తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈయన పెద్దమ్మ అమల్ రాజశేఖరన్(92) వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. విజయ్ తండ్రి చంద్రశేఖరన్ సోదరుడు రాజశేఖరన్ భార్యనే అమల్. ఈమె వయసు మీద పడటానికి తోడు వృద్ధాప్య సమస్యల కారణంగా చనిపోయారు.
(ఇదీ చదవండి: బీ కేర్‌ఫుల్.. వాటితో నాకు సంబంధం లేదు: జేసన్ సంజయ్)
అమలకు ఇద్దరు కొడుకు, ఓ కూతురు ఉండగా.. వీళ్లంతా విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో అమల్ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఆమె మృతదేహానికి సీఎం విజయ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, పలువురు మంత్రులు.. శుక్రవారం మధ్యాహ్నం నివాళులర్పించారు.
(ఇదీ చదవండి: హాలీవుడ్ నటుడు సర్ ప్యాట్రిక్ స్టీవర్ట్ మృతి)
பெரியம்மா மறைவு... நீலாங்கரையில் உள்ள தனியார் முதியோர் இல்லத்தில் வைக்கப்பட்டிருந்த உடலுக்கு முதல்வர் விஜய் அஞ்சலி TamilNaduCM | CMvijay | Chennai #CMVijay #Condolence #Newstamil24x7 https://t.co/LgArOFlTqx
— News Tamil 24x7 (@NewsTamilTV24x7) October 30, 2026


