దర్శకుడిగా శేఖర్‌ మాస్టర్‌.. నిజమెంత? | Sekhar Master Turns As A Film Director | Sakshi
Sakshi News home page

దర్శకుడిగా శేఖర్‌ మాస్టర్‌.. నిజమెంత?

Mar 14 2026 11:01 AM | Updated on Mar 15 2026 3:40 PM

Sekhar Master Turns As A Film Director

టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్‌ నటుటలతో  పాటు ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ లాంటి స్టార్‌ హీరోల వరకు అందరికి ఆయన కొరియోగ్రఫీ చేశాడు. హుక్‌ స్టెప్పుల స్పెషలిస్ట్‌గానూ పేరుపొందాడు. ఆయన కొరియోగ్రఫీ అందించిన చాలా పాటలు నెట్టింట వైరల్‌గా మారాయి.  ఒకవైపు సినిమాలకు డ్యాన్స్‌ కొరియోగ్రఫీ అందిస్తూనే..మరోవైపు పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

ఇలాంటి సమయంలో ఆయనకు సంబంధించిన ఓ క్రేజీ గాసిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. త్వరలోనే ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట.  అందులో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా కుమారుడు  రిషిల్ రాఘ‌వేంద్ర దేవా హీరోగా నటించబోతున్నాడట. ఈ వార్త గత రెండు, మూడు రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే వాస్తవం ఏంటంటే.. ఆయన ఇప్పట్లో మెగా ఫోన్‌ పట్టే అవకాశమే లేదట.  తన దర్శకత్వంలో ప్రభుదేవా కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్నారనే వార్తలో ఎలాంటి నిజం లేదని శేఖర్‌ మాస్టర్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement