కొట్టుకున్న డ్వాక్రా మహిళలు | DWCRA Women Clash in Sangareddy | Sakshi
Sakshi News home page

కొట్టుకున్న డ్వాక్రా మహిళలు

Mar 15 2026 6:04 AM | Updated on Mar 15 2026 6:04 AM

DWCRA Women Clash in Sangareddy

జోగిపేట(అందోల్‌): వాయిదాల డబ్బులు బ్యాంకులో చెల్లించలేదని డ్వాక్రా సంఘం మహిళలు కొట్టుకున్నారు. వివరాలు ఇలా... జోగిపేటకు చెందిన లక్ష్మినర్సింహ డ్వాక్రా గ్రూపునకు చెందిన మహిళలు స్థానిక బ్యాంకు నుంచి వనిత వ్యాపార వృత్తి పేర రుణాలు తీసుకున్నారు. సభ్యురాలు మళ్లీశ్వరి కూడా రుణం తీసుకొని ఆమె అత్త వెంకమ్మకు ఇవ్వగా వాడుకొని వాయిదాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు రుణం తీసుకున్న మహిళలకు ఫోన్‌ చేశారు. 

దీంతో సభ్యురాలు అనిత, ఆమె బంధువులు వెంకమ్మను పిలిపించి డబ్బుల విషయమై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వెంకమ్మకు గాయాలయ్యాయి. స్థానికులు 100కు డయల్‌ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గాయపడ్డ వారిని జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేవలం మళ్లీశ్వరి, అనిత మాత్రమే డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నారని మెప్మా అధికారులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement