రిషబ్‌ శెట్టి నివాసం..విశేషాల ఆవాసం... రేటు ఎంతంటే..? | Interesting Facts About Kantara Chapter 1 Superstar Rishab Shetty House, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

300 కిలోల గ్రానైట్‌తో తులసికోట.. కాంతార రైఫిల్‌.. ‘కాంతార’ హీరో నివాసం ప్రత్యేకతలివే!

Oct 14 2025 3:04 PM | Updated on Oct 14 2025 3:59 PM

Interesting Facts About Kantara Chapter 1 Superstar Rishab Shetty House

కాంతారా: చాప్టర్‌ 1 బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాతో పాటు, కర్ణాటకలోని ఉడిపిలోని కుందాపురలో ఉన్న రూ. 12 కోట్ల విలువైన రిషబ్‌ శెట్టి భవనం కళ, సంప్రదాయం సంస్కృతి పట్ల ఆయనకున్న ప్రేమను ప్రతిబింబిస్తుంది,ఆ ఇంట్లోని ప్రతీ చోటూ ఒక కధను చెబుతుంది. ఆ ఇంటిలోని పలు చోట్ల కాంతారా సినిమా ప్రభావం కనిపిస్తుండడం ఆసక్తికరం.

ఆయన ముత్తాత యాజమాన్యంలోని పూర్వీకుల భూమిపై నిర్మింతమైన ఈ భవనం ఓ క్లాసిక్‌ గా అభిమానులు పేర్కొంటారు. అది దక్షిణ భారత వాస్తుశిల్పాన్ని ఆధునిక సౌకర్యాలతో నేర్పుగా మిళితం చేయడం దీని విశేషం. ఘనమైన ప్రవేశ ద్వారం ఇత్తడితో కప్పబడిన బర్మా టేకు కలప తలుపు చేతితో లాగే ఆలయ గంటను కలిగి ఉంటుంది, ఇది ఇంట్లో అడుగుపెట్టిన తక్షణమే ఆధ్యాత్మికతో స్వాగతించే వైబ్‌ను అందిస్తుంది

లోపలికి అడుగు పెట్టగానే ఈ స్థలం నాలుగు మూలల్లో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది, ఇల్లు సూర్యకాంతి తో చుట్టుముట్టేలా...300 కిలోల గ్రానైట్‌తో నిర్మితమైన తులసికోటతో మన ముందు కొలువు దీరుతుంది. ఇక ఇంటిలో కనపడే యక్షగాన శిరస్త్రాణం, కాంతారా లోని రైఫిల్, యువరాజ్‌ సింగ్‌ సంతకం చేసిన క్రికెట్‌ బ్యాట్‌ వరకు సావనీర్లు కళలు, క్రీడలు భారతీయ జానపద సంప్రదాయాల పట్ల శెట్టికి ఉన్న ప్రేమను చూపుతాయి.

కానీ ఈ భవనంలోని తమ అత్యంత ఆసక్తికరమైన భాగాన్ని శెట్టి ’ఛాంటింగ్‌ కార్నర్‌’ అని పిలుస్తారు. ఎవరైనా ఆ ఇంట్లోని ఆ నార్త్‌ ఈస్ట్‌ కార్నర్‌లో ఒక నిర్దిష్ట నల్ల రాయిపై ఏడు సెకన్ల పాటు గానీ నిలబడితే, గాలి భూత కోల శ్లోకాలతో నిండిపోతుంది, దాదాపుగా కాంతారా లోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తుచేసే అనుభవాన్ని అందిస్తుంది.

ఈ భవనంలో విలాసవంతమైన ప్రైవేట్‌ స్క్రీనింగ్‌ గది కూడా ఉంది. ఇటాలియన్‌ లెదర్‌ రిక్లైనర్లు, 150అంగుళాల రిట్రాక్టబుల్‌ స్క్రీన్‌ డాల్బీ అట్మోస్‌ సరౌండ్‌ సౌండ్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది పూర్తి స్థాయి సినిమాటిక్‌ అనుభవాన్ని అందిస్తుంది. స్థానిక టచ్‌ ఇస్తూ గదిలోని షాండ్లియర్‌ను మంగళూరు టైల్స్‌తో తయారు చేశారు. కాంతారా నుంచి ఇచ్చిన అటవీ స్ఫూర్తితో సెలియరాయ అని పేరు కలిగిన ప్రొజెక్టర్, ఆ ఇంటి విశేషాలకు మరో వ్యక్తిగత కథ ను జోడిస్తుంది.

తమ మూలాలతో కుటుంబానికి ఉన్న సంబంధం వంటగది వరకూ కొనసాగుతుంది. నల్ల రాయి కౌంటర్‌ ను కొబ్బరి నూనెను ఉపయోగించి పాలిష్‌ చేస్తుంటారు. కోరి గస్సీ (చికెన్‌ కర్రీ) వంటి సాంప్రదాయ వంటకాలను వారసత్వంగా వచ్చే వంటశైలులను ఉపయోగించి తయారు చేస్తారు. పై అంతస్తులోని గదిలో 1,200 కంటే ఎక్కువ పుస్తకాలు కలిగిన లైబ్రరీ ఉంది, వీటిలో ఉండే భారతీయ జానపద కథల నుంచి స్టీఫెన్‌ కింగ్‌ థ్రిల్లర్‌ల వరకు, శెట్టి విస్త్రుత సేకరణను పుస్తకాభిరుచిని ప్రతిబింబిస్తాయి.

పురాతన కాలం నాటి ఆకర్షణ సంప్రదాయ విశేషాలు ఎన్నో ఉన్నప్పటికీ, ఈ భవనం అత్యాధునిక భద్రతతో పటిష్టంగా ఉంటుంది. ఫేస్‌ రికగ్నైజేషన్, కెమెరాలు ప్రవేశ ద్వారం దగ్గర కాపలాగా ఉంటాయి యక్ష అనే రిటైర్డ్‌ కోస్టల్‌ పోలీసు శునకం సైతం ఇంటికి కాపలా కాస్తుంటుంది. సందర్శకులు ప్రవేశించే ముందు వారి ఫోన్‌ లను ఇత్తడి లాకర్లలో జమ చేయాలి ఆసక్తికరంగా, కాంతారా సంభాషణల నుంచి ప్రేరణ పొంది ప్రతి నెలా వైఫై పాస్‌వర్డ్‌ మారుతుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement