వైఎంఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై వైఎంఆర్ నిర్మాణంలో దర్శకుడు వై. రాజ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సీతన్నపేట గేట్’. వేణు గోపాల్ హీరోగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు వి. సముద్ర, హీరో విజయ రామరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వి. సముద్ర మాట్లాడుతూ.. సినిమాలోని ప్రతీ పాత్ర వైల్డ్‌గా ఉంటుందని, హీరో వేణు గోపాల్ ఎంతో నేచురల్‌గా కనిపించారని అన్నారు. డిసెంబర్ 4న ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారని తెలిపారు.
దర్శకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ‘సీతన్నపేట గేట్’ ఉంటుందని, ఇంటర్వెల్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పారు. వాస్తవ సంఘటనలకు కల్పన జోడించి సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు.
హీరో వేణు గోపాల్ మాట్లాడుతూ.. తన తొలి చిత్రంగా వస్తున్న ‘సీతన్నపేట గేట్’ కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని, మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. ఈ సినిమాతో అద్భుతం జరుగుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు.


