హైదరాబాద్, సాక్షి: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై రేపు (సోమవారం)తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టులో విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజ్వర్వ్ చేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ ఫిర్యాదును స్పీకర్ స్వీకరించలేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద్ కోర్టు తలుపు తట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడునెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇక.. పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావ్‌లపై అనర్హత వేటు వేయాలని కోరారు. సోమవారం వెలువడే తీర్పుపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment