
స్టార్ హీరో సూర్య (Suriya) నుంచి సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లో జోష్ పెరిగిపోతుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కరుప్పు ఒకటి. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌జే బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.
గాడ్ మోడ్..
త్వరలోనే ఈ మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీపావళి పండగ సందర్భంగా సాంగ్ గాడ్ మోడ్ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను దీపావళి పండగ సందర్భంగా విడుదల చేశారు. నల్లని దుస్తులు, చేతిలో కత్తితో సూర్య నటించిన ఊరమాస్ ట్యూన్స్‌తో రూపొందిన ఈ పాట ఇప్పుడు అబిమానులను విపరీతంగా అలరిస్తోంది. సినిమాపై అంచనాలను సైతం పెంచేస్తోంది. ఇకపోతే సూర్య ఈ చిత్రంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంనూలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.