అనకాపల్లి టౌన్ : నేటి ప్రపంచీకరణలో ఇంగ్లిష్ పాత్ర, ప్రాముఖ్యత రోజు రోజుకూ పెరుగుతుందని సినీ పాటల రచయిత, గాయకుడు పుట్టా పెంచల్ దాస్ పేర్కొన్నారు. స్ధానిక హెడ్ పోస్ట్‌ఆఫీస్ కార్యాలయ ఆవరణలో స్ధానిక ఇంగ్లిష్ ఫ్యాకల్టీ డాక్టర్ విల్లూరి ఉమామహేశ్వరావు రచించిన ది ఆర్ట్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ రైటింగ్ అనే ఇంగ్లిష్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాస్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో సగటు మనిషి ఇంగ్లిషు మాట్లాడడం, రాయడం తప్పనిసరి అయిపోయిందన్నారు. ఇంగ్లిషులో చక్కగా మాట్లాడే వారు సైతం చక్కగా రాయలేకపోతున్నారన్నారు. ఇంగ్లిషులో మాట్లాడడం కంటే రాయడమే ఒక కళ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగపాటి భైరవ శివవేశవనాధ్, వి.నూక సత్య కిషోర్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వై.బి. పలాసరావు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పి. సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


