రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

● ఇద్దరికి గాయాలు

నక్కపల్లి : జాతీయ రహదారిపై నక్కపల్లి వారపు సంత సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. సీఐ జె.మురళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నక్కపల్లికి చెందిన శీకోలు రాజు(22) తన స్నేహితులు గొడుగు ధామస్‌, బద్దా పండుతో కలసి అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి మోటారు సైకిల్‌పై వస్తుండగా వారపు సంత సమీపంలో ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఆగడంతో వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో శీకోలు రాజు తలకు బలమైన గాయాలు తగిలి ఘటనా స్థలంలోనే మరణించాడు. మిగిలిన ఇద్దరికి గాయాలు కాగా వారిని నక్కపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement