సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు | Vijay Govt Approves Special Shows Trisha Karuppu Movie | Sakshi
Sakshi News home page

Trisha Karuppu: అనుకున్నట్లే నిర్ణయం తీసుకున్న సీఎం విజయ్

May 13 2026 10:58 AM | Updated on May 13 2026 11:09 AM

Vijay Govt Approves Special Shows Trisha Karuppu Movie

సినిమాలకు సంబంధించిన వ్యక్తి.. ప్రభుత్వంలో ఉంటే పలు నిర్ణయాలు ఇండస్ట్రీకి కలిసొచ్చేలా ఉంటాయి. విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కోలీవుడ్‌కి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు తమిళనాడులో ఆ ట్రెండ్ మొదలైంది. ఎన్నాళ్లుగానో లేని స్పెషల్ షోలకు అనుమతి లభించింది. త్రిష హీరోయిన్‌గా నటించిన మూవీతోనే దీనికి శ్రీకారం చుట్టడం విశేషం.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది)

తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమకు తొలిసారి ఊరట లభించింది. సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' మూవీకి మే 14,15 తేదీల్లో ఉదయం 9 గంటల స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు విజయ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమిళనాడులో చాన్నాళ్ల నుంచి స్పెషల్ షోలు లేవు. దీంతో ఈ నిర్ణయంపై నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్టర్స్.. సీఎం విజయ్‌కి థ్యాంక్స్ చెప్పింది. తెలుగులో ఈ చిత్రం 'వీరభద్రుడు' పేరిట రిలీజ్ కానుంది. విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడులో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 2 వరకు రెండు రోజుల పాటు మొత్తం 5 షోలు వేయనున్నారు.

సూర్య,త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన 'కరుప్పు' సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే పర్లేదనిపించేలా ఉంది. కోర్టులో సామాన్యులకు న్యాయం అందకుండా చేసే ఓ అవినీతి లాయర్ భరతం పట్టేందుకు దేవుడే దిగివస్తే ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత రెండు మూడు సినిమాలతో బాగా డీలాపడిపోయిన సూర్య.. ఇది హిట్ అవ్వడం చాలా కీలకం. మరి ఏం చేస్తాడో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement
 
Advertisement
Advertisement