స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి: షిరాజ్ మెహదీ | Shiraz Mehdi calls local films should be given priority in Telangana | Sakshi
Sakshi News home page

స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి: షిరాజ్ మెహదీ

Nov 29 2026 9:14 PM | Updated on Nov 29 2026 9:14 PM

Shiraz Mehdi calls local films should be given priority in Telangana

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ చిత్రాలు ఎదుర్కొంటున్న థియేటర్ల కొరత, విడుదల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని నటుడు, దర్శకుడు షిరాజ్ మెహదీ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్థానిక బెంగాలీ సినిమాలకు ప్రైమ్‌టైమ్‌లో తప్పనిసరిగా ప్రదర్శన అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశీలించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన వివరించారు.

షిరాజ్ మెహదీ మాట్లాడుతూ.. 2012లో ‘పార్సెల్’ సినిమాతో హీరోగా పరిచయమై, నటన, దర్శకత్వం, సంగీతం, పంపిణీ తదితర విభాగాల్లో పనిచేసిన అనుభవం తనకుందని తెలిపారు. కొత్తగా సినిమాలు నిర్మించేవారు కథ, చిత్రీకరణపైనే కాకుండా విడుదల, థియేటర్ వ్యాపారం, మార్కెటింగ్ అంశాలపైనా పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలాగే స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 

తెలుగు ఫిలిం ఛాంబర్ చిన్న నిర్మాతలకు తగిన మార్గదర్శకత్వం, వ్యాపార సహకారం అందించడం లేదని విమర్శించారు. సభ్యత్వ రుసుములు వసూలు చేస్తున్నప్పటికీ, నిర్మాతలు సమస్యల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం లేదని ఆరోపించారు. గత ఏడాదిన్నరగా ఈ సమస్యలపై పోరాటం చేస్తున్నానని, పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ ఫిలిమ్స్‌తో పాటు పరిశ్రమలోని పలువురికి న్యాయపరమైన నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.

తన పోరాటానికి పలువురు నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారుల మద్దతు లభిస్తోందన్నారు. సినిమా నిర్మాణంలో నష్టాలు వచ్చినంత మాత్రాన ఎవరూ ఆత్మహత్యలు వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలో ఏవైనా అన్యాయాలు ఎదురైతే శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రెస్‌మీట్ల ద్వారా తమ సమస్యలను వెల్లడించాలని సూచించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూర్య ‘సీన్‌’ అధికారిక ప్రకటన)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement