breaking news
Karuppu Movie
-
కరుప్పు నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్
స్టార్ హీరో సూర్య (Suriya) నుంచి సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లో జోష్ పెరిగిపోతుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కరుప్పు ఒకటి. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. గాడ్ మోడ్..త్వరలోనే ఈ మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీపావళి పండగ సందర్భంగా సాంగ్ గాడ్ మోడ్ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను దీపావళి పండగ సందర్భంగా విడుదల చేశారు. నల్లని దుస్తులు, చేతిలో కత్తితో సూర్య నటించిన ఊరమాస్ ట్యూన్స్‌తో రూపొందిన ఈ పాట ఇప్పుడు అబిమానులను విపరీతంగా అలరిస్తోంది. సినిమాపై అంచనాలను సైతం పెంచేస్తోంది. ఇకపోతే సూర్య ఈ చిత్రంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంనూలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
రేసు నుంచి తప్పుకోనున్న 'సూర్య'
దక్షిణాదిలో ప్రముఖ కథానాయకుల్లో రాణిస్తున్న నటుడు సూర్య. ఈయన ఇటీవల హీరోగా నటించిన రెట్రో చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్య రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి కరుప్పు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటి శ్వాసిక, ఇందిరెన్స్, యోగి బాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే డివోషనల్ అంశాలతో సాగే సోషియల్ కథాచిత్రంగా రూపొందుతున్న కరుప్పు చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు యూనిట్ వర్గాలు ప్రకటించారు. అయితే, ఈ చిత్ర విడుదల వాయిదా పడే అవకాశమే ఎక్కవగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ విడుదుల కానుంది. ఆపై శివకార్తికేయన్ ,రవి మోహన్, శ్రీ లీల, అధర్వ కలిసి నటిస్తున్న పరాశక్తి కూడా రానుంది. సంక్రాంతి కోసం తెలుగులో ఇప్పటికే భారీగానే లైనప్ ఉంది. దీంతో సూర్య హీరోగా నటిస్తున్న కరుప్పు చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు తాజా సమాచారం. సంక్రాంతి పోటీలో ఉండి ఇబ్బందులు పడటం ఎందుకని ఈ నిర్ణయం తీసుకునేందుకు చర్చిస్తున్నారట. ఏదేమైనా పొంగల్ రేసు నుంచి సూర్య తప్పుకోనున్నారనేది తెలుస్తోంది. -
తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?
తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే మహాప్రేమ. భాషతో సంబంధం లేకుండా ఏ మాత్రం బాగున్నా ఏ మూవీనైనా చూసి పడేస్తారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్నారో ఏమో గానీ కొందరు దక్షిణాది దర్శకనిర్మాతలు మనోళ్లని మరీ లైట్ తీసుకుంటున్నారే అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నాళ్ల నుంచి దాదాపు ఒకేలాంటి తప్పు మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?ఒకప్పుడు ఏ భాషకు చెందిన సినిమా అయినా సరే తెలుగులో డబ్ చేస్తున్నారంటే కనీస జాగ్రత్తలు తీసుకునేవారు. సినిమాలో తమిళ పదాలకు బదులు తెలుగు ఉండేలా చూసుకునేవారు. టైటిల్‌తోపాటు మూవీలోని పాత్రలకు కూడా తెలుగు పేర్లే పెట్టేవారు. గత కొన్నేళ్లలో మాత్రం అలాంటిది అస్సలు పాటించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలావరకు తమిళ దర్శకనిర్మాతలు యధాతథంగా తమ టైటిల్స్ తెలుగులోనూ అలానే ఉంచేస్తున్నారు. వేట్టయాన్, పొన్నియిన్ సెల్వన్, కంగువ, మార్గన్, తుడరుమ్.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడు ఉదాహరణలు.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))అంతెందుకు ఇప్పుడు సూర్య కొత్త సినిమాకు 'కరుప్పు' టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి తెలుగులో నలుపు అని అర్థం. ఎంత సూర్య అయినా సరే పేరు కాస్త తెలుగులో ఉంటేనే కదా.. మూవీ జనాలకు రీచ్ అవుతుంది. అలా కాదని చెప్పి యధాతథంగా టైటిల్స్ పెట్టుకుంటే పోతే ఇది మనం చూసే సినిమా కాదేమో మనవాళ్లు లైట్ తీసుకునే అవకాశముంది. చూడాలి మరి భవిష్యత్తులోనైనా ఈ తీరు మార్చుకుంటారా లేదా అనేది?సూర్య పుట్టినరోజు సందర్భంగా 'కరుప్పు' సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ ఆన్ యాక్షన్‌తో పాటు మాస్ సీన్స్ బాగానే ఉన్నాయి. వింటేజ్ చిత్రాలైన 'గజిని', 'భాషా' సినిమాల్ని గుర్తుచేసే కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయండోయ్. అంతా బాగానే ఉంది గానీ టీజర్లోనూ తమిళ ఫ్లేవర్ కాస్త గట్టిగానే కొట్టింది. మరి దీన్ని మన ఆడియెన్స్ ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి? దీపావళికి ఈ సినిమా థియేటర్లలోకి రావొచ్చని టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన) -
సూర్య కొత్త సినిమా టీజర్ రిలీజ్
'కంగువ'తో ఓ రేంజులో దెబ్బతిన్న సూర్య.. 'రెట్రో'తో కొంతమేర పర్వాలేదనిపించుకున్నాడు. ఎందుకంటే తమిళంలో మోస్తరుగా ఆడిన ఈ చిత్రం.. తెలుగులో మాత్రం ఘోరమైన ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'కరుప్పు' మూవీతో వస్తున్నాడు. బుధవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))'కరుప్పు' అంటే తమిళంలో నలుపు అని అర్థం. మరి దర్శకనిర్మాతలు ఏం ఆలోచించారో ఏమోగానీ అదే టైటిల్‌ని యధాతథంగా ఉంచేశారు. టీజర్ చూస్తుంటే కూడా తమిళ ఫ్లేవర్ ఎక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే మాస్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష హీరోయిన్గా చేస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకుడు.(ఇదీ చదవండి: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన)


