Chittoor
-
● సెటిల్మెంట్లకు అడ్డుపడుతున్నాడని వెల్లడి ● పోలీసుల విచారణలో నిందితుడు తమీమ్ వెల్లడి
కక్షతోనే జగన్ హత్య వి.కోట: సెటిల్మెంట్లకు అడ్డుపడుతున్నాడన్న కక్షతోనే రిపోర్టర్ జగన్మోహన్ తమీమ్ హత్య చేసినట్టు సీఐ సోమ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. మదనపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు తమీమ్, సుభాన్‌ను ఇటీవల కస్టడీలోకి తీసుకుని విచారించామన్నారు. 2026 సెప్టెంబర్‌లో జరిగిన మత కలహాలలో తమీమ్‌పై మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. అతను జైలుకు వెళ్లాడని, దీంతో ముస్లింలు అతన్ని దూరంగా పెట్టారని తెలిపారు. ఇందులో జగన్మోహన్ పాత్ర ఉందని తమీమ్ భావించి కక్ష పెంచుకున్నాడని వెల్లడించారు. ఈ క్రమంలో జగన్మోహన్ను హత్య చేయాలని ఏప్రెల్ 20 నుంచి రెండుసార్లు ప్రయత్నించి విఫలమై 28వ తేదీన హత్య చేశాడన్నారు. తమీమ్‌ను బీఎస్పీ శ్రీనివాసులు ప్రేరేపించాడన్నారు. కేసులో అండగా ఉంటానని చెప్పాడని తెలిపారు. అతను నేరుగా హత్యను ప్రోత్సహించాడా..? లేక పరోక్షంగానా అన్న కోణంలో విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా ఎవరి పాత్ర ఉందా, ఇతనికి ఎవరెవరు సహకరించారు అన్న కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ఇప్పటి వరకు 50 శాతం దర్యాప్తు పూర్తయిందన్నారు. తమీమ్‌పై వి.కోట పోలీసు స్టేషన్లో గంజాయి, గంధపు చెక్కల స్మగ్లింగ్ తదితర 12 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. -
జగన్ హత్య కేసులో తేలింది కొంతే!
పలమనేరు: చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన వి.కోట విలేకరి హత్య కేసులో పోలీసులు సాధించిన పురోగతి కొంతేనని తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తమీమ్, సుభాన్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. హత్యకు సెటిల్మెంట్లే కారణమని తేల్చారు. అసలు విషయాలు ఇంకా తేలా ల్సి ఉందని సెలవిచ్చారు. జగన్‌కు ఉన్న శత్రువుల ప్రోద్భలంతోనే హత్య జరిగిందనే విషయాన్ని పోలీసులు పసిగట్టారు. ఈ క్రమంలో హత్యలో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉందన్న విషయం సస్పెన్స్‌గానే మారింది. మూడుసార్లు హత్యకు స్కెచ్ జగన్‌ను అంతమొందించేందుకు తమీమ్, సుభాన్ గత నెల 23, 27వ తేదీల్లో ప్రయత్నించి విఫలమయ్యారని, 28న హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరిని ప్రేరేపించిన వారిలో శ్రీనివాసులుతోపాటు మరికొందరు ఉన్నట్టు గుర్తించారు. తమీమ్‌తో ఫోన్లో మాట్లాడిన, డీల్ కుదుర్చుకున్న 20 మందిని ఇప్పటికే పోలీసులు విచారించారు. ఈ హత్య కేసులో ఆరు ప్రత్యేక బృందాలు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నాయి. పీడీ యాక్టు గ్యారెంటీ.... తమీమ్, సుభాన్‌పై ఉన్న కేసులు, హత్య కేసులో ఉన్న ప్రత్యక్ష సాక్షులు, వీడియో పుటేజీల ఆధారంగా పోలీసులు ఎస్పీ ద్వారా కలెక్టర్‌కు నివేదిక పంపించారు. తద్వారా వారిపై పీడీ యాక్టు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు పంపి రెండేళ్లు బెయిల్ రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు లో విచారణ సగమే అయిందని వి.కోట పోలీసులు పేర్కొనడం గమనార్హం. ఇంకెంతమంది మెడకు చుట్టుకుంటుందో... ఈ హత్య కేసు వి.కోటకు చెందిన ఇంకెంతమంది మెడకు చుట్టకుంటుందోననే భయం తప్పేలా లే దు. హత్యకు ప్రేరేపించిన వారు చాలామందే ఉన్న ట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ హత్యకు ప్రధాన కారణం ఇంకా మిస్టరీగానే మారింది. త్వరలోనే పూర్తి స్థాయిలో హత్యకు కారణాలు బయటపెడతామని వి.కొట పోలీసులు చెప్పడం గమనార్హం. హత్యకు ఎన్నో కారణాలు గతనెల 28న వి.కోట విలేకరి జగన్మోహన్రెడ్డిని అదే పట్టణంలో జనం చూస్తుండగా దారుణంగా కత్తులతో హత్య చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన నిందితులైన తమీమ్, అతని మేనత్త కొడుకు సుభాన్ ఇక్కడ ఉంటే ప్రాణ హాని ఉంటుందని భావించి బెంగళూరులోని ఒక పీఎస్‌లో ఎన్బీడ్యూ పెండింగ్‌లో ఉన్న కేసులో సరెండర్ అయ్యా రు. తర్వాత ఇక్కడి పోలీసులు వారిని పిటీ వారెంట్ కింద తీసుకొచ్చారు. ఈ నెల 12న కస్టడీలోకి తీసు కుని విచారించి ఆదివారం అరెస్ట్ చూపారు. ఇందు లో భాగంగా గతంలో జరిగిన ఓ విషయంలో విక్కీ, ఆరీఫ్ మధ్య వివాదం నెలకొంది. ఇందులో విక్కీకి తమీమ్ సాయం చేయగా ఆరీఫ్‌కు జగన్మోహన్రెడ్డి సాయం చేసినట్టు తేలింది. దీంతో ఆరీఫ్‌పై తమీమ్, సుభాన్ అలియాస్ మోహిన్ ద్వారా గంజాయి తప్పుడు కేసు పెట్టడం.. దీన్ని జగన్ అడ్డుకుని తమీమ్‌పై కేసు పెట్టేలా చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో శత్రువు, శత్రువు మిత్రుడనే కోణంలో వి.కోటకు చెందిన శ్రీనివాసులు మరికొందరు తమీమ్‌ను ప్రేరేపించి జగన్మోహన్రెడ్డిపై కక్ష పెంచుకునేలా చేసినట్టు తేలింది. ఈ సందర్భంలోనే హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. -
ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలి మృతి
యాదమరి: మండలంలోని జంగాలపల్లి పంచాయతీ సీఎం కండ్రిగలో శనివారం రాత్రి ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలు మృతిచెందింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జంగాలపల్లి పంచాయతీ సీఎం కండ్రిగ గ్రామానికి చెందిన నరసింహులు భార్య జయమ్మ(82)కు కూతురు, కుమారుడు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు చేసింది. ఆమె ఒంటరిగా దాదాపు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇంటిలోనే ఉంటోంది. ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. శనివారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి నిద్రకు ఉపక్రమించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటి పైకప్పు కూలింది. తీవ్రంగా గాయపడిన జయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద శబ్దానికి హుఠాహుటిన వచ్చిన ఆమె మనవడు స్థానికుల సహాయంతో శిథిలాలను తొలగించి జయమ్మ మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచా రం అందుకున్న తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు నమోదు చేసు కుని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. జయమ్మ మృతదేహానికి పోస్టుమార్టం విషయమై అధికారులు, ఆమె బంధువుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నాం కాణిపాకం: రాష్ట్రంలోని మహిళల భద్రతే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తోందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆమె ఆదివారం కుటుంబ సమేతంగా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మురళీమోహన్ మంత్రికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాణిపాకంలో టీటీడీ ఆధ్వర్యంలో రూ.25 కోట్లతో కల్యాణ మండపాలు, రూ.15 కోట్లతో వంద గదుల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలి పారు. ఆలయ పరిసరాల్లో సుమారు 190 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. వాటిని ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేసి అనుమానాస్పద వ్యక్తులను వెంటనే గుర్తించేలా నిఘా వ్యవస్థను తీసుకువస్తున్నట్టు తెలిపారు. అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీ వెంకటరమణ, సీఐ శ్రీధర్‌నాయుడు, ఈవో పెంచలకిషోర్, చైర్మన్ మణినాయుడు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వి.కోట: మండలంలోని పలమనేరు– వి.కోట జాతీయ రహదారిలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొంది. దీంతో వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఎగువపల్లికి చెందిన నారాయణప్ప(58) ద్విచక్ర వాహనంలో వి.కోట నుంచి స్వగ్రామా ని కి బయలుదేరాడు. జాతీయ రహదారిలో కుమ్మరమడుగు వద్ద పలమనేరు నుంచి వి.కోట వైపు అతివేగంగా వెళుతున్న ఐచర్ వాహనం ఢీకంది. తీవ్ర గాయాలైన నారాయణప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. పంటలపై ఆగని ఏనుగు దాడులు పలమనేరు: కుంకీ ఏనుగుల ద్వారా రైతుల పంట పొలాలపై ఏనుగులు రాకుండా చూస్తామన్న ప్రభుత్వం మాటలు నీటిమూటలుగానే మారా యి. ముసలిమడుగు వద్ద ఉన్న కుంకీ క్యాంపు సమీపంలోనే గ్రామానికి చెందిన పలువురు రైతుల పంటలపై శనివారం రాత్రి మదపుటేనుగు దాడి చేసింది. వరి, మామిడి, అరటి, బీర పంటలను తొక్కి నాశనం చేసింది. గ్రామస్తులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ట్రాకర్స్ సాయంతో ఏనుగును అడవిలోకి మళ్లించారు. పంట నష్టంపై అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ప్రజలు నేరుగా తనను కలిసి సమస్యలు తెలియజేయవచ్చని వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. -
ముందుగా డబ్బు కడితేనే కరెంట్!
పలమనేరు: ‘‘స్మార్ట్ మీటర్లతో ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అంధకారంలో ఉండాల్సిందే. రైతులకు ఉరితాడు వేసినట్టే. ట్రాన్స్‌కో వాళ్లు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులగొట్టండి. ఎవరికీ భయపడొద్దు. మీకు నేను అండగా ఉంటాను’’ అని చంద్రబాబునాయుడు 2024 ఎన్నికల ముందు కుప్పంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చెప్పారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు స్మార్ట్ మీటర్లు బిగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ముందుగా డబ్బు కట్టి రీచార్జ్ చేసుకుంటనే కరెంటు ఉంటుంది. లేకుంటే అంధకారంలో ఉండాల్సిందే. ఈ విధానాన్ని ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుచేస్తున్నారు. తర్వాత వాణిజ్య, వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇళ్లలో అమలుచేయనున్నారు. జూన్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ బిల్లింగ్ సిస్టంను తీసుకువస్తున్నారు. ఆపై వాణిజ్య, గృహాలకు స్మార్ట్ మీటర్లు అమర్చి ప్రీపెయిడ్ విద్యుత్ బిల్లింగ్ విధానాన్ని అమలు చేస్తామని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు చెబుతున్నారు. తర్వాత రైతుల వ్యవసాయ బోర్లు, బావుల మోటార్లకు స్మార్ట్ మీటర్లను బిగించి ముందుగా డబ్బు కట్టాకే పంటలకు సాగు నీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజలకు ఉరితాడు కాదా? స్మార్ట్ మీటర్లతో ప్రజలు, రైతులకు ఉరితాడు తప్పదని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారని, అధికారంలోకి వచ్చే సరికి స్మార్ట్ మీటర్లతో ఎన్నో లాభాలుంటాయని చెబుతూ ప్రజలను ఏమారుస్తున్నారని ప్రతిపక్ష, వామపక్ష నాయకులు మండిపడుతున్నారు. చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తారని మరోసారి రుజువైందని ఆరోపిస్తున్నారు. ముందుగా రీచార్జి చేసుకోవాలి స్మార్ట్ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో అమర్చుతున్నారు. ఇప్పటి వరకు మీటర్ రీడింగ్ చూసి బిల్లు ఇచ్చేవారు. ఇకపై ఎవరితోనూ పని ఉండదు. స్మార్ట్ ఫోనుకు రీచార్జ్ చేసుకుంటామో అదే విధంగా కరెంట్ బిల్లును ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఇదే పద్దతి అన్ని వర్గాలకు అమలు చేయనున్నారు. రైతులు మోటార్ హెచ్‌పీని బట్టి రీచార్జి చేసుకోవాలి. కట్టిన డబ్బులు అయిపోయిన వెంటనే ఆటోమేటిక్‌గా కరెంట్ సరఫరా ఆగిపోతుంది. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు మాత్రం విద్యుత్ వినియోగం, బిల్లింగ్‌లో పారద్శకత కోసమే ప్రీ పెయిడ్ విధానాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పడం కొసమెరుపు. మీటర్ రీడర్లకు మంగళం ఉమ్మడి జిల్లాలో వేలాది మంది మీటర్ రీడర్లున్నారు. వీరు ప్రతినెలా ఇంటింటికీ వెళ్లి రీడింగ్‌ను తీసి బిల్లులు ఇస్తున్నారు. స్మార్ట్ మీటర్ల రాకతో వీరి ఉద్యోగాలు ఊడనున్నాయి. దీంతో వారు ఆందోళన బాట పట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే గ్రామ వలంటీర్లను ఇంటికి పంపించిన చంద్రబాబు సర్కార్ తాజాగా మీటర్ రీడర్లపై పడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం మొత్తం ఇళ్ల సర్వీసులు 3,81,690 వ్యవసాయ సర్వీసులు 1.25 లక్షలు కుటీర పరిశ్రమలకు చెందిన మీటర్లు 4736 వాణిజ్య సర్వీసులు 4163 జిల్లాలోని జగనన్న లేఅవుట్లు 592ఇది ప్రజలకు కుచ్చుటోపీ కాదా... స్మార్ట్ మీటర్లతో ప్రజలకు ఇబ్బందు లు తప్పవు. భవిష్యత్తులో రైతులకు కష్టాలు తప్పనట్టే. రైతు వరి పంట వేసి నీటి తడులు ఇవ్వాల్సిన తరుణంలో చార్జీ కట్టలేదని కరెంట్ డిస్ కనెక్ట్ చేస్తే పంట ఏమి కావాలి. గతంలో స్మార్ట్ మీటర్లు వద్దన్న చంద్రబా బు ఇప్పుడు అధికారంలోకి రాగానే వాటిని ఎలా అమ లు చేస్తున్నారు. దీనిపై తాము ఏడాదిగా పోరాటం చేస్తున్నాం. – గిరిధర్ గుప్త, సీపీఎం జిల్లా నాయకుడు, పలమనేరు చంద్రబాబు ఊసరవెళ్లిని మించిపోయారు ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను పగులగొట్టాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాటిని అమర్చుతున్నారు. కార్పొరేట్ కంపెనీకి మేలు కలిగిలా జనంపై భారం మోపుతున్నారు. ఆయన ఏమి చెబితే అదే కరెక్ట్ అన్న ట్టు మాట్లాడుతున్నారు. ఇదెక్కడి న్యాయం. దీన్ని జనం గమనించాలి. చంద్రబాబునాయుడు పూటకొక మాట మాట్లాడుతూ ఊరసవెల్లిని మించిపోయారు. – వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు -
మట్టి బకాసురులు
నాగరాజ కుప్పం వద్ద భూమట్టాన్ని దాటి 20 అడుగుల లోతు వరకు తవ్వేసిన కొండ గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లు నగరి : నియోజకవర్గంలో గ్రావెల్, కంకర అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్లుగా పగలు రాత్రి తేడా లేకుండా జేసీబీతో మట్టిని తవ్వేస్తున్నారు. ఈ దందా అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో నడుస్తుందన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. దీంతో అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ప్రధానంగా నగరి మండలం తడుకుపేట నుంచి రామాపురం వరకు, విజయపురం మండలం మహారాజపురంలో మట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నామమాత్రంగా దాడులు కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని మట్టి మాఫికాయకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్, విజిలెన్స్ అధికారులు అప్పు డప్పుడూ చుట్టపు చూపుగా వచ్చి తనిఖీలు చేస్తు న్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. క్వారీల్లో నిబంధనలను పాటించడం లేదు. విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. ఇటీవల విజయపురం మండలం మహారాజపురం నుంచి నకిలీ బిల్లులతో వెళుతున్న మూడు టిప్పర్లను స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా రెవెన్యూ అధికారులు సీజ్‌చేశారు. వారి వద్ద ఉన్నవి నకిలీ బిల్లులని కూడా గుర్తించారు. వాటిని నిర్వహించే యజమానులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి జాతీయ రహదారి సాకుతో గ్రావెల్, కంకర తమిళనాడుకు తరలిపోతోంది. రోజుకు పది బిల్లులు వేసుకొని ఆ బిల్లులతోనే వంద టిప్పర్లు తలించేస్తారు. దీంతో ప్రకృతి వనరుల ద్వారా ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి గండి పడుతోంది. అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. నగరి నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు, మిట్ట భూములను చెరబట్టింది. రేయింబవళ్లు జేసీబీలతో మట్టిని తవ్వుతూ టిప్పర్లు, లారీల్లో తరలించేస్తోంది. ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు తూతూమంత్రంగా దాడులు చేస్తూ నొప్పించక తానొవ్వక అంటూ కవర్ చేస్తున్నారు. చూస్తుండగానే కొండలు కరిగిపోతున్నాయి గతంలో ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణ పనులకు నగరి నియోజకవర్గంలో సుమారు 15 స్టోన్ క్వారీలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 50 క్వారీలు ఉన్నాయి. ఇవిగాక కొత్తగా తడుకు గ్రామంలో సర్వే నంబరు 85/1లో 6.514 హెక్టార్లు, సర్వే నంబరు 57లో 4.844 హెక్టార్లు, సర్వే నంబరు 100లో 4.996 హెక్టార్లు, సర్వే నంబరు 57, 102లలో 5.616 హెక్టార్లు, సర్వే నంబర్లు 85/4, 85/7లలో 5 హెక్టార్లు, సర్వే నంబరు 85లో 8 హెక్టార్లలో క్వారీలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. అలాగే కీళపట్టు రెవెన్యూలో గ్రావెల్, స్టోన్, బోల్డర్స్ తీసుకునేందుకు రెండు నూతన క్వారీలకు అనుమతి ఇచ్చేశారు. వారు భారీ పేలుళ్లతో కొండలు, గుట్టలను ధ్వంసం చేస్తున్నారు. పేలుళ్ల దాటికి ప్రజల ఇళ్లు భీటలు వారుతున్నాయి. రాళ్లు, దుమ్ము పొలాలపై పడుతుండడంతో పంటలు పండడం లేదని రైతులు వాపోతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు కొత్త క్వారీలకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. జాతీయ రహదారి పనులు పూర్తయ్యే లోపు నగరిలోని కొండలు, గుట్టలు ఖాళీ అయిపోతాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ‘గిరి‘ అన్నది నగిరి అనే పేరులోనే ఉంటుంది తప్ప ఊరులో ఉండదని అంటున్నారు. -
భక్తి భావనలే కవి క్షేత్రయ్య పదాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం)/వి.కోట : భక్తి భావనలతో మహాకవి క్షేత్రయ్య వాడిన పదాలు దైవలీలలను చాటాయని, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, భారతీయ తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షుడు నారాయణస్వామి, ఎం.వి.కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేట్ భవనంలో ఆదివారం సాహితీవేత్త డాక్టర్ మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో మహాకవి క్షేత్రయ్య సాహితీ వైభవంలో భాగంగా గీతాలాపన, కవితార్చన నిర్వహించారు. వారు మాట్లాడుతూ క్షేత్రయ్య సిద్ధేంద్రయోగి సూచనలతో అనేక క్షేత్రాలు దర్శించి ఆయా దేవతలపై అనేక గీతాలు రచించారని తెలిపారు. తద్వారా మహాకవి క్షేత్ర య్య బిరుదుతో ప్రఖ్యాతి పొందారని పేర్కొన్నారు. రచయితల జిల్లా అధ్యక్షుడు తోట గోవిందన్ మాట్లాడుతూ క్షేత్రయ్య కంచి, చిదంబరం క్షేత్రాల్లో కవిగానే కాకుండా పరమ భక్త శిఖామణిగా కీర్తి పొందారని తెలిపారు. తెలుగు రాజులు పరిపాలించిన తంజావూరు, మధుర రాజ్యాల మధ్య సఖ్యత కు క్షేత్రయ్య ప్రయత్నించారని తెలిపారు. అనంతరం వి.కోట మండలానికి చెందిన కవులు కొఠారి వెంకటరత్నం, రఘుపతి తోపాటు పలువురు రచయితలు, గాయకులను సాహితీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు సన్మానించారు. కార్యక్రమంలో ఎస్.మునీంద్ర, ఎం.కన్నయ్య నాయుడు, ఎం.శ్రీరాజు, జగదీష్, తాళ్లపాక వరలక్ష్మమ్మ, టి.మంజులాదేవి, కోటీశ్వర మొదలియార్, టి.ఎస్.ప్రవళ్లిక, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ డిగ్రీ కళాశాలపై కూటమి కక్ష
వెదురుకుప్పం: పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వెదురుకుప్పం మండలానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా కళాశాల నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. వారు ఆదివారం పచ్చికాపల్లంలో ఉన్న డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అందులో ముళ్ల కంపలతో నిండిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వెదురుకుప్పంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కళాశాల మంజూరు చేసినట్లు చెప్పారు. పచ్చికాపల్లం సమీపంలో 11 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. భవన నిర్మాణాలకు రూ.17,82,50,000 మంజూరు చేశారని వివరించారు. ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా డిగ్రీ కళాశాల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కళాశాలను వైఎస్.జగన్మోహన్రెడ్డి మంజూరు చేశారనే అక్కసుతోనే పేదల చదువుపై చంద్రబాబు విషం చిమ్ముతున్నట్టు మండిపడ్డారు. వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బండి హేమ సుందర్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య కు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. కళాశాలల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. ఫలితంగా పేద విద్యార్థులు ప్రైవేటు వైపు మొగ్గుచూపాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా డిగ్రీ కళాశాల గురించి పట్టించుకోవాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుకుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రామయ్య, యువజన విభాగం జిల్లా కార్యదర్శి నరేష్‌రెడ్డి, వైద్య విభాగం జీడీనెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రకాష్, మాజీ సర్పంచులు చిరంజీవిరెడ్డి, రమేష్‌రెడ్డి, గోవిందన్, కోఆప్షన్ సభ్యుడు వెంకటేశ్, ఎస్సీ సెల్ మండల కార్యదర్శి మురళీ, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జగదీశ్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ డైరెక్టర్ మునికృష్ణారెడ్డి, నాయకులు పురందర్‌రెడ్డి, వెంకటేశ్, వాసు, ఈశ్వరరెడ్డి, బొజ్జారెడ్డి, రేణుక పాల్గొన్నారు. -
పరిశ్రమలకు భూమిలివ్వాలని రైతులపై ఒత్తిడి
కుప్పం: గుడుపల్లె మండలం పొగురుపల్లె వద్ద ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని చెబుతూ ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరిస్తోంది. రైతులు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇందులో భాగంగానే ఆరు నెలల క్రితం పొగురుపల్లి గ్రామ సమీపంలో 350 ఎకరాలు తీసుకుంది. బాధిత రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు మల్బరి తోటలతోపాటు పూల తోటలు, అరటి, కూరగాయలు తదితర పంటలు సాగు చేసుకుంటున్నారు. అలాంటి మంచి భూములను పరిశ్రమల కోసం ఇవ్వాలని అధికారులు రైతులపై ఒత్తిడి తీసుకువచ్చారు. రైతులు చేసేదేమీ లేక భూములు ఇచ్చారు. వాటిలో పరిశ్రమల నిర్మాణ పనులు చేస్తున్నారు. బాధిత రైతులకు పరిహారం మాత్రం ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో సమాచారం కూడా లేదు. ఇప్పుడు మళ్లీ 250 ఎకరాల సెటిల్మెంట్ భూములపై ప్రభుత్వం కన్నేసింది. రైతులు తమ భూములు ఇచ్చేది లేదని ఎదురు తిరిగారు. ఇప్పటికే వందల ఎకరాల భూములను కోల్పోయామని, మిగిలిన భూములను తీసుకుంటే జీవనం ఎలా సాగించాలని ప్రశ్నిస్తున్నారు. 500 కుటుంబాలు వీధిన పడతాయని నిలదీస్తున్నారు. దీంతో భూసేకరణకు ఇబ్బందిగా మారింది. దీనిపై జిల్లా, మండల అధికార యంత్రాంగం, పోలీసులు గ్రామస్తులపై ఒత్తిడి చేపట్టారు. నష్ట పరిహారం చెల్లిస్తామని, కచ్చితంగా భూములు ఇవ్వాల్సందేనని హెచ్చరించారు. దీంతో ఏమి చేయాలో దిక్కతోచని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సోమశేఖర్‌రెడ్డి అనే రైతు శనివారం గుడుపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. -
నేడు వైఎస్సార్సీపీ నిరసన
చిత్తూరు కార్పొరేషన్: పెట్రోల్, డీజల్ ధరల పెంపునకు నిరసనగా సోమవా రం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వ హించనున్నట్లు ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. ఉదయం 9.30 గంటలకు గాంధీ విగ్రహం వద్దకు అన్ని విభాగాల నాయకులు చేరుకోవాలని కోరారు. అక్క డి నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యా లయానికి చేరుకుంటామ ని తెలిపారు. అక్కడ నిరసన తెలిపి ఆర్డీవోకు వినతి పత్రం అందజేస్తామని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ అమర్‌బాబు తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేయాలని సూచించారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రైతులపై విత్తన భారం
కూటమి ప్రభుత్వం రైతులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే ఎరువులు, పురుగు మందుల భారం మోపింది. తాజాగా వేరుశనగ విత్తన కాయల ధరలు పెంచి నడ్డి విరుస్తోంది. రాయితీ ఇస్తున్నామని చెబుతూ రైతుల జేబులకు చిల్లు పెడుతోంది. గత ఏడాదితో పోలిస్తే 30 కిలోల వేరుశనగ కాయల బస్తాపై రూ.162లు పెంచింది. ఆ లెక్కన జిల్లాలోని రైతులపై మొత్తం రూ.1.30 కోట్ల అదనపు భారం పడుతోందని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. కాణిపాకం: జిల్లాలో ఖరీఫ్–2026 సీజన్ ప్రారంభమైంది. ఇటీవల అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు పొలాలను దుక్కిదున్నుకున్నారు. ప్రభుత్వం వేరుశనగ విత్తన కాయలు ఇస్తే వాటిని వలుచుకుని తొలకరి వర్షం కురిసిన వెంటనే విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ జిల్లాకు 27,225.9 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలను కేటాయించింది. వీటితో పాటు భూసారాన్ని మెరుగుపరిచే పచ్చిరొట్ట విత్తనాలను కూడా రాయితీపై ఇస్తామని అధికారులు చెబుతున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా త్వరలో పంపిణీ ప్రారంభం కానుందని పేర్కొంటున్నారు. పచ్చిరొట్ట విత్తనాలను భూసార పరిరక్షణ దష్ట్యా రైతులకు 50 శాతం రాయితీపై అందించనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీ వెల్లడించారు. బస్తాపై రూ.162 పెంపు.. గత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం 30 కిలోల వేరుశనగ విత్తనకాయల బస్తాను రైతులకు రూ.1,674లకు అందజేసింది. ఈ సారి రూ.1,836లకు పెంచింది. అంటే బస్తాపై రూ.162 అదనంగా రైతు చెల్లించాల్సి వస్తోంది. కిలోకు సుమారు రూ.5.20 మేర ధర పెరిగింది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 31 వేల హెక్టార్లు కాగా గతేడాది 7 వేల హెక్టార్లల్లో మాత్రమే వేరుశనగ సాగైంది. ఈ సారి విత్తన ధర పెంపు, పెట్టుబడి సాయం జాప్యంతో ఖరీఫ్ కాడె కదిలే పరిస్థితి కనిపించడంలేదు. సాగు విస్తీర్ణం 4 హెక్టార్ల నుంచి 5 వేల హెక్టార్లకు పరిమితం కావచ్చని రైతులు చెబుతున్నారు. వేరుశనగ విత్తనాల ధరలు కే–6, టీసీజీఎస్–1694 రకాల విత్తనాల క్వింటాలు ధర రూ.10,200గా ఖరారు చేశారు. అందులో 40 శాతం రాయితీ రూ.4,080 పోగా రైతు వాటా రూ.6,120లుగా నిర్ణయించారు. ఈ లెక్కన 30 కిలోల బస్తా రైతులకు రూ.1,836 పడుతుంది. నారాయణి రకం విత్తనం క్వింటాలు ధర రూ.10,500గా నిర్ణయించారు. అందులో రూ.4,200 రాయితీ పోనూ రైతు వాటా రూ.6,300. లేపాక్షి రకం 30 కిలోల విత్తన బస్తా ధరను రూ.1,710గా ఖరారు చేశారు. రాయితీ ఉన్నప్పటికీ రైతులు చెల్లించాల్సిన మొత్తాలు ఎక్కువగానే ఉండడంతో అసంతప్తి వ్యక్తమవుతోంది. వర్షాలపై అనిశ్చితి ఒకవైపు, పెట్టుబడుల పెరుగుదల మరోవైపు రైతులను తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తోంది. కొన్నేళ్లుగా సాగు ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు ఆశించిన స్థాయిలో రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల కేటాయింపు క్వింటాళ్లలో వేరుశనగ 27,225.9 జీలుగ 337 జనుము 1005 పిల్లిపెసర 22 -
ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డేను పురస్కరించుకుని చిత్తూరు నగరంలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని నేషనల్ ఎయి డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో నిర్వహించారు. ర్యాలీ జిల్లా ఎయిడ్స్ నివారణ కేంద్రం నుంచి ప్రారంభమై చర్చ్ స్ట్రీట్, మార్కెట్ చౌక్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు సాగింది. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాగశశిభూషణ్‌రెడ్డి, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ జి.వెంకట ప్రసాద్, దిశా సీపీఎం కోటి రెడ్డి, ఐసీటీసీ సిబ్బంది, ఎన్జీవో ప్రతినిధులు, నర్సింగ్ విద్యార్థులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. స్వల్పంగా పెరిగిన టమాట ధరలు వి.కోట: వి.కోట మార్కెట్లో ఆదివారం టమాట ధరలు స్వల్పంగా పెరిగాయి. 18 కిలోల బాక్సు ధర రూ.250 నుంచి రూ.500 పలికింది. రైతులు మూడు రోజులుగా 18 కిలోల బాక్సు ధర అత్యధికంగా రూ.400 నుంచి 500 వరకు పలుకుతోంది. ప్రస్తుతం పంట తక్కువగా ఉందని, మార్కెట్‌కు టమాట కాయలు తక్కువగా వస్తుండడంతోనే ధరలు పెరుగుతున్నట్టు మండీ వ్యాపారులు చెబుతున్నారు. -
అధికారులు ఒత్తిడి చేస్తున్నారు
పరిశ్రమలకు భూములు ఇవ్వాలని అధికారులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నా రు. నష్ట పరిహారం ఇస్తాం.. పరిశ్రమలు వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి.. భూములు ఇవ్వాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే 350 ఎకరాలు ఇచ్చాం. మళ్లీ 250 ఎకరాలు కావాలని ఇబ్బంది పెడుతున్నా రు. భూములను లాక్కుంటే గ్రామం మొత్తం ఖాళీ చేసి కూలి పనుల కోసం వలస బాట పట్టాల్సిందే. – చెంగారెడ్డి, రైతు, పొగురుపల్లి భయపెడుతున్నారు సారవంతమైన పట్టా భూములు ఇవ్వాలని భయపెడుతున్నారు. ఒప్పుకోకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఏమి చేయా లో దిక్కతోచడం లేదు. మానసిన వేదనను తట్టుకోలేకపోతున్నాం. అధికారుల ఒత్తిడులను భరించకలేక ఆత్మహత్యే శరణ్యమని పెట్రోల్‌తో తహసీల్దార్ వద్దకు వెళ్లాను. మా పూర్వీకుల నుంచి వందేళ్లుగా ఇక్కడే జీవిస్తున్నాం. భూములుపోతే ఏమి చేయాలో తెలియడం లేదు. – సోమశేఖర్‌రెడ్డి, రైతు, పొగురుపల్లి నాలుగు ఎకరాల్లో ఒక సెంటు ఉండదు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నాం. నాకు పూర్వీకుల నుంచి వచ్చిన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాన్ని ఫ్యాక్టరీలకు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఆ భూమి మొత్తం తీసుకుంటే మాకు సెంటు భూమి కూడా ఉండదు. మా గ్రామంలో 80 కుటుంబాలు ఒక సెంటు భూమి కూడా లేకుండా కోల్పోయి గ్రామం వదిలి బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. – గజేంద్రరెడ్డి, రైతు, పొగురుపల్లి దినసరి కూలి పనులే గతి అనేక ఏళ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవ నం సాగిస్తున్నాం. ఇప్పు డు ఫ్యాక్టరీల కోసమని ఉన్న భూములను తీసుకుంటే ఎలా బతకాలి. దినసరి కూలీలుగా మారి కూలి పనులు చేసుకోవాల్సిందే. ఎంత ప్రాధేయపడినా అధికారులు వినడం లేదు. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. వ్యవసాయం నమ్ముకుని జీవించే రైతులం. మాపై పోలీసులు కేసులు పెడతామని బెదిరించడం ఎంత వరకు సమంజసం. – రవికుమార్, రైతు, పోగురుపల్లి -
నకిలీ నోట్ల ముఠా పట్టివేత
కార్వేటినగరం: రూ.10 లక్షలకు రూ.కోటి నకిలీనోట్లు ఇస్తామంటూ ఇద్దరిని మోసగించిన ఐదుగురిని చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు పోలీసులు కాగా ఒకరు టీడీపీ నాయకుడు. జీడీ నెల్లూరు మండలం బట్టుకండ్రిగ డంపింగ్ యార్డు వద్ద శనివారం అరెస్టు చేసిన నిందితుల్ని ఆదివారం చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రిమాండ్ విధించడంతో నిందితుల్ని చిత్తూరు జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సెల్వం.. మిట్టవేల్కూరు గ్రామ టీడీపీ నాయకుడు. సెల్వం కుమారుడు డిచ్ సీఎం చంద్రబాబునాయుడుతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుల్లో లోకనాథం చిత్తూరులో ట్రాఫిక్ ఏఎస్ఐగా పనిచేస్తుండగా, రవిచంద్రన్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్.ఈ కేసు వివరాలను జీడీ నెల్లూరు పోలీసులు ఆదివారం తెలిపారు. వారు తెలిపిన మేరకు.. వేలూరు జిల్లా సైదాపేటకు చెందిన ఇళంగోవన్, జీడీ నెల్లూరు మండలం మిట్టవేల్కూరు దళితవాడకు చెందిన సెల్వం, అదే గ్రామానికి చెందిన లక్ష్మణకుమార్, వేల్కూరు గ్రామానికి చెందిన రవిచంద్రన్ (రవి), పెనుమూరు మండలం గుడ్యాణంపల్లికి చెందిన లోకనాథం (లోక) ముఠాగా ఏర్పడి నకిలీనోట్లు ఇస్తామని తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మంజు, విజయ్‌లను సంప్రదించారు.రూ.10 లక్షలు ఇస్తే రూ.కోటి నకిలీనోట్లు ఇస్తామని చెప్పి బట్టుకండ్రిగ వద్దకు పిలిచారు. వారితో ముఠాలోని కొందరు సభ్యులు మాట్లాడుతుండగా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకుని బెదిరించి బాధితుల వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు లాక్కెళ్లారు. బాధితులు వెంటనే జీడీ నెల్లూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. -
అర్ధరాత్రి 2 గంటలు గుండెలు గుప్పిట్లో..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం జి.గొల్లపల్లెకు చెందిన జ్యోత్స్న 7వ నెలలోనే పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా అడ్మిటై, 800 గ్రాముల బరువున్న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉందని, వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. దీంతో తల్లి, బిడ్డను 12.15 సమయంలో అంబులెన్స్‌లోకి ఎక్కించారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డను అంబులెన్స్ వెంటిలేటర్‌పై ఉంచారు. మురకంబట్టు వద్దకు వెళ్లగానే అంబులెన్స్ ఆగిపోయింది. మరో 108ను 60 కి.మీ. దూరం ఉన్న పీలేరు నుంచి పిలిపించారు. వాహనం వచ్చే వరకూ 2 గంటలపాటు తల్లి, బిడ్డ నడిరోడ్డుపై నరకయాతన పడ్డారు. అనంతరం అంబులెన్స్ రావడంతో తల్లి, బిడ్డను తిరుపతికి తరలించారు. ప్రస్తుతం బిడ్డను రుయా ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంచి, వైద్యులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సామాన్యుడి నెత్తిన ధరల భారం
నగరి: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతోందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి రూ.3లు పెంచడంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్ని కల ముందు ఇంధనం ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనిస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారాలోకేష్ ఇప్పుడు ధరలు పెంచి ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇంధనం ధరల పెంపు ప్రభావం వాహనదారులపైనే కాకుండా రవాణా రంగం ద్వారా నిత్యావసర సరుకుల ధరలపైనా పడు తుందన్నారు. సామాన్య ప్రజల జీవనవ్య యం మరింత పెరుగుతుందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక లు ముగిసేంత వరకు ఇంధనం ధరలు పెరగవని చెప్పి, ఎన్నికలు ముగిసిన వెంటనే పెంచడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. గతంలో ‘‘బాదుడే బాదుడు’’ అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేశారని తెలిపారు. ఇప్పుడు నిజమైన భారం ఏమిటో ప్రజలకు చూపిస్తున్నారని విమర్శించారు. ధరలు పెంచబోమని చెప్పిన మంత్రి లోకేష్ -
ఆన్లైన్లో గురుకులాల సమాచారం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గురుకులాల్లో అడ్మిషన్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరుగుతోందని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్ పద్మజ తెలిపారు. గురుకులాల్లో అడ్మిషన్ల సమాచారమేదీ అన్న శీర్షికన శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. విద్యార్థుల ఎంపిక, మార్కులు తదితర వివరాలు ఆన్లైన్లో ఉంచినట్టు తెలిపారు. తమ నమోదిత ఫోన్ నంబరు, హాల్ టికెట్, ఆధార్ నంబర్లను ఉపయోగించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. అదేవిధంగా జిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో అడ్మిషన్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఎంపికై న 5వ తరగతి, జూనియర్ ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర గురుకుల శాఖ అధికారుల నుంచి మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించినట్టు తెలిపారు. మొదటి జాబితాలో ఎంపికై న విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి 29 వరకు సర్టిఫికెట్లను పరిశీలించి అడ్మిషన్లను ఖరారు చేశామని వివరించారు. రాష్ట్ర అధికారులు విడుదల చేసిన రెండవ జాబితా విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ మే 6 నుంచి ప్రారంభమైందని, 19 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇందులో 5వ తరగతికి ఎంపికై న విద్యార్థులకు ఫోన్లు చేసి అడ్మిషన్లు ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు. జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు మే 12న రెండవ జాబితా విడుదలైందని, వారికి మే 20వ తేదీ వరకు అడ్మిషన్లు కల్పించనున్నట్టు తెలిపారు. -
గిట్టుబాటు ధర కల్పించాలి
బంగారుపాళెం: మామిడి, పాడి రైతులకు గిట్టుబా టు ధర కల్పించాలని ఏపీ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బంగారుపాళెంలో శనివారం ఏపీ రైతు సంఘం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రకృతి వైపరీత్యాల వల్ల అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయాయన్నారు. వాటికి ధర రాక రోడ్లపై పడేశారన్నారు. గత ఏడాది ప్రభుత్వం మామిడి కిలో రూ.8కి నిర్ణయించినా ఆచరణలో అమలు కాలేదన్నారు. ఈ ఏడాది తక్కువ దిగుబడి వచ్చిందని, రైతులకు గిట్టుబాటుధర కల్పించాలన్నారు. జిల్లాలో ప్రైవేట్ పాల డెయిరీలు పాలకు కనీస మద్దతు ధర కల్పించకుండా దోపిడీ చేస్తున్నాయని చెప్పారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, జిల్లా కార్యదర్శి శంకరన్, రైతు సంఘ నేతలు పాల్గొన్నారు. -
మొబైల్ చూడొద్దన్నందుకు విద్యార్థి ఆత్మహత్య
చిత్తూరు అర్బన్ : నిత్యం మొబైల్ ఫోన్ చూడొద్దని తల్లిదండ్రు లు మందలించడంతో ఇంటర్ విద్యార్థి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివా రం చిత్తూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరం తంగవేలు కాలనీకి చెందిన శక్తివేల్ (17) స్థానికంగా ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల మొబైల్‌తో ఎక్కువ సేపు గడుపుతుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో కలత చెందిన బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నేడు జేఈఈ అడ్యాన్స్డ్ పరీక్ష తిరుపతి సిటీ: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివా రం జరగనుంది. తిరుపతి –కరకంబాడి రోడ్డు లోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 100 మంది, జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్లో 650 మంది పరీక్షకు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరగనుంది. -
ఆలపాకంలో భారీ చోరీ
విజయపురం (నగరి) : విజయపురం మండలంలోని ఆలపాకం గ్రామంలోని ఒక ఇంటిలో దొంగలు పడ్డారు. ఇంటి కిటికీని తొలగించి లోనికి చొరబడి రూ.30 లక్షల విలువైన 20 సవర్ల బంగారాన్ని చోరీ చేశారు. ఎస్ఐ వెంకటసుబ్బయ్య కథనం మేరకు.. ఆలపాకం గ్రామానికి చెందిన కె.హరీష్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని రోజులుగా మిద్దైపె నిద్రిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన దొంగలు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి కిటికీని తొలగించి లోపలికి ప్రవేశించారు. బీరువాను పగులగొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేశారు. శనివారం ఉదయం కిందికి దిగిన కుటుంబ సభ్యులు కిటికీలు తొలగించి ఉండడం, బీరువా పగులగొట్టి దుస్తులు చిందరవందరగా పడివుండడాన్ని గమనించి చోరీ జరిగినట్లు గుర్తించారు. బాధితుడు హరీష్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. -
గతంలో ప్రభుత్వమే చెల్లింపు
మైనర్ గ్రామ పంచాయతీల ఆర్థిక దుస్థితిని పరిగణనలోకి తీసుకుని వాటి విద్యుత్ బిల్లులను గతంలో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మైనర్ గ్రామ పంచాయతీలను దెబ్బతీసేలా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకప్పుడు చిన్న గ్రామ పంచాయతీలకు విద్యుత్ చార్జీల నుంచి మినహాయింపు ఉండేది. ఆయా పంచాయతీల్లో వీధి దీపాలు, మంచినీటి పథకాల విద్యుత్ బిల్లులను వసూలు చేసేవారు కాదు. మేజర్ గ్రామ పంచాయతీలు మాత్రం సొంత నిధుల నుంచి ఆ బిల్లులు చెల్లించాలి. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని నోటీసులిచ్చింది. అప్పటి నుంచి మైనర్ గ్రామ పంచాయతీల్లో బకాయిలు పేరుకుపోయాయని అధికారులు చెబుతున్నారు. -
పంచాయతీలకు షాక్
ప్రభుత్వం పంచాయతీలకు ఆదాయ వనరులను కల్పించకపోగా మరింత భారం వేస్తోంది. విద్యుత్ బిల్లులను పంచాయతీలే భరించాలని ఆదేశించింది. గతంలో లాగా ప్రభుత్వమే చెల్లించాలన్న ఫైనాన్స్ కార్పొరేషన్ చేసిన డిమాండ్‌కు బ్రేక్ వేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సర్వీసులకు ఏర్పాటుచేసిన స్మార్ట్ మీటర్లను ఇకపై ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చనున్నారు. ఇప్పటికే విద్యుత్ బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో పంచాయతీలపై అదనపు భారం పడనుంది. ఫలితంగా గ్రామాలు చీకట్లో ఉండాలా అని ప్రజలు వాపోతున్నారు. చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మొత్తం 623 పంచాయతీలున్నాయి. మేజర్ పంచాయతీలు బంగారు పాళ్యం. కార్వేటినగరం, రామకుప్పం, వి.కోట, కల్లూరు, పొలకల, డి.అగరం, అరగొండ, రొంపిచెర్ల ఉన్నాయి. మిగిలిన 614 మైనర్ పంచాయతీ లు.వాటిలో ఆదాయం, జనాభా ప్రాతిపదికన గ్రా మ పంచాయతీలను గ్రేడ్లుగా విభజించారు. గ్రేడ్–1 పంచాయతీలు –34, గ్రేడ్–255, గ్రేడ్–3 పంచాయతీలు 90, గ్రేడ్–4 కలిగినవి 223, గ్రేడ్–5 కింద 214 ఉన్నాయి. వీటిలో గ్రేడ్–1 పంచాయతీలు 34 వరకూ ఉన్నాయి. మిగిలిన 589లో ఒక 100 పంచాయతీల ఆదాయం సుమారుగా ఉంది. మిగిలిన 489 పంచాయతీల ఆదాయం అంతంతమాత్రమే. ప్రధానంగా ఇంటి పన్నులు, మంచినీటి చెరువుల గట్ల చుట్టూ ఉండే టెంకాయ చెట్లతోపాటు చింత తదితర చెట్ల నుంచి వచ్చే ఫలసాయం తప్ప మరో ఆదాయ మార్గం ఉండడం లేదు. అవి కూడా లేని గ్రామ పంచాయతీలు ఆర్థికంగా నానా పాట్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైనర్ గ్రామ పంచాయతీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన బాఽ ద్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని రాష్ట్ర ఫైనా న్స్ కార్పొరేషన్ చేసిన సిఫార్సులకు చంద్రబాబు ప్రభుత్వం నో చెప్పింది. వీధి దీపాల నిర్వహణ ఖర్చును గ్రామ పంచాయతీలే భరించాలని స్పష్టం చేసింది. రూ.382 కోట్లు బకాయిలు జిల్లాలో గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులు పేరుకుపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకు రూ.382 కోట్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వీటిని చెల్లించాలని ట్రాన్స్‌కో జిల్లా యంత్రాంగం చెబుతోంది. ప్రతినెలా మేజర్ పంచాయతీల్లో రూ.90 లక్షలు, మైనర్ పంచాయతీల్లో రూ.9.10 కోట్ల వరకు కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఏడాదికి రూ.120 కోట్లు కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మేజర్ గ్రామ పంచాయతీలకు వార్షిక ఆదాయం ఉంటుంది కాబట్టి విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఇబ్బంది లేదు. మైనర్ పంచాయతీలకు సొంత నిధులు లేని దుస్థితి. మౌలిక వసతులు కూడా కల్పించలేని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీధి దీపాలు, తాగునీటి మోటార్ల విద్యుత్ బిల్లుల చెల్లింపు వాటికి మోయలేని భారమవుతోంది. పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాలు చెల్లించడానికే ఆదాయం చాలడం లేదని, ఇక విద్యుత్ బిల్లుల చెల్లింపు ఏవిధంగా చేయాలో తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లా పంచాయతీల సమాచారం జిల్లాలో మొత్తం పంచాయతీలు 623 మేజర్ పంచాయతీల బకాయిలు రూ.32 కోట్లు మైనర్ పంచాయతీల బకాయిలు రూ.350 కోట్లు మొత్తం రూ.382 కోట్లువిద్యుత్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం నో -
ఉచిత భోజనంలో ఉప్పు.. కారం లేదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఉచిత భోజనంలో ఉప్పు, కారం లేదు. ఇడ్లీ లు రాళ్లులా ఉంటున్నాయి. రసం, సాంబారు, మజ్జిగ నీళ్లలా పల్చగా ఉన్నాయి. అన్నం ఉడకడం లేదు. వీటిని ఎలా తినాలని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేశా రు. ఎమ్మెల్యే గురజాల జగన్మోమన్ శుక్రవారం రాత్రి చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీ చేశారు. చిన్న పిల్లల వార్డు చికిత్స పొందుతున్న చిన్నారులు, రోగులతో మాట్లాడారు. భోజనం సరిగా లేదని పలువురు రోగులు ఎమ్మెల్యే ముందు వాపోయారు. ఇడ్లీలు రాళ్ల లాగా ఉండడంతో తినలేక పోతున్నామని తెలిపారు. డబ్బులిచ్చి బయట తెచ్చుకుంటున్నామని, పూటకు రూ.100 నుంచి రూ.200 వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. ఎవడైతే ఏముంది, ఇంత దారుణంగా ఆహారం అందిస్తారా? కలెక్టర్‌కు చెప్పి కాంట్రాక్టు రద్దు చేయిస్తా, మంచి కాంట్రాక్టర్‌ను తీసుకొస్తానంటూ పేర్కొన్నారు. రూ.10 లక్షల కుచ్చుటోపి ? సాక్షి టాస్క్ ఫోర్స్ : జీడీనెల్లూరు మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు రూ.10 లక్షల కుచ్చుటోపి పెట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ తాము టెంకాయల వ్యాపారం కోసం చిత్తూరు జిల్లాకు వచ్చామని తెలిపారు. గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ఐదుగురు తమను మోసం చేసి రూ.10 లక్షల దోచుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు జీడీనెల్లూరు మండలానికి చెందిన ముగ్గురిని, పోలీసు శాఖకు చెందిన ఇద్దరిని చిత్తూరులో విచారిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై జీడీ నెల్లూరు ఎస్ఐని వివరణ కోరగా పూర్వాపరాలు విచారించి ఆదివారం తెలియజేస్తామన్నారు. ఈ తతంగమంతా దొంగ నోట్ల ముఠా దొంగనోట్ల మార్పిడి కోసమేనని ప్రచారం జరుగుతోంది. -
అపోలోలో నర్సింగ్ విద్యార్థుల వీడ్కోలు వేడుకలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్ సిటీలోని అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో శనివారం 2021–2026 విద్యా సంవత్సరానికి చెందిన 5వ బ్యాచ్ విద్యార్థుల ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థు ల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీనియర్లు, జూనియర్లు కలిసి పంచుకున్న జ్ఞాపకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ నర్సింగ్ విద్యార్థులు సేవా భావం, క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ డి.జగదీశన్ మాట్లాడుతూ నర్సింగ్ అనేది నోబుల్ ప్రొఫెషన్ అని పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,688 మంది స్వామిని దర్శించుకున్నారు. 38,264 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనమవుతోంది. -
రక్తపోటుపై అవగాహన అవసరం
చిత్తూరు కలెక్టరేట్ : నిశ్శబ్ద శత్రువు రక్తపోటుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తెలిపారు. ఆయన శనివారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ప్రపంచ రక్తపోటు దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి కారణంగా రక్తపోటు వస్తోందన్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. తద్వారా గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించుకోవాలని, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, వ్యాయామం, యోగా చేయడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో ఉచితంగా రక్తపోటు పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
పేదలపై ఇంధనం బాంబ్..!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు సామాన్యుడి బతుకును భారంగా మారుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఎలాగోలా జీవితాలను నెట్టుకొస్తున్న పేదలపై తాజాగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారం మోపాయి. ఆ ప్రభావం వాహనదారులపైనా పడింది. షేరింగ్ ఆటోల చార్జీలు కూడా పెంచారు. ఇది ప్రజలకు మరో పెద్ద షాక్‌గా మారింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వరుసగా పెరుగుతున్న ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక బడ్జెట్ పూర్తిగా దెబ్బతింటోంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 146 పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. రోజువారీగా సుమారు 600 కేఎల్ డీజిల్, 4 వేల కేఎల్ పెట్రోల్ వరకు సరఫరా అవుతున్నట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. తాజాగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర రూ.110.27 నుంచి రూ.113.56 చేరగా, డీజిల్ ధర రూ.98.16 నుంచి రూ.101.30కు పెరిగింది. పవర్ పెట్రోల్ కూడా రూ.123.02కు చేరింది. ఒక్క లీటరుపైనే రూ.3లకు పైగా భారం పడడంతో ఆ ప్రభావం వాహనదారులపై నేరుగా పడుతోంది. దీంతో బైక్ వినియోగదారులు, కార్ల యజమానులు, డెలివరీ బాయ్స్ నుంచి చిన్న వ్యాపారుల వరకు నెలవారీ ఖర్చులు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధన ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై చూపింది. డీజిల్‌పై ఆధారపడే లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, వ్యవసాయ యంత్రాలు..ఇలా అన్నీ ఖర్చులు పెరిగిపోయాయి. షేరింగ్ ఆటో చార్జీలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటి వరకు రూ.10 నుంచి రూ.15 ఉన్న ప్రయాణానికి ఇప్పుడు రూ.15 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యం తక్కువగా ఉండడంతో ప్రజలు పూర్తిగా ఆటోలపైనే ఆధారపడుతున్నారు. రోజూ కూలి పనులకు వెళ్లే వారు, మార్కెట్‌కు వెళ్లే రైతులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇప్పుడు అదనపు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లి రావడానికే రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకు ఖర్చవుతోందని ప్రజలు చెబుతున్నారు.టీడీపీ పాలనలో పెట్రోల్, డీజిల్ మోత నిత్యావసర సరుకులపైనా ప్రభావం ఇంధన ధరల పెంపు ప్రభావం పరోక్షంగా కూడా కనిపిస్తోంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, పండ్లు, కిరాణా సరుకులు, పాలు, నిర్మాణ సామగ్రి వంటి అన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సరుకు తరలించే ఖర్చు పెరగడంతో చివరకు ఈ భారం వినియోగదారుడిపైనే పడుతోంది. ఇప్పటికే విద్యుత్ చార్జీలు, గ్యాస్ ధరలు, స్కూల్ ఫీజులు, వైద్యం ఖర్చులు పెరిగి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంధన ధరలు, ఆటో చార్జీల పెంపు కలిసి మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను పూర్తిగా కుదేలు చేస్తున్నాయి. ప్రతి నెలా ఖర్చులు పెరుగుతుండడంతో జీతం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఖాళీ అవుతోందని వాపోతున్నా రు. సామాన్యుడిపై పడుతున్న భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఇసుక తోడేళ్లు
సోమశిలలో కూటమి నేతలు అధికారం అండతో అక్రమ వ్యాపారాలను జోరుగా సాగిస్తున్నారు. ఇసుక, గ్రావెల్, మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమశిల ప్రాజెక్టులో ఇసుకను తవ్వి చిత్తూరు మీదుగా తమిళనాడు, కర్ణాటకకు రవాణా చేస్తున్నారు. పూతలపట్టు, చిత్తూరు నగర శివార్లలో డంప్ చేసి రాత్రిళ్లు టిప్పర్ల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. పూతలపట్టు పోలీసులు కాపుకాచి టిప్పర్లను పట్టుకోవడంతో అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో తిరుపతికి చెందిన ఓ ప్రధాన ఆలయ చైర్మన్ బంధువులే ప్రధాన భూమిక పోషిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. సాక్షి టాస్క్‌ఫోర్స్ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని గుడిపాల మీదుగా తమిళనాడులోని కాట్పాడి, బంగారుపాళ్యం, పలమనేరు మీదుగా కర్ణాటకకు తరలుతోంది. పూతలపట్టు, చిత్తూరు నగర శివార్లలో డంప్‌లు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి రాత్రిళ్లు టిప్పర్లతో సరిహద్దు రాష్ట్రాలకు తరలించడం ఈ మాఫియా స్టైల్ ఆపరేషన్‌గా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఈ మాఫియాకు ముందస్తు సమాచారం, రూట్ క్లియరెన్స్ ఇచ్చే వ్యవస్థీకృత నెట్వర్క్ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో తిరుపతిలోని ఓ ప్రధాన ఆలయ చైర్మన్ బంధువుల పాత్ర ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అదే పేరుతో ఇసుక వ్యాపారం నడిపిస్తూ, మధ్యవర్తులు, ట్రాన్స్పోర్ట్ యజమానుల ద్వారా భారీగా డబ్బు చేతులు మారుతోందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడులోని ధర్మపురికి చెందిన మరో కీలక వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. కూటమి నేతల ఆదాయ వనరుగా సోమశిల కాపు కాచి పట్టేశారు పోలీసులు శనివారం తెల్లవారుజామున పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ వద్ద టిప్పర్‌ను పట్టుకున్నారు. పరిశీలనలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు తేలింది. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక ఇసుకను నెల్లూరు వైపు నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన సూత్రధారులు ఇంకా వెలుగులోకి రాకపోవడంతో విచారణ మరింత వేగవంతమైంది. ఇప్పటికే కొందరి పేర్లు అనుమానితుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగించే ఈ అక్రమ ఇసుక రవాణా వెనుక ఉన్న ‘‘పెద్ద తలలు’’ బయటపడతాయా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం
చిత్తూరు అర్బన్: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉన్నప్పుడే మంచి భవిష్యత్తు, గౌరవం లభిస్తాయని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసలైన జీవితాలు నాశనం అవుతాయని పేర్కొన్నారు. కొందరు యువకులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారు తూ అసాంఘిక శక్తులుగా మారాలని చూస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్టు తెలిస్తే ప్రజలు పోలీసు వాట్సాప్ 9440900005, డయల్ 1972 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే డెంగీ నివారణ పూతలపట్టు(యాదమరి): ప్రజల ఆరోగ్యానికి దోమలే ప్రధాన శత్రువులని, సమాజ భాగస్వామ్యంతోనే డెంగీ వ్యాధిని అరికట్టవచ్చని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగశశిభూషన్‌రెడ్డి తెలిపా రు. ఆయన శనివారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పూతలపట్టు పీహెచ్సీలో డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నా రు. నీరు నిల్వ ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. నిల్వ ఉన్న నీటిలోనే దోమలు పెరుగుతాయని తెలిపారు. నీటి పాత్రలపై మూతలు పెట్టాలన్నారు. దోమల నివారణకు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే పాటించాలని, దోమ తెరలు వాడుతూ దోమకాటు నుంచి రక్ష ణ పొందాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మలేరియా అధికారి డాక్టర్ నవీన్, సీహెచ్ ఓ లక్ష్మినారాయణ, సిబ్బంది నరసింహప్రసా ద్, ధర్మేంద్ర, నారాయణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. నీటి నిల్వలపెంపునకు చర్యలు చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని చెరువుల్లో నీటి నిల్వల పెంపునకు చర్యలు చేప ట్టామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శనివారం జిల్లా అధికారులతో జలధార–జలహారతి కా ర్యక్రమంపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి నిధులతో ఫీడర్ కాలువల్లో పూడికతీత, చెరువులను దగ్గరలోని వాగులతో అనుసంధానం, తూములకు మరమ్మతు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే 1,500 పనుల్ని గుర్తించామని, కొన్ని పనులకు పరిపాలనా అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రతి మూడు చెరువుల పనుల పర్యవేక్షణకు ఒక సాంకేతిక సహాయకుడిని నియమించామ ని పేర్కొన్నారు. డ్వామా పీడీ రవికుమార్, జలవనరుల శాఖ ఎస్ఈ వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. విచారణకు హాజరైన పూడి శ్రీహరి కుప్పం : వైఎస్సార్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి శనివారం విచారణ నిమిత్తం కుప్పం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సోషల్ మీడియా పోస్టులపై కుప్పంలో నమోదు చేసిన కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు సహకరించాలన్న కోర్టు ఆదేశాల మేరకు శ్రీహరి శనివారం పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. కుప్పం డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లెష్ యాదవ్ గంట పాటు శ్రీహరిని విచారించారు. ఏఈ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ చిత్తూరు కార్పొరేషన్ : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌శాఖలో ఖాళీగా ఉన్న 629 ఏఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించింది. ఎస్పీడీసీఎల్ పరిధిలో 134 ఏఈలు భర్తీ కానున్నారు. చిత్తూరు జిల్లాలో ఐరాల, ఆవులకొండ, పెను మూరు, వి.కోట, కుప్పం సెక్షన్ల ఏఈ స్థానా లు ఖాళీగా ఉండడంతో సబ్ ఇంజినీర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వి.కోట, కుప్పంలో మరో సెక్షన్ ఏఈకి అదనపు బాధ్యతలు ఇచ్చారు. -
● అధిక ఉష్ణోగ్రతల వల్లే దిగుబడి తగ్గుదల ● పట్టుపరిశ్రమ శాఖ జేడీ పద్మమ్మ
త్వరలో పట్టు రైతులకు ఇన్సెంటివ్ పలమనేరు: పలమనేరు ప్రాంతంలోని పట్టు రైతులకు పెండింగ్‌లోని ఇన్సెంటివ్ను త్వరలో డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలో జమచేయనున్నట్టు పట్టు పరిశ్రమలశాఖ సంయుక్త సంచాలకులు పద్మమ్మ శనివారం ఓ ప్రటకనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీన సాక్షి దినపత్రికలో పట్టు జారుతోంది అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆమె స్థానిక పట్టుగూళ్ల కేంద్రం అధికారి ద్వారా సమాచారం సేకరించారు. పట్టు రైతులకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కిలో గూళ్లకు రూ.50 ఇన్సెంటివ్ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే బిల్లులు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశామని తెలిపారు. ఇందుకు సంబందించిన అనుమతులు రాగానే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని పేర్కొన్నారు. వేసవిలో 42 డిగ్రీల ఎండలు కాస్తుండడంతో పట్టుగూళ్ల ఉత్పత్తితోపాటు నాణ్యత కూడా తగ్గిందని తెలిపారు. -
నిధుల గ్రహణం!
కాపలాదారుడే దొంగ ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి విద్యుత్ స్తంభాలను చోరీచేసి విక్రయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మన బడికి శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026కూటమి ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తోంది. పత్రికల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెబుతున్నా వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. అట్టహాసంగా ప్రారంభించిన మన బడి – మన భవిష్యత్ పథకానికి నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. కొన్ని రోజుల్లో నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది. స్కూళ్లల్లో పనులు పూర్తికాలేదు. ఫలితంగా మన బడి – మన భవిష్యత్ పథకం రేపటి భవిష్యత్తుకు భరోసా నిస్తుందా? ప్రమాదపుటంచున విద్యార్థులను నిలబెడుతుందా? అని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో మనబడి– మన భవిష్యత్ పథకం అమలుపై సాక్షి ఫోకస్ కథనం. చిత్తూరు కలెక్టరేట్ : సర్కారు బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు సర్కా రు ‘మనబడి – మన భవిష్యత్తు’ పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో నిధుల లేమితో పనులు ముందుకు సాగడం లేదు. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. పాఠశాలలు తెరిచే లోపు పనులు పూర్తి కావాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. శిథిలావస్థకు చేరిన గదుల్లోనే పిల్లలు చదువులు సాగేలా కనిపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 40 శాతానికి పైగా పాఠశాలల్లో పనులు రూఫ్ లెవల్ వద్దే ఆగిపోయాయి. ఇందుకు చంద్రబాబు సర్కారు నిధుల మంజూరులో శ్రద్ధ చూపకపోవడమే కారణం. అప్పులు తెచ్చి పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్లు వడ్డీలు కట్టలేక అర్ధంతరంగా పనులు నిలిపివేశారు. అధికారుల పర్యవేక్షణ కరువు? జిల్లా అధికారులు పనుల పర్యవేక్షణపై దృష్టి సారించడం లేదు. దీంతో జిల్లా సమగ్రశిక్ష శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా పలుచోట్ల పనులు ఆగిపోయా యి. ఈ విషయం అధికారులకు తెలిసినా, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? మరో రెండు వారాల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా అసంపూర్తిగా ఉన్న గదులను సిద్ధం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాలను సరిచేయాలని కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పనులను చేపట్టాలని కోరుతున్నారు. పథకం అమలులో విఫలం గత వైఎస్సార్ సీపీ సర్కారు హయాంలో చేపట్టిన నాడు – నేడు పథకంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. చంద్రబాబు సర్కారు ఆ పేరును మన బడి– మన భవిష్యత్‌గా మార్చింది. ఈ పథకం అమలు జిల్లాలో విఫలమైంది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చలేని దుస్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఇక జిల్లాలోని మిగిలిన బడులను ఎలా బాగుచేస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిధుల కొరత.. నిలిచిన పనులు ఎస్ఆర్పురం మండలం చిల్లమాకులపల్లి హైస్కూల్లో నిలిచిపోయిన పనులు నిధులు లేక అర్ధంతరంగా ఆగిన పనులు జిల్లావ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు, మరు గుదొడ్లు, తాగునీటి పైపుల ఏర్పాటు తదితర పనులకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలేశారు. కొన్నిచోట్ల స్లాబ్ లెవల్ వరకు పనులు జరిగితే, మరికొన్ని చోట్ల పునాదులకే పరిమితమయ్యాయి. నిధులు విడుదల చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో స్పందన లేద ని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈ క్రమంలో మన బడి – మన భవిష్యత్ పథకం నీరుగారుతోంది. అసంపూర్తి పనులతో ప్రమాద ఘంటికలు జిల్లాలోని పలు పాఠశాలల ఆవరణల్లో తవ్విన గుంతలు, బయటపడి ఉన్న ఐరన్ రాడ్లు, నిల్వ ఉన్న భవన నిర్మాణ సామగ్రితో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే వర్షాకాలంలో ఈ అసంపూర్తి గోడలు, తవ్విన పునాదుల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో చిన్న పిల్లలు ఆడుకునే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
తప్పులు లేకుండా రీ సర్వే
చిత్తూరు కలెక్టరేట్ : తప్పులు దొర్లకుండా రీ సర్వేను చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్లో సర్వే, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లోని భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంలో మండల సర్వేయర్లు, వీఆర్వోల పాత్ర కీలకమన్నారు. గ్రామ సర్వేయర్లు తప్పనిసరిగా ఈకేవైసీ యాప్‌లో ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రాజకీయాలకు తావు ఇవ్వకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలని హితవుపలికారు. అదేవిధంగా రీ సర్వేలో ప్రతి ఒక్క సర్వే నంబర్‌పై పట్టు ఉండాలని పలమనేరు ఆర్డీవో, డీఐవోఎస్కు సూచించారు. క్షేత్రస్థాయిలో రీసర్వేను పర్యవేక్షించాలన్నారు. వీఆర్వో లాగిన్, సర్వేయర్ లాగిన్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, సర్వేలో పురోగతి సాధించాలని ఆదేశించారు. రికార్డుల తనిఖీ – రైతులకు ముందస్తు నోటీసులు గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి? పట్టా భూముల విస్తీర్ణం ఎంత? తదితర అంశాలపై స్పష్టత ఉండాలని కలెక్టర్ తెలిపారు. అలాగే వంకలు, పోరంబోకు భూములను క్షుణ్ణంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని విలేజ్ సర్వేయర్లను ఆదేశించారు. రీసర్వే నిర్వహించే సమయంలో సంబంధిత రైతులకు ముందుగా నోటీసులు ఇవ్వాలన్నారు. వారి సమక్షంలోనే సర్వే చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, పలమనేరు ఆర్డీవో భవాని, సర్వేశాఖ డీడీ జయరాజ్, డీఐవోఎస్ రమణారెడ్డి, ఏడీ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
కార్వేటినగరం: మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి పగలు తేడా లేకుండా గుట్టలను తవ్వి మట్టిని తరలిస్తోంది. ఈ విషయం తెలిసినా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుత్తూరు– కార్వేటినగరం సరిహద్దుల్లోని చిన్నబ్బనాయుడు కండ్రిగ వద్ద గుట్ట ఉంది. అందులో ఎర్రమట్టి ఉంది. దానిపై కన్నేసిన మాఫియా మూడు రోజులుగా జేసీబీతో తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. గుట్టను తవ్వేడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం పుత్తూరు–కార్వేటినగరం సరిహద్దులోని గుట్ట నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. మా సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీంచాం. అక్కడ మట్టి తరలించే ట్రాక్టర్లు, టిప్పర్లను తీసుకెళ్లిపోయారు. విచారణ చేపట్టి మట్టిని తరలిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అనుమతులు లేకుండా మట్టి, గ్రావెల్, ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగరాజు, తహసీల్దార్, కార్వేటినగరం -
మృత్యు శకటం!
పూతలపట్టు(యాదమరి): కర్నూలు నగరం బళ్లారి జంక్షన్‌కు చెందిన కృష్ణ(68) తమ కుటుంబ సభ్యు లు పది మందితో కలిసి కారులో గురువారం తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలోని అరుణాచల క్షేత్రానికి బయలుదేరారు. రాత్రి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని శుక్రవారం ఉదయం మూడు గంటలకు తిరుగు పయనమయ్యారు. ఆరు గంటల ప్రాంతంలో చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారి చవటపల్లి వద్దకు చేరుకోగానే కారు నడుపుతున్న కృష్ణ కుమారుడు మనోజ్‌కుమార్ నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. నుజ్జునుజ్జు అయిన కారు లారీని ఢీకొన్న కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న కృష్ణ కోడళ్లు రమ్యశ్రీ(35), హేమలత(31) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రమ్యశ్రీ తల చిద్రమైంది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న మనోజ్‌కుమార్ (40), విజయలక్ష్మి (52), కృష్ణ, హేమంత్(35), చిన్నారులు లోహిత్(11), చార్వి(6), కళ్యాణ్(5), సుహస్ర(4) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పూతలపట్టు సీఐ గోపి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో వారిని బయటకు తీసి చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కర్నూలులోని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు మరణించడంతో వారి సొంత ఊరిలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. ప్రమాద స్థలిని చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ పరిశీలించారు. సీఐ గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమ్యశ్రీ,హేమలత (ఫైల్) చవటపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వరుస ప్రమాదాలతో ఆందోళన చెందుతున్న ప్రజలు చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహన చోదకులు మితిమీరిన వేగంతో దూసుకెళుతున్నారు. పైగా రాత్రి సమయాల్లో నేషనల్ హైవే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై లారీలను నిలిపివేస్తున్నారు. దీంతో నిద్రమత్తులోకి జారుకుంటున్న మిగిలిన వాహనాల డ్రైవర్లు వాటిని ఢీకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇకనైనా సంబందిత అధికారులు జాతీయ రహదారిపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
కాపలాదారుడే దొంగ
శ్రీరంగరాజపురం : ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి విద్యుత్ స్తంభాలు, పరికరాలను చోరీ చేసి విక్రయించిన సంఘటన మండలంలోని మంగుంట గ్రామంలో వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. మంగుంట గ్రామానికి చెందిన రామిరెడ్డి అంకనపల్లి విద్యుత్ సబ్ స్టేషన్లో కాంట్రాక్ట్ షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి గ్రామంలోనూ 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్ సంస్థకు విద్యుత్ కాంట్రాక్ట్ పనులను కేటాయించింది. కాంట్రాక్ట్ షిఫ్ట్ ఆపరేటర్ రామిరెడ్డి మంగుట గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడి అండతో విద్యుత్ స్తంభాలను చోరీ చేసి తన పొలానికి తరలించి జేసీబీతో పూడ్చిపెట్టాడు. తర్వాత వాటిని రాత్రిళ్లు కోళ్లఫారానికి విక్రయిస్తున్నాడు. గమనించిన స్థానికులు విద్యుత్ అధికారులతోపాటు విద్యుత్ కాంట్రాక్ట్ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టి విద్యుత్ స్తంభం చోరీకి గురైనట్టు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఒక టీడీపీ నాయకుడు తనకు చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, అన్నీ తాను చూసుకుంటానంటూ చెప్పినట్టు సమాచారం. కాంట్రాక్ట్ ఉద్యోగి రామిరెడ్డి వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ మార్చలన్నా, కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా రైతుల నుంచి పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
● ఈ నెల 25 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు ● జిల్లాలో 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ● డీఈవో రాజేంద్రప్రసాద్ వెల్లడి
టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ నుంచి జూన్ 4 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు ఉంటాయన్నారు. ఈ నెల 25న మొదటి భాష, కాంపోజిట్ కోర్సు, 26న హిందీ, 28న ఇంగ్లీష్, 30న భౌతిక శాస్త్రం, జూన్ 1న జీవశాస్త్రం, జూన్ 2న సామాజిక శాస్త్రం, జూన్ 3, 4 తేదీల్లో కాంపోజిట్ కోర్సు పేపర్ 2, ఓఎస్ఎస్సీ ప్రధాన భాష పేపర్లు ఉంటాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయానికి కనీ సం అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రంలోనికి అనుమతించబోమని డీఈవో స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం చిత్తూరు జిల్లాలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో పర్యటించి సమస్యలను గుర్తించారు. 11 కేవీ ఫీడర్ల పరంగా 34 సమస్యలు, ఎల్టీ లైన్ల పరంగా 28, సర్వీసు లైన్ 1 మొత్తం 62 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ అమర్‌బాబు తెలిపారు. వాటిలో 3 సమస్యలను పరిష్కారించామన్నారు. మిగిలిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. -
సాధారణ రోజుల్లోనూ తిరుచానూరులో భక్తుల రద్దీ
తిరుపతి అర్బన్: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్ఓ మురళీకృష్ణతో కలసి మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రోడ్డు విస్తరణతోపాటు వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన అంశాలపై చర్చించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అడిషనల్ ఎస్పీ రవి మనోహరచారి, తిరుపతి ఆర్టీఓ రామ్మోహన్, ఏడీ సర్వేయర్ అరుణ్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, ఆర్అండ్బీ ఎస్ఈ సుధాకర్ నాయక్, తుడా ఎస్ఈ రవీంద్ర, తుడా సీపీఓ దేవి పాల్గొన్నారు. -
డంపే ధనం...!
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట ప్రాంతంలో ఇసుక వనరులున్నాయి. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ్ముళ్లు ఇసుక అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ నేత పలు ప్రాంతాల నుంచి ఇసుక తవ్వి పాలూరు వద్ద డంప్ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఇసుక కొరత ఉన్న ప్రాంతాలకు తరలించాలన్నది ఆయన ఉద్దేశం. డంప్ నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులు రాలేదు. ఒక వేళ అనుమతులున్నా.. డంప్ ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘా ఉండాలి. బిల్లులు ఇవ్వాలి. అధికారుల పర్యవేక్షణ ఉండాలి. రికార్డులు నిర్వహించాలి. ప్రభుత్వానికి నిర్ణీత ధర చెల్లించాలి. ఇవేవీ లేకుండా డంప్ పేరు చెప్పి టీడీపీ నేతలు దందాకు శ్రీకారం చుట్టారు. రెండేళ్లుగా పగలు ఇసుకను డంప్ చేసి రాత్రిళ్లు తమిళనాడుకు తరలించడమే పనిగా పెట్టుకున్నారు. గడువు ముగిసినా... చిత్తూరు మండల పరిధిలో గతంలో అనుమతులతో ఏర్పాటు చేసిన ఇసుక డంప్‌కు మార్చి నెలతో గడువు ముగిసింది. అయినప్పటికీ నేతలు అదే డంప్ పేరుతో భారీగా ఇసుకను నిల్వ చేస్తున్నారు. ముఖ్యంగా శెట్టిన్ తంగాల్, ఆనగల్లు నుంచి ఇసుక తీసుకొచ్చి పాలూరు వద్ద డంప్ చేసి రాత్రి తమిళనాడుకు తరలిస్తున్నారు. అక్కడ టిప్పర్ ఇసుక రూ.1.30 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు విక్రయిస్తున్నారు. టిప్పర్లు పాలూరు డంప్ నుంచి ఇసుక తీసుకుని బీఎన్‌ఆర్‌పేట వద్ద క్రాస్ చేసి తాళంబేడు, గుడిపాల చీలాపల్లి క్రాస్, అక్కడి నుంచి తమిళనాడుకు వెళుతున్నాయి. చిత్తూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా చిత్తూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా భారీగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ, గడువు ముగిసిన ఇసుక డంప్‌ల పేరుతో కొందరు అధికార పార్టీ నేతలు, మధ్యవర్తులు, ఇసుక మాఫియా కలిసి రూ.కోట్ల అక్రమ వ్యాపారాన్ని నడుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకృతి సంపదను విచక్షణారహితంగా దోచుకుంటూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్, ఎస్పీ, సీఎంవో కార్యాలయనికి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేస్తున్నారు అక్రమ ఇసుక రవాణాపై సొంత పార్టీ నేతలే జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు సీఎంవో కార్యాలయానికి ఫిర్యాదులు చేశారు. ఫొటోలు, బండి నంబర్లు వీడియోలు తీసి పంపినట్టు పేర్కొంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే మంత్రి నారాలోకేష్కే ఫిర్యాదు చేస్తామని బహిరంగంగా చెబుతున్నారు. రాజకీయ అండ లేకుండా ఇసుక దందా సాధ్యమేనా..? అన్న ప్రశ్నలు చిత్తూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారా యి. అదే మాదిరిగానే ఓ ప్రజాప్రతినిధికి ఈ ఫిర్యాదులు తలనొప్పిని తెచ్చిపెట్టాయి. సొంత పార్టీ నేతలే కలెక్టర్, ఎస్పీ, సీఎంవో ఆఫీసుకు ఫిర్యాదు చేయ డం ఏమిటని ఆ ప్రజాప్రతినిధి లోలోపల రగిలిపోతున్నారు. ఈ ఫిర్యాదుల వెనుక సీనియర్ నాయకుల హస్తం ఉందని కొందరు నేతలు చెబుతున్నారు. -
గురుకులాల్లో అడ్మిషన్ల సమాచారమేదీ?
చిత్తూరు కలెక్టరేట్ : పేద, వెనుకబడిన వర్గాల విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ (ఎస్సీ) గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియ తీవ్ర ప్రహసనంగా మారింది. 2026– 27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల కసరత్తు ఏ దశకు చేరిందనే సమాచారాన్ని అధికారులు బహిర్గతం చేయడం లేదు. దీంతో సీట్ల కేటాయింపు, ఎంపిక జాబితా కోసం జిల్లాలో వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా మే నెల సగంలో గురుకులాల్లో ప్రవేశాల ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ సారి ఎంపిక జాబితా విడుదలపై అధికారిక వెబ్సైట్లలో గానీ, పత్రికా ప్రకటనల ద్వారా గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థుల మార్కు లు, మెరిట్ లిస్టు, సీట్ల కేటాయింపు సమాచారాన్ని సకాలంలో అందించడంలో జిల్లా స్థాయి అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల వైపు అడుగులు? ప్రభుత్వ గురుకులాల్లో సీటు వస్తుందో రాదో తెలియని అయోమయ స్థితిలో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో చాలామంది అరకొర స్థోమత ఉన్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అడ్మిషన్ల కసరత్తు వివరాలు, సీట్ల కేటాయింపుల జాబితాను వెంటనే బహిర్గతం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హెల్ప్‌లైన్ నంబర్లు, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయాల ద్వారా స్పష్టమైన సమాచారం అందేలా కలెక్టర్ తక్షణ చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గందరగోళంలో విద్యార్థులు, తల్లిదండ్రులు -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావడమే లక్ష్యం
– ఏపీపీజీఈసెట్ రాష్ట్ర 2వ ర్యాంకర్ రాహుల్‌చౌదరి బంగారుపాళెం : ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలన్నదే తన లక్ష్యమని ఏపీ పీజీ ఈసెట్ పరీక్షలో కాకర్ల రాహుల్‌చౌదరి తెలిపా రు. మండలంలోని గుంతూరు గ్రామానికి చెందిన రైతు కాకర్ల వేణుగోపాల్ నాయుడు, లలిత దంపతుల కుమారుడు రాహుల్‌చౌదరి ఏపీ పీజీ ఈసెట్ పరీక్ష ఫలితాల్లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించాడు. అతను 10వ తరగతి వరకు బంగారుపాళెం సెయింట్‌మేరీ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇంటర్ పూతలపట్టులో ఉన్న మంగల్ విద్యాలయంలో, బీటెక్ (సీఎస్ఈ) బెంగళూరులోని గీతం యూనివర్సిటీలో పూర్తిచేశాడు. ఎంటెక్‌లో చేరేందుకు నిర్వహించిన ఏపీ పీజీ ఈసెట్‌లో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూశానని తెలిపాడు. 10 ఏళ్ల ప్రశ్న పత్రాలను సేకరించి ప్రిపేర్ అయినట్టు పేర్కొన్నాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయి వారి కలలను సాకారం చేస్తానని విద్యార్థి రాహుల్‌చౌదరి తెలిపాడు. ముగిసిన ‘పవర్’ వివాదం! యాదమరి: మండలంలోని దాసరాపల్లిలోని శ్రీ ధర్మరాజుల ఆలయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై నడుస్తున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వ జీవో ప్రకారం దేవదాయశాఖ ఆ భూములను 30 ఏళ్లు సోలార్ ప్లాంట్‌కు కేటాయించింది. ఆ నిర్ణయాన్ని స్థానికులు, రైతులు వ్యతిరేకించారు. జిల్లా కలెక్టర్‌కు, సంబందిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. రైతుల వినతులపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందివని, సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసిందని తెలిపారు. దీనికి అడ్డుచెప్పడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్, ఎస్ఐ ఈశ్వర్ సమక్షంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇక మీదట పవర్ ప్లాంట్ పనులకు ఎలాంటి ఆటంకాలు సృష్ఠించబోమని రైతు నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పరందామ గౌడ్, చిట్టి నాయు డు, ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూన్ 5 నుంచి ‘సర్’ తిరుపతి అర్బన్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 5 నుంచి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు ఎస్ఐఆర్పై ఓటర్ల జాబితాకు సంబంధించి సన్నాహాలు, శిక్షణతోపాటు ముద్రణ ఉంటుందని చెప్పారు. అలాగే జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బూత్‌లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) ఇంటింటా పర్యటిస్తారని చెప్పారు. మరోవైపు జూలై 14వ తేదీన పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జూలై 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ చేస్తామని పేర్కొన్నారు. అలాగే జూలై 21 నుంచి ఆగస్టు 20 తేదీ వరకు దావాలు, అభ్యంతరాల కాలం జరుగుతుందన్నారు. మరోవైపు జూలై 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు నోటీసు దశ, పరిష్కారానికి సంబంధించిన దావాలు, అభ్యంతరాలు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. చివరిగా సెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామన్నారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, వేలూరు జిల్లా, ఆర్కాట్ తాలూకా, మస్సురుపాళేనికి చెందిన సి.నాగరాజన్‌కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2017లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం తిరుపతి, చైన్నె రోడ్డు, గాజుల మండ్యం జంక్షన్ సమీపంలో తనిఖీ చేసింది. నిందితుడు నాగరాజన్ లారీలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ ఫారెస్ట్ సిబ్బందికి పట్టుపడ్డాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య రైల్వేకోడూరు అర్బన్: పట్టణంలోని రైల్వేస్టేషన్లో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి ఇంటర్సిటీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు జీన్స్‌ప్యాంటు, తెల్లచొక్కా ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
మద్దతు ధర లభించేనా..?
జిల్లాలో మొదలైన మామిడి సీజన్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో ఈసారి టేబుల్ రకాల మామిడి కాయలు మార్కెట్‌కు భారీగా వస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు నగరం కట్టమంచిలో ఉన్న మామిడికాయల మార్కెట్‌కు చక్కెర గుత్తి రకానికి వ్యాపారుల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తోంది. నాణ్యమైన గుత్తి రకం కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. మిగిలిన రకాల మామిడి ధరలు మాత్రం రైతులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. చాలాచోట్ల కిలో ధర రూ.40 లోపే ఉండడంతో సాగు ఖర్చులు కూడా రాకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా కేజీ కాదర్ రూ.30 నుంచి రూ.40, తోతాపురి (టేబుల్ రకం)– రూ.15, బేనీషా రూ.18 నుంచి రూ.25, చక్రగుత్తి రూ.80 నుంచి రూ.100 వరకు, దశేరి రూ.40, మల్లికా రూ.30 నుంచి రూ.40 పలుకుతున్నాయి. ఈరకమైన కాయలన్నీ రాజస్థాన్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అలాగే కొన్ని ఫ్యాక్టరీలు కాదర్‌ను కొనుగోలు చేస్తుండగా కేజీ ధర రూ.25లు మాత్రమే పలుకుతున్నాయి. కవర్లు కట్టిన కాయలకు డిమాండ్ మార్కెట్లో ఈసారి కవర్లు కట్టిన మామిడి కాయలకు ప్రత్యేక ఆదరణ కనిపిస్తోంది. రంగు, నాణ్యత మెరుగ్గా ఉండటం వల్ల వ్యాపారులు అలాంటి కాయలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఎగుమతులకు అనువైన కాయలపై కూడా వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రైతులు ముందు జాగ్రత్తలతో పండ్ల సంరక్షణపై దృష్టి పెట్టారు. కవర్లు కట్టిన బేనీషా కేజీ రూ.50గా అమ్ముడుబోయింది. స్థానికంగానే ఈ కాాయలు అమ్ముడుబోతున్నాయి. చిత్తూరు మార్కెట్‌కు వచ్చిన మామిడి కాయలు మార్కెట్‌కు వచ్చిన చక్కెర గుత్తి కాయలుప్రతి ఏటా మామిడి రైతులకు నష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం లేదు. ఈ సారైనా మద్దతు ధర లభిస్తుందా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ ప్రారంభమైంది. ప్రధాన మామిడి మార్కెట్లలో ఒకటైన చిత్తూరుకు రోజురోజుకూ కాయల రాక పెరుగుతోంది. మార్కెట్లో ఇప్పటికే 16 దుకాణాలు తెరుచుకున్నాయి. రైతులు మామిడి కాయలను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం టేబుల్రకాలు వస్తున్నాయి. చక్కెర గుత్తి రకం కాయలు కేజీ రూ.80 నుంచి రూ.100 పలుకుతుండగా.. మిగిలిన రకాలు మాత్రం రూ.40 లోపు పలుకుతున్నాయి. పెరిగిన ఖర్చులు.. తగ్గిన ధరలు ఈ సారి మామిడి సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు, నీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, మార్కెట్లో సరైన ధరలు రాకపోవడం మరింత భారంగా మారిందని వాపోతున్నారు. ముఖ్యంగా టేబుల్ రకాల మామిడి కాయలకు డిమాండ్ ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ధరలు లేవని చెబుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మామిడికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర ఇవ్వాలి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలి. కవర్లు కట్టిన బేనీషా కాయలు కేజీ రూ.50లకు అమ్మినా, తోతాపురి ప్రధానం. వీటికి ప్రభుత్వం మద్దతు ధర ఇస్తేనే రైతులు నష్టాల బారిన పడకుండా ఉంటారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. – విజయనాయుడు, వరదరాజులపల్లి, చిత్తూరు మండలం కోతకోయాలంటే భయంగా ఉంది టేబుల్ రకాల ధరలు కాస్త నిరాశ పరుస్తున్నాయి. ఇంకొద్దిగా రేట్లు వస్తే బాగుంటుంది. మామిడి సాగు, పురుగుల మందు పిచికారీ, కూలీల ఖర్చులు అమాంతంగా పెరిగిపోయాయి. కాయల ధరలు పాతాళంలో ఉన్నాయి. కాయలు కోత కోయాలంటేనే భయంగా ఉంది. ధరలు నిలకడగా, రైతులకు గిట్టుబాటు అయ్యేవిధంగా చూడాలి. – సుబ్రమణ్యంనాయుడు, ఎగువకండ్రిగ, చిత్తూరు మండలం -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 67,722 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,705 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.45 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. జూన్ 5న ఎస్వీయూ స్నాతకోత్సవం తిరుపతి సిటీ: శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 63 నుంచి 68వ స్నాతకోత్సవాలను వచ్చే నెల 5వ తేదీన నిర్వహించనున్నారు. కాగా ఇప్పటి వరకు కాన్వొకేషన్‌కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు ఇన్‌అడ్వాన్స్‌డ్ డిగ్రీకి దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. గడువు పూర్తి అయిన తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించకూడదని పరీక్ష విభాగాధికారులకు ఆయన సూచించారు. ఈఎస్ఐలో తనిఖీలు తిరుపతి తుడా: స్థానిక ఆర్సీ రోడ్డులోని ఈఎస్ఐ ఆస్పత్రిని ఇన్సూరెనన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ రాయలసీమ రీజియన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి పద్మజ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆమె డాక్టర్లతో మాట్లాడుతూ డిస్పెన్సరీల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు డిస్పెన్సరీలకు వచ్చే అవుట్ పేషెంట్ల సంఖ్యను పెంచేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈఎస్ఐ వైద్య సేవలను లబ్ధిదారులకు చేరువచేసేందుకు సంస్థలు పనిచేసే ప్రాంతాల్లో వైద్య శిబిరాలు పెట్టాలని చెప్పారు. అనంతరం సిబ్బంది హాజరు, ఫార్మసీ రిజిస్టర్లను, ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. -
జలధార పనులు వేగవంతం చేయండి
తవణంపల్లె: జలధార పథకం కింద చేపట్టే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అర్ధగిరి క్షేత్రంలో ఉపాధి పథకం కింద జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి కూలీలకు మజ్జిక, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉపాధి శ్రామికులు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పనులు చేయాలని సూచించారు. జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని ఆదేశించారు. శ్రామికులకు వేతనాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. కందాకాల పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా ఏపీడీ మల్లికార్జున, సహాయ పథక సంచాలకులు సుబ్రమణ్యం, ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి, ఏపీఓ బాల, ఈసీ రమ్మ, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా అర్ధగిరి క్షేత్రం
తవణంపల్లె: అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ రఘుపతి సమక్షంలో అర్ధగిరి ఆలయ అభివృద్ధిపై పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో ఆలయ పరిసరాల్లో టాయ్లెట్లు, క్యూ కాంప్లెక్స్‌లు, అన్నదాన సత్రం, పార్క్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. అర్ధగిరి ట్రస్టుబోర్డు సభ్యులు, దేవదాయశాఖాధికారులు, పర్యాటక శాఖ, డ్వామా, అటవీశాఖ అధికారులతో కలసి ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సమాచారం మేరకు సమీక్ష సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులు ఏవిధంగా అమలు చేయాలి, ఏఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, నిధులు వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జూన్ 15 నాటికి తుది నిర్ణయంతో నివేదిక అందజేయాలని ఆదేశించారు. అర్ధగిరి ఆలయం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. ఆలయ ఈఓ మునిశేఖర్, పంచాయతీ రాజ్ ఎస్ఈ చంద్రశేఖర్, డ్వామా పీడీ రవికుమార్, టూరిజంశాఖ అధికారి నరేంద్ర, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, తహసీల్దార్ మాధవరాజు, ఎంపీడీఓ హరిప్రసాద్‌రెడ్డి, ఏపీఓ బాల పాల్గొన్నారు.పూర్ణకుంభంతో ఘన స్వాగతం కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు అర్ధగిరి శ్రీవీరాంజనేయస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్, ట్రస్టుబోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొన్నారు. అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి, స్వామి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలు, సంజీవరాయ పుష్కరిణి తీర్థం అందజేసి ఆశీర్వాదించారు. -
దృఢత్వానికి ప్రతీక భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్
గంగాధరనెల్లూరు: నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ నిలుస్తుందని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.చాయాపతి తెలిపారు. గురువారం గంగాధరనెల్లూరు మండల కేంద్రంలోని భారతి సిమెంట్, శ్రీ బాలాజీ స్టీల్ అండ్ సిమెంట్ ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి సిమెంట్ టెక్నికల్ మేనేజర్ చాయాపతి మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీ రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పరివేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంటును ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. టెంపర్ ప్రూఫ్ బస్తాలతో మార్కెట్లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవకాశం ఉండదన్నారు. సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. అనంతరం భారతి సిమెంట్‌కు సంబంధించిన నాణ్యత ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాల పై అవగాహన కల్పించారు.భారతి ఆల్ట్రా ఫస్ట్ సిమెంట్ తయారవుతున్న విధానం, భవన నిర్మాణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం భారతి సిమెంట్ అన్నిచోట్ల అందుబాటులో ఉండేలా డీలర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తాపీ మేసీ్త్రలకు ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ స్టీల్ అండ్ సిమెంట్ యజమాని ఎల్ రాజారత్నం నాయుడు, సేల్స్ ఆఫీసర్ అనిల్‌కుమార్‌రెడ్డి, భారతి సిమెంట్ ప్రతినిధులు, తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు. -
కాపాడింది లేదు!
జిల్లాలో పశుసంవర్థక సహాయకుల తీరు రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. జబ్బు చేసిన పశువులకు సకాలంలో వైద్యం అందించకుండా గాలితిరుగుడు తిరుగుతుండడం విమర్శలకు తావిస్తోంది. పెంపకందారులు ఫోన్ చేసినా సర్వేలు..మీటింగ్‌లంటూ కుంటిసాకులు చెప్పడం రివాజుగా మారుతోంది. దీనిపై సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాణిపాకం: జిల్లాలో ప్రస్తుతం 297 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వీటి కింద 253 మంది పశుసంవర్థక శాఖ సహాయకులు పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక వీటి సంరక్షణపై దృష్టి సారించింది. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి పశుసంవర్థక సహాయకులను నియమించింది. వీరు పల్లెల్లో పశువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించే వారు. తక్షణమే వైద్య సేవలందించేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసింది. దీంతో పల్లె పశువైద్యం పడకేసింది. సాకులెక్కవ పశువులకు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు రైతులు సహాయకులకు ఫోన్ చేస్తే స్పందన ఉండడం లేదు. ఫోన్ ఎత్తినా సర్వేలో ఉన్నాం.. మీటింగ్‌లో ఉన్నాం.. ఇంకో గ్రామంలో కేసు ఉంది.. తర్వాత వస్తాం... అంటూ తప్పించుకుంటున్నారు. చాలాసార్లు గంటల తరబడి ఎదురు చూసినా సిబ్బంది రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. కొన్ని గ్రామాల్లో పశువులకు ప్రసవ సమస్యలు వచ్చినా వైద్యసిబ్బంది అందుబాటులో లేక ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. సేవలు శూన్యం కొన్ని కేంద్రాల్లో రికార్డుల్లో మాత్రం అన్ని సేవలు అందిస్తున్నట్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మందుల పంపిణీ, చికిత్స, పర్యటనలు జరిగినట్లు నమోదు చేస్తున్నా.. వాస్తవంగా రైతులకు సేవలు అందడం లేదని చెబుతున్నారు. పలు గ్రామాల్లో పశుసంవర్థక శాఖ సిబ్బంది నెలల తరబడి పర్యటించకపోయినా రికార్డుల్లో మాత్రం సందర్శించినట్లు నమోదు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సహాయకుల నిర్లక్ష్యంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హాజరు వేసి డుమ్మా జిల్లాలోని పలు రైతు భరోసా కేంద్రాల్లో విధులకు సకాలంలో హాజరవుతున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఉదయం కార్యాలయానికి వచ్చి అటెండెన్స్ వేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్టు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల మధ్యాహ్నం కాకముందే కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. రైతులు పశువులను తీసుకొచ్చినా.. కేంద్రాలు మూసి ఉండడంతో నిరాశగా వెనుదిరగడం రివాజుగా మారుతోంది. మరికొందరు సహాయకులు విధుల్లో ఉండాల్సిన సమయంలో గ్రామాల్లో తిరుగుతూ వ్యక్తిగత పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ‘పశువైద్యం కోసం వస్తామని చెబుతారు.. కానీ కనిపించరు’ అని రైతులు మండిపడుతున్నారు. పర్యవేక్షణ ఏదీ పశుసంవర్థక శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన సహాయకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం, బాధ్యతారాహిత్యంతో గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్యసేవలు అందక పాడిపశువులు మృత్యువాతపడుతున్నాయి. -
గుట్టగా తవ్వకాలు!
చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పుత్తూరు పట్టణం చుట్టూ గుట్టలు ఉండడంతో అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్నారు. మొన్న మరాఠిగేట్ గుట్ట, నిన్న చెర్లోపల్లి గుట్ట, నేడు చిన్నబ్బనాయుడుకండ్రిగగుట్టను లోడేస్తున్నారు. సమీపానే తమిళనాడు రాష్ట్రం ఉండడంతో ఈ అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పట్టపగలే హిటాచీలు పెట్టి మరీ గుట్టను తవ్వేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండతోనే అంతా జరుగుతోందని, అందుకే అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు చర్చించుకొంటున్నారు. పుత్తూరు: పట్టణంలోని గుట్టలు, చెరువులు, కాలువలు కబ్జాలకు గురవుతున్నాయి. పట్టణ జనాభా రోజు రోజుకూ పెరిగిపోవడంతో ఇళ్ల నిర్మాణాలకు మట్టి అవసరాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు పట్టణంలోని పలు గుట్టల నుంచి నిత్యం మట్టిని తరలిస్తున్నారు. ఇదే అదనుగా ఆక్రమ రవాణాదారులు గుట్టలను లక్ష్యంగా చేసుకొని యథేచ్ఛగా తమిళనాడుకు మట్టిని తరలిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. గుట్టల్లో ముందుగా ఎర్రమట్టిని క్యాష్ చేసుకోవడంతో పాటు ఖాళీ స్థలాల ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులోని చిన్నబ్బనాయుడుకండ్రిగ గుట్టను గత వారం రోజులుగా హిటాచీల సాయంతో తవ్వుతున్నారు. ప్రతిరోజూ టిప్పర్ల ద్వారా తమిళనాడుకు మట్టిని తరలిస్తున్నారు. రాత్రి, పగలు తేడాలేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఈ అక్రమ రవాణా సమాచారాన్ని అందించినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేషనల్ హైవే ముసుగులో దోపిడీ తిరుపతి–చైన్నె జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు ఎన్‌హెచ్ వారికి మరాఠిగేట్ గుట్ట నుంచి మట్టిని తరలించుకొనేందుకు అధికారులు అనుమతులిచ్చారు. అయితే ఎన్‌హెచ్ పేరిట అక్రమార్కులు ప్రతి గుట్ట నుంచి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే ఎన్‌హెచ్ పనుల కోసం అంటూ తప్పించుకొని పబ్బం గడుపుకుంటున్నారు. ఈ తంతు రెవెన్యూ అధికారులకు తెలిసే జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా మట్టి తరలింపులతో ఏర్పడిన ఖాళీ స్థలాలను ఆక్రమించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ పరిధిలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులైన గుట్టలు మాయమవుతున్నాయంటూ స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. చిన్నసుబ్బనాయుడుకండ్రిగ గుట్టను తవ్వేస్తున్న హిటాచీ -
ఇది రైతు దగాకోరు ప్రభుత్వం
వెదురుకుప్పం: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, కనీసం సాగు చేసిన పంటకు తగిన గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయనకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కొందరు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను నిర్మించి తద్వారా అన్ని రకాల సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తుచేశారు. ఆర్బీకేల్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు రాయితీ ద్వారా అలందించామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. వరి సాగు చేసిన రైతులు మామిడి రైతులు, మిర్చి వంటి అనేక పంటలు సాగు చేసి గిట్టుబాటు ధర లేక కనీసం పెట్టిన పెట్టుబడులు సైతం రాని దాఖలాలు అనేకమన్నారు. మామిడి రైతులు పడినపాట్లు అన్నీఇన్నీకావన్నారు. పంటను నిల్వ చేసుకునేందుకు సరైన గోదాములు లేక కల్లాల్లోనే ధాన్యాన్ని నిల్వ చేసుకోవడంతో మగ్గి చివరికి పనికిరాకుండా పోతున్నాయని వాపోయారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఏవిధంగానూ ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. ఇది మోసకారి ప్రభుత్వమన్నారు. పది మందికి అన్నంపెట్టే అన్నదాత అల్లాడుతుంటే ఏ ప్రభుత్వానికై నా మంచిదికాదన్నారు. అన్నదాతల ఆక్రందనలు సీఎం చంద్రబాబుకు శాపమని చెప్పారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు మండలంలో కలవగుంట జలాశయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జలాశయాన్ని అభివృద్ధి చేస్తే సుమారు 32 చెరువులకు అనుసంధానం చేసి వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. రైతుల పాలిట చంద్రబాబు ఎప్పుడూ శీతకన్ను చూపిస్తున్నారని తెలిపారు. బెల్లం రైతులు చితికిపోయారన్నారు. ధరలస్థిరీకరణతో రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
దేవదాయశాఖ జాడెక్కడ?
కుప్పం: శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయ మహోత్సవాల్లో దేవదాయ శాఖ జాడ కనకపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా జాతర సంబరాలు జరుగుతున్నా ఆలయ ఈఓ, సిబ్బంది మాత్రం తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఆలయ ప్రాగణంలో జరుతున్న అవకతవకలపై పట్టణ ప్రజలు ముక్తకంఠతో ఖండిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినపిస్తున్నారు. జాతరలో జరిగే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇవ్వాలని కోరుతూ క్యూ ఆర్ కోడ్‌తో బ్యానర్లు వేశారు. తీరా ఆ కోడ్‌కు డబ్బులు పంపితే అన్న క్యాంటీన్ ఖాతాలో జమవుతుండడంతో స్థానికులు విస్తుపోతున్నారు. జాతరకు తిరుపతి గంగమ్మ దేవాలయ ఖాతా నంబరుకు చెందిన క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేయాలి. కానీ అన్న క్యాంటీన్ సంబంధిత క్యూ ఆర్ కోడ్ బ్యానర్లు వేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. గతంలో జాతర చాటింపు నుంచి ముగిసేంత వరుకు ఆలయ ప్రాణంలో దేవదాయ శాఖ అధికారులు విధులు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది వారి జాడే కానరాకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. -
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
చిత్తూరు కలెక్టరేట్ : క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి కమిటీ (దిశా) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 3,100 చెరువుల ఫీడర్ చానల్స్ శుభ్రపరిచే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గత ఏడాది వర్షాలు పడినప్పటికీ 1,200 చెరువులు నిండలేదన్నారు. ఈ ఏడాది పూడికతీత పనుల చేపట్టి చెరువులు పూర్తి స్థాయిలో నిండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పీఎం ఆదర్శ గ్రామ యోజన పథకంలో జిల్లాలో మొదటి దశలో 66 ఎస్సీ గ్రామాలను ఎంపిక చేసి 437 పనులకు ఆమోదం తెలిపామన్నారు. ప్రతి ఎస్సీ కాలనీకి దాదాపు రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే 342 పనులకు రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వ్యత్యాసాలొద్దు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో సమగ్ర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 70 సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందేలా శ్రద్ద వహించాలన్నారు. ఐసీడీఎస్ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలన్నారు. -
యోగా రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్న యోగా 365 కార్యక్రమానికి అర్హత, ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం యోగాను సామూహిక ఉద్యమంగా ప్రోత్సహించేందుకు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబిల్ట్ హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్లో 100 రోజుల ఉచిత ప్రత్యక్ష యోగా తరగతులను నిర్వహిస్తుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లాలోని క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, అన్ని వయస్సుల సాధారణ ప్రజలు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్ కోసం 18003157008 నంబర్లో సంప్రదించాలన్నారు. గతంలో ఐడీవై 2025లో పేరు నమోదు చేసుకున్న వారు ప్రస్తుతం కొనసాగుతున్న యోగా 365లో చేరాలని కోరారు. ఆ పంచాయతీల్లో కొత్త బోర్లు నిషేధం పలమనేరు: జిల్లాలోని ఎనిమిది గ్రామాల్లో కొత్త బోర్ల తవ్వకాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వాల్టా చట్టం–2002 మేరకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో మోతాదుకు మించి నీటి వినియోగంతో భూగర్భజలాలు అడుగంటాయని పేర్కొన్నారు. ఆయా మండలాల్లో కొత్త బోర్లు, ఇసుక తవ్వకాలు చేపట్టరాదని అందులో పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో వీకోట, రామకుప్పం, శాంతిపురం, కుప్పం, గుడిపల్లి, పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి మండలాల్లోని ఏడు గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే బోర్లను డ్రిల్ చేసే వెసులుబాటు కల్పించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఆయా మండలాల గ్రామ పంచాయతీలకు సైతం పంపారు. ఈ నిషేధిత డార్క్ ఏరియాల్లో బోర్లకు కరెంట్ సర్వీసులు కూడా ఇవ్వరని అందులో పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫిజియోథెరపీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న భవిత కేంద్రాల్లో దివ్యాంగులకు సేవలందించేందుకు ఏడు ఫిజియోథెరపీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీపీటీ, ఎంపీటీ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. జిల్లాలోని చిత్తూరు, యాదమరి, గుడిపాల, బంగారుపాళ్యం, తవణంపల్లి, ఐరాల, రొంపిచెర్ల, పులిచెర్ల, పూతలపట్టు, పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, రామకుప్పం, వి.కోట, బైరెడ్డిపల్లి, పెనుమూరు, జీడీ నెల్లూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, ఎస్ఆర్పురం, పాలసముద్రం మండలాల్లోని భవిత కేంద్రాల్లో సేవలందించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు జిల్లా సమగ్రశిక్షశాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఏపీసీ సూచించారు. మోదీ పిలుపుతో దేశం అభివృద్ధి చిత్తూరు అర్బన్: దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. గురువారం చిత్తూరులోని తన కార్యాలయంలో ఎంపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక భద్రతకు వంటగ్యాస్ నుంచి వాహన ఇంధనం, బంగారు ఆభరణాల కొనుగోలు వరకు పొదుపు పాటించాలన్నారు. దీనివల్ల విదేశీమారకం బలపడుతుందన్నారు. రూపాయి విలువ పెరుగుతుందని తెలిపారు. ప్రజలు దీన్ని అర్థంచేసుకుని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలని కోరారు. డీఈ బదిలీ చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు డివిజన్ ఆర్అండ్బీ క్వాలిటీ కంట్రోల్ డీఈ శ్రీధర్ప్రసాద్ను అనంతపురం డివిజన్ ఈఈగా పదోన్నతి పై బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాకు ఉత్తర్వులు అందాయి. -
పన్ను వసూళ్లలో అగ్రగామి
కాణిపాకం: కాణిపాకం పంచాయతీలో ఏడు గ్రామాలుండగా 982 కుటుంబాలున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి బీజం పడింది. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ భవనాలు, రోడ్ల విస్తరణ, వీధి దీపాలు, తాగునీటి ట్యాంకులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామ రూపురేఖలను మార్చింది. స్థానికుల అవసరాలను గుర్తించి, సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం నేర్చుకుంది. ఆ ఆదాయాన్ని తిరిగి ప్రజాసేవలకే వినియోగించడం మొదలు పెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాణిపాక ప్రధాన ఆలయ జీర్ణోద్దరణతో కాణిపాకం పంచాయతీ కొత్త కళను సంతరించుకుంది. దీంతోపాటు ఆదాయ వనరుల పెంపునకు దోహదపడింది. టోల్ ఆదాయం దండి పంచాయతీకి ప్రధాన ఆదాయ వనరు టోల్ వసూళ్లు. ఏడాదిలో టోల్ వ్యవస్థ ద్వారా ఏకంగా రూ.2.3 కోట్ల మేర ఆదాయం సమారుకుతోంది. అలాగే ప్రతి ఏటా స్థానిక మార్కెట్ (వారపు సంత) ద్వారా రూ.5 లక్షలకుపైగా ఆదాయం వస్తోంది. గ్రామానికి వచ్చే వ్యాపారులు, రైతులు, కొనుగోలుదారులతో సంత సాగుతుండడం వల్ల ఆదాయం పెరిగింది. గ్రామ ఆర్థిక వ్యవస్థలో ఈ సంత కీలకపాత్ర పోషిస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ పంచాయతీ సమీకరించిన ఆదాయాన్ని ప్రజాసదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తోంది. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసింది. తాగునీటి ట్యాంకుల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్లు, వీధి దీపాలు, రోడ్ల విస్తరణ, కాలువల నిర్మాణం వంటి పనులతో గ్రామానికి కొత్త రూపు వచ్చింది. పంచాయతీ ఆదాయ వసూళ్లలో డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలను ప్రవేశపెట్టింది. నగదు పుస్తకాలు, రసీదులు, డిమాండ్–వసూలు రిజిస్టర్లు, వోచర్లు, మస్టర్ రోల్స్ అన్నీ క్రమబద్ధంగా నిర్వహిస్తోంది. పన్ను వసూలు కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. అధికారులు క్రమం తప్పకుండా సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ మరింత బలోపేతమైంది. ప్రశంసల వర్షం నెల రోజుల క్రితం కేంద్ర బృందం కాణిపాకం గ్రామాన్ని సందర్శించి పంచాయతీ పనితీరును పరిశీలించింది. ఆర్థిక రికార్డులు, ఆదాయ వసూళ్లు, అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్య నిర్వహణ, డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలను పరిశీలించి ప్రశంసల వర్షం కురిపించారు. సొంత వనరుల ఆదాయం పెంపు, పారదర్శక పరిపాలన, సమర్థవంతమైన సేవల ఆధారంగా ‘ఆత్మనిర్భర్ పంచాయతీ’ ప్రత్యేక పురస్కారానికి కాణిపాకం ఎంపికై ంది. దేశానికే ఆదర్శంగా కాణిపాకం పంచాయతీ పారిశుద్ధ్యం..అధిక ప్రాధాన్యం గ్రామ పారిశుద్ధ్య నిర్వహణలో కాణిపాకం ప్రత్యేక గుర్తింపు పొందింది. డంపింగ్‌యార్డు ద్వారా చెత్తను వేరు చేసి ఎరువుల తయారీ చేపడుతోంది. ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేస్తోంది. చెత్త పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి పారిశుద్ధ్య సేవల మెరుగుకు వినియోగిస్తోంది. ప్రతి వీధిలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, చెత్త సేకరణకు ప్రత్యేక సిబ్బంది నియామకం, పారిశుద్ధ్య వాహనాల వినియోగం వంటి చర్యలు చేపడుతోంది. డంపింగ్, పారిశుద్ధ్య సంబంధిత కార్యక్రమాలకు కాణిపాకం పంచాయతీని ఆదర్శంగా తీసుకుంటూ జిల్లాలోని అధికారులందరికీ ఇక్కడ శిక్షణ ఇప్పిస్తున్నారు. కాణిపాకం పంచాయతీ పన్ను వసూళ్లలో కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ఆస్తి పన్ను రూపంలో ఈ ఏడాది రూ.13,68,640 వసూలు చేసింది. ఇంటింటి సర్వేలు నిర్వహించి ఆస్తుల మ్యాపింగ్ చేయడం, డిమాండ్–కలెక్షన్–బ్యాలెన్స్ రిజిస్టర్లను పటిష్టంగా నిర్వహించడం వల్ల వసూళ్లు గణనీయంగా పెరిగాయి. నీటి చార్జీల ద్వారా రూ.3 లక్షలు, పారిశుద్ధ్య పన్ను రూ.1.6 లక్షలు, లైటింగ్ పన్ను రూ.80 వేలు, చెత్త పన్ను రూ.88 వేలు వచ్చింది. వీటితో పాటు పలు వనరుల ద్వారా కూడా ఆదాయం వస్తోంది. మొత్తంగా పంచాయతీ పన్ను ఆదాయం రూ.2.6 కోట్లు దాటుతోంది. పన్నేతర ఆదాయం రూ.8 లక్షలకు పైగా వస్తోంది. -
వికసించడమే!
పలమనేరు పట్టణంలోని మల్లిచెట్ల దేవేంద్ర ఇంటి పెరట్లో నాటిన మే పుష్పం గురువారం వికసించింది. ఏడాదికోసారి మేలో మాత్రమే ఇది వికసిస్తుందని దేవేంద్ర తెలిపారు. సాధరణంగా కొన్ని పుష్పాలు మాత్రమే వికసిస్తుంటాయి. కానీ ఈ మొక్కకు భారీ స్థాయిలో పుష్పాలు వచ్చాయి. వీటిని చూసేందుకు చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాలామంది తమ సెల్ఫోన్లలో బంధించారు. కాగా మే ఫ్లవర్ దుంగలు కావాల్సిన వారికి ఉచితంగానే అందజేస్తామని పలమనేరు ప్రకృతి నిర్వాహకులు మల్లిచెట్ల దేవేంద్ర తెలిపారు. – పలమనేరు -
వరి..ఉరి!
పలమనేరు: ఏ పంట సాగు చేసినా నికర లాభాలు లేనందున పలువురు రైతులు కనీసం తిండి గింజలకన్నా దక్కుతాయని వరిపంట సాగుపై మొగ్గుచూపారు. పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లో గత డిసెంబరు, జనవరి నెలల్లో నాటిన వరి ఇప్పుడు కోతకు వచ్చింది. రైతులు సుమారు 5 వేల ఎకరాల్లో వరి సన్న రకాలైన బీపీటీ, నర్మద, అమన్, ధనిష్ఠ, దొడ్డ రకాలైన జేజేఎల్, ఆర్ఎన్ఆర్లాంటి రకాలను సాగు చేశారు. ఇందులో 2 వేల ఎకరాల దాకా ఇప్పటికే నూర్పిళ్లు జరిగాయి. మరో రెండు వేల ఎకరాల్లో వరికోతలు జరగాల్సి ఉంది. వరికోతలు మొదలు కాగానే ఉన్నట్టుండి ధాన్యం ధరలు తగ్గాయి. మొన్నటి దాకా క్వింటా ధర రూ.2,500 దాకా ఉండగా ఇప్పుడు రూ.2 వేల నుంచి రూ.2200 దాకా పలుకుతోంది. నూర్పిడి చేసిన వరి ధాన్యాన్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. పంట సాగు చేయడం కంటే భూమిని బీడుగా వదిలేసినా బాగుండేదనే రైతుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులూ దక్కని వైనం ఎకరా పొలానికి వరి విత్తనాలు తెచ్చి నారు మడిని వేయడానికి రూ.2 వేలు. ఆపై బురద మడి దున్నడానికి ట్రాక్టరుకు గంటకు రూ.1,200 చొప్పున ఏడు గంటలకు రూ.9,600, మడి చుట్టూ గెనాలు కొట్టేందుకు రూ.2 వేలు అవుతుంది. నాటేందుకు ముందు పొలంలో రెండు బస్తాల కాంప్లెక్స్ ఎరువుకు రూ.2,600 అవుతుంది.ఇక వరినాట్లకు రూ.7 వేలు, ఆపై చెత్త తీసేందుకు రూ.3 వేలు అవుతోంది. ఈ సమయంలో యూరియా కోసం రూ.1200 ఖర్చు పెట్టాలి. పంటకు చీడపీడల నివారణకు పురుగు మందుల కోసం రూ.1000 అవుతుంది. పంటకోతకొచ్చాక యంత్రాల ద్వారా అయితే రూ.11 వేలు పెట్టాల్సిందే. నారుపోసినప్పటి నుంచి ధాన్యం ఇల్లు చేరేందుకు ఎకరా పొలంలో రైతుకు అయ్యే ఖర్చు రూ.40 వేల దాకా అవుతోంది. బయటి రాష్ట్రాల వ్యాపారులు స్థానికంగా వరికి ధరలేదని తెలిసి కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు, చింతామణి, శ్రీనివాసపుర తమిళనాడులోని తిమ్మిరి ప్రాంతానికి చెందిన వ్యాపారులు లారీలతో వచ్చి రైతు పొలాల వద్దే నెమ్ముగా ఉన్న ధాన్యాన్ని సైతం కొని అక్కడే తూకం వేసి గోతాముల్లో నింపి వెంటనే నగదు చెల్లించి తీసుకెళుతున్నారు. వరి ధాన్యాన్ని అడిగే వారులేకపోవడంతో బయటి వ్యాపారులు పొలం వద్దే కొంటున్నారనే సాకుతో తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది.రైతుకు మిగిలేది శూన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం గతంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని వ్యవసాయశాఖ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనేవారు. కాని చంద్రబాబు పాలనలో ధాన్యాన్ని కొనకపోగా కనీసం ధర లేకుండా రైతులు నష్టపోతున్నా పట్టించుకునేవారే లేరు. గత రెండు సీజన్లుగా వరి రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఎకరా పొలంలో పంట బాగా పండితే 30 బస్తాలు (బస్తా 80కేజీలు) లెక్కన 24 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పచ్చిగా ఉన్న ధాన్యం ఇప్పుడున్న ధరల మేరకు క్వింటా రూ.2వేలు అయితే రూ.48 వేలు చేతికొస్తుంది. ఇందులో రైతు పెట్టిన పంట పెట్టుబడి రూ.40 వేలు పోతే రైతుకు చివరికి మిగిలేది కేవలం రూ.8 వేలు మాత్రమే. దీంతోపాటు ఐదునెలల పాటు వరిపంట సాగు కోసం ఆరైతు కూలి లెక్కేసుకున్నా గిట్టుబాటు కాని పరిస్థితి. -
మద్యానికి బానిసై బలవన్మరణం
యాదమరి: మద్యానికి బానిసై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా, యాదమరి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం.. మండల పరిధి కుక్కలపల్లి గ్రామానికి చెందిన గోపి ఆచారి కుమారుడు సోమశేఖర్(33) చిన్నపాటి పనులు చేసుకుని స్థానికంగా జీవనం సాగిస్తుండే వాడు. ఇతనికి ఎవ్వరూ లేరు. మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. అదే సమయంలో అతని స్నేహితులైన భూపతి, నిర్మల్, సోమశేఖర్‌ను కలవడానికి రాగా.. అతను ఉరికి వేలాడడాన్ని గమనించి గట్టిగా కేకలు వేశారు. ఆ తర్వాత స్థానికులు వెంటనే సోమశేఖర్‌ను కిందకి దించి చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా మృతునికి ఎవరూ లేనందున మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వడదెబ్బతో వ్యక్తి మృతి శ్రీరంగరాజపురం : వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పెద్దతయ్యూరు దళితవాడలో చోటు చేసుకుంది.స్థానికుల కథనం మేరకు టి.గోవిందయ్య (57) బుధవారం మధ్యాహ్నం తన పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో వడదెబ్బ తగిలి కింద పడిపోవడంతో అక్కడే ఉన్న పశువుల కాపరులు , రైతులు వచ్చి చూసేలోపల గోవిందయ్య మృతి చెందినట్లు తెలిపారు. కారు ఢీకొని ఇద్దరికి గాయాలు తవణంపల్లె: మండలంలోని గల్లావాళ్ళవూరు వద్ద అతివేగంగా అరగొండ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ఐ రమేష్‌బాబు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలిలా. మండలంలోని గల్లావాళ్ళవూరు వద్ద చిత్తూరు పట్టణం వెంగళరావు కాలనీకి చెందిన మురళి, చరణ్ ద్విచక్ర వాహనంపై చిత్తూరుకు వస్తుండగా అరగొండ వైపు వెళ్తున్న కారు అతివేగంగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో మురళి, చరణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారైనట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. శ్రీవారి దర్శనానికి 14 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 24 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 80,389 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,213 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 14 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
● నెలరోజుల్లో పూర్తిచేయాలి ● రూ.32.16 కోట్ల పనులు పెండింగ్ ● ఏఈలకు నోటీసులు
వర్క్ఆర్డర్ల వర్రీ! చిత్త్రూు కార్పొరేషన్: ఎప్పటి పనులు అప్పుడు సరిచూసుకుంటే లెక్క సరిపోతుంది. తర్వాత చూస్తాంలే అనే నిర్లక్ష్య ధోరణి వారిని ఇక్కట్లపాల్జేసింది. శాఖ పరంగా జరిగిన అభివృద్ధి పనుల పరంగా సకాలంలో లెక్కచూపకపోవడంతో ఏఈలపై ఏపీఈఆర్సీ ఆదేశాల మేరకు అధికారులు చర్యలకు పూనుకోనున్నారు. దీంతో మిగిలిన ఏఈలు వణికిపోతున్నారు. జిల్లా ట్రాన్స్‌కో పరిధిలో వర్క్ఆర్డర్లు క్లోజ్ చేయని ఏఈలను రిలీవ్ చేసి వారి పర్సనల్ అకౌంట్స్ నుంచి మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఏఈలు ఉన్నారు. వీరు బదిలీ, పదోన్నతి వచ్చి డివిజన్, సెక్షన్లు మారిన లెక్కను సరిచేయాల్సిందే. నెలలోపు వీరి పనితీరు మారకపోతే పర్సనల్ అకౌంట్స్ నుంచి మొత్తాన్ని రికవరీ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 40 మంది ఏఈలు జిల్లాలో 2021–24వ సంవత్సరం వరకు 40 మంది ఏఈలు 1000 వరకు వర్క్ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.32.16 కోట్లు ఉంది. అభివృద్ధి పనుల్లో భాగంగా కరెంటు స్తంభాలు, లైన్, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. విద్యుత్‌శాఖలో ఏ పనిచేయాలన్నా దానికి అనుమతి తీసుకొని వర్క్ఆర్డర్లు సిద్ధం చేయాలి. అవి ఆమోదం పొందాక వాటిని స్టోర్స్ లో మెటీరియల్స్ తీసుకుంటారు. తదుపరి క్షేత్రస్థాయిలో పనులు చేస్తారు. చిన్న బోల్టు, నెట్, క్లాంప్, క్రాస్హారం, కిలోమీటర్ల లైన్ వరకు వేసిన వాటి లెక్క చూపాల్సిందే. జిల్లాలో కార్వేటినగరం 263 పనులు రూ.3.84 కోట్లు, పైపల్లె సెక్షన్ పరంగా 83 వర్క్ఆర్డర్లు రూ.1.37 కోట్లు, గంగవరం 134 వర్క్ఆర్డర్లు రూ.1.41 కోట్లు, యాదమరి 61 వర్క్ఆర్డర్లు రూ.69 లక్షలు, పలమనేరు 354 పనులు రూ.25 లక్షలు, పరంగా ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నారు. వీరితో మిగిలిన వారు ఆ మొత్తం చెల్లించాల్సి ఉంది. నిలిచిపోనున్న నిధులు ట్రాన్స్‌కో పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పరంగా చేసిన పనులు వివరాలు లెక్క చూపాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో జరిగిన పనులు గురించి వివరాలు తెలుస్తోంది. వాటిని క్లోజ్ చేయకపోవడంతో అలాగే పెండింగ్ ఉంటుంది. దీంతో అభివృద్ధి పనులకు నిధులు సైతం ఆగిపోనున్నాయి. దీంతో అవసరాలకు తగిన మెటీరియల్స్ రాక సకాలంలో పనులు పూర్తికావడం లేదు. పనులు సకాలంలో పూర్తి చేసి ఉంటే నిధులు, మెటీరియల్స్ పెరిగి అభివృద్ధి మరింతగా జరిగి ఉండేది. -
శక్తి సంబరం
సంపూర్ణం.. నడివీధి గంగమ్మ సేవకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిన వీధులు.. ఒళ్లు గగుర్పొడిచేలా ఓంశక్తి మాలధారుల విన్యాసాలు.. సంప్రదాయబద్ధంగా కొలుపులు.. శ్రవణానందంగా డప్పు వాయిద్యాలతో బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన అమ్మవారి నిమజ్జనోత్సవంతో జాతర సంబరం సంపూర్ణమైంది. మహిమాన్విత దివ్యరూప దర్శనంతో భక్తజనుల మనసు పులకరించింది. నగరం యావత్తూ ఆధ్యాత్మిక వైభవంతో దేదీప్యంగా విరాజిల్లింది. చిత్తూరు గంగజాతరలో భాగంగా బుధవారం ‘ఓం శక్తి’ నినాదాల మధ్య భక్తులు చేపట్టిన వినూత్న విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారిపై ఉన్న అపారమైన విశ్వాసంతో వందలాది మంది భక్తులు నోటికి, వీపునకు శూలాలు గుచ్చుకుని దీక్షలు నిర్వర్తించారు. కొందరు భక్తులు లారీలకు వేలాడుతూ ఊరేగింపులో పాల్గొనగా.. మరికొందరు ఆటోలు, కార్లను లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ దృశ్యాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల విన్యాసాలతో నగర వీధులు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి. చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరం గంగమ్మ జాతర సందడితో కళకళలాడింది. రెండు రోజులపాటు భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా సాగిన జాతర బుధవారం అర్థరాత్రి నిమజ్జన మహోత్సవంతో ఘనంగా ముగిసింది. రాష్ట్ర నలుమూలలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో నగరం జనసంద్రంగా మారింది. అంగరంగ వైభవం చిత్తూరు నగరంలోని చారిత్రాత్మక నడివీధి గంగజాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మంగళవారం గంగమ్మ తల్లిని నడివీధిలో కొలువుదీర్చి, రెండోరోజు బుధవారం నిమజ్జనానికి తీసుకెళ్లడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు గ్రామదేవత పొన్నియమ్మకు విశేష పూజలు నిర్వహించారు. సారె సమర్పణలో భాగంగా ఆలయం నుంచి నడివీధికి భారీ ఊరేగింపుగా బయలుదేరారు. డప్పు వాయిద్యాలు, నయండి మేళాలు, సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు, గజమాలలతో ఊరేగింపు వైభవంగా సాగింది. డప్పు దరువులకు యువకులు ఉత్సాహంగా చిందులేస్తూ సందడి చేశారు. అమ్మవారికి ధర్మకర్త గజమాల సమర్పించడంతో ప్రధాన ఊరేగింపు ప్రారంభమైంది. అడుగడుగునా నీరాజనాలు హైరోడ్డు మీదుగా సాగిన అమ్మవారి ఊరేగింపులో భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. గంగమ్మ దర్శనం కోసం రహదారుల వెంట భక్తులు బారులు తీరారు. ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొనసాగగా, చివరకు కట్టమంచి చెరువులో అమ్మవారి ప్రతిమను నిమజ్జనం చేశారు. అనంతరం నడివీధిలోని అఖండదీపాన్ని కొండెక్కించడం ద్వారా జాతర ఘట్టం పూర్తయింది. కట్టుదిట్టంగా బందోబస్తు అమ్మవారి నిమజ్జనోత్సవానికి పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు చేపట్టారు. ముందస్తుగా ట్రాఫిక్ మళ్లించారు. మండపాలు, ఊరేగింపు మార్గాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిఘా పెట్టారు. మొక్కు తీర్చుకుంటూ..నగరమంతా సందడి కొంగారెడ్డిపల్లి, సంతపేట, గిరింపేట, దొడ్డిపల్లె, మురకంబట్టు, ఒబనపల్లె తదితర ప్రాంతాల్లో సైతం గంగమ్మ ఊరేగింపులు నిర్వహించారు. సంతపేటలో ఓంశక్తి విన్యాసాలు, గిరింపేటలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పలు సేవా సంస్థలు అన్నదానం చేపట్టాయి. మజ్జిగ, చల్లటి పానీయాలు, తాగునీరు పంపిణీ చేశారు. -
అబ్బురపరిచిన విన్యాసాలు
జాతరలో ఓంశక్తి భక్తుల వినూత్న ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 40 రోజులపాటు దీక్షలు చేపట్టిన భక్తులు ముందుగా శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శూలాలతో విన్యాసాలు చేశారు. కొంతమంది భక్తులు నోటికి శూలాలు గుచ్చుకోగా, మరికొందరు వీపుకు కొక్కీలు వేయించున్నారు. ఇంకొందరు శరీరమంతా నిమ్మకాయలు గుచ్చుకుని భక్తి భావం చాటుకున్నారు. ఓంశక్తి భక్తుల విన్యాసాలు ఒళ్లుగగుర్పొడిచేలా దర్శనమిచ్చాయి. ఓ భక్తుడు క్రేన్న్ సహాయంతో లారీలో వేలాడుతూ గంగమ్మకు గజమాల సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారితో కలిసి ఓంశక్తి భక్తుడి విన్యాసం -
19న జిల్లా స్థాయి చెస్ పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు నగరంలో ఈ నెల 19వ తేదీన జిల్లా స్థాయి అండర్–13 చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా చెస్ అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఆర్బీ ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వేపమాను వీధిలోని స్కూల్ ఆఫ్ చెస్‌లో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికకు రాష్ట్ర స్థాయిలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుందన్నారు. జిల్లాకు చెందిన క్రీడాకారులకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి గలవారు ఈ నెల 18వ తేదీ లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నేరుగా వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని కోరారు. ఇతర వివరాలకు 9849313676, 9000475799 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పకడ్బందీగా ‘పది’ సప్లిమెంటరీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలోని 32 కేంద్రాల్లో 4,830 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పది, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలను ఈ నెల 25వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పరిధిలో పదో తరగతికి 13 కేంద్రాలు కేటాయించగా 917 మంది, ఇంటర్మీడియట్‌కు 10 కేంద్రాల్లో 1,831 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ మోహన్‌కుమార్, డీఈఓ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
సమగ్ర శిక్ష ఏపీసీగా వెంకటరమణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా మద్దిపట్ల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం చిత్తూరులోని డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్ కార్యాలయంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా విధుల్లో ఉన్న వెంకటరమణను జిల్లా అదనపు ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్‌గా నియమించారు. కాగా ఆయన ఇప్పటికే సమగ్ర శిక్ష ఏపీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం సమగ్ర శిక్ష ఏపీసీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీసీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ బడుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. -
ప్రభుత్వ బోరు కబ్జా
కుప్పం రూరల్ : కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నిత్యం ఏదో చోట అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కుప్పం మండలం వి.మిట్టపల్లి గ్రామంలో గ్రామస్తుల సౌకర్యార్థం ప్రభుత్వ నిధులతో వేసిన బోరుకు కూటమి నాయకుడు మోటారు బిగించి యథేచ్చగా నీటిని వాడుకుంటున్నాడు. నీటిని వ్యవసాయ పొలానికి పారించుకుంటున్నాడు. దీనిపై గ్రామస్తులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో పొలంలోకి వేసిన పైపులను తొలగించారు. మోటారు మాత్రం బోరు బావిలోనే ఉన్నట్లు గ్రామస్తులు చెప్పారు. అధికారులు స్పందించి ప్రైవేట్ వ్యక్తి వేసుకున్న మోటారును తొలగించి ప్రభుత్వం మోటారు బిగించి గ్రామానికి తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం గిరింపేట బౌండువీధిలోని వేంకటేశ్వర ఆలయ కుంభాభిషేక పూజలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అంకుర్పారణం, వాస్తు హోమం, గణపతి హోమ పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. నిర్వాహకులు సెంథిల్‌కుమార్, షణ్ముగం, గోపి, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. -
రోజుకు 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తే లక్ష్యం
కుప్పం: నియోజకవర్గంలో 2028 సంవత్సరానికి రోజుకు పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం కడా కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వ్యవసాయ రంగంలో పశుగ్రాస అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. కమ్యూనిటీ పౌడర్ డెవలప్మెంట్ ద్వారా పశుగ్రాస సరఫరాను పెంచాలని తెలిపారు. 2028 నాటికి 10 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తే లక్ష్యంగా చర్యలు చేపట్టాలన్నారు. సహజ వ్యవసాయం, ఉద్యాన పంటలు, పూలు, పట్టు వంటి రంగాల్లో రైతులను ప్రోత్సహించాలని కోరారు. దీంతో పాటు మామిడి, టమాట, అరటి వంటి సాంప్రదాయ పంటలతో పాటు డ్రాగన్ ప్రూట్, బ్లూబేర్రి వంటి విదేశి పంటలు సాగుకు రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. ఆదర్శ రైతులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందేటట్లు చూడాలని సూచించారు. 2027 నాటికి కుప్పం సిల్క్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలన్నారు. కడా పీడీ వికాస్ మర్మత్, పీఎంకే ఊడా చైర్మన్ డా. సురేష్ పాల్గొన్నారు. -
ఏనుగుల బీభత్సం
గుడిపాల: పంట పొలాలపై ఏనుగులు బీభత్సం సృష్టిస్తుంచాయి. 15 ఏనుగుల గుంపు ఒక్కసారిగా పంట పొలాలపై పడడంతో రైతులు ఆందోళన చెందారు. గుడిపాల మండలంలోని బట్టుబాళ్లూరు, పిళ్లారికుప్పం, ముత్తువాళ్లూరు, పల్లూరు, పానాటూరు గ్రామాల్లో రైతులు పండించిన వరి, అరటి, మామిడి, కొబ్బరి పంటలను ధ్వంసం చేశాయి. దీంతో బోరు మోటార్లుతో పాటు పైపులు, పెన్సింగ్లను కూడా ధ్వంసం చేశాయి. సుమారు 2 0మంది రైతులకు సంబంధించి పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. అటవీశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. -
రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తి
రేణిగుంట: పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ మరమ్మతు పనులు పూర్తి అయ్యాయి. దీంతో బుధవారం మధ్యాహ్నం రైల్వే అండర్ బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలను రేణిగుంట తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, ఎంపీడీఓ రవిచంద్ర, రైల్వే అధికారులు, పట్టణ సీఐ జయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రవిచంద్ర మాట్లాడుతూ సకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జిని పూర్తి చేసినందుకు రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అండర్ బ్రిడ్జ్ అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేసినందుకు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, క్లస్టర్ ఇన్చార్జి పుష్పనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఆర్జేసీలో ‘విశ్వం’ ఉత్తమ ఫలితాలు
తిరుపతి అర్బన్: ఏపీఆర్జేసీ 2026లో ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ సత్తా చాటింది. విశ్వం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ప్రవేశాల కోసం ఏప్రిల్ 24న నిర్వహించిన ఏపీఆర్జేసీ ఎంట్రెన్స్న పరీక్ష ఫలితాల్లో తిరుపతి విశ్వం విద్యా సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రత్యేక ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల్లో వి. మోక్షిత్ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించగా, టి. శ్రీదర్శిని రాష్ట్రస్థాయి 8వ ర్యాంకు, కే. పవ్యశ్రీ 9వ ర్యాంకు, కే. హర్షవర్ధన్ 11వ ర్యాంకు, కే. జ్యోత్స్న 12వ ర్యాంకు, ఎన్. హాసిని 13వ ర్యాంకు, ఈ. మునిశంకర్ 14వ ర్యాంకు, బి. హర్షిత్ 15వ ర్యాంకు, పి. తేజస్వి 16వ ర్యాంకు, కే. హర్ష 17వ ర్యాంకు, వి. పూజ 18వ ర్యాంకు, ఎం. చారుణ్య, కే. గీతిక 19వ ర్యాంకు, ఏ. రితీష్ కుమార్, కే. ధోనీష్ 20వ ర్యాంకులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారని విశ్వం విద్యా సంస్థల అధినేత ఎన్. విశ్వనాథ్ రెడ్డి బుధవారం వెల్లడించారు. ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులకు విశ్వనాఽథ్రెడ్డితోపాటు విశ్వం అకడమిక్ డైరెక్టర్ విశ్వచందన్‌రెడ్డి, విశ్వశ్రీ , కరస్పాండెంట్ తులసీ విశ్వనాథ్‌రెడ్డి అభినందనలు తెలిపారు. -
ఖేలో ఇండియా సంయుక్త కార్యదర్శి ఐసర్ సందర్శన
ఏర్పేడు: ప్రతిష్టాత్మకమైన ఖేలో ఇండియా సంయుక్త కార్యదర్శి వినీల్‌కృష్ణ మంగళవారం తిరుపతి ఐసర్ను సందర్శించారు. ఆయనకు ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతాను భట్టాచార్య, ఐసర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇంద్రప్రీత్‌సింగ్ కోహ్లీ జ్ఞాపిక అందజేసి, ఘనంగా సత్కరించారు. ఆయన పర్యటన సందర్భంగా ఐసర్ విద్యాసంస్థల్లో క్రీడలు, యువత సాధికారత, సంపూర్ణ అభివృద్ధి ప్రాముఖ్యతపై చర్చించారు. విద్యార్థుల్లో విద్య, పరిశోధన, ఫిట్నెస్, క్రీడా సంస్కృతిలో శ్రేష్టతను ప్రోత్సహించాలనే ఉమ్మడి దృక్పథాన్ని ఆయన పర్యటన ప్రతిబింబించిందని స్పష్టం చేశారు. -
వైభవంగా!
గంగరంగ చిత్తూరులో గంగజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నడివీధితో పాటు పలు ప్రాంతాల్లో గంగమ్మను కొలువుదీర్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని నడివీధిలో కొలువుదీరిన గంగమ్మ తల్లికి వంశపారంపర్య ధర్మకర్తలు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొందరు వినూత్న వేషధారణలతో మొక్కులు తీర్చుకోగా, మరికొందరు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరింపేట, సంతపేట, దొడ్డిపల్లి, కొంగారెడ్డిపల్లి, కట్టమంచి తదితర ప్రాంతాల్లో గంగమ్మ జాతర ఉత్సాహంగా సాగింది. విద్యుద్దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గంగమ్మను దర్శించుకున్న ఎస్పీ చిత్తూరు నడివీధిలో కొలువుదీరిన గంగమ్మ తల్లిని ఎస్పీ తుషార్‌డూడీ దర్శించుకున్నారు. వారికి జాతర నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించి పసుపు, కుంకుమ అందించారు. ముందుగా జాతర ఏర్పాట్లు, భక్తుల రద్దీ, నిఘా తదితర విషయాలను జాతర మండపం వద్ద ఎస్పీ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తిశ్రద్ధలతో చిత్తూరు గంగ జాతర నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చిత్తూరులో రెండో రోజు గంగమ్మ తల్లి నిమజ్జనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు నడివీధి గంగమ్మ నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. వంశపారంపర్య ధర్మకర్తలు అమ్మవారికి సారె సమర్పించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. -
వాళ్లకే సీట్లా?
రెండేళ్ల పాటు నేను సెల్ ఫోన్ చూడలే దు. స్నేహితులతో బయటకు వెళ్లలే దు. రోజుకు 14 గంటలు పుస్తకాలతోనే గడిపాను. పరీక్ష బాగా రాశాను. కచ్చితంగా సీటు వస్తుందన్న నమ్మకంతో ఉన్నా ను. కానీ పేపర్ లీకేజీ వార్త వినగానే నా ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపో యింది. లక్షలు పోసి పేపర్లు కొన్నవాళ్లకి ర్యాంకులు వస్తుంటే, మాలాంటి మధ్యతరగతి విద్యార్థుల కష్టానికి విలువే లేదా? మళ్లీ పరీక్ష రాయాలన్నా ఆ పాత ఉత్సా హం రావడం లేదు. – వివేక్, నీట్ విద్యార్థి, చిత్తూరు -
మామిడి రైతులకు భరోసా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మామిడి రైతు లు నష్టపోకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతామని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ భరోసా ఇచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో మామిడి సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలపై పరిశ్రమల నిర్వాహకు లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మామిడి రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ఏడాది మామిడి గుజ్జు పరిస్థితి గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. గత ఏడాదిలో నిల్వ ఉన్న మామిడి గుజ్జు ఇప్పటికే 80 శాతానికి పైగా విక్రయించడం శుభపరిణామమని చెప్పా రు. పాత నిల్వల సమస్య లేదని, కొత్త సీజన్ మామిడిని కొనుగోలు చేసేందుకు పరిశ్రమల యజమానులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సకాలంలో ప్రాసెసింగ్ సమావేశంలో పరిశ్రమల నిర్వాహకులు సాను కూలంగా స్పందించారని కలెక్టర్ తెలిపారు. మామిడి ప్రాసెసింగ్‌ను నిర్ణీత సమయానికే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా తమ వంతు సహకారం అందిస్తామని పరిశ్రమల నిర్వాహకులు వెల్లడించారన్నారు. పండ్ల నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ఏడాది 6.5 కోట్ల మామిడి కవర్లను రైతులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఉద్యానవన శాఖ అధికారులు, పరిశ్రమల నిర్వాహకులు పాల్గొన్నారు. 63 సమస్యల గుర్తింపు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో పరిధిలోని 40 సెక్షన్లలో విద్యుత్ అధికారులు కరెంటోళ్ల జనబాట నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 34 సమస్యలు, ఎల్టీ లైన్ల పరంగా 28, సర్వీసు లైన్ పరంగా ఒక సమస్య.. మొత్తం 63 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ అమర్‌బాబు తెలిపారు. అందులో మూ డు సమస్యలను పరిష్కరించినట్టు వెల్లడించారు. నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన నిత్యాన్నదాన ట్రస్ట్‌కు మంగళవారం బెంగళూరుకు చెందిన ప్రశాంత్ అనే దాత రూ.లక్ష నగదును విరాళంగా అందజేశారు. దాతకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటలా?
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి చిత్తూరు కలెక్టరేట్ : నీట్ నిర్వహణలో విఫలమైన కేంద్ర మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తూ నీట్ పరీక్షా పత్రాలను లీక్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. మే 4న జరిగిన నీట్ ప్రవేశ పరీక్షకు దేశ వ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. రెండేళ్ల పాటు కష్టపడి చదివి, డాక్టర్లు కావాలన్న ఆశతో పరీక్ష రాసిన పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆశలపై లీకేజీ ఉదంతం నీళ్లు చల్లిందని మండిపడ్డారు. వ్యాపారంగా మారిన పరీక్షలు గత ఏడాది కూడా ఇలాగే హర్యానా, బీహార్ రాష్ట్రా ల్లో నీట్ పేపర్‌ను రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అమ్ముకున్న ఉదంతాలు చోటు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ ఏడా ది కూడా అదే తరహాలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వరుసగా రెండేళ్లపాటు పేపర్లు లీక్ కావడం ఈ ఏజెన్సీ అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టారు. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఎన్ టీఏ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
వర్గపోరులో మునగంగ! కుప్పం గంగ జాతర నిర్వహణలో వర్గ విభేదాలు
● ఆలయ చైర్మన్, పాలకవర్గం మధ్య కుదరని సఖ్యత ● కొనసాగుతున్న బలవంతపు వసూళ్లు కుప్పం: పట్టణంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర నిర్వహణలో వర్గ విభేదాలు తార స్థాయికి చేరాయి. ప్రస్తుత పాలకవర్గ సభ్యులు, అధికా పార్టీ నేతలు, చైర్మన్ మధ్య సమన్వయం కుదరక రెండు వర్గాలుగా విడిపోయాయి. దీనికి తోడు పూజార్ల బృందం మరో వర్గంగా ఏర్పడింది. ఈ క్రమంలో దేవాలయంలో ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారిపోయింది. పారని పొదుపు మంత్రం గత ఏడాది అమ్మవారి దేవాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమి దేవాలయానికి కేటాయించారు. ఈ స్థలానికి వెళ్లేందుకు దారి కోసం ఇద్దరు ప్రయివేట్ వ్యక్తల దుకాణాలు కోనుగోలు చేసి దారి ఏర్పాటు చేశారు. దీనికి ఇంకా రూ.23 లక్షలు దాకా చెల్లించాల్సి ఉంది. అలాగే ప్రభుత్వ స్థలం పక్కనే ఉన్న ప్రయివేటు స్థలాన్ని కూడా చైర్మన్ ఆలయం కోసం కొనుగోలు చేశాడు. వీరందరికీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. దీనికి చైర్మన్ పొదుపు మంత్రాన్ని పాటించాలని సూచించారు. జాతర సింపుల్‌గా చేసి మిగిలిన డబ్బును ఆ స్థలాలకు చెల్లించాలని కోరారు. దీనికి అధికార పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జాతర సింపుల్‌గా చేసేది లేదని తేల్చేశారు. దీనికితోడు పాలకవర్గ సభ్యులు, చైర్మన్ మధ్య సమన్వయం కుదరడం లేదు. కమిటీ సభ్యులు పేరుకే గానీ తమకు ఎలాంటి విలువ ఇవ్వడం లేదని చైర్మన్, ఆయన కుటుంబ సభ్యులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా వసూళ్లు జాతర నిర్వహణకు అధికార పార్టీ పట్టణంలో బలవంతపు వసూళ్లకు పాల్పడు తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణం చుట్టూ ఉన్న వివిధ ఫ్యాక్టరీల వద్దకెళ్లి ఒక్కో ఫ్యాక్టరీ నుంచి రూ.50 వేలు రాసి చందా రసీదు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పలు వ్యాపార వేత్తల నుంచీ భారీగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మవారి జాతరకు భక్తిశ్రద్ధలతో విరాళాలు సేకరించాలి గానీ..ఇలా బలవంతపు వసూళ్లు తగదని స్థానికులు పేర్కొంటున్నారు. -
హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్
బంగారుపాళెం: హత్యాయత్నం కేసుకు సంబంధించి మంగళవారం ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఆదివారం రాత్రి మండలంలోని కీరమంద గ్రామానికి చెందిన కిరణ్ కు, అదే గ్రామానికి చెందిన నాగేంద్రపై అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కిరణ్ అతని బావమరిది దామోదరంతో కలసి నాగేంద్రపై చాకుతో కడుపు, భుజంపై పొడిచి తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసుకు సంబంధించి కిరణ్, దామోదరంను సీఐ పర్యవేక్షణలో ఎస్ఐ, సిబ్బంది బలిజపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. ఆపై ముద్దాయిలను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ చెప్పారు. నూతన వసతులతో ఆదర్శ పాఠశాల నిర్మాణం రొంపిచెర్ల: రొంపిచెర్ల ఆదర్శ పాఠశాల తరగతి గదులను నూతన వసతులతో నిర్మించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన మంగళవారం ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 12వ తేదీనాటికి విద్యార్థులకు సౌకర్యంగా మొదటి అంతస్తు తరగతి గదులను పూర్తి చేయాలన్నారు. తరగతి గదుల కొరత వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలని ఎంఈవో శ్రీనివాసులును ఆదేశించారు. ప్రిన్పిపల్ రెడ్డిప్రదీప్, తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఎంఈవో శ్రీనివాసులు, డీఈ సాయి, ఏఈ వేణుగోపాల్, కాంట్రాక్టర్ బహ్మనందరెడ్డి పాల్గొన్నారు. కారు ఢీకొని వ్యక్తి మృతి పలమనేరు: పలమనేరు–కుప్పం రహదారిలోని కొలమాసనపల్లి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైరెడ్డిపల్లి మండలం, ధర్మపురి అగ్రహారానికి చెందిన మణి(32) మృతి చెందాడు. స్వగ్రామం నుంచి బైక్‌పై పలమనేరుకు వస్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న కారు కొలమాసనపల్లి వద్ద అతన్ని ఢీకొందని స్థానికులు తెలిపారు. కాగా మృతునికి వివాహమై, మూడేళ్ల కుమార్తె ఉండగా ప్రస్తుతం ఇతని భార్య గర్భవతి. గత కొన్నాళ్లుగా పలమనేరు నుంచి బైరెడ్డిపల్లి మార్గంలో ఐదుగురు ఇలాంటి ప్రమాదాలతో నే మృతి చెందారు. బాగున్న తారు రోడ్డుపై కాంట్రాక్టర్ల లాభం కోసం ప్యాచ్‌వర్క్ చేయడంతోనే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. పలమనేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలిచారు. కేసు విచారణలో ఉంది. గోడ దూకి గోవా వెళ్లాడు! చంద్రగిరి: పరీక్షలు సరిగ్గా రాయలేదనే కారణంగా భయపడి ఎవరికీ చెప్పకుండా గోడ దూకి పారిపోయిన విద్యార్థి ఆచూకీని తిరుచానూరు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గోవాలోని వాస్కోలో బాలుడిని పోలీసులు సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గీతం జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువున్న జస్వంత్ రెడ్డి మార్చి 12వ తేదీన ఎవరికీ చెప్పకుండా కళాశాల నుంచి వెళ్లిపోయాడు. ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఈ విషయమై తిరుచానూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాల గాలింపు, సాంకేతిక ఆధారాలతో జస్వంత్ రెడ్డి గోవాలోని వాస్కో ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసు బృందం మంగళవారం వాస్కోకు చేరుకుని, అక్కడి పోలీసుల సహకారంతో బాలుడిని సురిక్షతంగా అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని విచారించగా ఇంటర్ ఫైనల్ పరీక్షలు సరిగ్గా రాయకపోవడంతో భయపడి ఎవరికీ చెప్పకుండా వచ్చేసినట్లు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం బాలుడిని పోలీసులు తిరుచానూరుకు తీసుకొచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ విద్యార్థులపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు వారి మానసిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారిని ప్రోత్సహించాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడేలా అవగాహన కల్పించాలని సూచించారు. -
దొంగ అరెస్టు
● ఎవరూ లేని ఇళ్లే అతని టార్గెట్..! ● రాత్రుల్లో చోరీకి పాల్పడే దొంగ అరెస్టు చేసిన తిరుచానూరు పోలీసులు ● రూ.8లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం ● వివరాలను వెల్లడించిన సీఐ సునీల్ కుమార్ చంద్రగిరి: తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీల కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సునీల్ కుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తిరుపతి జీవకోన, నవజీవన కాలనీలో ఉంటున్న వరదరాజుల మణి జల్సాలకు అలవాటు పడి ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో మార్చి 27వ తేదీన మంగళం తుడా క్వార్టర్స్‌లోని ప్లాట్ నంబర్ 51లో కాపురమున్న వెంకటేష్ బంధువుల ఇంట్లో శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. ఈ విషయం గుర్తించిన వరదరాజుల మణి 29వ తేదీన పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి బీరులోని ఉంచి 57 గ్రాముల బంగారు ఆభరణాలు, 512 గ్రాముల వెండి ఆభరణాలను దోచుకెళ్లాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తుల కదలికల గురించి విచారణ చేపట్టడంతో పాటు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళం సమీపంలోని ఆశ కల్యాణ మండపం సమీపంలో వరదరాజుల మణిను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించడంతో సుమారు 3 ఇళ్లలో చోరికి పాల్పడినట్లుగా తేలింది. గత ఏడాది నవంబర్‌లో జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన మణి తిరిగి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అలిపిరి, తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో 3 ఇళ్లలో చోరీలు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై తిరుచానూరు, అలిపిరి, సీసీఎస్, తిరుపతి రూరల్ పోలీసు స్టేషన్లలో 19 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. చోరీ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ సునీల్ కుమార్, ఎస్‌లు, క్రైం సిబ్బంది ప్రభాకర్, ప్రసాద్, షఫీలను ఎస్పీ అభినందించి వారికి నగదు రివార్డులను అందజేశారు. -
15నుంచి ఎస్వీయూ కళాశాలలకు సెలవులు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు ఈనెల 15 నుంచి జూన్ 28వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్డీ కోర్సుల చదువుతున్న విద్యార్థులకు జూన్ 29వ తేదీన యథాతధంగా తరగతులు ప్రారంభమవుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రశాంతంగా ఈఏపీసెట్ తిరుపతి సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2026 (ఎంసెట్) జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగింది. తిరుపతి రేణిగుంట రోడ్డులోని చదలవాడ ఇంజినీరింగ్ కళాశాల, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల, అన్నమయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్, పుత్తూరు శ్రీవెంకటేశ పెరుమాల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోని 5 పరీక్ష కేంద్రాల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు జరిగిన తొలిరోజు పరీక్షకు 96.50 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 12గంటల వరకు నిర్వహించిన తొలి సెషన్లో 616 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 592 మంది పరీక్ష రాశారన్నారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 1,331 మందికి గాను 1,287 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. రెండో రోజు బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్ష కేంద్రాల్లో మరో 1,450 మంది వరకు పరీక్షకు హాజరవుతారని వెల్లడించారు. -
పడిపోయిన ధరలు
పలమనేరు పట్టుగూళ్ల మార్కెట్‌కు గతంలో సగటున నాలుగు టన్నుల పట్టుగూళ్లు వచ్చేవి. అయితే వేసవి కారణంగా పంటలు సరిగ్గా రాక దిగుబడి తగ్గినా సమ్మర్లో సైతం సగటున రెండు టన్నుల గూళ్లు వచ్చేవి. కానీ ఈ నెలలో రోజువారీ వస్తున్న గూళ్లు సగటున కేవలం 1,600 నుంచి 2,200 కిలోలుగానే ఉంది. గతంలో ఇదే మార్కెట్లో కిలో గూళ్ల ధర రూ.900 దాకా పలికింది. కానీ క్రమేణా తగ్గుతూ సోమ, మంగళవారాల్లో స్థానిక మార్కెట్లో గరిష్ట ధర రూ.625, కనిష్ట ధర రూ.380, సగటు ధర రూ.534గా ఉంది. ఈ ధరతో తమకు గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
భరోసా ఏది?
పిల్లలను చాలా కష్టపడి చదివిస్తున్నాం. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు వల్ల విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. ము ఖ్యంగా అమ్మాయిలు పదేపదే బయటకు పంపించి పరీక్షలు రాయించాలంటే భయంగా ఉంటుంది. కేంద్రం విద్యార్థుల భద్రత కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయాల్సిన దుస్థితి వస్తుంది. ఈరోజు పేపర్ లీక్ అయిందని పరీక్ష రద్దు చేస్తే, లక్షలు కట్టి చదివించిన తల్లిదండ్రుల అప్పులు ఎవరు తీరుస్తారు? ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలి. – రమాదేవి, విద్యార్థి తల్లి -
నీట్‌పై నిప్పులు!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్షకు 1,060 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,020 మంది మే 3న జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. అయితే ప్రవేశ పరీక్ష పత్రం లీకేజీ కావడంపై క్షేత్ర స్థాయిలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య విద్యను అభ్యసించాలని కలలుగన్న విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయి. లీకేజీ మాఫియా పంజా వైద్యుడు కావాలనే లక్ష్యంతో రెండేళ్ల పాటు కోచింగ్ సెంటర్లలో గడిపారు. తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని లక్షల రూపాయల ఫీజుల రూపంలో కోచింగ్ సెంటర్లకు చెల్లించారు. తీరా పరీక్ష పూర్తయ్యాక పేపర్ లీక్ అయ్యిందని.. పరీక్షను రద్దు చేశారు. తాము చదివింది పరీక్ష రాయడానికా, అక్రమాలకు బలి కావడానికా అని విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుమిలిపోతున్న తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు అవుతారని ఆశపడ్డ తల్లిదండ్రులు ఇప్పుడు దిక్కుదోచని స్థితిలో పడిపోయారు. అప్పు చేసి చదివించిన చదువు లీకేజీల పుణ్యమా అని బూడిదలో పోసిన పన్నీరు కావడంతో వారి ఆవేదన వర్ణనాతీతం. నైతిక బాధ్యత ఎవరిది? లక్షలాది మంది విద్యార్థులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించి, వ్యయప్రయాసాలకోర్చి పరీక్ష రాస్తే.. దాన్ని రద్దు చేయడం అంటే వారి ఆశలపై నీళ్లు చల్లడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఒత్తిడిలో విద్యార్థులు నీట్ రద్దు నిర్ణయం విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతోంది. మళ్లీ మొదటి నుంచి ప్రిపేర్ కావాలంటే ఆ పాత ఉత్సాహం, ఏకాగ్రత కుదరదని విద్యార్థులు వాపోతున్నారు. కేంద్ర విద్యాశాఖ, ఏజెన్సీ చేసిన తప్పిదానికి తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు (ఫైల్)ఎన్టీఏ తీరుపై విమర్శలు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లీకేజీ ఏజెన్సీగా మారిందా..? అంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు వ్యవస్థపై నమ్మకాన్ని సడలిస్తున్నాయి. అక్రమార్కుల లాభం కోసం మెరిట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసమని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నీట్ ప్రవేశ పరీక్ష రద్దుపై జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్థులు రగిలిపోతున్నారు. రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి.. కష్టాన్ని ఆయుధంగా మలచిన తమకు నిరాశే ఎదురైందని కుమిలిపోతున్నారు. అక్రమార్కుల లీకేజీతో ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన చెందుతున్నారు. ఎన్టీఏ తీరునూ తీవ్రంగా తప్పుబడుతున్నారు. అక్రమార్కుల భరతం పట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని కూడా దుయ్యబడుతున్నారు. విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిన నీట్ -
టీడీపీ నాయకుడి అరాచకం
సాక్షి, టాస్క్‌పోర్సు: కార్వేటినగరం మండలం, అమ్మపల్లి పంచాయతీ, పొన్నగల్లు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఓ టీడీపీ నాయకుడు కూల్చివేశాడు. సదరు నాయకుడు కాంట్రాక్టర్ అవ తారమెత్తి రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం ఆ పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకావం ఉంది. కానీ మరమ్మతు పనుల పేరుతో అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా పాఠశాల భవనాన్ని కూల్చివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీరేవేరు ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆ నాయకుడి ఆగడాలు శ్రుతిమించడం పరిపాటిగా మారాయి. 2024–25 మధ్య కాలంలో కూడా ఇదే రీతిలో అరచాకాలు సాగించినట్టు స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో పంచాయతీ కార్యాలయానికి ప్రహరీ నిర్మాణం అవసరం లేకున్నా నిర్మాణానికి పూనుకున్నట్టు పేర్కొంటున్నారు. అక్కడ అడ్డుగా ఉన్న చింత చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికి సొమ్ము చేసుకున్నట్టు వెల్లడిస్తున్నారు. అలాగే చెరువుల్లో సొంతంగా చేపల పెంపకానికి కొంత వరకు ఆక్రమించుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పొన్నుగల్లు ప్రాథమిక పాఠశాల కూల్చివేత ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు పొన్నగల్లు ప్రాథమిక పాఠశాల మరమ్మతులకు గురైంది. కానీ దాని పునర్నిర్మాణానికి రూ.6.8 లక్షలు ఎంపీ నిధుల కోసం ప్రతిపాదనలు పెట్టాం. జిల్లా అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – విజయకుమార్, మండల విద్యాశాఖ అధికారి, కార్వేటినగరం -
బీ‘టెక్’ చోరుడు!
చిత్తూరు అర్బన్: మహేష్ బాబు బీటెక్. వయసు 22. బెట్టింగుల వ్యసనం అతడిని చోర శిఖామణిగా మార్చేసింది. పగలంతా కళాశాలకు వెళ్లి చదువుకోవడం.. రాత్రివేళ చోరీలు చేయడం అలవాటుగా మార్చుకున్న అతగాడు చివరకు పోలీసులకు చిక్కాడు. చిత్తూరు ఎస్పీ తుషార్‌డూడీ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్ పురం మండలం కన్యకాపురానికి చెందిన మహేష్ బాబు తిరుపతిలో ఉంటూ అక్కడే ఓ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగుల ఉచ్చులో చిక్కుకున్న అతడు తెలిసినవాళ్లు, స్నేహితుల నుంచి అప్పులు తీసుకుని మరీ రూ.లక్షలు పోగొట్టుకున్నాడు.అయినా ఆ వ్యసనం నుంచి బయటకు రాలేకపోయాడు. పందేలు కాయడానికి డబ్బులు లేకపోవడంతో చివరకు దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో చోరీలు చేస్తే పెద్దగా పట్టించుకునే వ్యవస్థ లేదని గ్రహించి.. గ్రామ, వార్డు సచివాలయాల్లో చోరీలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నాడు. రాత్రివేళ సచివాలయాల్లోకి ప్రవేశించి ప్రింటర్లు, ఎల్రక్టానిక్ వస్తువులు చోరీ చేసేవాడు. ఇలా ఎస్ఆర్ పురంలో 5, వెదురుకుప్పంలో 3, గుడిపాలలో 2, జీడీ నెల్లూరులో 2, తిరుపతి జిల్లాలో 5, అన్నమయ్య జిల్లాలో ఒక కేసులో మొత్తం కలిపి 18 కేసుల్లో మహేష్ కుమార్‌ను నిందితుడిగా గుర్తించారు. చోరీ చేసిన వస్తువులను ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు అమ్మేసేవాడు. వేలిముద్రలే పట్టించాయి చోరీలకు పాల్పడిన ప్రాంతాల్లో నిందితుడి వేలిముద్రలను సేకరించిన పోలీసులు ఆధార్ కార్డు నమోదైన వేలి ముద్రలతో సరిపోల్చి నిందితుడిని గుర్తించారు. సోమవారం చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై మఠం క్రాస్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహేష్ బాబును అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.8.10 లక్షల విలువ చేసే ప్రింటర్లు, ద్విచక్ర వాహనం, ఇనుప తలుపులు కత్తిరించే భారీ కట్టర్, ల్యాప్‌టాప్‌లను స్వాదీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపించిన కార్వేటి నగరం సీఐ హనుమంతప్ప, ఎస్ఆర్ పురం ఎస్ఐ సుమన్, సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డు అందచేశారు. ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ తరుణ్ పహ్వా, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, నగరి ఇన్చార్జి పోలీసు అధికారి రాంబాబు, ఎస్బీ సీఐ మురళి ఉన్నారు. -
శాశ్వత ఉద్యోగులుగా గుర్తించండి
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సంస్థలో కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, మూడో పార్టీ విధానాన్ని రద్దు చేయాలని ఏఈసీఈఎ జీ–3045 సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం వద్ద సోమవారం సోషల్‌మీడియా ఉద్యమం నిరసనలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర నాయకులు రూప్‌కుమార్, హేమకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఉద్యమం ప్రారంభమైందన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారాలోకేష్‌కు తమ సమస్యలను పంపించామని చెప్పారు. రెండు దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారుడు నిరంజన్‌కుమార్, జిల్లా అధ్యక్షులు మనిష్కుమార్, డివిజన్ కార్యదర్శులు బాలాజీ, రవి, చిరంజీవి, మధుసూదన్, వినయ్‌కుమార్, పాండు, రవీంద్రబాబు, గిరిబాబు పాల్గొన్నారు. -
టెక్స్టైల్స్ కార్మికులకు అన్యాయం
నగిరి మండలం పార్కిన్స్ టెక్స్టైల్స్ మాజీ కార్మికులు తమకు జరిగిన అన్యాయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 2006లో మూతబడిన కంపెనీ సెటిల్మెంట్ విషయంలో 272 మంది కార్మికులకు మొండిచేయి చూపిందన్నారు. 272 మంది కార్మికులకు కంపెనీ సెటిల్మెంట్ చేసిందన్నారు. మిగిలిన 26 మంది కార్మికులను ఇబ్బంది పెడుతోందన్నారు. కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారంతో సర్వే నెంబర్ 242/1లో 1.98 ఎకరాలు ఫ్యాక్టరీ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. కోర్టులో కేసు ఉండగానే జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరారు. -
అవగాహన కల్పిస్తున్నాం
వేసవిలో జరిగే చోరీలపై ప్రజలకు ఇప్పటికే అవగాహన కల్పించాం. ఎల్‌హెచ్‌ఎంఎస్(లాక్డ్ హౌస్ మాని టరింగ్ సిస్టమ్) అమలులో ఉంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌లోని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అందులో అడిగిన వివరాలివ్వాలి. ఆపై ఎప్పుడు ఊరెళుతున్నారు, ఎన్నా ళ్లు రారు తగిన వివరాలను అందులో ఎంట్రీ చేయాలి. పోలీసులు ఆ ఇంటి వద్ద సీసీకెమరా అమర్చి దాన్ని పోలీసు మానిటిరింగ్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తారు. చోరీ చేసిన వాళ్లను పట్టుకునే అవకాశం ఉంటుంది. – డేగల ప్రభాకర్, డీఎస్పీ, పలమనేరు -
సరెండర్
చిత్తూరు కార్పొరేషన్: మార్కెట్ వాల్యూ ఆడిట్ (ఎంవీఅండ్‌ఏ) రిజిస్ట్రార్ కార్యాలయంలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్‌ను రాష్ట్ర ఐజీ కార్యాలయానికి సరెండర్ చేశారు. చిత్తూరులోని రిజిస్ట్రేషన్ భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్, మార్కెట్ వాల్యూ ఆడిట్ రిజిస్ట్రార్ కార్యాలయం, డీఐజీ కార్యాలయాలున్నాయి. అక్కడ సదరు సీనియర్ అసిస్టెంట్ ఒకే కేంద్రంలో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. విచారణలో వాస్తవమని తేలడంతో ఎంవీఅండ్‌ఏ జిల్లా రిజిస్ట్రార్.. సదరు సీనియర్ అసిస్టెంట్ కార్యాలయానికి సరెండర్ చేశారు. గణనాథుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని సోమవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్‌రాయ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనంతో పాటు స్వామి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఓం శక్తి ఆలయంలో చోరీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం 5.వెంకటాపురం గ్రామంలోని ఓం శక్తి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అమ్మవారి తాళిబొ ట్టు, హుండీని అపహరించుకెళ్లారు. సోమవా రం ఉదయం ఆలయ తాళాలు పగులగొట్టిన విషయాన్ని గ్రామస్తులు గమనించి.. పోలీసుల కు సమాచారం అందించారు. పోలీసులు ఓం శక్తి ఆలయంలో జరిగిన చోరీపై ఆరా తీశారు. టీచర్లకు ఈఎల్స్ తప్పనిసరి చిత్తూరు కలెక్టరేట్ : సెలవుల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఈఎల్స్ మంజూరు చేయాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల విధులు, ఇతర విద్యాకార్యక్రమాల్లో పాల్గొంటున్న టీచర్లకు సంపాదిత సెలవులు (ఈఎల్)లు తప్పనిసరిగా మంజూరు చేయాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షల విధులు నిర్వహించే టీచర్లు, హెచ్ఎంలు, అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనే వారందరికీ తగిన ప్రయోజనాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలన్నారు. సోలార్ పనులు వేగం పెంచాలి చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ పనులు వేగం పెంచాలని ట్రాన్స్‌కో సీఎండీ శివశంకర్ ఆదేశించారు. సోమవారం ఆయన ఎస్ఈ, ఈఈలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో దాదాపు 19 వేల సర్వీసుల ఏర్పాటును ఆగస్టులోపు ఏర్పాటు చేయాలన్నారు. అందులో ఇప్పటి వరకు 1,100 ప్యానల్స్ బిగించారన్నారు. రోజూ 150 ప్యానల్స్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ అమర్‌బాబు, ఈఈ మునిచంద్ర, సురేష్ పాల్గొన్నారు. హత్యాయత్నం కేసు నమోదు బంగారుపాళెం: ఇద్దరు వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వివాహేతర సంబంధం కలిగివున్నాడనే నెపంతో మండలంలోని కీరమంద గ్రామానికి చెందిన సంపత్ కుమారుడు కిషోర్, అతని బావమర్థి, అదే గ్రామానికి చెందిన నాగేంద్రబాబుపై ఆదివారం రాత్రి కత్తితో దాడి చేశారు. ఈదాడిలో నాగేంద్రబాబు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు నాగేంద్రబాబును చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. నాగేంద్రబాబు ఫిర్యాదు మేరకు కిషోర్, దామోదరంపై హత్యయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
అమ్మో..దొంగ!
వేసవిలో దొంగల హల్చల్ జాగ్రత్తలు పాటిద్దాం పలమనేరు: వేసవిలో ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఊర్లకు వెళుతున్నారు. ఇదే అదునుగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి ఆపై తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. ఆపై అదును చూసి తాళాలు పగులగొట్టి చోరీలకు తెగబడుతున్నారు. ఎక్కడికై నా బయటళి వెళ్లేవారు సంబంధిత స్టేషన్ పరిధిలో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానం రాకుండా.. పాత ఇనుము కొంటామని, స్టౌలు రిపేరు చేస్తామని, మంచాలు రెడీ చేస్తామంటూ రకరకాల వ్యాపారాల పేరిట కొందరు వీధుల్లో పగటిపూట సంచరిస్తారు. రెండుమూడు రోజులు తాళం ఉన్న ఇళ్లను పక్కాగా స్కెచ్ వేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు. కొందరు మహిళలు పగటిపూట యాచిస్తూ కూడా ఏయే ఇళ్లకు తాళాలున్నాయో చూసుకెళ్లి మగవారికి చెప్పడం.. ఆపై రాత్రుల్లో చోరీలు జరగడం సర్వసాధారణమైపోతోంది. ఇటీవల జరిగిన చోరీలు.. పట్టణ సమీపంలోని సాయినగర్ వద్ద ఓ ఉద్యోగి తన కుటుంబంతోపాటు కాకినాడకు వెళ్లాడు. ఇంటికి లాక్ ఉందని ముందుగా తెలుసుకున్న దొంగలు అర్ధరాత్రి పూట ఇంట్లోకి ప్రవేశించి చోరీకి తెగబడ్డారు. ఈ చోరీలో పెద్ద మొత్తమే పోయినట్టు తెలిసింది. ఆపై సీసీ కెమరాల్లో సైతం ముసుగు కప్పుకున్న దొంగల పుటేజీ కనిపించింది. తాజాగా మండల కేంద్రమైన బైరెడ్డిపల్లిలోనూ డోర్‌లాక్ చేసిన ఇంట్లో చోరీ జరిగింది. పక్కపక్కనే మూడు ఇళ్ల వారు ఊర్లకు వెళ్లారు. ఆ మూడు ఇళ్ల లాక్‌లు ముందుగా పసిగట్టిన దొంగలు ఓ ఇంట్లో చోరీ చేస్తుండగా వీధికుక్కల గుంపు అరవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. -
సమస్యలు అనేకం.. పరిష్కారం నామమాత్రం
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వ హించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అర్జీదారులు క్యూ కట్టారు. ఆలకించి దయచూపండయ్యా అంటూ పలువురు తమ గోడును కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్‌లకు విన్నవించుకున్నారు. అందిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి విచారణ చేసి తక్షణ చర్యలు చేపట్టాలని కలె క్టర్, జేసీ పలు శాఖల అధికారులను ఆదేశించారు. అవినీతిపై మహిళల ధ్వజం పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, గుండుగల్లు గ్రామానికి చెందిన అనిత, ప్రేమ, పుష్పవతి తదితర మహిళా సంఘాల సభ్యులు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలోని 45 మహిళా ఎస్‌హెచ్‌జీ సంఘాలకు గత ఏడాదిగా శాశ్వత సంఘమిత్ర లేరని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఉన్న సంఘమిత్ర అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నివేదిక ఇవ్వాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. -
నవోదయలో విశ్వం ఉత్తమ ఫలితాలు
తిరుపతి అర్బన్: జాతీయ స్థాయిలో 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతి విశ్వం విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. తాజాగా విడుదల చేసిన 11వ తరగతి ప్రవేశ పరీక్షలో విశ్వం విద్యార్థులు శ్రావ్య, రిచిత, ప్రవీణ్, గగన్ హర్ష, గణేశ్, హర్ష, హర్షిత, తనుష, కావ్య, అస్మా, లిఖిత, వరుణ్ సందేశ్, చరితార్థ, ప్రీతం, తేజస్వి, శ్రీదేవి తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను తిరుపతిలోని తమ విద్యాసంస్థలో సోమవారం విశ్వం విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్ రెడ్డి, సాయిగణేష్ స్కూల్ కరస్పాండెంట్ చెంచురెడ్డి అభినందించారు. అలాగే 6వ, 9వ తరగతి ప్రవేశ పరీక్షల్లో కే. గీతిక, సి.కార్తీక్, శ్రీహాన్రెడ్డి, పి.నిశాంత్, సి.హేమతేజ, హెచ్ అనన్య, ఎం.భావదీష్, ఆర్.నికోలస్ ఫ్రాంక్లిన్, కే.సిద్ధార్థ, బి.సాయి అభిరామ్, బి.హనీశ్రీ, ఎస్.ఎం.ఇలియాస్, కే. సాయికృష్ణ, లిఖిత, జోషిక తదితరులతో పాటు మొత్తం 56 మంది విశ్వం విద్యార్థులు నవోదయ విద్యాలయాలకు ఎంపికై నట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్. విశ్వనాథ రెడ్డి తెలిపారు. గత 36 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో నిర్వహించే సైనిక్ స్కూల్, నవోదయ, మిలిటరీ స్కూల్స్ పోటీ పరీక్షలకు విశ్వం విద్యా సంస్థలు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాయని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి నవోదయ, సైనిక్, ఇతర రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షల శిక్షణ వివరాల కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
భూగర్భ నీటి మట్టం పెంపే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రతి చెరువుకూ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇరిగేషన్, పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో భూగర్భ నీటి మట్టాన్ని పెంచడమే లక్ష్యంగా జలధార నీటి భద్రతలో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,106 చెరువులకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి మండలం పరిధిలో ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వాటికి నీటిని అందించే ఫీడర్ కాలువ లు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ అయ్యాయా లేదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆందోళన కలిగిస్తున్న భూగర్భ జలాలు గత ఆరు నెలల్లో జిల్లాలో భూగర్భ జలాలు సుమారు 6 మీటర్ల మేర తగ్గిపోవడం పట్ల కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే నెలల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార, జలహారతి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పనులు ప్రారంభించాలని తెలిపారు. ఫీడర్ కాలువల పున రుద్ధరణ పనులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో శ్రామికుల ద్వారా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. శ్రామికు లు పని చేయలేని క్లిష్ట ప్రాంతాల్లో ప్రత్యేక టీఆర్–27 నిధులతో యంత్రాల సహాయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్దపంజాణి, పల మనేరు, వి.కోట, బైరెడ్డిపల్లి, గంగవరం మండలా ల్లోని చెరువుల పరిస్థితిపై ఆరా తీశారు. సమావేశంలో డ్వామా పీడీ రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరాజు, గ్రౌండ్ వాటర్ డీడీ గోవర్దన్ పాల్గొన్నారు. ప్రతి చెరువుకూ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి -
నిలకడ లేని టమాట!
పలమనేరు: టమాట ధరలు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో అర్థంగాని పరిస్థితి ఏర్పడింది. ఈ వేసవిలోనైనా ధరలు ఆశాజనకంగా ఉంటాయని ఇక్కడి రైతులు ఆశించారు. ఆ మేరకు పలమనేఏరు టమాట మార్కెట్లో వారం క్రితం బాక్సు (14 కిలోలు) రూ.500కు చేరింది. మళ్లీ రోజు రోజుకూ ధర తగ్గుతూ వచ్చి సోమవారం నాటికి బాక్సు ధర టాప్ రేట్ రూ.200 కాగా సగటు ధర రూ.150 పడిపోయింది. పంట కోసం పెట్టిన ఖర్చు సైతం రైతులకు దక్కేలా లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. తగ్గిన ఎగుమతులు బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు పెద్దగా రావడం లేదు. ముఖ్యంగా తమిళనాడు వ్యాపారులు ఇక్కడి మార్కెట్‌కు వస్తేనే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, వెస్ట్‌బెంగాళ్ రాష్ట్రాల్లోనూ సరుకు ఉన్నట్టు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో టమాటాకు డిమాండ్ తగ్గడం, ఆయా రాష్ట్రాల్లోనే కావాల్సినంత సరుకు అందుబాటులో ఉంది. మరోవైపు లోకల్ సరుకు ఎక్కువగా మార్కెట్‌కు చేరుతోంది. ఫలితంగా డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా ఉండడమే ఇందుకు కారణమైంది. గత వేసవిలో టమాటాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు ఎక్కువగా ఎగుమతులు జరిగేవి. ఈదఫా తగ్గినట్టు తెలుస్తోంది. టమాట సాగు వివరాలు వేసవిలో టమాట సాధారణ సాగు 4 వేల హెక్టార్లు ప్రస్తుతం సాగైన పంట 3వేల హెక్టార్లు పలమనేరు మార్కెట్‌కు వస్తున్న లోకల్ సరుకు రోజుకి ఎనిమిది లోడ్లు -
జనగణనపై అపోహలొద్దు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియపై ప్రజలు అపోహలు చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియలో ప్రజలు పారదర్శకంగా సమాచారం అందించాలన్నారు. ఇళ్ల గణన ఈనెల 30 వరకు సాగుతుందన్నారు. ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం పూర్తిగా సురక్షితంగా, గోప్యంగా ఉంటుందన్నారు. జాతరకు అంతరాయం లేని విద్యుత్ చిత్తూరు కార్పొరేషన్: గంగమ్మ జాతర సందర్భంగా డివిజన్ పరిధిలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాన్స్‌కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. లైన్ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జూని యర్ లైన్మెన్లు కలిపి మొత్తం 30 మంది సిబ్బంది అమ్మవారిని ప్రతిష్టించిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరు 24 గంటల పాటు రెండు రోజులు అందుబాటులో ఉంటారన్నారు. నేడు కరెంటోళ్ల జనబాట చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ అమర్‌బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకుంటామని పేర్కొన్నారు. బడి బస్సుల తనిఖీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని విద్యాసంస్థల బస్సులపై సోమవారం జిల్లా రవాణాశాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న 928 పాఠశాలలు, కాలేజీ బస్సుల్లో ఇప్పటివరకు 520 బస్సులను మోటారు వాహన పరిశీలకులు తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 98 బస్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీటీసీ నిరంజన్‌రెడ్డి తెలిపారు. తనిఖీల సందర్భంగా విద్యార్థుల భద్రతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విద్యాసంస్థల యజమాన్యాలకు సూచించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పర్మిట్, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలు చెల్లుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అలాగే బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ డోర్ వంటి భద్రతా పరికరాలు ఉండాలన్నారు. డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెనన్స్, బ్యాడ్జి కలిగి ఉండాలని చెప్పారు. డయల్ యువర్ ఎస్ఈకి ఆరు సమస్యలు చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను సకాలంలో పరిష్కారించాలని ట్రాన్స్‌కో ఎస్ఈ అమర్‌బాబు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఎస్ఈ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి ఆరు ఫిర్యాదులు వచ్చినట్టు పేర్కొన్నారు. ఇందులో పలమనేరులోని గంటావూరు, వినాయకనగర్ ప్రాంతాల్లో ఓల్టేజీ సమస్య ఉందని వినియోగదారుడు భూపతినాయుడు, వెంకటరావ్ ఫిర్యాదు చేశారు. అలాగే గంగవరం మండం, కీల్లపట్ల పంచాయతీలో అనధికారికంగా సర్వీసును లైన్‌మన్ ఇచ్చారని సుబ్రమణ్యం తెలిపారు. దొంగతనం జరిగిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో మరొకటి ఇవ్వడం లేదని విజయపురం నుంచి శ్రీరాములరాజు తెలిపారు. దెబ్బతిన్న కరెంటు స్తంభాన్ని మార్పు చేయాలని కొత్తపల్లెమిట్టకు చెందిన స్వర్ణలత ఫిర్యాదు చేయగా, బంగారుపాళ్యంలో అనధికారికంగా ట్రాన్స్ఫార్మర్ పెట్టారని వాటి పై చర్యలు తీసుకోవాలని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వెకేషన్ కోర్టు షెడ్యూల్ విడుదల తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యవసర సివిల్ కేసులు దాఖలు చేసుకోవడానికి ఏర్పాటైన వెకేషన్ కోర్టు ఏ ఏ ప్రాంతా ల్లో, ఏ ఏ తేదీల్లో విధులు నిర్వహిస్తుందన్న షెడ్యూలను వెకేషన్ కోర్టు జడ్జి, మదనపల్లి రెండో అదనపు జిల్లా జడ్జి పీవీఎస్ సూర్యనారాయణమూర్తి సోమవారం విడుదల చేశారు. ఈనెల 13, 20 తేదీల్లో చిత్తూరులోనూ, ఈనెల 14, 25వ తేదీల్లో తిరుపతిలో, ఈనెల 12, 15, 19, 21, 26 తేదీలు మదనపల్లిలోను, ఈనెల 18వ తేదీ పీలేరులోనూ, ఈనెల 22వ తేదీ శ్రీకాళహస్తిలో విధులు నిర్వహించనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జడ్జి సూర్యనారాయణ మూర్తి వెకేషన్ కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు. -
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా చలపతిరావు
కార్వేటినగరం: ఏపీటీఎఫ్ చిత్తూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా కె.చలపతిరావు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆ సంఘ రాష్ట్ర ఎన్ని కల పరిశీలకులు ఎస్కే బాబు వేణుగోపాల్ తెలి పారు. చిత్తూరు మున్సిపల్ హైస్కూల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్ర అదనపు కార్యదర్శి చెంగల్రాయమందడి ఆధ్వర్వంలో ఎన్నికలు నిర్వహించగా.. జిల్లా అధ్యక్షుడి గా చలపతిరావు, కార్యదర్శిగా గిరి, గౌరవ అధ్యక్షులుగా కిరణ్, అసోసియేట్ అధ్యక్షులుగా ద్వారకనాథ్‌రెడ్డి, ఉపాధ్యాక్షుడుగా రుద్రమూర్తి, గోవర్దన్శెట్టి, సురేంద్ర, కృష్ణమూర్తి, కార్యదర్శులుగా లక్ష్మీపతి, దినకరన్, లత, సురేష్, వరదరాజు, రెడ్డివాణి, యుగంధి ఎన్నికై నట్టు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు తెలిపారు. గతంలో పనిచేసిన జిల్లా నాయకులు కిరణ్, చిట్టిబాబు సేవలను పలువురు వక్తలు కొనియాడారు. సీనియర్ నాయకులు గుర్రప్ప, మునికృష్ణయ్య, రాజేంద్రనాయుడు, త్యాగ రాజునాయుడు, పురుషోత్తం, శ్రీనివాసులు, బాబు, గుర్రప్ప పాల్గొన్నారు. చిత్తూరు జాతరకు పటిష్ట బందోబస్తు చిత్తూరు అర్బన్: చిత్తూరులో రెండు రోజుల పాటు నిర్వహించనున్న గంగజాతరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. సోమవారం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. నగరంలో దాదాపు 600 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులతో మాట్లాడి అన్ని వసతులు పరిశీలించామన్నారు. వివాదాలకు తావులేకుండా పండుగను సవ్యంగా జరుపుకోవడానికి అందరూ సహకరించాలని కోరారు. వీఆర్‌కు కుప్పం సీఐ చిత్తూరు అర్బన్: కుప్పం టౌన్ సీఐ శంకరయ్యను వీఆర్ (వేకెంట్ రిజర్వు)కు తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జ్గా రూరల్ సీఐ మల్లేష్యాదవ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా శంకరయ్యపై స్థానిక టీడీపీ నేతల ఫిర్యాదుతోనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
పోలీసు గ్రీవెన్స్‌కు 39 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 39 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. -
పింఛన్‌కు ఎన్నేళ్లు?
పింఛనో రామచంద్రా! ఇతను చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండ లం, ఎంకేపేటకు చెందిన శంకర్. కంటిచూపు లేదు. ఏ పనీ చేయలేడు. సదరం పరీక్షల్లో డాక్టర్లే స్వయంగా 100 శాతం వికలత్వం ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఏం లాభం ?.. గత రెండేళ్లుగా కొత్త పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయినా ఫలితం లేదు. దివ్యాంగుల వేదన కొత్త పింఛన్ల కోసం దివ్యాంగుల బాధలు అన్నీఇన్నీకావు. శారీరక వైకల్యం వల్ల కదల్లేని స్థితిలో ఉన్న వారు సైతం అధికారుల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక అధికారి దగ్గరకు వెళ్తే మరొకరి దగ్గరకు సాగనంపడమే తప్ప, ఏ ఒక్కరూ బాధ్యతగా దరఖాస్తులను పరిష్కరించకపోవడం వారిపాలిట శాపంగా మారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరు విషయంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోంది. తాజాగా జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని మరో డ్రామాకు తెరలేపింది. అర్హులకు సామాజిక భద్రత కల్పిస్తామని గొప్పలు చెబుతున్నా, కొత్త దరఖాస్తుల స్వీకరణకు సచివాలయాల్లో ఇప్పటికీ ఆప్షన్లు ఇవ్వకపోవడం అభాగ్యుల పాలిట శాపంగా మారింది. కొత్త పింఛన్ల డ్రామా పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లపై సరికొత్త డ్రామాలకు తెరలేపుతోంది. పింఛన్ల కోసం అర్హులు కళ్లు కాయలు కాచేలా ఎదు రు చూస్తున్నా పట్టించుకోకుండా కాలయాపన చేస్తోంది. వేలాది మంది అర్జీలు అందజేస్తున్నా వాటిని బుట్టదాఖలు చేస్తూ అభాగ్యుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా.. వృద్ధాప్యం మీద పడి, కళ్లు సరిగ్గా కనిపించక, చేతులు వణుకుతున్నా.. ఏదో ఒక రోజు పింఛన్ రాకపోతుందా అనే ఆశతో జిల్లాలో వేల మంది వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక దానిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బడ్జెట్ సాకులు, సాంకేతిక కారణాలు చూపిస్తూ వాయిదాల పర్వాన్ని నడుపుతున్నారు. జూన్ 12 నుంచి అంట! చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాజాగా మరో కొత్త డ్రామాకు తెరలేపింది. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు అంటూ బుకాయిస్తోంది. దీనిపై దివ్యాంగులు రగిలిపోతున్నారు. నాడు పండుగలా పింఛన్ల పంపిణీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సామాజిక పింఛన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేవారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టిన తర్వాత అర్హులైన వారు పింఛన్లకు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఉండేది. ఏటా జనవరి, జూలై నెలల్లో ప్రత్యేకంగా కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించేవారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేసేవారు. వలంటీర్ లబ్ధిదారుల ముంగిటకే పింఛన్లను చేరవేసేవారు. పెండింగ్ దరఖాస్తుల వివరాలు కుప్పం 1,215 పలమనేరు 989 నగరి 864 చిత్తూరు 1,245 గంగాధరనెల్లూరు 948 పూతలపట్టు 1,142 -
ఆక్రమణదారులు
నగరి : వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైతులు వినియోగిస్తున్న గ్రావెల్ రోడ్డును ఆక్రమిస్తున్నారంటూ స్థానిక రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని కాకవేడు మిట్టిండ్లు నుంచి ఒంటిండ్లుకు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మిట్టిండ్లుకు చెందిన టీడీపీ నేతలు వాసునాయుడు, భాస్కర్ జేసీబీతో రోడ్డును చెక్కించి మట్టిని తమ భూముల్లో కలుపుకుంటున్నారని ఆరోపించారు. రైతులు, గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ మాజీ వైస్చైర్మన్వెంకటరత్నం రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నాయకులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిట్టిండ్లు–ఒంటిండ్ల మధ్యనున్న ఈ గ్రావెల్ రహదారి ద్వారా స్థానిక రైతులు తమ వ్యవసాయ భూములకు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో మామిడి తోటలు అధికంగా ఉండడంతో ట్రాక్టర్లు, కాయలు తరలించే లారీలు ఈ మార్గాన్నే వినియోగిస్తున్నాయని వివరించారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న మామిడి తోటల యజమానులైన టీడీపీ నేతలు రహదారిని ఆక్రమించుకోవడమే కాకుండా, కొండనీరు పారే కాలువకు సంబంధించిన నీటి పైపులను కూడా ముందుకు జరిపి మరింత స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ‘మా ప్రభుత్వం.. మా ఇష్టం’ అంటూ సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని స్థానిక రైతులు, వైఎస్సార్సీపీ నేతలు అధికారులకు సూచించారు. -
నారాయణ పాఠశాలను సీజ్ చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని మురుగానపల్లి వద్ద అనుమతులు లేని నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీ ణ్ డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు సోమ వారం డీవైఈవో కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మురుగానపల్లిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తు న్న నారాయణ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాదిగా అనుమతులు లేకుండా నారాయణ పాఠశాల నడుస్తున్నా విద్యాశాఖ అధి కారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వసతులు లేవు.. ఫీజులు మాత్రం వేలల్లో! జిల్లా కేంద్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయన్నారు. కనీసం ప్లే గ్రౌండ్, సరైన క్లాస్ రూమ్స్ ఇతర మౌలిక వసతులు లేకపోయినా అనుమతులు ఎలా ఇస్తున్నారని విద్యాశాఖ అధికారులను ఏఐఎస్ఎఫ్ నాయకులు నిలదీశారు. విద్యార్థులను మోసం చేస్తూ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. మురుగానపల్లి నారాయణ పాఠశాలతో పాటు, నగరంలో అనుమతులు లేని అన్ని కార్పొరేట్ పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మనోజ్, లిఖిత్, లోహిత్ పాల్గొన్నారు. -
స్వచ్ఛతలో నిలబడతారా..?
మన ఊరిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం స్వచ్ఛ సర్వేక్షణ్. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 4,432 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుద్ధ్యం మెరుగుపై స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపికై న ఉత్తమ మునిసిపాలిటీలకు కేంద్రం నిధులను కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ పోటీల్లో నిలబడేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు అర్బన్ : జిల్లాలోని ఇతర మునిసిపాలిటీలతో పోలిస్తే పారిశుద్ధ్య నిర్వహణ చిత్తూరు నగరంలో కాస్త మెరుగ్గానే కనిపిస్తుంది. ఇదే సమయంలో మురికివాడల్లో కనీస వసతులు కల్పించడంలో అధికారులు చోద్యంచూస్తున్నారు. నగరాన్ని ఓడీఎఫ్ (బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధం)గా అమలు అంతంత మాత్రంగానే ఉంది. పీసీఆర్ కళాశాల, కట్టమంచి చెరువు తదితర ప్రాంతాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతో ఓడీఎఫ్ సమస్య ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఇక నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో రంగులు అద్దడం, మొక్కలు ఏర్పాటు చేయడం, చిన్నపాటి ఉద్యానవనాలు నిర్మిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నారు. పడిలేస్తూ.. గతేడాది జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో దేశంలో చిత్తూరుకు 273వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు వచ్చింది. గతం నేర్పిన పాఠాలతో ఈసారి చిత్తూరును ఉత్తమ స్థానంలో నిలిపేందుకు అధికారులు ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏమిటి, ఎలా చేస్తున్నారు, నగరం సుందరంగా ఉండాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనికితోడు వాణిజ్య భవనాలు, కల్యాణ మండపాలు, కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, ఇతర సూపర్ బజార్ల వద్ద తడి–పొడి చెత్తను వేరు చేసి కార్మికులకు అందజేసేలా చైతన్యం కల్గిస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్‌కు ప్రత్యేకాధికారిగా కలెక్టర్ సుమిత్‌కుమార్ వ్యవహరిస్తుండడంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో సలహాలు ఇస్తూ అధికారులను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నగరాన్ని టాప్–10లో నిలబెడుతుందని ఆశతో చూస్తున్నారు. వచ్చేనెల ఫలితాలు స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలు ముగింపుదశలో ఉన్నాయి. అధికారులు నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలకు ఏ మేరకు చేరువయ్యాయో..? తెలుసుకోవడానికి రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వచ్చేవారం కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు సైతం నగరంలో పర్యటించి, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నాయి. వచ్చేనెల మొదటి వారంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు భావిస్తున్నారు.స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చిత్తూరు స్థానం ఇలా.. సంవత్సరం జాతీయ ర్యాంకు 2020–21 81 2021–22 137 2022–23 153 2023–24 143 2024–25 273మా ప్రయత్నం చేస్తున్నాం ఈ పోటీల్లో చిత్తూరును ఉత్తమ స్థానంలో నిలపడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. మొబైల్ టాయ్లెట్లు పెట్టాం. పచ్చటి మొక్కలతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నాం. ఎందుకూ పనికిరాని టైర్లు, ఇతర వస్తువులతో కళాఖండాలు, ఆకృతులు తయారుచేసి ప్రజల సందర్శన కోసం పెడుతున్నాం. మాకై తే మెరుగైన స్థానం వస్తుందని ఆశిస్తున్నాం. ఫలితం ఎలా ఉన్నా చిత్తూరును వన్ ఆఫ్ ది బెస్ట్ మునిసిపాలిటీగా చేస్తాం. – పి.నరసింహప్రసాద్, కమిషనర్, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ -
దామిని ఉండగా దిగులెందుకు
చిత్తూరు కలెక్టరేట్: వాతావరణంలో మార్పులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కడో ఒకచోట పిడుగులు పడతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిడుగుపాటు వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశాలుంటాయి. ఎక్కువగా పశువుల కాపరులు, పొలాల్లో పని చేసే వ్యవసాయ కార్మికులు, రైతులు ప్రాణాలు కోల్పోతుంటారు. మూగజీవాలు సైతం మృత్యువాత పడుతుంటాయి. సాయంత్రం వేళల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పిడుగుల ముందస్తు సమాచారం తెలుసుకునే యాప్‌లపై అవగాహన ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిడుగులు పడే సమాచారాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీయోరాలజీ ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ అందుబాటులోకి తీసుకొచ్చిన ‘దామిని, వజ్రపాత్’ యాప్‌లతో తెలుసుకోవచ్చు. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉండే ఆప్షన్లను అనుసరించి ఏ ప్రాంతంలో పిడుగు పడుతోంది, మనం ఎంత వరకు సురక్షితం అనే వివరాలు తెలుసుకోవచ్చు. చాలా మందికి అవగాహన లేక వీటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ జాగ్రత్తలు అవసరం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద, ఎత్తైన ప్రదేశాల్లో ఉండరాదు. వ్యవసాయ పంపు సెట్లకు దూరంగా ఉండాలి. తప్పని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తే మోకాళ్ల మధ్య తల ఉంచి, రెండు చేతులతో చెవులు మూసుకుని భూమికి తగలకుండా కూర్చోవాలి. పశు సంపదను సురక్షిత ప్రాంతాల్లో కట్టేయాలి. ఆరు బయట ప్రదేశాలు, రేకుల షెడ్లు, వరండాలో ఉండొద్దు. ఇళ్లలో ఉన్నవారు తలుపులు, కిటికీలు మూసేసి, విద్యుత్తు సరఫరాను ఆపేయాలి. పరిహారం పొందడం ఎలా? పిడుగుపాటుతో మృతి చెందినా, లేదాగా యపడిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు నష్టపరిహారం అందిస్తున్నాయి. మృతుడి వివరాలు, పోస్టుమార్టం నివేదిక, ఎఫ్ఐఆర్ తదితర వివరాలతో తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వారు పరిశీలించిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు. వాటిని అధికారులు విచారించి అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదించి మృతుడి వయసు ఆధారంగా నిబంధనల మేరకు నష్టపరిహారం చెల్లిస్తారని రెవెన్యూ అధికారులు వెల్లడిస్తున్నారు. కుప్పం, పలమనేరు పరిసర ప్రాంతాల్లో గతంలో వర్షం కురుస్తున్న సమయంలో పిడుగులు పడి రైతులు మృతిచెందారు. అలాగే నగరి, గంగాధరనెల్లూరు పరిసరాల్లో గుట్టలపై మేత మేస్తున్న గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. ఇంకా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పిడుగుపాటుతో పలువురు గాయపడ్డారు. పలు చెట్లు కాలిపోయాయి. ఇలా వర్షాకాలంలో కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, సెల్ ఫోన్ టవర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట పిడుగులు పడడం సర్వసాధారణం. ఈ క్రమంలో పిడుగు పడే ప్రాంతాల గురించి తెలియజేసే దామిని, వజ్రపాత్ యాప్‌లను ప్రభుత్వం తీసుకువచ్చింది. వీటిపై అవగాహన కలిగి ఉంటే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
కోడెగిత్తల జోరు
బంగారుపాళెం మండలంలోని గుంతూరు దళితవాడలో ఆదివారం పశువుల పరుగు పందేలు హోరెత్తాయి. ఇక్కడికి పరిసర ప్రాంతాల నుంచి యజమానులు తమ పశువులను టెంపోల ద్వారా తీసుకువచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరుగు పందేలు నిర్వహించారు. పరుగులు తీస్తున్న కోడె గిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో పలువురు యువకులు స్వల్ప గాయాలయ్యాయి. పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. పశువుల పరుగు పందేలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో గుంతూరు దళితవాడ జనసంద్రంగా మారింది. – బంగారుపాళెం -
హ్యాండ్‌బాల్ విజేతలుగా చిత్తూరు, పశ్చిమగోదావరి
కదిరి అర్బన్: పట్టణంలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న 48వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ జూనియర్ బాలికలు, బాలుర చాంపియన్‌షిప్ పోటీల్లో బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి, బాలుర విభాగంలో చిత్తూరు జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా, తృతీయ స్థానంలో విజయనగరం జిల్లా జట్టు నిలిచాయి. బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా, తృతీయ స్థానంలో విజయనగరం జట్లు సాధించాయి. గెలుపొందిన జట్లకు చాంపియన్ ట్రోఫీని బహూకరించారు. గంగజాతరకు పటిష్ట భద్రత తిరుపతి క్రైం : తిరుపతి గంగమ్మ జాతరకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్టు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు తెలిపారు. జాతర ప్రాంగణంలో జేబుదొంగలు, గొలుసు దొంగలు సంచరించే అవకాశాలు ఉన్నందున భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు బంగారు ఆభరణాలు అధికంగా ధరించి రావద్దని, విలువైన వస్తువులను ఎల్లప్పుడూ తమ కంటికి కనిపించేలా జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. -
వ్యాపారులు, అధికారుల కుమ్మక్కు
మామిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలడానికి వ్యాపారులతో పాటు అధికారులు కుమ్మక్కు కావడమే ప్రధాన కారణం. ధరలను ఇష్టారాజ్యంగా ప్రకటిస్తున్న వ్యాపారులపై మార్కెటింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా తనిఖీలు చేయడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. – టి.కేశవులు, అధ్యక్షుడు, మామిడి రైతు సొసైటీ, పుత్తూరు కఠిన చర్యలు తప్పవు జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను నియంత్రిస్తే కఠిన చర్యలు తప్పవు. మార్కెట్ యార్డుల్లోని సెక్రటరీలు ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ధరలను నియంత్రించే వ్యాపారులను యార్డు నుంచి తొలగిస్తాం. వారి లైసెన్సులను సైతం రద్దు చేస్తాం. – టి.సురేంద్రబాబు, ఏడీ, మార్కెటింగ్, తిరుపతి -
గంగమ్మ ఆభరణాల ప్రదర్శన
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని గీతామందిరంలో ఆదివారం నడివీధి గంగమ్మ అలంకరణ ఆభరణాలను జాతర వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీ.కే.బాబు ప్రదర్శించారు. సీకే బాబు దంపతులు రూ.3.60 లక్షలు విలువ చేసే బంగారు బొట్టు గుండ్లను తయారీ చేయించారు. అలాగే సీఆర్సీ రవి రూ.50 వేలు విలువ చేసే ఫ్యాన్సీ జ్యువెలరీ, చంద్రశేఖర్‌నాయుడు, సతీష్ రూ.1.20 లక్షలతో మైక్రో గోల్డ్ ప్లేటింగ్ చీర, ప్రముఖ వ్యాపారవేత్త వేమారెడ్డి కుటుంబ సభ్యులు రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు గుండ్లు బహూకరించారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళ, బుధవారాల్లో అత్యంత వైభవోపేతంగా జరిగే నడివీధి గంగమ్మ జాతర వేడుకల్లో ప్రజలు ఉత్సహంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు సీకే లావణ్య, వెంకటేష్, గుణ పాల్గొన్నారు. -
అన్షుమాలికకు అత్యున్నత డిగ్రీ
నగరి: అమెరికాలోని బ్లూమింగ్టన్ ఇండియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న మాజీ మంత్రి ఆర్కేరోజా కుమార్తె అన్షుమాలికకు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ విత్ హైఎస్ట్ డిస్టింక్షన్ పట్టా అందజేసింది. అన్షుమాలిక అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ‘‘హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డు సీనియర్’’ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా ఘనత సాధించడం, యూనివర్సిటీలో గౌరవ ప్రదర్శనగా ఉంచే బోర్డులో ఉత్తమ విద్యార్థినిగా ఈమె పేరు లిఖించిన బంగారు ఫలకం పొందుపరచడం విధితమే. అక్కడ కంప్యూటర్స్ సైన్స్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో ప్రతిభగల వారికి అందించే గ్రాడ్యుయేట్ విత్ హైఎస్ట్ డిస్టింక్షన్ పట్టాను యూనివర్సిటీ ఆమెకు అందజేసింది. దీంతో ఆమె ఘనత మరో అడుగు ముందుకు వేసింది. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
పత్తాలేని పల్లె పాలన
సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వారికి పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వలేదు. దీంతో పల్లె పాలన స్తంభించింది. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. చెక్ పవర్ లేకపోవడంతో నిధుల విడుదలకు అవకాశం లేకుండా పోతోందని ప్రత్యేక అధికారులు వాపోతున్నారు. దీనికితోడు ఒక్కో అధికారికి 4 నుంచి 5 పంచాయతీలను అప్పగించడంతో విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. – కార్వేటినగరం మండలం చింతతోపు ఎస్టీ కాలనీలో దాదాపు 60 కుటుంబాలున్నాయి. ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరు మోటారు మరమ్మతులకు గురికావడంతోనే సమస్య నెలకొందని స్థానికులు చెబుతున్నారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయ బావులు, బోర్లు, చేతిపంపుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. సమస్య గురించి పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. – తవణంపల్లె మండలంలో పారిశుద్ధ్యం లోపించింది. పలు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీనికితోడు దుర్గంధం వెదజల్లుతుండడంతో ముక్కులు మూసుకోవాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఆలయాల ముందు వ్యర్థపు నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని, ఆ నీటిలోనే నడుచుకుంటూ ఆలయంలోకి వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. అధికారులకు చెప్పినా ఫలితం లేదని వాపోతున్నారు. చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో 622 పంచాయతీలు ఉన్నాయి. వాటికి 145 మంది ప్రత్యేకాధికారులను నియమించారు. ఒక అధికారికి 4 నుంచి 5 పంచాయతీల బాధ్యతలు అప్పగించడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడం, సచివాలయాల వ్యవస్థకు ప్రాధాన్యత తగ్గించడంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు సతమతమవుతున్నారు. చిన్నచిన్న పనులకు కూడా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీల్లో కనీస వసతులు కరువై ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచుల పదవీకాలం కూడా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా సర్పంచుల స్థానంలో మండల స్థాయి అధికారులైన తహసీల్దార్, ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్, ఎంఈవో, ఈవోపీఆర్డీ, వ్యవసాయ, హార్టికల్చర్, ఐసీడీఎస్, పంచాయతీరాజ్ ఏఈ, డీఈ, వెటర్నరీ అసిస్టెంట్లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. చెక్‌పవర్ లేక అవస్థలు పల్లెల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కనుసన్నల్లోనే ప్రత్యేక అధికారులు పాలన సాగిస్తున్నారు. తాము చెప్పిన పనులనే చేయాలని, సూచించిన సమస్యలను మాత్రమే పరిష్కరించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారులకు ప్రత్యేక అధికారాలు కేటాయించిన ప్రభుత్వం వారికి పవర్ లేకుండా చేసింది. బాధ్యతలు స్వీకరించి నెల రోజులు అవుతున్నా నేటికి నిధులు డ్రా చేసేందుకు అధికారం ఇవ్వలేదు. సాంకేతికంగా వీరి ఆధార్, మొబైల్ నంబరు అప్డేషన్ ఉండడంతో వారికి ఇంకా డ్రాయింగ్ పవర్ రాలేదు. దీంతో పరిపాలన, అభివృద్ధి పనులు, ఇతర పాలనా పరమైన నిర్వహణను గాలికొదిలేశారు. సాధారణంగా ప్రతి పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలి. పూర్తి స్థాయిలో అధికారులు లేకపోవడంతో ఒక్కొక్క అధికారికి 4 నుంచి 5 పంచాయతీలు కేటాయించారు. దీంతో వీరు సొంత శాఖ బాధ్యతలు చూడడంతో పాటు తమకు కేటాయించిన గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, ఇతర సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి బాధ్యతలు చూడాల్సి ఉంది. అదనపు భారం కారణంగా అవన్నీ వారు చూడలేకపోతుండడంతో పంచాయతీల్లో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రజల గగ్గోలు ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన గ్రామాలకు మొక్కుబడిగా వెళ్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, వి.కోట, పులిచెర్లలో తాగునీటి తీవ్రంగా సమస్య ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉంది. అవే కాకుండ పారిశుద్ధ్య లోపం, వీధి దీపాల నిర్వహణ, కనీసం బోర్ మోటార్ మరమ్మతులు తదితరాల గురించి పట్టించుకునే నాథుడే లేడు. పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పటికీ వారికి రొటీన్ కార్యక్రమాలే సరిపోతున్నాయి. క్వారేటినగరం ఎస్టీ కాలనీలో చేతిపంపు వద్ద నీటి కోసం తిప్పలు తాగునీటి కోసం ప్రజల ఇబ్బందులు, లోపించిన పారిశుద్ధ్యం -
మూడు ఎకరాల చెరుకుతోట దగ్ధం
● రూ.4.5 లక్షల ఆస్తి నష్టం ● న్యాయం చేయాలని రైతు గురుమూర్తి వేడుకోలు నగరి : మండలంలోని దామరపాకం పంచాయతీ టీవీకండ్రిగ గ్రామంలో ఆదివారం రైతు గురుమూర్తికి చెందిన మూడు ఎకరాల చెరుకుతోట అగ్నికి ఆహుతైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట కాలిపోవడంతో సుమారు రూ.4.5 లక్షల వరకు నష్టం సంభవించినట్టు రైతు ఆవేదనవ్యక్తం చేస్తున్నాడు. స్థానికుల కథనం మేరకు.. చెరుకుతోటలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే తోట మొత్తం వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే మూడు ఎకరాల్లోని చెరుకు పూర్తిగా దగ్ధమైంది. రైతు గురుమూర్తి మాట్లాడుతూ అప్పు చేసి చెరుకు పంట సాగు చేశానని తెలిపారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉందన్నారు. ఎకరాకు సుమారు 15 టన్నుల చొప్పున మొత్తం 45 టన్నుల చెరుకు కాలిపోయిందని, రూ.4.5 లక్షల వరకు నష్టం సంభవించిందన్నారు. అధికారులు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఆకతాయిలు బీడీ, సిగరెట్ కాల్చి పడేయడం వల్ల మంటలు వ్యాపించాయా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా అన్న విషయం తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు. తమిళనాడు బియ్యం స్వాధీనం పెనుమూరు(కార్వేటినగరం): తమిళనాడు నుంచి తరలిస్తున్న రూ.2.20 లక్షల విలువ జేసే బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసులు ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 6 గంటలకు మండల పరిధిలోని మఠంపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. మూడు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించాయన్నారు. వాటిని ఆపి తనిఖీ చేయగా అందులో రూ.2.20 లక్షల విలువ జేసే 12.25 టన్నుల తమిళనాడు బియ్యం బయట పడ్డాయన్నారు. బియ్యంతో పాటు పట్టుబడిన ఎన్.రామచంద్ర, ఎ.చలపతి, కె.రెడ్డెప్ప, సి.భానుమూర్తి తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో పేదల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రం కోలార్‌లోని రైస్ మిల్లులకు తరలించి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు కూడా ఈ అక్రమ రవాణాలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. గతంలో కూడా నిందితులపై జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో అక్రమ బియ్యం రవాణా కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిందితులు అక్రమ రవాణాకు వాడిన టాటా హెక్సా కారు, టాటా 407 వాహనం, ఐషర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,512 మంది స్వామిని దర్శించుకున్నారు. 38,988 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా భక్తులకు కేటాయించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని వెల్లడించారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని, గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ అమర్‌బాబు తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలపై ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్ చేయాలని వివరించారు. నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు నేరుగా తనను కలిసి సమస్యలు తెలియజేయవచ్చని వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. విజయ్ అభిమానుల సంబరాలు నగరి: తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీనటుడు, తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు సి.జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయ డంతో నగరిలోని ఆయన అభిమానులు ఆదివారం సంబరాలు చేసుకున్నారు. సత్రవాడ, కేవీపీఆర్‌పేట, ఏకాంబరకుప్పం, పుదుపేట ప్రాంతాల్లో ప్రమాణ స్వీకారాన్ని టీవీలో వీక్షిస్తూ టపాకాయలు పేల్చారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. టీవీకే పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే శేఖర్ మాట్లాడుతూ తమిళనాడులో విజయ్ సర్కార్ ప్రారంభమైందని, ప్రజల ఆశయాలను నెరవేర్చే నాయకుడిగా విజయ్ ఎదుగుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. అభిమానుల ఉత్సాహం నగరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర యువత అధ్యక్షుడు మొహమ్మద్ సఖీ, అభిమాన సంఘం నేతలు సెల్వన్, రాజ, సంజీవి, ఏలుమలై, షణ్ముగం, కార్తి, వేణు, హరోన్, చని, వేను, శరవణ, శేఖర్, ధనరాజ్, హరి, కీర్తి, విజయ్ పాల్గొన్నారు. -
మూడు ఎకరాల చెరుకుతోట దగ్ధం
నగరి మండలం టీవీకండ్రిగలో మూడు ఎకరా ల్లో చెరుకుతోట దగ్ధమైంది. రూ.4.5 లక్షల వరకు నష్టం వాటిల్లింది.ఒక్కసారిగా పడిపోయిన మామిడి ధరలు సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026ఆశనిరాశల నడుమ మామిడి రైతులు ఊగిసలాడుతున్నారు. ఒక ఏడాది దిగుబడి బాగుంటే గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. మరో ఏడాది రేటు అధికంగా ఉంటే సక్రమంగా పంట చేతికందక దెబ్బతింటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తోటలు కళకళలాడుతున్నప్పటికీ ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు మండీ యజమానుల మాయాజాలమే కారణంగా ఆరోపిస్తున్నారు. సిండికేట్‌గా మారి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో మార్కెటింగ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. దామలచెరువు, తిరుపతి, చిత్తూరు, బంగారుపాళెం, పాకాల, పుత్తూరు చందూర నిలువు దోపిడీపై ఆగ్రహం ఏడాది పాటు మామిడి చెట్లను సంరక్షించుకుంటూ, వివిధ రకాల వాతావరణ సమస్యలను ఎదుర్కొని, చీడపీడలకు రూ.లక్షలు ఖర్చుచేసి పండించిన పంటకు యజమానులైన తాము ధరను నిర్ణయించే స్థితిలో లేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్ యార్డ్ వ్యాపారులు నిలువునా దోచుకొంటున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని ఆక్రోశిస్తున్నారు. అధికారులు సైతం మామూళ్లు దండుకుని తమను రోడ్డుపాలు చేస్తున్నారని వాపోతున్నారు. రైతుల పక్షాన నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. కనీసం జ్యూస్ ఫ్యాక్టరీలను త్వరగా తెరిపిస్తే నేరుగా సరుకును అమ్ముకొనే అవకాశం కలుగుతుందని కోరతున్నారు. ఆదిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేడింగ్ చేస్తున్న కూలీలుపుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మామిడి. సుమారు 2.65 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 70శాతం నుంచి 75 శాతం వరకు పంట దిగుబడి రావడంతో రైతులు కొంత ధైర్యంగా కోతలకు ఉపక్రమించారు. అయితే 10 రోజుల వ్యవధిలో ఒక్కసారిగా మామిడి ధరలు పతనమవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మార్కెట్ యార్డుల నుంచి వివిధ రకాల మామిడిని తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, గుజరాజ్, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. దీంతో మామిడి సీజన్ ప్రారంభంలో ధర ఆశాజనకంగా ఉంటుంది. అందులో భాగంగానే సీజన్ ప్రారంభంలో బేనీషా టన్ను ధర రూ.70 వేలు పలకగా, ప్రస్తుతం రూ.25 వేలకి పడిపోయింది. జిల్లా మొత్తం మీద మామిడి దిగుబడిలో 75 శాతంతో అగ్రభాగాన నిలిచే తోతాపూరి తొలుత టన్ను ధర రూ.25 వేల నుంచి రూ.30 వేలు పలికింది. అయితే ప్రస్తుతం రూ.9 వేలకు తగ్గిపోవడంతో రైతులు నివ్వెరపోతున్నారు. అలాగే చందూర రూ.30 వేల నుంచి రూ.14 వేలకి పడిపోయింది. దీనిపై ప్రశ్నించిన రైతులకు నెల్లూరు, విజయవాడ మార్కెట్లలో డిమాండ్ తగ్గిందని వ్యాపారులు కుంటి సాకులు చెబుతున్నారు. సాధారణంగా పల్ప్ ఫ్యాక్టరీలు తెరవక ముందు తోతాపూరి ధరలు ఆశాజనకంగా ఉంటాయి. ఫ్యాక్టరీలు తెరిచాక అన్ని ప్రాంతాల నుంచి సరుకు ఎక్కువగా రావడం వల్ల కాస్త ధర తగ్గడానికి అవకాశముంటుంది. ఓ పక్క ఫ్యాక్టరీలు తెరవక ముందే తోతాపూరితో పాటు అన్ని రకాలకు ధరలను సగానికి సగం తగ్గించేశారు. దీంతో మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బైరెడ్డిపల్లెలో రెండిళ్లలో చోరీ
బైరెడ్డిపల్లె : మండల కేంద్రమైన బైరెడ్డిపల్లెలో శనివారం రాత్రి దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ చందన ప్రియ కథనం మేరకు.. బైరెడ్డిపల్లె ఇందిరమ్మ కాలనీలో అద్దెకు ఉంటున్న కరీంసాబ్ కుమారుడు సాధిక్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం వెళ్లాడు. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.3.20 లక్షల నగదు, 35 గ్రాముల బంగారు, 100 గ్రాముల వరకు వెండి నగలు చోరీ చేశారు. బాధితుడు సాధిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే బీసీ కాలనీలో ఉన్న మణి ఇంట్లో రూ.50 వేల నగదు చోరీ అయినట్లు గుర్తించారు. రాత్రిళ్లు ఇంట్లో లేనిప్పుడు పోలీసులకు లేదా సమీపంలో ఉన్న బంధువులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధురాలి నుంచి గొలుసు అపహరణ బంగారుపాళెం : మండల కేంద్రమైన బంగారుపాళెం ఎన్పీఎస్ కాలనీలో ఆదివారం దుండగుడు వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. కాలనీలో నివాసముంటున్న చెంగయ్య భార్య వెంకటమ్మ(91) ఇంటి బయట కూర్చుని ఉంది. గుర్తుతెలియని వ్యక్తి తలకు హెల్మెట్ పెట్టుకుని ఎఫ్‌జెడ్ మోటర్ సైకిల్‌పై వచ్చాడు. ఇక్కడ జగదీష్ ఇంటి అడ్రస్ చెప్పాలని వెంకటమ్మను అడిగాడు. ఇంతలోనే ఉన్నఫళంగా ఆమె మెడలో ఉన్న 20 గ్రాముల బంగారు గొలుసును లాక్కున్నాడు. ఆమె తేరుకునేలోపే అక్కడి నుంచి పారిపోయాడు. గొలుసు విలువ రూ.3 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. బాధితురాలి కుమారుడు పార్థసారథి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం తిరుమల: గుంటూరుకు చెందిన కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కారుమూరి శ్రీనివాసులు రెడ్డి ఆదివారం బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాత విరాళం డీని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యులు నన్నపునేని సదాశివరావు పాల్గొన్నారు. 31 వరకు పోలీస్ యాక్ట్ రేణిగుంట: రేణిగుంట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమ ల్లో ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివా రం రాత్రి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు శాఖ నుంచి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర గుంపులుగా నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. -
విత్తనమేదీ..!
జిల్లాలో రెండేళ్లగా రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రభుత్వం నుంచి సాయం లేదు.. వేరుశనగ విత్తనాల పంపిణీ కూడా లేదు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు దుక్కిదున్ని పొలాల ను సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ధర నిర్ణయం కాకపోవడంతోనే విత్తనాలు పంపిణీ చేయలేదని అధికారులు సాకు లు చెబుతున్నారు. పంపిణీ ఆలస్యమైతే సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపుతుందని, పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాణిపాకం: జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 70 వేల హెక్టార్లు. అందులో వేరుశనగ సాగు విస్తీర్ణం 33 వేల హెక్టార్లు. సుమారు 80 వేల మంది రైతులు ఈ పంటను సాగుచేస్తారు. గతేడాది ఖరీఫ్‌లో వేరుశనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయలేదు. పెట్టుబడి సాయం కూడా అందలేదు. దీంతో 7 వేల హెక్టార్లల్లో మాత్రమే సాగు చేపట్టారు. ధర నిర్ణయించలేదని సాకులు విత్తనాల కేటాయింపు జరిగి నెల రోజులు కావస్తున్నా ధర నిర్ణయంలో జాప్యం చోటు చేసుకుంటోంది. దీని కారణంగా ఈ ఖరీఫ్‌కు కూడా విత్తనాల పంపిణీ ఆలస్యం కానుంది. అలాగే ఇతర కారణాల వల్ల విత్తనాలను జూన్ మొదటి వారంలో పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో పంపిణీ చేస్తే రైతులు కాయలు వలుచుకుని విత్తనాలు వేసేందుకు అవకాశం ఉంటుంది. ముందస్తు ప్రణాళికలేవీ..? ఈ సారి కూడా అధికారులు ఖరీఫ్ సాగుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయలేదు. ఈ ఏడాది వర్షాలు లేవని.. వేరుశనగ విత్తన పంపిణీ ఉండకపోవచ్చునని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రెండు నెలల ముందే వెల్లడించారు. దీనిపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో ప్రభుత్వం స్పందించింది. జిల్లాకు 27 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించింది. జిల్లాకు 38 క్వింటాళ్లకు పైగా విత్తనాలు అవసరమని రైతులు అంటున్నారు. అప్పుడే రైతుకు ఒక్కో బ్యాగు చొప్పున కాయలు అందుతాయని చెబుతున్నారు. లేనిపక్షంలో కాయ ల కోసం కుస్తీ పడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం -
పలమనేరు మాజీ సీఐ నరసింహరాజుకు తీవ్రగాయాలు
పలమనేరు: కడపలోని అల్మాస్‌పేట సర్కిల్లో శనివారం ఇరువర్గాల మధ్య అల్లర్లు జరిగాయి. ఇందులో గతంలో పలమనేరులో సీఐగా పనిచేసి బదిలీపై కడప తాలూకా స్టేషన్‌కు వెళ్లిన నరసింహరాజుకు తీవ్రగాయాలైనట్టు తెలిసింది. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఘనంగా కియా సిరోస్ 2026 ఆవిష్కరణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): కియా ఇండియా సంస్థకు చెందిన నూతన కియా సిరోస్ 2026 కారును శనివారం చిత్తూరు నగరం ఇరువారంలోని హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా షోరూంలో ఘనంగా ఆవిష్కరించారు. షో రూం మేనేజింగ్ డైరెక్టర్ సి.జగన్నాథ రెడ్డి మాట్లాడుతూ కియా నుంచి విడుదలైన సిరోస్ 2026 మోడల్ కారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలతో రూపొందించబడిందన్నారు. వినియోగదారుల సౌకర్యా న్ని దృష్టిలో పెట్టుకుని పలు నూతన ఫీచర్లను తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు చెరకు నిరంజన్, సి.భారతి, సి.హోషిమారెడ్డి, సి.ఆశిష్ రెడ్డి పాల్గొన్నారు. -
ఫ్రీ డయాలసిస్ సెంటర్ రానట్టే!
పలమనేరు: పలమనేరులోని కిడ్నీవ్యాధిగ్రస్తులు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని అనేక ఏళ్లుగా కోరుతున్నారు. అధికారులు ప్రతిపాదనలను సైతం ప్రభుత్వానికి పంపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని 12 పట్టణాల్లో పీఎంఎన్డీపీ (ప్రధాన మంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం) కింద కొత్తగా ఉచిత డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరుకు మాత్రం మంజూరైనట్టు తెలిపారు. దీనికి రూ.85 లక్షలు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ సెంటర్లు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నడుస్తాయని వెల్లడించారు. పలమనేరు పేరు లేకపోవడంతో స్థానికులు నిరాశ చెందుతున్నారు. ఫలితంగా డయాలసిస్ రోగులు బంగారుపాళెం లేదా అన్నమయ్య జిల్లా మదనపల్లె, తిరుపతి, కుప్పం పీఈఎస్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. బయటి ప్రాంతాలకు వెళ్లాల్సిందే పలమనేరు నియోజకవర్గంలో కిడ్నీ డయాలసిస్ రోగులు 256 మంది వరకు ఉన్నారు. వీరిలో డబ్బులున్న వారు తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రలు, వేలూరు సీఎంసీ, కుప్పం పీఈఎస్, బెంగళూరులోని ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. పేదలు మాత్రం ఇక్కడికి 24 కిలోమీటర్ల దూరంలోని బంగారుపాళెం వెళ్లాల్సి వస్తోంది. అక్కడ ఏడు డయాలసిస్ యంత్రాలు ఉన్నాయి. వందల సంఖ్యలో రోగులు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో అప్పోసప్పో చేసి ప్రైవేటు సెంటర్లకు వెళ్లాల్సివస్తోంది. ఇప్పటికై నా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్పందించి పలమనేరుకు డయాలసిస్ సెంటర్ వచ్చేలా చొరవచూపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. -
జనసేన గుడిపాల అధ్యక్షుడిపై కేసు నమోదు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : గుడిపాల మండలం నుంచి తమిళనాడుకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్టు తేలడంతో జనసేన మండల అధ్యక్షుడు రూప్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్టు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. మండలం నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టు సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తహసీల్దార్ శ్రీనివాసులు ఇసుక అక్రమాలపై నిఘా పెట్టారు. నారగల్లు పంచాయతీ సమీపంలో ఉన్న మంచినీళ్లగుంట వద్ద ఇసుక డంపింగ్‌ను గుర్తించారు. వీఆర్వో రాజారాం ద్వారా విచారణ చేయించారు. ఈ క్రమంలో గుడిపాల మండలానికి చెందిన జనసేన అధ్యక్షుడు రూప్‌కుమార్ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ చేసి రాత్రిళ్లు టిప్పర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నట్టు తేలింది. దీంతో తహసీల్దార్ ఇసుకను సీజ్ చేసి గుడిపాల ఎస్ఐ రామ్మోహన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కేసు నమోదు చేశారు. తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
ట్రాక్టర్‌ను ఢీకొని వ్యక్తి దుర్మరణం
కలప లోడుతో వెళుతూ ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గిరిబాబుయాదవ్ చిత్తూరు కలెక్టరేట్: ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శిగా యాదమరి మండలం మాదిరెడ్డిపల్లికి చెందిన మెరుగు గిరిబాబుయాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరులోని గిరింపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో శనివారం ఆ సంఘం జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గిరిబాబు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తన వంతు కృషిచేస్తానని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనకు పలువురు టీచర్లు, సంఘ నాయకులు అభినందనలు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు బాబు, సంఘ నేత లు దేవానంద్, నాథముని, త్యాగరాజు, గుర్రప్ప, లత, రెడ్డివాణి, శివరంజని పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలకు చెక్
చిత్తూరు అర్బన్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలకు చెక్ పెడుతున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఆయన శనివా రం విలేకరులతో మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం రి యల్ టైం గవర్నెన్స్‌లో భాగంగా ప్రవేశపెట్టిన సీసీటీవీ 360 ఏపీ వ్యవస్థ చోరీల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. చోరీకి గురైన వాహనాలను సీసీటీవీ 360 ఏపీ ద్వారా వేగంగా గుర్తించే అవకాశం కలిగిందన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల మిస్సింగ్ కేసుల్లోనూ సీసీ టీవీ సేవలు ఉపయోగకరంగా మారాయని చెప్పారు. వాహనం చోరీకి గురైన వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. లేదా జిల్లా పోలీసుల వాట్సాప్ నంబర్ 9440900005కు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, చివరిసారిగా ఎక్కడ కనిపించిందో తెలపాలన్నా రు. ప్రజలు వాహన భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, స్టీరింగ్ లాక్, వీల్ లాక్ వంటి భద్రతా పరికరాలు వినియోగించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా నంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
అప్పుడే కూటమి నేతల ఆర్డర్లు
ప్రభుత్వం ఈ సారి జిల్లాకు 27 క్వింటాళ్ల విత్తనాలను కేటాయించింది. దీంతో రైతులకు ఒక్కో బ్యాగు కూడా అందని పరిస్థితి ఉంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా కూటమి నేతలు కాయల కోసం కాపు కాస్తున్నారు. ముందుగానే వ్యవసాయశాఖ అధికారులకు ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో రైతులకు కాయలు అందే పరిస్థితి కనిపించడంలేదు. ఫలితంగా సాగు విస్తీర్ణం ఘణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. గతేడాది కూటమి నేతలు ఇష్టానుసారంగా కాయలు పట్టుకెళ్లారు. వాటికి పలు మండలాల్లో డబ్బులు కూడా చెల్లించలేదు. బకాయిలు పేరుకుపోవడంతో కొన్నిచోట్ల వ్యవసాయశాఖ సిబ్బంది అప్పులు చేసి కొంతమేర చెల్లించారు. మరికొన్నిచోట్ల సిబ్బంది సొంత అవసరాలకు వాడేశారు. ఈ సారైనా కూటమి నేతల జోక్యం లేకుండా కాయలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే 2024లో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2 వేల హెక్టార్లకే పరిమితమవుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వేరుశనగ విత్తనాలు(ఫైల్) -
లోన్ యాప్స్!
వేధిస్తున్నఇటీవల లోన్‌యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నగదు అవసరమున్న వారిని గుర్తించి ఆధార్ కార్డును అప్లోడ్ చేస్తే చాలు లోన్లు ఇస్తున్నాయి. వాటిలో వారం, నెల, ఏడాది రుణాలున్నాయి. తర్వాత అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. సకాలంలో ఇన్స్టాల్మెంట్లు చెల్లించని వారిని నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌కు పంపుతున్నారు. అదేవిధంగా మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా ఆధార్ కార్డు ఆధారంగా రూ.లక్షల్లో అధిక వడ్డీలకు రుణాలిస్తున్నాయి. అధిక వడ్డీలతో కంతులు కట్టలేక పలువురు ఇబ్బందులు పడుతున్నారు. పలమనేరు: ఆర్థికంగా ఇబ్బందులున్న వారు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఓ లోన్‌కు సంబందించిన వివరాలను టచ్ చేస్తే చాలు ఆపై ఏఐ ఆధారంగా వారి మొబైల్‌కు రకరకాల లోన్ యాప్‌ల ద్వారా రుణాలిస్తామనే మెసేజ్‌లు, లింకులు వస్తూనే ఉంటాయి. వీటిని చూసి కాస్త టెంప్ట్ అయి రుణం తీసుకుంటే మన తల వారి చేతికి ఇచ్చినట్టే. అధిక వడ్డీలు వేసి ఇబ్బందులు పెడుతున్నారు. వారి కుటుంబ సభ్యుల మార్ఫింగ్ ఫొటోలను వాట్సాప్‌కు పంపుతున్నారు. అంతేగాక వారి బంధువులు, స్నేహితుల మొబైళ్లకు సైతం పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో పేదలు వారు అడిగినంత డబ్బు చెల్లించలేక నరకం అనుభవిస్తున్నారు. మరికొందరు వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు వీరు ఎలా రుణాలిస్తారంటే.. రకరకాల లోన్ యాప్స్ ద్వారా రూ.10 వేల నుంచి రూ.లక్షల వరకు రుణం పొందవచ్చు. నిర్వాహకులు డబ్బులు తీసుకుంటున్న వారి ఆధార్, కుటుంబ సభ్యుల ఆధార్, వారి ఫోన్ నంబర్లు తీసుకుంటారు. ఆపై ప్రొసెసింగ్ ఫీజు, జీఎస్టీ తదితరాలు పట్టుకుని మన ఖాతాలోకి నగదు జమచేస్తారు. రూ.5 వడ్డీతో అసలు కలిపి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి ఉంటుంది. అప్పు తీసుకునే వారి స్థోమత, సిబిల్ రేటింగ్స్‌ను బట్టి రూ.1000 నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. ఎంతకట్టినా అప్పు తీరదు అధికవడ్డీతో ఇన్స్టాల్మెంట్లు చెల్లించాల్సి రావడం, ఓ కంతు కట్టకుంటే దానికి జరిమానా కలిపి భారీగా పెరగడం తదితరాలతో అప్పు తీరడం కష్టంగా మారుతుంది. మొదట్లో ఇదంతా చాలా సులభంగా ఉంటుందని నిర్వాహకులు నమ్మించి ఆపై అసలు కథను నడిపిస్తున్నారు. తీసుకున్న లోన్‌కు అసలు, వడ్డీ కలిపి కట్టినా ఇంకా ఉందంటూ బెదిరింపులు తప్పడం లేదు. కట్టకుంటే మీ కుటుంబ సభ్యుల న్యూడ్ పొటోలను వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. బ్లాక్మెయిల్ చేసి మరీ వసూళ్లు కంతులు సకాలంలో కట్టకుంటే డబ్బు తీసుకున్న వారి వాట్సాప్, కుటుంబ సభ్యుల వాట్సాప్‌కు వారి ఆధార్ ఆధారంగా ఉన్న ఫొటోలను మార్పింగ్ చేసి నగ్న ఫొటోలను సెండ్ చేస్తున్నారు. అప్పటికీ నగదు కట్టకుండా ఉంటే వారి వాట్సాప్‌ను హ్యాక్ చేసి అందులో ఉన్న నంబర్లకు సైతం న్యూడ్ ఫొటోలను పంపుతున్నా రు. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురికి ఈ విధమైన పరిస్థితి ఎదురైంది. వారు అప్పు చేసి మరీ మొత్తం అప్పు కట్టేశారు. ఈ మొత్తం వ్యవహారం యాప్ ద్వారానే సాగుతున్నందున ఎవరిపై ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు కుమిలిపోతున్నారు. ఇలాంటి లోన్‌యాప్‌ల జోలికి వెళ్లరాదని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నా జనం మాత్రం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారు. అధిక వడ్డీలతో జనాన్ని లూటీ చేస్తున్న వైనం -
‘కూటములను మట్టికరిపించిన విజయ్’
కార్వేటినగరం: తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల అనుభవం ఉన్న అన్నాడీఎంకే, డీఎంకే కూటములను మట్టి కరిపించిన ఘనత టీవీకే పార్టీ అధినేత విజయ్‌కే దక్కిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు చెల్లించకుండా ప్రజల మన్ననలతో విజయ్ 108 సీట్లు కైవసం చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనకు అనుమతి ఇవ్వకుండా గవర్నర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడని దుయ్యబట్టారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తూ మోదీ రాజ్యాంగాన్ని అమలు చేయా లని చూడడం దారుణమన్నారు. బేజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో కొన్ని సీట్లు తక్కువ ఉన్నా వారికి సమయం ఇచ్చారని, తమళినాడులో 108 సీట్లు సాధించిన విజయ్ ప్రమాణ స్వీకారానికి అనుమతించక పోవడం తగదన్నారు. ఇతర పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చినా గవర్నర్ కుంటి సాకులతో తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క సీటు సాధించిన బీజేపీకి చెందిన వ్యక్తికి అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ఽసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో ప్రచారం చేసి, ఆయన అమలుచేసిన సంక్షేమ పథకాలను తమిళనాడులోనూ చేస్తానని విజయ్ హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో ప్రజలు విజయ్‌కి బ్రహ్మరథం పట్టారని వివరించారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ పవన్ కళ్యాణ్ తన పార్టీ అంజెడాను పక్కన పెట్టి 15 ఏళ్లుగా చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. సినీరంగం నుంచి వచ్చిన విజయ్ కి, పవన్ కళ్యాణ్‌కు పోలీకే లేదని ఎద్దేవా చేశారు. రాజకీయ సభ్యత, సంస్కారం కలిగిన వ్యక్తి విజ య్ అని తెలిపారు. చెప్పు చూపించడం, కొడుకులని సంబోందించడం, కులాలను చూపించి ఓట్లు అడగడం పవన్‌కళ్యాణ్ నైజమన్నారు. ఆయ నకు విజయ్‌తో పోలికేంటని చురకలు అంటించారు. టీవీకే చీఫ్ విజయ్, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేశారు. -
వైభవం.. స్వర్ణ రథోత్సవం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారు స్వర్ణరథోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేపట్టారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్లు రమేష్ బాబు, రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
టీచర్ల సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని ఆపస్ నాయకులు కోరారు. వారు డీజీఈకి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో పలుచోట్ల పిలిస్తే పలకని 108 శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026ఆపదలో ఉన్నవారికి 108 అంటే భరోసా. ప్రమాదం జరిగినా.. ఎవరికై నా గుండెపోటు వచ్చినా.. ఏదైనా అత్యవసర పరిస్థితి కలిగినా.. గర్భిణికి పురిటినొప్పులు వచ్చినా.. ఒక్క ఫోన్ చేస్తే కుయ్‌కుయ్‌మంటూ నిమిషాల్లో 108 అంబులెన్స్ వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వ నిర్వహణ, పర్యవేక్షణ లోపం కారణంగా క్షేత్రస్థాయిలో పలుచోట్ల 108 వాహన సేవలు కుంటుపడ్డాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. చివరకు ప్రైవేటు వాహనాలే దిక్కుగా మారుతున్నాయి.ప్రశ్నిస్తే సిబ్బంది దురుసు ప్రవర్తన అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వారితో కొంతమంది 108 సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాల్సి ఉండగా దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు పలువురు వాపోతున్నారు. పేదలంటేనే చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో పర్యటించి సమస్యలను గుర్తించారు. 11 కేవీ ఫీడర్ల పరంగా 33 సమస్యలు, ఎల్టీ లైన్ల పరంగా 17, సర్వీసు లైన్ 6 కలిపి మొత్తం 56 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ అమర్‌బాబు తెలిపారు. వాటిలో 8 సమస్యలను పరిష్కారించామన్నారు. మిగిలిన వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. హుండీ లెక్కింపులో రూ.1.58 కోట్ల ఆదాయం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఉన్న హుండీల ద్వారా రూ.1,58,76,947ల ఆదాయం వచ్చినట్టు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించినట్టు తెలిపారు. ఈ క్రమంలో రూ.1,58,76,947 నగదు, బంగారం 31 గ్రాములు, వెండి 1.20 గ్రాములు వచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే గోసంరక్షణలోని హుండీల ద్వారా రూ.19,180, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.1,43,720 వచ్చిందని తెలి పారు. యూఎస్ఏ డాలర్లు 364, సింగపూర్ డాలర్లు 52, మలేషియా రింగిట్ ఒకటి, యూఏఈ దిర్హామ్స్ 70, ఆస్ట్రేలియావి డాలర్లు 500, కెనాడా డాలర్లు 20, ఇంగ్లాడ్ పౌండ్స్ 10 వచ్చాయన్నారు. కార్యక్రమంలో చైర్మన్ మణి నాయుడు, డీఈవో సాగర్‌బాబు, ఏఈవోలు కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఈసెట్‌లో మెరిసిన విద్యార్థులు – రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించిన కుసుమ చిత్తూరు కలెక్టరేట్ : డిప్లొమా కోర్సు పూర్తి చేసి నేరుగా బీఈ, బీటె క్, బీఫార్మసీ కోర్సుల్లో సెకండ్ ఇయర్(లేటరల్ ఎంట్రీ)లో చేరేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్‌లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇందు లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి 422 మంది పరీక్షలకు రాయ గా 392 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 224 మంది, బాలికలు 168 మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు ముందంజలో నిలిచారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 92.89 శాతం నమోదు కాగా బాలురు 91.80, బాలికలు 94.66 శాతం ఉత్తీర్ణత పొందారు. గంగాధరనెల్లూరు మండలం ఎగువకాలువ గ్రామానికి చెందిన పి.కుసుమ ఫార్మసీ విభాగంలో 146 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. ఆమెను పలువురు అభినందించారు. ఆపదొస్తే అవస్థే..!కాణిపాకం: చిత్తూరు జిల్లాలో 108 వాహనాలు 31 దాకా ఉన్నాయి. ఇవి రోజువారీగా సుమారు 5 వేల కిలోమీటర్లు తిరుగుతున్నాయని, 90 నుంచి 100 కేసులను ఆస్పత్రులకు చేరుస్తున్నట్టు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. వీటిలో పలు వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. కొన్ని తరచూ రిపేర్ అవుతున్నాయి. వాటికి తక్షణం మరమ్మతులు చేయించడం లేదు. మూడు వాహనాలు మరమ్మతులకు గురై చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మూలనపడ్డాయి. కొన్ని మండలాల్లో టైర్లు పాడవడం, ఇంజిన్్ సమస్యలు, బ్యాటరీ లోపాలు, ఇతర సాంకేతిక కారణాలతో వాహనాలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు 108 వాహన సేవలు అందడం లేదు. ఇప్పుడే ఎందుకిలా..? కరోనా సమయంలో 108 సేవలు ప్రజలకు ప్రాణాధారంగా నిలిచాయి. రాత్రింబవళ్లు పనిచేసి కరోనా బాధితులను ఆస్పత్రులకు తరలించాయి. అప్పట్లో 108 సిబ్బందిని ప్రజలు దేవుళ్లలా భావించారు. గత ఐదేళ్ల పాలనలో 108కు ఎక్కడా లోటు రాకుండా చూసుకున్నారు. మహానేత తీసుకొచ్చిన ఈ 108 సేవలను.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింతంగా తీర్చిదిద్దారు. అలాంటి సేవలు ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాయనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒకప్పుడు పిలిస్తే పలికిన 108 ఇప్పుడు కాల్ చేసినా కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం అన్నీ బాగానే ఉన్నాయని నివేదికలు పంపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే.. సిబ్బంది దురుసు ప్రవర్తన అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వారితో కొంతమంది 108 సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాల్సి ఉండగా దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు పలువురు వాపోతున్నారు. పేదలంటేనే చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. తక్షణం స్పందిస్తున్నాం జిల్లాలో 31 వాహనాలున్నాయి. బ్యాక్ ఆప్‌గా 4 వాహనాలున్నాయి. ఆస్పత్రి ఆవరణలో ఉన్నవి కూడా ఆవాహనలే. తక్షణం మరమ్మతులు చేయిస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. చర్యలు తీసుకుంటాం. – మోహన్‌బాబు, 108 మేనేజర్, చిత్తూరు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశం ఏటీఎం కేంద్రాల్లో భద్రత బ్యాంకులదే! చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశాలకు కసరత్తు చేస్తున్నట్టు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడు తూ విద్యాహక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతిలో ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రైవే ట్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం రెండవ విడత లాటరీ ఫలితాలు విడుదల చేసినట్టు తెలిపారు. ఒకటి నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. చిత్తూరులో 35, కుప్పంలో 33, బంగారుపాళ్యంలో 20, జీడీ నెల్లూరులో 17, పలమనేరులో 12, నగరిలో 11, తవణంపల్లిలో 11, గంగవరంలో 9, వి.కోటలో 7, యాదమరిలో 6, బైరెడ్డిపల్లిలో 4, గుడిపాలలో 4, ఎస్ఆర్పురంలో 4, వెదురు కుప్పంలో 4, రామకుప్పంలో 3, ఐరాలలో 2, కార్వేటినగరంలో 2, నిండ్రలో 2, పెద్దపంజాణిలో 2, పూత లపట్టులో 1, శాంతిపురంలో 1, విజయపురంలో 1 విద్యార్థులు ఎంపికై నట్టు తెలిపారు. ఎంపికై న విద్యా ర్థుల అడ్మిషన్ల ధ్రవీకరణ ఈ నెల 16వ తేదీ వరకు పాఠశాలలో చేయించుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఈ నెల 17న తుది నిర్ధారణ చేస్తామన్నారు. వివరాలకు ఎంఈవోలను సంప్రదించాలని కోరారు. చిత్తూరు అర్బన్ : ఏటీఎం కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులపై ఉందని చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిథి గృహంలో బ్యాంకు మేనేజర్లతో సేఫ్టీ–సెక్యూరిటీ ఆడిట్ పేరిట సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవల ఏటీఎం కేంద్రాల్లో చోరీలు జరుగుతున్నాయని తెలిపారు. దొంగలు భారీ మొత్తంలో నగదు చోరీ చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని బ్యాంకులు ఏటీఎం కేంద్రాల గురించి పట్టించుకోవడంలేదని తెలిపా రు. అక్కడ కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలేదన్నారు. తీరా చోరీ జరిగిన తర్వాత బాధపడుతున్నారని పేర్కొన్నారు. చోరీలు జరగకుండా ఉండేందుకు బ్యాంకర్లు పోలీసులకు సహకరించాలన్నారు. జనావాసంలేని ప్రాంతాలు, నగదు లావాదేవీలు తక్కువగా జరిగేచోట్ల ఉన్న ఏటీఎంలను మరో చోటికి తరలించాలన్నారు. ప్రతి ఏటీఎం కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ, డీఎస్పీ సెల్ నంబర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. బీట్ పాయింట్ పుస్తకం పెట్టాలన్నారు. తద్వారా పోలీసులు తనిఖీ చేసే సమయంలో ఇక్కడ రికార్డు చేస్తారని తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, కనీసం 90 రోజుల వీడియోను భద్రపరచాలన్నారు. నగదు నింపే సిబ్బంది వివరాలను ధృవీకరించాలన్నారు. ఫైనాన్స్ సంస్థలు బంగారు ఆభరణాల లాకర్లకు పటిష్టమైన భద్రతా గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య, తాలూకా సీఐ అశోక్‌కుమార్, పలు వురు బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 70,001 మంది స్వామిని దర్శించుకున్నారు. 30,085 మంది తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ విద్య చిత్తూరు కలెక్టరేట్ : పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు తాలీం ఏ హునర్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మైనారిటీ, వక్ఫ్‌బోర్డ్ అధికారులు వెల్లడించారు. దీనికి అర్హులైన ముస్లిం విద్యార్థులు apwaqfboard. el91.com వెబ్సైట్లో ఈ నెల 12వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో 450 మార్కులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలో 75 శాతం మార్కులు వచ్చిన మైనారిటీ విద్యార్థులు అర్హులని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 17వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని, అందులో ఎంపికై న వారికి కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్యతో పాటు జేఈఈ, నీట్ తదితర పరీక్షలకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. – పూతలపట్టులో మూడు రోజుల క్రితం కొందరు యువకులు వ్యక్తిగత కారణాలతో ఘర్షణ పడ్డారు. ఒక యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్సుకు కాల్ చేశారు. ఆ వాహనం సమయానికి రాలేదు. పోలీసులు పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే తమ వాహనంలోనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. – తవణంపల్లి మండలం సత్తారుబావి గ్రామంలో 20 రోజుల క్రితం ఆటో బోల్తా పడింది. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. గంటల తరబడి చూసినా 108 వాహనం రాలేదు. దీంతో స్థానికులు ఆటోలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండలంలో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగాయి. ఇలాంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా అనేకం జరిగాయి. గంటల తరబడి ఎదురు చూపులే.. పలు ప్రాంతాల్లో 108 సేవలు గాడితప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేస్తే తక్షణ స్పందన కనిపించడం లేదు. కొన్నిసార్లు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ‘‘వాహనం వస్తోంది.. ఇంకో కేసు దగ్గర ఉంది.. కొంతసేపట్లో అక్కడికి చేరుతుంది.. అంటూ సమాధానాలు వస్తున్నా.. అంబులెన్స్ మాత్రం రావడం లేదు. గంటల తరబడి చూసినా వాహనం రాకపోవడంతో చివరకు స్థానికులు కార్లు, ఆటోల్లో ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో బాధితులు రక్తపు మడుగులో బాధతో గంటల తరబడి అంబులెన్స్ కోసం ఎదురు చూసిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు గర్భిణులకు పురిటినొప్పులు వస్తే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనికితోడు పలమనేరు ఏరియా ఆస్పత్రికి వచ్చే కేసులను మెరుగైన వైద్య సేవల నిమిత్తం రెఫర్ చేయాలంటే 108 పలకడం కష్టంగా ఉంది. 108కు కాల్ చేస్తే సమయానికి రాకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. తవణంపల్లి, పూతలపట్టు, కార్వేటినగరం, ఎస్ఆర్పురం, నగరి తదితర మండలాల్లో ఈ సమస్య అధికంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చిత్తూరు జాతరొస్తోంది...!
చిత్తూరు నగరంలో ఈ నెల 12, 13 తేదీల్లో గంగ జాతర జరగనుంది. ఈ క్రమంలో నగరమంతా సందడి మొదలైంది. పెద్దలు, యువకులు, భక్తులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏటా అంగరంగ వైభవంగా జరిగే గంగ జాతరను ఈ సారి మరింత ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో మండపాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండడంతో అందుకు తగినట్టు ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు గంగ జాతరకు ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జాతరకు ముహూర్తం ఖరారుకావడంతో చిత్తూరు నగరంలోని నడివీధి, గిరింపేట, సంతపేట, కట్టమంచి, మురకంబట్టు, కొంగారెడ్డిపల్లి, దొడ్డిపల్లి, మంగసముద్రం తదితర ప్రాంతాల్లోని వీధులు కళకళలాడుతున్నాయి. వారం రోజులుగా మండపాల నిర్మాణం, చలువ పందిళ్లు, విద్యుత్ అలంకరణల పనులు కొనసాగుతున్నాయి. ఈసారి జాతరలో తమ ప్రాంత మండపమే ప్రత్యేక ఆకర్షణగా నిలవాలనే ఉద్దేశంతో నిర్వాహకులు భారీగా ఖర్చు చేస్తున్నారు. రంగురంగుల వస్త్రాలతో మండపాలను అలంకరిస్తూ, భారీ విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో దారిపొడవునా చలువ పందిళ్లు వేస్తున్నారు. క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, విశ్రాంతి ఏర్పాట్లపైనా దృష్టి సారిస్తున్నారు. వర్షం పడినా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మండపాలను పటిష్టంగా నిర్మిస్తున్నారు. జాతర ప్రారంభానికి ముందే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లకు ఆర్డర్లు ఇచ్చారు. సౌండ్ సిస్టంలు, డప్పు వాయిద్యాలు, విద్యుత్ లైటింగ్, పుష్పాలంకరణలు, వీధి నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర రోజుల్లో రాత్రిళ్లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థానిక కళాకారులను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలు, మహిళలు, యువత కోసం ప్రత్యేక వినోద కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. కొంగారెడ్డిపల్లిలో ఏర్పాటుచేసిన మండపం నడివీధిలో మండపం ఏర్పాట్లు నిఘా నీడలో జాతర గంగజాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే గుర్తించి నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలు, శాంతిభద్రతల అంశాలపై నిర్వాహకులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా అన్ని మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర జరిగే ప్రాంతాల్లో పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గంగమ్మ కొలువుదీరే ప్రాంతాలన్నీ ప్రస్తుతం నిఘా నీడలోనే ఉన్నాయి. ఇక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పోలీసుల అనుమతిని తప్పనిసరి చేశారు. -
హస్తకళాకారుల ఆర్థిక ఎదుగుదలకు కృషి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): హస్త కళాకారులకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఆమె శుక్రవారం చిత్తూరు మండలంలోని తుమ్మిందలో వినాయకుడి బొమ్మల తయారీని పరిశీలించారు. బొమ్మల తయారీ, విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బొమ్మల తయారీపై ఆసక్తి ఉన్న కళాకారులకు యూనిట్ పెట్టించేలా చర్య లు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఎంలు సుబ్బారెడ్డి, విజయభాస్కర్, సీసీ నిత్యానంద పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని వినతి చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల సాంకేతిక సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ కోరారు. ఆయన శుక్రవారం ఆ సంఘ నాయకులతో కలిసి శుక్రవారం విజయవాడలో రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ (డీజీఈ), ఐటీ అడిషనల్ డైరెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ టీచర్లు క్షేత్రస్థాయి లో సాంకేతికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. లీప్ యాప్ నిర్వహణలో ఇబ్బందులున్నట్లు తెలిపారు. టీచర్ల సర్వీసెస్ సెక్షన్లో ప్లే స్లిప్పుల మాదిరిగానే డిజిటల్ ఐడీ కార్డులను నేరుగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించాలన్నారు. మార్కులు, ఇతర వివరాలను ఒకసారి ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత, వాటినే రిజిస్టర్లుగా ప్రింట్ తీసుకునేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని కోరారు. మార్కుల ఎంట్రీలో తప్పు లు దొర్లితే సవరించుకునేందుకు, ప్రింట్ తీసుకునేందుకు నిరంతర అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం హాజరు వేసే సమయంలో సాఫ్ట్వేర్ అప్డేట్లు, అనవసర నోటిఫికేషన్లు రాకుండా చూడాలన్నారు. యాప్‌లన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఇద్దరు పిల్లలపై పిచ్చికుక్క దాడి చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో శుక్రవారం ఇద్దరు పిల్లలపై పిచ్చికుక్క దాడి చేసింది. నగరంలోని సంతపేట సాయినగర్ కాలనీలో రెండు పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి. అటువైపు వెళుతున్న వాళ్లను కరవడానికి ప్నయత్నిస్తుండగా స్థానికులు మునిసిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు పట్టించుకోలేదు. శుక్రవారం రాత్రి వీధిలో సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు పిల్లలను పిచ్చి కుక్క వెంటాడి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పిల్లలను కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు వాపోతున్నారు. -
బుడిబడి నడకలేవీ..?
అద్భుతమైన పథకం.. మహాద్భుతమైన నిబంధనలు.. ఇంకేం పేద విద్యార్థులకు ఇబ్బందే ఉండదు. అక్షరాలు కదం తొక్కుతాయి. పేద పిల్లలందరూ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల తలుపులు తడతారు. పేదలందరికీ కార్పొరేట్ విద్య అందుతుంది. పేదింట అక్షరాల పూదోటలు విలసిల్లుతాయనుకున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి.. ప్రభుత్వం మారింది.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పేద విద్యార్థులు కార్పొరేట్ గడప తొక్కలేక మగ్గిపోతున్నారు. ఇదీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యా పథకం పరిస్థితి. సరైన అవగాహన కల్పించడంలో విఫలం విద్యాశాఖ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు తమ ప్రాంతంలోనే ఉండే మంచి స్కూలును ఎంపిక చేసుకుంటే, ఉచిత విద్య పథకంలో అవకాశం కల్పిస్తామనే అవగాహన కల్పించలేదని విమర్శలున్నాయి. అలాగే కార్పొరేట్ పాఠశాలతోపాటు గుర్తింపు ఉన్న స్కూళ్లను ముందే సంప్రదించి...నామ్ అకడమిక్ పేరుతో రూ.30వేలు చెల్లించడం కుదరదని చెప్పడంలోను విద్యాశాఖ వెనుకబడి ఉందని చర్చసాగుతోంది. దీంతోనే అడ్మిషన్లు లేకుండా ఖాళీగా ఉన్న ప్రైవేటు స్కూళ్లను ఎక్కువగా ఎంపిక చేస్తున్నారని తెలుస్తుంది. తిరుపతి అర్బన్: పేద విద్యార్థులకు సైతం పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్‌లో విద్యను అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత విద్య పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థి తమ నివాసానికి సమీపంలోని ప్రైవేటు స్కూల్లో చేర్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ప్రతి కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలో 25శాతం అడ్మిషన్లు ఇవ్వాలనే నిబంధన పెట్టారు. ఆ విధానాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కచ్చితంగా అమలు చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు కూటమి ప్రభుత్వం తూట్లుపొడుస్తుందనే విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా ఏ గ్రేడ్‌లోనే కార్పొరేట్ స్కూళ్లలోనే కాకుండా బీ,సీ గ్రేడ్ల పరిధిలోని ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలను విద్యాశాఖాధికారులు చేర్పిస్తున్నారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో నాన్ అకడమిక్ ఫీజు రూ.30వేలు డిమాండ్ ఉచిత విద్య పథకానికి సంబంధించి కార్పొరేట్ స్కూళ్లను ఏ గ్రేడ్‌గా విభజించారు. అలాంటి స్కూళ్లలో పిల్లలను చేర్చుకుంటే విద్యాశాఖ ఒక విద్యా ర్థికి రూ.13 వేలు చొప్పన స్కూల్‌కు చెల్లించాలి (తల్లికి వందనంకు ఇచ్చే డబ్బులు), అలాగే మధ్యతరగతి ప్రైవేటు స్కూళ్లను బీ గ్రేడ్‌గా విభజన చేశారు. అలాంటి స్కూల్‌కు విద్యాశాఖ వారు ఒక్కో విద్యార్థికి రూ.11,500 చెల్లించాలి. మిగిలిన 1500 విద్యార్థి తల్లిఖాతాలో జమ చేస్తారు(తల్లికి వందనం రూ.13 వేలు నగదు విభజన), చిన్న ప్రైవేటు స్కూళ్లను సీ గ్రేడ్‌గా విభజన చేశారు. అలాంటి స్కూల్‌కు విద్యాశాఖ వారు ఒక్కో విద్యార్థికి రూ.10వేలు చెల్లిస్తారు. మిగిలిన రూ.3 వేలు నగదు విద్యార్థి తల్లి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన అంశం కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు (ఏ గ్రేడ్)ఉచిత విద్య స్కీమ్ ద్వారా పిల్లలను చేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. నాన్ అకడమిక్ పేరుతో అదనంగా రూ.30 వేలు ఒక్కో విద్యార్థి చెల్లించాలని మెలిక పెట్టేస్తున్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు వారి జోలికి వెళ్లడం లేదు. ఇక బీ గ్రేడ్‌లో భాగంగా మీడియం స్కూళ్ల విషయానికి వస్తే ఒకటో తరగతిలో అడ్మిషన్లు తక్కువ శాతం ఉన్నవారు మాత్రమే పేద పిల్లలను చేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. సీ గ్రేడ్‌లో భాగంగా చిన్న ప్రైవేటు స్కూళ్లు, ప్రధానంగా మండల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణంలో కొత్తగా పెడుతున్న చిన్న పాఠశాలల వారు మాత్రమే తమకు సరైన అడ్మిషన్లు లేకపోవడంతో పేద పిల్లలకు ఉచిత విద్య పథకం ద్వారా చేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ సైతం అదే దారిలో అడుగులు వేస్తుంది. మొత్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఇష్టాఇష్టాలతో పనిలేకుండా అడ్మిషన్లు కోసం ఎదురుచూస్తున్న ప్రైవేటు స్కూళ్లలోనే ఉచిత విద్య పథకం ద్వారా చేర్చుతున్నారనే విమర్శలున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్యకు తగ్గుతున్న ఆదరణ నాలుగు విడతల్లో 25 శాతం విద్యార్థుల భర్తీ ఉచిత విద్య పథకంలో భాగంగా జూన్ 12 లోపు నాలుగు విడతల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను విద్యాశాఖ వారు ప్రైవేటు స్కూళ్లలో చేర్చించాల్సి ఉంది. అయితే మొదటి విడతలో 523 మంది పేద విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే అందులో 106 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు స్కూల్ తమకు నచ్చకపోవడంతో అడ్మిషన్లు తీసుకోలేదు. రెండో విడతలో 261 మందిని ఎంపిక చేశారు. వీరు ఈ నెల 16 లోపు అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎవరూ ఆడ్మిషన్లు తీసుకోలేదు. మూడో విడత ప్రక్రియ ఈ నెల 17 నుంచి 31వ తేదీ లోపు, నాలుగో విడత జూన్ 1 నుంచి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. -
వైభవం.. స్వర్ణ రథోత్సవం
శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వెంకన్న స్వర్ణరథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిండు ప్రాణం బలి కార్వేటినగరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన దేవకి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శివరాత్రి సందర్భంగా తలకోనకు వెళ్లి తిరిగి వస్తున్నారు. తురకమిట్ట సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి చికిత్స అందించేందుకు 108 వాహనానికి సమాచారం ఇచ్చాం. గంట అయినా 108 వాహనం రాలేదు. తీవ్రంగా గాయపడిన దేవకి ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి విషయాలను అధికారులు గుర్తించాలి. – బండి రాము, లక్ష్మీపురం, కార్వేటినగరం మండలం గర్భిణిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లాం మూడు నెలల క్రితం గర్భిణి నొప్పులతో బాధపడుతుండగా 108కు కాల్ చేశాను. వారు నిండ్ర హాస్పిటల్ నుంచి పది నిమిషాల్లో చేరుకుంటామన్నారు. గంట సమయం దాటినా రాలేదు. నొప్పులు ఎక్కువగా ఉండడంతో ఆటోలో నగిరి ఏరియా ఆస్పత్రికి బయలుదేరాం. నగరి మండలం వేలావడి వద్ద వెళుతుండగా 108 వారు కాల్ చేసి పన్నూరు సబ్‌స్టేషన్ వద్దకు వచ్చామన్నారు. మేము ఆస్పత్రి సమీపంలో వెళుతున్నామని చెబితే టైం పాస్ కోసం 108కు ఫోన్ చేశారా అంటూ నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యమైందని వచ్చేశామంటే గొడవకు దిగారు. నాతో ఉన్న వారు ఎందుకు అలా అంటున్నారంటే ఎవరికైనా కంప్లయింట్ చేసుకోండి మాకేమీ భయం లేదు అని మాట్లాడారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. – జికె శివ, అత్తూరు, నిండ్ర మండలం -
టీడీపీ మూకలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
– మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరిక తిరుపతి తుడా: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ మూకలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని శుక్రవారం రోజా పరామర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ రాయచోటిలో మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి భూ దందాలు, రౌడీయిజం, గంజాయి అక్రమాలు మితిమీరుతున్నాయని మండిపడ్డారు. రామ్‌ప్రసాద్‌రెడ్డి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, భవిష్యత్‌లో వారికి ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా దాడి చేయడంపై ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. -
కునుకు తీస్తున్న కుంకీలు!
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం, పూతలపట్టు, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో ని కౌండిన్య అభయారణ్యం 250 కిలోమీటర్లకు విస్తరించి ఉంది. ఈ అడవితోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవుల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. మొత్తం 105 ఏనుగులు ఉన్నాయి. కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీలోనే 56 వరకు ఏనుగులు గుంపులుగా ఉన్నాయి. ఇవేగాక పక్కరాష్ట్రాల నుంచి ఏనుగులు ఇక్కడికి వస్తుంటాయి. ఈ ఏనుగులు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. అడవి నుంచి బయటకు రాకుండా కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. అలాగే కందకాలు తవ్వారు. అయినా ప్రయోజనం లేదు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుంకీ ఏనుగుల ద్వారా ఏనుగులను కట్టడి చేయడానికి పలమనేరు మండలం మొసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టును చేపట్టింది. అయినా ఏనుగుల సమస్య ఏమాత్రం అదుపులోకి రాలేదు. పంట నష్టం, ప్రాణ నష్టం తప్పడం లేదు. కుంకీల సంరక్షణకు సైతం నిధుల సమస్య కీలకంగా మారింది. జనం ప్రాణాలు పోతున్నా.. ఏనుగుల దాడుల్లో 2012 నుంచి ఇప్పటి వరకు మొత్తం 34 మంది ప్రాణాలను కోల్పోయారు. 25 మందికి పైగా గాయపడ్డారు. ఏనుగుల బారిన పడి 64 పశువులు మృతిచెందాయి. ఈ దాడులను ఎక్కువగా చేసింది మదపుటేనుగులేనని అధికారులు గుర్తించారు. ఇక ఏనుగుల కారణంగా 9 వేల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. అడవిని దాటి బయటకొచ్చే సమయంలో విద్యుత్ షాక్‌తోపాటు పలు కారణాలతో ఇప్పటి వరకు 24 ఏనుగులు మృత్యువాతపడ్డాయి. నెరవేరని కుంకీల లక్ష్యం ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా కుంకీ ఆపరేషన్లు చేస్తున్నారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు దుబేరా బేస్ క్యాంపు నుంచి నాలుగు కుంకీ ఏనుగులు, రామకుప్పం ననియాల నుంచి రెండు ఏనుగులను తెప్పించింది. వాటికి ఈ ప్రాంతాన్ని అలవాటు చేసి తర్వాత అడవిలోని ఏనుగులను కట్టడి చేయాలని నిర్ణయించారు. ముందుగా మదపుటేనుగులను గుర్తించి వాటికి మత్తుచ్చి కుంకీల సాయంతో క్యాంపునకు తీసుకురావాల్సి రావాలి. వాటిని ఎలిఫెంట్ క్రాల్స్‌లో బంధించి ఆరునెలలపాటు శిక్షణ ఇస్తే కుంకీలుగా మారి డాడులు చేయకుండా మాట వింటాయి. ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఇలా ఉండగా ననియాల ప్రాజెక్టు నుంచి తీసుకువచ్చిన వినాయక, జయంత్ అనే రెండు ఏనుగులను మళ్లీ అక్కడికే పంపించారు. ప్రస్తుతం ఇక్కడి క్యాంపులో అభిమన్యు, క్రిష్ణ, దేవా, రంజన్ అనే నాలుగు ఏనుగులు మాత్రమే ఉన్నాయి. భారంగా మారిన కుంకీల సంరక్షణ ఏనుగుల సమస్య అదుపులోకి రాలేదని రైతుల ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. కుంకీలకు మేత, ఆహారం కోసం అటవీశాఖకు మరింత భారంగానే మారింది. ఇక్కడి క్యాంపు నిర్వహణకు నెలకు రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. అంతేగాక ఇక్కడి అటవీ రేంజిలో పనిచేస్తున్న సిబ్బంది అడవులకు సంబందించిన పనులను పక్కనబెట్టి కుంకీ ఏనుగుల పనుల్లోనే బిజీగా మారిపోయారు. కుంకీలతో శిక్షణ, ట్రయల్స్‌కే పరిమితం బయటి రాష్ట్రాల్లో క్యాప్చరింగ్ ఇలా.. మదపుటేనుగులు ప్రమాదకరమైనవి. ఇవే ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. వీటిలో కొన్ని ఒంటరిగా సంచరిస్తుండగా మరికొన్ని గుంపుల్లో ఉన్నాయి. కుంకీలు నాలుగు దిశల్లోకి వెళ్లి గుంపులోని మదపుటేనుగులను అదుపుచేయాలి. ఆ సమయంలో మావటీలు మత్తుసూది ఇచ్చి వాటిని బంధించి క్యాంపునకు తీసుకురావాలి. తర్వాత క్రాల్స్‌లో బంధించి మూడు నుంచి ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చిన తర్వాత అవి కుంకీలుగా మారుతాయి. ఈ ప్రక్రియ కర్ణాటక, తమిళనాడులో సాగుతోంది. అదేవిధంగా ఇక్కడి మదపుటేనుగులను కట్టడి చేయాలంటే ఇంకా మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఏనుగుల సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒరిగిందేమీ లేదు అటవీశాఖ అధికారులు గతంలో టేకుమంద ఫారెస్ట్‌లో కుంకీ ఏనుగుల ట్రయల్ రన్ చేపట్టి విజయవంతమైందని చెప్పారు. కుంకీలు అడవిలోని ఆడ ఏనుగులను మళ్లించడం సులవే. మదపుటేనులను మళ్లించడం అంతసులువైన పనికాదు. వాటి కారణంగానే పంట, ప్రాణ నష్టం జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. వీటిని అదుపు చేయడమే కుంకీ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం అత్యంత కీలకమైన ప్రక్రియ క్యాప్చరింగ్ మాత్రమే. మదపుటేనుగుల క్యాప్చరింగ్ త్వరలో చేపడతామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడున్న కుంకీలకు మనిషి చెప్పినట్టు వినే కమాండింగ్స్ ఇచ్చి వాటి ద్వారా రకరకాల సర్కస్ ఫీట్లను చేయిస్తున్నారు. వీటిని చూసేందుకు ఎక్కువగా ప్రజలు ఎలిఫెంట్ క్యాంపుకు వెళుతున్నారు. -
అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : రానున్న విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేస్తున్న పాఠ్యపుస్తకాల పంపిణీలో ఎలాంటి అలసత్వం వహించకూడదని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోడౌన్‌ను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలన్నా రు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాల సరఫరా ప్రక్రియ ప్రారంభమైందన్నారు. గోడౌన్ నుంచి మండల కేంద్రాలకు పుస్తకాల తరలింపు సాగుతోందన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు ప్రా రంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకాలుండాలన్నారు. ఎంఈవోలు తమ పరిధి లోని పాఠశాలల అవసరాలకు అనుగుణంగా పుస్తకాల ఇండెంట్ పెట్టుకోవాలన్నారు. అనంతరం గోడౌన్లో స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. పాఠ్యపుస్తకాల గోడౌన్ మేనేజర్ సురేష్, సిబ్బంది వనజ, పాల్గొన్నారు. వేగం పెంచండి చిత్తూరు కార్పొరేషన్: ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానల్స్ వేగం పెంచాలని ట్రాన్స్‌కో చిత్తూరు జిల్లా నోడల్ ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్ సీజీఎం శోభా వాలంటీనా ఆదేశించారు. గురువారం ఎస్ఈ కార్యాలయంలో చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్ డివిజన్ అధి కారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడా రు. జిల్లాలో దాదాపు 19వేల సర్వీసుల ఏర్పాటు ఆగస్టులోపు ఏర్పాటు చేయాలన్నారు. అందులో ఇప్పటి వరకు 1000 ప్యానల్స్ బిగించారన్నారు. ప్రతిరోజు 150 ప్యానల్స్ ఏర్పాటు చేయాలన్నా రు. వర్క్‌ఆర్డర్లను నెలలోపు పూర్తి చేయాలని లేనిపక్షంలో ఏఈ పర్సనల్ అకౌంట్ నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించారు. డయల్ యువర్ సీఎండీలో జిల్లా పరంగా వస్తున్న ఫిర్యాదులను నమోదు చేసుకొని పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ అమర్‌బాబు, ఈఈలు మునిచంద్ర, సురేష్, మోహనమ్మ, డీఈలు, ఏఈలు, సబ్‌ఇంజినీర్లు పాల్గొన్నారు. నేడు కరెంటోళ్ల జనబాట చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని 40 సెక్షన్ల పరిధి లో శుక్రవారం కరెంటోళ్ల జనబాట నిర్వహించనున్నారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నారు. అల్లూరి చరిత్ర స్ఫూర్తిదాయకం చిత్తూరు కలెక్టరేట్ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని డీఆర్వో మోహన్ కుమార్ కొని యాడారు. గురువారం కలెక్టరేట్లో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన మహోజ్వల శక్తి, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అన్నారు. మన్యం ప్రాంతంలో గిరిజనులను ఏకం చేసి ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన చరిత్ర అల్లూరిదన్నారు. ఆయన పోరాట పటిమ ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. బీజేపీ నాయకులు శ్రీనివాసులు, జిల్లా పర్యాటకశాఖ అధికారి నరేంద్రకుమార్, సీపీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ పాల్గొన్నారు. శిక్షణకు కలెక్టర్ చిత్తూరు కలెక్టరేట్ : ముస్సోరీలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ తరగతులకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు ముస్సోరీలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో మిడ్ కెరీర్ ట్రైనింగ్ పేరుతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ నెల 11 నుంచి జూన్ 5వ తేదీ వరకు (మొత్తం 25 రోజుల) పాటు శిక్షణ నిర్వహించనున్నారు. ఈ నెల 10న ముస్సోరిలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. ఈ శిక్షణకు దేశ వ్యాప్తంగా 12 మంది కలెక్టర్లను ఎంపిక చేయగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. కలెక్టర్ శిక్షణ ముగించుకుని జూన్ 6న తిరిగి జిల్లాకు విచ్చేయనున్నారు. అప్పటి వరకు జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు. -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 71,029 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,184 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.07 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
నేడు ఎడ్‌సెట్
తిరుపతి సిటీ: బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ ఎడ్‌సెట్–2026 శుక్రవారం జరగనుంది. కుప్పం ద్రావిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు తిరుపతి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు తిరుపతి జాపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్లో 800 మంది, పుత్తూరు వెంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 160 మంది పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఉండదని సూచించారు. బస్సుల్లో చోరీలు.. కుప్పం దొంగ అరెస్టు కృష్ణరాజపురం (బెంగళూరు): బస్సుల్లో వెళ్తూ ప్రయాణికుల దృష్టి మరల్చి బంగారు నగలను దొంగిలించడంలో పేరుగాంచిన, ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బెంగళూరు రూరల్‌లోని హొసకోట పోలీసులు అరెస్టు చేశారు. చిన్నపిల్లలు వాంతులు చేసుకుంటున్నారని చెప్పి మహిళల నగలను కొట్టేశారు. ఇదే మాదిరిగా ఓ వృద్ధురాలి మెడలో ఉన్న 74 గ్రాముల బంగారు గొలుసును దొంగిలించి పారిపోయారు. ఆమె ఫిర్యాదు మేరకు హొసకోట పోలీసులు దర్యాప్తు నిర్వహించి, ముఠాలో ప్రధాన నిందితుడైన దివాకర్‌ను అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు మోనిషా, గాయత్రి, ఇంద్ర కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దివాకర్ నుంచి రూ.12 లక్షల విలువైన బంగారం, రూ.3.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కిశోరి వికాసానికి నిధుల్లేవ్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కిశోరి వికాసం కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదని ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి స్పష్టం చేశారు. ఈ నెల 6న సాక్షి దినపత్రికలో ‘కిశోరి వికాసం ఎక్కడ?’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై ఐసీడీఎస్ పీడీ స్పందించారు. సమ్మర్ క్యాలెండర్, కలెక్టర్ ఆదేశాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో బాలికలకు కిశోరి వికాసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యకమం నిర్వహణలో ఎవరైన అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని పీడీ హెచ్చరించారు. జనగణనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సాగుతున్న జనగణన ప్రక్రి యలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదని డీఆర్వో మోహన్‌కుమార్ హెచ్చరించారు. గురువారం క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతు న్న జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో, సమర్థవంతంగా నిర్వహించాలన్నా రు. జనగణన అత్యంత కీలకమైన కార్యక్రమమని చెప్పారు. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో ఈ సమాచారం కీలకమని తెలిపారు. జనగణనకు కేటాయించిన సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ విధుల్లోనే నిమగ్నం కావాలని స్పష్టం చేశారు. శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంకా సందేహాలు వ్యక్తం చేయడం, క్షేత్ర స్థాయిలో తప్పుడు సమాచారం సేకరించడం వంటి చర్యలకు పాల్పడితే వారిని తక్షణమే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 2,712 మంది ఎన్యూమరేటర్లు క్షేత్ర స్థాయిలో పనిచేయాలన్నారు. శాంతిపురం వంటి మండలాల్లో పనులు మందగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఒక నెల.. ఒక గ్రామం.. తూతూమంత్రం!
మొదటి రోజు కనిపించిన లోపాలు చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కారం చూపాల ని తలపెట్టిన ఒక నెల..ఒక గ్రామం.. కార్యక్రమం మొదటి రోజే తూతూమంత్రంగా సాగింది. అధికారులు గ్రామాలకు వస్తున్నారా లేదా చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారా అన్న సందేహం వ్యక్త మైంది. గురువారం జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, కుప్పం, పలమనేరు, నగరి నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు ఏదో మేలు చేసేలా తలపెట్టిన ఈ కార్యక్రమం అంతా షోయింగ్ కోసమేనని తేలిపోయింది. తహసీల్దార్లు ఏదో నాలుగు ముక్కలు మాట్లాడి నెమ్మదిగా జారుకున్నారు. గంట కూడా గడపలేదు! ప్రతి గురువారం ఎంపిక చేసిన గ్రామంలో తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలు క్షేత్ర స్థాయిలో పర్యటించి రెవెన్యూ, ఇతర సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే, క్షేత్ర స్థాయిలో మొదటి రోజు నిర్వహించిన కార్యక్రమంలోనే పరి స్థితి ఇందుకు భిన్నంగా కనిపించింది. కొన్ని చోట్ల సిబ్బంది కనీసం రికార్డులను కూడా తీసుకురాలేదు. మరికొన్ని గ్రామాల్లో అధికారులు గంట సేపు కూడా గడపకుండానే తిరుగుముఖం పట్టారు. అంతా తూచ్! ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం భూ సమస్యలు పరిష్కరించడం. అయితే మొదటి రోజు ఎన్ని సమస్యలు పరిష్కారమయ్యాయో వెల్లడించడానికి కలెక్టరేట్ అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. గణాంకాలను గోప్యంగా ఉంచడం చూస్తుంటే, క్షేత్ర స్థాయిలో ఆశించిన స్థాయిలో పని జరగలేదని స్పష్టమవుతోంది. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం వల్ల క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ప్రజా ధనం వృథాయేనా? కార్యక్రమాల నిర్వహణ పేరిట హడావుడి చేస్తున్నారే తప్ప, సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదని క్షేత్ర స్థా యి పరిశీలనలో తేలుతోంది. అధికారులు కేవలం ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకే పరిమితమవుతున్నారని, పర్యవేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రెవెన్యూ విశ్లేషకులు భావిస్తున్నారు. -
పోలీసుల అదుపులోకి విలేకరి హంతకులు
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో జరిగిన విలేకరి జగన్మోహన్రెడ్డి హత్య కేసులో నిందితులను వీకోట పోలీసులు కర్ణాటకలోని ఎలక్ట్రానిక్‌సిటీ పీఎస్ నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. ఇక్కడి జడ్జి నిందితులకు 15 రోజుల రిమాండ్ విధిస్తూ మదనపల్లి సబ్‌జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. నేడు దీనిపై మరో పిటిషన్ వేసి స్థానిక పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. కర్ణాటకలో అంత త్వరగా ఇవ్వని పీటీ వారెంట్ గత నెల 29న వీకోటకు చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్రెడ్డిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలం రేపింది. ఇందులో నిందితులుగా భావిస్తున్న అదే వీకోటకు చెందిన తమీమ్, అతని మేనత్త కొడుకు సుభాన్ తెలివిగా పాత కేసుల్లో కర్ణాటకలోని ఎలక్ట్రానిక్‌సిటీ పోలీసులకు హత్య జరిగిన రెండో రోజే సరెండర్ అయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి పీటీ వారెంట్ దాఖలు చేయగా వారు తిరష్కరించారు. దీంతో మళ్లీ ఇక్కడి పోలీసులు కోర్టు ఆర్డర్ ద్వారా పీటీ వారెంట్ తీసుకున్నారు. పలమనేరు కోర్టుకు తరలింపు నిందితులను కర్ణాటక నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య వీకోట సీఐ సోమశేఖర్‌రెడ్డి, ఎస్ఐ షేక్షావలి వారి సిబ్బందితో కలిసి గురువారం పలమనేరు కోర్టుకు తీసుకొచ్చారు. దీనిపై న్యాయమూర్తి వీరికి 15 రోజుల రిమాండ్ విధిస్తూ పలమనేరులో జైలు లేనందున మదనపల్లికి తరలించాల్సిందిగా ఆదేశించారు. నేడు పోలీసులు స్థానిక కోర్టులో పిటిషన్ ఫైల చేసి నిందితులను కస్టడీకి కోరనున్నట్టు స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. తేలనున్న వాస్తవాలు స్థానిక పోలీసులు పది రోజుల కస్టడీకీ కోర్టును కోరే అవకాశం ఉన్నా కోర్టు ఆదేశాల మేరకు ఎన్ని రోజులనే విషయం నేడు తేలనుంది. ఆపై నిందితులను సమగ్రంగా విచారించాకే విలేకరిపై హత్యకు సంబంధించిన వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంటుంది. -
‘నారాయణ’ఆగడాలు అరికట్టాలి
– కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకుల ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు, అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. గురువారం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న నారాయణ కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా రంగాన్ని వ్యాపారంగా మార్చేసి, విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రస్తుతం నారాయణ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అధికారిక షెడ్యూల్ రాకముందే ముందస్తు అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. నారాయణ కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల విషయంలో విద్యార్థులను వేధించడం ఆపాలని, లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేష్, లోహిత్, లిఖిత్, మనోజ్, గౌరవ్, గురు, నాని, లలిత్ పాల్గొన్నారు. రైతుల సమక్షంలోనే భూముల రీ సర్వే తవణంపల్లె: రైతుల సమక్షంలోనే భూముల రీసర్వే జరగాలని జిల్లా సర్వే శాఖ డీడీ జయరాజ్ మండల సర్వేయర్లను ఆదేశించారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న భూ రీసర్వేను ఆయన తనిఖీ చేశారు. గోనెపల్లెలో జరుగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్ భూముల రీసర్వేని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూముల రీసర్వేకు ముందు సర్వే సిబ్బంది నోటీసులు ఇస్తున్నారా.. లేదా సర్వే సక్రమంగా చేస్తున్నారా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈకేవైసీ యాప్ ద్వారా తప్పనిసరిగా సర్వే చేయలని గ్రామ సర్వేయర్లను ఆదేశించారు. భూ రీసర్వేలో వీఆర్ఓలు, వీఆర్ఏలు గైర్హాజరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా డీడీ రైతులతో మాట్లాడారు. భూముల గట్ల హద్దులను కచ్చితంగా చూపి గట్లు మేరకు రోవర్ సహాయంతో కో ఆర్డినేట్స్ చేసుకొని రీ సర్వే పారదర్శకంగా చేయాలని తెలిపారు. పైమాఘం, పుణ్యసముద్రం గ్రామాల్లో జరిగిన రీసర్వే వెక్టరైజేషన్ను తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ చేశారు. గత నెలలో హద్దు తగాదా ఫైల్‌ను తనిఖీ చేసి ఫోన్ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడారు. కార్యక్రమంలో సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఎం. కృష్ణమూర్తి, మండల ప్లాంట్ సర్వేయర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
ప్రకృతి పచ్చ సంపద
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇసుక, గ్రావెల్, మట్టి బంగారమైంది. ఇవి అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అనధికారికి అనుమతులతో రేయింబవళ్లు యథేచ్ఛగా పొరుగునే ఉన్న తమిళనాడుకు తరలించేస్తున్నారు. అయినా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఈ నెలవారీ మామూళ్లలో ఓ పచ్చ మంత్రికీ వాటాలు వెళుతున్నట్లు సమాచారం. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడడంతోపాటు ప్రకృతి విధ్వంసం అవుతోంది. సాక్షి టాస్క్‌ఫోర్స్: ప్రకృతి సంపదను అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వంలోని ఓ మంత్రి ఆదేశాలతో అధికార బృందం అనుమతులు ఇచ్చింది. అధికారుల అండతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో మైనింగ్ దొంగలు చెలరేగిపోతున్నారు. అక్రమంగా తవ్వి విక్రయించే సొమ్ము నుంచి నాలుగు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు వెళ్తున్నట్లు సమాచారం. అలాగే ఆ మంత్రికి కూడా అక్రమ సంపాదనలో నెలనెలా డబ్బుల పంపుతున్నట్టు కూటమికి చెందిన ఓ నాయకుడు తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజక వర్గం నుంచి ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ సంపాదనలో మామూళ్లు తీసుకెళ్లి ఇవ్వాల్సిందేనని చెప్పడం విశేషం. తిరుపతి, చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, చంద్రగిరి, నగరి, గంగాధనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు నియోజక వర్గాల పరిధిలో గత రెండేళ్లుగా విచ్చలవిడిగా ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ తవ్వకాలు జరిపి తమిళనాడుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ అక్రమాల విషయం ప్రతి రోజూ ఏదో ఒక పత్రిక, మీడియాలో ప్రసారం అవుతున్నా.. రెండు రోజులు ఆపి, మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. అలా కొనసాగించడానికి కారణం ఏమిటని కూటమి నేతలను ఆరా తీస్తే.. ‘మాదేం లేదు. నెలనెలా ఆ మంత్రికి తీసుకెళ్లి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమైంది, ఈ నెల రాలేదు’ అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు అడ్డుకోవడం మర్చిపోయారు ప్రకృతి సంపదను అక్రమంగా తవ్వి, తరలించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపేవారు. కేసులు పెట్టడం, అపరాధ రుసుములు వసూలు చేయడం చేసేవారు. అందుకే అక్రమార్కులు ఆ పనులకు వెళ్లాలంటే భయపడేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ ప్రయత్నాలే చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలు, రవాణా గురించి అధికారులకు సమాచారం ఉన్నా.. స్థానికులు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారి కరువయ్యారు. అక్రమాలకు అధికారే అనధికారిక అనుమతులు ఇవ్వడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాగలాపురం మండలంలో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలుగుడిపాల మండలం మంచినీళ్ల కుంట వద్ద డంప్‌చేసిన ఇసుక అనుమతులు ఇలా.. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో భారీగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమంగా తవ్వి, తరలించాలంటే ముందుగా జిల్లా అధికారి ఒకరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు సమర్పించాలి. ఆ తరువాత స్థానికంగా ఉన్న నాలుగు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు ఇచ్చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయిలో పంపకాలు ఇలా ఉంటే.. మంత్రి గారికి ప్రతి వాహనానికి రూ.వెయ్యి ఇచ్చేయాలి. అలా రోజుకు ఎన్ని వాహనాల ద్వారా ఇసుక, మట్టి, గ్రావెల్ తరలిస్తే అన్ని రూ.వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క సత్యవేడు నియోజక వర్గంలోనే 41 క్వారీలు ఉంటే.. రోజుకి 50 వాహనాలు, నెలకు 25 వేలు ట్రిప్పులు తరలిస్తున్నాయి. ఈ లెక్కన ఒక సత్యవేడు నియోజక వర్గం నుంచే నెలకు సుమారు రూ.3 కోట్లు మామూళ్లు వెళుతున్నట్లు అంచనా. ఒక్క సత్యవేడు నియోజక వర్గం నుంచే ఇలా ఉంటే.. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని మిగిలిన ఏడు నియోజక వర్గాల నుంచి నెలకు ఎంత మొత్తంలో అక్రమ రవాణా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నియోజక వర్గాల్లో మాత్రం ఎక్కువ శాతం స్థానిక నాయకులే జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు అధికారిక అనుమతులు రేయింబవళ్లు తరలింపు.. అక్రమ సంపాదన కోసం స్థానిక టీడీపీ నేతలు రేయింబవళ్లు ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారు. భారీ యంత్రాల ద్వారా తవ్వి పక్కనే ఉన్న తమిళనాడుకు తరలిస్తున్నారు. టిప్పర్ల ద్వారా తరలించి తమిళనాడులో అధిక ధరకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమ తవ్వకాల గురించి ఎవరైనా మాట్లాడితే వారిపై దాడులకు తెగబడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీల వద్దకు గుర్తు తెలియన వ్యక్తులకు అనుమతులు ఉండవు. క్వారీల సరిహద్దుల్లోనే అనుచరులను కాపాలా ఉంచుతున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి క్వారీలోకి ప్రవేశిస్తుంటే.. వెంటనే అక్రమార్కులకు సమాచారం ఇస్తారు. కొత్త వ్యక్తిని ఫాలో అవుతారు. క్వారీ వివరాల కోసమే వెళ్లి ఉంటే వారిపై దాడులకు తెగబడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విలేకరులు ఎవరైనా వెళితే.. వారిపైనా దాడులకు యత్నిస్తున్నట్లు తెలిసింది. -
వేతనాల వెం‘బడి’!
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని ఎయిడెడ్ విద్యాసంస్థల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. పనిలేని చోట జీతాలు.. పిల్లలు లేని చోట టీచర్లు అన్నట్టు తయారయ్యాయి. లోపాలను గుర్తించినా, నివేదికలు సిద్ధంగా ఉన్నా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కించడం వెనుక మతలబు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఖాళీ బెంచీలకు పాఠాలు విద్యార్థులే లోని చోట సైతం టీచర్లు యథేచ్ఛగా కొనసాగుతున్నారు. కొన్ని చోట్ల విద్యార్థులకంటే టీచర్లే ఎక్కువగా ఉన్నారు. మరికొన్ని చోట్ల కనీసం విద్యార్థి, టీచర్ల నిష్పత్తి లేకపోయినప్పటికీ అదనంగా మరికొందరు టీచర్లు తిష్టవేసి ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్నారు. ఇది కేవలం బాధ్యతా రాహిత్యమే కాదు, అక్షరాలా ప్రజాధనాన్ని దోచిపెట్టడమేనని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. లోపాల నివేదికలు బుట్టదాఖలు ఎయిడెడ్ పాఠశాలల్లోని లోపాల నివేదికలను విద్యాశాఖ అధికారులు బుట్టదాఖలు చేస్తున్నా రు. అక్రమాలను అరికట్టే బాధ్యతను ఆర్జేడీ, ప్రా థమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులకు అప్పగించినా క్షేత్ర స్థాయిలో మార్పు మాత్రం శూన్యమే. ప్రక్షాళన ఎప్పుడో? ఎయిడెడ్ పాఠశాలల్లో నిధులు వృథా అవుతున్నా యి. ఒక వైపు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొర త వేధిస్తుంటే, మరోవైపు ఎయిడెడ్ విద్యాసంస్థ ల్లో పని లేకుండానే వేతనాలు చెల్లించడం ఎంత వరకు సమంజసం అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వెంటనే జిల్లా వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపై క్షేత్ర స్థాయి విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేని పిల్లలను ఉన్నట్టు చూపించి..! కొన్ని ఎయిడెడ్ యాజమాన్యాలు లేని విద్యార్థుల ను ఉన్నట్లు చూపించి పోస్టులను కొనసాగిస్తూ చాన్నాళ్లుగా లబ్ధిపొందుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం యూడైస్ లెక్కలను పక్కా గా నిర్వహిస్తోంది. ఆధార్ నంబర్ ప్రకారం విద్యార్థి పేరు ఒక పాఠశాలలోనే ఉండాలి. జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న ఎయిడెడ్ పాఠశాలలో తక్కువ మంది విద్యార్థులున్నప్పటి కీ తప్పుడు నివేదికలు అమలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఆ యాజమాన్యాలతో లోపాయికారీ అవగాహన చేసుకుని.. కోర్టుపరమైన సాకులను బూచీగా చూపుతూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఉద్యోగోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రభుత్వ జూని యర్ కళాశాలల నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని నాన్ టీచింగ్ అసోసియేషన్ కందాటి విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న నాన్–టీచింగ్ సిబ్బంది ఉద్యోగోన్నతులు వెంటనే చేపట్టాలన్నారు. ఇటీవల రికార్డ్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతులు కల్పించడం హర్షణీయమన్నారు. ఇదే విధంగా మిగిలిన కేడర్ల ఉద్యోగోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంబులెన్సుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్ పూతలపట్టు(యాదమరి): మండల పరిధిలోని రంగంపేట క్రాస్ వద్ద క్షతగాత్రులతో ప్రయాణిస్తున్న అంబులెన్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. స్థానికుల కథనం మేరకు.. గురువారం మధ్యాహ్నం చితూరు నుంచి తిరుపతి వైపు అంబులెన్సు వాహనం ప్రయాణిస్తోంది. అదే సమయంలో పాలకూరు వైపుగా వస్తున్న ట్రాక్టర్ ఫ్లైఓవర్ వద్ద మలుపు తిరుగుతుండగా అంబులెన్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్సు బోల్తా పడి దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న సిబ్బందితో పాటు రోగులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, వాహనదారులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. -
టమాట బాక్సు ధర రూ.350
పలమనేరు: పలమనేరు టమాటా మార్కెట్లో గురువారం 15 కిలోల బాక్సు రూ.350 దాకా పలకింది. భారీ పెట్టుబడులు పెట్టి సాగుచేసిన రైతులకు నష్టాలు తప్పవేమోనని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇలాగే కొనసాగితే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. బాక్సు రూ.400 విక్రయిస్తే కొంత మేర గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. ఎకరానికి పెట్టుబడి రూ.3లక్షలు ప్రస్తుతం ఈ ప్రాంతంలో హైబ్రిడ్ రకాలైన పవర్అప్, సాహో, జయహో, ప్రభాకర్ సీడ్స్, సింజెంటా కంపెనీలకు చెందిన రకాలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఎకరంలో టమాట సాగుకు రూ.3 లక్షల దాకా పెట్టుబడి అవుతున్నట్టు రైతులు పేర్కొంటున్నారు. రైతుకు తప్ప అందరికీ లాభమే పంట కోసం వచ్చే కూలీలకు రోజుకు రూ.400, ర వాణా చేసే వారికి, మండీలోని కూలీలు, వ్యాపారు ల కమీషన్ ఇలా అందరికీ గ్యారెంటీ లాభాలుండగా కేవలం రైతుకు మాత్రమే నష్టాలు తప్పడం లేదు. 1000 బాక్సులైతే పంట దిగుబడి బాగా వచ్చి 1000 బాక్సులు కోస్తే ఇప్పుడున్న ధర రూ.350తో రూ.3.5 లక్షలు, బాక్సు ధర రూ.200 అయితే రూ.2 లక్షలు, సగటున రూ.250 అయితే రూ.2.5 లక్షలు మాత్రమే గిట్టు బాటు అవుతుంది. బాక్సు ధర రూ.400గా ఉంటేనే గిట్టుబాటు గా ఉంటోంది. కష్టంగా మారింది ప్రస్తుతం రోజుకు 50 బాక్సుల టమాటా మార్కెట్‌కు వేస్తున్నా. ఎకరా పొలంలో పంటసాగుకు రూ.2.7 లక్షలు ఖర్చుపెట్టా. ఇప్పు డున్న ధరలుంటే పెట్టుబడి దక్కుతుంది. ధరలు తగ్గుముఖం పడితే మా పరిస్థితి గోవిందా. అందుకే ప్రభుత్వం మద్దతు ధరను పెట్టాలి. – కృష్ణారెడ్డి, టమాట రైతు, పెద్దవెలగటూరు, పెద్దపంజాణి మండలం -
అపోలోలో ఘనంగా ఫిజియోక్వెస్ట్–2026
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులోని అపోలో నాలెడ్జ్ సిటీలో గురువారం ‘ఫిజియోక్వెస్ట్–2026’ దక్షిణ భారత స్థాయి ఇంటర్–స్టేట్ ఫిజియా లజీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి నాలెడ్జ్ సెంటర్ ఆడిటోరియంలో ఫిజియాలజీ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దక్షిణాది నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు పాల్గొని కేస్–బేస్డ్ లెర్నింగ్‌కు సంబంధించిన వినూత్న ప్రాజెక్టులు, ఎగ్జిబిట్స్ను ప్రదర్శించారు. అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ హెచ్.వినోద్ భట్ మాట్లాడుతూ, ఫిజియాలజీ, బేసిక్ సైన్సెస్ వైద్య విద్యకు బలమైన పునాదులు, వైద్య విద్యలో బేసిక్ సైన్సెస్‌పై స్పష్టమైన అవగాహన ఎంతో అవసరమన్నారు. తాము విద్యార్థి దశలో బేసిక్ సైన్సెస్ అధ్యయనానికి ఎక్కువ సమయం కేటాయించేవారమని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఏఐఎంఎస్ఆర్డీన్డాక్టర్ అల్ఫ్రెడ్ జె.అగస్టీన్, ఫిజియాలజీ విభాగాధిపతి, ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ రమ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి.విజేత, న్యాయనిర్ణేతలు డాక్టర్ శరణ్ బి.సింగ్, డాక్టర్ పి.శశికళ, అంతర్గత న్యాయనిర్ణేతలు, అధ్యాపకులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మెడికల్ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. -
నేనున్నానమ్మా!
కలెక్టర్ సుమిత్‌కుమార్ అధికార దర్పాన్ని పక్కనబెట్టారు. తనలో ఉన్న దయార్థహృదయాన్ని బయటకు తీశారు. ఉలుకూపలుకు లేకుండా ఓ చింత చెట్టు వద్ద పడి ఉన్న వృద్ధురాలిని అక్కున చేర్చుకున్నారు. ఆస్పత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటిచెప్పారు. వివరాలు.. చిత్తూరు నగరంలోని గంగనపల్లె కూడలిలో ఉన్న చింతచెట్టు వద్ద ఓ అవ్వ దీనస్థితిలో పడి ఉండడాన్ని కొందరు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. స్పందించిన కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆమెను ఆస్పత్రిలో చేర్పించాలని గురువారం అధికారులను ఆదేశించారు. అవ్వ బాగోగులు చూసుకోవాలని మెప్మా అధికారులను ఆదేశించారు. దీంతో వృద్ధురాలిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్య సేవలందిస్తున్నారు. – చిత్తూరు అర్బన్ -
నిరీక్షణ
జిల్లాలో పల్లెపండుగ 2.0 నిధుల విడుదలలో జాప్యం నెలకొంది. కూటమి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు వరకు మాత్రమే నిధులు విడుదల చేసింది. అప్పటి నుంచి ఒక్క పైసా విడుదల చేయలేదు. ఇప్పటికే చాలా చోట్ల పనులు చేసి.. నిధుల కోసం కాంట్రాక్టర్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తోంది. అప్పు చేసి.. వడ్డీలు కట్టలేక.. బిల్లులు రాక ఆపసోపాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆగస్టు వరకు చేసిన పనులకే బిల్లులు చిత్తూరు కార్పొరేషన్: కాంట్రాక్టర్లు కూటమి ప్రభుత్వ హామీలు నమ్మారు. వడ్డీలకు అప్పు చేసి పల్లెల్లో రోడ్ల పనులు పూర్తి చేశారు. అధికారులకు క్యాడర్ వారీగా ఇవ్వాల్సిన మామూళ్లూ ఇచ్చేశారు. తీరా బిల్లులు రాక అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో జరిగిన పల్లెపండు 2.0 పనులకు సంబంధించి గత ఏడాది ఆగస్టు వరకు మాత్రమే బిల్లులు చెల్లింపులకు ఉత్తర్వులు వచ్చాయి. మిగిలిన ఎనిమిది నెలల బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. జిల్లాలో జరిగిన పనులు జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం సీసీ రోడ్లు, అప్రోచ్‌రోడ్లు, బీటీరోడ్డు, కాంపౌండ్‌వాల్స్, బీటీరోడ్డు పనులన్నీ కలిపి మొత్తం 1,763 పనులు మంజూరయ్యాయి. వీటికి రూ.184.93 కోట్ల మేర మంజూరు చేశారు. ఇందులో 479 పనులు పూర్తవ్వగా వాటి కోసం రూ.50.02 కోట్లు ఖర్చు చేశారు. వివిధ దశ ల్లో 138 పనులు ఉన్నాయి. వాటి కోసం రూ.14.48 కోట్లు ఖర్చు చేశారు. ఆ లెక్కన మొత్తం రూ.64.50 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఆగస్టు వరకు జరిగిన పనులు రూ.10 కోట్లు వరకు ఉన్నాయి. మంజూరైన మొత్తంలో ఆమోదం తెలిపినవి రూ.36.29 కోట్లు పనులు ప్రారంభం కాలేదు. సీసీ రోడ్లు 24.40 కి.మీకి 1,462 పనులు మంజూరు అవ్వగా రూ.9.85 కోట్లు మంజూరు చేశారు. అలాగే సీసీ అప్రోచ్‌రోడ్లు 55.19 కి.మీ గాను 115 పనులకు రూ.28.73 కోట్లు, బీటీరోడ్లు 106.27 కి.మీ 148 పనులకు రూ.68.43 కోట్లు, కాంపౌండ్ వాల్స్ 3 కి.మీ 32 పనులకు రూ.2.72 కోట్లు, బీటీరోడ్లు(ఆర్అండ్బీ) 4.75 కి.మీ 6 పనులకు రూ.2.16 కోట్లు మంజూరు చేశారు. ఈ లెక్కన 184.93 కోట్లు పనులకు మంజూరు కాగా అందులో రూ.50 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.14.48 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.36.29 కోట్లు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఉపాధి సాఫ్ట్‌వేర్‌తో ఇబ్బందులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వీబీజీ రాంజీగా మార్పు చేశారు. సాఫ్ట్‌వేర్‌ను కూడా అందుకు అనుగుణంగా మారుస్తున్నారు. దీనివల్ల ఉపాధి పనులకు సంబంధించి పాత బిల్లులకు ఇబ్బంది కలగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎంజీఎన్ఆర్ఈఎస్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం భరిస్తోంది. అలాగే లేబర్ కాంపోనెంట్ వందశాతాన్ని కేంద్రమే భరిస్తోంది. ప్రస్తుతం పేరు, సాఫ్ట్వేర్ మారుస్తున్న నేపథ్యంలో మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్ 60 శాతం కేంద్రం, రాష్ట్రం 40 శాతాన్ని భరించాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభ్తుత్వం తన వాటాను నిర్ణీత సమయంలోగా విడుదల చేయకపోతే, పాత బిల్లులు వీబీజీ రాంజీ సాఫ్ట్‌వేర్‌లో మెర్జ్ అయితే మెటీరియల్ కాంపోనెంట్ శాతం తగ్గే ప్రమా దం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పల్లెపండుగ 2.0 నిధుల విడుదలలో జాప్యం డబ్బులు రావాల్సి ఉంది ఎన్ఆర్జీఎస్ ద్వారా జరిగిన పనులకు సంబంధించి డబ్బులు రావాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టు వరకు జరిగిన పనులకు బిల్లులు ఆప్‌లోడ్ చేయాలని ఆదేశాలొచ్చాయి. దీనికి తోడు ఉపాధి సాఫ్ట్వేర్ మారడం వల్ల కొంత ఆలస్యం అవుతోంది. బిల్లులు విడతల వారీగా నిధులు వచ్చిన వెంటనే విడుదల అవుతాయి. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఈ , పీఆర్ 2025 ఆగస్టు వరకు చేసిన పనులకే బిల్లుల అప్లోడ్ చేయాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే అంతవరకు దాదాపు రూ.10 కోట్లు వరకు మాత్రమే పనులు చేశారు. మొత్తం రూ.64.50 కోట్ల పనులు జరిగితే పది కోట్ల పనులకు మాత్రమే బిల్లులను ఆప్‌లోడ్ చేయాలని ఆదేశాలు రావడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఆగస్టు తర్వాతనే పనులు ఎక్కువగా జరిగాయి. ఆ పనులకు బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. -
నాణ్యత గాలికి
తమ్ముళ్లు బిల్లులు కోసం నాసిరకంగా పనులు చేసి వదిలేశారు. అనేక చోట్ల సీసీ రోడ్లు ఇప్పటికే పగళ్లు వచ్చాయి. వీటిపై పీఆర్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజినీర్లు కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్ల పనులను ఇంకా చెక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తయిన పనులకు వంద శాతం బిల్లుల చెల్లింపు జరగద ని, మొత్తం బిల్లుల్లో 15 శాతాన్ని డిపాజిట్‌గా ఉంచుకొని, క్వాలిటీ చెక్ చేసిన అనంతరం మొత్తాన్ని విడుదల చేస్తామని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఐచర్
గంగవరం: ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో బుధువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పెద్దపంజాణి మండలం, దాసనంపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి కుమారుడు నవీన్ అలియాస్ నరేష్(27) ఓ కోళ్ల హ్యాచరీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పలమనేరు నుంచి పల్సర్ బైక్‌లో స్వగ్రామం దాసనంపల్లికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలోని కోగిలేరు చెక్‌పోస్టుకు సమీపంలో వెళ్తుండగా పలమనేరు వైపు వెళ్తున్న ఐచర్ వాహనం బైక్‌ను ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడి తల భాగంలో తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్వీ జూపార్క్ క్యూరేటర్‌గా అనురాగ్ మీనా
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2020 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి అనురాగ్ మీనా బుధవారం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూపార్క్) క్యూరేటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అటవీ సంరక్షకుడిగా పదోన్నతి పొంది కర్నూలు సర్కిల్‌కు బదిలీ అయిన సెల్వం స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్‌కు చెందిన అనురాగ్ మీనా వన్యప్రాణుల నిర్వహణలో తనకున్న అపారమైన అనుభవంతో కొత్తగా బాధ్యతలను చేపట్టారు. ఇంతకుముందు రైల్వే కోడూరులో సబ్–డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (సబ్–డీఎఫ్ఓ)గా, ఆ తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని నంద్యాలలో ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించేందుకు విచ్చేసిన అనురాగ్ మీనాకు ఎస్వీ జంతు ప్రదర్శనశాల అధికారులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. -
మామిడి పరిశ్రమలపై ప్రత్యేక నిఘా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మామిడి పరిశ్రమలపై ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉండాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో ఉద్యానవన శాఖ అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహించాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారని, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సీఎం నేరుగా సమీక్ష నిర్వహిస్తారన్నారు. ఆలోపు క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.మామిడి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు రైతులకు సుమారు రూ.6.70 కోట్ల ప్రొటెక్షన్ కవర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. బంగారుపాళ్యం, పూతలపట్టు, కుప్పం ప్రాంతాల్లోని పల్ప్ యూనిట్ల ప్రస్తుత పరిస్థితిని ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రామాంజనేయులు, మురళి, కోటేశ్వరరావు, పరమేశ్వరన్ పాల్గొన్నారు. -
‘పవర్’లేని అధికారులు?
చిత్తూరు కార్పొరేషన్: పల్లె పాలనకు పెద్దపీట వేస్తామని చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. ఏదో ఒక సాకుతో పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం లేదు. సర్పంచుల పదవీ కాలం ముగయడంతో జిల్లాలోని 622 పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించారు. కానీ వారికి వేతనాల చెల్లింపులు, ఇతర పనులకు అనుమతి ఇవ్వలేదు. గత రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు లేకుండా అల్లాడుతున్నారు. అదే ఉద్యోగులకు నెలరోజులు జీతం ఇవ్వకపోతే ఉరుకుంటారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదీ దుస్థితి పాలనా పగ్గాలు చేపట్టిన ప్రత్యేకాధికారులు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. అధికారాలు కాగితాలపైనే తప్ప కార్యాచరణలో కనిపించడం లేదు. బాధ్యతలు చేపట్టి నెల రోజులు గడుస్తున్నా వారికి ఏ మాత్రం అధికారాలు ఉన్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏప్రిల్ రెండో తేదీతో జిల్లాలోని 622 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవీ కాలం ముగిసింది. ఆయా స్థానాల్లో వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా కలెక్టర్ నియమించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 13 లక్షల మంది జనాభా ఉన్నారు. ఆయా గ్రామాల్లో వీధిలైట్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో చేతిపంపుల మరమ్మతులు, చిన్న చిన్న తాగునీటి ట్యాంకులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా మండల పరిషత్ అధికారులు చేయిస్తున్నారు. వారు ఎంత పర్యవేక్షించినా వేతనాల విషయం వచ్చేటప్పటికి వారికి చేతి చమురు వదిలించుకోక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. కారణం ఆయా అధికారులకు చెక్ పవర్ లేకపోవడమే.రెండు నెలలుగా పెండింగ్ చర్యలు తీసుకుంటున్నాం ప్రత్యేకాధికారుల నుంచి ఆధార్ నెంబర్‌తో లింక్అయిన మొబైల్ నంబర్ ఇతర వివరాలను ఆప్డేట్ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇబ్బందులు లేకుండా సకాలంలో పనులు చేయాలని తెలియజేశాం. పల్లెల్లో బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక అధికారుల థంబ్ ఆప్డేట్కు చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లిస్తాం. – సుధాకర్‌రావు, డీపీఓప్రత్యేకాధికారులకు డ్రాయింగ్ పవర్ తప్పనిసరి. బిల్లులపై సంతకాలతో పాటు స్టాంప్ తదితర ధ్రువీకరణలు నమోదు చేయాలి. అనంతరం ఆన్లైన్లో థంబ్ ఇంప్రషన్ వేస్తేనే బిల్లు పాసయ్యేది. కానీ నాలుగు రోజుల క్రితమే ఆయా ప్రత్యేకాధికారుల నుంచి తంబ్ ఇంప్రెషన్ అథారిటీ అనుమతుల కోసం మండల పరిషత్ అధికారులు ఆధార్ నెంబర్‌తో పాటుగా దాంతో లింక్ అయిన మొబైల్ నెంబర్ వంటి వివరాలను సేకరించారు. జిల్లాలో మొత్తం 27 మండలాలు 622 పంచాయతీలు 5,914 వార్డులు ఉండగా వెయ్యి మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీరికి నెలకు రూ.6 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ ప్రక్రియలో జాప్యం వల్ల గ్రామాల్లో చేసిన పనులకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కానీ, జనరల్ ఫండ్ నుంచి కానీ బిల్లుల చెల్లింపులు జరగడం లేదని గ్రామ పంచాయతీల అధికారులు వాపోతున్నారు. కనీసం పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఇవ్వాలన్నా ప్రత్యేకాధికారి అనుమతితోనే ఇవ్వాల్సిన పరిస్థితి. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి వారికి వేతనాలు చెల్లించలేదని తెలుస్తోంది. -
అరీష్.. అదుర్స్!
చిత్తూరు కలెక్టరేట్: అతను పుట్టింది ఒక మారుమూల గ్రామంలో.. పెరిగింది వ్యవసాయ కుటుంబంలో.. చదివింది ప్రభుత్వ పాఠశాలలో.. కానీ, లక్ష్యం మాత్రం ఆకాశమంత. పట్టుదలే పెట్టిబడిగా, కృషినే ఆయుధంగా మలచుకుని ప్రస్తుతం అమెరికాలోని కనెక్టికట్ దేశంలో వైద్య రంగంలో సర్జికల్ రోబోటిక్స్ విభాగంలో తనదైన ముద్ర వేస్తున్నారు చిత్తూరు జిల్లా యువ ఇంజినీర్ అరీష్ దండు. గంగాధరనెల్లూరు మండలం, లక్ష్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాలయ్య, శాంతి దంపతుల కుమారుడు అరీష్ దండు. తండ్రి సామాన్య రైతు. అరీష్ గ్రామీణ వాతావరణంలో పెరిగినా, ఆయన కళ్లు మాత్రం ఎప్పుడూ ఆకాశమంత ఎత్తులో ఉండే లక్ష్యాల వైపు చూసేవి. చిన్నప్పటి నుంచి వినూత్న ఆలోచనలతో ఉండేవారు. ఇంజినీరింగ్ విద్యపై మక్కువతో అంచలంచెలుగా ఎదుగుతూ అమెరికా చేరుకున్నారు. అక్కడ పదేళ్లకు పైగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, హెల్త్‌కేర్ రంగాల్లో విశేష అనుభవం గడించారు. సాధారణ ఇంజినీరింగ్‌గా కెరీర్‌ను ప్రారంభించి, నేడు అత్యంత క్లిష్టమైన సర్జికల్ ఇన్నోవేషన్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగారు. భావితరాలకు మార్గదర్శి అరీష్ దండు ఈ ఏడాది ఏప్రిల్‌లో జాన్ ఎస్.మార్టినెజ్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో 150 మందికి పైగా విద్యార్థులకు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్‌మెటిక్స్) రంగాల ప్రాముఖ్యతను వివరించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన మెకానికల్ ఇంజినీరింగ్ సదస్సులో పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు. పల్లె బడిలో పడిన పునాది అరీష్ జిల్లాలోని గంగాధనెల్లూరు మండలం నెల్లేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి వరకు విద్యనభ్యసించారు. ఆయన ఉన్నత చదువుల అనంతరం ప్రతిభకు గుర్తింపుగా అమెరికాలో అవకాశాలు వరించాయి. ప్రస్తుతం న్యూయార్క్ సమీపంలోని కనెక్టికట్‌లో ఉన్న మెడికల్ డివైజ్ కంపెనీలో 15 సంవత్సరాలుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అరీష్ దండు తన సాంకేతిక నైపుణ్యంతో రెండు అమెరికా పేటెంట్లను (యూఎస్ 11,585,042 బీ2) (యూఎస్ 11,993,890 బీ2) సాధించి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటారు. సర్జికల్ జైన్లలో ఆయన చేసిన మార్పులు వైద్య పరికరాల రంగంలో మైలురాళ్లుగా నిలిచాయి. కేవలం వృత్తికే పరిమితం కాకుండా ఏఎస్ఎంఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ రివ్యూయర్‌గా ఉంటూ అంతర్జాతీయ స్థాయిలో కొత్తగా వచ్చే ఇంజినీరింగ్ ఆవిష్కరణలను సమీక్షించడం, వాటికి దిశానిర్దేశం చేయడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సర్జికల్ రోబోటిక్స్‌లో సరికొత్త విప్లవం అరిష్ దండు రోబోటిక్ సర్జరీ విభాగంలో తన ముద్ర వేశారు. రోబోటిక్ ఆర్మ్, సర్జికల్ ఆర్మ్ వ్యవస్థల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. శస్త్ర చికిత్సలు మరింత ఖచ్చితత్వంతో, తక్కువ రిస్క్‌తో జరిగేలా ఆయన డిజైన్ చేసిన పరికరాలు తోడ్పడుతున్నాయి. వైద్య సేవలు ఖరీదైనవిగా మారుతున్న తరుణంలో, నాణ్యత తగ్గకుండా ఉత్పత్తుల తయారీ ఖర్చును ఎలా తగ్గించవచ్చో ఆయన నిరూపిస్తున్నారు. -
జూదరుల అరెస్ట్
యాదమరి: అక్రమంగా కోడి పందేలు నిర్వహిస్తున్న జూదరులపై పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. ఆయన కథనం మేరకు...బుధవారం మండల పరిధి గొందివాండ్లవూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కోడి పందేలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో దాడులు చేశామన్నారు. గొందివాండ్లవూరుకు చెందిన గోవిందరాజులు, తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు చెందిన దామోదరంను అరెస్టు చేసి వారి నుంచి రూ.2,400 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మరి కొంత మంది నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. తెగి పడిన విద్యుత్ తీగలు తవణంపల్లె: మండలంలోని వెంగంపల్లెలో బుధవారం కరెంట్ తీగలు తెగిపడి మామిడి చెట్లు దగ్ధమైనట్లు బాధిత రైతు ఎం.రెడ్డెప్ప తెలిపారు. వెంగంపల్లె సమీపంలో తన పొలంలో విద్యుత్ లేన్లు వెళుతున్నాయని చెప్పారు. రెండు రోజుల క్రితం కరెంటు తీగలు తెగిపడడంతో నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగినట్టు వెల్లడించారు. ఈ మేరకు తవణంపల్లె తహసీల్దార్, వీఆర్ఓకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 30 చెట్లు అగ్నికి ఆహుతైనట్లు వివరించారు. ట్రాక్టర్‌ను ఢీకొన్న కంటైనర్ చంద్రగిరి: ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి కంటైనర్ ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్‌లోని ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడిన ఘటన ముంగళిపట్టు సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాకాల మండలం దామలచెరువు నుంచి తిరుపతికి ఓ ట్రాక్టర్లో కూలీలు మామిడికాయల ఖాళీ బాక్సులు వేసుకుని బయలుదేరారు. ట్రాక్టర్ ముంగళిపట్టు సమీపంలో వస్తుండగా బెంగళూరు నుంచి తిరుపతి వస్తున్న కంటైనర్ వెనుక నుంచి ఢీకొంది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న దామలచెరువుకు చెందిన కూలీలు గిరి, శోభ, గోపి, మంజు, డ్రైవర్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ తీగలు పడి వ్యక్తి మృతి తిరుపతి రూరల్: విద్యుత్ తీగలు తెగిపడటంతో షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన దుర్ఘటన తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో బుధవారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. పుత్తూరు మండలం కై లాసపురానికి చెందిన ఓబుల్ నాయుడు, ప్రభావతి దంపతులు పదేళ్ల క్రితం తిరుపతిలోని గాంధీపురం పంచాయతీ శ్రీనగర్ కాలనీకి వచ్చి నివాసముంటున్నారు. హమాలీగా పనిచేసే ఓబుల్ నాయుడు బుధవారం పనులు ముగించుకుని వర్షం ఆగిన తరువాత నడిచి వెళ్తుండగా తన ఇంటికి సమీపంలోని ఓ విద్యుత్ తీగ తెగి అతనిపై పడింది. షాక్‌కు గురైన ఓబుల్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తన భర్త మరణానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. పాలసముద్రం : మండలంలోని ఆముదాల పంచాయతీ, గొల్లకండ్రిగ బీసీ కాలనీలో గుక్కెడు నీటి కోసం స్థానికులు నానా ఇక్కట్లు పడుతున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ పలువురు ఖాళీ బిందెలతో బుధవారం నిరసన చేపట్టారు. నెల రోజుల క్రితం గ్రామంలోని తాగునీటి బోరు మోటారు మరమ్మతులకు గురైంది. దీన్ని ఇంతవరకు రిపేరు చేయకపోవడంతో నీటి ఇక్కట్లు ఎక్కువయ్యాయి. అధికారులు స్పందించి బోరు మోటారు, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేయించాలని కోరారు. -
మామిడి రైతులను ఆదుకోవాలి
బంగారుపాళెం: మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని మొగిలివెంకటగిరి గ్రామంలో మాజీ సమితి అధ్యక్షుడు తులసీరామకృష్ణారెడ్డి నివాసంలో స్థానిక నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత రెండు రోజులుగా అకాలవర్షం, పెనుగాలల ధాటికి మామిడితోటల్లో కాయలు నేలపాలయ్యాయన్నారు. గాలీవానకు తోటల్లో టన్నుల కొద్దీ మామిడి కాయలు నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రాలిన మామిడి కాయలను రైతులు మార్కెట్‌కు తీసుకు వెళ్తే వ్యాపారులు కిలో రెండు రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కూలీలు, రవాణా ఖర్చులు సైతం రాక ఆర్థికంగా నష్టపోతున్నట్లు చెప్పారు. పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నట్లు వాపోయారు. గత సంవత్సరం పంట చేతికి అందినా గిట్టుబాటు ధర లేక నష్టాలపాలయ్యారన్నారు.సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, మండల పార్టీ కన్వీనర్ రామచంద్రారెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా, వైస్ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, మాజీ సర్పంచులు ప్రకాష్‌రెడ్డి, థామస్, రాజా, వడ్డెర కార్పొరేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్ మొగిలీశ్వర్, సోషియల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిషోర్‌కుమార్‌రెడ్డి, మాజీ జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు మహేంద్ర, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు షాకీర్, మండల యూత్ అధ్యక్షుడు గజేంద్ర, మాజీ మండల యూత్ అధ్యక్షుడు గజదీష్, ఉప సర్పంచులు రఘు, కుమార్‌స్వామి, మండల పార్టీ కార్యవర్గ సభ్యులు ఖాదర్‌బాషా, బాలాజీ, తగ్గువారిపల్లె జగదీష్, చిట్టి, త్రిలోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోరాటం ఉధృతం చేయాలి
చంద్రబాబు పుట్టిన ఊరినే కాదు..రాయలసీమను కరువుసీమగా మార్చి, రైతులను కన్నీళ్లు పెట్టించి పైశాచిక ఆనందాన్ని పొందే చంద్రబాబు ద్రోహాన్ని సీమ జిల్లాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు చేసిన మోసాన్ని చెప్పాలి. ఇది కేవలం నీటి సమస్యగా మాత్రమే చూడవద్దు. ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభం కావాలి.. లేదంటే పోరాటం ఉదృతం చేయాలి. –చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త తిరుపతి రూరల్: ‘జగనన్న పాలనలో 90 శాతానికి పైగా పనులు పూర్తి అయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేసింది చంద్రబాబే అన్న నిజాన్ని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.. స్వప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించి ప్రజా ఉద్యమానికి ఊపిరిపోయాలి.’ అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. భాకరాపేట సమీపంలోని లేక్‌వ్యూ రిసార్ట్స్‌లో ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం – చంద్రబాబు మోసం’ అన్న అంశంపై వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థి విభాగం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మోసాలు బట్టబయలయ్యాయని అన్నారు. కరువుసీమగా మార్చేందుకే బాబు కుట్ర -
కొత్త గృహాల ఊసేలేదు
గత ప్రభుత్వంకంటే ఇంకా భారీగా ఇంటి నిర్మాణాలు చేపడతామని కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఊదరగొట్టింది. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఓ ఇంటి పునాదికూడా పడలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పంచాయతీలవారీగా కూటమి నేతల ద్వారా పక్కా ఇళ్లకు అర్జీలను తీసుకున్నారు. ఆ మేరకు వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు కాకుండా కేవలం కూటమి కార్యకర్తలకే ఇళ్లు మంజూరు చేయించేలా హౌసింగ్ అధికారులకు వాటిని పంపారు. వీరి లెక్కమేరకు జిల్లాలో సుమారు 30 వేల మంది లభ్ధిదారులుగా చేర్చారు. కానీ ఇప్పటిదాకా ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇళ్లు మంజూరు కాకపోవడం కొసమెరుపు. -
జిల్లాలో స్తంభించిన కాలనీ ఇళ్ల నిర్మాణం
● ఆపసోపాలు పడుతున్న లబ్ధిదారులు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం జిల్లాలో ఇళ్ల నిర్మాణం కొండెక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదవాడి సొంతింటి కల నెరవేరకుండా పోయింది. రెండేళ్లుగా కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త ఇల్లూ మంజూరు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకూ నిధులు మంజూరు చేయకుండా మొండికేస్తోంది. ఈ క్రమంలో ఎక్కడ ఇళ్లు అక్కడే ఆగిపోయాయి. వెక్కిరిస్తున్న మొండిగోడలను చూసి లబ్ధిదారులు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో కాలనీ ఇళ్ల నిర్మాణాలపై సాక్షి ప్రత్యేక కథనం. పలమనేరు మున్సిపాలిటీలోని బొమ్మిదొడ్డి లేఅవుట్లో ఆగిన ఇళ్ల నిర్మాణాలు మొత్తం లేఅవుట్లు 609పలమనేరు: జిల్లాలో కాలనీ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టనేలేదు. గత ప్రభుత్వంలో మంజూరై వివిధ దశల్లో ఆగిన ఇంటి నిర్మాణ పనులకు సక్రమంగా బిల్లులందక అవి కొండెక్కాయి. ఇంతవరకు నిర్మాణాలు చేపట్టని మూడు వేల ఇళ్లను గతంలో రద్దు చేస్తూ ఆన్లైన్లో వారి వివరాలను డిలీట్ చేసింది. దీంతో ఇప్పటిదాకా ఇళ్లను కట్టుకోలేని నిరుపేదలకు ఇక కేటాయించిన స్థలాలు పోయినట్టే. మరోవైపు పీఎం ఆవాజ్ యోజనలో నిర్మించిన ఇళ్లను కూటమి ప్రభుత్వం చేసినట్టు బిల్డప్ ఇచ్చారే గానీ ఇప్పటిదాకా ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టలేదు. గత ప్రభుత్వంలో పేదల కల సాకారం సొంతిల్లు కట్టుకోవాలన్నదే ప్రతి పేదవాని కల. ఆ కలను నిజం చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. జిల్లాలో 77,365 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 609 జగనన్న లేఅవుట్లున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,719 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా 2,389 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 4,330 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఆగిపోయింది. ఇందులో ఇప్పటికీ నాట్ స్టాటెడ్గా ఉన్న 3వేల ఇళ్లను ఆన్లైన్లో తొలగించింది. ఈ నెలఖరులో రావచ్చు కొత్త గృహాల విషయమై హౌసింగ్ అధికారులను వివరణ కోరగా.. ఇప్పటికీ అర్జీలు స్వీకరించి వాటిని ఆన్లైన్ చేశామన్నారు. ఈ నెలాఖరులో లబ్ధిదారులకు మంజూరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా సమాచారం పూర్తయిన ఇళ్లు 46,163ఖర్చుచేసిన మొత్తం రూ.1000.687 కోట్లు ప్రస్తుతం వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్లు 31,203 -
దివికేగిన పోరాట యోధుడు
చిత్తూరు అర్బన్: పోరాట యోధుడు ఇక లేరు. ఈదల వెంకటాచల నాయుడు (72) బుధవారం అనారోగ్యంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తుదిశ్వాశ విడిచారు. పెనుమూరు మండలంలోని సాతంబాకం పక్కనున్న పెరుమాళ్లకండ్రిగలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఐదో తరగతి వరకు చదువుకున్న ఈ పాడిరైతుకు పెద్దగా ఆస్తుల్లేవు. ఆరెకరాల భూమి, నాలుగు ఆవులే ప్రపంచం. పట్టుపురుగులు పెంచి పట్టుగూళ్లను అమ్మడం.. సేద్యం చేయడం తప్ప మరోలోకం తెలియని వ్యక్తి. పాలను డెయిరీకి పోసి నెలవారీ బిల్లులు తీసుకుని జీవనం సాగించేవారు. కానీ గత 25 ఏళ్లుగా జిల్లాలో ఏ మారుమూల గ్రామంలోనైనా సరే అన్నదాతకు కష్టమొస్తే ముందుంటాడు. ఆపదలో ఉన్న రైతుకు అండగా ఉండేవాడు. తన నిరసన గళాన్ని పాలకులకు వినిపించేలా సమస్యలపై పోరాటం చేసేవారు. ఆ నిరసన ఎలా ఉంటుందంటే రాజధానిలో ఏసీ గదుల్లో కూర్చున్న నేతలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తుంది. చొక్కా వేసుకోకుండానే..! 2003లో చిత్తూరు నుంచి సాతంబాకం వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కిన నాయుడు.. రూ.5 ఇచ్చి టికెట్టు ఇవ్వమన్నాడు. కండక్టర్ రూ.7 అడిగాడు. ఎందుకని అడిగితే చిత్తూరు నుంచి పెనుమూరు వెళ్లడానికి నాలుగు స్టేజీలు ఉండేవి. ఇప్పుడు ఐదో స్టేజీ పెరిగింది. అందుకే రూ.2 అదనంగా చెల్లించారని కండక్టర్ చెప్పడంతో ఆ ఏడాది జూన్‌లో నిసరన చేపట్టారు. పెనుమూరులోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 16 రోజుల పాటు వెంకటాచలంనాయుడు ఉద్యమం సాగింది. ఇదే సమస్యపై 2004లో 65 రోజులు, 2008లో 13 రోజుల పాటు దీక్షలు చేశాడు. ఇక దక్షిణాసియాలోనే ఒక వెలుగు వెలిగిన చిత్తూరు విజయా డెయిరీకి 2002లో అప్పటి చంద్రబాబు నాయుడు హయంలో పాలకవర్గం డెయిరీని మూసేయడంతో జిల్లాలోని లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. నాయుడు లోలోపల మదనపడిపోయారు. 2004లో చిత్తూరుకు ఓ పనిపై వచ్చిన వెంకటాచల నాయుడు విజయా డెయిరీ వైపు వెళ్లాడు. డెయిరీని, అక్కడ ఉన్న యంత్రపరికరాలు చూసి చలించిపోయారు. అప్పటి నుంచి విజయా డెయిరీని తెరిపించాలని నిరహారదీక్షలు, నిరవధిక దీక్షలు చేస్తూనే ఉండేవారు. డెయిరీని పునఃప్రారంభించేత వరకు చొక్కా ధరించనని, కాళ్లకు చెప్పులు వేసుకోనని 2007 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు దీక్షబూనాడు. పెనుమూరులోని కలవగుంట వద్ద ఉన్న ఎన్టీఆర్ జలాశయాన్ని శుభ్రం చేయించాలని 2008లో 18 రోజలు దీక్ష చేశాడు. డెయిరీ తెరిపించాలని 2015లో హైదరాబాద్ వెళ్లి ఇందిరాపార్కు వద్ద 48 గంటల పాటు నిరసన దీక్షబూనారు. చిత్తూరు సహకార చక్కర ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను తొలగించడమేగాకుండా, క్రషింగ్ ఆపేయడంపై ఫ్యాక్టరీ వద్ద ఉద్యమం చేశారు. ఆ మొండి పట్టుదల ఆయన మరణం వరకు చొక్కా వేసుకోకుండా, కాళ్లకు చెప్పులు తొడగకుండానే కన్నుమూశారు.చేయిచాచని ఆత్మాభిమానం వెంకటాచలం నాయుడుది ఓ మధ్యతరగతి సాధారణ రైతు కుటుంబం. ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె.. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. పాలడబ్బులు, పొలంలో వచ్చే ఆదాయంతోనే పిల్లల బాధ్యతలు తీర్చారు. ఉద్యమాల బాట పట్టడంతో ఇల్లు గడవడానికి, ఊర్లు తిరగడానికి ఆరెకరాల పొలంలో ఓ ఎకరం అమ్మేశాడు. అయినా సరే ఉద్యమాలకు ఎవరినీ ఆర్థిక సాయం అడగని నైజం నాయుడిది. ఎవరైనా ఉద్యమాలకు డబ్బులిచ్చినా ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని, తనకు ఎలాంటి ఆర్థిక సాయం వద్దని వెంకటాచలం నాయుడు మొహంపైనే చెప్పేసేవారు.2018లో చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేపట్టిన వైఎస్.జగన్మోహన్రెడ్డి వెంకటాచల నాయుడు గురించి తెలుసుకున్నారు. పూతలపట్టు సమీపంలో జరిగిన బహిరంగ సభలో వెంకటాచల నాయుడును స్టేజీపైకి పిలిపించి ఆయన పోరాట పటిమను మెచ్చుకుని అభినందించారు. తాము అధికారంలోకి వస్తే చిత్తూరు సహాకార పాల డెయిరీని పునఃప్రారంభిస్తామని వాగ్ధానం చేశారు. ఆపై వైఎస్.జగన్ సీఎం అవడం, విజయా డెయిరీని పునఃప్రారంభించడం తెలిసిందే. -
25 నుంచి పది సప్లిమెంటరీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ నుంచి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల తేదీలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. లైఫ్ సర్టిఫికెట్ కష్టాలకు చెల్లు చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి ఏడాదీ ప్రారంభంలో పెన్షన్‌దారులు అందించే లైఫ్ సర్టిఫికెట్ల విషయంలో రాష్ట్ర ట్రెజరీ అధికారులు పలు మార్పులు తీసుకొచ్చారు. సెల్‌ఫోన్ నుంచే నేరుగా నిధి అనే యాప్‌లో లైఫ్ సర్టిఫికెట్ అందించేలా అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే బ్యాంక్ లేదా, మీసేవ, పోస్టాఫీస్‌లో అందించాల్సి వచ్చేది. సకాలంలో లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే పెన్షన్ నిలిచిపోయేది. ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు సమర్పించాల్సి వచ్చేది. జిల్లాకు సంబంధించి దాదాపు 17 వేల మంది పెన్షన్‌దారులు ఉన్నారు. మంచాన పడ్డ పెన్షన్‌దారుల వద్దకు నేరుగా ట్రెజరీ అధికారులే వెళ్లి పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. యాప్ అందుబాటులోకి వస్తే ఫోన్ నుంచే నేరుగా నమోదు చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. పది గ్రామాల్లో నీటి సమస్య చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పది గ్రామాల్లో నీటి సమస్య ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఎస్ఈ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుడుపల్లెలో–4 ట్యాంక్‌లు, శాంతిపురంలో–2, రామకుప్పం–1 చొప్పున రోజూ 5వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్లను 17 ట్రిప్ప్ల వరకు తిప్పుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే పలమనేరు, వి.కోట, పులిచెర్లలో నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో వ్యవసాయ బోరుతో అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా గ్రామాల్లో నీటి సమస్య ఉంటే 08572–233098 నంబరులో సంప్రదించాలన్నారు. జూన్ చివరి నాటికి నీటి సరఫరాకు రూ.23 లక్షలు అవసరముంటుందని ప్రభుత్వానికి నివేదిక పెట్టినట్టు వెల్లడించారు. బకాయిలు రూ.64 కోట్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నగరి నియోజకవర్గం నిండ్ర చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి రైతుల అధికారిక బకాయిలను ఖరారు చేసినట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. బుధవారం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ బకాయిలకు ఎదురుచూస్తున్న 1,650 మంది రైతులకు ఇచ్చిన హామీ మేరకు సమస్య పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆ రైతులందరికీ అసలు, మొత్తం, వడ్డితో కలిపి రూ.64 కోట్లను అధికారిక బకాయిలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ సమస్యలో రైతులకు న్యాయం చేసేందుకు రూ.34 కోట్ల అసలుతో పాటు రూ.30 కోట్లు వడ్డీని క్లెయిమ్‌లో చేర్పించినట్టు వెల్లడించారు. ట్రిబ్యునల్ నియమించిన రిసొల్యూషన్ ప్రొఫెషనల్ రూ.64 కోట్లను చెల్లించాల్సిన బకాయిలుగా అంగీకరిస్తూ అధికారికంగా ధృవీకరించారన్నారు. రైతులకు అందాల్సిన నగదును అందజేసేలా న్యాయపరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జూలైలో ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు తిరుపతి సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ ఓల్డ్ బ్యాచ్) పరీక్షలు జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అంబేడ్కర్ వర్సిటీ స్టడీసెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండు, మూడో సంవత్సరం డిగ్రీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఈనెల 25వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రేపు ఎస్వీయూలో జాబ్‌మేళా తిరుపతి సిటీ: స్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు హాజరై సుమారు 1,800కు పైగా పలు రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ, డిప్లొమో అర్హతగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు సంక్షేమ ఫలాలను చేరవేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, శ్రీసిటీ సంయుక్తంగా మే 10 నుంచి వికలాంగ యువత కోసం ప్రత్యేక వెల్డింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గత ఆరు నెలల్లో భూగర్భ జలాలు 6 మీటర్ల మేర తగ్గినట్లు కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘జలధార, నీటి భద్రత’ కింద చేపట్టిన మైనర్ ఇరిగేషన్ పనులు, ఫీడర్ కాలువల పునరుద్ధరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో జిల్లాలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు 313 రెమెడియల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈ తరగతులకు విద్యార్థులు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఈవో రాజేంద్రప్రసాద్, డ్వామా పీడీ రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
పెద్దపంజాణి: మండలంలోని పలమనేరు–పుంగనూరు మార్గంలోని లింగాపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలి యని సుమారు 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మారెప్ప కథనం.. గుర్తు తెలియని వాహ నం ఢీకొని ఓ వృద్ధుడు లింగాపురం బస్టాప్ వద్ద మృతి చెందాడనే స్థానికుల సమాచారంతో ఎస్ఐ తన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమి త్తం పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు తెల్లరంగు షర్టు, నీలం రంగు లైన్లుకలిగిన లుంగీ, వంకాయ కలర్ టవల్‌తో ఉన్నాడని, అతని వివరాలు తెలిసిన వారు పెద్దపంజాణి పోలీసులకు తెలియజేయాలని కోరారు. బొలేరోను ఢీ కొన్న ద్విచక్ర వాహనం – ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు బైరెడ్డిపల్లె: పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలోని చీలంపల్లె వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కమ్మనపల్లె పంచాయ తీ పరిధిలోని ఎర్రకదిరేపల్లె గ్రామానికి చెందిన శంకరప్ప కుమారుడు నాగార్జున (27), కృష్ణప్ప కుమారుడు నాగార్జున, కొండప్ప కుమారుడు గణేష్ ద్విచక్ర వాహనంపై బైరెడ్డిపల్లె నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. చీలంపల్లె వద్ద పలమనేరు వైపు వెళ్తున్న బొలేరోను వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో శంకరప్ప కుమారుడు నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నాగార్జున, గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైరెడ్డిపల్లె ఎస్ఐ చందనప్రియ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెత్త వేశారని మహిళపై దాడి చిత్తూరు అర్బన్: ఇంట్లోని చెత్త పక్కింటి వద్ద వేశారంటు ఓ మహిళపై దాడి చేసిన ఘటన చిత్తూరులోని పెద్ద దళితవాడలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. నగరంలోని పెద్ద దళితవాడకు చెందిన నాగమ్మ ఉదయం తన ఇంటిని శుభ్రం చేస్తూ చెత్తను బయట వేశారు. ఈ విషయమై పక్క ఇంట్లో ఉన్న పవన్ తదితరులు నాగమ్మతో వాగ్వాదానికి దిగారు. మాట మాట పెరగడంతో నాగమ్మపై దాడి చేశారు. గాయపడ్డ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు లోక్ అదాలత్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల పరిష్కారానికి ముందస్తు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి 40 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆ కోర్టు ఆదేశాల మేరకు ‘సమాధాన్–సమరోహ –2026’ కార్యక్రమంలో భాగంగా కక్షిదారులకు జిల్లా న్యాయసేవాసదన్ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేస్తామన్నారు. కక్షిదారులతో ముందస్తు లోక్ అదాలత్ ద్వారా మధ్యవర్తిత్వం విధానంలో కేసులు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముందస్తు లోక్ అదాలత్‌లో ఇరుపక్షాల దస్త్రాలను సుప్రీంకోర్టుకు నివేదించి.. అక్కడ ఆగస్టు 21, 22, 23 తేదీల్లో జరిగే ప్రత్యేక లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు.


