breaking news
Suriya
-
సూర్య ఫేవరేట్ రోల్.. తెలుగు టీజర్ చూశారా?
కోలీవుడ్ హీరో సూర్య ఇటీవల సూపర్ హిట్ అందుకున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే మరో సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా సూర్య కొత్త మూవీ టీజర్ కూడా వచ్చేసింది.ప్రస్తుతం సూర్య.. జితు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి సీన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే సూర్య మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌లోని సీన్స్ సింగం-2 మూవీని తలపించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో సూర్య సరసన నజ్రియా హీరోయిన్గా కనిపించనుండగా.. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నట్లు టీజర్లోనే రివీల్ చేశారు. ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు. -
మళ్లీ పెళ్లి చేసుకున్న జ్యోతిక ,సూర్య
-
మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక (ఫొటోలు)
-
పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక
తమిళ స్టార్ జంట సూర్య-జ్యోతిక మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 2006లో ప్రేమ వివాహం చేసుకున్న వీళ్లు.. ఇప్పుడు తమ బంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రిస్టియన్ పద్ధతిలో పిల్లల సమక్షంలో ఉంగరాలు మార్చుకుని కొత్త జంటలా వివాహం చేసుకున్నారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని జ్యోతిక తన ఇన్ స్టాలో షేర్ చేసింది. 'ది సీక్వెల్- 20 ఏళ్ల ప్రేమకు మరో ప్రతిజ్ఞ' పేరుతో వీడియో షేర్ చేసిన జ్యోతిక తన మనసులోని మాటలకు అద్భుతమైన అక్షరరూపం ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'20 ఏళ్ల వైవాహిక బంధం.. ఎన్నో మధుర జ్ఞాపకాలు. చిన్న చిన్న మనస్పర్థలు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, త్యాగాలు, మరీ ముఖ్యంగా ఎలాంటి అంచనాల్లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోవడం. ఇది పరిపూర్ణమైన పెళ్లిని సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ఒకరి కోసం మరొకరు మారుతూ, ఎదుగుతూ వచ్చిన మనం అనే బంధానికి ఇది ఓ వేడుక. ఒకప్పుడు కలలా అనిపించిన జీవితం.. ఇప్పుడు నా జీవితాంతం కలగనేంత అందమైన నిజంలా మారింది''ఇకపై నేను ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. జీవితంలో ఇబ్బందులు ఎదురైతే అందులోని పాజిటివిటీనే చూడాలని నిర్ణయించుకున్నాను. జీవితాన్ని ప్రతిరోజూ వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇకపై ఎలాంటి ఫిర్యాదు చేయను. కృతజ్ఞతతో ఉంటాను. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను. మంచి తల్లిగా ఉండేందుకు ప్రయత్నిస్తాను' అని జ్యోతిక చెప్పుకొచ్చింది.తన భర్త సూర్య గురించి మాట్లాడుతూ.. 'నేను ఎప్పటికీ నీతో గొడవపడతాను. మళ్లీ నేనే వచ్చి మాట్లాడతాను. ప్రతి చిన్న గొడవ తర్వాత మన బంధం మరింత దగ్గరవుతుందని నమ్ముతాను. ఈ 20 ఏళ్ల ప్రయాణంలో అన్నింటికంటే విలువైనది మన స్నేహమే. ఓ వ్యక్తి నాతో సమానంగా, మనసులోని మాటలు చెప్పుకోగలిగే నమ్మకస్తుడిగా, గాసిప్ పార్ట్నర్గా, బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండటం అరుదు. అలాంటి వ్యక్తే నా భర్తగా, నా పిల్లలకు తండ్రిగా నా జీవితంలో ఉండటం నేను చేసుకున్న అదృష్టం. ఇది 20 ఏళ్ల ప్రయాణానికి ముగింపు కాదు. మరో 20 ఏళ్లకు ఆరంభం' అని జ్యోతిక భావోద్వేగానికి గురైంది.(ఇదీ చదవండి: పదేళ్ల ప్రేమ.. ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
సూర్య సినిమాకు భారీ ఓపెనింగ్స్ పాన్ ఇండియా వసూళ్లే టార్గెట్!
-
ఓటీటీలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
సూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు రెడీ అయింది. సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ కథేంటంటే.. సంజయ్ విశ్వనాథ్(సూర్య) ఓ వ్యాపారవేత్త, ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి చేసుకోడు. అమెరికాకి వెళ్లి సరోగసి ద్వారా మగబిడ్డని కని స్వదేశానికి తిరిగొస్తాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లాడు ఓ అరుదైన వ్యాధి బారిన పడతాడు. బోన్ మారో(ఎముక గుజ్జు) ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవసరం ఏర్పడుతుంది. అమెరికాకు తిరిగెళ్లి సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని వెతికి భారత్‌కి తీసుకొస్తాడు. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు.20 ఏళ్ల మ్యాడీ.. సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా తన కొడుకును పెంచుకోగలిగాడా? మ్యాడీ ప్రేమని సంజయ్ ఎందుకు తిరస్కరించాడు? చివరకు పెళ్లి విషయంలో సంజయ్ తన ఆలోచన మార్చుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ. -
'డిసి' సూపర్ హిట్.. బ్యూటీకి బంపర్ ఆఫర్
రీసెంట్ టైంలో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా అంటే చాలామంది 'డిసి' అని చెబుతారు. తెలుగులో అయితే జీరో ప్రమోషన్స్ చేశారు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులొచ్చాయి. ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇందులో హీరోయిన్గా చేసిన వామికా గబ్బికి దక్షిణాదిలో ఓవర్‌నైట్ స్టార్డమ్ వచ్చింది. ఇప్పుడదే ఊహించని అవకాశం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్ సినిమాలతో చాన్నాళ్ల తర్వాత వరస హిట్స్ అందుకున్న సూర్య ప్రస్తుతం నజ్రియాతో కలిసి మలయాళ దర్శకుడు జీతు మాధవన్‌తో ఓ మూవీ చేస్తున్నారు. 'జై భీమ్' ఫేమ్ జ్ఞాన వేల్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఇకపోతే సూర్య 49వ చిత్రం 'జన నాయగన్' ఫేమ్ దర్శకుడు హెచ్.వినోద్ తీయనున్నాడట.ఈ మూవీలోనే హీరోయిన్గా లేటెస్ట్ సెన్సేషన్ వామిక గబ్బిని అనుకుంటున్నారట. సాయి అభయంకర్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు సూర్య 'కరుప్పు'కు సాయినే సంగీతమందించాడు. దీని అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముంది. -
ఇలాంటి సినిమా చేయడం సాధ్యమా అని ఆశ్చర్యపోయా
కార్తీ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'సర్దార్ 2'. 2022లో తొలి భాగం విడుదలై హిట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ తీశారు. ఈసారి మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్ తదితర హీరోయిన్లు కొత్తగా నటించారు. రజిషా విజయన్ మరోసారి కార్తీతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎస్జే సూర్య విలన్. వచ్చే శుక్రవారం పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సోమవారం చెన్నైలో ఆడియో లాంచ్ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా 'పళ్లబురుసు')ఈ చిత్ర టీజర్ చూసి ఇలా తమిళంలో చేయడం సాధ్యమా? అరే ఇది మిత్రన్ సినిమానా? అని ఆశ్చర్యపోయాను. అందరూ కార్తీని సర్ధార్ అని పిలుస్తున్నారు. కార్తీ నాకంటే మంచి మూవీస్ చేస్తున్నాడు. దాన్ని నేను ఆస్వాదిస్తూ , ఆశ్చర్యంగాను, సంతోషంగానూ చూస్తున్నాను. మరో విషయం ఏంటంటే నేను చెన్నైలోనే ఉంటున్నాను. అప్పడప్పుడు ముంబైకి వెళ్లి వస్తున్నాను అని సూర్య తాను గురించి జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చాడు.నటుడు కార్తీ మాట్లాడుతూ .. నేను విదేశాల్లో చదువుకున్నాను. అక్కడ కూడా మన చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమాను కొందరు ఎగతాళి చేస్తారు. కొందరు అభినందిస్తారు. వారు అభినందించే విధంగా మూవీస్ చేయాలని నేను భావిస్తాను. సర్ధార్ 2 చిత్రం అలాంటిదే అని అన్నాడు.(ఇదీ చదవండి: ఐటమ్ సాంగ్‌లో ట్రెండింగ్ హీరోయిన్ కాయదు?) -
మమిత సూపర్ డ్యాన్స్.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రెండు వారాల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలో హీరో సూర్యతో పాటు చాలామందికి హీరోయిన్ మమిత బైజు కూడా తెగ నచ్చేసింది. యాక్టింగ్ అంటూ ఈమె చేసిన అల్లరికి చాలామంది ఫ్లాట్ అయిపోయారు. ఇదే మూవీలో హిట్ గీతం 'నేనో బటర్ ఫ్లై' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడీ సాంగ్ పూర్తి వీడియోని రిలీజ్ చేసేశారు.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి)సూర్యపై ప్రేమ పుట్టే సందర్భంలో మమిత ఈ పాట పాడుతూ క్యూట్, సూపర్ డ్యాన్స్ చేస్తుంది. ఈ మూవీకి ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. తమిళ చిత్రంగా దీన్ని తీశారు. అయితే సొంత భాషలో పెద్దగా ఆడలేదు గానీ తెలుగు, ఓవర్సీస్లో మంచి వసూళ్లు దక్కించుకుంది. వచ్చే నెల రెండో వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: మమిత మరో ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్) -
సంక్రాంతికి సై
తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ అంటే చాలా ప్రత్యేకం అని చెప్పాలి. తెలుగు లోగిళ్లలో ముగ్గుల పండగ వేళ విందూ వినోదాల్లో కొత్త సినిమాలది కూడా ఒక భాగమే. ఇండస్ట్రీకే కాదు... తెలుగు ప్రేక్షకులకు కూడా ముఖ్యమైన పండగ అంటే సంక్రాంతి. ఆ సమయంలో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు ఆడియన్స్. ఈ టైమ్‌లో వచ్చే మూవీస్‌లో చాలా వరకు కమర్షియల్ సక్సెస్‌లు అందుకుంటాయి. అందుకే హీరోలు, దర్శక– నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తుంటారు. పైగా ఈ సమయంలో విడుదలయ్యే చిత్రాలకు మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చన్నది మేకర్స్ ఆలోచన. పండగకి వచ్చే సినిమాల్లో ‘ఫలానా సినిమా’ బాగుందనే టాక్ వచ్చిందంటే ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీనే. అందుకే స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకూ సంక్రాంతి పోటీకి సై అంటుంటారు. 2027 సంక్రాంతి మరో నాలుగు నెలలు ఉండగానే పలు చిత్రాలు ఇప్పటికే విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. మరికొన్ని ప్రాజెక్టులు కూడా సంక్రాంతి రేసులో ఉండేందుకు ముస్తాబవుతున్నాయి. చిరంజీవి, వెంకటేశ్–కల్యాణ్ రామ్, రవితేజ, శర్వానంద్, సాయిదుర్గా తేజ్ వంటి హీరోలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కర్చీఫ్ వేసేశారు. బాలకృష్ణ, నాగార్జున, రజనీకాంత్, సూర్య వంటి హీరోలు కూడా సంక్రాంతి పోటీలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. మరి... సంక్రాంతి బరిలో నిలిచిన, నిలవనున్న సినిమాలేంటో చూద్దాం. 13న కాకా రాక చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబోలో రూపొందుతున్న సినిమా ‘కాకా’. ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, అనశ్వరా రాజన్ , సునీల్, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్ పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చినట్లు యూనిట్ పేర్కొంది.‘‘తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ‘కాకా’ కథనం సాగుతుంది. చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేస్తారు. చిరంజీవిని రెండు విభిన్నమైన లుక్స్‌లో ప్రజెంట్ చేస్తున్నారు బాబీ. మిడిల్ క్లాస్ అవతార్‌లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్‌తో, యంగ్ వెర్షన్ లో తన యాటిట్యూడ్, ఎనర్జీతో ఆకట్టుకుంటారు. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తన డైనమిక్ విజువల్స్‌తో గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా మలిచారు.ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ఇంటెన్సిటీని మరింత పెంచింది. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని ఐకానిక్ ‘గ్యాంగ్ గ్యాంగ్’ పాటను రీమిక్స్ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్‌కు మరింత స్వాగ్‌ను జోడించింది. టైటిల్ గ్లింప్స్ తర్వాత ‘కాకా’ పై అంచనాలు పెరిగాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.జనవరి 12 విడుదల వెంకటేష్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి నటిస్తున్నారు. సురేష్ ప్రోడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘జనవరి 12 విడుదల’ (బావ బామ్మర్ది సౌజన్యంతో అన్నది ట్యాగ్‌లైన్) అనే టైటిల్‌ను ఖరారు చేసి, సినిమాని కూడా జనవరి 12 విడుదల చేయనున్నట్లు ఓ ఫన్నీ వీడియోను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.‘‘దగ్గుబాటి, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన స్టార్స్‌ని కలిపి ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని ఒక క్లీన్, టిపికల్ ఎంటర్టైనర్గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిస్తున్నారు అనిల్ రావిపూడి. అనిల్ ట్రేడ్ మార్క్ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్తో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే కంప్లీట్ ఎంటర్టైనర్గా ఉంటుంది.వెంకటేష్, కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. వెంకటేష్, కల్యాణ్ రామ్ మధ్య సినిమాలో ఉండే రిలేషన్ ను హైలెట్ చేస్తూ ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్ ని పెట్టడం జరిగింది. మా సినిమా 2027 సంక్రాంతికి ఫెస్టివ్ ట్రీట్‌గా నిలవనుంది. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. దాగుడు మూతల దండాకోర్? ‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రవితేజ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న ఆయన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా నటించనున్న ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్న ఈ 64వ సినిమాకి ‘ఎస్వీసీ 64’ అనే వర్కింగ్ టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌ని మంగళవారం ప్రకటించారు మేకర్స్. అంతేకాదు... ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలి పారు.‘‘రవితేజ, హసిత్ గోలి కలిసి ఓ హార్డ్‌కోర్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారు. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో కమర్షియల్ ఎంటర్టైనర్లను రవితేజ మరో స్థాయికి తీసుకెళ్తే... వైవిధ్యమైన కథలు, హ్యూమర్‌తో హసిత్ గోలి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. హసిత్ గోలి రూపొందించనున్న ఈ కామెడీ డ్రివెన్ కాన్సెప్ట్‌లో రవితేజ సరికొత్తగా కనిపిస్తారు. ఈ సంక్రాంతికి రవితేజ నుంచి రానున్న ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను, టైటిల్‌ని త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి ‘దాగుడు మూతల దండాకోర్’ అనే టైటిల్‌ని ఖరారు చేయనున్నారట మేకర్స్. 14న జార్జ్ క్రిష్ ‘నారి నారి నడుమ మురారి’, ‘బైకర్’ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న హీరో శర్వానంద్ తొలిసారిగా దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకర ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన ఈ సినిమాకి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు జనవరి 14 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలి పారు. ‘‘పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’.‘శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా, నారి నారి నడుమ మురారి’ వంటి చిత్రాలతో పండుగ సీజన్ లో గుర్తుండిపోయే విజయాలను అందుకున్న శర్వాకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా ప్రత్యేకమైనది. ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ‘జార్జ్ క్రిష్’ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదల చేస్తున్నాం. సంక్రాంతి సీజన్లో శర్వాకు ఉన్న విజయ వంతమైన ట్రాక్ రికార్డ్, కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలకు శ్రీను వైట్లకు ఉన్న పేరు, ఆసక్తిని రేకెత్తించేలా ఆకర్షణీయంగా రూపొందించిన టైటిల్... ఇలా వీటన్నింటితో ‘జార్జ్ క్రిష్’ పూర్తి స్థాయి పండగ వినోద చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు’’ అన్నారు మేకర్స్. 8న మహాకాళి ‘హను–మాన్’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో (పీవీసీయూ) భాగంగా రూపొందిన ఫీమేల్ సూపర్ హీరో సినిమా ‘మహాకాళి’. భూమిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్, శ్రియా రెడ్డి, ఖుష్బూ సుందర్, రాకేష్ బేడీ, సముద్ర ఖని, జితిన్ గులాటి, రజత్ కపూర్, మురళీ శర్మ, నార్, బబ్లూ పృథ్వీరాజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు.ఈ మైథాలజీ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ అందించగా, పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ స్పెక్టకిల్ మూవీ ‘మహాకాళి’. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్‌పై ఏర్పడిన క్యూరియాసిటీని ఈ గ్లింప్స్ మరింత పెంచింది.ధర్మం, అధర్మం మధ్య జరిగే మహా సంగ్రామాన్ని ఈ గ్లింప్స్ ప్రజెంట్ చేస్తోంది. ఇది కేవలం మంచి–చెడు మధ్య జరిగే పోరాటం కాదని, ఓ ప్రపంచ భవిష్యత్తునే నిర్ణయించే స్థాయిలో యుద్ధం ఉండబోతుందనే ఆసక్తిని కలిగిస్తోంది. శ్రియా రెడ్డి కూడా పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తారు. ‘హను–మాన్’ మూవీతో పీవీసీయూకు బలమైన పునాది వేసిన ప్రశాంత్ వర్మ భారతీయ ఇతిహాసాలను మోడరన్ విజువల్ ట్రీట్మెంట్తో తెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని ‘మహాకాళి’తో మరింత భారీ స్థాయికి తీసుకెళ్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. 12న సంబరాలు సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటించారు. ఈ మూవీలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జనవరి 12 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు)’. ఇందులో సాయిదుర్గా తేజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారు. బలమైన భావోద్వేగ అంశాలతో పాటు అద్భుతమైన దృశ్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను మేళవించి ఈ చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దారు దర్శకుడు రోహిత్ కేపీ. ‘అసుర ఆగమన’ గ్లింప్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కి వచ్చిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. షూ టింగ్ విజయవంతంగా ముగియడంతో ఆడియన్స్‌కి గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించడానికి పోస్ట్ ప్రోడక్షన్‌పై దృష్టి పెట్టాం’’ అని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.⇒ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ 100’. తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ మూవీని డిసెంబరులో విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిర్స్లో వినిపించింది. అయితే డిసెంబరులో తన తనయుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే... సంక్రాంతికి ‘కింగ్ 100’ని విడుదల చేయాలన్నది మేకర్స్ ఆలోచన అట. పైగా సంక్రాంతి పండగ అంటే నాగార్జునకు బాగా కలిసి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. జనవరి 14న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ⇒ బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ నటిస్తున్న ఈ 111వ సినిమాకి ‘ఎన్బీకే 111’ అనే వర్కింగ్ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ‘వీరసింహా రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఎన్బీకే 111’ చిత్రంలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అయితే బాలకృష్ణకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉందట చిత్రయూనిట్. ⇒ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ధర్మన్ ’. ‘ది డెడ్లీ డాక్టర్’ అనేది ఉప శీర్షిక. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్, రాశీఖన్నా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘ధర్మన్’ పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా విడుదల కానుంది. 2027 పొంగల్‌కు రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. రజనీకాంత్ సినిమా అంటే తెలుగులోనూ రిలీజ్ కావడం ఖాయం. ఈ రకంగా ‘ధర్మన్’ కూడా సంక్రాంతికి తెలుగు తెరపై సందడి చేయనుంది. ⇒ ‘వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు హీరో సూర్య. ఆయన హీరోగా నటించిన 47వ చిత్రానికి ‘ఆవేశం’ మూవీ ఫేమ్ జిత్తు మాధవ్ డైరెక్టర్. ‘సూర్య 47’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రంలో నజ్రియా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక నిర్మించారు. ఈ సినిమాని పొంగల్‌కి (సంక్రాంతి) రిలీజ్ చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. సూర్య చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ రకంగా ఈ మూవీ టాలీవుడ్‌లోనూ విడుదలవుతుందని ఊహించవచ్చు. – డేరంగుల జగన్ మోహన్ -
పిల్లలపై ర్యాంకుల భారం మోపవద్దు..! హీరో సూర్య పేరెంటింగ్ టిప్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో మంచి హిట్ అందుకున్న హీరో సూర్య తల్లిదండ్రులను పిల్లలు విషయంలో అలా వ్యవహరించొద్దంటూ చక్కటి పేరెంటింగ్ సలహాలు సూచనలు ఇచ్చారు. పిల్లల పెంపకంలో ఆ విషయంలో ప్రతి పేరెంట్‌ని ఆ విధంగా ఉండొద్దని నొక్కి చెప్పారు. అందరి తల్లిదండ్రులు పిల్లల మార్కుల విషయంలో ఎలా ప్రవర్తిస్తే ప్రయోజనకరంగా ఉంటుందో వివరించడమే గాక తండ్రిగా తన అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. మరి అవేంటో చూసేద్దామా..!.ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో పిల్లల మార్కుల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన తీరు గురించి చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. బాల్యాన్ని ఆస్వాదించకుండా వాళ్లను ఎలా పోటీ వాతావరణంలోకి తోసేస్తున్నారో మాట్లాడారు. దయచేసి పిల్లలను పెంచేటప్పుడు ప్రతి పేరెంట్ వారి బాల్యాన్ని కోల్పోయేలా అస్సలు చేయొద్దని హితవు పలికారు. ఎందుకంటే విద్యావ్యవస్థలో అధిక కటాఫ్ మార్కుల పట్ల ఉన్న క్రేజ్‌పై తల్లిదండ్రల్లో ఉండే ఆందోళన తెలియకుండానే పిల్లలకు సంక్రమిస్తుందని అన్నారు. దాంతో వాళ్లకు 18 మార్కుల వస్తే సంతోషంగా ఉండదు..ఫస్ట్ అయితేనే హ్యాపీ అనే ఆలోచనకు వచ్చేస్తారు. తెలియకుండానే మొగ్గదశలోనే వారిలో ఆ భావన నాటుకుపోతోందన్నారు. అధిక కటాఫ్ మార్కులనేవి తీవ్రమైన పోటీకి దారితీసి..పిల్లల్లో తెలియని ఒత్తిడిని కలుగజేస్తాయి. యూనివర్సిటీలు 99.9 శాతం కటాఫ్ అడుగుతుంటాయి, అక్కడ చాలా పోటీ ఉంటుంది, అని పిల్లల్లో నూరిపోస్తుంటారు. దాంతో వాళ్లు తమ మధురమైన బాల్యాన్ని ఆస్వాదించకుండా చేసేస్తాం. నిజానికి దాన్ని ఎలా ఛాలెంజింగ్‌గా తీసుకుంటూ బాల్యాన్ని కూడా ఎలా ఎంజాయ్ చేయాలో వాళ్లకు నేర్పించమని అన్నారు. అలాగే పిల్లల సక్సెస్‌ని జరుపుకునే విధానంపై కూడా మండిపడ్డారు. "మా పిల్లాడికి ఇన్ని మార్కులు వచ్చాయంటూ పక్కంటి వాళ్లతో గర్వంగా చెప్పడంతో వాళ్ల బిడ్డ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆలోచించరు. సక్సెస్‌ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు..పక్కవాళ్లకు..తక్కువ మార్కులు వచ్చే పిల్లాడి మనసులో బాధ కలుగజేసేలా కాదని." అంటున్నారు హీరో సూర్య. అదేసమయంలో తాను పోటీతత్వానికి వ్యతిరేకం కాదని అన్నారు. తీవ్రమైన పోటీతత్వం మంచిదే. కానీ దాని విషయంలో అతి అస్సలు వదని అన్నారు. ఈ సందర్భంగా తన పిల్లల విషయంలో తండ్రిగా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు సూర్య. కుమారుడి స్పోర్స్ డే ఘటన..తన కుమారుడు దేవ్ పాఠశాల స్పోర్ట్స్ డే నాటి ఒక సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. పిల్లలు సహజంగానే ఎంతటి సానుభూతితో ఉంటారో అర్థం చేసుకోవడంలో ఆ సంఘటన తన దృక్పథాన్ని మార్చిందని ఆయన చెప్పారు. పిల్లలు పరుగెత్తుకుంటూ వెళ్లి, ఒక వాటర్ బాటిల్ తీసుకుని, తిరిగి ముగింపు రేఖకు చేరుకోవాల్సిన ఒక పరుగు పందెంలో దేవ్ పాల్గొన్నట్లు చెప్పారు. "అయితే దేవ్ అత్యంత వేగంగా పరిగెత్తే వారిలో ఒకడు, కానీ ఆ రోజు పరుగుపందెంలో తనకిష్టమైన బ్లూ కలర్ బాటిల్ తోపాటు పింక్ కలర్ బాటిల్ తీసుకొచ్చాడు. దాంతో అతడు అందులో గెలవలేకపోయాడు. ఆ తర్వాత నాతో అప్పా నాకు నీలం రంగు ఇష్టం కాబట్టి వెళ్లి నా నీలం రంగు బాటిల్ తీసుకున్నాను, కానీ అక్కకు గులాబీ రంగు అంటే ఇష్టం అందుకని ఆమె కోసం ఇది కూడా తీసుకొచ్చానని చెప్పాడు. ఇప్పుడు మన దగ్గర రెండు బాటిల్స్ ఉన్నాయి ఒకటి నా కోసం, ఇంకొకటి అక్క కోసం అని అనందంగా అన్నాడు. ఫలితం కంటే నా కుమారుడు తన అక్కు ఇచ్చిన ప్రాధాన్యత మనసుకు హత్తుకుంది. అలాగే తన సహా విద్యార్థి పట్ల దేవ్ ప్రవర్తించిన తీరు కూడా నన్ను ఆకట్టుకుందన్నారు. ఎందుకంటే దేవ్ తాను ఓడిపోయానని బాధపడకుండా తన బలాలు గుర్తిస్తూనే తరగతిలో అత్యంత వేగంగా పరుగెత్తినందుకు ఆ అబ్బాయిని ప్రశంసించాడు. పైగా అతడు అత్యంత వేగంగా పరిగెట్టగలడు, నేను బొమ్మలు బాగా గీయగలను అని అన్నాడు. అంతేగాదు అతడు నా అంత బాగా గీయలేడు నాన్న అని చెప్పిన తీరు నన్ను ఎంతగానో కదిలించింది." అని సూర్య అన్నారు. ఇక్కడ ఆ విధంగా ఆలోచించమని దేవ్‌కి ఎవ్వరూ శిక్షణ ఇవ్వలేదు, అయినా తను కొన్ని విషయాల్లో తన స్నేహితుడు కొన్ని విషయాల్లో రాణించగలడు అని చెప్పగలిగే ఒక స్పష్టత అతడికి ఉండటం నిజంగా అభింనందించదగ్గ విషయం అని అన్నారు సూర్య. కాగా సూర్య జ్యోతిక దంపతులకు 2007లో దియా అనే కుమార్తె, 2010లో దేవ్ అనే కుమారుడు జన్మించారు. తమ పిల్లలు బీ-కరికులం పాఠశాలల్లో చదవడం కోసం చెన్నై నుంచి ముంబైకి మకాం మార్చేశారు ఈ దంపతులు.(చదవండి: అనీమియా @ డిమెన్షియా!) -
కథ వినగానే సూర్య అలా అన్నారు!: వెంకీ అట్లూరి
‘‘ఒకప్పుడు అన్ని రకాల జానర్ సినిమాలు వచ్చేవి. కానీ, కొంతకాలంగా ఫ్యామిలీ సినిమాలు తగ్గిపోయాయి. అందుకే మంచి ఫ్యామిలీ సినిమా వస్తే, ప్రేక్షకులు థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. కోవిడ్ టైమ్‌లో ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారని తెలుసుకున్నాను. ఇందుకు తగ్గట్లే జానర్స్ షిఫ్ట్ చేస్తూ, కథలు రాస్తూ సినిమాలు చేస్తున్నాను’’ అని వెంకీ అట్లూరి చెప్పారు. సూర్య, మమిత బైజు హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది.ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, విజయవంతంగా ప్రదర్శితమవుతోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు... ⇒ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు మేం ఊహించినదానికంటే ఎక్కువ స్పందన లభిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సూర్యగారు ఈ సినిమా కథ వినగానే కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే కథలోని ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్తలు వహించాను. అలాగే క్లైమాక్స్‌లో కూడా చాలా కేర్ తీసుకున్నాం. ⇒ నా దృష్టిలో ఏ మనిషి చెడ్డవారు కాదు. పరిస్థితుల వల్ల ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవరిస్తుంటారు. ఇదే ఈ విషయాన్ని ఈ సినిమాలో చెప్పాను. వయసు వ్యత్యాసం ఉన్న బంధంపై కథ రాయాలనుకున్నప్పుడే హీరోకు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉండాలనుకుని, ఈ అంశం చుట్టూ ఈ కథ అల్లాను. వయసు వ్యత్యాసం కూడిన అంశాన్ని తమిళనాడు సీఎం విజయ్‌గారి జీవితంతో పోల్చుతూ కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారని అంటున్నారు. కానీ నిజానికి ఈ కథను 2022లోనే అనుకుని, క్యారెక్టర్ పేరు సంజయ్ అని రాసుకున్నాను. కాకపోతే హీరోగా సూర్యగారిని ఊహించుకోలేదు. సూర్యగారికి కథ చెప్పిన తర్వాత ఆయన బాడీ ల్యాంగ్వేజ్కి తగ్గట్లు కొన్ని మార్పులు చేయడం జరిగింది. ⇒ సూర్యగారికి తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈ సినిమాను తమిళంలో తీసి, తెలుగులో డబ్ చేశాం. అయితే తమిళంలో కన్నా, తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి కదా అంటున్నారు. కానీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తున్నారు. తమిళనాడు ఒక రాష్ట్రం మాత్రమే. పైగా మన దగ్గర థియేటర్స్ సంఖ్య ఎక్కువ. అలాగే టికెట్ ధరల్లో కూడా వ్యత్యాసం ఉంది. అయితే అక్కడి సిని మాలకు థియేటర్స్‌లో లాంగ్ రన్ ఉంటుంది.⇒ సితార బ్యానర్లో నిర్మితమయ్యే సినిమాలకు త్రివిక్రమ్‌గారి పర్యవేక్షణ ఉంటుంది. దీంతో ఆయన సినిమాలు చూసి కొన్ని చిన్న చిన్న మార్పులు చెబుతుంటారు. కానీ ఈ సినిమాకి ఆయన ఏ మార్పులు చెప్పలేదు. డబ్బు, అగ్రిమెంట్లను మించిన అతీతమైన బంధం సితార బ్యానర్‌తో నాకు ఏర్పడింది. నా నెక్ట్స్ చిత్రం కూడా ఇదే బ్యానర్లో ఉండొచ్చు. ఇటీవలి కాలంలో తెలుగు హీరోతోనే సినిమా చేయాలనుకున్నాను. ఏంటో... అనుకుంటే కుదరడం లేదు. ఈసారి అనుకోకుండా ముందుకు వెళ్తాను (నవ్వుతూ). -
సూర్యలోని విశ్వాసమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయానికి కారణం: వెంకీ
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. నటి మమిత బైజు నాయకిగా నటించిన ఇందులో నటి రాధిక శరత్ కుమార్, భవానీశ్రీ, సునిల్ రెడ్డి, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను వెంకీ అట్లూరి నిర్వహించారు. జీవీ.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఇటీవల తెలుగు, తమిళం భాషల్లో విడుదలై సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చైన్నెలోని ఒక స్టార్ హోటల్లో థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు.ఇందులో పాల్గొన్న నటి రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ నటుడు సూర్య తనకు చాలా కాలంగా తెలుసు అన్నారు. ఈ చిత్రంలో ఆయన ఎంతో పరిపక్వతతో నటించారని ప్రశంసించారు. ఈ చిత్రం గురించి ఒక్క నెగిటివ్ విమర్శ వస్తుందని చూశానని, అయితే అన్ని పాజిటివ్ విమర్శలే రావడం విశేషం అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి ప్రతి విషయంలోనూ చాలా క్లియర్‌గా ఉన్నారన్నారు. తనకు బాగా నచ్చిన చిత్రం సూర్యవంశం అనీ, ఆ తరువాత విశ్వనాథ్ అండ్ సన్స్ అని పేర్కొన్నారు.దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. చిత్ర ప్రివ్యూను మీడియా మిత్రులతో కలిసి చూశానని, దీంతో వారి రియాక్షన్ ఎలా ఉంటుందో అని కాస్త భయపడ్డానని, అయితే ఆ తరువాత ప్రతి ఒక్కరూ బాగుందని అభినందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను ఇంతకు ముందు దర్శకత్వం వహించిన వాథ్తి, లక్కీ భాస్కర్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారని, తాజాగా తమిళంలో చేసిన విశ్వనాథ్ అండ్ సనన్స్ చిత్రానికి గాను విజయాన్ని అందించారని పేర్కొన్నారు. నటుడు సూర్యలోని విశ్వాసమే ఈ చిత్రం విజయానికి ప్రధాన కారణం అని దర్శకుడు వెంకీ అట్లూ రి పేర్కొన్నారు. కాగా నటుడు సూర్య చైన్నెలో లేని కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేదు. -
క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత
-
మూడు రోజుల్లోనే.. కోట్ల వర్షం కురిపించిన విశ్వనాథ్ అండ్ సన్స్!
-
విశ్వనాథ్ అండ్ సన్స్.. రెండో రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
సూర్య హీరోగా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలి రోజు నుంచే అదరగొడుతోంది. మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు అదే జోరును కొనసాగించింది. ఫస్ట్ డే కంటే ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్టమెంట్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ షేర్ చేసింది. రెండు రోజుల్లో కలిపి రూ.37.6 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ మూవీ.. గ్రాస్ పరంగా సెంచరీ కొట్టేసింది. తొలిరోజుతో పోలిస్తే వసూళ్ల పరంగా రెండో రోజే అత్యధికంగా కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్ కావడం, పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు. కరుప్పుతో హిట్ కొట్టిన సూర్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరనుంది. #VishwanathAndSons hits it out of the park and smashes a 100cr+ in just 2 days 💥💥#BlockbusterVAS running successfully in cinemas near you ❤️#BlockbusterVishwanathAndSons @Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli… pic.twitter.com/fhIpLYvFJb— Sithara Entertainments (@SitharaEnts) August 16, 2026 -
అదృష్టం అంటే ఈ హీరోయిన్నే..పాతికేళ్లకే తిరుగులేని క్రేజ్
ప్రస్తుతం కోలీవుడ్‌లో నటి మమిత బైజు టైమ్ నడుస్తుందనే చెప్పవచ్చు. వరుస విజయాలతో ఈ మాలీవుడ్ చిన్నది దూసుకుపోతోంది. కేరళ రాష్ట్రం ,కొట్టాయం సమీపంలోని కిడంగూర్ అని గ్రామానికి చెందిన డిగ్రీ కూడా పూర్తి చేయని మమిత బైజు ఇప్పుడు మలయాళం, తమిళం , తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా దూసుకుపోతోంది.బాల్యంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె మొదట్లో బాలనటిగా కొన్ని చిత్రాలు నటించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే 2024 ఈ అమ్మడికి లక్కీ ఇయర్ అనే చెప్పాలి. ఆ ఏడాదిలో మలయాళం లో కథానాయకిగా నటించిన ప్రేమలు చిత్రం మమిత బైజు జీవితాన్నే మార్చేసింది. ఆ చిత్రం అనూహ్య విజయం తో మలయాళం లోనే కాకుండా తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమంలోనూ ఈమె పేరు మారుమ్రోగింది. ఇకపోతే అదే సంవత్సరంలో మమిత బైజు రెబల్ అని చిత్రంతో కోలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మమిత బైజు కు మాత్రం ఇక్కడ మంచి సక్సెస్ఫుల్ బాటను అమర్చింది.నటుడు ధనుష్ ,విజయ్ ,ప్రదీప్ రంగనాథన్ ,సూర్య వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలను పొందింది. తాజాగా జంటగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో శుక్రవారం విడుదలై సక్సెస్ఫుల్ టాక్ తో ప్రదర్శింపబడుతుంది. ఈ చిత్రంలో మమిత బైజు నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ప్రతిభకు లక్కు తోడైతే అది మమిత బైజు లా ఉంటుంది అని కూడా అంటున్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రను ఎంపిక చేసుకుంటూ ఆయా పాత్రలో లీనమై నటించడం వల్లే ఈమె వరసగా సక్సెస్ అందుకుంటుందనే భావన సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తమిళం మలయాళం భాషలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ పాతికేళ్ల పరువాల భామ తమిళంలో నటుడు కార్తీకి జంటగా నటిస్తున్న చిత్రం నిర్మాణ దశలో ఉంది. -
‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'సూర్య హిట్ సినిమా.. నాకు అన్యాయం'.. మన్సూర్ అలీఖాన్ షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ వివాదాస్పద నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్య మూవీలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరుప్పు చిత్రంలో తాను ఎంతో కష్టపడి డ్యాన్స్ చేశానని తెలిపారు. అయితే ఎలాంటి కారణం చెప్పకుండానే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాలు యూట్యూబ్‌లో వస్తాయని నిర్మాత చెప్పారని.. కానీ అది కూడా జరగలేదని అన్నారు. సూర్య, కార్తీ పెద్ద స్టార్స్ అని.. వాళ్లు జీవించాలని కోరుకుంటానని అన్నారు. అయితే తమ లాంటి చిన్ననటులను కూడా బతకనివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను చాలా ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తున్నానని తనకు న్యాయం జరగాలని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఆల్ పాస్ మూవీ ఈవెంట్‌కు హాజరైన ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పులో తన సన్నివేశాలు తొలగించడంపై మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డ్యాన్స్ సీన్ కోసం తాను ఎంతో శ్రమించానని.. కానీ అది మూవీలో లేకపోవడం చాలా బాధగా ఉందన్నారు. ఆ పాటకు నేను విలన్లతో కలిసి డ్యాన్స్ చేశానని.. ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశానని వెల్లడించారు. ఈ సినిమాలో నా నటనను, కష్టాన్ని నా కొడుకులకు స్వయంగా చూపించా.. కానీ ఆ సన్నివేశాన్ని తొలగించారు. మీరు నటించిన సీన్ ఎందుకు తొలగించారని నా బిడ్డలు అడిగినప్పుడు నా చేతుల్లో ఏం లేదని చెప్పాను. కనీసం ఆ సన్నివేశం యూట్యూబ్‌లో కూడా లేకపోవడంతో మరింత బాధేసిందని అలీఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన మూవీ కరుప్పు. ఈ చిత్రాన్ని వీరభద్రుడు పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. బిగ్ బాస్ ఫేమ్ జనని నాయకిగా నటించిన చిత్రం ఆల్ పాస్. నిరంగళ్ మూండ్రు, తరుణం చిత్రాల ఫేమ్ దుష్యంత్ హీరోగా నటించారు. ఈ సినిమాకు మైదీన్ దర్శకత్వం వహించగా.. వన్ స్టెప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మోహన.ఆర్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఆడియో, ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్ ,విక్రమన్ ,నటుడు మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సినిమాకు జేమ్స్ వసంతన్ సంగీతం అందించారు. #Suriya மீது கடும் கோபத்தில் கொந்தளித்த Mansoor Ali Khan🤬🤬 உனக்கு ஆண்மை இருந்தா அத போடு 💥😬 என்னைய டம்மியா நிக்க வச்சானுங்க😣😖 நீ விக்ரம் படத்துல 5நிமிசம் தான வந்த 😬 #SuriyaSivakumar #MansoorAliKhan #TamilCinema pic.twitter.com/fGCK1sPMAd— BingooBox (@BingooBox) August 14, 2026 -
సూర్యతో సినిమా.. రిక్వెస్ట్ కాదు డిమాండ్: త్రివిక్రమ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లాక్ అయిందంటూ అప్పట్లో చాలా స్టోరీలు వచ్చాయి. నిజానికి అవి రూమర్స్ కావు. వీరిద్దరూ కలిసి సినిమా చేయడానికి గతంలో ప్రయత్నించారు. అయితే కథ విషయంలో ఇద్దరికీ సెట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. శనివారం నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌కి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, యూనిట్‌కి అభినందనలు తెలిపారు.త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నేను సూర్యతో ఇప్పటికే ఓ సినిమా చేయాలి. కానీ సూర్యకు నచ్చే కథను నేను చెప్పలేకపోయాను. అయితే త్వరలోనే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తానని నిండుసభలో ప్రకటించారు. నా భార్య సూర్యకు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో తను నన్ను కోరుతున్నారు. “అది రిక్వెస్ట్ కాదు.. డిమాండ్” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, సూర్యను కలిసేందుకు తన భార్య ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ షూటింగ్‌కి వెళ్లి, ఆయనతో ఫొటో కూడా దిగినట్లు త్రివిక్రమ్ వెల్లడించారు.అందరూ ఒక్కటై సక్సెస్ చేశారు – సూర్య‘‘వెంకీ అట్లూరిగారు తెలుగు. నేను తమిళ్, రవీనా టాండన్ మేడం మహారాష్ట్ర, మమిత బైజు కేరళ... ఇలా వేర్వేరు ప్రాంతాలవాళ్లం కలిసి చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాని మీరందరూ (ప్రేక్షకులు) ఒక్కటై అద్భుతంగా ఆదరించారు. మాకు సక్సెస్, గౌరవాన్ని, ప్రేమను ఇవ్వడంతో పాటు ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు మరిన్ని తీసే ప్రోత్సాహం అందించినందుకు థ్యాంక్స్’’ అని సూర్య అన్నారు. సూర్య హీరోగా నటించిన తెలుగు–తమిళ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మమిత బైజు హీరోయిన్గా నటించిన ఈ మూవీలో రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న (శుక్రవారం) విడుదలైంది. సూర్య మాట్లాడుతూ.. ‘‘కొన్ని సినిమాలను వసూళ్లతో కొలవలేం. ప్రేక్షకులు పొందిన అనుభూతిలోనే ఈ సినిమా అసలు విజయం దాగుంది. ఇలాంటి మంచి సినిమా ఇచ్చిన వెంకీ అట్లూరికి ధన్యవాదాలు. మా మూవీకి శుక్రవారంతో పోల్చితే శనివారానికి వసూళ్లు డబుల్ అయ్యాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథ రాసినప్పుడు యాక్షన్, డార్క్ హ్యూమర్, ఘోస్ట్, దైవం నేపథ్యంలోని మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఒక కుటుంబ కథా చిత్రంతో వస్తామన్నప్పుడు నిర్మాతలు కొంచెం నిరుత్సాహపరుస్తారు. కానీ, వంశీగారు ప్రోత్సహించారు’’ అని తెలిపారు వెంకీ అట్లూరి. ‘‘ఈ మూవీ ఊటీ షెడ్యూల్లో సూర్యతో పాటు నేనూ ఉన్నాను. ముంబైలోని నా ఫ్రెండ్స్ ఊటీకి వచ్చారు. అయితే వారు వచ్చింది నా కోసం కాదు... సూర్య కోసం (నవ్వుతూ)’’ అన్నారు రవీనా టాండన్. కరుప్పు హిట్ తర్వాత సూర్య నటించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌తోనే సూపర్ హిట్ అవుతుందని టాక్ వినిపించింది. అలానే రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. -
విశ్వనాథ్ అండ్ సన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాతే సూపర్ హిట్ అవుతుందని టాక్ వినిపించింది. రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్..అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.27.51 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియా వ్యాప్తంగా మొదటి రోజు రూ.15.15 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టగా.. రూ.17.51 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్లో రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీకి తమిళ వర్షన్ రూ. రూ.9.15 కోట్లు రాగా.. తెలుగులోనే రూ. 6 కోట్లు కలెక్ట్ చేసింది. కరుప్పు హిట్ తర్వాత సూర్య నటించిన మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం ఆగష్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. -
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ
మూడు నెలల క్రితం 'కరుప్పు'(తెలుగులో వీరభద్రుడు)తో హిట్ కొట్టిన సూర్య.. ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో వచ్చేశాడు. దీనికి తెలుగువాడైన వెంకీ అట్లూరి దర్శకుడు కాగా, నాగవంశీ నిర్మాత. మమిత బైజు హీరోయిన్. రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సంజయ్ విశ్వనాథ్(సూర్య) ఓ వ్యాపారవేత్త, ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి చేసుకోడు. అమెరికాకి వెళ్లి సరోగసి ద్వారా మగబిడ్డని కని స్వదేశానికి తిరిగొస్తాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లాడు ఓ అరుదైన వ్యాధి బారిన పడతాడు. బోన్ మారో(ఎముక గుజ్జు) ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవసరం ఏర్పడుతుంది. అమెరికాకు తిరిగెళ్లి సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని వెతికి భారత్‌కి తీసుకొస్తాడు. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు.20 ఏళ్ల మ్యాడీ.. సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా తన కొడుకును పెంచుకోగలిగాడా? మ్యాడీ ప్రేమని సంజయ్ ఎందుకు తిరస్కరించాడు? చివరకు పెళ్లి విషయంలో సంజయ్ తన ఆలోచన మార్చుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ. ఎలా ఉందంటే?కుటుంబ నేపథ్యంలో సాగే సినిమా ఇది. సాంప్రదాయాలు, బంధాలు, తల్లి-కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాల చుట్టూ కథ తిరుగుతుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా దాని చుట్టూ అల్లిన సన్నివేశాలు, మానవ సంబంధాలని హృదయాలను హత్తుకునేలా తీర్చిదిద్దాడు. కాసేపు నవ్విస్తూ మరి కాసేపు భావోద్వేగానికి గురిచేస్తూ బోర్ కొట్టకుండా కథనాలు నడిపించాడు.సంజయ్ విశ్వనాధ్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే సన్నివేశంతో మూవీ ప్రారంభమవుతుంది. తర్వాత సంజయ్ ఫ్యామిలీ నేపథ్యం, మంచి వ్యాపారవేత్తగా ఎదిగిన తీరు చూపించారు. ఆ వెంటనే బిడ్డ కోసం సరోగసి మార్గం ఎంచుకోవడం... కొడుకు సర్జరీ కోసం సరోగసి మదర్ మ్యాడీ ఇండియాకు రావడంతో కథ కామెడీ టర్న్ తీసుకుంటుంది. మ్యాడీ చేసే అల్లరి థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. అదే సమయంలో తల్లితో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు గుండెని బరువెక్కిస్తాయి.టీవీ షో ఎపిసోడ్ అయితే కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. ద్వితీయార్థంలో కథనం చాలావరకు ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. మదర్ ఎపిసోడ్లో తెరపై సూర్య కన్నీళ్లు పెట్టుకుంటే సీట్లో ఉన్న ప్రేక్షకుడి గుండె బరువెక్కుతుంది. ఆ తర్వాత కథనం కొంతవరకు నెమ్మదిగా సాగుతుంది. పెళ్లి ఎపిసోడ్ అయితే కొంత సాగదీత అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంది.ఎవరెలా చేశారంటే?సంజయ్ విశ్వనాధ్ పాత్రల్లో సూర్య ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన కన్నీళ్లు తెప్పిస్తుంది. మమితకు మంచి పాత్ర లభించింది. మ్యాడీగా ఆమె చేసే అల్లరి నవ్వులు పూయిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మమిత పాత్రను మర్చిపోరు. తల్లిగా రాధిక చక్కగా నటించింది. మిగిలిన వాళ్లు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.సాంకేతిక విషయాలకొస్తే మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి సీన్ తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.అంజి శెట్టే , సాక్షి వెబ్ డెస్క్ -
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో సూర్య.. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీతో కలిసి చేసిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమిత బైజు హీరోయిన్ కాగా రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. నేడు(ఆగస్టు 14) తెలుగు, తమిళంలో రిలీజైన ఈ సినిమా గురించి ట్విటర్ టాక్ ఏంటి? ఆడియెన్స్ ఏమంటున్నారు?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)45 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడటం అనే కథాంశంతో ఈ సినిమా తీశారు. ఇందులో సూర్య.. ఒలింపిక్ షూటర్ పాత్రలో కనిపించాడు. 20 ఏళ్ల చలాకీ అమ్మాయి పాత్రని మమిత బైజు చేసింది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ పర్లేదనిపించాయి.ఇక సినిమా విషయానికొస్తే కొందరికి బాగా నచ్చేసింది. ఆ మేరకు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఫస్టాప్ బాగుందని, సెకండాఫ్ తేలిపోయిందని అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత మెలోడ్రామా ఎక్కువైందని, క్లైమాక్స్ ఇంకా బాగా తీసి ఉండొచ్చని రాసుకొస్తున్నారు. ఓవరాల్‌గా డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. మరికొందరు మాత్రం తమకు ఒక్క సీన్ కూడా నచ్చలేదని అంటున్నారు.(ఇదీ చదవండి: 'అగధ' మూవీ రివ్యూ)#VishwanathAndSons – One of the BEST FAMILY ENTERTAINERS in Recent Times…!!This one is a breezy, light hearted family entertainer from #Suriya and Director #VenkyAtluri.The lead performances and writing are the biggest strengths of the film.Don’t expect a #LuckyBhaskar kind…— Rangasthalam (@RangasthalamIN) August 14, 2026Disaster Review for #VishwanathAndSons 💔Weakest Movie from #VenkyAtluri #VishwanathAndSons pic.twitter.com/HUfsTQhJCr— 𝗕𝗵𝗮𝗿𝗮𝗻𝗶🥃🎲 (@Anirudhoff_) August 14, 2026#VishwanathAndSons Review: “A Decent Family Entertainer”👉Rating : 2.75/5Positives:⁰👉#Suriya performance⁰👉#MamithaBaiju & Radhika are well cast⁰👉Venky Atluri’s dialogues work well⁰👉A few good emotional momentsNegatives:⁰👉Uneven 2nd half⁰👉Some subplots don’t work…— PaniPuri (@THEPANIPURI) August 14, 2026🔥 #VishwanathAndSons — OVERALL REVIEW 🔥When the story was leaked and the trailer dropped, I was worried that the film might have nothing more to offer. But the 2nd half has a major surprise that wasn’t revealed in any publicity material! 🔥The director shows two sides of… pic.twitter.com/JizKxv2OBu— Kollywood Wire (@KollywoodWire) August 14, 2026#VishwanathAndSons - VATCHABLE ONES!Good 1st Hlf & Avg 2nd Half.OKayish Feel Good Family Entertainer!— Christopher Kanagaraj (@Chrissuccess) August 14, 2026#VishwanathAndSons First half - Excellent 👌- Took 15 Mins to setup the plot and Conflict !!- Once #MamithaBaiju entered, the film took off and totally entered into the fun mode. Mamitha & her mannerisms was super cute🥰😀 - #Suriya's Screen presence and performance was… pic.twitter.com/A4x9vB0HPn— AmuthaBharathi (@CinemaWithAB) August 14, 2026#VishwanathAndSons A Watchable, Clean Family Entertainer With a Good 1st Half but a Weak 2nd Half!After a slow start, the first half feels refreshing and stays focused on the core plot with a good mix of fun and emotion. Just when you expect that flow to continue, the second…— Venky Reviews (@venkyreviews) August 14, 2026 -
విశ్వనాథ్ అండ్ సన్స్.. ఎవరికెంత రెమ్యునరేషన్?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమతా బైజు హీరోయిన్గా నటించింది. మధ్య వయస్కుడితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారనే విషయంపై చర్చ మొదలైంది. ఈ చిత్రానికి సూర్య దాదాపు రూ.45 కోట్ల వరకు వసూలు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇది దాదాపు సూర్య పారితోషికానికి డబులు అని తెలుస్తోంది. మమితా బైజు కోటిన్నర నుంచి మూడు కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ఈ మూవీలో రవీనా టాండన్ తన రోల్‌కు దాదాపు రూ.2 నుంచి 3 కోట్ల వరకు ఛార్జ్ చేశారని టాక్. వీరితో పాటు రాధిక శరత్‌కుమార్ దాదాపు రూ.40 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
సూర్య ముందు అద్భుతమైన అవకాశం
హీరో విజయ్.. సీఎం విజయ్ అయిపోయారు. ఈయన చేసిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' గత నెలలోనే రిలీజైపోయింది. మరో వారం ఆగితే ఓటీటీలోకి కూడా వచ్చేయొచ్చు. సరే ఈ విషయం పక్కనబెడితే తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతానికైతే కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న హీరో విజయ్ మాత్రమే. ఇప్పుడు ఈయన యాక్టింగ్ వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. మరి ఈ స్థానాన్ని భర్తీ చేసే హీరో ఎవరు? సూర్యకు ఎంత అవకాశముంది?(ఇదీ చదవండి: మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్)సూర్య స్టార్ హీరోనే కానీ గత కొన్నేళ్లలో సరైన సినిమాలు పడకపోయేసరికి క్రేజ్ తగ్గిన మాట వాస్తవం. కానీ ఈ ఏడాది 'కరుప్పు'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. 'వీరభద్రుడు' పేరిట ఇది తెలుగులోనూ రిలీజై మంచి వసూళ్లు అందుకుంది. రూ.350 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. సూర్య కెరీర్లోనే ఇదే అత్యధికం. ఇదొచ్చి మూడు నెలలు కూడా కాలేదు ఇంతలోనే 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో వచ్చేందుకు సూర్య సిద్ధమయ్యాడు. దీనిపై బజ్ బాగానే ఉంది. కాకపోతే కంటెంట్ క్లిక్ అవ్వాలి.ట్రైలర్, పాటలు లాంటివి చూస్తుంటే ఇదో కుటుంబకథా చిత్రమని అర్థమవుతుంది. 'కరుప్పు' మాస్ కంటెంట్ కావడంతో చాలామంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. మరి 'విశ్వనాథ్'లో క్లాస్ టచ్ కనిపిస్తోంది. ఇది ఎంతమందికి కనెక్ట్ అవుతుందనేది చూడాలి? ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం సూర్య సక్సెస్ ట్రాక్‌లో పడ్డట్లే. ఇదే జోష్ కొనసాగిస్తూ వరసగా మంచి సినిమాలు చేస్తే మాత్రం విజయ్ వదిలేసిన స్థానాన్ని సూర్య అందుకోవచ్చు.తమిళ ఇండస్ట్రీ వరకు చూసుకుంటే రజనీకాంత్, కమల్ హాసన్ వయసైపోయింది. అందుకు తగ్గట్లే సినిమాలు చేయడం తగ్గించేశారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చేశారు. అజిత్ అయితే యాక్టింగ్ కంటే రేసింగ్‌పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ధనుష్ ఏడాదికి రెండు మూడు మూవీస్ చేస్తున్నప్పటికీ ఓ సెట్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రమే ఇతడికి ఉన్నారు. విక్రమ్, శింబు లాంటి వాళ్లు స్టార్డమ్ ఉన్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే చిత్రాలు చేయలేక బాగా వెనకబడిపోయారు. మిగిలిన వాళ్లలో శివకార్తికేయన్, కార్తీ, విశాల్ తదితరులని మిడ్ రేంజ్ కేటగిరీ అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సూర్య టాప్‌లోకి వెళ్లిపోవచ్చు. ఎటొచ్చి అందుకు తగ్గ డైరెక్టర్స్-సినిమాలు సెట్ కావాలంతే.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' అగ్నిపరీక్ష.. అభిజిత్ పరువు తీసిన కంటెస్టెంట్!) -
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు)
-
తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.. ఎమోషనల్ అయిన సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. గత 28 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అన్నారు. శివకుమార్ కుమారులైన తమను తెలుగు ప్రజలు దత్త పుత్రుల్లా గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. విశ్వనాథ్ అండ్ సన్స్’లో హ్యూమన్ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాకు మొదట్నుంచి త్రివిక్రమ్‌గారి సపోర్ట్ ఉంది. ఈ సినిమా నాకు మంచి జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు.‘గజినీ’లో సంజయ్ రామస్వామి పాత్రను ఎలా ఆదరించారో.. అదే వింటేజ్ మ్యాజిక్‌ను మళ్లీ తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ఈ కథను రూపొందించారని సూర్య చెప్పారు. హైదరాబాద్‌లో ఆరు నెలల షూటింగ్ అనుభవం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. వెంకీ అట్లూరి రైటింగ్, సిన్సియారిటీని ప్రశంసిస్తూ.. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని తెలిపారు.‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’కు అందించిన ప్రేమనే ఆగస్టు 14న విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’కు కూడా అందించాలని తెలుగు ప్రేక్షకులను కోరారు.‘‘రాధికగారు ఈ సినిమాలో ఒక మ్యాజిక్. ఇక లైఫ్‌లో మీకు డబ్బు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే... మమితలా ఇంత మంచి పొజిషన్లో ఉంటారు. జూనియర్ ఆర్టిస్టు కుమార్తె నుంచి ఇప్పుడు ఆమె ఈ వేదికపై ఉన్నారు. మిమ్మల్ని మీరు నమ్మండి. వెంకీ ఈ సినిమాలో మూడు అందమైన మహిళా క్యారెక్టర్స్ రాశారు. వెంకీతో నేను ఓ బయోపిక్ చేయాల్సింది. కానీ ఈ సినిమా చేశాం. ఈ సినిమాలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. ఈ చిత్రం మా అందరికీ స్పెషల్’’ అని సూర్య అన్నారు.వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల ముఖంపై ఒక చిరునవ్వు ఉంటుంది. సూర్య నటించిన చాలా సినిమాలు ఫ్రై డే రోజునే నేను చూశాను. కానీ నేను ఆయన్ను డైరెక్ట్ చేసిన సినిమా ఈ ఫ్రై డే రిలీజ్ కానుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో ప్రేక్షకులను 90 శాతం ఎంటర్టైన్ చేస్తానని చెప్పగలను’’ అని అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత స్టేజ్‌పై ధైర్యంగా చెబుతున్నా... ఈ సినిమా చాలా బాగుంది. ఇందులో మదర్ అండ్ సన్స్ రిలేషన్ అద్భతంగా ఉంటుంది. అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు నాగవంశీ. ‘‘కొత్త పాయింట్‌తో వెంకీ అట్లూరి మంచి కథ రాశారు. ఈ సినిమాలో మూడు పాటలు రాశాను’’ అన్నారు రామజోగయ్య శాస్త్రి. ఈ వేడుకలో పాల్గొన్న నిర్మాతలు వై. రవిశంకర్, కేఎల్ నారాయణ, జూబ్లీహిల్స్ ఎమ్ఎల్ఏ నవీన్ యాదవ్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హిట్ కావాలని ఆకాంక్షించారు. సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. -
'సంజయ్ రామస్వామిని మళ్లీ చూస్తారు': నాగవంశీ
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు సూర్యతో నిర్మాత నాగవంశీ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. సూర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీతో సూర్యలో మరోసారి సంజయ్ రామస్వామిని గుర్తుకు తెస్తామని ప్రకటించారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు. మదర్ సెంటిమెంట్ ఈ మూవీలో మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమా చూశాక మీ మదర్‌ను పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తారని అన్నారు. రాధిక క్యారెక్టర్ చూస్తే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూస్తారని అన్నారు. ఈ సినిమా త్రివిక్రమ్‌కు కూడా నచ్చిందని వెల్లడించారు. ఆయన మెచ్చుకున్న ఏ సినిమా నాది ఫెయిల్ అవ్వలేదని పేర్కొన్నారు. -
ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు
సూర్య, జ్యోతికది హిట్ జోడీ. పెళ్లికి ముందు పలు సినిమాల్లో కలిసి నటించిన వీళ్లు.. తర్వాత ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. సూర్య తమిళ చిత్రాలతో బిజీగా ఉంటే, జ్యోతిక హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే మళ్లీ కలిసి నటించబోతున్నట్లు టాక్ నడుస్తుండగా దీనిపై జ్యోతిక స్పందించింది.(ఇదీ చదవండి: నటికి చేదు అనుభవం.. లిప్ కిస్ పెట్టిన లేడీ ఫ్యాన్)మేం మళ్లీ కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు, కథలు కూడా వింటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అలాంటిదేవీ జరగలేదు. మంచి కథ సెట్ అయితే కలిసి నటించడానికి సిద్దమే. తమకు ఆఫ్ స్క్రీన్‌లోనూ మంచి ప్రేమ లభిస్తోంది. ఆన్ స్క్రీన్‌లో తమని చూడాలని ఎవరూ కోరుకోవడం లేదు అనుకుంటా అని జ్యోతిక చెప్పుకొచ్చింది.సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. 'రోలెక్స్' గురించి మాట్లాడుతూ లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా చిత్రం చేసే పనిలో ఉన్నారని, తర్వాత 'విక్రమ్ 2' ఉందని.. అయినా రోలెక్స్ మూవీ ఉంటుందనీ, కథను రెడీ చేస్తున్నట్లు లోకేశ్ కనక రాజ్ చెబుతున్నాడని, అయితే అది ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది కాలమే చెప్పాలని సూర్య అన్నాడు. (ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్‌ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు) -
సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్
-
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్.. ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్.ఈ నేపథ్యంలోనే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని పుల్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్‌గా డ్రామాగా రూపొందించారని ట్రైలర్లో తెలిసిపోతోంది. 'గెలిచేదాకా ఆగకూడదు.. గెలిచాక ఎక్కువగా మాట్లాడకూడదు' అనే డైలాగ్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రంలో సూర్య 40 ఏళ్ల వ్యక్తిగా, మమిత బైజు 20 ఏళ్ల అమ్మాయిగా నటించారు. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
సూర్య కంటే మూడింతలు ఎక్కువ సంపాదించా
సినిమా సెలబ్రిటీల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. వాళ్లలో సూర్య-జ్యోతిక జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే బంధాన్ని అలా మెంటైన్ చేస్తుంటారు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఎవరికివాళ్లు బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇద్దరూ కలిసి కనిపించారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడారు. జ్యోతిక అయితే అప్పట్లో సూర్య కంటే తానే మూడింతలు ఎక్కువ సంపాదించానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఏదో ఒకరోజు కమ్యూనిజందే గెలుపు.. శోభిత రాజకీయ వ్యాఖ్యలు)'సూర్య భర్తగా చాలా గొప్ప వ్యక్తి. సమానత్వం అనేది ఆయన మనసులో మొదట నుంచి ఉంది. అది పుట్టుకతోనే రావాలి. అమ్మాయిలకు వంట చేయడం రాకపోయనా ఏదైనా పని ఇష్టం లేదని చెప్పినా సరే అని వదిలేయడం చాలావరకు సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ మా ఇంట్లో అలానే జరుగుతుంది. నేను ఫెమినిస్ట్‌గా మాట్లాడటం లేదు. మా ఇంట్లో మేమిద్దరం సమానమే''సినిమాని నిర్మించడం దగ్గర నుంచి పిల్లల్ని పెంచడం, సెలవుల్లో తిరగడం వరకు ప్రతిదీ మేం కలిసే నిర్ణయం తీసుకుంటాం. ఒకరి ఎదుగుదలని చూసి మరొకరం ఆనందించడం మాకు చాలా ఇష్టమైనది. ఆ రోజుల్లో సూర్య పారితోషికం కంటే నాది మూడింతలు ఎక్కువ. కానీ ఇప్పుడు 30 రెట్లు తగ్గింది' అని జ్యోతిక చెప్పుకొచ్చింది.ఇకపోతే ఈ ఏడాది 'కరుప్పు'తో సక్సెస్ అందుకున్న సూర్య.. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించాడు. వచ్చే శుక్రవారం.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే సినిమాతో రాబోతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకుడు కాగా నాగవంశీ నిర్మాత. మమిత బైజు హీరోయిన్.(ఇదీ చదవండి: 200 రోజులు కష్టపడితే ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే బ్లాక్‌బస్టర్: సూర్య) -
200 రోజులు కష్టపడితే ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే బ్లాక్‌బస్టర్
తమిళ హీరో సూర్య.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో వచ్చేవారం థియేటర్లలోకి రానున్నాడు. దీని ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ మీడియాకు యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులోనే 'రోలెక్స్' గురించి, అలానే 'కంగువ' డిజాస్టర్ కావడం గురించి మాట్లాడాడు. తన నుంచి ఈ ఏడాది మూడో చిత్రం కూడా రానుందని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: మరో ఆలోచన లేకుండా మాకు డబ్బులిచ్చింది.. సూర్య ఎమోషనల్)'రోలెక్స్' సినిమా ఎప్పుడు మొదలవుతుందో, లోకేష్ ఏం చేస్తున్నాడో నాకు తెలీదు.. ఆయన ఇప్పటికే అల్లు అర్జున్ మూవీతో పాటు 'విక్రమ్ 2' పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంటర్వ్యూల్లో 'రోలెక్స్' స్టోరీ రాస్తున్నానని చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. జీతూ మాధవన్‌తో చేస్తున్న నా మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది చివర్లో థియేటర్లలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం' అని సూర్య చెప్పుకొచ్చాడు.రీసెంట్ టైంలో తన సినిమాలకు వచ్చిన ఫలితాల గురించి మాట్లాడిన సూర్య.. "దాదాపు 200 రోజుల పాటు ఎంతో నమ్మకంతో తీసిన మూవీ(కంగువ) పూర్తిగా ఫెయిలైంది. కేవలం 45 రోజుల్లో పూర్తయిన చిత్రం(కరుప్పు) ఈ ఏడాది పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇండస్ట్రీలో విజయానికి ఎలాంటి ఫార్ములా లేదు. ఈ అనుభవాలే దాన్ని మరోసారి గుర్తుచేశాయి. 30 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత కూడా ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంది' అని అన్నాడు.సూర్య నటించిన 'కంగువ' 2024లో భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా నిరాశపరిచింది. దర్శకుడు శివ తీసిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా భారీ నష్టాలని చవిచూసింది. దీని తర్వాత ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య చేసిన 'కరుప్పు' ఊహించని సక్సెస్ అందుకుని ఏకంగా రూ.300 కోట్లు కలెక్షన్స్ సాధించింది. సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.(ఇదీ చదవండి: త్రిష.. రాజకీయాల్లోకి రావాలి) -
మరో ఆలోచన లేకుండా మాకు డబ్బులిచ్చింది
తమిళ స్టార్ హీరోల్లో పలువురికి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి వాళ్లలో సూర్య, కార్తి ముందు వరసలో ఉంటారు. అయితే రాధిక తమ కుటుంబానికి ఆపత్కాలంలో ఆర్థిక సాయం చేసిందని చెప్పిన సూర్య.. ఆమెని ఎప్పటికీ మర్చిపోలేం అని ఎమోషనల్ అయ్యాడు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆడియో లాంచ్ సందర్భంగా సూర్య ఈ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'కార్తీ.. అమెరికాలో చదివేందుకు వెళ్లాల్సిన టైంలో వీసా ప్రక్రియలో భాగంగా బ్యాంక్ అకౌంట్లో సరిపడా డబ్బులు ఉండాలి. అప్పట్లో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత బాగోలేదు. ఈ విషయం తెలుసుకున్న రాధిక అక్క.. మరో ఆలోచన లేకుండా అవసరమైన మొత్తాన్ని ఇచ్చింది. కార్తీకి కాలేజీలో అడ్మిషన్ వచ్చే వరకు ఈ డబ్బులు అకౌంట్లో ఉంచుకోమని చెప్పింది. ఆమె చేసిన సాయాన్ని మా ఫ్యామిలీ జీవితాంతం మర్చిపోదు' అని సూర్య చెప్పుకొచ్చాడు.అమెరికాలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసిన కార్తీ.. చెన్నైకి తిరిగి వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. దర్శకుడు మణిరత్నం దగ్గర 'ఆయుధ ఎళుత్తు'తో పాటు దాని హిందీ వెర్షన్ 'యువ' సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత హీరోగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇకపోతే రాధిక.. సూర్య, కార్తీ సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉంటుంది. కార్తీ 'సర్దార్ 2' సెప్టెంబరులో రిలీజ్ కానుంది. మరోవైపు 'మార్షల్' అనే తమిళం మూవీ.. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' తీసిన కల్యాణ్ శంకర్‌తో, 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను, దర్శకుడు మోహన్ రాజాతోనూ ఓ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: స్పైడర్ మ్యాన్ ఊచకోత.. ఇక్కడే రూ.1000 కోట్లు వస్తాయేమో?) -
షాకిచ్చిన సూర్య-జ్యోతిక.. ఏఐ కాదు నిజమే
డైట్, గ్లామర్ మెంటైన్ చేయాలంటే సామాన్యులకు కష్టం గానీ సెలబ్రిటీలకు చాలా సింపుల్. ఎందుకంటే కొందరు 50-60 ఏళ్లొచ్చినా సరే యంగ్‌గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంటారు. ఇప్పుడు సెలబ్రిటీ జంట సూర్య-జ్యోతిక కూడా అలానే షాకిచ్చారు. వీళ్లు కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)గత 30 ఏళ్లుగా నటుడిగా చేస్తున్న సూర్య.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వచ్చే వారం ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో ఓ పక్క బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు భార్యతో కలిసి ఓ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నాడు. బ్లాక్ అండ్ వైట్, కలర్ గ్రేడింగ్‌తో ఉన్న ఈ ఫొటోల్లో డిజైనర్ దుస్తుల్లో వీళ్లిద్దరూ కనువిందు చేశారు. ఇవి చూసిన చాలామంది వీళ్లకు వయసు తగ్గుతోందా? అని మాట్లాడుకుంటున్నారు.సూర్య సినిమాలతో బిజీగా ఉండగా జ్యోతిక కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో హిందీలో మూవీస్ చేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈమె 'సిస్టమ్' అనే వెబ్ సిరీస్ చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న దీనితో సక్సెస్ అందుకుంది.(ఇదీ చదవండి: మెడలో తాళితో 'బిగ్‌బాస్' ఫేమ్ ట్రాన్స్‌జెండర్ ప్రియాంక) -
సూర్యతో ఉన్న తల్లీకూతుళ్లని గుర్తుపట్టారా? ఇద్దరూ నటులే
అప్పుడప్పుడు నటీనటులు షేర్ చేసుకునే పాత ఫొటోలు చిత్రంగా అనిపిస్తుంటాయి. ఎందుకంటే చిన్నప్పుడెప్పుడో సరదా కోసం స్టార్ హీరోహీరోయిన్లతో కొందరు పిక్స్ తీసుకుంటారు. పెరిగి పెద్దయిన తర్వాత మళ్లీ వాళ్లని కలిసేసరికి తెగ ఆనందపడిపోతుంటారు. ఈ నటి అలాంటి అనుభూతి చెందింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)పైన సూర్యతో కలిసున్న తల్లీకూతుళ్లు తమిళ సినిమాల్లో చేస్తున్న నటులే. పెద్దావిడ పేరు శ్రీజ. ఈమె సీనియర్ నటి. తమిళ, మలయాళంలో చాలానే మూవీస్ చేస్తోంది. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'లోనూ నటించింది. ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈమె కూతురు, నటి రవీనా కూడా లొకేషన్‌కి వెళ్లింది. భర్తతో కలిసి సూర్యని కలవడంతో పాటు తన చిన్నప్పుడు కలిసి సందర్భాన్ని గుర్తుచేసుకుంది. తాజాగా ఈ రెండు ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.ఇకపోతే పాప పేరు రవీనా. 'లవ్ టుడే' మూవీలో ప్రదీప్ రంగనాథన్‌కి అక్కగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు నటిగా ఫేమస్ అయింది కానీ డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. 'జవాన్'లో దీపికా పదుకొణెకు తమిళ-తెలుగు వెర్షన్స్‌లో, తమిళ 'గేమ్ ఛేంజర్'లో కియారా అడ్వాణీకి.. ఓకే బంగారం, ప్రేమమ్(మడోన్నా సెబాస్టియన్), 2.0 (అమీ జాక్సన్), నవాబ్ (ఐశ్వర్యా రాజేశ్), శ్యామ్ సింగరాయ్ (మడోన్నా సెబాస్టియన్) తదితర తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది ఈమెనే.ఇకపోతే 2023లో 'వాలాట్టి' అనే కుక్కల నేపథ్య కథతో తీసిన సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది. ఆ టైంలో ఈ చిత్ర దర్శకుడు దేవన్ జయకుమార్తో ప్రేమలో పడింది. ఈ ఏడాది మే నెలలో పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంది.(ఇదీ చదవండి: అలాంటి పాత్రలు చేయడం మానేశా.. కానీ రజనీకాంత్ కోసం) View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) -
ఫ్యామిలీ స్టార్స్
సూపర్ పవర్స్ లేని సూపర్ హీరో నాన్న. అయినా కుటుంబం కోసం సూపర్ కష్టాలను తట్టుకుని మరీ కుటుంబ సంక్షేమం కోసం తపన పడతాడు... ఒక్కోసారి తన ఇష్టాలను కూడా త్యాగం చేస్తాడు. బాధ్యతలనే ఇష్టంగా చేసుకుంటాడు. కుమారుడు, కుమార్తెల సంతోషమే తన ఆస్తిగా ఫీలవుతాడు. అందుకే ప్రతి కుటుంబానికి నాన్నే ఫ్యామిలీ స్టార్. ఇలా తండ్రి ఎమోషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే... ఫాదర్ ఎమోషన్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ జానర్లో మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నేడు (ఆదివారం) నేషనల్ పేరెంట్స్ డే. ఈ సందర్భంగా తండ్రి ఎమోషన్‌తో రానున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేయండి.గ్యాంగ్‌స్టర్ నాన్న కూతురు సంరక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ తండ్రి కథ వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషనే అని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట.కొన్ని సీన్స్‌లో చిరంజీవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలోని కొంత భాగం గోదావరి నేపథ్యంలో, మరికొంత భాగం కోల్‌కతా నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల పాత్రలో చిరంజీవి, మలయాళ నటి అనశ్వర రాజన్ నటిస్తున్నారని టాక్. నివేతా పేతురాజ్ మరో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి భార్యగా నివేతా పేతురాజ్ కనిపిస్తారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతి పండగకు రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో చిత్రయూనిట్ షూటింగ్ చేస్తోందని తెలిసింది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటు క్లాస్... అటు మాస్ సమాజంలో వారిది ‘ఆదర్శ కుటుంబం’. కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం, ఈ కుటుంబం పెద్ద అయిన తండ్రి గన్ పడతాడు? తన కుటుంబ సభ్యుల చేత ఫైట్ చేయిస్తాడు. ఈ మాస్ ఫాదర్ డీటైల్స్ ఏంటో తెలుసుకోవాలంటే అక్టోబరు 2 వరకు ఆగాల్సిందే. వెంకటేశ్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబరు 47’ (ఏకే 47). ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఫాదర్ రోల్ చేస్తున్నారు వెంకటేశ్. అలాగే వెంకటేశ్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. క్లాస్‌గా ఉంటూనే తన కుటుంబం ఆపదలో ఉందంటే మాత్రం ఫైర్ అయి పోయే మాస్ ఫాదర్ రోల్ చేస్తున్నారట వెంకటేశ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది. మరోవైపు వెంకటేశ్ హీరోగా నటించిన హిట్ ఫిల్మ్స్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలకు దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం.కూతురు కోసం... రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమాలో రవితేజ తండ్రి పాత్రలో నటించగా, ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్ నటించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది. ఏదో మానసిక బాధలో ఉన్న తండ్రిని మందు మానేయమని కూతురు రిక్వెస్ట్ చేయడం, కుమార్తె కోసం ఆ తండ్రి తనను తాను మార్చుకోవాలనుకోవడం, ఆ కుమార్తె రక్షణ కోసం తన ప్రాణాలనైనా లెక్క చేయని తండ్రి సాహసం... వంటి అంశాల నేపథ్యంలో ఈ ‘ఇరుముడి’ సినిమా కథనం సాగుతుందని టాక్. ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది. తండ్రి ఆదేశం తన తండ్రి లక్ష్యం కోసం రుద్ర ఓ సాహసోపేతమైన ప్రయాణం మొదలుపెట్టాడు. కాలానికి అతీతంగా ఖండాల మధ్య ప్రయాణం చేస్తున్నాడు. మరి... రుద్రకు అతని తండ్రి అప్పగించిన మిషన్ ఏంటి? తండ్రి కోసం రుద్ర ఏం చేశాడు? అన్న అంశాల నేపథ్యంలోనే ‘వారణాసి’ సినిమా కథనం రూపొందుతోందనే ప్రచారం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడు... ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంక చో్ర పా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్, అడ్వెంచరస్ అంశాలు ఉన్నప్పటికీ ‘వారణాసి’ ప్రధాన కథాంశం తండ్రీ కొడుకుల అనుబంధమే అని ఇటీవల పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు రాజమౌళి. దీంతో ‘వారణాసి’ సినిమా కథపై విభిన్న ప్రచారాలు తెరపైకి వచ్చాయి. పైన పేర్కొన్న కథాంశం కూడా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు...ఈ చిత్రంలో మహేశ్‌బాబు తండ్రిగా ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారని భోగట్టా. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు పాల్గొంటుండగా కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.ఓ తండ్రి... ఇద్దరు కొడుకులు ఓ తండ్రి తన ఇద్దరు కొడుకుల కోసం ఎలాంటి త్యాగం చేశాడు? ఈ ఇద్దరు కొడుకులకు, తండ్రికి మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? అనే అంశాల ఆధారంగా ‘రాకా’ సినిమా తెరకెక్కుతోందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ‘రాకా’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తండ్రి, ఇద్దరు కొడుకులు... ఇలా మూడు పాత్రల్లోనూ అల్లు అర్జున్ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ తండ్రీ కొడుకుల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయని సమాచారం. అంతే కాదండోయ్..‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్ చేస్తున్న మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో ఒక క్యారెక్టర్ విలన్ అని టాక్. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ‘రాకా’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మేజర్‌గా ఈ సెట్స్‌లోనే ఈ సినిమాను షూట్ చేస్తున్నారు అట్లీ అండ్ టీమ్. కాగా, ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో భాగంగా ఆస్ట్రియాలో ఉన్నారు అల్లు అర్జున్. ఈ వెకేషన్ పూర్తి కాగానే, ముంబై చేరుకుని ‘రాకా’ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ రిలీజ్ మాత్రం వచ్చే ఏడాది ఉంటుందట. ఎందుకంటే... ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించారు దర్శకుడు అట్లీ. అందుకోసం చాలా వీఎఫ్ఎక్స్ పనులు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే ‘రాకా’ సినిమా విడుదల వచ్చే ఏడాది ఉంటుంది. నటీమణులు దీపికా పదుకోన్, ఫెమినా జార్జ్, పంజాబీ నటి నైలా గ్రేవాల్ ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ సైతం ఈ సినిమాలో భాగమయ్యారని బాలీవుడ్ సమాచారం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తండ్రి హీరో... కొడుకు విలన్? ఏ తండ్రికైనా తన కొడుకే హీరో. కానీ ఓ తండ్రి పాలిట ఓ కొడుకు విలన్ అయ్యాడు. మరి... ఈ తండ్రీ కొడుకుల కహానీ ఏంటి? కొడుకు తనపై పెంచుకున్న ద్వేషాన్ని ప్రేమగా మార్చేందుకు ఓ తండ్రి ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు? అన్న అంశాలతో ‘టాక్సిక్’ సినిమా రూపొందుతోందని సమాచారం. యశ్ ద్వి పాత్రాభినయం చేసిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లిష్) చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అండ్ అప్స్’. గోవా నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రాయ, టాక్సిక్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు యశ్.‘టాక్సిక్’ కథనం తండ్రీ కొడుకుల ప్రతీకారం, అనుబంధం నేపథ్యంలో సాగుతుందని, 1940–1970 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యశ్ పేర్కొన్నారు. ఈ సినిమా ప్రధానాంశం తండ్రిపై కొడుకు ప్రతీకారమే అయినా, క్లైమాక్స్‌లో వీరిద్దరూ కలిసి మెయిన్ విలన్‌ను ఓ ఆటాడిస్తారట. మరి... ఈ సినిమా కథనం ఇలానే సాగుతుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం ఆగస్టు 26 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 8న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.ఇక ఈ చిత్రంలో గంగ పాత్రలో నయనతార, నాడియాగా కియారా అద్వానీ, రెబెక్కా రోల్లో తారా సుతారియా, మెలిస్సాగా రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో కలిసి ఈ సినిమాకు కథ అందించారు యశ్. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ సినిమాను నిర్మించారు. సంజయ్ విశ్వనాథ్ సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టైటిల్లోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఉండటం, ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య నటించారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్స్ కూడా ఈ చిత్రంలో సూర్య చేసినది ఫాదర్ రోల్ అని స్పష్టం చేస్తున్నాయి. మరి... సంజయ్ విశ్వనాథ్‌గా తండ్రి పాత్రలో సూర్య ఎలా నటించారు? ఈ పాత్ర చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ బాండింగ్స్ ఏంటి? అన్న అంశాలు తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించగా, హీరోయిన్గా మమితా బైజు నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు.⇒ కార్తీ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘ఖైదీ’ ఒకటి. ఈ సినిమాలో ఢిల్లీ పాత్రలో కార్తీ అద్భుతమైన నటన కనబరచారు. పదేళ్ల పాటు జైలు జీవితం గడిపి, తన కుమార్తె అముదను కలసుకునేందుకు ఢిల్లీ తిరిగి వస్తాడు. మరి... ఈ తండ్రీకూతుళ్ల కథ ఏంటి? ఢిల్లీ భార్యకు ఏం జరిగింది? డ్రగ్స్ మాఫియా నుంచి అముదకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఢిల్లీ ఏ విధంగా అడ్డుకుంటాడు? అన్న ఆసక్తికరమైన అంశాలను ‘ఖైదీ 2’ చిత్రంలో చూడాలి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఏఆర్ ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘ఖైదీ’ సినిమా సీక్వెల్ ‘ఖైదీ 2’ కూడా రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేసే పనిలో ఉన్నారు లోకేష్. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘ఖైదీ 2’ సినిమా చిత్రీకరణను షురూ చేస్తారు కార్తీ, లోకేష్.⇒ మదర్ సెంటిమెంట్‌తో ‘బిచ్చగాడు’ సినిమా తీసి, బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ ఆంటోనీ. తాజాగా ఆయన ఫాదర్ సెంటిమెంట్‌తో చేస్తున్న సినిమా ‘నాన్న కుట్టి’. ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, చిత్ర లక్ష్మణన్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ము. మారన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోనీ ఈ సినిమాను నిర్మిస్తుండగా, రామాంజనేయులు జవ్వాజీ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇలా తండ్రి భావోద్వేగాలతో కూడిన సినిమాలు మరికొన్ని ఉన్నాయి. అలాగే తల్లి ఎమోషన్‌తో కూడిన సినిమాలు కూడా ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
హీరో సూర్య పాడిన పెళ్లి పాట రిలీజ్
హీరో సూర్యకి తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఓ సినిమా చేశాడు. అదే 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వచ్చే నెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కొన్నాళ్ల క్రితం 'బటర్ ఫ్లై' పాట విడుదల చేయగా.. ఇప్పుడు సూర్య పాడిన పాటని వదిలారు.(ఇదీ చదవండి: 'విశ్వనాథ్ అండ్ సన్స్' తెలుగు సినిమా కాదు)'వెడ్డింగ్ సాంగ్' అంటూ సాగే ఈ పాట కలర్ఫుల్గా ఉంది. ఇందులో సూర్య 40 ఏళ్ల వ్యక్తిగా, మమిత బైజు 20 ఏళ్ల అమ్మాయిగా నటించారు. వీళ్లిద్దరూ ప్రేమలో పడితే ఏమైంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: 45 ఏళ్లకు తల్లయిన టాలీవుడ్ హీరోయిన్) -
ఇది తెలుగు సినిమా కాదు.. డబ్బింగ్ చేశామంతే
సూర్య స్వతహాగా తమిళ హీరోనే కానీ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో బోలెడంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అందుకు తగ్గట్లే దాదాపు ప్రతి మూవీ ఒకేసారి ఇక్కడ కూడా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ టైంలో అయితే 'కరుప్పు'ని 'వీరభద్రుడు' పేరుతో రిలీజ్ చేస్తే పర్లేదనిపించింది. వచ్చే నెలలో 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం గురించి దర్శకుడు వెంకీ అట్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ.. సూర్యతో చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచి అంతా ఇది.. ఈ హీరో తెలుగులో చేస్తున్న తొలి సినిమా అనుకున్నారు. కానీ స్ట్రెయిట్ తమిళ చిత్రం అని, తెలుగులో డబ్బింగ్ చేశామని స్వయంగా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతి బయటపెట్టాడు.'గతంలో ధనుష్‌తో 'వాతి'(సార్) సినిమా టైంలో ప్రయోగం చేయాలనుకున్నాం. ఓటీటీల కారణంగా ధనుష్‌కి తెలుగులో భారీగా అభిమానులు పెరిగారు. దీంతో ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాం. కానీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్టోరీ దృష్ట్యా ముందుగా తమిళంలో పూర్తిచేసి తర్వాత తెలుగులో డబ్బింగ్ చేశాం. సూర్యతో ముందుగా ఓ బయోపిక్ చేయాలనుకున్నాను. కానీ దానికి హక్కుల విషయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది. సూర్యతో సినిమా చేయాలనేది నా చిరకాల కోరిక. భవిష్యత్తులో ఆయనతో తప్పకుండా మరో సినిమా చేయాలనుంది' అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.40 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడటం అనే స్టోరీతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా తీశారు. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో సూర్య సరసన మమిత బైజు హీరోయిన్గా చేసింది. రాధిక, రవీనా టండన్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: రిలీజ్ రోజే 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?)#VishwanathAndSons is not a bilingual like #Vaathi. The film was shot in Tamil only and dubbed into Telugu.It made more sense to me as a director and my actors were comfortable.- #VenkyAtluri pic.twitter.com/oF0Q73eCbx— telugucinema.com (@thetelugucinema) July 24, 2026 -
బాజా మోగించి...
సూర్య హీరోగా నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమిత బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్ అనే పాత్రలో నటించారు సూర్య.గురువారం (జూలై 23) సూర్య బర్త్ డే. ఈ సందర్భంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లోని పెళ్లి పాట లిరికల్ వీడియో ప్రోమోను రిలీజ్ చేసి, ఈ పూర్తి పాటను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘ఆజా అన్నాడే... రాజా చిన్నోడే... బాజా మోగించి తాళి కట్టేస్తాడే..’ అన్న లిరిక్స్ ఈప్రోమోలో వినిపిస్తాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి యూరప్‌లో ఓ కీలక షెడ్యూల్ జరిగింది.యూరప్‌లో ఈ వెడ్డింగ్ సాంగ్‌ను చిత్రీకరించారని సమాచారం. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను హీరో సూర్య పాడటం విశేషం. ఇక తనకంటే వయసులో దాదాపు 20 సంవత్సరాలు పెద్దవాడైన హీరోను ఓ యంగ్ గర్ల్ ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. -
సూర్య మూవీతో నయనతార ఢీ.. బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందా?
లేడీ సూపర్‌స్టార్ నయనతార, కవిన్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ హాయ్. ఈ రొమాంటిక్ డ్రామాతో విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని వెల్లడించారు. ఈ మూవీని ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.సూర్యతో నయన్ ఢీ..అయితే అదే రోజున సూర్య హీరోగా వస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీకి వెంక అట్లూరి దర్శకత్వం వహించారు. దీంతో నయనతార.. సూర్య చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. హాయ్ మూవీ పోటీలోకి రావడంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తిగా మారింది. కాగా.. 'హాయ్' చిత్రాన్ని నయనతార, విఘ్నేష్ శివన్ తమ బ్యానర్ 'రౌడీ పిక్చర్స్, 'సెవెన్ స్క్రీన్ స్టూడియో', 'జీ స్టూడియోస్' భాగస్వామ్యంతో నిర్మించారు. ఈ చిత్రంలో భాగ్యరాజ్, రాధికా శరత్‌కుమార్, ప్రభు, విటివి గణేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించారు. -
బర్త్ డేకి టీజర్?
సూర్య హీరోగా ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సూర్య 47’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో నజ్రియా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు.కాగా, ఈ మూవీ చిత్రీకరణ పూర్తయిందని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 23న సూర్య బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, టీజర్‌ను రిలీజ్ చేయాలనే సన్నాహాల్లో ఉన్నారట. అంతేకాదు... వచ్చే పొంగల్‌కి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. -
సూర్యతో జక్కన్న మూవీ..! కోలీవుడ్ కి 1000 కోట్లు కన్ఫర్మ్
-
హీరో సూర్యతో రాజమౌళి కొత్త సినిమా?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి చిత్రం తర్వాత జక్కన్న ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. గతంలో రాజమౌళి తర్వాత చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఉండబోతుందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే దీనిపై అల్లు అర్జున్ నుంచి కానీ, రాజమౌళి టీం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే తాజాగా రాజమౌళి వారణాసి తర్వాత చిత్రం తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో ఉండబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. సినీ ఇండస్ట్రీలో కూడా సూర్యతో సినిమా చేయడానికి రాజమౌళి సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఇది ఒకటిగా నిలవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సూర్య-రాజమౌళి కాంబినేషన్‌పై ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. వీరి కాంబినేషన్లో సినిమా రానుందంటూ గతంలో కూడా పలు వార్తలు తెగ హల్చల్ చేశాయి. అప్పట్లో రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో హీరోగా ముందు సూర్య పేరును పరిశీలించినట్లు జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అనంతరం కూడా పలుమార్లు వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, అవి అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. సూర్యతో మూవీ చేసే అవకాశాన్ని తాను మిస్ అయ్యానని అప్పట్లోనే రాజమౌళి చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సూర్య తన 50వ సినిమా రాజమౌళి దర్శకత్వంలోనే ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో ఓ భారీ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దాంతో సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై రాజమౌళి నుంచి కానీ సూర్య నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది కరుప్పుతో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది. అనంతరం భారీ చిత్రాలు నిర్మించే హోంబలే ఫిల్మ్స్‌తో జతకట్టారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కు జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. -
సీఎం విజయ్‌లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ
నటుడు సూర్య స్టార్ హీరోగా రాణిస్తూ తన అగరం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈయన కూడా హీరో విజయ్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రిలా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలాన్నిచ్చేలా ఆదివారం చెన్నైలో జరిగిన సూర్య అఖిల ఇండియా అభిమానుల పరిరక్షణ సంఘం నిర్వహించిన రాష్ట్ర జిల్లా స్థాయి చర్చా సమావేశంలో ఆర్.వీరమణి.. నటుడు సూర్య రాజకీయ ప్రవేశం తథ్యం అని అన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్')సూర్య పొలిటికల్ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. దీంతో అఖిల భారత సూర్య అభిమానుల పరిరక్షణ సంఘం నిర్వహకులు స్పందించారు. ఆర్.వీరమణి చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని, నటుడు సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు.సూర్య కెరీర్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ లేదు. గత నెలలో విడుదలైన 'వీరభద్రుడు' మూవీ తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ తమిళంలో మాత్రం అద్భుతమైన హిట్ అయింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆగస్టులో 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో రాబోతున్న సూర్య.. మరోవైపు దర్శకుడు జీతూ మాధవన్ తీస్తున్న ఓ మూవీలో పోలీస్‌గా చేస్తున్నారు. నిన్ననే 'సలార్' నిర్మాతలతో కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్నప్పుడు ప్రాక్టికల్‌గా చూసుకున్న సూర్య.. రాజకీయాల్లోకి రావడం అనేది అసాధ్యం.(ఇదీ చదవండి: అంత్యక్రియల ప్రదేశాన్ని సర్కస్‌లా చేసేశారు.. రాధిక అసహనం) -
మరో హిట్ కాంబో.. ఈ సారి భారీ ప్రాజెక్ట్..!
ఈ ఏడాది కరుప్పుతో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది.అంతలోనే మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు కోలీవుడ్ స్టార్ హీరో. భారీ చిత్రాలు నిర్మించే హోంబలే ఫిల్మ్స్‌తో జతకట్టారు. ఈ సందర్భంగా సూర్యకు ఆహ్వానం పలుకుతూ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కు జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సూపర్ హిట్ కాంబో మరోసారి రిపీట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ చిత్రాన్ని పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమాలో సూర్య సరసన కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జూన్ 29న పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది. The next chapter... #SuriyaXHombaleHe built it.Frame by frame. Film by film. Fight by fight.Roles that bled truth.Characters that carried the weight of real lives.A journey defined by courage, conviction, and craft.Three decades of truth on screen.Countless hearts… pic.twitter.com/HoZOgQRbC7— Hombale Films (@hombalefilms) June 29, 2026 -
విశ్వనాథ్ అండ్ సన్స్.. సింగర్‌గా సూర్య!
కోలీవుడ్ హీరో సూర్య ఇటీవలే కరుప్పు మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది సమ్మర్లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ తర్వాత సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా బయటకొచ్చింది. ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను స్వయంగా సూర్యనే పాడారు. ఈ పాటకు కేవలం డ్యాన్స్ చేయడమే కాదు.. తన గొంతుతోనే అభిమానులను అలరించనున్నారు. కాగా.. ఈ పాటకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా... కెన్ కరుణాస్ లిరిక్స్ అందించారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సూర్య పాడిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలిపారు. ఇటీవలే రిలీజైన నేనో బటర్‌ఫ్లై పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. THE ONE @Suriya_offl sir sings a dance number for #vishwanathandsons …. Written by @KenKarunaas ….. A #Venkyatluri film … @SitharaEnts @vamsi84 …. ❤️❤️❤️😍😍😍 pic.twitter.com/jf7yTKZRI0— G.V.Prakash Kumar (@gvprakash) June 29, 2026 -
ఆ విషయంలో ఫెయిల్.. నాకు ముందే తెలుసు: కరుప్పు డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ కరుప్పు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ మూవీని వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మూవీలో సూర్య నటనపై ప్రశంసలు కురిపించారు.అయితే ఈ సినిమాలో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్, సీజీఐ షాట్స్ ఓటీటీలో నిరాశపరిచాయని పలువురు ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. వీటిపై దర్శకుడు ఆర్జే బాలాజీ స్పందించారు. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. విజువల్ ఎఫెక్ట్స్ సమస్య ఇప్పుడు వచ్చింది కాదు.. దీనిపై నేను చాలాసార్లు మాట్లాడానని అన్నారు. వీఎఫ్ఎక్స్లో లోపాలు ఉన్నమాట నిజమేనని అంగీకరించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ.. భవిష్యత్ ప్రాజెక్టులలో మెరుగైన ఫలితాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.వీఎఫ్ఎక్స్ గురించి వివరిస్తూ..' ఈ షాట్స్‌లో కొన్ని సన్నివేశాలు పూర్తి కావడానికి నెలల సమయం పడుతుంది. వాటి కోసం సీజీఐ కంపెనీలకు ముందస్తు చెల్లింపులు కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని చెల్లింపుల షెడ్యూళ్లను.. నిర్మాణ కాలపరిమితులను మా టీమ్ పాటించలేకపోయింది. అవే తుది ఫలితంపై ప్రభావం చూపాయి. 'సింగం' ఫైట్ సీక్వెన్స్ సీన్‌ను పూర్తి చేయడానికి మేము వీలైనన్ని తక్కువ షాట్లను ఉపయోగించాం. సినిమా ఓటీటీకి వచ్చాక ప్రేక్షకులు లోపాలను గమనిస్తారని మాకు ముందే తెలుసు ఓటీటీ విడుదల తర్వాత ప్రజలు ఎత్తి చూపినవి కొన్ని మాత్రమే. థియేటర్లలో చూసినట్లే ఓటీటీలో కూడా మమ్మల్ని ప్రశంసిస్తూ, సినిమాను ఆస్వాదిస్తున్నారు' అని అన్నారు.ఈ చిత్రాన్ని ప్రధానంగా థియేటర్లో అనుభూతి కోసమే రూపొందించామని ఆర్జే బాలాజీ తెలిపారు. మీరు ప్రేక్షకుల మధ్య థియేటర్లో చూసినప్పుడే వీఎఫ్ఎక్స్ అనుభవాన్ని చూస్తారని అన్నారు. కొన్ని చిన్న చిన్న తప్పులు ఉన్నాయి.. కానీ ఆ తప్పులను పట్టించుకోకపోవడం కూడా సినిమాలో ఒక భాగమేనని ఆయన అన్నారు. ప్రేక్షకులకు కంటే ముందే మా తప్పుల గురించి తెలుసని అన్నారు. ఓటీటీ రిలీజ్ తర్వాత ప్రేక్షకులు పోస్ట్ చేస్తున్న స్క్రీన్షాట్ల కంటే.. నేను అంతకంటే చాలా ఎక్కువ స్క్రీన్షాట్లు తీసుకున్నానని తెలిపారు. ఇది ఒక పొరపాటు.. మిమ్మల్ని నిరాశపరిచినందుకు ఓటీటీ ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతున్నా.. వచ్చేసారి మేము మరింత మెరుగ్గా చేస్తామని పేర్కొన్నారు. -
సూర్య-మమిత బైజు.. క్యూట్ సాంగ్ రిలీజ్
ఈ మధ్యే 'వీరభద్రుడు'తో చాన్నాళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. మరో రెండు నెలల్లో మరో సినిమాతో రాబోతున్నాడు. అదే 'విశ్వనాథ్ & సన్స్'. మమిత బైజు హీరోయిన్. సర్, లక్కీ భాస్కర్ చిత్రాల ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకుడు. ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ నుంచి తొలి పాటని తాజాగా రిలీజ్ చేశారు.'నేనో బటర్ ఫ్లై' అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్.. హీరోపై తన ప్రేమని చూపించుకునే సీన్స్ చూపించారు. సరే ఇవన్నీ పక్కనబెడితే 'వీరభద్రుడు' మాస్ మూవీ కాగా.. ఇదేమో క్లాస్ చిత్రం. మరి దీంతో ఎంతవరకు ఆకట్టుకుంటాడనేది చూడాలి? -
విజయ్ దర్శకుడితో సూర్య కొత్త సినిమా!
సూర్య మంచి జోరు మీద ఉన్నారని చెప్పవచ్చు. ఈయన ఇంతకుముందు నటించిన రెట్రో చి త్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆయన నటించిన కరుప్పు చిత్రం సంచలన విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆయన హీరోగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ప్రస్తుతం ఈయన మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో తన 47వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నజ్రియా నటిస్తున్నారు.తర్వాత టీజే.జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్.వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సూర్య రెడీ అవుతున్నట్లు సామాజక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన ఇటీవల జననాయకన్ చిత్రాన్ని చేశారు. తమిళనాడు సీఎం విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. దీంతో హెచ్.వినోద్ తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సూర్య హీరోగా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.అయితే ఆయన ఇటీవలే సొంత నిర్మాణ సంస్ధను ప్రారంభించి తన శిష్యుల్లో ఒకరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆయన దర్శకత్వంలో సూర్య హీరోగా చిత్రం ఉంటుందని ఈ చిత్రానికి కథా చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సూర్య నటించే 49వ చిత్రం అవుతుంది. ఈ రేర్ కాంబో షురూ అయితే చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమానార్హం. -
థియేటర్లలో పెద్ది.. ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల మార్క్‌కు దగ్గరకు చేరుకుంది. ఈ వారం కూడా పెద్ది హవానే కొనసాగుతోంది. ఈ ఫ్రైడే రోజు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఓటీటీకి వచ్చేస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ మూవీ భూత్ బంగ్లా స్ట్రీమింగ్కు రానుంది. వీటితో పాటు తెలుగులో ష్ అనే తెలుగు వెబ్ సిరీస్ ఆసక్తి పెంచుతోంది. అంతేకాకుండా పలు టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (జూన్ 8 నుంచి 14 వరకు)నెట్ఫ్లిక్స్కలర్స్ ఆఫ్ ఈవిల్ - బ్లాక్ (మూవీ) - జూన్ 10మై ఫ్యామిలీ సీజన్2 (వెబ్‌సిరీస్) - జూన్ 10స్వీట్ మగ్నోలియాస్ -సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 11ది ఈవిల్ లాయర్ (వెబ్‌సిరీస్) - జూన్ 11భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12అమెజాన్ ప్రైమ్ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10ద రెస్ట్ ఈజ్ ఫుట్‌బాల్ (డాక్యుమెంటరీ మూవీ) - జూన్ 10రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12జియో హాట్స్టార్ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12ఆహాష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12జీ5మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12లయన్స్ గేట్ ప్లేషెల్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 12ఆపిల్ టీవీ ప్లస్క్రిమినల్ రికార్డ్ (వెబ్‌సిరీస్) - జూన్ 10 -
ఓటీటీకి సూర్య హిట్ సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్..!
సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్గా త్రిష కనిపించింది. ఆర్థిక సమస్యలతో ఒక రోజు ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12 నుంచో ఓటీటీ ప్రియులను అలరించనుంది. రిలీజైన నెల రోజుల్లోపే స్టార్ హీరో మూవీ ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.కరుప్పు కథేంటంటే..మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు.ఈ కేసునే టేకాప్ చేసిన లాయర్ బేబీ కృష్ణ(ఆర్.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ. god mode ON 🔥 #KaruppuOnPrime, June 12@Suriya_offl @RJ_Balaji @SaiAbhyankkar @dop_gkvishnu @trishtrashers @prabhu_sr #Indrans @natty_nataraj #Swasika @SshivadaOffcl #SupreethReddy #AnaghaMayaRavi #VikramMor @kalaivananoffl #ArunVenjaramoodu @PraveenRaja_Off @ZeeTamil… pic.twitter.com/VeKFZ4qViA— prime video IN (@PrimeVideoIN) June 8, 2026 -
సూర్య.. 5 రూపాయల డాక్టర్?
ఎన్నాళ్ల నుంచో థియేటర్లలో సరైన హిట్ లేక సతమతమైన సూర్యకు.. 'కరుప్పు' సినిమా కడుపు నింపేసింది. కళ్లు చెదిరే కలెక్షన్స్ సాధిస్తున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ ఆనందంలోనే సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్లకు రూ.30 లక్షలు విలువ చేసే తలో కారుని సూర్య ఇచ్చాడు. మరోవైపు కొత్త మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. ఇదలా ఉండగానే సూర్య చేయబోయే కొత్త ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)గతంలో సూర్యని ప్రధాన పాత్రలో పెట్టి 'జై భీమ్' అనే సినిమా తీసిన టీజే జ్ఞానవేల్.. ఇప్పుడు మరోసారి ఇదే హీరోతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాడట. ఈసారి కూడా నిజ జీవితం ఆధారంగానే మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన డాక్టర్ తిరువేంగడం.. రూ.5 డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పేదల వైద్యుడిగా పేరు పొందిన ఈయన.. తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ నుంచి రూ.2 లేదా రూ.5 మాత్రమే తీసుకునేవారు.ఛాతీ వైద్యుడిగా చాలా పేరు తెచ్చుకున్న ఈయనకు అద్భుతమైన జ్ఞానం ఉండేసరికి అందరూ ఈయన్ని నడిచే ఎన్సైక్లోపిడియా అని పిలిచేవారు. ఈయన్ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతోనూ గౌరవించింది. ఈ డాక్టర్ జీవితం ఆధారంగానే సూర్య-జ్ఞానవేల్ కొత్త మూవీ చేయబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: రూ.300 కోట్ల కలెక్షన్.. కార్లు గిఫ్ట్ ఇస్తున్న సూర్య)(ఇదీ చదవండి: 'కేజీఎఫ్' యష్ దంపతుల రూ.24 కోట్ల డీల్) -
300 కోట్ల క్లబ్ లో కరుప్పు
-
రూ.300 కోట్ల కలెక్షన్.. కార్లు గిఫ్ట్ ఇస్తున్న సూర్య
సక్సెస్ ఉన్నడినే అందరూ గుర్తుపెట్టుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని కోరుకుంటారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఉంటేనే మార్కెట్ బాగుంటుంది. సినిమాలకు కలెక్షన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు అలా చాలా ఏళ్ల తర్వాత 'కరుప్పు' మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో హీరో సూర్య ఆనందం పట్టలేకపోతున్నాడు. చిత్ర యూనిట్‌కి కార్లని బహుమతిగా ఇస్తున్నాడు.(ఇదీ చదవండి: అప్పుడు ‘పెద్ది’ నుంచి తప్పుకోవాలనుకున్నా : శివరాజ్‌కుమార్)సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'కరుప్పు'. తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో రిలీజ్ చేశారు. మన దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది గానీ పర్లేదనిపించే కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం జనం ఎగబడి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.300 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. చాన్నాళ్ల తర్వాత ఈ మూవీతో సూర్యకు హిట్ దక్కింది.ఇకపోతే ఈ సినిమాలో తనని అద్భుతంగా చూపించినందుగానూ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణుకి మహీంద్ర బీ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారుని సూర్య బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని విష్ణు తన ఇన్ స్టాలో వెల్లడించాడు. ఈ కారు ఖరీదు రూ.30-40 లక్షల ఉంటుంది. ఇతడితో పాటు సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ కి కూడా ఇదే మోడల్ కారు ఇచ్చాడు. ఆ విషయాన్ని సాయి తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. చూస్తుంటే సూర్య.. టీమ్ అందరికీ ఒకేలాంటి కార్లు గిఫ్ట్స్ ఇస్తున్నట్లున్నాడు.(ఇదీ చదవండి: 'నీకు నేను చాలా కృతజ్ఞుడిని'.. శోభితకు చైతూ స్పెషల్ విషెస్) -
చాన్నాళ్లకు హిట్.. ఇప్పుడు మరొకటి రెడీ
తమిళ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి ఏళ్లు గడిచిపోయింది. అయితే ఈ నెల రెండో వారం వచ్చిన 'కరుప్పు'(తెలుగు 'వీరభద్రుడు') ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఇది థియేటర్లలో ఆడుతోంది. ఇంతలోనే మరో మూవీ రిలీజ్ డేట్ ని సూర్య ప్రకటించేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)సర్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆకట్టుకున్న తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి.. సూర్యతో తీసిన మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమిత బైజు హీరోయిన్. సాఫ్ట్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. 40 ఏళ్లు దాటేసిన ఓ వ్యక్తి.. 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడితే అనేది కాన్సెప్ట్. లెక్క ప్రకారం జూలైలోనే తీసుకురావొచ్చని అనుకున్నారు. కానీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ తో ప్రకటించారు.'కరుప్పు'తో సక్సెస్ అందుకున్న సూర్య.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడనేది చూడాలి. ఇందులో రాధిక, రవీనా టండన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీత దర్శకుడు.(ఇదీ చదవండి: ఈ గుండెని తాకిపో తాతా: తారక్ ఎమోషనల్ పోస్ట్) -
త్రిష నలుపు దుస్తులు ధరిస్తే హిట్ పక్కా..ఇదిగో సాక్ష్యం!
గత కొద్ది కాలంగా చర్చనీయాంశంగా మారిన నటి త్రిష. ఒక పక్క ఈ బ్యూటీ తమిళంలో అజిత్ కు జంటగా నటించిన విడాముయర్చి, కమలహాసన్‌తో కలిసి నటించిన థక్ లైఫ్ చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ అపజయం పాలవడం, ఆ తరువాత నటుడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి ట్రోలింగ్‌లకు గురవడం వంటి విషయాలతో చాలా తలనొప్పికి గురైన త్రిష, ఎప్పుడైతే విజయ్ ఎన్నికల్లో గెలవడంతో పాటు పార్టీని ఒంటి చేతితో గెలిపించుకుని ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి త్రిష ఆనందంతో తుళ్లి పడుతున్నారనే చెప్పాలి. అదేవిధంగా నటి మంచి విజయాన్ని చూసి చాలా కాలం కావడంతో విచారంలో ఉన్న త్రిషకు కరుప్పు చిత్రం రూపంలో మంచి విజయం వరించింది. దీంతో ఈ బ్యూటీ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఇకపోతే ఆమె తన అభిమాని వల్ల ఇంకా సంతోషానికి లోనవుతున్నారప్పుడు. సూర్య, త్రిష జంటగా నటించిన కరుప్పు చిత్రం గత 15వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దీంతో సూర్య అభిమానుల ఆనందం గురించి పక్కన పెడితే త్రిష అభిమానులు తెగ సంబర పడుతున్నాయి. ఆమె అభిమాని ఒకరు త్రిషతో విజయ్ నటించిన ఢిల్లీ, అజిత్ నటించిన మంగాత్తా, సూర్య నటించిన ఆరు చిత్రాలు ఈ ముగ్గురు హీరోలకు చాలా మైలు రాయిగా నిలిచారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ మూడు చిత్రాల్లోనూ త్రిష నలుపు దుస్తులు ధరించారని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందుకేనేమో ఆ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించి ఉంటాయన్నారు. అందువల్ల త్రిషను కరుప్పు స్టార్ ( బ్లాక్ స్టార్) అని పిలవవచ్చు అని ఆ అభిమాని చేసి పోస్ట్ త్రిష వరకు చేరింది. ఆయన పోస్ట్‌ను చూసి న త్రిష ఎంతగానో సంతోషపడి ఇది చాలా అందంగా ఉంటుంది. ధన్యవాదా లు అని పేర్కొని చిరునవ్వుతో కూడిన పలు ఎమోజీలను ఎక్స్ మీడి యాలో పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
డబ్బింగ్‌లకు డబ్బులు.. తెలుగు సినిమాలకు నిల్.. ఎందుకిలా?
సూర్య 'కరుప్పు'(తెలుగులో వీరభద్రుడు) బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. తమిళ, తెలుగులో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. మరోవైపు మోహన్ లాల్ 'దృశ్యం 3' ఎలాంటి ప్రచారం లేకుండానే మన థియేటర్లలోకి వచ్చి మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. అయితే ఈ రెండింటికి తెలుగులో ఏమంత గొప్ప టాక్ రాలేదు. కానీ ఆ ప్రభావం కలెక్షన్స్‌పై అస్సలు పడినట్లు కనిపించడం లేదు. అదే టైంలో వీటితో పాటు రిలీజైన తెలుగు మూవీస్‌ని ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకీ పరిస్థితి?(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్)టాలీవుడ్ బాక్సాఫీస్‌కి సంక్రాంతి ఎంత ముఖ్యమో అంతకు మించి వేసవిలో సందడి ఉంటుంది. కానీ ఈ సమ్మర్‌ని తెలుగు దర్శకనిర్మాతలు హీరోలు వృథాగా వదిలేశారు. చెప్పుకోదగ్గ ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేదు. దీంతో థియేటర్లన్నీ బోసిపోయాయి. ఎండలు, ఐపీఎల్ వల్ల జనాలు థియేటర్లకు రావట్లేదని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు గానీ అసలు కారణం ఇది కాదు. ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే కంటెంట్‌తో ఒక్కరూ మూవీస్ చేయట్లేదు. రొటీన్ రొట్టకొట్టుడు కంటెంట్ వల్ల చిన్న, మిడ్ రేంజ్ మూవీస్ వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోతున్నాయి.అలా స్టార్స్ సినిమాల కోసం ముఖం వాచిపోయిన తెలుగు ప్రేక్షకులకు.. సూర్య, మోహన్ లాల్ మూవీస్ మండవేసవిలో కూలింగ్ వాటర్లా కనిపించాయి. అంత ఎండలో వాటర్ బాగోలేదని చెప్పినా ఎవరూ పట్టించుకోరు. అలానే ఈ రెండు చిత్రాలు ఏమంత పెద్దగా గొప్పగా లేవు అని ఆడియెన్స్‌కి తెలిసినా సరే చూసేద్దాంలే అని వెళ్తున్నారు. సూర్య చిత్రానికి బీ,సీ సెంటర్లలో రెండో వారం కూడా ఆదరణ లభిస్తుండగా.. మోహన్ లాల్ చిత్రం మల్టీప్లెక్స్‌ల్లో జోరు చూపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోలేకపోయిన తెలుగు దర్శకనిర్మాతలు పదుల కోట్ల రూపాయల వసూళ్లని చేజేతులా వదిలేసుకున్నారు.ఉన్నంతలో తెలుగు ఆడియెన్స్ కోసం వేసవి చివరలో వస్తున్న పెద్ద సినిమా 'పెద్ది'నే. ప్రస్తుతానికైతే దీనిపై బజ్ బాగానే ఉంది కానీ ఇండస్ట్రీలో పరిస్థితులే బాగోలేవు. ఈ మూవీకి కచ్చితంగా పర్సంటేజీ ఇచ్చి తీరాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా తగ్గడం లేదు. దీనికి పరిష్కారం ఎప్పుడు దొరుకుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇలా టాలీవుడ్‌లోని అంతర్గత సమస్యలు కూడా డబ్బింగ్‌లకు ఓ రకంగా ప్లస్ అవుతున్నాయి. మరి ఈ విషయం తెలుగు హీరోలు దర్శకులు నిర్మాతలకు ఎప్పుడు అర్థమవుతుందో?(ఇదీ చదవండి: ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం) -
స్టార్ హీరోలకు అచ్చొచ్చిన త్రిష.. వాళ్లందరికీ లక్కీ ఛార్మ్!
హీరోయిన్ త్రిషకు 43 ఏళ్ల వయసొచ్చినా అందం, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. తాజాగా కరుప్పుతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే కొంతకాలంగా త్రిష పేరు అటు రాజకీయాల్లో, ఇటు ఫిల్మీదునియాలో మారుమోగిపోతోంది. హీరో విజయ్- త్రిష ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది.లక్కీ చార్మ్ఇటీవల విజయ్ భార్యతో విడాకులకు సిద్ధపడటం.. సీఎంగా గెలిచాక త్రిషతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ ప్రేమాయణం నిజమని అందరికీ అర్థమైపోయింది. పైగా తను కూడా రాజకీయాల్లో అడుగుపెడుతుందని మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తమిళ స్టార్ హీరోలకు త్రిష బాగా అచ్చొచ్చిందట. అందుకు కారణం.. విజయ్, అజిత్, సూర్యల కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తనే హీరోయిన్. ఈ ఆసక్తికర విషయాన్ని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తిరిగి పంచుకుంది.విజయ్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. 2023లో దసరాకి ముందు విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.600 కోట్లకు పైగా రాబట్టి విజయ్ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డుకెక్కింది.అజిత్: హీరో అజిత్ 'గుడ్బ్యాడ్ అగ్లీ' ద్వారా తన కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. 2025లో విడుదలైన ఈ సినిమాలోనూ త్రిషయే కథానాయిక. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.సూర్య: కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'కరుప్పు'. ఈ ఏడాది మే 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులోనూ త్రిషయే కథానాయిక. అలా త్రిష నటించిన పై మూడు సినిమాలు భారీ కలెక్షన్ల రికార్డులతో ఆయా హీరోల కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. దీంతో ఆమెను లక్కీ ఛార్మ్ అని కొనియాడుతున్నారు.చదవండి: 30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్ రీఎంట్రీ -
రెండేళ్ల కిందటే గ్రీన్ సిగ్నల్.. సూర్య కెరీర్లోనే అత్యధికం!
సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కరుప్పు (తెలుగులో వీరభద్రుడిగా విడుదలైంది). త్రిష హీరోయిన్గా నటించిన ఇందులో ఆర్జే.బాలాజీ ప్రతినాయకుడిగా నటించడంతో పాటు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. న్యాయస్థానం, అవినీతికి పాల్పడే న్యాయవాదులు, న్యాయం కోసం బాధితులు పడే అవస్థలు, గ్రామ దేవతలు ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు చాలా ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంది. అంతేకాదు ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే మూవీ రిలీజయ్యాక ఫస్ట్ షో నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకుంది.సూర్య కెరీర్లోనే అత్యధికంమే 15న తెరపైకి వచ్చిన కరుప్పు చిత్రం వారం దాటినా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మైలురాయిని చేరుకుంది. అలాగే సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది. సూర్య శనివారం ఈ చిత్ర విజయానందాన్ని మీడియాతో పంచుకున్నారు. రెండేళ్ల క్రితం అరగంట, ముప్పావు గంటలో తీసుకున్న నిర్ణయం ఈ చిత్రం. దర్శకుడు ఆర్జే.బాలాజీ విజన్యే ఈ సినిమా. ఇటీవలి కాలంలో జనం నుంచి ఇంత స్పందన చూడలేదు. రాజీ పడలేదుప్రతి చిత్రానికి ఏదో ఒక విమర్శ వస్తుంటుంది. అయితే ఈ చిత్రానికి అంతటా ప్రేమ మాత్రమే లభించడంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిర్మాతలు ఎస్ఆర్.ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. పిల్లల నుంచి పెద్దలు వరకూ చూసి ఆనందించడంతో థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండటం ఆనందంగా ఉంది అన్నారు. #Karuppu MEGA BLOCKBUSTER 🔥🔥🔥🔥 @Suriya_offl ❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/CeTOaOdawY— RJ Balaji (@RJ_Balaji) May 21, 2026 చదవండి: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్ -
సూర్య కరుప్పు.. విమర్శలకు జ్యోతిక కౌంటర్..!
కోలీవుడ్ హీరో సూర్య లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కరుప్పు. గత వారంలో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాదనిపిస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్ దాటేసింది.అయితే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై కొంత మిశ్రమ స్పందన వస్తోంది. ఈ మూవీ కమల్‌హాసన్ విక్రమ్‌తో పోలుస్తున్నారు. కరుప్పు మూవీకి వస్తున్న మిక్స్డ్ రెస్పాన్స్‌పై సూర్య సతీమణి జ్యోతిక స్పందించింది. ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కాదని.. సృజనాత్మక కోణంలోనే చూడాలని సూచించింది. ఈ సినిమాకంటూ ఒక ఆత్మ ఉందని అన్నారు. సూర్య కెరీర్లో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం కాకపోయినా.. ప్రేక్షకులు ఎదురుచూస్తున్న దాన్ని ఈ సినిమా అందించిందని తెలిపింది.జ్యోతిక మాట్లాడుతూ.." కరుప్పు చూసి మేము చాలా ఉద్వేగానికి లోనయ్యాము. సూర్య మంచి కథలనే ఇష్టపడతాడు. అతను ప్రతి సినిమాలో ఒక కథ ఉండేలా చూసుకుంటాడు. కానీ హీరోలకు బాక్సాఫీస్ వసూళ్లు కూడా అవసరమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఎవరూ నష్టపోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మంచి వసూళ్లు సాధించడం చాలా ముఖ్యం. ఇది కేవలం కమర్షియల్ లాభాల కోసం తీసినది కాదు. దానికంటూ ఒక ఆత్మ ఉంది. సామాన్య ప్రజలు చూసేలా విభిన్నంగా రూపొందించారు. కానీ సినిమా చివరి పది నిమిషాల్లో సూర్య అద్భుతంగా నటించారు' అని అన్నారు. -
సూర్య కరుప్పు.. వారం రోజుల్లోనే అరుదైన మార్క్..!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ తొలి మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ అరుదైన ఫీట్ సాధించింది. రిలీజైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల మార్క్ అధిగమించింది. ఇండియా వ్యాప్తంగా ఏడో రోజు రూ. 8.30 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. దీంతో మనదేశంలో రూ. 114.05 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ వసూళ్లను చూస్తే దేశవ్యాప్తంగా రూ. 132.05 కోట్లు.. ఓవర్సీస్లో రూ. 57 కోట్లు కలెక్ట్ చేసింది.ఓవరాల్‌గా చూస్తే ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 207 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా తమిళ వర్షన్లో అత్యధిక వసూళ్లు రాబడుతోంది. కేవలం తమిళ వెర్షన్ మాత్రమే ఏడో రోజు రూ. 7 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, శివాడ, యోగి బాబు, స్వాసిక కీలక పాత్రల్లో నటించారు. -
భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న సూర్య వీరభద్రుడు
-
ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన ‘కరుప్పు’ టీమ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కరుప్పు(తెలుగులో వీరభద్రుడు) చిత్ర బృందం క్షమాపణలు చెప్పింది. ఆయనను అగౌరపరచడం తమ ఉద్దేశం కాదని.. సినిమాలో ఉన్న డైలాగలను వెంటనే తొలగిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.అసలేం జరిగింది?సూర్య, త్రిష జంటగా నటించిన తాజా చిత్రం కరుప్పు. ఆర్.జే. బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమాలో ఇళయారాజాపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా కొన్ని డైలాగులు ఉన్నాయి. కొన్ని చోట్ల అసందర్భంగానూ ఇళయరాజాపై డైలాగులు పెట్టారు. అవి ఆయన గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇళయరాజా కూడా ఆ డైలాగులపై అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కొంతమంది ఇళయరాజా అభిమానులు సినిమాను ట్రోల్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదం పెద్దది కాకముందే ముగింపు పలికారు చిత్రబృందం. ఇళయరాజాను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది.ఈ రోజు నుంచే మార్పు..ఇళయరాజా అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. సినీ రంగం కోసం ఆయన చేస్తున్న సేవలు ఎన్నోతరాల్లో స్ఫూర్తి నింపుతున్నాయి. కరుప్పులో ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగు వల్ల ఆయన బాధ పడ్డారని మా దృష్టికి వచ్చింది. ఇళయరాజాను మేము క్షమాపణలు కోరుతున్నాం. ఆయన మనోభావాలను దెబ్బతీయడం, అగౌరవపర్చడం మా ఉద్దేశం కాదు. ఈ చిత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగులను తొలగిస్తున్నాం. ఈరోజు నుంచి ఈ మార్పు చేస్తున్నాం. ఆయన గౌరవమే మాకు ప్రధానం’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. -
సూర్య కరుప్పు.. మూడు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు. ఈ మూవీని తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఆర్జే బాలాజీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. మొదటి రోజే ఆర్థిక సమస్యలు రావడంతో ఒక్క రోజు ఆలస్యంగా థియేటర్లో రిలీజైంది. గురువారమే విడుదల కావాల్సి ఉండగా.. శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది.ఈ చిత్రం రిలీజైన మూడు రోజుల్లోనే సెంచరీ మార్క్ కొట్టేసింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. భారతదేశ వ్యాప్తంగా చూస్తే రూ. 68 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా వసూళ్లు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా రూ. 78.75 కోట్ల గ్రాస్ రాబట్టగా.. ఓవర్సీస్లో రూ. 42 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఆదివారం ఒక్కరోజే రూ. 28.35 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.కాగా.. ఈ చిత్రంలో, సూర్య.. శరవణన్ అనే లాయర్ పాత్రను పోషించారు. దోపిడీకి గురై, అవినీతిమయమైన న్యాయ వ్యవస్థలో చిక్కుకున్న తండ్రీకూతుళ్ల కథగా ఈ మూవీని తెరకెక్కించారు. -
సూర్యకు భారీ పారితోషికం.. త్రిషకు మాత్రం ఇదే చివరిసారి!
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "కరుప్పు". తెలుగులో ఈ మూవీ 'వీరభద్రుడు' పేరిట విడుదలైంది. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒకరోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. దీన్ని ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు. సినిమా పాజిటివ్ టాక్ అందుకుంటున్న నేపథ్యంలో ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారో చూసేద్దాం...పారితోషికంకోలీవుడ్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం హీరో సూర్య రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట! త్రిష రూ.5 కోట్లు, ఆర్జే బాలాజీ రూ.4 కోట్లు పుచ్చుకోగా కమెడియన్ యోగిబాబు రూ.2 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. నటుడు ఇంద్రన్స్ రూ.80 లక్షలు అందుకున్నాడని సమాచారం. స్వసికకు రూ.40 లక్షలు, జార్జ్ మరియన్‌కు రూ.30 లక్షలు ముట్టజెప్పారని భోగట్టా!తర్వాతి నుంచి..ప్రస్తుతం రూ.5 కోట్లతో సరిపెట్టుకున్న త్రిష తన తర్వాతి సినిమాకు మాత్రం పారితోషికం రెట్టింపు చేసిందని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్- రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేసేందుకుగానూ ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్ చేసినట్లు వినికిడి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ బ్యూటీని సినిమాలో పెట్టుకునేందుకు అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సైతం రెడీ అంటున్నారట! ఈ లెక్కన త్రిష తక్కువ పారితోషికం తీసుకున్న చివరి తమిళ సినిమాగా 'వీరభద్రుడు' మిగిలిపోనుందన్నమాట!చదవండి: వీరభద్రుడు మూవీ రివ్యూ -
‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: వీరభద్రుడునటీనటులు: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, ఆర్.జే బాలాజీ తదితరులునిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభురచన & దర్శకత్వం: ఆర్.జే బాలాజీసినిమాటోగ్రఫీ : జికె విష్ణుసంగీతం : సాయి అభ్యంకర్ఎడిటర్ : ఆర్.కళైవానన్విడుదల తేది: మే 15, 2026సూర్య ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇప్పుడు ఆయన ఆశలన్నీ కరుప్పు పైనే పెట్టుకున్నాడు. తెలుగులో ‘వీరభద్రుడు’పేరుతో నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు. ఈ కేసునే టేకాప్ చేసిన లాయర్ బేబీ కృష్ణ(ఆర్.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే..ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ఒక కేసుని పరిష్కరించడానికి నెలల సమయం పడుతుంది. డబ్బులు ఉన్నవాడికే ‘న్యాయం’ జరుగుతున్న రోజులివి. సామాన్యుడు న్యాయం కోసం కోర్టుని ఆశ్రయిస్తే.. ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదు. అప్పటికీ సరైన న్యాయం జరుగుతుందా అంటే అనుమానమే. అవినీతి కంపులో న్యాయ వ్యవస్థ మునిగిపోయిందనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. చివరకు ఆ దేవుడే దిగివచ్చినా.. ప్రస్తుత న్యాయవ్యవస్థను బాగు చేయలేడు అనేది వినోదాత్మకంగా ‘వీరభద్రుడు’ సినిమాలో చెప్పాడు దర్శకుడు ఆర్.జే బాలాజీ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. కోర్టులో జరుగుతున్న అవినీతిని, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. కానీ సూర్య స్థాయి లాంటి హీరోని పక్కన పెట్టి.. ఆర్.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్రను హైలెట్ చేయడమే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా మొదలైన అరగంట వరకు సూర్య తెరపై కనిపించడు. సూర్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆర్జే బాలజీ పాత్రకే మంచి సన్నివేశాలు ఉంటాయి. అయితే క్లైమాక్స్‌లో మాత్రం వీరభద్రుడు(సూర్య) తాండవం అదిరిపోతుంది. మీను పాత్రతో పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. నగలు అమ్మి చికిత్స చేసుకోవాలని నగరానికి వచ్చిన తండ్రి కూతుళ్లపై దొంగలు దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లడం.. కేసు పెట్టి, కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అయినప్పటికీ సూర్య ఎంట్రీ లేకపోవడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక వీరభద్రుడు ఆగమనం తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. కోర్టు డ్రామా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో ఫాంటసీ ఎలిమెంట్స్ ఆకట్టుకోకపోగా..చిరాకుగా అనిపిస్తుంది. న్యాయం కోసం దేవుడు చేసే పనులు సిల్లీగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ఎమోషన్ మీద దృష్టిపెట్టిన దర్శకుడు..ద్వితియార్థంలో మాత్రం మాస్ ఎలిమెంట్స్‌పైనే ఫోకస్ పెట్టాడు. సూర్యతో వచ్చే యాక్షన్ సన్నివేశాలు.. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కథనం కూడా అక్కడక్కకే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో వీరభద్రుడు తాండవం ఆకట్టుకుంటుంది. తమిళ వాసనలు ఎక్కువగా ఉండడం.. సూర్య పాత్ర నిడివి తక్కువగా ఉండడం ఈ సినిమాకు మైనస్. ఎవరెలా చేశారంటే.. వీరభద్రుడు పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. సామాన్య మనిషిగా, దేవుడిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించి..తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్‌లో వీరభద్రుడు తాండవం అదిరిపోతుంది. లాయర్ ప్రీతిగా త్రిష చక్కగా నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సెకండాఫ్‌లో మాత్రం ఒకటి రెండు మంచి సీన్లు పడ్డాయి. ఇక దర్శకుడు ఆర్.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో బాలాజీ ఒదిగిపోయాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సాయి అభ్యంకర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు అంతగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ వీఎఫ్ఎక్స్ పనితీరు తేలిపోయింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
కరుప్పు మూవీ.. పూనకంతో ఊగిపోయిన డైరెక్టర్..!
సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గురువారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఆర్థికపరమైన సమస్యలతో ఓ రోజు ఆలస్యంగా తెరపైకొచ్చింది. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్గా త్రిష కనిపించింది.ఇవాళ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆర్జే బాలాజీ సైతం థియేటర్లో వీక్షించారు. దీంతో సినిమాను చూసి పూనకంతో ఊగిపోయారు. టాలీవుడ్ హీరో నాని నటించిన జెర్సీ మూవీ సీన్ రీ క్రియేట్ చేశారు. ట్రైన్ సీన్లో నానిలానే బిగ్గరగా అరుస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #RJBalaji - HUGGED TRISHA AFTER A BLOCKBUSTER RESPONSE - Of #Karuppu Film 🔥🔥🔥🔥This Man Deserves this SUCCESS.pic.twitter.com/LmeMv8q3Fv— GetsCinema (@GetsCinema) May 15, 2026 -
కరుప్పు మూవీ వాయిదా.. ఆందోళనకు దిగిన ఫ్యాన్స్
తమ అభిమాన హీరో సినిమా కోసం ఫ్యాన్స్ అంతా సిద్ధమయ్యారు. ఈ రిలీజ్ అనగానే ఉదయం 9 గంటలకే థియేటర్లకు చేరుకున్నారు. తీరా అక్కడికెళ్లాక అభిమానులు షాక్ తిన్నారు. ఈ రోజు సినిమా విడుదల లేదని థియేటర్ యాజమాన్యాల చెతులేత్తేశాయి. దీంతో తమ హీరో మూవీని చూడాలని వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇదంతా సూర్య హీరోగా వచ్చిన కరుప్పు మూవీ గురించే. ఇవాళ రిలీజ్ కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది.దీంతో ఒక్కసారిగా సూర్య అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. మొదటి షోలు రద్దు కావడంతో పుదుచ్చేరిలోని సూర్య అభిమానులు థియేటర్ల బయట నిరసనలు చేపట్టారు. తమ అభిమాన నటుడి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన టీ-షర్టులు,, టపాసులు, డోలు వాయిద్యాలు, పూల దండలు, పాలతో సిద్ధమైన ఫ్యాన్స్ సినిమా హాళ్ల బయట వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు. నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఫైనాన్స్ సమస్యలతో ఈ సినిమాను అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌కు చెల్లించాల్సిన రూ. 50 కోట్లకు పైగా బకాయిలు సమస్యల కారణంగా విడుదల కాలేదు. దీంతో ఈ చిత్రం మే 15న థియేటర్లలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. కరుప్పు చిత్రంలో యోగి బాబు, జాఫర్ సాదిక్, మన్సూర్ అలీ ఖాన్, ఇంద్రన్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సాయి అభ్యంక్కర్ సంగీతం అందించారు. View this post on Instagram A post shared by MUBARAK🇮🇳 (@mubaraksvlog) -
చిక్కుల్లో సూర్య సినిమా.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు బిగ్ షాక్ తగిలింది. ఆయన నటించిన తాజా చిత్రం కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) నేడు(మే 14) ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా... అనూహ్యంగా మార్నింగ్ షోలు రద్దయ్యాయి. అంతేకాదు ఆమెరికా షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. మార్నింగ్ షోలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి అనుమతి వచ్చినా కూడా ఎందుకు రిలీజ్ కాలేదు? అసలు సమస్య ఏంటి? వివరాల్లోకి వెళితే..సూర్య,త్రిష జంటగా నటించిన కరుప్పు చిత్రానికి ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మాతలు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. మార్నింగ్ షోల కోసం సీఎం విజయ్ నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. విజయ్ సీఎం అయ్యే ముందు వరకు తమిళనాడులో మార్నింగ్ షోస్ లేవు. పదకొండున్నర గంటలు దాటిన తర్వాత థియేటర్లలో బొమ్మ పడేది. విజయ్ వచ్చాక ఉదయం తొమ్మిది గంటలకు షోలు వేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు జీవో కూడా జారీ చేశారు. అయినా కూడా మార్నింగ్ షోలు పడలేదు. కారణం ఫైనాన్షియల్ ఇష్యూస్. రూ. 10 కోట్ల బకాయిలు.. ఏ సినిమా అయినా సరే.. విడుదలకు ముందే ఫైనాన్స్ క్లియర్ చేయాలి. లేదంటే షోలను నిలిపివేస్తారు.లీగల్ సమస్యలు కూడా వస్తాయి. కరుప్పు విషయంలో ఇప్పుడిదే జరిగింది. సినిమాకు సంబంధించిన ఫైనాన్స్‌ని పూర్తిగా క్లియర్ చేయకుండానే రిలీజ్‌కి వచ్చారట. రూ. 10 కోట్లకు పైగా బకాయిలు చెల్లించలేదట. దీనిపై బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు జరిపిన చర్చలన్నీ విఫలం అవ్వడంతోనే మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బకాయిల చెల్లింపులకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇవి పరిష్కారమైతేనే తదుపరి షోలు ప్రదర్శించే అవకాశం ఉంది.నా దగ్గర సమాధానం లేదు : ఆర్జే బాలాజీమార్నింగ్ షో రద్దుపై దర్శకుడు ఆర్జే బాలాజీ ఎక్స్‌వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ‘సూర్య అభిమానులకు నేను క్షమాపణలు కోరుతున్నా. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. సినిమా విడుదలకు ముందు ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల షోలు రద్దయ్యాయి. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాను. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సినిమా కచ్చితంగా విడుదలవుతుంది. మీరందరూ పడుతున్న ఇబ్బందికి నేను క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి సాయంత్రం షో అయినా పడుతుందా లేదా రిలీజ్ వాయిదా పడుతుందో చూడాలి. #RjBalaji's Very Emotional video..🥲"I'm really sorry.. It shouldn't have happened.. I didn't expect this too.. I hope all the issues will get resolved and the film will be released this evening at 6PM..❣️ Sorry for making you all go through this..🫂"pic.twitter.com/cCkOyFXfE0— Laxmi Kanth (@iammoviebuff007) May 14, 2026 -
'హైదరాబాద్ ఈవెంట్లో కామెంట్స్.. తప్పుగా అర్థం చేసుకున్నారు'
కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కరుప్పు. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ బాలాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా థియేటర్లకు వచ్చే వారికోసమే తీశామని అన్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో సమీక్షించే వారి కోసం కాదన్నారు. దీంతో దర్శకుడు బాలాజీ కామెంట్స్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆన్లైన్ సినిమాలను విశ్లేషించే వారిని కించపరిచేలా మాట్లాడారంటూ ట్రోల్స్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై స్పందించారు. కేరళలో నిర్వహించిన మూవీ ఈవెంట్లో తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు.తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జే బాలాజీ అన్నారు. ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా సినిమా చూడమని మాత్రమే తాను ప్రేక్షకులను కోరానని స్పష్టం చేశారు. సినిమాలపై చేసే సమీక్షలను, చర్చలను కొట్టిపారేయడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ముందుగానే ఓ అభిప్రాయంతో థియేటర్లకు రావద్దని ప్రేక్షకులను కోరడమే నా ఉద్దేశమని వెల్లడించారు. మీరు విశాల దృక్పథంతో థియేటర్లకు వచ్చి.. సినిమా చూసిన తర్వాతే.. నచ్చిందో లేదో చెప్పాలని కోరుకుంటున్నానని అన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చాక.. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడాలి.. సమీక్షించాలి. నేను కూడా ఒకప్పుడు సమీక్షకుడినే.. ఇప్పుడే డైరెక్టర్‌గా మారానని తెలిపారు.సూర్య హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, స్వాసిక, శ్శివద, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మరియన్, ఆడుకలం నరేన్, నమో నారాయణ, దీపా శంకర్, సభ మారన్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రం మే 14న థియేటర్లలో విడుదల కానుంది. -
గతంలో తెలుగు సినిమాలని అవమానించి ఇప్పుడేమో!
తెలుగు ప్రేక్షకులకు మన తన అని భేదముండదు. బాగుండాలే గానీ ఏ భాష సినిమా అయినా చూసేస్తుంటారు. మిగతా భాషలతో పోలిస్తే తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులో డబ్బింగ్ అవుతుంటాయి. అలా సూర్య 'కరుప్పు'.. 'వీరభద్రుడు'గా ఈ వారం థియేటర్లలోకి రానుంది. దీనిపై పెద్దగా బజ్ ఏం లేదు. ట్రైలర్ కూడా పర్లేదనిపించింది. కానీ ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీపై తెలుగు నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. గతంలో ఇతడు టాలీవుడ్‌ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)గతంలో ఓ అవార్డ్ షోలో మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో హీరో కచ్చితంగా హీరోయిన్ వెంట పడతాడు అని చెప్పుకొచ్చాడు. 'యానిమల్' గురించి మరో సందర్భంలో మాట్లాడుతూ హింసను, మహిళలను అగౌరవపరిచే సన్నివేశాలని ప్రజలు ఆస్వాదించడం చూసి తాను బాధపడ్డానని, అందుకే ఆ సినిమాను థియేటర్లో చూడలేదని అన్నాడు.తీరా చూస్తే ఇప్పుడు ఇతడు తీసిన సినిమాలో మరీ 'యానిమల్' అంత హింస కాకపోయినా కొంతమేర యాక్షన్ ఉంది. అలానే తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందేందుకు మెగా హీరోలైన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లని ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కుదిరితే రామ్ చరణ్‌తో సినిమా చేస్తానని అన్నాడు. అప్పుడేమో తెలుగు సినిమాల్ని అవమానించి.. ఇప్పుడు తన సినిమా కోసం తెలుగు హీరోల అభిమానుల్ని కాకా పట్టేస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పాత వీడియోలు ట్విటర్(ఎక్స్)లో వైరల్ అవుతున్నాయి.గతంలో తెలుగు సినిమాల్ని కించపరిచి ఇప్పుడు అదే మార్కెట్ నుంచి కలెక్షన్స్ ఆశించడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు నటుడు-దర్శకుడు ఆర్జే బాలాజీపై వస్తున్నాయి. ఇతడిపై పెరుగుతున్న నెగిటివిటీ.. సూర్య 'వీరభద్రుడు' ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపిస్తుందా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సూర్యకు తెలుగులో మార్కెట్ ఉంది కానీ దర్శకుడిపై వస్తున్న ట్రోల్స్ ఏం చేస్తాయనేది చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)5 years ago an absolute clown called #RJBalaji used a platform like this to mock and ridicule Telugu films to prove a point and today his next film as a director is shamelessly releasing in Telugu again. Have some shame maybe @RJ_Balaji ?? Care to apologise?? pic.twitter.com/0m6kxP5Hbb— Meher Kilaru (@Kilaruness) May 11, 2026 -
సూర్య 'వీరభద్రుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నమ్మకం ఉంటే మ్యాజిక్ జరుగుతుంది: హీరో సూర్య
‘‘వీరభద్రుడు’ సినిమా తొలి భాగం మంచి కోర్టు రూమ్ డ్రామా. సెకండాఫ్ మంచి థియేట్రికల్ మాస్ మూమెంట్స్... ఫన్, హ్యూమర్ కూడా ఉంటుంది. ఈ నెల 14న మీ అందరికీ ‘వీరభద్రుడు’ సినిమాతో ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమాను ఇవ్వబోతున్నామని ప్రామిస్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని అతిథుల్లా కాకుండా దత్తపుత్రుల్లా భావిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని సూర్య అన్నారు. సూర్య, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’). ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయనుంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ– ‘‘ఎక్కడైతో నమ్మకం ఉంటుందో ఎక్కడైతే ఆశ ఉంటుందో అక్కడ మ్యాజిక్ జరుగుతుంది. నేను దేవుణ్ణి నమ్ముతాను. సమస్యలు వచ్చినప్పుడు గుడికి వెళ్తాను. కానీ ఆర్జే బాలాజీ ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్ధిస్తుంటాడు. ఆర్జే మంచి యాక్టర్, రైటర్, డైరెక్టర్, గుడ్ ఫాదర్, ఫ్రెండ్... ఇలా మల్టీ టాలెంటెడ్. భావోద్వేగం అయినా, హాస్యం అయినా ఆయన నిజాయితీతో వర్క్ చేస్తారు.సుప్రియగారితో ఎప్పట్నుంచో మంచి పరిచయం ఉంది. ‘వీరభద్రుడు’ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థతో అసోసియేట్ కావడం మాకు గౌరవప్రదం. దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో త్రిష–నేను కలిసి నటించాం’’ అన్నారు. ఈ వేడుకకు అతిథిగా హాజరైన హీరో కార్తీ మాట్లాడుతూ–‘‘వీరభద్రుడు’ మాస్ మసాలా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. అన్నయ్య (సూర్యని ఉద్దేశించి)గారు మాత్రమే చేయగలిగిన సినిమా ఇది. థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా ‘వీరభద్రుడు’’ అన్నారు.ఆర్జే బాలాజీ మాట్లాడుతూ– ‘‘వీరభద్రుడు’ సినిమా తమిళ ప్రేక్షకుల కోసమే కాదు... తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని తీశాం. మాకు కరుప్పు స్వామి ఎలాగో మీకు వీరభద్రుడు స్వామి అలా. నేనొక దర్శకుడిగా, సూర్యగారు హీరోగా సినిమా చేస్తానని అనుకోలేదు. సూర్యగారు నన్ను నమ్మడం వల్లే ఈ సినిమా సాధ్యమైంది. అయితే ఈ సినిమా స్టార్టింగ్‌లో సూర్య సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకుడా? అని కొందరు అన్నారు. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత నాపై వారికి నమ్మకం కలిగింది’’ అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి, లిరిక్ రైటర్–సింగర్, యాక్టర్ రాకేందు మౌళి, రచయిత రామజోగయ్య శాస్త్రి, ఫైట్ మాస్టర్ విక్రమ్ మాట్లాడారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ పాల్గొన్నారు.‘‘ప్రపంచంలో మనల్ని నమ్మేవారు ముందు కొద్ది మందే ఉండొచ్చు. రెండు మూడేళ్ల క్రితం తమిళనాడులోని ఒక వ్యక్తిపై విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అతన్ని ఎవరూ నమ్మలేదు. చాలామంది నెగటివ్ ప్రచారం చేశారు. కానీ ఆ వ్యక్తి తనను తాను నమ్మాడు. ఇప్పుడు అతను తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యాడు... గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌గారికి తాను మంచి చేయగలనన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకమే లక్షలాది తమిళ ప్రజల్లోకి వెళ్లి, వారి చేత ఓట్లు వేయించింది’’ అని ఆర్జే బాలాజీ అన్నారు. -
'తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు'.. వీరభద్రుడు ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కరుప్పు. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. కంగువ', 'రెట్రో' డిజాస్టర్స్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తుంటే లాయర్, కోర్టు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను చూపించే లక్ష్యంగా ఈ కథ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో త్రిష న్యాయవాదిగా కనిపించనుంది. 'దేవుడే దిగొచ్చినా కోర్ట్ ప్రోసీజర్ని మార్చలేడా? వచ్చాను కదరా.. పిచ్చకొట్టుడు కొడతా' అనే డైలాగ్ సూర్య ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. 'అయ్యో వచ్చింది తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు.. కానీ వచ్చింది భద్రుడు.. వీరభద్రుడు.. ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు పడేస్తాడు' అనే డైలాగ్స్ చూస్తే ఫుల్ యాక్షన్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్‌గా పాత్రలో కనిపించనున్నారు. -
దేవుడు-లాయర్‌గా సూర్య.. కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
తమిళ హీరో సూర్య హిట్ కొట్టి చాలాకాలమైపోయింది. గత రెండు చిత్రాలు 'కంగువ', 'రెట్రో' అయితే ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. వాటితో కాస్త భిన్నంగా చేద్దామని ప్రయత్నించాడు. కానీ వర్కౌట్ కాకపోయేసరికి మళ్లీ కమర్షియల్ రూట్లోకి వచ్చేశాడు. అలా చేసిన సినిమానే 'కరుప్పు'. తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో ఈ గురువారం(మే 14) థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)ట్రైలర్లోనే దాదాపు స్టోరీ ఏంటనేది చెప్పేసే ప్రయత్నం చేశారు. ఓ కోర్టు. అందులో విలన్(ఆర్జే బాలాజీ), హీరోయిన్(త్రిష) లాయర్స్‌గా పనిచేస్తుంటారు. న్యాయం అంటూ ఎవరొచ్చినా సరే తిప్పించుకుంటూ ఉంటారు. దీంతో దేవుడు అయిన హీరో(సూర్య) లాయర్‌గా వస్తాడు. అటు సామాన్యులకు న్యాయం చేయడంతో పాటు విలన్ బెండు ఎలా తీశాడనేది కథలా అనిపిస్తుంది.సూర్య, త్రిష హీరోహీరోయిన్లు కాగా.. దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్‌గానూ చేశాడు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ప్రస్తుతానికైతే తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు. రేపో ఎల్లుండో తెలుగు ట్రైలర్ కూడా వదులుతారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు, హీరో విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తదితర విషయాల వల్ల సూర్య సినిమాపై కనీస బజ్ లేకుండా పోయింది. మరి ఇదైనా సూర్యకు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్) -
సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ...ఎందుకో తెలుసా?
వైవిధ్య భరత పాత్రల్లో నటించాలని తపించే అతికొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. ఈయన ఏ చిత్రం చేసిన తన పాత్రలో కచ్చితంగా కొత్త దనాన్ని చూపిస్తుంటారు. అలా నటించిన కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొంది ఉండకపోవచ్చు. అయితే సూర్య నటన మాత్రం అందరూ కొనియాడతారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కరుప్పు. నటి త్రిష నటించిన ఈ చిత్రాన్ని నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో సూర్య విభిన్న గెటప్పులతో కనిపించడంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చిత్ర ఆడియో విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. కాగా త్వరలోనే చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఆయన అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్న కరుప్పు చిత్రం ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం విడుదల అవుతుందా అన్న సందేహం వ్యక్తం అవుతున్న తరుణంలో నిర్ణయించిన తేదీలోనే చిత్రం విడుదలవుతుందని దర్శకుడు ఆర్జే బాలాజీ స్పష్టంగా పేర్కొన్నారు. ఇకపోతే సూర్య కథానాయకుడిగా నటించిన మరో చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. నటి మమితా బైజు నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది. కాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించడంతో సూర్య అభిమానులకు డబల్ ధమాకా కావడంతో యమ ఖుషీ అవుతున్నారు. -
తమిళనాడులో విజయ్ సునామీ.. సెలబ్రిటీలతో సెల్ఫీలు వైరల్!
-
మాస్ వీరభద్రుడు
సూర్య హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల కానుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సినిమా సెన్సార్ పూర్తయిందని, సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందనీ మేకర్స్ తెలిపారు.‘‘మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘వీరభద్రుడు’. ఈ మూవీని ఆర్జే బాలాజీ తనదైన శైలిలో తెరకెక్కించారు. తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమల్లో పాపులర్ కంటెంట్‌ను అందించి, అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరు తెచ్చుకున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ‘వీరభద్రుడు’ని భారీ స్థాయిలో నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలని సృష్టించాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్, కెమెరా: జీకే విష్ణు. -
త్రిష షాకింగ్ ట్వీట్.. ఇలా అవమానిస్తారా?
సినిమాల్లో నటించడమే కాదు దాన్ని ప్రమోషన్స్‌లో పాల్గొనడం కూడా హీరోహీరోయిన్ల బాధ్యత. ఇప్పుడు చాలా మంది ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నారు. షూటింగ్ అయిపోయిందా.. ప్యాకప్ చెప్పేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లలో చాలా మంది ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నారు. అందులో త్రిష కూడా చేరిందని మొన్నటి వరకు ప్రచారం సాగింది. సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’(తెలుగులో వీరభద్రుడు) మూవీలో త్రిష హీరోయిన్గా చేసింది. మే 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిష హాజరుకాకపోవడంతో..ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. మూవీ ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటుందని కొంతమంది నెటిజన్స్ విమర్శిస్తూ కామెంట్ చేశారు. అయితే అసలు విషయం ఏంటంటే.. అసలు ఆడియో లాంచ్ ఈవెంట్‌కి త్రిషకు ఆహ్వానమే అందలేదట. ఈ విషయాన్ని త్రిష పరోక్షంగా చెబుతూ.. ‘కరుప్పు’ టీమ్‌పై సెటైర్లు వేసింది.త్రిష లుక్ వైరల్కరుప్ప మేకర్స్ తాజాగా త్రిషకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆమె 'ప్రీతి' అనే లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. 37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో త్రిష కోర్టు రూమ్‌లో సీరియస్ లాయర్‌గా, మరో సీన్లో ఆకుపచ్చ చీరలో డ్యాన్స్ చేస్తూ మెరిశారు. 43 ఏళ్ల వయసులోనూ మరింత అందంగా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. త్రిష ఇంత యంగ్‌గా ఎలా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.నేను కూడా మర్చిపోయా.. అయితే ఓ అభిమాని త్రిష లుక్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘కరుప్పు సినిమాలో త్రిష ఉందన్న విషయమే మర్చిపోయాను. ఆమె ఏజ్ రివర్స్ గేర్‌లో వెళ్తోంది" అని ట్వీట్ చేశారు. దానికి త్రిష ఇలా రిప్లై ఇచ్చింది. "ధన్యవాదాలు. నేనూ మర్చిపోయాను. కనీసం ఇప్పటికైనా వారు ఇలా గుర్తు చేసినందుకు సంతోషంగా ఉంది’ అని వ్యంగ్యంగా పేర్కొంది. ఇన్విటేషన్ మిస్ అయిందేమోదీనిపై సూర్య అభిమాని స్పందిస్తూ.. ‘ఆడియో లాంచ్‌కే రాని మీకు ఇంత వెతకారం అవసరమా?’ అని ప్రశ్నించారు. దానికి త్రిష బదులిస్తూ.. ‘నా ఇన్విటేషన్ బహుశా మెయిల్లో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుందిలే’ అంటూ తనను ఆ వేడుకకు తనను ఆహ్వానించలేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పింది. ఆడియో లాంచ్ పోస్టర్లలో ఆమె పేరున్నప్పటికీ, పిలవకుండా పోస్టర్లు వేస్తే ఎలా వస్తారని ఆమె మద్దతుదారులు వాదిస్తున్నారు.‘చెత్త ప్రొడక్షన్ హౌస్.. ఒక స్టార్ హీరోయిన్ని ఇలా అవమానిస్తారా?’, ‘సూర్య ఈ విషయంపై స్పదించాలి’ అని కామెంట్ చేస్తున్నారు. Thank you ☺️ Even I forgot.Good to know they set a reminder now atleast😅 https://t.co/vAgpPJiJJ9— Trish (@trishtrashers) May 1, 2026 -
అలాంటి ప్రశ్న వేయడమే తప్పు : శ్రియ
ఇంతకుముందు హీరోయిన్లను వెంటాడే భయాల్లో ఒకటి పెళ్లి, మరొకటి వయసు. పెళ్లి అయితే హీరోయిన్ అవకాశాలు పోతాయేమోనన్న భయం ఎక్కువగా ఉండేది. అదేవిధంగా వయసు మీరితే అందం కరిగిపోతుందనే భయం కూడా ఉండేది. అయితే ఇప్పుడా భయం ఎవరిలోనూ కనిపించడంలేదు. పెళ్లి అయ్యి, నాలుగు పదుల వయసు దాటిన నటీమణులు కూడా అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అలాంటి వారిలో శ్రియ ఒకరు. ఈ భామ దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా వెలుగొందారు. కాగా వివాహానంతరం నటనకు కొద్ది కాలం దూరంగా ఉన్న శ్రియ ఇప్పుడు మళ్లీ నటించడంపై పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఇటీవల సూర్య హీరోగా నటించిన రెట్రో చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించి మెప్పించారు. ఈ భామను ఇటీవల 43 మూడేళ్ల వయసులో ఇంత అందాన్ని ఎలా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు, ఎలా అవకాశాలను అందుకుంటున్నారు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రియ బదులిస్తూ వయసును బట్టి నటీమణులను అంచనా వేయరాదంటూ ఘాటుగా పేర్కొన్నారు. అసలు ఈ ప్రశ్న వేయడమే తప్పు అన్నారు. వయసుతో పని ఏముంది? పెళ్లి అయితే నటీమణుల పని అయిపోతుంది అన్న ఆలోచనే రాకూడదు అని అన్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో సాధించడానికి వయసు ఆటంకమే కాదన్నారు. ప్రతిభ ముఖ్యమని, ప్రతి భావంతులైన కళాకారులు ఏ వయసులోనైనా సాధించగలరని అన్నారు. కాగా 43 ఏళ్ల వయసులోనూ తరగని అందాలతో ఆకట్టుకుంటున్న శ్రియ ఇప్పటికీ ఐటమ్ సాంగ్స్‌లో నటించడానికి సిద్ధం అంటున్నారు. -
ఓటు వేసిన సూర్య, జ్యోతిక
-
మీరొస్తామంటే... మేమొద్దంటామా..!
‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ఆస్కార్ అవార్డును కూడా తెచ్చింది. విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ తెలుగు సినీ ఇండస్ట్రీపైనే ఉంది. అందుకే పరభాషా హీరోలు టాలీవుడ్ దర్శక–నిర్మాతలతో అసోసియేట్ అయి, సినిమాలు తీస్తున్నారు. సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమానైనా హిట్ చేస్తారు, ఏ హీరోకైనా స్టార్ స్టేటస్ ఇస్తారు. దీంతో తెలుగులో సినిమాలు చేసే పరభాషల హీరోల సంఖ్య ఎక్కువ అవుతోంది. తెలుగు దర్శక–నిర్మాతలు కూడా ‘మీరొస్తామంటే... మేమొద్దంటామా..!’ అంటూ సినిమాలను ఓకే చేస్తున్నారు. మరి... ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తున్న కొందరు పరభాషా హీరోలపై ఓ లుక్ వేయండి.సల్మాన్ భాయ్ వచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో తిరుగు లేని నటుడు. అయితే తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు సల్మాన్ ఖాన్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూశారు. కొంతమంది కమర్షియల్ దర్శకులు చెప్పిన కథలు కూడా ఉన్నారు. కానీ సల్మాన్ ఖాన్‌ను డైరెక్ట్ చేసే అవకాశం మాత్రం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లికి దక్కింది. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోని ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారు.ఈ నెలాఖరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించనున్నారు. వచ్చే నెలలో ఆమె ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్‌రాజా డైరెక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.హిట్ 4 అన్నయ్య సూర్య బాటలోనే కార్తీ నడుస్తున్నారు. సూర్య మాదిరిగానే కార్తీ సినిమాలన్నీ ఆల్మోస్ట్ తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. సూర్యను ఓన్ చేసుకున్నట్లే కార్తీని కూడా తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో 2016లో ‘ఊపిరి’ సినిమా వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ఇది. తెలుగులో కార్తీ చేసిన స్ట్రయిట్ ఫిల్మ్‌గా ‘ఊపిరి’ని చెప్పుకోవచ్చు. కార్తీతో సినిమాలు చేసేందుకు కొంతమంది తెలుగు దర్శకులు కూడా ఆసక్తి చూపించారు.‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్, ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ వంటి దర్శకులు కథలు వినిపించారని తెలిసింది. ఈ చర్చలు ఇలా ఉండగానే... నాని నిర్మాతగా ‘హిట్’ ఫ్రాంచైజీ నుంచి ‘హిట్ 4’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్‌కు వెళ్లనుందని తెలిసింది. ఇక కార్తీ నటించిన ‘సర్దార్ 2’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా, ‘మార్షల్’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.డబుల్ ధమాకా! ‘కాంతార, కాంతార: చాప్టర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తర్వాత రిషబ్ శెట్టి హీరోగా తెలుగులో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ప్రశాంత్ శర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. రానా మరో కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2027లో ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.మరోవైపు అశ్విన్ గంగరాజు డైరెక్ట్ చేయనున్న ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తారు. 18వ శతాబ్దం నేపథ్యంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలోని బెంగాల్ ప్రావిన్స్ ప్లేస్‌లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఇందులో ఓ తిరుగుబాటు దళానికి చెందిన నాయకుడిగా రిషబ్ శెట్టి కనిపిస్తారట. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘జై హనుమాన్’తో రిషబ్ బిజీగా ఉన్నారు. సో... అశ్విన్ గంగరాజుతో రిషబ్ శెట్టి చేయనున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కొంత సమయం పడుతుందని ఊహించవచ్చు.నిశ్శబ్దం పెరిగేకొద్దీ... ‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది’ అంటున్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ రద్దు అయిందంటూ ఇటీవల నెట్టింట వార్తలు హల్చల్ చేయడం.. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అంటూ చిత్ర నిర్మాణ సంస్థలు స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఓ ఫొటోని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎన్టీఆర్ షేర్ చేసి, ‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కండలు తిరిగిన దేహంతో ఉన్న ఆయన ఫొటో వైరల్‌గా మారింది. ఈ మూవీ తర్వాతి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్.హీరోగా హాస్యనటుడుచాలాకాలం హాస్య నటుడిగా కొనసాగిన సూరి మెల్లిగా హీరోగా సినిమాలు చేస్తున్నారు. సూరి హీరోగా తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మించనుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఆర్. రవికుమార్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విధంగా తెలుగులో సూరి చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది. ఫుల్ యాక్షన్ మూవీగా ఈ సినిమా రానుందని తెలిసింది.తెలుగులో బిజీ బిజీ ‘మహానటి, లక్కీభాస్కర్, కాంత’ వంటి చిత్రాలతో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘ఆకాశంలో ఒక తార’ అనే తెలుగు సినిమా చేస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో సాత్విక వీరవల్లి దర్శకురాలిగా పరిచయం అవుతుండగా ఇందులో శ్రుతీ హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాకు నిర్మాతలు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బలమైన ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఓ అమ్మాయి తన కలను నిజం చేసుకోవడానికి ఎంతటి సాహసం చేసిందనే అంశాన్ని ఈ సినిమాలో చాలా ఎమోషనల్‌గా చూపించనున్నారట దర్శకుడు పవన్. అలాగే రవి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇంకా నాని నిర్మాతగా ‘కోర్ట్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన రామ్ జగదీష్ డైరెక్షన్లో దుల్కర్ హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇలా తెలుగు సినిమాలతో దుల్కర్ సల్మాన్ బిజీ బిజీగా ఉంటున్నారు. అటు మలయాళంలోనూ ఆయన హీరోగా ‘ఐ యామ్ ది గేమ్’ సినిమా రూపొందుతోంది. షూటర్ విశ్వనాథ్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే మన హీరోనే అని ఫీలవుతుంటారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఆయన హీరోగా నటించిన సినిమాలన్నీ తెలుగులో అనువాదం అవుతుంటాయి. ఇదిలా ఉంటే... సూర్య తెలుగులో స్ట్రయిట్‌గా ‘రక్త చరిత్ర 2’ (2010) అనే సినిమా చేశారు. మళ్లీ ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత డైరెక్ట్‌గా మరో తెలుగు సినిమా చేస్తున్నారు. అదే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా. కోలీవుడ్ హీరో ధనుష్‌తో ‘సార్’, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి, ఈ ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో షూటర్ సంజయ్ విశ్వనాథ్‌గా సూర్య నటిస్తున్నారు. హీరోయిన్గా మమితా బైజు కనిపిస్తారు.రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. సంజయ్ విశ్వనాథ్ కన్నా వయసులో 20 సంవత్సరాలు చిన్నదైన అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుంటుంది. ఈ సమస్య నుంచి సంజయ్ ఎలా బయటపడ్డాడు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది.సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ కానుంది. సూర్య హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ‘వీరభద్రుడు’ మే 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదల తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటాయని, రిలీజ్ డేట్‌పై కూడా స్పష్టత వస్తుందని ఊహించవచ్చు. ఇంకా... ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాల ఫేమ్ చందు మొండేటి సైతం సూర్యను కలిసి, కథ వినిపించారని తెలిసింది.ఒకేసారి రెండు సినిమాలుఅల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో విలన్ బన్వర్ సింగ్ షెకావత్‌గా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఫాహద్ ఫాజిల్ హీరోగా తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాల ప్రకటనలు వచ్చాయి. ఈ చిత్రాలు ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్’. ఈ రెండు చిత్రాలు రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ (రాజమౌళి తనయుడు) నిర్మిస్తున్నవే. ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తుండగా, ‘ఆక్సిజన్’ చిత్రానికి సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకుడు. ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. భావోద్వేగాలతో ముడిపడిన ‘ఆక్సిజన్’ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసింది.ఈసారి హీరోగా..! తమిళ నటుడు విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘ఉప్పెన, సైరా నరసింహారెడ్డి’ వంటి తెలుగు చిత్రాల్లో విజయ్ సేతుపతి నటించారు. కొంత కాలంగా ఆయన హీరోగా నటించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగులో అనువాదమై రిలీజ్ అవుతున్నాయి. కాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి హీరోగా ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ అనే సినిమా తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో టబు, సంయుక్తా మీనన్, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, చార్మి, జేబీ నారాయణ కొండ్రల్ల ఈ సినిమాను నిర్మించారు. త్వరలోను రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.యాక్షన్ థ్రిల్లర్తమిళంలో సూపర్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ యంగ్ హీరో చేసిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి సినిమాలు తెలుగులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రదీప్ గత చిత్రం ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రెండో తమిళ సినిమా ఇది. అయితే ఈసారి ఇదే నిర్మాణ సంస్థలో ప్రదీప్ హీరోగా ఓ తెలుగు సినిమా రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. చంద్రశేఖర్ ఏలేటి ఓ యాక్షన్ థ్రిల్లర్ కథను రెడీ చేశారని, ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథన్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇప్పుడు చాలా సినిమాలు ఒక భాషలో తెరకెక్కి, ఇతర భాషల్లో అనువాదం అవుతున్నాయి. కొన్ని సినిమాలు ద్విభాషా చిత్రాలుగా కూడా ఉంటున్నాయి. ఈ రకంగా పరభాషా హీరోలు టాలీవుడ్లో సినిమాలు చేసినప్పుడు, ఈ చిత్రాలు ఆ హీరోల మాతృభాషలోనూ రిలీజ్ అవుతున్నాయి. ఇలా హీరోలకు రెండు విధాలా కలిసొస్తుంది. అలాగే తెలుగులో స్టార్ హీరోలందరూ ఒక సినిమాను పూర్తి చేసేందుకు దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. సినిమా భారీతనాన్ని బట్టి ఎక్కువ సమయం పడుతోందని ఊహించవచ్చు. పైగా ఒక సినిమా సెట్స్‌లో ఉండగా ఇంకో సినిమా చేసే వీలు కొందరు హీరోలకు ఉండటంలేదు. పరభాషల హీరోలతో తెలుగు ఫిల్మ్ మేకర్స్ అసోసియేట్ కావడానికి ఇదొక కారణం అనే ఊహాగానాలు ఉన్నాయి.– ముసిమి శివాంజనేయులు -
ట్రెండింగ్‌లో గాడ్ మోడ్ సాంగ్
‘గాడ్ మోడ్...’ అంటూ హుషారుగా చిందేస్తున్నారు హీరో సూర్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరభద్రుడు’. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. మే 14న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘గాడ్ మోడ్...’ అంటూ సాగేపాటని శనివారం విడుదల చేశారు మేకర్స్. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈపాటని కాల భైరవపాడారు.‘‘తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమల్లోపాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ‘వీరభద్రుడు’ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని పెంచింది. ‘గాడ్ మోడ్...’ అంటూ సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పక్కా మాస్ ఎనర్జీతో ఊపేస్తూ, థియేటర్లలో విజిల్స్ పండించే డ్యా న్స్ నంబర్‌గా నిలుస్తుంది.కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పవర్‌ఫుల్‌గా, క్యాచీగా ఉండి ఒక్కసారి వినగానే గుర్తుండిపోయేలా ఉన్నాయి. కాల భైరవ వాయిస్ ఈపాటకు అదనపు పవర్ ఇచ్చి, ప్రతి బీట్‌ను మరింత ఎలివేట్ చేసింది. ఈ సాంగ్‌లో సూర్య చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. స్టైల్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ... అన్నీ కలిపి ఆయన్ను మరింత స్పెషల్‌గా చూపిస్తున్నాయి. ఇప్పటికే ఈపాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ, సినిమా హైప్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జీకే విష్ణు. -
మే 14న వీరభద్రుడు
సూర్య హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కరుప్పు’. త్రిష హీరోయిన్గా నటించారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ చిత్రం మే 14న విడుదల కానుంది.కాగా, ఈ సినిమాకు తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో కత్తి పట్టుకుని మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు సూర్య. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్. -
అందమే ఆనందం.. జ్యోతిక ఫోటోలు వైరల్
అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం ఆన్నారో మహాకవి. అవును ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఏనాటి వరకైనా జీవితం అందం గురించే పరుగులు తీస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. అలా అందమైన నగుమోము కలిగిన అతిథులకు వయసు గుర్తుకు రాదని చెప్పడానికి పలు ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడికో ఎందుకు మనం నటి జ్యోతికనే తీసుకుంటే 1997లో ఒక హిందీ చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసి, ఆ వెంటనే అంటే 1998లో అజిత్ హీరోగా నటించిన వాలి చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రమే సంచలన విజయాన్ని సాధించడం, జ్యోతిక నటన ప్రశంసనీయంగా ఉండడంతో ఆ తరువాత ఆమెకు నటిగా ఎదురు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తమిళం, తెలుగు,హిందీ వంటి పలు భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికిగా రాణిస్తున్నారు. చంద్రముఖి చిత్రంలో ఈమె నటన రిమార్కబుల్. టైటిల్ రోల్లో అంత అద్భుతంగా నటించారు. అలా రెండు దశాబ్దాలకు పైగా నటిస్తూ ఎవర్ గ్రీన్ నాయకి పేరు తెచ్చుకున్న జ్యోతిక కెరీర్ ప్రారంభంలోనే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడారు. వీరి పెళ్లి 2006 జరిగింది. ఆ తరువాత కొంతకాలం సంసార జీవితానికి పూర్తిగా సమయాన్ని కేటాయించారు. సూర్య, జ్యోతిక దంపతులకు దేవ్ అనే కొడుకు, దియా అనే కూతురు ఉన్నారు. పిల్లలు చదువుపై దృష్టి పెట్టిన తరువాత జ్యోతిక మళ్లీ నటనపై దష్టి పెట్టారు.అయితే తన ఇమేజ్ కు సరిపోయే ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. కాగా ఇటీవల బాలీవుడ్‌పై ఎక్కువగా దష్టి పెడుతున్నారు.అలా ఈమె నటుడు అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన సైతాన్ చిత్రం 2024లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్‌లో నటిస్తున్న జ్యోతిక తన అందాలను పదిల పరచుకోవడానికి తీవ్రంగా కసరత్తు చేస్తుంటారు. అందుకే 47 ఏళ్ల వయసులో కూడా ఆమె చాలా అందంగా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జ్యోతిక కొత్తగా ఫుల్ ఫిట్ నెస్‌తో కూడిన తన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
కరుప్పు ఫస్ట్ విజయ్‌కే చెప్పా.. ఆయనకు నచ్చింది.. కానీ!
స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో కరుప్పు ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్ సూర్య కంటే ముందు దళపతి విజయ్ చేతికి వెళ్లిందట. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజనీకాంత్ కెరీర్లో భాష, ముత్తు, పడయప్ప (నరసింహ) వంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటికీ చాలామంది జనాలు వీటిని మళ్లీ మళ్లీ చూస్తుంటారు. 2023లోనే..అలాంటి ఒక ఫుల్ ఎంటర్టైనర్ సినిమాని తీయాలని నా కోరిక. యాక్టింగ్ అంటే గట్టిగా అరవడం, ఏడవడం కాదు. అన్ని రకాల ఎమోషన్స్‌ను సమపాళ్లలో పండించాలి. అది సూర్యకు వెన్నతో పెట్టిన విద్య.. తను బాగా డ్యాన్స్ చేస్తాడు, అద్భుతంగా నటిస్తాడు, ఏదైనా సింపుల్‌గా చేసేస్తాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. నిజానికి 2023లో కరుప్పు కథ రాయడం మొదలుపెట్టాను. విజయ్‌కు కథ చెప్పా..ఈ కథకు బలమైన స్టార్ ఉంటే బాగుంటుందనిపించింది. అలా హీరో విజయ్ను కలిశాను.. పైగా ఆయన 2021లోనే ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగాడు. ఈ రెండు కారణాల వల్ల తనను కలిశాను. కరుప్పు విజయ్‌కు చాలా బాగా నచ్చింది. ఇది భారీ సినిమా.. వెంటనే మొదలుపెడదాం అన్నారు. కానీ విజయ్ వంటి స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే పెద్ద బాధ్యత.. నచ్చింది కానీ..అలా హడావుడిగా మొదలుపెట్టలేనని చెప్పాను. తర్వాత కొన్నిసార్లు కలిశాం, మాట్లాడుకున్నాం.. కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆయన నా నుంచి కుటుంబ కథా చిత్రం ఆశించాడు. అయినప్పటికీ ఈ కథ తనకెంతో నచ్చింది.. అదే సంతోషం అని ఊరుకున్నాను. తర్వాత సూర్యను సంప్రదించగా ఆయన ఓకే చెప్పాడు అని తెలిపాడు.సినిమాకరుప్పు విషయానికి వస్తే.. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది. స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.చదవండి: ధురంధర్ 2 ప్రభంజనం.. 28 ఏళ్ల కిందటి లేఖ వైరల్ -
40 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమకథ.. ఆసక్తిగా టీజర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజైన టీజర్ చూస్తుంటే 20 ఏళ్ల అమ్మాయితో 40 ఏళ్ల వ్యక్తి ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దగా ఉన్న వ్యక్తితో హీరోయిన్ ప్రేమలో పడడం ఈ చిత్రం ఆసక్తిని మరింత పెంచుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. -
సూర్య లేటేస్ట్ మూవీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈనెల 16న సాయంత్రం 04:06 నిమిషాలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. A journey filled with heart. ❤️The teaser of #VishwanathAndSons is on its way.🥳Sanjay Vishwanath arrives on March 16th @ 04:06 PM! 😎In cinemas from this JULY 2026. 🤩@Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli… pic.twitter.com/FKoOht3Oz0— Sithara Entertainments (@SitharaEnts) March 14, 2026 -
రీమేక్‌ల కాలం ముగిసింది.. ఒరిజినల్ కథలే ఆయుధం
ఒకప్పుడు రీమేక్ హక్కులు దక్కించుకోవడం అంటే నిర్మాతలు గర్వంగా చెప్పుకునేవారు.అది వారకి ఎంతో గర్వకారణం. మినిమం గ్యారెంటీ అనే భరోసా కూడా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సినిమా రీమేక్ చేస్తున్నారని తెలిసిన వెంటనే ప్రేక్షకులు ఒరిజినల్ వెర్షన్‌ను చూసి పోల్చడం అలవాటుగా మారింది. దాంతో ఈ పోలికల్లో సినిమాలోని లోపాలు ఎక్కువగా బయటపడటంతో రీమేక్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నాయి. ఇటీవల సూర్య హీరోగా నటిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్ర యూనిట్ తమ సినిమా మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటించిన కంగారూ రీమేక్ అని వచ్చిన ప్రచారంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ సినిమా పోస్టర్లు ఒకేలా కనిపించడంతో ఈ పుకారు మొదలైంది. దాంతో వెంటనే యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. తమ సినిమా ఒరిజినల్ కథతో వస్తోందని స్పష్టం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ కూడా మొదటి నుంచి ‘తేరి’ రీమేక్ అని ప్రచారం నడిచింది. ఇప్పుడు విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ దర్శకుడు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇది రీమేక్ కాదని సుదీర్ఘంగా వివరణలు ఇస్తున్నాడు. ప్రేక్షకులు ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో హిట్ అయితే ఏంటి గొప్ప? అని ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా విజృంభనతో రీమేక్ విషయాలు దాచిపెట్టడం అసాధ్యం అయ్యింది.రీమేక్ అని తెలిసిన వెంటనే ట్రోలింగ్ మరింత పెరిగింది.ఫలితంగా నిర్మాతలు రీమేక్‌లకు పూర్తిగా దూరమవుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా తమ సినిమా రీమేక్ అని ప్రచారం జరిగితే చిత్ర యూనిట్లు వెంటనే మీడియా ముందుకొచ్చి ఖండించడం మొదలుపెట్టాయి. రీమేక్ అనే ముద్ర పడకుండా కిందామీద పడుతున్నారు. మొత్తానికి రీమేక్‌ల కాలం ముగిసింది. ఒరిజినల్ కథలే ఇప్పుడు ప్రేక్షకులను ఆకర్షించే ప్రధాన ఆయుధం. -
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆ మూవీ రీమేక్నా..?
కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య తొలిసారి తెలుగు స్ట్రెయిట్ సినిమా చేస్తున్నారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. లక్కీ భాస్కర్ మూవీ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ ఏడాది జులైలో థియేటర్స్‌లోకి రానుంది. అయితే, ఈ మూవీ రీమేక్ అంటూ సోషల్‌మీడియాలో కథనాలు వస్తున్నాయి.పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ యాక్షన్-కామెడీ చిత్రం 'కంగారూ'(Kangaroo)కి రీమేక్ అని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. 2007లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమా రీమేక్‌గా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారని ప్రచారం మొదలైంది. అయితే, ఇందులో నిజం లేదని ఇండస్ట్రీకి చెందిన కొందరు చెబుతున్నారు. ఆ మూవీ రైట్స్ ఇప్పటికీ ఎవరూ కొనుగోలు చేయలేదని క్లారిటీ ఇస్తున్నారు.విశ్వనాథ్ అండ్ సన్స్ అనేది వెంకీ అట్లూరి రూపొందించిన స్క్రిప్ట్‌తోనే తెరకెక్కిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ రీమేక్ టాపిక్‌పై ఆయన స్పిందించే ఛాన్స్ ఉంది. 45 ఏళ్ల కథానాయకుడిపై ఇరవై ఏళ్ల అమ్మాయి ఇష్టం పెంచుకుంటే.. వారి బంధం ఎలా ఉంటుంది. ఇద్దరి మధ్య ఎలాంటి భావోద్వేగాలు కనిపిస్తాయనేది ఈ మూవీ కథ అని సమాచారం. ఇందులో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాష్‌కుమార్ అందించారు. -
క్రేజీ కాంబో ఫిక్స్.. సూర్యతో పూరి జగన్నాధ్..!
తమిళ స్టార్ హీరో సూర్యతో దర్శకుడు పూరి జగన్నాధ్ కొత్త సినిమా ఫైనల్ అయింది. ప్రస్తుతం సూర్య సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే పూరి దర్శకత్వంలో సూర్య చేయబోయే సినిమా ఉండే అవకాశం ఉంది. అసలు ముందుగా వెంకీ అట్లూరి సినిమా తరువాత సూర్య మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దాంతో ఆ స్థానంలో పూరి జగన్నాధ్‌కు అవకాశం దక్కింది. అయితే సూర్యతో సినిమా చేయడానికి దర్శకుడు చందు మొండేటి కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తండేల్ సినిమా ముందు నుంచే ఆయన ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. దాంతో ప్రస్తుతం ఆయన కార్తికేయ 3 ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. హీరోల డేట్స్ సంపాదించడం పూరి జగన్నాధ్ కు పెద్ద సమస్య కాదు. పూరి-విజయ్ సేతుపతితో చేసిన సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్టైనర్ వస్తుందో చూడాలి. -
ఫ్యామిలీ మ్యాన్‌గా సూర్య.. టైటిల్ ఏంటో తెలుసా?
సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో ఇతర భాషా హీరోలకు ఘన విజయాలను అందించాడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు ఈయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం (మార్చి 2న) రిలీజ్ చేశారు. సూర్య కెరీర్లో 46వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాపోస్టర్లో కళ్లజోడు ధరించిన హీరో సూర్య చిన్న బాబును ఎత్తుకుని స్టైలిస్ట్‌గా కనిపిస్తున్నాడు. ఇది మనసును తాకే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని మూవీ టీం ప్రకటించింది. జూలైలో సినిమా రిలీజ్ చేస్తామని పేర్కొంది. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.సినిమామరోవైపు సూర్య చేతిలో ఇంకో రెండు సినిమాలున్నాయి. ఒకటి.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న కరుప్పు మూవీ.. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో త్రిష కథానాయిక. మరోటి.. మలయాళ డైరెక్టర్ జిత్తు మాధవన్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. ఇందులో సూర్య పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్గా కనిపించనుంది. Power in his presence. 🔥Warmth in his embrace.🤍Bringing back the vintage magic of @Suriya_offl in a heart-touching family spectacle. 🤩#VishwanathAndSons ~ The biggest family drama of the year arrives this July. 🫶🏻#VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena… pic.twitter.com/frvwNwuU8f— Sithara Entertainments (@SitharaEnts) March 2, 2026 చదవండి: అల్లు ఫ్యామిలీలో నయనిక సిస్టర్స్.. ఫోటో వైరల్ -
జ్యోతికతో ప్రేమ పెళ్లి.. నాన్నను ఒప్పించేందుకు సూర్య ఏం చెప్పాడంటే? (ఫొటోలు)
-
సూర్య- జ్యోతిక ప్రేమను ఒప్పుకోలేదు!: హీరో తండ్రి
ప్రేమించడం ఈజీయేమో కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం మాత్రం కొంత కష్టమైన పనే! కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక ప్రేమాయణం హీరో తండ్రి, నటుడు శివకుమార్‌కు ఏమాత్రం ఇష్టం లేదట. కానీ సూర్య పట్టుపట్టి సాధించి, ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ విశేషాలను శివకుమార్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.జీవితాంతం ఒంటరిగానే..శివకుమార్ మాట్లాడుతూ.. మొదట్లో సూర్య ప్రేమను నేను ఒప్పుకోలేదు. పెళ్లంటూ చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటానని, లేదంటే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతానన్నాడు. వెంటనే నాకు నేను నటించిన 150 సినిమాలు కళ్లముందు కదిలాయి. అందులో చాలావరకు ప్రేమకథలే ఉన్నాయి. దీంతో వెంటనే అతడి ప్రేమను అంగీకరించాను.ఎలా ఉండేవాడు?వాడు మొదట్లో చాలా బిడియంగా ఉండేవాడు. రాధికా శరత్‌కుమారే వాడిని జ్యోతికతో మాట్లాడించింది. అలా మొదలైన మాటలు తర్వాత ప్రేమకు దారితీశాయి. ఎంతో మొహమాటంతో ఉండే వీడేనా ఈరోజు ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నాడు అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని శివకుమార్ సరదాగా చెప్పుకొచ్చాడు.ప్రేమ- పెళ్లిసూర్య, జ్యోతిక అనేక సినిమాల్లో కలిసి నటించారు. 'పూవెల్లం కేట్టుప్పార్' మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ 2006 సెప్టెంబర్ 11న పెళ్లితో మరింత బలపడింది. ఈ దంపతులకు కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం. సినిమాల విషయానికి వస్తే.. సూర్య ప్రస్తుతం 'కరుప్పు' సినిమా చేస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. అలాగే హీరోయిన్ నజ్రియాతో సూర్య మరో సినిమా చేస్తున్నాడు.చదవండి: కొడుకు- కోడల్ని అభినందించిన మెగాస్టార్ -
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)
-
సీఎం స్టాలిన్, హీరో సూర్యతో వైఎస్ జగన్
-
వైఎస్ జగన్‌ను కలిసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ కలిశారు. చెన్నైలో జరిగిన సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ హీరోలు కార్తీ, సూర్య వైఎస్ జగన్‌ను ఆత్మీయంగా పలకరించారు. పెళ్లి వేడుకలో హీరోలు కార్తీ, సూర్యతో వైఎస్ జగన్‌తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు అటు రాజకీయాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తికర చర్చలకు దారి తీసింది. View this post on Instagram A post shared by Sakshi (@sakshinews) -
సూర్య జట్టు 'చెన్నై సింగమ్స్'దే ISPL టైటిల్
తమిళ నటుడు సూర్య కో-ఓనర్‌గా ఉన్న చెన్నై సింగమ్స్ జట్టు తొలి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) టైటిల్‌ను కైవసం చేసుకుంది. నిన్న (ఫిబ్రవరి 6) జరగిన ఫైనల్లో ఆ జట్టు కోల్‌కతా టైగర్స్‌పై 29 పరుగుల తేడాతో గెలుపొందింది. సూరత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సింగమ్స్ ఆటగాళ్లు ఆది నుంచే పట్టు సాధించారు. ఈ మ్యాచ్‌ను సూర్యతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ప్రత్యక్షంగా వీక్షించాడు. టెన్నిస్ బాల్‌తో ఆడే ఈ టీ10 లీగ్ దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఈ లీగ్‌కు ఇది మూడో ఎడిషన్. ఈ ఎడిషన్‌లో కొత్త ప్రతిభలు వెలుగులోకి వచ్చాయి. వివేక్ షెలార్ అనే బౌలర్ రెండు హ్యాట్రిక్‌లు నమోదు చేశాడు. అంకిత్ యాదవ్ (కోల్‌కతా) 16 వికెట్లు, ప్రశాంత్ ఘరాట్ (హైదరాబాద్) 203 పరుగులు, నిజామ్ అలీ (అహ్మదాబాద్) 20 వికెట్లు సాధించారు. అవార్డులు - MVP: జగన్నాథ్ సర్కార్ (చెన్నై సింగమ్స్) – బహుమతిగా పోర్షే 911 కారు అందుకున్నాడు. - Best Batter: సైఫ్ అలీ (కోల్‌కతా టైగర్స్) - Best Bowler: ప్రవీణ్ కుమార్ (హైదరాబాద్ ఫాల్కన్ రైజర్స్) - Best Catch: ప్రతమేష్ ఠాకరే (అహ్మదాబాద్ లయన్స్) మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 10 ఓవర్లలో 103/7 చేసింది. ఓపెనర్లు కేతన్ మ్హాత్రే, జగన్నాథ్ సర్కార్ వేగంగా ఆరంభించారు. కేతన్ రెండో ఓవర్లోనే 28 పరుగులు కొట్టి దూకుడు చూపాడు. మధ్యలో సరోజ్ ప్రమాణిక్ రెండు వికెట్లు తీసి చెన్నై వేగాన్ని తగ్గించినా, సర్ఫరాజ్ ఖాన్ దూకుడు కొనసాగించాడు. చివర్లో గణేష్, సంభాజీ దూకుడు ప్రదర్శనతో చెన్నై భారీ స్కోర్ చేసింది. అనంతరం 104 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కోల్‌కతా విఫలమైంది. రాజత్ ముంధే, సరోజ్ ప్రమాణిక్ తొలుత కష్టపడ్డారు. జగన్నాథ్ సర్కార్ కీలక వికెట్ తీసి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. అరిష్ ఖాన్ 25 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపినా, కోల్‌కతా స్కోర్ 74/9కే పరిమితమైంది. అనురాగ్ సర్షర్ 3 వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. సునీల్ కుమార్, అంకుర్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. -
ఆరేళ్ల తర్వాత బిగ్ ప్రాజెక్ట్ లోడింగ్.. కర్ణుడిగా సూర్య
నటుడు సూర్య ఒక్కసారి కథను నమ్మితే, ఆ చిత్రం కోసం ప్రాణం పెడతారనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అలా ఆయన ప్రతి చిత్రానికి తన వంతు కృషి చేస్తారు. ఇక జయాపజయాలు అన్నది ఎవరి చేతిలోనూ ఉండవు. కంగువా చిత్రం విషయంలో కూడా జరిగింది ఇదే. భారీ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం అది. ఆ చిత్రంలో నటుడు సూర్య నటనను ఎవరూ విమర్శించలేదు సరికదా విమర్శకులు సైతం ప్రశంసించారు. అనివార్య కారణాల వల్ల కంగువా చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇకపోతే ఆ తరువాత సూర్య నటించిన రెట్రో చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్నే అందుకుంది. కాగా సూర్య ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు చిత్రాన్ని పూర్తి చేశారు. ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా మాలీవుడ్ దర్శకుడు జీతు మాదవన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఈయన నటిస్తున్న 47వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో ఆయన మరోసారి తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. కర్ణుడిగా సూర్యహిందీ చిత్రంలో నటించడానికి సూర్య సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మహాభారతం ఇతిహాసంలోని కర్ణుడి ఇతి వృత్తంతో పాన్ ఇండియా స్థాయిలో కర్ణ పేరుతో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు,అందులో కర్ణుడి పాత్రలో నటుడు సూర్య, నటి జాన్వీకపూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు 2024లో ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.దీంతో కర్ణ చిత్రం అనివార్య కారణాల వల్ల డ్రాప్ అయ్యిందనే ప్రచారం వైరల్ అయ్యింది. అలాంటిది ఇటీవల దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ ఒక భేటీలో పేర్కొంటూ కర్ణ చిత్రం డ్రాప్ కాలేదనీ, దీని కోసం ఆరేళ్ల క్రితమే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు.ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీనికి స్క్రీన్‌ప్లేను పూర్తిగా రాసినట్లు ఇక షూటింగ్‌ను ప్రారంభించడమే తరువాయి అని చెప్పారు. కొన్ని కారణాల వల్ల చిత్ర షూటింగ్ వాయిదా పడింది కానీ, డ్రాప్ కాలేదని స్పష్టం చేశారు.ఈ చిత్రం కోసం ఏఆర్.రెహామాన్ ఆరు పాటలను రెడీ చేశారని దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ తెలిపారు. మొత్తం మీద సూర్యను ఆయన అభిమానులు కర్ణుడిగా చూడబోతున్నారన్నమాట. -
తమిళనాడు స్టేట్ సినీ అవార్డ్స్‌లో 'సూర్య' రికార్డ్
తమిళనాడు ప్రభుత్వం 2016 నుండి 2022 సంవత్సరాలకు సంబంధించి తాజాగా రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. సినిమాలే కాకుండా.. 2014 నుండి 2022 వరకు రాష్ట్ర టెలివిజన్ అవార్డులలో భాగంగా కళాకారులను సత్కరించింది. ధనుష్, విజయ్ సేతుపతి, సూర్య, ఆర్య, విక్రమ్ ప్రభు, కార్తీ, పార్థిబన్ వంటి స్టార్స్ వారి చిత్రాలకు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. నయనతార, కీర్తి సురేష్, జ్యోతిక, అపర్ణ బాలమురళి, లిజోమోల్ జోస్, సాయి పల్లవి 2016-2022 సంవత్సరాలకు ఉత్తమ హీరోయిన్స్‌గా ఎంపికయ్యారు. సూర్య నటించిన జై భీమ్, ఆకాశం నీ హద్దురా చిత్రాలు ఏకంగా 13 ఆవార్డ్స్ను దక్కించుకుని రికార్డ్స్ క్రియేట్ చేశాయి. 2021 ఉత్తమ చిత్రంగా జైభీమ్ ఎంపికతో పాటు దర్శకుడు, నటి,విలన్, సహాయ నటుడు, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు వంటి విభాగాల్లో సత్తా చాటింది. అయితే, ఆకాశం నీ హద్దురా సినిమాకు గాను సూర్యకు ఉత్తమ నటుడి అవార్డ్ దక్కింది. ఫిబ్రవరి 13న అవార్డ్స్ కార్యక్రమం జరగనుంది.2016 విజేతలుఉత్తమ చిత్రం : మానగరంమహిళా సాధికారత విభాగంలో ఉత్తమ చిత్రం: అరువిఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి (పురియత పుతిర్)ఉత్తమ నటి: కీర్తి సురేష్ ఉత్తమ దర్శకుడు: లోకేష్ కనగరాజ్ (మానగరం)ఉత్తమ నటి (ప్రత్యేక బహుమతి): అదితి బాలన్ (అరువి)ఉత్తమ విలన్: రెహమాన్ఉత్తమ హాస్య నటుడు: రోబో శంకర్ (మరణానంతరం)2017 విజేతలు:ఉత్తమ చిత్రం : అరమ్ (కర్తవ్యం)ఉత్తమ చిత్రం (ప్రత్యేక బహుమతి): టు లెట్ఉత్తమ నటుడు: కార్తీ ఉత్తమ నటి: నయనతార అరమ్ (కర్తవ్యం)ఉత్తమ దర్శకుడు: పుష్కర్-గాయత్రి (విక్రమ్ వేద)2018 విజేతలు:ఉత్తమ చిత్రం: పరియేరుమ్ పెరుమాల్ఉత్తమ నటుడు: ధనుష్ (వడ చెన్నై)ఉత్తమ నటి: జ్యోతిక ఉత్తమ దర్శకుడు: మారి సెల్వరాజ్ (పరియేరుమ్ పెరుమాల్)ఉత్తమ నటుడు (ప్రత్యేక బహుమతి): విష్ణు విశాల్ (రాక్షసన్)ఉత్తమ నటి (ప్రత్యేక బహుమతి): ఐశ్వర్య రాజేష్ (కనా/వడ చెన్నై)ఉత్తమ విలన్: సముద్రఖని (వడ చెన్నై)ఉత్తమ సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్ (వడ చెన్నై)2019 విజేతలు:ఉత్తమ చిత్రం : అసురన్ఉత్తమ నటుడు: ఆర్ పార్థిబన్ ఉత్తమ నటి: మంజు వారియర్ (అసురన్)ఉత్తమ నటుడు (ప్రత్యేక బహుమతి): కార్తీ (ఖైదీ)ఉత్తమ విలన్: అర్జున్ దాస్ (ఖైదీ)ఉత్తమ హాస్య నటి: కోవై సరళ (కాంచన-3)ఉత్తమ సహాయ నటుడు: ప్రకాష్ రాజ్ (అసురన్)ఉత్తమ దర్శకుడు: ఆర్ పార్థిబన్2020 విజేతలు:ఉత్తమ చిత్రం : కూజంగల్ఉత్తమ నటుడు: సూర్య (ఆకాశం నీ హద్దురా)ఉత్తమ నటి: అపర్ణా బాలమురళి (ఆకాశం నీ హద్దురా)ఉత్తమ దర్శకురాలు: సుధా కొంగర (ఆకాశం నీ హద్దురా)2021 విజేతలు:ఉత్తమ చిత్రం : జై భీమ్ఉత్తమ నటుడు: ఆర్య (సర్పట్ట పరంబరై)ఉత్తమ నటి: లిజోమోల్ జోస్ (జై భీమ్)ఉత్తమ విలన్: తమిజ్ (జై భీమ్)ఉత్తమ సహాయ నటుడు: కె మణికందన్ (జై భీమ్)ఉత్తమ దర్శకుడు: జ్ఞానవేల్ (జై భీమ్)ఉత్తమ సంగీత దర్శకుడు: సీన్ రోల్డాన్ (జై భీమ్)ఉత్తమ నేపథ్య గాయకుడు (పురుషుడు): అరివు (జై భీమ్)2022 విజేతలు:ఉత్తమ చిత్రం : గార్గిఉత్తమ నటుడు: విక్రమ్ ప్రభు (తానక్కరన్)ఉత్తమ నటి: సాయి పల్లవి (గార్గి)ఉత్తమ విలన్: ప్రకాష్ రాజ్ (విరుమాన్)ఉత్తమ హాస్య నటుడు: రోబో శంకర్ (మరణానంతరం)ఉత్తమ హాస్య నటి: ఇంద్రజ శంకర్ (విరుమాన్)ఉత్తమ దర్శకుడు: గౌతం రామచంద్రన్ (గార్గి) -
నాకు సూర్య సపోర్ట్‌గా నిలిచారు.. ఇలా మరే హీరో ఉండరు: నిర్మాత
నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'వా వాతియార్' తమిళ్లో నేడు విడుదల కానుంది. ఇందులో కృతిశెట్టి నాయకిగా నటించింది. సత్యరాజ్, ఆనంద్‌రాజ్ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ. జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రానికి నలన్ కుమారస్వామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పొంగల్ సందర్భంగా నేడు (బుధవారం) తెరపై రానుంది.ఈ సందర్భంగా చెన్నైలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు కార్తీ, నటి కృతిశెట్టి , నిర్మాత కేజీ.జ్ఞానవేల్ రాజా, సత్యరాజ్, ఆనంద్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ‘‘ నేను ఎక్కడికి పారిపోలేదు. ఇక్కడే ఉన్నాను. అందరిని ఆనంద పరిచే చిత్ర పరిశ్రమలోనే ఉంటాను. నా గురించి రక రకాలుగా ప్రచారం చేశారు. అప్పుల పాలయ్యారు అని కూడా ప్రచారం చేశారు. నిజం చెప్పాలంటే సినిమా రంగంలో అప్పు లేని నిర్మాతను నేనే. నాకు పూర్తి సపోర్ట్‌గా నిలిచిన నటుడు సూర్య అన్నయ్యకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆనందంలోనే కాదు.. కష్ట సమయంలోనూ సూర్య అన్న నాకు తోడుగా ఉన్నారు. ఇలా మరే హీరో ఉండరు. ముఖం ముందు పొగిడి, వెనుక విమర్శించే వారు ఉంటారు, వారి గురించి పట్టించుకోవద్దని హితవు పలికిన ఆయన నాకు పూర్తిగా మద్దతుగా నిలిచారు. 'వా వాతియార్' చిత్రం జనరంజకంగా వచ్చింది ‘‘ అని పేర్కొన్నారు.నటుడు కార్తీ మాట్లాడుతూ ‘‘ 'వా వాతియార్'చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. జ్ఞాన వేల్ రాజా చెప్పినట్లు అన్నయ్య సూర్య ఈ చిత్రానికి ఎంతగానో సపోర్ట్ గా నిలిచారు. దర్శకుడు నలన్ కుమారస్వామి ఈ చిత్ర కథను చెప్పగానే నేను ఇందులో ౠంజీఆర్ గా నటించగలనా ?అని భయపడ్డాను. అయితే దర్శకుడు కథను అద్భుతంగా మలిచారు.ఆయన ఇచ్చిన ధైర్యంతో ఈ చిత్రంలో నటించాను. మనం సూపర్ మాన్, బ్యాట్ మాన్ సూపర్ హీరోల కల్పిత కథలతో చిత్రాలు చేస్తున్నాం. నిజ జీవితంలో ఎంజీఆర్ వంటి హిరోల కథలు చాలా ఉన్నాయి. అలాంటి కథలతో చేసిన చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తాయి. 'వా వాతియార్' చిత్రంలో నటించడం నా అదృష్టం ‘‘అని నటుడు కార్తీ పేర్కొన్నారు. -
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
-
మహిళా అభిమాని పెళ్లి.. సర్ప్రైజ్ చేసిన హీరో సూర్య
అభిమానుల పెళ్లికి సినిమా హీరో లేదా హీరోయిన్లు వెళ్లడం టాలీవుడ్లో ఎప్పుడైనా చూశారా? అస్సలు చూసుండరు. మహా అయితే వ్యక్తిగత సిబ్బంది పెళ్లి జరిగితే కొన్నిసార్లు కనిపిస్తారంతే. కానీ కోలీవుడ్‌లో మాత్రం ఫ్యాన్స్ పెళ్లిలో హీరోలు కనబడటం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. హీరో సూర్య ఇప్పుడు అలానే ఓ లేడీ ఫ్యాన్‌కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో షాక్ అవడం ఆమె వంతైంది.(ఇదీ చదవండి: ప్రభాస్ అందుకే చీర బహుమతిగా ఇచ్చాడు.. రాజాసాబ్ హీరోయిన్)అరవింద్ అనే కుర్రాడు కాజల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకు కాబోయే భార్యకు హీరో సూర్య అంటే చాలా ఇష్టం. దీంతో రిక్వెస్ట్ చేసి సూర్య తన వివాహానికి వచ్చేలా ఒప్పించాడు. ఈ విషయాన్ని చివరి నిమిషం వరకు కాజల్‌కు చెప్పలేదు. సడన్‌గా కల్యాణ మండపంలో సూర్యని చూసి ఆమె షాకైంది. ఈ మొత్తాన్ని వీడియోగా తీసి కొత్త పెళ్లి జంట.. దాన్ని తమ ఇన్ స్టా పేజీ 'కాదల్స్'లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదే కాదు గతంలోనూ సూర్య.. పలువురు అభిమానుల పెళ్లికి హాజరై సర్ప్రైజ్ చేశాడు. తమిళ హీరో విశాల్, ఆర్య, కార్తీ, ధనుష్ తదితర హీరోలు కూడా ఫ్యాన్స్ వివాహాలకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో హీరోలు ఇలా చేస్తున్నారు. మరి తెలుగులో ఇలా అభిమానుల పెళ్లికి గానీ శుభకార్యాలకు గానీ అటెండ్ అయిన హీరోలు ఎంతమంది ఉన్నారు?(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?) View this post on Instagram A post shared by Aravind & Kajal (@kaadhals_) -
అతడికి 45.. ఆమెకు 20 ఏళ్లు.. ఇద్దరి మధ్య ప్రేమ
పేరుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ సూర్యకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఇతడికి చాలా ఫాలోయింగ్ ఉంది. గతంలో 'రక్తచరిత్ర 2' అనే తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో నటించాడు గానీ పూర్తిస్థాయిలో తెలుగు మూవీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు 'సార్', 'లక్కీ భాస్కర్' దర్శకుడు తీస్తున్న సినిమా చేస్తున్నాడు. షూటింగ్ జరుగుతుందని తెలుసు గానీ కాన్సెప్ట్ ఏంటనేది బయటకు రాలేదు. ఇప్పుడు స్వయానా నిర్మాత నాగవంశీ.. స్టోరీ కాస్త రివీల్ చేశారు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్)ఈ మూవీలో హీరో సూర్య.. 'గజిని'లో సంజయ్ రామస్వామిలా ఓ ధనవంతుడు. అతడి వయసు 45 ఏళ్లు. అలాంటి ఇతడు 20 ఏళ్ల అమ్మాయి(మమిత)తో ప్రేమలో పడతాడు. వీళ్ల మధ్య స్నేహం, ప్రేమ, కోపం.. ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ల మధ్య ఉన్నది ప్రేమా కాదా అనేది స్టోరీ పాయింట్ అని నాగవంశీ చెప్పుకొచ్చారు. చూస్తుంటే సూర్య.. ఈసారి ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.సూర్య గత కొన్నేళ్లుగా చేస్తున్న సినిమాల చూస్తే చాలావరకు యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఓ లవ్ స్టోరీ అని తెలిసి తెలుగు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. వెంకీ అట్లూరి తీస్తున్న ఈ సినిమాలో సూర్య, మమిత బైజుతో పాటు రవీనా టండన్ కూడా కీలక పాత్ర చేస్తోంది. మరో రెండు మూడు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వచ్చే వేసవిలో లేదంటే వేసవి చివరలో థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలైతే ఉన్నాయి.(ఇదీ చదవండి: 'పుష్ప-2' తొక్కిసలాట కేసు: ఏ-11గా అల్లు అర్జున్) -
పిల్లాడికి బంగారు చైన్ బహుమతిచ్చిన సూర్య
అభిమాన హీరో ఆటోగ్రాఫ్ ఇస్తే ఆనందంలో మునిగి తేలుతారు. సెల్ఫీ ఇస్తే సంతోషంతో ఉప్పొంగిపోతారు. కానీ, ఆ హీరో ఏకంగా తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో భాగమైతే.. ఇంకేమైనా ఉందా? అది జీవితంలో మర్చిపోలేని బహుమతి అవుతుంది. నటుడు చరణ్‌కు ఇలాంటి సర్ప్రైజే ఇచ్చాడు హీరో సూర్య. చరణ్ కుమారుడి చర్విక్ మొదటి బర్త్‌డేను వారి కుటుంబానికి లైఫ్‌లాంగ్‌ను గుర్తుండిపోయేలా చేశాడు. బుడ్డోడిని ఎత్తుకుని ఆడించాడు. అంతేకాకుండా ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.బంగారు గొలుసు కానుకపిల్లవాడి మెడలో బంగారు గొలుసును వేశాడు. చర్విక్ను అతడి తల్లి ఎత్తుకుని ఉండగా సూర్య ఎంతో ఉత్సాహంగా గోల్డ్ చైన్‌ను బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లెజెండరీ యాక్టర్ సూర్య ఇచ్చిన సర్ప్రైజ్ చూసి మా దిమ్మ తిరిగిపోయింది. మా బాబు చర్విక్ ఫస్ట్ బర్త్‌డే పురస్కరించుకుని బంగారు చైన్‌ను గిఫ్టిచ్చాడు. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు, ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురమైన జ్ఞాపకం అని చరణ్ ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు.తెలుగులో సినిమాఇకపోతే సూర్య చివరగా రెట్రో మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఒకటి (#Suriya46) ఆయన తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమిత బైజు హీరోయిన్. రవీనా టండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. సూర్య 47వ మూవీసితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే సూర్య.. రోమాంచమ్, ఆవేశం సినిమాల ఫేమ్ జీతూ మాధవన్ డైరెక్షన్లో ఓ సినిమా (#Suriya47) చేస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్గా నటిస్తోంది. What an incredible surprise from the legendary Actor *Suriya* himself, such a kind gesture — gifted my baby boy *Charvik* a gold chain for his 1st Birthday! Thank you, *Suriya* sir—we’re forever grateful! 🙏✨@SuriyaFansClub #suriya46 @ActorSuriyaoff pic.twitter.com/grbI6DCngR— Charan (@Charanmaveric) December 17, 2025 -
గుమ్మడికాయ కొట్టారు
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్య 46’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటించగా, రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవల యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్ జరిపారు.ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన మరో కీలక షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. -
సూర్య కొత్త సినిమా లాంచ్.. హీరోయిన్గా నజ్రియా (ఫొటోలు)
-
సూర్య కొత్త సినిమా.. స్టార్ నటుడి సతీమణికి ఛాన్స్
కోలీవుడ్ టాప్ హీరో సూర్య 47వ సినిమా ప్రారంభమైంది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమం ప్రారంభమైంది. అందుకు సంబంధించిన పోటోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. జీతూ మాధవన్ ఇప్పటికే రోమాంచమ్, ఆవేశం చిత్రాలతో వరుస విజయాల్ని అందుకున్న విషయం తెలిసిందే. రేపటి నుంచే ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో క్యూట్ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తుంది. సూర్యకు జోడీగా వెండితెరపై ఆమె కనిపించనుంది. చాలారోజుల తర్వాత ఒక పాన్ ఇండియా సినిమాలో ఆమె భాగం కానుంది. ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్‌కు నజ్రియా సతీమణి అనే విషయం తెలిసిందే. ఫహద్ ఫాసిల్, దర్శకుడు జీతూ మాధవన్ కాంబినేషన్లో వచ్చిన ఆవేశం సినిమా భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ప్రేమలు, కొత్తలోక మూవీస్‌తో పాపులర్ అయిన యంగ్ హీరో నస్లెన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ సుశిన్ శ్యామ్ సంగీతం అందిచడం విశేషం. ‘ఆవేశం’ లాంటి ఒక మాస్ ఎనర్జిటిక్ మూవీ తర్వాత జిత్తు మాధవన్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య కనిపించనున్నారు. -
శంకర్ సినిమాలో హీరో సూర్య!
ఏ రంగంలోనైనా జయాపజయాలు సహజం. అయితే ఒకటీరెడు అపజయాలతో సినీ ప్రముఖుల పేరు తగ్గిపోదు. దర్శకుడు శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్తోనే ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ముదల్వన్, బాయ్స్, ఇండియన్, రోబో, నన్బన్ (స్నేహితులు), అన్నియన్ (అపరిచితుడు), శివాజీ ఇలా వరుసగా బ్రహ్మాండమైన చిత్రాలతో తమిళ సినిమాను భారతీయ చిత్రాల స్థాయికి తీసుకెళ్లారు. బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్అయితే ఇటీవలి కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ నిరాశపర్చాయి. ఇకపోతే ఈసారి శంకర్ చారిత్రక కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వేల్చారి అనే నవల ఆధారంగా శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. అందుకు సంబంధించిన ప్రీపొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య గ్రీన్ సిగ్నల్?ఈ సినిమాలో హీరో సూర్య (Suriya) నటించే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ టాక్. ఈమేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇంతవరకు శంకర్ దర్శకత్వంలో నటించనేలేదు. దీంతో వేల్చారి చిత్రంలో సూర్య నటిస్తే కచ్చితంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్ రావడం ఖాయం. మరి ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి! ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు త్వరలో రిలీజ్ కానుంది. అలాగే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మలయాళ దర్శకుడితో ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
నిర్మాత కన్నుమూత.. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కన్నీటి పర్యంతమయ్యారు. ప్రముఖ నిర్మాత శరవణన్ పార్థీవదేహనికి నివాళులర్పించిన ఆయన.. తనలోని బాధను ఆపుకోలేకపోయారు. శరవణన్ మృతిని తలచుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ కనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. దిగ్గజ నిర్మాతగా శరవణన్.. నిర్మాత శరవణన్ మృతితో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300 వందల సినిమాలను నిర్మించారు. ఏవీఎం ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపుకలలు, జెమిని, శివాజీ, లీడర్ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించారు. ఎంజీఆర్, శివాజీ, జెమిని గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్‌లతో వంటి లెజెండరీలు.. విక్రమ్, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్లో నటించారు.ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్. ఆయన శరవణన్ తండ్రి. మద్రాస్(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్ తొలినాళ్లలో సరస్వతి సౌండ్ ప్రొడక్షన్స్‌గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్ లిమిటెడ్, ప్రగతి స్టూడియోస్.. మేయప్పన్( ఏవీ మేయ్యప్ప చెట్టియార్) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్ తర్వాత శరవణన్ ఆ ప్రొడక్షన్ హౌజ్‌ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. #WATCH | Tamil actor Suriya paid his respects to veteran producer AVM Saravanan at AVM Studio in Vadapalani. Suriya had worked in two of his hit films, Perazhagan and Ayan, under the AVM banner. Saravanan, who shaped generations of Tamil cinema, passed away at the age of 86.… pic.twitter.com/nAvEEnhEnQ— The Federal (@TheFederal_News) December 4, 2025 -
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)
-
ఫ్యామిలీ స్టార్స్!
కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ తిరుగు ఉండదు. మంచి కథ, క్యాస్టింగ్, డైరెక్టర్ కుదిరితే ఆ ఫ్యామిలీ మూవీ సూపర్ హిట్ అవుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి పండక్కి విడుదలైన ఫ్యామిలీ డ్రామా సినిమా పెద్ద చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’, చిన్న చిత్రాల్లో వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కోర్టు’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ తరుణంలో ఫ్యామిలీ డ్రామా సినిమాలపై, కుటుంబ భావోద్వేగాలపై కొందరు స్టార్ హీరోలు ఫోకస్ పెట్టారు. మరి... ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాలు చేస్తున్న టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్స్‌పై మీరూ ఓ లుక్ వేయండి.రాజీ పడదామే... మాజీ ఇల్లాలా! శంకర వరప్రసాద్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఫుల్లీ వర్క్ మైండెడ్. దీంతో పర్సనల్ లైఫ్‌కి, వర్కింగ్ లైఫ్‌కి మధ్య బ్యాలెన్స్ తప్పిందట. మరి... ఈ రెంటినీ మళ్లీ శంకరవరప్రసాద్ ఎలా బ్యాలెన్స్ చేశాడు? అన్నది ‘మన శంకరవరప్రసాద్’ లో చూడొచ్చట. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితమైన సినిమాగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార భార్యా భర్తలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘మీసాల పిల్ల’ అనే పాట విడుదలైంది. ఇందులో ‘రాజీ పడదామే మాజీ ఇల్లాలా’ అనే లిరిక్స్ ఉన్నాయి.దీన్నిబట్టి, ఈ చిత్రంలో భార్యాభర్తలుగా చిరంజీవి–నయనతారల మధ్య ఫ్యామిలీ గొడవలు, అలకలు ఉంటాయని అర్థం అవుతోంది. ఈ సన్నివేశాలు థియేటర్స్‌లో ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతాయని ఊహించవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్, క్యాథరీన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తు న్నారు. సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన మరో సినిమా ‘విశ్వంభర’. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుందని సమాచారం.ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు సిస్టర్స్ ఉంటారని, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్స్ చిరంజీవికి సిస్టర్స్‌గా నటించారని తెలిసింది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.అబ్బాయిగారు 60 ప్లస్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలు వెంకటేశ్ కెరీర్లో ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ రెండు సినిమాలకు రైటర్‌గా పని చేశారు ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లోనే వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రానుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. వెంకటేశ్ కెరీర్‌లోని ఈ 77వ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు చాన్స్ ఉందని, త్వరలోనే ఈ హీరోయిన్ పేరు కూడా మేకర్స్ రివీల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల కథలు వైజాగ్ నేపథ్యంలో మొదలై, హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాయి. వెంకటేశ్–త్రివిక్రమ్ తాజా చిత్రం కూడా వైజాగ్ నేపథ్యంలోనే ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ సినిమాకు ‘వెంకటరమణ, ఆనంద నిలయం, వెంకటరమణ కేరాఫ్ ఆనందనిలయం, అబ్బాయిగారు 60 ప్లస్’ అనే టైటిల్స్ కూడా తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని, టైటిల్‌ను కూడా అతి త్వరలోనే రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ ఫ్యామిలీ డ్రామా వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది.మరోవైపు ఇంటెన్స్ క్రైమ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ అయిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు రాగా, ఈ రెండు చిత్రాల్లోనూ వెంకటేశ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ముచ్చటగా ‘దృశ్యం 3’ కూడా రానుందని ఇటీవల జరిగిన ఓ వేడుకలో వెంకటేశ్ కన్ఫార్మ్ చేశారు. అలాగే తాను, మీనా హీరో హీరోయిన్లుగా నటించనున్న విషయాన్ని కూడా వెంకటేశ్ చెప్పారు. ఇక ‘దృశ్యం 3’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం కానున్నట్లుగా తెలిసింది.రామసత్యనారాయణ విజ్ఞప్తి! ‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్... ఏఐ... జెమిని..చాట్‌జీపీటీ.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్ళని.., ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు ఆడగకూడదని, పెళ్లయిన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి డైలాగ్స్ రవితేజ కొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలోనివి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రామసత్యనారాయణగా హీరో రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్‌లోనే పైన పేర్కొన్న సంభాషణలు ఉన్నాయి. ఈ డైలాగ్స్‌ని బట్టి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. తాత–మనవడి కథ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ సినిమా ఒకటి. సోషియో ఫ్యాంటసీ హారర్ కామెడీ జానర్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, సంజయ్‌దత్ తాత–మనవడి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అంతేకాదు...ఈ సినిమాలో కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగానే ఉంటాయట.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో బలమైన ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారట ఈ చిత్రదర్శకుడు మారుతి. ఇంకా... ఈ సినిమాలో ఓ ఘోస్ట్‌గా సంజయ్ దత్ కనిపిస్తారు. సెకండాఫ్‌లో ప్రభాస్ పాత్రను సంజయ్ దత్ ఆత్మ ఆవహిస్తుందని, ఈ సీన్స్ థియేటర్స్‌లో అదిరిపోతాయని టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది.విశ్వనాథన్ అండ్ సన్స్ ‘రంగ్ దే, లక్కీ భాస్కర్’ వంటి సూపర్‌హిట్ కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి తాజాగా తనదైన మార్క్‌తో ఈ జానర్లోనే మరో మూవీ తీస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే యూరప్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షూటింగ్ షెడ్యూల్‌ను జరిపారు మేకర్స్. అంతేకాదు... ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా టైటిల్ గురించి అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది.మూడు తరాల కథ మోటర్ రేసింగ్ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే మల్టీ జనరేషన్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’. 1990– 2000 మధ్య కాలంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ హీరోగా నటించారు. ఈ సినిమా కథకు రేసింగ్ బ్యాక్‌డ్రాప్ ఉన్నప్పటికీ, మూడు తరాల ఫ్యామిలీ కథగా ‘బైకర్’ మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని తెలిసింది. ఇందులో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించగా, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ ‘బైకర్’ చిత్రం డిసెంబరు 6న రిలీజ్ కానుంది.మరోవైపు ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే శర్వానంద్ హీరోగా రూపోందుతున్న తాజా చిత్రం ‘నారీ నారీ నడము మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. లవ్, ఫ్యామిలీ డ్రామా ప్రధాన అంశాలుగా ఈ చిత్రకథనం సాగుతుంది. వచ్చే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.లెనిన్ అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లుగా తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ‘లెనిన్’ సినిమాలో లవ్‌స్టోరీతో పాటు బలమైన ఫ్యామిలీ భావోద్వేగాలు ఉండబోతున్నట్లుగా తెలిసింది. తండ్రీ–కొడుకుల భావోద్వేగంతో కూడిన ఓ ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ఉందని, ఈ సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయని టాక్. అయితే ఈ సినిమాలోని తండ్రి పాత్రలో ఎవరు యాక్ట్ చేస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా శ్రీలీల కన్ఫార్మ్ అయ్యారు. కానీ కాల్షీట్స్ కేటాయింపుల్లో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకున్నారని, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఫ్యామిలీ కథ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో కిరణ్ అబ్బవరం. కిరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా, కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఇటీవల ఓ ఫ్యామిలీ స్టోరీని కిరణ్‌కు వినిపించారని, కథ నచ్చడంతో ఈ యువ హీరో కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌కు శ్రీను వైట్ల మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని, త్వరలోనే ఈ మూవీపై మేకర్స్ నుంచి ఓ ప్రకటన రానుందని తెలిసింది. ఇలా కుటుంబ కథలతో సినిమాలు చేస్తున్న తెలుగు హీరోలు మరి కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ ఫ్యామిలీ జానర్ సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. -
సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్
‘‘రవితేజ (Raviteja)గారికి నేను అభిమానిని. సూపర్ ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది మాస్‌మహారాజ రవితేజ. ఓ మామూలు మనిషిని స్క్రీన్‌పైకి తీసుకువచ్చి కింగ్ సైజ్‌లో సహజంగా చూపించే పాత్రలు చేస్తుంటారు. మన జీవితంలో కలలు నిజమౌతాయని ఆయన గుర్తు చేస్తుంటారు. ‘మాస్ జాతర’ బ్లాక్‌బస్టర్ కావాలి’’ అని హీరో సూర్య అన్నారు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. శ్రీలీల హీరోయిన్గా నటించగా, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. రవితేజపై సూర్య పొగడ్తల వర్షంభాను భోగవరపు దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సూర్య మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులను నవ్వించడం కష్టమైన పని. ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను రవితేజ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ తరహా నైపుణ్యం తక్కువమందికి ఉంటుంది.ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాంఅమితాబ్ బచ్చన్, రజనీకాంత్ గార్లు మంచి కామిక్ టైమింగ్‌తో యాక్ట్ చేస్తుంటారు. రవితేజ గురించి కార్తీ, నేను, జ్యోతిక మాట్లాడుకుంటూ ఉంటాం. ‘విక్రమార్కుడు, కిక్’ సినిమాలు చూశాను. తమిళంలో కూడా రవితేజకి అభిమానులు ఉన్నారు. అక్టోబరు 31న థియేటర్స్‌లో రవితేజ జాతర’’అని అన్నారు. రవితేజ మాట్లాడుతూ–‘‘సూర్యగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి వ్యక్తి. ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అభిమానులను నిరాశపర్చదు: రవితేజ‘మాస్ జాతర’ సినిమా చూశాను. హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో నవీన్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తాడనిపిస్తోంది. రాజేంద్రప్రసాద్‌గారితో నా కాంబినేషన్ సీన్స్ అలరిస్తాయి. ఇందులో మాస్ క్యారెక్టర్ చేశారు శ్రీలీల. భానురూపంలో మన ఇండస్ట్రీకి ఓ మంచి దర్శకుడు వస్తున్నాడు. ఈ సినిమాలోని పాటలను, ముఖ్యంగా ఆర్ఆర్ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా నా అభిమానులను నిరాశపరచదు’’ అని చెప్పారు. శ్రీలీల మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో తులసి అనే మాస్ క్యారెక్టర్ చేశాను. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా!: రాజేంద్రప్రసాద్రవితేజగారిని చూసి చాలా నేర్చుకున్నాను. సూర్యగారికి నేను పెద్ద అభిమానిని’’ అన్నారు. ‘‘మాస్ జాతర’ సినిమా ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు నిర్మాత నాగవంశీ. ‘‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రంలో నేను చేసిన బాల్ రెడ్డి పాత్ర తర్వాత ‘మాస్ జాతర’లో నేను చేసిన శివుడు క్యారెక్టర్‌ను ఆడియన్స్ గుర్తు పెట్టుకుంటారు’’ అని చెప్పారు నవీన్ చంద్ర. ‘‘రవితేజగారు నా కథ విని, సితార వంటి ఓ పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు’’ అని భాను భోగవరపు పేర్కొన్నారు. ‘‘మాస్ జాతర’ చూసి ప్రేక్షకులు షాక్ అవ్వకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను. నా క్యారెక్టర్ ఏంటో థియేటర్స్‌లో చూడండి’’ అని తెలిపారు రాజేంద్ర ప్రసాద్.చదవండి: ఆ సినిమా రిలీజయ్యాక ట్రోలింగ్.. తట్టుకోలేకపోయా! -
రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'రవితేజ మూవీ నా తమ్ముడికి టర్నింగ్ పాయింట్'.. కోలీవుడ్ హీరో సూర్య
మాస్ మహారాజా రవితేజ మరో ఫుల్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన మాస్ జాతర ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. రవితేజ యాక్షన్, డైలాగ్ మాస్ ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల తన డ్యాన్స్‌తో మరోసారి ఆడియన్స్‌ను అలరించింది. రవితేజతో కలిపి స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.హీరో సూర్య మాట్లాడుతూ..' రవితేజకు నేను కూడా అభిమానినే. ఇది నాకు ఫ్యాన్ భాయ్ మూమెంట్. ఆయన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ నటనకు బిగ్ ఫ్యాన్ నేను. తమిళంలోనూ రవితేజ సినిమాలకు అద్భుతమైన క్రేజ్ ఉంది. విక్రమార్కుడు మూవీ కార్తీ కెరీర్లో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ మాస్ జాతర సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఈ మూవీలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ భాను కల నిజం కావాలి. ఈనెల 31 మరో బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం' అని అన్నారు. కాగా.. రవితేజ, శ్రీలీల జంటగా వస్తోన్న మాస్ జాతర అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. The joy, the excitement, and the MASS vibe all in one frame! 🔥Pics from the Grand Pre Release event of #MassJathara ❤️🔥Premieres Worldwide on Oct 31st from 6 PM Omwards! 😎🤘Mass Maharaja @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/bAqv31Lym8— Sithara Entertainments (@SitharaEnts) October 28, 2025 -
రవితేజ 'మాస్ జాతర' కోసం వస్తున్న సూర్య
'మాస్ జాతర'(Mass Jathara) కోసం కోలీవుడ్ నటుడు 'సూర్య' వచ్చేస్తున్నారు. ధమాకా లాంటి భారీ విజయం తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జోడీగా నటిస్తున్న చిత్రం మాస్ జాతర.. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్ర చేస్తున్నారు రవితేజ. విలన్‌గా నవీన్ చంద్ర కనిపిస్తారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ నెల28న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.రవితేజ మాస్ జాతర ప్రీ- రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నటుడు సూర్య వస్తున్నట్లు ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అక్టోబర్ 28న సాయంత్రం 5:30గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా రన్‌టైమ్ 160 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.సూర్య 46వ సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. దీంతో నాగవంశీతో సూర్యకు అనుబంధం ఏర్పడింది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్నంలో మమితా బైజు, రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.The celebration just got BIGGER! 💥🔥The one and only @Suriya_offl garu to grace the grand pre-release event of #MassJathara 😍📍TOMORROW from 5:30 PM Onwards at JRC CONVENTIONS, HYD!In cinemas worldwide #MassJatharaOnOct31st Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14… pic.twitter.com/IUkt8NgMbM— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025 -
'డ్యూడ్' హీరోయిన్ మమితా బైజుకు బిగ్ ఛాన్స్
ధనుష్‌తో నటి మమితా బైజుకు(Mamitha Baiju) జత కుదిరింది. రీసెంట్గా డ్యూడ్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మొదట మలయాళం మూవీతో తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ తమిళం, తెలుగు అంటూ చుట్టేస్తోంది. ప్రేమలుతో దక్షిణాది చిత్ర పరిశ్రమనే తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం రెబెల్ నిరాశపరచడంతో అక్కడ ఈ భామ పప్పులు ఉడకవు అనే విమర్శలను ఎదుర్కొంది. బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రంలో కొన్ని రోజులు నటించి వైదొలగింది. దీంతో కోలీవుడ్‌లో చిన్న గ్యాప్ కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రదీప్ రంగనాథన్‌తో జతకట్టిన ద్విభాషా ( తమిళం, తెలుగు) చిత్రం డ్యూడ్ దీపావళి సందర్భంగా తెరపైకి వచ్చి ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన జననాయకన్ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా కీలక పాత్రను పోషించింది. ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 9న తెరపైకి రానుంది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలో కథానాయికిగా నటిస్తోంది. అదేవిధంగా ఇరెండు వారమ్ అనే మరో చిత్రంలో నటించిన మమితబైజు మలయాళంలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. కాగా తాజాగా మరో లక్కీచాన్స్ ఈ అమ్మడిని వరించింది. ధనుష్ సరసన నటించడానికి మలయాళీ బ్యూటీ రెడీ అవుతోంది. నటుడు ధనుష్ ప్రస్తుతం తేరే ఇష్క్మేన్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఈయన నటించే 54వ చిత్రం అవుతుంది. దీనికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించనున్నారు. దీనికి జీవీ.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించిన అధికారిక పోస్టర్‌ను నిర్మాతల వర్గం విడుదల చేసింది. వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో మమితబైజు నాయకిగా నటించనుందని సినీ వర్గాల సమాచారం. -
కరుప్పు నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్
స్టార్ హీరో సూర్య (Suriya) నుంచి సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లో జోష్ పెరిగిపోతుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కరుప్పు ఒకటి. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. గాడ్ మోడ్..త్వరలోనే ఈ మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీపావళి పండగ సందర్భంగా సాంగ్ గాడ్ మోడ్ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను దీపావళి పండగ సందర్భంగా విడుదల చేశారు. నల్లని దుస్తులు, చేతిలో కత్తితో సూర్య నటించిన ఊరమాస్ ట్యూన్స్‌తో రూపొందిన ఈ పాట ఇప్పుడు అబిమానులను విపరీతంగా అలరిస్తోంది. సినిమాపై అంచనాలను సైతం పెంచేస్తోంది. ఇకపోతే సూర్య ఈ చిత్రంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంనూలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
రెండో బ్యానర్ స్టార్ట్ చేయనున్న హీరో సూర్య!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇకపోతే ఈయన తన భార్య జ్యోతికతో కలిసి 2డీ ఎంటర్టెయిన్మెంట్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే! తాజాగా సూర్య మరో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.నగరం స్టూడియోస్ పేరుతో కొత్త బ్యానర్ లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థలో మొదటి చిత్రంగా మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించి నిర్మించనున్నట్లు తెలిసింది. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానుందని తెలిసింది. ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తెరపైకి రానుంది.చదవండి: జ్ఞాపకాలను మోయడం ఆపేశాను -
ఇండస్ట్రీలోకి వచ్చేసిన సూర్య కూతురు.. 17 ఏళ్లకే ఇలా
తమిళ హీరో సూర్య ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. భార్య జ్యోతిక కూడా కొన్నాళ్ల క్రితం రీఎంట్రీ ఇచ్చింది. అడపాదడపా మూవీస్ చేస్తోంది. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి తర్వాత తరం కూడా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. సూర్య కూతురు దియా.. ఏ మాత్రం హడావుడి లేకుండా కొత్త ప్రాజెక్ట్ చేసింది. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ విషయం బయటపడింది.సూర్య-జ్యోతిక లది ప్రేమ వివాహం. 'కాకా'(తెలుగులో ఘర్షణ) అనే సినిమా చేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి 2006లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు దియా, దేవ్ అని కూతురు కొడుకు ఉన్నారు. దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు. మొన్నీమధ్య స్కూలింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు 'లీడింగ్ లైట్' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది.(ఇదీ చదవండి: మరోసారి తండ్రయిన హీరో సుహాస్)సినిమా తీయడంలో తెర వెనక చాలామంది మహిళలు పనిచేస్తుంటారు. అసలు వాళ్లు ఎలాంటి కష్టాలు పడుతుంటారు? అనే కాన్సెప్ట్‌తో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ని దియా తీసింది. ఆస్కార్ అర్హత కోసం ప్రస్తుతం దీన్ని కాలిఫోర్నియాలోని రీజెన్సీ థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 02 వరకు ప్రతిరోజూ ఈ డాక్యుమెంటరీ వేయనున్నారు.సూర్య-జ్యోతిక కూతురు ఇలా ఇండస్ట్రీలోకి వచ్చింది, దర్శకత్వం చేసింది అనే విషయాన్ని ఇప్పటివరకు సైలెన్స్‌గానే ఉంచారు. దీన్ని సూర్య-జ్యోతిక తమ ప్రొడక్షన్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. తాజాగా సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ పెట్టేసరికి అందరికీ ఈ విషయం తెలిసింది. అలా సూర్య కూతురిని అభినందిస్తున్నారు. మొన్నీమధ్య షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌తో దర్శకుడిగా మారాడు. ఇప్పుడు సూర్య కూతురు కూడా డైరెక్టర్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఓజీలో పవన్ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?) -
సూర్య పనిమనుషుల చేతివాటం.. రూ.42 లక్షలు స్వాహా!
తమిళ హీరో సూర్య (Suriya)కి భద్రతా అధికారిగా పని చేస్తున్న జార్జ్ ప్రభు ఆర్థికంగా మోసపోయారు. సూర్య ఇంట్లో పనిచేసేవారి చేతుల్లో రూ.42 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్య ఇంట్లో సులోచన, ఆమె కుమారుడు పని చేస్తున్నారు. వీరు సెక్యూరిటీ ఆఫీసర్ జార్జ్‌కు అధిక వడ్డీ ఆశ చూపారు. దీంతో ఆయన మొదటగా రూ.1 లక్ష ఇచ్చారు. దానికి బదులుగా 30 గ్రాముల బంగారాన్ని వీళ్లు తిరిగిచ్చారు. జార్జ్‌కు నమ్మకం కుదరడంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం రూ.42 లక్షలను నిందితులకు బదిలీ చేశారు. రూ.2 కోట్ల మేర మోసంఅప్పటినుంచి వాళ్లు డబ్బులివ్వకుండా సైలెంట్ అయ్యారు. దీంతో భద్రతా అధికారి తన డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా సులోచన కుటుంబం అక్కడినుంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఇదే కుటుంబం చెన్నైలో పలువురిని నమ్మించి రూ.2 కోట్ల దాకా మోసాలకు పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ నలుగురూ సూర్య ఇంట్లో పనిచేసేవారే కావడం గమనార్హం! చదవండి: సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై.. -
రేసు నుంచి తప్పుకోనున్న 'సూర్య'
దక్షిణాదిలో ప్రముఖ కథానాయకుల్లో రాణిస్తున్న నటుడు సూర్య. ఈయన ఇటీవల హీరోగా నటించిన రెట్రో చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్య రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి కరుప్పు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటి శ్వాసిక, ఇందిరెన్స్, యోగి బాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే డివోషనల్ అంశాలతో సాగే సోషియల్ కథాచిత్రంగా రూపొందుతున్న కరుప్పు చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు యూనిట్ వర్గాలు ప్రకటించారు. అయితే, ఈ చిత్ర విడుదల వాయిదా పడే అవకాశమే ఎక్కవగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ విడుదుల కానుంది. ఆపై శివకార్తికేయన్ ,రవి మోహన్, శ్రీ లీల, అధర్వ కలిసి నటిస్తున్న పరాశక్తి కూడా రానుంది. సంక్రాంతి కోసం తెలుగులో ఇప్పటికే భారీగానే లైనప్ ఉంది. దీంతో సూర్య హీరోగా నటిస్తున్న కరుప్పు చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు తాజా సమాచారం. సంక్రాంతి పోటీలో ఉండి ఇబ్బందులు పడటం ఎందుకని ఈ నిర్ణయం తీసుకునేందుకు చర్చిస్తున్నారట. ఏదేమైనా పొంగల్ రేసు నుంచి సూర్య తప్పుకోనున్నారనేది తెలుస్తోంది. -
'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్
సమాజం నాకెంతో ఇచ్చింది.. మరి సమాజానికి నేనేం ఇచ్చాను? అని ఆలోచించేవారు కొద్దిమందే ఉంటారు. వారిలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ముందు వరుసలో ఉంటాడు. నిరుపేద విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలన్న సంకల్పంతో సూర్య.. అగరం పేరిట ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశాడు. తమిళనాడులో పేద, వెనుకబడిన సామాజిక విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఈ సంస్థ తోడ్పడుతుంది. ఇటీవలే ఈ సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.నా జీవితం ఓ సినిమా కథఈ కార్యక్రమంలో ఓ యువతి.. అగరం ఫౌండేషన్ వల్ల తన జీవితమే మారిపోయిందని స్పీచ్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. నాపేరు జయప్రియ. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. నా జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. మొదట్లో ఆ సంతోషం అన్న పదమే మా జీవితాల్లో లేదు. అదెందుకో మీకు చెప్తాను. ఇదొక సినిమాకథలా అనిపించొచ్చు. మాది చిన్న ఊరు. ఆ ఊరి పేరు అగరం. ఆ గ్రామంలో ఓ తాగుబోతు తండ్రి ఉండేవాడు. పూరి గుడిసెలో జీవితంఅతడితో తాగుడు మాన్పించలేక భార్య మౌనంగా ఏడుస్తూ ఉండేది. వీరికి ఇద్దరు కూతుర్లు. వాళ్లది మట్టి గోడలతో కట్టిన ఇల్లు (పూరి గుడిసె). తాటాకులే ఇంటి పైకప్పు. వర్షం వచ్చిందంటే నీళ్లన్నీ ఇంట్లోకి వచ్చేవి. ఆ ఇంటికి పాములు చుట్టాల్లా తరచూ వస్తుండేవి. ఇదే నా జీవితం. కరెంటు లేదు. ఇంటికి మంచినీటి కనెక్షన్ లేదు. కానీ చదువుకోవాలన్న కోరిక మాత్రం నాకు బలంగా ఉండేది. చదువులోనూ ముందుండేదాన్ని. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేదాన్ని.నెక్స్ట్ ఏంటి?కొంతకాలానికి మేమున్న ఇల్లు కూలిపోయింది. అమ్మానాన్న నిరుపేదలు. ఏమీ చేయలేకపోయారు. చూస్తుండగానే 12వ తరగతి పూర్తి చేశాను. కాలేజీ టాపర్‌గా నిలిచాను. తర్వాతేం చేయాలో తోచలేదు. మా మేడమ్ అగరం ఫౌండేషన్ నెంబర్ ఇచ్చింది. వాళ్లు నాకు సాయం చేస్తారంది. 2014లో అగరం ఫౌండేషన్‌కు కాల్ చేశాను. అప్పుడే నా జీవితం ఆనందంగా ముందుకుసాగింది.గోల్డ్ మెడల్మంచి కాలేజీలో చేర్పించారు. కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. అన్నా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నాను. తర్వాత టీసీఎస్‌లో చేరాను. కొంతకాలానికి ఇన్ఫోసిస్‌కు మారాను. నాకున్న ఏకైక కల సొంతిల్లు. నేను సంపాదించిన డబ్బుతో మంచి ఇల్లు కట్టాలి. అందులో అమ్మానాన్న ప్రశాంతంగా నిద్రించాలి. అగరం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. పెద్ద ఇల్లు కట్టాను. గర్వంగా చెప్తున్నాఒకటి కాదు ఇప్పుడు నాకు రెండు ఇండ్లున్నాయని గర్వంగా చెప్తున్నాను. దీనంతటికీ కారణం అగరం ఫౌండేషన్. ఆడపిల్లలకు చదువెందుకు అని ఇప్పటికీ కొందరు అంటుంటారు. అమ్మాయిలను చదవనివ్వండి. చదివితేనే కదా ఏదో ఒకటి చేయగలం అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు సూర్య కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆమె విజయాన్ని అభినందిస్తూ లేచి చప్పట్లు కొట్టాడు.చదవండి: నీ సినిమాలు ఆడవ్ అని ప్రొడ్యూసర్ మొహం మీదే చెప్పాడు -
అగరం .. పేదలకోసం అహరహం.. విద్యతోనే వికాసం
హీరో అంటే సినిమాల్లో ఒక్క దెబ్బకు పదిమంది రౌడీలను గాల్లోకి ఎగిరేలా కొట్టడమేనా.. హీరో అంటే హీరోయిన్‌తో రొమాన్స్ చేయడమేనా.. హీరో అంటే ఖర్చులేని కబుర్లు చెప్పడమేనా.. పైసా ఖర్చులేకుండా రక్తదానం.. అవయవదానం.. ట్రాఫిక్ రూల్స్ అంటూ ఉచిత సలహాలు ఇవ్వడమేనా.. ఆదాయపు పన్నులు ఎగ్గొట్టేసి .. రాజకీయ నాయకులతో అంటకాగుతూ సొంత లాభాలు చూసుకోవడం కాదు.. ఎక్కడికక్కడ చిల్లర పాలిటిక్స్ చేస్తూ తమకు నచ్చనివాళ్లను తొక్కేసి నచ్చేవాళ్లకు మాత్రమే సినిమా ఛాన్సులు వచ్చేలా ఇండస్ట్రీ పాలిటిక్స్ చూడడం కూడా కాదు.. అభిమాన సంఘాలను రెచ్చగొట్టి తమ ఇమేజి కాపాడుకుంటూ హీరోయిజం వెలగబెట్టడం అసలే కాదు.మరి హీరో అంటే ఏమిటి ? తాను సంపాదించిన రూపాయితో పదిపైసలు ఈ సమాజం కోసం తిరిగి ఇచ్చేవాడు హీరో.. ఒక సాధారణమైన తనను హీరోలా నిలబెట్టి గుండెల్లో గుడికట్టి ఆరాధిస్తున్న అభిమానులకు .. సమాజానికి తనవంతుగా తిరిగి ఇస్తున్నవాడు అసలైన హీరో.. అలాంటి హీరో తమిళ సూపర్ స్టార్ సూర్య..వందల్లో డాక్టర్లు... వేలల్లో ఇంజినీర్లుఅగరం ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసిన సూర్య పేదల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ చదువుకోవాలని ఉన్నా ఆ ఆశ తీరని పేద పిల్లలకు తోడ్పాటును అందిస్తూ వస్తున్నారు.అగరం ఫౌండేషన్ – విద్య ద్వారా జీవన మార్పుచెన్నైలో 2006లో మొగ్గ తొడిగిన ఈ అగరం అగరం ఫౌండేషన్, తమిళనాడులోని పేద, వెనుకబడిన సామాజిక వర్గాల విద్యార్థులకు ఆశాకిరణంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను బడివైపు నడిపించే బాధ్యత ఈ సంస్థ చేపట్టింది. దాదాపు పదోహేనేళ్ళుగా ఈ మహాయజ్ఞంలో ఉన్న ఈ సంస్థ ఇప్పటికి దాదాపు ఏడువేల మంది వరకు పేద విద్యార్థులను బడివైపు నడిపించింది. ఈ ఫౌండేషన్ సాయంతో చదువుకున్న వారిలో దాదాపు 1800 మంది ఇంజినీర్లుగా ఎదిగారు .. మరో 51 మంది పేద పిల్లలు ఏకంగా డాక్టర్లు అయ్యారు. గతంలో సంస్థ వార్షికోత్సవంలో సూర్య పాల్గొనగా ఒక విద్యార్ధి మాట్లాడుతూ తన ఆశను కళలను నెరవేర్చింది సూర్య సార్ అని చెబుతూ.. తన కలలకు సూర్య సార్ రెక్కలు తొడిగి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించారని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. అదే కార్యక్రమంలో ఉన్న సూర్య కళ్ళలోంచి కూడా కన్నీరు ధారాపాతంగా కారడం .. ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే. ఉంది. ఇంకా వీరే కాకుండా వందలమంది రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఇంకొన్ని వేలమంది వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు.ప్రాధమిక విద్య అందించడమే కాకుండా ఉన్నత విద్య.. సాంకేతిక విద్య ఆర్జించాలనుకునే విద్యార్థులకు ఈ సంస్థ చేదోడుగా నిలుస్తోంది. పేదింటి పిల్లల ఆశల సౌధం నిర్మించుకునేందుకు అగరం ఒక్కో ఇటుకనూ పేరుస్తూ వస్తోంది. దీంతోబాటు దాదాపు 400 స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించింది ఈ సంస్థ . కరోనా సమయంలో తంజావూరులో ప్రభుత్వ ఆస్పత్రికి రూ. 25 లక్షల వైద్యపరికరాలు అందించారు. దీంతోబాటు అంతర్యుద్ధం.. ఆకలి పేదరికంతో పోరాడుతూ పొట్టచేతబట్టుకుని శ్రీలంక నుంచి వస్తున్నా శరణార్ధుల పిల్లలకు సైతం స్కాలర్షిప్ అందిస్తున్నారు.మనలో ఒకడిని సమాజం ఉన్నతంగా చూస్తుంటే సహించలేదు ఈ సమాజం.. అయన సేవల్లోని గొప్పతనానికి బదులుగా అందులో లోపాలు వెతికే రోజులివి.. కానీ సూర్య సేవలను కమల్ హాసన్ వంటి నటులు ఇది ఒక మౌనవిప్లవం.. నిశ్శబ్దంగా సమాజాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు అంటూ సూర్య చేపట్టిన ఈ దీక్షను కొనియాడారు. ఇంకో చిత్రం ఏమంటే ఇక్కడ చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లిన ఇంజినీర్లు.. డాక్టర్లు తాము కూడా సామాజిక బాధ్యతల్లో తలా ఓ చేయి వేస్తున్నారు. తమ వంతుగా వారు కూడా మరి కొందరు పేద పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. సూర్య, కార్తీల తండ్రి శివ కుమార్ వేసిన ఈ చిన్న మొక్కను ఇప్పుడు సూర్య, కార్తీ మహా వృక్షంగా మలిచారు. ఆ వృక్షం కింద వేలమంది అందండంగా చదువుకుంటూ తమ జీవితాలను వెలుగులవైపు నడిపిస్తున్నారు.Suriya Karthi Kamal #Karthi #Kamal #Suriya #Agaram pic.twitter.com/UvznU8OXPM— 𝙰𝚛𝚓𝚞𝚗 (@GaneshC32674824) August 5, 2025 -
నువ్వు నిజంగానే దేవుడివయ్యా.. సూర్యపై ప్రశంసలు
నటుడు సూర్య నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ అగరం ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. కాగా అగరం ఫౌండేషన్ స్థాపించి 15 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా చెన్నైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు శివకుమార్, సూర్య, కార్తీ, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్, వెట్రిమారన్ నిర్మాత కలైపులి ఎస్ ధాను, డ్రమ్స్ శివమణి ప్రముఖులు పాల్గొని, అగరం ఫౌండేషన్ విద్యా సేవలను కొనియాడారు. ఈ వేడుకకు నటుడు, మక్కల్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమలహాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నటుడు సూర్య మాట్లాడుతూ ఇది అగరం ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం అని విద్య అనేది ఆయుధం అన్నదే అగరం ఫౌండేషన్ నమ్మకం అని, అది ఈరోజు నిజం అయ్యిందని పేర్కొన్నారు. విద్య అనేది చదువు మాత్రమే కాదని విద్యార్థులకు మన సాంప్రదాయాన్ని నేర్పించేదన్నారు. వారి ప్రతిభను వెలికి తీసే పనిని అగరం ఫౌండేషన్ చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడే విద్యార్థులకు అగరం ఫౌండేషన్ విద్యాసేవలు అందిస్తుందని, విద్య ఎంత మార్పు తీసుకొస్తుందన్నది గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు తెలియజేయాలన్నదే ఆగరం ఫౌండేషన్ ప్రయత్నం అని సూర్య పేర్కొన్నారు. 15 ఏళ్ల ప్రయాణం..51 మంది వైద్యులుకాగా అగరం ద్వారా ఈ 15 ఏళ్లలో 51 మంది విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించి, వైద్యులు అయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ సంస్థ నుంచి సుమారు 8 వేలకు పైగానే విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకుని వివిధ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. రెట్రో సినిమా లాభాల్లోంచి రూ.10 కోట్లు అగరం ఫౌండేషన్‌కు సూర్య విరాళంగా ఇచ్చారు. పేదవారికి అండగా నిలబడుతున్న సూర్య నిజంగానే దేవుడు అంటూ సోషల్‌మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కమలహాసన్ మాట్లాడుతూ విద్య,ప్రేమ ఒకే చోట లభించడం సాధ్యం కాదన్నారు. అయితే అది అమ్మ వద్ద, అగరం వద్ద లభిస్తాయన్నారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వారికి లభించేది ముళ్ల కిరీటాలేన్నారు. తాను విద్యను నేర్చుకునే తీరుతాను, ఇతరులకు నేర్పించే తీరుతాను అనేది ఒక సాగదీత ప్రక్రియగా పేర్కొన్నారు. 2017 తర్వాత విద్యార్థుల వైద్యవిద్య అనేది కొనసాగలేక పోతోందన్నారు. కారణం నీట్ పరీక్ష అని పేర్కొన్నారు. అందుకే నీట్ పరీక్షలు వద్దని తాము చెబుతున్నామన్నారు. అందుకు చట్టాన్ని మార్చే బలం విద్యకే ఉందన్నారు. విద్య అనేది ఈ యుద్ధంలో ఆయుధంగా మాత్రమే కాదని, దేశాన్ని చక్కదిద్దేది కూడా అని అన్నారు. సనాతన సంకెళ్లను, సర్వాధికార సంకెళ్లను నుగ్గు నుగ్గు చేసే ఆయుధం విద్య అని కమలహాసన్ పేర్కొన్నారు. -
సూర్యకు హీరోయిన్గా సంగీత దర్శకుడి సోదరి!
సూర్య.. కొన్నాళ్ల క్రితమే 'రెట్రో'తో ప్రేక్షకుల్ని పలకరించాడు. తమిళంలో పర్లేదు గానీ తెలుగులో ఘోరమైన డిజాస్టర్ అయింది. ప్రస్తుతం 'కరుప్పు' అనే మూవీ చేస్తున్నాడు. దీనికి ఆర్జే బాలాజీ దర్శకుడు. కొన్నిరోజుల క్రితం గ్లింప్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీనితో పాటు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితోనూ సూర్య ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులోనే ప్రముఖ సంగీత దర్శకుడి సోదరి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి భవాని శ్రీ.. సూర్య-వెంకీ అట్లూరి మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. భవాని శ్రీ ఇంతకుముందు పావ కథైగల్, కాపే రణసింగం సినిమాల్లో హీరోయిన్గా చేసింది. సూరికి జంటగా 'విడుదలై' చిత్రంలోనూ కథానాయికిగా నటించింది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో ఈమె పాత్ర ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు చేస్తోంది. మరి భవాని శ్రీ కూడా సూర్యకు హీరోయిన్ లేదా మరేదైనా పాత్ర అనేది తెలియాల్సి ఉంది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన 'బిగ్‌బాస్' ఫేమ్ గౌతమ్) -
సూర్య అంటే చేయూత!
సాక్షి, చెన్నై: సేవా గుణం కలిగిన అతి తక్కువ మంది తమిళ నటుల్లో సూర్య ముందుంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. ఈ నటుడిలో ఎంత పెద్ద కథానాయకుడు ఉన్నాడో అంత మంచి విద్యాదాత ఉన్నారు. విద్యాదానంలో తన తండ్రి నటుడు శివకుమార్‌ను స్ఫూర్తిగా తీసుకొని సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా అనేక మందిని చదివిస్తూ వారి ఉన్నత కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిభ ఉండి చదువుకునే స్థోమత లేని పేద విద్యార్థులకు ప్రతి ఏడాది ఆర్థికసాయం, ప్రశంసా పత్రాలతో ప్రోత్సహిస్తున్నారు. ఈయన సేవా దాతృత్వం గురించి ఇటీవల స్టంట్ మాస్టర్ సెల్వ చెబుతూ గత పదేళ్లుగా సూర్య తమిళ సినిమాకు సంబంధించిన స్టంట్ మాస్టర్లకు ఏడాదికి అందరికి కలిపి రూ.10లక్షలు ఇన్సూరెన్స్ కడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ఎవరితోనూ చెప్పలేదని పేర్కొన్నారు. అంతటి మానవత్వం కలిగిన సూర్య బుధవారం 50 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో నాలుగు రోజుల నుంచే ఆయన అభిమానులు పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టారు. అలా సూర్య సేవా సంఘం తరఫున ఉత్తర చెన్నై ప్రాంతంలో రూ.2లక్షల విలువైన సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కుట్టుమిషన్లు, 150 మంది మహిళలకు చీరలు, 50 మంది పురుషులకు పంచెలు, 150 మంది విద్యార్థులకు చదువు ఉపకరణాలు, 150 మంచి నీటి బిందెలు, పదిమంది వృద్ధులకు ఆర్థికసాయం అందించారు. ఈసేవా కార్యక్రమంలో 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ నిర్మాత రాజశేఖర్ పాండియన్ పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 45వ చిత్రం కడుప్పు. ఈ చిత్రం దీపావళికి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం తన 46 వ చిత్రాన్ని టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. -
హీరో సూర్య బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?
తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే మహాప్రేమ. భాషతో సంబంధం లేకుండా ఏ మాత్రం బాగున్నా ఏ మూవీనైనా చూసి పడేస్తారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్నారో ఏమో గానీ కొందరు దక్షిణాది దర్శకనిర్మాతలు మనోళ్లని మరీ లైట్ తీసుకుంటున్నారే అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నాళ్ల నుంచి దాదాపు ఒకేలాంటి తప్పు మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?ఒకప్పుడు ఏ భాషకు చెందిన సినిమా అయినా సరే తెలుగులో డబ్ చేస్తున్నారంటే కనీస జాగ్రత్తలు తీసుకునేవారు. సినిమాలో తమిళ పదాలకు బదులు తెలుగు ఉండేలా చూసుకునేవారు. టైటిల్‌తోపాటు మూవీలోని పాత్రలకు కూడా తెలుగు పేర్లే పెట్టేవారు. గత కొన్నేళ్లలో మాత్రం అలాంటిది అస్సలు పాటించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలావరకు తమిళ దర్శకనిర్మాతలు యధాతథంగా తమ టైటిల్స్ తెలుగులోనూ అలానే ఉంచేస్తున్నారు. వేట్టయాన్, పొన్నియిన్ సెల్వన్, కంగువ, మార్గన్, తుడరుమ్.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడు ఉదాహరణలు.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))అంతెందుకు ఇప్పుడు సూర్య కొత్త సినిమాకు 'కరుప్పు' టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి తెలుగులో నలుపు అని అర్థం. ఎంత సూర్య అయినా సరే పేరు కాస్త తెలుగులో ఉంటేనే కదా.. మూవీ జనాలకు రీచ్ అవుతుంది. అలా కాదని చెప్పి యధాతథంగా టైటిల్స్ పెట్టుకుంటే పోతే ఇది మనం చూసే సినిమా కాదేమో మనవాళ్లు లైట్ తీసుకునే అవకాశముంది. చూడాలి మరి భవిష్యత్తులోనైనా ఈ తీరు మార్చుకుంటారా లేదా అనేది?సూర్య పుట్టినరోజు సందర్భంగా 'కరుప్పు' సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ ఆన్ యాక్షన్‌తో పాటు మాస్ సీన్స్ బాగానే ఉన్నాయి. వింటేజ్ చిత్రాలైన 'గజిని', 'భాషా' సినిమాల్ని గుర్తుచేసే కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయండోయ్. అంతా బాగానే ఉంది గానీ టీజర్లోనూ తమిళ ఫ్లేవర్ కాస్త గట్టిగానే కొట్టింది. మరి దీన్ని మన ఆడియెన్స్ ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి? దీపావళికి ఈ సినిమా థియేటర్లలోకి రావొచ్చని టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన) -
సూర్య కొత్త సినిమా టీజర్ రిలీజ్
'కంగువ'తో ఓ రేంజులో దెబ్బతిన్న సూర్య.. 'రెట్రో'తో కొంతమేర పర్వాలేదనిపించుకున్నాడు. ఎందుకంటే తమిళంలో మోస్తరుగా ఆడిన ఈ చిత్రం.. తెలుగులో మాత్రం ఘోరమైన ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'కరుప్పు' మూవీతో వస్తున్నాడు. బుధవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))'కరుప్పు' అంటే తమిళంలో నలుపు అని అర్థం. మరి దర్శకనిర్మాతలు ఏం ఆలోచించారో ఏమోగానీ అదే టైటిల్‌ని యధాతథంగా ఉంచేశారు. టీజర్ చూస్తుంటే కూడా తమిళ ఫ్లేవర్ ఎక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే మాస్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష హీరోయిన్గా చేస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకుడు.(ఇదీ చదవండి: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన) -
రాముడిగా సూర్య, రావణుడిగా మోహన్‌బాబు, నేనేమో..: విష్ణు మంచు
మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) అని అందరికీ తెలుసు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో ఈ సినిమా తీశాడు. అందులో తనే కన్నప్ప పాత్రను పోషించాడు. మహాభారత్ సీరియల్ డైరెక్ట్ చేసిన ముకేశ్ కుమార్ ఈ చిత్రాన్ని అందంగా తెరకెక్కించాడు. జూన్ 27న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇటీవల రాష్ట్రపతి భవన్‌లోనూ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.2009లోనే..అయితే విష్ణు.. కన్నప్ప కంటే ముందు రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని ప్రయత్నించాడట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు మంచు మాట్లాడుతూ.. రావణుడి పుట్టుక నుంచి చావు వరకు ఏమేం జరిగిందనే కథంతా నా దగ్గరుంది. దీనిపై సినిమా తీయాలని నేను గతంలోనే అనుకున్నాను. ఈ ప్రాజెక్టులో సూర్య రాముడిగా నటిస్తే బాగుంటుందనుకున్నాను. ఇదే విషయం గురించి మాట్లాడేందుకు 2009లో సూర్యను కూడా సంప్రదించాను.హనుమంతుడిగా చేయాలనుకున్నా..రాఘవేంద్రరావును డైరెక్టర్‌గా అనుకున్నాను. అయితే రాఘవేంద్రరావుకు నేను హనుమంతుడి రోల్ చేయడం ఇష్టం లేదు. ఇంద్రజిత్తుడి పాత్ర చేస్తే బాగుంటుందన్నారు. రావణుడి పాత్ర మా నాన్న పోషించాల్సింది. స్క్రిప్టు.. డైలాగులు అన్నీ పూర్తయ్యాయి, కానీ బడ్జెట్ సమస్య వల్ల సినిమా పట్టాలెక్కలేదు. భవిష్యత్తులో రామాయణ మూవీ చేస్తానో, లేదో కూడా తెలీదు! సీతగా ఎవరంటే?ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం రాముడిగా మళ్లీ సూర్యనే ఎంపిక చేసుకుంటాను. సీతగా ఆలియాభట్‌ను సెలక్ట్ చేస్తాను. రావణుడిగా మా నాన్నను కాకుండా ఎవరినీ ఊహించుకోలేను. హనుమంతుడి పాత్ర నేనే చేస్తాను. ఇంద్రజిత్తుగా సూర్య సోదరుడు కార్తీ, లక్ష్మణుడిగా కళ్యాణ్ రామ్, జటాయువుగా సత్యరాజ్ చేస్తే బాగుంటుంది అని విష్ణు చెప్పుకొచ్చాడు.భారీ బడ్జెట్‌తో బాలీవుడ్లో రామాయణప్రస్తుతం బాలీవుడ్లో రామాయణ సినిమా తెరకెక్కుతోంది. నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. యష్ రావణుడిగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రామాయణ నిలిచింది. ఈ మూవీ మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.చదవండి: నా జీవితానికి వెలుగు నీవే.. సితారకు మహేశ్ బర్త్‌డే విషెస్ -
సూర్య, దీపికా పదుకొణెలతో 8 వసంతాలు..: డైరెక్టర్
8 వసంతాలు (8 Vasantalu Movie).. ఇది ప్రేమ కథ కాదు, ప్రేమ కావ్యమని చెప్పొచ్చు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి దుగ్గిరాల, హనురెడ్డి, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించారు. కవిత్వం, భావుకత పుష్కలంగా ఉన్న ఈ సినిమా చాలామందికి నచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు మొదట స్టార్ హీరోహీరోయిన్లను అనుకున్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సూర్య, దీపికతో..ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ.. 8 వసంతాలు మూవీ పెద్దవాళ్లతో చేద్దామనుకున్నాను. సూర్య, దీపికా పదుకొణెను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అందుకే డైలాగులు అంత బలంగా ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ దగ్గరకు కథ తీసుకెళ్లినప్పుడు కొత్తవాళ్లతో అయితే ఇంకా బాగుండొచ్చు అన్నారు. పెద్దవాళ్లతో అంటే ఇబ్బందులు ఎదురవొచ్చేమో, కథ ఎక్కడైనా పాడవుతుందేమో.. ఒక్కసారి ఆలోచించు అన్నారు. అప్పుడు నేను ఆలోచించి కొత్తవాళ్లతో ముందుకు వెళ్లాను అని చెప్పుకొచ్చారు.చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
వెకేషన్లో సూర్య దంపతులు.. వీడియో షేర్ చేసిన జ్యోతిక!
రెట్రో మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ డైరెక్టర్‌తో జతకట్టారు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరితో కలిపి పనిచేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో సూర్య తన కూతురితో కలిసి పాల్గొన్నారు. ఈ చిత్రంలో ప్రేమలు ఫేమ్ మమతా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా విరామం రావడంతో విదేశాల్లో వాలిపోయారు సూర్య. తన భార్య జ్యోతికతో కలిసి ఫారిన్లో చిల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్ ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇవీ చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదు అయింది. ఏప్రిల్ 26న జరిగిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో గిరిజనులను అవమానించలేలా మాట్లాడారంటూ విజయ్‌పై గిరిజన సంఘం నాయకుడు అశోఖ్ కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హీరో వ్యాఖ్యలపై విచారణ జరిపుతున్నట్లు వారు వివరించారు.ఇంతకీ ఏం జరిగింది?ఈ ఏడాది ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో తమిళ హీరో సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని విజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చాయని, వారిని అవమానించాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్‌కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేడయంతో విజయ్‌పై కేసు నమోదు చేశారు.అప్పుడే స్పందించిన విజయ్ఈ వివాదంపై విజయ్ అప్పుడే స్పందించాడు. తాను ట్రైబ్స్ అనే పదం వాడిన మాట నిజమే కానీ.. దాని అర్థం గిరిజనులు కాదని చెప్పారు. ‘వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. ఆ సెన్స్‌లోనే ట్రైబ్స్ అనే పదం వాడాను. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్‌ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయితే విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని విజయ్ అప్పుడే సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు. -
సూర్య- ఆర్జే బాలాజీ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్
హీరో సూర్య 45వ చిత్రం ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. గతేడాదిలో పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. నటుడు ఆర్జే బాలాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటి త్రిష హీరోయిన్గా నటించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.సూర్య- ఆర్జే బాలాజీ ప్రాజెక్ట్‌కు 'కరుప్పు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదే ఏడాది చివరలో కరుప్పు విడుదల కావచ్చని సమాచారం. రేటియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించిన ఆర్జే బాలాజీ మల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే. ఆయన నటుడు, గాయకుడు మాత్రమే కాదు, దర్శకుడిగానూ కొలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. నయనతారతో ‘అమ్మోరు తల్లి’ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘వీట్ల విశేషం’ అంటూ సత్యరాజ్‌తో ఓ మూవీ తీసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు హీరో సూర్యతోనే ఛాన్స్ దక్కించుకుని హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. -
ప్లాప్ సినిమాకి సీక్వెల్ ప్లాన్
-
కూతురుతో హైదరాబాద్‌కు సూర్య.. యంగ్ లుక్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది 50 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్నప్పటికీ, చూడటానికి 30 ఏళ్ల యువకుడిలా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వయసుతో పాటు ఆయన అందం కూడా పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ మరింత ఫిట్‌గా, హ్యాండ్సమ్గా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా, సూర్య తన కూతురు దియాతో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఈ వీడియోలో సూర్య, దియా తండ్రి-కూతుళ్లలా కాకుండా అన్నా-చెల్లెల్లా కనిపించారు. సూర్య యంగ్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అవుతూ, ‘మా హీరో రోజురోజుకూ మరింత యంగ్‌గా మారుతున్నాడు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వీడియోని షేర్ చేస్తున్నారు.సూర్య ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి ఆధ్వర్యంలో కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే తన కూతురు దియాని కూడా వెంటబెట్టుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో టీషర్ట్‌లో సింపుల్‌గా కనిపించిన సూర్య, తన ఫిట్నెస్తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.సూర్య కూతురు దియా సాధారణంగా పబ్లిక్‌లో ఎక్కువగా కనిపించదు. ఆమెకు సంబంధించిన వివరాలు కూడా పెద్దగా బయటకు రాలేదు. ఇటీవల దియా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, ఆ ఫోటోలను సూర్య భార్య జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. చదువు పూర్తి చేసిన దియా ఇప్పటి వరకు సినిమా రంగంలోకి అడుగుపెట్టలేదు. అయితే, తండ్రితో కలిసి షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం ఆసక్తికరంగా మారింది. ఎయిర్‌పోర్ట్‌లో సూర్య, దియా కలిసి నడుచుకుంటూ వెళ్లిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సూర్య ఫిట్నెస్, యంగ్ లుక్కు అభిమానులు మరోసారి ఆకర్షితులవుతూ, అతడి స్టైల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. Exclusive @Suriya_offl ❤️ #Suriya46 pic.twitter.com/3a5nMaE9Au— Suriya Fanatics Kerala ™ (@TeamSFK__Offl) June 8, 2025 -
కమల్ సంస్థలో రోలెక్స్.. భారీ బడ్జెట్‌తో ప్లాన్
కథానాయకుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తున్న నటుడు కమలహాసన్. ఈయన ఇటీవల తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శివకార్తికేయన్ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం అమరన్. నటి సాయిపల్లవి నాయకిగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా తాజాగా కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో మెడ్రాస్ టాకీస్తో కలిసి రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన థగ్‌లైఫ్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తదుపరి కమలహాసన్ ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించి, ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా తాజాగా కమలహాసన్ మరో చిత్రం నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి యు.అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఈయన ఇంతకు ముందు సిద్ధార్థ్ హీరోగా చిత్తా, విక్రమ్ కథానాయకుడిగా వీర ధీర శూరన్ వంటి సక్సెస్‌పుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రంలో నటించే హీరో ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నా, చివరికి నటుడు సూర్య ఈ చిత్రంలో హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సూర్యతో నిర్మించనున్న ఈ సినిమా కోసం కమల్ భారీ బడ్జెట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.సూర్య ఇంతకు ముందు కమలహాసన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన విక్రమ్ చిత్రంలో రోలెక్స్ అనే పాత్రలో అతిథిగా మెరిసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సూర్య హీరోగా అరుణ్‌కుమార్ దర్శకత్వంలో నటించనున్న చిత్రం గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. కాగా ప్రస్తుతం సూర్య తన 45వ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉంటూనే తన 46వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. -
టాలీవుడ్‌పై సూర్య ఫోకస్.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా క్యాన్సిల్?
హీరో సూర్యకు గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ అనేదే లేదు. 'విక్రమ్' మూవీలో రోలెక్స్ అనే అతిథి పాత్ర తప్పితే చెప్పుకోదగ్గ మూవీస్ రావట్లేదు. గత రెండు చిత్రాల్లో 'కంగువ' అట్టర్ ఫ్లాప్ కాగా, గత నెలలో వచ్చిన 'రెట్రో'.. తమిళంలో మాత్రం కలెక్షన్ సాధించింది. ఇది తప్పితే హిట్ కాదు. ఇలా కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్న సూర్య.. ప్రస్తుతం తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి మూవీపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. అలానే టాలీవుడ్‌పైనే గట్టిగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ప్రభాస్‌కి నో-బన్నీతో ఫిక్స్.. దీపిక ప్లాన్ ఏంటి?)ప్రస్తుతం తెలుగు దర్శకులతో పనిచేసేందుకు సూర్య ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ క్రమంలో గతంలో కమిట్ అయిన 'వడివాసల్' అనే చిత్రాన్ని పక్కనబెట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది. తమిళంలో స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్.. సూర్యతో ఈ సినిమా తీయాలని అనుకున్నాడు. మూడేళ్ల క్రితం ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగాయి. ఏమైందో ఏమో గానీ ఈ ప్రాజెక్ట్ అలా సైడ్ అయిపోయింది. స్క్రిప్ట్ ఇంకా పూర్తిస్థాయిలో సెట్ కాకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది.మరోవైపు పాన్ ఇండియా ట్రెండ్‌లో పలువురు టాలీవుడ్ దర్శకులు ముందు వరసలో ఉన్నారు. దీంతో సూర్య ఇప్పుడు ఫోకస్ అంతా తెలుగు ఇండస్ట్రీపై పెట్టాడని తెలుస్తోంది. ఈ రూమర్స్ బట్టి చూస్తుంటే త్వరలో సూర్య.. స్ట్రెయిట్ తెలుగు మూవీస్ మరిన్ని చేస్తాడేమో అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. కానీ అందుకు తగ్గ సినిమాలు సెట్ కావట్లేదు. సూర్యని ప్రస్తుత తరం తమిళ దర్శకులు సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ కారణంతోనే ఇకపై యువ దర్శకులకు ఛాన్స్ ఇవ్వాలని సూర్య అనుకుంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
మారిపోతున్న సూర్య ఆ మూవీస్ ఇక లేనట్టే
-
క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్న 'సూర్య'
కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్, సూర్య కథానాయకుడిగా వాడివాసల్ చిత్రం చేయడానికి చాలా కాలం నుంచి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి సూర్య తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పనుల్లోనే సూర్య బిజీగా ఉన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అయితే, వెట్రిమారన్ తన తర్వాతి సినిమాను హీరో శింబుతో తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారట.కోలీవుడ్ హీరో శింబు గత రెండేళ్లకు పైగా ఎలాంటి చిత్రంలో నటించలేదు. తాజాగా కమలహాసన్‌తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో థగ్‌లైఫ్ చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు వరుసగా చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దేశింగు పెరియస్వామి దర్శకత్వంలో ఒక చిత్రం, పార్కింగ్ చిత్రం రాంకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం, అశ్వద్ మారి ముత్తు దర్శకత్వంలో ఇంకో చిత్రం, అంతేకాకుండా ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నిర్మించే చిత్రంలోనూ నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో చిత్రాన్ని శింబు కమిట్ అయినట్లు తెలిసింది. వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీన్ని వి.క్రియేషన్‌న్స్ సంస్థ నిర్మించనుందని టాక్.. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. -
ఇక షురూ
తమిళనాడులోని పళని దేవాలయానికి హీరో సూర్య అండ్ టీమ్ వెళ్లారు. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మమితా బైజు హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ నెల 9న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.ఈ సందర్భంగా పళని దేవాలయంలో మురుగన్‌ని దర్శించుకుని, పూజలు నిర్వహించి, ‘‘ఓ మేజర్ స్టెప్ వేసేందుకు సన్నద్ధమౌతున్నాం. దేవుడి ఆశీర్వాదం కోసం పళని దేవాలయానికి వచ్చాం’’ అని యూనిట్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
మళ్లీ సింగం గెటప్ తో సూర్య..
-
కూతురు గ్రాడ్యుయేషన్ వేడుకల్లో హీరో సూర్య
స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ టైంలో మాత్రం 'కంగువ', 'రెట్రో' చిత్రాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇవన్నీ పక్కనబెడితే కొన్నాళ్ల క్రితం సూర్య ఫ్యామిలీ గురించి అనుకోని కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు కూతురు గ్రాడ్యుయేషన్‌తో వాటన్నింటికీ చెక్ పెట్టినట్లయింది.తమిళంలో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్న సూర్య.. తనతో పాటు కలిసి నటించిన జ్యోతికని 2006లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరమైంది. కూతురు దియా, కొడుకు దేవ్ కాస్త పెద్దోళ్లు అయిన తర్వాత నటిగా రీఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం పిల్లల్ని పట్టుకుని జ్యోతిక.. ముంబైలోని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది. దీంతో లేనిపోని రూమర్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)జ్యోతిక ముంబైలో, సూర్య చెన్నైలో ఉంటున్నారని.. ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయనే కామెంట్స్ వినిపించాయి. కానీ తాజాగా కూతురు దియా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో అటు సూర్య తల్లిదండ్రులు, ఇటు జ్యోతిక పేరెంట్స్ పాల్గొన్నారు. అందరూ ఒక్కచోట కనిపించడంతో ఇప్పటివరకు వినిపించిన మాటలన్నీ రూమర్స్ అని క్లారిటీ వచ్చేసింది.సూర్య కూతురు దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు. ప్రస్తుతం ఇంటర్మీడియట్(ప్లస్ టూ) పూర్తి చేసింది. త్వరలో పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంది. మరి తల్లిదండ్రుల్లా దియా కూడా ఇండస్ట్రీలోకి వస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం చూడటానికి మాత్రం హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంత అందంగా ఉంది. మరి జ్యోతిక.. తన కూతురి గురించి ఏం ఆలోచిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!) -
'సూర్య'ను కాదనుకున్న కీర్తి సురేశ్.. తెలుగు హీరో కోసమేనా?
కీర్తి సురేశ్.. చిత్ర పరిశ్రమలో ఎలాంటి పాత్రలోనైనా సరే తన నటనతో సత్తా చూపించగలరు. తమిళ హీరో సూర్య కూడా ఆ కోవకు చెందిన నటుడిగానే గుర్తింపు ఉంది. అయితే, సూర్యతో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ కీర్తి వదులుకుందని వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత కీర్తి మళ్లీ బిజీ అవుతుంది. బాలీవుడ్ తన మొదటి సినిమా 'బేబీ జాన్' నిరాశ పరిచినప్పటికీ మళ్లీ అక్కడే మరో ఛాన్స్ దక్కించుకుంది. కీర్తి కోసం ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థ విధానంపై బాలీవుడ్లో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారు. నటుడు రాజ్‌కుమార్ రావుతో (Raj Kumar Rao) కలిసి కీర్తి నటించనున్నట్లు సమాచారం. ‘సెక్టార్ 36’ ఫేమ్ ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.అదే విధంగా తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా కీర్తి సురేశ్( Keerthy Suresh) నటించే ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో తమిళం, తెలుగు భాషల్లో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 46వ చిత్రంలోనూ కథానాయకిగా నటించే అవకాశం ఆమెను వరించిందట, అయితే ఆమె విజయ్‌దేవరకొండకు జంటగా నటించనున్నడం వల్ల సూర్యతో కలిసి నటించే ఛాన్స్‌ను వదులుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంతనో తెలియాల్సి ఉంది. మొత్తం మీద కీర్తి వివాహానంతరం మళ్లీ బిజీ అవుతున్నారన్నమాట. కాగా ఈమె ఇంతకుముందు సూర్యకు జంటగా 'గ్యాంగ్' చిత్రంలో నటించారన్నది గమనార్హం. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సూర్య.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్గా రెట్రోతో మెప్పించిన ఆయన తాజాగా మరో సినిమాను మొదలుపెట్టారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. సార్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో సౌత్ చిత్రపరిశ్రమలో తనదైన ముద్రను వెంకీ అట్లూరి వేశారని చెప్పవచ్చు. -
హైదరాబాద్ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం
కోలీవుడ్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా పెట్టాలెక్కింది. సూర్యకు రెట్రో, వెంకీ అట్లూరికి లక్కీ భాస్కర్ చిత్రాలు మంచి విజయాన్ని ఇచ్చాయి. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్‌ను తాజాగా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటిస్తుంది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు.హిట్ ఫిల్మ్ ‘సార్’ (2023) (తమిళంలో ‘వాతి’), దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ సినిమాల కోసం ఇతర భాషలకు చెందిన హీరోలను ఎంపిక చేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ఇప్పుడు మళ్లీ తమిళ హీరో సూర్యతో మరో సినిమా ప్లాన్ చేయడం విశేషం. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
'రెట్రో' కలెక్షన్స్ విడుదల.. సూర్య కెరీర్లో ఇదే టాప్
రెట్రో సినిమాతో సూర్య భారీ హిట్ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. సూర్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చినా రెట్రో మాత్రం ఆ లోటును తీర్చింది. అయితే, తెలుగులో అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా మే 1న రెట్రో విడుదలైంది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించగా.. జోజూ జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. యాక్షన్‌తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్‌స్టర్‌గా సూర్య ఇందులో నటించాడు.రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో అత్యధికంగా తమిళనాడులోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సూర్య కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మొదటి స్థానంలో రెట్రో ఉంది. ఆ తర్వాత 24 మూవీ రూ. 157 కోట్లు, సింగం2 రూ. 122 కోట్లు, కంగువా రూ. 106 కోట్లు, 7th సెన్స్ రూ. 113 కోట్లు, సికిందర్ రూ. 95 కోట్లతో వరుసగా ఉన్నాయి. రెట్రో సినిమాకు 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ భారీగానే దెబ్బ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం టాక్ బాగుండటంతో కోలీవుడ్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. లేదంటే రెట్రో కలెక్షన్స్ సులువుగా రూ. 300 కోట్లకు దగ్గర్లో ఉండేవని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.Dear Audience and #AnbaanaFans, we're humbled by your immense love and support for #TheOne ‼️ Grateful for the glory, it's all because of you ❤#RETRO@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian… pic.twitter.com/wScjYwaqu4— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 18, 2025 -
దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ
సినిమాలు ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కానీ కొన్ని చూసినప్పుడు మాత్రం దానిలో ఎమోషన్ మనసుల్ని తాకుతుంది. మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది. అలాంటి చిత్రమే 'సత్యం సుందరం'. కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది రిలీజైంది. దీనికి '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకుడు.(ఇదీ చదవండి: సూర్యకు గిఫ్ట్ ఇచ్చిన 'రెట్రో' డిస్ట్రిబ్యూటర్..)గతేడాది సినిమా వచ్చింది. కమర్షియల్ గా హిట్ కాలేదు గానీ చాలామంది ప్రేక్షకులకు మాత్రం సినిమా నచ్చింది. సరే ఇప్పుడు ఈ విషయం ఎందుకా అంటారా? దర్శకుడు ప్రేమ్ కుమార్ కి ఇప్పుడు సూర్య-కార్తీ మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. ఎందుకంటే ప్రేమ్ చాన్నాళ్ల నుంచి ఈ కారు కొనుక్కుందామని అనుకుంటుండగా.. ఇప్పుడు సూర్య-కార్తీ ఇతడి కల నెరవేర్చారు. ప్రేమ్ కుమార్ ఇన్ స్టా పోస్ట్ చూస్తే ఇది అర్థమైపోయింది.'మహీంద్ర థార్ నా డ్రీమ్ కారు. కొన్ని కారణాల వల్ల 5 డోర్స్ వెర్షన్ కోసం నేను ఎదురుచూస్తున్నాను. ప్రత్యేకంగా డిజైన్ చేసిన థార్ ఆర్ఓఎక్స్ఎక్స్ ఏఎక్స్ 5ఎల్ 4x4 మోడల్ లో వైట్ కలర్ కారు కొనాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. నా దగ్గర డబ్బులున్నా సరే కారు రావడానికి చాలారోజులు పట్టేస్తుంది. దీంతో రాజా సర్ సాయం అడిగా''ఒకానొక సందర్భంలో కారు కొనడం కంటే అవసరాలు ఎక్కువైపోయాయి. దీంతో కారు కోసం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చుయిపోయాయి. కల చెదిరిపోయింది. ఇదంతా రాజా సార్ కి చెప్తే సైలెంట్ గా ఉండిపోయారు. కానీ నిన్న సూర్య అన్న నుంచి కారు ఫొటో మెసేజ్ వచ్చింది. నేను ఫస్ట్ షాకయ్యాను. వెంటనే రాజా సర్ కి ఫోన్ చేసి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని చెబితే.. ఆయన నవ్వి, ప్రేమ్ ఇది నీకు సూర్య సర్ ఇస్తున్న గిఫ్ట్ అని అన్నారు. దీంతో నాకు మాట రాలేదు. సూర్య సర్ ఇంటికి వెళ్లి కార్తీ అన్న చేతుల మీదుగా కారు అందుకున్నాను''ఇదంతా ఇంకా కలలానే అనిపిస్తుంది. నేను దీన్ని బహుమతిలా చూడటం లేదు. నేను దీన్ని అన్నయ్యలు తమ్ముడికి నెరవేర్చిన కలలా భావిస్తున్నాను. థ్యాంక్స్ సూర్య అన్న, థ్యాంక్స్ కార్తీ బ్రదర్, థ్యాంక్స్ రాజా సర్' అని ప్రేమ్ కుమార్ రాసుకొచ్చాడు. మార్కెట్ లో ప్రస్తుతం ఈ కారు ధర రూ.25 లక్షల వరకు ఉంది. ఇకపోతే ప్రేమ్ కుమార్ ఇప్పుడు '96' సీక్వెల్ స్క్రిప్ట్ రాస్తూ బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: రూ.10 కోట్లు దానం చేసిన హీరో సూర్య) View this post on Instagram A post shared by Premkumar Chandran (@prem_storytelling)


