తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ | Udhayanidhi Makes Pushpa Movie Reference Tamil Nadu Assembly | Sakshi
Sakshi News home page

Udayanidhi Stalin Pushpa: తమిళనాడులో సోఫా రాజకీయం.. విజయ్‌పై కౌంటర్స్

May 13 2026 1:48 PM | Updated on May 13 2026 1:56 PM

Udhayanidhi Makes Pushpa Movie Reference Tamil Nadu Assembly

తమిళ రాజకీయాల గురించి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పుడూ లేనంతగా గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రి కావడం. టీవీకే పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అధికారం దక్కించుకున్నారు. రీసెంట్‌గానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల బలపరీక్షలోనూ నెగ్గారు. 144 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కి దక్కింది. అయితే అధికారం దక్కించుకునే సీఎం విజయ్ సోఫా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు చేశారు.

(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)

ఉదయనిధి.. విజయ్‌పై విమర్శలు చేసిన సందర్భంలోనే తెలుగు బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా 'పుష్ప' గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యమంత్రి విజయ్‌పై ఘాటు విమర్శలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. సోఫా సెట్ రాజకీయం చేశారంటూ సీఎంపై కౌంటర్లు వేశారు. ఆయన పుష్ప తరహా సోఫా రాజకీయం చేశారని విమర్శించారు. ముందు సోఫాని ఎమ్మెల్యేకి పంపిన తర్వాతే సీఎం.. పూల బొకేలతో అక్కడికి వెళ్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలని అప్పుగా తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలు వేశారు. టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడిందని ఉదయనిధి ఆరోపించారు. ఉదయనిధి ఆరోపణలపై ‍స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. ప్రభుత్వాన్ని నడపడానికి రేసు గుర్రాలని కొనే అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.

'పుష్ప 2' సినిమాలో హీరో, కేంద్రమంత్రి పాత్రధారిని కలవడానికి ముందే డబ్బుల కట్టలతో నిండిన సోఫాని ఆయనకు పంపిస్తాడు. అలానే రావు రమేశ్ పాత్రని ముఖ్యమంత్రి చేసేందుకుగానూ ఎమ్మెల్యేలకు డబ్బులతో నిండిన సోఫా సెట్‌లని పంపిస్తాడు. అలా ఈ చిత్రంలోని సన్నివేశాల్ని రిఫరెన్స్‌గా తీసుకుని తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి)

Advertisement
 
Advertisement
Advertisement