వివాదంలో ‘ఆదర్శ కుటుంబం’.. నిర్మాత ఆవేదన | Jim Jim Tara Song Issue Aadarsha Kutumbam Movie | Sakshi
Sakshi News home page

‘ఆదర్శ కుటుంబం’లో వైరల్ పాట వినియోగంపై నిర్మాత అభ్యంతరం

Oct 31 2026 1:05 PM | Updated on Oct 31 2026 1:14 PM

Jim Jim Tara Song Issue Aadarsha Kutumbam Movie

విడుదలకు సిద్ధమవుతున్న ‘పర్ణశాల’ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాటని ‘ఆదర్శ కుటుంబం’లో అనుమతి లేకుండా ఉపయోగించడంపై నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హీరో వెంకటేశ్‌కి సంబంధించిన ఓ సన్నివేశంలో తమ సినిమా పాటని వినియోగించడం అన్యాయమని పేర్కొన్నారు. చిన్న సినిమాను బ‌తికించండని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47' మూవీ రివ్యూ)

మీడియాతో మాట్లాడిన నిర్మాత‌ వెంకట్.. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేసిన తమ సినిమా పాటని, అనుమతి లేకుండా మరో చిత్రంలో ఉపయోగించడం వల్ల ‘పర్ణశాల’ సినిమాకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇలాంటి చర్యలు చిన్న సినిమాల మనుగడకు ఇబ్బందికరంగా మారుతాయి. ఇకపై తమ పాటను అనుమతి లేకుండా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.

మంచి వెంకట్ నిర్మిస్తున్న ‘పర్ణశాల’ చిత్రానికి వై.జి.భరత్ దర్శకుడు. హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘జిమ్ జిమ్ తార’ పాటను లక్ష్మీదేవితో పాడించి చిత్ర బృందం వినూత్నంగా ప్రచారం చేపట్టింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' తొలిరోజు కలెక్షన్ ఎంత?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement