
రాజశేఖర్( Rajasekhar) పేరు చెప్పగానే గుర్తుకొచ్చే చిత్రాల్లో అంకుశం, సింహారాశి కచ్చితంగా ఉంటాయి. నైంటీస్ జనరేషన్‌కి అంకుశం ఫేవరేట్ అయితే.. ఆ తర్వాతి తరానికి ‘సింహారాశి’ మాత్రమే గుర్తుంటుంది. ఆ సినిమాలో హీరోయిన్ ఉన్నప్పటికీ.. హీరో మాత్రం ఆమెను టచ్ కూడా చేయడు. కథ ప్రకారం ఆయన ఆడవాళ్లను ముట్టుకోవద్దు. అయితే పాటల్లో మాత్రం ముట్టుకోవడానికి రాజశేఖర్ ట్రై చేశాడట. కానీ డైరెక్టర్ వద్దని చెప్పడంతో పాటల్లో కూడా హీరోయిన్‌ని టచ్ చేయలేదట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా దర్శకుడు సముద్ర చెప్పాడు.
‘మా కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం సింహారాశి. అందులో రాజశేఖర్ అద్భుతంగా నటించాడు. కథ ప్రకారం ఆయన అమ్మాయిలను టచ్ చేయొద్దు. ఎందుకంటే ప్లాష్ బ్యాక్‌లో తల్లి తనను పట్టుకోకుండా పెంచి పెద్ద చేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. తన తల్లి తాకని ఈ శరీరాన్ని ఎవరూ తాకొద్దని హీరో ఒక సన్యాసిలా బతుకుతాడు. అటువంటి వాడిని ఒక హీరోయిన్ వచ్చి ప్రేమించి, అతన్ని మార్చి ఎలా పెళ్లి చేసుకుంది’ అన్నది సింహారాశి కథ.
సినిమా అన్నాక సాంగ్స్ కచ్చితంగా ఉంటాయి. పాటలన్నీ బాగా వచ్చాయి. అవి చూసి రాజశేఖర్ ఆనందంతో డ్యాన్స్ చేసేవాడు. ఓ సాంగ్ కోసం ఊటీకి వెళ్లాం. షూటింగ్ చేస్తుంటే.. హీరోయిన్(సాక్షి శివానంద్)ని పట్టుకోవాలని కొరియోగ్రాఫర్ చెప్పాడు. నేను మాత్రం హీరోయిన్‌ని టచ్ చేయొద్దని చెప్పా.
అప్పుడు రాజశేఖర్ వచ్చి ‘అదేంటి? ఇది డ్రీమ్ కదా.. డ్రీమ్‌లో కూడా అమ్మాయిని పట్టుకోవద్దా?’ అని అడిగాడు. డ్రీమ్ అయినా..లైవ్ అయినా.. అసలు అమ్మాయినే పట్టుకోవద్దని చెప్పా. ‘లేదు సముద్ర, ఫ్యాన్స్ గోల చేస్తారు. నేను పట్టుకుంటా’ అని రాజశేఖర్ అన్నారు. ‘సార్.. మీకు దండం పెడతా..వద్దు వదిలేయండి’ అని చెప్పా. జీవిత కూడా నాకే సపోర్ట్ చేసింది. ‘అన్ని చేశారు కదా బంగారం.. డైరెక్టర్ ఏదో కుతూహల పడుతున్నాడు విను’ అని చెప్పింది. జీవిత చెప్పడంతో రాజశేఖర్ హీరోయిన్‌ని పట్టుకోకుండానే పాటను పూర్తి చేశాడు’ అని సముద్ర చెప్పుకొచ్చాడు.