Anakapalle
-
మామిడీలా..
దిగజారిన ధరలు ● మందగించిన ఎగుమతులు వెలవెల బోతున్న కమీషన్ దుకాణాలు ● నష్టాల్లో రైతులు, వ్యాపారులుపెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు నాకు 50 సెంట్ల మామిడి తోట ఉంది. ఇప్పటి వరకు నాలుగు సార్లు పురుగుమందులు జల్లేందుకు, ఎరువుల కోసం రూ.6వేల పెట్టుబడి పెట్టాను. దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. నాణ్యమైన కాయలు రావడం లేదు. వీటినికొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు.దీంతో ఎంతో కొంత ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. – సఖిరెడ్డి వెంకటరావు, చినరామభద్రపురం నాణ్యమైన కాయలు రాలేదు – తోట సత్తిబాబు, కమీషన్ వ్యాపారి అధికంగా పురుగు మందులు వాడడం వల్లే ఈ ఏడాది మామిడి దిగుబడి, కాయల్లో నాణ్యత తగ్గాయి. పురుగుమందులు, రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల దిగుబడిపై ప్రభావం చూపుతోంది. తోటల్లో ముందుగానే సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ సమస్య ఉండదు. తోటను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి, చెత్తను తొలగించి సకాలంలో దుక్కులు, నీరుఏర్పాటు చేస్తే తెగుళ్లబారినుంచి కాపాడుకోవచ్చు. తోటలకు గాలి ,వెలుతురు కూడా ఉండాలి. రైతులు సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టిసారిస్తే మంచి దిగుబడి,నాణ్యమైన కాయలు లభించే అవకాశం ఉంది. – సాయిప్రియ, ఉద్యానవన శాఖాధికారి, పాయకరావుపేటనక్కపల్లి: ప్రతి ఏటా మామిడీ సీజన్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచే అత్యధికంగా ఎగుమతులు జరిగేవి. వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల ప్రభావం కారణంగా ఈ ఏడాది నాణ్యమైన మామిడి కాయలు లభ్యం కాలేదు. దీని ప్రభావం ఎగుమతులపై పడింది. సీజన్ ప్రారంభంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ఏడాది దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని మామిడి రైతులు ఆందోళన చెందారు. తర్వాత పరిస్థితులు అనుకూలించడంతో కాపు కొంత బాగుంది. అయితే నాణ్యమైన కాయలు లభించలేదని రైతులు చెబుతున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడం, పొగమంచు తదితర కారణాల వల్ల దిగువ భాగంలో పుచ్చు, మచ్చరావడంతో నాణ్యమైన కాయలు లభించలేదు. ఈ ఏడాది దిగుబడి ఉన్నప్పటికీ నాణ్యమైన కాయలు రాకపోవడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, కటక్, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో స్థానికంగా ఆశాజనకంగా దిగుబడి రావడంతో ఉత్తరాంధ్ర ఎగుమతులపై ప్రభావం చూపిందని వ్యాపారులు, రైతులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ నెలాఖరు వరకు మామిడి సీజన్ ఉంటుంది. డిసెంబరు నెలాఖరు నాటికే పూత వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, పొగమంచు, తెగుళ్ల కారణంగా చాలా చోట్ల నాణ్యమైన కాయలు లభించలేదు. 25వేల ఎకరాల్లో సాగు ఉమ్మడి విశాఖ జిల్లాలో 25వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో నాలుగు వేల ఎకరాలు, పాయకరావుపేట మండలంలో మూడు వేల ఎకరాలు, కోటవురట్ల మండలంలో మూడు వేల ఎకరాలు, ఎస్.రాయవరం మండలంలో నాలుగు వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. నాతవరం, కొయ్యూరు, గొలుగొండ, పద్మనాభం, నర్సీపట్నం, యలమంచిలి, మాడుగుల, రాంబిల్లి, కోటపాడు, చోడవరం మండలాల్లో దాదాపు 12వేల ఎకరాల్లో మామిడి పండిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 4నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 10శాతం తగ్గిన దిగుబడి ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రతిఏటా 1.25లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. కానీ ఉద్యానవన శాఖాధికారులు మాత్రం 75 శాతం దిగుబడిని మాత్రమే లెక్కకడతారు.ఈ లెక్కన దాదాపు 80 నుంచి 90వేల టన్నులు దిగుబడి అంచనా వేస్తారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల వల్ల 65శాతం దిగుబడి వస్తుందని అంచన వేశారు. దక్షిణాది నుంచి రాని ఆర్డర్లు తమిళనాడు, బెంగళూరు రాష్ట్రాలతోపాటు చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో లోకల్‌గా పండిన మామిడి కాయలు ఎక్కువగా రావడంతో ఆయా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు ఆర్డర్లు రావడం లేదని వ్యాపారులు, రైతులు తెలిపారు.ఆయా ప్రాంతాలత్లో నాణ్యమైన కాయలు రావడం, ధరకూడా అందుబాటులో ఉండటం వల్ల ఆర్డర్లు రావడం లేదని రైతులు చెబుతున్నారు.ఉత్తరాది రాష్ట్రాలకు ఇక్కడ నుంచి ఎగుమతి ఎక్కువగా జరిగేది. ఈ ఏడాది అదీకూడా తగ్గిపోయిందని చెబుతున్నారు. కలెక్టర్ రకంపై నిరాసక్తత కలెక్టర్ రకం కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడంతో జ్యూస్ ఫ్యాక్టరీలకు తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. కొత్తపల్లి కొబ్బరి రకం ఈ ఏడాది కాపు బాగా ఉందని టోకు పద్ధతిలో కిలో రూ.50లకు విక్రయిస్తున్నామని రైతులు తెలిపారు. బంగినపల్లి రకం విశాఖపట్నంలో బాక్సు (21కిలోలు) రూ.500ల చొప్పున విక్రయించాల్సి వస్తోందన్నారు. 10 ఎకరాలు... రూ.1.50లక్షలు పది ఎకరాల మామిడి తోట నుంచి ఏడాది ఫలసాయం తీసుకునేందుకు రూ.1.50లక్షలు చెల్లించాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.పురుగుల మందు పిచికారీ, ఎరువులు తదితర ఖర్చులు, కాయల కోత ఖర్చు మరో రూ. 50 వేలు అవుతుందన్నారు. ఇంత పెట్టుబడి పెట్టినా దిగుబడి నాణ్యమైన దిగుబడి రావడం లేదంటున్నారు.ఎగుమతికి సిద్ధం చేస్తున్న మామిడి పండ్లు, వ్యాపారంలేక ఖాళీగా ఉన్న కమీషన్ దుకాణంపడిపోయిన ఎగుమతులు ప్రతిఏటా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి సుమారు 40 వేల టన్నుల ఎగుమతులు జరిగేవి. మే రెండోవారంలో ఈ కమీషన్ దుకాణాల నుంచి రోజుకు 500 టన్నుల చొప్పున ఎగుమతులు జరిగేవి. కానీ ఈ సీజన్లో ఇతర రాష్ట్రాలనుంచి వ్యాపారులు రాకపోవడంతో ప్రస్తుతం రోజుకు 100 టన్నులు కూడా ఎగుమతి చేయడం కష్టంగా ఉందని కమీషన్ వ్యాపారులు వాపోతున్నారు.గత ఏడాది మే నెలాఖరు నాటికి 20 వేల టన్నులకు పైగా ఎగుమతులు జరిగాయి. ఈ ఏడాది ఐదు వేల టన్నులు కూడా ఎగుమతి చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. గతంలో ఐషర్ వ్యాన్లు, లారీల్లో ఎగుమతులు చేసేవారమని, ఇప్పుడు బొలేరో వాహనాల్లో మాత్రమే ఎగుమతులు చేస్తున్నామని వారు చెబుతున్నారు. ఒడిశా, కోల్‌కతా ప్రాంతాల్లో తక్కువ ధరకు..గతంలో ఇతర రాష్ట్రాలనుంచి వ్యాపారులు కమీషన్ దుకాణాల వద్దకు వచ్చి తమకు కావాల్సిన సరుకును ఇక్కడ నిర్ణయించిన ధరలకు ఒప్పందం కుదుర్చుకుని కొనుగోలు చేసే వారు.ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఒడిశా, కోల్‌కతా ప్రాంతాల్లో స్థానిక మార్కెట్లోనే మామిడి అధికంగా, కిలో రూ.10లకే లభిస్తుండటంతో వ్యాపారులు కమీషన్ దుకాణాల వద్దకు రావడం లేదు.ఎగుమతి చేయాలంటే రవాణా ఖర్చులు పెట్టుబడులు కలిపి కిలో రూ.25కు విక్రయించాలి.అంత ధరపెట్టి వ్యాపారులు కొనడంలేదు. వ్యాపారులు స్థానిక మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాయకరావుపేట నియోజకవర్గంలో కమీషన్ వ్యాపారులు, రైతులు తుని, అనకాపల్లి, విశాఖపట్నం, అడ్డురోడ్డు, కాకినాడ రాజమండ్రి తదితర ప్రాంతాలకు వాహనాల్లో తరలించి అక్కడే వచ్చినకాడకి విక్రయిస్తున్నారు. పాయకరావుపేట నుంచే అధికంఈ ఏడాది మామిడి వ్యాపారం కుదేలైంది. వాతావరణ ప్రభావం, తెగుళ్ల వల్ల కాయల్లో నాణ్యత తగ్గింది.. ఎగుమతులు మందగించాయి.. దిగుబడి ఉన్నప్పటికీ సరైన ధర లేకపోవడంతో రైతులు, కమీషన్ వ్యాపారులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. టన్ను ధర ఇలా... మామిడి రకం గత ఏడాది ఈ ఏడాది బంగినపల్లి రూ.35వేలు రూ.25వేలు కలెక్టర్ రూ.25 వేల–రూ.30వేలు రూ.7వేలు సువర్ణరేఖ రూ.50వేలు రూ.30వేలు ఇతర రకాలు రూ.15వేలు రూ.5 వేల–రూ.8వేలు -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
యలమంచిలి రూరల్: మునిపాలిటీ పరిధి సోమలింగపాలెం సమీపంలో గోకివాడ ఆనకట్ట వద్ద శారదానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.ఇక్కడ నదిలో తేలుతూ ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ప్రమాదవశాత్తు నదిలో జారిపడిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుని వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహం స్థితిని బట్టి ప్రమాదం జరిగి ఒకరోజు కావచ్చని ఎస్ఐ తెలిపారు.మృతదేహాన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని,మృతుని చిరునామా,ఇతర వివరాల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9440796104 నంబరులో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
వేధింపుల పర్వం
ఏయూలో దళిత పరిశోధకుడిపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ ఈ దారుణ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ ఎస్సీ కమిషన్.. ఏడు రోజుల్లోగా పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని వీసీ రాజశేఖర్‌కు కస్టమ్ నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ వర్సిటీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. కమిషన్ తాజాగా ‘అత్యవసర’ రిమైండర్‌ను పంపింది. ఇంకా నిర్లక్ష్యం వహిస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం కమిషన్‌కు ఉన్న సివిల్ కోర్టు సమానమైన అధికారాలను ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించింది. మద్దిలపాలెం: జాతీయ స్థాయిలో ఘన చరిత కలిగిన విశ్వవిద్యాలయంగా వెలుగొందుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. వర్సిటీ ఉన్నతాధికారుల అనుచిత వైఖరి, మొండితనం కారణంగా జాతీయ స్థాయిలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబాసాహెబ్ డా.బీఆర్ అంబేడ్కర్ పేరుతో నడుస్తున్న ప్రతిష్టాత్మక పీఠం(చైర్)లోనే ఒక దళిత పరిశోధక విద్యార్థికి ఘోర అవమానం ఎదురైంది. ‘జాతీయ ఎస్సీ కమిషన్’ఆదేశాలను సైతం వర్సిటీ ఉన్నతాధికారులు బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖతో పాటు డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను సైతం తుంగలో తొక్కుతూ ఒక మేధావిని మానసికంగా కుంగదీస్తున్న వైనంపై జాతీయ కమిషన్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. ఫెలోషిప్ నిలిపివేత.. వీసీ, డీన్లపై వేధింపుల ఆరోపణలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పీఠం కింద డాక్టరల్ ఫెలోగా అత్యున్నత పరిశోధన చేస్తున్న యాడాల ప్రవీణ్‌కుమార్ ఏడాది కాలంగా నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితుడు జాతీయ ఎస్సీ కమిషన్‌కు సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు ప్రకారం.. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, ఆర్ అండ్ డీ డీన్లు తనను పదేపదే వివక్షకు గురిచేస్తున్నారు. పరిశోధనకు సంబంధించిన ఫెలోషిప్ సొమ్మును ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తూ, ఆర్థికంగా దెబ్బతీస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. కన్నతల్లిని కోల్పోయినా కరగని మానవత్వం తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకునేందుకు వీసీ కార్యాలయానికి పదేపదే తిరిగినా ప్రవీణ్‌ను కనీసం గదిలోకి కూడా రానివ్వలేదు. చివరకు వీసీ కారు ఎక్కి వెళ్తుండగా.. పరుగున వెళ్లి వేడుకున్నా కనీస మానవతా దృక్పథం చూపకపోగా, ‘అంబేడ్కర్ చైర్‌ను మూసేస్తాం, నిన్ను యూనివర్సిటీలో లేకుండా చేస్తాం’అంటూ చిన్నచూపు చూస్తూ మాట్లాడారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కన్నతల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారుల మనసు కరగలేదు. చివరకు వర్సిటీ అధికారులు పెట్టిన మానసిక వేదనను భరిస్తూనే, తల్లికి సరైన వైద్యం అందించలేక ప్రవీణ్‌కుమార్ తన తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. సీపీకి ఎస్సీ కమిషన్ లేఖ మరోవైపు ఈ ఘటనపై అట్రాసిటీల నిరోధక చట్టం కింద తక్షణమే కేసు నమోదు చేసేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ ప్రత్యేకంగా లేఖ రాసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో నగర పోలీసులు రంగంలోకి దిగి, ఈ వేధింపుల ఆరోపణలపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించడంతో ఏయూ వర్గాల్లో వణుకు మొదలైంది. బాబాసాహెబ్ సందేశమే నన్ను బతికించింది: ప్రవీణ్ కుమార్ ‘వర్సిటీ అధికారులు పెట్టిన మానసిక వేధింపులను తట్టుకోలేక, ఒక దశలో ప్రాణాలు తీసుకోవాలని కూడా అనుకున్నాను. కానీ హక్కుల కోసం పోరాడాలి, ఉద్యమించాలి అన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ సందేశం నన్ను బతికించింది. ధైర్యాన్ని కూడగట్టుకుని, అన్ని ఆధారాలతో జాతీయ కమిషన్‌ను ఆశ్రయించాను’అని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. -
ఏఎంఆర్ సిబ్బంది గూండాగిరి
● అక్కిరెడ్డిపాలెంలో దౌర్జన్యం ● ట్రాక్టర్ డ్రైవర్ కుటుంబంపై దాడి తుమ్మపాల: ఏఎంఆర్ సంస్థ సిబ్బంది గ్రామాల్లో హల్చల్ చేస్తూ ప్రజలపై గూండాల్లా దాడులు చేస్తున్నారు. చిన్నాచితక యజమానులను కూడా వదలకుండా దౌర్జన్యంగా సీనరేజ్ వసూలు చేస్తున్నారు. పంటసాగుకు చేపట్టిన మట్టి తవ్వకాలకు సైతం పైకం కట్టాల్సిందేనంటూ రైతులను కూడా భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. జిల్లాలో ఏఎంఆర్ సంస్థ సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయని ప్రజలు వాపోతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. తాజాగా ఆదివారం అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో టోల్‌టాక్స్ పేరుతో ఓట్రాక్టర్ డ్రైవర్ కుటుంబంపై ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు దాడికి తెగబడడం కలకలం రేపింది. వివరాలోకి వెళితే.. అక్కిరెడ్డిపాలేనికి చెందిన ఓవ్యక్తి తన ట్రాక్టర్‌తో సొంత పనుల నిమిత్తం గ్రావెల్ తరలిస్తుండగా ఏఎంఆర్ సంస్థ సిబ్బంది సీనరేజ్ కట్టాలంటూ అడ్డుకున్నారు. రేపు చెల్లిస్తామని చెప్పినప్పటికీ వినకుండా సదరు సంస్థ ప్రతినిధులు దౌర్జన్యానికి దిగారు. ఆయన ఇంటిపై దాడిచేసి, కుటుంబసభ్యురాలైన కర్రికుమారి,ఆమె భర్తతో పాటు అడ్డువచ్చిన మరో గ్రామస్తుడిని తీ వ్రంగా కొట్టారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తు లు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగా రు. పోలీసులకు ఫిర్యాదు దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయా లని బాధితులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సీపీఎం నేతలు హెచ్చరించారు. ఎంపీ అండతోనే అక్రమ వసూళ్లు ఈ ఘటనను సీపీఎం తీవ్రంగా ఖండించింది. సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ మాట్లాడుతూ.. ఏఎంఆర్ అనేది ఒక అనధికార సంస్థ అని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ఎంపీ సి.ఎం.రమేష్ అండదండలతోనే జిల్లాలో అక్రమ వసూళ్లకు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏఎంఆర్ సిబ్బంది ప్రజలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని, తక్షణమే అక్కిరెడ్డి పాలెం వద్ద ఏర్పాటు చేసిన రెండు చెక్‌పోస్టులను తొలగించాలని డిమాండ్ చేశారు. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు పెదకోరాడలో ఉరి వేసుకుని ఓవ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా నారిపల్లి మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన ఎద్దుల హనుమంతురెడ్డి పెదకోరాడ గ్రామానికి చెందిన చీపిరి కృష్ణవేణిని సుమారు ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె ఉంది. పెదకోరాడలో ఈ నెల 12న జరిగిన పండగకు భార్య, తల్లితో కలిసి హనుమంతురెడ్డి వచ్చాడు. భార్యాభర్తల మధ్య శనివారం చిన్నపాటి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తాను ఇంటికి వెళ్తానని చెప్పి హనుమంతురెడ్డి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లాడు. సాయంత్రం పశువుల పాకలో ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.మృతుడు అనంతపురం జిల్లా వాసి -
చెరువులో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు
యలమంచిలి రూరల్: మండలంలోని జంపపాలెం సమీపంలో మొండి గెడ్డ చెరువులో ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పొక్లెయిన్‌తో మట్టి తవ్వకాలు చేపట్టడంపై ఆ గ్రామానికి చెంది దాడి జగ్గ అప్పలనాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు.కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా చెరువులో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నారని ఫిర్యాదుచేయడంతో పాటు అందుకు సంబంధించిన వీడియోలు,ఫొటోలను రెవెన్యూ అధికారులకు పంపించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్టు చేశారు. తహసీల్దార్ వరహాలు స్పందించి అక్కడకు వెళ్లాల్సిందిగా వీఆర్వో నూకరాజు,వీఆర్ఏలు రమాదేవి,అప్పారావులను ఆదేశించారు.వాళ్లు అక్కడకు వెళ్లేసరికే అక్రమ తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులు వాహనాలతో పరారయ్యారు.అయితే అప్పటికే కొంత మట్టిని తరలించుకుపోయారు.తాను ఆరు నెలల క్రితమే మొండి గెడ్డలో పూడిక తీయిస్తానని జలవనరుల శాఖ అధికారులకు రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చానని,కానీ తనకు అనుమతి ఇవ్వకపోగా ఇప్పుడు అక్రమార్కులు దర్జాగా మట్టి తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని అప్పలనాయుడు ప్రశ్నించారు.అదేవిధంగా చెరువు గట్టుపై యూకలిప్టస్ చెట్లను కొందరు నరికి పట్టుకుపోయారన్నారు.అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
పెట్రో ధరల పెంపుపై మండిపాటు
● జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆందోళన ● మునగపాకలో ఆటోలకు తాళ్లు కట్టిలాగుతూ వినూత్నంగా నిరసన మునగపాక: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండల కేంద్రమైన మునగపాకలో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేశారు. స్థానిక మెయిన్ రోడ్డు నుంచి రిక్షా స్టాండ్ వరకు ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వల్ల సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతుందని చెప్పారు. నిత్యావసర సరకులు ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మనరాష్ట్రంలోనే పెట్రోల్,డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు. మరికొద్ది రోజుల్లో మళ్లీ ధరలు పెంచేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఇప్పటికై నా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు,మాజీ ఎంపీపీ దాసరి గౌరీలక్ష్మి అప్పారావు, పార్టీ నేతలు నరాలశెట్టి సూర్యనారాయణ,కోనపల్లి రామ్మోహనరావు, దిమ్మల శివ,పెంటకోట సారధి, మళ్ల రామజగన్నాథం,ద్వారం జానకీరామ్,భీశెట్టి ఈశ్వరరావు,కాండ్రేగుల జగన్,భీశెట్టి ధనశ్రీను,వెంకట్,నరసింగరావు,నరాలశెట్టి తాతారావు,ఆడారి గణేష్ మళ్ల హేమంత్,పల్లె అప్పలనాయుడు పాల్గొన్నారు. -
21 నుంచి జీవీఎంసీ కార్మికుల సమ్మె బాట?
● కమిషనర్‌తో చర్చలు విఫలమైతే ఆందోళన తప్పదు ● కాంట్రాక్ట్ కార్మికుల హెచ్చరిక డాబాగార్డెన్స్(విశాఖ): జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో ఈ నెల 19న జరిగే చర్చలు ఫలవంతం కాకపోతే, 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి హెచ్చరించారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషనర్ గత ఒప్పందాల మినిట్స్‌ను అమలు చేస్తారని ఆశించామని, కానీ కౌన్సిల్లో చేసిన తీర్మానాలను ఇప్పటివరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సరఫరా, వెటర్నరీ, పార్కులు, రిటైర్డ్, కారుణ్య నియామకాలు, లోడర్ల వేతనాల వంటి అంశాలపై ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని మండిపడ్డారు. ఇటీవల ఇన్చార్జి కమిషనర్(కలెక్టర్)తో జరిగిన ఒప్పందాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. చివరకు హెల్త్ అలవెన్స్ బకాయిలు, విలీన కార్మికుల పీఎఫ్ సొమ్ము, సప్లిమెంటరీ కార్మికుల జీతాల బిల్లులు, ఇన్కమ్ ట్యాక్స్ సొమ్ము, జీవో 333 ఏరియర్స్‌ను కూడా చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడర్లు, బదిలీ, కాంట్రాక్ట్, ప్యాకేజీ, డైలీ వేజ్ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, సెలవులు ఇవ్వకుండా జీవీఎంసీ గొప్ప లు చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. నిత్యం చెత్త, దుర్వాసనలో ప్రాణాలకు తెగించి పనిచేసే వారికి కేవలం రూ.450 కూలి ఇచ్చి, బానిసల్లా పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. వీరికి 3 నుంచి 4 నెలలుగా జీతాలు చెల్లించకపోతే కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. విలీన కార్మికులకు మినిమమ్ టైమ్ స్కేల్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి ఏడాది గడుస్తున్నా అమలు చేయలేద న్నారు. మరణించిన, రిటైర్డ్ కార్మికుల పిల్లలకు ముందుగా ఉపాధి కల్పించకుండా, బయటి వ్యక్తులను తీసుకోవడం ద్వారా పోస్టులను అమ్ముకుంటున్నారని కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అవినీతి జరిగాక ఇప్పుడు కమిషనర్ చర్యలకు ఆదేశాలు ఇవ్వడం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. -
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే సహించం
ఆర్టీసీ డిపో గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అనకాపల్లి: ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే సహించబోమని ప్రజారవాణాశాఖ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి జి.వి.రమణ అన్నారు. స్థానిక డిపో గ్యారేజీ గేటువద్ద మధ్యాహ్న భోజన విరామసమయంలో యూనియన్ ఆధ్వర్యంలో ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రేవేటీకరణ చేయడం వల్ల బలహీన వర్గాల ప్రయాణిలకు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఉద్యోగుల పీఆర్సీని ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నపోస్టులను భర్తీచేయాలని, సీ్త్రశక్తి పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని, రద్దీని దృష్టిలో పెట్టుకుని 3 వేల బస్సులను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు ఆర్టీసీని ధారాదత్తం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకురాలు ఒ.ఆర్.కళ, యూనియన్ నాయకులు శ్రీను, కె.ఎం.రావు, వేపాడ శ్రీను, డి.వి.గణేష్, జి.చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి వ్యాపారం ‘పచ్చ’గా...
● చెరువులు గుల్ల చేస్తున్న టీడీపీ నేతలు ● ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు ● పట్టించుకోని అధికారులు కోటవురట్ల : అడ్డదారులు తొక్కేందుకు పచ్చనేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అక్రమాలకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. మనల్ని ఆపేదెవడు అంటూ పేట్రేగిపోతున్నారు. వరాహనది నుంచి ఇసుక, కొండలను తవ్వేసి గ్రావెల్ తరలించుకుపోతుండగా ప్రస్తుతం పలువురి టీడీపీ నేతల దృష్టి మట్టిపై పడింది. చెరువులను జంకూ గొంకూ లేకుండా తవ్వేసి మట్టిని తరలించుకుపోతున్నారు. పెట్టుబడి లేకుండా మట్టి వ్యాపారం రూ.లక్షలు తెచ్చిపెడుతుండడంతో మండలంలోని పలువురి టీడీపీ నేతల కన్ను చెరువులపై పడింది. దీనికి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు తమకేమీ తెలియనట్టు మిన్నకుండిపోవడంతో మట్టిని ఇష్టానుసారం తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు మట్టి రూ.2500లకు విక్రయించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. బి.కె.పల్లి, రామచంద్రపాలెం రెవెన్యూ పరిధిలోని చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చీకటి పడితే చాలు పచ్చనేతలు పొక్లెయిన్, ట్రాక్టర్లతో చెరువులో వాలిపోతున్నారు. అడ్డేవారు లేకపోవడంతో తెల్లవార్లూ మట్టిని తవ్వేసి తరలించుకుపోతున్నారు. ఆదివారం రాత్రి రామచంద్రపాలెంలోని ఎర్ర చెరువులో గ్రామానికి చెందిన టీడీపీ నేత నేరుగా పొక్లెయిన్‌తో మటి తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండడంతో తాజా మాజీ సర్పంచ్ పరదేశమ్మ భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు తమరాన కన్నంనాయుడు అడ్డగించారు. చెరువులో నుంచి మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డుగా ద్విచక్ర వాహనాన్ని నిలిపి అడ్డగించారు. దాంతో టీడీపీ నాయకుడు వాగ్వాదానికి దిగినట్టు కన్నబాబు తెలిపారు. కన్నబాబు మాట్లాడుతూ చెరువులో పొక్లెయిన్‌తో మట్టిని తవ్వి 5 ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం తవ్వగా అడ్డుకున్నామని, తిరిగి ఆదివారం కూడా తవ్వకాలు జరపడంతో అడ్డుకుని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫోన్ చేసినట్టు తెలిపారు. అయితే అధికారులు స్పందించలేదని ఆరోపించారు. -
రెండు లారీలు ఢీ
మాకవరపాలెం: రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. మండలంలోని శెట్టిపాలెం శివారు వెంకన్నపాలెం వద్ద ఆదివారం తెల్లవారుజామున తాళ్లపాలెంవైపు నుంచి రాచపల్లి వద్దగల పయినీర్ కంపెనీకి బొగ్గులోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది. ఈ ప్రమదంలో బొగ్గులారీ డ్రైవర్ గాయపడడంతో వెంటనే విశాఖ తరలించినట్టు స్థానికులు తెలిపారు. బొగ్గు లారీ ముందు భాగం బాగా దెబ్బతినడంతో సాయంత్రం వరకు రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం స్థానిక పోలీసులు దగ్గరుండి లారీని పక్కకు తొలగించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.డ్రైవర్‌కు గాయాలు -
శివపురంలో బంగారు ఆభరణాలు చోరీ
నర్సీపట్నం: పట్టణంలోని శివపురంలో నివాసం ఉంటున్న మద్దికొండ సిరిల్‌పాల్ ఇంట్లో ఈ నెల 15వ తేదీ రాత్రి చోరీ జరిగినట్టు టౌన్ సీఐ ఎస్.కె.గఫూర్ తెలిపారు. సిరిల్‌పాల్ కుటుంబ సభ్యులతో కలిసి వేరే ఊరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బీరువాలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో ఉంచిన 6 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఎవరైనా ఇతర ఊళ్లకు వెళ్లే సమయంలో తమ విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలని, లేదా తమ వెంట తీసుకువెళ్లాలని సీఐ సూచించారు. -
‘రాపెప్’ శిక్షణలో రాటు దేలుతున్న అగ్రి విద్యార్థులు
● ఉపయుక్తంగా గ్రామీణ వ్యవసాయ పని అనుభవ (రాపెప్) కార్యక్రమం ● వ్యవసాయ విద్యార్థులకు గ్రామాల్లో ప్రత్యేక శిక్షణఅనకాపల్లి: అధునిక యుగంలో అగ్రికల్చర్ డిగ్రీకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. శ్రీకాకుళం జిల్లా నైరా అగ్రికల్చర్ నాలుగో ఏడాదికి కళాశాల 38 మంది విద్యార్థులు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిధిలో ఫిల్డ్ విజిట్‌లో భాగంగా శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో అనకాపల్లి, కశింకోట, మునగపాక, అచ్యుతాపురం మండలాల్లో 38 మంది విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించి ఒక విభాగంలో 18 మంది, మరో విభాగంలో 20 విద్యార్థులుగా ఒక్కో బృందానికి రైతులను అప్పగించి, గ్రామాల్లో రైతులు పండిస్తున్న పంటలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అధికారిగా ఆర్‌ఏఆర్‌ఎస్‌లో వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త దాడి ఉమామహేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఒక హోస్ట్ రైతును కేటాయించి, ఆయా రైతుల కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ భూముల వివరాలు, పంటల సాగు విధానాలు తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. విద్యార్థులు గ్రామాల్లో రైతులతో ప్రత్యక్షంగా మమేకమై, గ్రామ సచివాలయం ద్వారా గ్రామానికి సంబంధించిన వివిధ వివరాలను సేకరిస్తున్నారు. రైతుల పొలాలను సందర్శించి పంటలలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి తగిన శాసీ్త్రయ సూచనలు అందిస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేకంగా వ్యవసాయ సమాచార కేంద్రం ఏర్పాటు చేసి, పంటలలో వచ్చే చీడపీడలు, వ్యాధులు, వాటి నివారణ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ, సాంకేతికతలు, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు. గ్రామ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు ఉపయోగకరమైన వ్యవసాయ సమాచారాన్ని నిరంతరం చేరవేసే పనిలో అగ్రికల్చర్ విద్యార్థులు చేస్తున్నారు. రాపెప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మట్టి నమూనాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించి, మట్టి పరీక్షల ప్రాముఖ్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులతో సమూహ చర్చలు నిర్వహించి, పొలాల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. రైతులను నూతన సాంకేతికతలు, ఆధునిక వ్యవసాయ ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తున్నారు. గ్రామ ప్రజల అభిప్రాయాలు, అవసరాలు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పరిస్థితులపై సమగ్ర అవగాహన విద్యార్థులతో పాటు రైతులు పొందుతున్నారు. నూతన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కొత్త వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు పొలాల్లో మెథడ్ డిమానిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను ప్రదర్శిస్తూ మెరుగైన దిగుబడులు సాధించే మార్గాలను తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రైతులు అనుసరిస్తున్న పద్ధతులు, శాసీ్త్రయ సిఫార్సుల మధ్య ఉన్న తేడాలను గుర్తిస్తూ ‘గ్యాప్ అనాలిసిస్’నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధి, పంటలలో మెరుగైన దిగుబడుల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) రూపొందించి అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు గ్రామీణ వ్యవసాయంపై ప్రత్యక్ష అనుభవం లభించడంతో పాటు రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెరుగుతోంది. -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. ఆలయ ఏఈవో పిల్లా శ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం శ్రీ వరావరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. -
రాజ్యాంగ పదవి నుంచి డిప్యూటీ స్పీకర్‌ను తొలగించాలి
డాబాగార్డెన్స్ (విశాఖ): డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దళితులు, దళిత క్రైస్తవులపై చేస్తున్న వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం అండదండలున్నాయని మాల మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి, రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తున్న ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శనివారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం చింతాడ ఆనంద్ కేసులో దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీ స్టేటస్ రద్దు అవుతుందని తీర్పు ఇచ్చిందని, అయితే ఆ తీర్పులో ఎస్టీ, బీసీ, ఓసీ కులాలకు చెందిన క్రైస్తవులపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. ఈ తీర్పు మిగిలిన వర్గాల క్రైస్తవులకు వర్తించదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇటీవల దళితులు, దళిత క్రైస్తవుల గురించి చాలా హీనంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో దళితులందరూ క్రైస్తవులని సంబోధించి మాట్లాడడం దారుణమన్నారు. హిందూ మతంలో ఉన్న హిందూ దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సరికాదన్నారు. డిప్యూటీ స్పీకర్ రూ.వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసినట్టు వార్తలు వస్తున్నాయని, ఒక ఉన్నతాధికారితో ఆయనకున్న వ్యక్తిగత విభేదాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో ఉన్న దళితులకు ఆపాదించడం మంచిది కాదని హెచ్చరించారు. అలాంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్‌గా ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని, చంద్రబాబు సర్కార్ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజుకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫ్లెక్సీ తన దారికి అడ్డుగా లేకపోయినప్పటికీ, కార్యకర్తల మెప్పుకోసం రఘురామ తన చేతులతో ఫ్లెక్సీని చింపి వేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు. -
‘డిఫెన్స్’ డిప్లొమా రెండో బ్యాచ్ ప్రారంభం
తగరపువలస: రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేలా కృషి చేయాలని హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ గంటి వెంకటేశ్వర్లు కోరారు. శనివారం ఆయన ఆనందపురం మండలం గంభీరంలోని ఐఐఎంవీలో డిఫెన్స్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డిప్లమో రెండో బ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి బ్యాచ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఐఐఎంవీ సిబ్బందిని అభినందించారు. సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ బృందాలను ఉత్తేజపరుస్తూ, మార్పు వైపు నడిపించే బహుముఖ ప్రజ్ఞాశాలులే నిజమైన నాయకులన్నారు. చిన్నపాటి సానుకూల మార్పులైనా వ్యవస్థలపై పెద్ద ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఐఐఎంవీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ ప్రోగ్రామ్ పరిశ్రమ–అకాడెమియా సమన్వయంతో, కేస్ స్టడీస్ ఆధారిత లెర్నింగ్ విధానంలో రక్షణ రంగ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ బ్యాచ్‌లో ఆరు డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, ఎన్ఏడీ, ప్రైవేట్ డిఫెన్స్ సంస్థలకు చెందిన అధికారులు ఉన్నారని చెప్పారు. అడ్మిషన్స్ చైర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ నాయర్ మాట్లాడుతూ.. ఈ బ్యాచ్‌లో అభ్యర్థుల సగటు వయసు 38 ఏళ్లు కాగా, వారికి 12 ఏళ్లకు పైగా పని అనుభవం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ చైర్ ప్రొఫెసర్ బి.శ్రీరంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
‘శృంగవరం పంచాయతీకి అవార్డు గర్వకారణం’
నాతవరం : మండలంలో శృంగవరం గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు రావడం జిల్లాకే గర్వకారణమని ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అన్నారు.ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. శృంగవరం గ్రామ పంచాయతీ గుడ్ గవర్నెన్స్ విభాగంగా జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కిన విషయం తెలిసిందేన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కేంద్ర మంత్రి రామ్మెహన్‌నాయుడు అధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి సందీప్, శృంగవరం పంచాయతీ కార్యదర్శి వి. శ్రీనివాస్‌రావుకు ఉత్తమ అవార్డు అందుకోవడం సంతోషమన్నారు. అవార్డును అందుకున్న శ్రీనివాస్‌కు ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో మూర్తిబాబుతో పాటు పంచాయతీ కార్యదర్శులు, మండల శాఖ సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. -
ఫార్వర్డ్ మెసేజ్‌పై విచారణ
పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్‌తో మాట్లాడుతున్న బొడ్డేడ ప్రసాద్, మలసాల భరత్‌కుమార్, జానకీరామరాజు, జాజుల రమేష్ అనకాపల్లి: వివిధ గ్రూపుల్లో వచ్చిన ‘కొంప ముంచుతున్న కొణతాల అల్లుడి తీరు’ పోస్ట్‌ను ఫార్వర్డ్ చేసినందుకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మండల కార్యదర్శి బాతు సాయికిరణ్‌పై టీడీపీ నాయకుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు సాయికిరణ్‌ను పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్ శనివారం పిలిపించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్, పార్టీ శ్రేణులు పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ నిధులు కేంద్రమే భరించాలి
కూలీల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు నర్సీపట్నం: ఉపాధి హామీ పథకానికి నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు కోరారు. నర్సీపట్నం మండలం వేములపూడిలో ఉపాధి పనుల వద్ద కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ నిర్వహణకు 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించాలన్నారు. ముఖ హాజరు సడలించి, వేసవి అలవెన్సుతోపాటు ఐదు కిలో మీటర్ల దాటితే ప్రయాణం చార్జీలు, పనిముట్లు, టెంట్లు సౌకర్యాలు కల్పించాలన్నారు. భవిష్యత్తులో ఉపాధి పని జాబ్‌కార్డుకు 200 రోజులు పని కల్పించాలన్నారు. రోజుకు రూ.600 గిట్టుబాటు కూలి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కె.ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నక్కపల్లి : జాతీయ రహదారిపై నక్కపల్లి వారపు సంత సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. సీఐ జె.మురళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నక్కపల్లికి చెందిన శీకోలు రాజు(22) తన స్నేహితులు గొడుగు ధామస్, బద్దా పండుతో కలసి అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి మోటారు సైకిల్‌పై వస్తుండగా వారపు సంత సమీపంలో ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఆగడంతో వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో శీకోలు రాజు తలకు బలమైన గాయాలు తగిలి ఘటనా స్థలంలోనే మరణించాడు. మిగిలిన ఇద్దరికి గాయాలు కాగా వారిని నక్కపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భూములు గుంజుకుని..పరిహారానికి కొర్రీలా?
ఆనందపురం: అభివృద్ధి పేరుతో నాడు విలువైన భూములను గుంజుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. నేడు ఆ బాధితులకు నష్టపరిహారం అందించే విషయంలో కొర్రీలతో వేధింపులకు గురిచేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులకు మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించే విషయంలో చుక్కలు చూపిస్తున్నారు. డీఆర్డీఏ స్లిప్పులు ఉన్న 520 మంది రైతులకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి.. ఇపుడు తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేయడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిబంధకంగా మారిన తనిఖీలు తహసిల్దార్ ఎస్.శ్రీనుబాబు ఆదేశాల మేరకు శనివారం 15 మంది గ్రామ రెవెన్యూ అధికారుల బృందం గ్రామంలో ముమ్మరంగా అర్హుల వెరిఫికేషన్ పేరిట తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల తీరుపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రతి ఇంటికీ వెళుతూ, గతంలో ప్రభుత్వం ఇచ్చిన డీఆర్డీఏ స్లిప్ నంబర్లతో సరిపెట్టకుండా.. ఆధార్ నంబర్, బియ్యం కార్డు నంబర్, ఇంటి పన్ను రశీదు నంబర్ల కోసం ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాకుండా, గతంలో వీరికి ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకం ఏమైనా వచ్చిందా లేదా అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. హక్కుగా రావాల్సిన పరిహారానికి అర్హతలా? గూగుల్ డేటా సెంటర్ కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారు. దానికి ప్రతిఫలంగా నేరుగా నష్టపరిహారం ఇవ్వాల్సింది పోయి, ఇప్పుడు కొత్తగా ఇన్ని కొర్రీలు, తనిఖీలు చేయడాన్ని రైతులు నిలదీస్తున్నారు. గతంలో ఇళ్లు వచ్చి ఉంటే ఇప్పుడు నష్టపరిహారం కింద ఇచ్చే ఇళ్ల స్థలాన్ని నిరాకరిస్తారా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ బేషరతుగా పరిహారం ఇవ్వాలే తప్ప, ఇలా సంక్షేమ పథకాల తరహాలో వడపోత కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడుతున్నారు. లబ్ధిదారుల్లో అయోమయం మరోవైపు, గ్రామంలో ఇంకా కొంతమంది లబ్ధిదారులైన రైతుల పేర్లను అధికారులు వెరిఫై చేయాల్సి ఉంది. ఈ ముసుగులో ఎక్కడ తమ పేర్లను జాబితా నుంచి తొలగిస్తారోననే భయం మిగిలిపోయిన రైతుల్లో నెలకొంది. కాలయాపన చేయకుండా తమ పేర్లను కూడా తనిఖీ చేసి, ఈ అసంబద్ధ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, తమకు దక్కాల్సిన న్యాయమైన నష్టపరిహారాన్ని వెంటనే అందజేయాలని బాధితులు రెవెన్యూ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. -
రబీ రైతుకు వేదన
రబీ ధాన్యం కొనుగోలు లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. వేలాది మంది రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన రబీ వరి పంట కోత దశకు వచ్చింది. రబీ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో రైతులు టన్ను వద్ద రూ, 6 వేల వరకు ధర నష్టపోతున్నారు. బుచ్చెయ్యపేట : వడ్డాది కస్పా పొలాల్లో ప్రతి ఏటా ఖరీఫ్‌తో పాటు రబీలోను 1,600 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తారు. బుచ్చెయ్యపేట, దిబ్బిడి, చిన అప్పనపాలెం, ఎల్బీ పురం, వడ్డాది, బంగారుమెట్ట, కొత్తూరు తదితర గ్రామాల రైతులకు వడ్డాది కస్పా పొలాల్లో భూములున్నాయి. పెద్దేరు రిజర్వేయర్ ద్వారా కస్పా పొలాలకు నీటి హక్కు ఉండడంతో వేలాది మంది రైతులు భూమిని నమ్ముకుని వరి పంటను సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ, 20 నుంచి 25 వేలు వరకు పెట్టుబడులు పెడుతున్నారు. కష్టపడి పండించిన పంటను కోసి ధాన్యం అమ్ముదామంటే సర్కార్ అనుమతి లేదు. వారం, పది రోజులుగా కోసిన పంటను పొలాల్లోనే ఆరబెట్టిన రబీ ధాన్యం కొనుగోలుకు అనుమతులు లేవు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకం టన్నుకు రూ, 24,610 ఉండగా, సాధారణ రకం ధర టన్ను రూ.24,410గా ఉంది. ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలుకు అనుమతి రాక పలువురు రైతులు పొలాల్లో ఉన్న ధాన్యం పగలు, రాత్రుళ్లు కాపలా కాయలేక ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులకు టన్ను ధాన్యం రూ.18వేలు నుంచి రూ.19వేలు వేలకు తెగ నమ్ముకుంటున్నారు. టన్ను వద్ద 30 నుంచి 50 కేజీల ధాన్యం వ్యాపారులు లెస్ చేసి (తగ్గించి) రైతులను మోసగిస్తున్నారు. దీనివల్ల ఒక్కో రైతు టన్ను వద్ద రూ, 6,610 వరకు నష్టపోతున్నారు. నెరవేరని కూటమి నేతల హామీ రబీ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతించిందని కూటమి నేతలు వారం రోజుల కిందటే ప్రకటించారు. వడ్డాది కోఆపరేటివ్ ద్వారా కస్పా పొలాల్లో ఉన్న రబీ ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని ప్రకటనలు చేసినా నేటికీ ధాన్యం కొనుగోలుకు ఎటువంటి అనుమతి రాలేదు. ధాన్యం కొనుగోలులో కూటమి నేతల మధ్య ఉన్న వర్గ పోరు వల్ల అనుమతులు రావడం ఆలస్యం అవుతుందని పలువురు రైతులు వాపోతున్నారు. రబీ ధాన్యంకు అనుమతి తీసుకొచ్చామని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, జనసేన చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి పి.వి.ఎస్.ఎన్ రాజు, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఈర్లె శ్రీరామూర్తి, వడ్డాది కోఆపరేటివ్ అధ్యక్షుడు దొండా నరేష్ ప్రకటించారు. దీంతో తాతయ్యబాబుకు వ్యతిరేక వర్గమైన ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు వర్గీయులు రబీ ధాన్యం కొనుగోలు అనుమతికి ముందుకు రాకపోవడంతోనే అధికారులు కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమాయక రైతుల పట్ల కూటమి నేతలు కుటిల రాజకీయాలు మానుకుని తక్షణం ప్రభుత్వం నుంచి రబీ వరి ధాన్యం కొనుగోలుకు అనుమతులు తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. కోసిన ధాన్యం పొలాల్లోనే ఆరబెట్టిన రైతుధాన్యం కొనుగోలుకు ఆటంకాలు కూటమి నేతలు హామీ ఇచ్చినా రాని అనుమతి రైతుల గోడు పట్టించుకోని ఎమ్మెల్యే, అధికారులు దళారులకు వచ్చిన ధరకు తెగ నమ్ముకుంటున్న రైతులు టన్ను వద్ద రూ.6 వేలు వరకు నష్టపోతున్న అన్నదాతలుపంట కోసి ఐదు రోజులుగా ఎదురు చూపులు రబీ వరి పంట కోసి ఐదు రోజులైంది. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఇంకా రాలేదని అధికారులు చెబుతున్నారు. పండించిన పొలంలోనే ధాన్యం ఆరబెట్టి ఐదు రోజులుగా రాత్రి, పగలు ఎదురు చూస్తున్నాను. అసలే ఎండా కాలం వడదెబ్బకు గురౌతున్నాను. నూర్చిన ధాన్యం పోగు వేసి ప్రభుత్వం కొంటుందని ఎదురు చూస్తున్నాను. ప్రైవేటు వ్యాపారులు వచ్చి టన్ను రూ.18 వేలకు ఇస్తావా అంటూ బేరాలు ఆడుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలి. –గాడి రమణ, బుచ్చెయ్యపేట రైతు దళారుల చేతులో మోసపోతున్నాం రబీ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వ అనుమతి రాక దళారుల చేతుల్లో మోసపోతున్నాం. మద్దతు ధర 24 వేలకుపైగా ఉండగా ప్రైవేటు వ్యాపారులు మాత్రం రూ.18 వేలకు కొంటున్నారు. దీనివల్ల టన్ను వద్ద రూ.6 వేలు వరకు నష్టపోతున్నాం. రెండు ఎకరాల్లో వరి వేయగా మూడు టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుంది. సుమారు రూ.20 వేలు వరకు నష్టపోతున్నాం. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలి. –దాడి మోదినాయుడు, బంగారుమెట్ట రైతు -
ఆర్డీవో బాధ్యతల నుంచి తప్పించండి
మహారాణిపేట: విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి(ఇన్చార్జి)గా ఉన్న శేష శైలజ తనను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆమె కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు లేఖ సమర్పించినట్లు తెలిసింది. ప్రస్తుతం కలెక్టరేట్లో ఉన్న కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న శేష శైలజను, అప్పటి కలెక్టర్ ఇన్చార్జి ఆర్డీవోగా నియమించారు. అప్పటి నుంచి ఆమె ఆర్డీవోగా, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్‌గా రెండు పదవుల్లోనూ కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్ 21న అప్పటి డీఆర్వో బి.హెచ్.భవానీ శంకర్, ఆర్డీవో పి.శ్రీలేఖలను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో అప్పటి హెచ్‌పీసీఎల్ భూసేకరణ అధికారిగా పనిచేస్తున్న సనపల సుధాసాగర్‌ను ఇన్చార్జి ఆర్డీవోగా నియమించారు. కొంతకాలం తర్వాత సుధాసాగర్ విజయనగరం ఆర్డీవోగా బదిలీ కావడంతో, ఆయన అప్పటికప్పుడు రిలీవ్ అయ్యారు. ఆ సమయంలో కలెక్టరేట్ కేఆర్సీలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న శేష శైలజకు ఇన్చార్జి ఆర్డీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే విశాఖ ఆర్డీవో పోస్టుకు ప్రోటోకాల్ బాధ్యతలు ఎక్కువగా ఉండడంతో, తాను ఈ అదనపు బాధ్యతలను నిర్వహించలేనని శేష శైలజ కలెక్టర్‌కు లేఖ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై ప్రస్తుతం కలెక్టరేట్లో జోరుగా చర్చ సాగుతోంది. తదుపరి ఆర్డీవో బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై అధికారులు ఆలోచనలో పడ్డారు. విశాఖ కలెక్టర్‌కు ఇన్చార్జి ఆర్డీవో శేష శైలజ లేఖ? -
అతిగథిలేని గృహాలు
చోడవరం: ఒక నాడు బ్రిటిషు దొరతోపాటు నేటి మన పాలకుల వరకు అతిథులెందరికో విశ్రాంతినిచ్చిన ప్రభుత్వ అతిథి గృహాలు నేడు ఆలనాపాలనకు నోచుకోక శిథిలావస్థకు చేరుకున్నాయి. మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, వివిధ రంగాల ప్రముఖులు సైతం నాడు ఉపయోగించుకొని నేడు వారే పట్టించుకోకపోవడంతో నిరాదరణకు గురవుతున్నాయి. బ్రిటిషు దొరలు, విజయనగరం సామంతు రాజులు సైతం ఇక్కడ అతిథి గృహాల్లో విశ్రాంతి తీసుకొని పన్నులు వసూలు చేసేవారు. అంతటి వందేళ్ల చరిత్ర ఉన్న వసతి గృహాలు అక్కరకురాకుండా పోతున్నాయి. వీటిలో బ్రిటీషు కాలం, జమిందారీ కాలం నాటి అతిథి గృహాలు కొన్నయితే, జలాశయాల పర్యవేక్షణ కోసం నిర్మించిన గెస్ట్‌హౌస్‌లు మరికొన్ని ఉన్నాయి. చోడవరం కేంద్రంగా నాడు బ్రిటిషు పాలకులు పన్నుల వసూలు చేసేందుకు, తెల్లదొరలు విశ్రాంతి తీసుకునేందుకు ఇక్కడ హార్డింజ్ గెస్ట్ హౌస్‌ను నిర్మించారు. అప్పట్లో ఈ గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవడం చాలా గొప్పగా చెప్పుకునేవారు. సుమారు వందేళ్లకు పైబడి అతిథులకు విశ్రాంతి ఇచ్చిన ఈ భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. దేవాదాయశాఖ ఆధీనంలో ఉండటంతో ప్రస్తుతం ఉన్న నమూనాలోనే కొత్త భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు రూ.కోటి వరకు ఖర్చవుతుందని అంచనా వేయగా, అది ప్రతిపాదనల దశలోనే ఉండిపోయింది. నిరుపయోగంగా కోనాం గెస్ట్ హౌస్... చోడవరం పేరు చెబితే అందరీకి గుర్తుకొచ్చే మరో అతిథి గృహం కోనాం గెస్ట్ హౌస్. చీడికాడ మండలం కోనాం కొండల్లో రిజర్వాయరు నిర్మించేటప్పుడు ఈ గెస్ట్ హౌస్‌ను కట్టారు. నిర్మాణ పనులు పర్యవేక్షించేందుకు ఈ కోనాం గెస్ట్ హౌస్‌ను చోడవరంలో నిర్మించారు. రెండు ఏసీ గదులతోపాటు రెండు సూట్లు, పలు రూమ్‌లు, డైనింగ్ రూమ్‌తోపాటు ముఖ్యమంత్రులు, మంత్రుల కాన్వాయ్‌ల రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక రోడ్డుతో కూడిన ప్రహరీ, చుట్టూ పచ్చని మొక్కలతో ఎంతో అందంగా ఈ గెస్ట్‌హౌస్‌ను నిర్మించారు. చాలా కాలం పాటు వీవీఐపీలకు అతిథి గృహంగా ఉండేది. ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు విశ్రాంతికి ఈ అతిథి గృహాన్ని వినియోగించేవారు. అయితే ఎనిమిదేళ్లుగా కోనాం గెస్ట్ హౌస్ నిరుపయోగంగా మారింది. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ వారు విద్యుత్ బిల్లులు, నిర్వహణ సరిగ్గా చేయడం పోవడంతో నిరుపయోగంగా మారింది. మొదట్లో విద్యుత్ సరఫరా నిలిపివేయగా తర్వాత నిర్వహణ లోపంతో అంతా బూజులు పట్టింది. ఆవరణంలో ఉన్న చెట్లు భవనంపై కూలిపోవడంతో కొంతమేర దెబ్బతింది. దీనితో ఈ గెస్ట్‌హౌస్‌కు పూర్తిగా తాళాలు వేసేశారు. గజపతినగరంలో బంగ్లా ఆక్రమణ రాజుల కాలంలో జమిందారులు చోడవరానికి నాలుగు కిలోమీటర్ల సమీపంలో గజపతినగరంలో ఒక భవనాన్ని నిర్మించారు. విజయనగరం సామ్రాజ్యానికి చెందిన ముఖ్యులు ఎవరైనా గుర్రాలపై వస్తే వారితోపాటు గుర్రాలకు కూడా విశ్రాంతి కల్పించేందుకు గుర్రాల శాలతో కూడిన అతిథిగృహాన్ని అప్పట్లో నిర్మించారు. క్రమేణా ఆర్అండ్బీ బంగ్లాగా మారి ఇప్పుడు పూర్తిగా శిథిలమైపోయి ఆక్రమణలకు గురైంది. రెండు నియోజకవర్గాల్లో బసకు ఇబ్బందులు మాడుగుల ఆర్అండ్బీ బంగ్లా, రైవాడ గెస్ట్ హౌస్‌లు కూడా అతిథులకు ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రభుత్వ అతిథి గృహాలన్నీ శిథిలావస్థలో ఉండటంతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పర్యటించే ప్రముఖులకు ఇప్పుడు ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క అతిథి గృహం కూడా లేకుండా పోయింది. ఎంతో గొప్ప గెస్ట్‌హౌస్‌లు ఉన్నప్పటికీ అవి శిథిలమై పోవడంతో భవనాలే కరువయ్యాయి. సుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌసే గతి గోవాడ సుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌసే ఇప్పుడు అందరికీ ఉన్న ఏకై క అతిథి గృహంగా మారింది. అది కూడా రెండేళ్లుగా క్రషింగ్ చేయకపోవడంతో ఫ్యాక్టరీని మూసివేశారు. దీనితో మంత్రులు సైతం సొంత పార్టీ కార్యకర్తల ఇళ్లు, వారి సొంత గెస్ట్‌హౌస్‌ల్లో ఉండి వెళుతున్నారు. ఇప్పటికై నా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆర్అండ్బీ, ఇరిగేషన్, దేవాదాయ శాఖలు చొరవ తీసుకొని అతిథి గృహాల మరమ్మతులు చేయడం లేదా వాటి స్థానే కొత్తవి నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సర్వసిద్ధి పీహెచ్సీ సిబ్బంది విధులకు డుమ్మా !
ఎస్.రాయవరం : సర్వసిద్ధి పీహెచ్సీ వైద్యాధికారితో పాటు, మరో ముగ్గురు సిబ్బంది శనివారం విధులకు హాజరు కాలేదు. వారు కనీసం సెలవు చీటీ అయినా పెట్టకుండా విధులకు గైర్హాజరైనట్టు తెలుస్తోంది. ఎంపీహెచ్ టి.నాగేశ్వరరావు ఆస్పత్రికి వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు. కాగా నలుగురు సిబ్బంది ఒకే రోజు రాకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఉన్న సిబ్బంది తమకు మిగిలిన సిబ్బంది సమాచారం తెలియదని బదులిచ్చారు. వైద్యులు ఫోన్ సమాచారానికి కూడా అందుబాటులో లేరని రోగులు చెప్పారు. ప్రభుత్వం పీహెచ్‌సీకి భవనానికి కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసి సుమారు 18 నుంచి 30 మంది సిబ్బందిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా కనీసం గ్రామాల్లో వెల్ నెస్ కేంద్రాల్లో అందే సేవలు కూడా పీహెచ్సీలో అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది విధులకు రాని రోజు హాజరు పట్టీలో ఖాళీ ఉంచి, వచ్చిన రోజున ఆయా ఖాళీల్లోనూ సంతకాలు పెట్టి ఉన్నతాధికారుల కళ్లు కప్పుతున్నారు. సిబ్బంది పనితీరుపై స్థానిక ప్రజా ప్రతినిధులు పదే పదే ఫిర్యాదు చేసినా వారిలో మార్పు రాలేదు. ఇకనైనా జిల్లా వైద్యాధికారులు పీహెచ్సీ సిబ్బంది పని తీరుపై తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వైద్యాధికారి ఎన్.వాసంతి, పీహెచ్ఎన్, ఎంఆర్ సఖి, కంటి వైద్యులు కె.లక్ష్మి, హెచ్వీ వై. సూర్యకుమారి శనివారం సెలవు పెట్టకుండా విధులకు హాజరు కాలేదు. దీనిపై స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
పరిసరాల పరిశుభ్రతతో డెంగ్యూ దూరం
పట్టణంలో డెంగ్యూపై అవగాహన ర్యాలీ తుమ్మపాల : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ బారిన పడకుండా ఉండగలమని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎం.హైమావతి అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినం పురస్కరించుకొని పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద మానవహారం చేసి అవగాహన ర్యాలీ చేపట్టారు. మూడు పద్ధతులు పాటించండి..డెంగ్యూను జయించండి.. ‘పరిశీలించండి.. శుభ్రం చేయండి.. మూతలు పెట్టండి’ అనే నినాదంతో అవగాహన కల్పించారు. జిల్లా మలేరియా అధికారి వరహాలు దొర మాట్లాడుతూ ప్రభుత్వం డెంగ్యూ నివారణకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. -
ఘరానా దొంగల ముఠా గుట్టురట్టు
అనకాపల్లి : వివిధ జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్ జిల్లా ఘరానా దొంగల ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. మునగపాక మండలంలో జరిగిన ఒకే ఒక్క దొంగతనం కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసే క్రమంలో ముగ్గురు మోస్ట్ వాంటెడ్ దొంగలను శనివారం అరెస్ట్ చేసినట్టు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) తుహిన్ సిన్హా వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 60 లక్షల విలువైన 450 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. శనివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. సినీ ఫక్కీలో ఛేజింగ్... ఈ నెల 2వ తేదీన మునగపాక మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన ఒక దొంగతనంపై స్థానిక ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తుండగా పోలీసులకు సాంకేతిక ఆధారాలతో పాటు కీలక సమాచారం లభించింది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో మునగపాక ఎస్ఐ పి. ప్రసాదరావుకు నిందితుల కదలికలపై సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి అనకాపల్లి బైపాస్ రోడ్డు లకీ్ష్పురం బస్ స్టాప్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే మోటార్ సైకిల్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి భయపడి బైక్ తిప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వారిని సినీ ఫక్కీలో వెంబడించి చాకచక్యంగా పట్టుకున్నారు. పాత నేరస్థులే.. పోలీసుల ప్రాథమిక విచారణలో పట్టుబడ్డ ముగ్గురూ పాత నేరస్థులని, వీరిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో అనకాపల్లి జిల్లా ఓ.కోటపాడు మండలం పాచిలవానిపాలెం గ్రామానికి చెందిన రొంగలి ప్రకాష్ (24) మొదటి నిందితుడు (ఏ1) కాగా, విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన ఆటో డ్రైవర్ ఇర్ల వినయ్ కుమార్ (28) రెండో నిందితుడిగా (ఏ2), మళ్లీ పాచిలవానిపాలెం గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ మూడో నిందితుడిగా (ఏ3) ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు పోలీసులు తమదైన శైలిలో లోతుగా విచారించడంతో నిందితులు మునగపాకలోనే కాకుండా పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా వరుస దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. యలమంచిలి టౌన్, ఎలమంచిలి రూరల్, రాంబిల్లి, అనకాపల్లి రూరల్, సబ్బవరం, విజయనగరం జిల్లా ఎస్.కోట, గుంటూరు జిల్లా నాదెండ్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరు చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. ప్రస్తుతం నిందితుల నుంచి రూ. 60 లక్షల సొత్తును స్వాధీనం చేసుకుని, వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన మునగపాక ఎస్ఐ ప్రసాదరావు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
పెట్రో, డీజిల్ ధరల పెంపు అన్యాయం
మునగపాక : ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు ఆసన్నమయ్యాయని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు అమలు కాని హామీలు ఇచ్చి నేడు వాటిని విస్మరించడం విచారకరమన్నారు. పెట్రో, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ శనివారం పార్టీ శ్రేణులతో కలిసి మునగపాక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే పెట్రో, డీజిల్ ధరలు పెంచమంటూ హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేడు వాటిని మరిచిపోయి పేద, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపేలా ధరలు పెంచడం సమంజసం కాదన్నారు. ఈ కారణంగా నిత్యావసర సరకుల ధరలు కూడా ఆకాశాన్నంటే ప్రమాదం ఉందన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడతారన్నారు. ప్రజలంతా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. తక్షణమే పెంచిన పెట్రో.డీజిల్ ధరలను తగ్గించాలని, లేకుంటే అన్ని వర్గాల ప్రజలతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు,ఎంపీటీసీలు సూరిశెట్టి రాము,మద్దాల వీరునాయుడు,కాండ్రేగుల జగన్,దిమ్మల శివ, మొల్లేటి అచ్చియ్యనాయుడు,కాండ్రేగుల రామప్పారావు,పెంటకోట సారధి,మళ్ల రామజగన్నాఽథం, రమణబాబు పాల్గొన్నారు. మన రాష్ట్రంలోనే అధికంగా పెంపు... అనకాపల్లి : పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అధికంగా అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. శనివారం రాత్రి స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్‌రాజా ఆధ్వర్యంలో విజయరామరాజుపేట రైల్వే గేటు వద్ద పెట్రోల్ బంక్ వద్దకు ర్యాలీగా చేరుకుని పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఇంధన ధరల పెంపు వల్ల సామాన్యులపై ఎనలేని భారం పడిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే అదనంగా రూ.10 పెరిగిందన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎట్టి పరిస్థితిల్లో పెంచే ప్రసక్తి లేదని ప్రజలకు నమ్మబలికి మరీ ధరలు పెంచడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పట్టణ, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగుల హైమావతి, పద్మకుమారి, 84వ వార్డు ఇన్ఛార్జ్ కె.రాఘవ, మండల పార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, కశింకోట ఎంపీపీ లక్ష్మి గున్నయ్యనాయుడు, పార్టీ నాయకులు దేముడుబాబు, కొణతాల మురళీకృష్ణ, గణేష్, లక్ష్మి పాల్గొన్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన
నర్సీపట్నం: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.3 పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్నంగా నర్సీపట్నంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు అడిగర్ల రాజు మాట్లాడుతూ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు వచ్చిన పది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల భారాలను మోపిందని విమర్శించా రు. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మధ్య పెట్టి, ఎన్నికలయ్యాక రాక్షస పాలన చేస్తోందని దుయ్యబట్టారు. కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రాయి తీలు ఇస్తున్న ప్రభుత్వం ప్రజలపై ధరల భారాన్ని మోపడం దారుణమన్నారు. ధరలు పెంచే ఉద్దేశంతో ముందుగా పొదుపు చర్యలు పేరుతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చారన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులపై ధరలు పిడుగు పడిందన్నారు. చోడవరం: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ చోడవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటోలను తాళ్లతో లాగుతూ శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోలు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఏ భయం లేదని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారన్నారు. ఎన్నికలు ముగియగానే ధరలు పెంచి సామాన్యుల నెత్తిన భారం మోపడం దారుణమన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి పెంచిన రేట్లు తగ్గించాలని చేయాలని డిమాండు చేశారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు ఎస్.వి.నాయుడు, బి.దేవుళ్లు, జి.జాన్, బి.సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్న సాక్షిగా ట్రస్ట్ కోల్పోయిన కూటమి
సింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుల నియామకంలో పారదర్శకత లోపించిందని కూటమి నాయకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పదవుల కోసం ఆశగా ఎదురుచూసిన సొంత పార్టీల నేతలకు మొండిచేయి ఎదురైంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారిని పక్కనపెట్టి, కూటమితో ఏమాత్రం సంబంధం లేని వారికి, స్థానికేతరులకు బోర్డులో చోటు కల్పించడంపై ఆశావాహులు మండిపడుతున్నారు. జగన్ హయాంలో పారదర్శకత సింహాచలం దేవస్థానానికి 2005 నుంచి 2019 వరకు ట్రస్ట్‌బోర్డు నియామకం జరగలేదు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 2020 మార్చిలో, మళ్లీ 2022 ఏప్రిల్‌లో ట్రస్ట్‌బోర్డులను ఏర్పాటు చేశారు. అప్పట్లో స్థానికులకు, ఆలయ విశిష్టతను కాపాడే వారికి పెద్దపీట వేయడంతో పాటు మహిళలకు 50 శాతం అవకాశం కల్పించారు. అయితే 2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండేళ్ల పాటు బోర్డును నియమించకపోవడం సొంత నేతల్లోనే అసంతృప్తికి దారితీసింది. ఎట్టకేలకు శుక్రవారం 17 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ పార్టీ శ్రేణులకు కనీస సమాచారం లేకుండా ఆగమేఘాల మీద ఈ జాబితాను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలో అనర్హులకు పెద్దపీట ప్రకటించిన జాబితాలో అనర్హులకు పెద్దపీట వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఒక హోటల్ సీఈవో గుత్తికొండ శ్రీలతకు టీడీపీ కోటాలో బోర్డు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. ఆమె అసలు పార్టీ కోసమే పనిచేయలేదని టీడీపీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. అలాగే టీడీపీ సానుభూతిపరుడైన మధుపాడ సన్యాసిరావును బీజేపీ ప్రతినిధిగా చూపించి నియామకం చేపట్టడంపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పేరుతో లబ్ధి పొందుతూ చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమకు కూడా తగిన ప్రాధాన్యం దక్కలే దని జనసేన నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పట్టించుకోని ఎమ్మెల్యే సిఫార్సులు నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలను నమ్ముకుని పదవుల కోసం ఆశించిన వారికి తీవ్ర భంగపాటు ఎదురైంది. స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులను అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు సూచించిన వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారు కూడా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. వీటన్నింటికీ మించి, సింహాచలం దేవస్థానంతో నేరుగా ముడిపడి ఉన్న అడవివరం గ్రామానికి చెందిన వారికి కూడా బోర్డులో కనీస అవకాశం కల్పించకపోవడం పట్ల స్థానికులు, కూటమి నేతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి అవమానం ఏపీలో బీజేపీ పూర్తిగా టీడీపీమయమైపోయింది. సింహాచలం ట్రస్ట్ బోర్డు నియామకాల్లో టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాలపై అవగాహన లేని వారిని నియమించి అపప్రధ పాలవుతోంది. కూటమి వల్ల లబ్ధి పొందుతూనే బీజేపీని ప్రతి విషయంలోనూ చిన్నచూపు చూస్తోంది. కనీసం బీజేపీ నగర, రాష్ట్ర అధ్యక్షులకు తెలియకుండానే, తమకు అనుకూలంగా ఉండేవారిని బీజేపీ కోటాలో నియమించుకోవడం పార్టీని దెబ్బతీయడమే. గత ప్రభుత్వం 80 శాతం వరకు భక్తులకు ప్రాధాన్యం ఇస్తే, ప్రస్తుత బోర్డు మాత్రం దేవస్థానం భూముల అన్యాక్రాంతంపై నోరు మెదపని వారి కోసం వేసినట్లుగా ఉంది. –విజయశంకర్ ఫణీంద్ర, బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ -
బైక్‌ల దొంగ అరెస్టు
రూ.12.70 లక్షల గంజాయి స్వాధీనం నాతవరం: ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్ఐ వై.తారకేశ్వరరావు శుక్రవారం తెలిపారు. రోడ్డుపై పలు కార్యాలయాలు, దుకాణాలు వద్ద నిలిపి ఉంచిన వాహనాలు చోరీకి గురైనట్టు చెప్పారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇటీవల తాండవ జంక్షన్లో జరిగిన చోరీ కేసులో అనుమానితులపై ప్రత్యేంగా నిఘా పెట్టామన్నారు. శుక్రవారం వల్సంపేట జంక్షన్లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఆ సమయంలో వచ్చిన నిందితుడు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన కె.దుర్గాప్రసాద్‌ను పట్టుకుని, చోరీ చేసిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించాలమని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో సహకరించిన మైత్రి బృందానికి ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు. -
ఇసుక తోడేళ్లు
తీరంలో ● అడ్డుగోలుగా సముద్రపు ఇసుక తరలింపు ● పాయకరావుపేట, నక్కపల్లి, అచ్యుతాపురం, రాంబిల్లి పరిధిలో జోరుగా తవ్వకాలు ● ఇసుక దిబ్బలు తరిగిపోతే పోటు ముప్పు ● భవన నిర్మాణాల్లో యథేచ్చగా వినియోగం ● సంద్రం ఇసుక వాడితే అనతికాలంలోనే కూలిపోయే ప్రమాదం ● పట్టించుకోని రెవెన్యూ, మైరెన్, పోలీసు, అటవీ శాఖల అధికారులు సాక్షి, అనకాపల్లి: ఇసుక తోడేళ్లు సముద్ర తీర ప్రాంతంపై పడ్డాయి...నదీగర్భాలను తోడేసిన ఇసుకాసురులు ఇప్పుడు సముద్ర ఇసుకను యథేచ్ఛగా తరలించేస్తున్నారు. నది ఇసుకలో సముద్ర ఇసుకను మిక్స్ చేసి విక్రయించి కాసులు వెనుకేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు మిక్స్ చేసే ఇసుకను వినియోగిస్తున్నారు. ఇసుకాసురుల నిర్వాకం వల్ల ఒక వైపు తీరం కోతకు గురవుతుండగా, మరో వైపు భవన నిర్మాణాల్లో నాణ్యత దెబ్బతింటోంది. జిల్లాలో ఉన్న 72 కిలోమీటర్ల తీర ప్రాంతంలో కూటమి నేతల కనుసన్నుల్లోనే సముద్రపు ఇసుకను దొడ్డిదారిన విక్రయిస్తున్న ఇసుక మాఫియా రూ.లక్షల్లో వెనకేసుకుంటోంది. ఈ వ్యవహారమంతా అధికారులకు తెలిసినా కూటమి నేతల ఒత్తిడికి తలొగ్గి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతంలో ఇసుక తరిగిపోతుండడంతో ప్రకృతి విపత్తులు, తుపాన్లు వచ్చినప్పుడు తీర ప్రాంత గ్రామాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో అటవీ శాఖ వేసిన విలువైన సరుగుడు కలప కూడా అక్రమార్కుల పాలవుతోంది. విలువైన చెట్లు తరలిపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా అధికారుల్లో కనీస స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక తవ్వకాలను అరికట్టాలని కోరుతున్నా రెవెన్యూ, మైరెన్, పోలీసు, అటవీ శాఖలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని తీరప్రాంత గ్రామస్తుల వాపోతున్నారు. ఇసుక దిబ్బలు క్షీణిస్తే పోటు ముప్పు జిల్లాలో పాయకరావుపేట, నక్కపల్లి, అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ మండలాల పరిధిలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందని సమాచారం. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలించరాదన్న నిబంధనలు ఉన్నప్నటికీ అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. ట్రాక్టర్లు, ట్రిప్పర్ల ద్వారా ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టరు ఇసుకను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ ఇసుకను నావెల్ బేస్ ప్రాజెక్టు (ఎన్‌ఏవోబీ)నిర్మాణం కోసం, అచ్యుతాపురంలో కంపెనీల ఏర్పాటుకు రవాణా చేస్తారు. తీరప్రాంతంలో ఇసుక తవ్వకాల కారణంగా సముద్రం కోతకు గురవుతుంది. ప్రకృతి విపత్తులు, తుపానులు వచ్చినప్పుడు మత్స్యకార గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
యలమంచిలి రూరల్: ప్రభుత్వం మాది ఇక్కడ మేము ఏమి చేసినా చెల్లుతుంది, దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోండి..చూద్దాం అంటూ కొందరు టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి యలమంచిలిలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరిపి, అక్రమంగా తరలిస్తున్నారు. చెరువులు,వాగులు,వంకలు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ గట్టు ఇలా దేన్నీ వదలడం లేదు. కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా,ఫిర్యాదు చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తయిన చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. పంట కాలువలో పూడికతీత పేరుతో.. యలమంచిలి జలవనరుల శాఖ పరిధిలో యలమంచిలి పంట కాలువలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిధులు రూ.9.6 లక్షలతో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఆయా నీటి సంఘాల పాలకవర్గాలతో ఈ పనులు చేయిస్తున్నారు. సుమారు 5 కిలోమీటర్ల పొడవైన ఈ కాల్వలో పూడికతీత సమయంలో భారీగా కలప,మట్టి దోపిడీ జరిగింది.కాలువకు రెండువైపులా ఏపుగా పెరిగిన చెట్లను యంత్రాలతో కూల్చి, వందల టన్నుల కలపను అక్రమంగా అమ్ముకున్నారు. మట్టి దోపిడీ కూడా భారీగా జరుగుతోంది.కాలువ నిర్వహణ పనుల పేరుతో అక్రమంగా మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలించి అమ్ముకుంటున్నారు. తాజాగా శుక్రవారం పంటకాల్వకు ఆనుకుని ఉన్న బ్రాంచి కాల్వలో పూడికతీత పేరుతో పొక్లెయిన్‌తో మట్టిని తవ్వి నాలుగు ట్రాక్టర్లతో సమీపంలో ఇటుకబట్టీలకు తరలించారు.అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఎవరైనా విలేకరులు ఇలాంటి విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సవాలక్ష ప్రశ్నలు వేస్తూ ధీమాగా ఉంటున్నారు. యలమంచిలి పంట కాలువ పూడికతీత పనుల్లో కలప,మట్టి తరలింపుపై జంపపాలెంకు చెందిన ఒక సామాజిక కార్యకర్త కలెక్టరుకు ఫిర్యాదు చేసినా అక్రమాలేవీ జరగలేదని అధికారులు సమాధానమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చర్యలు తీసుకుంటాం యలమంచిలి పంటకాలువ,కృష్ణాపురం బిళ్వకుమారి చెరువులో మట్టి తవ్వకాలు అక్రమంగా జరుపుతున్నట్టు మాదృష్టికి రాలేదు. మట్టి తవ్వకాలపై పరిశీలన జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటాం.మట్టి అమ్ముకోవడానికి నిబంధనలు అనుమతించవు.ఫిర్యాదులపై విచారణ జరుపుతాం. –ఎన్ ప్రేమ్‌కుమార్, ఏఈఈ,జలవనరుల శాఖ,యలమంచిలి బిళ్వకుమారి చెరువులో తవ్వకాలపై జనసేన నేత ఫిర్యాదు యలమంచిలి మండలం కృష్ణాపురం రెవెన్యూ పులపర్తి ప్రధాన కాల్వ నుంచి సాగునీరు ప్రవహించే బిళ్వకుమారి చెరువులో రాత్రీ పగలూ తేడా లేకుండా జరుగుతున్న అక్రమ తవ్వకాలపై పులపర్తికి చెందిన జనసేన నేత,పులపర్తి సాగునీటి సంఘం అధ్యక్షుడు సుంకర బుల్లిబాబు శుక్రవారం కలెక్టర్,యలమంచిలి తహసీల్దార్,యలమంచిలి జలవనరుల శాఖ డీఈఈ,యలమంచిలి జలవనరుల శాఖ ఏఈఈలకు ఫిర్యాదు చేశారు.గుంటూరు జిల్లా పన్నూరు గ్రామస్తుడు మోటూరు శేషారావుకు చెందిన 2.26 ఎకరాల పొలాన్ని మట్టితో చదును చేసేందుకు అధికారుల నుంచి అనుమతి తీసుకుని, 10రోజులుగా రెండు భారీ ఎక్స్‌వేటర్లు, టిప్పర్ లారీలు,పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని పెద్ద ఎత్తున తవ్వి అక్రమంగా తరలించుకుని అమ్ముకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 2,000 ట్రిప్పుల మట్టిని కొల్లగొట్టినా స్థానిక జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఓ టీడీపీ నేత చేస్తున్న మట్టి అక్రమ తవ్వకాలపై జనసేన నేత అధికారులకు ఫిర్యాదు చేశారంటే ఇక్కడ మట్టి మాఫియా ఎలా చెలరేగిపోతోందో అర్థం చేసుకోవచ్చు. -
● ఇద్దరి అరెస్టు
నర్సీపట్నం: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని నర్సీపట్నం రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముందుస్తుగా వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్ఐ రాజారావు, సిబ్బందితో చింతపల్లి రూట్లో నెల్లిమెట్ట జంక్షన్ వద్ద మాటు వేసి పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన చల్లా గోపి(25), ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలిమెల మండలం పపులర్ పంచాయతీకి చెందిన మహాదేబ్ ఖిలా(23)ను అరెస్ట్ చేసినట్ట సీఐ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.12.70 లక్షల విలువైన 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, రెండు సెల్ఫోన్లు, రూ.1000 నగదు సీజ్ చేసినట్టు సీఐ చెప్పారు. -
గంజాయి రవాణా కేసులో నిందితుడికి జైలు
అనకాపల్లి: జిల్లాలో మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన గంజాయి రవాణా కేసులో నిందితుడికి 2 సంవత్సరాల 7 నెలల జైలుశిక్ష విధిస్తూ విశాఖ 1వ అదనపు న్యాయమూర్తి ఎం.వెంకటరమణ శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధించారని, జరిమానా చెల్లించని పక్షంలో ఒక నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాలన్నారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా విల్లవంకోడ్ గ్రామానికి చెందిన పుష్పరాజ్ 2023 నవంబర్ 8న ఏజెన్సీ ప్రాంతం నుంచి తమిళనాడుకు ఏడు కిలోల గంజాయిని తరలిస్తుండగా అప్పటి మాకవరంపాలెం ఎస్ఐ పి.రామకృష్ణ పట్టుకున్నట్టు ఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా వాదోపవాదాలు అనంతరం జైలు శిక్షణ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు తెలిపారు. కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాస్ బలమైన వాదనలు వినిపించారని చెప్పారు. -
అద్దె అడిగితే గొంతు కోశాడు
అల్లిపురం(విశాఖ): అద్దె డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకుని ఒక మహిళను దారుణంగా హత్య చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ కే. లతామాధురి వెల్లడించారు. కేసు వివరాలిలా.. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్‌లోని నాగ ఆనంద్ అపార్టుమెంట్లో పిల్లా పార్వతి (53) తన భర్త చంద్రశేఖర్‌తో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఉన్న ఒక దుకాణాన్ని తాటిచెట్లపాలేనికి చెందిన గన్నవరపు రాము అద్దెకు తీసుకుని ‘దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మూడు నెలలుగా షాపు అద్దె బకాయి పడ్డాడు. ఆ అద్దె డబ్బుల కోసం పార్వతి గట్టిగా అడగడంతో ఆమైపె కక్ష పెంచుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి రాము లోపలికి ప్రవేశించాడు. అద్దె విషయంలో ఆమెతో గొడవపడి, అనంతరం ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన 2.5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల నల్లపూసల దండ, చెవి దిద్దులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా, పార్వతి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మర దర్యాప్తు : సమాచారం అందిన వెంటనే ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ డీసీపీ కే. లతామాధు రి పర్యవేక్షణలో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రాముగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్‌కు పారిపోవడానికి రైల్వే స్టేషన్ గేటు వద్దకు చేరుకోగా, దర్యాప్తు బృందం అతడిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్‌కు తరలించారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సీఐ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తరఫున క్రైమ్ డీసీపీ అభినందించారు. -
అతిగా మద్యం తాగి యువకుడు మృతి
అచ్యుతాపురం రూరల్ : అతిగా మద్యం తాగి వికాష్ కుష్వా (26) అనే యువకుడు మృతి చెందిన ఘటన చీమలాపల్లి రెవెన్యూ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలి ఇలా ఉన్నాయి. వికాష్ కుష్వా మడుతూరు కూడలిలో ఉన్న మై చాయిస్ ఐస్ క్రీమ్ కంపెనీలో రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 11 తేదీన విధులు ముగించుకుని దగ్గర్లో ఉన్న మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి, అతిగా మద్యం తాగాడు. శివ ప్రియా గార్డెన్స్ వద్ద మృతదేహం ఉన్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం వెళ్లి పరిశీంచి, మృతి చెందిన వ్యక్తి వికాష్ కుష్వాగా గుర్తించారు. ఎక్కువగా మద్యం తాగడం వల్లే మృతి చెంది ఉంటాడని ఎస్ఐ వెంకటరావు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ చంద్ర శేఖర్ రావు తెలిపారు. -
దైవ దర్శనానికి వెళ్లి వృద్ధుడు అదృశ్యం
మాడుగుల రూరల్: తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన వృద్ధుడు 12 రోజులైనా తిరిగి ఇంటికి చేరలేదు. మండలంలోని వీరనారాయణం గ్రామానికి చెందిన కోరుకొండ కళ్యాణం అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దాడి పెంటయ్యతోపాటు అతడు ఈ నెల 1న వృద్ధాప్య పింఛను తీసుకుని 4వ తేదీన అనకాపల్లిలో తిరుమల రైలు ఎక్కి 5వ తేదీన తిరుపతికి చేరుకున్నారు. అక్కడ దర్శనం చేసుకుని వెంగమాంబ భోజన శాల వద్ద భోజనాలు చేశారు. పెంటయ్య తన బ్యాగ్‌ను కళ్యాణంకు ఇచ్చి చేతులు కడుక్కోని వచ్చేలోగా కనిపించలేదు. బ్యాగ్‌లో నగదు, బట్టలు ఉండటంతో పెంటయ్య ఆందోళనకు గురయ్యాడు. అక్కడ మైక్‌లో అనౌన్స్ చేసినా ఆచూకీ తెలియరాలేదు. తర్వాత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి గాలించినా సరే జాడలేదు. దీంతో పెంటయ్య కట్టుబట్టలతో తిరిగి ఈ నెల 14వ తేదీన స్వగ్రామం వీరనారాయణం చేరుకున్నాడు. ఈ విషయం కళ్యాణం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆందోళనకు గురవుతున్నారు. -
అప్పన్న కొండపై తవ్వకాలు అపచారం
డాబాగార్డెన్స్ (విశాఖ): హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న సింహాచలం కొండను చంద్రబాబు ప్రభుత్వం బోడిగుండు చేస్తోందని సీపీఎం నాయకుడు గంగారావు ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల కొండ ప్రాంతంలో డేటా సెంటర్ పేరుతో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారని మండిపడ్డారు. నరసింహ స్వామి కొలువై ఉన్న పవిత్ర కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ఈ చర్యలను భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అలాగే సింహాచలం కొండ నుంచి వచ్చే వర్షపు నీరు ముడసర్లోవకు చేరే సహజ ప్రవాహ వ్యవస్థ దెబ్బతింటుందని, కొండను తవ్వడం వల్ల నీటి ప్రవాహానికి అంతరాయం కలిగే ప్రమాదం ఉందని గంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. -
స్నేహితుడి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..
బుచ్చెయ్యపేట: మండలంలో కశింకోట– బంగారుమెట్ట(కేబీ) రోడ్డులో నీలకంఠాపురం వద్ద విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి అనకాపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు స్నేహితులు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్నారు. రాజాం గ్రామానికి చెందిన మరిసా శివ పని మీద అనకాపల్లి వెళ్లాడు. అర్ధరాత్రి వాహనాలు లేకపోవడంతో తన స్నేహితులైన మరిసా సాయి, పడాల శివకు ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకెళ్లడానికి రావాలని కోరాడు. స్నేహితుడిని తీసుకురావడానికి ద్విచక్ర వాహనంపై మరిసా సాయి, పడాల శివ అనకాపల్లి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు వస్తుండగా, రాత్రి 2 గంటల ప్రాంతంలో నీలకంఠాపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సాయి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. 108 వాహనంలో పడాల శివ, మరిసా శివలను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన స్నేహితుడి కారులో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి వెళ్తున్న మరిసా సాయి(20) జంగాలపాలెం గ్రామ దగ్గర ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదంలో పడాల శివ కాలు విరిగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మరిసా శివ అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివాహమైన ఏడాదికే.. మరిసా సాయి తురకలపూడికి చెందిన మాధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 8వ తేదీన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నారు. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయి తన గ్రామంలో పొలం అమ్మడానికి 20 రోజుల క్రితం భార్యతో కలిసి రాజాం వచ్చాడు. రెండు రోజుల క్రితం భూమి రిజిస్ట్రేషన్ అయింది. మళ్లీ హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. తన స్నేహితుడు అనకాపల్లిలో ఉండిపోవడంతో అర్ధరాత్రి తీసుకురావడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భార్య మాధవి ప్రస్తుతం ఆరో నెల గర్భిణి. భర్త మృతితో ఆమె రోదిస్తున్న తీరును చూసి పలువురు చలించిపోయారు. సాయి తల్లి లచ్చమ్మ అనారోగ్యంతో మంచాన ఉండగా, తండ్రి సన్యాసినాయుడు కుమారుడు మృతితో భోరున విలపిస్తున్నాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ శ్రీనివాసరావు పరిశీలించి కేసు నమోదు చేశారు. సాయి మృతదేహానికి పోస్టుమార్టం జరిపి, సాయంత్రం రాజాంలో అంత్యక్రియలు నిర్వహించారు. కేబీ రోడ్డును ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని మార్చాలని ఫిర్యాదులు చేస్తున్నా ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కేకే లైన్‌తో కూడిన రైల్వేజోన్ ప్రకటించాలి
సీతంపేట: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కె.కె. లైన్‌ను చేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంపీ శ్రీభరత్ బీచ్ రోడ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రం అందజేయనున్నట్లు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జె.టి. రామారావు తెలిపారు. శుక్రవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘కె.కె. లైన్‌తో ఉన్న రైల్వే జోన్ – భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రధాన ఆస్తులు, ఆదాయ మార్గాలను ఇతర జోన్లకు అప్పగించి విశాఖకు కేవలం పేరు మాత్రమే ఇవ్వడం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కె.కె. లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ అసంపూర్ణమని, దీని సాధన కోసం పాదయాత్రలు, ర్యాలీలు, ‘చలో ఢిల్లీ’ వంటి కార్యక్రమాలతో దశలవారీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఇప్పటికై నా గళమెత్తాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు అడారి కిషోర్ కుమార్, కస్తూరి వెంకట్రావు, గొలగాని రాము, ఎం.ఎల్.ఎన్. పట్నాయక్ , పలు మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జిల్లాలో 89 లక్షల మొక్కల పెంపకం
కె.కోటపాడు: సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని 80 వన నర్సరీల్లో వివిధ రకాలకు చెందిన 89 లక్షల మొక్కలను పెంచుతున్నట్లు సోషల్ ఫారెస్ట్ అధికారి(డీఎఫ్‌వో) ఎం.సోమసుందరం తెలిపారు. కె.కోటపాడు మండలం కొత్తూరు, ఎ.కోడూరు, సింగన్నదొరపాలెం, రామచంద్రపురం, పొడుగుపాలెం, బత్తివానిపాలెం గ్రామాల్లో వన నర్సరీలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వేసవి ఉష్ణోగ్రత్తలు ఎక్కువగా ఉండడం వల్ల నర్సరీల్లో మొక్కలకు నీటి తడులను తరచూగా ఇవ్వాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి జిల్లా ఫారెస్ట్ కమిటీ సమావేశం అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. ఏయే మొక్కలు రైతులకు, ప్రభుత్వ అవసరాలకు ఉచితంగా ఇవ్వాలనేది కమిటీ నిర్ణయిస్తుందన్నారు. పరిశ్రమలకు నిర్దేశించిన ధరలకు ఈ మొక్కలను అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పెంచుతున్న మొక్కల్లో 70 లక్షల సరుగుడు మొక్కలతోపాటు మిగిలిన 19 లక్షలు జీడి, మహగణి, ఎర్రచందనం, ఏగిస, యూకలిప్టస్, నేరేడు, రోజ్‌వుడ్, కందంబ, ఫెల్టోఫారం తదితర మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. గతేడాది రోడ్లకిరువైపులా రహదారి వనాల కార్యక్రమంలో బాగంగా మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు బ్లాక్ ఫ్లాంటేషన్ విధానంలో మొక్కలను నాటామన్నారు. ఈ ఏడాది ఎన్టీపీసీ(సింహాద్రి) నిధులతో రహదారి వనాలు, బ్లాక్ ప్లాంటేషన్ విధానంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వన నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని వీబీ జీ రాంజీ, ఎన్టీపీసీ, ఆగ్రో ఫారెస్ట్రీ, కాంపా నిధులతో పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శివరంజిని, డిప్యూటీ రేంజ్ అధికారి నూకరాజు, వన సేవకుడు చిరికి గోవింద పాల్గొన్నారు. -
బీడీఎల్ యూనిట్‌కు శంకుస్థాపన
మునగపాక: మండలంలోని టి.సిరసపల్లిలో భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్ )యూనిట్ నిర్మాణానికి శుక్రవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్సింగ్,సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్ పద్ధతిలో భూమిపూజ చేశారు. రక్షణ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌ను టి.సిరసపల్లిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్,జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్,నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్షన్ యూనిట్ సీజీఎం మనోజ్‌కుమార్,కంట్రోలర్ నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్షన్ విజేంద్ర సింగ్ నాన్యా,కమోడోర్ సంజయ్ కపూర్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ ఆర్.ప్రధాన్,ఎన్ఎస్టీఎల్ శాస్త్రవేత్త రాజేశ్వరి,ఎమ్మెల్యేలు సుందరపు విజయకుమార్,బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ,పలు కార్పొరేషన్ల చైర్మన్లు,పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ బీడీఎల్ యూనిట్ ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.ఈ యూనిట్లో తమ ప్రాంతానికి చెందిన వారికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ టి.సిరసపల్లి పంచాయతీ శివారు నారాయుడుపాలెంకు చెందిన గ్రామస్తులు ఎమ్మెల్యే విజయకుమార్‌కు వినతి అందజేశారు.పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేసులు
● రూ. 34,25,430 జరిమానా విధింపు ● జిల్లా రవాణా శాఖా అధికారి మనోహర్ తుమ్మపాల: ఓవర్ లోడింగ్, టార్పాలిన్‌తో కప్పకుండా సరుకు (ప్రత్యేకించి ఫ్లై యాష్, బొగ్గు)ను రవాణా చేయడంతో పాటు ఇతర నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నట్టు జిల్లా రవాణా శాఖా అధికారి జి.మనోహర్ తెలిపారు. నెల రోజులుగా రాత్రి వేళల్లో ఆకస్మికంగా తనిఖీలు జరిపి, మొత్తం 71 భారీ వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. వీటిలో ఓవర్లోడింగ్, సరుకును టార్పాలిన్‌తో సరిగా కప్పకుండా తరలించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు రూ.34,25,430 జరిమానా విధించామన్నారు. 58 వాహనాలను సీజ్ చేసి అపరాధ రుసుం విధించామన్నారు. వాహన యజమానులు, డ్రైవర్లు రహదారి భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాల సూచించారు. -
అనుమానాస్పద మృతిపై.. దర్యాప్తు ముమ్మరం
మృతుని భార్య రాజ్యలక్ష్మిని విచారిస్తున్న డీఎస్పీ శ్రీనివాస్ నర్సీపట్నం:యువకుడి అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రోలుగుంట మండలం బుచ్చంపేటకి చెందిన లాలం సాయికుమార్ బుధవారం నర్సీపట్నం మండలం గబ్బాడ శివారు నెల్లిమెట్ట వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తమ గ్రామానికి చెందిన కొంతమంది సాయికుమార్‌ను హత్య చేసినట్లు మృతిని భార్య రాజ్యలక్ష్మి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్త మృతిని హత్య కోణంలో విచారణ జరిపించాలని రాజ్యలక్ష్మి స్వ యంగా ఎస్పీ తుహిన్ సిన్హాను కలిసి ఫిర్యాదు చేసింది. ఖా‘కీలు’బొమ్మలేనా.. అన్న శీర్షికతో ‘సాక్షి’లో సాయికుమార్ మృతితో పాటు మరో మరణంపై శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీంతో పోలీసుల్లో కదలిక మొదలైంది. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాస్ స్వయంగా మృతుడి గ్రామం వెళ్లి విచారణ జరిపారు. ముందుగా మృతుడి భార్య రాజ్యలక్ష్మిని విచారించారు. తన భర్తది ముమ్మాటికీ హత్యేనని ఆమె డీఎస్పీ వద్ద స్పష్టం చేసింది. నిందితులు తమతో రాయబారాలు జరుపుతున్నారని, నగదు ఆశచూపి కేసు ఉపసంహరణకు ఒత్తిడి చేస్తున్నారని ఆమె పోలీసులకు చెప్పింది. తమ కుటుంబం ఊరికి దూరంగా నివసిస్తున్నందున తన భర్త హత్య చేసినట్టే తనను, తన అత్త,మామల ను అంతమొదించే అవకాశం ఉందని రాజ్యలక్ష్మి భ యాందోళన వ్యక్తం చేసింది. తమ కుటుంబానికి రక్ష ణ కల్పించాలని కోరింది. గ్రామంలో మరికొంత మందిని కూడా డీఎస్పీ విచారించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమైన డీఎస్పీ సంప్రదించగా విచారణ ప్రారంభమైంది, శవ పరీక్ష నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పెళ్లింట పెను విషాదం
అగనంపూడి: పెళ్లి ముచ్చట్లు తీరకముందే.. నూరేళ్ల బంధానికి పునాది పడకముందే నవవధువు అనంత లోకాలకు చేరుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పుట్టింటికి వస్తున్న తరుణంలో.. మృత్యువు కారు రూపంలో ఆమెను కబలించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లికుమార్తె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ హృదయవిదారక ఘటన అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో గురువారం జరిగింది. పరవాడ మండలం వాడచీపురుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఈరుగుల సన్యాసమ్మ కుమారుడు నరసింగరావు (43) వాడచీపురుపల్లి పంచాయతీలో క్లాప్ వ్యాన్ డ్రైవర్. ఆయనకు అగనంపూడి నిర్వాసితకాలనీ కొండయ్యవలసకు చెందిన నడుపూరు పెంటారావు, కనకమహాలక్ష్మిల కుమార్తె రామేశ్వరి (31)తో బుధవారం రాత్రి వివాహం జరిగింది. తిరుగుమరుగుళ్లలో భాగంగా గురువారం సాయంత్రం 3.30 గంటల సమయంలో నవ వధువు రామేశ్వరి ఇంటికి వెళ్లేందుకు ఆమె భర్త నరసింగరావు, ఆమె తల్లి కనకమహాలక్ష్మి, సోదరి కలిసి కారులో వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి బయల్దేరారు. ఆ కారును నర్సింగరావే నడుపుతున్నాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరిపోతారనుకున్న సమయంలో అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నరసింగరావుకు కళ్లు మూతలు పడడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వీధిలైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లి కనకమహాలక్ష్మి తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతుంది. సోదరి వరలక్ష్మి, నర్సింగరావు కూడా గాయపడ్డారు. రామేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరు మున్నీరవుతున్న బంధువులు అత్తారింట్లో అడుగుపెట్టి ఆనందంగా ఉండాల్సిన వధువు ప్రమాదంలో తీరనిలోకాలకు చేరుకోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. పెళ్లి వేడుక ముగిసి 24 గంటలు కూడా కాకముందే పెళ్లికూతురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు సైతం కన్నీరు మున్నీరవుతున్నారు. -
ఖాకీలుబొమ్మలేనా!
ఉమ్మడి జిల్లాలోని పోలీసుల అత్యుత్సాహమో... అధికారపార్టీ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్ల వల్లనో... పూర్తిగా విచారణ చేయకుండానే జరిగిన సంఘటనలపై నిర్ధారణకు వచ్చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా కేసులను కూడా అదే తరహాలో నమోదు చేస్తున్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసుల వ్యవహారశైలితో బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఇటీవల సంచలనం సృష్టించిన గాజువాకలో జరిగిన మౌనిక హత్య కేసులో ఏకపక్షంగా హంతకుడు నేవీ అధికారి చింతాడ రవీంద్ర చెప్పిన విషయాన్నే యథాతథంగా అదే వివరాలను పోలీసులు వెంటనే ప్రకటించారు. విచారణలో మాత్రం హత్య వేరే ప్రాంతంలో జరిగినట్టు గుర్తించారు. ఈ ఘటనలో విశాఖ పోలీసులు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ ఘటన మరువకముందే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగిన ఒక వ్యక్తి మరణంపై యాక్సిడెంట్ అంటూ స్థానిక పోలీసులు ప్రకటించడం అనుమానాలకు దారి తీసింది. కనీసం పోస్టుమార్టం నివేదిక ఇంకా అందకముందే ఎందుకు అంత త్వరగా పోలీసులు ప్రకటనలు గుప్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామ సమీపంలో యువకుడు లాలం సాయికుమార్ అనుమానాస్పద మృతిపై యాక్సిడెంట్ అంటూ పోలీసులు ప్రకటించడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో అటు మౌనిక, ఇటు సాయికుమార్ హత్య, అనుమానాస్పద మృతిపై సదరు బాధిత కుటుంబ సభ్యులు విచారణ చేయాలంటూ ఇటు పోలీసు కమిషనర్‌ను, అటు అనకాపల్లి జిల్లా ఎస్పీని కలిసి విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ విధంగా హడావుడిగా జరిగిన సంఘటనలపై ప్రకటనలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అది యాక్సిడెంట్ కాదు...! ఇప్పటికే గాజువాకలో జరిగిన మౌనిక హత్య కేసులో మరోసారి విచారించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నా నిందితుడు చెప్పిన వివరాలనే పోలీసులు ఎలా చెబుతారంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పోలీసులు లోతుగా విచారణ జరపకుండానే వివరాలను పత్రికా ముఖంగా బహిరంగంగా ప్రకటించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు కలెక్టర్‌తో పాటు పోలీసు కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశా రు. ఈ పరిస్థితుల్లో తాజాగా అనకాపల్లి జిల్లాలో నూ ఇదే తరహా సంఘటన జరగడం పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామ సమీపంలోని నెల్లిమెట్ల వద్ద ఈ నెల 9వ తేదీన లాలం సాయికుమార్ (30) అనే యువకుడు అనుమానాస్పదంగా మరణించాడు. బైక్‌పై నర్సీపట్నం వెళుతుండగా యాక్సిడెంట్ జరిగిందంటూ పోలీసులు ప్రకటించారు. అయితే, సంఘటన జరిగిన ప్రదేశాన్ని గమనించిన కుటుంబ సభ్యులు మాత్రం మృతి అనుమానాస్పదంగా ఉందని అంటున్నారు. యాక్సిడెంట్ జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నా, పరిసరాలను గమనిస్తే హత్యే కావొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అనకాపల్లి జిల్లా ఎస్పీని కలిసేందుకు గురువారం కార్యాలయానికి వచ్చి విచారణ చేయాలంటూ విన్నవించారు. అయితే, ఎస్పీని కలిసేందుకు సైతం కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంతం 5 గంటల వరకూ వారు వేచి ఉండాల్సి వచ్చింది. సాయంత్రం 5.15 గంటల సమయంలో ఎస్పీ తుహిన్ సిన్హా కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా మృతుడి భార్య లాలం రాజ్యలక్ష్మి తమ గోడును వినిపించుకుంది. దీంతో ఆయన స్పందించి కేసులో పూర్తి విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణికి ఈ కేసు విచారణ బాధ్యతలు అప్పగించారు.హత్య చేసి యాక్సిడెంట్ అంటున్నారు...! తన భర్త లాలం సాయికుమార్‌ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారంటూ మృతుడు లాలం సాయికుమార్ భార్య రాజ్యలక్ష్మి వాపోతున్నారు. మా కుటుంబానికి న్యాయం చేయాలని గురువారం అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హాను కలిసి విన్నవించారు. రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామంలో ఈనెల 9వ తేదీన తన భర్త లాలం సాయికుమార్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారం హత్యచేశారనేది ఆమె ఆరోపణ. సంఘటన జరిగి నాలుగు రోజులైనప్పటికీ పోస్టుమార్టం నివేదిక ఎందుకు రాలేదని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఒక్కోసారి ఒక విధంగా తమకు సమాచారం ఇచ్చారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పోలీసులు వ్యవహారశైలి మరోసారి ఉమ్మడి విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అత్యుత్సాహమా!.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లా? పూర్తిగా విచారణ చేయకుండానే కేసుల నిర్ధారణ బాధిత కుటుంబాల నుంచి విమర్శలు మళ్లీ విచారణ చేయాలంటూ నివేదనలు గతంలో గాజువాకలో మౌనిక ఇప్పుడు నర్సీపట్నంలో లాలం సాయి మృతిపై అదే తీరు నా భర్తను హత్య చేశారు ఈ నెల 9న ఉదయం 11 గంటలకు నా భర్త లాలం సాయికుమార్‌కు గాలి రాజేష్, సుర్ల సతీష్ ఫోన్ చేసి రమ్మన్నారు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి మాకిరెడ్డి నానాజీతో కలిసి మద్యం సేవించారు. అదేరోజు సుమారుగా సాయంత్రం 5.30 సమయంలో నా భర్త లాలం సాయికుమార్ మృతిచెందినట్టు తమకు పోలీసులు నుంచి ఫోన్ వచ్చింది. ఎలా మృతి చెందాడని అడగగా..బైక్‌ను కారు ఢీ కొట్టిందని ఒకసారి, బైక్ చెట్టును ఢీ కొట్టిందని మరోసారి, మూడోసారి సెల్ఫ్ యాక్సిడెంట్ అయిందని పొంతన లేని సమాధానం చెప్పారు. నా భర్త ఎలా మృతిచెందాడో పూర్తి సమాచారం ఇవ్వాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశాను. – రాజ్యలక్ష్మి, మృతుడు సాయికుమార్ భార్య మృతికి కారణాలను వెలికితీయాలి నా మేనల్లుడు ఎలా మృతిచెందాడో ఇప్పటికీ అనుమానంగానే ఉంది. యాక్సిడెంట్ జరిగితే మృతుడి శరీరంపై గాయాలు ఉంటాయి, కానీ ఎక్కడా గాయాలు కనిపించలేదు. కాలిపై మాత్రమే చిన్న రక్కులా ఉంది. ఈ విషయంపై ఎస్పీ తుహిన్ సిన్హాకు లిఖిత పూర్వకంగా వినతిప్రతం అందజేశాం. మూడు రోజుల్లో కేసును ఛేదించడం జరుగుతుందని చెప్పారు. –నాగరాజు, మృతుడి మేనమామ, బుచ్చింపేట గ్రామం -
భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తాం
అనకాపల్లి: జిల్లాలో పెండింగ్‌లో భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం తెలిపారు. గురువారం స్థానిక గాంధీనగరంలోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లాలోని ఎస్సీ సంక్షేమ భూములకు సంబంధించిన భూ కబ్జా, సర్వే కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కార మార్గాలపై సంబంధిత అధికారులకు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ద్వారా తదుపరి చర్యల కోసం లేఖలు పంపించామన్నారు. 54 మంది ఫిర్యాదులు చేసినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, సోషల్ వెల్ఫేర్ డీడీ బి.రామానందం, డీవీఎంసీ సభ్యులు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. భూ వివాదంపై విచారణ దేవరాపల్లి: మండలంలోని ముషిడిపల్లిలో రెవెన్యూ పరిధిలో దళితులు, కల్లుగీత కార్మికులు మధ్య నెలకొన్న భూ వివాదంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం గురువారం విచారణ చేపట్టారు. మండలంలోని కె.ఎం.పాలెం గ్రామానికి చెందిన కణితి అర్జున్ ముషిడిపల్లిలోని తన భూ సమస్యపై రాష్ట్ర ఎస్సీ కమీషన్‌ను ఆశ్రయించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ సూచనల మేరకు సదరు వివాదాస్పద స్థలాన్ని స్థానిక తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, ఎస్ఐ వి. సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం సదరు స్థలానికి సంబంధించి ఇరువురి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించారు. ఇరువర్గాల వారి వాదనలను వినడంతో పాటు స్థానిక పెద్దలను, అధికారులను సైతం భూమికి సంబంధించిన పూర్వపరాలపై ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల వారు పరస్పర వాదోపవాదనలకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను సముదాయించారు. -
తాటి చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
చీడికాడ: మండలంలోని జి.కొత్తపల్లి శివారు చినగోగాడకు చెందిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ తాటిచెట్టుపై నుంచి జారి పడి మృతి చెందినట్లు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కోన నారాయణమూర్తి(43)గురువారం మధ్యాహ్నం తమ కల్లం సమీపంలో తాటికాయలు కోసేందుకు తాటిచెట్టు ఎక్కాడన్నారు. ప్రమాదవశాత్తూ కాలుజారి చెట్టు పైనుంచి కిందికి పడిపోవడంతో తలకు,శరీరంపై బలమైన గాయాలై మృతి చెందాడన్నారు. ఘటనపై మృతుని భార్య వెంకట వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. -
నీలి సంద్రం.. గాల్లో విహారం
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్ ప్రస్తుతం సాహస క్రీడలకు నెలవుగా మారింది. ఇక్కడ కొత్తగా అందుబాటులోకి వచ్చిన పారగ్లైడింగ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నీలిరంగు సముద్రపు అలలపై గాలిలో తేలుతూ, విహంగ వీక్షణంగా తీర ప్రాంత అందాలను ఆస్వాదించడం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. నిపుణులైన పైలట్ల పర్యవేక్షణలో సాగుతున్న ఈ పారగ్లైడింగ్, అటు స్థానికులను ఇటు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆకాశం నుంచి సాగర తీరాన్ని చూస్తూ ప్రకృతి ఒడిలో విహరిస్తున్న పర్యాటకులు ఈ అనుభవాన్ని మరుపురాని జ్ఞాపకంగా అభివర్ణిస్తున్నారు. –ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఏపీఆర్జేసీలో చేనులపాలెం విద్యార్థినికి 500వ ర్యాంక్
దేవరాపల్లి: ఏపీఆర్జేసీ విడుదల చేసిన ఫలితాల్లో చేనులపాలెం విద్యార్థిని కొట్యాడ రాజ మౌనిక 500వ ర్యాంక్ సాధించింది. ఈ ఫలితాల్లో దేవరాపల్లిలో ఉచిత కోచింగ్ పొందిన 20 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంక్‌లు సాధించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ కోచింగ్ తీసుకున్న విద్యార్థినులు టి. ఉష 1,243, ఎస్. సంతోషి 1,402వ ర్యాంక్‌లు సాధించారు. 2 వేల లోపు ముగ్గురు, 4 వేల లోపు 8 మంది ర్యాంకులు సాధించిన వారులో ఉన్నారు. వీరిని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, ఉపాధ్యక్షుడు కొరుప్రోలు శ్రీను అభినందించారు. స్థానిక పెద్దలు, ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో 2018 నుంచి ఏటా 150 మంది విద్యార్థులకు ఏపీఆర్జేసీ, పాలిసెట్ ఉచిత శిక్షణ అందిస్తున్నామని కె.వి.రమణ, కొరుప్రోలు శ్రీను తెలిపారు. -
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలి
కశింకోట: జిల్లాలోని ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని విశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు బి. విజయకుమార్ ఆదేశించారు. గురువారం స్థానిక సెయింట్ జాన్స్ స్కూలులో జిల్లా స్థాయిలో మండల విద్యా శాఖ అధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, హైస్కూలు ప్లస్ ప్రధానోపాధ్యాయులకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంపొందిస్తూ బలోపేతం చేయాలన్నారు. జిల్లా విద్యా పరంగా అన్ని అంశాల్లో ముందుండాలన్నారు. పదో తరగతి పునశ్చరణ తరగతులు నిర్వహించి మార్చిలో ఉత్తీర్ణులు కాని వారందరిని అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ కావడానికి ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు, రాష్ట్ర పరిశీలకుడు నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. -
నేడు బీడీఎల్ యూనిట్‌కు శంకుస్థాపన
సాక్షి, అనకాపల్లి: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ(బీడీఎల్) ఆధ్వర్యంలో స్థాపించనున్న రక్షణ తయారీ యూనిట్‌ను ఈ నెల15న శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో మునగపాక మండలంలో టి.సిరసాపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు పుట్టపర్తి నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. రూ. 489 కోట్ల పెట్టుబడితో ఆధునిక తయారీ అసెంబ్లీ, పరీక్ష(మ్యాట్) సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలు ద్వారా అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమవడంతో పాటు, ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందన్నారు. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
యలమంచిలి రూరల్ : పార్క్ చేసి ఉంచిన ద్విచక్రవాహనాలను చాకచక్యంగా చోరీ చేస్తున్న వ్యక్తిని గురువారం అరెస్ట్ చేసినట్టు యలమంచిలి పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీన పర్చుకున్నామన్నారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లికి కోడిగుడ్డు సన్యాసిరావు ద్విచక్రవాహనాలను చోరీ చేసి వాటిని తెలిసిన వారి వద్ద తాకట్టు పెట్టి డబ్బుతో తన అవసరాలు తీర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. యలమంచిలి పట్టణ ఠాణాలో 2023లో రెండు, 2024 నాగుల చవితి జాతర రోజు ఒకటి మొత్తం మూడు ద్విచక్ర వాహనాలను నిందితుడు అపహరించాడు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మూడు కేసుల్లో నిందితుడిగా సన్యాసిరావును పోలీసులు నిర్థారించుకున్నారు. గురువారం 16వ నెంబర్ జాతీయ రహదారిపై పెదపల్లి కూడలి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా చోరీకి గురైన మూడు వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
మాకవరపాలెం: మండలంలోని వజ్రగడ శివారు తమ్మయ్యపాలెంలో గురువారం మధ్యాహ్నం బొడ్డు అప్పలనాయుడు(50) మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరి కొందరితో మంగళవారం హనుమాన్ జయంతి రోజున నిర్వహించిన అన్నసమారాధనలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పలనాయుడుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు తమ్మయ్యపాలెం వెళ్లగా, అతడు భయంతో మనస్తాపానికి గురై తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లే సరికే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. దీనిపై మృతుడు భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ దామోదర్‌నాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. -
మహిళ దారుణ హత్య
● బంగారు నగల కోసమే ఘాతుకం ● అక్కయ్యపాలెంలో ఘటనపార్వతి మృతదేహంతాటిచెట్లపాలెం: నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్‌లోని పీఆర్కే నాగ్ ఆనంద్ హైట్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న పార్వతి (53)ని దుండగులు హతమార్చారు. మృతురాలి భర్త దొండపర్తిలో పాన్‌షాప్ నిర్వహిస్తుండగా, ఆయన గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తన దుకాణానికి వెళ్లాడు. తిరిగి రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి చేరుకునేసరికి పార్వతి విగతజీవిగా పడి ఉండటం చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు లోపలికి ప్రవేశించి, కాళ్లు చేతులు బంధించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మంగళసూత్రం, నల్లపూసల తాడు, చెవి రింగులు, చేతి గాజులను దోచుకుని అక్కడ నుంచి పరారయ్యారు. నేరం జరిగిన ప్రదేశంలో క్లూస్ దొరకకుండా ఉండేందుకు దుండగులు కారంపొడి చల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలి మెడపై గాయాలు ఉండటాన్ని బట్టి, నిందితులతో ఆమె తీవ్రంగా పెనుగులాడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు పార్వతి సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో తన పిల్లలతో ఫోన్లో మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. దీనిని బట్టి ఆ తర్వాతే ఈ హత్య జరిగి ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న ఫోర్త్‌టౌన్ క్రైం పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. క్రైం డీసీపీ, ఏసీపీలతో పాటు లా అండ్ ఆర్డర్ ఏసీపీలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
18 కిలోల గంజాయితో ముగ్గురు అరెస్టు
చీడికాడ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకుని వాహనాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. ఆయన గురువారం అందించిన వివరాలిలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు మండలంలోని అప్పలరాజుపురం లలితా దేవి మెట్ట వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు స్కూటీలపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా ఆపి తనిఖీ చేయగా రెండు వాహనాల్లో 18 కిలోల గంజాయిని గోనె సంచిల్లో గుర్తించామన్నారు. దీంతో విజయవాడ ప్రాంతానికి చెందిన ఎం.యువనాగ సాయి సుధర్, వాసి గోపితో పాటు 17 సంవత్సరాల మైనర్ బాలుడిని పట్టుకున్నామన్నారు. వీరు అల్లురి జిల్లా పాడేరు ఏజేన్సీకి చెందిన గుంత నర్సు, నారీస్ పాంగి వద్ద నుంచి గంజాయిని సేకరించి విజయవాడకు తరలిస్తున్నట్టు విచారణలో తెలిపారన్నారు. వారి వద్ద రెండు స్కూటీలు, గంజాయిని, మూడు సెల్ఫోన్లను స్వాధినం చేసుకుని కోర్టుకు తరలించామని తెలిపారు. గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్ బుచ్చెయ్యపేట : గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకుని కోర్టుకి అప్పగించినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 11వ తేదీన బుచ్చెయ్యపేట వద్ద 194 కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న చీడికాడ మండలం బైలపూడికి చెందిన గొల్లవిల్లి గోపిని వడ్డాదిలో వాహనాల తనిఖీల్లో భాగంగా గురువారం పట్టుకున్నామన్నారు. గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తిగా గుర్తించి సీఐ కోటేశ్వరరావు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. పట్టుబడిన గంజాయి నిందితులతో ఎస్ఐ సతీష్ బుచ్చెయ్యపేటలో పట్టుకున్న వ్యక్తితో సీఐ, ఎస్ఐ -
భూ సమస్యలపై ఆదివాసీల రిలే దీక్షలు
రోలుగుంట: మండలంలోని కె.అడ్డసరం గ్రామానికి చెందిన ఆదివాసీలు తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే దీక్షలు గురువారం చేపట్టారు. గతంలో కె.అడ్డసరం రెవెన్యూ గ్రామంలో ఖాతా నెంబర్ 559లో భూములను ఫోర్జరీ వారసత్వ ధ్రువపత్రంతో రాయివరపు చంద్రశేఖరరావు పేరున మార్చారు. తహసీల్దార్ డిజిటల్ సంతకంతో ఆన్లైన్లో నమోదు కావడంతో సాగుదారులైన గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై కలెక్టర్ విచారణ చేపట్టి తహసీల్దార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చంద్రశేఖరరావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. భూముల హక్కు పత్రాలపై తహసీల్దార్ డిజిటల్ సంతకం రద్దు చేసే వరకూ రిలే దీక్షలు కొనసాగుతాయని కె.అడ్డసరం ఆదివాసీలు, కొంతలం ఓబీసీ రైతులు తేల్చిచెప్పారు. జాయింటు కలెక్టర్ కోర్టులో ఆర్వోఆర్ అపీల్‌పై ఆర్డరు వచ్చేంత వరకూ తమ జోలికి రావ్వొద్దని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘం జిల్లా కార్యదర్శి మూసూరి రాజు, కేదారి దేవి, వెంగళరావు సత్య, తుర్రి నూకరాజు, అర్జున్ పాల్గొన్నారు. సోషల్ మీడియాలో అసభ్య ప్రచారంపై కేసు -
ఇంధన భద్రతే దేశాభివృద్ధికి కీలకం
ఐఐపీఈ స్నాతకోత్సవంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్ సబ్బవరం : దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి, సాంకేతిక స్వావలంబన అత్యంత కీలకమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్ పేర్కొన్నారు. సబ్బవరం మండలంలోని వంగలి వద్ద గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) శాశ్వత ప్రాంగణంలో గురువారం నిర్వహించిన ఆరో వార్షిక స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, ఎనర్జీ స్టోరేజ్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో భారత్ ప్రస్తుతం వేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు ఆచార్య పీకే బానిక్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో మొత్తం 114 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. వీరిలో 92 మంది బీటెక్ విద్యార్థులు, 15 మంది ఎంఎస్సీ అప్లైడ్ జియాలజీ విద్యార్థులతో పాటు ఇద్దరు పీహెచ్డీ పరిశోధకులు కూడా ఉన్నారు. విద్యలో సమగ్ర ప్రతిభ కనబరిచిన అన్సుల్ చటర్జీకి అత్యున్నతమైన ‘ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్’ను అందజేశారు. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్‌లో అమితన్షు దాస్ బంగారు పతకాన్ని, అనుపమ్ ఆనంద్ వెండి పతకాన్ని అందుకోగా, పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగంలో హర్షకుమార్ అభిజిత్ స్వర్ణ పతకాన్ని, సోహమ్ ముఖర్జీ రజత పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఎంఎస్సీ అప్లైడ్ జియాలజీలో అమర్దీప్ ప్రసాద్ , దేవదత్త సెంగుప్తా వరుసగా బంగారు, వెండి పతకాలను స్వీకరించారు. సంస్థ డైరెక్టర్ ఆచార్య శాలివాహన్ మాట్లాడుతూ ఐఐపీఈకి కేటా యించిన శాశ్వత ప్రాంగణంలో తొలిసారిగా స్నాతకోత్సవం నిర్వహించడం తమకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామ్ ఫల్ ద్వివేది, బోర్డు సభ్యులు, పాల్గొన్నారు. -
గ్యాస్ మంట... ఓటీపీ తంటా..!
నాతవరం : గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ బుకింగ్‌కు చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా విధించిన ఆన్లైన్ నిబంధనలు గిరిజనులను అవస్థల పాల్జేస్తున్నాయి. ఒకనాడు మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం ప్రతి ఇంట్లో విధిగా పొగలేని పొయ్యిలు ఉండాలంటూ యుద్ధ ప్రతిపాదికన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. ఆ సమయంలో సరుగుడు సుందరకోట, కె.వి. శరభవరం గిరిజన పంచాయతీల్లో 90 శాతం గిరిజనులకు సెల్ఫోన్లు లేవు, గ్రామంలో దగ్గర బంధువులు, స్థానిక ప్రజా ప్రతినిధుల వద్ద ఉన్న సెల్ఫోన్లు నంబర్లు బినామీ పేర్లతో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసేశారు. మొదట్లో గ్యాస్ కనెక్షన్లు ఆన్లైన్ కాకుండా ఆఫ్‌లైన్‌లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేవారు. తాజాగా గ్యాస్ కొరత కారణంగా ప్రభుత్వం ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని వినియోగదారుకు ఓటీపీ వస్తేనే గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయాలని, ఆఫ్‌లైన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ సరఫరా చేయరాదని నిబంధన విధించారు. దీంతో మండలంలో సుమారుగా 26 గ్రామాలకు పైగా గిరిజన గ్రామాల్లో గిరిజనులకు 800 నుంచి 1000 మంది వరకు గ్యాస్ సిలిండర్లు పొందలేకపోతున్నారు. సుందరకోట పంచాయతీ శివారు అసనగిరి, తొరడ, బమ్మిడికలొద్దు, కొత్త దద్దుగుల, కొత్త లంకలు, ముంతమామిడిలొద్దు, సిరిపురం, కొత్త సిరిపురం తదితర గిరిజన గ్రామాలు పూర్తిగా కొండలపై ఉన్నాయి. ఆ పంచాయతీలో ఒక్క సెల్ టవరు కూడా ఏర్పాటు చేయలేదు. అక్కడ గ్రామాలకు పూర్తిగా సెల్ సిగ్నల్స్ లేవు. కొండల మీద గిరిజనులకు సెల్ఫోన్లు ఉంటే కొండలు దిగి మైదాన ప్రాంతం నాతవరం వస్తేనే సెల్ సిగ్నల్స్ అందుతాయి. సరుగుడు పంచాయతీ శివారు అచ్చంపేట, రామన్నపాలెం, దద్దుగుల, రాజవరం, యరకంపేట, మాసంపల్లి, కె.వి.శరభవరం పంచాయతీ శివారు కొండ ధర్మవరం, కృష్ణాపురం, కొడవటిపూడి అగ్రహారం తదితర గిరిజన గ్రామాల్లో కూడా సెల్ సిగ్నల్స్ లేవు. ఆయా గిరిజన గ్రామాల్లో అధిక శాతం ప్రజలకు సెల్‌ఫోన్ వినియోగంపై కనీస అవగాహన లేదు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్ కష్టాలతో గ్యాస్ సిలిండర్లు పొందలేక వారంతా తిరిగి వంట కోసం కట్టెల పొయ్యినే ఆశ్రయిస్తున్నారు. నాతవరం గ్రామంలో గల ఇండేన్ గ్యాస్ ఎజెన్సీ ద్వారా నాతవరం, గొలుగొండ, అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో సుమారుగా 16వేల మంది వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేస్తున్నారు. నర్సీపట్నంకు చెందిన హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీ నుంచి కూడా నాతవరం, గొలుగొండ మండలాల్లో కూడా వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఈ రెండు మండలాల్లో సుమారుగా 20 వేల గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ఓటీపీ చెబితేనే గ్యాస్ సిలిండరు ఇస్తాం కలెక్టరు, జాయింట్ కలెక్టరు ఆదేశాల ప్రకారం ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని ఓటీపీ నెంబరు వస్తేనే గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఆఫ్‌లైన్‌లో ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ ఇవ్వం. ఆన్లైన్లో బుకింగ్ కాకపోతే వినియోగదారుడు మా ఆఫీసుకు గ్యాస్ నంబరు తీసుకు వస్తే ఈకేవైసీ చేసి ఫోన్లో బుకింగ్ చేసి లబ్ధిదారుకు గ్యాస్ ఇస్తాం. – చెక్కా తాతారావు, ఇండేన్ గ్యాస్ డీలరు, నాతవరం కట్టెల పొయ్యే గతి కూటమి ప్రభుత్వం కొత్త నిబంధనల కారణంగా గ్యాస్ డీలరు ఆఫ్‌లైన్‌లో గ్యాస్ సిలిండరు ఇవ్వలేదు. మా గ్రామాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేయలేదు. అలాంటప్పుడు మాకు ఆన్లైన్ బుకింగ్ ఎలాగో తెలియదు. పాత పద్ధతుల్లోనే మా గిరిజన గ్రామాల్లో ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకుని గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. – కొండపల్లి చింతల్లి, మాజీ సర్పంచ్, సుందరకోట పంచాయతీ -
ధర్మసాగరం పంచాయతీకి ఐఎస్ఓ సర్టిఫికెట్
ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకుంటున్న కార్యదర్శి సూర్యకళ, తాజా మాజీ సర్పంచ్ కన్నయ్యనాయుడు నర్సీపట్నం : ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ ఉత్తమ గ్రామంగా పేరుపొందిన నర్సీపట్నం మండలం, ధర్మసాగరం పంచాయతీ అంతర్జాతీయ ప్రమాణాల ఆర్గనైజేషన్(ఐఎస్ఓ) గుర్తించింది. జిల్లాలో ధర్మసాగరం తుది జాబితాలో ఎంపిక కాబడింది. ఐఎస్ఓ 9001–2015 సర్టిఫికెట్‌ను టాటా క్వాలిటీ సెర్ట్ సర్వీసెస్ ప్రతినిధి సలీం, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి చెందిన కళ్యాణి గురువారం పంచాయతీ కార్యదర్శి సూర్యకళ, తాజా మాజీ సర్పంచ్ గొంప కన్నయ్యనాయుడుకు అందజేశారు. పంచాయతీ పరిపాలనలో కార్యాలయం పనితీరు, ప్రజలకు అందించే సేవలు, రికార్డులు, పారిశుధ్యం, తాగు నీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ, ప్రజలతో ఉద్యోగుల సత్ప్రవర్తన, మెరుగైన ప్రజా సేవలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహిస్తున్నందున ఐఎస్ఓ 9001–2015 సర్టిఫికెట్ వరించింది. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుకల రమణమ్మ, ఎంపీడీవో సిహెచ్.ఉషారాణి, డిప్యూటీ ఎంపీడీవో రమా కుమారి, మాజీ ఉపసర్పంచ్ వెంకటలక్ష్మి, అప్పలనాయుడు, చినబాబు పాల్గొన్నారు. -
జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం
అనకాపల్లి: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ, యువత భవిష్యత్‌తో అడుకుంటున్న నేరస్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తుహిన్ సిన్హా గురవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరం అసాంఘిక కార్యక్రలాపాలకర పాల్పడుతున్న, గంజాయి స్మగ్లర్‌పై ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉత్తర్హులు మేరకు పీటీ ఎన్డీపీఎస్ యాక్టును ప్రయోగించి జైలుకు తరలించడం జరుగుతుందన్నారు. రోలుగుంట మండలం, బెన్నభూపాలపట్నం గ్రామానికి చెందిన చిన్నికృష్ణ(35) కొంతకాలంగా వరుసగా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడుతున్నాడని, ఇతనిపై జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్‌లో ఐదుకు పైగా కేసులు నమోదై ఉన్నాయన్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ సమాజానికి ముప్పుగా మారిన చిన్ని కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందని, దీనిపై పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఈనెల 11న పీటీ యాక్టు అమలు చేయాలని ఆదేశించినట్టు ఎస్పీ చెప్పారు. కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్ఐ పి.రామకృష్ణారావు చిన్నికృష్ణను అదుపులోనికి తీసుకుని, విశాఖ సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిందన్నారు. ఈ చట్టం కింద అరెస్టుయిన వ్యక్తికి ఏడాది వరకూ బెయిల్ వచ్చే అవకాశం ఉండదన్నారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. సాదారణ సెక్షన్లతో పాటు పీటీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. -
రెవెన్యూ సేవలు వేగవంతం
నేటి నుంచి శుభకార్యాలకు బ్రేక్ తుమ్మపాల : రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని, రెవెన్యూ సేవలలో సమయపాలన, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనను కట్టుదిట్టం చేయాలని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులు ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో మానిటరింగ్ చేసి, రెవెన్యూ సేవలలో ఆలస్యం లేకుండా ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూ, ఆక్రమణలను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో వివాదరహిత భూ రికార్డులు, బాధ్యతాయుత రెవెన్యూ పరిపాలన కోసం అధికారులు మరింత చురుకుగా పనిచేయాలన్నారు. ఆన్లైన్ సేవలు, భూ వ్యాపింగ్, రికార్డులు అప్డేషన్, మ్యుటేషన్ దరఖాస్తులు వంటి సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక తయారుచేసుకొని పరిష్కరించాలన్నారు. లోపాలు ఉన్న చోట వెంటనే సరిదిద్దాలని, నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించాలన్నారు. పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్‌లలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విచారణ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో సుబ్బలక్ష్మి, ప్రత్యేక డిప్యుటీ కలెక్టర్లు కె.మనోరమ, అనిత, ఆర్డీఓలు షేక్ అయిషా, వి.వి.రమణ, ఏడీ సర్వే గోపాలరాజా పాల్గొన్నారు. -
ఆగని అక్రమ మట్టి తరలింపు
మంగళవారం రాత్రి తరలించుకువచ్చిన చెరువు మట్టి ఎస్.రాయవరం : ఇటుక బట్టీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసినా, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా తమ బట్టీలకు అక్రమ మట్టి రవాణా ఆపబోమని ఇటుక బట్టీల యజమానులు యధావిధిగా మంగళవారం రాత్రి వమ్మవరం గ్రామంలో బట్టీల వద్దకు మట్టిని తరలించారు. యలమంచిలి కృష్ణాపురం చెరువులో అనుమతులు పొందినట్టు జేసీబీలను ఉపయోగించి దర్జాగా వమ్మవరానికి మట్టి తరలించుకు రావడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షించినా మట్టి తరలింపు ఆపకపోవడం పట్ల ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. అనకాపల్లి జిల్లా పోలీస్, అధికారులు విజిలెన్స్ ఉన్నతాధికారులకు బుధవారం మరో మారు ఫిర్యాదు చేశారు. -
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెంకన్న
దేవరాపల్లి: అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దేవరాపల్లికి చెందిన డి.వెంకన్న ఎన్నికయ్యారు. అమలాపురంలో ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నట్లు వెంకన్న బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, వృత్తిదార్లు, సన్న,చిన్నకారు రైతులు పాల్గొన్న ఈ మహాసభలో పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు తీర్మానాలు చేశామన్నారు. దళితులపై దాడులు, కుల వివక్షను అరికట్టాలని, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినట్టు చెప్పారు. దళితులు, గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని వెంకన్న విమర్శించారు. క్రైస్తవ మతం తీసుకున్న దళితులను ఎస్సీలు కాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని వారి సర్టిఫికెట్లను రద్దు చేయించాలని చూస్తుండటాన్ని మహాసభలో తీవ్రంగా ఖండించినట్టు చెప్పారు.ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. -
వేసవి శిక్షణ విజ్ఞానదాయకం
మాట్లాడుతున్న ఎంఎస్ఆర్ ఐటీఐ కరస్పాండెంట్ జోగారావు మునగపాక : వేసవి సెలవులను వృఽథా చేయకుండా విజ్ఞానాన్ని అందించే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఆర్ ఐటీఐ కరస్పాండెంట్ మళ్ల జోగారావు కోరారు. మునగపాక గ్రామీణ యువజన మందిరం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. లక్ష్యం కోసం చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. కర్ర సాము, చెస్, క్యారమ్, గీత శ్లోకాలపై శిక్షణ పెంచుకోవాలన్నారు. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. యువజన మందిరం అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మందిర సభ్యులు ఆడారి లక్ష్మణరావు, ఆడారి సూర్య చంద్రరావు, వెలగా ప్రవీణ పాల్గొన్నారు. -
వ్యర్థాల తొలగింపునకు సమగ్ర కార్యాచరణ
తుమ్మపాల : ప్రతి గ్రామ పంచాయతీలోను పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే పూర్తిగా తొలగించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టరు విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ ఎంపీడీఓలు, పోలీస్, విద్యుత్, వైద్య, విద్య, రవాణా శాఖ అధికారులతో బుధవారం వెర్వేరుగా ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా వ్యర్థాలు లేకుండా సమగ్ర కార్యాచరణ చేపట్టాలన్నారు. వ్యర్థాల తొలగింపు కోసం అవసరమైన యంత్రాలు, సిబ్బంది, నిధులను సమకూర్చుకొని పనులను పురమాయించి వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో గార్బేజ్ ట్రాన్సిట్ స్టేషన్లు ఏర్పాటు చేసి, చెత్త సేకరణ, రవాణా వంటి వ్యవస్థను మరింత సమర్ధంగా నిర్వహించాలన్నారు. అన్ని వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చూసుకోవాలని, ఎక్కడైనా లోపాలు ఉంటే తక్షణమే మరమ్మతులు చేయాలన్నారు. ప్రతి ఇంటిలో సొంత మరుగుదొడ్లు ఉండేలా, వాటిని వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని, వసూళ్ల లక్ష్యాలను చేరుకుని జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు ఈ నెల 21 నుంచి జూన్ 04 వరకు జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వానన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సమర్ధంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల కేంద్రంలోకి హాల్ టికెట్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్ప మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఐప్యాడ్, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతింపబోమన్నారు. టాయిలెట్లు, వైద్య విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు పరిశీలన చేసుకోవాలన్నారు. మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశిస్తూ సంబంధిత అధికారులను పరీక్షలు పారదర్శకంగా, జరిగేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలు సమకూర్చాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అలాగే, ప్రశ్నాపత్రాల రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ సుబ్బలక్ష్మి, డీఈవో అప్పారావునాయుడు, డీపీవో సందీప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
దేవరాపల్లి: అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి ఓ కుమార్తె తల కొరివి పెట్టి రుణం తీర్చుకుంది. పలువుర్ని కంటతడి పెట్టించిన ఈ ఘటన మండలంలోని పెదనందిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. పెదనందిపల్లి గ్రామానికి చెందిన వేచలపు గోవింద అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన గోవిందకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ముగ్గురు కుమార్తెలకు వివాహం అయింది. కుమారులు లేకపోవడంతో పెద్ద కుమార్తె అంజలి తల కొరివి పెట్టడానికి ముందుకు వచ్చింది. కుండ పట్టుకుని తండ్రి అంతిమ యాత్రలో పాల్గొని, దహన సంస్కారాలు పూర్తిచేసింది. అంజలి విశాఖపట్నంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తోంది. తండ్రికి కుతూరు తల కొరివి పెట్టిన దృశ్యాని చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో పెదనందిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
వంతెన సంగతి మరిచారా?
భూమి పూజకు 17 నెలలు..నిర్మాణానికి ఇంకెన్నేళ్లు? నర్సీపట్నం– తుని మధ్య వెదుళ్ల గెడ్డపై కలగానే వంతెన నిర్మాణం తాండవ ఉప్పొంగితే రెండు జిల్లాల రాకపోకలు బంద్ గత ప్రభుత్వంలో నిధులు మంజూరైనా కాంట్రాక్టరు నిర్వాకంతో జరగని పనులు మరల రీశాంక్షన్తో పనులకు భూమి పూజ చేసిన స్పీకర్, కలెక్టరు రోడ్డు విస్తరణ చేసి వంతెన పనులు మరిచిన వైనం ఆర్భాటమేనా..? కూటమి ప్రభుత్వం ఆర్భాటమే తప్ప దానికి తగట్టుగా పనులు చేయడం లేదు. మమ్మల్ని విమర్శించారు. ఇపుడు మీరు చేసిందేంటి? స్పీకరు అయ్యన్న పాత్రుడు, కలెక్టరు విజయకృష్ణన్ స్వయంగా భూమి పూజ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా వంతెన పనులు మొదలు కాలేదు. దీనిని బట్టి చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది. – సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీపీ నాతవరం మండలం రెండేళ్లయినా అభివృద్ధి ఊసు లేదు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు కంటే రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుపైనే దృష్టి పెట్టింది. స్పీకరు, కలెక్టరు స్వయంగా భూమి పూజ చేసిన పనులే ఈ విధంగా జరుగుతుంటే..మిగిలిన అభివృద్ధి పనుల మాటేమిటో? –లగుడు నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్, వైఎస్సాన్సీపీ మండల శాఖ అధ్యక్షుడు నాతవరం : ఆర్భాటంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు.. కానీ వంతెన నిర్మాణం పనులు మరిచారు. ఈ రోడ్డు పనులకు స్వయంగా అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టరు విజయకృష్ణన్ 2024 నవంబరులో భూమి పూజ చేశారు. కానీ ఏడాదిన్నర గడిచినా వంతెన నిర్మాణం ఊసేలేదు. మండలంలో నర్సీపట్నం–తుని మధ్య గన్నవరం మెట్ట వద్ద అర్అండ్ రోడ్డుపై వెదుళ్లుగెడ్డ ప్రతి ఏటా వర్షాలు సమయంలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. గతంలో ఇక్కడ వెదుళ్లుగెడ్డ నీటి ఉధృతికి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో అర్అండ్బీ రోడ్డుపై వెర్రిగెడ్డ నీటి ప్రవాహాన్ని అప్పటి ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ స్వయంగా పరిశీలించారు. రోడ్డుపై వెదుళ్లు గెడ్డనీరు ప్రవాహంతో ఈ చుట్టుపక్కల గ్రామాలు వైబీ అగ్రహారం, గన్నవరం మెట్ట నీటి ముంపునకు గురికావడం, ఈ ప్రాంతీయులు బాధలు ఆయన చూశారు. ఈ సమస్యను అప్పటి సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో గన్నవరం మెట్ట వద్ద వెదుళ్లు గెడ్డపై వంతెన నిర్మాణం, శృంగవరం నుంచి 4 కిలోమీటర్లు కాకినాడ జిల్లా సరిహద్దు వరకు రోడ్డు విస్తరణ కోసం రూ.14 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో అప్పటి ఎమ్మెల్యే గణేష్ శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణకు సంబంధించి ఎ.శరభవరం, శృంగవరం మధ్య భూసేకరణ చేశారు. పనులు ప్రారంభించి పూర్తి చేయకుండా బిల్లులు రావంటూ సాకు చెప్పి అప్పటి టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ కాలయాపన చేశారు. ఆ పనులను మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీశాంక్షన్ చేశామంటూ 2024 నవంబరులో ఈ రోడ్డుకు స్పీకరు అయ్యన్నపాత్రుడు, కలెక్టరు విజయకృష్ణన్ స్వయంగా భూమి పూజ చేశారు. అసంపూర్తిగా ఉన్న శృంగవరం నుంచి జిల్లా సరిహద్దు మధ్య అర్అండ్బీ రోడ్డు విస్తరణ పనులు చేశారు. కానీ ఈ రోడ్డు మధ్యలో గన్నవరం మెట్ట వద్ద వెదుళ్లుగెడ్డపై వంతెన నిర్మాణం పనులు నేటికీ ప్రారంభించలేదు. భూమి పూజ చేసి 17 నెలలు అవుతున్నా వంతెన పనులు ఊసెత్తలేదు. స్పీకరు, కలెక్టరు స్వయంగా భూమి పూజ చేయడంతో యుద్ధ ప్రాతిపదికన వంతెన నిర్మాణం చేస్తారు..ఏళ్ల నాటి సమస్య తీరుతుందని ఈ ప్రాంతీయలు ఆశించారు. కానీ వంతెన నిర్మాణం చేయకపోవడంతో ఈ ఏడాది కూడా వర్షాలు, తుఫాన్లు సమయంలో వెదుళ్లుగెడ్డ నీటి కష్టాలు తప్పవంటున్నారు. తాండవ ప్రాజెక్టు నుంచి స్పిల్‌వే గేట్లు ఎత్తినా, భారీ వర్షాలు కురిసినా వెదుళ్లుగెడ్డ రోడ్డుపై ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. నీటి ఉధృతి తగ్గేంత వరకు రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. రాత్రి వేళల్లో కొత్తగా వచ్చే వాహనదారులకు నీటి ఉధృతి తెలియక దిగేయడంతో పలువురు కొట్టుకుపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తుపానుల సమయంలో అధికారులు వెదుళ్లుగెడ్డ వద్ద కాపలా పెట్టి ప్రమాదాలు జరగకుండా పోలీసులు దగ్గరుండి వాహనాలు పంపిస్తూ జాగ్రత్తలు చేపడుతుంటారు. ఈ విషయంపై ఆర్అండ్బీ జేఈ నాయుడుబాబును సంప్రదించగా వంతెనలు నిర్మాణం చేసేందుకు కాంట్రాక్టరు జాప్యమే కారణమన్నారు. ఈ సమస్య ఉన్నతాధికారులు దృష్టిలో ఉందన్నారు -
‘పాలిటెక్నిక్’ దరఖాస్తుల విక్రయం ప్రారంభం
దరఖాస్తుల విక్రయాన్ని ప్రారంభిస్తున్న ఎండీ ప్రసాద్ కశింకోట: స్థానిక ఆర్ఈసీఎస్లోని రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యుత్ వినియోగదారుల కోటా కింద ప్రవేశానికి దరఖాస్తుల విక్రయం బుధవారం ప్రారంభమైంది. దరఖాస్తుల విక్రయాన్ని ఎమ్‌డి జి.ప్రసాద్ ప్రారంభించారు. ఈ నెల 30 వరకు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కళాశాలలో దరఖాస్తులను పొందవచ్చు. ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్, అసోసియేట్ ప్రిన్సిపాల్ కె. శివ, విభాగాధిపతులు గణేష్, రమణ కుమార్, ఆఫీస్ సూపరింటిండెంట్ కె. శివరాం తదితరులు పాల్గొన్నారు. -
కూటమి నేతల వత్తాసు!
సొసైటీ రుణాలు కొల్లగొట్టిన సీఈవోకు రోలుగుంట : జానకీరాంపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కోట్లాది రూపాయలు రుణాలు దర్వినియోగానికి పాల్పడిన నేరంపై ఉన్నతాధికారులు ఆ సంఘ సీఈవోను విధుల నుంచి తొలగించారు. మళ్లీ అదే వ్యక్తికి కూటమి నాయకుల సిఫారసుతో అదే బ్యాంకులో విధుల్లో చేరే విధంగా తీర్మానం చేయడంపై బాధితులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు, రైతు సంఘ నాయకులు బుధవారం విలేకరులతో పీఏసీఎస్‌లో జరిగిన అవకతవకలు, బినామీ రుణ బాధితులు తమకు జరిగిన నష్టంపై మాట్లాడారు. సమారు నాలుగైదేళ్ల క్రితం కోట్లాది రూపాయలను పలు రకాల రుణాలు సభ్యులకు తెలియకుండా మంజూరు చేసి అప్పటి సీఈవో కృష్ణ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. సొసైటీలో సభ్యులు కాని వారికి, స్థానికేతరులకు, భూమిలేని వారికి సుమారుగా 200 మంది పేరున రుణాలు మంజూరుకు పాల్పడ్డాడని కిల్లాడ సాంబమూర్తి నాయుడు, గొల్లు కల్పన, నారాయణరావు ఆరోపించారు. దీనిపై పలువురు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కల్టెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేసి, సీఈవోకు, అతనికి సహకరించిన గుమస్తాను తొలగిస్తూ సమారు ఎనిమిది మాసాల క్రితం డిస్మిస్ చేయడం జరిగింది. దీినిపై కోపోద్రిక్తుడైన సీఈవో రికార్డులను కాల్చేస్తానని పెట్రోలు తీసుకెళ్లి అధికారులను బెదిరించాడు. దీంతో ఇక్కడ అధికారుల ఫిర్యాదుతో అప్పటి సీఐ గోవిందరావు కేసు నమోదు చేసి విచారణానంతరం రిమాండుకు తరలించగా 70 రోజులు రిమాండు ఖైదీగా ఉన్నాడు. విచారణ తూతూ మంత్రం? అయితే రుణబాధితుల ఫిర్యాదును మాత్రం ఆ శాఖ అధికారులు తూతూ మంత్రంగానే విచారణ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 51 చట్టం ప్రకారం విచారణ చేస్తామంటారు, ఎత్తేస్తారు.. ఇలా బాధితులతో ఆటలాడుకోవడం మినహా న్యాయం జరగలేదని చెబుతున్నారు. సుమారు రూ.నాలుగు కోట్ల నష్టంతో ఉన్న ఈ పీఏసీఎస్ ఇటీవల మడ్డు గణేష్ అనే సీఈవోతో నామమామత్రంగా నడుపుతున్నారు. ఇదిలా ఉండగా జనసేన పార్టీ మండల నాయకుడు దొరబాబుని పర్సన్ ఇన్చార్జిగా, మరో ఇద్దరు డైరెక్టర్లతో నడుస్తుంది. ఈ పర్సన్ ఇన్చార్జితో డిస్మిస్ అర్డరు జారీ చేసి, ఇదే ఇన్చార్జితో మరలా విధుల్లో చేర్పించే తీర్మానం చేయడానికి పాలకవర్గం యత్నాన్ని, కూటమి ప్రభుత్వ తీరును బాధితులు తీవ్రంగా ఖండిస్తున్నారు. విధుల నుంచి డిస్మిస్ అయి 70 రోజులు రిమాండు ఖైదీగా ఉన్న వ్యక్తికి మళ్లీ ఇదే పీఏసీఎస్‌లో ఉద్యోగమిస్తే, అతన్ని విధుల్లో చేరనివ్వబోమని, అలా జరిగితే వందలాది మందితో కలసి పీఏసీఎస్‌కు తాళం వేసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. కూటమి నాయకులు చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, జనసేన నియోజకవర్గం ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్ రాజును కలసి తమ ఉద్యమ నోటీసును అందజేయనున్నట్టు గ్రామ నాయకులు సబ్బవరపు పెద్దినాయుడు తదితరులు స్పష్టం చేశారు. -
● కంచరపాలెం, ఎయిర్‌పోర్టు స్టేషన్ల పరిధిలో నాలుగు చోరీలు ● ఉదయం 7.30 నుంచి 11.30 మధ్యే చోటు చేసుకున్న వైనం
‘చైన్’చోరీలతో బెంబేలు గోపాలపట్నం: విశాఖనగరంలో ఒకే రోజు గంటల వ్యవధిలో నాలుగు చోట్ల జరిగిన చైన్ స్నాచింగ్‌లతో ప్రజలు హడలెత్తిపోయారు. కంచరపాలెం, ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7.30 నుంచి 11.30 మధ్య నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. మహిళల మెడల్లో ఉన్న చైన్లను తెంచుకుపోయారు. బాధితులు పోలీసులు తెలిపిన వివరాలు.. మొదటి చోరీ.. ఉదయం 7.30 సమయంలో మర్రిపాలెం జ్యోతీనగర్ వద్ద పంచముఖి లక్ష్మి(62) కాయగూరలు కొనుగోలు చేసేందుకు వచ్చింది. 7.45 గంటలకు తిరుగుముఖం పడుతూ ఇంటి సందులో మలుపుతిరుగుతున్న సమయంలో కాపుకాసి ఉన్న దుండగుడు వెనక నుంచి వచ్చి మెడలోని గొలుసు తెంచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన లక్ష్మి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం తెంచుకుపోయాడు. లాకెట్టు, చైన్‌లో సగభాగం తన చేతిలో ఉండిపోయింది. సుమారు రెండున్నర తులాల వరకు దుండగుడు లాక్కెళ్లిపోయినట్లు బాధితురాలు వాపోతోంది. రెండో చోరీ : పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద ఉదయం 8.05 గంటల సమయంలో రాజీవ్‌నగర్‌కు చెందిన నిడమల రత్నకుమారి విధులకు హాజరయ్యేందుకు బస్టాప్ సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఆటో కోసం నిరీక్షిస్తోంది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో పుస్తెల తాడు, నల్లపూసల దండ తెంచుకెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె అప్రమత్తం కావడంతో చేతిలో పుస్తెలు, నల్లపూసల దండ కొంతభాగం ఉండిపోయింది. మిగిలిన సుమారు రెండున్నర తులాలు తెంచుకుపోయాడు. మూడో చోరీ : ఉదయం 8.15 గంటల సమయంలో కంచరపాలెం జైభారత్‌నగర్ వద్ద ఎస్ కోట దరి జామి వెళ్లేందుకు వర్రి అరుణ బస్టాప్‌కు నడుస్తూ వస్తోంది. కాపుకాసిన దుండగుడు రెండు తులాల గొలుసు, రెండు తులాల నల్లపూసల దండ లాక్కుపోయాడు. నాలుగో చోరీ : విమాన్‌నగర్ వద్ద అదే ప్రాంతానికి చెందిన ఎం.అచ్చయ్యమ్మ(56) ఉదయం 11.30కు నగరంలో జరిగే ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు బస్టాప్ వద్ద నిరీక్షిస్తోంది. అక్కడే ఉన్న ఓ యువకుడు ఆమెను సమీపించాడు. బైక్‌పై మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న 5 తులాల నల్లపూసల దండ, చైన్ తెంచుకుని బైక్‌పై వెళ్లిపోయారు. గమనించిన ఓ వ్యక్తి తన బైక్‌తో వెంబడించే ప్రయత్నం చేసినా ఆ వ్యక్తిని ఢీకొట్టేందుకు యత్నించి తప్పించుకుపోయారు. కరాసా వద్ద బైక్ చోరీ : ఆ సమయంలోనే కరాసాకు చెందిన ఓ యువకుడి ద్విచ్రవాహనం చోరీకి గురయింది. కరాసా వద్ద నైట్ ఫుడ్ స్టాల్స్ ఉన్న చోట 10.30 సమయంలో పార్కింగ్ చేసిన తన బైక్‌ను ఎవరో దొంగిలించడంతో బాధితుడు వెంటనే వాట్సాప్ ఫిర్యాదుతోపాటు, స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు కూడా చేశాడు. తన బైక్‌తోనే ఈ చోరీలకు పాల్పడ్డారేమోనని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఉదయం 7.30 నుంచి దొంగతనాలు జరుగుతుండటంతో ఈ వాహనం వాడి ఉండరని పోలీసులు చెప్తున్నారు. చైన్ స్నాచింగ్‌లపై బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్రమౌళి తెలిపారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు -
నేటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
మహారాణిపేట(విశాఖ) : వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలుం ఇలా శుభకార్యాలతో కళకళలాడే వేళకు తాత్కాలికంగా విరామం పడింది. గురువారం నుంచి వరుసగా 36 రోజుల పాటు శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి బాజాలు మూగబోనున్నాయి. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 18 వరకు వివాహాది శుభకార్యాలకు బ్రేక్ పడింది. వేద పండితుల ప్రకారం ఈ కాలాన్ని ‘మూఢమి’గా పరిగణిస్తారు. అందుకే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి ప్రధాన శుభకార్యాలను చాలామంది వాయిదా వేస్తున్నారు. అయితే అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం, రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. జూన్ 19 నుంచి మళ్లీ పెళ్లి సందడి జూన్ 19న నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కావడంతో మళ్లీ శుభముహూర్తాల సందడి మొదలుకానుంది. జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత జూలై 1 నుంచి 9 వరకు కూడా వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ పలు శుభముహూర్తాలు లభించనున్నాయి. గత డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీగా వివాహాలు జరగడంతో పట్టణాలు, గ్రామాలు పెళ్లి వేడుకలతో కళకళలాడాయి. ఇప్పుడు మరోసారి జూన్ చివరి నుంచి అదే సందడి కనిపించనుంది. పెళ్లి రంగానికి తాత్కాలిక మందగమనం శుభముహూర్తాలు లేకపోవడంతో వివాహాలకు అనుబంధంగా ఉన్న వందలాది వృత్తులు తాత్కాలికంగా మందగించనున్నాయి. కళ్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్ హౌస్‌లు, డెకరేషన్, పూల వ్యాపారులు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారులు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్ మేళాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, హోటళ్లు, లాడ్జిలు ఇలా అనేక రంగాలపై ప్రభావం పడనుంది. అయితే జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాల సీజన్ ప్రారంభం కావడంతో ఈ రంగాలన్నీ తిరిగి ఊపందుకోనున్నాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 19 వరకు ఆగాల్సిందే.. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 18 వరకు ప్రధాన శుభకార్యాలకు విరామం ఉంటుంది. జూన్ 19 నుంచి మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. – అయిలూరి శ్రీనివాస దీక్షితులు -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం
చోడవరం: పట్టణ శివారు అన్నవరం ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ప్రధాన విద్యుత్ వైర్లపై చెట్లకొమ్మలు పడి షార్ట్ సర్క్యూట్ జరగడంతో పలు ఇళ్లలో గృహోపకరణాలు దగ్ధమై సుమారు రూ.10 లక్షల నష్టం జరిగింది. 40 ఇళ్లలో ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, ఇతర గృహోపకరణాలు కాలిపోవడంతో పాటు, ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం విద్యుత్ శాఖ ఏఈ రాజుతోపాటు సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఏఈని చుట్టుముట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన విద్యుత్‌లైన్లపై పలుచోట్ల చెట్ల కొమ్మలు తాకుతున్నాయని, దీనివల్ల సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడుతోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఏకంగా వైర్లపై కొమ్మలు పడి షార్ట్‌సర్క్యూట్‌తో తమ ఇళ్లలో ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, ఇతర గృహోపకరణాలు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మొక్కుబడిగా విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి చూసి పోవడమే తప్ప ఏ పనీ సక్రమంగా చేయడంలేదని ఆరోపించారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఏఈ నిర్లక్ష్యం వల్లే... అన్నవరం సబ్‌స్టేషన్ పరిధిలో నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమై తరుచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్‌శాఖ ఏఈ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా గతంలో అనేక ఫిర్యాదులు కూడా వెళ్లాయి. మండల సమావేశాల్లో సైతం ఎంపీటీసీలు, వార్డుమెంబర్లు ఇక్కడ ఏఈపై ధ్వజమెత్తినా మార్పురాకపోవడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చర్యలుతీసుకుని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని చోడవరం పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
అణచివేతకే అక్రమ కేసులు
అనకాపల్లి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, యువజన విభాగం నాయకులను అణచివేయడమే ధ్యేయంగా పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్ రాజా, జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ అన్నారు. స్థానిక భీమునిగుమ్మం అంబేడ్కర్ విగ్రహం వద్ద కర్నూలు జిల్లాలో పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు బాలుపై అక్రమ కేసును తొలగించాలని బుధవారం జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ప్రభుత్వంలో ఇప్పుడు తప్పు చేసిన నాయకులను, అధికారులను వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులపై జరుగుతున్న అరాచకాలను పార్టీ డిజిటల్ బుక్‌లో వారి పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుందని, తప్పక శిక్ష పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కర్రి రుద్రి, జిల్లాలో వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు జాజుల రమేష్, ఆకుల సాయి, పెద్దిశెట్టి శేఖర్, పట్టణ అధ్యక్షుడు వేగి త్రినాథ్, 82వ వార్డు అధ్యక్షుడు అల్లు త్రినాథ్, బుచ్చియ్యపేట మండల అధ్యక్షుడు రవి, పార్టీ సీనియర్ నాయకులు బుద్ద జగన్, కర్రి రమేష్, కొంకి శ్రీరామూర్తి, లక్కోజు రాంబాబు, బొనేల సాయి, సోమిశెట్టి భార్గవ్, దొడ్డి కిరణ్, నెట్టిమి రామచంద్రరావు, శరగడం హేమంత్, దేశెట్టి బసవేశ్వరరావు, నూకేష్, నడిశెట్టి గోవింద, రెడ్డి చిన్నా, దొడ్డి హేమంత్ పాల్గొన్నారు. -
వ్యవసాయ బోర్లకు విద్యుత్ లైన్లు ఏర్పాటు
నక్కపల్లి: వ్యవసాయ బోర్లకు ఽవిద్యుత్ సరఫరా కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్‌కో అధికారులు ఎట్టకేలకు విద్యుత్లైన్లు ఏర్పాటు పనులు ప్రారంబించారు. మండలంలో గొడిచర్ల గ్రామానికి చెందిన నలుగురు రైతులు తమ పొలాల్లో వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసుకునేందుకు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్కోవారికి దరఖాస్తు చేశారు. విద్యుత్లైన్లు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలంటే రూ.2.51 లక్షలు డీడీ చెల్లించాలని ట్రాన్సోకో వారు సూచించారు. ఏడాది క్రితం రైతులు ఈ మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించారు. డీడీలు చెల్లించినప్పటికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు మరోసారి ట్రాన్స్‌కో వారిని సంప్రదించారు. ఏడాది పూర్తవుతున్నా కనెక్షన్ ఇవ్వలేదంటూ అఽధికారులను ప్రశ్నించారు. దీంతో మరో రూ.1.35 లక్షలు చెల్లించాలని నోటీసు ఇచ్చారు. ఈ మొత్తాన్ని కూడా రైతులు చెల్లించారు. సుమారు నాలుగు లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుండడంతో ‘కనెక్షన్ పేరిట కలెక్షన్’ అనే శీర్షికన బాధితుల గోడు వినిపిస్తూ సాక్షి దినపత్రికలో వార్త కథనం వెలువడింది. డీడీలు చెల్లించినప్పటికీ విద్యుత్లైన్లు ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోందంటూ రైతుల ఆవేదనను సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి స్థానిక ట్రాన్స్‌కో వారిని వివరణ కోరారు. తక్షణమే రైతులకు విద్యుత్ సరఫరా ఇవ్వాలని ఆదేశాలు రావడంతో ట్రాన్స్‌కో అధికారులు యుద్ధ ప్రాతిపదికన రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన వదిలేసిన స్తంభాలకు విద్యుత్లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టారు. రెండు రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి రైతుల వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా ఇవ్వడం జరుగుతుందని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. -
విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందాలి
విద్యార్థులకు క్రీడా సామాగ్రి కిట్లను పంపిణీ చేసిన కలెక్టర్ విజయ్ కృష్ణన్ తుమ్మపాల : విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సమ్మర్ క్యాంప్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి కలెక్టరేట్లో బుధవారం క్రీడా సామాగ్రి కిట్లను ఆమె విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రీడలు, వ్యాయామం, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ నెల 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌లను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పి.శైలజ, కోచ్ సిహెచ్ సూరి అప్పారావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గోల్డ్ హంటర్స్!
● ఉదయం 7.45 గంటలు.. జ్యోతి నగర్.. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లి మొదటి సవాల్ విసిరారు. ● ఉదయం 8.05 గంటలు.. పంజాబ్ హోటల్ జంక్షన్లో మహిళ మెడలోంచి చైన్ తెంచేసి పారిపోయి హడలెత్తించారు. ● ఉదయం 8.15 గంటలు కంచరపాలెం జయభారత్నగర్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళే లక్ష్యంగా చైన్ అపహరించిన దొంగలు రెప్పపాటులో మాయమయ్యారు. ● ఉదయం 11.30 గంటలు... విమాన్‌నగర్ బస్టాప్ వద్ద బస్ కోసం ఎదురు చూస్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కుని పరారైపోయారు. నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు మార్చిలో 7 ఏప్రిల్‌లో 5 మే 13 వరకూ 4 సాక్షి, విశాఖపట్నం: మహానగరంలో ‘గోల్డ్’వేట మొదలైంది. గన్ పట్టుకున్న వేటగాడు అడవిలో పొంచి ఉన్నట్టు.. బైక్ ఎక్కిన దొంగలు.. జనం మధ్యే ‘స్నాచింగ్’పంజా విసిరారు. నాలుగు గంటల వ్యవధిలో 13 తులాల బంగారాన్ని కొట్టేశారు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న విశాఖ వీధులు ఇప్పుడు ‘గోల్డ్ హంటర్స్’దూకుడుతో ఉలిక్కిపడుతున్నాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలో, నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో హంటర్స్ చేసిన హడావుడి చూస్తుంటే.. పోలీసుల నిఘా వ్యవస్థకు గట్టి సవాల్ విసిరినట్టే కనిపిస్తోంది. టైమ్ ఫిక్స్.. టార్గెట్ గోల్డ్.! బుధవారం ఉదయం నుంచి జరిగిన చైన్‌స్నాచింగ్ కేసుల్లో దొంగల రూట్ మ్యాప్ చూస్తే ఎవరికై నా ఆందోళన కలగాల్సిందే. వచ్చింది ద్విచక్ర వాహనంపై.. పోయింది సుమారు 13 తులాల పసిడి. బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టారు. అయితే.. నాలుగు చోట్లా చేసింది ఒక్కరేనా.. లేదా అంతర్రాష్ట్ర ముఠా పనా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. ‘నిఘా’నేత్రాలు నిద్రపోతున్నాయా.? నగర రక్షణ కోసం సిటీలో ఏర్పాటు చేసిన ‘మూడో కన్ను(సీసీ కెమెరాలు)’అనేక చోట్ల రెప్పవాల్చిన విషయం చైన్ స్నాచింగ్ ముఠా పసిగట్టినట్లుందనే వదంతులు వినిపిస్తున్నాయి. సేఫ్ సిటీగా ఉన్న విశాఖ నగరం.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గోల్డ్ హంటర్స్ సిటీగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖ సిటీ పోలీస్ అధికారిక గణాంకాల ప్రకారం... నగర వ్యాప్తంగా 13,485 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అధికారిక రికార్డులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ డేటా, ఇటీవల పోలీస్ శాఖ నిర్వహించిన అంతర్గత ఆడిట్ నివేదికల ప్రకారం.. వీటిలో పోలీస్ శాఖవే కాకుండా ‘నేను సైతం’ప్రోగ్రామ్ కింద ప్రజలు, షాపుల యజమానులు పెట్టినవి కూడా ఉన్నాయి. వీటిలో ఎన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్ పంపుతున్నాయనే లైవ్ స్టేటస్ ద్వారా దాదాపు 40 శాతం అంటే 5,394 సీసీ కెమెరాలు మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయని గుర్తించారు. ఇదే.. దొంగలకు అనువుగా మారిందనే అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసుల యాక్షన్ ప్లాన్ షురూ..! వరుస ఘటనలతో అప్రమత్తమైన నగర పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. గతంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే నిందితులు కావడంతో.. బుధవారం జరిగిన చోరీలు కూడా వారి పనేనని ప్రాథమికంగా నిర్ధారించారు. సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు, పనిచేస్తున్న కొన్ని కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల వేటలో నిమగ్నమయ్యారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు పెరిగినప్పటి నుంచి చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా జరుగుతుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. వీలైనంత త్వరగా గోల్డ్ హంటర్స్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. -
డివైడర్‌ను ఢీకొన్న కారు... ఒకరు మృతి
పాయకరావుపేట : జాతీయ రహదారి పై విశాఖపట్నం వైపునకు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందినట్టు ఎస్ఐ ఆలీ తెలిపారు. నామవరం గ్రామం వద్ద మంగళవారం రాత్రి కారు ముందు ప్రయాణిస్తున్న మోటార్ బైక్ హఠత్తుగా బ్రేక్ వేయడం వల్ల అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఇద్దరు వ్యాపారం నిమిత్తం శ్రీకాకుళం వెళ్తున్నారు. కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి రాధా ఆలీసామను తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. కారులో వున్న మరో వ్యక్తి సోమ మహామ్మద్ అనే వ్యక్తి గాయపడడంతో తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి గుజరాత్‌కు చెందిన వ్యక్తి అని, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సుమారు రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత
అనకాపల్లి : ఏజెన్సీ ప్రాంతం నుంచి అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట, జాతీయ రహదారి మీదుగా కారులో తరలిస్తున్న 194 కేజీల గంజాయితో పాటు(వీటి విలువ సుమారుగా రూ.97లక్షలు) కారు, ముగ్గురు వ్యక్తులు, మూడు సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాదీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. తమ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంజాయి రవాణాపై జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ, గంజాయి స్మగ్లర్లు ప్రత్యేక మార్గాల్లో రవాణా చేయడం జరుగుతుందని, గత ఏడాది కంటే ఈ ఏడాది గంజాయి(డ్రైయి) రవాణా తగ్గినప్పటికీ హషీష్ అయిల్ పెరిగిందన్నారు. ఈనెల 11న జిల్లాలో బుచ్చియ్యపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈగిల్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ పర్యవేక్షణలో అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు బుచ్చియ్యపేట పోలీసులు బంగారుమెట్ట–అనకాపల్లి రోడ్డులోని గొన్నవానిపాలెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. గంజాయితో వెళుతున్న కారుకు రూట్ మ్యాప్ ద్వారా వెళుతున్న సమయంలో బైక్‌ను నడుపుతున్న వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించగా, వెనుక కారులో 194 కిలోల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పటుబడ్డారని తెలిపారు. చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గుమ్మాల పేరునాయుడు (గతంలో 6 కేసులు), అల్లూరి జిల్లా పెదబయలు మండలం, గజ్జేడు గ్రామానికి చెందిన మండిపల్లి సత్తిబాబు(గంజాయి సాగుదారు), చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గొల్లవిల్లి గణేష్(కారు డ్రైవర్)ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందుతుల కోసం గాలిస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా తక్షణమే 112 లేదా 1972 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. రెండేళ్లలో జిల్లాలో గంజాయి రవాణా గణనీయంగా తగ్గిందని, ఈ ఏడాది ఇప్పటి వరకూ 46 కేసులు నమోదు చేసి, మొత్తం 1,177 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందన్నారు. 7.14 లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రాసిక్యూషన్ విభాగంతో సమన్వయం ద్వారా ఈ ఏడాది 13 కేసుల్లో 24 మందికి శిక్షలు పడేలా చేశామని, ఇందులో 16 మందికి 10 నుండి 15 ఏళ్ల జైలు శిక్ష పడిందన్నారు. ఎన్డీపీఎస్ కేసుల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేటి వరకూ రూ.1.25 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, కొత్తకోట ఎస్ఐ ఎం.శ్రీనివాస్, బుచ్చయ్యపేట ఎస్ఐ ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. బుచ్చెయ్యపేట ఎస్ఐకు ఎస్పీ అభినందన బుచ్చెయ్యపేట: స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావును ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం అభినందించారు. బుచ్చెయ్యపేట రోడ్డులో సుమారు రూ.కోటి విలువ గల సుమారు 194 కిలోల గంజాయి, స్మగ్లర్లను చౌకచక్యంగా పట్టుకోవడంతో ఎస్ఐని సత్కరించారు.ఎస్ఐతో పాటు బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
బస్సు మెకానిజంపై డ్రైవర్లకు అవగాహన
ఆర్టీసీ డ్రైవింగ్స్కూల్ల్లో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న మెకానికల్ ఇంజినీర్ అశ్విని అనకాపల్లి : నిరుద్యోగ యువతీ, యువతులకు ఉద్యోగ ఆవకాశాల్లో భాగంగా ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) ఆధ్వర్యంలో 13 వ డ్రైవింగ్ స్కూల్ బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రజారవాణాశాఖ అనకాపల్లి డిపో గ్యారేజ్ మెకానికల్ ఇంజినీర్ అశ్విని అన్నారు. మంగళవారం డ్రైవర్లకు బస్సు మెకానిక్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైవర్లకు బస్సు మెకానిజంపై శిక్షణ, అవగహన కల్పించడం వల్ల వారిలో నైపుణ్యాన్ని వెలికితీయవచ్చన్నారు. కొన్ని సందర్భాల్లో బస్సులు మార్గమధ్యంలో ఆగిపోయినపుడు ఈ శిక్షణ వారికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డ్రైవింగ్ స్కూల్ అసిస్టెంట్ బాపు నాయుడు, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ జి.వి.రమణ పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ రవిబాబు దంపతులకు సత్కారం
సాక్షి,పాడేరు: పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు దంపతులను, వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,డాక్టర్ నర్సింగరావు దంపతులు ఘనంగా సన్మానించారు.అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్,అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, కరణం ధర్మశ్రీ, వెంకట్రామయ్య, మాజీ జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, వడ్డాది జెడ్పీటీసీ దొండా రాంబాబు, చింతపల్లి ఎంపీపీ అనుషాదేవి తదితర నేతలకు భాగ్యలక్ష్మి స్వాగతం పలికారు. -
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సు ప్రవేశ పరీక్షలు ప్రారంభం
పరీక్ష కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు మాకవరపాలెం : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సు ప్రవేశ పరీక్షలకు 273 మంది విద్యార్థులు హాజరయ్యారు. తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం నుంచి ఈ ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు ఈ నెల 18 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌రావు తెలిపారు. నిత్యం రెండు విడతల్లో జరిగే పరీక్షలకు గంటన్నర ముందుగా కేంద్రానికి హాజరుకావాలన్నారు. మొదటి రోజు 273 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. -
అందుబాటులో జనుము విత్తనాలు
అనకాపల్లి: చెరకు, కూరగాయ పంటలకు అవసరం మేరకు నీటి సదుపాయం కల్పించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి ఏడీఆర్ టి.శ్రీలత తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు, సలహాలు అందించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పంటలను బెట్ట నుంచి కాపాడటానికి పంట వ్యర్థాలతో మల్పింగ్ చేయాలి. ఖరీఫ్‌కు ముందు పచ్చిరొట్ట పైరు వేసుకోవాలి. వర్షాలు పడగానే విత్తుకోవడానికి వీలుగా విత్తనాలను ముందుగా సేకరించుకోవాలి. పరిశోధన స్థానంలో జనము విత్తనాలు ఎస్యూఐఎన్.037, జేఆర్జే 610 రకాలు కిలో రూ.130 చొప్పున అందుబాటులో ఉన్నాయి. విత్తనాల కోసం రైతులు సంప్రదించాలని సూచించారు. చెరకు మొక్క, కార్శి తోటలలో వరుసల మధ్య అంతర కృషి చేపట్టాలి. చెరకులో కొరడా తెగులు ఆశిస్తే ప్రొపికొనజోల్ 1 మి.లీ లేదా అజోక్సిస్ట్రోబిన్, టెబుకోనజోల్ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పీక పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే క్లొరాంట్రినిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఖరీఫ్ పంటగా నువ్వులు వేసుకోవడానికి నేలను తయారు చేసుకుని అధిక దిగుబడినిచ్చే వైఎల్‌ఎం. 66, 146 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కూరగాయల్లో బొగ్గు కుళ్లు తెగులు ఆశించవచ్చని, నివారణకు లీటరుకు 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను మొక్కమొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. మామిడిలో పండు ఈగ నివారణకు 2 మి.లీ మిథైల్ యూజినాల్, 3 గ్రా, కార్బోప్యూరాన్ 3జి గుళికలను లీటరు నీటిలో కలిపిన ద్రావణాన్ని ప్లాస్టిక్ సీపాలో పోసి తోటలో అక్కడక్కడా చెట్ల కొమ్మలకు వేలాడ దీయాలి. ఖాళీ పొలాల్లో వేసవిలోతు దుక్కులు దున్నుకోవాలని ఆమె చెప్పారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కె.వి.రమణమూర్తి, వి.గౌరీ, ఆర్.సరిత, వి.చంద్రశేఖర్, ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ భవనాల పూర్తికి ప్రతిపాదనలు
రావికమతం : జిల్లాలో 9 ప్రాజెక్ట్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న 208 అంగన్వాడీ భవనాలను పూర్తి చేసేందుకు రూ.11 కోట్లు నిధులు మంజురూ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.సూర్యలక్ష్మి తెలిపారు. మంగళవారం స్దానిక ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కిశోర వికాసంపై రూపొందించిన 18 అంశాలపై బాలికులకు అవగాహన కల్పించారు. తదనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా లో 9 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు పరిధిలో 1908 అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయని, వీటిలో నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ భవనాలకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించామన్నారు. అలాగే 24 ఖాళీగా ఉన్న సూపర్ వైజర్ పోస్టులు భర్తీ చేయాలని కోరామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయాలు, కార్యకర్తలకు సంబంధించి 236 మందిని నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేశామని ఆమె తెలిపారు. మే ఒక్కటి నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులలో కిశోర బాలికలకు కిశోర వికాసం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీని ద్వారా కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, పోషకాహార ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీని కోసం ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో 15 నుంచి 20 మందిని గ్రూపులుగా విభజించి మంగళవారం, శుక్రవారం సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో మంగతాయారు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం. రమేష్ పాల్గొన్నారు. -
బీసీ వసతిగృహ విద్యార్థినికి
అవార్డు ప్రదానంబీసీ సంక్షేమశాఖ మంత్రి సబిత నుంచి అవార్డు అందుకుంటున్న బీసీ వసతిగృహ విద్యార్థిని రుత్తల దుర్గ నర్సీపట్నం: ఇటీవల విడుదులైన టెన్త్ ఫలితాల్లో 574 మార్కులు సాధించిన బీసీ బాలికల వసతిగృహం విద్యార్థిని రుత్తల దుర్గ మంగళవారం రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంది. టెన్త్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతిగృహాల విద్యార్థులకు అమరావతిలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సబిత, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ ఎ.మల్లికార్జున్‌రావు, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ చేతుల మీదగా విద్యార్థిని దుర్గ అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకుంది. దుర్గను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వసతిగృహం వార్డెన్ బి.వెంకటలక్ష్మి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా భద్రతకు పాటుపడాలి
నర్సీపట్నం : మహిళా భద్రతపై మహిళా పోలీసు సిబ్బంది దృష్టిసారించాలని, మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు మహిళా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని అనకాపల్లి మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ, నర్సీపట్నం ఇన్ఛార్జీ డీఎప్పీ ఈ.శ్రీనివాసులు సూచించారు. స్థానిక ప్రవేటు కళ్యాణమండపంలో డివిజన్లోని మహిళా పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను ఆరికట్టేందుకు కృషి చేయాలని, మహిళల రక్షణపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రచార రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన శక్తి యాప్ అవశ్యకతను మహిళలు, బాలికలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్, రూరల్ సీఐలు గపూర్, రేవతమ్మ, పాయకరావుపేట సీఐ శంకర్రావు, డివిజన్ పరిధిలో మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వందో రోజు కొనసాగిన దళిత రైతుల దీక్షలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్ల దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం వందవ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ ఎటువంటి పరిహారం ఇవ్వకుండా దళిత రైతులకు చెందిన డీ పట్టా భూములను లాక్కొనేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు.దళితులు దీక్షలు చేపట్టి వంద రోజులైనా కూటమి నేతలు పట్టనట్టు వ్యవహరించడం శోచనీయమన్నారు.నిరుపేదలైన దళితుల భూముల్ని లాక్కొంటున్న ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వేలాది ఎకరాలకు దోచిపెడుతోందని విమర్శించారు.పంచదార్ల రైతులకోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు.అనంతరం దీక్ష శిబిరం వద్ద పలువురు దళిత సంఘాలు,విదసం నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐడీ బాబు,జి.దేముడు నాయుడు,చందక రామకృష్ణ,ధోనీ కాసియా,రేబాక రాము,ఎం.డి. రాజు,సూర్య,శివ,ఆర్ కృష్ణ,నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇటుక బట్టీలపై విజిలెన్స్ దాడులు
ఎస్.రాయవరం : మండలంలో ఇటుక బట్టీలపై విజులెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వమ్మవరం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల యజమానులు అక్రమంగా చెరువు మట్టిని తరలించి ఇటుక తయారికి వినియోగిస్తున్నారని మంగళవారం సాక్షి దినపత్రికలో ‘హోంమంత్రి ఇలాకాలో మట్టి మాఫియా’ అనే శీర్షికన వార్త వెలువడింది. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు స్పందించి వమ్మవరం ఇటుక బట్టీలపై దాడులు నిర్వహించారు. మట్టి నిల్వలను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. మట్టి ఎన్ని క్యుబిక్మీటర్లు ఒక్కో బట్టీవద్ద ఉన్నదీ, ఆ యజమాని ఎక్కడ నుంచి మట్టి తరలించారనే వివరాలు నమోదు చేసుకుని కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ తనిఖీలల్లో మైన్ ఇన్స్పెక్టర్ సత్యమూర్తి, నర్సీపట్నం ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, సీఎస్‌డీటీ సూరి స్థానిక వీఆర్ఏలు పాల్గొన్నారు. -
కాఫీ తాగుతూ.. కార్గో చూస్తూ..
దేశంలోనే ఎంతో ప్రత్యేకం దేశంలో అనేక సముద్రతీర ప్రాంతాల్లో ప్రొమెనేడ్లను అభివృద్ధి చేశారు. పుదుచ్చేరిలో రాక్ బీచ్ ప్రాంతంలో కిలోమీటరుకుపైగా ఉన్న బీచ్ రాక్ ప్రొమెనేడ్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పర్యాటకులు హాయిగా సేద తీరేందుకు ఏర్పాట్లు చేశారు. కేఫ్‌ల్లో కాఫీ తాగుతూ సముద్ర అందాలను తిలకించే వీలుంది. ఇక ముంబైలో 3 కిలోమీటర్ల పొడవైన ‘క్వీన్స్ నెక్లెస్ ఆర్క్’ముంబై డ్రైవ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ముంబై కోస్టల్ రోడ్ ప్రొమెనేడ్ ఏకంగా 7.5 కిలోమీటర్ల పొడవుతో షియోన్ పార్క్ నుంచి షిరోన్ పార్క్ వరకూ అభివృద్ధి చేశారు. ఇక కోల్‌కతా వద్ద నది తీరం వెంబడి విహార ప్రదేశాన్ని అభివృద్ది చేయగా.. కొచ్చి వద్ద బ్యాక్ వాటర్ వద్ద ఉన్న నడక మార్గం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే.. విశాఖ ప్రొమెనేడ్ మాత్రం వీటన్నింటికీ భిన్నం. సముద్ర అందాలను ఆస్వాదించడంతో పాటు, నౌకాశ్రయంలో జరిగే లైవ్ వ్యాపార కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కేవలం విశాఖ పబ్లిక్ ప్రొమెనేడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సముద్ర తీరంలో చల్లని గాలిని ఆస్వాదిస్తూ, వేడి వేడి కాఫీ తాగుతూ.. భారీ నౌకల్లో కార్గో హ్యాండ్లింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? సముద్రపు అలల సవ్వడి వింటూ... విదేశాల నుంచి వచ్చే క్రూయిజ్ పర్యాటకులకు చిరునవ్వుతో హాయ్ చెప్పాలని భావిస్తున్నారా? భారీ నౌకల్లోకి సరుకుల ఎగుమతులు, దిగుమతులు ఎలా చేస్తారో ఎలాంటి అనుమతులు లేకుండానే దగ్గరి నుంచి చూడాలని ఉందా?.. విశాఖ నగర వాసులకు ఈ కోరికలన్నీ త్వరలోనే తీరనున్నాయి. నగర పౌరుల కోసం విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) సరికొత్త పర్యాటక కానుకను సిద్ధం చేసింది. విశాఖ వాసులకు పర్యాటక కానుక ఏకంగా రూ.16 కోట్లతో 600 మీటర్ల పొడవైన అందమైన ‘పబ్లిక్ పోర్ట్ ప్రొమెనేడ్’ను పోర్టు అధికారులు నిర్మించారు. తీర ప్రాంత పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ప్రజలకు ఆకర్షణీయమైన విహార ప్రదేశాలను అందించే లక్ష్యంతో మంగళవారం విశాఖ పోర్టు ఇన్చార్జి చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు ఈ ప్రొమెనేడ్‌ను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పచ్చటి ల్యాండ్‌స్కేపింగ్‌తో దీనిని అత్యంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఎటువంటి ప్రవేశ రుసుం లేకుండానే సముద్రతీరంలో వాకింగ్ చేసుకునే వెసులుబాటు, చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక ఆటస్థలం, అలాగే సువిశాలమైన పార్కింగ్ సదుపాయం ఇక్కడ కల్పించారు. ఈ నెలాఖరు నుంచి ఈ ప్రదేశం నగర ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని చైర్మన్ అంగముత్తు తెలిపారు. క్రూయిజ్ టెర్మినల్‌కు సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న దారి గుండా ఈ ప్రొమెనేడ్‌ను చేరుకోవచ్చు. లైవ్ మారిటైం వీక్షణ సాధారణంగా ఏ పోర్టులో జరిగే కార్యకలాపాలనైనా సామాన్యులు దగ్గరి నుంచి చూసే అవకాశం ఉండదు. కానీ, విశాఖలో మాత్రం పోర్టులో జరిగే సముద్ర వ్యాపార కార్యక్రమాలను ప్రజలు లైవ్‌గా వీక్షించేలా ఈ ప్రొమెనేడ్‌ను డిజైన్ చేయడం విశేషం. భారీ నౌకల నుంచి సరుకుల రవాణా, అంతర్జాతీయ క్రూయిజ్‌ల రాకపోకలను ప్రజలు సురక్షితంగా చూసి ఆనందించేందుకు వీలుగా ఇక్కడ ప్రత్యేకమైన డెక్స్‌ను ఏర్పాటు చేశారు. -
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షుడు గంటా శ్రీరామ్ డిమాండ్ చేశారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్‌ఏఆర్‌ఎస్ కార్మికులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకూ కార్మికులకు అండగా ఉండి పోరాటం సాగిస్తామని చెప్పారు. మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలన వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లేబర్ కోడ్స్ పూర్తిగా రద్దయ్యే వరకు ప్రతి కార్మికుడు ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొనాలన్నారు. అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో డైలీ వెజ్ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని, లేకపోత ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కాళ్ళ తేలయ్యబాబు, నాయకులు వారాది సత్యనారాయణ, లక్ష్మి, ప్రసన్న, అనురాధ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
‘మన రిజిస్ట్రేషన్–మన బాధ్యత’తో రిజిస్ట్రేషన్ సేవలు చేరువ
సబ్బవరం: రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి మన రిజిస్ట్రేషన్–మన బాధ్యత కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ జి.బాలకృష్ణ అన్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మధరావు, సబ్ రిజిస్ట్రార్ జిలానీబేగంతో కలిసి ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. నిషేధిత భూములు, ఇనాం భూములు, సర్వర్ సమస్యలు, అధిక మార్కెట్ విలువల నిర్ణయంపై ప్రజలు అర్జీలు దాఖలు చేశారు. రిజిస్ట్రేషన్ సేవల వికేంద్రీకరణ, సందేహాల నివృత్తి, సలహాలు, సూచనల స్వీకరణ, సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ఆరిపాక ప్రాంతంలోని మారుమూల భూములకు అధిక మార్కెట్ విలువలు నిర్ణయించారని, వాటిని తగ్గించాలని కోరారు. పైడివాడ అగ్రహారం మాజీ సర్పంచ్ దాసరి వెంకటరమణ మాట్లాడుతూ గ్రామంలోని లే అవుట్ భూములను తిరిగి రైతులు ఆక్రమించడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయన్నారు. దీనిపై స్పందించిన అధికారులు ఆర్డీవో కోర్డులో కేసులు దాఖలు చేయాలని సూచిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందిస్తామని భరోసానిచ్చారు. రిజిస్ట్రేషన్ రైటర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శేఖరమంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ వారంలో రెండు మూడు రోజులు సర్వర్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ స్పందిస్తూ ఇతర శాఖల సర్వర్ సమస్యలు, ఆధార్ సీడింగ్ లోపాల వల్ల ఈ సమస్య వస్తోందని, సంబంధిత శాఖల దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. అనకాపల్లి జిల్లాలో ప్రతి మంగళవారం, శుక్రవారం షెడ్యూల్ ప్రకారం అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘మన రిజిస్ట్రేషన్–మన బాధ్యత’కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత లక్ష్యం
మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో శత శాతం ఫలితాలు సాధించడం లక్ష్యమని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్ష ఫలితాలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రతి మండలంలో ఉత్తీర్ణత, ఫెయిల్ శాతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫలితాల్లో వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలనివిద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావునాయుడు, ఎంఈవోలు పాల్గొన్నారు.రేపు ఎస్సీ కమిషన్ సభ్యుడు జిల్లా పర్యటన తుమ్మపాల : రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యుడు రావాడ సీతారామ్ ఈ నెల 14న జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారిత అధికారి బి.రామానందం ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. అదే రోజు పట్టణంలో గుండాల జంక్షన్ వద్ద శంకరన్ మీటింగ్ హాలులో ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నారని, అనంతరం దేవరాపల్లి మండలం, మాడుగుల మండలాల్లో పలు సర్వే నంబర్ల గల భూములను స్థల పరిశీలన చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎస్సీ కులస్తులకు సంబంధించి తమ సమస్యలను వినతుల రూపంలో అందించవచ్చని పేర్కొన్నారు. -
అక్కరకు రాని అగ్రిల్యాబ్‌లు
రైతన్నకు దూరమైన భూసార పరీక్షలు ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందే మట్టి నమూనాలు సేకరణ ఈ ఏడాది ప్రశ్నార్థకంగా మారిన మట్టి పరీక్షలు చంద్రబాబు ప్రభుత్వంలో అగ్రి ల్యాబ్‌లు నిర్వీర్యం అందని నిధులు..సిబ్బంది కొరతతో అవస్థలుసాక్షి, అనకాపల్లి : జిల్లాలోని అగ్రిల్యాబ్‌లు రైతులకు అక్కరకు రాకుండా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ల్యాబ్‌ల్లో ఇతర జిల్లాల నుంచి తెచ్చిన నమూనాలను పరీక్షిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్‌కు నెలకు ముందే భూసార పరీక్షలను చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 2024 ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా 32,584 మట్టి పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనకాపల్లి జిల్లాలో గతే ఏడాది 25,052 పరీక్షలు చేసి రైతులకు ఫలితాల వివరాలు అందించారు. ఈ ఏడాది అనకాపల్లి జిల్లాలో ఇంకా లక్ష్యమే నిర్దేశించుకోలేదు.అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, చోడవరం, అల్లూరి జిల్లా అరకులో మాత్రమే అగ్రిల్యాబ్‌లు వినియోగంలో ఉన్నాయి. అది కూడా బయట జిల్లాల మట్టి నమూనాలను పరీక్షిస్తున్నారు. నిర్లక్ష్యం నీడలో భూసార పరీక్షలు సాధారణంగా మార్చి నుంచే మట్టి నమూనాల సేకరణ ప్రక్రియ ప్రారంభం కావాలి. ఏప్రిల్ నెలాఖరుకల్లా పరీక్షలు పూర్తి చేసి, మే మొదటి వారంలో ఫలితాలను రైతులకు అందించాలి. తద్వారా తమ భూమికి ఏ రకమైన ఎరువులు అవసరం, ఏ పంటలు వేస్తే దిగుబడి వస్తుందో రైతులకు ఒక అవగాహన ఉంటుంది. కానీ అనకాపల్లి జిల్లాలో మే రెండో వారం గడుస్తున్నా ఇప్పటివరకు లక్ష్యాలను కూడా నిర్దేశించకపోవడం గమనార్హం. ఖరీఫ్ సాగుపై ప్రభావం భూమిలో సారం తగ్గడం, రసాయనిక ఎరువుల అధిక వినియోగం వల్ల నేల స్వభావం మారుతోంది. ఈ తరుణంలో సమగ్ర భూసార పరీక్షలు నిర్వహించకపోతే పంట దిగుబడి తగ్గడమే కాకుండా, చీడపీడల తాకిడి పెరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వంలో మేలైన సేవలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ల్యాబ్ చొప్పున ఏర్పాటు చేశారు. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంలో అగ్రిల్యాబ్ ప్రారంభించారు. యలమంచిలి, మాడుగులలో నియోజకవర్గ స్థాయి నూతన భవనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ల్యాబ్ సుమారు రూ. 65 లక్షల ఖర్చుతో అత్యాధునిక అగ్రి ల్యాబ్‌లను నిర్మించారు. ఇక్కడ కేవలం మట్టి పరీక్షలే కాకుండా, విత్తనాల నాణ్యత, పురుగుమందుల పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంది. నేడు సిబ్బంది కొరత, నిధుల నిలిపివేత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రస్తుతం జిల్లాలోని నర్సీపట్నం, చోడవరం ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో వినియోగంలో లేవు. సిబ్బంది కొరత, నిధుల నిలిపివేత కారణంగా ఈ భవనాలు కేవలం అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఇతర జిల్లాల నుంచి తెచ్చిన నమూనాలను పరీక్షిస్తున్నారే తప్ప, స్థానిక రైతులకు సేవలు అందడం లేదు. ఖరీఫ్ సమయం దగ్గరపడుతుండడంతో రైతులు ఏ ఎరువులు వాడాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, వెంటనే నిధులు విడుదల చేసి అగ్రి ల్యాబ్‌లను పునరుద్ధరించాలని, యుద్ధ ప్రాతిపదికన భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలు అందించాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా మరో నెలన్నర రోజుల్లో రైతులు పొలం పనుల్లో నిమగ్నం కావాల్సి ఉంది. అయితే, పంట సాగులో అత్యంత కీలకమైన భూసార పరీక్షల విషయంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ముందస్తుగానే మట్టి నమూనాల సేకరణ పూర్తి చేసి ఫలితాలు అందించే వారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో అగ్రి ల్యాబ్‌లు నిర్వీర్యమై, పరీక్షలు అటకెక్కాయి. ఖరీఫ్ దగ్గర పడుతున్నా వ్యవసాయ శాఖలో పూర్తి సన్నద్ధత కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో జిల్లాలో 3 అగ్రిల్యాబ్‌ల సేవలు రైతు పొలాల్లో సేకరించిన మట్టి నమూనాలకు 12 రకాల పరీక్షలు 2024 ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా 32,584 మట్టి పరీక్షలు గతేడాదిలో 25,052 నమూనాలు మాత్రమే సేకరణ -
కన్నీట్ సుడులు
నీట్ రద్దుతో విద్యార్థుల కన్నీటి పర్యంతం ప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం రెండేళ్ల శ్రమ బుగ్గిపాలేనని ఆవేదన రెండేళ్ల కష్టం.. ఎన్నో ఆశలు.. ఒక వైద్య సీటు కోసం జీవితాన్నే పుస్తకాలకే అంకితం చేసిన లక్షలాది విద్యార్థుల కలలను నీట్ రద్దు నిర్ణయం ఒక్కసారిగా ఛిద్రం చేసింది. ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తుండగా.. మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనలోకి నెట్టేసింది.సాక్షి, విశాఖపట్నం/మద్దిలపాలెం : వైద్యుడై సమాజానికి సేవ చేయాలని, తెల్లకోటు వేసుకుని స్టెతస్కోప్‌తో రోగి నాడి పట్టుకోవాలని.. లక్షలాది మంది విద్యార్థులు రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. మే 3వ తేదీన పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు, వారి కళ్లలో ఒక రకమైన సంతృప్తి.. ’అమ్మా, నాన్నా.. నేను డాక్టర్ అవుతాను’ అన్న ధీమా. కానీ, ఆ సంతోషం చిటికెలో ఆవిరైపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నీట్ యూజీ 2026 రద్దు నిర్ణయం, లక్షలాది మంది విద్యార్థుల గుండెల్లో గునపమై దిగినట్టయింది. ప్రతిభావంతులు బలి రాజస్థాన్‌లో వెలుగు చూసిన ’పేపర్ లీక్’ ఉదంతం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పునాదులను కదిలించింది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించడం, పరీక్షను రద్దు చేయడం సరైన నిర్ణయమే కావచ్చు. కానీ, అక్రమాలకు పాల్పడిన కొందరు స్వార్థపరుల వల్ల, రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది సాధారణ విద్యార్థులు ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయారు. ఆగిపోయిన కల.. ఆవిరైన శ్రమ చిన్న చిన్న గదుల్లో బందీలై, పుస్తకాలే ప్రపంచంగా బతికిన విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం. ‘రెండేళ్ల శ్రమ.. వేల గంటల సాధన.. అంతా ఒక్క నిర్ణయంతో బూడిదలో పోసిన పన్నీరైంది. మళ్లీ అదే ఏకాగ్రతతో పుస్తకాలు పట్టగలమా? ఆ ఉత్సాహం మళ్లీ వస్తుందా?’ అని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయం. తమ పిల్లల చదువు కోసం రెక్కల కష్టం ధారబోసి, కోచింగ్ సెంటర్లకు రూ.లక్షలు కుమ్మరించిన వారు, ఇప్పుడు తమ బిడ్డల నిరాశను చూసి తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటుండగాం తల్లిదండ్రులు వారిని ఓదార్చలేని పరిస్థితి నెలకొంది. మా తప్పేంటి? నిజాయితీగా చదివి, కష్టపడి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ అదే ఒత్తిడిని భరించాల్సి వస్తోంది. ఒకరి అక్రమంం లక్షల మందికి శిక్షగా మారిందనే భావన విద్యార్థుల్లో కనిపిస్తోంది. ‘మళ్లీ చదవాలి.. మళ్లీ ఒత్తిడి భరించాలి.. మళ్లీ పరీక్ష హాల్లో కూర్చోవాలి’.. అనే ఆలోచన వారిని మానసికంగా అలసటకు గురిచేస్తోంది. ఎన్టీఏ భరోసా సరిపోతుందా? రీ–ఎగ్జామ్ కోసం కొత్తగా దరఖాస్తు చేయక్కర్లేదని, ఫీజు కట్టనవసరం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. కానీ, విద్యార్థులకు కావాల్సింది ఆర్థిక వెసులుబాటు కాదు, మానసిక స్థైర్యం. ఒకసారి రాసిన పరీక్షను, అది కూడా లీకేజీ మరకల మధ్య మళ్లీ రాయాల్సి రావడం అంటే, ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే. వ్యవస్థ మారేది ఎప్పుడు? ఒక పేపర్ లీక్.. ఒక రద్దు.. వేలాది మంది విద్యార్థుల కన్నీళ్లు. ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న అక్రమార్కులకు కఠిన శిక్ష పడాల్సిందే. ఈ రద్దు నిర్ణయం వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందేమో కానీ, విద్యార్థుల మనసులకు తగిలిన గాయాన్ని మాత్రం అంత సులభంగా మాన్పలేదు. కొత్త షెడ్యూల్ రావచ్చు.. కొత్త హాల్ టికెట్లు జారీ అవ్వొచ్చు.. కానీ, పోగొట్టుకున్న సమయాన్ని, మానసిక ప్రశాంతతను మళ్లీ తెచ్చి ఇచ్చేది ఎవరు? నీట్ పరీక్ష రద్దు చేయడం దారుణం.. నీట్ పరీక్ష రద్దు చేయడం దారుణం. ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పరిపాటిగా మారింది. నీట్ నిర్వహణలో లోపాన్ని గుర్తించకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఎన్డీఏ ప్రభుత్వానికి తగదు. మా పాపతో పాటు ఎంతో మంది విద్యార్థులు కష్టపడి ఏడాది పాటు ప్రిపేరు అయ్యారు. తీరా పరీక్ష రాసిన తరువాత పరీక్ష రద్దు చేయడం సరికాదు. ఈ విధమైన చర్య విద్యార్ధుల భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను. – వి.వి.ఎన్.హరికృష్ణ, విద్యార్థిని తండ్రి, నర్సీపట్నం -
