యాద్రాద్రి భువనగిరి జిల్లాలో దారుణం | Yadadri Bhuvanagiri: Mother Attacked Daughter And Son | Sakshi
Sakshi News home page

యాద్రాద్రి భువనగిరి జిల్లాలో దారుణం

Mar 15 2026 8:22 AM | Updated on Mar 15 2026 10:53 AM

Yadadri Bhuvanagiri: Mother Attacked Daughter And Son

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం తొక్కాపురం దారుణం జరిగింది. మానసికంగా బాగాలేక కూతురు, కుమారుడిపై తల్లి కత్తితో దాడి చేసింది. అనంతరం తల్లి నీలిమ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీలిమను ఉప్పల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి దాడిలో కూతురు కృతికరెడ్డి మృతి చెందింది.

బీబీనగర్‌ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్‌రెడ్డితో 15 ఏళ్ల క్రితం వివాహమయ్యింది. నిన్న(శనివారం) సాయంత్రం నీలిమ.. తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement