ప్రేమ... వినోదం | MY Love Movie First Look Launch | Sakshi
Sakshi News home page

ప్రేమ... వినోదం

Aug 24 2026 2:26 AM | Updated on Aug 24 2026 2:26 AM

MY Love Movie First Look Launch

సంజోష్, రిషిత

సంజోష్‌ తగరం హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘మై లవ్‌’. ఈ చిత్రంలో రిషిత హీరోయిన్‌గా నటిస్తుండగా, మురళీధర్‌ గౌడ్, తనికెళ్ల భరణి, ‘పుష్ప’ కేశవ, రచ్చ రవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలంగాణ ఐటీ అండ్‌ ఇండస్ట్రీస్‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమర్పణలో జోష్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌  పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా సంజోష్‌ తగరం మాట్లాడుతూ– ‘‘మీ గతంలో మీరు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించే ఉంటారు. మళ్లీ ఆ అమ్మాయిని గుర్తుకు తెచ్చే సినిమా ‘మై లవ్‌’. ఫీల్‌ గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ జానర్‌లో డివోషనల్‌ కాన్సెప్ట్‌తో, ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని ఓ కొత్త పాయింట్‌తో ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నాను’’ అని చెప్పారు కేశవ. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఈ మంచి సినిమా సక్సెస్‌ కావాలి. సంజోష్‌గారికి నా బెస్ట్‌ విషెస్‌’’ అన్నారు అతిథిగా హాజరైన హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వైస్‌ చైర్మన్‌ ఇటికాల పూరషోత్తం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement