లూగర్ చూపు శ్రీలంక వైపు పడిందని తెలిసింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డ్రాగన్’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
1967 నేపథ్యంలో ఓపీఎం అక్రమ రవాణా ప్రధానాంశంగా ఈ సినిమా కథ సాగుతుందని, ఇప్పటికే విడుదలైన ‘డ్రాగన్’ గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ఇందులో లూగర్ పాత్రలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ పాత్రలో విభిన్న కోణాలు ఉన్నాయని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఎన్టీఆర్, రుక్మిణీ వసంత్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. కాగా, ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ని శ్రీలంకలో ప్లాన్ చేశారట. ఈ శ్రీలంక షెడ్యూల్‌ను మేకర్స్ ఆగస్టులోనే ప్లాన్ చేశారు.
కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయం కావడం వల్ల కుదరలేదు. ఇప్పుడు వీలు పడటంతో ఈ షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నారట ప్రశాంత్ నీల్. ఒకవేళ శ్రీలంక కుదరకపోతే ముందుగా గుజరాత్‌లో కొంత చిత్రీకరణ జరిపి, ఆ తర్వాత శ్రీలంకకు షిఫ్ట్ అవ్వాలని కూడా చూస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.


