అల్లు సినిమాస్‌ ఏర్పాటుకు కారణాలివే!: అల్లు అరవింద్‌ | Allu Aravind Reveals Idea Behind Launching Allu Cinemas In Hyderabad, Know About Its Specialities | Sakshi
Sakshi News home page

Allu Aravind: జనాలకు అనుభూతి సరిపోవట్లే.. అందుకే అల్లు సినిమాస్‌..

Mar 14 2026 9:30 AM | Updated on Mar 14 2026 9:45 AM

Allu Aravind about Allu Cinemas Specialities

‘‘అల్లు సినిమాస్‌’ను నిర్మించడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. యూవీ సంస్థ వంశీ సూళ్లూరుపేటలో ఒక లగ్జరీ థియేటర్‌ నిర్మించారు. ఆ థియేటర్‌లో సినిమా చూసేందుకు ఆ చుట్టుపక్క ఊర్ల నుంచి జనాలు వస్తున్నారు. అది చూసి, నాకు కూడా ఓ లగ్జరీ థియేటర్‌ కట్టాలనిపించింది. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 6’ సినిమాను ఐమ్యాక్స్‌ లార్జ్‌ స్క్రీన్‌లోనే చూడాలని ఉందని, తన పిల్లలు గోల చేస్తున్నారని, అయితే  టికెట్లు దొరకలేదని ఒక పెద్ద వ్యాపారవేత్త నాతో అన్నారు. 

అలా మొదలైంది
నేను టికెట్స్‌ ఏర్పాటు చేయించి, ఆయనకు ఇవ్వడంతో సంతోషించారు. దీన్నిబట్టి పిల్లలు కూడా థియేటర్స్‌లో కేవలం సినిమాలు చూసేందుకు మాత్రమే కాకుండా, ఆ అనుభూతిని ఆస్వాదించాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. లార్జ్‌ ఫార్మాట్, కొత్త ఎక్స్‌పీరియన్స్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనిపించింది. అలా మా ‘అల్లు సినిమాస్‌’ మొదలైంది’’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. 

హైదరాబాద్‌లోనే మొట్ట మొదటి డాల్బీ సినిమా
హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌ కాంప్లెక్స్‌లో ఉన్న నాలుగు స్క్రీన్‌ల అల్ట్రా లగ్జరీ మల్టీప్లెక్స్‌ను ‘అల్లు సినిమాస్‌’గా ప్రారంభించినట్లు అల్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లోనే మొట్ట మొదటి డాల్బీ సినిమా, ప్రపంచంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్‌ను (స్క్రీన్‌ 1) కలిగి ఉన్న మల్టీప్లెక్స్‌గా ‘అల్లు సినిమాస్‌’ నిలిచిందని నిర్మాత అల్లు అరవింద్‌ చెప్పారు. 

ఆ అనుభూతి సరిపోవడం లేదు
ఈ అంశాలను గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘సింగిల్‌ స్క్రీన్స్‌లో సినిమా చూసేప్పుడు కలుగుతున్న అనుభూతి ఇప్పటి ప్రజలకు సరిపోవడం లేదు. అందుకే ఎక్కువగా మల్టీప్లెక్స్‌లకు వస్తున్నారు. మల్టీప్లెక్స్‌ల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్‌’ను నిర్మించాం. డాల్బీ ఫార్మాట్‌లోని సినిమా విజువల్‌ పరంగా కొత్తగా కనిపిస్తుంది. కొత్త సౌండ్‌తో వినిపిస్తుంది. డాల్బీ సినిమాస్‌ ఇండియా ప్రతినిధి రాజ్‌ మాకు ఎంతో సహకరించారు. ఈ స్క్రీన్‌లో 78 స్పీకర్లు, 165 సౌండ్‌ ఔట్లెట్లను బయటకు కనిపించకుండా అమర్చారు. జర్మనీ టీమ్‌ ఈ స్క్రీన్‌ చూసి ఆశ్చర్యపోయింది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాల్బీ సినిమాస్‌ ఇండియా ప్రతినిధి రాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement