జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మైలురాయి’. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వంలో శ్రీ హన్సిక పెద్దిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. జగన్ యోగిరాజు మాట్లాడుతూ– ‘‘ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అన్నారు. ‘‘భావోద్వేగాలతో కూడిన ప్రేమకథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చెప్పారు రఘువర్ధన్ కోట్ల. ‘‘మా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ్రపొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ గురించిన వివరాలు చెబుతాం’’ అన్నారు హన్సిక పెద్దిరెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: రాజీవ్ రాజ్.