యువకుడి అనుమానాస్పద మృతి
నర్సీపట్నం : నర్సీపట్నం మండలం, గబ్బాడ గ్రామ సమీపం నెల్లిమెట్ట వద్ద యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు రూరల్ ఎస్ఐ రాజారావు తెలిపారు. రోలుగుంట మండలం, బుచ్చింపేట గ్రామానికి చెందిన లాలం సాయి కుమార్ (30) ఈ నెల 10వ తేదీ సాయంత్రం అదే గ్రామానికి చెందిన సతీష్, రాజేష్, నానాజీలతో కలిసి గబ్బాడ గ్రామం, నెల్లిమెట్ట వద్ద మద్యం సేవించినట్టు ఎస్ఐ తెలిపారు. అనంతరం మృతుడు సాయికుమార్, రాజేష్ బైక్‌పై నర్సీపట్నం వైపు రావడం జరిగిందన్నారు. బైక్‌పై వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి సాయికుమార్ మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య లాలం రాజ్యలక్ష్మి సాయికుమార్ మృతిపై అనుమానం వ్యక్తి చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలి
అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలంటు రైతుల నిరసన భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల నిరసన తుమ్మపాల: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోను రీఓపెన్ కాకూడదని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి వారితో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్కు 123, రెవెన్యూ క్లినిక్‌కు 145 మొత్తం 268 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లను తక్షణం నిలిపేయాలి.. ఏళ్ల తరబడి సాగులో ఉన్న రైతుల భూములకు అనధికారక లేఅవుట్ చూపించి తప్పుడు పద్ధతిలో చేస్తున్న రిజిస్ట్రేషన్లను తక్షణమే నిలిపివేసి రైతులకు రక్షణ కల్పించాలంటు పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందించారు. గ్రామంలో సర్వే నంబర్ల 274, 276, 279, 290, 291, 298, 347లో మొత్తం 60 ఎకరాల రైతుల భూమిలో కొంత భూమిని కొనుగోలు చేసిన ఓ ప్రైవేటు రియల్టర్ మిగిలిన రైతుల భూములను కూడా కలిపి అనధికారక లేఅవుట్ వేసినట్లు తెలిపారు. అనధికారక జీపీఏ పత్రాలతో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేస్తూ రైతుల భూముల్లోకి వచ్చి ముప్పుతిప్పలు పెడుతున్నారని, రౌడీమూకలతో భూముల్లోకి వచ్చి వివాదాలు సృష్టిస్తున్నట్లు తెలిపారు. తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నా పోలీసులు సివిల్ వివాదం అంటూ చేతులు దులుపుకోవడం, అధికారులు జీపీఏలతో కొనసాగిస్తున్న రిజిస్ట్రేషన్లను నిలిపివేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాల్లో విచారణ చేపట్టి తమ భూములకు సంబంధించి సృష్టిస్తున్న తప్పుడు పత్రాలను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు. సాగు భూములను కాపాడాలి.. ఎస్ఈజెడ్ నిర్మాణం కోసం కె.కోటపాడు మండలం పలు గ్రామాల్లో చేపడుతున్న బలవంతపు భూసేకరణ నిలిపేసి సాగు భూములను కాపాడాలంటు ఏపీ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా నాయకులు రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జిల్లాలో అత్యధిక రిజర్వాయర్లు కలిగి ప్రతి ఎకరం నీటి సౌకర్యంతో నిత్యం పంటలు పండే చోట ఎస్ఈజెడ్ అంటు భూములను సేకరించి కంపెనీలతో కలుషితం చేయడం మానుకోవాలన్నారు. అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే వేల ఎకరాల భూముల సేకరణ జరిగిందని, జిల్లాలో మిగిలిన భూములను వ్యవసాయ ఆధారిత ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎస్పీ కార్యాలయానికి 65 ఆర్జీలు అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 65 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వేధింపులు, ఇతర విభాగాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయన్నారు. వాస్తవాల ఆధారంగా సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్, సీఐ సేనం రమేష్ పాల్గొన్నారు. -
జిరాయితీ చెరువులో ఉపాధి పనులు
నాతవరం : వైఎస్సార్సీపీ కార్యకర్తకు చెందిన జిరాయితీ భూమిలో ఉపాధి హామీ పథకం నిధులతో అభివృద్ధి చేసి ప్రభుత్వ భూమిగా మార్చేందుకు కూటమి నేతలు కుట్ర చేయడంతో బాధితుడు కలెక్టరుకు ఫిర్యాదు చేయడమే కాక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయస్థానం స్టే ఇవ్వడంతో గత ఏడాది పనులు ఆపేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి నేతల ఒత్తిళ్లతో ఉపాధి హామీ పథకం అఽధికారులు యథావిధిగా చెరువులో పనులు చేస్తున్నారు. మండలంలో జిల్లేడుపూడి పంచాయతీలో సర్వే నెంబరు 240లో 4 ఎకరాల 80సెంట్లు జిరాయితీ భూమి ఇదే గ్రామానికి చెందిన సబ్బి సత్తిబాబు పేరిట రెవెన్యూ రికార్డులో ఉంది. పూర్వం ఈ గ్రామంలో సబ్బి కుటుంబీకులు సంబంధించి సుమారుగా 25 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉండేవి. అప్పట్లో ఉమ్మడిగా సాగునీటి కోసం ఈ భూమిలో కొంత విస్తీర్ణంలో జిరాయితీ చెరువు ఏర్పాటు చేసుకున్నారు. ఆ చెరువు నీరు అధారంగా వ్యవసాయ పంటలు సాగు చేసేవారు. తర్వాత తాండవ రిజర్వాయరు నిర్మాణం, అలాగే వ్యవసాయ బోర్లు ఏర్పాటుతో జిరాయతీ చెరువులో నీరు అవసరం లేకుండా పోయింది. తరువాత కాలంలో వారు భూములు పంచుకోగా, జిరాయితీ చెరువు భూమి సబ్బి సత్తిబాబు తండ్రి జోగులు వాటాకు వచ్చింది. కాగా సత్తిబాబు వైఎస్సార్సీపీ కార్యకర్త కావడంతో రాజకీయంగా స్థానిక కూటమి నేతలు ఇబ్బంది పెట్టడానికి కుట్ర చేశారు. చెరువులో ఉపాధి పనులు చేయించి ప్రభుత్వ చెరువుగా మార్చేందుకు ప్రయత్నాలు సాగించారు. గత ఏడాది ఆ జిరాయితీ చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా సబ్బి సత్తిబాబు అడ్డుకున్నారు. అంతేకాకుండా న్యాయస్ధానాన్ని ఆశ్రయించడంతో పనులు చేయరాదంటూ సత్తిబాబుకు అనుకూలంగా కోర్టు స్టే ఇచ్చింది. గత ఏడాది సత్తిబాబు కలెక్టరు, ఉపాధి పథకం జిల్లా అధికారులకు సైతం ఫిర్యాదు చేయడంతో ఆ చెరువులో అనుమతి లేకుండా ఉపాధి నిధులతో పనులు చేయడం జరగదని 4–05–2025 తేదీన అప్పటి డ్వామా ప్రాజెక్టు అధికారి పూర్ణిమాదేవి లిఖిత పూర్వకంగా లేఖ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఏడాది మళ్లీ చెరువులో ఉపాధి పనులు చేయడంతో సత్తిబాబు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఏపీవో దాసరి కొండాజీని వివరణ కోరగా ఈ సమస్య ఇటీవల తన దృష్టికి రావడంతో జిరాయతీ చెరువులో పనులు నిలుపుదల చేశామన్నారు. తనకు తెలియకుండా స్థానిక వీఆర్పీ పని చేయించారేమో తెలుసుకుంటానన్నారు. రైతు అమోదం లేకుండా జిరాయతీ చెరువు భూముల్లో పనులు చేయడం జరగదన్నారు. నాపై కక్ష సాధింపుగానే.. మా తాత తండ్రులు దగ్గర్నుంచి వారసత్వంగా వచ్చిన జిరాయతీ భూమి పూర్వం మా కుటుంబీకులు వ్యవసాయ సాగు చేసేందుకు సొంతంగా చెరువు చేసుకున్నారు. మా కుటుంబ సభ్యులు భూములు పంపకాలు చేసేటప్పుడు ఈ చెరువు భూమి మా నాన్న వాటాకి వచ్చింది. మా నాన్న కాలం చేయడంతో జిరాయితీ చెరువును ప్రభుత్వ చెరువుగా మార్చేందుకు కూటమి నేతలు కుట్ర చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నాకు అనుకూలంగా కోర్టు స్టే ఇవ్వడంతో గత ఏడాది పనులు అపేశారు. ఇప్పుడు మళ్లీ పనులు చేస్తున్నారు. నా వద్ద కోర్టు స్టే అర్డర్ ఉండగా రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి కుట్ర చేస్తున్నారు. –సబ్బి సత్తిబాబు, జిల్లేడుపూడి గ్రామం -
‘పల్లె పండగ’ దండగేనా!
రోలుగుంట : పల్లె పండగ పథకం పేరిట మండలంలో గల అర్ల పంచాయతీ శివారు గ్రామాలకు కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేపట్టినట్టు నేతలు చెబుతున్నా అవి గుంతలకే పరిమితం కావడంతో బాధిత గ్రామాల గిరిజనులు సోమవారం బురదమయంగా మారిన రోడ్డుపై నడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వివరాలివి. మండలంలో అర్ల పంచాయతీ శివారు పెదగరువు, పాతలోసింగి తదితర గ్రామాల్లో కోందు ఆదివాసీ గిరిజనులు సమారు 560 మంది ఉన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా బి.టి.రోడ్డు నిర్మాణానికి 2024లో 2 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయి. పల్లె పండగ–2025 లో భాగంగా గతేడాది జనవరిలో రహదారి పనులకు ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు శంకుస్థాపన చేశారు. ఎర్త్ వర్క్ క్రషర్ పిక్కతో రోడ్డు పనులు చేసి అర్ధంతరంగా వదిలేశారు. తరువాత భారీ వర్షాలకు పిక్కంతా కొట్టుకుపోయి బురదమయంగా మారి గుంతలుగా మారాయి. ఈ నేపథ్యంలో బాధిత గ్రామాల గిరిజనులు సొంత నిధులు సేకరించి రూ.6 లక్షలతో రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. అది భారీ వర్షాలకు కొట్టుకుపోతోంది. ఇలాఉండగా లోసింగిలో 40 మందికి హౌసింగు స్కీం అందింది. దీంతో ఈ రోడ్డులో మెటీరియల్ తీసుకెళ్లే ప్రయత్నంలో రోడ్డు మధ్యలో వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. దీంతో హౌసింగు స్కీం నిలిచిపొయే పరిస్థితి నెలకొనడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ డబ్బులు కాంట్రాక్టర్లకు, అధికారులకు తప్ప అరకొర పనులతో తమకు ఒరిగిందేమీ లేదని ప్రభుత్వతీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. కోట్లు నిధులు మంజూరు చేసినా అవి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నాయి కానీ పనులు శూన్యమని ఆరోపిస్తున్నారు. రోడ్డు పనులు నిమిత్తం రూ.లక్షలకు, లక్షలు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపించడం మినహా రోడ్డు పనులు మాత్రం పూర్తి చేయడం లేదని, దీంతో గుంతలు పడిన రోడ్డు బురదమయం కావడంతో గిరిజనులు నిరసనకు దిగారు. సోమవారం ఆ బురద రోడ్డులోనే పాదయాత్ర చేపట్టి డబ్బు ఖర్చు చేసిన రోడ్డు నిర్మాణం ఎక్కడ..? ఇదేనా పల్లె పండగ పథకం తీరు? అంటూ నినాదాలు చేశారు. ఈ రహదారి సమస్య మెరుగుపరచి తమకు డోలిమోత సమస్య తప్పించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామస్థులు అప్పారావు, కె.వెంకట్రావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
వేసవి సెలవుల్లో పనులు అప్పగించడం అన్యాయం
అనకాపల్లి: సెలవుల్లో వాట్సాప్ ఆదేశాల ద్వారా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదని, లిఖితపూర్వక ఉత్తర్వులు లేకుండా, కేవలం వాట్సాప్ సందేశాల ద్వారా విద్యా సంబంధిత పనులను అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు అన్నారు. స్థానిక డీఈవో కార్యాలయంలో సోమవారం డీఈవో గిడ్డి అప్పారావు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని, కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు లేనప్పటికీ, జిల్లాలో మాత్రం మే 12 నాటికి ఫౌండేషన్ ప్లాన్, మండల ప్లాన్, స్కూల్ లెవల్ ప్లాన్న్లను సిద్ధం చేయాలని ఒత్తిడి చేయడం సరి కాదన్నారు. తక్షణమే ఈ ఒత్తిడి ఆపాలని, ఉపాధ్యాయుల సెలవు హక్కు గౌరవించాలని, వాట్సాప్ ద్వారా కాకుండా అధికారిక ప్రొసీడింగ్స్ ద్వారా మాత్రమే విధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో జిల్లా కార్యదర్శి యేశపోగు సుధాకర్‌రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ఎస్.దుర్గాప్రసాద్, గొంది చిన్నబ్బాయ్, కె. పరదేశి, కార్యవర్గ సభ్యుడు వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
నక్కపల్లి : రైతుకు చెందిన భూమిని మ్యూటేషన్ చేసేందుకు రూ.1.50 లక్షలు తీసుకుంటూ నక్కపల్లి మండలం పెదతీనార్ల వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం కశింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన ముక్కా శ్రీను అనే రైతు నక్కపల్లి మండలం పెదతీనార్లలో రెండు వేర్వేరు సర్వే నంబర్లలో 5.57 ఎకరాల భూమిని 2023లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఈ భూమిలో కొబ్బరి పంట వేసి సాగు చేసుకుంటున్నాడు. మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక సర్వే నంబరుకు సంబంధించి 2.14 ఎకరాలకు భూమికి మ్యూటేషన్ జరిగింది. 3.43 ఎకరాల భూమి మ్యూటేషన్ జరగలేదు..రికార్డుల్లో కొనుగోలు చేసిన వ్యక్తి, అమ్మిన వ్యక్తి పేరు లేదు. వేరొక అసామి పేరున నమోదై ఉంది. బాధితుడు కొనుగోలు చేసిన భూమిలో 2.14 ఎకరాల భూమిని ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్క్ కోసం సేకరించింది. ఈ భూమి మాత్రమే బాధితుడి పేరున రికార్డుల్లో మ్యూటేషన్ అయి నమోదై ఉండడంతో దానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన భూమికి నష్టపరిహారం ఇవ్వలేదు. దీంతో మిగిలిన భూమిని మ్యూటేషన్ చేయాలని రెవెన్యూ అదికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు మాత్రం సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో బాధితుడు శ్రీను వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబును సంప్రదించగా, మ్యుటేషన్‌కు రూ. 2 లక్షలు మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అడ్వాన్సుగా రూ.1.50 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం బాధితుడు ఈనెల 7వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అడ్వాన్సు రూ.1.50 లక్షలు సోమవారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు సమీపంలో వీఆర్వోకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నాయకత్వంలో సిబ్బంది వలవేసి పట్టుకున్నారు. అక్కడ నుంచి నిందితుడిని నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వీఆర్వో సొంత గ్రామం నక్కపల్లి మండలం ఉపమాకలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పట్టుబడ్డ వీఆర్వోపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఏడాదిలో ఇది రెండో కేసు... నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం ఏడాదిలో ఇది రెండోసారి. ఏడాది కిత్రం వ్యవసాయ బోరుకు ఎన్వోసి ఇచ్చేందుకు రైతు నుంచి రూ.12 వేలు డిమాండ్ చేసి కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ ఆర్ఐ కన్నబాబు ఏసీబీకి పట్టుబడడం గమనార్హం. మండలంలో భారీ స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో భూముల ధరలు కూడా అమాంతం పెరిగాయి కొనుగోలు చేసిన భూములను తమ పేరున మార్చుకునేందుకు రైతులు తహసీల్దార్ కార్యాలయాలకు వస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని వీఆర్వోలు, కొంతమంది సిబ్బంది రైతుల నుంచి భారీ స్థాయిలో లంచాలు గుంజుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
రైతులంటే ఇంత చులకనా...?
చోడవరం : గోవాడ చెరకు రైతులు ఉద్యమానికి మరోసారి సిద్ధమౌతున్నారు. రైతు సంఘాల నాయకులు, పలు రైతు ఉద్యమకారులు కలిసి చోడవరంలో బుధవారం సమావేశమయ్యారు. భారతీయ జనతాపార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రైతు ఉద్యమకారుడు ఎ.ఆర్.జి శర్మ ఇంటి వద్ద రైతు సంఘాల నాయకులంతా హాజరయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వారంతా తప్పుబడ్డారు. రైతులంటే ప్రభుత్వానికి చాలా చులకనగా ఉందని, మరోసారి ఉద్యమానికి చెరకు రైతులు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కార్మికులంతా సిద్ధం కావాలంటూ ఈ సమావేశం నిర్ణయించింది. అవసరమైతే రైతుల తరపున న్యాయపోరాటానికై నా వెళదామని ఏ.ఆర్.జి శర్మ ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులకు తెలిపారు. పార్టీలు, రాజకీయాలు ముఖ్యం కాదని, 24 వేల మంది చెరకు రైతులు, కార్మికుల జీవన్మరణ సమస్యగా మారిన గోవాడ ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికే మొదటి దశ ఉద్యమం చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ మేరకు ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపడం జరిగిందని, వారి హామీ మేరకు ఏమీ జరగకపోవడంతో మరోసారి ఉద్యమానికి అంతా సిద్ధమవ్వాలని నిర్ణయించారు. చెరకు రైతుల బకాయిలు, కార్మికుల జీత బకాయిలు రూ. 30 కోట్లు వరకూ ఫ్యాక్టరీ చెల్లించాల్సి ఉందని, అవి ఇప్పటి వరకూ చెల్లించలేదని, అంతేకాకుండా వచ్చే సీజన్ గానుగాట ఆడిందీ లేనిదీ ఏమీ చెప్పకపోవడంతో రైతులు చెరకు పంట వేయాలా వద్దా అనే మీమాంశలో ఉన్నారని, అదీ ప్రభుత్వం తేల్చలేదని సమావేశంలో రైతు సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వీటిపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయకపోతే త్వరలోనే రెండో దశ ఉద్యమం చేయడానికి అంతా సిద్ధంగా ఉండాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో రైతు సంఘం జిల్లా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, జనసేన నియోజకవర్గ నాయకుడు జెర్రిపోతుల నానాజీ, రైతు సంఘాల ప్రతినిధులు మహాలక్ష్మినాయుడు, దాడి అమర్, పెదబాబు పాల్గొన్నారు. -
దేవాలయ భూములకు నష్టపరిహారం ఇప్పించండి
అచ్యుతాపురం రూరల్ : దుప్పితూరులో పద్మశాలీల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రావతీ సమేత భావనాఋషి ఆలయ భూములకు నష్టపరిహారం ఇప్పించాలని ఆలయ కమిటీ సభ్యులు అనకాపల్లి కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా తమ సొంత నిధులతో స్వామికి నిత్య దీప ధూప నైవేద్యాలు, ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. ఆలయ భూములకు పరిహారంతో పాటు భూమికి భూమి ఇవ్వాలని వినతిపత్రం ద్వారా కలెక్టర్‌ను కోరారు. నష్టపరిహారం చెల్లించకుండా ఆలయ భూములను ఆక్రమిస్తున్న ఏపీఐఐసీ, బ్రాండిక్స్ సంస్థలు నిర్మిస్తున్న ప్రహారీ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆలయ కమిటీ చైర్మన్ మాడెం సూరి అప్పారావు, ఉపాధ్యక్షుడు శేశెట్టి రాంబాబు, సెక్రటరీ మాడెం అప్పారావు, కమిటీ సభ్యులు అంజూరి అప్పలరాజు, శేశెట్టి నర్సింగరావు, శేశెట్టి నానాజీ, వానపల్లి ముకుందేశ్వరరావు, వానపల్లి సన్యాసిరావు, అముదూరి అర్జునరావు తదితరులు ఉన్నారు. -
తాటి చెట్టుపై నుంచి పడి యువకుడి మృతి
పాయకరావుపేట : పట్టణానికి చెందిన యువకుడు తాటి చెట్టు పై నుంచి పడి మృతి చెందినట్టు ఏఎస్ఐ గోవిందు తెలిపారు. పట్టణంలో రాజుగారిబీడుకు చెందిన పంజాబీ పవన్ కుమార్ (21) తాటిముంజులు తీయడం కోసం స్థానికంగా గల తాటిచెట్టు ఎక్కి 40 అడుగులు ఎత్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుల సహాయంతో తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఏఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. -
కళ్లెదుటే సహజ సంపద దోపిడీకి గురవుతున్నా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే చట్టం పక్కదారి పడుతుంటే...ఇక రాష్ట్రంలో మిగతా చోట్ల పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. అధికారపా
సాక్షి, అనకాపల్లి : రాష్ట్ర హోం మంత్రి ఇలాకాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా చెరువులను తవ్వేస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతోంది. ఎస్.రాయవరం మండలంలో వమ్మవరం నరసింహాసాగర్ చెరువు, యలమంచిలి మండలంలో కృష్ణాపురంలో గల దుబ్బల చెరువు ఇప్పుడు అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా.. ముఖ్యంగా ప్రభుత్వ సెలవు దినాల్లో అధికారుల పర్యవేక్షణ ఉండదని భావించి.. పొక్లెయిన్లతో చెరువు గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. వందల ట్రిప్‌ల మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తూ కాసులు కురిపించుకుంటున్నారు. ఈ అక్రమ తవ్వకాలు ఎస్.రాయవరం మండలంలో ఓ టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. సదరు నేత ఆధ్వర్యంలోనే సమీప ప్రాంతాల్లో భారీగా మట్టి స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇటుక బట్టి యాజమానులకు, కృష్ణాపురం, పులపర్తి గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలను పూడ్చడానికి, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ మట్టిని భారీ ధరలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ అండదండలు ఉండడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. దీనిపై స్థానిక రైతులు పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామస్తులు వాపోతున్నారు. డయల్ 100కు ఫోన్ చేసినా పట్టించు కోలేదని వాపోయారు. రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్లలో మట్టిని తరలిస్తుంటే అధికారులకు ఏమి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. నిల్వ ఉండని నీరు.. ఆందోళనలో రైతన్నలు నియమ నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో అస్త వ్యస్తంగా లోతైన గుంతలు తవ్వేస్తుండడంతో రానున్న రోజుల్లో సాగునీరు నిల్వ ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల గర్భం దెబ్బతినడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోయి, వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని ఆవేదన చెందుతున్నారు. అక్రమ తవ్వకాలపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా, వారు స్పందించకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు అందాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో కూటమినేతలు అక్రమ తవ్వకాలకు పాల్పడడం, హైకోర్టు అదేశాలను ధిక్కరించి నర్సీపట్నంలో పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం ఏర్పాటు చేయడం వంటి పనులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్పీకి ఫిర్యాదు.. యలమంచిలి మండలం కృష్ణాపురంలో నీటిపారుదల శాఖ చెరువు దుబ్బల చెరువులో అక్రమ మట్టితవ్వకాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త సోమిరెడ్డి వెంకట అప్పల సత్య సన్యాసి నూకరాజు సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కృష్ణాపురం గ్రామంలో గల నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉన్న దుబ్బల చెరువులో నుంచి వమ్మవరం గ్రామానికి చెందిన నీటి పారుదల శాఖ కాంట్రాక్టర్ పల్లెల దివాణం అనుచరుడు, బయ్యవరం మాజీ సర్పంచ్ గెంజి శ్రీనివాసరావు పొక్లెయిన్, 8 ట్రాక్టర్లు, 10 టిప్పర్లతో అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడి కృష్ణాపురం వద్ద ఒక చోట డంప్ చేయిస్తున్నారని, అక్కడ నుంచి టిప్పర్లతో నమ్మవరం 5 ఇటుక బట్టీలకు, లక్కవరం ఇటుక బట్టీకి తరలిస్తున్నారని తెలిపారు. దీనిపై యలమంచిలి రూరల్ ఎస్ఐకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహిన్‌సిన్హాను కోరారు. తూతూ మంత్రంగానే విచారణ.. ఎస్.రాయవరం మండలంలో వమ్మవరం నరసింహాసాగర్ చెరువులో అక్రమంగా మట్టి తవ్వి ఇటుక బట్టీలకు తరలించుకుపోతున్నారని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఆయకట్టు ఉన్న చెరువుల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టడం వల్ల చెరువు గర్భం అస్తవ్యస్తమై సాగునీరు ప్రవహించే అవకాశం లేదన్నారు. గ్రామంలో ఉన్న అయిదారు బట్టీలకు ఇదే క్రమంలో మట్టిని తరలించుకుపోతున్నారని చెప్పారు. ఈ మేరకు అక్రమ తవ్వకాలపై ఇన్చార్జి డిప్యూటీ తహసీల్దార్ నీరజ విచారణ చేయించారు. ఇటుక పరిశ్రమలకు అక్రమంగా తవ్విన మట్టి వెళుతున్నట్టు గుర్తించారు. దీనిపై రాయవరపు శ్రీనివాసరావు, ఓరుగంటి సత్తిబాబు, దోసపాత్రుని సత్యనారాయణ, తోట నాగబాబు, తోట శ్రీనివాసరావుపై కేసులు నమోదు చేయమని మైన్స్ అధికారులకు ఆమె ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిసింది. వారిపై ప్రస్తుతం ఎమ్మార్వో సమీపంలో బైండోవర్ చేశారు. అధికారుల మౌనం.. గ్రామస్తుల ఆగ్రహం కళ్ల ముందే అక్రమంగా మట్టి తవ్వకాలు, రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై గ్రామస్థులు, చెరువు ఆధారంగా వ్యవసాయం చేసే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే చట్టం పక్కదారి పడుతుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే కృష్ణాపురంలో గల దుబ్బల చెరువు వద్ద జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హోం మంత్రి ఇలాకాలో మట్టి మాఫియా పొక్లెయిన్లతో చెరువులు ధ్వంసం, మట్టి దోపిడీ ట్రాక్టర్లు, లారీల్లో యథేచ్ఛగా రవాణా ఇటుక బట్టీలకు, రియల్ వెంచర్లకు సరఫరా కూటమి నేత ఆధ్వర్యంలో స్టాక్ పాయింట్స్ పట్టించుకోని అధికారులు -
ప్రముఖ వైద్యుడు శ్రీరామ్మూర్తి మృతికి సంతాపం
బుచ్చెయ్యపేట: వడ్డాదిలో పేదల వైద్యుడిగా పేరొందిన ప్రముఖ వైద్యుడు బెన్నాబత్తుల శ్రీరామ్మూర్తి (68) (పెంటబాబు డాక్టర్ ) గుండె పోటుతో మృతి చెందారు. రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో ఉన్న తన కుమారుడి దగ్గరకు వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం విశాఖలోని ఓ పైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదు దశాబ్దాలుగా బుచ్చెయ్యపేట, చినఅప్పనపాలెం, బంగారుమెట్ట, దిబ్బిడి, ఎల్బీ పురం, భీమవరం, వడ్డాది, వీరవల్లి, పోతనపూడి, కుముదాంపేట, లోపూడి, శింగవరం తదితర గ్రామాల ప్రజలకు తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు అందించేవారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలతో పాటు నిరుపేదలకు ఫీజు తీసుకోకుండా వైద్య సేవలు అందించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేని సమయంలో, కరోనా కాలంలో కూడా పలువురికి వైద్య సేవలు అందించి పేదల పెన్నిధిగా పేరొందారు. శ్రీరామూర్తి అకాల మరణంతో పలు గ్రామాల ప్రజలు, పలువురు వైద్యులు, నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని పెద్ద కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా భార్య, కుమారుడు ఉన్నారు. -
పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఆవుల శేఖర్ నర్సీపట్నం: పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూములు దక్కే వరకు పోరాటాలు ఆగవని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు ఆవుల శేఖర్ పేర్కొన్నారు. అనకాపల్లిలో జిల్లా అధ్యక్షుడు అర్జున్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో శేఖర్ మాట్లాడారు. ఏళ్ల తరబడి గ్రామీణ పేదలకు సాగు భూములు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయమని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ భూములన్నీ రాజకీయ పలుకుబడి కలిగిన వారి చేతుల్లో ఉన్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా రాష్ట్ర ప్రభుత్వం భూములు కట్టబెడుతుందన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను అమలు చేస్తే పేదలకు ఇళ్ల స్థలాలు, సాగుభూములు అందుతాయన్నారు. పేదల సంక్షేమ పథకాలు కత్తిరించాలనే గ్రామాల్లో సర్వే చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలుగుల అర్జున్‌రావు, బాలేపల్లి వెంకటరమణ, జిల్లా ఆఫీస్ బేరర్లు కొండలరావు, అప్పలనాయుడు, లవరాజు, బంగారయ్య, అప్పారావు, నాగేశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘రహదారి లేదని చెప్పడం అన్యాయం’
మాట్లాడుతున్న బుద్ద మురళీ తాతారావు అనకాపల్లి: స్థానిక మెయిన్‌రోడ్డు రఘరాం లే అవుట్‌ను ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 1535/3లో 7.603 సెంట్ల జీరాయితీ భూమిలో గేటు నిర్మిస్తున్న సమయంలో లే అవుట్ ప్రతినిధి కాండ్రేగుల వెంకట పరమేశ్వరరావు ఈనెల 9వ తేదీన తమ భూమిలో గేటు నిర్మించుకోవడం తప్పు అని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని స్థల యజమాని బుద్ద మురళీ తాతారావు అన్నారు. స్థానికంగా ఉన్న తమ భూమిలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లే అవుట్‌కు ఆనుకుని ఉన్న తమ స్థలానికి ఇటు రహదారి లేదని చెప్పడం అన్యాయమన్నారు. లే అవుట్ సైడ్ గేటు ఏర్పాటు చేసుకోవాలంటే రూ. 50 లక్షలు చెల్లించాలని పరమేశ్వరరావు చెప్పడం తగదని మురళీ తాతారావు అన్నారు. ఇదే విషయంపై సోమవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కాండ్రేగుల వెంకట పరమేశ్వరరావుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాతారావు కుటుంబ సభ్యులు విల్లూరి గణేష్, దాడి నాని, ఆడారి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తూ ఆర్మీ ఉద్యోగి మృతి
వార్షిక ప్రణాళిక అమలుతో మహిళా సంఘాల అభివృద్ధి సబ్బవరం: వార్షిక ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసి, గ్రామీణ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని డీపీఎం ఐబీ పి.వెంకటరమణ సూచించారు. సబ్బవరం మండల సమాఖ్య కార్యాలయంలో ఏఏపీ–1 సెక్షన్ పరిధిలో రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సబ్బవరం మండల సమాఖ్యతో పాటు అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, గొలుగొండ, చోడవరం, యలమంచిలి మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వీవో స్థాయిలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారీ, కార్యవర్గ సభ్యులకు, ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అవగాహన కల్పించడం, బడ్జెట్ ప్రక్రియపై శిక్షణ అందించినట్లు ఆయన తెలిపారు. వీఎంవోఎస్ఏ అంఽశాలపై టీవోటీ కె.శ్రీనివాసరావు వివరించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తుల సృష్టి, ప్రవర్తనలో మార్పు, సుస్థిర జీవనోపాధి వంటి అంఽశాలపై సభ్యులతో చర్చించి గ్రామ, మండల స్థాయి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏడు మండలాలకు చెందిన అధికారులు, సిబ్బందితో పాటు సబ్బవరం మండలంలోని 58 గ్రామ సంఘాల లీడర్లు పాల్గొన్నారు. -
క్రీడా శిక్ష ణ కేంద్రాలకు విశేష స్పందన
● ఆరోగ్యం, ఆత్మరక్షణ కల్పించేందుకు యోగా, తైక్వాండోలో శిక్షణ చోడవరం: వేసవి సెలవులు రావడంతో వివిధ క్రీడల్లో ప్రారంభమైన వేసవి శిక్షణ కేంద్రాలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆయా విభాగాల స్పోర్ట్స్ యూనిట్లు ఇప్పటికే అన్ని కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించాయి. ఆత్మరక్షణ, ఆరోగ్య రక్షణలకు కీలకంగా మారిన తైక్వాండో, యోగాలో జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. 30రోజుల పాటు ఈ కేంద్రాలు నిర్వహించనున్నారు. తైక్వాండో అసోషియేషన్, చోడవరం పతంజలి యోగా కేంద్రాల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు ప్రారంభమయ్యాయి. తైక్వాండోలో... ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ చాలా అవసరం. అందులో బాలికల ఆత్మరక్షణ విషయంలో అప్రమత్తత అవసరమని భావించి స్పోర్ట్స్ అథారిటీ ఈ వేసవి శిక్షణ తరగతుల్లో తైక్వాండో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చింది. బాలబాలికలు కలిపి 30రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్వంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ జిల్లాలో ఐదు కేంద్రాల్లో తైక్వాండో జూడో క్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లం మురళి తెలిపారు. చోడవరం, అనకాపల్లిపట్టణం, అనకాపల్లిలో గాంధీనగరం, పరవాడ, బుచ్చెయ్యపేట(వడ్డాది) ప్రాంతాల్లో వేసవి ఉచిత శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. 5నుంచి 16సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలు ఈ శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 1 నుంచి నెలాఖరు వరకూ నిర్వహించే శిక్షణ తరగతులకు విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో హాజరవుతున్నట్టు మురళి తెలిపారు. యోగాలో .. అందరికీ ఆరోగ్యాన్ని అందించే యోగాలో శిక్షణ ఇచ్చేందుకు చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ప్రారంభించారు. ఇక్కడి ఉషోదయ విద్యాసంస్థల ప్రాంగణంలో ఉన్న యోగా కేంద్రంలో ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని యోగా గురువు పుల్లేటి సతీష్ తెలిపారు. యోగా వల్ల విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం, శరీర సౌష్టవంతోపాటు ఏకాగ్రత లభిస్తుందన్నారు. ఈ కేంద్రాన్ని ఈనెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు పాల్గొన్నారు. ● శ్రీ వరావరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందజేశారు. -
పోయిన పర్సు బాధితుడికి అందజేత
మునగపాక : మునగపాక పీఏస్‌కు చెందిన హెచ్‌సీ సాగర్ మానవత్వం చాటుకున్నారు. ఉమ్మలాడకు చెందిన ఆడారి సాయి ఆదివారం సాయంత్రం తన పర్సును పోగొట్టుకున్నాడు. ఈ పర్సులో రూ.15వేల నగదుతో పాటు పలు ఏటీఎం కార్డులు ఉన్నాయి. పర్సు కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో నిస్సహాయకునిగా ఉండిపోయాడు. కాగా కేసు విచారణలో భాగంగా ఆదివారం రాత్రి ఉమ్మలాడ వెళ్లిన హెచ్‌సీ సాగర్‌కు పర్సు కనిపించింది. దీంతో పర్సులోని అడ్రసు గుర్తించి బాధితుడు సాయికి ఫోన్ చేశారు. సంబంధిత పర్సును మునగపాక పోలీసు స్టేషన్లో బాధితుడు సాయికి హెచ్‌సీ సాగర్ అందజేశారు. దీంతో స్టేషన్ ఎస్ఐ ప్రసాదరావుతో పాటు ఇతర సిబ్బంది సాగర్ మానవత్వం పట్ల అభినందనలు తెలిపారు. పోయిన పర్సు దొరకడంతో హెచ్‌సీ సాగర్‌కు బాధితుడు సాయి కృతజ్ఞతలు తెలిపాడు. -
ఆర్మీ ఉద్యోగి భౌతికకాయం ఊరేగింపు
పట్టణంలో ఊరేగింపుగా తీసుకువెళుతున్న ఆర్మీ ఉద్యోగి రాపేటి పూర్ణచంద్రరావు భౌతికకాయం అనకాపల్లి టౌన్: వెంకుపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి రాపేటి పూర్ణచంద్రరావు(37) ఆర్మీలో విధులు నిర్వహిస్తూ శుక్రవారం డెహ్రాడూన్‌లో మృతి చెందారు. ఈయన మృతదేహం ఆదివారం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఊరేగింపుగా, పట్టణం గుండా గ్రామానికి చేరుకుంది. గ్రామానికి చేరుకున్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. తన విధుల్లో భాగంగా ట్రక్ నడుపుతుండగా ప్రమాదానికి గురై మరణించినట్టు బంధువులు తెలిపారు. చంద్రశేఖర్‌కు భార్య గ్రేషి, ఐదేళ్ల కుమారుడు కనిష్క్, రెండేళ్ల కుమార్తె కారుణ్య ఉన్నారు. ఈ అనుకోని సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
నిర్లక్ష్యం.. నీరుగారిన లక్ష్యం
రిజర్మాయర్ ప్రాంతం : చినరాచపల్లి పేరు : ఊటగెడ్డ నిర్మాణం : 2008 సంవత్సరం రిజర్వాయర్ విస్తీర్ణం : 70 ఎకరాలు ఆయకట్టు : 200 ఎకరాలు సాగునీరు అందాల్సిన గ్రామాలు : వెంకయ్యపాలెం, చినరాచపల్లి, రామన్నపాలెం, రాచపల్లి, జి.కోడూరు. ప్రస్తుత పరిస్థితి : ● ఈ రిజర్వాయర్‌కు ముందుగా ఒక కాలువ మాత్రమే నిర్మించడంతో పూర్తి స్థాయిలో పంట భూములకు నీరు అందేదికాదు ● రైతుల అభ్యర్థన మేరకు రూ.9లక్షలతో రెండో కాలువకు లైనింగ్ పనులు చేశారు. ● కాలువ గేటును నిర్మాణ సమయంలో సక్రమంగా అమర్చకపోవడం వల్ల రిజర్వాయర్‌లో ఉన్న నీరు వృథాగా పోతోంది. ● ఈ రిజర్వాయర్‌కు చెందిన సుమారు 20 ఎకరాలను ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. -
‘మనమిత్ర’ ద్వారా అప్పన్న టికెట్లు సులభతరం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, భక్తులు వీటిని విరివిగా వినియోగించుకోవాలని ఈవో జె.వెంకటరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి వద్ద నుంచే మొబైల్ ద్వారా దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదం టోకెన్లు, వసతి గదులను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా రూ.100, రూ.300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల సాధారణ క్యూతో సంబంధం లేకుండా అత్యంత తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం పూర్తవుతుందని ఆయన వివరించారు. దళారుల బెడద లేకుండా, పారదర్శకమైన సేవలను అందించడమే ఈ ‘మనమిత్ర’ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. భక్తులు తమ మొబైల్లో 9552300009 నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో మెసేజ్ పంపడం ద్వారా సులభమైన పద్ధతిలో ఈ సేవలను పొందవచ్చునని ఈవో వెల్లడించారు. -
వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మునగపాక: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ఈ నెలాఖరులోగా జిల్లా వ్యాప్తంగా అనుబంధ విభాగాల కమిటీలను పూర్తిస్థాయిలో నియమించాలని సూచించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పాలన సాగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అనుబంధ విభాగాలకు పూర్తిస్థాయిలో కమిటీలు నియమించాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేయాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని చెప్పారు.చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో జరుగుతున్న విధ్వంసకర పరిస్థితులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఘనంగా ప్రపంచ మాతృ దినోత్సవం ప్రపంచ మాతృదినోత్సవాన్ని ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాతను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ తదితరులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతిగా పేరుగాంచారన్నారు. బొడ్డేడకు ఘన సత్కారం... వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ను పలు అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రసాద్ నాయకత్వంలో అనకాపల్లి జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. -
నిర్వహణ లేదు.. నీరు రాదు
మాకవరంపాలెం: పంటలకు సాగు నీరు అందించాల్సిన జలాశయాలు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఏళ్ల తరబడి వీటి నుంచి సాగునీరు అందకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. పూడిక పేరుకుపోయి.. కాలువల లైనింగ్ శిథిలమవడంతో ఏటా ఖరీఫ్ సీజన్లో రెండు వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు కూడా సాగునీరు అందే పరిస్థితి కానరాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మాకవరపాలెం మండలంలో మూడు జలాశయాల నిర్వహణను పట్టించుకునే వారు లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిపాదనలు పంపాం మూడు రిజర్వాయర్ల గేట్లు, కాలువల మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఒక్కో రిజర్వాయర్‌కు రూ.20 లక్షల చొప్పున ప్రతిపాదించాం. నిధులు రాగానే పనులు చేస్తాం. సర్వేచేసి రిజర్వాయర్లలో ఆక్రమణలను తొలగిస్తాం. ప్రస్తుతం మామిడిపాలెం రిజర్వాయర్ గర్భంలో పూడికను ఉపాధి పథకంలో తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్.రామన్నపాత్రుడు, ఏఈ, ఇరిగేషన్, నర్సీపట్నంపూనిక లేదు.. పూడిక తొలగదు కూలిన మదుములు.. పాడైన షట్టర్లు పెరుగుతున్న పూడిక... కొనసాగుతున్న ఆక్రమణలు కానరాని మరమ్మతులు నిరుపయోగంగా మూడు జలాశయాలు -
లేబర్ కోడ్స్ కాపీలు దహనం
సెజ్‌లో లేబర్ కోడ్స్ నిబంధన కాపీలను దహనం చేస్తున్న సీఐటీయూ నాయకులు, కార్మికులు అచ్యుతాపురం రూరల్: లేబర్ కోడ్స్ నిబంధన కాపీలను సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సెజ్ వద్ద కార్మికులు దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రొంగలి రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కారణంగా 29 కార్మిక చట్టాలు రద్దు అయిపోతాయన్నారు. 12 గంటల పాటు పని చేయాలని, దీంతో కార్మికులపై పని భారం అధికమవుతుందని చెప్పారు. లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెజ్ కార్మికులు పాల్గొన్నారు. -
సోలార్ పేరుతో మోసం చేస్తున్న సర్కార్
సీపీఐ జిల్లా కార్యదర్శి దొరబాబుఅనకాపల్లి: సోలార్ స్కీమ్‌ల పేరుతో ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఉచిత విద్యుత్’పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న సోలార్ స్కీమ్‌ల గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవానికి ఈ పథకాల వల్ల ఆ పనులు చేస్తున్న ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్ల ద్వారా కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతాయని చెప్పారు. ప్రభుత్వ రంగ విద్యుత్ వ్యవస్థను బలహీనపరుస్తూ, భవిష్యత్‌లో ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపే పరిస్థితి తీసుకొస్తున్నారని ఆయన చెప్పారు. గ్రామీణ, పేద ప్రజలకు ఉచిత విద్యుత్ పేరుతో ఆశలు చూపుతున్న ప్రభుత్వం ప్రస్తుత సబ్సిడీలను తగ్గించే అవకాశం ఉందన్నారు. సోలార్ ప్యానెల్స్ నిర్వహణ, మరమ్మతులు, పనితీరు వంటి అంశాల్లో వచ్చే సమస్యల గురించి ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదన్నారు. టెండర్ల కేటాయింపు, అమలు ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్ల అవినీతి పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజల డబ్బుతో కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనకాపల్లి పట్టణంలో సుమారు 10 రోజుల క్రితం శ్రీరామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పాడైపోయిందన్నారు. ఈ విషయంపై విద్యుత్‌శాఖ అధికారులకు గృహయజమాని ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. -
పంట పొలాలు ముంపునకు గురైతే బాధ్యులెవరు..?
మునగపాక: భూసేకరణ చేపట్టకుండా మునగపాక దరి సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు చేపట్టడం సరికాదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌తో కలిసి సాగునీటి కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ మునగపాక, తోటాడ రెవెన్యూ పరిధిలో వేలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించే కాలువలను మూసేసి రెయిలింగ్ పనులు చేపట్టడం సరికాదన్నారు. ముందుగా రైతుల నుంచి భూసేకరణ చేపట్టి కాలువల నిర్మాణాలు చేపడితే బాగుండేదన్నారు. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువల్లో రెయిలింగ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే విపత్తు సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. రహదారి విస్తరణను ఈ ప్రాంత ప్రజలతో పాటు రైతులు కూడా సమ్మతిస్తున్నారని అయితే రైతులకు నష్టం వాటిల్లేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరికాదన్నారు. బాధితులకు ఇచ్చే పరిహారం నేరుగా అకౌంట్లో వేసేలా చూడాలన్నారు. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ నిలబడుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు లోచల సుజాత,వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు,మాజీ ఎంపీపీ దాసరి గౌరీలక్ష్మి అప్పారావు, పాటిపల్లి ఎంపీటీసీ ఇల్లా శిరీషా నాగేశ్వరరావు పాల్గొన్నారు. భూసేకరణ చేపట్టకుండా సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు సరికాదు బాధితులకు పరిహారం నేరుగా అందించాలి టీడీఆర్‌లు వద్దంటున్నా ప్రభుత్వంలో కానరాని స్పందన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ -
వెతలే.. వేతనాలు లేవ్
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అరకొర వేతనాలతో పనిచేస్తున్న వారి గోడును కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా ఒక్క పైసా పెంచలేదు సరికదా సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కుటుంబ పోషణ వారికి భారమవుతోంది.ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డెస్క్సాక్షి, అనకాపల్లి: పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం సేవలందించడంలో ఆరోగ్యమిత్రల సేవలు కీలకం. వ్యాధుల బారిన పడిన వారు, రోడ్డు ప్రమాదాలకు గురైన వారు ఆస్పత్రులకు వస్తే వారికి సకాలంలో ఉచిత వైద్య సేవలందేలా కృషి చేసి, వారు కోలుకునే వరకూ వెన్నంటే ఉండి సేవలందిస్తున్న ఆరోగ్య మిత్రలు చాలీచాలని వేతనంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, వీరి వేతనాల్లో ఒక్క రూపాయి కూడా పెంచకపోగా, కనీసం ఇస్తున్న అరకొర జీతాలను కూడా సకాలంలో విడుదల చేయకుండా వేధిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం అమలుకు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 163 మంది ఆరోగ్యమిత్రలు, జిల్లా టీమ్ లీడర్లు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆరోగ్య మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారం చేపట్టినా ఆరోగ్య శ్రీ, ఆరోగ్య మిత్రలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు వాపోతున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ వైద్యసేవలను క్రమేపీ నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్..ఆరోగ్య మిత్రలను కూడా ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్రలకు తెరలేపుతోంది. రేయింబవళ్లు శ్రమిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి అండగా నిలవాల్సిన పాలకులు, వారి గోడును పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బండెడు చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం,వేతనాలు పెంచే విషయంలో మాత్రం మొండిచేయి చూపుతోంది. అందని జీతాలు.. ఆర్థిక ఇబ్బందులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య మిత్రలకు రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారి, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలాఖరు వస్తే చాలు ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, నిత్యావసరాల ఖర్చుల కోసం ఎవరిని అడగాలో తెలియక వారు ఆవేదన చెందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చాకిరీ ఎక్కువ.. జీతం తక్కువ ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సేవలందించడంలో ఆరోగ్య మిత్రల పాత్ర కీలకం. ఉదయం నుంచి సాయంత్రం వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నా, వారికి దక్కేది మాత్రం నామమాత్రపు వేతనమే. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వీరికి అండగా నిలవగా, ప్రస్తుత చంద్రబాబు సర్కార్ ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపైనే అదనపు పనిభారం పడుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలను పెంచాలని ఆరోగ్య మిత్రలు డిమాండ్ చేస్తున్నారు. మూడు జిల్లాల్లో వివరాలు ఇలా.. ● విశాఖ జిల్లాలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది: 110 మంది ● అనకాపల్లి జిల్లాలో మొత్తం సిబ్బంది : 33 మంది ● అల్లూరి జిల్లాలో మొత్తం సిబ్బంది : 20 మందిఅనకాపల్లిలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంఎన్టీఆర్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న ఆరోగ్య మిత్రలున్యాయస్థానాల్లో పోరాడుతాం రెండేళ్లుగా వేతనాలు పెంచకుండా ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది. కనీస వేతనం అమలు చేయాలని ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించాం. ట్రస్ట్ సీఈవోకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మా వేతనాలు విడుదల చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించకపోవతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – గోవింద్, ఆరోగ్య మిత్రల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోగ్య మిత్రలకు రెండు నెలలుగా అందని జీతాలు రూ.60 లక్షల వేతన బకాయిలు ఉమ్మడి విశాఖ జిల్లాలో 163 మంది ఎదురు చూపులు రెండేళ్లుగా పైసా పెంచని వైనం.. బండెడు చాకిరీకి అరకొర జీతం కనీస వేతనం అమలు చేసి, రెగ్యులరైజ్ చేయాలంటూ డిమాండ్ -
క్రీడాకారులు ఫూల్
స్విమ్మింగ్ పూల్..విశాఖ స్పోర్ట్స్: ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లోకి ఈ కాంప్లెక్స్ వెళ్లినప్పటి నుంచి క్రీడాకారుల శిక్షణ గాలికొదిలేసి, కేవలం లాభార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ ఆస్తులపై పెత్తనం చెలాయిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో సుమారు 1500 నుంచి 1800 మంది వరకు, వింటర్ సీజన్లో కూడా రోజుకు 300 మందికి పైగా శిక్షణ కోసం ఇక్కడికి వస్తుంటారు. సమ్మర్ సీజన్లో ఒక్కొక్కరు నుంచి రూ.3000 వసూలు చేస్తున్నారు. ఇంతమంది వస్తున్నా అందుకు తగ్గట్టుగా కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రైవేట్ నిర్వాహకులు ఘోరంగా విఫలమయ్యారు. తీవ్ర ఇబ్బందులు శిక్షణార్థుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పూల్‌లో ఈత నేర్చుకోవడం కంటే, ఒడ్డున నిరీక్షించడానికే ఎక్కువ సమయం వృథా అవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మూడు గంటల పాటు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ టైమ్ స్లాట్లు కేటాయించి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, కనీస పర్యవేక్షణ కరువైంది. 16 అడుగుల లోతు గల ప్రధాన పూల్..పక్కనే ఉన్న 3 నుంచి 6 అడుగుల లెర్నింగ్ పూల్‌లో కలిపి నిత్యం వందలాది మంది కిక్కిరిసిపోతున్నారు. గంట స్లాట్‌లో ఒక చిన్నారికి కేవలం అరనిమిషం పాటు మాత్రమే నీటిలో స్విమ్మింగ్ చేసే అవకాశం దక్కుతోందని, మిగిలిన 20 నిమిషాల నుంచి అరగంట సమయం కేవలం క్యూలో నిలబడటానికే సరిపోతోందని వాపోతున్నారు. కోచ్‌ల కొరత వందలాది మంది పిల్లలకు కేవలం ముగ్గురు కోచ్‌లు, నలుగురు లైఫ్ గార్డులు మాత్రమే అందుబాటులో ఉండటం నిర్వాహకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. శిక్షణ గురించి ప్రశ్నిస్తే ‘కోచ్‌లు దొరకడం లేదు’ అనే రొటీన్ సమాధానం వస్తోందని, అసలు బాధ్యతాయుతమైన కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియని పరిస్థితి నెలకొందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు స్వతంత్రంగా ప్రాక్టీస్ చేద్దామన్నా విపరీతమైన రద్దీ వల్ల నిరాశే ఎదురవుతోంది. ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోనే ఇదే పరిస్థితి ఇదే తరహా పరిస్థితి ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోనూ కనిపిస్తోంది. ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల క్రీడాకారుల భద్రత, రక్షణ, నాణ్యమైన శిక్షణ అనే అంశాలు మరుగున పడిపోయి, క్రీడా ప్రాంగణాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయనేది నగ్న సత్యం. విశాఖ కీర్తి ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికై నా జీవీఎంసీ కమిషనర్ , కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, ఈ ప్రైవేట్ సంస్థల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని, ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు న్యాయం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. -
పడకేసిన వైద్యం
కేజీహెచ్ మందుల కౌంటర్ల వద్ద రోగుల పడిగాపులుఖాళీల భర్తీలో ప్రభుత్వం విఫలం ఆస్పత్రుల్లో బదిలీల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉన్న వైద్యులలో కొందరు ఆస్పత్రికి వచ్చి కేవలం ముఖ గుర్తింపు హాజరు వేసి, ఆపై తమ వ్యక్తిగత పనులకు లేదా ప్రైవేటు ప్రాక్టీసులకు వెళ్లిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నర్సులు, ఫార్మసిస్టులే ‘డాక్టర్ల’ అవతారం ఎత్తుతున్నారు. తమకున్న పరిమిత వైద్య పరిజ్ఞానంతో వారు మందులు రాసి ఇస్తున్నారు. ఇది ఒకరకంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అత్యవసర పరిస్థితుల్లో రోగులు చేసేదేమీ లేక, తమ జేబులు ఖాళీ అయినా సరే ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. యూపీహెచ్సీ, పీహెచ్‌సీల్లో అందుబాటులో లేని వైద్యులు వైద్యుల అవతారం ఎత్తుతున్న నర్సులు, ఫార్మసిస్టులు కాని రాని స్పెషాలిస్ట్ వైద్యులు 66 యూపీహెచ్‌సీలు, 9 పీహెచ్‌సిల్లో అరకొర సౌకర్యాలు -
రాజు వెర్సెస్ బాబు
● చోడవరం కూటమిలో అసమ్మతి కుంపటి ● ఎమ్మెల్యే లేకుండా అభివృద్ధిపై నాయకుల ప్రెస్‌మీట్ ● నియోజకవర్గంలో బయటపడుతున్న నేతల కుమ్ములాటబుచ్చెయ్యపేట: చోడవరం నియోజకవర్గంలో కూటమి నేతల కుమ్ములాటలు మరోసారి బయట పడ్డాయి. ఆదివారం మేజర్ పంచాయతీ వడ్డాదిలో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు లేకుండానే జిల్లా టీడీపీ అధ్యక్షుడు,రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ బత్తుల తాతయ్యబాబు, నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పి.వి.ఎస్.ఎన్. రాజు, రాష్ట బీజేపీ అధికార ప్రతినిధి ఈర్లె శ్రీరామూర్తిలు తమ అనుచరులతో కలిసి అభివృద్ధి పనులపై ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అభివృద్ధిపై కాకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గంగా చూపించుకునేందుకే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు పలువురు గుసగుసలాడారు. ఇప్పటికే జిల్లా కేంద్రం అనకాపల్లిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు,మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందరావు మధ్య తీవ్ర వర్గ పోరు సాగుతోంది. అనకాపల్లికి పక్కనే ఉన్న చోడవరం నియోజకవర్గంలోను ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు, రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ బత్తుల తాతయ్యబాబుల మధ్య కూడా విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పటికే వీరిద్దరి మధ్యన ఉన్న వర్గ పోరు టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. 20 రోజుల కిందట కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన రైతు సమీక్ష సమావేశంలో కూడా ఎమ్మెల్యే రాజు పాల్గొనక పోగా కూటమి నేతలు తాతయ్యబాబు, పి.వి.ఎస్.ఎన్. రాజు,ఈర్లె శ్రీరామూర్తులు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రాజు పాల్గొంటున్న కార్యక్రమాలకు కూడా ఈ ముగ్గురు నేతలకు పిలుపు ఉండటం లేదు. కూటమిలో ఉన్న జనసేన,బీజేపీ నాయకులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రాజు నియోజక వర్గంలో పలు కార్యక్రమాలు చేయడంపై జనసేన,బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజు తమకు సమాచారం ఇవ్వకపోవడంపై కినుక వహించి జనసేన,బీజేపీ నేతలు ఎమ్మెల్యే రాజును వ్యతిరేకిస్తున్న తాతయ్యబాబు పక్కన చేరారు. ఎమ్మెల్యేను ఒంటరి చేయాలని కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు,సంక్షేమం గురించి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే లేకుండా ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే వర్గ నాయకులు ఆగ్రహం చెందుతున్నారు. -
నూకాంబికను దర్శించుకున్న క్రీడల ఉన్నతాధికారి
బంగార్రాజు దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ న్యూఢిల్లీ డైరెక్టర్ తటపర్తి బంగార్రాజు దంపతులు కుటుంబ సమేతంగా ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. న్యూఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్‌పోర్డుకు వచ్చి అక్కడ నుంచి కారులో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ బంగార్రాజు దంపతులను శాలువాలతో సత్కరించి అమ్మవారి ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ టెన్నికోయిట్ అసోసియేషన్ చైర్మన్ కె.ఎన్.వి. సత్యనారాయణ పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే మేనల్లుడు
సాక్షి టాస్క్‌ఫోర్స్: అనకాపల్లిలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడి అనుచరులు ఓ కాలనీ గోడను కూల్చివేయడమే కాకుండా ఇదేమని ప్రశ్నించిన కాలనీవాసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నానితోపాటు ఎమ్మెల్యే బంధువైన కొణతాల బాల సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లిలో విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అనుమతి పొందిన లేఅవుట్లో కాలనీ వాసులు నిర్మించుకున్న గోడను జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నాని, ఎమ్మెల్యే బంధువు కొణతాల బాల, విల్లూరి గణేష్, ఆడారి శంకరరావు, శరగడం రమేష్, బుద్ద మురళీ తాతారావు తదితరులు ఈ ఏడాది ఫిబ్రవరి 18న అర్ధరాత్రి పొక్లెయిన్ సాయంతో కూల్చివేశారు.కాలనీ వాసులు తమ రక్షణ కోసం చాలాకాలం క్రితం ఆ గోడను నిర్మించుకోగా.. ఆ గోడ అవతల ఉన్న స్థలంపై జనసేన పార్టీకి చెందిన వ్యక్తులు కన్నేశారు. కాలనీ వాసులు అడ్డు చెప్పేలోపే పాత గోడను తొలగించి.. పక్కన మరో గోడ నిర్మించారు. గోడ తొలగించిన స్థలంలో అది తమ స్థలమేనంటూ బోర్డులు పెట్టారు. గోడ కూల్చివేత, స్థలాన్ని ఆక్రమించడంతోపాటు పక్కనే అక్రమ కట్టడం నిర్మించడంపై కాలనీవాసులు అప్పట్లోనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పోలీసులు స్పందించడానికి చాలా సమయం తీసుకున్నారు.ఎమ్మెల్యే బంధువు ఈ వ్యవహారంలో ఉండటంతో కేసు నమోదులో జాప్యం జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు శనివారం (ఈ నెల 9న) బాధితులలో ఒకరైన కాండ్రేగుల బాల వెంకట పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే మేనల్లుడు, బంధువుపై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే మేనల్లుడు తదితరులు కాలనీవాసులపై శనివారం రాత్రి దౌర్జన్యానికి దిగటం కలకలం రేపింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వ్యవసాయమే ముద్దు.. ఎస్ఈజెడ్ వద్దు
కె.కోటపాడు: ఆర్లి, చింతపాలెం, గురుగుబిల్లి రెవెన్యూలో గల భూములను ఎస్ఈజెడ్కు ఇచ్చేది లేదంటూ ఆర్లిలో రైతులతో కలిసి సీపీఎం నాయకులు నిరసన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.వెంకన్న మాట్లాడుతూ ఎస్ఈజెడ్కు తమ భూములు ఇచ్చేది లేదంటూ ఈ గ్రామాల్లో గల రైతులు ఒక్క పక్క నిరసన తెలుపుతుంటే మరోవైపు ఈ గ్రామాల నుంచి కొంత మంది రైతులను శుక్రవారం ఆర్డీవో వద్దకు ఎమ్మెల్యే తీసుకువెళ్లి భూములకు ఎంత ధర ఇస్తారో చెప్పాలని అడగడం హాస్యాస్పదంగా ఉందని వెంకన్న అన్నారు. గత ఏడాది ఎస్ఈజెడ్కు భూములు తీసుకుంటామని ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చెప్పినప్పటి నుంచి రైతులు ఆందోళనలు చేస్తూ దరఖాస్తులను అధికారులకు అందిస్తున్నారని అన్నారు. భూములు ఇవ్వని రైతులపై కేసులు పెడతామంటూ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి బెదిరిస్తున్నా... ఇటువంటి బెదిరింపులకు ఆర్లి పంచాయతీలోని రైతులు బయపడరని వెంకన్న స్పష్టం చేశారు. గతంలో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేసిన పరవాడ ప్రాంతంలో నిషేధిత కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలిసే పరిస్థితి ఉందని, ఈ ప్రాంతంలో వ్యర్థాలు ఎక్కడకు పంపుతారని ఆయన ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పన పేరుతో నిషేధిత కంపెనీల ఏర్పాటుతో పచ్చటి పొలాలను నాశనం చేసే యత్నాలను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భూ కేటాయింపులు జరిగినప్పుడే ఏ కంపెనీలు ఈ ప్రాంతంలో పెడతారో ప్రజలకు చెప్పాలని ఆయన కోరారు. బలవంతపు భూసేకరణతో ప్రజల జీవితాలను నాశనం చేయనున్నారని వెంకన్న అన్నారు. మాడుగుల నియోజకవర్గంలో రిజర్వాయర్లు ఉండడం వల్ల ఈ ప్రాంతంలో పంటలకు పనికి వచ్చే భూములని అన్నారు. ఈ ప్రాంతంలో రైతులు ఎట్టి పరిస్థితిలోనూ భూములు ఇచ్చేందుకు ముందుకు రారని, బలవంతపు భూసేకరణ జరిగితే రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని వెంకన్న తెలిపారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు గండి నాయినిబాబు, ఈర్లె నాయుడుబాబు, రైతులు ఆర్.ఏ.పాత్రుడు, కక్కల శివ, తాళ్ల నాగేష్, సీముసురు రాము, ఇమంది రాజుతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.ఆర్లిలో రైతులతో కలిసి సీపీఎం నాయకుల నిరసన -
టీడీపీలో వర్గ పోరు
సాక్షి, అనకాపల్లి: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తెలుగుతమ్ముళ్లలో ఆధిపత్య పోరు మరోసారి పతాక స్థాయికి చేరింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. నియోజకవర్గ ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణపై ఆ పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో ‘తమ్ముళ్ల’ మధ్య రచ్చ బట్టబయలైంది. గత ఏడాది డిసెంబర్లో అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు వద్ద దాడి వీరభద్రరావు, పీలా గోవింద్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ఇద్దరూ కలిసి పని చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే అదే నియోజకర్గంలో తుమ్మపాలలో ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులంతా సమావేశం ఏర్పాటు చేసుకుని బహిరంగంగానే పీలా గోవింద్‌పై విమర్శలు సంధించారు. ఇది మరవక ముందే.. గోవింద్పైనే అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి దాడి వర్గీయులు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ వర్గీయులు, సీనియర్ టీడీపీ నేతలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. వాస్తవానికి వీరి మధ్య విభేదాలు ఇప్పటివి కాదు. గడిచిన ఏడాదిన్నర కాలంగా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా అది రెండు వర్గాల మధ్య ఘర్షణకే దారితీస్తోంది. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను పీలా గోవింద్ ఏకపక్షంగా తన అనుచరులతోనే నిర్వహిస్తున్నారని, ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న సీనియర్లను విస్మరిస్తున్నారని మాజీ మంత్రి దాడి వర్గం, పార్టీలో సీనియర్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రతీ కార్యక్రమంలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి, పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, విడివిడిగా సమావేశాలు నిర్వహించడంతో అసలు పార్టీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందో తెలియని అయోమయ స్థితి నెలకొంది. పదవుల కోసం, పట్టు కోసం అగ్ర నాయకులు చేస్తున్న ఈ ఆధిపత్య పోరు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో తమ కొంప ముంచుతుందేమోనని కార్యకర్తలు భయపడుతున్నారు. తారస్థాయికి విభేదాలు.. గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ టికెట్ దక్కకపోవడంతో భంగపాటుకు గురైన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో పాటు అనకాపల్లి నియోకవర్గ పార్టీ ఇన్చార్జిగా అధిష్టానం కొనసాగించింది. మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు కూడా ఎన్నికలకు ముందు నియోజకవర్గం టికెట్ ఆశించి టీడీపీలో చేరారు. అయితే అక్కడ పొత్తులో భాగంగా జనసేనకు అవకాశం కల్పించారు. కాగా గెలుపొందిన జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ..మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ బంధువు కావడంతో నియోజకవర్గంలో పీలా గోవింద్‌కు కాస్త స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలో పనులు చేసే విషయంలో అధికారులు కూడా పీలా గోవింద్‌కే అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారని టీడీపీలో చర్చించుకుంటున్నారు. దీన్ని జీర్ణించుకోలేని దాడి వర్గం... ఒక వర్గానికే పార్టీలో పదవులు దక్కుతున్నాయంటూ ఆరోపిస్తోంది. అక్కడ నుంచి ప్రారంభమైన వీరి మధ్య విభేదాలు రోజు రోజుకు తారస్థాయికి చేరుకుంటున్నాయి. అధినేత వార్నింగ్ బేఖాతర్.. గత ఏడాది డిసెంబర్ 20న అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు వద్ద పీలా గోవింద్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పరస్పరం ఫిర్యా దు చేసుకున్నారు. దీంతో ఇద్దరు నేతలతో వేర్వేరుగా చంద్రబాబు మాట్లాడారు. ‘మీ బాగోతాలు అన్ని నా దగ్గర ఉన్నాయి.. అంతా చూస్తూనే ఉన్నా.. నేను జోక్యం చేసుకునే అంతవరకు సాగదీయకండి.. తమాషాలుగా ఉందా’ అని అంటూ హెచ్చరించినట్టు ఆ పార్టీలో సీనియర్ నాయకులు బహిరంగంగానే చర్చించుకున్నారు. ఇద్దరు మాజీ లకు అధినేత వార్నింగ్ ఇవ్వడం..వాటిని వారు బేఖాతరు చేయడం ఆ పార్టీలో చర్చీనీయాంశంగా మారింది. అనకాపల్లి తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు మాజీ మంత్రి దాడి వర్సెస్ నియోజకవర్గ ఇన్చార్జి పీలా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వైఖరిపై జిల్లా అధ్యక్షుడుకి దాడి వర్గీయుల ఫిర్యాదు గతంలో తాళ్లపాలెంలో చంద్రబాబు వద్ద వీరి పంచాయితీ అధినేత చంద్రబాబు వార్నింగ్ బేఖాతర్ -
నేడు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేత
అనకాపల్లి: జిల్లాలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 10న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ జిల్లా ఆపరేషన్ ఎస్ఈ జి.ప్రసాద్ శనివారం తెలిపారు. 400కేవీ కాలపాక – ఖమ్మం లైన్‌పై తుప్పు పట్టిన పాత విద్యుత్ టవర్లను మార్చే పనుల నిమిత్తం ఏపీ ట్రాన్స్‌కో ఈ లైన్ క్లియరెన్స్‌ను తీసుకుంటుందని, 220కేవీ బ్రాండిక్స్ కల్పక–1, 2 సర్క్యూట్లో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరమ్మతులు నిమిత్తం పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామన్నారు. 220/132/33కేవీ బ్రాండిక్స్ సబ్ స్టేషన్, 33/11కేవీ బ్రాండిక్స్, 33/11కేవీ ఎస్‌ఈజె–1, 2 నుంచి విద్యుత్ పొందే పరిశ్రమలన్నింటికీ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ను నిలుపుదల చేస్తామన్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఉదయం 4 గంటలకు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. సాధారణ వినియోగదారులు ట్రాన్స్‌కో ప్రత్యామ్నాయ వనరుల ద్వారా విద్యుత్ అందిస్తున్నందున ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. వినియోగదారులు, పారిశ్రామిక వర్గాలు ఈ మార్పుకు సహకరించాలని కోరారు. -
సకాలంలో గ్యాస్ అందక ఇబ్బందులు
● ఉదయం 10.30 నుంచి రాత్రి 8 గంటల వరకు పడిగాపులు ● మాకవరపాలెంలో ఆందోళనకు దిగిన వినియోగదారులు మాకవరపాలెం: సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులకు ప్రతి శనివారం, సోమవారం గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తుంటారు. అయితే గత నెల రోజులుగా సకాలంలో సిలిండర్లు అందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని సుమారు 50 మంది వినియోగదారులు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలైనా గ్యాస్ వ్యాన్ రాకపోవడంతో పడిగాపులు కాశారు. తీరా 8 గంటలకు వ్యాన్ వచ్చినా 20 సిలిండర్లు మాత్రమే ఉండడంతో వినియోగదారులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న 50 మందికి సిలిండర్లు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని ఆందోళనకు దిగారు. ఇదే విషయమై సివిల్ సప్లయి డీటీ అశోక్‌కు వినియోగదారులు ఫోన్లో ఫిర్యాదు చేశారు. మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు గ్యాస్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఏ సమయంలో గ్యాస్ పంపిణీ చేస్తారో ముందుగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామన్నారు. దీనిపై స్పందించిన డీటీ మాట్లాడుతూ సిలిండర్ల కోసం ఉన్న 50 మందికీ గ్యాస్ పంపిణీ చేస్తామని తెలిపారు. సోమవారం నుంచి ఏ సమయంలో గ్యాస్ అందజేస్తామనే విషయాన్ని వినియోగదారులకు తెలియజేయడంతో పాటు నిర్ణీత సమయానికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
కొత్త జిల్లాల్లోనూ త్వరలో నర్సుల సంఘ ఎన్నికలు
మహారాణిపేట(విశాఖ): కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కూడా వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వ నర్సుల సంఘ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.రాధమ్మ తెలిపారు. శనివారం కేజీహెచ్ క్లాక్‌రూమ్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో 13 జిల్లాల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించామని, కొత్త జిల్లాల నుంచి కూడా సంఘాల ఏర్పాటుకు డిమాండ్ వస్తోందని చెప్పారు. అందువల్ల ఆయా జిల్లాల్లో సభ్యత్వ నమోదు చేపట్టి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తామని వెల్లడించారు. అదే సందర్భంగా విశాఖ జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు ఉపాధ్యక్ష పదవులను ప్రభుత్వ (జీఏడీ) అనుమతితో కో–ఆప్షన్ ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎ.జయలక్ష్మి, ఎస్.జి.గౌరి, జి.హేమలత, పి.కల్పనలను నియమించగా, కార్యవర్గ సభ్యురాలిగా డి.విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఇన్–సర్వీస్ నర్సులు ఎమ్మెస్సీ చదివేందుకు ప్రభుత్వం త్వరలో జీవో విడుదల చేయనుందని, విశాఖ నర్సింగ్ కళాశాలకు 10 సీట్లు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమ్మ, జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని, జిల్లా కార్యదర్శి జీవీఎస్ వరలక్ష్మి, కోశాధికారి వంశీ, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరి, ఈసీ సభ్యులు పద్మజ, వినీల, మెహర్ శాంతి, లిల్లి తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.రాధమ్మ -
విశాఖలో సెమీ రింగురోడ్డు
విశాఖ సిటీ: నగరంలో రానున్న 50 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శనివారం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌పై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఈ నెలాఖరుకల్లా సిద్ధమవుతుందని చెప్పారు. వీఎంఆర్డీఏ పరిధిలోని 6,836 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై సుమారు 3,720 అభ్యంతరాలు వచ్చాయని మంత్రి తెలిపారు. వీటిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి, ఎమ్మెల్యేలు సూచించిన వినతుల్లో దాదాపు 90 శాతం సమస్యలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానిస్తూ నిర్మిస్తున్న ఏడు రహదారులలో మూడు పూర్తయ్యాయని వివరించారు. దీంతో పాటు భోగాపురం నుంచి విశాఖ నగరం వరకు ఒక ప్రత్యేకమైన బీచ్ కారిడార్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ నగర ప్రజల భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం రూ.14 వేల కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని 95 శాతం ఇళ్లకు నేరుగా పైపులైన్ల ద్వారా తాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు ఎం.శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ పాల్గొన్నారు. -
జోన్ సరే.. కొలువుల బోర్డు ఏది?
సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల పోరాటం తర్వాత విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవుతుందన్న సంతోషం నిరుద్యోగ యువతలో కనిపించడం లేదు. 2019లో జోన్ ఏర్పాటుపై ప్రకటన వెలువడినప్పటి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తూనే ఉంది. దీనిపై మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ఆందోళన చేస్తున్నా.. టీడీపీ, జనసేన నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో కేంద్రం ఇక్కడ బోర్డు ఏర్పాటుపై కాలయాపన చేస్తోంది. జోన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ, అందులో ఆర్ఆర్బీపై స్పష్టత ఇవ్వకపోవడం ఉత్తరాంధ్ర నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దేశవ్యాప్తంగా 19 జోన్లలో 21 ఆర్ఆర్బీలు ఉండగా, విశాఖ విషయంలో మాత్రం సాంకేతిక కారణాల సాకుతో జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంప్రతిపత్తి లేని ‘పేపర్ జోన్’? సాధారణంగా భారతీయ రైల్వేలో ఏ జోన్ ఏర్పడినా, ఆ పరిధిలో ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్ఆర్బీ ఉంటుంది. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలో కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. సికింద్రాబాద్, భువనేశ్వర్లలో ఇప్పటికే బోర్డులు ఉన్నాయని, వాటి ద్వారానే ఇక్కడి నియామకాలు చేపట్టవచ్చనేది అధికారుల వాదనగా కనిపిస్తోంది. అయితే, ఒక భారీ జోన్‌ను నిర్వహించేటప్పుడు దానికి స్వయంప్రతిపత్తి కలిగిన నియామక మండలి లేకపోతే, అది కేవలం ఒక ‘పేపర్ జోన్’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆర్ఆర్బీ ఇవ్వరెందుకు? ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 ప్రధాన కార్యనిర్వాహక జోన్లు ఉండగా, ఆర్ఆర్బీలు మాత్రం 21 ఉన్నాయి. కొన్ని పెద్ద జోన్ల పరిధిలో ఒకటి కంటే ఎక్కువ బోర్డులు ఉండగా, మరికొన్ని బోర్డులు రెండు, మూడు జోన్ల అవసరాలను తీరుస్తున్నాయి. గతంలో వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ బోర్డు పరిధిలో ఉండేది. కానీ ఇప్పుడు కొత్త జోన్ కేంద్రంగా విశాఖ అవతరించిన తర్వాత కూడా పాత బోర్డులపైనే ఆధారపడటం ఈ ప్రాంత అభ్యర్థుల ఉపాధి హక్కులను కాలరాయడమే అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర యువత ఉపాధికి ముప్పు ఆర్ఆర్బీ విశాఖకు కేటాయించకపోతే నియామక ప్రక్రియ మొత్తం ఒడిశా లేదా తెలంగాణలోని బోర్డుల నియంత్రణలోకి వెళ్తుంది. దీని వల్ల నోటిఫికేషన్లు వెలువడినప్పుడు మన అవసరాల కంటే ఆయా బోర్డుల పరిధిలోని ప్రాంతాలకే ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అభ్యర్థులు తమ సొంత ప్రాంతంలోని రైల్వే లైన్లలో పని చేయాలన్నా.. ఇతర రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పరీక్షలు, దరఖాస్తుల పరిశీలన, వైద్య పరీక్షల కోసం అభ్యర్థులు వందల కిలోమీటర్ల దూరంలోని భువనేశ్వర్ లేదా సికింద్రాబాద్ వెళ్లడం భారంగా మారుతుంది. రైల్వే గ్రూప్–డి వంటి పోస్టులకు స్థానిక భాషా పరిజ్ఞానం కీలకం. ఇతర రాష్ట్రాల బోర్డులు నియామకాలు చేపట్టినప్పుడు, తెలుగు అభ్యర్థులకు సమాచారం చేరవేయడంలోనూ, ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని వల్ల తెలుగు విద్యార్థులు సాంకేతికపరంగా వెనుకబడే ప్రమాదం ఉంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు అనేది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు, అది ఉత్తరాంధ్ర ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది. కేవలం భవనాలు, ప్లాట్‌ఫాంలు పెంచితే అది అభివృద్ధి అనిపించుకోదు. స్థానిక యువతకు ఉపాధి దొరికినప్పుడే రైల్వే జోన్ కల సాకారమవుతుంది. తక్షణమే కేంద్రం స్పందించి విశాఖకు ఆర్ఆర్బీ మంజూరు చేయాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికతకు ప్రాధాన్యం పెరుగుతుంది విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని ప్రకటించినప్పుడు ఉత్తరాంధ్ర యువతలో ఎన్నో ఆశలు చిగురించాయి. కానీ ఇప్పుడు ఆర్ఆర్బీ ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఉద్యోగ నియా మకాల్లో స్థానికులకు ప్రాధాన్యం దక్కాలంటే విశాఖలోనే సొంత బోర్డు ఏర్పాటు చేయాలి. ఒకవేళ భువనేశ్వర్ బోర్డు ద్వారానే రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగితే, వారు పరీక్ష కేంద్రాలను కూడా అక్కడే కేటాయించే అవకాశం ఉంది. దీని వల్ల ఇక్కడ అభ్యర్థుల కంటే ఇతర ప్రాంతాల వారికే ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది. ఒక స్వతంత్ర జోన్‌కు స్వయంప్రతిపత్తి కలిగిన నియామక బోర్డు లేకపోతే, అది అధికారాలు లేని కేవలం ఒక నామమాత్రపు కార్యాలయంగానే మిగిలిపోతుంది. – ఎం.మన్మధరావు, ఉద్యోగార్థి జోన్ ఇచ్చి.. బోర్డును విస్మరిస్తే ఎలా? నేను గత మూడేళ్లుగా రైల్వే గ్రూప్–డీ, ఇతర పోటీ పరీక్షల కోసం శ్రమిస్తున్నాను. ఉత్తరాంధ్ర నిరుద్యోగుల కలలు నిజం కావాలంటే విశాఖలో ఆర్ఆర్బీ ఏర్పాటు చేయడం అత్యవసరం. స్థానికంగా బోర్డు అందుబాటులో లేకపోతే, ఉద్యోగ నోటిఫికేషన్లలో దొర్లే తప్పులను గానీ, ఫలితాల జాప్యాన్ని గానీ ప్రశ్నించే హక్కు అభ్యర్థులకు లేకుండా పోతుంది. ఏదైనా చిన్న సమస్య తలెత్తినా, ఫిర్యాదు చేయడానికి పొరుగు రాష్ట్రాల్లోని కార్యాలయాలకు వెళ్లడం మాలాంటి వారికి ఆర్థికంగా, మానసికంగా పెనుభారం. విశాఖను రైల్వే జోన్ కేంద్రంగా ప్రకటించి, ఆర్ఆర్బీని మాత్రం కేటాయించకపోవడం అంటే.. నియామకాల కోసం మమ్మల్ని మళ్లీ ఇతర రాష్ట్రాలపై ఆధారపడేలా చేయడమే. – కె.అప్పారావు, రైల్వే ఉద్యోగ అభ్యర్థి -
ఆర్‌ఏఆర్‌ఎస్ విద్యార్థుల ప్రతిభ
అనకాపల్లి: ఏపీ ఈసెట్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విభాగంలో స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ పాలిటెక్నిక్ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించినట్టు పరిశోధన స్థానం ఏడీఆర్ సీహెచ్.ముకుందరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి ర్యాంక్ సిరిపురపు సృజన, రెండో ర్యాంక్ జి.రమ్య, నాల్గో ర్యాంక్ జవ్వాది దేవి, ఏడో ర్యాంక్ అల్లురి దుర్గా సిరి, ఎనిమిదో ర్యాంక్ గౌడు సమిత, పదో ర్యాంక్ కె.ఎస్.కిరణ్, 15 ర్యాంక్ బి.గాయత్రి, 17వ ర్యాంక్ ఎ.రామమధు, 23వ ర్యాంక్ ఆర్.భవ్యశ్రీ , 29వ ర్యాంక్ బి.నైమిష, 30వ ర్యాంక్ పి.ధనలక్ష్మి సాధించినట్టు తెలిపారు.ఈసెట్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విభాగంలో ర్యాంకుల పంట -
అనకాపల్లి జోనల్ కమిషనర్ బదిలీ
వీడ్కోలు పలుకుతున్న జోనల్ ఉద్యోగులు అనకాపల్లి టౌన్: స్థానిక జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి పదోన్నతిపై మాతృసంస్థకు బదిలీ అయ్యారు. కర్నూలు జిల్లా బనగాన పల్లె వ్యవవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. గత ఏడాది మే నెలలో ఇక్కడి జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ముఖ్యంగా పారిశుధ్యం మెరుగుపరచడంలో సఫలీ కృతులయ్యారని చెప్పొచ్చు. జోనల్ కార్యాలయంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డి.లక్ష్మీ తులసి ఇన్చార్జ్ కమిషనర్‌గా వ్యవహరించనున్నారు. చక్రవర్తికి జోనల్ ఉద్యోగులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. -
గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం
కె.కోటపాడు: మండలంలోని పైడంపేటలో శనివారం ఉదయం జామి ఈశ్వరరావు, జామి హరికృష్ణ ఇళ్లలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో గల డోర్కర్టెన్స్కు, ఇంటి దూలాలకు మంటలు వ్యాపించాయి. అదుపు చేసేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇళ్లలో గల దుస్తులు, నిత్యావసర సరుకులు, బంగారం, నగదు, ధాన్యం కాలిబూడిదయ్యాయని బాధితులు హరికృష్ణ, ఈశ్వరరావు తెలిపారు. స్థానికుల సమచారంమేరకు చోడవరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. డి.గొటివాడలో...మాడుగుల: డి.గొటివాడలో వంట గ్యాస్ లీక్ అవడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు... శుక్రవారం రాత్రి గ్యాస్ స్విచ్ ఆఫ్చేయకుండా గ్రామానికి చెందిన చుక్కల జగ్గారావు నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున టీ పెట్టడానికి గ్యాస్ వెలిగించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇంటిలో సామగ్రి దగ్ధమైంది. జగ్గారావుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. -
డయాలసిస్‌కు వెళ్తూ మృత్యు ఒడికి
గాజువాక: కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఒక వ్యక్తి డయాలసిస్ కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి.. కూర్మన్నపాలేనికి చెందిన ఇందుకూరి సతీష్ (45) హెచ్పీసీఎల్లో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొద్ది కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడు. డయాలసిస్ చేయించుకోవడం కోసం చినగంట్యాడ జంక్షన్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడం కోసం ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. వందడుగుల రోడ్ సిగ్నల్ జంక్షన్‌కు వచ్చేసరికి జాతీయ రహదారిపై కుక్కలు అకస్మాత్తుగా అడ్డంగా వచ్చాయి. దీంతో సతీష్ తన ద్విచక్ర వాహనాన్ని స్లో చేశాడు. దీంతో వెనకనే వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు అతడిని బలంగా ఢీకొట్టి ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుని బావమరిది దండు గోపాల కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు సీఐ ఎస్కే హుస్సేన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నీలిబందలో వైద్య శిబిరం
రోలుగుంట: మండలం అర్ల గిరిజన పంచాయతీ శివారు నీలబంద గ్రామంలో బుచ్చింపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నీలిబందలో జ్వరాలు శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. వైద్యుడు ఎల్.శివప్రసాద్ సిబ్బందితో కలసి గ్రామంలో జ్వరపీడితుల ఇళ్లను సందర్శించారు. రోగులను కలసి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. దీనిలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు చేశారు. రక్తపు నమూనాలు తీశారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వేడి ఆహారం, మరగకాచిన నీటిని తాగాలన్నారు. -
రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో జస్వంత్ ప్రతిభ
నాతవరం: రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన అనిమిరెడ్డి జస్వత్ మండలానికే వన్నె తెచ్చాడని నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు అభినందించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాతవరం హైస్కూల్లో చదువుతున్న జస్వంత్ అనకాపల్లి జిల్లా జట్టు తరపున బేస్‌బాల్ పోటీలలో పాల్గొన్నారన్నారు. ఈ నెల 5,6,7, తేదీల్లో కర్నూల్ జిల్లా వెనుగొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జస్వంత్ ప్రతిభ చూపించడంతో సెమీఫైనల్‌కు చేరుకోవడం జరిగిందన్నారు. మారుమూల నాతవరం మండలం నుంచి జిల్లా తరఫున క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. జిల్లాలో ఈ జట్టు తరుఫున పోటీల్లో నర్సీపట్నం, మాకవరపాలెం మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని ఎస్ఐ తెలిపారు. -
హైవేపై డివైడర్‌ను ఢీకొన్న కారు
● 8 మందికి గాయాలు ● నవ వధూవరులు కుటుంబంతో అన్నవరం వెళ్తుండగా ప్రమాదం యలమంచిలి రూరల్: డ్రైవర్ నిద్రమత్తు,నిర్లక్ష్యం కారణంగా శనివారం నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.యలమంచిలి మండలం మర్రిబంద వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో రహదారి పక్కన నడిచి వెళ్తున్న మహిళ,కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తల్లి తీవ్రంగా గాయపడగా మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపిన వివరాలు..విశాఖపట్నం అక్కయ్యపాలెంలో శుక్రవారం వివాహం జరిగిన నవ వధూవరులు కుటుంబంతో అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి కారులో బయలుదేరారు.యలమంచిలి దాటిన తర్వాత మర్రిబంద వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొంది. కారు అతివేగంగా ప్రయాణిస్తుండడంతో ముందు చక్రాలు ఊడి రోడ్డుపై పడ్డాయి.డివైడర్ పక్కనున్న సోలార్ పలకలు విరిగిపోయాయి.విరిగిన సోలార్ పలక రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళపై పడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో డ్రైవర్ తల్లికి కాలు విరిగింది.మిగిలిన ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.కారు ముందు భాగం నుజ్జవడం బట్టి ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే యలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు. క్షతగాత్రులను హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన పాదచారి రుత్తల లక్ష్మి భర్త రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
జిప్సం లారీలు అడ్డగింత
మాకవరపాలెం : ప్రమాదాలకు కారణమవుతున్న జిప్సం లారీలను మండలంలోని భీమబోయినపాలెం గ్రామస్తులు అడ్డుకున్నారు. విశాఖ కోరమండల్ నుంచి గత నెల రోజులుగా తాళ్లపాలెం, మాకవరపాలెం, నర్సీపట్నం మీదుగా భారీలోడుతో జిప్సం లారీలు రవాణా అవుతున్నాయి. రాజమండ్రి వెళ్లే ఈ లారీలు టోల్ చార్జీలు చెల్లించకుండా ఉండేందుకు ఇటుగా వెళుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ లారీల నుంచి జిప్సం పౌడర్ రోడ్డుపై జల్లుకుంటూ లారీలు వెళుతున్నాయి. దీంతో వెనుక వచ్చే ద్విచక్రవాహనదారుల కళ్లలో ఈ పౌడర్ పడి ఇబ్బందులు పడుతున్నారు. కళ్లలో పడిన వెంటనే మంట వస్తుందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ జిప్సం కారణంగా భీమబోయినపాలెం గ్రామానికి చెందిన పప్పల అశోక్‌కుమార్ ద్విచక్ర వాహనంపై వెళుతూ తీవ్రంగా గాయపడినట్టు గ్రామస్తులు తెలిపారు. నిత్యం ఎవరో ఒకరు ఈ కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తాజామాజీ సర్పంచ్ రుత్తల కిశోర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు రెండు లారీలను అడ్డుకున్నారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. అధికారులు స్పందించి ఈ మార్గం గుండా ఈ లారీలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని ద్విచక్ర వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
నీలిబందలో జ్వరాలు
రోలుగుంట : మండలంలోని అర్ల గిరిజన పంచాయతీ కొండ శిఖరాగ్రాన ఉన్న నీలిబంద గ్రామంలో పలువురు జ్వరాలతో మంచాన పడ్డారు. జ్వరంతో సకాలంలో చికిత్స పొందని పరిస్థితిలో ఇదే గ్రామానికి చెందిన డిప్పల సురేష్(2) ఇంటి వద్దే శుక్రవారం మృతి చెందినట్టు పీవీటీజీ సంఘ నాయకుడు గెమ్మిల వాసు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివి. జి.మాడుగుల మండలం నుంచి నీలిబంద గ్రామానికి వలస వచ్చిన గిరిజనులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. జ్వరాల బారిన పడిన వారిలో డిప్పల సూరిబాబు (3), గెమ్మిల నవీన్(2), వంతల అఖిల్ (2), డిప్పల రమేస్(8), కొర్ర ప్రవీణ్(2), కొర్ర రుక్తి(5) ఉన్నారు. ఈ గ్రామం నుంచి మండలంలోని బుచ్చింపేట పీహెచ్‌సీకి వైద్యానికి రావాలంటే కొండ శిఖరాగ్రం నుంచి మేలైన రవాణా మార్గం, వాహనాలు రాకపోకలు లేని పరిస్థితిలో 13 కిలోమీటర్లు నడచుకుని డోలిమోతతో రావాలి. ఈ గ్రామానికి ఆశా కార్యకర్త కానీ, ఏఎన్ఎం కాని లేరు. ఎవరు అనారోగ్యం బారిన పడినా బుచ్చింపేట పీహెచ్‌సీకి 13 కిలోమీటర్ల దూరం నడిచి రావాల్సిందే. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందించి, తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి, రవాణా సదుపాయాలు మెరుగుపరచాలని, ఏఎన్ఎంని నియమించాలని కోరారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరపీడితులకు తక్షణ వైద్యం అందించాలని ఆయన డిమాండు చేశారు. -
ప్రపంచీకరణతో ఆంగ్లానికి ప్రాముఖ్యం
అనకాపల్లి టౌన్ : నేటి ప్రపంచీకరణలో ఇంగ్లిష్ పాత్ర, ప్రాముఖ్యత రోజు రోజుకూ పెరుగుతుందని సినీ పాటల రచయిత, గాయకుడు పుట్టా పెంచల్ దాస్ పేర్కొన్నారు. స్ధానిక హెడ్ పోస్ట్ఆఫీస్ కార్యాలయ ఆవరణలో స్ధానిక ఇంగ్లిష్ ఫ్యాకల్టీ డాక్టర్ విల్లూరి ఉమామహేశ్వరావు రచించిన ది ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ రైటింగ్ అనే ఇంగ్లిష్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాస్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో సగటు మనిషి ఇంగ్లిషు మాట్లాడడం, రాయడం తప్పనిసరి అయిపోయిందన్నారు. ఇంగ్లిషులో చక్కగా మాట్లాడే వారు సైతం చక్కగా రాయలేకపోతున్నారన్నారు. ఇంగ్లిషులో మాట్లాడడం కంటే రాయడమే ఒక కళ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగపాటి భైరవ శివవేశవనాధ్, వి.నూక సత్య కిషోర్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ వై.బి. పలాసరావు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పి. సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్పత్తి కేంద్రం ఫినిష్!
ఉత్తరాంధ్రలోనే తాండవలో చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రానికి ఒకప్పుడు ప్రత్యేకత ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లుగా ఇక్కడ చేప పిల్లలు ఉత్పత్తి జరగలేదు. గతంలో ఏటా కోటి 25 లక్షల చేప పిల్లల ఉత్పత్తి జరిగే చోట నేడు ఇతర జిల్లాల్లో చేప పిల్లలు కొనుగోలు చేసి తరలించే దుస్థితికి తీసుకువచ్చింది. నాతవరం : తాండవ రిజర్వాయరు దిగువ ప్రాంతంలో 1984లో చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా జూన్ – ఆగస్టు మధ్య కాలంలో ఇక్కడ కృత్రిమ ఉత్పత్తి ద్వారా కోటి 25 లక్షలు చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. పెద్ద చేపలకు హార్మోన్లు అభివృద్ధికి ఇంజక్షన్లు చేసి కృత్రిమ ఉత్పత్తి ద్వారా వివిధ రకాలు చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. ఆ పిల్లలను మత్స్య సహకార సంఘాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసేవారు. ఇంకా మిగిలిన పిల్లలను జిల్లాలో ఉన్న తాండవ, రైవాడ, కల్యాణపులోవ, కోనాం, వరాహ, మేహాద్రిగెడ్డ, రావణాపల్లి రిజర్వాయర్లలో విడుదలకు తరలించేవారు. చెరువుల్లో పెంచుకునేందుకు ప్రైవేటు వ్యక్తులకు కూడా విక్రయాలు చేసేవారు. అయితే రెండేళ్లుగా తాండవ చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రంలో మచ్చుకై నా పిల్లలు ఉత్పత్తి చేయలేదు. కేంద్రంలో సిబ్బంది జాడే కన్పించడం లేదు. ఇటీవల కాలంలో ఎప్పుడు చూసినా తాండవ చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రం మూసి ఉంటుంది. చేప పిల్లలు ఉత్పత్తి చేసేందుకు నిర్మించిన నీటి కుండీలు నీటితో నిండుగా కన్పిస్తున్నాయి. నీటి కోసం కేంద్రంలో ఏర్పాటు చేసిన బోరుని ఉపయోగించక మరమ్మతుకు గురై పిచ్చి మొక్కల నడుమ కన్పించకుండా ఉంది. కేంద్రం గేట్లు ఊడి పోయి భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది. కిటికీలు, తలుపులు చెదలుపట్టి విషకీటకాలకు నిలయంగా మారింది. గతంలో ఇక్కడ పని చేసే సిబ్బంది పదవీ విరమణ చేయగా, మరికొందరు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఈ కేంద్రం నర్సీపట్నం మత్స్యశాఖ అభివృద్ధి అఽధికారి ఆధ్వర్యంలో నడుస్తోంది. సామగ్రి లేదు, సిబ్బంది లేరు... ఈ విషయంపై నర్సీపట్నం మత్స్యకార అభివృద్ధి అఽధికారి నాగమణిని వివరణ కోరగా చేప పిల్లలు ఉత్పత్తి చేసేందుకు సామగ్రి లేదన్నారు. గతంలో పని చేసే సిబ్బంది ప్రస్తుతం లేరని, సచివాలయ సిబ్బందితో మూడేళ్లుగా పని చేయిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది రెండుసార్లు ఇతర జిల్లాలో 9 లక్షల 80 వేల చేప పిల్లలు కొనుగోలు చేసి తీసుకొచ్చి తాండవ ప్రాజెక్టులో విడుదల చేశామన్నారు. తాండవలో చేప పిల్లలు పెంచే నీటి కుండీలురెండేళ్లుగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం మూత గతంలో ఏటా కోటి 25 లక్షలకు పైగా పిల్లలు ఉత్పత్తి ఉమ్మడి జిల్లాలో మత్స్యకార సంఘాలకు సరఫరా కూటమి ప్రభుత్వం వచ్చాక మూలకు చేరిన వైనం నిర్వహణ లేక కేంద్రం భవనాలు, నీటి కుండీలు శిథిలం -
అసైన్డ్ భూములపై అధికార పార్టీ నేతల కన్ను
దేవరాపల్లి: మాడుగుల నియోజకవర్గంలోని అసైన్డ్ భూములపై స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సహా అధికార పార్టీ నేతల కన్ను పడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నియోజకవర్గంలోని అసైన్డ్ పట్టాదారులంతా అప్రమత్తంగా ఉండి తమ భూములను రక్షించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో పరిశ్రమల పేరిట పేద గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల కుట్రలను రైతులు, గిరిజనులు, వృత్తిదారులు, దళితులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దేవరాపల్లి మండలం కొండకొడాబు, సమ్మెద, కొత్తూరు, చింతలపూడి, కోరాడ గ్రామాలలో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ పేరిట 820 ఎకరాలను, చీడికాడ మండలం జి. కొత్తపల్లి, అడవిల అగ్రహారం, చినగోగాడ, బైలపూడి గ్రామాల్లో సోలార్ ప్లాంట్ పేరిట 262 ఎకరాలను, కె.కోటపాడు మండలం ఆర్లి, గుల్లేపల్లి, చింతపాలెం, గరుగుబిల్లి గ్రామాల్లో ఎస్ఈజెడ్ పేరిట 10,250 ఎకరాలను, మాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీలో వీఎంఆర్డీఏ పేరిట 110 ఎకరాల అసైన్డ్ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్లి పంచాయతీలో నాలుగు రోజులు క్రితం కూటమి నాయకులు మీటింగ్ పెడితే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు స్పష్టం చేశారన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొందర్నీ తాజాగా ఆర్డీవో దగ్గరికి పంపించి భూములు ఇస్తున్నట్లుగా చెప్పించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. వ్యవసాయంపై అధారపడిన మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ముందుగా సుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, ఆ తర్వాత వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమలు కోసం కృషి చేయాలని పాలకులకు హితవు పలికారు. పరిశ్రమల పేరుతో పేద రైతుల అసైన్డ్ భూములను కాజేయాలని చూస్తే ఊరుకునేది లేదని, రైతులకు అండగా నిలిచి సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం–రాహత్ వరం
అనకాపల్లి: రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’పీఎం–రాహత్’ పథకం ఒక గొప్ప వరమని ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు. రహదారి ప్రమాదంలో గోల్డెన్ అవర్‌గా ప్రాణాలకు సంజీవని ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమైన సమయం అన్నారు. ఈ సమయంలో బాధితుడికి సరైన వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం 90శాతం ఎక్కువగా ఉంటుందని, ప్రమాదం జరిగిన వెంటనే 100 లేదా 112 నంబర్‌కు సమాచారం అందించి, 108 అంబులెన్స్ ద్వారా బాధితులను తక్షణమే ఆసుపత్రికి తరలించాలన్నారు. పీఎం–రాహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురైన ఎవరైనా సరే (పాదచారులు, వాహనదారులు, లేదా విదేశీయులు) గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స పొందే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి వరుసగా ఏడు రోజుల పాటు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ప్రమాదం జరిగిన 24 గంటల లోపు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం, పేద–ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ అత్యవసర సమయంలో ప్రాణరక్షణ కల్పిస్తుందన్నారు. సహాయం చేసే వారికి ’రక్షన కింద ప్రభుత్వం రూ.25,000 బహుమతి అందజేస్తుందన్నారు. రహదారి ప్రమాదాల్లో మానవత్వంతో స్పందించి, ప్రాణాలను నిలబెట్టి సీఎం రాహత్‌ను పొందాలని ఆయన పిలుపునిచ్చారు. -
మృతదేహానికీ వివక్షేనా?
ప్రశ్నార్థకమైన మానవత్వం ఒక ఎంపీటీసీ హోదాలో ఉన్న వ్యక్తికే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఇక సామాన్య గిరిజనుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే రోగుల పట్ల కేజీహెచ్ సిబ్బంది వైఖరి మారాలని, మరణంలోనైనా వారికి గౌరవం దక్కాలని స్థానికులు కోరుతున్నారు. చివరికి సుభద్ర, భాగ్యలక్ష్మి బాధితులను పరామర్శించి, వాహనం ఏర్పాటు చేసి పంపించడంతో ఆ విషాద ప్రయాణం ముందుకు సాగింది. మహారాణిపేట : ‘పేదవాడికి ప్రాణం ఉన్నప్పుడు వైద్యం దొరకదు.. ప్రాణం పోయాక గౌరవం దక్క దు’. ఉత్తరాంధ్రకు తలమానికం అని చెప్పుకునే కేజీహెచ్‌లో గిరిజనుల పట్ల అమానుషత్వం మరోసారి బట్టబయలైంది. ఒక ఎంపీటీసీ హోదాలో ఉన్న గిరిజన నాయకుడి మృతదేహాన్ని తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాన్ని నిరాకరించి, వ్యవస్థ ఎంతటి మొద్దునిద్రలో ఉందో చాటిచెప్పారు. ప్రజాప్రతినిధులు రోడ్డెక్కితే తప్ప కదలని ఈ మొండి యంత్రాంగంపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆఖరి ప్రయాణానికి అడ్డంకులు జి.కె.వీధి మండలం దామన్నపల్లి ఎంపీటీసీ కొర్ర బీమరాజు (45) అనారోగ్యంతో పోరాడుతూ శుక్రవారం ఉదయం కేజీహెచ్‌లో తుదిశ్వాస విడిచారు. కొండ కోనల నుంచి మెరుగైన వైద్యం అందుతుందని ఆశతో వచ్చిన ఆ కుటుంబానికి, మరణం తర్వాత కోలుకోలేని చేదు అనుభవం ఎదురైంది. కనీసం మృతదేహాన్ని తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాన్ని గానీ, అంబులెన్స్‌ను గానీ కేటాయించమని వేడుకున్నా.. ఆసుపత్రి అధికారులు కనికరించలేదు. దిక్కుతోచని స్థితిలో అమాయక గిరిజనులు ‘వాహనాలు అందుబాటులో లేవు’ అంటూ సిబ్బంది చెప్పిన మాటలు బాధితుల గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి. ఆసుపత్రిలోని ఎస్టీ సెల్‌కు సమాచారం అందించినా, అక్కడ కూడా స్పందన కరువైంది. తమ వారిని కోల్పోయిన బాధ ఒకవైపు, పార్థివ దేహాన్ని ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియని అయోమయం మరోవైపు.. ఆ గిరిజనుల వేదన వర్ణనాతీతం. వ్యవస్థల మధ్య సామాన్యుడు, ముఖ్యంగా గిరిజనుడు ఎంతటి అగౌరవానికి గురవుతున్నాడో ఈ దృశ్యాలు కళ్లకు కట్టాయి. నేతల జోక్యంతో కదిలిన యంత్రాంగం ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్పర్సన్, నేరుగా సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడంతో నిమిషాల వ్యవధిలోనే ‘లేవన్న’ వాహనాలు ప్రత్యక్షమయ్యాయి. కేజీహెచ్‌లో మృగ్యమైన మానవత్వం -
మెట్రో సీసీకి భారీ విజయం
విశాఖ స్పోర్ట్స్ : సూపర్ నాకవుట్ వన్డే మ్యాచ్‌ల్లో మెట్రో సీసీ, గెలాక్సీ సీసీ జట్లు పరుగుల వరద పారించి భారీ విజయాలను అందుకున్నాయి. రైల్వే స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెట్రో సీసీ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 526 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ హ్రితిక్ కేవలం 45 బంతుల్లోనే 13 సిక్సర్లు, 8 ఫోర్లతో 119 పరుగులు చేయగా, మిడిలార్డర్లో పరమ్‌వీర్ 147 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరికి తోడుగా కెప్టెన్ యువన్ (85), వినోద్ (87), శ్రావణ్ (52) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం ఛేదనకు దిగిన వైజాగ్ బ్లూస్ జట్టు 18.1 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. మెట్రో బౌలర్ అచ్యుత్ 5 వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరవడంతో మెట్రో సీసీ 435 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మరోవైపు వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన హిందూ ట్రోఫీ మ్యాచ్‌లో గెలాక్సీ సీసీ జట్టు సిటీ పోలీస్‌పై 360 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గెలాక్సీ సీసీ 478 పరుగులకు ఆలౌటైంది. హిమకర్ (61), భస్వంత్ (76), ధీరజ్ (59) రాణించడంతో జట్టు భారీ స్కోరును అందుకోగలిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సిటీ పోలీస్ జట్టు గెలాక్సీ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 25.5 ఓవర్లలో 118 పరుగులకే చాపచుట్టేసింది. యశ్వంత్, వాసు, ధీరజ్‌లు తలో రెండు వికెట్లు తీసి పోలీస్ జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. జగదీష్ (21) మినహా మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేకపోవడంతో పోలీస్ జట్టుకు భారీ పరాజయం తప్పలేదు. ఘోరంగా ఓడిన సిటీపోలీస్ జట్టు -
అపార్ట్టుమెంట్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
బీచ్‌రోడ్డు : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన మీసాల సత్యనారాయణ (39) తీవ్రమైన మద్యపాన వ్యసనంతో బాధపడుతుండేవాడు. దీని నుంచి అతడిని విముక్తి కలిగించేందుకు కుటుంబ సభ్యులు నగరంలోని మానసిక ఆసుపత్రిలోని డి–ఎడిక్షన్ సెంటర్లో చేర్పించారు. శుక్రవారం ఆసుపత్రి సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లిన సత్యనారాయణ, అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడికి 2016లో చంద్రకళతో వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం మత్తులో భార్యను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మూడేళ్లుగా సత్యనారాయణ తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ వైద్యం.. మామూళ్ల మాయాజాలం!
అది పేదోడి పాలిట పెన్నిధి కావాల్సిన ప్రభుత్వ ఆస్పత్రి. రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందుతుందన్న ఆశతో వచ్చే నిరుపేదల రక్తాన్ని సిబ్బంది లంచాల రూపంలో జుర్రుకుంటున్నారు. రూపాయి లేనిదే స్ట్రచర్ కదలదు.. వంద నోటు విదిలిస్తేనే వార్డు క్లీన్ అవుతుంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది చేస్తున్న ఈ వసూళ్ల దందాపై ఓ మహిళా రోగి ధైర్యంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. నర్సీపట్నం : నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో లంచాలు ఆరికట్టండి...అంటూ ఆస్పత్రిలో చేరిన మహిళా పేషెంట్ ఆవేదనతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుంది. రావికమతం మండలం, టి.అర్జాపురం గ్రామానికి చెందిన తురబల్లి కోట సత్యవతి జ్వరంతో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన ఏరియా హాస్పిటల్లో చేరింది. సిబ్బంది చేతివాటంపై ఆమె వీడియో చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఆరోగ్య పరిస్థితి బాగోక ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను.. క్లినింగ్ చేసే సిబ్బంది డబ్బుల కోసం పేషెంట్లను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అన్న క్యాంటిన్‌కు వెళ్లి రూ.5 పెట్టి భోజనం తినేందుకు ఇబ్బంది పడుతున్న రోజుల్లో మనిషికి వంద రూపాయలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాం...అంటూ మహిళా పేషెంట్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఉన్న వార్డులో సుమారు 30 బెడ్లు ఉన్నాయి. వీళ్లు మంచానికి వంద చొప్పున వసూలు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేకనే ఏరియా హాస్పిటల్‌కు వచ్చాం. యూరిన్ పెడితే రూ.100, సర్జరీ పేషెంట్ వద్ద రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారని వీడియోలో పేర్కొంది. కదల్లేని రోగులను స్ట్రచర్పై ఈసీ జీ, ఎక్స్‌రేకు తీసు కు వెళ్లాలంటే వంద రూపాయలకు తక్కువైతే తీసుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చింది. వంద రూపాయలు ఉంటే పండ్లు లేక భోజనం కొనుక్కుందాం అనుకుంటే సిబ్బంది వసూళ్లతో ఇబ్బంది పడుతున్నాం. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే సిబ్బంది తిరగబడుతున్నారని ఏకరువు పెట్టింది. ఈ పేషెంట్ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ విషయమై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాశారదను వివరణ కోరగా పేషెంట్‌ను డబ్బుల కోసం డిమాండ్ చేసిన శానిటేషన్ వర్కర్‌ను విధుల నుంచి తొలగించామని, డబ్బులు డిమాండ్ చేయవద్దని శానిటేషన్ సిబ్బందిని హెచ్చరించామని తెలిపారు.


