జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కూ క్లీన్‌చిట్‌ | Telangana Speaker Clean Chit To Jagtial MLA Sanjay | Sakshi
Sakshi News home page

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కూ క్లీన్‌చిట్‌

Feb 4 2026 11:15 AM | Updated on Feb 4 2026 1:07 PM

Telangana Speaker Clean Chit To Jagtial MLA Sanjay

సాక్షి, హైదరాబాద్‌: ఫిరాయింపుల వ్యవహారంలో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఆయన పార్టీ ఫిరాయించినట్లు తగిన ఆధారాల్లేవంటూ.. దాఖలైన పిటిషన్‌ను కొట్టేశారు. దీంతో ఇప్పటిదాకా 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లైంది. 

మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించారంటూ బీఆర్‌ఎస్‌ తెలంగాణ స్పీకర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. విచారణలో జాప్యం జరుగుతుండడంతో బీఆర్‌ఎస్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్‌ను మందలిస్తూ.. వీలైనంత త్వరగా విచారణ జరిపి ఏదో ఒకటి తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 

ఈ వ్యవహారంలో కడియం శ్రీహరిని, పిటిషన్‌ వేసిన వివేకానందను ఇవాళ(బుధవారం, ఫిబ్రవరి 04) క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనున్నారు స్పీకర్‌. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పిటిషన్‌ ఇంకా విచారణ దశలోనే ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement