breaking news
Samudra
-
హీరోయిన్ని టచ్ చేస్తానంటే నో చెప్పా.. జీవిత ఏం అన్నారంటే..: డైరెక్టర్
రాజశేఖర్( Rajasekhar) పేరు చెప్పగానే గుర్తుకొచ్చే చిత్రాల్లో అంకుశం, సింహారాశి కచ్చితంగా ఉంటాయి. నైంటీస్ జనరేషన్‌కి అంకుశం ఫేవరేట్ అయితే.. ఆ తర్వాతి తరానికి ‘సింహారాశి’ మాత్రమే గుర్తుంటుంది. ఆ సినిమాలో హీరోయిన్ ఉన్నప్పటికీ.. హీరో మాత్రం ఆమెను టచ్ కూడా చేయడు. కథ ప్రకారం ఆయన ఆడవాళ్లను ముట్టుకోవద్దు. అయితే పాటల్లో మాత్రం ముట్టుకోవడానికి రాజశేఖర్ ట్రై చేశాడట. కానీ డైరెక్టర్ వద్దని చెప్పడంతో పాటల్లో కూడా హీరోయిన్ని టచ్ చేయలేదట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా దర్శకుడు సముద్ర చెప్పాడు.‘మా కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం సింహారాశి. అందులో రాజశేఖర్ అద్భుతంగా నటించాడు. కథ ప్రకారం ఆయన అమ్మాయిలను టచ్ చేయొద్దు. ఎందుకంటే ప్లాష్ బ్యాక్‌లో తల్లి తనను పట్టుకోకుండా పెంచి పెద్ద చేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. తన తల్లి తాకని ఈ శరీరాన్ని ఎవరూ తాకొద్దని హీరో ఒక సన్యాసిలా బతుకుతాడు. అటువంటి వాడిని ఒక హీరోయిన్ వచ్చి ప్రేమించి, అతన్ని మార్చి ఎలా పెళ్లి చేసుకుంది’ అన్నది సింహారాశి కథ.సినిమా అన్నాక సాంగ్స్ కచ్చితంగా ఉంటాయి. పాటలన్నీ బాగా వచ్చాయి. అవి చూసి రాజశేఖర్ ఆనందంతో డ్యాన్స్ చేసేవాడు. ఓ సాంగ్ కోసం ఊటీకి వెళ్లాం. షూటింగ్ చేస్తుంటే.. హీరోయిన్(సాక్షి శివానంద్)ని పట్టుకోవాలని కొరియోగ్రాఫర్ చెప్పాడు. నేను మాత్రం హీరోయిన్ని టచ్ చేయొద్దని చెప్పా. అప్పుడు రాజశేఖర్ వచ్చి ‘అదేంటి? ఇది డ్రీమ్ కదా.. డ్రీమ్‌లో కూడా అమ్మాయిని పట్టుకోవద్దా?’ అని అడిగాడు. డ్రీమ్ అయినా..లైవ్ అయినా.. అసలు అమ్మాయినే పట్టుకోవద్దని చెప్పా. ‘లేదు సముద్ర, ఫ్యాన్స్ గోల చేస్తారు. నేను పట్టుకుంటా’ అని రాజశేఖర్ అన్నారు. ‘సార్.. మీకు దండం పెడతా..వద్దు వదిలేయండి’ అని చెప్పా. జీవిత కూడా నాకే సపోర్ట్ చేసింది. ‘అన్ని చేశారు కదా బంగారం.. డైరెక్టర్ ఏదో కుతూహల పడుతున్నాడు విను’ అని చెప్పింది. జీవిత చెప్పడంతో రాజశేఖర్ హీరోయిన్ని పట్టుకోకుండానే పాటను పూర్తి చేశాడు’ అని సముద్ర చెప్పుకొచ్చాడు. -
జీవిత కోసం రాజశేఖర్ ఓవరాక్టింగ్.. కావాలనే గొడవ : డైరెక్టర్
రాజశేఖర్ హిట్ చిత్రాల్లో ‘ఎవడైతే నాకేంటి’ ఒకటి. 2007లొ విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. అప్పటి వరకు వరుస ప్లాఫులతో సతమతమవుతున్న రాజశేఖర్‌కి.. ఎవడైతే నాకేంటి మూవీ బిగ్ రిలీఫ్‌ని ఇచ్చింది. వి. సముద్ర, జీవిత సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు అప్పట్లో ప్రకటించారు. కానీ ఈ చిత్రం మొత్తం నేనే తెరకెక్కించానని..చివరిలో గొడవ చేసి మరీ జీవిత తన పేరుని వేయించుకుందని అంటున్నాడు దర్శకుడు వి. సముద్ర.హిట్ అవుతుందని తెలిసే.. జీవిత-రాజశేఖర్ పేరు కోసం తనతో గొడవ చేశారని చెప్పారు. రాజశేఖర్ హీరోగా నటించిన ‘సింహరాశి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన సముద్ర.. ఆ తర్వాత 2007లో మరోసారి రాజశేఖర్‌తో కలిసి ‘ఎవడైతే నాకేంటి’ సినిమా చేశాడు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ గొడవ వెనుక ఉన్న అసలు విషయాన్ని చెప్పాడు సముద్ర. ఐదు సినిమాలు రిజెక్ట్ చేశాసింహరాశి (2001) విడుదల తర్వాత రాజశేఖర్ నాతో మరో సినిమా చేయాలకున్నాడు. ఆయనకు నచ్చిన కథలను నా దగ్గరకు పంపించేవాడు. నేను విని రిజెక్ట్ చేశా. అలా 2001-07 మధ్య కాలంలో ఐదు సినిమాలను రిజెక్ట్ చేశా. దీంతో రాజశేఖర్ హర్ట్ అయ్యాడు. ‘నేను పంపిస్తే రిజెక్ట్ చేస్తాడా’ అనుకున్నాడు. కానీ అవి ఆడవనే విషయం నాకు తెలుసు. నేను ఊహించినట్లే 2001-07 మధ్య కాలంలో రాజశేఖర్ నటించిన ఏ చిత్రం కూడా విజయం సాధించలేదు. పరుచూరితో కబురుఆయన చెబితే రిజెక్ట్ చేస్తున్నానని తెలిసి చివరకు పరుచూరితో నాకు ఫోన్ చేయించి మలయాళ చిత్రం ‘లయన్’ కథ చెప్పించాడు. అది నాకు బాగా నచ్చింది. రాజశేఖర్‌తో ఈ చిత్రం చేస్తానని చెప్పి.. ఓ కండీషన్ పెట్టా. ఇందులో 60 శాతం మార్పులకు ఒప్పుకుంటే చేస్తానని పరుచూరితో చెప్పా. ఆయన అదే విషయాన్ని రాజశేఖర్‌తో చెబితే.. ‘సముద్ర చేస్తానని ఒప్పుకున్నాడు కదా..అది చాలు’ అన్నాడట. పేరు కోసం.. జీవిత, రాజశేఖర్ కూడా కథా చర్చల్లో కూర్చుంటారు. సలహాలు ఇస్తుంటారు. నేను చెప్పినట్లుగానే లయన్‌లో భారీ మార్పులు చేసి ‘ఎవడైతే నాకేంటి’ కథ రెడీ చేశాం. షూటింగ్ కూడా స్టార్ట్ చేశాం. సినిమా బాగా వచ్చింది. దీంతో రాజశేఖర్, జీవిత నన్ను తొలగించి .. డైరెక్టర్‌గా వారి పేరు వేయించుకోవాలనుకున్నారు. ఈ విషయం ఒక రచయిత ద్వారా నాకు తెలిసింది. గొడవ కోసం ప్లాన్షూటింగ్ మధ్యలోకి వచ్చిన తర్వాత నన్ను తొలగించాలని వారిద్దరు భావించారు. అందులో భాగంగానే రాజశేఖర్ సెట్‌కి వచ్చి ‘ఈ సీన్ బాలేదు.. అది బాలేదు’ అంటూ ఓవరాక్టింగ్ చేశాడు. జీవిత ఆయనను కూల్ చేస్తున్నట్లు నటించింది. ఇదంతా చూసి.. ‘పేరు కోసం ఎందుకు ఇలా యాక్టింగ్ చేస్తున్నారు? అదే కావాలంటే నాకు డైరెక్ట్‌గా చెప్పండి. మీరే తీసుకొని మీ పేరే వేసుకోండి. నేను ఇక చేయను’ అని బయటకు వచ్చేశా. తర్వాత ఇండస్ట్రీ పెద్దలు చెప్పడంతో మళ్లీ నన్ను రిక్వెస్ట్ చేశారు. దీంతో నేనే సినిమా మొత్తం కంప్లీట్ చేశా. ఇక చివరిలో మళ్లీ కావాలనే నన్ను ఇరిటేట్ చేశారు. రెమ్యునరేషన్ కూడా సగమే ఇచ్చారు. ఇదంతా తమకు పేరు రావాలనే చేశారు. వ్యక్తిగతంగా జీవిత, రాజశేఖర్ చాలా మంచొళ్లు. రాజశేఖర్ అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. కానీ పేరు కోసం అలా చేయడం నచ్చలేదు. ఇప్పుడు కూడా నేను రాజశేఖర్‌తో మాట్లాడతా. కలుస్తుంటా. నాకు ఎవరిపై కోపం ఉండదు’ అని సముద్ర చెప్పుకొచ్చాడు. -
మేనమామ-మేనకోడలు బంధంతో 'శ్రీరంగపురం'..
Srirangapuram Movie Trailer Launched By Director V Samudra: వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవీ సింగ్, చిందనూరు నాగరాజు, సత్యప్రకాశ్ ముఖ్య తారాగణంగా ఎమ్ఎస్. వాసు దర్శకత్వంలో చిందనూరు నాగరాజు నిర్మించిన చిత్రం ‘శ్రీరంగపురం’. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు వి. సముద్ర రిలీజ్ చేశారు. ‘‘నేను ముంబై నుంచి వచ్చాను. తెలుగు అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడే ప్రయత్నాలు చేస్తున్నాను.. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే.. అప్పట్లో ‘గోరింటాకు’కి ఎంత ఆదరణ లభించిందో అందరికీ తెలిసిందే. అదే తరహాలో బెస్ట్ సెంటిమెంట్ చిత్రంగా ‘శ్రీరంగపురం’ నిలిచిపోతుంది’’ అన్నారు వినాయక్ దేశాయ్. ‘‘మేనకోడలు–మేనమామ బంధం ఎంత గొప్పదో చెప్పే చిత్రం ఇది. మేనకోడలి కోసం మేనమామ తన ప్రాణాలను సైతం వదులుతాడు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. చదవండి: 11 నెలలుగా నా ఇంట్లో నా భార్యతో ఉంటున్నాడు: నటుడు -
రివేంజ్ డ్రామాగా 'మల్లెతీగ' ప్రారంభం
రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న 'మల్లెతీగ' సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీ నందనం క్రియేషన్స్ పతాకంపై జైరాజ్ జల్లూరి, ప్రవీణ్ పోతురాజు, సిమ్రాన్, హన్సిక శ్రీనివాస్, సుజాత, భరత్, చందు ప్రధాన పాత్రల్లో పల్లి మోహన్ రావు దర్శకత్వంలో శ్రీను మోచర్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. ప్రముఖ దర్శకుడు సముద్ర హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు నిర్మాత డి.యస్. రావు చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అంతా కొత్త వాళ్లతో విలేజ్ బ్యాక్ డ్రాప్లో చేస్తున్న ఈ "మల్లెతీగ" సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నిర్మాత డి.యస్. రావు తెలిపారు. 'ఈ చిత్ర మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ఈ 'మల్లె తీగ' చిత్రం ఎర్ర మల్లెలు అంత పెద్ద హిట్ అవ్వాలి. మంచి కథను సెలెక్ట్ చేసుకొని నిర్మిస్తున్న దర్శక, నిర్మాతలకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాల'ని దర్శకుడు సముద్ర అన్నారు. దర్శకుడు చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించిందని చిత్ర నిర్మాత శ్రీను మోచర్ల పేర్కొన్నారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక గ్రామంలో చిత్రీకరణ జరుపుకుంటుందన్నారు. కొత్తవారితో చేస్తున్న తమ సినిమాను ప్రేక్షకులందరూ కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. చిత్ర దర్శకుడు పల్లి మోహన్ రావు మాట్లాడుతూ 'ఇది నా మొదటి చిత్రం. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథే హీరో. ఇందులో నటించిన హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు కేవలం కథకు ప్రాణం పోస్తారు. వైజాగ్ దగ్గర గుడివాడ పరిసర ప్రాంతంలో ఉన్న ఈ విలేజ్ ఎక్కడా మ్యాప్‌లో కూడా లేదు. గవర్నమెంట్ అండర్లో లేని ఈ విలేజ్‌కు సెట్ కూడా అవసరం లేదు. ఇది పూర్తి ట్రైబల్‌లో ఉన్న ఈ గ్రామాన్నిసెలెక్ట్ చేసుకొని షూటింగ్ చేస్తున్నాం.ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాత శ్రీను మోచర్లకు కృతజ్ఞతలు.' అని తెలిపారు. -
కాకతీయుడు వస్తున్నాడు
తారకరత్న హీరోగా వి. సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాకతీయుడు’. లగడపాటి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగిశాయి. ఇటీవల సెన్సార్ పూర్తయింది. ‘‘సముద్ర దర్శకత్వంలో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. జూలై రెండోవారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ‘‘తారకరత్న బాడీ లాంగ్వేజ్‌కి సరిపడే కథా, కథనాలతో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు సముద్ర. -
సస్పెన్స్ థ్రిల్లర్..
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి సరి కొత్త ఆలోచనలతో ఎందరో అడుగుపెడుతున్నారు. వైవిధ్యమైన సినిమాలు తీసి సక్సెస్ అవుతున్నారు. యంగ్ అండ్ డైనమిక్ టీం రూపొందిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు సముద్ర అన్నారు. చెన్నకుని శెట్టి(కుమార్) దర్శకత్వంలో భరతవర్ష క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న నూతన చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. వినోదంతో పాటు, విస్మయానికి గురి చేసే అంశాలున్నాయి’’ అన్నారు శెట్టి. ‘‘కొత్త ట్రెండ్ సృష్టించే అన్ని అంశాలు మా కథలో ఉన్నాయి’’ అన్నారు జి.వి.ఆర్.–4 మ్యూజిక్ అధినేత వి. గోపాలకృష్ణ. తెలంగాణ ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ , కార్యదర్శి సాయివెంకట్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో దర్శకుడి సోదరుడు మృతి
గుంటూరు : యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీదర్శకుడు సముద్ర సోదరుడు వేణుగోపాల్ మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున బోయపాలెం వద్ద డైట్ కాలేజీ ఎదుట ఆగిఉన్న లారీని వేణుగోపాల్ ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. దీంతో తీవ్ర గాయాలైన వేణుగోపాల్ మృత్యువాత పడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.