో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు. దానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారు?. పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్దాలు చెప్తున్నారు. పార్టీ మారినోళ్ళకు సిగ్గు లేదు. ఏ పార్టీలో ఉన్నామో చెప్పే దమ్ము లేదు. ఆ దమ్మే ఉంటే స్వయంగా చెప్పొచ్చు కదా అని కేటీఆర్ నిలదీశారు.AICC అంటే.. ఆల్ ఇండియా కరపర్షన్ కమిటీ. విజయోత్సవాలు ఎందుకు చేయోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదు. రాజకీయాలు కాదు.. ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలను పట్టించుకోవాలి. మున్సిపల్ మంత్రి లేక.. పట్టించుకునే వారు లేక హైదరాబాద్ అనాధగా మారింది. హైదరాబాద్ సిటీ చెత్త చెదారంతో నిండిపోయింది. పట్టణంలో ఉండే పేదల కోసమే కేసీఆర్ 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. కనీస మందులు కూడా అందుబాటులో లేవు. ఇది ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఆకస్మిక తనిఖీలను చేపట్టాం. బస్తీ దావాఖాన సిబ్బందికి తక్షణమే జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలి. కేసీఆర్ ముందు చూపుతో.. కరోనా సమయంలో కూడా ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడలేదు. వైద్య పరీక్షలు ఉచితంగా చేసే టీ డయాగ్నస్టిక్స్ ను అందుబాటులోకి తీసుకురావాలి నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే.. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మంది దర్నా చేస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.అటు శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించిన తర్వాత హరీష్‌రావు మాట్లాడారు. ‘‘పేదల ఆరోగ్యంపై రేవంత్‌కు శ్రద్ధ లేదు. బస్తీ దవాఖానాల్లో బీపీ మిషన్లు పని చేయడం లేదు. కేసీఆర్‌పై కోపంతో కేసీఆర్ కిట్ పథకం తీసేశారు. జనం మద్యం తాగాలి.. ఖజానా నిండాలి అన్నదే సీఎం ఆలోచనగా కనిపిస్తోంది అని హరీష్ విమర్శించారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. భ్రాంతి కాకూడదు!
హైదరాబాద్‌లో భూమి ధరలు రికార్డులు బద్ధలు కొడుతున్నాయి. ఎకరా భూమి ఏకంగా రూ.177 కోట్లు పలికిందంటే ఆశ్చర్యమేస్తోంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేవన్న వార్తలొస్తున్న వేళ ఒక కంపెనీ ఇంత మొత్తం పెట్టిందంటటే నమ్మశక్యం కాదు. వేలం పాటలో కొన్నమాటైతే వాస్తవం. అయితే కొనుగోలు ధర పూర్తిగా చెల్లించినప్పుడే ఈ విలువ ధృవీకరణ అవుతోంది.తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుదేలైందన్నది దుష్ప్రచారమేనని వాస్తవం లేదని, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.2800 కోట్ల విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగితే, అది రూ.4804 కోట్లు అని రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి ఇదే ఆధారమని కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే జనాభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ కాస్త బాగున్న రోజుల్లో బుక్ అయిన ఇళ్లు, అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతుండవచ్చని, ప్రస్తుతం బుకింగ్ ఎంత మేరకన్నది కూడా చూడాలంటున్నారు వారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణతోపాటు దేశాద్యంతం కూడా మందగతిలోనే ఉందని వారు చెబుతున్నారు.కొన్ని రోజుల క్రితం తెలంగాణ పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ రాయదుర్గ్‌లోని 7.67 ఎకరాల భూమిని వేలానికి పెడితే ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1350 కోట్లకు దక్కించుకుంది. పెస్టీజ్ రియాల్టీ ఇంకో 11 ఎకరాలను ఎకరాకు రూ.141.5 కోట్ల చొప్పున సొంతం చేసుకుంది. ఈ వేలం ద్వారా మొత్తం రూ.2913 కోట్ల ఆదాయం దక్కిందన్నమాట. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీల రూపంలో ఇంకో రూ.225 కోట్లు కూడా రానున్నాయి. అయితే గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే.. వేలం పాడిన ఈ సంస్థలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేంతవరకూ కొనసాగుతాయా అన్న అనుమానం వస్తుంది. 2023లో కోకాపేటలో ఎకరాకు రూ.100.75 కోట్లు పలికిన విషయం తెలిసిందే. అప్పటితో పోలిస్తే ధర సుమారు 76 శాతం పెరిగిందన్నమాట. హైదరాబాద్ సాధిస్తున్న సుస్థిరాభివృద్ధి, గ్లోబల్ బిజినెస్ హబ్‌గా మారడం, మౌలిక వసతులు తదితరాలు ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ విధానాలపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని టీజీఐఐసీ ఎండీ శశాంక అభిప్రాయపడ్డారు. ఇవన్నీ వాస్తవమైతే ఫర్వాలేదు కానీ.. బలవంతంగా మార్కెట్‌ను పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం బెడిసికొడుతుందని రియల్ ఎస్టేట్ రంగం అనుభవజ్ఞులు చెబుతున్నారు.ఎకరా భూమికి రూ.177 కోట్లు, రూ.141.5 కోట్లు పెట్టి కొన్న కంపెనీలు నిర్మాణాలు పూర్తయిన తరువాత ఎంత కాదన్నా అన్ని ఖర్చులు కలుపుకుని చదరపు అడుగు రూ.30 - 40 వేల కు అమ్ముకోవాల్సి వస్తుందని కొందరు బిల్డర్ల అంచనా. అయితే ఆ ప్రాంతంలో ఎఫ్ఎస్ఏ ఎక్కువ కాబట్టి ఏభై, అరవై అంతస్థుల నిర్మాణానికి కూడా అనుమతులు లభిస్తాయని... ఆ రకంగా చదరపు అడుగుకు రూ.10 - 20 వేలకు అమ్ముకున్నా గిట్టుబాటు అవుతుందని మరికొందరి అంచనా. మరీ ఎక్కువ ధర పెడితే కంపెనీలు కూడా కొనుగోలుకు ఆలోచిస్తాయని చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడిపై ఒక శాతం కూడా గిట్టుబాటు కాదనుకుంటే ఎందరు కొనుగోలు చేస్తారు అని ఒక ప్రముఖ బిల్డర్ ప్రశ్నించారు.కోకాపేటలో పక్కనే 50 - 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటంతో దాని ధర రూ.వంద కోట్లయితే తనదీ అంతే పలుకుతుందన్న అంచనాతో గతంలో ఒక కంపెనీ వేలంలో పాల్గొందని సమాచారం. అయితే ఆ అంచనాలు తారుమారు కావడంతో ఆ కంపెనీ తన డిపాజిట్‌ను వదులుకుంది మినహా ఎకరాకు రూ.వంద కోట్లు చెల్లించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుత వేలం పాటలలో పాల్గొన్న కంపెనీలలో ఒక రాజకీయ నేత భాగస్వామిగా ఉన్నారు. ఇటీవలే రియల్ ఎస్టేట్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడియన ఆయన కంపెనీనే ఇంత భారీ మొత్తానికి వేలం పాటలో పాల్గొనడం వెనుక మతలబు ఏమిటన్నది ప్రశ్న. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా మాంద్యం ఏర్పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లేవు. అమెరికా ప్రభుత్వ విధానాలు, ప్రత్యేకించి ట్రంప్ సుంకాలు భారత్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఏఐ కారణంగా ఐటీ రంగం అనిశ్చితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు గతంలో మాదిరిగా రుణాలపై అపార్టుమెంట్లు కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. పైగా ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలు, అపార్ట్మెంట్లు కొనుగోలుదారులు, అద్దెదారుల కోసం వేచి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నంతలో హైదరాబాద్ కాస్తో, కూస్తో బెటర్‌గా ఉండవచ్చేమో కాని, ఈ స్థాయిలో ధరపెట్టి కొనుగోలు చేసేంతగా ఉండకపోవచ్చని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఇంకో సంగతి గుర్తు చేసుకోవాలి. హెచ్ఎండీయే ఇటీవలే హైదరాబాద్ శివార్లలో 103 ప్లాట్లను వేలం వేస్తే, మూడు మాత్రమే అమ్ముడుపోయాయి. వేలం ద్వారా రూ.500 కోట్లు వస్తాయని ఆశిస్తే, రూ.38 కోట్లే వచ్చాయి. కొద్ది నెలల వ్యవధిలోనే ఎకరం రూ.177 కోట్లకు కొనేంత మార్పు వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చివరి రోజుల్లో రియల్ ఎస్టేట్ పడిపోవడం ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ మరింతగా దిగజారిందన్న అపప్రథ ఉంది. దీనిని కప్పిపుచ్చడానికి రేవంత్ ప్రభుత్వం ఏదో మాయాజాలం చేసి ఉండాలని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు ప్రముఖ సంస్థలపై ఒత్తిడి తెచ్చి, ఇతరత్రా మేలు చేస్తామని ఆఫర్ ఇచ్చి ఈ స్థాయిలో ధర పలికేలా చేశారన్నది కొందరి అనుమానం. ఈ రెండు కంపెనీలు గడువులోపు డబ్బును చెల్లిస్తే రేవంత్ ప్రభుత్వ విశ్వసనీయత, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ అమాంతంగా పెరిగిపోతుంది. దీని ప్రభావం ఫ్యూచర్ సిటీపై కూడా పడుతుంది. అక్కడ కూడా లావాదేవీలు పుంజుకుంటాయి. రీజినల్ రింగ్ రోడ్ల నిర్మాణం, హైదరాబాద్ - విజయవాడ రోడ్లు విస్తరణ, కొత్తగా అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే వంటివి కూడా కార్యాచరణకు వచ్చినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునే అవకాశం ఉంది. ఇంతకాలం నేచురల్ గా గ్రోత్ ఉండడం వల్ల భూముల ధరలు పెరిగాయి. అయితే ఇవీ మరీ పెరిగిపోతే మధ్య తరగతికి అందుబాటులో లేకపోతే కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంటుంది.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీ!?
సాక్షి, హైదరాబాద్: 42 శాతం రిజర్వేషన్ల సాధన డిమాండ్‌తో బీసీ సంఘాలు ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనల్లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శనివారం ఉదయం ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో.. ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లితో పాటే నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేస్తూ కనిపించాడు.‘‘కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు.. ప్రతి ఇంటి నుండి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలి. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు ఎంతో అవసరం’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కవితను ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో నొచ్చుకున్న ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. విదేశాల్లో చదువుకున్న ఆదిత్య ఇటీవలే ఇండియాకు రాగా.. అనూహ్యంగా ఇవాళ్టి బంద్, ధర్నాల్లో పాల్గొనడం గమనార్హం. దీంతో 20 ఏళ్లకే కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రెడీనా? అనే చర్చ నెట్టింట జోరుగా నడుస్తోంది. -
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ.. 9వ షెడ్యూల్ చేర్చి చట్టసవరణ చేయాలంటూ బీసీ సంఘాలు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ఈ బంద్‌కు అన్ని పార్టీలతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు మద్దతు ప్రకటించాయి. -
కొండా సురేఖ వివాదం.. అసలేం జరిగింది?
మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. తన మాజీ ఓఎస్డీ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల మంత్రి సురేఖ కోపంగా ఉన్నట్టు కనబడుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన సురేఖ ఓఎస్డీపై చట్టపరమైన చర్యలకు సర్కారు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన పోలీసులను సురేఖ కుమార్తె సుస్మిత (konda sushmitha) అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తమను టార్గెట్ చేశారని, రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తోందంటూ సుస్మిత మీడియా ముందు ఫైర్ అయ్యారు.మరోవైపు ఈ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని మంత్రి సురేఖ భర్త కొండా మురళి హన్మకొండలో చెప్పారు. తమ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి వివాదం పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. అదే సమయంలో తన కూతురును ఆయన వెనకేసుకొచ్చారు. కాగా, ఈ వివాదంపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కూడా సురేఖ వ్యవహరించిన తీరు పట్ల సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖను ఆమె నుంచి తీసేసుకోవాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.అసలేం జరిగింది? తన నియోజకవర్గం హుజూర్‌నగర్‌లోని డెక్కన్ సిమెంట్స్‌లోని పనిచేస్తున్న ఓ వ్యక్తిని డబ్బుల కోసం కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ బెదిరించినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో అతడిని విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతడు సురేఖ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో బుధవారం రాత్రి అక్కడికి వెళ్లారు. జూబ్లీహిల్స్ గాయత్రిహిల్స్‌లోని తమ ఇంటికి మఫ్టీలో వచ్చిన పోలీసులను సురేఖ కూతురు సుస్మిత అడ్డుకున్నారు. మంత్రి ఇంటికి పోలీసులు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. ఈలోపు ఇంట్లో ఉన్న సురేఖ, సుమంత్ బయటికి వచ్చి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మా ప్రమేయం లేదుఈ నేపథ్యంలో మేడారం జాతర పనులను రోడ్లు భవనాలకు అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కొండా సురేఖ (Konda Surekha) వివాదంపై స్పందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిరాకరించారు. డెక్కన్ సిమెంట్ వివాదంలో తన ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో తనపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి తోసిపుచ్చారు. డెక్కన్ సిమెంట్ వివాదంలో తన ప్రమేయం లేదని అన్నారు.తెలంగాణ కేబినెట్ భేటీసీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, రైతు భరోసా, మైనింగ్ కొత్త పాలసీ, ట్రో ఫేజ్-2 టెండర్లపై మంత్రి మండలిలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కొండా సురేఖ వివాదం నేపథ్యంలో కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, సురేఖకి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి క్యాబినెట్ మీటింగ్‌కు హాజరు కావాలని కోరినట్టు తెలుస్తోంది. చదవండి: నన్ను తిట్టినవాళ్లే నాకోసం వస్తున్నారుపొంగులేటిపై ఫిర్యాదు!అంతకుముందు మేడారం పనుల టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. తన శాఖకు సంబంధించిన రూ. 71 కోట్ల విలువైన పనులను తనవాళ్లకు ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని సురేఖ ఆరోపించినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి పొంగులేటితో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. మహేష్ గౌడ్ క్లారిటీమంత్రి కొండా సురేఖ వివాదంపై పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ స్పందించారు. ఈ వ్యవహారాన్ని తాను మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపం కనిపిస్తుందని, తొందరలో క్లారిటీ వస్తుందని మీడియా ప్రతినిధులతో చెప్పారు. -
రేవంతన్నతో గొడవల్లేవ్.. నా బిడ్డ అందుకే అలా మాట్లాడింది: కొండా మురళి
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ(మాజీ) సుమంత్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు గత అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు రావడం, సురేఖ కూతురు సుస్మిత వాళ్లతో వాగ్వాదానికి దిగడం, ఈ క్రమంలో సంచలన ఆరోపణల చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ, సురేఖ భర్త కొండా మురళి స్పందించారు. సుమంత్ వ్యవహారం, కూతురు సుస్మిత వ్యాఖ్యలపై కొండా మురళి గురువారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించి స్పందించారు. ‘‘హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సుమంత్ వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదు. సెక్రటేరియట్లో కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు.నా బిడ్డకు(సుస్మితను ఉద్దేశించి..) మాట్లాడే స్వేచ్ఛ ఉంది. తాను ఇబ్బంది పడ్డాడని చెప్పింది. అందుకే అలా మాట్లాడి ఉంటుంది. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాం. నాకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంతన్న హామీ ఇచ్చారు. తప్పకుండా ఇస్తారు కూడా. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు. అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది. నేను మంత్రుల వద్దకు వెళ్తాను. పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తా. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తా. ఎవరి తప్పు ఉన్నా, సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా. మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మళ్ళీ మీనాక్షి గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతా. మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటాను... నన్ను తిట్టిన వల్లే మళ్ళీ నా కోసం వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్ట్ పనులు కోసం నా దగ్గరకు వచ్చిన వాడే. వేం నరేందర్ రెడ్డి(సీఎం సలహాదారు) నేను కామన్ గా కలుస్తుంటాం. నేను ఎవరికీ టార్గెట్ కాను, నాకు ఎవరూ టార్గెట్ లేరు. నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టం అని మురళి అన్నారు.ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మాజీ ఓస్డీని అర్ధరాత్రి తన కారులో మంత్రి కొండా సురేఖ తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కొండా మురళి పరోక్షంగా స్పందించారు. కొండా సురేఖ హైదరాబాద్‌లోనే ఉన్నారని.. ఈరోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్‌తో ప్రోగ్రామ్ ఉందని, దానికి ఆమె హాజరవుతారని అన్నారాయన. ఇదీ చదవండి: మా అమ్మ అరెస్టుకు కుట్ర జరుగుతోంది: కొండా సుస్మిత -
కేసీఆర్ రీఎంట్రీకి ఇదే మొదటి మెట్టు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తమకు మంచి రోజులు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటమి తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేయడానికి బయల్దేరే ముందు తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ మాకు మంచి రోజులు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అన్ని పనులు ఆగిపోయాయి. హైడ్రా పేరిట శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. కాబట్టి ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం.. .. గులాబీ దండు జైతయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం అవుతుంది. కేసీఆర్ పునరాగమనానికి ఇదే తొలి మెట్టు. ప్రజల దీవెనలు బీఆర్ఎస్కే ఉంటాయని ఆశిస్తున్నాం. మాగంటి సునీత గెలుపునకు బీఆర్ఎస్ సమిష్టిగా కృషి చేస్తుంది అని కేటీఆర్ అన్నారు.నామినేషన్ వేసిన సునీతజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ షేక్‌పేట ఎమ్మార్వో ఆఫీస్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె వెంట కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు ఉన్నారు. పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని, బీఆర్ఎస్ గెలిస్తే బుల్డోజర్ అరాచకాలకు పుల్‌స్టాప్ పడ్డట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: వీడిన సస్పెన్స్.. బీజేపీ అభ్యర్థి ఎవరంటే..? -
Konda Surekha: రేవంత్‌కు ఫిర్యాదు.. ఖర్గేకు లేఖ
సాక్షి, హైదరాబాద్: అడ్లూరి-పొన్నం వివాదం మరువక ముందే.. తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య లొల్లి మొదలైంది(Telangana Ministers Clash). దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మేడారం టెండర్ల విషయంలో ఈ ఇద్దరు మంత్రులకు వార్ మొదలైందని తెలుస్తోంది. ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. అయితే.. తన శాఖకు సంబంధించిన రూ.71 కోట్ల పనులను తన మనిషికి ఇప్పించుకునేందుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది మంత్రి కొండా సురేఖ ఆరోపణ. ఈ క్రమంలో సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పలుకీలక అంశాలతో లేఖ రూపేణా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని ప్రచారం బలంగా వినిపిస్తోంది(Konda Surekha Complaint Ponguleti). ఇదిలా ఉంటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్య చేశారంటూ అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియో రిలీజ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. పొన్నం క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారాయన. ఈ క్రమంలో సీఎం సూచనతో.. టీపీపీసీ చీఫ్ మధ్యవర్తిత్వం వహించడంతో పొన్నం క్షమాపణలు చెప్పగా ఆ పంచాయితీ ముగిసింది.ఇదీ చదవండి: కోర్టు ఆదేశాలంటే లెక్కే లేదా? -
అడ్లూరినేం అనలేదు.. ఇది బీఆర్ఎస్ కుట్ర: పొన్నం
తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్ (Congress) మంత్రుల మధ్య విభేదాలు హీటెక్కించాయి. తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్‌పై (G.Vivek) సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో.. మంత్రి పొన్నం స్పందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీడియో(Adluri Laxman Kumar) నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా స్పందించారు. ‘‘అడ్లూరిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నా వాఖ్యలు వక్రీకరించారు. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర. ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.అడ్లూరి వీడియోలో.. ‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?.. .. నేను త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ని కలుస్తా. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్’ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.పొన్నం పేరిట వైరల్ అయిన వీడియోలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో.. ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటూ పొన్నం అన్నట్లు ఉంది. ఇదీ చదవండి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. బిగ్ ట్విస్ట్ -
స్థానిక ఎన్నికల వేళ.. బీజేపీలో బిగ్ ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. పార్టీలో వివిధ స్థాయి నేతల మధ్య సమన్వయలేమి బీజేపీ(Telangana BJP) నాయకత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ ఎన్నికల్లో కనీసం 15 జెడ్పీలు గెలిచి రాజకీయంగా సత్తా చాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. దీని సాధనకు పార్టీ పూర్తిస్థాయిలో సంసిద్ధమై ఉందా ఉన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా.. రాష్ట్రంలో పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో బలపడేందుకు స్థానిక ఎన్నికలు ఏ మేరకు ఉపయోగపడతాయన్న దానిపై నాయకుల్లో స్పష్టత కొరవడింది. పార్టీలో కొంతకాలంగా అంటే గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి పాత–కొత్త నాయకులు, వివిధ స్థాయి నాయకుల మధ్య సమన్వయ సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఆదివారం జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలోనూ ముఖ్యనేతల మధ్య సమన్వయలేమి, అంతర్గత సమస్యలు మరోసారి బయటపడ్డాయి.మూడునాలుగేళ్లుగా పలువురు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా గెలుపొందినా కూడా ఇంకా పార్టీలో పాత–కొత్తల వివాదం కొనసాగుతుండడంపై ముఖ్యనేతలు సైతం పెదవి విరుస్తున్నారు. అంతేకాకుండా జిల్లా నుంచి మండల, గ్రామస్థాయి వరకు నాయకులు, కార్యకర్తల సమన్వయం, ఆయా జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలకు ఉన్న స్నేహపూర్వక సంబంధాలు, ఒకరికి ఒకరు సహకరించుకోకపోవడం వంటివి ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. ఆ లోగా అందరికీ సర్ది చెప్పే ప్రయత్నాల్లో నాయకత్వం నిమగ్నమైంది. జిల్లాల్లోనూ అంతే..జిల్లా పార్టీలో సరైన సమన్వయం లేదంటూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Vishweshar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమాల నిర్వహణ, తదితరాల విషయంలో తన ఎంపీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షుల తీరుపై నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పధాదికారుల సమావేశంలో నిలదీశారు. ఈ నేపథ్యంలో వెంటనే ఈ జిల్లాల అధ్యక్షులపై వచ్చిన ఫిర్యాదులపై మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, పార్టీనేత గోలి మధుసూదన్ రెడ్డిలతో ఓ కమిటీని అధ్యక్షుడు రామచందర్‌రావు ఏర్పాటు చేసినట్టు సమాచారం. పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా గెలిచిన ప్రజాప్రతినిధులతో జిల్లా నేతలకు సరైన సమన్వయం లేదని పధాదికారుల సమావేశంలోనే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి వాపోయారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూర్చొని కార్యక్రమాలు నిర్ణయించడం తప్ప క్షేత్ర స్థాయిలో అసలు అవి ఏ విధంగా అమలు చేస్తున్నారనేదే నాయకత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే చేసిన విమర్శలు, లేవనెత్తిన అంశాలను సైతం సీరియస్‌గా తీసుకున్న నాయకత్వం.. నేతల మధ్య సమన్వయం, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు, తదితర అంశాలపైనా దృష్టి పెట్టినట్టు పార్టీవర్గాల సమాచారం. -
జూబ్లీహిల్స్ బైపోల్: కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరంటే..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను (Jubilee Hills Bypoll) అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఈ విషయంలో చాలా ముందుంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రచారం కూడా ముమ్మరంగా చేసుకుంటోంది. కాంగ్రెస్ దాదాపుగా మహమ్మద్ అజారుద్దీన్‌ను ఖరారు చేసినట్లే చేసి.. ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తూ ట్విస్ట్ ఇచ్చింది. ఇక బీజేపీ సరైన అభ్యర్థినే ఎన్నుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ఇప్పటికే హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అభ్యర్థుల పరిశీలన జరిగింది. ఇవాళ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగిన జూమ్ మీటింగ్‌లోనూ ఈ ఉప ఎన్నిక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఇక.. రేసులో ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని త్వరలోనే పీసీసీకి సమర్పించబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అన్నీ కుదిరితే.. ఈ నెల 6వ తేదీన పీసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది(Jubilee Hills Congress Candidate). ఇక ఈ లిస్టులో లోకల్ యంగ్ లీడర్ నవీన్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. అనూహ్యంగా రెహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు వచ్చి చేరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే గత గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గ్రాండ్ విక్టరీకి కారణమైన మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా తెర మీదకు రావడం గమనార్హం. మరోవైపు.. బీజేపీ పార్టీ కూడా ఆపరేషన్ జూబ్లీహిల్స్‌ను ముమ్మరం చేసింది(Jubilee Hills BJP Candidate). ఇందుకోసం త్రీమెన్ కమిటీ వేసింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, అడ్వకేట్ కోమల ఆంజనేయులుకు చోటు కల్పించారు. వీళ్లు గ్రౌండ్ లెవల్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా అతిత్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లంకా దీపక్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, పీవీ మనవడు ఎన్వీ సుభాష్, సామాజిక కార్యకర్త మాధవీలత, డాక్టర్ పద్మ విప్పర్తి, కీర్తి రెడ్డి.. ఇలా పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆ రెండు పార్టీలు వారం, పదిరోజుల్లో అభ్యర్థిపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. -
‘నిన్న గాజులరామారం.. రేపు బోరబండ బస్తీపైకి హైడ్రా బుల్డోజర్లు’
సాక్షి, హైదరాబాద్: సెలవు దినాల్లో కూల్చివేతలు చేయొద్దని హైడ్రాకు హైకోర్టు స్పష్టంగా చెప్పిందని.. అయినా హైడ్రా ఆ ఆదేశాలను ఉల్లంఘించి ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన తాజా పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి ఆదివారం ఎందుకు కూల్చివేస్తున్నారు?. గతంలో హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు చేయవద్దని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ, గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారు. గాజులరామారంలో ఇళ్లు కూల్చివేశారు, రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారు... హైడ్రా బూల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుంది.. పెద్దల ఇళ్లకు వెళ్లదు. ముఖ్యమంత్రి సోదరుడితో పాటు మంత్రులు పొంగులేటి, వివేక్ తదితరులు ప్రభుత్వ స్థలాల్లో, చెరువుల పైన ఇళ్లు కట్టినా వారిని కూల్చివేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. మన ఇళ్లు కూలగొట్టమని కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే. మన పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారు. కాంగ్రెస్ పార్టీ కూలగొట్టిన ఆ ఇంటిని మళ్లీ కట్టించి ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది అని కేటీఆర్ అన్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారణ జరిపేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. మరిన్ని ఆధారాలు సమర్పించాలంటూ బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకూ నోటీసులు జారీ కావడం గమనార్హం. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), సంజయ్(జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్చెరు), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు(భద్రాచలం)లకు తాజాగా నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఫిరాయింపుల అభియోగాలకు సంబంధించి బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకూ స్పీకర్ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి.. కాంగ్రెస్‌లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో.. స్పీకర్ వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీచేయగా.. 10 మంది ఎమ్మెల్యేల్లో.. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), సంజయ్(జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్చెరు), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ) ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు(భద్రాచలం) స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. . తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని వివరణ ఇచ్చారు. దీంతో వీళ్ల వివరణపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఈ నెల 11న స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు వేర్వేరుగా లేఖలు పంపించింది. అయితే.. వీరితోపాటు నోటీసులు స్వీకరించిన శాసనసభ్యులు కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్), దానం నాగేందర్(ఖైరతాబాద్) మాత్రం ఇంకా సమాధానాలివ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడు.. నోటీసులపై సమాధానాలిచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై తమ అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో అందజేయాలని.. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గురువారం శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు పేరిట లేఖలు వెళ్లాయి. స్పీకర్ వద్ద విచారణలో భాగంగా.. నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలు, ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలుంటాయి. కాబట్టి.. తదుపరి విచారణ కోసం లీగల్ ఫార్మాట్లో అభ్యంతరాలను ఇవ్వాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. లేఖ అందిన మూడు రోజుల్లోగా అందించాలని గడువు విధించారు. -
జూబ్లీహిల్స్ బైపోల్.. కవిత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్ధి దాదాపు ఖాయం అయ్యాడనుకున్న తరుణంలో.. మహమ్మద్ అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీకి ఎంపిక చేసి కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది. అక్కడి నుంచి అభ్యర్థి ఎంపిక విషయంలో మళ్లీ మల్లాగుల్లాలు పడుతూ మొదటికొచ్చింది. ఈలోపు.. బీఆర్ఎస్ రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రొజెక్టు చేస్తూ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో నెగ్గి.. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందర హైదరాబాద్‌లో తమ బలం ఏమాత్రం తగ్గలేదని రాజకీయ ప్రత్యర్థులకు చూపించాలని ఆయన భావిస్తున్నారు. ఈలోపు.. సోమవారం ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పీజేఆర్ తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇద్దరూ అరగంటకు పైగా చర్చ జరపడంతో జూబ్లీహిల్స్ టికెట్ కోసమేననే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పీ జనార్ధన్ రెడ్డి తనయుడు పీ విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి మరణానంతరం 2008లో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై 2009లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో బీఆర్ఎస్లో చేరారు. అయితే జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవచ్చనే సంకేతాల నడుమ.. ఆయన కవితతో భేటీ అయ్యారన్నది తాజా ఊహాగానాల సారాంశం. అయితే.. ఈ పుకార్లకు విష్ణు పుల్‌స్టాప్ పెట్టారు. పెద్దమ్మ తల్లి దసరా నవరాత్రి వేడుకలకు కవితకు ఆహ్వాన పత్రిక అందించడానికే వచ్చినట్లు చెప్పారాయన. ‘‘కేటీఆర్‌తోనే నా ప్రయాణం. ఎప్పుడు నేను ఇదే చెబుతా. కేటీఆర్‌కు ప్రమోషన్ ఉంటుంది.. నాకూ ప్రమోషన్ ఉంటుంది’’ అని ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే విష్ణు తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ పరిణామంతో తీవ్రంగా కలత చెందిన ఆమె.. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ ప్రెస్మీట్లో ఆమె సంచలన ఆరోపణలే చేశారు. వేరే పార్టీలో చేరిక.. సొంత పార్టీ గురించి స్పష్టత ఇవ్వని ఆమె.. ఇక నుంచి రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టినా కేసీఆర్ ఫొటోతోనే ముందుకు సాగుతానని ఆమె ప్రకటించడం గమనార్హం. -
కవిత ఎపిసోడ్‌పై కుండబద్ధలు కొట్టిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సోదరి, పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తొలిసారి పెదవి విప్పారు. పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత ఆ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్‌రావు, సంతోష్ రావు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ‘‘రామన్నా.. హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది..’’ అంటూ కవిత పేర్కొన్నారు.తాజా రాజకీయ పరిణామాలపై సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కవిత ఆరోపణలపై ప్రశ్న ఎదురైంది. కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించిన తర్వాతనే అధినేత నిర్ణయం తీసుకున్నారని, ఇంక ఆమెపై స్పందించడానికి ఏం లేదు అని కేటీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారాయన. తాజాగా కవిత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. తనను అక్రమంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. తానెప్పుడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. తనపైపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినప్పుడు.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం ఫోన్ చేసి అడగాల్సిన బాధ్యత కూడా తీసుకోలేదు. 103 రోజులుగా కేటీఆర్ తనతో మాట్లాడలేదని అన్నారామె. అయితే తనకు నోటీసు ఇవ్వడంపై బాధ కలగడం లేదని.. ఈ వ్యవహారంపై ఎన్నడూ లేనిది తెలంగాణ భవన్లో మహిళా నేతలు స్పందించడమే తనకు కొంత ఊరట కలిగించిందని వ్యంగ్యంగా మాట్లాడారామె. -
అదే ‘కూలేశ్వరం’ నీళ్లను హైదరాబాద్‌కు తెస్తున్నారు.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శనాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కక్షగట్టారని, కమిషన్ పేరుతో టైంపాస్ చేశారని అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. అలాంటి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష గట్టారు. కాంగ్రెస్ కాళేశ్వరంపై ఎన్నికల ముందు నుండే అడ్డమైన ఆరోపణలు చేస్తోంది. సీబీఐ, ఈడీలు బీజేపీ జేబు సంస్థలంటూ రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. కానీ, ఆయన విమర్శించే సీబీఐకే రేవంత్ కాళేశ్వరం కేసు అప్పగించారు. ఇవాళేమో మూసీ పునరుజ్జీవం(జలాల అనుసంధానం) పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తోంది. మల్లన్న సాగర్ వద్ద కాకుండా తలాతోకా లేకుండా గండిపేట వద్ద శంకు స్థాపన చేస్తున్నారు. కాళేశ్వరం కూళేశ్వరం అయ్యింది అని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అదే ప్రాజెక్టు నీళ్లను హైదరాబాద్‌కు తెస్తున్నారు. అదే కాళేశ్వరం ద్వారా గంధమల్ల రిజర్వాయర్కి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే.. కాళేశ్వరంపై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ తెస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టువి అవునో.. కాదా ఆయన సమాధానం చెప్పాలి..కాళేశ్వరం ప్రాజెక్టుకు 94 వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది. మరి లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ జరిగింది?. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను బద్నాం చేస్తున్న వారు ముక్కు నేలకు రాయాలి. ఎల్లకాలం మోసం చేయలేమని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని కేటీఆర్ అన్నారు. అదే సమయంలో.. విడతల వారిగా భారీ అవినీతికి ప్రభుత్వం తెరతీసిందని ఆరోపించారాయన. మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన సంస్థనే కూలిన పిల్లర్లను నిర్మిస్తామని ముందుకు వస్తే.. ప్రభుత్వం అడ్డుకుంటోంది. కొండ పోచమ్మ ద్వారా రూ.1,100 కోట్లతో హైదరాబాద్‌కి నీళ్లు తేవోచ్చు. కానీ, ఈ రోజు రూ. 7,700 కోట్లకు వ్యయం.. అంటే 7 రెట్లు ఎలా పెరిగింది?. కేవలం కమిషన్ ల కోసమే వ్యయం పెంచారు. అవినీతే కాదు ఇందులో క్రిమినల్ కోణం కూడా ఉంది. సుంకిశాల రైటింగ్ వాల్ కూలిన సంస్థకే రూ.7,400 కోట్ల ప్రాజెక్ట్ ఎలా ఇస్తున్నారు?. వారిపైన చర్యలు తీసుకోక పోగా వారికే మళ్ళీ కాంట్రాక్ట్ లు ఎలా ఇస్తున్నారు?. ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపణలు చేసిన వారికి ఇప్పుడు బెస్ట్ ఇండియా కంపెనీ ఎలా అయ్యింది అని కేటీఆర్ ప్రశ్నించారు.ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థ వైఖరి అవలంభిస్తోందని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. ఫిరాయింపుల వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రజాస్వామాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని అన్నారాయన. ‘‘బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నాం అని టీపీసీసీ అధ్యక్షుడే ఒప్పుకున్నారు. అలాంటప్పుడు ఇంక విచారణ దేనికి?. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటు వేయాలి’’.. కేటీఆర్ డిమాండ్ చేశారు. -
కవిత ఆరోపణలపై స్పందించిన హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని, అందులో దాపరికాలు ఏం లేవని అన్నారాయన.విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియా నుంచి ఈ వ్యవహారంపై ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది. గత కొంతకాలంగా మా పార్టీ పైన, నా పైన కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆ వ్యాఖ్యలనే కవిత ప్రస్తావించారు. వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగుతున్నా. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు’’ అని అన్నారాయన.ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు. మరొకవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవడం మా కర్తవ్యం. ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంత ఉంటుంది. మేం ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళు కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళు, సో, మా సమయాన్ని అంత కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటాం. ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం అని హరీష్‌రావు అన్నారు.ఇదిలా ఉంటే.. హరీష్ రావు, సంతోష్ రావుల వల్లే తాను పార్టీ నుంచి సస్పెండ్ అయ్యానని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ క్రమంలో హరీష్‌రావుకు బంగారు తెలంగాణపై చిత్తశుద్ధి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారామె. హరీష్‌రావు మొదటి నుంచి పార్టీలో ఏం లేరని, బీఆర్ఎస్పై ఎప్పటి నుంచో హరీష్‌రావు కుట్రలు చేస్తున్నారని, కాంగ్రెస్..బీజేపీలతో టచ్‌లో ఉంటూ కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని, స్వలబ్ధి కోసమే తనను బయటకు పంపించేశారని ఆరోపించారామె. ఆరడుగుల బుల్లెట్టుగా బీఆర్ఎస్ అభివర్ణిస్తున్న హరీష్‌రావు తనకు గాయం చేశారని పేర్కొంటూ.. ఈ క్రమంలో హరీషన్నతో జాగ్రత్త అంటూ కేసీఆర్, కేటీఆర్‌లకు సూచిస్తూ పార్టీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారామె. -
రాజ్‌గోపాల్‌రెడ్డి విషయంలో కొంత కన్ఫ్యూజన్: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో బ్రేకులే కాదు సడెన్ బ్రేకులు కూడా ఉంటాయని అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాళేశ్వరం సీబీఐ విచారణ, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై ఆయన శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. సీబీఐతో కాకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే బద్నాం చేసేవారు. సీబీఐ కంటే మరో మార్గం కనిపించడం లేదు. ఆ దర్యాప్తు సంస్థలోనూ అనేక లొసుగులు ఉన్నాయి. కానీ కాళేశ్వరం విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారాయాన. అదే సమయంలో రాజ్‌గోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యవహారంపైనా స్పందించారు. ‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కోమటిరెడ్డి బ్రదర్స్ కి అలవాటు. కానీ, రాజ్‌గోపాల్‌రెడ్డి విషయంలో కొంత కొంత కన్ఫ్యూజన్ ఉంది’’ అని అన్నారు. నాగేందర్ రిజైన్ చేసి పోటీ చేస్తానని చెప్తున్నారు. నాగేందర్ సభ్యత్వం పోతుందని అనుకోవడం లేదు. మంత్రి పదవి ఇస్తామంటే వద్దని చెప్పాను. నాకు కులమంటే అభిమానమే కానీ కుల పిచ్చి లేదు. బీసీలు కొన్ని రోజులు కులాన్ని పక్కన పెట్టాలి. వచ్చే ఎన్నికల్లోనూ రేవంత్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని మహేష్‌గౌడ్ అన్నారు. -
ప్చ్.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు!
శత్రువులు ఎక్కడో ఉండరు.. ఇంట్లో మనచుట్టూనే తిరుగుతూంటారని ఈ మధ్య వచ్చిన ఒక సినిమా డైలాగుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఈ మాట ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటుందని అనిపిస్తోంది. కేసీఆర్ కుమార్తె కవిత అంత పని చేశారు మరి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి, సీబీఐ విచారణ ప్రయత్నాలతోనే కేసీఆర్ సతమతమవుతున్న తరుణంలో ఉరుము లేని పిడుగు మాదిరి కవిత విరుచుకుపడ్డారు. నేరుగా ఏమీ అనకపోయినా, ఆమె వ్యాఖ్యలన్నిటికి కేసీఆర్ బాధ్యుడవుతారన్నది బహిరంగ రహస్యం. కవిత వైఖరి కొన్ని నెలలుగా పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. సోదరుడు పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించడమే కాకుండా.. అధినేత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ దనుమాడిన సంగతి ప్రజలందరికీ తెలుసు. వీటన్నింటినీ ఓపికగా సహించిన కేసీఆర్ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు ఆయుధాన్నిచ్చేలా వ్యవహరించడంతో సహించలేకపోయారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత కూడా పార్టీకి రాజీనామా చేసి ఒక రకంగా తండ్రితో బంధాలు తెంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్రావులతోపాటు ప్రముఖ కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డిలపై కూడా కవిత ఆరోపణలు చేశారు. హరీశ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని, వీరిద్దరూ ఢిల్లీ నుంచి విమానంలో కలిసి వచ్చారని, ఆ సందర్భంలో రాజకీయాలు మాట్లాడుకున్నారని ఆమె అంటున్నారు. బీఆర్ఎస్లో కాని,ఆయా రాజకీయ వర్గాలలో కాని, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ సలహా, సంప్రదింపులతోనే కవిత తన సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. దానిని పూర్వపక్షం చేయడానికి ఆమె ప్రయత్నించినట్లు కనిపించినా, ఎవరూ పెద్దగా నమ్మకపోవచ్చు. తన తండ్రిపై సీబీఐ విచారణ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత?, పోతే ఎంత అని ప్రశ్నించడం ద్వారా ఆమె తన మనసులో మాట చెప్పారన్న భావన కలుగుతుంది. కేసీఆర్‌పై అవినీతి మరక పడిందని కవిత కూడా చెప్పడం సహజంగానే బీఆర్ఎస్లో కలకలం రేపుతుంది.పైకి హరీశ్, సంతోష్‌ల గురించి ప్రస్తావించినా, వారు కేసీఆర్‌ను దెబ్బతీస్తారని అంటున్నా, ఆమె చేసే ప్రతి వ్యాఖ్య కేసీఆర్‌కు తగులుతుంది. కాకపోతే ఆమె నేరుగా ఈ మాట చెప్పకపోవచ్చు. ఈ మధ్య కాలంలో పార్టీకి దూరమైన కవిత ఇప్పుడు ఆ పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత అని ప్రశ్నించారు. దానికి తగిన విధంగా సస్పెన్షన్ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. పార్టీపై, తండ్రిపై గౌరవం ఉంటే అలా మాట్లాడగలిగేవారా?. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం వివాదంపై మాజీ మంత్రి, కేసీఆర్ అల్లుడు హరీశ్‌రావు సమర్థంగా వాదించారన్న ఆనందం ఎంతో సేపు లేకుండా చేశారు కవిత తన వ్యాఖ్యలతో!. పోనీ ఆమె అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడారని అనుకున్నా, ఆమె పై కొంతకాలం క్రితం వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అభియోగాలు, కొద్ది నెలలపాటు జైలులో ఉన్న పరిస్థితి కూడా సహజంగానే చర్చకు వస్తాయి. కాళేశ్వరం దెబ్బతినడంతోపాటు, కవిత లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం కూడా బీఆర్ఎస్ను ఎన్నికలలో దెబ్బతీసిందన్నది చాలామంది భావన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఉందని ఏ బీఆర్ఎస్ నేత అయినా బహిరంగంగా అంటే ఒప్పుకుంటారా? కవిత చేసిన వ్యాఖ్యల గందరగోళాన్ని తగ్గించుకోవడానికి గాను ఆమెపై చర్య తీసుకోక తప్పని స్థితి ఏర్పడిందన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం. అలా చేయలేకపోతే హరీశ్ సంతోష్ వంటివారికి అసంతృప్తి కలగవచ్చు. ఇప్పటికే కవిత దూరమైన నేపథ్యంలో వీరిని వదలుకునే పరిస్థితి ఉండదు. ఆమె తిరుగుబాటుకు పార్టీలో పెద్దగా అనుకూలత వచ్చినట్లు అనిపించదు. హరీశ్‌రావుకు పార్టీ అంతా అండగా ఉన్నట్లు తేలింది. వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఒక వ్యాఖ్య చేస్తూ హరీశ్‌ను ఆరడగుల బుల్లెట్ అని, మాస్టర్ క్లాస్ అని అసెంబ్లీలో మాట్లాడిన తీరును ప్రశంసించారు. ఇవన్ని కవితకు బీఆర్ఎస్ ఇచ్చిన సమాధానాలే అవుతాయి. కవిత తొలుత తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా, ఆ తర్వాత కాలంలో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కాని ఆ గెలుపును ఆమె నిలబెట్టుకోలేకపోయారు. నిజామాబాద్ లో మరోసారి పోటీచేసి ఓటమి పాలయ్యారు.అయినా కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వ్యవహార శైలిపై కొంతమందిలో అసంతృప్తి ఉన్నప్పటికి, ఎవరూ పైకి మాట్లాడేవారు కారు. ఇప్పుడు వారు కూడా హరీశ్‌రావు పార్టీకి మూల స్తంభాలలో ఒకరని బదులు ఇస్తున్నారు. కొద్దికాలం క్రితం కవిత పై విమర్శలు చేయడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాందీ కూడా పలికారు. కవిత సొంతంగా పార్టీ పెట్టుకుంటారా? లేక కాంగ్రెస్‌లో చేరతారా? అన్న చర్చకు ఆమె అవకాశం ఇస్తున్నారు. తనను అరెస్టు చేయించింది బీజేపీనే అన్న భావనలో ఉన్నందున ఆ పార్టీ వైపు వెళతారా అన్నది అప్పుడే చెప్పలేం. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సంక్షోభం వెనుక తమకు ఎలాంటి పాత్ర లేదని, అది అవినీతి సొమ్ము పంచాయతీ అని సమాధానం ఇచ్చారు. కవిత తనకు తెలిసిన అవినీతి సమాచారం అంతటిని సీబీఐకి ఇవ్వాలని బీజేపీ ఎంపీలు అరవింద్, రఘునందన్ వంటివారు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్లో గొడవలు ఆ రెండు పార్టీలకు సహజంగానే సంతోషం కలిగిస్తాయి. కవిత ఒకరకంగా తండ్రినే బ్లాక్ మెయిల్ చేసినట్లు కనిపిస్తోంది. పైకి ఆయనను గొప్పవాడుగా ప్రొజెక్టు చేసినట్లు అనిపించినా.. మొత్తం ఆయనను దృష్టిలో ఉంచుకుని చేశారన్న భావన కలుగుతుంది. రేవంత్ ను ఉద్దేశించి కొంత అనుచిత వ్యాఖ్య చేసినట్లు కనిపించినా, కవిత తీరు వల్ల కాంగ్రెస్ కు రాజకీయంగా లబ్ది చేకూరే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేస్తూ కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైందని వ్యాఖ్యానించారు.అందులో మామ వాటా ఎంతో అల్లుడి వాటా ఎంతో తేలాలి అని కూడా ఆయన అన్నారు. తనను కాంగ్రెస్, బీజేపీ, రేవంత్, బండి సంజయ్ నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఖబడ్దార్ అని కవిత హెచ్చరించారు. తాను ఎవరో చెబితే ఆడే తోలుబొమ్మను కాదని, తనది కేసీఆర్ రక్తమని కవిత పేర్కొనడం బాగానే ఉన్నా, ఏ లక్ష్యంతో ఆమె ఈ వివాదాన్ని సృష్టించారన్న దానిపై ఎవరికి వారు ఊహించుకుంటారు. చర్చించుకుంటారు. గతంలో ఆమె కేసీఆర్‌కు ఒక లేఖ రాసి పార్టీలో అసమ్మతికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు పార్టీకి దూరం అయ్యారు. కవిత భవిష్యత్తు రాజకీయం అంత తేలికగా ఉండదు. ఒక పెద్ద పార్టీ నీడలో, అది కూడా సొంత పార్టీలో, తండ్రి చెంత ఉండడం వేరు. సొంతంగా పార్టీని పెట్టుకున్నా, మరో పార్టీలో చేరినా, అది ముళ్లబాటే అవుతుంది. వాటన్నిటిని దాటుకుని కవిత తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకుంటే అది గొప్ప విషయమే అవుతుంది. కాని చరిత్రలో అలా సఫలం అయిన ఘట్టాలు చాలా తక్కువే అని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాళేశ్వరం తలనొప్పి ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే కాదు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోందా? శాసనసభలో ఒకలా.. హైకోర్టులో ఇంకోలా వాదనలు వినిపించడం ఈ అనుమానానికి తావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఆదివారం హడావుడిగా శాసనసభ పెట్టి సీబీఐ విచారణకు ఇవ్వాలని నిర్ణయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు ఇప్పటికీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయం తరువాత విచారిస్తామని ప్రభుత్వం సీబీఐకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడంతో హైకోర్టు కేసీఆర్, హరీశ్‌రావులపై తదుపరి చర్యలను నెల పాటు నిలిపివేసింది. ఈ కేసులో ఆడ్వకేట్ జనరల్ వాదన ఆసక్తికరంగా ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు, సీబీఐ విచారణకు సంబంధం లేదని, జాతీయ డామ్ సేఫ్టీ అధారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరామని ఆయన వెల్లడించారు. అదే నిజమైతే కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ ఎందుకన్న ప్రశ్న వస్తుంది. పైగా ఈ చర్చ జరిగిన తీరు చూస్తే బీఆర్ఎస్తోపాటు, కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ రొంపిలో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది.శాసనభలో తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాదనను గట్టిగా వినిపించి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసినట్లు అనిపించింది. కాని ఆ తర్వాత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తన వాదనను సమర్థంగా వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిందా అనిపించింది. సీఎంతోపాటు పలువురు మంత్రుల ఆరోపణలకు హరీశ్ ధీటుగా ఆధారసహితంగా జవాబిచ్చారు. ఒక దశలో హరీశ్ ప్రసంగం కొనసాగకుండా చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వారు ఘోష్ కమిషన్ నివేదిక చెత్త అని, అది పీసీసీ నివేదిక అంటూ విమర్శలు చేసి వాకౌట్ చేశారు. పిమ్మట మరికొందరు మాట్లాడిన అనంతరం ఈ నివేదికపై తదుపరి విచారణ చేసి చర్యలు తీసుకోవడానికిగాను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తీసుకున్న నేపథ్యంలో సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెబుతున్నా అది సమర్థనీయంగా అనిపించదు. ఈ నిర్ణయం వ్యూహాత్మకమా? చిత్తశుద్దితో చేసిందా? అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ కోర్టులోకి బాల్ నెట్టి లాభం పొందుదామన్నది కాంగ్రెస్ ప్రయత్నమా? కేంద్రం అనుమతించకపోతే బీజేపీ, బీఆర్ఎస్ల కుమ్మక్కు అని ప్రచారం చేయవచ్చు. అనుమతిస్తే దాని ప్రభావం బీఆర్ఎస్పై ఉండనే ఉంటుందన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ల పొత్తు అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో సీబీఐ తీరును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ సంస్థ సహాయం కోరడం ఏమిటన్నది కొందరి ప్రశ్న. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఇదే అంశంపై ఒక ప్రకటన చేశారు. దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో అస్త్రాలుగా మారాయని గతంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కేటీఆర్ ప్రస్తావించారు. అదే సంస్థను రేవంత్ ఎలా విశ్వసిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. సీబీఐ, ఈడీల కారణంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ కూడా కొన్ని రోజుల క్రితం సీబీఐని విమర్శిస్తూ స్పీచ్ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్పై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. దీనిద్వారా రేవంత్ తన చేతిలోని ఆయుధాన్ని బీజేపీకి అప్పగించారా అన్న ప్రశ్న కూడా వస్తోంది.కేంద్రం సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ కాస్త ఇబ్బంది పడవచ్చు. సీబీఐ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు తదితరులను అరెస్టు చేస్తుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేము కానీ.. ఈలోగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధినేత అసమ్మతి నేతగా మారి చేసిన ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలకు దారి తీసింది. హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌లకే కాళేశ్వరం స్కామ్ సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ నుంచి కవితకు పెద్ద మద్దతు అయితే రాలేదు. అందరూ హరీశ్‌రావు వెంబడే నిలబడ్డారు. అయినా సరే.. కవిత వ్యాఖ్యలతో పార్టీకి కొంత నష్టమైతే జరిగింది. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని భావిస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. కేసీఆర్‌కు సానుభూతి వస్తుందనుకుంటే ముందుకు వెళ్లకపోవచ్చు.లేదా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడానికి కూడా యత్నించవచ్చు. ఈ పరిణామాలేవీ తెలంగాణ బీజేపీకి అంతగా రుచించినట్లు అనిపించడం లేదు. ఒకప్పుడు బీజేపీ కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేసేది. కాని ఇప్పుడు ఆ పక్షం ఈ పరిణామంతో కాస్త ఇబ్బంది పడినట్లు అనిపిస్తుంది. ఆ పార్టీ నేత మహేశ్ రెడ్డి సీబీఐ విచారణను స్వాగతించినట్లు కనిపించలేదు. ఎందుకింత హడావుడిగా ఒకరోజు సమావేశం పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేశారని, ముందుగానే ఈ కేసును సీబీఐకి అప్పగించి ఉండాల్సిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. సీబీఐ దర్యాప్తును చేపడితే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈయన పాత్రను కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ తప్పు పట్టింది. కమిషన్ విచారణ సందర్భంగా ఈటెల ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని చెప్పారు. కమిషన్ మాత్రం దానిని పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. పలువురు ఐఎఎస్ అధికారులు కూడా సీబీఐ విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ ఐదేళ్లు ఈ వ్యవహారం ఒక రాజకీయ రచ్చగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఘోష్ కమిషన్ ఎక్కువ భాగం సాంకేతిక అంశాలకే పరిమితం అయినట్లు అనిపిస్తుంది. అవినీతి జరిగి ఉంటే ఏ రకంగా జరిగిందన్నదానిపై నివేదికలో పెద్దగా పరిశీలన లేదు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన తుమ్మిడి హెట్టి వద్ద నీరు తగినంత ఉన్నా, దానిని మార్చి మేడిపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్చించారన్నది ఘోష్ కమిషన్ వ్యాఖ్య. దానిని హరీశ్ రావు తోసిపుచ్చుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పులు చేయలేదని కాదు. ఆ రోజుల్లో కేసీఆర్ తన మాటే శాసనంగా ప్రభుత్వాన్ని నడిపారు. సాంకేతికపరమైన అంశాలను కూడా ఆయనే డీల్ చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. అదే రీతిలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది. ఈ కమిషన్ కొంతమంది అధికారుల జోలికి అసలు వెళ్లకపోవడంపై కూడా విమర్శలు ఉన్నాయి. రేవంత్ కాని, మంత్రులు కాని ప్రధానంగా రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కి సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే యత్నం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డను వ్యతిరేకించలేదని రిపోర్టులోని అంశాలను హరీశ్ ఎత్తిచూపారు. ఘోష్ కమిషన్ వద్ద ఉన్న ఈ కమిటీ రిపోర్టును హరీశ్ ఉటంకించడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఆ మీదట.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రిపోర్టు మీరే రాయించి ఉంటారని అనడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్లయింది. అలాగే మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తుమ్మిడి హెట్టికి, మేడిగడ్డకు మధ్య గోదావరిలో కలిసే వాగులు, ఏరులు లేవని చేసిన వ్యాఖ్యకు సంబంధించి సమాధానం ఇస్తూ ఎన్ని వాగులు గోదావరిలో కలిసేది ఒక పెద్ద జాబితానే చదివారు. దాంతో జూపల్లి వాదన వీగిపోయింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావించడంతో ఆ రోజుల్లో టీఆర్ఎస్లో ఉండి ఆయనేమి మాట్లాడారో, ట్వీట్ చేశారో చూపించారు. జాతీయ డ్యామ్ భద్రత అధారిటీ విచారణ గురించి ఉత్తం చెప్పారు. అసలు ఆ అధారిటీ ని కేంద్రం ఏర్పాటు చేస్తూ బిల్లు తీసుకువచ్చినప్పుడు ఎంపీగా ఉన్న ఉత్తం దానిని వ్యతిరేకించారని, రాష్ట్రాల హక్కులను హరించడమే అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడితే లక్ష కోట్ల దోపిడీ అంటూ రేవంత్, మంత్రులు మాట్లాడినా, అది ఏరకంగా జరిగిందన్నది వివరంగా చెప్పలేదు. ఏదో సాధారణ రాజకీయ విమర్శగానే చేశారు. దానికి హరీశ్ బదులు ఇస్తూ కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మాత్రమే ప్రాజెక్టు కాదని, 15 రిజర్వాయిర్లు, కిలోమీటర్ల కొద్ది టన్నెళ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, మొదలైన వాటి జాబితాను వివరించారు. అసలు మొత్తం ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లు అయితే, లక్ష కోట్ల దోపిడీ అని ఆరోపించడంలో హేతుబద్దత కనిపించదు. అయితే మేడిగడ్డ వద్ద బారేజీ దెబ్బతింటే అసలు నీరు అందుబాటులో ఉండదని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు నిరర్థకం అవుతుందని ఉత్తం అనడంలో కొంత అర్థం ఉంది.కాని ఆ బ్యారేజీలు పూర్తిగా దెబ్బతిని ఉంటే ఆ సమస్య వస్తుంది కాని, లేకుంటే వాటిని వాడుకునే అవకాశం ఉంటుంంది.దానిని రిపేరు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యత్నించకపోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురి అవుతుంది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ఒకవైపు 18 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తున్నట్లు చెబుతూ,మరోవైపు అందుకు విరుద్దంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం చర్చలో ఈ నిర్మాణం చేసిన కాంట్రాక్టు సంస్థలను ఏ రాజకీయ పార్టీ పెద్దగా తప్పు పట్టకపోవడం గమనించవలసిన అంశమే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


