దేవుడా ఇందుకిలా చేశావు? | Road Accident At Rampur Medak District | Sakshi
Sakshi News home page

దేవుడా ఇందుకిలా చేశావు?

Mar 15 2026 6:08 AM | Updated on Mar 15 2026 6:08 AM

 Road Accident At Rampur Medak District

రోడ్డు ప్రమాదంలో భర్త, కొడుకు, అల్లుడు దుర్మరణం

 రోదించిన కుటుంబ సభ్యులు

మెదక్‌ జిల్లాలో ఘటన  

మెదక్‌జోన్‌:  కొడుకా నిన్నపుట్టిన రోజు జరు పుకొని.. ఇవాలా చనిపోయావా.. దేవుడా ఇందుకిలా చేశావని మహిళ రోదించింది. రోడ్డు ప్రమాదంలో భర్త, కొడుకు, అల్లుడు చనిపోవడంతో.. ఆ కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరిని కంట తడిపెట్టించింది. హవేళిఘనాపూర్‌ మండలం భూర ్గుపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి అమృత్‌గౌడ్‌(50),యాదమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. మొదటి కూతురుని ఇదే మండలం బొగుడభూపతిపూర్‌ గ్రామానికి చెందిన గోకని సాయాగౌడ్‌(32)కు ఇచ్చి పెళ్లి చేశారు. రెండో కూతురు బానును కొల్చారం మండలం రంగంపేటకు సాయిరాంగౌడ్‌కు ఇచ్చి వివాహం చేశారు. 

మూడో సంతానం రిషివర్ధన్‌గౌడ్‌(14)ను గ్రామంలో చదివించుకుంటూ కల్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండో కూతురు కొడుకు తొట్టెల కార్యక్రమానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో అమృత్‌గౌడ్‌(50) తోపాటు తన కొడుకు రిషివర్ధన్‌గౌడ్‌(14), అల్లుడు సాయాగౌడ్‌ దుర్మరణం చెందారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మార్చురీ వద్ద తన కొడుకు మృతదేహంపై పడి యాదమ్మ రోదించిన తీరు అక్కడ ఉన్నవాళ్లను కంటతడి పెట్టించింది.

 ఈనెల 13న ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఆ మరుసటి రోజున ప్రమాదంలో దుర్మరణం చెందటంతో ఆమె బోరున విలపించింది. ప్రమాదంలో కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన కొడుకు, అల్లుడు ముగ్గురు చనిపోగా రెండు కుంటుబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. మృతుడు సాయాగౌడ్‌కు భార్యతో పాటు 6 ఏళ్లలోపు ముగ్గురు సంతానం ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement