సూర్య 'రెట్రో' ట్రైలర్ రిలీజ్ | Suriya Retro Trailer Telugu | Sakshi
Sakshi News home page

Retro Trailer: సూర్య-కార్తిక్ సుబ్బరాజ్ 'రెట్రో' ట్రైలర్ చూశారా?

Apr 18 2025 7:09 PM | Updated on Apr 18 2025 7:09 PM

Suriya Retro Trailer Telugu

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. ఇతడి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు చాలామంది ఎదురుచూస్తుంటారు. కానీ గతకొన్నాళ్లులో సూర్యకు సరైన హిట్ పడలేదు. దీంతో 'రెట్రో' మూవీపై బాగానే ఆశలు పెట్టుకున్నాడు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)  

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాపై ఓ మాదిరి అంచాలు ఉన్నాయి. రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న 'కనిమ' సాంగ్ ఇందులోనిదే. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి.

ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతమందించాడు. మే 1న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. గతేడాది 'కంగువ'తో సూర్యకు చాలా గట్టిగా దెబ్బ పడింది. మరి 'రెట్రో'తో హిట్ కొడతాడో లేదో చూడాలి?

(ఇదీ చదవండి: జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement