రెండేళ్ల విరామం తర్వాత నటి నివేదా థామస్ ‘శ్రీమతి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మధ్యతరగతి గృహిణి మధుశ్రీ పాత్రలో ఆమె కనిపించనున్నారు. తిరువీర్, రేణు దేశాయ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. వచ్చే నెల 4 నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పనులు చేయడానికి రోబోలు కాదు
‘మగవారు గుడికి వెళ్లి లక్ష్మీదేవికి, అమ్మవారికి ఎంతో భక్తితో పూజలు చేస్తారు. కానీ ఇంట్లో ఉన్న లక్ష్మీ స్వరూపమైన మహిళలకు మాత్రం కనీస గౌరవం ఇవ్వరు. ఆడవాళ్లు ఇంట్లో అన్ని పనులు చేయడానికి రోబోలు కాదు. మగవారికి ఉన్నట్లే మాకూ శరీర అవయవాలు ఉంటాయి. మాకూ అలసట, బాధలు ఉంటాయి. ఏ మగవాడూ తనంతట తానుగా ఈ ప్రపంచంలోకి రాలేడు. ఒక మహిళే జన్మనివ్వాలి అనే విషయాన్ని మర్చిపోకూడదు.
‘తిరువీర్ నాకు సొంత తమ్ముడిలాంటి వాడు. అతని భార్య కల్పన నాకు బాగా తెలుసు. ఈ సినిమాలో తిరువీర్ పోషించిన పాత్రకు, నిజ జీవితంలో అతని వ్యక్తిత్వానికి ఎలాంటి సంబంధం లేదు. నిజ జీవితంలో అతను తన భార్యకు ఎంతో అండగా ఉంటాడు. భర్త అంటే తిరువీర్‌లా ఉండాలి’ అని రేణు దేశాయ్ మాట్లాడారు.
(ఇదీ చదవండి: సంగీతం నచ్చలేదని నా పేమెంట్ ఆపేశారు : ఏఆర్ రెహమాన్)
“This is a story that deserves to be told in every language, celebrating a woman’s identity and how a family should stand up for it.” ❤️ -Actress @iam_RenuDesai Speech at #SRIMATHI Pre-Release Event ✨ Watch Live Here 🔴 -- https://t.co/DftNm5cegK https://t.co/gi0CqPhUmN
— Primeshow Entertainment (@Primeshowtweets) November 29, 2026


