breaking news
defection case
-
ధన్‌ఖడ్ ఏమన్నారో అందరికీ తెలుసు.. ‘సుప్రీం’ తీర్పుపై తెలంగాణ స్పీకర్
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇవాళ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. తనకు మూడు నెలల గడువు విధించడంపై న్యాయ నిపుణులతో చర్చించాకే తదుపరి నిర్ణయానికి వెళ్తామని అన్నారాయన. ఈ క్రమంలో ధన్‌ఖడ్ వ్యాఖ్యల ప్రస్తావన తెచ్చారు.‘‘సుప్రీంకోర్టు తీర్పు పై న్యాయ నిపుణులతో చర్చిస్తా. మాజీ ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ఏం మాట్లాడారో అందరూ చూశారు. వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాం. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. సుప్రీం కోర్టు తీర్పును పరిశీలించాకే అన్ని వివరాలు త్వరలో చెప్తా’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. పార్టీ మారిన పది మందిపై తొలుత తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో.. విచారణ షెడ్యూల్ కోసం సింగిల్ బెంచ్ జడ్జి తెలంగాణ స్పీకర్‌కు నాలుగు వారాల గడువు విధించారు. అయితే డివిజనల్ బెంజ్ దానిని కొట్టేసింది. ఇక ఇవాళ్టి తీర్పులో ఫిరాయింపులపై చర్యల విషయంలో స్పీకర్‌కు సుప్రీం కోర్టు మూడు నెలల కాలపరిమితి విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉప రాష్ట్రపతి హోదాలో ఓ కార్యక్రమానికి హాజరైన ధన్‌ఖడ్.. సుప్రీం కోర్టుపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పార్లమెంటే సుప్రీం అని. ఎన్నికైన ప్రజాప్రతినిధులే రాజ్యాంగ ప్రకారం అల్టిమేట్ మాస్టర్స్ అని అన్నారాయన. ‘‘సుప్రీం కోర్టు రాష్ట్రపతికి గడువు విధించడం తగదు. ఇప్పుడు జడ్జీలు శాసనాలు చేస్తారు, కార్యనిర్వాహక విధులు నిర్వర్తిస్తారు, సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు’’ అని విమర్శించారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణి ప్రయోగించకూడదు అని తీవ్ర వ్యాఖ్య చేశారాయన. అయితే.. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలన్న పిటిషన్ విచారణ సమయంలో సుప్రీం కోర్టు పరోక్షంగా ధన్‌ఖడ్ వ్యాఖ్యలపై స్పందించింది. ఇప్పుడు మేమే కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేస్తున్నామన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అంటూ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.సంబంధిత వార్త: ఆలస్యం చేసే ఎత్తుగడలు సరికావు.. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ -
సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని చెప్పిన రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను. రాహుల్ గాంధీ చెప్పే మాటలకు, నీతులకు కట్టుబడి ఉండాలి. దమ్ముంటే, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పంచ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్ విసిరారు.రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయలేరు. పార్టీ మారిన పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలి. బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ధన్యవాదాలు.BRS welcomes the decision of the Honorable Supreme Court and we thank the Honorable CJI for ensuring that the democratic structure of this country isn't eroded by malicious methodsI hope @rahulgandhi who in his Panch Nyay advocated for stronger anti-defection laws and automatic…— KTR (@KTRBRS) July 31, 2025పార్టీ తరఫున ఎన్నికైన 10 ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా.. కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన లక్షల మంది కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్.. రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమవుతుందన్నారు. ఈ దిశగా పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేటీఆర్.. అంతిమంగా సత్యం ధర్మం గెలిచిందని కేటీఆర్ అన్నారు. -
తెలంగాణ ‘ఫిరాయింపుల’ కేసులో కీలక తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించింది. గతంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అలాగే.. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి(మూడు నెలలు) విధిస్తున్నట్లు పేర్కొంది.ఏళ్ల తరబడి ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్‌లో ఉంచడం సరికాదన్న భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్.. ఆ పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందే అని తీర్పు వెల్లడించారు. అదే సమయంలో న్యాయస్థానమే వేటు వేయాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ‘అపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’ అనే సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై పార్లమెంట్ ఆలోచించాలి. న్యాయస్థానం విచారణ మొదలుపెట్టాకే.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. మేము జోక్యం చేసుకునేంత వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం సమంజసం కాదు. పదో షెడ్యూల్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా ? లేదా అని ఆలోచించాలి. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు మంచివి కావు అని సీజేఐ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ విచారణను పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే.. స్పీకర్ తగు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారాయన.2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్.. అటుపై అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. అయినా, స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించింది. హైకోర్టులో ఎదురుదెబ్బ టు సుప్రీం కోర్టు తీర్పు దాకా.. అనర్హత పిటిషన్ల టైం లైన్2024 ఏప్రిల్‌లో.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పది మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు09.09.2024.. నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయానికి జస్టిస్ బి విజయ్‌సేన్ రెడ్డి బెంచ్ ఆదేశం.22.11.2024.. హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఆదేశాలను రద్దు చేస్తూ.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం.. రీజనబుల్ టైం కావాలంటూ వ్యాఖ్య. స్పీకర్‌కు షెడ్యూల్ ఖరారు చేయాల్సిన అవసరం లేదని స్పష్టీకరణజనవరి 2025.. హైకోర్డు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, వివేకానంద10.02.2025.. పార్టీల హక్కులు నిర్లక్ష్యం చేయబడకూడదు అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తూ.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన ‘రీజనబుల్ టైం’ అంటే ఎంత? అని ప్రశ్నించింది.18.02.2025.. సుప్రీం కోర్టు తదుపరి విచారణకు తేదీ నిర్ణయించింది, స్పీకర్ సమాధానం కోసం వేచి చూసింది.2025 మార్చి 4 – కోర్టు స్పీకర్, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.03.04.2025.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.31.07.2025.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పీకర్‌కు కాలపరిమితి విధిస్తూ మరీ సుప్రీం కోర్టు తుది తీర్పు -
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీం తుది తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్ర్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే పరిస్థితిని అంగీకరించమని ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బి ఆర్. గవాయి ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది.పదో షెడ్యూల్ కింద స్పీకర్కురాజ్యాంగ రక్షణ లేదు. ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియను సాగదీసే ప్రయత్నం చేయొద్దు. పార్టీ ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై పార్లమెంట్ ఆలోచించాలి. మేము జోక్యం చేసుకునేంత వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం సమంజసం కాదు. పదో షెడ్యూల్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా ? లేదా అని ఆలోచించాలి. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు మంచివి కాదు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా గడువు విధించాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికే పూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్‌లు పార్టీ ఫిరాయించారు. -
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నేడు సుప్రీం తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈకేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీం కోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.అదేరోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాం«దీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్‌ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లంటినీ కలిపి విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును ఎనిమిది వారాలకు రిజర్వ్ చేసింది. ధర్మాసనంలో సీజేపాటు జస్టిస్ వినోద్ చంద్రన్ ఉన్నారు. -
TG: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ‘సుప్రీం’ తుది తీర్పు రేపే
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు(గురువారం) సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై రేపు(జులై 31) తుది తీర్పును వెలువరించనుంది. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. ‘సుప్రీం’ తీర్పుపై ఆ ఎమ్మెల్యేలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయమే తీర్పు వచ్చే అవకాశముంది. -
సీఎంకు సంయమనం పాటించడం తెలియదా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ముఖ్యమంత్రికి సంయమనం పాటించడం తెలియదా? ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఎగతాళి చేసినట్లే ఉన్నాయి..గతంలో హెచ్చరించినా ఆయనలో మార్పు రాలేదు..’అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీతో కూడిన ధర్మాసనం వరుసగా రెండోరోజు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఆయనపై తాము గతంలో చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించింది.గురువారం సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా.. ‘ఉప ఎన్నికలు రావు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అంటూ సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యను బీఆర్ఎస్ తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం గురువారం మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన పత్రికా కథనాలను న్యాయమూర్తులకు చూపించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందించింది. గతంలో చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా? ‘గతంలో ఇలాంటి అనుభవం ఉన్నందున కొంత సంయమనం పాటించాలనే విషయం ముఖ్యమంత్రికి తెలియదా? 2024 ఆగస్టులో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కవితకు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. వాటిపై అప్పుడు క్షమాపణలు చెప్పారు. కానీ ఆ సమయంలో మేము సీఎంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా? అని ఇప్పుడు అనిపిస్తోంది. సీఎం కనీస స్వీయ నియంత్రణ పాటించలేరా?..’అని ధర్మాసనం ప్రశ్నించింది.‘గతంలో ఇలాంటి ఘటనను ఎదుర్కొన్న వ్యక్తి ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా? సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుంది..’అని జస్టిస్ గవా యి హెచ్చరించారు. ‘సీఎం అటువంటి వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం, పైగా స్పీకర్ సమక్షంలో ఇలా వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదు అని వారించినా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా మాట్లాడారు..’అని ఆర్యమా సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ రెండు వ్యవస్థలు సంయమనం పాటించాలి ‘న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య పరస్పర సంయమనం అవసరం. దేశ సర్వోన్నత న్యాయస్థానం అన్ని విషయాల్లో సంయమనం పాటిస్తుంది. అదే సంయమనాన్ని శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల నుంచి మేం ఆశిస్తున్నాం..’అని ధర్మాసనం పేర్కొంది. అసెంబ్లీలో విపక్షం నుంచి అంతకంటే ఎక్కువగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని స్పీకర్ తరఫు న్యాయవాది అభిõÙక్ మనుసింఘ్వీ చెప్పారు. అయితే అవన్నీ ఇప్పుడు అప్రస్తుతమని జస్టిస్ గవాయి బదులిచ్చారు. శాసనసభలో ముఖ్యమంత్రి ఫిరాయింపులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను (ట్రాన్స్క్రిప్్ట, టేప్స్) యథాతథంగా తమకు అందజేయాలని సింఘ్వీని జస్టిస్ గవాయి ఆదేశించారు. -
స్పీకర్ చర్యలు తీసుకోకున్నా చేతులు కట్టుకొని చూస్తుండాలా?: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేం (కోర్టులు) చేతులు కట్టుకొని కూర్చోవాలా?’ అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తమ ముందుకు వచ్చే దాకా పార్టీ మారిన ఎమ్మె ల్యేలకు స్పీకర్ ఎందుకు నోటీ సులు జారీ చేయలేదని ప్రశ్నించింది. తొలి నోటీసు ఇచ్చేందుకు స్పీకర్‌కు 11 నెలలు ఎందుకు పట్టిందని నిలదీసింది. ‘ఒకవేళ కేసు మా ముందుకు రాకపోయి ఉండి ఉంటే మీరు (స్పీకర్) నాలుగేళ్లు కాలయాపన చేసేవాళ్లేమో?’ అంటూ చురకలు అంటించింది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)తోపాటు మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాందీలపై దాఖలైన రిట్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎస్ఎల్పీపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించగా స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, అభిషేక్ మనుసింఘ్వీ వాదించారు. స్పీకర్ స్వతంత్రుడు... తొలుత ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘స్పీకర్ స్వతంత్రుడు, కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలదు. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టుకు హైకోర్టులపై నియంత్రణ అధికారం లేదు. స్పీకర్ తన విధానాలకు స్వతంత్రుడు. కాబట్టి కోర్టు ఆదేశాలు ఇవ్వజాలదు’ అని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది రాజ్యాంగ తీర్పులకు వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్‌కు చెప్పలేమా? అంటూ ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘మేం అలా చేయకపోతే రాజ్యాంగ నిబంధనలను నిరాశ పరిచినవారమవుతాం. 2, 3, 4 ఏళ్లు నిర్ణయం తీసుకోకపోయినా ఆర్టికల్ 226 కింద ఆదేశాలు జారీ చేయడానికి కోర్టుకు అధికారం లేదని మీరెలా అంటారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అనర్హత పిటిషన్లను నిర్దిష్ట కాలపరిమితిలో నిర్ణయించాలని తాము స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై రోహత్గీ స్పందిస్తూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే హైకోర్టులో పిటిషనర్లు పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు వేస్తూ వచ్చారని.. కనీసం స్పీకర్‌కు ఫిర్యాదును పరిశీలించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని తెలిపారు. చర్యలకు ఉపక్రమించొచ్చు ముకుల్ రోహత్గీ వాదనలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయి. 11 నెలలుగా స్పీకర్ ఫిరాయింపులపై స్పందించలేదు. మేం జోక్యం చేసుకున్న తర్వాతే కదా వాళ్లకు మీరు నోటీసులు ఇచ్చింది. మేం స్పందించకపోతే ఇలాగే మరో నాలుగేళ్లు వేచి చూసేవాళ్లేమో?, స్పీకర్ జోక్యం చేసుకోకుంటే మేం ఇలాగే చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచనట్లే. రాజ్యాంగ సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన బాధ్యత మాపై ఉంది. ‘సింగిల్ బెంచ్ కేవలం స్పీకర్‌ను నాలుగు వారాల్లో షెడ్యూల్‌ను నిర్ణయించాలని మాత్రమే అడిగింది. అలాంటప్పుడు అందులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదు. కానీ రాజ్యంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలు, అభ్యర్థనలను రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అయినా పాటించనప్పుడు.. వారిపై చర్యలు తీసుకొనే అధికారం ఉంటుంది. మా నిర్ణయాన్ని స్పీకర్‌కు అభ్యర్థన రూపంలో తెలియపరుస్తాం. అప్పటికీ స్పీకర్ స్పందించకపోతే ఆర్టికల్ 142 ప్రకారం మా అధికారాలు ఉపయోగించి చర్యలకు ఉపక్రమిస్తాం. గతంలో మాకున్న అధికారాలతో ఓ స్పీకర్‌ను కోర్టుకు పిలిపించిన విషయాన్ని మర్చిపోవద్దు’ అంటూ ధర్మాసనం గుర్తుచేసింది. ముకుల్ రోహత్గీ వాదనల అనంతరం స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ, ఎమ్మెల్యేల తరఫున రవిశంకర్ జంధ్యాల, ఎమెల్యేల తరఫున గౌరవ్ అగర్వాల్‌లు వాదనలను వినిపించారు. స్పీకర్, స్పీకర్ కార్యదర్శి తరఫున ముగ్గురు వాదనలను వినిపిస్తారా? ఏం చెప్పినా ఒకటే కదా మీ అందరూ చెప్పేది అంటూ జస్టిస్ గవాయి వారిని ఉద్దేశించి వ్యంగ్రా్రస్తాలు సంధించారు. సీఎం రేవంత్‌పై సుప్రీం ఆగ్రహం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘రాష్ట్రంలో ఉపఎన్నికలు రావు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను విచారణ సందర్భంగా బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్పీకర్ సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను అపహస్యం చేసినట్లే’ అని ధర్మాసనం మండిపడింది. అయితే తాను సీఎం తరఫున వాదనలను వినిపించట్లేదని.. అందువల్ల ఆ వ్యాఖ్యల గురించి వివరించలేకపోతున్నానని ముకుల్ రోహత్గీ బదులిచ్చారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ గతంలో అదే సీఎం తరఫున ఒక కేసులో హాజరైన విషయం మర్చిపోవద్దంటూ గుర్తుచేశారు. ‘రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఏదైనా చెప్పినప్పుడు దానికి కొంత పవిత్రత ఉంటుంది, ప్రజలు ఆ మాటలను విశ్వసిస్తారు. మేము కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేయడంలో నెమ్మదిగా ఉండొచ్చు.. కానీ శక్తిలేనివారమైతే కాదు. కాబట్టి ఇకపై ఇటువంటి వ్యాఖ్యలను పునరావృతం చేయొద్దని సీఎంకు చెప్పి హెచ్చరించండి’ అని ధర్మాసనం రోహత్గీకి సూచించింది. అనంతరం ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. గురువారం స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. అనంతరం ఆర్యమా సుందరం రోహత్గీ, సింఘ్వీల వాదనలపై రిప్లై ఇవ్వనున్నారు. ఆర్టికల్ 142 ఏం చెబుతోందంటే... రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు విస్తృతాధికారాలు కల్పిస్తోంది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై అవసరమైన ఉత్తర్వులు జారీ చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ ఉత్తర్వులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అమలు చేసి తీరాల్సిందే. గతంలో ఈ ఆర్టికల్ మేరకు అధికారాలను వినియోగించి భోపాల్ గ్యాస్ లీక్ కేసులో పరిహారం అందించాలని, జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు వైన్ షాపులు ఏర్పాటు చేయవద్దని.. ఇలా పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
మేం చూస్తూ ఊరుకోం!.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలి? తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం.’’ – తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీతో సుప్రీంకోర్టు ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి మీకెంత సమయం కావాలో చెప్పండి. ఇంకా తగినంత సమయం కావాలని అడుగుతున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఆ సమయానికి ఏదైనా గడువు అనేది ఉండాలి కదా? ఇలా సమయాన్ని పెంచుకుంటూ వెళితే ఎలా? రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే.. మేం చూస్తూ ఊరుకోబోం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. కావాల్సిన సమయం ఎంత అనేది చెప్పకపోతే.. తామే గడువు పెడతామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. రెండు పిటిషన్లపై విచారణ.. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రా వ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ), మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీని వాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ రెండు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచా రణ చేపట్టింది. స్పీకర్ తరపున సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గీ వాదనలు విని పించగా.. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యామ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు. ఇంకా ఎంత సమయం కావాలి? తొలుత పిటిషనర్ల తరపు న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఆయన కుమార్తె కోసం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేశారు’’ అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తాము విచారణ జరుపుతున్నది ఎన్నికల ప్రచారంపై కాదని, అనర్హత పిటిషన్‌పై మాత్రమేనని, అందువల్ల పిటిషన్లో ఉన్న అంశాలను ప్రస్తావించాలని సూచించింది. పిటిషన్‌పై స్పందించేందుకు మీకెంత సమయం కావాలని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. తమకు ఇంకా తగినంత సమయం కావాలని రోహత్గీ బదులిచ్చారు. ఈ సమయంలో పిటిషనర్ల తరపు మరో న్యాయవాది ఆర్యామ సుందరం జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటికే పది నెలలు గడిచింది, మొదట్లోనే దీనిపై స్పీకర్ స్పందించి ఉంటే.. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేవారు కాదు’’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హక్కులకు సంబంధించిన అంశం ఇది అయితే తమకు ఇంకా సమయం కావాలని రోహత్గీ ఈ సందర్భంగా అభ్యర్ధించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం’’ అని స్పష్టం చేసింది. సంపత్‌కుమార్, సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ కోరిన ‘తగినంత సమయం’ అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన తీర్పును రోహత్గీ ప్రస్తావించారు. దీనితో ‘తగినంత సమయం’ అంటే ఎంత అని రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. ‘‘తగినంత సమయం అంటే రెండు నెలలు, మూడు నెలలు అని ఏదీ కూడా ఆ తీర్పులో ధర్మాసనం చెప్పలేదని రోహత్గీ బదులిచ్చారు. డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం’ అంటే ఎంత? రోహత్గీ సమాధానంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం (రీజనబుల్ టైం) అంటే ఎంత? పది నెలలు రీజనబుల్ టైం కాదా? అయితే మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పండి? మీరు చెప్పే రీజనబుల్ టైమ్‌కు గడువు అనేది ఉందా, లేదా? పోనీ మీరు రీజనబుల్ టైం చెప్పకపోతే.. మేమే ఓ గడువు విధిస్తాం. ఆ గడువులోపు దానిని పూర్తి చేయండి’’ అని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్‌చంద్రన్‌ల ధర్మాసనం పేర్కొంది. అయితే ‘రీజనబుల్ వ్యక్తికి రీజనబుల్ టైం ఇవ్వాల’ని రోహత్గీ తిరిగి అభ్యర్ధించారు. ‘‘రీజనబుల్ వ్యక్తి దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటీ, అసలు ఎంత సమయం కావాలి?’’ అని ధర్మాసనం ఆగ్రహంగా స్పందించింది. దీనికి బదులు ఇచ్చేందుకు రెండు, మూడు రోజులు సమయం కావాలని రోహత్గీ విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం అంగీకరించి తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. ధర్మాసనానికి అన్ని ఆధారాలు సమర్పించాం: మోహిత్‌రావు తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ తరపు న్యాయవాది పి.మోహిత్‌రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అన్ని ఆధారాలను ధర్మాసనానికి సమర్పించామని చెప్పారు. గతంలోని సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు సూచనలను స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని వివరించామన్నారు. -
ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ వాయిదా
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత..హైకోర్టులో పాల్ వాదనలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం(అక్టోబర్ 25) మరోసారి విచారించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేఏ పాల్ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పాల్ పార్టీఇన్పర్సన్(స్వయంగా)గా కేఏ పాల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 4కు వాయిదా వేసింది.కాగా, తమ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి తుది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు -
TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై రేపే తీర్పు
హైదరాబాద్, సాక్షి: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై రేపు (సోమవారం)తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టులో విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజ్వర్వ్ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ ఫిర్యాదును స్పీకర్ స్వీకరించలేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద్ కోర్టు తలుపు తట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడునెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక.. పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావ్‌లపై అనర్హత వేటు వేయాలని కోరారు. సోమవారం వెలువడే తీర్పుపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. -
స్పీకర్ వేటు వేయకుంటే సుప్రీంకు..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడతామని ఢిల్లీలో పోజులు కొడుతున్న కాంగ్రెస్ పార్టీ .. రాష్ట్రంలో మాత్రం దానిని తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో భేటీ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై గగ్గోలు పెడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేలా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే పదవిని కోల్పోయేలా రాజ్యాంగాన్ని సవరించాలన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్పీకర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు కర్ణాటకలో ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీజేపీ రూ.50 కోట్ల చొప్పున కొనుగోలు చేస్తోందని అక్కడి సీఎం సిద్దరామయ్య ఆరోపించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎన్ని కోట్లు చేతులు మారుతున్నాయో చూడాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు అక్కడి స్పీకర్లు అనర్హత వేటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర స్పీకర్‌ను ప్రభుత్వంతో పాటు కొందరు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకున్నా ఎలాంటి కళంకం రాదంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని, వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణలో దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారకుంటే ప్రాణహాని పేరిట బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను డీఎస్పీ స్థాయి అధికారులు బెదిరించారని చెప్పారు. బీజేపీని వాషింగ్ మెషీన్ పారీ్టగా విమర్శించిన కాంగ్రెస్ తెలంగాణలో అదే పని చేస్తోందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆస్తులు, భవనాలపై ప్రభుత్వ సంస్థలతో దాడులు చేయిస్తోందని చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేల వ్యాపారాలపై విజిలెన్స్ విభాగాన్ని, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారిపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టౌన్ ప్లానింగ్ విభాగాలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. స్పీకర్‌తో భేటీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కోరింది. ఈ మేరకు వేర్వేరుగా లేఖలు అందజేసింది. కేటీఆర్ నేతృత్వంలో 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. కాగా నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రివిలేజ్ నోటీసులు అందజేశారు. -
కీలకదశకు చేరిన ఫిరాయింపుల కేసు
-
‘సుప్రీం’ ఆదేశాలను అపహాస్యం చేయడమే
న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో తెలపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ర్ట ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో ఈ నెల 8వ తేదీలోపు చెప్పాలని సుప్రీం కోర్టు శాసనసభ స్పీకర్‌ను ఆదేశించిందన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయలేదన్నారు. ఇది రాజ్యాంగంపై ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో తెలియజేస్తున్నదన్నారు. అత్యున్నత ధర్మాసనం ఆదేశించినా ప్రభుత్వం స్పందించకుండా అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.