సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్‌ రియాక్షన్‌ | Mlas Defection Case: Ktr Responds To Supreme Court Verdict | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్‌ రియాక్షన్‌

Jul 31 2025 1:22 PM | Updated on Jul 31 2025 3:05 PM

Mlas Defection Case: Ktr Responds To Supreme Court Verdict

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని చెప్పిన రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను. రాహుల్ గాంధీ చెప్పే మాటలకు, నీతులకు కట్టుబడి ఉండాలి. దమ్ముంటే, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పంచ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్‌ విసిరారు.

రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయలేరు. పార్టీ మారిన పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలి. బీఆర్‌ఎస్‌ తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ధన్యవాదాలు.

పార్టీ తరఫున ఎన్నికైన 10 ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా.. కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన లక్షల మంది కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్.. రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమవుతుందన్నారు. ఈ దిశగా పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేటీఆర్.. అంతిమంగా సత్యం ధర్మం గెలిచిందని కేటీఆర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement